Aranya Kanda Sarga 8 In Telugu – అరణ్యకాండ అష్టమః సర్గః

Aranya Kanda Sarga 8 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టమ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణుడు అగస్త్య మహర్షిని కలుసుకుని ఆయన ఆశీర్వాదం పొందుతారు. అగస్త్యుడు రాముడికి దివ్య ఆయుధాలను అందజేస్తాడు, వాటితో రాక్షసులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. రాముడు, లక్ష్మణుడు ఆ ఆయుధాలను స్వీకరించి, ధైర్యంగా దండకారణ్యంలో రాక్షసులను ఎదుర్కొంటారు.

సుతీక్ష్ణాభ్యనుజ్ఞా

రామస్తు సహసౌమిత్రిః సుతీక్ష్ణేనాభిపూజితః |
పరిణామ్య నిశాం తత్ర ప్రభాతే ప్రత్యబుధ్యత ||

1

ఉత్థాయ తు యథాకాలం రాఘవః సహ సీతయా |
ఉపాస్పృశత్సుశీతేన జలేనోత్పలగంధినా ||

2

అథ తేఽగ్నిం సురాంశ్చైవ వైదేహీ రామలక్ష్మణౌ |
కాల్యం విధివదభ్యర్చ్య తపస్విశరణే వనే ||

3

ఉదయంతం దినకరం దృష్ట్వా విగతకల్మషాః |
సుతీక్ష్ణమభిగమ్యేదం శ్లక్ష్ణం వచనమబ్రువన్ ||

4

సుఖోషితాః స్మ భగవంస్త్వయా పూజ్యేన పూజితాః |
ఆపృచ్ఛామః ప్రయాస్యామో మునయస్త్వరయంతి నః ||

5

త్వరామహే వయం ద్రష్టుం కృత్స్నమాశ్రమమండలమ్ |
ఋషీణాం పుణ్యశీలానాం దండకారణ్యవాసినామ్ ||

6

అభ్యనుజ్ఞాతుమిచ్ఛామః సహైభిర్మునిపుంగవైః |
ధర్మనిత్యైస్తపోదాంతైర్విశిఖైరివ పావకైః ||

7

అవిషహ్యాతపో యావత్సూర్యో నాతివిరాజతే |
అమార్గేణాగతాం లక్ష్మీం ప్రాప్యేవాన్వయవర్జితః ||

8

తావదిచ్ఛామహే గంతుమిత్యుక్త్వా చరణౌ మునేః |
వవందే సహ సౌమిత్రిః సీతయా సహ రాఘవః ||

9

తౌ సంస్పృశంతౌ చరణావుత్థాప్య మునిపుంగవః |
గాఢమాలింగ్య సస్నేహమిదం వచనమబ్రవీత్ ||

10

అరిష్టం గచ్ఛ పంథానం రామ సౌమిత్రిణా సహ |
సీతయా చానయా సార్ధం ఛాయయేవానువృత్తయా ||

11

పశ్యాశ్రమపదం రమ్యం దండకారణ్యవాసినామ్ |
ఏషాం తపస్వినాం వీర తపసా భావితాత్మనామ్ ||

12

సుప్రాజ్యఫలమూలాని పుష్పితాని వనాని చ |
ప్రశస్తమృగయూథాని శాంతపక్షిగణాని చ ||

13

ఫుల్లపంకజషండాని ప్రసన్నసలిలాని చ |
కారండవవికీర్ణాని తటాకాని సరాంసి చ ||

14

ద్రక్ష్యసే దృష్టిరమ్యాణి గిరిప్రస్రవణాని చ |
రమణీయాన్యరణ్యాని మయూరాభిరుతాని చ ||

15

గమ్యతాం వత్స సౌమిత్రే భవానపి చ గచ్ఛతు |
ఆగంతవ్యం త్వయా తాత పునరేవాశ్రమం మమ ||

16

ఏవముక్తస్తథేత్యుక్త్వా కాకుత్స్థః సహలక్ష్మణః |
ప్రదక్షిణం మునిం కృత్వా ప్రస్థాతుముపచక్రమే ||

17

తతః శుభతరే తూణీ ధనుషీ చాయతేక్షణా |
దదౌ సీతా తయోర్భ్రాత్రోః ఖడ్గౌ చ విమలౌ తతః ||

18

ఆబధ్య చ శుభే తూణీ చాపౌ చాదాయ సస్వనౌ |
నిష్క్రాంతావాశ్రమాద్గంతుముభౌ తౌ రామలక్ష్మణౌ ||

19

శ్రీమంతౌ రూపసంపన్నౌ దీప్యమానౌ స్వతేజసా |
ప్రస్థితౌ ధృతచాపౌ తౌ సీతయా సహ రాఘవౌ ||

20

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే అష్టమః సర్గః ||

Aranya Kanda Sarga 8 Meaning In Telugu

సీతా రామ లక్ష్మణులు మరునాడు ఉదయం నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు. రాముడు సుతీక్షుని వద్దకు వెళ్లాడు.

“మహాత్మా! రాత్రి మీ ఆతిధ్యము స్వీకరించాము. మాకు చాలా సంతోషము అయింది. మీరు అనుమతి ఇస్తే మేము ముగ్గురమూ, మాతో వచ్చిన మునులు కలిసి, ఈ అరణ్యములో ఉన్న ముని ఆశ్రమములను చూచి వస్తాము. ఆ మునుల ఆశీర్వాదములు తీసుకుంటాము.” అని అన్నాడు రాముడు..

“రామా! నీకు శుభమగు గాక! నీ ఇష్టము ప్రకారము ఈ వనములో ఉన్న ముని ఆశ్రమములను అన్నిటినీ దర్శించు. ఈ వనములో ఫలములు, పుష్పములు సమృద్ధిగా ఉన్నాయి. నిర్మలమైన నీరు కలలా జలాశయములు ఎన్నో ఉన్నాయి. కొండలమీది నుండి నేల మీదికి దుముకుచున్న జలపాతములు కూడా చాలాఉన్నాయి. జింకలు, నెమళ్లు తదితర వన్యప్రాణులు మీకు కనువిందు చేస్తాయి. ఈ అడవిలో ఉన్న అందాలన్నీ తనివిదీరా చూడండి. మరలా మన ఆశ్రమమునకు చేరుకోండి.” అని అన్నాడు.

“మహర్షీ! అలాగే చేస్తాను.” అని ఆ మహర్షికి నమస్కరించి, లక్ష్మణుడు, సీత, మునులతో వనములోకి వెళ్లడానికి ప్రయాణము అయ్యాడు. సీత రామునికి లక్ష్మణునికి ధనుర్బాణములు, ఖడ్గములు తెచ్చి ఇచ్చింది. వాటిని రామలక్ష్మణులు ధరించారు. ఆయుధధారులైన రామ లక్ష్మణులు, సీతతో కలిసి ఆ అరణ్యములో ప్రయాణం చేస్తున్నారు.

శ్రీమద్రామాయణము
అరణ్య కాండము ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ నవమః సర్గః (9) >>

Aranya Kanda Sarga 15 In Telugu – అరణ్యకాండ పంచదశః సర్గః

Aranya Kanda Sarga 15 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” పంచదశః సర్గలో, రాముడు గోదావరి నదికి సమీపంలోని పంచవటిలో పర్ణ శాల, గడ్డి కుటీర నిర్మాణ పనిని అప్పగిస్తాడు . లక్ష్మణుడు తన నైపుణ్యంతో హాయిగా ఉండే ఒక కుటీరాన్ని నిర్మించాడు మరియు గృహప్రవేశ కార్యక్రమం తర్వాత వారు దానిలోకి ప్రవేశిస్తారు. రాముడు లక్ష్మణుడిని అతని నిర్మాణ పనిని మెచ్చుకుంటాడు మరియు కృతజ్ఞతాపూర్వకంగా అతను లక్ష్మణుడిని ఆలింగనం చేసుకుంటాడు మరియు రాముడి పట్ల లక్ష్మణునికి ఉన్న శ్రద్ధ గురించి తన హృదయాన్ని వ్యక్తం చేస్తాడు.

పంచవటీపర్ణశాలా

తతః పంచవటీం గత్వా నానావ్యాలమృగాయుతామ్ |
ఉవాచ భ్రాతరం రామః సౌమిత్రిం దీప్తతేజసమ్ ||

1

ఆగతాః స్మ యథోద్దిష్టమముం దేశం మహర్షిణా |
అయం పంచవటీదేశః సౌమ్య పుష్పితపాదపః ||

2

సర్వతశ్చార్యతాం దృష్టిః కాననే నిపుణో హ్యసి |
ఆశ్రమః కతరస్మిన్నో దేశే భవతి సమ్మతః ||

3

రమతే యత్ర వైదేహీ త్వమహం చైవ లక్ష్మణ |
తాదృశో దృశ్యాతాం దేశః సన్నికృష్టజలాశయః ||

4

వనరామణ్యకం యత్ర స్థలరామణ్యకం తథా |
సన్నికృష్టం చ యత్ర స్యాత్ సమిత్పుష్పకుశోదకమ్ ||

5

ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః సంయతాంజలిః |
సీతాసమక్షం కాకుత్స్థమిదం వచనమబ్రవీత్ ||

6

పరవానస్మి కాకుత్స్థ త్వయి వర్షశతం స్థితే |
స్వయం తు రుచిరే దేశే క్రియాతామితి మాం వద ||

7

సుప్రీతస్తేన వాక్యేన లక్ష్మణస్య మహాత్మనః |
విమృశన్ రోచయామాస దేశం సర్వగుణాన్వితమ్ ||

8

స తం రుచిరమాక్రమ్య దేశమాశ్రమకర్మణి |
హస్తౌ గృహీత్వా హస్తేన రామః సౌమిత్రిమబ్రవీత్ ||

9

అయం దేశః సమః శ్రీమాన్ పుష్పితైస్తరుభిర్వృతః |
ఇహాశ్రమపదం సౌమ్య యథావత్కర్తుమర్హసి ||

10

ఇయమాదిత్యసంకాశైః పద్మైః సురభిగంధిభిః |
అదూరే దృశ్యతే రమ్యా పద్మినీ పద్మశోభితా ||

11

యథాఽఽఖ్యాతమగస్త్యేన మునినా భావితాత్మనా |
ఇయం గోదావరీ రమ్యా పుష్పితైస్తరుభిర్వృతా ||

12

హంసకారండవాకీర్ణా చక్రవాకోపశోభితా |
నాతిదూరేణ చాసన్నే మృగయూథనిపీడితాః ||

13

మయూరనాదితా రమ్యాః ప్రాంశవో బహుకందరాః |
దృశ్యంతే గిరయః సౌమ్య ఫుల్లైస్తరుభిరావృతాః ||

14

సౌవర్ణై రాజతైస్తామ్రైర్దేశే దేశే చ ధాతుభిః |
గవాక్షితా ఇవాభాంతి గజాః పరమభక్తిభిః ||

15

సాలైస్తాలైస్తమాలైశ్చ ఖర్జూరపనసామ్రకైః |
నివారైస్తిమిశైశ్చైవ పున్నాగైశ్చోపశోభితాః ||

16

చూతైరశోకైస్తిలకైశ్చంపకైః కేతకైరపి |
పుష్పగుల్మలతోపేతైస్తైస్తైస్తరుభిరావృతాః ||

17

చందనైః స్పందనైర్నీపైః పనసైర్లికుచైరపి |
ధవాశ్వకర్ణఖదిరైః శమీకింశుకపాటలైః ||

18

ఇదం పుణ్యమిదం మేధ్యమిదం బహుమృగద్విజమ్ |
ఇహ వత్స్యామి సౌమిత్రే సార్ధమేతేన పక్షిణా ||

19

ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః పరవీరహా |
అచిరేణాశ్రమం భ్రాతుశ్చకార సుమహాబలః ||

20

పర్ణశాలాం సువిపులాం తత్ర సంఘాతమృత్తికామ్ |
సుస్తంభాం మస్కరైర్దీర్ఘైః కృతవంశాం సుశోభనామ్ ||

21

శమీశాఖాభిరాస్తీర్య దృఢపాశావపాశితామ్ |
కుశకాశశరైః పర్ణైః సుపరిచ్ఛాదితాం తథా ||

22

సమీకృతతలాం రమ్యాం చకార లఘువిక్రమః |
నివాసం రాఘవస్యార్థే ప్రేక్షణీయమనుత్తమమ్ ||

23

స గత్వా లక్ష్మణః శ్రీమాన్నదీం గోదావరీం తదా |
స్నాత్వా పద్మాని చాదాయ సఫలః పునరాగతః ||

24

తతః పుష్పబలిం కృత్వా శాంతిం చ స యథావిధి |
దర్శయామాస రామాయ తదాశ్రమపదం కృతమ్ ||

25

స తం దృష్ట్వా కృతం సౌమ్యమాశ్రమం సహ సీతయా |
రాఘవః పర్ణశాలాయాం హర్షమాహారయద్భృశమ్ ||

26

సుసంహృష్టః పరిష్వజ్య బాహుభ్యాం లక్ష్మణం తదా |
అతిస్నిగ్ధం చ గాఢం చ వచనం చేదమబ్రవీత్ ||

27

ప్రీతోఽస్మి తే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభో |
ప్రదేయో యన్నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః ||

28

భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ |
త్వాయా పుత్రేణ ధర్మాత్మా న సంవృత్తః పితా మమ ||

29

ఏవం లక్ష్మణముక్త్వా తు రాఘవో లక్ష్మివర్ధనః |
తస్మిన్దేశే బహుఫలే న్యవసత్సుసుఖం వశీ ||

30

కంచిత్కాలం స ధర్మాత్మా సీతయా లక్ష్మణేన చ |
అన్వాస్యమానో న్యవసత్ స్వర్గలోకే యథామరః ||

31

రాముడు, లక్ష్మణుడు, సీత, జటాయువు అందరూ కలిసి పంచవటి ని చేరుకున్నారు.

రాముడు లక్ష్మణుని చూచి “లక్ష్మణా! ఇక్కడ పూలు చక్కగా పుప్పించి ఉన్నాయి. ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. నేల చదునుగా ఉంది. పక్కనే సెల ఏళ్లు ఉన్నాయి. అగస్త్యుడు చెప్పిన పంచవటి ఇదే కావచ్చును. ఇక్కడ మనము పర్ణశాల నిర్మించు కొనుటకు అనవైన ప్రదేశము చూడుము. లక్ష్మణా! జలాశయము పక్కన, దగ్గరగా ఫలవృక్షములు ఉన్న చోట, దర్భలు, సమిధలు దొరకుచోట, తగిన ప్రదేశమును నిర్ణయింపుము. ” అని పలికాడు.

“రామా! అట్లు కాదు. స్థల నిర్ణయములో నీ కన్నా సమర్థుడు లేడు. నీవు సీత కలిసి ఆలోచించి స్థల నిర్ణయము చెయ్యండి. అక్కడ నేను సుందరమైన ఆశ్రమమును నిర్మించెదను.” అని అన్నాడు.

రాముడు, సీత చుట్టపక్కల ప్రదేశములు తిరిగి గోదావరీ నదీ తీరంలో ఉన్న సమతల ప్రదేశమును ఎన్నుకొన్నారు.

“లక్ష్మణా! ఈ ప్రదేశములో పర్ణశాలను నిర్మింపుము. ఈ ప్రదేశము మనకు అనుకూలముగా ఉంది. పక్కనే గోదావరీ నది ప్రవహించుచున్నది. మనకు జలమునకు కొదవ లేదు. ఈ సమతల ప్రదేశములో ఫల వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. చుట్టూ పర్వతములు పెట్టని కోటలాగా ప్రకాశిస్తున్నాయి. ఆ పర్వతముల మీద మామిడి, అశోక, చంపక, చందన, శమీ, కింశుక వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. అదీ కాకుండా ఇక్కడ ఉన్న వటవృక్షముల మీద అనేక పక్షిజాతులునివసిస్తున్నాయి. జటాయువు కూడా ఈ చెట్ల మీద నివసించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పర్ణశాల నిర్మించుటకు ఇదే అనువైన చోటు.” అని అన్నాడు రాముడు.

రాముని మాటను శిరస్సున దాల్చాడు లక్షణుడు. రాముడు కోరినట్టు అక్కడ ఒక సుందరమైన పర్ణశాలను నిర్మించాడు. మట్టితో గోడలు కట్టాడు. మధ్యలో స్తంభాలు పాతాడు. పొడుగాటి వెదుళ్లతో నిలువుగా అడ్డంగా కట్టాడు. దానిమీద తాళ ఆకులు, దాని మీద రెల్లు గడ్డి కప్పాడు. పర్ణశాల ముందు ఉన్న స్థలమును చదునుచేసాడు. చుట్టు కంచె కట్టాడు. ఆ ప్రకారంగా ఒక సుందరమైన పర్ణశాలను లక్ష్మణుడు నిర్మించాడు.

తరువాత లక్ష్మణుడు గోదావరికి వెళ్లి స్నానము చేసి అక్కడ పుష్పించిన తామర పువ్వులు కోసుకొని వచ్చాడు. లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాలను చూచి సీతారాములు ముగ్ధులయ్యారు. రాముడు లక్ష్మణుని కౌగలించుకొని “లక్ష్మణా! నా కోరిక మేరకు మనకు ఒక అనువైన పర్ణశాలను నిర్మించినందుకు నీకు నేనేమి ఇవ్వగలను నా గాఢపరిష్వంగము తప్ప” అంటూ లక్ష్మణుని ప్రేమతో కౌగలించుకున్నాడు రాముడు. రాముని ప్రేమకు లక్ష్మణుడు పొంగిపోయాడు. ఆ ఆశ్రమములో రాముడు, సీత, లక్ష్మణుడు సుఖంగా నివసించసాగారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదునైదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ షోడశః సర్గః (16) >>

Aranya Kanda Sarga 7 In Telugu – అరణ్యకాండ సప్తమః సర్గః

Aranya Kanda Sarga 7 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తమ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారి సాహసాలు, రాక్షసులతో జరిగిన ఘర్షణలు, వనవాసంలో ఎదురైన కష్టాలు వివరించబడతాయి. మహర్షి అగస్త్యుని ఆశీర్వాదం అందుకుంటారు.

సుతీక్ష్ణాశ్రమః

రామస్తు సహితో భ్రాత్రా సీతయా చ పరంతపః |
సుతీక్ష్ణస్యాశ్రమపదం జగామ సహ తైర్ద్విజైః ||

1

స గత్వాఽదూరమధ్వానం నదీస్తీర్త్వా బహూదకాః |
దదర్శ విపులం శైలం మహామేఘమివోన్నతమ్ ||

2

తతస్తదిక్ష్వాకువరౌ సంతతం వివిధైర్ద్రుమైః |
కాననం తౌ వివిశతుః సీతయా సహ రాఘవౌ ||

3

ప్రవిష్టస్తు వనం ఘోరం బహుపుష్పఫలద్రుమమ్ |
దదర్శాశ్రమమేకాంతే చీరమాలాపరిష్కృతమ్ ||

4

తత్ర తాపసమాసీనం మలపంకజటాధరమ్ |
రామః సుతీక్ష్ణం విధివత్తపోవృద్ధమభాషత ||

5

రామోఽహమస్మి భగవన్భవంతం ద్రష్టుమాగతః |
త్వం మాఽభివద ధర్మజ్ఞ మహర్షే సత్యవిక్రమ ||

6

స నిరీక్ష్య తతో వీరం రామం ధర్మభృతాం వరమ్ |
సమాశ్లిష్య చ బాహుభ్యామిదం వచనమబ్రవీత్ ||

7

స్వాగతం ఖలు తే వీర రామ ధర్మభృతాం వర |
ఆశ్రమోఽయం త్వయాక్రాంతః సనాథ ఇవ సాంప్రతమ్ ||

8

ప్రతీక్షమాణస్త్వామేవ నారోహేఽహం మాహాయశః |
దేవలోకమితో వీర దేహం త్యక్త్వా మహీతలే ||

9

చిత్రకూటముపాదాయ రాజ్యభ్రష్టోఽసి మే శ్రుతః |
ఇహోపయాతః కాకుత్స్థ దేవరాజః శతక్రతుః ||

10

ఉపాగమ్య చ మాం దేవో మహాదేవః సురేశ్వరః |
సర్వాఁల్లోకాంజితానాహ మమ పుణ్యేన కర్మణా ||

11

తేషు దేవర్షిజుష్టేషు జితేషు తపసా మయా |
మత్ప్రసాదాత్సభార్యస్త్వం విహరస్వ సలక్ష్మణః ||

12

తముగ్రతపసా యుక్తం మహర్షిం సత్యవాదినమ్ |
ప్రత్యువాచాత్మవాన్రామో బ్రహ్మాణమివ కాశ్యపః ||

13

అహమేవాహరిష్యామి స్వయం లోకాన్మహామునే |
ఆవాసం త్వహమిచ్ఛామి ప్రదిష్టమిహ కాననే ||

14

భవాన్సర్వత్ర కుశలః సర్వభూతహితే రతః |
ఆఖ్యాతః శరభంగేణ గౌతమేన మహాత్మనా ||

15

ఏవముక్తస్తు రామేణ మహర్షిర్లోకవిశ్రుతః |
అబ్రవీన్మధురం వాక్యం హర్షేణ మహతాఽఽప్లుతః ||

16

అయమేవాశ్రమో రామ గుణవాన్రమ్యతామిహ |
ఋషిసంఘానుచరితః సదా మూలఫలాన్వితః ||

17

ఇమమాశ్రమమాగమ్య మృగసంఘా మహాయశాః |
అటిత్వా ప్రతిగచ్ఛంతి లోభయిత్వాకుతోభయాః ||

18

నాన్యో దోషో భవేదత్ర మృగేభ్యోఽన్యత్ర విద్ధి వై |
తచ్ఛ్రుత్వా వచనం తస్య మహర్షేర్లక్ష్మణాగ్రజః ||

19

ఉవాచ వచనం ధీరో వికృష్య సశరం ధనుః |
తానహం సుమహాభాగ మృగసంఘాన్సమాగతాన్ ||

20

హన్యాం నిశితధారేణ శరేణాశనివర్చసా |
భవాంస్తత్రాభిషజ్యేత కిం స్యాత్కృచ్ఛ్రతరం తతః ||

21

ఏతస్మిన్నాశ్రమే వాసం చిరం తు న సమర్థయే |
తమేవముక్త్వా వరదం రామః సంధ్యాముపాగమత్ ||

22

అన్వాస్య పశ్చిమాం సంధ్యాం తత్ర వాసమకల్పయత్ |
సుతీక్ష్ణస్యాశ్రమే రమ్యే సీతయా లక్ష్మణేన చ ||

23

తతః శుభం తాపసభోజ్యమన్నం
స్వయం సుతీక్ష్ణః పురుషర్షభాభ్యామ్ |
తాభ్యాం సుసత్కృత్య దదౌ మహాత్మా
సంధ్యానివృత్తౌ రజనీమవేక్ష్య ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే సప్తమః సర్గః ||

Aranya Kanda Sarga 7 Meaning In Telugu

రాముడు, సీతతోనూ, లక్ష్మణుని తోనూ, ఇంకా కొందరు మునులతోనూ సుతీక్ష మహర్షి ఆశ్రమమునకు వెళ్లాడు. సుతీక్ష మహర్షి ఆశ్రమము ఒక మహారణ్యములో చదునైన ప్రదేశములో ఉంది. ఆ అడవిలో ఫలవృక్షములు పుష్కలంగా ఉన్నాయి.

రాముడు ఆ ఆశ్రమములో ప్రవేశించాడు. తపస్సులో ఉన్న సుతీక్ష మహర్షిని చూచాడు. భక్తితో నమస్కరించాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు.

“ఓ మహర్షీ! నా పేరు రాముడు అయోధ్యాధి పతి దశరథుని కుమారుడను. తండ్రి ఆజ్ఞ మేరకు, నా భార్య, సోదరునితో కలిసి అరణ్యవాసము చేస్తున్నాను. శరభంగ మహర్షి ఆదేశము మేరకు తమ దగ్గరకు వచ్చాను. కళ్లు తెరిచి నాతో మాట్లాడండి.” అని ప్రార్థించాడు.

సుతీక్ష మహర్షి కళ్లు తెరిచాడు. రాముని చూచాడు. పరమానందంతో రాముని కౌగలించుకున్నాడు.

“రామా! నీకు స్వాగతము. నీరాకచే మా ఆశ్రమమునకు ఒక నాధుడు దొరికినట్టయింది. రామా! నీ గురించి విన్నాను. నీవు అరణ్యములలో సంచరిస్తున్నావని తెలిసి నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాను. దేవేంద్రుడు వచ్చి నన్ను స్వర్గలోకమునకు ఆహ్వానించాడు. నేను స్వర్గమునకు వెళ్లవలెనని నిశ్చయించుకున్నాను. కాబట్టి నేను ఆర్జించిన తపోఫలమును నీకు ధారపోస్తాను. నీవు స్వీకరించు.” అని అన్నాడు.

అప్పుడు రాముడు ఆ మహర్షితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నీ గురించి శరభంగ మహర్షి వలన విని ఉన్నాను. తమరు నాకు ఉండటానికి తగిన ప్రదేశమును నిర్ణయిస్తారని శరభంగ మహర్షి చెప్పాడు.” అని అన్నాడు.

“రామా! ఈ అడవిలో ఈ ప్రాంతము నివాసయోగ్యమైనది. ఇక్కడ ఫలవృక్షములు, పూదోటలు విస్తారముగా ఉన్నాయి. పర్ణశాల నిర్మించుకోడానికి అనువైన చదునైన ప్రదేశము ఉంది. కాబట్టి నీవు పర్ణశాల నిర్మించుకొని ఇక్కడే ఉండవచ్చును. కాని ఈ ప్రదేశమునకు పెద్ద పెద్ద జంతువులు గుంపులు గుంపులుగా వస్తాయి. కాని అవి ఎవరికీ హాని చెయ్యవు. కాసేపు అటూ ఇటూ తిరిగి వెళ్లిపోతాయి. అది తప్ప ఇక్క ఏ విధమైన భయము లేదు. ప్రశాంతంగా ఉంటుంది.” అని అన్నాడు సుతీక్ష మహర్షి.

అప్పుడు రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నాకు మృగముల వలన భయము లేదు. నేను వనవాసిని కాను కదా. క్షత్రియుడను. ఈ ధనుర్బాణములతో మనకు హాని కలిగించు మృగములను చంపగలను. కాని నేను మృగములను చంపడం సహజంగా దయాళువులైన మీకు కష్టం కలిగించవచ్చును. కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ కాలము ఉండలేను అనిపిస్తూ ఉంది.” అని అన్నాడు రాముడు.

తరువాత రాముడు, లక్ష్మణుడు సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు. సుతీక్ష మహర్షి రామలక్ష్మణులకు, సీతకు, వారితో వచ్చిన మునులకు ఫలములను ఇచ్చి సత్కరించాడు. ఆ రాత్రికి వారు సుతీక్షుని ఆశ్రమములోనే ఉన్నారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ అష్టమః సర్గః (8) >>

Ayodhya Kanda Sarga 83 In Telugu – అయోధ్యాకాండ త్ర్యశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 83 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ  త్ర్యశీతితమః సర్గ, “భరతవనప్రస్థానమ్”, రామాయణంలో ఒక ప్రాధాన్యభరితమైన భాగం. ఈ సర్గలో భరతుడు తన సైన్యంతో, మంత్రులతో, మరియు ప్రజలతో కలిసి రాముడిని తిరిగి తీసుకురావాలన్న పట్టుదలను చూపిస్తాడు. భరతుడు తన అన్న రాముడిని తిరిగి తెచ్చేందుకు చేసిన ఈ యాత్ర, అతని విధేయతను, ధర్మపరాయణతను, మరియు కుటుంబ ప్రేమను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది.

భరతవనప్రస్థానమ్

తతః సముత్థితః కాల్యమాస్థాయ స్యందనోత్తమమ్ |
ప్రయయౌ భరతః శీఘ్రం రామదర్శనకాంక్షయా ||

1

అగ్రతః ప్రయయుస్తస్య సర్వే మంత్రిపురోధసః |
అధిరుహ్య హయైః యుక్తాన్ రథాన్సూర్యరథోపమాన్ ||

2

నవనాగసహస్రాణి కల్పితాని యథావిధి |
అన్వయుర్భరతం యాంతమిక్ష్వాకు కులనందనమ్ ||

3

షష్ఠీ రథసహస్రాణి ధన్వినో వివిధాయుధాః |
అన్వయుర్భరతం యాంతం రాజపుత్రం యశస్వినమ్ ||

4

శతం సహస్రాణ్యశ్వానాం సమారూఢాని రాఘవమ్ |
అన్వయుర్భరతం యాంతం సత్యసంధం జితేంద్రియమ్ ||

5

కైకేయీ చ సుమిత్రా చ కౌసల్యా చ యశస్వినీ |
రామానయన సంహృష్టా యయుర్యానేన భాస్వతా ||

6

ప్రయాతాశ్చార్యసంఘాతాః రామం ద్రష్టుం సలక్ష్మణమ్ |
తస్యైవ చ కథాశ్చిత్రాః కుర్వాణా హృష్టమానసాః ||

7

మేఘశ్యామం మహాబాహుం స్థిరసత్త్వం దృఢవ్రతమ్ |
కదా ద్రక్ష్యామహే రామం జగతః శోకనాశనమ్ ||

8

దృష్ట ఏవ హి నః శోకమపనేష్యతి రాఘవః |
తమః సర్వస్య లోకస్య సముద్యన్నివ భాస్కరః ||

9

ఇత్యేవం కథయంతస్తే సంప్రహృష్టాః కథాశ్శుభాః |
పరిష్వజానాశ్చాన్యోన్యం యయుర్నాగరికా జనాః ||

10

యే చ తత్రాపరే సర్వే సమ్మతా యే చ నైగమాః |
రామం ప్రతి యయుర్హృష్టాః సర్వాః ప్రకృతయస్తదా ||

11

మణికారాశ్చ యే కేచిత్ కుంభకారాశ్చ శోభనాః |
సూత్రకర్మకృతశ్చైవ యే చ శస్త్రోపజీవినః ||

12

మాయూరకాః క్రాకచికా రోచకాః వేధకాస్తథా |
దంతకారాః సుధాకారాస్తథా గంధోపజీవినః ||

13

సువర్ణకారాః ప్రఖ్యాతాస్తథా కంబలధావకాః |
స్నాపకోచ్ఛాదకా వైద్యా ధూపకాః శౌండికాస్తథా ||

14

రజకాస్తున్నవాయాశ్చ గ్రామఘోషమహత్తరాః |
శైలూషాశ్చ సహ స్త్రీభిర్యయుః కైవర్తకాస్తథా ||

15

సమాహితా వేదవిదో బ్రాహ్మణా వృత్తసమ్మతాః |
గోరథైః భరతం యాంతమనుజగ్ముః సహస్రశః ||

16

సువేషాః శుద్ధ వసనాస్తామ్ర మృష్టానులేపనాః |
సర్వే తే వివిధైః యానైః శనైర్భరతమన్వయుః ||

17

ప్రహృష్టముదితా సేనా సాఽన్వయాత్కైకయీ సుతమ్ |
భ్రాతురానయనే యాంతం భరతం భ్రాతృవత్సలమ్ ||

18

తే గత్వా దూరమధ్వానం రథయానాశ్వకుంజరైః |
సమాసేదుస్తతో గంగాం శృంగిబేరపురం ప్రతి ||

19

యత్ర రామసఖో వీరో గుహో జ్ఞాతిగణైర్వృతః |
నివసత్యప్రమాదేన దేశం తం పరిపాలయన్ ||

20

ఉపేత్య తీరం గంగాయాశ్చక్రవాకైరలంకతమ్ |
వ్యవతిష్ఠత సా సేనా భరతస్యానుయాయినీ ||

21

నిరీక్ష్యానుగతాం సేనాం తాం చ గంగాం శివోదకామ్ |
భరతః సచివాన్ సర్వాన్ అబ్రవీద్వాక్యకోవిదః ||

22

నివేశయత మే సైన్యమభిప్రాయేణ సర్వతః |
విశ్రాంతః ప్రతరిష్యామః శ్వైదానీమిమాం నదీమ్ ||

23

దాతుం చ తావదిచ్ఛామి స్వర్గతస్య మహీపతేః |
ఔర్ధ్వదేహనిమిత్తార్థమ్ అవతీర్యోదకం నదీమ్ ||

24

తస్యైవం బ్రువతోఽమాత్యాస్తథా ఇత్యుక్త్వా సమాహితాః |
న్యవేశయంస్తాం ఛందేన స్వేన స్వేన పృథక్ పృథక్ ||

25

నివేశ్య గంగామను తాం మహానదీమ్
చమూం విధానైః పరిబర్హశోభినీమ్ |
ఉవాస రామస్య తదా మహాత్మనో
విచింతయానో భరతర్నివర్తనమ్ ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్ర్యశీతితమః సర్గః ||

Ayodhya Kanda Sarga 83 Meaning In Telugu

మరునాడు ఉదయము భరతుడు నిద్ర లేచాడు. ప్రాతఃకాల సంధ్యావందనాదికార్యకమములు నిర్వర్తించాడు. తన రథముఎక్కి బయలుదేరాడు. భరతుని వెంట పురోహితులు, మంత్రులు తమ తమ వాహనములలో బయలుదేరారు.

భరతుని వెనక 9,000 ఏనుగులు, 60,000 రథములు, వాటిలో ధనుస్సులు ధరించిన సైనికులు, ఒక లక్ష మంది ఆశ్విక సైన్యము రక్షణగా బయలుదేరింది. కౌసల్య, కైకేయీ, సుమిత్ర తమ తమ రథములలో భరతుని వెంట రాముని వద్దకు బయలుదేరారు. రాజకుటుంబము వారికి సన్నిహితంగా ఉన్నవారు, వర్తకులుకూడా రాముని వద్దకు బయలుదేరారు. వీరు కాకుండా వివిధ చేతి వృత్తులవారు ఎప్పుడు ఎవరి అవసరము వస్తుందో అని భరతుని వెంట బయలుదేరారు. వారి వెనక వేదములు వల్లిస్తూ బ్రాహ్మణులు ఎడ్లబండ్ల మీద భరతుని అనుసరించారు.

వారందరూ శృంగిభేర పురము దగ్గర ప్రవహించుచున్న గంగానదిని సమీపించారు. భరతుడు అక్కడ ఆగాడు. అమాత్యులను పురోహితులను సైన్యాధ్యక్షులను చూచి ఇలా అన్నాడు.

“ఈ రాత్రికి మనము ఈ గంగానదీ తీరములో విడిది. చేద్దాము. రేపు ఉదయము మన ప్రయాణము కొనసాగిస్తాము. నేను నా తండ్రికి గంగానదిలో జలతరణములు విడుస్తాను. మీరందరూ సేనలతో విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు.

భరతుని ఆదేశము మేరకు అందరూ ఆ రాత్రికి గంగానదీ తీరమున విడిదిచేసారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతురశీతితమః సర్గః (84) >>

Aranya Kanda Sarga 14 In Telugu – అరణ్యకాండ చతుర్దశః సర్గః

Aranya Kanda Sarga 14 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” చతుర్దశః సర్గలో, రాముడు మరియు మిగిలిన ఇద్దరు పంచవటికి వెళుతుండగా జటాయు అనే శక్తివంతమైన డేగతో పరిచయం ఏర్పడింది. రాముడు దాని గుర్తింపు గురించి ప్రశ్నించినప్పుడు, జటాయు మానవులతో పాటు జంతు జాతుల సృష్టిని వివరిస్తాడు మరియు తాను దశరథ రాజుకు స్నేహితుడని మరియు అజ్ఞాతవాసంలో ఉన్న రాముడికి సహాయం చేయాలనుకుంటున్నానని రాముడికి తెలియజేస్తాడు.

జటాయుఃసంగమః

అథ పంచవటీం గచ్ఛన్నంతరా రఘునందనః |
ఆససాద మహాకాయం గృధ్రం భీమపరాక్రమమ్ ||

1

తం దృష్ట్వా తౌ మహాభాగౌ వటస్థం రామలక్ష్మణౌ |
మేనాతే రాక్షసం పక్షిం బ్రువాణౌ కో భవానితి ||

2

స తౌ మధురయా వాచా సౌమ్యయా ప్రీణయన్నివ |
ఉవాచ వత్స మాం విద్ధి వయస్యం పితురాత్మనః ||

3

స తం పితృసఖం బుద్ధ్వా పూజయామాస రాఘవః |
స తస్య కులమవ్యగ్రమథ పప్రచ్ఛ నామ చ ||

4

రామస్య వచనం శ్రుత్వా సర్వభూతసముద్భవమ్ |
ఆచచక్షే ద్విజస్తస్మై కులమాత్మానమేవ చ ||

5

పూర్వకాలే మహాబాహో యే ప్రజాపతయోఽభవన్ |
తాన్మే నిగదతః సర్వానాదితః శృణు రాఘవ ||

6

కర్దమః ప్రథమస్తేషాం విశ్రుతస్తదనంతరః |
శేషశ్చ సంశ్రయశ్చైవ బహుపుత్రశ్చ వీర్యవాన్ ||

7

స్థాణుర్మరీచిరత్రిశ్చ క్రతుశ్చైవ మహాబలః |
పులస్త్యశ్చాంగిరాశ్చైవ ప్రచేతాః పులహస్తథా ||

8

దక్షో వివస్వానపరోఽరిష్టనేమిశ్చ రాఘవ |
కశ్యపశ్చ మహాతేజాస్తేషామాసీచ్చ పశ్చిమః ||

9

ప్రజాపతేస్తు దక్షస్య బభూవురితి విశ్రుతమ్ |
షష్టిర్దుహితరో రామ యశస్విన్యో మహాయశః ||

10

కశ్యపః ప్రతిజగ్రాహ తాసామష్టౌ సుమధ్యమాః |
అదితిం చ దితిం చైవ దనుమప్యథ కాలికామ్ ||

11

తామ్రాం క్రోధవశాం చైవ మనుం చాప్యనలామపి |
తాస్తు కన్యాస్తతః ప్రీతః కశ్యపః పునరబ్రవీత్ ||

12

పుత్రాంస్రైలోక్యభర్తౄన్వై జనయిష్యథ మత్సమాన్ |
అదితిస్తన్మనా రామ దితిశ్చ మనుజర్షభ ||

13

కాలికా చ మహాబాహో శేషాస్త్వమనసోఽభవన్ |
అదిత్యాం జజ్ఞిరే దేవాస్త్రయస్త్రింశదరిందమ ||

14

ఆదిత్యా వసవో రుద్రా హ్యశ్వినౌ చ పరంతప |
దితిస్త్వజనయత్పుత్రాన్దైత్యాంస్తాత యశస్వినః ||

15

తేషామియం వసుమతీ పురాసీత్సవనార్ణవా |
దనుస్త్వజనయత్పుత్రమశ్వగ్రీవమరిందమ ||

16

నరకం కాలకం చైవ కాలికాపి వ్యజాయత |
క్రౌంచీం భాసీం తథా శ్యేనీం ధృతరాష్ట్రీం తథా శుకీమ్ ||

17

తామ్రాపి సుషువే కన్యాః పంచైతా లోకవిశ్రుతాః |
ఉలూకాన్ జనయత్క్రౌంచీ భాసీ భాసాన్వ్యజాయత ||

18

శ్యేనీ శ్యేనాంశ్చ గృధ్రాంశ్చ వ్యజాయత సుతేజసః |
ధృతరాష్ట్రీ తు హంసాంశ్చ కలహంసాంశ్చ సర్వశః ||

19

చక్రవాకాంశ్చ భద్రం తే విజజ్ఞే సాపి భామినీ |
శుకీ నతాం విజజ్ఞే తు నతాయా వినతా సుతా ||

20

దశ క్రోధవశా రామ విజజ్ఞే హ్యాత్మసంభవాః |
మృగీం చ మృగమందాం చ హరిం భద్రమదామపి ||

21

మాతంగీమపి శార్దూలీం శ్వేతాం చ సురభిం తథా |
సర్వలక్షణసంపన్నాం సురసాం కద్రుకామపి ||

22

అపత్యం తు మృగాః సర్వే మృగ్యా నరవరోత్తమ |
ఋక్షాశ్చ మృగమందాయాః సృమరాశ్చమరాస్తథా ||

23

హర్యాశ్చ హరయోఽపత్యం వానరాశ్చ తరస్వినః |
తతస్త్విరావతీం నామ జజ్ఞే భద్రమదా సుతామ్ ||

24

తస్యాస్త్వైరావతః పుత్రో లోకనాథో మహాగజః |
మాతంగాస్త్వథ మాతంగ్యా అపత్యం మనుజర్షభ ||

25

గోలాంగూలాంశ్చ శార్దూలీ వ్యాఘ్రాంశ్చాజనయత్సుతాన్ |
దిశాగజాంశ్చ కాకుత్స్థ శ్వేతాప్యజనయత్సుతాన్ ||

26

తతో దుహితరౌ రామ సురభిర్ద్వే వ్యజాయత |
రోహిణీం నామ భద్రం తే గంధర్వీం చ యశస్వినీమ్ ||

27

రోహిణ్యజనయద్గా వై గంధర్వీ వాజినః సుతాన్ |
సురసాజనయన్నాగాన్రామ కద్రూస్తు పన్నగాన్ ||

28

మనుర్మనుష్యాంజనయద్రామ పుత్రాన్యశస్వినః |
బ్రాహ్మణాన్క్షత్త్రియాన్వైశ్యాన్ శూద్రాంశ్చ మనజర్షభ ||

29

సర్వాన్పుణ్యఫలాన్వృక్షాననలాపి వ్యాజాయత |
వినతా చ శుకీ పౌత్రీ కద్రూశ్చ సురసా స్వసా ||

30

కద్రూర్నాగం సహస్రస్యం విజజ్ఞే ధరణీధరమ్ |
ద్వౌ పుత్రౌ వినతాయాస్తు గరుడోఽరుణ ఏవ చ ||

31

తస్మాజ్జాతోఽహమరుణాత్సంపాతిస్తు మమాగ్రజః |
జటాయురితి మాం విద్ధి శ్యేనీపుత్రమరిందమ ||

32

సోఽహం వాససహాయస్తే భవిష్యామి యదీచ్ఛసి |
ఇదం దుర్గం హి కాంతారం మృగరాక్షససేవితమ్ |
సీతాం చ తాత రక్షిష్యే త్వయి యాతే సలక్ష్మణే ||

33

జటాయుషం తం ప్రతిపూజ్య రాఘవో
ముదా పరిష్వజ్య చ సన్నతోఽభవత్ |
పితుర్హి శుశ్రావ సఖిత్వమాత్మవాన్
జటాయుషా సంకథితం పునః పునః ||

34

స తత్ర సీతాం పరిదాయ మైథిలీం
సహైవ తేనాతిబలేన పక్షిణా |
జగామ తాం పంచవటీం సలక్ష్మణో
రిపూన్దిధక్షన్ శలభానివానలః ||

35

Aranya Kanda Sarga 14 In Telugu Pdf Download

రాముడు సీత, లక్ష్మణులతో సహా పంచవటికి వెళుతున్నాడు. దారిలో వారికి ఒక వటవృక్షము మీద కూర్చుని ఉన్న పెద్ద ఆకారము కల పక్షి కనపడింది. ఆ అరణ్యములో కామరూపులైన రాక్షసులు నివసిస్తుంటారు అని విని ఉన్నాడు. అందుకని ఆ పక్షిని రాక్షసుడిగా తలచాడు రాముడు.

