Sri Allasani Peddana Krta Manucaritra Loni katha In Telugu – శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర లోని కథ

శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర లోని కథ – నీతికథలు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ప్రవరాఖ్యుని కథ.

ప్రవరాఖ్యుని కథ

అరుణాస్పదం అనే పట్పణములో ప్రవరుడనే బ్బాహ్మణోత్తముడుండే వాడు. అతడు గృహస్థాశ్రమ ధర్మాలను తప్పకుండా అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు. అతనికి తీర్చయాత్రలంటే చాలా మక్కువ. కానీ దేవతార్చన మాతాపితసేవ అతిథి అభ్యాగతసేవ స్వాధ్యాయము అన్ని నియమం తప్పకుండా ఎంతో శ్రద్శగా చేయటంతో ఎక్కడికీ వెళ్ళటానికి కుదిరేది కాదు.

భార్యాపిల్లలను చూసుకోవడం చెట్లను పశుపక్షాదులను పోషిచడం ఆహ్నికాలు తీర్చుకోవడం ఇలా ఒకదాని తరువాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం ఎంత ప్రయత్నించినా తీర్భయాత్రలకి వెళ్ళాలేకపోయేవాడు. తీర్భయాత్రులు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి యాత్తా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు.

ఒక రోజు చాలా తీర్భయాత్తులు చేసిన సిద్భుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ సిద్భుడు అతి చిన్న వయస్సులోనే ఎన్నో తీర్భయాత్రులు చేశాడని తెలుసుకోని ప్రవరడు “స్వామీ! కర్తవ్య పాలనమే సర్వతీర్శక్షేత్ర దర్శన ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షముగా చూడాలన్నది నా కోరిక. కాని ప్రతిదినమూ కర్తవ్య నిర్వహణతోనే గడచిపోతున్నది. నేను తీర్చయాత్రులు చేసే ఉపాయముబోధించండి” అని ప్పార్భించాడు. ప్రవరాఖ్యుని గృహస్థ ధర్మపాలనా దీక్షకు సంతోషించి ఆ సిద్భుడిలా అన్నాడు.

“నాయనా. ప్రవరా! మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాలకోసమే కొన్ని సిద్భులు శక్తులు సంపేదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి. అవి ఉపయోగించి సునాయాసముగా నీవు తీర్భయాత్రులకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్యాలనూ పాటించ వచ్చు. నా వద్ద ఒక పాద లేహ్యమున్నది (పసరు). దీనిని నీ పాదాలకు పూసుకొనిన నీవు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు”. మహదానందముతో ఆ పసరును ఆ సిద్భుని వదృనుండి స్వీకరీంచాడు ప్రవరుడు.

మణునాడు ప్రవరుడు ఇంటనున్న తల్సిదండ్రులను సేవించి తన నిత్య అనుష్టానాలు పూర్తి చేసుకుని అందఠి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగతసేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకొని హిమాలయ పర్వతాల లోని పవిత్ర, క్షేత్రాలు సుందర తీర్భప్రదేశాలు చూడాలని బయలుదేరాడు.

ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్శించడం ఆ బ్రహ్మకైనా తరమా! కోండల కోనలనుండి ప్రవహించే సెలయేళ్ళు నదుల సరోవరాల అలల చప్పుళ్ళు పింఛాలు విప్పి ఆ ధ్వనులకు ఆనంద నర్తనం చేసే నెమళ్ళు అన్ని ఆశ్చర్యముగా చూడసాగాడు ప్రవరుడు. ఇలా ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి అేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్చామనుకున్న ప్రవరుడు ఊరుచేరాలని సంకల్పించుకున్నాడు. కానీ కదలలేక పోయాడు! మంచునీటిలో పాదలేపనం కరిగి పోయిన వైనం తెలుసుకున్నాడు. మొదలు నరికిన వృక్షమైపోయాడు.

“ఓ భగవంతుడా! ఇది ఎక్కడి కర్మపాశం! ఎక్కడ అరుణాస్పదం? ఎక్కడ హిమాలయ పర్వతాలు? ఆలోచనా రహితముగా రావచ్చునా? ఎంత తెలివిమాలిన పని చేశాను”! నిమిషము కనిపించక పోయినా చింతించే తల్సిదండ్రులను అనుకూలవతీ సాధ్వి అయిన అర్గాంగినీ తలుచుకుని బాధపడ్డాడు. “ఆడుతూపాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తారో? అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతాయో? అగ్నిహోత్త్సాలు నిత్యానుష్థానాలు చేయలేని ఈ దుస్ఫితి ఎవరికీ రాకూడదు” అని పరిపరి విధాల వగచాడు ప్రవరుడు.

ఇంతలో వరూధినీ అనే గంధర్వ కన్య ప్రవరాఖ్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది. అనుష్థానాలు చేయలేక పోతానేమో అన్న దంఃఖం ఒక వైపు వరూధినీ శృంగారచేష్టలు ఒకవైపు. ఇంతలో సూర్యుడు అస్తమిస్తాడని తెలిసి సంధ్యవార్భని జీవితం వ్యర్భం అనిపించింది ప్రువరుడికి.

“ఇన్నాళ్ళూ నేను చేసిన అనుష్టానము ఆగిపోతుందా”? అని అనుకుని భ్బాంతిచెందాడు. ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్టానాలు చేయాలనే దృఢ సంకల్పముతో అగ్నిదేవుని మనసులో తలచి “నేసే కనక నిత్యానుష్థాన తత్పరుడనైతే కర్తవ్య పాలనా దక్షుడనైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక”! అని అనుకున్న మణుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు. కర్మసాక్షి అయిన ఆ భగవంతునికి నమస్కరించి అనుష్టానాలు చేసుకుని ఇంటిల్ల పాదిని ఆనందపజచాడు ప్రవరుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. నిత్యకర్మలను కర్తవ్యాలను మనసా వాచా కర్మణా ఆచరించిన ప్రవరుని రక్షించి అతని నిష్టకు అంతరాయం కలుగకుండా కాపాడినాడు భగవంతుడు. ధర్మో రక్షతి రక్షితః అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనముంటుందా?
  2. గృహసన్ఫ ధర్మాలేమిటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు. దేవతార్శన మాతాపితసేవ మానవసేవ (అతిథిసేవ) పశుపక్షాదులను వృక్షములను కాపాడటం స్వాధ్యాయము (శాస్త్ర పురాణ పఠనం) విడువకుండా చేసి బుషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యాలని చూపినాడు.
  3. ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం. సౌందర్యవతి అయిన వరూధినీ ప్రలోభాలను పట్సించుకోకుండా కార్యోన్ముఖుడైన ప్రవరుడు పునకు మార్గదర్శి.

