పల్లవి :ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకైన
నీ మాయ తెలియవశమా
కామారి వినుతగుణధామకువలయదళ
శ్యామా నన్ను గన్న తండ్రి రామా
సుతుడనుచు కవులు క్షితినాథుడనుచు భూ
పతులు కొలిచిరిగాని పతితపావనుడనుచు
మతి తెలియలేరైరి.
॥ఏమయ్య॥
చెలిమి కొడవనుచు పాండవులు నిజ
విరోధివటంచు నల జరాసంధాదులు కలవాడవని
కుచేలుండు నెరింగిరి గాని ఓజలజాక్ష నిన్ను సేవింపలేరైరి
॥ఏమయ్య॥
నరుడవని నరులు తమ దొరవనుచు యాదవులు
నరుడవనుచు కోపింతురు కరివరద భద్రాద్రిపుర నిలయ
రామదాస పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి
॥ఏమయ్య॥
8. పున్నాగరావళి చాపుతాళం
పల్లవి : ఏల దయరాదో రామయ్య నీకేల దయరాదో
మీ మేలుకై పాటుబడితిని యేల మీ భండము చాలుచాలును
॥ఏల॥
చరణములు
బ్రహ్మ గూర్పగదే అహోవరబ్రహ్మకావగదే
బ్రహ్మజనక భవ బ్రహ్మేంద్రాదులు బ్రహ్మానందము పాలైనారట
॥ఏల॥
పాపములచేత రామయ్య నేనోపలేను గదే
శ్రీభూపతి యే ప్రాపులేక నీ ప్రాపేగోరితి ఘోరరూపయిక
అయోధ్యా కాండ సర్గ 56 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. మరునాడు ఉదయం రాముడు ముందుగా మేల్కొన్నాడు. లక్ష్మణుని నిద్రలేపాడు. “లక్ష్మణా! మనము బయలుదేరు వేళ అయినది. తొందరగా నిద్రలే.” అని నిద్రలేపాడు. తరువాత సీతకూడా నిద్రలేచింది. అందరూ యమునలో స్నానం చేసారు. ప్రాతఃసంధ్యా కార్యక్రమములు నిర్వర్తించి చిత్రకూటమునకు ప్రయాణము అయ్యారు. రాముడు సీతకు దారిలో కనపడ్డ వృక్షముల గురించి, పుష్పముల గురించి వివరిస్తున్నాడు. చిత్రకూట పర్వతము మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని సీతకు చూపించాడు రాముడు. అలా నడుచుకుంటూ వారు ముగ్గురూ చిత్రకూట పర్వతమును చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆగాడు రాముడు.
మరునాడు ఉదయం రాముడు ముందుగా మేల్కొన్నాడు. లక్ష్మణుని నిద్రలేపాడు. “లక్ష్మణా! మనము బయలుదేరు వేళ అయినది. తొందరగా నిద్రలే.” అని నిద్రలేపాడు. తరువాత సీతకూడా నిద్రలేచింది. అందరూ యమునలో స్నానం చేసారు. ప్రాతఃసంధ్యా కార్యక్రమములు నిర్వర్తించి చిత్రకూటమునకు ప్రయాణము అయ్యారు.
రాముడు సీతకు దారిలో కనపడ్డ వృక్షముల గురించి, పుష్పముల గురించి వివరిస్తున్నాడు. చిత్రకూట పర్వతము మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని సీతకు చూపించాడు రాముడు. అలా నడుచుకుంటూ వారు ముగ్గురూ చిత్రకూట పర్వతమును చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆగాడు రాముడు.
“లక్ష్మణా! ఇక్కడ మనము ప్రశాంతంగా వనవాసము చేయవచ్చును. మనకు కావలసిన ఫలములు, కాయలు దుంపలు, ఆహారమునకు పనికి వచ్చు జంతువులు, స్వచ్ఛమైన నీరు పుష్కలంగా ఉన్నాయి. ఈ పర్వతము మీద చాలామంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు.” అని అన్నాడు.
వారు అలా మాట్లాడుకుంటూ వాల్మీకి ఆశ్రమమునకు చేరుకున్నారు. వాల్మీకి వారిని సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు వేసాడు. తన గురించి తనయొక్క వనవాసము గురించి వాల్మీకి మహర్షికి వివరంగా తెలిపాడు రాముడు.
తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“లక్ష్మణా!మనము ఇచ్చటనే ఒక కుటీరము నిర్మించుకొని నివసిస్తాము. కాబట్టి వెంటనే బలమైన కర్రలు తీసుకొని వచ్చి కుటీరము నిర్మించు.” అని అన్నాడు. లక్ష్మణుడు రాముడు చెప్పిన మేరకు ఒక కుటీరము నిర్మించాడు. ఆ పర్ణశాలను చూచి ఎంతో సంతోషించాడు రాముడు. “లక్ష్మణా! మనకు ఈ పర్ణశాలలో చాలాకాలము నివసింపబోవుచున్నాము. కాబట్టి వాస్తుదేవతలను పూజించాలి. వారిని శాంతింపజేయాలి. ముందుగా మనము లేడి మాంసముతో వాస్తుపూజ చేద్దాము.
కాబట్టి ఒక లేడిని చంపి దాని మాంసము తీసుకొని రా. శాస్త్రము ప్రకారము చేయవలసిన కర్మ కనుక లేడిని చంపిన పాపము అంటదు.” అని అన్నాడు రాముడు. వెంటనే లక్ష్మణుడు అడవిలోకి పోయి ఒక లేడిని వేటాడి తీసుకొనివచ్చాడు. దాని మాంసమును అగ్నిమీద ఉడికించాడు. గృహపూజకు సిద్ధం చేసాడు. “రామా! లేడి మాంసము ఉడికించాను. పూజకు అన్నీసిద్ధం చేసాను.ఇంక పూజకు ఉపక్రమించండి.” అని అన్నాడు లక్ష్మణుడు.
రాముడు స్నానము చేసి శుచిగా వచ్చి కూర్చున్నాడు. వేదమంత్రములను పఠిస్తూ గృహపూజ,వాస్తుదేవతా పూజను శాస్త్రోక్తంగా చేసాడు. దేవతల నందరినీ పూజించాడు. సీతా సమేతంగా ఆ పర్ణశాలలో గృహప్రవేశము చేసాడు రాముడు. తరువాత రాముడు విశ్వేదేవతలకు, త్రిమూర్తులకు బలులు సమర్పించాడు.
లక్ష్మణుడు పర్ణశాల లోపల వేదికలను, అగ్ని గృహమును నిర్మించాడు. తరువాత సీతారాములు అడవిలో లభించు ఫలములు, పుష్పములు, పక్వమైన మాంసముసేకరించి వాటితో భూతతృప్తి గావించారు. తరువాత అందరూ ఆ పర్ణశాలలో ప్రవేశించారు. అప్పటి నుండి సీతారామలక్ష్మణులు ఆ పర్ణశాలలో నివసిస్తున్నారు. అరణ్యములలో విహరిస్తూ, ఫలములు, కాయలు, దుంపలు, తేనె మొదలగు తినే పదార్ధములు సేకరిస్తూ, వాటిని తింటూ, ఆహ్లాదంగా జీవితం గడుపుతున్నారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ 82వ సర్గ, “సేనాప్రస్థాపనమ్”, రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, భరతుడు తన అన్న రాముడిని తిరిగి తీసుకురావడానికి వనానికి సేనను ప్రస్థానిస్తాడు. భరతుడు తన సైన్యంతో సహా, రాముడు ఉంటున్న అరణ్యానికి బయలుదేరతాడు. ఈ సర్గ భరతుడి ధైర్యం, రాముడి పట్ల అతని అపారమైన ప్రేమ, మరియు రాముడు తిరిగి రావాలని కోరుకునే భరతుడి పట్టుదలను స్పష్టంగా చూపిస్తుంది. సేనాప్రస్థాపన సందర్భంలో, భరతుడు తన సైన్యానికి మార్గదర్శకత్వం చేస్తూ, రాముడి సేవలో ఉండడం తన కర్తవ్యంగా భావిస్తాడు. ఈ సర్గ భరతుడి విధేయత, ధర్మపరాయణత, మరియు కుటుంబ ప్రేమను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది.
రాజసభలో వసిష్ఠుడు ఆదేశము ప్రకారము మంత్రులు సామంతులు పురప్రముఖులు ఎవరికి నిర్దేశించిన ఆసనములలో వారు కూర్చున్నారు. భరతుడు ఉన్నతాసనము అలంకరించాడు. పక్కనే శత్రుఘ్నుడు కూడా కూర్చున్నాడు. అప్పుడు వసిష్ఠుడు లేచి సభను, భరతుని ఉద్దేశించి ఇలా పలికాడు.
‘రాకుమారా! నీకు జయము కలుగు గాక! ఇప్పటి వరకు నీ తండ్రి దశరథుడు ఈ అయోధ్యను ధర్మమును ఆచరించుచూ ప్రజారంజకంగా పరిపాలించాడు. ఈ రాజ్యమును నీకు అప్పగించి దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. నీ అన్న రాముడు తండ్రి మాట ప్రకారము రాజ్యమును నీకు వదిలి అరణ్యములకు వెళ్లాడు. కాబట్టి, ఓ భరతా! నీ తండ్రి, నీ అన్న, నీకు అప్పగించిన రాజ్యభారమును నీవు వహించవలెను. వెంటనే అయోధ్యకు పట్టాభిషిక్తుడవు కమ్ము. ఈ అయోధ్యకు, ఉత్తరదేశపు రాజులు, పశ్చిమ దేశపు రాజులు, దక్షిణదేశపు రాజులు, సరిహద్దులలో ఉన్న రాజ్యాధీశులు, ఇంకా నీ అధీనములో ఉన్న ద్వీపములను పరిపాలించు రాజులు నీకు కప్పములు చెల్లించెదరు. ఈ సువిశాల సామ్రాజ్యమును నీవు పరిపాలించు.” అని పలికాడు వసిష్ఠుడు.
అప్పుడు భరతుడు ఇలా అన్నాడు. “కులగురువులు వసిష్టులు ఇలా మాట్లాడటం ఉచితము కాదని నా అభిప్రాయము. నా తండ్రి దశరథుడు ఈ రాజ్యమునకు అధినేత. ఆయన మరణానంతరము ఆయన పెద్దకుమారుడు రాముడు ఈ రాజ్యమునకు అధినేత. రామునికి తప్ప వేరెవ్వరికీ ఈ రాజ్యము మీద అర్హత లేదు. ఇప్పుడు నేను అయోధ్యకు పట్టాభిషిక్తుడను అయితే అంత కన్నా మహాపాపము వేరొకటి ఉండదు. ఆ పాపము చేసి నేను ఇక్ష్వాకువంశమునకు కళంకము తీసుకు రాలేను. నా తల్లి చేసిన పాప కార్యములో నేను పాలుపంచుకోలేను. నా అన్న రామునికి ఇక్కడి నుండి నమస్కారము చేయుచున్నాను. రాముని బదులు నా తల్లి కోరిక నేను తీర్చెదను. రామునికి పట్టాభిషేకము చేసి ఆయన బదులు నేను వనవాసము చేసెదను. ఇది నానిర్ణయము.” అని పలికాడు భరతుడు.
భరతుని నిర్ణయానికి సభలో ఉన్న వారందరూ జయజయధ్వానాలు చేసారు. భరతుడు ఇంకా తన ప్రసంగము కొనసాగించాడు.
“మీ అందరి సహకారంతో నేను ఎలాగైనా రాముని అయోధ్యకు తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తాను. ఒక వేళ రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము తిరిగి రాకపోతే, నేను కూడా లక్ష్మణునితో పాటు అడవులలోనే ఉంటాను. రాముని వద్దకు వెళ్లుటకు నేను అన్ని ఏర్పాట్లు చేయించాను. సుమంత్రా! నీవు వెళ్లి రాముని వద్దకు పోవుటకు అన్ని ఏర్పాట్లు చెయ్యి. నా వెంట సైన్యము కూడా రావలెను. రాముని రాజలాంఛనములతో అయోధ్యకు తీసుకురావలెను. వెంటనే నా రథమును కూడా సిద్ధము చెయ్యి ” అని అన్నాడు.
భరతుని ఆదేశము ప్రకారము సుమంత్రుడు రధము సిద్ధము చేసాడు. సైన్యాధ్యక్షులు తమ తమ అధీనములో ఉన్న సైన్యములను ప్రయాణానికి సమాయత్తం చేసారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ ఏకాశీతితమః సర్గ, “సభాస్తానమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, భరతుడు తన అన్న రాముడు వనవాసానికి వెళ్లిన తరువాత, అయోధ్యను ఎలా పాలించాలో నిర్ణయించడానికి రాజసభలో సమావేశం నిర్వహిస్తాడు. భరతుడు, రాముడి పట్ల ఉన్న గాఢమైన ప్రేమను మరియు విధేయతను ప్రతిబింబిస్తూ, రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి తనను తాను ప్రతినిధిగా ప్రకటిస్తాడు. ఈ సర్గలో, భరతుడు తన ధర్మాన్ని, భక్తిని, మరియు రాముడి పట్ల ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తూ, ప్రజలతో పాటు తన సామంతులను మరియు రాజకుటుంబాన్ని చర్చించుకుంటాడు. ఈ సంఘటన భరతుడి వినయం, విధేయత, మరియు నిస్వార్థతను హృదయానికి హత్తుకునేలా చూపుతుంది.
దశరథుడు చనిపోయి 13 రోజులు గడిచిపోయాయి. కర్మకాండలు అన్నీ పూర్తి అయ్యాయి. శోకదినములు గడిచిపోయాయి. 14వరోజున రాచరిక లాంఛనాలు ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జామునే వందిమాగథులు భరతుని స్తోత్రం చేస్తున్నారు. దుందుభులు మ్రోగిస్తున్నారు. మంగళవాద్యములు మోగుతున్నాయి. వేశ్యలు నృత్యం చేస్తున్నారు. అంతా కాబోయే మహారాజు భరతుని మేలుకొలుపు తున్నారు. కాని ఈ రాజలాంఛనాలు అన్నీ భరతునికి చికాకు పుట్టించాయి. అతనికి ఇంకా దుఃఖము ఎక్కువ అయింది.
“ఆపండి. నేను రాజును కాను.” అని గట్టిగా అరిచాడు.
అన్నీ ఆగిపోయాయి. భరతుడు శత్రుఘ్నుని చూచి ఇలా అన్నాడు.
“శత్రుఘ్నా! చూచావా. కైక వలన ఎంతటి అనర్ధము వాటిల్లిందో. మహారాజు రాజ్యభారము నా మీద మోపి తాను హాయిగా స్వర్గసుఖములు అనుభవిస్తున్నాడు. ఈ కష్టములు అన్నీ నాకు వదిలి రాముడు హాయిగా వనవిహారము చేస్తున్నాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను.’ అని రోదిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే వసిష్ఠుడు రాజసభను ఏర్పాటు చేసాడు. అయోధ్యలో ఉన్న అన్ని కులముల వారినీ, అమాత్యులనూ, పురప్రముఖులను, గణాధ్యక్షులను, సభకు ఆహ్వానించాడు. వారందరూ సభలో తమ తమ ఆసనములమీద కూర్చున్నారు. తరువాత వసిష్ఠుడు భరతుని, శత్రుఘ్నుని, యుధాజిత్తును, సుమంత్రుని తీసుకొని రమ్మని భృత్యులను పంపించాడు. భరతుడు, శత్రుఘ్ను సమేతంగా వచ్చిసభలో కూర్చున్నాడు. భరతుడు రాగానే అందరూ లేచి ఆయనకు అభివాదములు తెలియ జేసారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ఏకాదశః సర్గలో, రాముడు సరస్సు దాటి వస్తాడు, దాని నుండి దివ్య సంగీతం వినిపిస్తుంది. సరస్సు యొక్క నీటి క్రింద నుండి సంగీత స్వరాలను చూసి ఆశ్చర్యపోయిన అతను అనుసరిస్తున్న ఋషిని విచారించాడు మరియు ఆ ఋషి ఋషి మందకర్ణి యొక్క ఘట్టాన్ని వివరిస్తాడు.
ఆ అడవిలో రాముడు ముందు నడుస్తున్నాడు. సీత మధ్యలో ఉంది. వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు. వారు అనేకములైన కొండలను, సెలయేళ్లను దాటుకుంటూ వెళుతున్నారు. నదీతీరములలో ఇసుక తిన్నెల మీద ఎగురుతున్న సారస పక్షులను, చక్రవాక పక్షులను, జలపక్షులను చూస్తూ ఆనందిస్తున్నారు. గుంపులు గుంపులుగా పోవుచున్న వన్యప్రాణులను చూచి, ఆగి అవి వెళ్లిన మీదట వెళుతున్నారు. సాయంత్రము అయింది. వారు ఒక సరస్సును సమీపించారు.
ఆ సరస్సులో నుండి గీతాలాపనలు, వాద్య ధ్వనులు శ్రవణానందంగా వినిపిస్తున్నాయి. కాని ఆ దరిదాపులలో మానవ సంచారము లేదు. సీతారామలక్ష్మణులు ఆ ధ్వనులు విని ఆశ్చర్యపోయారు. తమ వెంట వస్తున్న ఋషులను ఆ వాద్య ధ్వనులు ఎక్కడినుండి వస్తున్నాయి అని అడిగారు. అందులో ధర్మభృతుడు అనే వృద్ధుడైన ఒక ఋషిఇలా చెప్పసాగాడు.
“రామా! ఈ సరస్సుపేరు పంచ అప్సర సరస్సు. ఈ తటాకము అన్ని ఋతువులలోనూ ఒకే విధంగా నీటితో నిండి ఉంటుంది. ఈ సరస్సును మాణ్ణకర్ణి అనే ఋషి నిర్మించాడు. మాణ్ణకర్ణి అనే ఆ ఋషి పదివేల సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేసాడు. ఆ తపస్సుకు దిక్పాలకులు వణికిపోయారు. ఎవరి పదవిని కోరి ఆ ఋషి తపస్సు చేస్తున్నాడో అని భయపడ్డారు. వెంటనే వారుమెరుపు తీగల వలె మెరిసిపోతున్న ఐదుగురు అప్సరసలను పిలిపించారు. ఆ ఋషి తపస్సును భగ్నం చేయమని వారిని పంపారు.
ఆ అప్సరసలు మాణ్ణకర్ణి వద్దకు వచ్చారు. తమ శృంగార హావభావాలతో ఆ మునిని ఆకట్టుకున్నారు. తమకు దాసుడిగా చేసుకున్నారు. శృంగార చేష్టలలో ఓలలాడించారు. ఆ ముని తన తపోబలంతో యువకుడిగా మారిపోయాడు. ఆ ఐదుగురు
అప్సరసలను పెళ్లి చేసుకున్నాడు. వారి కొరకు ఈ సరస్సును సృష్టించి, ఈ సరస్సు అడుగుభాగంలో ఒక గృహమును ఏర్పరిచి అందులో వారితో పాటు నివసిస్తున్నాడు. ఆ ఐదుగురు అప్సరసలు ఆలపించే గీతాలు, వాద్య ధ్వనులే మీరు వింటున్నారు.” అని అన్నాడు.
ఆ మాటలు విన్న రామలక్ష్మణులు సీత ఆశ్చర్యపోయారు. రాముడు అక్కడ కొన్ని మున్యాశ్రమములు చూచాడు. ఆ ఆశ్రమములలో ఉన్న మునులు రాముని సాదరంగా ఆహ్వానించారు. అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించారు. రాముడు ఆ ముని ఆశమములలో కొంత కాలము నివసించాడు. తరువాత రాముడు ఆ అడవిలో ఎన్నో ఆశ్రమములు సందర్శించాడు. ఆయా ఆశ్రమములలో కొంత కాలము నివసించాడు.
ఒక ఆశ్రమములో పది మాసములు, మరొక ఆశ్రమములో ఒక సంవత్సరము, మరొక ఆశ్రమములో నాలుగు మాసములు, ఐదు మాసములు, ఆరు మాసములు, ఒక మాసము, ఒకటిన్నర మాసము, మూడు మాసములు, ఎనిమిది మాసములు ఈ ప్రకారంగా రాముడు, సీత, లక్ష్మణుడు ఒక్కొక్క ఆశ్రమములో పై చెప్పిన విధంగా నివసిం చారు. ఆ విధంగా ముని ఆశ్రమములలో నివసిస్తూ రాముడు, సీత, అక్ష్మణుడు తమ వనవాస కాలములో పది సంవత్సరములు ఆనందంగాగడిపారు.
(దీనికి సంబంధించిన శ్లోకము ఇక్కడ ఉదహరిస్తాను. చదవండి.)
తదాసంవసతస్తస్య మునీనామాశ్రమేషు వై,
రమతశ్చానుకూల్యేన యయు: సంవత్సరా దశ.
ఆ విధంగారాముడు ఆశ్రమములలో నివసిస్తూ ఉండగా పది సంవత్సరములు అనుకూలంగా గడిచిపోయాయి. అంటే ఈ పదిసంవత్సరములు రాముడు ఒక్క రాక్షసుని కూడా చంపలేదు. మరి రాముడు మునులను రక్షిస్తాను అని వారికి ఇచ్చిన మాట ఏమైనట్టు. వారు రాక్షసుల చేతిలో అనుదినమూ బాధలు పడుతున్నారా! చస్తున్నారా! సీతను, లక్ష్మణుని అయినా వదులుకుంటాను కానీ నేను మునులకు ఇచ్చిన మాట తప్పను. అందుకే ధనుర్బాణాలు ధరించాను అన్న రాముడు వారి ఊసెత్తకుండా పది సంవత్సరాలు ఆనందంగా గడిపాడు. కానీ వారి కష్టాలు బాధలు తీర్చలేదు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?దీని అర్థం ఏమయి ఉంటుంది.
దీనికి సమాధానం మనకు ముప్పదవ సర్గలో కనిపిస్తుంది. రాముడు ఒక్కొక్క రాక్షసుని చంపడానికి ఇష్టపడలేదు. ఒకేసారి రాక్షసులనందరినీ మట్టు పెట్టాలని అనుకున్నాడు. అదును కోసం వేచి ఉన్నాడు. శూర్పణఖ వల్ల ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మొత్తం 14,000+5,000 సైనికులను ఖరుని, దూషణుని, త్రిశిరుని ఒకేసారి సంహరించి దండకారణ్యములో రాక్షస బాధను శాశ్వతంగా నివారించాడు. రాముడు తాత్కాలిక పరిష్కారం కోసం కాకుండా శాశ్వత పరిష్కారం కోసరం వేచిఉన్నాడు. ఇలా అర్థం చేసుకుంటే రాముని ఆంతర్యం మనకు అర్థం అవుతుంది.)
తరువాత ధర్మజ్ఞుడైన రాముడు, సీతతో, లక్ష్మణునితో ఆయా ఆశ్రమములలో నివసిస్తూ, తుదకు సుతీక్షుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. రాముడు సుతీక్షుని ఆశ్రమంలో కొంతకాలము నివసించాడు.
ఒకరోజు రాముడు సుతీక్ష మహామునిని చూచి ఇలా అన్నాడు. “మహాత్మా! అగస్త్యుడు ఈ అరణ్యములోనే ఆశ్రమము నిర్మించుకొని నివసిస్తున్నాడు అని వారి గురించి కథలు కధలు గా విన్నాము. మాకు ఆయనను దర్శించవలెనని కోరికగా ఉంది. ఆయన ఆశ్రమము ఎక్కడ ఉందో దయచేసి తెలియజేయండి.” అని ప్రార్థించాడు.
“రామా! మంచి పని చేస్తున్నావు. నేనే నిన్ను అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లమని చెబుదాము అని అనుకుంటున్నాను. ఇంతలో నీవే అడిగావు. చాలా సంతోషము. ఈ ఆశ్రమము నుండి నాలుగు యోజనముల దూరంలో దక్షిణ దిశగా అగస్త్యుని సోదరుడు (అగస్త్యభ్రాత) ఆశ్రమము కలదు.
(ఈ అగస్త్య భ్రాత గురించి మన ఇంట్లో పెద్ద వాళ్లకు తెలుసు. అగస్త్యుని సోదరునికి పేరు లేదు. అంతా అగస్త్య భ్రాత అంటారు. “వీడెవడో అగస్త్య భ్రాతలా ఉన్నాడే!” అని అనడం మనం వింటూ ఉంటాము. అగస్త్యభ్రాత అనేది ఒక నానుడి.)
రామా! నీవు అగస్త్య భ్రాత ఆశ్రమములో ఒక రాత్రి ఉండి మరునాడు అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లు. అగస్త్య భ్రాత ఆశ్రమము నకు ఒక యోజన దూరంలో అగస్త్యుని ఆశ్రమము ఉంది.” అని అన్నాడు.
తరువాత రాముడు సుతీక్షుని వద్ద అనుజ్ఞ తీసుకొని అగస్త్యుని ఆశ్రమమునకు బయలు దేరాడు. దక్షిణ దిశగా నాలుగు యోజనములు ప్రయాణము చేసి అగస్త్య భ్రాత ఆశ్రమమును చేరుకున్నారు.
ఫలవృక్షములు సమృద్ధిగా కల ఆ ప్రాంతమును చూచి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఇక్కడ ఉన్న ఫలవృక్షములు, పిప్పళ్ల చెట్లు, ఆశ్రమము బయట ఉన్న సమిధలు, సేకరించిన దర్భలు, ఆరవేసిన నార చీరలు, చూస్తుంటే సుతీక్ష మహాముని చెప్పిన అగస్త్య భ్రాత ఆశ్రమము ఇదే అని తెలుస్తోంది. అటు చూడు, ఆ ఆశ్రమము పైనుండి అగ్ని హోత్రము నుండి వెలువడే పొగ ఆకాశంలోకి ఎలా పోతోందో! సందేహము లేదు. ఇదే అగస్త్య భ్రాత ఆశ్రమము.
లక్ష్మణా! నీకు తెలుసా! అగస్త్యుడు ఈ దక్షిణ ప్రాంతము అరణ్యములలో నివసించు బ్రాహ్మణులకు తాపసులకు వారికి ఎంతో ఉపకారము చేసాడు. ఎలాగంటే…..
ఈ అడవిలో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు ఇక్కడ నివసించే బ్రాహ్మణులను, తాపసులను మోసం చేసి చంపి తినేవారు. ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడిగా వేషం వేసుకొనేవాడు. “ ఈ రోజు నా తండ్రి ఆబ్దికము మీరు భోజనానికి భోక్తగా రావాలి” అని బ్రాహ్మణులను తన ఇంటికి తీసుకొని వెళ్లేవాడు. వాతాపి ఒక గొర్రెగా మారి పోయేవాడు. శాస్త్రములలో చెప్పబడిన శ్రాద్ధకర్మల విధి ప్రకారము ఇల్వలుడు ఆ గొర్రెను చంపి ఆ మాంసముతో ఆ భోక్తగా వచ్చిన బ్రాహ్మణునకు భోజనం పెట్టేవాడు.
బ్రాహ్మణుడు భోజనం చేసిన తరువాత “వాతాపీ! బయటకు రా!” అని బిగ్గరగా అరిచేవాడు. ఆ బ్రాహ్మణుని పొట్టలో ఉన్న వాతాపి గొర్రెగా మారి, ఆ బ్రాహ్మణుని పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేవాడు. వాతాపి, ఇల్వలుడు ఇద్దరూ కలిసి ఆ బ్రాహ్మణుని చంపి తినేవారు. ఈ ప్రకారము ఆ రాక్షసులు ఇద్దరూ ఎంతో మంది బ్రాహ్మణులను చంపారు. ఈ సంగతి తెలిసి దేవతలు, బ్రాహ్మణులు అగస్త్యుని శరణు వేడారు. అగస్త్యుడు సరేఅన్నాడు.
ఒక రోజు అగస్త్యుడు ఇల్వలుని ఇంటికి భోక్తగా వెళ్లాడు. వాతాపి గొర్రెగా మారాడు. ఇల్వలుడు వాతాపిని చంపి ఆ మాంసమును వండి అగస్త్యునికి వడ్డించాడు. అగస్త్యుడు తృప్తిగా భోజనం చేసాడు. “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అంటూ బ్రేవ్మంటూ త్రేన్చాడు. అంతే. అగస్త్యుని పొట్టలో ఉన్న వాతాపి జీర్ణం అయిపోయాడు. ఇది తెలియని ఇల్వలుడు “వాతాపీ! బయటకు రా!’ అని అరిచాడు. ఎంత అరిచినా వాతాపి రాలేదు.
అగస్త్యుడు నవ్వాడు. “ఇంకెక్కడి వాతాపి. వాడు నా పొట్టలో ఎప్పుడో జీర్ణం అయిపోయాడు.” అన్నాడు తన పొట్ట నిమురుకుంటూ. దానికి కోపించి ఇల్వలుడు అగస్త్యుని మీద దాడి చేసాడు. అగస్త్యుడు తన తపోశక్తితో ఇల్వలుని భస్మం చేసాడు. ఆ ప్రకారంగా అగస్త్యుడు ఈ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులకు, మునులకు రాక్షస బాధ తొలగించాడు. ఆ అగస్త్యుని సోదరుడే ఈ అగస్త్య భ్రాత” అని వివరించాడు రాముడు.
(ఈ రోజుల్లో కూడా తల్లులు పసిబిడ్డలకు ఉగ్గు, పాలు పట్టిన తరువాత “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం మా అబ్బాయి తాగిన పాలుజీర్ణం” అని పొట్ట మీద నిమురడం మనం చూస్తూ ఉంటాము.)
అంతలో సాయంత్రం అయింది. రామలక్ష్మణులు సాయంసంధ్యలు నిర్వర్తించారు. అగస్త్యభ్రాత ఆశ్రమములోనికి ప్రవేశించి ఆయనకు పాదాభివందనము చేసారు. అగస్త్యభ్రాత కూడా రాముని సాదరంగా ఆహ్వానించాడు. ఫలములు పుష్పములు ఇచ్చి సత్కరించాడు. రాముడు, లక్ష్మణుడు, సీత ఆ రాత్రికి ఆ ఆశ్రమములోనే ఉన్నారు.
మరునాడు ఉదయమే లేచి రాముడు సంధ్యావందనాది కార్యక్రమములు పూర్తి చేసుకొని అగస్త్యభ్రాత వద్దకు వెళ్లి అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లుటకు ఆయన అనుమతి కోరాడు. అగస్త్య భ్రాత రామునికి తన అన్న అగస్త్యుని ఆశ్రమమునకు పోవుటకు మార్గము చెప్పాడు. రాముడు, సీత, లక్ష్మణులు వెంట రాగా అగస్త్య ఆశ్రమమునకు బయలుదేరాడు. అగస్త్య భ్రాత చెప్పిన గుర్తుల ప్రకారము ప్రయాణం చేస్తున్నాడు.
ఒకచోట ఫలవృక్షములు మెండుగా కనిపించాయి. లేళ్లు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. హెూమధూమము పైకి లేస్తోంది. దానిని బట్టి అగస్త్యుని ఆశ్రమము అక్కడకు దగ్గరలోనే ఉంది అని రాముడు అనుకొన్నాడు. అంతలోనే నారచీరలు ఆరవేసి ఉన్న ఆశ్రమ ప్రాంగణము కనపడింది. మృగములు తమ సహజ వైరము మరిచి ప్రశాంతంగా సంచరిస్తున్నాయి.
“ఎవరి తపోప్రభావంచేత రాక్షసులు ఈ ప్రాంతానికి రావడానికి భయపడుతుంటారో ఆ అగస్త్య మహా ముని ఆశ్రమము ఇదే. ఇక్కడకు దేవతలు గంధర్వులు నియమం తప్పకుండా వచ్చి అగస్త్య మహామునిని సేవిస్తుంటారు.
ఈ అగస్త్య మహాముని ఆశ్రమములో అబద్ధాలు చెప్పేవారికి, ఈ క్రూరులకు, వంచకులకు, సాటి మానవులను హింసించేవారికి స్థానము లేదు. ఎంతో మంది మహర్షులు ఇక్కడ తపస్సు చేసి, స్వర్గానికి వెళ్లారు. ఈ ఆశ్రమ ప్రాంతములో ఎవరైనా తపస్సు చేసి కోరికలు కోరుకుంటే వాటిని దేవతలు తప్పకుండా నెరవేరుస్తారు. ఇదీ ఆ ఆశ్రమ మహాత్మ్యం.
లక్ష్మణా! ముందు నీవు ఆశ్రమములోనికి ప్రవేశించి నేను, సీత మహాముని దర్శనానికి వచ్చామని అగస్త్యునికి విన్నవించు” అని రాముడు లక్ష్మణునితో అన్నాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిసప్తతితమః సర్గలో, పరశు రాముడు నిష్క్రమణ సమయంలో వివాహ బృందం అయోధ్యకు చేరుకుంటుంది. వివాహానికి ముందు వచ్చిన భరతుని మామ అయిన యుధాజిత్ ఇప్పుడు భరతుడు మరియు శత్రుఘ్నులను తన రాజ్యానికి తీసుకువెళతాడు. అప్పటి నుండి రామ, లక్ష్మణులు తమ తండ్రి కోరిక మేరకు వారి వారి సంక్షేమ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. రాముడు మరియు సీత వారి ఆనందకరమైన వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తారు.
పరశురాముడు మహేంద్రగిరికి వెళ్లిన తరువాత రాముడు తన వద్ద ఉన్న విష్ణుధనుస్సును, బాణమును, వరుణ దేవునికి ఇచ్చాడు. తరువాత రాముడు వసిష్ఠుడు మొదలగు ఋషులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. తండ్రి దశరథుని చూచి ఇలాఅన్నాడు.
“తండ్రీ! పరశురాముడు వెళ్లిపోయాడు. ఇంక మనము అయోధ్యకు ప్రయాణము సాగిద్దాము. మన పరివారమునకు సేనలకు అనుజ్ఞ ఇవ్వండి.” అని అన్నాడు.
అప్పటి దాకా ఆశ్చర్యంతో చూస్తున్న దశరథుడు ఒక్కసారి తెలివిలోకి వచ్చాడు. రాముని గట్టిగా కౌగలించుకున్నాడు. శిరస్సును ముద్దుపెట్టుకున్నాడు. అటు ఇటు చూచి పరశురాముడు వెళ్లి పోయాడు అని నిర్ధారించుకున్నాడు. ఆనందంతో పొంగిపోయాడు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు మరలా జన్మమెత్తినట్టు భావించాడు. దశరథుని మనస్సు కుదుట పడింది. తన సైన్యమునకు అయోధ్యకు ప్రయాణము సాగించమని ఆజ్ఞాపించాడు. అందరూ అయోధ్యకు చేరుకున్నారు.
వీరి రాక ముందు తెలిసిన అయోధ్యాపుర వాసులు వారికి ఘనస్వాగతం పలికారు. నగరమంతా మామిడి తోరణములతోనూ, అరటి స్తంభములతోనూ, రకరకాల పూలతోనూ అలంకరించారు. మంగళ వాద్యములతో రామునికి ఎదురేగి స్వాగతం పలికారు. అందరూ రాజనగరు ప్రవేశించారు.
కౌసల్య, సుమిత్ర, కైకేయీ ఎదురుగా వచ్చి కొత్త కోడళ్లను ఆహ్వానించి లోపలకు తీసుకొని వెళ్లారు. సీతకు, ఊర్మిళకు,మాండవికి, శ్రుతకీర్తికి కొత్త పట్టుబట్టలు అలంకరింపజేసారు. నూతన వధూవరులు గృహప్రవేశ కార్యక్రమును నిర్వర్తించారు. గృహదేవతలను పూజించారు. జనకుని పుత్రికలు అత్తగార్లకు, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నారు. బ్రాహ్మణులకు గోదానములు, సువర్ణదానములను చేసి వారిని తృప్తిపరిచారు. ఆ రాత్రికి వారి వారి భర్తలతో సాంసారిక సుఖములను అనుభవించారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రి దశరథునికి సేవచేసు కుంటూ ఉన్నారు.
కొన్ని రోజులు గడిచిన తరువాత దశరథుడు భరతుని చూచి ఇలా అన్నాడు.
“నాయనా భరతా! నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తన వెంట తీసుకొని వెళ్లుటకు కేకయ రాజ్యము నుండి వచ్చాడు. ఆ విషయము నాకు మిథిలలోనే చెప్పాడు. శుభకార్యములు జరుగు చుండుట వలన వీలు కాలేదు. నీవు నీ తాత గారింటికి వెళ్లి ఆయనను సంతోష పెట్టు.” అని అన్నాడు.
భరతుడు తండ్రి మాట ప్రకారము చేసాడు. తండ్రికి తల్లులకు, పెద్దలకు పురోహితులకు నమస్కరించి వారి ఆశీర్వాదము వారి అనుమతి తీసుకున్నాడు. శత్రుఘ్నుడు వెంట రాగా తన తాతగారి ఇంటికి ప్రయాణమయ్యాడు.
భరత శత్రుఘ్నులు వెళ్లిన తరువాత రామ లక్ష్మణులు తండ్రిగారికి సేవజేసుకుంటూ ఉన్నారు. తండ్రి అనుమతితో రాముడు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులను చేసాడు. పూర్తిగా నియమములను పాటిస్తూ తండ్రికి రాజ్యపాలనలో సాయం చేస్తున్నాడు. ఎవరి మనస్సూ నొప్పించకుండా అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు.
రాముని ప్రవర్తనకు, గుణగణములకు అయోధ్య ప్రజలు ఎంతో సంతోషించారు. రాముని వంటి ప్రభువు తమకు కావాలని కోరు కున్నారు.
రాముడు రాజ్యకార్యములలో పడి భార్యను నిర్లక్ష్యము చేయలేదు. సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకొనేవాడు. ఎల్లప్పుడూ ఆమెను తన హృదయ పీఠము నందు నిలుపుకొనే వాడు.
సీత కూడా రాముని ఎడల ఎంతో ప్రేమతో ప్రవర్తించేది. రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. రాముడు సీత మధ్య ఉన్న ప్రేమ దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది. ఒకరి హృదయము తెలిసి మరొకరు నడుచుకొనేవారు. వారి అన్యోన్యాను రాగములతో కూడిన దాంపత్యము చూచి కౌసల్య ఎంతో మురిసి పోయేది. ఆ ప్రకారంగా రాముడు సీత సాక్షాత్తు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తున్నారు.
అయోధ్యాకాండం యొక్క షట్సప్తతితమః సర్గంలో, దశరథ మహారాజు రాముని వనవాసం పట్ల తీవ్రంగా దుఃఖిస్తూ తన గత పాపాలను తలుచుకుంటాడు. ఆయన కైకేయితో చేసిన వాగ్దానం ఫలితంగా రాముడు అడవికి వెళ్లిపోయినందుకు పశ్చాత్తాపంతో బాధపడతాడు. రాత్రిలో దశరథుడు కౌసల్య, సుమిత్రలతో తన బాధను పంచుకుంటాడు. దశరథుడు రాముని విడిచి ఉండలేక, ఆ వేదనతో అణచిపడి, తన ప్రాణాలను విడుస్తాడు. ఆయన చివరి క్షణాలలో రాముని మరియాదలను, అతని కరుణామయ స్వభావాన్ని తలుచుకుంటాడు. కౌసల్య, సుమిత్రలు దశరథుని మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోతారు, అయోధ్యలో విషాద వాతావరణం నెలకొంటుంది.
మరునాడు తెల్లవారింది. భరతుడు వచ్చాడు అన్న వార్త విని కులగురువు వసిష్ఠుడు భరతుని వద్దకు వచ్చాడు. భరతునితో ఇలా అన్నాడు. “నాయనా భరతా! నీకు శభము అగుగాక! నీ తండ్రి మరణము గురించి దుఃఖించకుము. నీ తండ్రికి కర్మకాండలు జరిపించు.” అని పలికాడు. కులగురువు వసిష్ఠుని ఆదేశము ప్రకారము భరతుడు తన తండ్రికి ఉత్తర క్రియలు అన్ని యధావిధిగా జరిపించాడు. దశరథ మహారాజు శరీరమును తైలద్రోణిలో నుండి బయటకు తీసి నేల మీద ఉంచారు. తైల ద్రోణిలో ఉంచడం వల్ల మహారాజు శరీరములో ఏ మార్పూ రాలేదు. నిద్రపోతున్నట్టు ఉన్నడు దశరథుడు. తరువాత మహారాజును రత్నములు పొదిగిన శయ్యమీద పడుకోబెట్టారు. తన తండ్రి శవమును చూచి భరతుడు ఎంతో దు:ఖించాడు.
“మహారాజా! నేను ఇంట్లో లేని సమయం చూచి రాముని అడవులకు ఎందుకు పంపావు? అటువంటి నిర్ణయము ఎందుకు తీసుకున్నావు? నీకేం హాయిగా స్వర్గానికి వెళ్లావు. రాముడు లక్ష్మణునితో కలిసి అరణ్యములకు వెళ్లాడు. నేను జీవచ్ఛవము లాగా ఇక్కడ ఉన్నాను. ఇంక ఈ అయోధ్య యోగక్షేమములు ఎవరు చూస్తారు? మహారాజా! నీవులేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశము వలె కళావిహీనంగా ఉంది.” అని విలపిస్తున్నాడు భరతుడు. ఆ ప్రకారంగా శోకిస్తున్న భరతుని చూచి వసిష్ఠుడు ఇలా అన్నాడు.
“భరతా! పోయినవారి గురించి చింతించి ప్రయోజనములేదు. జరుగవలసిన కార్యము గురించి ఆలోచించు. మహారాజుకు ప్రేతకర్మలు నిర్వర్తించు. మహారాజును ప్రేతత్వము నుండి విముక్తి కలిగించు.” అని అన్నాడు. అగ్ని గృహమునుండి ఋత్విక్కులు అగ్నిని తీసుకొని వచ్చారు. దశరథుని పార్థివశరీరమును బయటకుతీసుకొని వచ్చారు. ఆయన శరీరమును పల్లకీలో పరుండబెట్టారు. ఆ పల్లకిని ఊరేగింపుగా శ్మశానమునకు తీసుకొని వెళ్లారు. దారిలో పురజనులు ఆయన శరీరము మీద వెండి, బంగారము, పూలు చల్లారు. చందనము కర్రలతో చితిని పేర్చారు. సుగంధ ద్రవ్యములను చితిలో వేసారు. దశరథుని శరీరమును చితిమీద ఉంచారు. ఋత్విక్కులు హెమం చేసారు. వేదములు పఠించారు. దశరథుని భార్యలందరూ తమ తమ వాహనములలో శ్మశానమునకు చేరుకున్నారు.
అయోధ్యాకాండ పంచసప్తతితమః సర్గంలో, సుమంత్రుడు రాముడు, సీత, లక్ష్మణులను గంగానది వద్ద వదిలి కుశలముగా తిరిగి అయోధ్యకు చేరుకుంటాడు. సుమంత్రుడు వధూతి దశరథుని వద్దకు వెళ్ళి రాముని అరణ్యవాసం గురించి వివరించాడును. దశరథుడు రాముని వేదనతో బాధపడి, వేదనతో వ్యాకులుడైనాడు. రాముడు లేని జీవితాన్ని తట్టుకోలేక, రాముడి తలపులో ఉంటూ కన్నీళ్ళతో వ్యతిరేకిస్తున్నాడు. ఆయనకు నిద్ర కూడా పట్టడం లేదు, రాముని స్వరాన్ని మళ్లీ వినాలని తహతహలాడతాడు. దశరథుడు చివరికి తాపత్రయంతో రాముడి తలపులో తన ప్రాణాలు విడుస్తాడు.
పుత్ర వ్యామోహం ఇంత చేటు తెస్తుందని కలలోనైనా తలపని కైక, తన కొడుకు కోసరం ఇదంతా చేసింది. అపకీర్తి పాలయింది కైక. కాని తనకొడుకు భరతుడు తననే నిందిస్తున్నాడు. శాపాలు పెడుతున్నాడు. తన తల్లివే కాదు పొమ్మన్నాడు. ఈ మాటలు విని కైక కుమిలిపోతోంది. నోట మాట రావడం లేదు. నేల మీద పడి ఉన్న కొడుకు భరతుని నిస్సహాయంగా చూస్తూ ఉంది.
ఇంతలో భరతుడు లేచాడు. భరతుని రాకను విని అమాత్యులు అందరూ అక్కడకు చేరుకున్నారు. కాబోయే మహారాజు భరతుడు నేలమీద పడి ఉన్నాడు. వాళ్లకు ఏం చెయ్యాలో తోచడం లేదు. అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో భరతుడు తల పైకి ఎత్తి అమాత్యులను చూచాడు. భరతునికి ఒక అనుమానం పట్టుకొంది. రాముడు అరణ్యములకు వెళితే, తన తండ్రి మరణిస్తే, తానే రాజు అవుతాడు. ఈ చర్యల వల్ల లబ్ధి. పొందేది తను. అమాత్యులు తానే ఇదంతా తన తల్లి కైక తో చేయించానని అపోహ పడే అవకాశం ఉంది. తనకు ఏమీ తెలియదు అనీ, తాను అమాయకుడననీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత తన మీద ఉందని గుర్తించాడు భరతుడు. అందుకే అమాత్యులతో బిగ్గరగా ఇలా అన్నాడు.
“అందరూ వినండి. నేను ఇప్పటిదాకా మా తాతగారి ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే అయోధ్యకు వచ్చాను. ఇక్కడ జరిగిన పరిణామాలు ఏవీ నాకు తెలియవు. నేను చాలా దూరంలో ఉన్నాను కాబట్టి తెలిసే అవకాశం కూడా లేదు. అందరికీ తెలియజేసేది ఏమంటే నాకు అయోధ్యకు రాజు కావాలని కోరిక లేదు. అలా అని నేను ఎవరినీ కోరలేదు. నా తల్లి కైక కూడా నాతో ఈ విషయం ఎప్పుడూ చర్చించ లేదు. రాముడు వనవాసము వెళ్లినట్టుగానీ, వారిని సీత, లక్ష్మణుడు అనుసరించినట్టుగానీ నాకు ఏ మాత్రం తెలియదు. వారు ఏ కారణం చేత అడవులకు వెళ్లారో కూడా నాకు తెలియదు. ఇది నిజం.” అని బిగ్గరగా అరిచాడు.
భరతుని కంఠస్వరమును విన్నది కౌసల్య, సుమితను పిలిచింది. “సుమిత్రా! అది భరతుని కంఠస్వరము కదూ! భరతుడు తన మేనమామ ఇంటినుండి వచ్చినట్టున్నాడు. పద వెళ్లి భరతుని పలకరించి వద్దాము.” అని అంది కౌసల్య. కౌసల్య సుమిత్రలు భరతుని చూడ్డానికి బయలుదేరారు. ఇంతలో భరతుడు, శత్రుఘ్ననితో కలిసి కౌసల్య మందిరము వైపువస్తున్నాడు.
“అందరూ వినండి. నేను ఇప్పటిదాకా మా తాతగారి ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే అయోధ్యకు వచ్చాను. ఇక్కడ జరిగిన పరిణామాలు ఏవీ నాకు తెలియవు. నేను చాలా దూరంలో ఉన్నాను కాబట్టి తెలిసే అవకాశం కూడా లేదు. అందరికీ తెలియజేసేది ఏమంటే నాకు అయోధ్యకు రాజు కావాలని కోరిక లేదు. అలా అని నేను ఎవరినీ కోరలేదు. నా తల్లి కైక కూడా నాతో ఈ విషయం ఎప్పుడూ చర్చించ లేదు. రాముడు వనవాసము వెళ్లినట్టుగానీ, వారిని సీత, లక్ష్మణుడు అనుసరించినట్టుగానీ నాకు ఏ మాత్రం తెలియదు. వారు ఏ కారణం చేత అడవులకు వెళ్లారో కూడా నాకు తెలియదు. ఇది నిజం.” అని బిగ్గరగా అరిచాడు.
భరతుని కంఠస్వరమును విన్నది కౌసల్య, సుమితను పిలిచింది. “సుమిత్రా! అది భరతుని కంఠస్వరము కదూ! భరతుడు తన మేనమామ ఇంటినుండి వచ్చినట్టున్నాడు. పద వెళ్లి భరతుని పలకరించి వద్దాము.” అని అంది కౌసల్య. కౌసల్య సుమిత్రలు భరతుని చూడ్డానికి బయలుదేరారు. ఇంతలో భరతుడు, శత్రుఘ్ననితో కలిసి కౌసల్య మందిరము వైపువస్తున్నాడు.
భరతుని చూచినకౌసల్యకు దుఃఖము ఆగలేదు. ఏడుస్తూ భరతుని పొదిపట్టుకొంది. గట్టిగా కౌగలించుకొని ఏడుస్తూ ఉంది. “నాయనా భరతా! నీవు రాజ్యము కావాలని కోరుకున్నావు. నీకు అన్నదమ్ముల బాధ కానీ దాయాదుల బాధ కానీ లేని రాజ్యము లభించింది. నీ తల్లి కైక చేసిన దుశ్చర్యల వలన నీకు రాజ్యప్రాప్తి సులభంగా కలిగింది. కైక తన కొడుక్కు రాజ్యము కావాలని కోరుకోడంలో తప్పులేదు. కానీ నా కొడుకును నార చీరలు కట్టించి అడవులకు పంపడం దేనికి? దాని వలన ఆమెకు కలిగే ప్రయోజనము ఏమి? అంతకన్నా నన్ను కూడా రామునితో పాటు అడవులకు పంపాలి అని ఆమె కోరుకొని ఉంటే బాగుండేది. ఆమె కోరుకున్నా కోరుకోక పోయినా నేను, సుమిత్రా, మా కుమారుల వద్దకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాము. నీ అనుమతి కోసరం ఎదురుచూస్తున్నాము. నీకు మామీద దయ ఉంటే మమ్ములను రాముడు ఉన్నచోటికి తీసుకొని వెళ్లు. ఇదే మేము నిన్ను కోరేది.” అని భరతుని సూదుల వంటి మాటలతో బాధపెట్టింది కౌసల్య.
ఆ మాటలకు చలించిపోయాడు భరతుడు. తనకు ఏ పాపమూ తెలియకపోయినా అంతా తనకు తెలిసే జరిగిందని అంతా అనుకుంటున్నారు. తుదకు కౌసల్యకూడా ఆ ప్రకారము మాట్లాడింది. ఏం చెయ్యాలో తోచక భరతుడు అలాగే కిందికి జారిపోయాడు. గట్టిగా కౌసల్య కాళ్లు పట్టుకున్నాడు. భోరునవిలపిస్తున్నాడు. కౌసల్యముందు చేతులు జోడించి మోకాళ్ల మీద నిలబడ్డాడు. ఆమెతో ఇలా అన్నాడు. “అమ్మా! నా సంగతి నీకు తెలియదా. రాముడు అంటే నాకు ఎంత ప్రేమా భక్తి ఉందో నీకు తెలియదా. ఎందుకమ్మా నువ్వు కూడా నన్ను నిందిస్తావు. నా అన్న రాముని అరణ్యములకుపంపిన వారికి ధర్మశాస్త్రము గురించి ఏమీ తెలియదు. వారి బుద్ధి చెడిపోయినది.
అమ్మా! నాకు తెలిసీ, నేను రాముని అడవులకుపంపడానికి సమ్మతించినట్టయితే నేను నిద్రించుచున్న గోవును కాలితో తన్నిన పాపమును, సూర్యుని ఎదురుగా మలమూత్రవిసర్జన చేసిన పాపమును, పాపాత్ములను సేవించిన పాపమును పొందుతాను. అమ్మా! నేనే కనక రాముని అడవులకు పంపినట్టయితే నేను పనివాళ్ల చేత పనిచేయించుకొని వారికి పారితోషికము ఇవ్వని పాపమున పోతాను. రాముడు అడవులకు పోవడం నాకు తెలిసీ నేను ఊరకుంటే నేను రాజద్రోహము చేసిన పాపమున పోతాను.
నేను కనక రాముడు అడవులకు పోవడానికి సమ్మతి తెలియజేసినట్టయితే నేను ప్రజల నుండీ పన్నులు వసూలు చేస్తూ ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించని పాపమున పోతాను. (ప్రస్తుత రాజకీయ నాయకులందరూ ఇదే పాపం చేస్తున్నారు.)
అమ్మా! నేను కనక రాముని అరణ్యములకో పోవుటకు నా సమ్మతి తెలిపినట్టయితే నేను యాగము చేయించుకున్న తరువాత ఋత్విక్కులకు బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన పాపాన పోతాను.
నేను కనక నా అన్న రాముని అరణ్యవాసమునకు కారణము అయితే నేను యుద్ధములో పారిపోయి వచ్చిన వాడు పొందే పాపమును, పెద్దలను అవమానించిన పాపమును, వేదాధ్యయనము చెయ్యని పాపమును, మిత్రద్రోహము చేసిన పాపమును, భార్యాబిడ్డలకు, బంధువులకుపెట్టకుండా నేనొక్కడినే మృష్టాన్నమును భుజించిన పాపమును, సంతానము కలుగని వాడు పొందే పాపమును, రాజును, స్త్రీలను, బాలురను వృద్ధులను చంపిన పాపమును, తాను పోషించ వలసిన వారిని పోషించకుండా వదిలివేసిన పాపమును, అక్రమ వ్యాపారములను చేసిన వాడు పొందే పాపమును, ఇతరుల ఇండ్లు తగలపెట్టిన వాడు పొందే పాపమును, ఉదయము, సాయంత్రమూ నిద్రించేవాడు పొందే పాపమును, గురువుగారి భార్యను కామించే వాడు పొందే పాపమును, దేవతలను ఆరాధించని వాడు, తల్లితండ్రులకు సేవచేయని వాడు పొందే పాపమును, క్రూరపు పనులు చేయుచూ, అబద్ధాలు ఆడుతూ, అపవిత్రంగా, అధర్మంగా, అందరికీ భయపడుతూ దొంగవలె బతికేవాడు పొందే పాపమును, కట్టుకున్న భార్యను వదిలి, పరస్త్రీల వెంట తిరిగేవాడు పొందే పాపమును, తాగే నీరు పాడుచేసేవాడు, ఇతరులకు విషం ఇచ్చేవాడు పొందే పాపమును, సిద్ధంగా ఉన్న పూజను పాడుచేసేవాడు పొందేపాపమును, దూడకు కూడా మిగల్చకుండా ఆవునుండి పాలు అన్నీపితికేవాడు పొందే పాపమును, నా దగ్గర జలం ఉండీ, దప్పికతో ఉన్న వారికి జలం ఇవ్వని వాడు పొందే పాపమును, ఇద్దరు కొట్టుకుంటుంటే వారిని విడదీయకుండా వినోదంగా చూచేవాడు పొందే పాపమును, పొందుతాను.
అమ్మా! నేను కనక రాముని అడవులకు పంపడానికి అనుమతి ఇచ్చినట్టు నీవు భావిస్తే నేను ప్రజలందరిచేతా అందరికీ అపకారము చేసేవాడి గానూ, కృతఘ్నుడు గానూ, ఆత్మహత్యాసదృశు డుగానూ, సిగ్గులేని వాడిగానూ అవమానింపబడతాను. నేను మీ అందరి శాపములు తగిలి బిచ్చము ఎత్తుకొంటూ పిచ్చివాని వలె బతుకుతాను. నిత్యమూ మద్యము సేవిస్తూ స్త్రీలతో క్రీడిస్తూ, పాపములు చేస్తూ బతుకుతాను. ధర్మభ్రష్టుడిని, సత్కర్మ భ్రష్టుడిని అయిపోతాను. ఈ పాపాలన్నీ నేనే చేసిన ఫలితాన్ని పొందుతాను.
ఇకనైనా నన్ను నమ్మవా అమ్మా.” అని భరతుడు ఎన్నో ఒట్లు పెట్టుకున్నాడు. కౌసల్య పాదాల మీద పడ్డాడు భరతుడు. భరతుని మాటలు విన్న కౌసల్యకు నోట మాట రాలేదు. భరతుని పైకి లేవదీసింది. “కుమారా భరతా! నీవు ఇన్ని ఒట్లు పెట్టుకొని నా దు:ఖము మరింత ఎక్కువ చేసావు. భరతా! నీవు ధర్మాత్ముడివి. ఆవిషయం నాకు తెలుసు. కాని రాముని మీద ఉన్న ప్రేమతో ఏదేదో అన్నాను. ఏమీ అనుకోకు” అంటూ భరతుని కౌగలించుకొని కౌసల్య దు:ఖిస్తూ ఉంది. ఆ ప్రకారంగా భరతుడు, కౌసల్య దు:ఖిస్తూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఉన్నారు.
అయోధ్యాకాండం యొక్క చతుఃసప్తతితమః సర్గం లో రాముడు, లక్ష్మణుడు, సీతతో కలిసి అరణ్యాన్ని చేరుతారు. ఈ సమయంలో దశరథ మహారాజు, కైకేయి కోరిన రెండు వరాలు ఇవ్వడం వల్ల, రాముని అడవికి పంపడం వల్ల బాధతో మరణిస్తారు. భార్య కైకేయి కారణంగా తన కుమారుడిని వనవాసానికి పంపడం వల్ల ఆయన తీవ్రంగా బాధపడతారు. రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ అక్కడి వనచరుల సహాయంతో జీవనం సాగిస్తారు. కైకేయి చేసిన కార్యం పట్ల దశరథుడు తీవ్ర పశ్చాత్తాపంతో, తపస్సు చేస్తూ రాముని తిరిగి రావాలని ఆశిస్తూ చివరకు మరణిస్తారు.
తన కొడుకు భరతుడు ఎంత దూషించినా కైక మారు పలక లేదు. మౌనంగా ఉంది. భరతుడు తండ్రి మరణాన్ని తలచుకొని తలచుకొని ఏడుస్తున్నాడు. తన తండ్రి మరణానికి కారణం తన తల్లి కైక అని గుర్తుకు తెచ్చుకున్నాడు భరతుడు. తల్లి వంక తీక్షణంగా చూచాడు.
“అమ్మా! నీవు తండ్రి గారినే కాదు నన్ను కూడా మరణించేట్టు చేసావు. అమ్మా నేను మరణించిన తరువాత నా శవాన్ని, ఈ రాజ్యాన్ని చూచుకుంటూ తీరిగ్గా ఏడుద్దువుగానీ. ఏమ్మా! నీ కొడుకు మరణిస్తే నీకు దుఃఖం వచ్చిందా! ఏ పాపమూ ఎరుగని రాముని అరణ్యాలకు పంపినపుడు ఈ దుఃఖము ఏమయింది? నీ వలన నా తండ్రి అకాల మరణము పొందినపుడు ఈ దుఃఖము ఏమయింది? నీకు ఏమి అపకారము చేసాడని నా రాముని అడవులకు వెళ్లమని చెప్పావు?
నీవు చేసినపాపాలకు నీకు నరకమే సరి అయిన గతి. స్వర్గములో నీకు, భార్యగా నా తండ్రి పక్కన ఉండే అర్హత నీకు లేదు. అమ్మా! ఈ తుచ్ఛమైన రాజ్యము కోసరం నీవు చేసిన పనులు చూస్తుంటే నాకే భయం వేస్తోంది. రేపు నన్నుకూడా ఏమైనా చేస్తావేమో అని భయపడుతున్నాను. నా రాముని అడవులకు పంపినది నీవే అయినా, నా తండ్రిమరణానికి కారణం నీవే అయినా, నేనే ರಾಜ್ಯಂ కోసరం ఇదంతా చేయించానని నాకు శాశ్వత అపకీర్తి అంటగట్టావు. తల్లి తన కుమారుని క్షేమం కోరుతుంది. నీవు మాత్రం నా నాశనాన్ని కోరావు. నువ్వు నా తల్లివి కావు. నావు శత్రువుతో సమానము. భర్త మరణానికి కారకురాలవైన నీ వంటి క్రూరురాలను నా తల్లి అని చెప్పుకోడానికి నాకు సిగ్గుగా ఉంది. నీ మూలంగా కౌసల్యకు, సుమిత్రకు కూడా చెడ్డ పేరు వచ్చింది.
నీవు ఇక్ష్వాకు వంశమునకే కాదు నీ తండ్రి అశ్వపతి వంశమునకు కూడా అపకీర్తి తెచ్చిపెట్టావు. మా తాత గారి వంశములో పుట్టిన రాక్షసివి. నీవు చేసిన పాపపు పనులకు నాకు పితృవియోగము, సోదరుల వియోగము కలిగాయి. ఇన్ని పాపములు చేసిన నీకు నరకము కూడా సరి అయినది కాదు. నీకు మరొక పాపలోకము సృష్టింపబడవలెను.
అమ్మా! నీకు రాముని సంగతీ, నా తండ్రి దశరథుని సంగతీ తెలియదా! వారు ధర్మము తప్పని వారనీ, ఆడి తప్పని వారనీ తెలియదా! వారికి ఇంత ద్రోహం ఎలా చేసావమ్మా! నేను నీ కన్న కొడుకును. నీ శరీరం నాకు పంచి ఇచ్చావు. మరి నాకు ఈ పితృవియోగము, భ్రాతృవియోగము ఎందుకు కలిగించావమ్మా! తల్లి ప్రేమ గురించి నీకు తెలుసో లేదో నేను చెబుతాను విను ….పూర్వము ఒక సారి కామధేనువు తన సంతతిలో పుట్టిన పుత్రులు (కోడె దూడలు) భూమిని దున్నుతూ సొమ్మసిలి పడిపోవడం చూచిందట. అలా పడిపోయిన దూడలను చూచి కామధేనువు ఏడ్చిందట. ఆ కామధేనువు కంటి నీరు దేవేంద్రుని మీద పడినవట. ఆ కంటినీరు కామధేనువువి అని అనుకున్నాడు దేవేంద్రుడు. వెంటనే దేవేంద్రుడు కామధేనువు దగ్గరకు వెళ్లాడట. ఇంద్రుని చూచి కామధేనువు ఆయనకు నమస్కరించి ఇలా అంది.
“దేవేంద్రా! నా పుత్రులు అయిన ఈ వృషభములు కష్టించి పనిచేస్తూ సొమ్మసిలి పడిపోయాయి. కాని దయజాలి లేని ఆ రైతు వాటిని కర్రతో కొడుతూ తోక మెలితిప్పుతూ బాధపెడుతున్నాడు. నా కుమారుల దుస్థితి చూచి నాకు కన్నీళ్లు వచ్చాయి. బరువుమోయలేక పడిపోయిన ఆ ఎద్దులు నా శరీరము పంచుకొని పుట్టాయి. ఎవరికైనా పుత్రులను మించిన ప్రియమైన వస్తువు వేరే ఉండదు కదా!” అని పలికింది కామధేనువు.
అమ్మా! ఈ లోకంలో ఉన్న కోటాను కోట్ల ధేనువులు అన్నీ కామధేనువు పుత్రులే. కానీ, కేవలం రెండు ఎద్దులు బాధపడుతుంటే తట్టుకోలేక కన్నీరు కార్చింది ఆ కామధేనువు. అటువంటిది లేక లేక కలిగిన కన్నకొడుకులను పోగొట్టుకున్న ఆ కౌసల్య, సుమిత్ర నిరంతరమూ కార్చే కన్నీరు నీకు కనపడలేదా అమ్మా! వారి దుఃఖము నీ మనసును కదిలించలేదా?
అమ్మా! కన్నకొడుకులను కన్నతల్లికి దూరం చేసిన వారికి ఏ పాపం చుట్టకుంటుందో ఆ పాపం నీకు కూడా చుట్టుకుంటుంది. నేను వెంటనే నీవు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకుంటాను. నేను వెంటనే రాముని వద్దకు పోయి ఆయనను అయోధ్యకు తీసుకొని వస్తాను. రామునికి బదులుగా నేను మునివేషము ధరించి అడవులకు పోతాను. అప్పుడు పుత్రవియోగంతో నీవు చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తావు. లేకపోతే నీవు కూడా నా వెంట అరణ్యములకు రా! అదీ కాకపోతే ఆత్మహత్య చేసుకొని మరణించు. ఇదితప్ప నీకు వేరుమార్గము లేదు. రాముని తిరిగి రాజ్యాభిషిక్తుని చేస్తేగానీ నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము కలుగదు.” అని కోపంతో ఊగి పోతూ తల్లి కైకను శతవిధాలా దూషించాడు భరతుడు. ఆయాసం వచ్చి నేలమీద కూలబడి పోయాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచసప్తతితమః సర్గలో, సందర్శకుడు పరశు రాముడు విష్ణువు మరియు శివుడి విల్లుల పురాణాలను రాముడికి వివరిస్తాడు. తన కుమారులను విడిచిపెట్టమని దశరథుడు చేసిన అభ్యర్థనను పట్టించుకోకుండా, పరశు రాముడు దశరథ రాముడిని నేరుగా ఉద్దేశించి, విష్ణువు యొక్క పొడవాటి ధనుస్సుతో లక్ష్యం వేయమని అడుగుతాడు మరియు దశరథ రాముడు అలా చేయగలిగితే, పరశురాముడు ద్వంద్వ యుద్ధం చేస్తానని చెప్పాడు. అతనిని.
వైష్ణవధనుఃప్రశంసా
రామ దాశరథే రామ వీర్యం తే శ్రూయతేఽద్భుతమ్ | [వీర]
ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శ్రుతమ్ ||
వసిష్ఠుడు, దశరథుడు, అర్పించిన అర్ఘ్య పాద్యములు, అతిథి మర్యాదలు స్వీకరించిన పరశురాముడు, రాముని చూచి ఇలా అన్నాడు.
“ఓ రామా! నీ పరాక్రమము గురించి విన్నాను. నీవు శివుని విల్లు విరిచావని కూడా తెలిసింది. నీవు శివుని విల్లు విరవడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు పరమశివుని విల్లు విరుస్తావని నేను ఊహించలేదు. అందుకే మరొక మహత్తరమైన విల్లు తీసుకొని వచ్చాను. ఈ విల్లు నాకు మా తండ్రి జమదగ్ని ఇచ్చాడు. ఈ విల్లును కూడా నీవు ఎక్కుపెట్టి నీ పరాక్రమమును ప్రదర్శించు. అప్పుడు నేను నీవు పరాక్రమ వంతుడవనీ, వీర్య వంతుడవనీ ఒప్పుకుంటాను. నీతో ద్వంద్వ యుద్ధము చేస్తాను. రా! ఈ విల్లు తీసుకో! ” అని రాముని పిలిచాడు పరశురాముడు.
ఆ మాటలు విని దశరథుడు నిలువెల్లా వణికిపోయాడు. చేతులు జోడించి పరశురాముని ఎదుట నిలబడి ఇలా అన్నాడు.
“ఓ పరశురామా! నీ కీర్తి లోకమంతా వ్యాపించింది. నీవు బ్రాహ్మణుడవు. కాని నీవు క్షత్రియుల మీద కోపించి వారిని 21 మార్లు ఓడించావు. తరువాత శాంతిని పొందావు. కాని ఇప్పుడు అకారణంగా బాలుడైన నా కుమారుని యుద్ధానికి పిలుస్తున్నావు. ఇది న్యాయమా! నా కుమారులను ఏమీ చేయనని అభయము ఇమ్ము.
ఓ పరశురామా! నీవు సామాన్యుడవుకావు. పవిత్రమైన భృగు వంశంలో జన్మించావు. దేవేంద్రుని సమక్షంలో ఆయుధములను విడిచిపెట్టావు. నీవు జయించిన ఈ భూమండలము నంతా కశ్యపునకు దానం చేసావు. మహేంద్ర పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నావు. అటువంటి నీవు అకారణంగా నా కుమారుడు రాముని యుద్ధమునకు పిలుస్తున్నావు. రాముడు నీతో యుద్ధము చేసి జయించలేడు. రాముడు లేనిచో మేము ఎవరమూ బతుకలేము. కాబట్టి మా కందరకూ ప్రాణభిక్ష పెట్టు.” అని వేడుకున్నాడు.
కాని పరశురాముడు దశరథుని మాటలు లెక్క చేయలేదు. రాముని చూచి ఇలా అన్నాడు.
“ఓ రామా! నీవు విరిచిన ధనుస్సు, నా చేతిలో ఉన్న ధనుస్సు రెండూ గొప్పవి. దివ్యలోకములకు సంబంధించినవి. బాగా ధృడమైనవి. బలమైనవి. ఈ రెండు ధనుస్సులను విశ్వకర్మ తయారు చేసాడు. అందులో ఒక ధనుస్సును త్రిపురాసుర సంహార సమయంలో దేవతలు పరమేశ్వరునికి ఇచ్చారు. ఆ ధనుస్సునే నీవు విరిచావు. ఈ రెండవ ధనుస్సు దేవతలు విష్ణువుకు ఇచ్చారు. కాబట్టి దీనిని విష్ణు ధనుస్సు అని అంటారు. ఈ ధనుస్సు కూడా శివధనుస్సుతో సమానమైనది.
ఒక సారి దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి శివుడు, విష్ణువు వీరిలో అత్యధిక బలవంతుడు ఎవరు? అని అడిగారు. బ్రహ్మ కూడా చెప్పలేకపోయూడు. శివకేశవులలో ఎవరు బలవంతులో తెలుసుకోడానికి వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కల్పించాడు. అవి వారిద్దరి మధ్య యుద్ధమునకు దారి తీసాయి. శివకేశవులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది. అప్పుడు విష్ణువు పెద్దగా హుంకారము చేసాడు. ఆ హుంకారమునకు శివుడు భయపడి పోయాడు. అప్పుడు విష్ణువే అధికుడు అని నిర్ణయించారు.
పరమశివునికి కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న శివ ధనుస్సును విదేహ దేశాధీశుడు అయిన దేవరాతుడు అనే రాజర్షి వద్ద ఉంచాడు. విష్ణువు కూడా తన ధనుస్సును భృగు వంశీకుడు అయిన ఋచీకుని వద్ద ఉంచాడు. ఋచీకుడు మా తాతగారు. మా తాత గారైన ఋచీకుడు ఆ విష్ణు ధనుస్సును తన కుమారుడు. మా తండ్రి అయిన జమదగ్నికి ఇచ్చాడు.
పాపాత్ముడైన కార్తవీర్యార్జునుడు నా తండ్రి జమదగ్ని ని చంపాడు. నా తండ్రిని చంపాడన్న కోపంతో కార్తవీర్యార్జునుని వాని కుమారులను చంపాను. అతనినే కాదు క్షత్రియ వంశములో ఉన్న ప్రతి వానినీ పుట్టిన వాడిని పుట్టినట్టు సంహరించాను. క్షత్రియకులమును సర్వనాశనము చేసాను. భూమి మీద రాజు అనేవాడు లేకుండా చేసాను. క్షత్రియులను చంపి నేను జయించిన ఈ భూమిని కశ్యపునకు దానంగా ఇచ్చాను. తరువాత నేను మహేంద్రపర్వతము మీద తపస్సు చేసుకుంటున్నాను. ఇప్పుడు నీవు శివధనుస్సును విరిచావు అని దివ్యదృష్టి ద్వారా తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాను.
ఓ రామా! నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మము ప్రకారము మాకు వంశపారంపర్యముగా సంక్రమించిన ఈ విష్ణుధనుస్సును తీసుకో. దీనిని కూడా ఎక్కుపెట్టి సంధించు. నాతో ద్వంద్వ యుద్ధము చెయ్యి. ” అని పలికాడు పరశురాముడు.