Kolluna Navveru Ninnu Govinduda In Telugu – కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా

ఈ పోస్ట్ లో కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 14
కీర్తన : కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా
సంఖ్య : 333
పుట: 193
రాగం: మనోహరి

మనోహరి

10 కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుఁడా
గొల్లెతల నేమనేవు గోవిందుఁడా

||పల్లవి||

యేపున నీసుద్దులెల్ల యిట్టె యశోదతోడ
గోపిక లాడుకొనేరు గోవిందుఁడా
తీపుల నీచేఁతలెల్ల తేట తెల్లమాయనిదే
కోపగించఁ జెల్లదిఁక గోవిందుఁడా

||కొల్లు||

సిసువవై యాడువారి చీరలు దీసినందుకు
కొసరి తిట్టేరు నిన్ను గోవిందుఁడా
పసులఁగాచేచోట భామలు విందు దెచ్చిరి
కుసిగుంపు సేయకుమీ గోవిందుఁడా

||కొల్లు||

వాడలసతుల నొక్కవావిగానే సేసితివి
కోడెల నావులఁ గాచేగోవిందుఁడా
యీడనే శ్రీవేంకటాద్రి నిరవై శ్రీసతితోడఁ
గూడి లోలుఁడ వైతివి గోవిందుఁడా.

||కొల్లు||

అవతారిక:

“గోవులను కాచే గోవిందుడా! నిన్ను చూచి ఈ రేపల్లె గొల్లభామలు గొల్లుమని నవ్వారయ్యా! వాళ్ళనేమనగలము?” అంటున్నారు అన్నమాచార్యులవారు. నీ కోపాలు యికపై చెల్లేట్లులేవు. మరి నీవు వాళ్ళ చీరెలెత్తికెళ్ళిపోతే మళ్ళీ నిన్నే తిడుతున్నారు, అంటున్నారు. ఈ గోవిందుడు గొల్లవాడలోనున్న సతులనందరినీ ఒక్కవావిగానే చేశాడట. అంటే యేమిటో తెలుసా? ఆ గోవిందుడు, వరుసకు వదినా మరదళ్ళయిన ఇద్దరిని కూడితే వారు ఏమవుతారు? ఒకేవావి కదా! అంటే అక్కా చెల్లెళ్ళేకదా! అదన్నమాట సంగతి. ఇంతా చేసిన ఆ శ్రీసతిలోలుడేనట.

భావ వివరణ:

ఓ గోవిందుడా! ఈ గొల్లెతలను (గొల్లభామలను యేమనేవు (నీవేమి అనగలవు?) నీసంగతులు చెప్పుకొంటూ వాళ్ళు గొల్లుమని నవ్వుకొంటున్నారు చూశావా?

ఓ గోవిందుడా! నీ సుద్దులెల్లా (ముచ్చట్లనన్నియు) ఈ గోపికలు నీ తల్లి యశోదమ్మతో యేపున వున్నవీ లేనివీ కల్పించి యెక్కువగా) చెబుతున్నారు. నీ తీపుల చేతలెల్లా (నీవు పెట్టిన యాతనలు చిలిపి పనులు) అన్నియునూ తేటతెల్లమాయె (బట్టబయలైపోయాయి). ఓ గోవిందుడా నీ అలుకలు చెల్లవిక.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment