Parvathi Devi Mangala Harathulu – మంగళ హారతులు
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పార్వతి దేవి, హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యమైన దేవతలలో ఒకరు. ఆమె శివుని పత్నిగా, గణపతి మరియు కార్తికేయుల తల్లిగా విఖ్యాతి గాంచింది. పార్వతి, శక్తి లేదా దుర్గా రూపంలో కూడా పూజించబడుతుంది. ఆమె శాంతియుత స్వభావంతో పాటు శక్తి స్వరూపిణిగా కూడా ఆరాధించబడుతుంది. పార్వతి దేవి కథలు, పురాణాలు, వేదాలు, మరియు ఇతిహాసాలలో విస్తారంగా ప్రస్తావించబడ్డాయి. ఆమె జీవితంలో ప్రతి ఘట్టం ఆదర్శప్రాయంగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది. పార్వతి దేవి కృష్ణవర్ణంలో, అందమైన మంగళసూత్రం ధరించి, నిత్యం భక్తులను అనుగ్రహిస్తుంది. పార్వతి దేవి పూజ అనేక రూపాల్లో, రీతులలో జరుగుతుంది. భక్తులు ఆమెను శివునితో కలిసి లేదా స్వతంత్రంగా కూడా పూజిస్తారు. పార్వతి దేవి పూజించడం వలన భక్తులకు శాంతి, సమృద్ధి, సౌభాగ్యం లభిస్తాయని విశ్వసిస్తారు. తద్వారా పార్వతి దేవి తెలుగు ప్రజల మన్ననలు పొందుతూ, వారి జీవితాల్లో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు పార్వతీదేవి మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…
అంబా జగదంబా
పరమ పావనీ “పార్వతీదేవి” గీర్వాణనుత గిరిజాదేవి
(జౌళిరాగం – త్రిశ్రగతి తాళం)
చ 1) అంబా జగదంబా అంబా కంబుకంఠి
అంబా ఫలదాయినీ శాంభవీ
అంబుజభవ రాణి అలివేణి శాంకరి
కంబుకంథరి నీను కనుగొంటి ఈశ్వరీ॥
||మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం||
చ 2) తళుకు చెక్కుల కాంతి ధగధగ మెరయగ
మొలక నవ్వుల ముద్దు గుల్కగనూ
చిలుక పలుకు లతో కులుకుచు నున్నట్టి
చిలుకల కొలికీ కలికి బంగరు బొమ్మ।।
॥మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం||
చ 3) సరిగంచు చీరయు జాబిలి రవికెయు
సిరులొప్పు మల్లెల విరిదండలు
పరిమళ గంధంబు పచ్చకస్తురి నలది
భక్తుల రక్షించే బాల చాముండీ!॥
||మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం||
శ్రీవిద్య నాలింపు ఆటలు పాటలు
సింహవాసిని నీవు చాముండికాదేవి
॥మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం!॥
చ 5) సందిట దండలు జతల తాయెతులు
విందగు నవరత్న కంకణాలు
అందమై కనిపించు చంద్రహారములు
దుగా దాల్చిన పూబోడి ఈశ్వరీ
॥మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం ॥
చ 6) క్రౌంచ పర్వత మందు గ్రక్కున వెలసిన
మంజు భాషలు దెలసి మురియుచునూ
అంచయానలు అపుడు హారతులివ్వగ
సింహవాసిని నీవు చాముండికాదేవి
॥మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం॥
చ 7) పచ్చని కమ్మలు పసిడి తాయెత్తులు
హెచ్చైన సొమ్ములు వేడ్కమీరా
గుత్తపు సరులతో కుచ్చుల ముంగర
అచ్చరూపము గనుచు ముచ్చటతీర
॥మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం॥
చ 8) బాజా భజంత్రీలు పంచమ స్వరమున
తేజమయిన మంచి దివిటీలతో
రాజ్యలక్ష్మిని గూడి నాట్యములాడె
రాజవీధులు తిరుగు రాజరాజేశ్వరీ
॥మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం||
చ 9) అమరావతీ నగరమందు శృంగారించి
వైభవముతో కృష్ణాతీరమందు
అమరేశ్వరుని గూడి ఆనంద లీలల
వెలుగుచున్నట్టి చాముండికా దేవి
॥మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం॥
ఆహా సుకుమారీ
గిరిజా శుభకరి శాంకరి గౌరీ
(కళ్యాణిరాగం – త్రిశ్రగతి ఆదితాళం)
పల్లవి: ఆహ సుకుమారీ గరళకంఠుని నారీ
కొనుము జయహారతిదే గౌరీ
॥హర॥
చ 1) హరుని సతీ ఆ అంబై హృదయా
నందము నీయ రమ్మా హారతిదే గౌరీ
॥హర॥
చ 2) అందమైన వెండి పళ్ళెరమున
అమరించితిమి ఆత్మవిచారిణి
పరమపావని మోదమలర హరతిగైకొను గౌరీ
॥ఆహ॥
ఘల్లు ఘల్లున పాద గజ్జె లందెలు మ్రోయ
హరిహర మహాశివ
(సురట రాగం – మిశ్రచాపు తాళం)
చ 1) ఘల్లు ఘల్లున పాద గజ్జెలందెలు మ్రోయ
కలహంస నడకల కలికి ఎక్కడికే
జడలోను గంగను ధరియించుకొన్నట్టి
జగములేలెడు జగధీశు సన్నిధికీ!
॥మంగళం మంగళం ॥
చ 2) బొడ్డుమల్లెలు జాజి దండలు మెడనిండ
అందమెరిగిన జగదంబ ఎక్కడికే
అందము విభూతి అలరు శ్రీగంధము
నలదిన నీలకంఠేశు సన్నిధికే
॥మంగళం మంగళం ॥
చ 3) తళతళమను రత్న తాటంకములు మెరయ
పసిడి మండలముల పడతి ఎక్కడికే
కలియుగ జన్మముగల శివుడై నట్టి
గురువైన శంఖు శంకరుని సన్నిధికే
॥మంగళం మంగళం ॥
చ 4) హెచ్చు పాపట బొట్టు పచ్చల కిరీటమ్ము
ఏమమ్మ కరుణాకటాక్ష మెక్కడికే?
కడు పెద్ద రుద్రాక్ష మెడలో హారము దాల్చి
నంది నెక్కెడు జగధీశు సన్నిధికే
॥మంగళం మంగళం ॥
చ 5) చెంగావి చీరలు కొంగులు చెంగున జారంగ
రంగైన నవమోహనాంగి ఎక్కడికే?
చంద్రుని శిరమున ధరియించు కొన్నట్టి
మండల మేలే నందీశు సన్నిధికే
॥మంగళం మంగళం||
చ 6) సన్నపు నడుముపై బిళ్ళ వొడ్డాణము
మెరిసేటి బంగారుబొమ్మ’ ఎక్కడికే
కన్నులు మూడు భుజంబు లారు
గల అర్ధనారీశు శివుని సన్నిధికే
॥మంగళం మంగళం||
మంగళ హారతులు
రంగదుత్తుంగ తరంగమంగళాంగీ పార్వతీ
(ఆనందభైరవి రవిరాగం ఆదితాళం)
చ 1) జయజయ హారతీ జననీ పార్వతీ
శరణు శుద్ధిమతీ! శంకరుని ప్రియసతీ
||జయ||
చ 2) సుందరవదన! సురనుత చరణ
వందన మంటిని! వాదమేలనే
||జయ||
చ 3) నగరాజ బాలశ్రీ! నారద సురపాల
నగుమోముతో బాల! నన్నేలు మీవేళ
||జయ||
చ 4) ఓం బీజవాసినీ! ఓంకార రూపిణి
శ్రీంకార కారుణి! సామ్రాజ్య పోషణీ
||జయ||
మంగళమే శంభురాణి
శుంభదారంభ జృంభిత పార్వతి
(హరికాంభోజి రాగస్వరాలు – త్రిశ్రగతి తాళం)
పల్లవి: మంగళమే శంభురాణి మానిని యో పూవుబోణీ
చ 1) భంగు కుంతల బ్రోవుమా పుత్తడి బంగరుబొమ్మా
నిన్ను గొల్చుచుంటినమ్మా నీదు దయ నుంచవమ్మా
చ 2) మల్లెపూల సరులు తెచ్చి
మగువరో నిను పూజింతునమ్మా
ఉల్లము నందుంచవమ్మా
మగువరో దయ యుంచవమ్మా||
చ 3) దోసిలొగ్గి యుంటినమ్మా దోషము లింక ఎంచకమ్మా
కాశీ విశ్వేశ్వరుని కొమ్మా కనికరింప సమయమమ్మా॥
హారతి మీరేల ఇవ్వరే
దివ్య నవ్య శ్రావ్యభవ్యా పార్వతీ
(సింధుభైరవి రాగం – మిశ్రచాపు తాళం)
చ 1) హారతి మీరేల ఇవ్వరే? అంబకు మంగళ ॥ హారతి ॥
హారతి మీరేల ఇవ్వరే? జ్ఞాన విద్యలకెల్ల ప్రథితము
లీలతో పదియారు వన్నెల మేలిమి బంగారుతల్లికి
చ 2) పాదములకు పూజచేయరే మా తల్లి కిపుడు
పారిజాత హారతివ్వరే హారములు మొలలో గజ్జలు
రవల పాపిడి, ముక్కు పుడకలు
సమముగ ధరియించు తల్లికి ॥ హారతి॥
చ 3) ఇంతపరాకేలనే ఆమ్మా రుద్రాణిదేవి
చెంతనుండి పూజ చేయరే శంకరీ ఓంకార రూపిణి
కుంకుమాక్షత లలంకారికి పొంకమెసగ అలంకారిణీ
4) లక్షవత్తుల జ్యోతి కూర్చరే మా తల్లి కిపుడు
పచ్చ పళ్ళెర ముంచరే
రక్షితంబుగ నుడి వేదాక్షరంబై
రాక్షస సంహారమున కిపుడు ముచ్చటలరగ పాడుకొనుచు
హారతిదిగో శ్రీ పార్వతీ
గీరత! సారత ధీరత! పార్వతీ
(కాపిరాగం – త్రిశ్రగతి ఆదితాళం)
పల్లవి: హారతిదిగో శ్రీ పార్వతీ కాపాడవే మమ్ము కాత్యాయనీ
చ 1) మురహరు రాణి మా పాలిట జననీ
పూర్ణేందు బింబానన పువ్వుబోణీ
సారసాక్షీ మమ్ము బ్రోవజాలమేలనే
॥హారతిదిగో||
చ 2) వాదమేల నమ్మా వారిజ ముఖి
కదంబ వనివాసినీ ఫలదాయినీ
మందయాన సుందరేశుని మనోహరిణీ
॥హారతిదిగో||
మరిన్ని భక్తి గీతాలు :