మరిన్ని నీతికథలు మీకోసం:

తెలుగు సూక్తులు – బంగారు మాటలు

తెలుగు సూక్తులు – బంగారు మాటలు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు, మన పెద్దవాళ్ళు తెలుగులో నేటి తరానికి అందించిన సూక్తులు మీ అందరికోసం… ఈ బ్లాగ్ లో వున్నా సూక్తులు మీ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని ఆసిస్తూ… మీ భక్తివేద్.కం.

సూక్తులు

  • నేనిక త్రాగనని ఒట్టు పెట్టుకుని త్రాగే గ్లాసు పగులగొట్టాను కానీ పగిలిన ఆ గ్లాసు ముక్కులు పక్కున నవ్వినవి నా చేతిలో మరో నిండు గ్లాసును చూసి.
  • జీవితంలో కష్టాలు భరించలేక చావును కోరుకున్నాను మృత్యువొచ్చి ముంగిట నిలిస్తేకానీ అర్ధం కాలేదు చావడమెంత కష్టమో !
  • నడిరోడ్డులో నడిచే స్వేచ్ఛాజీవీ నీ వెనుక వచ్చే స్కూటరువాడు నీలాగే స్వేచ్ఛను కోరుకుంటే నీ నడ్డి విరుగుతుంది భాయీ !
  • అష్ట ఐశ్వర్యములున్నా అనంతమైన శక్తి సామర్థ్యములున్నా అంతః కరణశుద్ధి లేకపోతే శృంగభంగము తప్పదన్నా.
  • ధన ధాన్యములు సంపాదించి ధనాగారములు నింపు పెద్దలు చేయరు దానధర్మములు చేసెదరు పెద్ద పెద్ద వాగ్దానాలు.
  • ప్రాణం పోతున్న జీవికి గంగా జలమిచ్చి పుణ్యం కట్టుకోవాలనుకుంటున్నారు పాపం ! బ్రతికుండగా గ్రుక్కెడు మంచినీళ్ళిచ్చిన పాపాన పోలేదీ పుణ్యాత్ములు !
  • ఎక్కడెక్కడో పడుతున్న వర్షం అదేమి చిత్రమో నా పెరట్లో పడుదు ఎవరెవరినో వరిస్తున్న అదృష్ట దేవత నా అదృష్టమేమో నన్ను వరించడు !
  • ఇరవై యేళ్ళ కుర్రాడొకడు అరవైయేళ్ళ అరిందలా మాట్లాడుతుంటే అరవైయేళ్ళ ముసిలాడొకడు పదేళ్ళ పసివాడిలా ప్రవర్తిస్తుంటాడు!
  • ప్రపంచంలో అందరూ హాయిగా బ్రతుకుతున్నారు కానీ, నీ వొక్కడివే సమస్యలతో సతమతమౌతున్నావా? పైకి డాబుసరిగా కనపడే కొందరు బాబుకు ఎన్ని సమస్యలో నీకు తెలిస్తే నీ గుండే ఆగిపోతుంది.
  • ఆకలి అవుతుందని అడ్డంగా తింటే అనారోగ్యం చేసి ఆస్పత్రిపాలు అవుతావు బాగా దప్పిక అయితే కొన్ని మంచినీళ్ళు త్రాగాలి కానీ బావిలో దూకితే ప్రాణమే పోతుంది.

బంగారు మాటలు

  • పది రూకలిచ్చి పదిసార్లు చెప్పుకుంటారు దానం చేసే విధానంలోని ప్రథమ సూత్రం తెలియదు కాబోలు కుడి చేయి చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదని !
  • అయినా వాడి కొరకు కానివాడిని కష్టాలపాలు చేయకండి ఒకడి బాగు కొరకు మరొకడి భవిష్యత్తును బలి చేయకండి.
  • ఆడపిల్లల నల్లరి పెట్టే అల్పసంతోషి ! ఆ అమ్మాయి సాహసిస్తే నీ చెంప చెళ్లుమంటుంది పోలీసువాడు చూస్తే నీ వీపు బ్రద్దలవుతుంది.
  • అందరికీ అన్నం పెట్టేది ఆ అదృశ్యశక్తే అయినా మధ్య దళారీలు సగం జనాభాను మలమల మాడ్చేస్తున్నారు అన్నం పెట్టే పని కూడా యీ పాపిష్టి మనుషుల చేతుల్లోనే వుంటే మొత్తం జనాభాను మాడ్చి చంపగల రేమో !
  • ఈ స్వార్ధ భరిత ప్రపంచంలో ఎవరికి ఎవరు అవుతారు? ఎవరిని నమ్మి దగ్గరకు తీస్తామో వారే మోసం చేస్తున్నారు
  • ఒక్క భార్య వున్న మగధీరుడే వందసార్లు పెళ్లాం గడ్డం పట్టుకుంటుంటే అష్టభార్యలున్న కృష్ణుడు ఒకసారి సత్యభామ కాలు పట్టుకుంటే తప్పా?
  • నీవు పుట్టిన గడ్డమీద ఓ మంచిపని చేసి వెళ్ళిపో నానాగడ్డి కరిచి సంపాదించినా అది విడిచివెళ్ళే రోజు రాకతప్పడెలాగో !
  • ఆ జన్మలో సహగమనం చేసిన సహ ధర్మచారణి ఋణం ఈ జన్మలో తీర్చుకుంటున్నాడు కాబోలు అగ్ని సాక్షిగా పెళ్ళాడిన సతిని అగ్నికాహుతి చేసి !
  • ఎవడో అన్యాయం చేశాడని ఏడిస్తే ఏం లాభం ? చరాచర జగత్తును సృష్టించిన మహానుభావుడే నరరూప రాక్షసులను సృష్టించి తమాషా చూస్తుంటే !
  • మనిషి ముందర ఓ తీయని మాట మనిషి వెనుక ఓ ఘాటు పోటు ఈ మాటలే ఈటెలై నీ భరతం పడే పుట్టగతులుండవు భారత పుత్రా !
  • విద్యార్థులను హద్దులో పెట్టలేడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేడు ఇలాంటి గురువు మరి ఎలాంటి శిష్యులను తయారు చేయగలడు?
  • ఆరు పదులు నిండిన అతను పెద్దగా సాధించిన దేముంది? ఒక్క అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి వేశాడు.
  • అయినచోట – కానిచోట నోరు పారేసుకోవద్దు మిత్రమా ! నీ చుట్టూ నీవాళ్ళు తక్కువ నీవంటే గిట్టనివాళ్ళే ఎక్కువ.
  • పిన్నవయసు లో చినిగిపోయిన బట్టలు వేసుకొని కొత్తపుస్తకాలు పట్టుకొని స్కూల్ కెళ్లే వాళ్ళం సింపుల్గా వయస్సు వచ్చిన తరువాత కొత్తబట్ట లేసుకొని చినిగిన పుస్తకాలు తీసుకొని కాలేజీ వెళ్తున్నాం స్టయిల్గా !
  • క్రమం తప్పకుండా క్లబ్బు కెళ్ళడం చూసిని స్నేహితులు నన్ను మండలిస్తే నాలో నేనే నవ్వుకున్నాను. నేను స్వర్గానికి నిచ్చెన వేసుకుంటుంటే పాపం చూడలేక పోతున్నారేమోనని!

