మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం గురించి తెలుసుకుందాం…
శ్రీ ప్రణవ స్తోత్రమ్
(రఘుపతి రాఘవ రాజారాం…. అనే బాణీలో పాడుకోవచ్చును)
1. అనంత గుణగణ భూషిత
ఓమ్
(పరమేశ్వరుడు అనంత గుణములతో అలంకరింపబడినవాడు)
2. శుద్ధ బ్రహ్మ పరాత్పర
ఓమ్
(శుద్ధుడు. అందరికంటె గొప్పవాడు. పెద్దవాడు)
3. సబల బ్రహ్మ సునామక
ఓమ్
(బలవంతుడు. బ్రహ్మయను సుందర నామము కలవాడు)
4. కాలాత్మక పరమేశ్వర
ఓమ్
(కాలమును నియమించువాడు. గొప్ప ఐశ్వర్యవంతుడు)
5. ప్రళయానంతర సుస్థిత
ఓమ్
(ప్రళయంలోను తరువాత ఉండువాడు)
6. ఈక్షిత సృష్టి విధాయక
ఓమ్
(కనబడుచున్న ఈ సృష్టిని చేయువాడు)
7. వ్యాపక యజ్ఞ ప్రసారక
ఓమ్
(సృష్టియను యజ్ఞమును అంతటా విస్తరింపజేయువాడు)
8. లోకాఖిల గతిదాయక
ఓమ్
(లోకాలన్నింటిని త్రిప్పువాడు)
9. జగన్నియంతా పాలక
ఓమ్
(జగత్తును నియమముగా పాలించువాడు)
10. జనతా దుఃఖ ప్రభంజక
ఓమ్
(ప్రజల దుఃఖములను తొలగించువాడు)
11. భక్తప్రియ సుఖదాయక
ఓమ్
(భక్తులను ప్రేమించి సుఖముల నిచ్చువాడు)
12. సూర్యాదిక ద్యుతి ధారక
ఓమ్
(సూర్యాది నక్షత్రములకు ప్రకాశమునిచ్చువాడు)
13. పరమసహాయక ప్రియవర
ఓమ్
(గొప్ప సహాయకుడు. ప్రియుడు. శ్రేష్ఠుడు)
14. నిత్య తృప్త సర్వాశ్రయ
ఓమ్
(జీవులను తృప్తిపరిచే సృష్టికి ఆశ్రయము)
అనంత గుణ గణ భూషిత
ఓమ్
శుద్ధబ్రహ్మ పరాత్పర
ఓమ్
15. జ్ఞానరూప సత్ప్రేరక
ఓమ్
(సత్యజ్ఞానమును ప్రేరేపించువాడు)
16. సకల ద్రవ్య వ్యాపక
ఓమ్
(సృష్టిలోని పదార్థాలన్నింటిలో వ్యాపించియున్నవాడు)
17. శ్రోత్రా దీంద్రియ శక్తిద
ఓమ్
(జ్ఞాన కర్మేంద్రియాలకు శక్తినిచ్చువాడు)
18. కర్మాశ్రిత ఫలదాయక
ఓమ్
(జీవులు చేయు కర్మలకు ఫలము నిచ్చువాడు)
19. అద్భుత తేజో బలయుత
ఓమ్
(అద్భుతమైన తేజస్సు బలములు కలవాడు)
20. శ్రేయః ప్రాప్తి సుసాధక
ఓమ్
(మోక్షప్రాప్తికి సాధనము)
21. హర్షిత మతి సందాయక
ఓమ్
(సుఖములనిచ్చు బుద్ధిని ప్రసాదించువాడు)
22. మాతృప్రేమ పరిపోషక
ఓమ్
(తల్లి ప్రేమతో అందరిని పెంచువాడు)
23. స్నేహా త పితృపాలక
ఓమ్
(స్నేహంతో దయతో తండ్రివలె పోషించువాడు)
24. వ్యాహృతి లోక విభాజక
ఓమ్
(విస్తారమైన సృష్టిని లోకాలుగా విభజించువాడు)
25. సకల బుద్ధి సిద్ధిప్రద
ఓమ్
(సకల జ్ఞానము నిచ్చువాడు)
26. వేద చతుష్టయ దాయక
ఓమ్
(ఋగ్, యజుస్, సామ, అథర్వ వేదాల నిచ్చువాడు)
అనంత గుణ గణ భూషిత
ఓమ్
శుద్ధబ్రహ్మ పరాత్పర
ఓమ్
27. అగ్న్యాధిక ఋషి పూజిత
ఓమ్
(అగ్ని వాయు ఆదిత్య అంగిరసులను ఆది ఋషులచే పూజింపబడువాడు)
28. సాధన సాధ్య సముచ్చయ
ఓమ్
(సాధ్యమునకు తగిన సాధనములను సమకూర్చువాడు.
