మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వీరబ్రహ్మష్టకము గురించి తెలుసుకుందాం…
శ్రీ వీరబ్రహ్మష్టకము
హైందవ మహమ్మదీయ సఖ్యముకొఱకు
సర్వ మానవ ధర్మంబు చాటి చెప్పి,
“ఆలకింపుఁ డమృతపుత్రు లంద”ఱనెడి
విశ్వధర్మ నిర్ణేత భావింతు నెపుడు.
ఎవని యానతి యవస మహీళు లేని
అలరు ఒత్తుగా శీర్షములందుఁ దాల్చి,
పాలన మొనర్తు ధార్మిక ప్రభుత నెఱపి
అట్టి గురునందు నాచిత్తమలరుఁగాళ.
కులమునకుఁ గాక యోగ్యతకును గుణమ్ము
నకును మన్నన యొసఁగి యంత్యజున కేని,
ఔపనిషదర్థ పీయూష మందఁ జేయు
నట్టి దేశికు చరణమ్ము లాశ్రయింతు.
యతుల కేగాని ముక్తి, గృహస్థ తతికి
దూరమనెడు నపోహముఁ దొలఁగఁ జేసి,
గేస్తుధర్మమ్ము ప్రకటించు గృహివరేణ్యు
డెపుడు వసియించుఁగాత నా హృదయ సీను.
అల సనాతన ఋషి ధర్మ మైన శిల్ప
కర్మయోగముఁ బూని నైష్కర్య సిద్ధిఁ
జాటె నే కర్మకుశలుఁ డా సంయమీంద్రుఁ
డొసఁగి ప్రోచుత సత్రియా యోగదీతు.
ఘనతరాష్టాంగ యోగంబు కాలి పోయి
శుష్క వేదాంతమున యోగశూన్య మైన
జగమునన్ యోగమార్గ సంస్థాపన మ్మొ
సరు యోగేశ్వరుఁడు శరణమ్ము నాకు.
ఎవఁడు శ్రుత్యంతముల నెల్ల నేర్పరించి
లుఁగు తత్త్వాలలోఁ బ్రబోధించినాఁడొ;
ఆ త్రయీమూర్తి రుచిరపాదాబ్జ సీమఁ
జేరి నటియించుఁగాత నా చిత్త భృంగి.
ఆతఁడు తమోరజస్సుల కవల వెలుఁగు
సత్వమూర్తి, త్రయీశిర స్సార రూపి,
వెలుఁగులకు వెల్గు, ప్రణవైకవేద్య నిత్య
తత్త్వ మా వీర గురుఁడు ప్రత్యక్ష మగుత
మరిన్ని అష్టకములు