Sri Lalitha Chalisa In Telugu | శ్రీ లలితా చాలీసా

శ్రీ లలితా చాలీసా

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా చాలీసా గురించి తెలుసుకుందాం…

Sri Lalitha Chalisa In Telugu Lyrics

శ్రీ లలితా చాలీసా

లలితామాతాశంభుప్రియా జగతికిమూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం

1

హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప
చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం

2

పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా
హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి

3

శ్వేత వస్త్రముధరియించి అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి

4

నిత్య అన్నాదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆదిభిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు

5

కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్ధప్రదాయనిగా కంచికామాక్షివైనావు

6

శ్రీచక్రరాజనిలయనిగా శ్రీమత్ త్రిపురసుందరిగా
సిరిసంపదలు ఇవ్వమ్మా శ్రీమహలక్ష్మిగ రావమ్మా

7

మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో
మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి

8

పసిడి వెన్నెల కాంతులలో పట్టువస్త్రపుధారణలో
పారిజాతపు మాలలో పార్వతిదేవిగ వచ్చితివి

9

రక్తవస్త్రపు ధరయించి రణరంగమున ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రమ్యకపర్ధినివైనావు

10

కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి
కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలసితివి

11

రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణివిగా
రమావాణీ సేవితగా రాజరాజేశ్వరివైనావు

12

ఖడ్గం, శూలం ధరియించి పాశుపతాస్త్రము చేబూని
శంభు నిశుంభుల దునిమాడి వచ్చింది శ్రీశ్యామలగా

13

మహామంత్రాధి దేవతగా లలితాత్రిపురసుందరిగా
దారిద్య్ర బాధలు తొలగించి మహదానందము కలిగించె

14

ఆర్తత్రాణపరాయణివే అద్వైతామృతవర్షిణివే
ఆదిశంకరపూజితవే అపర్ణాదేవి రావమ్మా

15

విష్ణుపాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
భాగిరధుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి

16

॥ల॥

ఆశుతోషునిమెప్పించి అర్ధశరీరం దాల్చితివి
ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ

17

దక్షుని ఇంట జనియించి సతీదేవిగా చాలించి
అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ

18

శంఖుచక్రము ధరియించి రాక్షస సంహారముచేసి
లోకరక్షణ చేసావు భక్తులమదిలో నిలిచావు

19

పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా
చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరయించితివి

20

పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమధగణములు కొలువుండ కైలాసంబే పులకించే

21

సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా
మాణిక్యాలకాంతులతో నీ పాదములు మెరిసినవి

22

మూలాధారచక్రములో యోగినులకు ఆధీశ్వరియై
అంకుశాయుధధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబ

23

సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది
శంఖనాదము చేసితివి సింహవాహినిగ వచ్చితివి

24

॥ల॥

మహామేరువు నిలయనివి మందార కుసుమమాలలతో
మునులందరు నిను కొలవంగ మోక్షమార్గము చూపితివి

25

చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి
నీ చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించె

26

అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం
అద్భుతమైనది నీ మహిమ అతిసుందరము నీ రూపం

27

అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా
జ్ఞానప్రసూనా రావమ్మా జ్ఞానము నందరికివ్వమ్మా

28

నిష్టతో నిన్నే కొలచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు

29

రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్ధింప
అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి

30

అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో
అసురులనందరను దునుమాడి అపరాజితవై వచ్చితివి.

31

గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తులకోర్కెలు తీర్చితివి

32

॥ల॥

పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా
అందిరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి

33

కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా

34

ఏ విధముగ నిను కొలిచినను ఏ పేరున నిను పిలచినను
మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగ కాపాడు

35

మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి
మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి

36

త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమవునా

37

ఆశ్రితులందరురారండి అమ్మ రూపము చూడండి
అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము

38

సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి
సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు

39

మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి
మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము

40

॥ల॥

మరిన్ని చాలీసా పోస్టులు మీకోసం:

Anganalala Manache Nadinchukonegani In telugu – అంగనలాల మనచే నాడించుకొనెగాని

అంగనలాల మనచే నాడించుకొనెగాని - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అంగనలాల మనచే నాడించుకొనెగాని కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అంగనలాల మనచే నాడించుకొనెగాని – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 1
కీర్తన : అంగనలాల మనచే నాడించుకొనెగాని
సంఖ్య : 454
పుట: 304
రాగం: శంకరాభరణం

శంకరాభరణం

44 అంగనలాల మనచే నాడించుకొనెఁ గాని
సంగతెఱిఁగిన నెరజాణఁ డితఁడే

||పల్లవి||

వొడలులేనివాని కొక్కఁడే తండ్రాయఁ గాని
తడయక పురుషోత్తముఁ డితఁడే
బడబాగ్నిజలధికిఁ బాయ కల్లుఁడాయఁ గాని
వెడలించె నమృతము విష్ణుఁ డితఁడే

॥ అంగ||

పులిగూడు దిన్నవాని పొందొక్కటే సేసెఁగాని
నలువంక లక్ష్మీనాథుఁ డితఁడే
చలికిఁ గోవరివానిసరుస బావాయఁ గాని
పలుదేవతల కెల్ల ప్రాణబంధుఁ డితఁడే

॥ అంగ||

యెక్కడో గొల్లసతుల కింటిమగఁ డాయఁ గాని
తక్కక వెదకే పరతత్వ మితఁడే
మిక్కిలి శ్రీవేంకటాద్రిమీఁద మమ్ము నేలెఁ గాని
తక్కక వేదముచెప్పే దైవ మీతఁడే.

॥ అంగ||

అవతారిక:

“ఓ అంగనలారా! ఈ పిల్లాడు ఇట్లా మనచేత ఆడింపబడుతున్నాడు కాని అసలు సంగతి తెలుసుకొంటే ఇతడే గొప్ప నెరజాణమ్మా!” అని ఆలాపిస్తున్నారు మన అన్నమాచార్యులవారు. ఇందులో వున్న ప్రహేళికలు (చిక్కు ప్రశ్నలు) జాగ్రత్తగా సమాధానాలు ఆలోచించి భావవివరణతో సరిజూసుకోండి. ఇదొక ‘క్విజ్ ప్రోగ్రాం’ అన్నమాట. తినబోయేముందు ఇది రుచి చూడండి… పులిగూడు దిన్నవాడెవడు? వాని పొందొక్కటే సేనుగాని. అంటే యేమిటి? ఆలోచించండి. ఎక్కడో గొల్లసతులకు ఇంటిమగడయ్యిం దెవరు? చలికిఁ గోవరివాడెవడు? అనుకున్నంత తేలికకాదు అని తెలుసుకోండి, మరి.