“నీవు ఎవరవు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?” అని అడిగాడు రాముడు.

“రామా! నేను నీకు తెలియకపోయినా నీవు నాకు తెలుసు. నీవు దశరథుని కుమారుడైన రాముడివి. నీ తండ్రి దశరథుడు నాకు మంచి మిత్రుడు.” అని అన్నాడు.

తన తండ్రికి మిత్రుడైన వాడు తనకు గౌరవింపతగ్గవాడు అని అనుకొన్నాడు రాముడు. ఆ పక్షికి అభివాదము చేసాడు. ఆ పక్షి రామునితో ఇలా పలికింది.

“రామా! నీకు పూర్వము ఎంతమంది ప్రజాపతులున్నారో వారి గురించి చెబుతాను శ్రద్ధగా విను.

ప్రజాపతులలో ప్రథముడు కర్దముడు. అతని తరువాతి వాడు విక్రీతుడు. ఆ తరువాత శేషుడు. అతని తరువాత సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్యుడు, అంగిరసుడు, ప్రచేతసుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు వరుసగా ప్రజాపతులయ్యారు.

ఆఖరి వాడు కశ్యప ప్రజాపతి. ఆయనకు అరిష్టనేమి అనే పేరుకూడా ఉంది. నీకు చెప్పానే దక్షుడు అని, ఆయనకు అరవై మంది కుమార్తెలు. వారిలో అదితి, దితి, దనువు, కాళిక, తామ్ర, క్రోధవశ,మను, అనల అనే ఎనిమింది కన్యలను కశ్యపప్రజాపతి పెళ్లిచేసుకున్నాడు.

కశ్యపుడు తన భార్యలతో “మీరందరూ నాతో సమానమైన ముల్లోకములను పోషించగలిగే పుత్రులను ప్రసవించండి.” అని కోరాడు. వారిలో అదితి, దితి, కాళిక అనే వారు మాత్రము కశ్యపుని మాట మన్నించారు. మిగిలినవారు ఆయన మాటమీద మనసు పెట్టలేదు.

కశ్యపుని కోరిక ప్రకారము అదితికి పన్నెండు మంది ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు), ఎనిమిది మంది వసువులను (అష్టవసువులు. అందులో ఆఖరి వసువే శాపకారణంగా గంగాదేవికి భీష్ముడిగా పుట్టాడు. మహాభారత కధకు మూలపురుషుడు అయ్యాడు), పదకొండు మంది రుద్రులు, ఇద్దరు అశ్వినులు, మొత్తం ముప్పది ముగ్గురు దేవతలుపుట్టారు.

కశ్యపునకు దితి యందు దైత్యులు జన్మించారు. వారందరూ ఈ భూమికి అధిపతులయ్యారు. పూర్వము ఈ భూమి అంతా దైత్యుల అధీనంలో ఉండేది.

కశ్యపునకు దనువు అనే భార్య ద్వారా హయగ్రీవుడు అనే పుత్రుడు కలిగాడు. కాళి అనే భార్యకు నరకుడు, కాలకుడు అనే పుత్రులు జన్మించారు. తామ్ర అనే భార్య క్రౌంచి, భాసి, శ్యేని,ధృతరాష్ట్రి, శుకి అనే ఆడపిల్లలకు జన్మనిచ్చింది. (ఇవి అన్నీ పక్షిజాతుల పేర్లు).ఆ తరువాత క్రౌంచికి ఉలూకములు (గుడ్లగూబలు), భాసి అనేకూతురు భాస పక్షులకు జన్మనిచ్చింది. శ్యేని అనే కూతురుకు శ్యేనములు (డేగలు) పుట్టాయి. ధృతరాష్ట్రికి రకరకాలైన హంస జాతులు, చక్రవాక పక్షులు, జన్మించాయి. ఈ ప్రకారంగా పక్షిజాతి అభివృద్ధిచెందింది.

శుకి అనే కూతురుకు నత అనే కుమారుడు కలిగాడు. నతకు వినత అనే కూతురు పుట్టింది. కశ్యపునకు క్రోధవశ అనే భార్య ద్వారా మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే పదిమింది పుత్రికలు జన్మించారు. (ఇవన్నీ మృగజాతుల పేర్లు). మృగి సంతానము లేళ్లు, దుప్పులు, జింకలు. ఎలుగుబంట్లు, చామరీ మృగములు ఇంకా ఇతర మృగములు మృగమంద సంతానము. హరికి సింహములు, వానరములు పుట్టాయి. (అందుకే సింహమునకు కోతులకు, హరి అనే పేరు వచ్చింది.

భద్రమదకు ఇరావతి అనే కూతురు పుట్టింది. ఇరావతికి ఐరావతము పుట్టింది. మాతంగికి ఏనుగుజాతి జన్మించింది. శార్దూలి అనే కూతురికి పెద్దపులులు, కొండముచ్చులు జన్మించాయి. శ్వేతకు దిగ్గజములు జన్మించాయి.

సురభి రోహిణి, గంధర్వి అనే ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చింది. రోహిణికి గోవులు, గోసంతతి, గంధర్వికి అశ్వజాతి, సురసకు రెండు తలలు అంతకన్నా ఎక్కువ తలల పాములు, కద్రువకు ఒక్కొక్క పడగ ఉన్న పాములు జన్మించాయి.

మనువుకు మానవులు జన్మించారు. ఆ మానవులు వారి వారి గుణముల బట్టీ చేసే వృత్తులబత్తీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజింపబడ్డారు. అనల మంచి మంచి ఫలములను ఇచ్చు వృక్షజాతికి జన్మనిచ్చింది.

రామా! నీకు పక్షిజాతులకు జన్మనిచ్చిన వినత, నాగులకు జన్మనిచ్చిన కద్రువ గురించి చెబుతాను విను. వినత శుకికి మనుమరాలు. కద్రువ సురసకు సోదరి. కద్రువకు ఆదిశేషుడు కుమారుడుగా పుట్టాడు. వినతకు గరుడుడు, అరుణుడు అనే పుత్రులు జన్మించారు.

(గరుడుడు విష్ణువుకు వాహనము అయ్యాడు. అరుణుడుకి కాళ్లు లేకపోవడం వల్ల సూర్యుని రథమునకు సారథి అయ్యాడు).

ఆ అరుణుడికి ఇద్దరు కుమారులు. నేను, సంపాతి. నా పేరు జటాయువు. నేను శ్యేని జాతికి చెందిన వాడిని. ఇదీ నా జన్మ వృత్తాంతము.

(అవకాశము వస్తే చాలు, పూర్వకాలపు కవులు కొత్త కొత్త విషయాలను ఆయాపాత్రల ద్వారా మనకు తెలియజేస్తారు. వాల్మీకి ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు మనకు చెప్పాడు. ఈభూమి మీద మనుషులు, జంతువులు, పక్షులు, వృక్షములు ఎలా పుట్టాయి, వాటి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అనే విషయాలను వివరంగా చెప్పాడు.)

రామా! ఈ వనమంతా నాకు బాగాతెలుసు. నీకు ఇష్టం అయితే నేను నీకు ఏదైనా సాయం కావలిస్తే చేస్తాను. నీకు సహాయకుడుగా ఉంటాను. ఈ అడవిలో అనేక క్రూర మృగములు, నరమాంసభక్షకులైన రాక్షసులు ఉన్నారు. నీవు కోరితే మీరు ఇంట లేనపుడు సీత రక్షణ బాధ్యతను నేను వహిస్తాను.” అని అన్నాడు.

జటాయువు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. జటాయువును చూచి తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు. తండ్రికి మారుగా జటాయువును పూజించాడు రాముడు. తరువాత జటాయువు పంచవటికి మార్గం చూపించాడు. జటాయువుతో కలిసి రాముడు, లక్ష్మణుడు సీతతో సహా పంచవటికి వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదునాల్గవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ పంచదశః సర్గః (15) >>

Aranya Kanda Sarga 6 In Telugu – అరణ్యకాండ షష్ఠః సర్గః

Aranya Kanda Sarga 6 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షష్ఠః సర్గం రామాయణంలో కీలకమైన భాగం. ఈ సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో నివసిస్తారు. అక్కడ సుర్పణఖ తన సోదరులైన ఖర, దూషణలను రాముని మీద దాడి చేయమని ప్రేరేపిస్తుంది. ఖర, దూషణలు తమ దళాలతో రాముడిపై దాడి చేస్తారు. రాముడు ధైర్యంగా యుద్ధం చేసి, ఖర, దూషణలను వధిస్తాడు.

|| రక్షోవధప్రతిజ్ఞానమ్ ||

శరభంగే దివం యాతే మునిసంఘాః సమాగతాః |
అభ్యగచ్ఛంత కాకుత్స్థం రామం జ్వలితతేజసమ్ ||

1

వైఖానసా వాలఖిల్యాః సంప్రక్షాలా మరీచిపాః |
అశ్మకుట్టాశ్చ బహవః పత్రాహారాశ్చ ధార్మికాః ||

2

దంతోలూఖలినశ్చైవ తథైవోన్మజ్జకాః పరే |
గాత్రశయ్యా అశయ్యాశ్చ తథైవాభ్రావకాశకాః ||

3

మునయః సలిలాహారా వాయుభక్షాస్తథాపరే |
ఆకాశనిలయాశ్చైవ తథా స్థండిలశాయినః ||

4

వ్రతోపవాసినో దాంతాస్తథార్ద్రపటవాససః |
సజపాశ్చ తపోనిత్యాస్తథా పంచతపోఽన్వితాః ||

5

సర్వే బ్రాహ్మ్యా శ్రియా జుష్టా దృఢయోగాః సమాహితాః |
శరభంగాశ్రమే రామమభిజగ్ముశ్చ తాపసాః ||

6

అభిగమ్య చ ధర్మజ్ఞా రామం ధర్మభృతాం వరమ్ |
ఊచుః పరమధర్మజ్ఞమృషిసంఘాః సమాహితాః ||

7

త్వమిక్ష్వాకుకులస్యాస్య పృథివ్యాశ్చ మహారథ |
ప్రధానశ్చాసి నాథశ్చ దేవానాం మఘవానివ ||

8

విశ్రుతస్త్రిషు లోకేషు యశసా విక్రమేణ చ |
పితృభక్తిశ్చ సత్యం చ త్వయి ధర్మశ్చ పుష్కలః ||

9

త్వామాసాద్య మహాత్మానం ధర్మజ్ఞం ధర్మవత్సలమ్ |
అర్థిత్వాన్నాథ వక్ష్యామస్తచ్చ నః క్షంతుమర్హసి ||

10

అధర్మస్తు మహాంస్తాత భవేత్తస్య మహీపతేః |
యో హరేద్బలిషడ్భాగం న చ రక్షతి పుత్రవత్ ||

11

యుంజానః స్వానివ ప్రాణాన్ప్రాణైరిష్టాన్సుతానివ |
నిత్యయుక్తః సదా రక్షన్సర్వాన్విషయవాసినః ||

12

ప్రాప్నోతి శాశ్వతీం రామ కీర్తిం స బహువార్షికీమ్ |
బ్రహ్మణః స్థానమాసాద్య తత్ర చాపి మహీయతే ||

13

యత్కరోతి పరం ధర్మం మునిర్మూలఫలాశనః |
తత్ర రాజ్ఞశ్చతుర్భాగః ప్రజా ధర్మేణ రక్షతః ||

14

సోఽయం బ్రాహ్మణభూయిష్ఠో వానప్రస్థగణో మహాన్ |
త్వన్నాథోఽనాథవద్రామ రాక్షసైర్బాధ్యతే భృశమ్ ||

15

ఏహి పశ్య శరీరాణి మునీనాం భావితాత్మనామ్ |
హతానాం రాక్షసైర్ఘోరైర్బహూనాం బహుధా వనే ||

16

పంపానదీనివాసానామనుమందాకినీమపి |
చిత్రకూటాలయానాం చ క్రియతే కదనం మహత్ ||

17

ఏవం వయం న మృష్యామో విప్రకారం తపస్వినామ్ |
క్రియమాణం వనే ఘోరం రక్షోభిర్భీమకర్మభిః ||

18

తతస్త్వాం శరణార్థం చ శరణ్యం సముపస్థితాః |
పరిపాలయ నో రామ వధ్యమానాన్నిశాచరైః ||

19

పరా త్వత్తో గతిర్వీర పృథివ్యాం నోపపద్యతే |
పరిపాలయ నః సర్వాన్రాక్షసేభ్యో నృపాత్మజ ||

20

ఏతచ్ఛ్రుత్వా తు కాకుత్స్థస్తాపసానాం తపస్వినామ్ |
ఇదం ప్రోవాచ ధర్మాత్మా సర్వానేవ తపస్వినః ||

21

నైవమర్హథ మాం వక్తుమాజ్ఞప్తోఽహం తపస్వినామ్ |
కేవలేనాత్మకార్యేణ ప్రవేష్టవ్యం మయా వనమ్ ||

22

విప్రకారమపాక్రష్టుం రాక్షసైర్భవతామిమమ్ |
పితుస్తు నిర్దేశకరః ప్రవిష్టోఽహమిదం వనమ్ ||

23

భవతామర్థసిద్ధ్యర్థమాగతోఽహం యదృచ్ఛయా |
తస్య మేఽయం వనే వాసో భవిష్యతి మహాఫలః ||

24

తపస్వినాం రణే శత్రూన్హంతుమిచ్ఛామి రాక్షసాన్ |
పశ్యంతు వీర్యమృషయః సభ్రాతుర్మే తపోధనాః ||

25

దత్త్వాఽభయం చాపి తపోధనానాం
ధర్మే ధృతాత్మా సహ లక్ష్మణేన |
తపోధనైశ్చాపి సభాజ్యవృత్తః
సుతీక్ష్ణమేవాభిజగామ వీరః ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠః సర్గః ||

Aranya Kanda Sarga 6 Meaning In Telugu

ఆ ప్రకారంగా శరభంగ మహర్షి బ్రహ్మలోకము చేరుకున్నాడు. తరువాత ఆ వనములో నివసించుచున్న మునులు, ఋషులు అందరూ రాముని వద్దకు వచ్చారు. ఆ వచ్చిన వారిలో వైఖానసులు, వాలఖిల్యులు, సంప్రక్షాలులు, మరీచులు, మొదలగు మహాఋషులు అక్కడకు వచ్చారు. వారందరూ రాముని ఇలా అన్నాడు.

