Lord Krishna Mangala Harathi Patalu In Telugu – మంగళ హారతులు

Table of Contents

Lord Krishna Mangala Harathi Patalu In Telugu – మంగళ హారతులు

కృష్ణుడు (లేదా కృష్ణభగవానుడు) హిందూ మతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవతలలో ఒకరు. ఆయనను వైష్ణవ సంప్రదాయంలో విష్ణువుకి అష్టావతారాలలో ఎనిమిదవ అవతారంగా పూజిస్తారు. శ్రీకృష్ణుడు యాదవ వంశంలో వసుదేవుడు, దేవకుల కుమారుడుగా మథురలో జన్మించాడు. ఆయన జన్మదినాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమిగా అత్యంత భక్తితో జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు జీవితంలో ఎన్నో సంఘటనలు, లీలలు ఉన్నాయి. చిన్నప్పటి నుండే ఆయన అసురులను సంహరించి, తన భక్తులను కాపాడేవాడు. బాల్యంలో పొట్టి కృష్ణుడి బదురి గోపాలుల కోసం చేసిన అద్భుతాలు, నందగోపుల పాలు, పెరుగు కాపాడిన విధానం, గోపికలతో క్రీడలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీకృష్ణ మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…

కేశవా హారతి గైకొను
ఈశా! భవా! కేశవా!

(ఉదయరవిచంద్రిక రాగం – మిశ్రచాపు తాళం)

పల్లవి: కేశవా యీ హారతి గొను ఇంత కోపంబేలనో హరీ
చ 1) పన్నగేంద్ర శయనా రారా పాపము లెడబాపగ రారా
పారిజాత సుమహరణ రాధా రుక్మిణీ వల్లభా

॥ కేశవా ॥

చ 2) కోపమటరా గోపబాలా కోరితి నిన్ గావగరావా
కరుణ తోడుత మమ్ము గావుము
గరుడ వాహన వేగమెరా

॥ కేశవా ॥

చ 3) వాసిగా యీ సంసార సాగర పురము నందుననోదేవ
దానురాలను రక్షింపరా ధర్మపాలన వీడకే

॥ కేశవా ॥

కోరిన హారతుల్ గోవిందునకు
ఆనంద నందన మందిర శ్రీకృష్ణా

(కాపీరాగం – ఆదితాళం)

పల్లవి: కోరిన హారతుల్ గోవిందునకు
కోమలాంగులు గూడివ్వరే॥

ఆ.ప.) పద్మనాభునకు పాటలు పాడిన
పాపాములన్నియు తొలగునుగా॥
గోకులమందున గోవర్ధనమెత్తి
కాచి రక్షించిన శ్రీకాంతునకు

జయ జయ మంగళం శుభమంగళం.
ప్రియ జయ జయ శుభజయ మంగళం శ్రీకృష్ణా

యదుకుల కాంభోజి రాగం – ఆదితాళం)

చ 1) జయ మంగళం శుభ మంగళం
నంద నందనా నీకు మంగళం
జయ మంగళం శుభ మంగళం
నంద నందనా నీకు మంగళం
నిను పాడగా నరులాడగా నీవు
వేడ్కతో జగమేలగ కనులారగ
నిను చూడగ జాతి నై తిర కృష్ణ బాలక॥

పక పక నవ్వుచు పరుగిడబోకు
శుభంకర! శుభకర! సుంధరవీరా! బాలగోపాలా

(యమునా కళ్యాణ రాగం – ఆదితాళం)

ఆ.ప.) పక పక నవ్వుచు పరుగిడబోకుర!
పడతి యశోదా భాగ్యఫలంబా!

పల్లవి: బాలగోపాల మంగళ హారతు లిచ్చెద
చ 1) లేగ తోకను బట్టి లేమ జెడకు చుట్టి
ఊరకె తోలుట ఉచితముగాదు కృష్ణ

॥బాల॥

మాధవ గొనుమా మంగళ హారతి.
సుధామధుగాధా మాధవా!