భావ వివరణ:

ఓ అంగనలారా (రమణుల్లారా!) ఈనాడు ఈయన మన చేత ఆడించబడుతున్నాడు. కాని, సంగతెరిగిన (అసలు విషయం తెలుసుకొంటే) ఇతడే గొప్ప నెరజాణ (అన్నీ తెలిసిన చతురుడు).

ఒడలు లేనివానికి (శరీరం లేనివాడికి) ఒక్కడే, తండ్రియైన వాడు (ఎవరు? (మన్మథుని తండ్రియైన శ్రీహరి). తడయక ఆలస్యములేక రక్షించే పురుషోత్తముడు కూడా ఇతడే. బడబాగ్నిని తనలో దాచుకున్న సముద్రునికి, పాయక (కోరి) అల్లుడైన వాడే, కాని అమృతాన్ని అందించినవాడు. ఈయనే | విష్ణువు.

ఈయన పులిగూడుతిన్నవాని పొందొక్కటే చేశాడు (భిక్షాటన చేసి ఆ భిక్ష భుజించేవాని స్నేహం చేసేవాడు)… అంటే (పరమశివుని మిత్రుడైన శ్రీహరి). అయినా ఈయన భిక్ష యెత్తడండీ. ఎందుకంటే అప్లైశ్వర్యములున్న లక్ష్మీదేవికి మగడండీ ఈయన. ఈయన చలికిన్ కోవరి వాని బావ. అంటే చల్లదనాన్నిచ్చే చంద్రునికి బావగారు అయిన శ్రీకాంతుడు. అంతేకాదు దేవతలందరికీ ప్రాణబంధువు.

ఎక్కడో రేపల్లెలో వున్న గొల్లపడుచులకి “ఇంటి మగడు” ఒకే ఇంటిపేరుండేట్లు చేసిన మగడు. యోగులందరూ తక్కక (వెనుదీయక) వెదకే పరతత్వము (పరబ్రహ్మ) ఇతడే. ఇవన్నీ అటుంచి శ్రీవేంకటాద్రి మీద వెలసి మమ్మల్ని యేలే దేవుడు ఈయనే. కానీ వేదాలన్నీ శ్లాఘించే పరాత్మరుడు కూడా ఈ దేవుడే.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Itani Neragakuntenila In Telugu – ఈతని నెఱగకుంటేనిల

ఈతని నెఱగకుంటేనిల - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఈతని నెఱగకుంటేనిల కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఈతని నెఱగకుంటేనిల – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన : ఈతని నెఱగకుంటేనిల
సంఖ్య : 536
పుట: 360
రాగం: లలిత

లలిత

45 ఈతని నెఱఁగకుంటే నిల స్వామిద్రోహము
ఘాతల నేఱు గుడిచి కాలువ పొగడుట.

||పల్లవి||

హరిపాదముననే యడఁగె లోకములెల్ల
హరినాభినే పౌడమి రదివో బ్రహ్మాదులు
హరినామము వేదాల కాదియు నంత్యము నాయ
హరిదాసులే వశిష్ఠాదు లిందరును.

||ఈత||

విష్ణుఁడే యమృత మిచ్చె
విష్ణుఁడే ధరణి మోఁచె విశ్వమంతాను
విష్ణుచక్రమున దైత్యవీరులెల్లా నడఁగిరి
విష్ణువుముఖమునందే విప్రులు జనించిరి.

||ఈత||

పరమపుశ్రీపతివే భారతరామాయణాలు
పరమాత్ముఁ డితఁడే పలుజీవులయందెల్లా
పరము చేచేతఁ జూపె పట్టి శ్రీవేంకటేశుఁడు
పరమానంద మొసఁగు భక్తులకు నితఁడు.

||ఈత||536

అవతారిక:

జగద్భర్త నారాయణుడు. మనకు భోజనమిచ్చి అది అరిగేశక్తినిచ్చి పుట్టినదాది తుది శ్వాసదాకా రక్షించేది పురుషోత్తముడే. ఆయన గురించి తెలియకపోవటం కన్న స్వామి ద్రోహం వుంటుందా. లౌకికంగా చూచినా మనకు వుద్యోగం ఇచ్చి, నెలనెలా జీతం ఇచ్చి పోషిస్తున్న మన యజమాని గురించి తెలుసుకోనివాడు ద్రోహియే కదా! అన్నమాచార్యులవారిలో కవి దీనిని నిరసిస్తూ ఏటినీరు తాగి కాలువనీళ్ళను పొగడటం అంటే ఇదే… అని దెప్పిపొడుస్తున్నారు. ప్రతి జీవిలోనూ అంతర్యామిగా వున్న ఈ శ్రీవేంకటేశుడే పరము చేచేత పట్టి జూపె అంటున్నారు.

భావ వివరణ:

ఓ భక్తులారా! ఈతని (ఈ నారాయణుని యెరుగకుంటే (తెలియకపోతే) ఇల (భూమిపై) ఇంతకంటే స్వామిద్రోహం మరియొకటుంటుందా? ఘాతల దెబ్బతిన్నవాడు దీనావస్థలో) నీటినీల్ళ తాగి ప్రాణం నిలబెట్టుకొని, కాలువలో నీళ్ళు బాగుంటాయి అని పొగడటంలాంటిదే… ఇది కూడా అవునా?

విశ్వంలోని పదునాలుగు భువనాలూ ఈ శ్రీహరిపాదం కిందనే వున్నాయి. | ఒక్క తొక్కుడుతో అన్నీ చితక్కొట్టగలడు. అంతెందుకు సృష్టికర్త బ్రహ్మ మొదలైన వారంతా ఆయన నాభి (బొడ్డు) లోంచి పుట్టినవారేకదా! అసలు జ్ఞానానికి మూలమైన వేదముపుట్టిందే శ్రీహరి నామములోనుంచి వేదాంతము కూడా ఆయనే కదా! వశిష్ఠుడు మొదలైన సప్తఋషలు యెవ్వరనుకున్నారు? వారంతా హరిదాసులే.