“ఓ రామా! నీవు ఇక్ష్వాకు వంశములో శ్రేష్ఠుడవు. దేవేంద్రుడు స్వర్గ లోకమును పాలించినట్టు నీవు ఈ భూమిని పాలిస్తున్నావు. నీవు సత్యమునే పలుకుతావు. అమితమైన పరాక్రమ వంతుడవు. పితృవాక్య పరిపాలన నీ ప్రధానధర్మము. నీకు తెలియని ధర్మము లేదు. అందుకని మీతో మా బాధలను చెప్పుకో దలిచాము. నీవు ఏమీ అనుకోవద్దు.

రాజధర్మము గురించి నీకు చెప్ప పనిలేదు. రాజు తన ప్రజల నుండి ఆరవ వంతు ఆదాయమును పన్నుగా తీసుకొని, దానికి ప్రతిగా ప్రజలకు అన్ని సౌకర్యములు కలిగించాలి. ప్రజలను రక్షించాలి. ఇదీ రాజధర్మము. తన పాలనలో ఉన్న ప్రజలందరినీ కన్న బిడ్డలవలె రక్షించే రాజు చిరకాలము రాజ్యము చేస్తాడు. మరణానంతరము అటువంటి రాజుకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. మేము మునులము. తాపసులము. మేము రాజుకు పన్నురూపంలో ఏమీ ఇచ్చుకోలేము. కాని మేము చేసే తపస్సులో నాలుగవ వంతు ఫలము రాజుకు దక్కుతుంది. కాబట్టి మమ్ములను రక్షించే బాధ్యత రాజువైన నీ మీద ఉన్నది.

ప్రస్తుతము మేము నివసించుచున్న ఈముని ఆశ్రమములన్నీ నీ పాలనలో ఉన్నాయి. నీ పాలనలో ఉండి కూడా మేము | అభద్రతా భావంతో బతుకుతున్నాము. మాకు ఎలాంటి రక్షణ, భద్రత లేదు. ఈ అరణ్యములో రాక్షసులు ఎక్కువగా ఉన్నారు. వారు ఎంతో మంది మునులను చంపారు. మాకు ఎన్నో బాధలను కలిగిస్తున్నారు. రామా! మాతో రా! ఆ చనిపోయిన మునుల శవములను మీకు చూపిస్తాము.

ఈ రాక్షసులు మందాకినీ నదీ ప్రాంతములోనూ, చిత్రకూట పర్వతప్రాంతములోనూ, పంపానదీ ప్రాంతములోనూ ఎక్కువగా తిరుగుతున్నారు. ఆ యా ప్రాంతములలో నివసించే మునులను చంపుతున్నారు. వారు పెట్టే బాధలకు అంతు లేదు. ఆ రాక్షసులు చేసే వినాశనమును ఇంక ఎంతమాత్రము మేము సహించలేకపోతున్నాము. నీవే మమ్ములను రక్షించాలి. మేమంతా నీ రక్షణ కోరుతున్నాము. ఆ రాక్షసుల చేతిలో మేము చావకుండా మమ్ములను కాపాడు రామా! ఎందుకంటే నిన్ను మించిన వీరుడు ఈ లోకంలో లేడు అని మా నమ్మకము. నీవే ఈ రాక్షస సంహారమునకు సమర్థుడవు.” అని పలువిధములుగా తమ బాధలు రామునితో విన్నవించుకున్నారు.

రాముడు ఆ మునుల మాటలను శ్రద్ధగా విన్నాడు. తరువాత రాముడు ఆ మునులకు నమస్కరించి ఇలా అన్నాడు.

“ఓ మహామునులారా! మీరు ఇంత దీనంగా నన్ను ప్రార్థించడం తగదు. మీరు నన్ను ఆజ్ఞాపించాలి కాని అర్థించకూడదు. మిమ్మల్ని రక్షించే అవకాశము నాకు కల్పించినందులకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ రాక్షసులు పెట్టే బాధల గురించి నేను వింటూనే ఉన్నాను. మీ బాధలు తీర్చడం రాజుగా నా కర్తవ్యం. బాధ్యత. అందుకే మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము నేను ఈ అరణ్యములో ప్రవేశించాను. రాక్షస సంహారంతో నా వనవాసమునకు గొప్ప ఫలము లభిస్తుంది. మీరింక నిర్ణయంగా తపస్సు చేసుకోండి. మీ రక్షణ బాధ్యత నేను వహిస్తాను.” అని రాముడు ఆ మునులకు అభయము ఇచ్చాడు.

తరువాత రాముడు, సీతతో, లక్ష్మణునితో కలిసి సుతీక్షుని ఆశ్రమమునకు వెళ్లాడు. రాముని వెంట కొంతమంది మునులు అనుసరించారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ సప్తమః సర్గః (7) >>

Ayodhya Kanda Sarga 57 In Telugu | అయోధ్యాకాండ సప్తపంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 57 In Telugu

అయోధ్యా కాండ సర్గ 57 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. గంగానదిని దాటడానికి రాముడు, సీత, లక్ష్మణుడు నావ ఎక్కిన తరువాత నావ గంగానదిలో సాగిపోయింది. తరువాత సుమంత్రుడు, గుహుడు చాలాసేపు రాముని వనవాసము గురించి మాట్లాడుకున్నారు. తరువాత సుమంత్రుడు రథము తోలుకుంటూ అయోధ్యకు వెళ్లాడు. గుహుడు తన మనుషులద్వారా రాముడు భరద్వాజ ఆశ్రమము చేరుకున్నాడని తెలుసుకున్నాడు.

సుమంత్రోపావర్తనమ్

కథయిత్వా సుదుఃఖార్తః సుమంత్రేణ చిరం సహ |
రామే దక్షిణకూలస్థే జగామ స్వగృహం గుహః ||

1

భరద్వాజాభిగమనం ప్రయాగే చ సహాసనమ్ |
ఆగిరేర్గమనం తేషాం తత్రస్థైరభిలక్షితమ్ ||

2

అనుజ్ఞాతః సుమంత్రోఽథ యోజయిత్వా హయోత్తమాన్ |
అయోధ్యామేవ నగరీం ప్రయయౌ గాఢదుర్మనాః ||

3

స వనాని సుగంధీని సరితశ్చ సరాంసి చ |
పశ్యన్నతియయౌ శీఘ్రం గ్రామాణి నగరాణి చ ||

4

తతః సాయాహ్న సమయే తృతీయేఽహని సారథిః |
అయోధ్యాం సమనుప్రాప్య నిరానందాం దదర్శ హ ||

5

స శూన్యామివ నిశ్శబ్దాం దృష్ట్వా పరమదుర్మనాః |
సుమంత్రశ్చింతయామాస శోకవేగసమాహతః ||

6

కచ్చిన్న సగజా సాశ్వా సజనా సజనాధిపా |
రామసంతాపదుఃఖేన దగ్ధా శోకాగ్నినా పురీ ||

7

ఇతి చింతాపరః సూతః వాజిభిః శ్రీఘ్రపాతిభిః |
నగరద్వారమాసాద్య త్వరితః ప్రవివేశ హ ||

8

సుమంత్రమభియాంతం తం శతశోఽథ సహస్రశః |
క్వ రామైతి పృచ్ఛంతః సూతమభ్యద్రవన్నరాః ||

9

తేషాం శశంస గంగాయామహమాపృచ్ఛ్య రాఘవమ్ |
అనుజ్ఞాతో నివృత్తోఽస్మి ధార్మికేణ మహాత్మనా ||

10

తే తీర్ణా ఇతి విజ్ఞాయ బాష్పపూర్ణముఖా జనాః |
అహో ధిగితి నిశ్వస్య హా రామేతి చ చుక్రుశుః ||

11

శుశ్రావ చ వచస్తేషాం బృందం బృందం చ తిష్ఠతామ్ |
హతాః స్మ ఖలు యే నేహ పశ్యామైతి రాఘవమ్ ||

12

దానయజ్ఞవివాహేషు సమాజేషు మహత్సు చ |
న ద్రక్ష్యామః పునర్జాతు ధార్మికం రామమంతరా ||

13

కిం సమర్థం జనస్యాస్య కిం ప్రియం కిం సుఖావహమ్ |
ఇతి రామేణ నగరం పితృవత్పరిపాలితమ్ ||

14

వాతాయనగతానాం చ స్త్రీణామన్వంతరాపణమ్ |
రామ శోకాభితప్తానాం శుశ్రావ పరిదేవనమ్ ||

15

స రాజమార్గమధ్యేన సుమంత్రః పిహితాననః |
యత్ర రాజా దశరథస్తదేవోపయయౌ గృహమ్ ||

16

సోఽవతీర్య రథాచ్ఛీఘ్రం రాజవేశ్మ ప్రవిశ్య చ |
కక్ష్యాః సప్తాభిచక్రామ మహా జన సమాకులాః ||

17

హర్మ్యైర్విమానైః ప్రాసాదైరవేక్ష్యాథ సమాగతమ్ |
హాహాకారకృతా నార్యో రామదర్శనకర్శితాః ||

18

ఆయతైర్విమలైర్నేత్రైః అశ్రువేగపరిప్లుతైః |
అన్యోన్యమభివీక్షంతేఽవ్యక్తమార్తతరాః స్త్రియః ||

19

తతో దశరథ స్త్రీణాం ప్రాసాదేభ్యస్తతస్తతః |
రామ శోకాభితప్తానాం మందం శుశ్రావ జల్పితమ్ ||

20

సహ రామేణ నిర్యాతః వినా రామమిహాగతః |
సూతః కిం నామ కౌసల్యాం శోచంతీం ప్రతివక్ష్యతి ||

21

యథా చ మన్యే దుర్జీవమేవం న సుకరం ధ్రువమ్ |
ఆచ్ఛిద్య పుత్రే నిర్యాతే కౌసల్యా యత్ర జీవతి ||

22

సత్యరూపం తు తద్వాక్యం రాజ్ఞః స్త్రీణాం నిశామయన్ |
ప్రదీప్తమివ శోకేన వివేశ సహసా గృహమ్ ||

23

స ప్రవిశ్యాష్టమీం కక్ష్యాం రాజానం దీనమాతురమ్ |
పుత్ర శోక పరిద్యూనమపశ్యత్ పాండరే గృహే ||

24

అభిగమ్య తమాసీనం నరేంద్రమభివాద్య చ |
సుమంత్రః రామవచనం యథోక్తం ప్రత్యవేదయత్ ||

26

స తూష్ణీమేవ తచ్ఛ్రుత్వా రాజా విభ్రాంతచేతనః |
మూర్ఛితో న్యపతద్భూమౌ రామ శోకాభిపీడితః ||

27

తతోఽంతః పురమావిద్ధం మూర్ఛితే పృథివీపతౌ |
ఉద్ధృత్య బాహూ చుక్రోశ నృపతౌ పతితే క్షితౌ ||

28

సుమిత్రయా తు సహితా కౌసల్యా పతితం పతిమ్ |
ఉత్థాపయామాస తదా వచనం చేదమబ్రవీత్ ||

29

ఇమం తస్య మహాభాగ దూతం దుష్కరకారిణః |
వనవాసాదనుప్రాప్తం కస్మాన్న ప్రతిభాషసే ||

30

అద్యేమమనయం కృత్వా వ్యపత్రపసి రాఘవ |
ఉత్తిష్ఠ సుకృతం తేఽస్తు శోకే న స్యాత్ సహాయతా ||

31

దేవ యస్యా భయాద్రామం నాతుపృచ్ఛసి సారథిమ్ |
నేహ తిష్ఠతి కైకేయీ విస్రబ్ధం ప్రతిభాష్యతామ్ ||

32

సా తథోక్త్వా మహారాజం కౌసల్యా శోకలాలసా |
ధరణ్యాం నిపపాతాశు బాష్ప విప్లుత భాషిణీ ||

33

ఏవం విలపతీం దృష్ట్వా కౌసల్యాం పతితాం భువి |
పతిం చావేక్ష్య తాః సర్వాః సుస్వరం రురుదుః స్త్రియః ||

34

తతస్తమంతః పుర నాదముత్థితమ్
సమీక్ష్య వృద్ధాస్తరుణాశ్చ మానవాః |
స్త్రియశ్చ సర్వా రురుదుః సమంతతః
పురం తదాసీత్ పునరేవ సంకులమ్ ||

35

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తపంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 57 Meaning In Telugu

గంగానదిని దాటడానికి రాముడు, సీత, లక్ష్మణుడు నావ ఎక్కిన తరువాత నావ గంగానదిలో సాగిపోయింది. తరువాత సుమంత్రుడు, గుహుడు చాలాసేపు రాముని వనవాసము గురించి మాట్లాడుకున్నారు. తరువాత సుమంత్రుడు రథము తోలుకుంటూ అయోధ్యకు వెళ్లాడు. గుహుడు తన మనుషులద్వారా రాముడు భరద్వాజ ఆశ్రమము చేరుకున్నాడని తెలుసుకున్నాడు.