(మోక్షమునకు – యోగమును)
29. ప్రాణదక్ష సందాయక
ఓమ్
(జీవులకు ప్రాణముల నిచ్చువాడు)
30.ఇంద్ర బృహస్పతి నామక
ఓమ్
(ఇంద్రుడు, బృహస్పతి మున్నగు పేర్లతో పిలువబడువాడు)
31. ఋతుపరివర్తన కారణ
ఓమ్
(వసంతాది ఆఱు ఋతువులను కల్పించువాడు)
32. ఋతుమూలక హిత దాయక
ఓమ్
(ఋతువుల ద్వారా జీవులకు మేలు చేయువాడు)
33. జ్ఞాన సూర్య విస్తారక
ఓమ్
(జ్ఞానమనే సూర్యుని మానవులలో ప్రకాశింపజేయువాడు)
34. సుర సంపూజిత సురవర
ఓమ్
(దేవతలు పూజించే శ్రేష్ఠుడు – అధిదేవుడు)
35. సత్సంకల్ప ప్రపూరక
ఓమ్
(సత్యసంకల్పములను నెరవేర్చువాడు)
36. ధర్మాధర్మ సుశిక్షక
ఓమ్
(ధర్మము – అధర్మములను వేదముద్వారా బోధించువాడు)
37. జన్మరహిత జన్మప్రద
ఓమ్
(తాను శరీరమును ధరించక జీవులకు శరీరముల నిచ్చువాడు)
38. దేవాధిక ఋణమోచక
ఓమ్
(విద్వాంసులను ఋణములనుండి విడిపించువాడు)
అనంత గుణగణ భూషిత
ఓమ్
శుద్ధ బ్రహ్మ పరాత్పర
ఓమ్
39. క్లేశ విముక్త విశేషణ
ఓమ్
(కష్టములు లేని పురుష విశేషుడు)
40. స్నాయు రహిత సుఖపూరక
ఓమ్
(నాడీ బంధనములు లేనివాడు. జీవులలో సుఖమును నింపువాడు)
41. దైహికరోగ నివారక
ఓమ్
(దేహసంబంధమైన రోగాలను రాకుండా చేయువాడు)
42. తనుపాలక దీర్ఘాయుద
ఓమ్
(శరీరాలను పోషించి దీర్ఘాయువునిచ్చువాడు)
43. ఆత్మికబల సందాయక
ఓమ్
(ఆత్మబలము నిచ్చువాడు)
44. మానవ లక్ష్య మహాశ్రయ
ఓమ్
(మానవులకు లక్ష్యము (పొందవలసినవాడు) మరియు గొప్ప ఆశ్రయము)
45. నిత్య నిరంజన నిరుపమ
ఓమ్
(భగవంతుడు నిత్యుడు, నిరంజనుడు, నిరుపముడు)
46. భవభయ భంజన భేషజ
ఓమ్
(ప్రపంచమునందలి భయమును నాశనమొనర్చే ఔషధము)
47. ఆర్తత్రాణ పరాయణ
ఓమ్
(కష్టములలోనున్న మంచివారిని రక్షించువాడు)
48. అజ్ఞానాదిక రిపుహర
ఓమ్
(అజ్ఞానము మున్నగు శత్రువులను హరించువాడు)
49. దారిద్ర్యాది వినాశక
ఓమ్
(పురుషార్ధపరులైన వారి దారిద్ర్యమును పోగొట్టువాడు)
50. పరమైశ్వర్య సుదాయక
ఓమ్
(తన ఐశ్వర్యాదులతో జీవులకు సుఖముల నిచ్చువాడు)
అనంత గుణగణ భూషిత
ఓమ్
శుద్ధ బ్రహ్మ పరాత్పర
ఓమ్
51. సర్వానంద సుసాధక
ఓమ్
(పూర్ణానందమును పొందుటకు సాధనం)
52. సామ్రాజ్యర్క ప్రసారక
ఓమ్
(సామ్రాజ్య సూర్యుని విస్తరింపజేయువాడు)
53. విశ్వ వినోదక విభువర
ఓమ్
(విశ్వమును సకల సుఖములతో వినోదంగా సృష్టించి వ్యాపించి యుండువాడు)
54. సద్బోధిత హృద్వర్ధక
ఓమ్
(సత్యసంకల్పములను చేయు మనస్సును వృద్ధి చేయువాడు)
55. నిర్మల నాయక శర్మద
ఓమ్
(మల రహితుడు. నాయకుడు. ఆనందం నిచ్చువాడు)
56. లోభాదిక రిపు నాశక
ఓమ్