ఆయన మహిమనెంతని పొగడగలం చెప్పండి? దేవతలు అమరులవటానికి కారణమైన అమృతం తెప్పించింది ఆయనే కదా! ఆదివరాహమై ఈ భూమిని మోసినవాడు శ్రీహరే కదా! రోజుకి 24 గంటలు, | సంవత్సరానికి 365 రోజులు 6 గంటలు (దాదాపుగా) సమయంపట్టేట్లు ఈ | భూమి ఒక గొప్ప సమయపాలన గతి నిర్దేవంతో నడుస్తున్నదే అదెవరివల్ల జరుగుతున్నది? రాక్షసులనందరినీ సుదర్శన చక్రంతో అడ్డగించినదెవరు? నేటికీ వేదవిజ్ఞానం విస్తరింపచేస్తున్న విప్రులు జన్మించింది కూడా ఆయన ముఖంలోనుంచే కదా!

భారత రామాయణాది పురాణవాఙ్మయం పుట్టిందే శ్రీహరి కథామృమును విస్తరింపజేయుటకు కదా! సర్వ జీవులయందున్న పరమాత్ముడు అంతర్యామీ ఈ దేవదేవుడే కదా! నేడు శ్రీవేంకటేశుడై పరము (మోక్షమును) చేనేతపట్టి (అభయవరద హస్తాలతో పట్టి) చూపుతూ భక్తులకు పరమానందమునిస్తున్న ఏడుకొండల యేలికయై భక్తులని అనుగ్రహిస్తున్నది ఈతడే కదా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

అన్నమయ్య కీర్తనలు – Annamayya Keerthanalu

అన్నమయ్య కీర్తనలు – Annamayya Keerthanalu

అన్నమయ్య కీర్తనలు – Annamayya Keerthanalu

 

  1. అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి
  2. ఆతడేపో మాయేలిక ఆతడే జగన్మూల
  3. కదిసి యాతఁడు మమ్ముఁగాచుఁగాక
  4. నరుడా యీతడు ఆదినారాయణుడు గాక
  5. అతడితడా వెన్నలంతట దొంగిలినాడు
  6. నరులార నేఁడువో నారసింహజయంతి
  7. మంచివాడవంతేపో మాధవరాయా
  8. కోడెకాడు గదవమ్మ గోవిందరాజు
  9. వేడుక కాడితడు విట్టలేశుడు
  10. కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా
  11. శ్రీవేంకటేశ్వరుఁడు శ్రీయలమేల్మంగతోడ
  12. సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా
  13. వారిధిశయన వో వటపత్రపరియంక
  14. వైష్ణవులసొమ్ము నేను వారు నీసొమ్ములింతే
  15. తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
  16. అంజినీదేవి కొడుకు హనుమంతుడు
  17. అప్పడైన హరియెక్కె నదివో తేరు
  18. అడియా నడియనయ్య యఖిలలోకైకనాథ
  19. చేకొని కొలువరో శ్రీనరసింహము
  20. రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు
  21. ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
  22. జగములేలేవాడవు జనార్దనుడవు
  23. వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు
  24. కరేణ కిం మాం గృహీతుం తే
  25. చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ
  26. ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద
  27. నాలం వా తవ నయవచనం
  28. చక్కని సరసపు శిశువు
  29. లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ
  30. యెన్ని మారులు యిట్టె నీపనులు
  31. మేలుకొనవే
  32. హరి నీవే సర్వాత్మకుడవు
  33. కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను
  34. నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను
  35. తగు మునులు ఋషులు తపముల సేయగ
  36. ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె
  37. అభయదాయకుడ వదెనీవే గతి
  38. హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
  39. సీతాసమేత రామ శ్రీరామ
  40. వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు
  41. దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో
  42. ఒకరిగానగ నొడబడదు మనసు
  43. ఈడనిందరికి నేలికైవున్నాడు
  44. అంగనలాల మనచే నాడించుకొనెగాని
  45. ఈతని నెఱగకుంటేనిల
  46. ఎన్నిమహిమలవాడె యీ దేవుడు
  47. మియునెఱగని పామరులను మమ్ము
  48. అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి
  49. శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి
  50. నీవు జగన్నాథుఁడవు నే నొక జీవుఁడ నింతే
  51. వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు
  52. వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల
  53. సదానందము సర్వేశ్వర నీ-
  54. కౌసల్యానందనరామ కమలాప్తకులరామ
  55. కలశాపురముకాడ గాచుకున్నాడు
  56. సర్వేశ్వరా నీతో సరియెవ్వరు
  57. పేరు నారాయణుడవు బెంబాడిచేతలు నీవి
  58. ఇతని కితడేకాక యితరులు సరియా
  59. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు
  60. చూచి మోహించకుందురా సురలైన నరులైన
  61. ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు
  62. ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను
  63. మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా
  64. ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో
  65. అంగనకు విరహమే సింగారమాయ
  66. మలసీ చూడరో మగ సింహము
  67. నిద్దిరించి పాల జలనిధివలెనే
  68. రారా చిన్నన్నా రారోరి చిన్నవాఁడ
  69. వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము
  70. శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును
  71. దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ
  72. ఘనుడాతడా యితడు కలశాపురముకాడ
  73. బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల
  74. దాసోహమనుబుద్దిదలచరు దానవులు
  75. నారాయణుడ నీనామమె మంత్రించివేసి
  76. భక్తి నీపై దొకటె పరమసుఖము
  77. భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో
  78. ఇందులోననే నెవ్వరిబోలుదు
  79. అతని నమ్మలే రల్పమతులు భువి
  80. హరియవతారమితడు అన్నమయ్య
  81. సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ
  82. మొలనూలి గొల్లెత మురియుచును
  83. శిన్నెక తేవే శెలువుని తా
  84. పసులు గాచేటి కోల పసపుజేల
  85. కుందణంపుమై గొల్లెత తా
  86. నెయ్యములల్లో నేరేళ్ళో
  87. అంజలిరంజలిరయం తే
  88. సిన్నవాడవని నమ్మసెల్లదునిన్ను
  89. ప్రలపనవచనై: ఫలమిహకిం
  90. తలలేదు తోకలేదు దైవమానీ మాయలకు
  91. నమో నమో దశరథనందన మమ్ము రక్షించు
  92. ఇవియే పో ప్రద్యుమ్నా యిహపరసాధనము
  93. పరమవివేకులాల బంధువులాల
  94. చెల్లె నీచేతలు నీకే చేరి మేడెగుడిదిన్న
  95. సమమతినని నీవే చాటుదువు
  96. నారాయణుని శ్రీనామమిది
  97. స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే
  98. కలిగె మాకిదె కైవల్యసారము
  99. హరిహరి యిందరికి నబ్బురముగాని యిది
  100. హరిహరి నీ మాయామహిమ
  101. ఎత్తరే ఆరతులు యియ్యరేకానుకలు

Timmireddy Makuniche Distamaina Polamu In Telugu – తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము

తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
సంఖ్య : 52
పుట : 35
రాగం : సామంతం

సామంతం

15 తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము
బొమ్మిరెడ్డి కప్పగించి పోదిసేసెఁ బొలము

॥పల్లవి||

నిండినట్టిమడుగులనీరువంకపొలము
కొండలు మోఁచిన పెద్దగొబ్బరపుఁబొలము
అండనే పొలమురాజులుండేటిపొలము
చెండివేసి మాకులెల్లా సెలగినపొలము

||తిమ్మి||

ఆసపడి వరదానమడిగినపొలము
బాసలతోఁ గడు నెత్రుపట్టమైనపొలము
రాసికెక్కే మునులకు రచ్చైనపొలము
వేసరక నాఁగేట వేగిలైన పొలము

||తిమ్మి||

మంచి గురుతైన రావిమానిచేనిపొలము
వంచిన గుఱ్ఱముఁ దోలే వయ్యాళిపొలము
యెంచఁగ శ్రీవేంకటేశు నిరవైనపొలము
పంచుకొని లోకులెల్లా బ్రదికేటిపొలము

||తిమ్మి|| 52

అవతారిక:

ఇది అత్యద్భుతమైన దశావతారవర్ణన కీర్తించే అన్నమాచార్య కీర్తన. ఎంతో మేధాశక్తి వుంటేనే కాని ఈ కీర్తన అర్థంకాదు. తిమ్మన్న అంటే వేంకటేశ్వరుడు తిమ్మిరెడ్డి అంటే పరమాత్మ అయిన శ్రీవేంకటేశ్వరుడు. బొమ్మిరెడ్డి అంటే జీవాత్మయైన అంతర్యామి అంటే క్షేత్రజ్ఞుడు. దిష్టమైన పొలము అంటే (భాగ్యముకొద్దీ సంప్రాప్తించిన సాగుచేయదగిన మాగాణి వంటి క్షేత్రము లేక శరీరము). మా భాగ్యము కొద్దీ ఆ శ్రీవేంకటేశ్వరుడు మాకు ఈ దేహాన్నిచ్చి మాజీవాత్మకు ఒప్పగించి “వొరే దీనిని సక్రమంగా సాగుచేసుకోండిరా” అన్నాడు… ఇదీ ఈ కీర్తన పల్లవి. ఇకపై ఓపికగా చదివి భావ వివరణ నాస్వాదించండి.

భావ వివరణ:

తిమ్మిరెడ్డి (పరమాత్మ) మాకు దిష్టమైన (మా భాగ్యముననుసరించి) ఒక పొలము (క్షేత్రము) సాగుచేసికొనమని, బొమ్మిరెడ్డికి (అంతర్యామియైన క్షేత్రజ్ఞునికి) ఒప్పగించినాడు. ఇక చూసుకోండి ఎన్నిరకాల పొలములు సాగులోకి వచ్చాయో.

“నిండినట్టి మడుగుల నీరువంక పొలము” ఎప్పుడూ నిండుగా నీరువుండే చోట నీట్లో వుండేదేహము.. – (అంటే మత్స్యావతారము.) “కొండలు మోచిన పెద్దగొబ్బరపు పొలము” నిస్వార్థముగా పరులకోసం పెద్ద కొండను మోసిన దేహం… – (అంటే తాబేలు లేక కూర్మావతారం.) “అండనే పొలము రాజులు వుండేటి పొలము” సూకరములుండే దేహము – (అంటే వరాహావతారము). “చెండివేసి మాకులెల్లా చెలగిన పొలము”. మాలిన్యమును లేక పాపమును చెండాడి విజృంభించిన దేహము – (అంటే నరసింహావతారము).

“ఆస పడి వరదానము అడిగిన పొలము” యాచించి వరమును పొందిన దేహము – (అంటే వామనావతారము). “బాసలతో కడునెత్రుపట్టమైన పొలము” ప్రతిజ్ఞ పట్టి ఎంతో నెత్తురు పారించిన దేహము – (అంటే పరశురాముడు). “మునులకు రచ్చై రాసికెక్కిన పొలము” మునులకు రక్షణయై విఖ్యాతిగాంచిన దేహము – (అంటే శ్రీరామావతారము). “వేసరక నాగేట వేగిలైన పొలము” విసుగులేక నాగలి ధరించు ఉద్రేకియైన దేహము – (అంటే బలరామావతారము).

“మంచి గురుతైన రావిమాని చేని పొలము” అశ్వత్థవృక్షం క్రింద మంచి ప్రసిద్ధినొందిన దేహము – (అంటే బుద్ధావతారము). “వంచిన గుఱ్ఱము దోలే వయ్యాళిపొలము” అణుకువ గలిగిన గుఱ్ఱమునెక్కి విహారముచేసిన దేహము – (అంటే కల్కి అవతారము). “యెంచగ శ్రీవేంకటేశు నిరవైన పొలము” ప్రసిద్ధికెక్కిన శ్రీవేంకటేశ్వరుడై నెలకొనిన దేహము. మరి ఆ అద్భుతమైన పొలము యెట్లాంటిదంటే లోకులందరూ దానిని పంచుకొని, శరణని బ్రతుకుతున్నారు. అవును కదా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Vaishnavula Sommu Nenu Varu Nisommulinte In Telugu – వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే

వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే
సంఖ్య : 185
పుట : 124
రాగం : సాళంగనాట

సాళంగనాట

14 వైష్ణవులసొమ్ము నేను వారు నాసొమ్ములింతే
విష్ణుఁడ నీవెట్టైన వివరించుకోవయ్యా

॥పల్లవి||

నెఱి నీబంటనా హరి నీకంటే బలువులైన-
తఱి నీదాసులకే నే దాసుఁడగాక
గుఱుతెరుఁగుదునా నేఁ గోరి యింతకతొల్లి
గుఱుతు చూపిన మాగురువునేకాక

||వైష్ణ||

ముంచి నీకు మొక్కేఁగాక ముందే నీశరణులు
పెంచి పాదాలు నా నెత్తిఁబెట్టిరయ్య
పొంచి నీవేడ నేనేడ బుజముల ముద్రవెట్టి
సంచితమై సేసినట్టిసంబంధమేకాక

||వైష్ణ||

శ్రీవేంకటేశ నీసేవే సేసేఁగాక నేడీ-
సేవకుఁ దెచ్చెను వారిసేవేకాదా
భావమొక్కటిగా నాకుఁ బట్టిచ్చిరి నిన్ను వారు
ఆవలీవలికిఁ బరమార్థమేకాక

||వైష్ణ|| 185

అవతారిక:

విశిష్టాద్వైత మత దీక్ష స్వీకరించిన అన్నమాచార్యులవారు, బుజములపై శంఖచక్రముల ముద్రలు ధరించారు. తిరునామం నుదుటిపై ధరించారు. వైష్ణవ సిద్ధాంత ప్రచారకులై రోజుకి, కనీసం ఒక్క కీర్తన శ్రీవేంకటేశ్వరునిపై చెప్పారు. ఈ నాటికీ నాబోటి అనామకులను సైతం ఆ నామం అనుమానం లేకుండా రక్షిస్తున్నది. ఎందుకంటే.. వైష్ణవులంతా స్వామివారి సొమ్ము. అందుకే అన్నమయ్య “ఓ విష్ణుడా! నీవు యెట్లా అన్వయించుకొనినా పర్వాలేదు, నేను వైష్ణవుల సొత్తును. వారు నీసొత్తు” అని తేల్చిపారేశారు. స్వామీ! నిన్ను నాకు ఆ వైష్ణవులు పట్టిచ్చారయ్యా! అంటున్నారు.

