Sri Shailesha Charana Sharana Ashtakam In Telugu – శ్రీశైలేశ చరణ శరణాష్టకమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శైలేశ చరణ శరణాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Sri Shailesha Charana Sharana Ashtakam Telugu Lyrics

శ్రీశైలేశ చరణ శరణాష్టకమ్

గౌరీమనోహర ! సురాసుర మౌనిబృంద
సంసేవితాంఘ్రియుగ ! చంద్రకళావతంస !
కైలాసవాస ! కరుణాకర ! భక్తబంధో !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. గౌరీమనోహర! = పార్వతీ దేవికిఁ బ్రియుఁడైనవాఁడా! సురాసుర మానిబృంద= దేవరాక్షపమని సంఘముచే, సంసేవిత = సేవింపఁబడుచున్న, ఆంఫ్రియుగ! = పాదద్వంద్వముగలవాఁడా! చంద్రకళా వతంస! = చంద్రకళను శిరమున కలంకారముగ ధరించినవాఁడా! కైలాసవాస! = కైలాసాచలము నివాసముగఁ గలవాఁడా! కరుణాకర! = దయ కాకరమైనవాఁడా! భక్తబంధో ! = భ క్తులపాలిటియాప్త బంధువా! శ్రీశైలవాస = శ్రీగిరివాస, తవ = నీయొక్క, చరణం = పాదములను, శరణం = రక్షణమును, ఆస్మి = అంటిని.
తా. ఓ శ్రీశైలవాస! ‘గౌరీమనోహర’ అను నాఱు నామములతోఁ గూడిన నీచరణమునే నేను శరణమంటిని.

భక్తార్తిహార ! భవబంధ వినాశ కేశ !
దివ్యాపగాకలిత కాంత జటాక లాప !
శేషాహిభూష! వృషవాహన ! వ్యోమకేశ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. భక్త = భక్తులయొక్క, ఆర్తి = బాధను, హార! = హరించువాఁడా! భవబంధ = సంసారబంధమును, వినాశక ! = నశింపఁజేయువాఁడా!, ఈశా! = లోకముల శాసించువాఁడా!, దివ్యాసగా = దేవగంగతో, కలిత = కూడి, కాంత = మనోహరమైన; జటాకలాప! = జడల సమూ హముగలవాఁడా! శేషాహి = శేషుఁడనుసర్పరాజు, భూష! = ఆలంకా రముగాఁ గలవాఁడా, వృషవాహన! = వృషభమును వాహనముగాఁ గలవాఁడా! వ్యోమకేశ! = ఆకాశమునంటిన కేశములుగలవాఁడా!, శ్రీశైలనాథ! = శ్రీగిరివాస!, తవ = నీయొక్క, చరణం = పాదమును శరణం = రక్షణమునుగ, ఆస్మి = ఆంటీని.

తా. ఓ శ్రీశైలనాథ! ‘భక్తార్తిహర’ అనునామము నుండి సప్తనామములతో నిన్నాహ్వానించి నీ పాదమును శరణమంటిని.

భృంగీశసేవిత ! గణేశ కుమార తాత !
మృత్యుంజయ ! త్రిపురదానవభేదకారిన్ !
పాణావుపాత్త మృగ డామరుక త్రిశూల !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. భృంగీశ సేవిత = భృంగీశునిచే (ప్రసుధాధిపుఁడు) సేవింపఁబడువాఁడా!; గణేశ కుమారతాత = గణపతి, కుమారులు పుత్రులగఁగలవాఁడా!, మృత్యుంజయ! = మృత్యువును జయించినవాఁడా!, త్రిపురదానవ = త్రిపురాసుకులను, భేవకారన్ = భేదించినవాఁడా! పాణే = చేతియందు, ఉపాత్త = పొందిన, మృగ = లేడియు, డామరుక = డమరుకము (బుడబుక్కలవారు వాయించుసాధనము) త్రిశూల = త్రిమాలమును గలవాఁడా! శ్రీశైలవాస! శ్రీగిరినిలయుడా! తవ = నీయొక్క, శరణం= పాదమును, శరణం = రక్షకమునుగ, ఆస్మి = అయియుంటిని.

తా. ఓ! శ్రీశైలవాస! ‘భృంగీశసేవిత’ అను నైదు నామములతో నిన్నుఁ బిల్చి నీ పాదమును శరణ మంటిని.

నాగేంద్ర చర్మవస ! నాగ్ని రవీందునేత్ర !
నారాయణీప్రియ ! మహేశ ! నగేశ ! శంభో !
మౌనిప్రి ! యాశ్రితమహాఫల ! దోగ్రరూప
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. నాగేంద్ర = గజేంద్రునియొక్క, చర్మ = చర్మమును, వసన = వస్త్రముగఁగలవాఁడా! అగ్ని, రవి, ఇందు నేత్ర! = అగ్ని, సూర్యుడు, చంద్రుఁడునామూఁడు నేత్రములుగధరించినవాఁడా! నారాయణి = నారా యణీయను శక్తికి (వైష్ణవమాయకు) ప్రియ = ప్రియమైనవాఁడా!, మహేళ = మహాప్రభూ!, నగేశ = కైలాసాధీశ్వరుఁడా!, శంభో = సుఖమును గల్గించువాఁడా! మౌనిప్రియ! = మహర్షులకుఁ బ్రియమైనవాఁడా! ఆశ్రితమహాఫలద ! ఆశ్రయించినవారికిఁ బరమపురుషార్థ సాధనమునిచ్చువాఁడా!, (జ్ఞానమ్మహేశ్వరాదిచ్చేత్ – అనిశాస్త్రము) ఉగ్రరూప! = ఉగ్రుఁడను రూపముతోనున్నవాఁడా!, శ్రీశైలనాథ = శ్రీగిరి ప్రభూ! తవ = నీయొక్క, చరణం = పాదమును, శరణం = రక్షణమును, ఆస్మి = అయియుంటిని.

తా. ఓయీ ! శ్రీశైలప్రభూ ! ‘నాగేంద్రచర్మవసన’ అను నవ నామములతో నిన్నుఁ బిలిచి నీ పాదములను శరణ మంటిని.

Sri Shailesha Charana Sharana Ashtakam Telugu

సర్వార్తిభంజన ! సదాశివ ! దానవారే !
పార్థప్రహార కలితోత్తమ మూర్థభాగ !
యక్షేశసేవితపదాబ్జ ! విభూతి దాయిన్ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. సర్వ = సమస్తమైన, ఆర్తి = ఆపదలను, భంజన = విధ్వంసమొవర్చువాఁడా ! సదాశివ ! = ఎల్లప్పుడు మంగళముతోనుండువాఁడా!, దానవ = రాక్షసులకు, ఆరే = శత్రువైనవాఁడా! పార్ధ = ఆర్జనునియొక్క, ప్రహార = దెబ్బతో, కలిత = కూడిన, మూర్ఖభాగ = శిరోభాగముఁ గలవాఁడా!, యక్షేశ = కుబేరునిచే, సేవిత = సేవింపఁబడిన పదాబ్జ = పాదపద్మములుగలవాఁడా! విభూతిదాయిన్ ! = ఐశ్వర్యమాను నొసంగువాఁడా, శ్రీశైలవాస! = శ్రీగిరివాస, తవ = నీయొక్క, చరణం = పాదమును, శరణం = రక్షణముగ, అస్మి = ఆంటిని.

తా. ఓ! శ్రీశైలవాస! ‘సర్వార్తిభంజన’ అను నాఱు పేరులతో నిన్నుఁ బిలిచి నీ పాదమును శరణ మంటిని.

శ్రీభ్రామరీశ ! మదనాంతక ! కృత్తివాస !
సర్పాస్థిరుండ కలి తామల హారధారిన్ !
భూతేశ ! ఖండపరశో ! భవబంధనాశ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. శ్రీ భ్రామరీశ! = శుభములిచ్చు భ్రమరాంబికానాథుఁడా!, మదనాంతక! = మన్మథుని నాశనమొనర్చినవాఁడా! కృత్తివాసః = గజేంద్ర చర్మమును వస్త్రముగఁ గలవాఁడ!, సర్ప = పాములు, ఆస్థి = ఎముకలురుండ = తలపులతో, కలిత = కూడిన, అమల = స్వచ్ఛమైన హార = హారమును, ధారిన్ = ధరించినవాఁడా! భూతేశ! = భూతములకధిపతి యైనవాఁడా!, ఖండపరశో! = ఖండించెడి గొడ్డలికలవాడా (పరశువను రాక్షసుని ఖఁడించినవాఁడా) భవబంధనాశ! = సంస్కృతిబంధ మును దెగగొట్టువాఁడా!, శ్రీశైలనాథ = శ్రీగిరివాస!, తవ = నీయొక్క చరణం = పాదములను, శరణం = రక్షకముగ, అస్మి = ఆయితిని.