(జంగ్లారాగం ఆదితాళం)

పల్లవి: మాధవ గొనుమా మంగళ హారతు లిచ్చెద

॥మాధవ॥

చ 1) ఉరమున సిరియును మెరయుచు నుండగ
గరుడ కిన్నెరులు గానము సేయగ
వరుడ వని నెర నమ్మితిని
సరగున మము దయ జేకొను

చ 2) సృష్టి స్థితి లయముననే కృష్ణుడవై జన్మించితిని
దుష్టుల మద మణగించి శిష్టుల పరిపాలించెడి

॥మాధవ॥

మానినిరో మాధవునికి మంగళం
జ్ఞానమాసత్రేణ మాధవా! శ్రీహరి

(హరి కాంభోజి రాగం – త్రిశ్రగలి తాళం)

చ 1) మానినిరో మాధవునకు మంగళం బని
పాడగా పాడగా మానవతులు కూడి వేగ
దీనజనుల బ్రోవు మనుచు
గానలోల గారవించు

॥మానినిరో॥

చ 2) మకరిచేత చిక్కి హరి మొరలు పెట్టగా
తికమకలై సకలాత్ముడు వేగ వచ్చి
సకలనుతా శస్త్రమున
మకరి ద్రుంచి కరి గాచిన

॥మానినిరో॥

చ 3) అంబ తపసి వెడలు బుద్ధి
అంబరీశుని శపియింపగ
డింబ మనుచు చక్రమంటి
కుంభినీ తన యార్చితునకు
సంభ్రమమును కలిగించును

॥మానినిరో॥

చ 4) తులువలైన కౌరవులు
వలువ లొలువ కరుణ కల్గి
కలత తీర్చి పిలువక – నే తరలి వచ్చి
వలువ లిచ్చి పగబాపిన

॥మానినిరో॥

Lord Krishna Mangala Harathi Patalu In Telugu pdf

మంగళ హారతిదేరా
ఆవిరళ సంగరఖేలన ధీరా! గోపాల

(జంగ్లా రాగం – ఆదితాళం)

పల్లవి: మంగళా హారతిదేరా మార సుందరా!
చ 1) రాధారమణా రమ్య గుణాకర
రక్షించు సమయ మిదేరా రాజేంద్ర వినుత

॥మం॥

చ 2) వేణునాద ప్రియ వేగమె కాపాడగ
వేడితీరా నిన్ను వేగమె రారా

॥మం॥

చ 3) గోకులమందున గోపాలుర గూడి
గోవర్ధన మెత్తిన గోపాలా రారా

॥మం॥

చ 4) పదునాల్గు భువనములు బొజ్జ నిల్పిన తండ్రి
పాపుల నందన జంపిన పన్నగ శయనా

॥మం॥

చ 5) వైకుంఠ మందునా వటపత్రసాయివై
వామ భాగమునందు గూడి

॥మం॥

మంగళ హారతిదేరా
ఆనంద నందన సుందరా శ్రీ కృష్ణా

(జంగ్లా రాగం – ఆదితాళం)

పల్లవి: మంగళ హరతిదేరా మారా సుందరా రాధా రమణా రమ్యగుణాకర
రక్షించు సమయ మిదే రాజేంద్ర వినుతా!

చ 1) వేణునాద ప్రియ వేగమె కాపాడరా
వేడితిరా నిన్ను వేవేగమె రారా

॥మం॥

చ 2) గోకుల మందున గోపాలురతో గూడి
గోవర్ధన మెత్తిన గోపాల బాల రారా

॥మం॥

చ 3) పదునాల్గు భువనముల్ బొజ్జ నిలిపిన తండ్రి
పాపుల దుష్టుల చంపిన పన్నగ శయనా

॥మం॥

చ 4) వైకుంఠ మందున వటపత్రశాయివై
వామభాగము నందు లక్ష్మీతో గూడిన

॥మం॥

రంగా! నీకిదే మంగళం.
రంగదుత్తుంగ నానందతరంగా రంగ!

(మోహనరాగం – ఆదితాళం)

పల్లవి: రంగా నీకిదే మంగళం – కస్తూరి రంగా నీకిదే మంగళం

చ 1) రంగ ఖగరాట్ తురంగ కలుష వి
భంగా తవ మోహనాంగా వయ్యారి

॥రంగా॥

చ 2) హరే విబుధ విహారీ ఉభయ
కావేరీ తీర విహారీ వయ్యారి

॥రంగా॥

చ 3) అన్నా యితరుల నన్నెవరు-నీ
కన్న నన్ను బ్రోవుచున్నా-వయ్యారి

॥రంగా॥

చ 4) లీలా శేషాంశు లీలా కరుణాల
వాలా జగత్పరిపాలా-వయ్యారి

॥రంగా॥

చ 5) అయ్యా వరము మాకియ్య నిను నమ్మి
తయ్య నను బ్రోవుమయ్య-వయ్యారీ

॥రంగా॥

చ 6) హాసా మహ చిద్విలాసా శేషాచల
దాశార్చిత పరమేశా-వయ్యారి

॥రంగా॥

రాధా మనోహర హారతి ఇదేరా
సుధా మధుర నిధీ! శ్రీకృష్ణా

(శుద్ధసావేరీ రాగం – ఆదితాళం)