సుమంత్రుడు తన రథమును అయోధ్యవైపు తీసుకొని వెళుతున్నాడు. మూడవ రోజు సాయంత్రానికి సుమంత్రుడు అయోధ్యకు చేరుకున్నాడు. అయోధ్య అంతా అంధకార బంధురంగా ఉంది. ఎవరి ఇంట్లోనూ దీపాలు వెలగటం లేదు. ఎప్పుడూ ఆనందోత్సాహాలతో కళకళలాడే అయోధ్య రాముని వియోగంతో విలవిలలాడిపోతోంది అని బాధపడ్డాడు సుమంత్రుడు. సుమంత్రుడు నగరప్రవేశము చేసాడు.

రాముని రథము చూచి పౌరులు గుంపులు గుంపులుగా సుమంత్రుని వెంట బడ్డారు. “రాముడు ఎక్కడ? రాముని ఎక్కడ వదిలి వచ్చావు?” అని ప్రశ్నల వర్షము కురిపిస్తున్నారు. సుమంత్రుడు రథము ఆపి వారితో ఇలా అన్నాడు. “నేనురాముని గంగానదిని దాటించి వచ్చాను. రాముని వద్దనుండి ఆజ్ఞతీసుకొని వచ్చాను.” అని బాధతో చెప్పాడు సుమంత్రుడు.

“రాముడు వనవాసమునకు వెళ్లిపోయాడా. రాముడు ఇంకమాకు కనపడడా” అనుకుంటూ వారు ఎవరి దారిన వారు వెళ్లారు.సుమంత్రుడు దశరథుని అంతఃపురమునకు వెళ్లాడు. అంత:పురములోని స్త్రీలు, రాముడు లేకుండా వంటరిగా వచ్చిన సుమంత్రుని చూచి విలపించారు. సుమంత్రుని చూచి దశరథుని భార్యలు తమలో తాము ఇలా అనుకుంటున్నారు.

“సుమంత్రుని చూచిన కౌసల్య “నా రాముడు ఏడీ” అనిఅడిగితే కౌపల్యకు ఏమి సమాధానము చెబుతాడు. కొడుకు కోడలు తనను విడిచి పెట్టి పోయినా కూడా కౌసల్య ఇంకా జీవించి ఉంటుందా! ఏమో ఆమె బతకడం చాలా కష్టము. ఏం జరుగుతుందో ఏమో!” అని తమలో తాము ఆందోళన చెందుతున్నారు.

ఆ మాటలన్నీవింటూ సుమంత్రుడు దశరథుని మందిరము వైపు వెళుతున్నాడు. సుమంత్రుడు దశరథుని చూచి రాముడు తనతో చెప్పమన్న మాటలు యథాతథంగా వినిపించాడు. రాముని మాటలు విన్న దశరథుడు మూర్ఛపోయాడు. అంతలో అంతఃపుర స్త్రీలు అందరూవచ్చి ఆయనకు ఉపచారములు చేసారు. ఇంతలో కౌసల్యసుమిత్ర అక్కడకు వచ్చారు. దశరథుని పట్టుకొని లేవదీసారు.

దశరథునితో కౌసల్య ఇలాఅంది.”మహారాజా! రాముని అడవిలో వదిలిపెట్టి రామసందేశమును తీసుకొని వచ్చిన సుమంత్రునితో మాట్లాడవేమి. మహారాజా! చెయ్యవలసినది అంతా చేసి ఇప్పుడు మాట్లాడ కుండా మౌనంగా ఉ ంటావెందుకు. ఎలాగైనా నీ మాట నిలబెట్టుకున్నావు. ఆడి తప్పని వాడివని పేరు ప్రతిష్ఠలు గడించావు. సత్యవాక్పరిపాలకుడవై పుణ్యం సంపాదించుకున్నావు. అది చాలులెండి. ఇక్కడ కైక లేదులెండి.

మీరు భయపడనవసరం లేదు. నిర్భయంగా సుమంత్రునిలో మాట్లా డ వచ్చును.” అని కౌసల్య పలికి ఆమెకు దుఃఖము ముంచుకురాగా కిందపడిపోయింది. కిందపడిపోయిన దశరథుని, కౌసల్యను చూచి దశరథుని భార్యలు ఏడుస్తున్నారు. వారి దుఃఖానికి అంతులేదు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబది ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అష్టపంచాశః సర్గః (58) >>

Ayodhya Kanda Sarga 79 In Telugu – అయోధ్యాకాండ ఏకోనాశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 79

అయోధ్యాకాండ ఏకోనాశీతితమః సర్గములో, భరతుడు చిత్తతో రాముడిని అనుసరించి అరణ్యానికి చేరుకున్నాడు. అతని వెంట సుమంతుడు, వశిష్టుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి తదితరులు ఉన్నారు. రాముడు తన తల్లి కౌసల్యను పలకరించి ఆశీర్వాదం అందుకున్నాడు. భరతుడు రాముని పాదాలను తాకి అయోధ్యకు తిరిగి రావాలని వేడుకున్నాడు. రాముడు తన పాదుకలను భరతునికి సమర్పించి, అవి ఆయుధాలుగా రాజ్యం పరిపాలించమని ఆదేశించాడు. భరతుడు పాదుకలను తీసుకొని, రాముడి ఆజ్ఞ ప్రకారం నందిగ్రామంలో ఉంటూ, రాముడి ప్రతినిధిగా రాజ్యపాలన చేయడానికి తిరిగి వెళ్ళాడు. భరతుడి త్యాగం, భక్తి, సోదర ప్రేమ ఈ సర్గలో స్పష్టంగా దర్శనమిస్తుంది.

సచివప్రార్థనాప్రతిషేధః

తతః ప్రభాతసమయే దివసే చ చతుర్దశే |
సమేత్య రాజకర్తారః భరతం వాక్యమబ్రువన్ || ౧ ||

గతర్దశరథః స్వర్గం యో నో గురుతరః గురుః |
రామం ప్రవ్రాజ్య వై జ్యేష్ఠం లక్ష్మణం చ మహాబలమ్ || ౨ ||

త్వమద్య భవ నో రాజా రాజపుత్ర మహాయశః |
సంగత్యా నాపరాధ్నోతి రాజ్యమేతదనాయకమ్ || ౩ ||

ఆభిషేచనికం సర్వమిదమాదాయ రాఘవ |
ప్రతీక్షతే త్వాం స్వజనః శ్రేణయశ్చ నృపాత్మజ || ౪ ||

రాజ్యం గృహాణ భరత పితృపైతామహం మహత్ |
అభిషేచయ చాత్మానం పాహి చాస్మాన్నరర్షభ || ౫ ||

[* ఏవముక్తః శుభం వాక్యం ద్యుతిమాన్ సత్య వాక్ఛుచిః |*]
ఆభిషేచనికం భాండం కృత్వా సర్వం ప్రదక్షిణమ్ |
భరతస్తం జనం సర్వం ప్రత్యువాచ ధృతవ్రతః || ౬ ||

జ్యేష్ఠస్య రాజతా నిత్యముచితా హి కులస్య నః |
నైవం భవంతః మాం వక్తుమర్హంతి కుశలా జనాః || ౭ ||

రామః పూర్వో హి నో భ్రాతా భవిష్యతి మహీపతిః |
అహం త్వరణ్యే వత్స్యామి వర్షాణి నవ పంచ చ || ౮ ||

యుజ్యతాం మహతీ సేనా చతురంగ మహాబలా |
ఆనయిష్యామ్యహం జ్యేష్ఠం భ్రాతరం రాఘవం వనాత్ || ౯ ||

ఆభిషేచనికం చైవ సర్వమేతదుపస్కృతమ్ |
పురః కృత్య గమిష్యామి రామహేతోర్వనం ప్రతి || ౧౦ ||

తత్రైవ తం నరవ్యాఘ్రమభిషిచ్య పురస్కృతమ్ |
ఆనేష్యామి తు వై రామం హవ్యవాహమివాధ్వరాత్ || ౧౧ ||

న సకామాం కరిష్యామి స్వామిమాం మాతృగంధినీమ్ |
వనే వత్స్యామ్యహం దుర్గే రామః రాజా భవిష్యతి || ౧౨ ||

క్రియతాం శిల్పిభిః పంథాః సమాని విషమాణి చ |
రక్షిణశ్చానుసంయాంతు పథి దుర్గ విచారకాః || ౧౩ ||

ఏవం సంభాషమాణం తం రామహేతోర్నృపాత్మజమ్ |
ప్రత్యువాచ జనస్సర్వః శ్రీమద్వాక్యమనుత్తమమ్ || ౧౪ ||

ఏవం తే భాషమాణస్య పద్మా శ్రీరుపతిష్ఠతామ్ |
యస్త్వం జ్యేష్ఠే నృపసుతే పృథివీం దాతుమిచ్ఛసి || ౧౫ ||

అనుత్తమం తద్వచనం నృపాత్మజ
ప్రభాషితం సంశ్రవణే నిశమ్య చ |
ప్రహర్షజాస్తం ప్రతి బాష్పబిందవో
నిపేతురార్యానననేత్ర సంభవాః || ౧౬ ||

ఊచుస్తే వచనమిదం నిశమ్య హృష్టాః
సామాత్యాః సపరిషదో వియాతశోకాః |
పంథానం నరవర భక్తిమాన్ జనశ్చ
వ్యాదిష్టాస్తవ వచనాచ్చ శిల్పివర్గః || ౧౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనాశీతితమః సర్గః || ౭౯ ||

Ayodhya Kanda Sarga 79 Meaning In Telugu

పదమూడవ రోజు అలాగడిచిపోయింది. పదునాలుగవ రోజున మంత్రులు పురోహితులు భరతుని వద్దకు వెళ్లారు. “కుమారా! భరతా! మన మహారాజు గారు మృతిచెందారు. పెద్దకుమారుడైన రాముడు తండ్రిమాట ప్రకారము అడవులకు వెళ్లాడు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేని రాజ్యములో అరాచకము చెలరేగుతుంది. అయోధ్య ప్రజలు ధర్మపరులు అందుకని అటువంటి ఉ పద్రవము చెలరేగలేదు. పట్టాభిషేకమునకు నీవు ఆలస్యము చేస్తే, దేశంలో అరాచకము చెలరేగే ప్రమాదము ఉంది. రాజప్రముఖులు, పురప్రముఖులూ పురోహితులూ పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు చేసుకొని నీ అనుమతి కోసరం ఎదురు చూస్తున్నారు. వంశపారపర్యముగా నీవే అయోధ్యకు మహారాజువు. కాబట్టి నీవు అయోధ్యకు రాజ్యాభిషిక్తుడవై మమ్ములను పాలించు.”అని అన్నాడు.

భరతుడు ఆలోచించాడు. వారితో ఇలా అన్నాడు. “మీకందరికీ రాజధర్మము బాగా తెలుసు. రాచరిక వ్యవస్థలో రాచకుటుంబము లోని పెద్దవాడు రాజ్యమునకు అర్హుడు. మహారాజు కుమారులలో పెద్దవాడు రాముడు. అందుకని రాముడే రాజ్యమునకు అర్హుడు. నేను కాదు. నన్ను పట్టాభిషేకము చేసుకోమనడం యుక్తము కాదు. కాబట్టి, రాముని రాజ్యాభిషిక్తుని చేద్దాము. రాముని బదులు నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చేస్తాను. అందుకని చతురంగ బలములు సిద్ధం చేయండి.

వెంటనే నేను రాముని ఉన్నచోటికి వెళ్లి ఆయనను ఒప్పించి అయోధ్యకు తీసుకొని వస్తాను. లేకపోతే రామునికి అక్కడే పట్టాభిషేకము జరిపించి అయోధ్యాధి పతిగా ఆయనను అయోధ్యకు తీసుకొని వస్తాను. ఎట్టి పరిస్థితులలో కూడా నా తల్లి కైక కోరిక తీరడానికి వీలులేదు. మా తల్లి కోరికకు భిన్నంగా జరగాలి. రాముడు రాజుకావాలి. నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చెయ్యాలి. కాబట్టి మన ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేయండి.” అని ఆదేశించాడు భరతుడ ఆయన మాటలకు అందరూ సంతోషంతో అంగీకరించారు. రాముని మీద భరతునికి ఉన్న అనురాగానికి, భక్తికి, అక్కడ ఉన్న వారికండ్ల వెంట ఆనందభాష్పాలు రాలాయి. “భరత కుమారా! తమరి ఆజ్ఞ ప్రకారము తమరి ప్రయాణమునకు అన్ని ఏర్పాట్లు చేస్తాము.” అని అన్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము డెబ్బది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అశీతితమః సర్గః (80) >>

Aranya Kanda Sarga 13 In Telugu – అరణ్యకాండ త్రయోదశః సర్గః

Aranya Kanda Sarga 13 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” త్రయోదశః సర్గలో, అజ్ఞాతవాసంలో ఉన్న రోజుల్లో నివాసం చేసుకోవడానికి అడవిలో ఒక స్థలాన్ని సూచించమని రాముడు అగస్త్య మహర్షిని అభ్యర్థిస్తాడు. అగస్త్య మహర్షి రామాయణం యొక్క తదుపరి కోర్సును ఊహించాడు మరియు స్త్రీత్వం మరియు సీత చుట్టూ తన సంభాషణను నడిపించాడు. అప్పుడు ఆ ఋషి పంచవటికి వెళ్లమని రాముడికి తెలియజేస్తాడు, అక్కడ సీత తన పరిసరాలను చూసి ముచ్చటగా ఉంటుంది.