(లోభము మున్నగు శత్రువులను నాశనము చేయువాడు)
57. తేజః ప్రద తేజోమయ
ఓమ్
(సూర్యాది నక్షత్రములకు జీవులకు పూర్ణ ప్రకాశము నిచ్చువాడు)
58. ఓజః ప్రద ఓజోమయ
ఓమ్
(అనంతసామర్థ్యము కలిగియుండి పూర్ణ సామర్థ్యము నిచ్చువాడు)
59. శ్రద్ధాప్రద శ్రద్ధామయ
ఓమ్
(అనంత శ్రద్ధతో జీవులలో శ్రద్ధను కలుగజేయువాడు)
60. రసవాహక సర్వేశ్వర
ఓమ్
(పుష్పఫలాదులలో రసమును చేర్చుచు సృష్టిఅంతా ఐశ్వర్యంగాకలవాడు)
61. దాన సృష్టి సంచాలక
ఓమ్
(తాను సృష్టించిన జగత్తును జీవుల కొరకు దానమొనర్చి చక్కగా నడపువాడు)
62. రసభేదక సంవర్ధక
ఓమ్
(వృక్షాదులలోని రసమును సూర్యాదుల ద్వారా పైకి ఆకర్షింపజేయుచు వృద్ధిచేయువాడు)
అనంత గుణగణ భూషిత
ఓమ్
శుద్ధ బ్రహ్మ పరాత్పర
ఓమ్
63. పాపనివారక మోక్షద
ఓమ్
(పాపములు చేయకుండా నివారించి మోక్షము నిచ్చువాడు)
64. మృత్యురూప సంశోధక
ఓమ్
(మరణము ద్వారా జీవులను ఉద్దరించేవాడు)
65. చిత్ర విచిత్ర మహాతుథ
ఓమ్
(సృష్టిలోని చిత్రవిచిత్రములన్నీ తెలిసినవాడు)
66. సత్యసనాతన ధర్మద
ఓమ్
(సత్యము సనాతనమైన వేదధర్మము బోధించేవాడు)
67. హోమార్పిత హవిభేదక
ఓమ్
(హోమంలో అర్పించిన ద్రవ్యముల ద్వారా సుగంధమును వెదజల్లువాడు)
68. సభ్యసభా ప్రతిభాప్రియ
ఓమ్
(ప్రతిభావంతులైన సభ్యుల సభకు ప్రియుడు)
69. విస్తృత శాంతి విధాయక
ఓమ్
(శాంతిని విస్తరింపజేయువాడు)
70. వరుణ ప్రజాపతి ప్రేరక
ఓమ్
(వరుణుడు. ప్రజాపతి. ప్రేరణ నిచ్చువాడు)
71. స్థావర జంగమ రక్షక
ఓమ్
(స్థావరములను (కదలనివి) జంగమములను (కదలునవి) రక్షించువాడు)
72. విద్వజ్జన మతి ప్రేరక
ఓమ్
(విద్వాంసుల బుద్ధిని వికసింపజేయువాడు)
73. విక్రమ విష్ణు విరాడసి
ఓమ్
(విక్రముడు. విష్ణువు . విరాట్ మున్నగు నామములు కలవాడవు)
74. దాన రహిత నరనాశక
ఓమ్
(దానము చేయని ప్రజలను నాశనము చేయువాడు)
అనంత గుణగణ భూషిత
ఓమ్
శుద్ధ బ్రహ్మ పరాత్పర
ఓమ్
75. త్యాగయుక్త నర భద్రద
ఓమ్
(త్యాగము చేయు నరులను రక్షించువాడు)
76. మన్యురూప మన్యుప్రద
ఓమ్
(దుష్టులపైన దుష్టకార్యములపైన క్రోధము కలిగి, మానవులకును అట్టి మన్యువును ఇచ్చువాడు)
77. వీర్యరూప వీర్యప్రద
ఓమ్
(అనంత పరాక్రమముతో మానవులకు పూర్ణ పరాక్రమము నిచ్చువాడు)
78. సహనరూప సహదాయక
ఓమ్
(అనంత సహనముతో మానవులకు సహనము నిచ్చువాడు)
79. అచల రూప సంచాలక
ఓమ్
(తానుకదలక జగత్తునంతటినీ నడిపించువాడు)
80. రుద్ర భీమ భయవాహక
ఓమ్
(రుద్రుడు. భీముడు. భయంకరుడు)
81. సజ్జన సమ్మత సౌఖ్యద
ఓమ్
(సజ్జనులకిష్టమైన సుఖముల నిచ్చువాడు)