పల్లవి: రాధా మనోహర హారతి ఇదేరా గైకొను ధీరా

చ 1) నారాయణ దామోదర కేశవ
నందుని వర సుకుమారా
నను గావగ నీవేరా
మందారధార సుందరాకార

||రాధా॥

చ 2) శేషశైల ద్వారకావాసా నిజమనీషా రవికుల భూషా
ఆహల్య శాప విమోచనా!
గోపాల బాల కృప జూపుమివేళ

||రాధా॥

చ 3) వైకుంఠవాసా వామనరూపా
వందన మీదే గైకోరా
నను గావవేర వేగరా
కరిరాజ మిత్ర కౌసల్య తనయా

॥రాధా॥

Lord Krishna Mangala Harathlu In Telugu pdf

మంగళ హారతిదేరా
మంగళాంగా! దివ్మతురంగా! శ్రీకృష్ణా!

(జంగ్లారాగం – ఆదితాళం)

పల్లవి: మంగళహారతిదేరా మారా సుందరా
రాధా రమణా రమ్యగుణాకర
రక్షించు సమయ మిదేరా రాజేంద్రా వినుతా

చ 1) వేణునాద ప్రియ వేగమె కాపాడరా
వేడితిరా నిన్ను వేవేగమె రారా

॥మం॥

చ 2) గోకులమందున గోపాలురతో గూడి
గోవర్ధన మెత్తిన గోపాల బాల రారా

॥మం॥

చ 3) పదునాల్గు భువనముల్ బొజ్జలోనిల్పిన తండ్రి
పాప పుదుష్టుల చంపిన పన్నగశయనా

॥మం॥

చ 4) వైకుంఠమందున వటపత్రశాయి వై
వామభాగమునందు లక్ష్మితో గూడిన

॥మం॥

సంగీతలోలా నందునిబాలా
రంగా తరంగ సంగీత భంగీ శ్రీకృష్ణా

(యమునా కళ్యాణి రాగం – ఆదితాళం)

పల్లవి: సంగీతలోలా నందునిబాలా మంగళహారతిగొను మీవేళా||
చ 1) అంగన లందరు శృంగారమ్ముగ
బంగారు పళ్ళెరముల కొని పాడ

చ 2) దేవేంద్రుడు శిలావర్షమ్ము
ధేనువు లన్నిటి పై కురియింపగ కృష్ణ

చ 3) గోవర్ధన గిరి గోటితో ఎత్తి
గోపాలకులను గాచిన కృష్ణ

చ 4) శిశుపాలకునకును చెలియను ఇచ్చుట
సద్విధంబని నుడివెడి జపములు

చ 5) వనుధేశులతో వంచన చేయక
వనిత రుక్మిణిని వేగమె పరిణయమాడిన కృష్ణ

హారతు లేశారమ్మ
ధీరవీర సారమారా శ్రీకృష్ణా

(ఫరజు రాగం – జుంపె తాళం)

పల్లవి: హారతు లివ్వరమ్మా – శ్రీ వేణుగోపాలుని బోలేటి తమ్మునకు

చ 1) తమ్మిట్లు, జూకాలు, తళతళ మెరయగ
వన్నెచక్కనీ చుక్క చిన్నారి తమ్మునకు

॥హారతి ||

చ 2) కాళ్ళ గజ్జలు ఘల్లు ఘల్లు మ్రోయగ
చిట్టి పాదాలతో చిందాడే తమ్మునకు

॥హారతి ||

చ 3) వెయ్యి నూటపదహార్లు వెయ్యవలెనేగాని
కొద్దిగా వేస్తేను కోపగిస్తా మేము

॥హారతి ||

శ్రీ రాధాపతే మంగళం
మధుర సుమధుర రాధాపతే

(సింధుభైరవి రాగం – ఆదితాళం)

పల్లవి: శ్రీరాధాపతే మంగళం ఓధీరా గంభీరా సుందరసుకుమార

చ 1) వేది గోచరుడవు నీవేకదా
మోదముతో నను బ్రోవ రారా
రాదా దయరాదా ఇది మర్యాద

॥రాధా॥

చ 2) మందర ధర నీదు సౌందర్యము
పొందుగ వర్ణింప సాధ్యమా
ఆనందా నంద గోవిందా ముకుందా.

॥రాధా॥

చ 3) ధరలోన మైసూరు పురములోన
వరలిన నన్ను దాసుడను
రాతిని నాతిగ చేసిన శ్రీరామా

॥రాధా॥

మరిన్ని భక్తి గీతాలు : 

Leave a Comment