పంచవటీగమనమ్

రామ ప్రీతోఽస్మి భద్రం తే పరితుష్టోఽస్మి లక్ష్మణ |
అభివాదయితుం యన్మాం ప్రాప్తౌ స్థః సహ సీతయా ||

1

అధ్వశ్రమేణ వాం ఖేదో బాధతే ప్రచురశ్రమః |
వ్యక్తముత్కంఠతే చాపి మైథిలీ జనకాత్మజా ||

2

ఏషా హి సుకుమారీ చ దుఃఖైశ్చ న విమానితా |
ప్రాజ్యదోషం వనం ప్రాప్తా భర్తృస్నేహప్రచోదితా ||

3

యథైషా రమతే రామ ఇహ సీతా తథా కురు |
దుష్కరం కృతవత్యేషా వనే త్వామనుగచ్ఛతీ ||

4

ఏషా హి ప్రకృతిః స్త్రీణామాసృష్టే రఘునందన |
సమస్థమనురజ్యంతి విషమస్థం త్యజ్యంతి చ ||

5

శతహ్రదానాం లోలత్వం శస్త్రాణాం తీక్ష్ణతాం తథా |
గరుడానిలయోః శైఘ్ర్యమనుగచ్ఛంతి యోషితః ||

6

ఇయం తు భవతో భార్యా దోషైరేతైర్వివర్జితా |
శ్లాఘ్యా చ వ్యపదేశ్యా చ యథా దేవీ హ్యరుంధతీ ||

7

అలంకృతోఽయం దేశశ్చ యత్ర సౌమిత్రిణా సహ |
వైదేహ్యా చానయా రామ వత్స్యసి త్వమరిందమ ||

8

ఏవముక్తః స మునినా రాఘవః సంయతాంజలిః |
ఉవాచ ప్రశ్రితం వాక్యమృషిం దీప్తమివానలమ్ ||

9

ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే మునిపుంగవః |
గుణైః సభ్రాతృభార్యస్య వరదః పరితుష్యతి ||

10

కిం తు వ్యాదిశ మే దేశం సోదకం బహుకాననమ్ |
యత్రాశ్రమపదం కృత్వా వసేయం నిరతః సుఖమ్ ||

11

తతోఽబ్రవీన్మునిశ్రేష్ఠః శ్రుత్వా రామస్య తద్వచః |
ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మా ధీరో ధీరతరం వచః ||

12

ఇతో ద్వియోజనే తాత బహుమూలఫలోదకః |
దేశో బహుమృగః శ్రీమాన్పంచవట్యభివిశ్రుతః ||

13

తత్ర గత్వాశ్రమపదం కృత్వా సౌమిత్రిణా సహ |
రంస్యసే త్వం పితుర్వాక్యం యథోక్తమనుపాలయన్ ||

14

కాలోఽయం గతభూయిష్ఠో యః కాలస్తవ రాఘవ |
సమయో యో నరేంద్రేణ కృతో దశరథేన తే ||

15

తీర్ణప్రతిజ్ఞః కాకుత్స్థ సుఖం రాజ్యే నివత్స్యసి |
ధన్యస్తే జనకో రామ స రాజా రఘునందన ||

16

యస్త్వయా జ్యేష్ఠపుత్రేణ యయాతిరివ తారితః |
విదితో హ్యేష వృత్తాంతో మమ సర్వస్తవానఘ ||

17

తపసశ్చ ప్రభావేన స్నేహాద్దశరథస్య చ |
హృదయస్థశ్చ తే ఛందో విజ్ఞాతస్తపసా మయా ||

18

ఇహ వాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే |
వసంతం త్వాం జనాః సర్వే జ్ఞాస్యంతి రఘునందన ||

19

అతశ్చ త్వామహం బ్రూమి గచ్ఛ పంచవటీమితి |
స హి రమ్యో వనోద్దేశో మైథిలీ తత్ర రంస్యతే ||

20

స దేశః శ్లాఘనీయశ్చ నాతిదూరే చ రాఘవ |
గోదావర్యాః సమీపే చ మైథిలీ తత్ర రంస్యతే ||

21

ప్రాజ్యమూలఫలశ్చైవ నానాద్విజగణాయుతః |
వివిక్తశ్చ మహాబాహో పుణ్యో రమ్యస్తథైవ చ ||

22

భవానపి సదారశ్చ శక్తశ్చ పరిరక్షణే |
అపి చాత్ర వసన్రామ తాపసాన్పాలయిష్యసి ||

23

ఏతదాలక్ష్యతే వీర మధూకానాం మహద్వనమ్ |
ఉత్తరేణాస్య గంతవ్యం న్యగ్రోధమభిగచ్ఛతా ||

24

తతః స్థలముపారుహ్య పర్వతస్యావిదూరతః |
ఖ్యాతః పంచవటీత్యేవ నిత్యపుష్పితకాననః ||

25

అగస్త్యేనైవముక్తస్తు రామః సౌమిత్రిణా సహ |
సత్కృత్యామంత్రయామాస తమృషిం సత్యవాదినమ్ ||

26

తౌ తు తేనాభ్యనుజ్ఞాతౌ కృతపాదాభివందనౌ |
తదాశ్రమాత్పంచవటీం జగ్మతుః సహ సీతయా ||

27

గృహీతచాపౌ తు నరాధిపాత్మజౌ
విషక్తతూణౌ సమరేష్వకాతరౌ |
యథోపదిష్టేన పథా మహర్షిణా
ప్రజగ్మతుః పంచవటీం సమాహితౌ ||

28

అగస్యుడు రామునికి ఆయుధములను ఇచ్చిన తరువాత ఇలా అన్నాడు.

“ఓ రామా! మీరు నన్ను చూడటానికి ఇంత దూరము వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా దూరము ప్రయాణము చేసి వచ్చారు. సుకుమారి అయిన సీత బాగా అలసి పోయినట్టు కనపడుతూ ఉంది. తండ్రి ఆదేశము ప్రకారము వనములకు వచ్చిన నీతో పాటు అనుసరించి వచ్చిన నీభార్య సీత ఇప్పటికి ఎవ్వరూ చేయని మహత్తరమైన పని చేసింది. కాబట్టి ఆమె కష్టపడకుండా చూడవలసిన బాధ్యత నీది.

సాధారణంగా స్త్రీలు సుఖములలో భర్తను వదలకుండా అంటిపెట్టుకొని ఉంటారు. కష్టకాలములో భర్తను వదిలివేస్తారు. ఈ సృష్టి మొదలైనప్పటి నుండి అది స్త్రీ నైజము. ఇంకా స్త్రీల గురించి చెప్పాలంటే వారు మెరుపుల మాదిరి చంచల స్వభావులు. వాడియైన కత్తి మాదిరి చాలా తీక్షణంగా ఉంటారు. గరుడుని మాదిరి వేగంగా ఆలోచిస్తారు.

కానీ నీ భార్య సీతలో ఈ దోషములు ఏవీ లేవు. సీత శాంత స్వభావురాలు. ఉత్తమ పతివ్రత. అందుకే నిన్ను అనుసరించి అడవులకు వచ్చి నీతోపాటు కష్టములు పడుతూ ఉంది. ఓ రామా! నీవు, సీత, లక్ష్మణుడు ఎక్కడ ఉంటారో అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.” అని వారిని శ్లాఘించాడు అగస్త్యుడు.

అగస్యుడు పలికిన మాటలు విన్న రాముడు వినయంగా ఇలా అన్నాడు. “నా గురించి, నా భార్య గురించి, నా తమ్ముని గురించి తమరు నాలుగు మంచి మాటలు చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అనుగ్రహానికి పాత్రుడను అయ్యాను. నేను ఈ అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడ నా వనవాస కాలమును గడపదలచుకున్నాను. దానికి అనువైన ప్రదేశమును మీరు సూచించండి.” అని అడిగాడు రాముడు.

“రామా! ఇక్కడికి రెండు యోజనముల దూరంలో పంచవటి అనే ప్రదేశము ఉంది. అక్కడ ఫలములు, కందమూలములు, నిర్మలమైన జలము సమృద్ధిగా లభిస్తుంది. నీవు పంచవటిలో ఒక ఆశ్రమమును నిర్మించుకొని అక్కడ నీ వనవాసకాలమును గడపవచ్చును. నీకు ఇప్పటికే వనవాసకాలము చాలావరకు గడిచిపోయింది. కొద్దికాలము మాత్రమే మిగిలి ఉంది. ఆ కొద్ది కాలము కూడా పూర్తి చేసి, నీవు నీ తండ్రిమాట నిలబెట్టు. ఆయనను తరింపజెయ్యి.

అసలు నిన్ను ఇక్కడే ఉందామనుకున్నాను. కాని ఒంటరిగా ఉండాలి అన్న నీ మనసులో మాట తెలుసుకొని నిన్ను పంచవటికి పంపుతున్నాను. పంచవటి ఇక్కడకు ఎంతో దూరంలో లేదు. కాబట్టి నీవు ఇక్కడ ఉన్నట్టే పంచవటిలో ఉండవచ్చును. పంచవటి సమీపములో గోదావరీ నది ప్రవహిస్తూ ఉంది. అక్కడ జనసంచారము అంతగా ఉండదు. నీవు ప్రశాంతముగా అక్కడ ఉండవచ్చును.

అటు చూడు. అక్కడ ఒక మధూక చెట్ల వనము కనపడుతూ ఉంది. ఆ మధూక వనమునకు ఉత్తరంగా వెళ్లండి. మీరు ఒక ఎత్తు అయిన ప్రదేశము చేరుకుంటారు. అక్కడి నుండి చూస్తే మీకు పంచవటి కనిపిస్తూ ఉంటుంది.” అని పంచవటికి పోవు మార్గము చెప్పాడు అగస్త్యుడు.

రామలక్ష్మణులు, సీత అగస్త్యునికి నమస్కరించి ఆయన వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. అక్కడి నుండి పంచవటికి బయలుదేరారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ చతుర్దశః సర్గః (14) >>

Sri Ramadasu Keerthanalu 31- 40 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

శ్రీ రామదాసు కీర్తనలు - Sri Ramadasu Keerthanalu కీర్తన: 31-40

Sri Ramadasu Keerthanalu 31- 40 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

31. అసావేరి రూపకతాళం

పల్లవి : ఆవుమీ హమర బాద్దిటికి చల్ మీ
గోల్కొండకు చల్ మీ అరే లేపు మీ
అంటే యేమోయోచించేవు మీ అరే అరే ఉటో ఉటోచల్

|| ఆవుమీ||

తివాసిదిండటిక్కా నేడుదిగూ నవాబు హుకుమిదిచూడు.
జవాబు మాతోసరిగా నేడు చెప్పి నీవు మానము కాపాడు

|| ఆవుమీ||

అవురంగ బాదుతఖత్తులోన అనేక తహసీల్దార్లున్నారు
వారిపై నున్న ఏమో నీపై బాకీశానా

|| ఆవుమీ||

నిముషమైనా నిలువనీయము నిలువలన్ని ఝటా పైకము
చేకొనుము వేగమే యిపుడు చేర్చందు చేసుకొందుముచూడు

||ఆవుమీ||

ఆవు లే కానీ యీ సీమకధికారైన వేరువాము
మీదొక భద్రాద్రి శ్రీరామదాసుడని తాళలేముసుమ్మి

|| ఆవుమీ||

32. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి : ఆనందమానందమాయెను శ్రీజానకిరామస్మరణచేయును
నేడార్యుల కృప మాకుగల్గెను ఇప్పుడిరువ దేడింటనున్న రాజును జూడగానే

||ఆనంద॥

పరమభక్తి శ్రద్ధగల్గెను బహుదురితజాలములెల్ల దొలగెను
పలురాగద్వేషమువల్ల వీడెఅట్టె రాజయోగమందున్న పరమాత్మ జూడగనే

||ఆనంద॥

పూర్వపుణ్యములొనగూడెను శ్రీపార్వతి జపమంత్రమీడేరెను
పూర్వకృతంబు కనబడేను పరమపావనమైన శ్రీహరి సేవ గల్గెనేడు

||ఆనంద॥

సామాన్యులచెంత చేరము వట్టిపామర జనులనింక గూడము
విషయ కామములజేరి వేడము
మాకు హరినామస్మరణజేయు పరమభాగవతులు దిక్కు

॥ఆనంద॥

రామభక్తుల జేరగల్గెను ఇతర కామముల్లను వీడగల్గెను
పరభామలపైన భ్రాంతి దొలగెను మేము నరులదోషము లెన్న మొరులకు నెదురాడము

॥ఆనంద॥

ఇతర చింతలు చేయమువేరే ఇతరదైవమును గొలిచియాడము
ధరాపతులకు మ్రొక్కింతలు చేయము ఇనకులచంద్రుడైన
భద్రాద్రిస్వామి మాదుదైవము పేరు
క్షుద్రదేవతలను దలపము దారిద్ర్యములనెల్లమది నెంచము
భద్రగిరి రామదాసు నేలిన పరమదయాళుడు గల్గె

॥ఆనంద॥

33. కాంభోజి చాపుతాళం

పల్లవి :ఆనబెట్టితినని ఆయాసపడవద్దు రామచంద్ర
నాపామరత్వముచేత బ్రతిమాలికొనియెద రామచంద్ర

॥ఆన॥

తామసింపక యిత్తరి నన్ను కృపజూడు రామచంద్ర
తడియక మీ తల్లి దండ్రియాన తీరు రామచంద్ర

॥ఆన॥

సేవకునిగా జేసి చేయిబట్టి రక్షింపు రామచంద్ర
చెలువుగ సీతాదేవి యానతీరు రామచంద్ర

॥ఆన॥

కోరిక దయచేసి కొదవలు దీర్చుమో రామచంద్ర
కొమరొప్ప మీ కులగురువాయుదీరు రామచంద్ర

॥ఆన॥

నెనరుంచి నామీద నిరతము బ్రోవుము రామచంద్ర
వినయమిగా సౌమిత్రి యానతీరు రామచంద్ర

॥ఆన॥

వేడుకమీరగ వేగరక్షింపుమి రామచంద్ర
జోడుగ భరత శత్రుఘ్ను లానతీరు రామచంద్ర

॥ఆన॥

జంటగ మీ వెంట బంటుగ నేలుము రామచంద్ర
తంటలేని మీయింటి యానతీరు రామచంద్ర

॥ఆన॥

ఆదరింపుము నన్ను అడియేన్ దాసుడ రామచంద్ర
వాడేల రామదాసుని బ్రోవుమిక రామచంద్ర

॥ఆన॥

34. ఆనందభైరవి ఏకతాళం

పల్లవి : ఆశపుట్టె శ్రీరాములతో ఆహా నే పుట్టనైతి
రఘురాములతో నే పుట్టనైతి
శ్రీరాములతో బుట్టి సేవలు సేయగనైతిని
దశరథనందుడై దాశరథి రాముల వశముగ బాలురతో
వరదుడై యాడగ వనజనాభునకు దాసుడనై నే భయభక్తితోడ