భావ వివరణ:

ఓ విష్ణుదేవా! నేను వైష్ణవదీక్షను స్వీకరించినందున వైష్ణవుల సొమ్మునైతిని. మరి ఆ వైష్ణవులు నీసొమ్ము. అనగా నీదాసులైన వైష్ణవులకు నేను దాసుడను. ఆ విధంగా నేను నీకు చెందినవాడినే. దీనిని నీవెట్లు వివరించుకొనినా నీఇష్టమే.

ఓ హరీ! నెఱి (న్యాయంగా) నీబంటునయ్యేవాడినే కాని, నీదాసులువున్నారే వారికి వారి బలంతోపాటు నీ బలంకూడా తోడవటం వల్ల, వారు నీకంటే బలవంతులు. అటువంటప్పుడు నాకెప్పుడూ యెదురుగా వుండేవారి దాస్యం చేయుట నాకు మంచిది కదా! నేను ఇంతకు పూర్వం నిన్నెరుగను. తొల్లి (మొట్టమొదట) మా గురువులే నీ గుర్తులు చూపించితే నిన్ను గుర్తుపట్టగలిగాను. లేకపోతే నీవెవవరవో నాకేమి తెలుసు?

ఓ విష్ణుదేవా! నేను వేరే నీకు మొక్కవలసిన పనిలేదు. ఎందుకంటే, ఇంతకు ముందే నీశరణము పొందిన మా గురువులు నీపాదాలను మానెత్తినయెప్పుడో పెట్టేశారయ్యా! మాకు వైష్ణవ దీక్షనిచ్చింది అట్లాగే కదా! ఆ దీక్షే లేకపోతే నీవు యెక్కడ మేము యెక్కడ? మా రెండు భుజముల మీద నీ శంఖ చక్రముల ముద్రలు వేశారు. మాగురువులావిధంగా మన సంబంధాన్ని సంచితము చేశారు (కూడబెట్టారు) గానీ (లేకపోతే) నీవు నాకెట్లు తెలిసేవాడివి?

ఓ శ్రీవేంకటేశ్వరా! ఈ నాడు నేను నీ సేవచేస్తున్నమాట నిజమే. కానీ నేను మొదట వారిని సేవించినందువల్లనే, నేను నిన్ను సేవించటం అన్నది జరిగింది. నాకు వారు భావమొక్కటిగా (అన్యధా శరణం నాస్తి అను ఒకే ఒక భావనతో) నిన్ను నాకు మాగురువులు పట్టిచ్చారు. అందువల్లనే మాకు ఆవలీవల పరమార్థము (ఇహపరములు రెండిటి పరమార్ధము దక్కినది). కాక నేను నిన్నెట్లెరుంగుదునయ్యా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Varidhi Shayana Vo Vatapatra Pariyanka In Telugu- వారిధిశయన వో వటపత్రపరియంక

వారిధిశయన వో వటపత్రపరియంక - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో వారిధిశయన వో వటపత్రపరియంక కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వారిధిశయన వో వటపత్రపరియంక – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : వారిధిశయన వో వటపత్రపరియంక
సంఖ్య : 465
పుట: 314
రాగం: దేవగాంధారి

దేవగాంధారి

13 వారిధిశయన వో వటపత్రపరియంక
గారవాన మేలుకొని కన్నులు దెరవవే

॥పల్లవి||

ఘనయోగిహృదయపుకమలాలు వికసించె
వొనర విజ్ఞానసూర్యోదయమాయ
మును జీవపరమాత్మములజక్కవలు గూసె
వనజాక్ష మేలుకొని వాకిలి దెరవవే

॥వారిధి॥

కలుషములనేటిచీఁకట్లెల్లఁ బెడఁబాసె
నలువంక వేదకీరనాదము మ్రోసె
అలరి యితరధర్మాలనేటిచుక్కలు మాసె
జలజాక్ష మేలుకొని సతిమోము చూడవే

॥వారిధి||

కపటరాక్షసనేత్రకలుహారములు మోడ్చె
యిపుడే సుకర్మముల యెండలు గాసె
అపురూప శ్రీవేంకటాద్రీశ మేలుకొని
నిపుణుఁడ యిందిరయు నీవు మమ్ముఁ గానవే

॥వారిధి|| 465

అవతారిక:

“వటపత్రపరియంక” అంటే మఱియాకు తల్పముగా శయనించువాడని అర్థం. జక్కువలు అంటే చక్రవాక పక్షులు. కల్హారము అంటే తెలుపు రంగు మిళితమైన ఎఱ్ఱనికలువపూవు. తేలిక అని భ్రమ కలిగించే క్లిష్టమైన కీర్తన ఇది. వటపత్రశాయియైన జలధిశయన ఆదినారాయణునిపై అన్నమాచార్యులవారు చెప్పిన అద్భుతమైన కీర్తన ఇది ఆయన యోగీశ్వరుల హృదయకమలాలలో వుంటాడు. అన్య మతధర్మములను నక్షత్రాలు మాసిపోవునట్లు చేసే పూర్యోదయం అవుతుంది ఈయన నిదుర మేలుకొంటే. కపటులైన రాక్షసుల కన్నులనే కల్హారములు మ్రోడువారిపోతాయట. అంటే రాక్షసులు నశిస్తారని అర్థం.

భావ వివరణ:

ఓ వటపత్రపరియంకా! (మఱియాకు శయ్యగా పరుండిన వాడా!) వారిధిశయనా! (క్షీరసాగరముపై శయనించు దేవా!) గారవాన (మంగళప్రదుడవై) మేలుకొని కన్నులు తెరవవయ్యా!