82. వర్ణ చతుష్టయ స్థాపక
ఓమ్
(బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను నాలుగు వర్ణములను ఏర్పరచినవాడు)
83. సర్వ న్యూన సంపూరక
ఓమ్
(సృష్టిలో ఏలోటులేకుండా చేయువాడు)
84. విద్వేషాదిక భంజక
ఓమ్
(ద్వేషాదులను నాశనము చేయువాడు)
85. సర్వమిత్ర సంపాదక
ఓమ్
(అందరికీ మిత్రుడు)
86. సృష్టి స్థితి లయ కారక
ఓమ్
(సృష్టిని చేసి పోషించి నాశనము చేయువాడు)
అనంత గుణ గణ భూషిత
ఓమ్
శుద్ధ బ్రహ్మ పరాత్పర
ఓమ్
87. క్షోభరహిత నభ నామక
ఓమ్
(దుఃఖము లేనివాడు, ఆకాశనామముకలవాడు)
88. మంగళ మూల మయోభవ
ఓమ్
(మంగళకారకుడు)
89. శంకరరూప మయస్కర
ఓమ్
(శంకరుడు. మయస్కరుడను పేర్లతో పిలువబడువాడు)
90. సృష్టి మయా వసు రసవతి
ఓమ్
(నేను చేసిన ఈ సృష్టి ఐశ్వర్య, రసాదులతో కూడినది)
91. సత్పథ ధర్మ పురోహిత
ఓమ్
(ధార్మికులను సత్యమార్గములో నడిపించువాడు)
92. నాశ నివారక స్వస్తిద
ఓమ్
(నాశమునుండి తప్పించి శుభములనిచ్చువాడు)
93. సకల యజ్ఞ స్వీకారక
ఓమ్
(శ్రేష్ఠ కర్మలన్నింటినీ అనుమతించువాడు)
94. ఉక్షిత రక్షక శిక్షక
ఓమ్
(శుభకర్మలాచరించువారిని రక్షించువాడు. దుష్టులను శిక్షించువాడు)
95. విశ్వరూప విశ్వావసు
ఓమ్
(విశ్వమనెడు ఈ సమస్త ఐశ్వర్యము పరమేశ్వరునిది)
96. విశ్వమిత్ర వైశ్వానర
ఓమ్
(అందరికి మిత్రుడు. ఈశ్వరుడు)
97. పుణ్య పురూత మపూరుష
ఓమ్
(జీవునివలె పుణ్య పాపకర్మలు చేయువాడు కాడు)
98. పాహి నిరంతర పూషణ
ఓమ్
(సజ్జనులను ఎల్లప్పుడు రక్షించి పోషించువాడు)
అనంత గుణగణ భూషిత
ఓమ్
శుద్ధ బ్రహ్మ పరాత్పర
ఓమ్
99. పాహి ప్రవాహణ ప్రభువర
ఓమ్
(అందరికీ ప్రభువైన ఓ ఈశ్వర మమ్ము రక్షించు)
100.అద్భుత మిత్ర కృపాకర
ఓమ్
(గొప్పమిత్రుడు, కృపను జూపువాడు)
101. మిత్ర రూప వ్రతపాలక
ఓమ్
(స్నేహ వ్రతమును పాలించువాడు)
102. నిశ్చిత మిత్ర నిరాశ్రయ
ఓమ్
(సదా మిత్రుడు, ఆశ్రయము)
103. అధమోద్ధారక చిన్మయ
ఓమ్
(దీనుల నుద్ధరించువాడు. అనంత జ్ఞానము కలవాడు)
104. సత్య సుఖాత్మక సర్వద
ఓమ్
(సత్యసుఖముతో కూడినవాడు. సృష్టిని దానము చేయువాడు)
105.నిర్గుణ రూప నిరామయ
ఓమ్
(రూపరస గంధాది గుణములు, అజీర్ణాది రోగములు లేనివాడు)
106. ఆనందామృత వర్షక
ఓమ్
(ఆనందమనే అమృతము నిచ్చువాడు)
107. గణనాయక గణపాలక
ఓమ్
(దేవతాది గణములకు నాయకుడు – పోషకుడు)
108. మర్మాచ్ఛాదక విభువర
ఓమ్
(జీవనమునకు కారణములైన ప్రాణాదులను కప్పియుంచువాడు)
అనంత గుణ గణ భూషిత
ఓమ్
శుద్ధ బ్రహ్మ పరాత్పర
ఓమ్
(ఇతి అష్టోత్తర శత ప్రణవ నామాని)
మరిన్ని స్తోత్రములు