॥ఆశ॥

సకల సేవలుసల్పుచుమురియును అకటనలుగురితోనాడుకొనుదుగద
అయోధ్యాపురిలో గజమునెక్కి అత్యుతుండు రాగాను నాట్యమాడుచు
నన్ను రక్షింపుమంచును విశ్వామిత్రుని వెంటపోగా నేనునుపోదును జనకుడు హరికి

॥ఆశ॥

జానకిని పెండ్లాడగ వారిద్దరికి నే శేషబియ్యము నిత్తును
అమ్మవారికి ఆకులమడచి యిత్తును నరులార యితడే నారాయణుడని చాటుదును

॥ఆశ॥

మనలను రక్షించే మాధవుడు వచ్చేనందును మన గతి యేమందు
ప్రభు దశరథునే బతిమాలుదుగద కైకేయిని నే గాదనందుగద
రామునికైన రాజ్యమిత్తుగద ప్రభవయి యేలగ నేనొనర్తు గద
అడవికి బోవ నంటిపోదుగద గుహునితో గూడుక కూడి మురియుదుగద

॥ఆశ॥

నిల్చి దానవుల నెత్తి గొట్టుదుగద కరయుద్ధంబున గౌగలింతుగద
కనకమృగమును రామకాంత తెమ్మంటె ఓ నిర్దయులార అయ్యోనే పోయి
ఆ మృగమును దెచ్చి అమ్మకిత్తుగద హరిని నేనుపోవదందునుగద
ఈ మృగమువెంట, దశముఖు డంతట తపోవేషమున
దశముఖు తన శౌర్యముజూపగ జానకి వణకగ ఆ రావణుడు సీతమ్మను చెరపట్టగ
అప్పుడు నేనుంటే అమ్మ కభయ మిత్తును

॥ఆశ॥

ఆ శ్రీపాదములునట్టే పట్టుకనే మ్రొక్కుదును
హరి దుఃఖింపగ అమ్మడ దెత్తును
సర్వజ్ఞమూర్తి చాలు నీ విరహమందును
విశ్వములో నందరు విన నట్లూరకుండిరీ
సురవరులందరు సుఖంబుగ జూచుచుండిరి.
అయ్యో యిదేమని ఆ బ్రహ్మాదుల శపింతునుగద

॥ఆశ॥

మిత్రవంశునకు నేనేమి చేయుదు నేనెవ్వరివేడుదు
ఏమరియుండిరీ మానినులందరు ఏలపోయెనో యాక్షీరాబ్ధికి
ఏల దశరథుడు యజ్ఞము చేసెను ఎందుకు బుట్టిరియీ లోకమునను
ఎందుకు వచ్చిరి యీవనమునకును ఇట్టి వరములనేలవేడిరి
ఎక్కడ నోపుదు యింతటి జాలి

॥ఆశ॥

పంపాతీరమున పరిమార్చి కబంథుని
ఇంపుగ శబరివిందులు యిష్టములోజేసి
ఇంద్రసూనుని హతముగావించి ఆంజనేయాంగదముఖ్యాదులు
మంజులవాణిని మరువక వెతకగ వారలతోగూడి వెడుదుగద
వైదేహిని ప్రేమతో సహాయముగా రమ్ము
సముద్రము నే చౌకళించి వేగ దుముకుదును
లంకను గాలించి పంకజాక్షిని నే సేవింతును
సంపాతి పోకముందు

॥ఆశ॥

అంగుళీయకమిచ్చి అమ్మా హరి యిచ్చెనందును
ఆవృత్తాంతము హరికినే విన్న వింతును
జానకిరామ జాగేల రమ్మందును అపరాధిని నేనని వారికి వాహనము
ఆంజనేయుడు ఆ లక్ష్మణునకు అంగదడా
ప్రభు రాములనే ప్రార్థించెదను గద సేనలగూడుక చెండాడు

॥ఆశ॥

కపులచే వారధి గట్టింతుగద సముద్రుడా యిది సమయమందు
గద హరిసేనతో పనులాచరింతుగద వలీముఖులకుగల బలము
జూతుగద శుభరామునితో సొంపు నొందుగద

॥ఆశ॥

లక్ష్మణాగ్రజుడు సేననురావించి లక్ష్మికొరకు కపి లంక జుటంగ
రక్షించు భద్రాద్రివాసుడనై రణములో రావణుని ద్రుంతును
మాధవుకర్పించి మురియుదును అమ్మకు మారుగ అగ్నిలో జొత్తును

॥ఆశ॥

పుష్పకమెక్కి హరితో నయోధ్యకు బోదును
భరతుడానంద భరితుడై వేడుకొనగ
జోరున వాద్యములు భువనములు నిండి మ్రోయగ
పట్టాభిషేకము పరమఋషులు సేవింపగ
జలజాక్షులు జయములు పాడంగ రాములతొడపై లక్ష్మియుండగ
లక్ష్మణానుజులు వింజామర విసరగా వాయుసుతుడు పద వనజము లొత్తగా
జేరి విభీషణ మహాత్మయనగా అర్థికపులు హరిగోవిందయనగ
బ్రహ్మాదులు హరి ప్రస్తుతింపగా తల్లిమారుతికి దండవేయగా
నా తల్లియపుడు నాకును వేయునుగద కష్టపడితినని కరుణించుగద
సీతారాములు సిరులిత్తురుగద

॥ఆశ॥

35. వరాళి రూపకతాళం

పల్లవి :ఇదిగో రండి పైకము చూడండి
దినిటీ వేయించండి తివాసులు పరిపించండి.
రవాణ ధనములు కన్నుల జూచి
రశీదు మాకు వ్రాసియివ్వండి
పండ్రేండ్లాయెమీరు బందిఖానాలోన నుంచీ
పాపమనక రామదాసుని బాధించుచున్నావు చాలు

||ఇదిగో||

పారనలేని దొరతనమట పాలించుచుండి
మీరేప్పుడూ చెల్లి చెలకలున్నను ప్రొద్దున చెల్లగట్టి పోయెదముగాని

||ఇదిగో||

రామదాసుని తల్లిదండ్రులు రయమున తనయునిగనుగొని
క్షేమమరసిపోవగ వచ్చితి మీక్షణమాలస్యము చేయుటతగదిక

||ఇదిగో||

36. కల్యాణి చాపుతాళం

పల్లవి : ఇన్ని గల్గి మీరూరకున్న నేనెవరినాడ నౌదు
కన్నతండ్రివలె రక్షించుటకును కరుణ యేలరాదు
అక్షయ మియ్యదలచిన శ్రీ మహలక్ష్మీదేవి లేదా
రక్షింప దయగలిగిన భూదేవియు రత్నగర్భగాదా

||ఇన్ని||

పక్షపాతమొదలి పని చేతిలో పరుసవేది లేదా
ఈ తక్షణమున దయగలిగిన సంచిత ధనమున్నదిగాదా

||ఇన్ని||

ననుగని నిర్హేతుక కృపజూచిన కల్పతరువు లేదా
మనవాడని నెనరుంచిన చింతామణి యున్నది గాదా

||ఇన్ని||

పెనబడు వెతదీర్పును శరణాగతి బిరుదు నీదేగదా
వనజ భవాండము లేలు దొరలు దేవరవారలెగదా

||ఇన్ని||

కరిప్రహ్లాద విభీషణాదులను కాచితివని వింటి
హరసుర బ్రహ్మాదుల కంటెను నిను నధికుడవనియంటి

||ఇన్ని||

రామసిరిదాయక నీ మరుగుజొచ్చితిని చేపట్టు మటంటి
కరుణతో భద్రాచల రామదాసుని గావుము యనియంటి

||ఇన్ని||

37. వరాళి రూపకతాళం

పల్లవి : ఎంతో మహానుభావుడవు నీవు
ఎంతో చక్కని దేవుడవు
వింతను చేసితి నీ లోకమందున
సంతత భద్రాద్రిస్వామి రామచంద్ర

||ఎంతో||

తొలివేల్పు జాంబవంతుని చేసినావు
మలివేల్పు పవనజుగా జేసినావు
వెలయ సూర్యు సుగ్రీవుగ జేసినావు
ఇల సర్వామరుల కోతుల జేసినావు

||ఎంతో||

కారణ శ్రీ సీతగ జేసినావు
గరిమ శేషుని లక్ష్మణుని జేసినావు
ఆరెంటిని భరతశత్రుఘ్నుల జేసినావు
నారాయణ నీవు నరుడవైనావు

||ఎంతో||

రాతికి ప్రాణము రప్పించినావు
నాతి ఎంగిలి కానందించినావు
కోతి మూకలనెల్ల గొలిపించినావు
నీటిపై కొండలు నిల్పించినావు

||ఎంతో||

లంకపై దండెత్తి లగ్గెక్కినావు
రావణకుంభకర్ణుల ద్రుంచినావు
పంకజాక్షిని సీత పాలించినావు
లంకేశు దివ్యపుష్క మెక్కినావు

||ఎంతో||

పరగ నమోధ్యకు బరతెంచినావు
పట్టాభిషిక్తుడవై పాలించినావు
వర భద్రగిరి యందు వసియించినావు
ధరను రామదాసు దయ నేలినావు

||ఎంతో||

38. ఆనందభైరవి చాపుతాళం

పల్లవి :ఎటుబోతివో రామ ఎటుబోతివో
ఎటుబోతివో నిన్ను నే వేడు కొనుచుంటి
గటకటా నేడు నా కనుల జూతామంటే

||ఎటు||

అంధకారమువంటి బంధిఖానాలో
నన్ను నిందల నెడబాపనేల నీకు మ్రొక్కెదస్వామీ

||ఎటు||

పాపము లన్ని యెడబాపెడి దొరవు నీవు
ఆపదలుదీర్చి నన్నాదుకొమ్మంటీ స్వామీ

||ఎటు||

తాసీషాగారు వచ్చి సరితీర్పు చేరుదును
పైకము బంపించి వేగ బంధిఖానా వదిలింప

||ఎటు||

అపరాధినని చాల మతిచేసి మొరలిడగ
వెనుకటి నేరము లెంచక వేగమె రావే

||ఎటు||

అప్పుల వారొచ్చి యరికట్టుచున్నారు
ఒప్పుకోబడునని చెప్పక దాగినావె

||ఎటు||

నీవు భద్రాచల నిలయుడవయ్య రామ
బ్రోవవయ్య రామదాసు నేయెడ స్వామీ

||ఎటు||

39. వరాళి చాపుతాళం

పల్లవి : ఎన్నెన్ని జన్మము లెత్తవలయునో యేలాగు తాళుదును ఓరామా
నన్నింత కన్నడ జేయుట నీకు న్యాయము కాదు సుమీ ఓ రామా

॥ఎన్నెన్ని॥

మొదటి నిబంధనము సగమాయువు నిదురపాలై పోయెనుగా ఓ రామా
పదపడి తక్కిన సగములో పదియేండ్లు బాలత్వమున బోయెనుగా ఓ రామా

॥ఎన్నెన్ని॥

వదలక యౌవనము పరాభావమువలన దగులనాయెనా ఓ రామా
రాముడిమి సంసారకూపములో జిక్కి మునిగి తేలగనాయేనా ఓ రామా

॥ఎన్నెన్ని॥

తను వస్థిరంబని తారకనామము తలపోయలేనైతిగా ఓ రామా
దినదినము పొట్టకొరకై దీనులవేన దీనత్వమొందితిగా ఓ రామా

॥ఎన్నెన్ని॥

అనుదినమును గురువుపదేశయోగము నభ్యసించనైతిగా
ఎనసి నిమిషమైన మీ పాదములపైన మనసు నిల్పగనైతిగా ఓ రామా

॥ఎన్నెన్ని॥

వాసిగ నిహములో బడిన పాటునెల్ల బాసిన పాశముగా ఓ రామా
మీ సేవజేయు మిమ్మే నమ్మిన భవపాపములంటవుగా ఓ రామా

॥ఎన్నెన్ని॥

లేశమైన కృతజేసి భద్రశైలవాస కావగా రావుగా ఓ రామా
ఆశతోనే రామదాసుడని మీకు దోసిలి యొగ్గితిరా ఓ రామా

॥ఎన్నెన్ని॥

40. బిలహరి ఆదితాళం

పల్లవి : ఎవరు దూషించిన నేమి మరి ఎవరు భూషించిన నేమి
అపగుణము మాన్పి యార్చే రా తీర్చే రా
నవనీతచోరుడు నారాయణుడుండగ

॥ఎవరు॥

పిమ్మట నాడిననేమి మంచి ప్రియములు పలికిన నేమి
కొమ్మరో రమ్మని కోరికలొసగెడి సమ్మతి నాపాలి సర్వేశ్వరుడుండగ

॥ఎవరు॥

వాని పంతము మాకేల వట్టివాదులతోడ పోరేల
భాషించువారితో పలుమారు పొందేల కాచి రక్షించెడి ఘనుడు రాముడు

॥ఎవరు॥

అపరాధముల నెంచువారు మాకు ఉపకారులై యున్నారు.
విపరీత చరితలు వినుచు నెల్లపుడు కపటనాటకధారి కనిపెట్టి యుండగ

॥ఎవరు॥

వారి వన్నెలు సల్పనేల మూడు వాసనలకు భ్రమయనేల
వాసిగ భద్రాద్రివాసుడై నిరతము భాసురముగ రామదాసుడై యుండగ

॥ఎవరు॥

మరిన్ని కీర్తనలు:

  1. కన్నడ ఆదితాళం
  2. సావేరి చాపుతాళం
  3. మోహన ఆదితాళం
  4. ఆనందభైరవి రూపకతాళం
  5. కళ్యాణి ఆదితాళం
  6. నాదనామక్రియ రూపకతాళం
  7. మాయామాళవగౌళ ఏకతాళం
  8. నాదనామక్రియ ఆదితాళం
  9. కాంభోజి ఆదితాళం
  10. మధ్యమావతి చాపుతాళం
  11. మోహన ఆదితాళం