తా. ఓ! శ్రీశైలప్రభూ ! ‘శ్రీభ్రమరీశ’ అనునది మొద లీపైఁబడిన యేడు నామములతో నిన్నుఁ బిలచి నీ పాదమును శరణ మనుచున్నాను.

సర్వాగమస్తుత ! పవిత్ర చరిత్ర ! నాథ !
యజ్ఞప్రియ ! ప్రణతదేవ గణోత్తమాంగ !
కల్పద్రుమ ప్రసవ పూజిత దివ్యపాద !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. సర్వ = సమస్తమైన. ఆగమ = స్మృతులచే, స్తుత! = కొనియాడఁ బడినవాఁడా!, పవిత్రచరిత్ర = పవిత్రమగు చరిత్రగలవాఁడా ! , నాథ! = ఓ! ప్రభూ!, యజ్ఞప్రియ! = యజ్ఞములపైఁ బ్రీతిఁగలవాఁడా!, ప్రణత = నమస్కరించెడు, దేవగణ = దేవతాసమూహముయొక్క, ఉత్తమాంగ! = శిరస్సులుగలవాఁడా; కల్పద్రుమ = కల్పవృక్షములయొక్క, ప్రసవ = పూలచే, పూజిత = పూజింపఁబడిన, దివ్యపాద = ప్రకాశించు పాదములు గలవాఁడా!, శ్రీ శైలనాస! శ్రీగిరిపర్వతాశాసము గలవాఁడా, శంకరా ! తవ = వీయొక్క, చరణం = పాదమును, శరణం = రక్షకముగ, అస్మి = అయితిని.

తా. ఓ శ్రీశైల పర్వతమందు నివసించు స్వామి! ‘సర్వాగ మస్తుత’ అనునామము మొదలాఱు నామములతో నిన్నుఁ బిల్చి నీ పాదమును శరణ మంటిని.

శంభో ! గిరీశ ! హర ! శూలధరాంధకారే !
శ్రీశైలవాస ! భ్రమరాంబికయా సమేత !
శ్రీ పార్వతీదయిత ! సాక్షిగణాధిపేడ్య !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. శఁభో ! = సుఖమునుగల్గించువాఁడా!, గిరీశ ! = కైలాసపర్వతమునకు బ్రభువా? ( లేక – పర్వతములపైననే తన నివాసముండుటనుబట్టి పర్వతము అకుఁ బ్రభువా! యనియునర్థము) హర! = కష్టములనుహరించువాఁడా! శూలధర! = త్రిశూలమును ధరించినవాఁడా!, ఆంధకారే! = ఆంధకుఁడను రాక్షసునకు శత్రువైనవాఁడా!, శ్రీశైలవాస! = శ్రీగిరియందు వసించువాఁడా! భ్రమరాంబికయా = భ్రమరాంబాదేవితో, సమేత! = కూడినవాఁడా!, శ్రీ = శోభావతియగు, పార్వతీ = పర్వతరాజపుత్రిక, దయిత! = ప్రియురాలుగాఁ గలవాఁడా! సాక్షిగణాధిప! = సాక్షిగణపతిచే, ఈడ్య! = నుతింపఁబడు వాఁడా! శ్రీ శైలనాథ! = శ్రీశైలశ్రభూ! తవ = నీ యొక్క, చరణం = పాదమును, శరణం = రక్షకముగ, అస్మి = ఆయితిని.

తా. ఓ! శ్రీశై లేశ్వర! ‘శంభో’ అనునది మొదలు తొమ్మిది నామములతో నిన్నుఁ బిలిచికొని నీ పాదమే నాకు శరణమని యనుచుంటిని; రక్షింపుమని భావము,

శ్రీశైలం, శిఖరేశ్వరం , గణపతిం, శ్రీహాటకేశం పున
స్సారంగేశ్వర, బిందుతీర్థమమలం, ఘంటార్కసిద్ధేశ్వరమ్
గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతామారామవీరేశ్వరం
శంఖం చక్రవరాహతీర్థకలితం శ్రీశైలనాథం భజే.