ఓ ప్రభూ! నిన్ను జూచి ఘనులైన యోగేశ్వరుల హృదయ కమలములు వికసించినవి, యెందుకంటే వారిలో నిన్ను గూర్చిన విజ్ఞాన సూర్యోదయమైనది కదా! ఆ విజ్ఞాన సూర్యోదయమున జీవాత్మ పరమాత్మ అనే జక్కువలు (చక్రవాక పక్షులజంట) ఆనందముగ కూసినవి. (అంటే ఆ జంట నిజానికి తామొక్కటే అని కూస్తూన్నాయి అని భావము). ఓ వనజాక్షా! (పద్మనయనా!) నీ వైకుంఠద్వారపు వాకిలి తలుపులు తెరిపించి నిదురమేలుకొనవయ్యా!

ఓ జలజాక్షా! నీవు మేలుకొంటే దుర్మార్గము అనే చీకట్లన్నీ తొలగిపోతాయి నలుదెసలా చతుర్వేదములనెడి కీరములు (చిలుకలు) నాదముతో రవళిస్తాయి. ఈ లోకంలోవున్న వేద విహిత ధర్మములన్నియు నింగిలోని చుక్కలవలె (నక్షత్రముల తీరుగా) అదృశ్యమవుతాయి. ఓ దేవా! నిదురమేల్కొని ఒకపరి నీసతి మోమును పరికించుము.

ఓ దేవదేవా! నీవు మేలుకొంటే, కపటులైన రాక్షసుల నేత్రకలుహారములు (కన్నులనే లేత ఎఱుపురంగు కలువపూలు) మోడ్చె (ముడుచుకుపోతాయి). సుకర్మములు (వేదయుక్తమైన పనులు) అనే ఎండలుకాస్తాయి. అపురూపుడవైన శ్రీవేంకటేశ్వరా! నీవు నిదుర మేల్కొని ఇందిరాదేవితో కూడి నిపుణుడవై మమ్ము రక్షించి పరిపాలింపుము తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Satithoda Sare Sareku Sarasamuladukonta In Telugu – సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా

సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 14
కీర్తన : సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా
సంఖ్య : 376
పుట : 218
రాగం : కాంబోది

కాంబోది

12 సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా
తతితోడనారగించీ తగునె యీదేవుఁడు

॥పల్లవి||

ఒక్కమాటె వంటలెల్లా నొద్దనుండి వడ్డించి
మిక్కిలినలసె నలమేలుమంగ
చెక్కులఁ జెమటగారఁ జేరి యీపె వడ్డించఁగా
చొక్కి చొక్కి యారగించీఁ జూడరె యీదేవుఁడు

||సతితో||

పాఱి పాఱి బంగారుపళ్ళెములు వెట్టించి
మీఱి బుసకొట్టె నలమేలుమంగ
జాఱిన తురుముతోడఁ జవులాకె యడుగఁగ
ఆఱడి గూరలు మెచ్చీనంతలో నీదేవుఁడు

||సతితో||

వాలిన రాజసముతో వంటసాలలోననే
మేలిమిఁ గూచున్న దలమేలుమంగ
యీలోనె శ్రీవేంకటేశుఁడీపెఁ దానునారగించి
తాలమిఁ గాఁగిటఁగూడె దక్కక యీదేవుండు

॥సతితో॥ 376

అవతారిక:

అన్నమాచార్యులవారి వొక్కొక్క కీర్తనకు వొక్కొక్క ప్రత్యేకత వుంటుంది. ఇందులో చూడండి తన ముద్దుల సతితో ముచ్చట్లాడుకుంటూ మాటి మాటికీ సరసాలాడుతూ చాలా ఇష్టంగా భోజనం చేస్తున్నాడట ఆ దేవదేవుడు. తన చెక్కిళ్ళపై చెమటలు కారిపోతుంటే, సడలిన తనకొప్పును సవరించుకోలేక అలమేల్మంగమ్మ, తిప్పలు పడుతుంటే ఆహా! ఓహెూ! అని మెచ్చుకొంటూ ఆరగిస్తున్నాడట స్వామి. ఈలోనే అమ్మవారు కూడా ఆరగించి తాలిమితో యీదేవుని కౌగిట కరిగిపోయిందట. ధన్యోస్మి. ఏమి ఆ పదకవితాసౌరభం!! ఏమి ఆ కల్పనా చాతుర్యం!! ఏమని పొగడుదునయ్యా! అన్నమయ్యా!

భావ వివరణ:

సారెసారెకు (మాటిమాటికీ) సతితోడ (తన భార్యతో) సరసములాడుకొంటూ (చలోక్తులు విసురుతూ) ఈ దేవదేవుడు తగు తతితోడన్ (తగినంత ప్రీతితో) | ఆరగించీ (భుజించుచున్నాడు). ఆ వైనం వినండి.

జగముల తల్లి అలమేలుమంగ తను ఆయనకిష్టమని చేయించిన వంటకాలన్నింటిని ఒక్కటీ వదలకుండా వడ్డించింది. అందుచే ఆ తల్లి మిక్కిలి అలిసిపోయినది. ఆమె చెక్కుల జెమట (చెక్కిళ్ళపై శ్రమవలన చెమట) కారిపోతున్నది. ఆమె చేరి స్వయముగా వడ్డించుచునేయున్నది. ఈ దేవుడు చొక్కి చొక్కి (పారవశ్యముతో) ఆరగించుచున్నాడు. ఈ అద్భుత దృశ్యం మీ మనోనేత్రాలతో చూచి తరించండి.

ఈ తల్లి, పాఱిపాటి (తడవ తడవకూ) వంటకాలన్నీ బంగారు పళ్ళెరములలో పెట్టించి, అలసటతో మీఱి బుసకొట్టీ (పెద్దగా నిట్టూర్చింది) అలమేల్మంగమ్మకు ఆ పరిశ్రమవలన తురుము (సిగకొప్పు) సడలి పోయింది (వదులై విడిపోబోతున్నది). అయినా ఆమె కొప్పు సవరించుకొంటూనే, చవులడుగగా (వంటలెలావున్నాయండీ… అని అడుగుతుంటే) ఈ దేవుడు ఆఱడి (మించి) అంతలో (పూర్తిగా తినకుండానే) కూరలు మెచ్చీ (కూరలు యెంత బాగున్నాయి. ఆహా!! యేమి రుచి అని మెచ్చుకొన్నాడు).

ఆ తల్లి అటుపిమ్మట, వాలిన రాజసముతో (మిక్కిలి అతిశయించిన రాచఠీవితో) మేలిమి వంటసాలలో (స్వర్ణమయమైన ఆ వంటశాలోనే) తానూ భుజించుటకు కూర్చున్నది. ఈలోనె (ఈరీతిగా) శ్రీవేంకటేశ్వరుడు మరియు అలమేల్మంగ, ఆరగించిరి. ఆపై, తక్కక (తప్పకుండా) ఈ దేవదేవుడు తాలిమి (ఉత్సాహముతో) ఆ దేవిని కౌగిట కూడెన్.

శ్లో॥ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: