Vidya Viveka Hetuvu in Telugu – విద్య వివేక హేతువు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విద్య వివేక హేతువు నీతికథ.

విద్య వివేక హేతువు:

(ఈ కథ ఆరణ్య పర్వంలో ఉంది)

విదేహ దేశాన్ని పాలించే జనక మహారాజు ఆస్థానంలో వంది అనే మహా విద్వాంసుడు ఉండేవాడు.

ఎంతటి మహా విద్వాంసుడై నా వందితో వాదించి గెలవలేక పోతు న్నాడు. అందరినీ ఓడించిన అహంకారంతో ఉన్న నంది:

“నాతో వాదించి ఓడినవారిని నదీ ప్రవాహంలో ముంచేస్తాను’, అని ప్రకటించాడు.
అలా ఎందరినో నదిలో తోయించి సగర్వంగా ఉన్నాడు వంది..

ఆ రోజులలో
ఉద్దాలకుని శిష్యుడైన కహోడుడు విదేహ చేరి వంది చేతులలో ఓడిపోయి ప్రాణాలు విడిచాడు.

అప్పటికి గర్భవతిగా ఉంది కహోడుని భార్య సుజాత, భర్త మరణవార్త విని ఎంతో దుఃఖించింది. గర్భంలో ఉన్న శిశువు మీద మమకారాన్ని చంపుకో లేక విచారాన్ని విడనాడి జీవితం గడుపుతూ కొంత కాలానికి కుమారుని కన్నది.

ఆ బాలుడు తండ్రి శాపంవల్ల ఎనిమిది వంకరలతో పుట్టాడు. అందువల్ల అందరూ వానిని ‘అష్టావక్రుడు’ అని పిలిచేవారు.

పన్నెండు సంవత్సరాలు గడిచాయి. అప్పటికి అష్టావక్రునికి తన తండ్రి మరణ కారణం తెలిసి, వందితో వాదనకు బయలుదేరి విదేహ రాజ్యానికి వచ్చాడు.

‘నిండా పన్నెండేళ్ళు రాని బాలుడు వంటివంటి మహా విద్వాంసు నితో వాదించడమా !’ అని ద్వారపాలకుడు నిరోధించాడు.

‘ద్వారపాలక విద్యకు వయస్సుతో నిమిత్తం లేదు. జుట్టు నెరసి వయస్సు ముదిరినవాడు మహా విద్వాంసుడని అనుకోకు”, అని వాదిస్తుండగా అటు వచ్చిన జనక మహారాజు:

‘ఆర్యా! మా ఆస్థాన విద్వాంసుడు వంది ప్రచండ సూర్య సముడు. ఆయన ముందు మిగిలిన విద్వాంసులందరూ చిన్న చిన్న నక్షత్రాలవలె వెల వెల బోతుంటారు’ అనగా అష్టావక్రుడు :

‘ మహారాజా ! నా వంటి వాడెవరూ మీ సభా భవనానికి వచ్చి ఉండరు, అన్నాడు.

‘ అయితే ముప్పది అవయవాలతో, పన్నెండు అంశలతో ఇరువది నాలుగు పర్వాలతో మూడు వందల అరువది రేకులతో ఉండే దానిని ఎరిగిన జ్ఞానివా నువ్వుః ‘ అని జనకుడు ప్రశ్నించాడు.

“మహారాజా ! ముప్పది దినాలు అవయవాలు, అమావాస్యలు పన్నెండు, పూర్ణిమలు పన్నెండు, ఈ ఇరువది నాలుగు పర్వాలు, పన్నెండు నెలలు అంశలు, మూడు వందల అరువది రోజులు రేకులు, అటువంటి సంవత్సర రూపమయిన కాలచక్రం మీకు సమస్త కళ్యాణాలు కలిగించుగాక’, అన్నాడు.

జనకుడు: అడు గుర్రాలజంటవలె కనిపిస్తూ, హఠాత్తుగా డేగలా మీద పడే ఆ రెండిటినీ ధరించే దెవరు ?
అష్టా : మహారాజా ! అవి మీ శత్రువుల గృహాల మీద పడకూడదని కోరుతున్నాను. ప్రాణ నామాలతో ఉండే ఆ రెండు తత్వాలవల్ల విద్యుత్తు పుడుతుంది. వీటిని మేఘం ధరిస్తుంది.
జన: కన్ను మూయకుండా నిద్రించేది ఏది?
అష్టా: నిరంతరం నీటిలో ఉండే చేప.
జన: జన్మించినా చైతన్యం లేనిది ఏది?
అష్టా: పక్షులు పెట్టే గ్రుడ్డు.
జన: హృదయం లేనిదేది?
అషా : బండరాయి.
జన: ఓవేదవేత్తా! ఇప్పుడు మీరు మా మండపానికి వచ్చి వాదన సాగించవచ్చు అని సాదరంగా తీసుకు వెళ్ళాడు.

చూశాడు మహావిద్వాంసుడు వంది. అష్టావక్రుడు ఆయనను సమీపించాడు.

వంది: బాలకా! నిద్రపోయే సింహాన్ని లేవకు. కాలకూట విషభరిత మయిన పాము పడగ మీద కాలు పెట్టకు,
అష్టా: : మహారాజా ! పర్వతాలన్నీ మైనం కంటె చిన్నవి. లేగదూడలు ఆంబోతుకంటే చిన్నవి. రాజులందరూ జనకునికంటె అల్పులు. దేవతలలో యింద్రుని వలె, నరులలో ఉత్తముడుగా ఉన్న మహారాజువు నువ్వు. మీ విద్వాంసుడైన వందిని వాదానికి రమ్మనండి. ప్రారంభిస్తున్నాను నా వాదం.

అగ్ని ఒకటే అయినా అనేక రూపాలలో ప్రకాశం ఇస్తుంది. సూర్యుడొక్కడే సర్వలోకాలకు వెలుగు. దేవేంద్రుడొక్కడే ఏకైక వీరుడు. పితృ దేవరావతి, యముడొక్కడే, అని ప్రారంభించాడు, వంది.

అష్టా: నంది ! ఇంద్రుడు- అగ్ని నిరంతర స్నేహబంధంతో ఉండే దేవతలు, అలానే పర్వత నారదులు. అశ్వనీ దేవత లిద్దరు. రథా నికి చక్రాలు రెండు. సతీపతులు ఇద్దరు..

వంది: ప్రాణికోటి అంతా దేవమానవ తిర్యగ్రూపాలు మూడు ధరి స్తుంది. ఋగ్యజుస్సామాలు మూడే వేదాలు. ప్రాతర్మాధ్యా హ్నిక సాయం సవనాలు మూడు. స్వర్గ మర్త్య నరకాలు మూడే లోకాలు, అగ్ని, సూర్య చంద్రులు ముగ్గురే జ్యోతి స్వరూపులు.

అష్టా: బ్రహ్మచర్య, గార్హస్థ్య, వావవస్థ, సన్న్యాశ్రమాలు నాలుగు, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు నాలుగు, దిక్కులూ నాలుగే హ్రస్వ, దీర్ఘ, ప్లత, హల్లు భేదాలతో శబ్దం నాలుగు రకాలు. వేరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ అని వాక్కు నాలుగు రగాలు.

వంది: గార్హపత్య, దక్షిణాగ్ని, ఆహవనీయ, సభ్య అసభ్యం అనే అవస్థా భేదంతో యజ్ఞాగ్ని అయిదు విధాలు. వంక్తి ఛందస్సుకి ‘ పాదాలు అయిదు. దేవ, పితృ, ఋషి, మమష్య, భూత, యజ్ఞాలు అయిదు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అని జ్ఞానేంద్రి యాలు అయిదు. విపాశ, ఇరావతి, వితస్త, చంద్రభాగ శశుద్రు నామాలతో ప్రఖ్యాతమైనది పంచనాదం.

అష్టా : బాలకా! అగ్ని స్థాపన వేళ ఆరు ఆవులను దక్షిణ ఇవ్వాలి. ఆరుఋతువులే సంవత్సర కాల చక్రాన్ని నడుపుతాయి. మన స్సుతో కలిసి జ్ఞానేంద్రియాలు ఆరు. కృత్తికలు ఆరు. యజ్ఞలు ఆర

వంది: విద్వాంసుడా! ఆవు, దున్న, మేక, గుర్రం, కుక్క, పిల్లి, గాడిద ఇవి ఏడూ గ్రామాలలో ఉండే జంతువులు. సింహం, కార్దూలం, లేడి, తోడేలు, ఏనుగు, వానరం, భల్లూకం – యివి. ఏడూ వన్యమృగాలు. గాయత్రి, బృహతి, జగతి, అతి జగతి, పంక్తి, త్రిష్టుప్, అనుష్టుప్, భేదాలతో ఛందస్సు ఏడురకాలు. అత్రి, పులస్త్య, క్రతు, మరీచి, అంగిరస, వసిష్ఠులు సప్త మహర్షులు. ధూప, దీప, నైవేద్య, ఆచమన, గంధ, పుష్ప, తాంబూలాదులు కూడా ఏడే.

అష్టా: తులాదండాన్ని బంధించే సూత్రాలు ఎనిమిది. సింహాన్ని సంహరించే శరభ మృగానికి ఎనిమిది పాదాలు. యజ్ఞశాల సమీ పంలో యూవస్థంభానికి రోజులు ఎనిమిది. వసువులు ఎవ మండుగురు.

వంది: పితృయజ్ఞవేళ అగ్నిని ఉపాసించే సామిధేను మంత్రాలు తొమ్మిది. ప్రకృతి, పురుష, అహంకార, మహత్తత్త్వ, పంచతన్మా త్రలు తొమ్మిది. వీటి సంయోగం వల్లనే సృష్టి సాగుతున్నది. బృహతీ ఛందస్సుకు ప్రతిపాదంలోనూ తొమ్మిదే అక్షరాలు. గణితశాస్త్రం యావత్తూ తొమ్మిది అంకెలమీద ఆధారపడి ఉంది.

అష్టా: దిక్కులువది. గర్భంలో శివుడు పది మాసాలుంచాడు. రోగి, దరిద్రుడు శోకార్హుడు, రాజదండితుడు, వృత్తిలో మోసపోయిన వాడు, పిచ్చివాడు, కాముకుడు, అనూయాపరుడు, మూర్ఖుడు మొండివాడు ఈ పదిమంది నిందార్హులు. గురువు, తండ్రి, పెద్దన్నగారు, ప్రభువు, మాతామహి, పితామహులు, మేనమామ, మామగారు, తండ్రిసోదరులు, కుటుంబంలో వృద్ధులు ఈ పది మంది పూజింప దగినవారు.

ప్రాణికి పది దశలు :
గర్భవాసం, జననం, బాల్యం, కౌమారం, పౌగండం, కై కోరం, యౌవనం, ప్రౌఢత్వం, వార్ధక్యం, మృత్యువు.

వంది: ప్రాణి కోటికి యింద్రియాలు పదకొండు. విషయాలూ వద కొండే. జ్ఞాన, కర్మేంద్రియాలతో మనస్సు కలిసి పదకొండు|| శబ్ద, స్పర్శ, రూప, రస, గంథాలు జ్ఞానేంద్రియ విషయాలు.
మాట, పని, నడక, మలాదుల విసర్జన, భార్యా సంయోగం యివి కర్మేంద్రియాలు చేసే పనులు. వీటి మననం మనస్సు చేసేపవి. ఇవి పదకొండు.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, రాగ, ద్వేష, హర్ష, శోక, అహంకారాది వికారాలు పదకొండు.

మృగ, వ్యాధ, సర్ప, అజై కపాద, అహిర్బుధ్న్య, కపాలి, పివారి, నిర్భతి, దహిస, స్థాయి, ఈశ్వర వీరు ఏకాదశ రుద్రులు.

అష్టా: పసివాడా। మాసాలు పన్నెండు. జగతీ ఛందస్సుకి అక్షరాలు పన్నెండు. ప్రాకృతయజ్ఞం పన్నెండు రోజులు సాగుతుంది. ఆదిత్యులు పన్నెండుగురు.

వంది: తిథులలో త్రయోదశి మంచిది. భూమిమీద పదమూడు ద్వీపాలు ఉన్నాయి అని ఆగిపోయి ఆలోచన ఆరంభించగా,

అహ్జైాన్నకుడు: మహారాజా! మీ విద్వాంసుడు శ్లోకం సగం చదివి విర మించాడు. మిగిలింది నేను చెబుతా.

కేశి దానవునితో మహావిష్ణువు పదమూడు రోజులు యుద్ధం చేసాడు. వేదంలోని అతిజగతి ఛందస్సు పదమూడక్షరాల పరిమితితో నడుస్తుంది. అనగా, పంది తల వంచేశాడు.

నియమానుసారం పంది తనకు తానే నదిలో మునిగిపోయాడు. మనకు ఎంత విద్య ఉన్నా, వయస్సు మీరినా, వివేకాన్ని దిగమ్రింగే అహంకారంతో నడుచుకునే వారు వంది వలెనే పసివారి ప్రజ్ఞముందు పతనమయిపోతారు.

విద్య వినయాన్ని కలిగించాలికాని గర్వ హేతువు కారాదు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Leave a Comment