టీక. శ్రీశైలం = శ్రీగిరి, శిఖరేశ్వరం = శిఖరేశ్వరుని, గణపతిం = సాక్షి గణపతిని, శ్రీహాటకేశం = శోభించుహాటకేశ్వరుని (ఆటికేశ్వరుని) పునః = ఇంకను, సారంగేశ్వర = సారంగతీర్థమును, అమలం = స్వచ్ఛమైన, బిందుతీర్థం = బిందుతీర్థమును, ఘఁట = ఘంటేశుని, ఆర్క = అర్కేశ్వరుని, సిద్ధేశ్వరం = సిద్ధేశుని, గంగాం = పాతాళగంగను, శ్రీ భ్రమరాంబికాం = శ్రీ భ్రమరాంబాదేవిని, గిరిసుతాం = పార్వతీదేవిని, ఆరామవీరేశ్వరం = ఆరామవీరేశ్వరుని, శంఖం = శంఖమనుతీర్థమును. చక్రవరాహతీర్థ = చక్రతీర్థ, వరాహతీర్ధములతో, కలితం = కూడిన, శ్రీశైలవాథం = శ్రీ శైలేశుఁడగు మల్లీ కార్జున స్వామిని, భజే = సేవించుచున్నాను.

తా. శ్రీశైలక్షేత్రతీర్ధమునఁ గల ఈపైఁ జూపఁబడిన పదు నాఱు క్షేత్రతీర్థములతోఁగూడిన శ్రీశైలవాసుని నిత్యము మనసులోఁ దలఁచు చున్నాను. అని, కవి శ్రీశైలక్షేత్రా దిస్మరణము కాశీస్మరణము వలె పాపహరమని నుడువుచున్నాఁడు.

శ్రీశైలేశ్వర సుప్రభాత కలిత గ్రంథస్య, లంకాన్వయ
స్సీతారామకవి, ర్యథామతి, ముదా, భావార్థవైశద్యయు
గ్వ్యాఖ్యానం, విరచయ్య, చాంతిమతదే తస్యానుకంపాప్తయే
హ్యేకం, శ్రీచరణద్వయం, శరణమి, త్యాలోచ్య, తేనేష్టకమ్

టీక. శ్రీశైలేశ్వరసుప్రభాత = శ్రీగిరీశుని సుప్రభాతముతో, కలిత = కూడిన, గ్రంథస్య = గ్రంథమునకు, అంకాన్వయః = లంకావంశసంభూతుఁడగు, సీతారామకవిః = కవియగుసీతారామశాస్త్రి, ముదా = సంతోషముతో, యథామతి = బుద్ధివైశడ్యముతోలది, భావార్థవైశద్యయన్ = భావము, ఆర్థములయొక్క విశదీకరణముతోకూడిన, వ్యాఖ్యానం = విపులీకరణమును, విరచయ్య రచించి, అంతిమపదే = ఈసుప్రభాత గ్రంథాంతిమస్థానమును, (గ్రంథముయొక్క చివర) తస్య = ఆ శ్రీశైలేశునియొక్క, ఆనుకంపా = దయను, ఆప్తయే = పొందుటకొఱకు ఏకం = ముఖ్యమైనది, శ్రీ చరణం = శ్రీ వారి పాదమే, శరణంహి = రక్షకముగదా? ఇతి = ఇట్లని, ఆలోచ్య = తలఁచి, అష్టకం = శ్రీశైలవాస చరణశరణాష్టకమును, తేనే = రచించెను. తసూకరణ ఇతిధాతోర్థటి ఉత్తమ పురుషైకవచనమ్)

తా. ‘లంకా సీతారామశాస్త్రి’ యను కవి యీ శ్రీశైల సుప్రభాత గ్రంథమునకు టీకాతాత్పర్యములను వ్రాసి, యీ గ్రంథాంతమందు శ్రీశైలచరణ శరణాష్టక ముండు టావశ్యక మనియు-గుర్వులకా శ్రీశునిచరణమే శరణమని యెంచి దానిని రచించి ధన్యుఁడయ్యెనని తాత్పర్యము.

మరిన్ని అష్టకములు:

Leave a Comment