Kishkindha Kanda Sarga 24 In Telugu – కిష్కింధాకాండ చతుర్వింశః సర్గః

Kishkindha Kanda Sarga 24

కిష్కింధాకాండ చతుర్వింశః సర్గంలో, సుగ్రీవుడు రాముని దయతో కిష్కింధా పట్టణాన్ని తిరిగి పొందతాడు. సుగ్రీవుని పట్టాభిషేకం ఘనంగా జరుగుతుంది. సుగ్రీవుడు రాజు అవడంతో వానరులు ఆనందంగా ఉంటారు. వాలి భార్య తార సంతాపంతో రాముని వద్దకు వెళ్లి వాలి పాపాలు క్షమించాలని కోరుతుంది. రాముడు ఆమెకు సాంత్వన చెప్పి వాలి అర్హతను గుర్తించి, సుగ్రీవుడు మంచి రాజుగా ఉంటాడని హామీ ఇస్తాడు. సుగ్రీవుడు రాజ్యపాలనలో న్యాయం, ధర్మం పాటించడానికి రాముని ఆశీర్వాదం తీసుకుంటాడు. రాముడు సీతను రాక్షసుల చెరనుండి విముక్తం చేసేందుకు సుగ్రీవుని సహాయంపై ఆధారపడి, తన ప్రయత్నాలను కొనసాగించడానికి సిద్ధమవుతాడు.

సుగ్రీవతారాశ్వాసనమ్

తాం చాశ్రువేగేన దురాసదేన
త్వభిప్లుతాం శోకమహార్ణవేన |
పశ్యంస్తదా వాల్యనుజస్తరస్వీ
భ్రాతుర్వధేనాప్రతిమేన తేపే || ౧ ||

స బాష్పపూర్ణేన ముఖేన వీక్ష్య
క్షణేన నిర్విణ్ణమనా మనస్వీ |
జగామ రామస్య శనైః సమీపం
భృత్యైర్వృతః సంపరిదూయమానః || ౨ ||

స తం సమాసాద్య గృహీతచాప-
-ముదాత్తమాశీవిషతుల్యబాణమ్ |
యశస్వినం లక్షణలక్షితాంగ-
-మవస్థితం రాఘవమిత్యువాచ || ౩ ||

యథాప్రతిజ్ఞాతమిదం నరేంద్ర
కృతం త్వయా దృష్టఫలం చ కర్మ |
మమాద్య భోగేషు నరేంద్రపుత్ర
మనో నివృత్తం సహ జీవితేన || ౪ ||

అస్యాం మహిష్యాం తు భృశం రుదంత్యాం
పురే చ విక్రోశతి దుఃఖతప్తే |
హతేఽగ్రజే సంశయితేఽంగదే చ
న రామరాజ్యే రమతే మనో మే || ౫ ||

క్రోధాదమర్షాదతివిప్రధర్షా-
-ద్భ్రాతుర్వధో మేఽనుమతః పురస్తాత్ |
హతే త్విదానీం హరియూథపేఽస్మిన్
సుతీవ్రమిక్ష్వాకుకుమార తప్స్యే || ౬ ||

శ్రేయోఽద్య మన్యే మమ శైలముఖ్యే
తస్మిన్నివాసశ్చిరమృశ్యమూకే |
యథా తథా వర్తయతః స్వవృత్త్యా
నేమం నిహత్య త్రిదివస్య లాభః || ౭ ||

న త్వాం జిఘాంసామి చరేతి యన్మా-
-మయం మహాత్మా మతిమానువాచ |
తస్యైవ తద్రామ వచోఽనురూప-
-మిదం పునః కర్మ చ మేఽనురూపమ్ || ౮ ||

భ్రాతా కథం నామ మహాగుణస్య
భ్రాతుర్వధం రాఘవ రోచయేత |
రాజ్యస్య దుఃఖస్య చ వీర సారం
న చింతయన్ కామపురస్కృతః సన్ || ౯ ||

వధో హి మే మతో నాసీత్స్వమాహాత్మ్యవ్యతిక్రమాత్ |
మమాసీద్బుద్ధిదౌరాత్మ్యాత్ప్రాణహారీ వ్యతిక్రమః || ౧౦ ||

ద్రుమశాఖావభగ్నోఽహం ముహూర్తం పరినిష్ఠనన్ |
సాంత్వయిత్వా త్వనేనోక్తో న పునః కర్తుమర్హసి || ౧౧ ||

భ్రాతృత్వమార్యభావశ్చ ధర్మశ్చానేన రక్షితః |
మయా క్రోధశ్చ కామశ్చ కపిత్వం చ ప్రదర్శితమ్ || ౧౨ ||

అచింతనీయం పరివర్జనీయ-
-మనీప్సనీయం స్వనవేక్షణీయమ్ |
ప్రాప్తోఽస్మి పాప్మానమిమం నరేంద్ర
భ్రాతుర్వధాత్త్వాష్ట్రవధాదివేంద్రః || ౧౩ ||

పాప్మానమింద్రస్య మహీ జలం చ
వృక్షాశ్చ కామం జగృహుః స్త్రియశ్చ |
కో నామ పాప్మానమిమం క్షమేత
శాఖామృగస్య ప్రతిపత్తుమిచ్ఛన్ || ౧౪ ||

నార్హామి సమ్మానమిమం ప్రజానాం
న యౌవరాజ్యం కుత ఏవ రాజ్యమ్ |
అధర్మయుక్తం కులనాశయుక్త-
-మేవంవిధం రాఘవ కర్మ కృత్వా || ౧౫ ||

పాపస్య కర్తాఽస్మి విగర్హితస్య
క్షుద్రస్య లోకాపకృతస్య చైవ |
శోకో మహాన్ మామభివర్తతేఽయం
వృష్టేర్యథా నిమ్నమివాంబువేగః || ౧౬ ||

సోదర్యఘాతాఽపరగాత్రవాలః
సంతాపహస్తాక్షిశిరోవిషాణః |
ఏనోమయో మామభిహంతి హస్తీ
దృప్తో నదీకూలమివ ప్రవృద్ధః || ౧౭ ||

అంహో బతేదం నృవరావిషహ్య
నివర్తతే మే హృది సాధు వృత్తమ్ |
వివర్ణమగ్నౌ పరితప్యమానం
కిట్టం యథా రాఘవ జాతరూపమ్ || ౧౮ ||

మహాబలానాం హరియూథపానా-
-మిదం కులం రాఘవ మన్నిమిత్తమ్ |
అస్యాంగదస్యాపి చ శోకతాపా-
-దర్ధస్థితప్రాణమితీవ మన్యే || ౧౯ ||

సుతః సులభ్యః సుజనః సువశ్యః
కుతః సుపుత్రః సదృశోఽంగదేన |
న చాపి విద్యేత స వీర దేశో
యస్మిన్భవేత్ సోదరసన్నికర్షః || ౨౦ ||

యద్యంగదో వీరవరార్హ జీవే-
-జ్జీవేచ్చ మాతా పరిపాలనార్థమ్ |
వినా తు పుత్రం పరితాపదీనా
తారా న జీవేదితి నిశ్చితం మే || ౨౧ ||

సోఽహం ప్రవేక్ష్యామ్యతిదీప్తమగ్నిం
భ్రాత్రా చ పుత్రేణ చ సఖ్యమిచ్ఛన్ |
ఇమే విచేష్యంతి హరిప్రవీరాః
సీతాం నిదేశే తవ వర్తమానాః || ౨౨ ||

కృత్స్నం తు తే సేత్స్యతి కార్యమేత-
-న్మయ్యప్రతీతే మనుజేంద్రపుత్ర |
కులస్య హంతారమజీవనార్హం
రామానుజానీహి కృతాగసం మామ్ || ౨౩ ||

ఇత్యేవమార్తస్య రఘుప్రవీరః
శ్రుత్వా వచో వాల్యనుజస్య తస్య |
సంజాతబాష్పః పరవీరహంతా
రామో ముహూర్తం విమనా బభూవ || ౨౪ ||

తస్మిన్ క్షణేఽభీక్ష్ణమవేక్ష్యమాణః
క్షితిక్షమావాన్ భువనస్య గోప్తా |
రామో రుదంతీం వ్యసనే నిమగ్నాం
సముత్సుకః సోఽథ దదర్శ తారామ్ || ౨౫ ||

తాం చారునేత్రాం కపిసింహనాథం
పతిం సమాశ్లిష్య తదా శయానామ్ |
ఉత్థాపయామాసురదీనసత్త్వాం
మంత్రిప్రధానాః కపివీరపత్నీమ్ || ౨౬ ||

సా విస్ఫురంతీ పరిరభ్యమాణా
భర్తుః సకాశాదపనీయమానా |
దదర్శ రామం శరచాపపాణిం
స్వతేజసా సూర్యమివ జ్వలంతమ్ || ౨౭ ||

సుసంవృతం పార్థివలక్షణైశ్చ
తం చారునేత్రం మృగశాబనేత్రా |
అదృష్టపూర్వం పురుషప్రధాన-
-మయం స కాకుత్స్థ ఇతి ప్రజజ్ఞే || ౨౮ ||

తస్యేంద్రకల్పస్య దురాసదస్య
మహానుభావస్య సమీపమార్యా |
ఆర్తాఽతితూర్ణం వ్యసనాభిపన్నా
జగామ తారా పరివిహ్వలంతీ || ౨౯ ||

సా తం సమాసాద్య విశుద్ధసత్త్వా
శోకేన సంభ్రాంతశరీరభావా |
మనస్వినీ వాక్యమువాచ తారా
రామం రణోత్కర్షణలబ్ధలక్షమ్ || ౩౦ ||

త్వమప్రమేయశ్చ దురాసదశ్చ
జితేంద్రియశ్చోత్తమధార్మికశ్చ |
అక్షయ్యకీర్తిశ్చ విచక్షణశ్చ
క్షితిక్షమావాన్ క్షతజోపమాక్షః || ౩౧ ||

త్వమాత్తబాణాసనబాణపాణి-
-ర్మహాబలః సంహననోపపన్నః |
మనుష్యదేహాభ్యుదయం విహాయ
దివ్యేన దేహాభ్యుదయేన యుక్తః || ౩౨ ||

యేనైకబాణేన హతః ప్రియో మే
తేనేవ మాం త్వం జహి సాయకేన |
హతా గమిష్యామి సమీపమస్య
న మామృతే రామ రమేత వాలీ || ౩౩ ||

స్వర్గేఽపి పద్మామలపత్రనేత్రః
సమేత్య సంప్రేక్ష్య చ మామపశ్యన్ |
న హ్యేష ఉచ్చావచతామ్రచూడా
విచిత్రవేషాప్సరసోఽభజిష్యత్ || ౩౪ ||

స్వర్గేఽపి శోకం చ వివర్ణతాం చ
మయా వినా ప్రాప్స్యతి వీర వాలీ |
రమ్యే నగేంద్రస్య తటావకాశే
విదేహకన్యారహితో యథా త్వమ్ || ౩౫ ||

త్వం వేత్థ యావద్వనితావిహీనః
ప్రాప్నోతి దుఃఖం పురుషః కుమారః |
తత్త్వం ప్రజానన్ జహి మాం న వాలీ
దుఃఖం మమాదర్శనజం భజేత || ౩౬ ||

యచ్చాపి మన్యేత భవాన్మహాత్మా
స్త్రీఘాతదోషో న భవేత్తు మహ్యమ్ |
ఆత్మేయమస్యేతి చ మాం జహి త్వం
న స్త్రీవధః స్యాన్మనుజేంద్రపుత్ర || ౩౭ ||

శాస్త్రప్రయోగాద్వివిధాచ్చ వేదా-
-దాత్మా హ్యనన్యః పురుషస్య దారాః |
దారప్రదానాన్న హి దానమన్య-
-త్ప్రదృశ్యతే జ్ఞానవతాం హి లోకే || ౩౮ ||

త్వం చాపి మాం తస్య మమ ప్రియస్య
ప్రదాస్యసే ధర్మమవేక్ష్య వీర |
అనేన దానేన న లప్స్యసే త్వ-
-మధర్మయోగం మమ వీర ఘాతాత్ || ౩౯ ||

ఆర్తామనాథామపనీయమానా-
-మేవంవిధామర్హసి మాం నిహంతుమ్ |
అహం హి మాతంగవిలాసగామినా
ప్లవంగమానామృషభేణ ధీమతా || ౪౦ ||

వినా వరార్హోత్తమహేమమాలినా
చిరం న శక్ష్యామి నరేంద్ర జీవితుమ్ |
ఇత్యేవముక్తస్తు విభుర్మహాత్మా
తారాం సమాశ్వాస్య హితం బభాషే || ౪౧ ||

మా వీరభార్యే విమతిం కురుష్వ
లోకో హి సర్వో విహితో విధాత్రా |
తం చైవ సర్వం సుఖదుఃఖయోగం
లోకోఽబ్రవీత్తేన కృతం విధాత్రా || ౪౨ ||

త్రయో హి లోకా విహితం విధానం
నాతిక్రమాంతే వశగా హి తస్య |
ప్రీతిం పరాం ప్రాప్స్యసి తాం తథైవ
పుత్రస్తు తే ప్రాప్స్యతి యౌవరాజ్యమ్ || ౪౩ ||

ధాత్రా విధానం విహితం తథైవ
న శూరపత్న్యః పరిదేవయంతి |
ఆశ్వాసితా తేన తు రాఘవేణ
ప్రభావయుక్తేన పరంతపేన |
సా వీరపత్నీ ధ్వనతా ముఖేన
సువేషరూపా విరరామ తారా || ౪౪ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే చతుర్వింశః సర్గః || ౨౪ ||

Kishkindha Kanda Sarga 24 Meaning In Telugu

వాలి బతికి ఉన్నప్పుడు వాలి చావాలి అని కోరుకున్న సుగ్రీవుడు వాలి మృతదేహము చూడగానే దుఃఖము ఆపుకోలేక పోయాడు. రాముని వద్దకు వెళ్లి ఇలా అన్నాడు.

“రామా! మిత్రమా! ఏదో ఆవేశంలో నా అన్న వాలిని చంపమని నిన్నుకోరాను. కానీ ఇప్పుడు నా అన్న మృతదేహాన్ని ప్రత్యక్షంగా చూస్తుంటే నాకు నా జీవితమే వ్యర్ధము అనిపిస్తూ ఉంది. ఇహలోక భోగముల మీద ఆసక్తి పోయింది. కిష్కింధకు మహారాజు వాలి మరణించాడు. కిష్కింధా మహారాణి తార, భర్త దేహము మీద పడి ఏడుస్తూ ఉంది. కిష్కింధా నగరమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. అంగదుని భవిష్యత్తు ఏమిటో తెలియడం లేదు. ఇవన్నీ చూస్తుంటే నాకూ రాజ్యాభిలాష చచ్చిపోయింది.

రామా! పూర్వము వాలి నా భార్యను అపహరించి, నన్ను రాజ్యము నుండి వెళ్ల గొట్టాడని అతని మీద పట్టరానికోపం ఉండేది. కానీ ఇప్పుడు చచ్చిపడి ఉన్న వాలిని చూస్తుంటే ఆ కోపం అంతా మటుమాయం అయింది. కోపం స్థానంలో దుఃఖము ఆవరించింది. కిష్కింధలో ఉండి రాజ్యము చేసే దాని కన్నా ఇదివరకు మాదిరి ఋష్యమూక పర్వతము మీద కందమూలములు, ఫలములు ఆరగిస్తూ ప్రశాంత జీవనం గడపడం మేలు అనిపిస్తూ ఉంది. నా అన్న వాలి లేకపోయిన తరువాత నాకు స్వర్గ సుఖములు కూడా వృధా అనిపిస్తూ ఉన్నాయి.

రామా! నా అన్న వాలి నన్ను ఎన్నడూ చంపాలి అని అనుకోలేదు. “పోరా పో! ఎక్కడైనా ప్రాణాలతో బతుకు పో” అని అనేవాడు. కాని నేను నా అన్న వాలిని చంపాలని అనుకున్నాను. అది ఆయన గొప్పతనం. ఇది నా అల్పబుద్ధి.

రామా! ఎంత రాజ్యము మీద కోరిక ఉన్నా, అన్నను చంపి రాజ్యము చేయాలనే కోరిక నాకు ఏనాడూ లేదు. నా అన్న వాలి తన ఉదార బుద్ధితో నన్ను చంపడానికి ఏనాడూ ఇష్టపడలేదు. కానీ నేను నా బుద్ధి పెడతోవబెట్టి నా అన్నను చంపడానికి నిన్ను ఆశ్రయించాను. నేను తప్పు చేసినపుడు నా అన్న నన్ను చిన్న చెట్టు కొమ్మతో కొట్టి బుద్ధి చెప్పేవాడు. కాని నేను నా క్రోధముతో, వక్రబుద్ధితో, వానరస్వభావముతో నా అన్ననే చంపడానికి పూనుకున్నాను. నా అన్నను చంపి ఎనలేని పాపమును మూటకట్టుకున్నాను. ఆ పాపము ఈ జన్మలో తీరేది కాదు. జన్మజన్మలకూ నన్ను వెంటాడుతూ ఉంటుంది.

పూర్వము ఇంద్రుడు విశ్వరూపుని చంపి బ్రహ్మహత్యా పాతకము మూటగట్టుకున్నాడు. ఆ పాపమును భూమికి, జలానికి, వృక్షములకు, స్త్రీలకు, పంచి పెట్టాడు. కాని నేను నాఅన్నను చంపిన పాపమును స్వీకరించడానికి ఎవరు ఉన్నారు రామా! నేను స్వయంగా అనుభవించాలి తప్పదు.
నా అన్నను చంపి నేను అధర్మానికి ఒడిగట్టాను. లోక నిందకు పాల్పడ్డాను. నేను రాజ్యాధికారమునకు అర్హుడను కాను. నేను చేసిన పాపము ఏనుగు రూపంలో నన్ను కకావికలు చేస్తూ ఉంది. నా శరీరంలో మంచితనము మృగ్యము అయి పోయింది.

పాపం ప్రవేశించింది. తండ్రిని పోగొట్టుకొని అంగదుడు జీవించలేడు. కొడుకును పోగొట్టుకొని తార జీవించలేదు. నా అనే వాళ్లు అందరినీ పోగొట్టుకొని నేను జీవించడం ఎందుకు వృధా. నేను నా అన్న వాలితో పాటు అగ్నిలో ఆహుతి అవుతాను. ఈ వానరులు సీతను వెదకడంలో నీకు సాయపడతారు. నేను మరణించినా నీ కార్యము మాత్రం సిద్ధిస్తుంది. కులనాశమునకు కారణమైన నేను ఈ లోకంలో జీవించడం వృధా. నేను మరణించడానికి అనుమతి ఇవ్వండి.” అని రాముని ముందు దీనంగా వేడుకున్నాడు.

సుగ్రీవుని మాటలు విని రాముడు కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. రాముడు, భర్త శవం మీద పడి ఏడుస్తున్న తార వంక చూచాడు. తార తల ఎత్తి రాముని వంక చూచింది. చేతిలో ధనుర్బాణములను ధరించి ఠీవిగా నిలబడి ఉన్న సూర్యుని వంటి తేజస్సుతో వెలిగిపోతున్న రాముడిని చూచింది. తన భర్తను చంపిన రాముడు అతడే అని గుర్తించింది. తార, భర్త శవం పక్కనుండి లేచి, రాముని వద్దకు వెళ్ళింది.

“రామా! నీవు ధర్మపరుడవు. ఇంద్రియములను జయించిన వాడవు. కీర్తివంతుడవు. అమితమైన పరాక్రమ వంతుడవు. ధనుర్బాణములను ధరించిన వాడవు. నా పట్ల కూడా నీ ధర్మం నెరవేర్చు. భర్తలేనిదే భార్యకు జీవితం లేదు. ఏ బాణంతో నా భర్త ప్రాణం తీసావో అదే బాణంతో నా ప్రాణం కూడా తియ్యి. నన్ను నా భర్త వద్దకు పంపు. దయచేసి ఆ పుణ్యం కట్టుకో. ఎందుకంటే నా భర్త స్వర్గానికి పోయినా అక్కడ ఉన్న అప్సర స్త్రీల వంకచూడడు. నా కోసం ఎదురు చూస్తుంటాడు. నేను దగ్గర లేకపోతే వాలికి స్వర్గం కూడా నిస్సారంగా కనిపిస్తుంది. కాబట్టి నన్ను కూడా చంపి నా భర్త వద్దకు పంపు. నేను స్త్రీ అనీ, స్త్రీని చంపితే స్త్రీ హత్యా పాతకము చుట్టుకుంటుందని సందేహించకు. నేను కూడా వాలినే అనుకో. అప్పుడు నీకు ఆ దోషం అంటదు. ఒకసారి వివాహము అయిన తరువాత భర్త, భార్య వేరు కాదు. ఇరువురి శరీరాలు ఒకటే. ఇది వేదములలో చెప్పబడినది. కాబట్టి వేదవిహితమైన కార్యము దోషము కాదు కదా!

ఓ రామా! ఈ పెద్దలు నన్ను నా భర్తను వేరు చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. నువ్వు నన్ను చంపితే నేను కూడా సత్వరమే నా భర్త వద్దకు చేరుకుంటున్నాను. నీవు ఇప్పుడు నన్ను చంపకపోయినా, వాలి లేకుండా నేను ఎక్కువ కాలము జీవించలేను. కాబట్టి నన్ను వెంటనే చంపు.” అని రాముని దీనంగా వేడుకుంది తార.

దీనాలాపనలు విని రాముడు చలించి పోయాడు. ఆమెను చూచి ఇలా అన్నాడు. “అమ్మా తారా! నువ్వు వీరుని భార్యవు. ఇలా బేలగా మాట్లాడటం తగదు. నువ్వు విపరీతంగా మాట్లాడుతున్నావు. ఈ ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించాడు. సృష్టిలోని అన్ని జాతులకూ సుఖ దు:ఖాలను పెట్టాడు. ఎవరు కూడా బ్రహ్మ సృష్టిని అతిక్రమించ లేరు. కాబట్టి దు:ఖము మాని ఓర్పు వహించు.

కిష్కింధా రాజ్యానికి నీ కుమారుడు యువరాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. నీవు వీర పత్నివి. వీర మాతవు. ఇది బ్రహ్మ విధించిన అందరికీ సమ్మతమైన విధానము. దీనిని ఎవరూ అతిక్రమించలేరు. నీ వంటి వీర పత్ని ఇలా విలపించరాదు.”అని రాముడు తారతో చెప్పాడు.
(తార ఇలా సుదీర్ఘంగా విలపించడం ప్రాచ్యపాఠములో లేదని, ఎవరో తదుపరి చేర్చారని పండితుల అభిప్రాయము. అదే కాదు, తార రామునికి ఒక శాపం ఇచ్చినట్టు ప్రాచ్య పాఠంలో ఉందని, ” నాకు నా భర్తకు అకాల వియోగం కల్పించావు కాబట్టి, నీకు తాత్కాలికంగా నీ భార్య లభించినా, శాశ్వతంగా భార్యావియోగం కలుగుతుంది” అని తార రామునికి శాపం ఇచ్చినట్టు ప్రాచ్యపాఠంలో ఉందని పండితుల అభిప్రాయము.)

శ్రీమద్రామాయణము,
కిష్కింధా కాండము ఇరువది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ పంచవింశః సర్గః (25) >>>

Kishkindha Kanda Sarga 23 In Telugu – కిష్కింధాకాండ త్రయోవింశః సర్గః

Kishkindha Kanda Sarga 23

కిష్కింధాకాండ త్రయోవింశః సర్గంలో, వాలిని రాముడు బాణంతో చంపిన తర్వాత సుగ్రీవుడు ఎంతో బాధ పడతాడు. వాలి చివరి శ్వాసలు తీసుకుంటూ రాముడితో మాట్లాడి, సుగ్రీవుని రక్షించమని అభ్యర్థిస్తాడు. రాముడు వాలికి సంతాపం తెలియజేసి, సుగ్రీవుని రాజ్యాన్ని పొందడం సరియైనదని చెప్పి అతనిని ఆత్మస్థైర్యంతో నిలిపి, అతని కర్తవ్యం నిర్వర్తించమని సలహా ఇస్తాడు. వాలిని అంజనాదేవి (తార) కన్నీళ్లు పెట్టుకొని బాధ పడుతుంది. వాలి చివరగా రాముని క్షమాపణ కోరతాడు, అప్పుడు రాముడు వాలిని శాంతినిచ్చి, సుగ్రీవుని రాజుగా నియమించడానికి ఏర్పాట్లు చేయడం మొదలుపెడతాడు.

అంగదాభివాదనమ్

తతః సముపజిఘ్రంతీ కపిరాజస్య తన్ముఖమ్ |
పతిం లోకాచ్చ్యుతం తారా మృతం వచనమబ్రవీత్ || ౧ ||

శేషే త్వం విషమే దుఃఖమనుక్త్వా వచనం మమ |
ఉపలోపచితే వీర సుదుఃఖే వసుధాతలే || ౨ ||

మత్తః ప్రియతరా నూనం వానరేంద్ర మహీ తవ |
శేషే హి తాం పరిష్వజ్య మాం చ న ప్రతిభాషసే || ౩ ||

సుగ్రీవస్య వశం ప్రాప్తో విధిరేష భవత్యహో |
సుగ్రీవ ఏవ విక్రాంతో వీర సాహసికప్రియ || ౪ ||

ఋక్షవానరముఖ్యాస్త్వాం బలినః పర్యుపాసతే |
ఏషాం విలపితం కృచ్ఛ్రమంగదస్య చ శోచతః || ౫ ||

మమ చేమాం గిరం శ్రుత్వా కిం త్వం న ప్రతిబుధ్యసే |
ఇదం తద్వీరశయనం యత్ర శేషే హతో యుధి || ౬ ||

శాయితా నిహతా యత్ర త్వయైవ రిపవః పురా |
విశుద్ధసత్త్వాభిజన ప్రియయుద్ధ మమ ప్రియ || ౭ ||

మామనాథాం విహాయైకాం గతస్త్వమసి మానద |
శూరాయ న ప్రదాతవ్యా కన్యా ఖలు విపశ్చితా || ౮ ||

శూరభార్యాం హతాం పశ్య సద్యో మాం విధవాం కృతామ్ |
అవభగ్నశ్చ మే మానో భగ్నా మే శాశ్వతీ గతిః || ౯ ||

అగాధే చ నిమగ్నాఽస్మి విపులే శోకసాగరే |
అశ్మసారమయం నూనమిదం మే హృదయం దృఢమ్ || ౧౦ ||

భర్తారం నిహతం దృష్ట్వా యన్నాద్య శతధా గతమ్ |
సుహృచ్చైవ హి భర్తా చ ప్రకృత్యా మమ చ ప్రియః || ౧౧ ||

ఆహవే చ పరాక్రాంతః శూరః పంచత్వమాగతః |
పతిహీనా తు యా నారీ కామం భవతు పుత్రిణీ || ౧౨ ||

ధనధాన్యైః సుపూర్ణాపి విధవేత్యుచ్యతే జనైః |
స్వగాత్రప్రభవే వీర శేషే రుధిరమండలే || ౧౩ ||

కృమిరాగపరిస్తోమే త్వమాత్మశయనే యథా |
రేణుశోణితసంవీతం గాత్రం తవ సమంతతః || ౧౪ ||

పరిరబ్ధుం న శక్నోమి భుజాభ్యాం ప్లవగర్షభ |
కృతకృత్యోఽద్య సుగ్రీవో వైరేఽస్మిన్నతిదారుణే || ౧౫ ||

యస్య రామవిముక్తేన హృతమేకేషుణా భయమ్ |
శరేణ హృది లగ్నేన గాత్రసంస్పర్శనే తవ || ౧౬ ||

వార్యామి త్వాం నిరీక్షంతీ త్వయి పంచత్వమాగతే |
ఉద్బబర్హ శరం నీలస్తస్య గాత్రగతం తదా || ౧౭ ||

గిరిగహ్వరసంలీనం దీప్తమాశీవిషం యథా |
తస్య నిష్కృష్యమాణస్య బాణస్య చ బభౌ ద్యుతిః || ౧౮ ||

అస్తమస్తకసంరుద్ధో రశ్మిర్దినకరాదివ |
పేతుః క్షతజధారాస్తు వ్రణేభ్యస్తస్య సర్వశః || ౧౯ ||

తామ్రగైరికసంపృక్తా ధారా ఇవ ధరాధరాత్ |
అవకీర్ణం విమార్జంతీ భర్తారం రణరేణునా || ౨౦ ||

ఆస్రైర్నయనజైః శూరం సిషేచాస్త్రసమాహతమ్ |
రుధిరోక్షితసర్వాంగం దృష్ట్వా వినిహతం పతిమ్ || ౨౧ ||

ఉవాచ తారా పింగాక్షం పుత్రమంగదమంగనా |
అవస్థాం పశ్చిమాం పశ్య పితుః పుత్ర సుదారుణామ్ || ౨౨ ||

సంప్రసక్తస్య వైరస్య గతోఽంతః పాపకర్మణా |
బాలసూర్యోదయతనుం ప్రయాంతం యమసాదనమ్ || ౨౩ ||

అభివాదయ రాజానం పితరం పుత్ర మానదమ్ |
ఏవముక్తః సముత్థాయ జగ్రాహ చరణౌ పితుః || ౨౪ ||

భుజాభ్యాం పీనవృత్తాభ్యామంగదోఽహమితి బ్రువన్ |
అభివాదయమానం త్వామంగదం త్వం యథా పురా || ౨౫ ||

దీర్ఘాయుర్భవ పుత్రేతి కిమర్థం నాభిభాషసే |
అహం పుత్రసహాయా త్వాముపాసే గతచేతనమ్ || ౨౬ ||

సింహేన నిహతం సద్యో గౌః సవత్సేవ గోవృషమ్ |
ఇష్ట్వా సంగ్రామయజ్ఞేన రామప్రహరణాంభసి || ౨౭ ||

అస్మిన్నవభృథే స్నాతః కథం పత్న్యా మయా వినా |
యా దత్తా దేవరాజేన తవ తుష్టేన సంయుగే || ౨౮ ||

శాతకుంభమయీం మాలాం తాం తే పశ్యామి నేహ కిమ్ |
రాజశ్రీర్న జహాతి త్వాం గతాసుమపి మానద |
సూర్యస్యావర్తమానస్య శైలరాజమివ ప్రభా || ౨౯ ||

న మే వచః పథ్యమిదం త్వయా కృతం
న చాస్మి శక్తా వినివారణే తవ |
హతా సపుత్రాఽస్మి హతేన సంయుగే
సహ త్వయా శ్రీర్విజహాతి మామిహ || ౩౦ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే త్రయోవింశః సర్గః || ౨౩ ||

Kishkindha Kanda Sarga 23 Meaning In Telugu

తార తన భర్త ముఖాన్ని చూస్తూ తట్టుకోలేక ఈ విధంగా విలపిస్తూ ఉంది. “నాధా! అర్థరాత్రి సుగ్రీవునితోయుద్ధానికి పోవద్దని నేను నీకు శతవిధాలా చెప్పాను. కానీ నీవు నా మాటను పెడచెవిని పెట్టావు. అందుకే నేను ఇక్కడే ఉన్నా భూదేవిని కౌగలించుకొని పడుకున్నావు. ముల్లోకాలను గడగడలాండిచి ఎవరికీ లొంగని నీవు, నీ తమ్ముడు, నీ కన్నా దుర్బలుడైన సుగ్రీవుని చేతిలో ఓడిపాయావా! ఎంత ఆశ్చర్యము.

నాధా! వానర నాయకులు, భల్లూకనాయకులు నిన్ను సేవించడానికి వచ్చారు. లే. వారిని ఆదరించు. వారితో మాట్లాడు. నీవు నీ శత్రువులను చంపి వారిని భూతల శయనము చెందేట్టు చేసావు. ఇప్పుడు నీవు కూడా నీశత్రువు చేతిలో చంపబడి భూతలము మీద శయనించి ఉన్నావా!
నాధా! నన్ను అనాధనుచేసి నీవు ఒంటరిగా వెళ్లిపోవడం నీకు న్యాయంగా ఉందా నాధా! ఈ లోకంలో బుద్ధి ఉన్న వాడు ఎవ్వడూ తన కుమార్తెను వీరుడికి, పరాక్రమవంతుడికి ఇవ్వకూడదు. ఎందుకంటే శూరుడి భార్యకు నా మాదిరి అకాల వైధవ్యము తప్పదుకదా! వారు శోక సముద్రములో మునిగి పోక తప్పదు కదా! నీ మరణము కనులారా చూచికూడా నా హృదయము బద్దలు కాలేదంటే, నా గుండె కటిక పాషాణముతో సమానము కదా!

నాధా! ఈ లోకంలో స్త్రీకి ఎన్ని సంపదలు ఉన్నా, ఎంత వైభవము ఉన్నా, భర్తలేకపోతే ఆమెను విధవ అనే అంటారు. అటువంటి వైధవ్యము నాకు సంప్రాప్తించింది. ఎలాభరించాలి! ఈ సమయంలో నిన్ను తనివిదీరా కౌగలించుకొని ఏడవకుండా నీ శరీరం రక్తసిక్తమయింది. సుగ్రీవుని ఆశలు నెరవేర్చిన ఈ రాముని బాణము ఇంకా నీ శరీరంలో ఎందుకు ?”అంటూ తార వాలి శరీరంలో నుండి రాముని ధనుస్సు వెడలిన బాణమును బయటకు లాగింది.

వాలి శరీరంనుండి రామ బాణమును బయటకు లాగగానే, ఆ గాయము నుండి రక్తం జలధార మాదిరి పైకి ఉబికింది. తార తన కళ్లనుండి నీరు కారుతుండగా వాలి గాయము నుండి స్రవించిన రక్తాన్ని తుడిచింది. తార తన కుమారుడు అంగదుని చూచి ఇలా అంది.

“నాయనా! అంగదా! నీ తండ్రిని కడసారి చూచి నమస్కారం చెయ్యి.” వెంటనే అంగదుడు పైకి లేచి తన తండ్రి వాలికి భక్తితో నమస్కారం చేసాడు. “నాధా! నేను తమరి కుమారుడు అంగదుడు పక్కనే కూర్చుని ఉన్నాము. తమరి కుమారుడు అంగదుడు నమస్కరించు చున్నాడు. ఆశీర్వదించండి” అని విలపించింది తార.

ఓనాధా! మీరు, మీ తమ్ముడు సుగ్రీవునితో యుద్ధము అనే యజ్ఞమును చేసి, మీ భార్యనైన నేను లేకుండానే, రక్తంతో అవభృధ స్నానం చేస్తున్నారా! (యజ్ఞము చేసిన తరువాత భార్యా భర్తలు కలిసి పవిత్రమైన అవభృధ స్నానము చేయడం ఆచారం. రాజసూయ యాగము అయిన తరువాత అవభృధ స్నానంతో పవిత్రమైన తనకురులను ఆ దుష్టుడు దుశ్శాసనుడు తాకాడని ద్రౌపది కోపంతో ఊగిపోయింది.)

నా మాట వినకుండా యుద్ధమనే యజ్ఞము చేసి ఒంటరిగా అవభృధ స్నానం చేసారా! నాధా! మరణించింది నీవు మాత్రమే కాదు. నేను, నా కుమారుడు అంగదుడు కూడా మరణించాము. జీవచ్ఛవాల మాదిరి మిగిలిపోయాము. నీవు మమ్ములను విడిచిపోయినట్టు మా ఐశ్వర్యము కూడా మమ్ములను విడిచి పెట్టి పోయింది.” అని ఏడుస్తూ ఉంది తార.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

కిష్కింధాకాండ చతుర్వింశః సర్గః (24) >>>

Kishkindha Kanda Sarga 22 In Telugu – కిష్కింధాకాండ ద్వావింశః సర్గః

Kishkindha Kanda Sarga 22

కిష్కింధాకాండ ద్వావింశః సర్గంలో, హనుమాన్ సుగ్రీవుని సల్లాపాన్ని రాముని వద్ద వివరిస్తాడు. రాముడు సుగ్రీవుని సమస్యలు తెలుసుకొని, వాలిని చంపడానికి సుగ్రీవుని సహాయం చేయడానికి నిర్ణయిస్తాడు. సుగ్రీవుడు తన యోధులను సమీకరించి, రాముని సహాయంతో వాలిని ఎదిరించడానికి సిద్ధమవుతాడు. వాలి తన సోదరుడు సుగ్రీవుని ఎదిరించడానికి వస్తాడు. సుగ్రీవుడు రాముని మద్దతుతో వాలితో యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. యుద్ధం తీవ్రంగా సాగుతుంది, కానీ రాముడు వాలిని నిశితంగా చూసి సుగ్రీవుని రక్షణలో నిలబడి, వాలిని కుష్టిదాడితో చంపేస్తాడు.

వాల్యనుశాసనమ్

వీక్షమాణస్తు మందాసుః సర్వతో మందముచ్ఛ్వసన్ |
ఆదావేవ తు సుగ్రీవం దదర్శ త్వాత్మజాగ్రతః || ౧ ||

తం ప్రాప్తవిజయం వాలీ సుగ్రీవం ప్లవగేశ్వరః |
ఆభాష్య వ్యక్తయా వాచా సస్నేహమిదమబ్రవీత్ || ౨ ||

సుగ్రీవ దోషేణ న మాం గంతుమర్హసి కిల్బిషాత్ |
కృష్యమాణం భవిష్యేణ బుద్ధిమోహేన మాం బలాత్ || ౩ ||

యుగపద్విహితం తాత న మన్యే సుఖమావయోః |
సౌహార్దం భ్రాతృయుక్తం హి తదిదం తాత నాన్యథా || ౪ ||

ప్రతిపద్య త్వమద్యైవ రాజ్యమేషాం వనౌకసామ్ |
మామప్యద్యైవ గచ్ఛంతం విద్ధి వైవస్వతక్షయమ్ || ౫ ||

జీవితం చ హి రాజ్యం చ శ్రియం చ విపులామిమామ్ |
ప్రజహామ్యేష వై తూర్ణం మహచ్చాగర్హితం యశః || ౬ ||

అస్యాం త్వహమవస్థానాం వీర వక్ష్యామి యద్వచః |
యద్యప్యసుకరం రాజన్ కర్తుమేవ తదర్హసి || ౭ ||

సుఖార్హం సుఖసంవృద్ధిం బాలమేనమబాలిశమ్ |
బాష్పపూర్ణముఖం పశ్య భూమౌ పతితమంగదమ్ || ౮ ||

మమ ప్రాణైః ప్రియతరం పుత్రం పుత్రమివౌరసమ్ |
మయా హీనమహీనార్థం సర్వతః పరిపాలయ || ౯ ||

త్వమేవాస్య హి దాతా చ పరిత్రాతా చ సర్వతః |
భయేష్వభయదశ్చైవ యథాఽహం ప్లవగేశ్వర || ౧౦ ||

ఏష తారాత్మజః శ్రీమాంస్త్వయా తుల్యపరాక్రమః |
రక్షసాం తు వధే తేషామగ్రతస్తే భవిష్యతి || ౧౧ ||

అనురూపాణి కర్మాణి విక్రమ్య బలవాన్ రణే |
కరిష్యత్యేష తారేయస్తరస్వీ తరుణోఽంగదః || ౧౨ ||

సుషేణదుహితా చేయమర్థసూక్ష్మవినిశ్చయే |
ఔత్పాతికే చ వివిధే సర్వతః పరినిష్ఠితా || ౧౩ ||

యదేషా సాధ్వితి బ్రూయాత్ కార్యం తన్ముక్తసంశయమ్ |
న హి తారామతం కించిదన్యథా పరివర్తతే || ౧౪ ||

రాఘవస్య చ తే కార్యం కర్తవ్యమవిశంకయా |
స్యాదధర్మో హ్యకరణే త్వాం చ హింస్యాద్విమానితః || ౧౫ ||

ఇమాం చ మాలామాధత్స్వ దివ్యాం సుగ్రీవ కాంచనీమ్ |
ఉదారా శ్రీః స్థితా హ్యస్యాం సంప్రజహ్యాన్మృతే మయి || ౧౬ ||

ఇత్యేవముక్తః సుగ్రీవో వాలినా భ్రాతృసౌహృదాత్ |
హర్షం త్యక్త్వా పునర్దీనో గ్రహగ్రస్త ఇవోడురాట్ || ౧౭ ||

తద్వాలివచనాచ్ఛాంతః కుర్వన్యుక్తమతంద్రితః |
జగ్రాహ సోఽభ్యనుజ్ఞాతో మాలాం తాం చైవ కాంచనీమ్ || ౧౮ ||

తాం మాలాం కాంచనీం దత్త్వా వాలీ దృష్ట్వాఽఽత్మజం స్థితమ్ |
సంసిద్ధః ప్రేత్యభావాయ స్నేహాదంగదమబ్రవీత్ || ౧౯ ||

దేశకాలౌ భజస్వాద్య క్షమమాణః ప్రియాప్రియే |
సుఖదుఃఖసహః కాలే సుగ్రీవవశగో భవ || ౨౦ ||

యథా హి త్వం మహాబాహో లాలితః సతతం మయా |
న తథా వర్తమానం త్వాం సుగ్రీవో బహు మంస్యతే || ౨౧ ||

మాస్యామిత్రైర్గతం గచ్ఛేర్మా శత్రుభిరరిందమ |
భర్తురర్థపరో దాంతః సుగ్రీవవశగో భవ || ౨౨ ||

న చాతిప్రణయః కార్యః కర్తవ్యోఽప్రణయశ్చ తే |
ఉభయం హి మహాన్ దోషస్తస్మాదంతరదృగ్భవ || ౨౩ ||

ఇత్యుక్త్వాఽథ వివృత్తాక్షః శరసంపీడితో భృశమ్ |
వివృతైర్దశనైర్భీమైర్బభూవోత్క్రాంతజీవితః || ౨౪ ||

తతో విచుక్రుశుస్తత్ర వానరా హరియూథపాః |
పరిదేవయమానాస్తే సర్వే ప్లవగపుంగవాః || ౨౫ ||

కిష్కింధా హ్యద్య శూన్యాసీత్స్వర్గతే వానరాధిపే |
ఉద్యానాని చ శూన్యాని పర్వతాః కాననాని చ || ౨౬ ||

హతే ప్లవగశార్దూలే నిష్ప్రభా వానరాః కృతాః |
యేన దత్తం మహద్యుద్ధం గంధర్వస్య మహాత్మనః || ౨౭ ||

గోలభస్య మహాబాహోర్దశ వర్షాణి పంచ చ |
నైవ రాత్రౌ న దివసే తద్యుద్ధముపశామ్యతి || ౨౮ ||

తతస్తు షోడశే వర్షే గోలభో వినిపాతితః |
హత్వా తం దుర్వినీతం తు వాలీ దంష్ట్రాకరాలవాన్ |
సర్వాభయకరోఽస్మాకం కథమేష నిపాతితః || ౨౯ ||

హతే తు వీరే ప్లవగాధిపే తదా
ప్లవంగమాస్తత్ర న శర్మ లేభిరే |
వనేచరాః సింహయుతే మహావనే
యథా హి గావో నిహతే గవాం పతౌ || ౩౦ ||

తతస్తు తారా వ్యసనార్ణవాప్లుతా
మృతస్య భర్తుర్వదనం సమీక్ష్య సా |
జగామ భూమిం పరిరభ్య వాలినం
మహాద్రుమం ఛిన్నమివాశ్రితా లతా || ౩౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే ద్వావింశః సర్గః || ౨౨ ||

Kishkindha Kanda Sarga 22 Meaning In Telugu

అప్పటికి వాలి ప్రాణాలు ఇంకా పోలేదు. కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. నెమ్మదిగా కళ్లు తెరిచాడు. తార వంక చూచాడు. తన కుమారుడు అంగదుని వంక, తార వంక మార్చి మార్చి చూచాడు. సుగ్రీవుని తన దగ్గరకు పిలిచాడు. అతి కష్టం మీద ఇలా అన్నాడు.
“సుగ్రీవా! నేను నీ పట్ల చాలా అపరాధము చేసాను. నన్ను క్షమించు. నా బుద్ధి వక్రించి నీ భార్యను నా దగ్గర ఉంచుకొని నిన్ను రాజ్యము నుండి వెడలగొట్టాను. మన ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండవలెనని బ్రహ్మ రాసి ఉన్నాడు. అందుకే నేను యమలోకమునకు పోతున్నాను. నీవు ఈ కిష్కింధను పాలించు. ఎవరి చేతిలోనూ ఓడి పోని నేను రామునిచేతిలో ఓడిపోయాను. ధర్మానికి ఓడిపోయాను. నా మరణావస్థలో నేను నీకు ఒక మాట చెపుతాను.

సావధానంగా విను. వీలైతే ఆచరణలో పెట్టు. నా కొడుకు అంగదుడు. చిన్నవాడు. చూడు ఎలా నేల మీద పడి పొర్లుతున్నాడో. అంగదుడు చిన్నప్పటి నుండి. సుఖాలలో పెరిగాడు. కష్టము అంటే ఎరుగడు. వాడిని నేను నా ప్రాణముల కంటే ఎక్కువగా చూచుకున్నాను. నా కుమారుడు అంగదుని నీ కుమారునిగా భావించు. వాడికి ఏ లోటూ రాకుండా చూచుకో. ఇంక మీదట నుండి అంగదునికి తండ్రివి, దాతవు, రక్షకుడివి, అభయ ప్రదాతవు అన్నీ నువ్వే. అంగదుడు నీకు అన్ని విధాలా తోడ్పడగలడు. యుద్ధములో నీకు అండగాఉండి అన్ని విధాలా నా కొడుకు అనిపించుకుంటాడు. ఇంక ఈమె నా భార్య తార. సుషేణుని కుమార్తె. ఎంతటి క్లిష్ట సమస్యనైనా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోడంలో సమర్థురాలు. ఎటువంటి ఉపద్రవకర పరిస్థితులకు కూడా ఎదురు నిలిచి, సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం కలది. తార ఆలోచించి చేయమన్న కార్యమును నీవు నిస్సందేహంగా చేయవచ్చును. నీకు జయం లభిస్తుంది.

తరువాత, నీవు రామునితో ఏ కార్యము నిమిత్తము మైత్రి చేసుకున్నావో ఆ కార్యమును తక్షణం నెరవేర్చు. రాముడిని అవమానించకు. మోసగించకు. అలాచేస్తే రాముడు నా మాదిరి నిన్ను కూడా చంపుతాడు.

సుగ్రీవా! నా మెడలో ఉన్న బంగారు మాల నాకు ఇంద్రుడు ఇచ్చాడు. దానిని నీవు వెంటనే తీసుకో. అది నా ఒంటిమీద ఉండగా నేను చనిపోతే దానికి శవదోషం తగులుతుంది. అప్పుడు దాని మహత్తు పోతుంది. కాబట్టి వెంటనే తీసుకొని నీ మెడలో వేసుకో.” అని అన్నాడు వాలి.
వాలి మాటలు విని సుగ్రీవునికి దుఃఖము పొర్లుకొచ్చింది. ఏడుస్తూనే వాలి మెడలో ఉన్న బంగారు మాలను తీసుకొని తనమెడలో వేసుకున్నాడు. వాలి అంగదుని వంక చూచి ఇలా అన్నాడు. “కుమారా! అంగదా! ఇంక మీదట నీకు అన్నీ నీ పినతండ్రి సుగ్రీవుడే. సు:ఖము వచ్చినా, దు:ఖము వచ్చినా ఓర్చుకో. కాలానుగుణంగా ప్రవర్తించు. సుగ్రీవుని ఆజ్ఞలను పాలించు. నేను కాబట్టి నీవు ఏమి చేసినను ఓర్చుకున్నాను. సహించాను. కాని ఇదివరకటి మాదిరి చేస్తే సుగ్రీవునికి కోపం రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా నడుచుకో. సుగ్రీవునికి కోపం తెప్పించకు.

ఇంకొక మాట. నీవు ఇంక మీదట సుగ్రీవుని అధీనంలో ఉండబోతున్నావు. సుగ్రీవుని శత్రువులతో స్నేహం చేయకు. అలాగే సుగ్రీవుని మిత్రులతో శత్రుత్వం పెట్టుకోకు. సుగ్రీవునికి ఇష్టమైన పనులనే చేస్తూ ఉండు. ఇంకొక విషయం. నీవు ఎవరి పట్ల ఎక్కువ ప్రేమ, అలాగే ఎక్కువ ద్వేషము కలిగి ఉండకు. ఎందుకంటే అతిగా ఉండటం ఎప్పుడూ అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి రాగద్వేషాలలో సమతుల్యం పాటించు. మధ్యస్తంగా వ్యవహరించు.”

అలా మాట్లాడుతూనే వాలి ఆఖరిశ్వాస విడిచాడు. వాలి మరణించాడు అని తెలియగానే వానరులందరూ బిగ్గరగా ఏడవడం మొదలెట్టారు. వాలి మరణంతో కిష్కింధా నగరము కళావిహీన మయింది. వాలి యొక్క పరాక్రమము, వీరత్వము, వాలి చేసిన యుద్ధములు, వాలి చంపిన వారి గురించి వానరులు తలచుకొని తలచుకొని ఏడుస్తున్నారు. తన కళ్ల ఎదుటే ప్రాణాలు విడిగిన తనభర్త వాలినిచూచి తట్టుకోలేక తార వాలి శరీరం మీద పడి ఏడుస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది రెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ త్రయోవింశః సర్గః (23) >>>

Kishkindha Kanda Sarga 21 In Telugu – కిష్కింధాకాండ ఏకవింశః సర్గః

Kishkindha Kanda Sarga 21

కిష్కింధాకాండంలో ఏకవింశః సర్గంలో, హనుమాన్ సుగ్రీవుని దర్శించి శ్రీరాముని సందేశం తెలియజేస్తాడు. సుగ్రీవుడు రాముని పరిచయం గురించి విన్నతర్వాత తన బాధలను వివరించడానికి హనుమాంతో మాట్లాడతాడు. వాలి భయంతో సుగ్రీవుడు కిష్కింధను విడిచిపెట్టి మల్యవంత పర్వతం వద్ద ఆశ్రయం పొందినట్లు చెప్పినప్పుడు హనుమాన్ రాముని దక్షిణ దిశలో వెతికినట్లు వివరిస్తాడు. రాముడు సుగ్రీవుని సమస్యను పరిష్కరించడానికి వాలి యుద్ధంలో సహాయం చేస్తానని వాగ్దానం చేస్తాడు.

హనుమదాశ్వాసనమ్

తతో నిపతితాం తారాం చ్యుతాం తారామివాంబరాత్ |
శనైరాశ్వాసయామాస హనుమాన్ హరియూథపః || ౧ ||

గుణదోషకృతం జంతుః స్వకర్మఫలహేతుకమ్ |
అవ్యగ్రస్తదవాప్నోతి సర్వం ప్రేత్య శుభాశుభమ్ || ౨ ||

శోచ్యా శోచసి కం శోచ్యం దీనం దీనాఽనుకంపసే |
కస్య కో వాఽను శోచ్యోఽస్తి దేహేఽస్మిన్ బుద్బుదోపమే || ౩ ||

అంగదస్తు కుమారోఽయం ద్రష్టవ్యో జీవపుత్రయా |
ఆయత్యాం చ విధేయాని సమర్థాన్యస్య చింతయ || ౪ ||

జానాస్యనియతామేవం భూతానామాగతిం గతిమ్ |
తస్మాచ్ఛుభం హి కర్తవ్యం పండితేనైహలౌకికమ్ || ౫ ||

యస్మిన్ హరిసహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ |
వర్తయంతి కృతాంశాని సోఽయం దిష్టాంతమాగతః || ౬ ||

యదయం న్యాయదృష్టార్థః సామదానక్షమాపరః |
గతో ధర్మజితాం భూమిం నైనం శోచితుమర్హసి || ౭ ||

సర్వే హి హరిశార్దూలాః పుత్రశ్చాయం తవాంగదః |
ఇదం హర్యృక్షరాజ్యం చ త్వత్సనాథమనిందితే || ౮ ||

తావిమౌ శోకసంతాపౌ శనైః ప్రేరయ భామిని |
త్వాయా పరిగృహీతోఽయమంగదః శాస్తు మేదినీమ్ || ౯ ||

సంతతిశ్చ యథా దృష్టా కృత్యం యచ్చాపి సామ్ప్రతమ్ |
రాజ్ఞస్తత్క్రియతాం తావదేష కాలస్య నిశ్చయః || ౧౦ ||

సంస్కార్యో హరిరాజశ్చ అంగదశ్చాభిషిచ్యతామ్ |
సింహాసనగతం పుత్రం పశ్యంతీ శాంతిమేష్యసి || ౧౧ ||

సా తస్య వచనం శ్రుత్వా భర్తృవ్యసనపీడితా |
అబ్రవీదుత్తరం తారా హనుమంతమవస్థితమ్ || ౧౨ ||

అంగదప్రతిరూపాణాం పుత్రాణామేకతః శతమ్ |
హతస్యాప్యస్య వీరస్య గాత్రసంశ్లేషణం వరమ్ || ౧౩ ||

న చాహం హరిరాజస్య ప్రభావామ్యంగదస్య వా |
పితృవ్యస్తస్య సుగ్రీవః సర్వకార్యేష్వనంతరః || ౧౪ ||

న హ్యేషా బుద్ధిరాస్థేయా హనుమన్నంగదం ప్రతి |
పితా హి బంధుః పుత్రస్య న మాతా హరిసత్తమ || ౧౫ ||

న హి మమ హరిరాజసంశ్రయాత్
క్షమతరమస్తి పరత్ర చేహ వా |
అభిముఖహతవీరసేవితం
శయనమిదం మమ సేవితుం క్షమమ్ || ౧౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకవింశః సర్గః || ౨౧ ||

Kishkindha Kanda Sarga 21 Meaning In Telugu

తార అలా ఏడుస్తుంటే హనుమంతుడు ముందుకు వచ్చి ఆమెను ఓదారుస్తున్నాడు. “అమ్మా! తారా! మనము చేసిన కర్మలను బట్టి ఫలితాలు వస్తుంటాయి. వాలి తాను చేసిన అకృత్యములకు ఫలితము అనుభవించాడు. దీనికి చింతించి ప్రయోజనము లేదు. ఈ దేహములు నీటి బుడగలు. కాలానుగుణంగా అవి బద్దలు అవుతుంటాయి. అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వారమే. పోయిన వాలి గురించి విచారించే కంటే బతికి ఉన్న అంగదుని క్షేమం గురించి విచారించు. పుట్టిన ప్రతి ప్రాణీ చావక తప్పదు. కాబట్టి చనిపోయిన వారి గురించి ఆలోచించక, నీ శేషజీవితములో శుభం కలగాలని కోరుకో! అదే ప్రస్తుత కర్తవ్యము.

ఇప్పటి దాకా ఈ కిష్కింధలో ఉన్న వేలకొలది వానరులు వాలి సంరక్షణలో హాయిగా జీవించారు. ఇప్పుడు వాలి లేడు. స్వర్గమునకు వెళ్లాడు. స్వర్గసుఖములు అనుభవించుచున్న వాలి గురించి దు:ఖించడం అవివేకము. ఈ కిష్కింధలో ఉన్న వేలాది వానరులకు, భల్లూకములకు వాలి మరణానంతరము నీవు, అంగదుడు రక్షకులు. అంగదునికి పట్టాభిషేకము చేస్తాము. నీ సంరక్షణలో అంగదుడు రాజ్యము చేస్తాడు. తదుపరి కార్యక్రమములు నిర్వర్తించమని సుగ్రీవునికి ఆదేశములు ఇవ్వు. ఇప్పుడు అంగదుడు, సుగ్రీవుడు, వాలికి శాస్త్రములలో నిర్ణయింపబడినట్టు ఉత్తర క్రియలు నిర్వహించాలి. వాలికి దహన సంస్కారములు చెయ్యాలి.” అని పలికాడు హనుమంతుడు.

భర్త మరణముతో బాధ పడుతున్న తార, హనుమంతుని మాటలు విని ఇలా అంది. “హనుమా! నాకు నా భర్త లేకపోయిన తరువాత అంగదుని వంటి కుమారులు నూరు మంది ఉన్నా ఏమి ప్రయోజనము. నా శక్తి, నా సామర్థ్యము అన్నీ నా భర్తతోనే పోయాయి. నేను అశక్తురాలను. అన్ని వ్యవహారములు అంగదుని పినతండ్రి సుగ్రీవుని ఆజ్ఞప్రకారమే చెయ్యండి. అంగదుని యోగక్షేమములు విచారించుటకు నేను అర్హురాలిని కాను. అది తండ్రి బాధ్యత. తండ్రి లేనపుడు పినతండ్రి బాధ్యత. కాబట్టి అంగదుని యోగక్షేమముల గురించి సుగ్రీవుడు చూచుకొన గలడు. ఇన్నాళ్లు నేను నా భర్త వాలిని సేవించాను. ఇప్పుడు ఆయన పోయిన మార్గమునే అనుసరిస్తాను. నా భర్త పక్కనే నేను ఉంటాను. ఇది నా నిశ్చయము.” అని పలికింది తార.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ ద్వావింశః సర్గః (22) >>>

Kishkindha Kanda Sarga 20 In Telugu – కిష్కింధాకాండ వింశః సర్గః

Kishkindha Kanda Sarga 20

కిష్కింధాకాండంలో వింశం సర్గంలో, రాముడు లక్ష్మణుడిని వానర సేనలకు సహాయంగా పంపిస్తాడు. సుగ్రీవుడు హనుమంతుడిని కళంకించడానికి చేయాల్సి, అవను మొదటి రామాయణ వెర్షన్ను చెప్పింది. రాముని సోదరి శ్రీమతి మారుతి వాల్మీకితో సందేహంకు కారణమైన కోపానికి ప్రకారం మరులసియుండదు.

తారావిలాపః

రామచాపవిసృష్టేన శరేణాంతకరేణ తమ్ |
దృష్ట్వా వినిహతం భూమౌ తారా తారాధిపాననా || ౧ ||

సా సమాసాద్య భర్తారం పర్యష్వజత భామినీ |
ఇషుణాభిహతం దృష్ట్వా వాలినం కుంజరోపమమ్ || ౨ ||

వానరేంద్రం మహేంద్రాభం శోకసంతప్తమానసా |
తారా తరుమివోన్మూలం పర్యదేవయదాతురా || ౩ ||

రణే దారుణ విక్రాంత ప్రవీర ప్లవతాం వర |
కిం దీనామపురోభాగామద్య త్వం నాభిభాషసే || ౪ ||

ఉత్తిష్ఠ హరిశార్దూల భజస్వ శయనోత్తమమ్ |
నైవంవిధాః శేరతే హి భూమౌ నృపతిసత్తమాః || ౫ ||

అతీవ ఖలు తే కాంతా వసుధా వసుధాధిప |
గతాసురపి యాం గాత్రైర్మాం విహాయ నిషేవసే || ౬ ||

వ్యక్తమన్యా త్వయా వీర ధర్మతః సంప్రవర్తితా |
కిష్కింధేవ పురీ రమ్యా స్వర్గమార్గే వినిర్మితా || ౭ ||

యాన్యస్మాభిస్త్వయా సార్ధం వనేషు మధుగంధిషు |
విహృతాని త్వయా కాలే తేషాముపరమః కృతః || ౮ ||

నిరానందా నిరాశాహం నిమగ్నా శోకసాగరే |
త్వయి పంచత్వమాపన్నే మహాయూథపయూథపే || ౯ ||

హృదయం సుస్థిరం మహ్యం దృష్ట్వా వినిహతం పతిమ్ |
యన్న శోకాభిసంతప్తం స్ఫుటతేఽద్య సహస్రధా || ౧౦ ||

సుగ్రీవస్య త్వయా భార్యా హృతా స చ వివాసితః |
యత్తు తస్య త్వయా వ్యుష్టిః ప్రాప్తేయం ప్లవగాధిప || ౧౧ ||

నిఃశ్రేయసపరా మోహాత్త్వయా చాహం విగర్హితా |
యైషాఽబ్రవం హితం వాక్యం వానరేంద్ర హితైషిణీ || ౧౨ ||

రూపయౌవనదృప్తానాం దక్షిణానాం చ మానద |
నూనమప్సరసామార్య చిత్తాని ప్రమథిష్యసి || ౧౩ ||

కాలో నిఃసంశయో నూనం జీవితాంతకరస్తవ |
బలాద్యేనావపన్నోఽసి సుగ్రీవస్యావశో వశమ్ || ౧౪ ||

వైధవ్యం శోకసంతాపం కృపణం కృపణా సతీ |
అదుఃఖోపచితా పూర్వం వర్తయిష్యామ్యనాథవత్ || ౧౫ ||

లాలితశ్చాంగదో వీరః సుకుమారః సుఖోచితః |
వత్స్యతే కామవస్థాం మే పితృవ్యే క్రోధమూర్ఛితే || ౧౬ ||

కురుష్వ పితరం పుత్ర సుదృష్టం ధర్మవత్సలమ్ |
దుర్లభం దర్శనం వత్స తవ తస్య భవిష్యతి || ౧౭ ||

సమాశ్వాసయ పుత్రం త్వం సందేశం సందిశస్వ చ |
మూర్ధ్ని చైనం సమాఘ్రాయ ప్రవాసం ప్రస్థితో హ్యసి || ౧౮ ||

రామేణ హి మహత్కర్మకృతం త్వామభినిఘ్నతా |
ఆనృణ్యం చ గతం తస్య సుగ్రవస్య ప్రతిశ్రవే || ౧౯ ||

సకామో భవ సుగ్రీవ రుమాం త్వం ప్రతిపత్స్యసే |
భుంక్ష్వ రాజ్యమనుద్విగ్నః శస్తో భ్రాతా రిపుస్తవ || ౨౦ ||

కిం మామేవం విలపతీం ప్రేమ్ణా త్వం నాభిభాషసే |
ఇమాః పశ్య వరా బహ్వీర్భార్యాస్తే వానరేశ్వర || ౨౧ ||

తస్యా విలపితం శ్రుత్వా వానర్యః సర్వతశ్చ తాః |
పరిగృహ్యాంగదం దీనం దుఃఖార్తాః పరిచుక్రుశుః || ౨౨ ||

కిమంగదం సాంగదవీరబాహో
విహాయ యాస్యద్య చిరప్రవాసమ్ |
న యుక్తమేవం గుణసన్నికృష్టం
విహాయ పుత్రం ప్రియపుత్ర గంతుమ్ || ౨౩ ||

కిమప్రియిం తే ప్రియచారువేష
మయా కృతం నాథ సుతేన వా తే |
సహాంగదాం మాం స విహాయ వీర
యత్ప్రస్థితో దీర్ఘమితః ప్రవాసమ్ || ౨౪ ||

యద్యప్రియం కించిదసంప్రధార్య
కృతం మయా స్యాత్తవ దీర్ఘబాహో |
క్షమస్వ మే తద్ధరివంశనాథ
వ్రజామి మూర్ధ్నా తవ వీర పాదౌ || ౨౫ ||

తథా తు తారా కరుణం రుదంతీ
భర్తుః సమీపే సహ వానరీభిః |
వ్యవస్యత ప్రాయముపోపవేష్టు-
-మనింద్యవర్ణా భువి యత్ర వాలీ || ౨౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే వింశః సర్గః || ౨౦ ||

Kishkindha Kanda Sarga 20 Meaning In Telugu

రాముని బాణం దెబ్బతిని చావుబతుకుల్లో ఉన్న భర్త వాలిని చూచి తార భోరున ఏడిచింది. “ఓ వీరుడా! నీవు లోకోత్తర వీరుడవే. నీ వీరత్వము, పరాక్రమము ఏమైపోయాయి. ఎందుకు ఇలా దీనంగా నేల మీద పడి ఉన్నావు. నేను, నీ భార్య తారను, వచ్చాను. లే. నన్ను పలకరించు. నీవు మహారాజువు. ఇలా నేల మీద పడుకోవడం తగునా. లేచి మెత్తని హంసతూలికా తల్పం మీద పడుకో. ఓ భూనాధా! ఇన్నాళ్లు ఈ భూమిని పాలించిన నీవు, అవసాన సమయంలో కూడా భూదేవిని వదల లేక. ఆమెను కౌగలించుకొని పడుకున్నావా!

ఓ వానరవీరా! ఎంతో కష్టపడి, స్వర్గాన్ని తలదన్నే విధంగా, ఈ కిష్కింధను నిర్మించావు. ఇప్పుడు ఆ కిష్కింధను వదిలి ఎక్కడకు పోతున్నావు? నాధా! నేను నీ వియోగము తట్టుకోలేకున్నాను. నన్ను విడిచి వెళ్లవద్దు. నిన్ను ఈ స్థితిలో చూచి కూడా నా హృదయం బద్దలు కాలేదంటే, నా గుండె కఠినమైన పాషాణము అనుకుంటాను. అయినా కాలగతిని ఎవరు తప్పించగలరు. ఈ కాలమే నిన్ను సుగ్రీవుని చేతిలో మరణించేట్టు చేసింది.
నాధా! నేను నీకు భార్యగా ఉన్నాను. నేను కాకుండా ఎంతో మంత్రి స్త్రీలు ఉన్నారు కదా! కానీ నీవు ఆ సుగ్రీవుని భార్యను కోరుకున్నావు. అతనిని రాజ్యము నుండి వెళ్లగొట్టావు. దాని ఫలితమే నీకు సంప్రాప్తించిన ఈ దుర్మరణం. నాధా! నీవు సుగ్రీవునితో యుద్ధానికి పోకముందు ఎన్నోవిధాలుగా చెప్పాను. సుగ్రీవునితో సంధి చేసుకోమన్నాను. కానీ నీవు నా మాటలను పెడచెవిని పెట్టావు. పైగా నన్ను నిందించావు. కోరి కోరి మరణాన్ని కౌగలించుకున్నావు.

నాధా! రాముడు నిన్ను చంపినందుకు నేను చారించడం లేదు. కానీ ఏ నాడూ కష్టము గానీ, దు:ఖము కానీ అనుభవించని నేను ఈ వైధవ్య దుఃఖమును అనుభవించవలసి రావడం చాలా బాధగా ఉంది. నాధా! నీ కుమారుడు అంగదుని చూడండి. చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా పెరిగాడు. ఇప్పుడు పినతండ్రి సుగ్రీవుని వశమయ్యాడు. ఎన్ని బాధలు పడతాడో ఏమో!

నాయనా! అంగదా! నీ తండ్రివాలిని చూడు. కడసారి దర్శనం చేసుకో. ఇంక మీదట రోజూ చూచే నీ తండ్రి ముఖం రేపటి నుండి నీకు కనిపించదు. నాథా! నీ కుమారుడు అంగదుడు నిన్ను పిలుస్తున్నాడు. అంగదుని పలకరించు. అతనికి జీవితంలో నడుచుకోవలసిన జాగ్రత్తలు చెప్పు.
నాధా! నిన్ను చంపడం ద్వారా రాముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. సుగ్రీవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఓ సుగ్రీవా! నీ కోరిక తీరింది కదా! ఇంక నీ భార్య రుమ నీకు లభిస్తుందిలే. నీవు ఏ దిగులు, భయమూ లేకుండా ఈ కిష్కింధను ఏలుకో! నీ అన్న వాలిని చంపించావు కదా! ఇంకనీకు అడ్డేముంది.

నాధా! నేను ఇంతగా మాట్లాడుతున్నా నువ్వు ఒక్కమాట కూడా పలుకవేమి? మాట్లాడు. నేనే కాదు. నీ భార్యలందరూ వచ్చి ఉన్నారు. వారి వంక కన్నెత్తి చూడు. వారిని పలకరించు.” అని తార, ఆమెతో వచ్చిన వాలి భార్యలు వలా వలా ఏడుస్తున్నారు. అంగదుని పట్టుకొని రోదిస్తున్నారు.
తారకు ఇంకా ఆశ చావలేదు. వాలి మరలా బతుకుతాడని ఆశతో వాలిని కుదిపి కుదిపి ఏడుస్తూ ఉంది. “ఓ నాధా! నేను, అంగదుడు ఏమి అపరాధము చేసామని మమ్ములను విడిచి పోతున్నావు. తెలిసో తెలియకో మేము నీ పట్ల ఏమైనా అపరాధము చేస్తే దానిని క్షమించు. నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను.” అని వాలి పాదాల మీద తల పెట్టి ఏడుస్తూ ఉంది తార. భర్త లేని బతుకు తనకు వ్యర్ధమని ఎంచి, తార తన భర్త వాలితో పాటు ప్రాయోపవేశము చెయ్యాలని నిర్ణయించుకుంది.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ ఏకవింశః సర్గః (21) >>>

Kishkindha Kanda Sarga 19 In Telugu – కిష్కింధాకాండ ఏకోనవింశః సర్గః

Kishkindha Kanda Sarga 19

కిష్కింధాకాండంలో ఏకోనవింశం సర్గంలో, హనుమంతుడు లక్ష్మణుడిని ఆశ్వాసన ఇస్తాడు మరియు రాముని సహాయాన్ని పూర్తిచేస్తాడు. వాల్మీకి మహర్షి సహాయంతో రామాయణ కథని ఆరంభిస్తాడు. రాముడు హనుమంతుడి వర్ణనను ఆదరిస్తున్నాడు, అది పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి హనుమంతుడి అదృష్టాన్ని శ్రేష్టిస్తాడని వెలుగులు వ్యక్తం చేస్తాడు.

తారాగమనమ్

స వానరమహారాజః శయానః శరవిక్షతః |
ప్రత్యుక్తో హేతుమద్వాక్యైర్నోత్తరం ప్రత్యపద్యత || ౧ ||

అశ్మభిః ప్రవిభిన్నాంగః పాదపైరాహతో భృశమ్ |
రామబాణేన చ క్రాంతో జీవితాంతే ముమోహ సః || ౨ ||

తం భార్యా బాణమోక్షేణ రామదత్తేన సంయుగే |
హతం ప్లవగశార్దూలం తారా శుశ్రావ వాలినమ్ || ౩ ||

సా సపుత్రాప్రియం శ్రుత్వా వధం భర్తుః సుదారుణమ్ |
నిష్పపాత భృశం త్రస్తా మృగీవ గిరిగహ్వరాత్ || ౪ ||

యే త్వంగదపరీవారా వానరా భీమవిక్రమాః |
తే సకార్ముకమాలోక్య రామం త్రస్తాః ప్రదుద్రువుః || ౫ ||

సా దదర్శ తతస్త్రస్తాన్ హరీనాపతతో ద్రుతమ్ |
యూథాదివ పరిభ్రష్టాన్ మృగాన్నిహతయూథపాన్ || ౬ ||

తానువాచ సమాసాద్య దుఃఖితాన్ దుఃఖితా సతీ |
రామవిత్రాసితాన్ సర్వాననుబద్ధానివేషుభిః || ౭ ||

వానరా రాజసింహస్య యస్య యూయం పురఃసరాః |
తం విహాయ సుసంత్రస్తాః కస్మాద్ద్రవథ దుర్గతాః || ౮ ||

రాజ్యహేతోః స చేద్భ్రాతా భ్రాత్రా రౌద్రేణ పాతితః |
రామేణ ప్రహితై రౌద్రైర్మార్గణైర్దూరపాతిభిః || ౯ ||

కపిపత్న్యా వచః శ్రుత్వా కపయః కామరూపిణః |
ప్రాప్తకాలమవిక్లిష్టమూచుర్వచనమంగనామ్ || ౧౦ ||

జీవపుత్రే నివర్తస్వ పుత్రం రక్షస్వ చాంగదమ్ |
అంతకో రామరూపేణ హత్వా నయతి వాలినమ్ || ౧౧ ||

క్షిప్తాన్ వృక్షాన్ సమావిధ్య విపులాశ్చ శిలాస్తథా |
వాలీ వజ్రసమైర్బాణై రామేణ వినిపాతితః || ౧౨ ||

అభిద్రుతమిదం సర్వం విద్రుతం ప్రసృతం బలమ్ |
అస్మిన్ ప్లవగశార్దూలే హతే శక్రసమప్రభే || ౧౩ ||

రక్ష్యతాం నగరద్వారమంగదశ్చాభిషిచ్యతామ్ |
పదస్థం వాలినః పుత్రం భజిష్యంతి ప్లవంగమాః || ౧౪ ||

అథవారుచితం స్థానమిహ తే రుచిరాననే |
ఆవిశంతి హి దుర్గాణి క్షిప్రమన్యాని వానరాః || ౧౫ ||

అభార్యాశ్చ సభార్యాశ్చ సంత్యత్ర వనచారిణః |
లుబ్ధేభ్యో విప్రయుక్తేభ్యస్తేభ్యో నస్తుములం భయమ్ || ౧౬ ||

అల్పాంతరగతానాం తు శ్రుత్వా వచనమంగనా |
ఆత్మనః ప్రతిరూపం సా బభాషే చారుహాసినీ || ౧౭ ||

పుత్రేణ మమ కిం కార్యం కిం రాజ్యేన కిమాత్మనా |
కపిసింహే మహాభాగే తస్మిన్ భర్తరి నశ్యతి || ౧౮ ||

పాదమూలం గమిష్యామి తస్యైవాహం మహాత్మనః |
యోఽసౌ రామప్రయుక్తేన శరేణ వినిపాతితః || ౧౯ ||

ఏవముక్త్వా ప్రదుద్రావ రుదంతీ శోకకర్శితా |
శిరశ్చోరశ్చ బాహుభ్యాం దుఃఖేన సమభిఘ్నతీ || ౨౦ ||

ఆవ్రజంతీ దదర్శాథ పతిం నిపతితం భువి |
హంతారం దానవేంద్రాణాం సమరేష్వనివర్తినామ్ || ౨౧ ||

క్షేప్తారం పర్వతేంద్రాణాం వజ్రాణామివ వాసవమ్ |
మహావాతసమావిష్టం మహామేఘౌఘనిఃస్వనమ్ || ౨౨ ||

శక్రతుల్యపరాక్రాంతం వృష్ట్వేవోపరతం ఘనమ్ |
నర్దంతం నర్దతాం భీమం శూరం శూరేణ పాతితమ్ || ౨౩ ||

శార్దూలేనామిషస్యార్థే మృగరాజం యథా హతమ్ |
అర్చితం సర్వలోకస్య సపతాకం సవేదికమ్ || ౨౪ ||

నాగహేతోః సుపర్ణేన చైత్యమున్మథితం యథా |
అవష్టభ్య చ తిష్ఠంతం దదర్శ ధనురుత్తమమ్ || ౨౫ ||

రామం రామానుజం చైవ భర్తుశ్చైవానుజం శుభా |
తానతీత్య సమాసాద్య భర్తారం నిహతం రణే || ౨౬ ||

సమీక్ష్య వ్యథితా భూమౌ సంభ్రాంతా నిపపాత హ |
సుప్త్వేవ పునరుత్థాయ ఆర్యపుత్రేతి క్రోశతీ |
రురోద సా పతిం దృష్ట్వా సందితం మృత్యుదామభిః || ౨౭ ||

తామవేక్ష్య తు సుగ్రీవః క్రోశంతీం కురరీమివ |
విషాదమగమత్కష్టం దష్ట్వా చాంగదమాగతమ్ || ౨౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకోనవింశః సర్గః || ౧౯ ||

Kishkindha Kanda Sarga 19 Meaning In Telugu

వాలిని రాముడు తన బాణంతో కొట్టడం, వాలి పడిపోవడం, చనిపోయే స్థితిలో ఉండటం వాలి భార్య తారకు తెలిసింది. వాలి, తారల కుమారుడు అంగదుడు ఆమె పక్కనే ఉన్నాడు. తార, అంగదులు వాలి దుర్మరణానికి ఎంతో దుఃఖించారు. వాలి దగ్గరకు పరుగు పరుగున వస్తున్నారు.
అప్పటికే, ధనుస్సును ధరించి, కాలయముని మాదిరి నిలబడి ఉన్న రాముని చూచి వానరులు అందరూ పారిపోయారు. పారి పోతున్న వానరులను చూచింది తార. తార వారిని చూచి ఇలా పలికింది. “ఓ వానరులారా! ఇప్పటి వరకూ మీరు మీ రాజు వాలి వెంట ఉండే వాళ్లు కదా. ఇప్పుడు ఎందుకు ఇలా పారిపోతున్నారు. రాజ్యం కోసరం సుగ్రీవుడు, తాను ఏమీ చేయలేక, రాముని సాయంతో మీ రాజు వాలిని చంపించాడు. మీరు ఎందుకు పారిపోతున్నారు? భయపడకండి. పారిపోకండి. నాతో రండి.” అని అన్నది తార.

పారిపోతున్న వానరులు తార మాటలు విని వెనక్కు తిరిగి వచ్చారు. తారను చూచి ఇలా అన్నారు. “అమ్మా తారా! ముందు నీవు, నీ కుమారుడు అంగదుడిని రక్షించుకో. లేకపోతే రాముడు అంగదుడిని కూడా చంపుతాడు. సుగ్రీవునికి అడ్డం లేకుండా చేస్తాడు. రాముడు వాలిని చంపగానే, మేమందరమూ భయంతో పారిపోయాము. అమ్మా తారా! నీవు అంగదుని రాజుగా అభిషేకించు. మేమందరమూ అంగదుని, వాలిని సేవించినట్టు సేవిస్తాము.” అని ఎవరికి తోచినట్టు వారు అరిచారు.

మరి కొందరు తారను చూచి “తారా! నీవు అంగదుడు ఇక్కడ ఉండటం మంచిది కాదు. సుగ్రీవుడు, అతని మంత్రులు రాజదుర్గములను ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటిదాకా మనము సుగ్రీవుని అతని మంత్రులను నానా కష్టాలుపెట్టాము. వాళ్లు ఇప్పుడు మనమీద పగతీర్చుకొనే అవకాశం ఉంది. కాబట్టి నీవు అంగదునితో కలిసి పారిపో” అని సలహా ఇచ్చారు.

ఆ మాటలు విన్న తార వారితో ఇలా అంది. “ఓ వానరవీరులారా! నా సర్వస్వము అయిన నా భర్త పోయాక, నాకు ఈ రాజ్యంతో, నా కొడకుతో, ఈ శరీరంతో పనేముంది. నేను నా భర్త వద్దకు వెళ్లాలి. నా భర్త ఎక్కడ ఉన్నాడు. ఏస్థితిలో ఉన్నాడు.” అంటూ ఏడుస్తూ వాలి వద్దకు పరుగెత్తింది.
దుందుభి లాంటి రాక్షసులను మట్టుబెట్టిన వాలి, పరాక్రమంలో దేవేంద్రునితో సమానమైన వాలి, మరణావస్థలో నేలమీద పడి ఉండటం చూచింది. వాలి దేహము పక్కన ధనుస్సు ఊతంగా పట్టుకొని నిలబడి ఉన్న రాముని, లక్ష్మణుని, తన భర్త వాలి తమ్ముడు సుగ్రీవునీ చూచింది. నేరుగా వెళ్లి తన భర్త శరీరం మీద పడిపోయింది. “ఆర్య పుత్రా! లేవండి. నేను మీ తారను వచ్చాను లేవండి.” అంటూ రోదిస్తూ ఉంది. తన వదిన తారను, తన అన్నకుమారుడు అంగదుని చూచి సుగ్రీవునికి దుఃఖము ఆగలేదు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ వింశః సర్గః (20) >>>

Kishkindha Kanda Sarga 6 In Telugu – కిష్కింధాకాండ షష్ఠః సర్గః

Kishkindha Kanda Sarga 6

కిష్కింధాకాండలో షష్ఠ సర్గ, హనుమంతుడు సీతను వెతికే ప్రస్థానంలో కీలకమైనది. అన్వేషణ బృందం దక్షిణ దిశలోని ఎడారి, అడవులు దాటింది. అన్వేషణలో వారు సింహిక అనే రాక్షసితో పోరాడుతారు, హనుమంతుడు ఆమెను సంహరిస్తాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, హనుమంతుడు ధైర్యంతో ముందుకు సాగుతాడు. చివరికి, వారికి సంపాతి అనే జటాయువు సోదరుడు లభిస్తాడు, అతను సీత లంకలో ఉంది అని సమాచారమిస్తాడు. ఈ వార్తతో హనుమంతుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, అంగదుడు తదితరులు ఉత్సాహంగా లంకకు ప్రయాణించడానికి సిద్ధమవుతారు. ఈ సర్గలో హనుమంతుడి ధైర్యం, ప్రతిభ, అన్వేషణలో ఉత్సాహం ప్రధానంగా చూపిస్తాయి.

భూషణప్రత్యభిజ్ఞానమ్

పునరేవాబ్రవీత్ ప్రీతో రాఘవం రఘునందనమ్ |
అయమాఖ్యాతి మే రామ సచివో మంత్రిసత్తమః || ౧ ||

హనుమాన్ యన్నిమిత్తం త్వం నిర్జనం వనమాగతః |
లక్ష్మణేన సహ భ్రాత్రా వసతశ్చ వనే తవ || ౨ ||

రక్షసాఽపహృతా భార్యా మైథిలీ జనకాత్మజా |
త్వయా వియుక్తా రుదతీ లక్ష్మణేన చ ధీమతా || ౩ ||

అంతరప్రేప్సునా తేన హత్వా గృధ్రం జటాయుషమ్ |
భార్యావియోగజం దుఃఖమచిరాత్త్వం విమోక్ష్యసే || ౪ ||

అహం తామానయిష్యామి నష్టాం వేదశ్రుతీమివ |
రసాతలే వా వర్తంతీం వర్తంతీం వా నభస్తలే || ౫ ||

అహమానీయ దాస్యామి తవ భార్యామరిందమ |
ఇదం తథ్యం మమ వచస్త్వమవేహి చ రాఘవ || ౬ ||

న శక్యా సా జరయితుమపి సేంద్రైః సురాసురైః |
తవ భార్యా మహాబాహో భక్ష్యం విషకృతం యథా || ౭ ||

త్యజ శోకం మహాబాహో తాం కాంతామానయామి తే |
అనుమానాత్తు జానామి మైథిలీ సా న సంశయః || ౮ ||

హ్రియమాణా మయా దృష్టా రక్షసా క్రూరకర్మణా |
క్రోశంతీ రామ రామేతి లక్ష్మణేతి చ విస్వరమ్ || ౯ ||

స్ఫురంతీ రావణస్యాంకే పన్నగేంద్రవధూర్యథా |
ఆత్మనా పంచమం మాం హి దృష్ట్వా శైలతటే స్థితమ్ || ౧౦ ||

ఉత్తరీయం తయా త్యక్తం శుభాన్యాభరణాని చ |
తాన్యస్మాభిర్గృహీతాని నిహితాని చ రాఘవ || ౧౧ ||

ఆనయిష్యామ్యహం తాని ప్రత్యభిజ్ఞాతుమర్హసి |
తమబ్రవీత్తతో రామః సుగ్రీవం ప్రియవాదినమ్ || ౧౨ ||

ఆనయస్వ సఖే శీఘ్రం కిమర్థం ప్రవిలంబసే |
ఏవముక్తస్తు సుగ్రీవః శైలస్య గహనాం గుహామ్ || ౧౩ ||

ప్రవివేశ తతః శీఘ్రం రాఘవప్రియకామ్యయా |
ఉత్తరీయం గృహీత్వా తు శుభాన్యాభరణాని చ || ౧౪ ||

ఇదం పశ్యేతి రామాయ దర్శయామాస వానరః |
తతో గృహీత్వా తద్వాసః శుభాన్యాభరణాని చ || ౧౫ ||

అభవద్బాష్పసంరుద్ధో నీహారేణేవ చంద్రమాః |
సీతాస్నేహప్రవృత్తేన స తు బాష్పేణ దూషితః || ౧౬ ||

హా ప్రియేతి రుదన్ ధైర్యముత్సృజ్య న్యపతత్ క్షితౌ |
హృది కృత్వా తు బహుశస్తమలంకారముత్తమమ్ || ౧౭ ||

నిశశ్వాస భృశం సర్పో బిలస్థ ఇవ రోషితః |
అవిచ్ఛిన్నాశ్రువేగస్తు సౌమిత్రిం వీక్ష్య పార్శ్వతః || ౧౮ ||

పరిదేవయితుం దీనం రామః సముపచక్రమే |
పశ్య లక్ష్మణ వైదేహ్యా సంత్యక్తం హ్రియమాణయా || ౧౯ ||

ఉత్తరీయమిదం భూమౌ శరీరాద్భూషణాని చ |
శాద్వలిన్యాం ధ్రువం భూమ్యాం సీతయా హ్రియమాణయా || ౨౦ ||

ఉత్సృష్టం భూషణమిదం తథారూపం హి దృశ్యతే |
ఏవముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్ || ౨౧ ||

నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే |
నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ || ౨౨ ||

తతః స రాఘవో దీనః సుగ్రీవమిదమబ్రవీత్ |
బ్రూహి సుగ్రీవ కం దేశం హ్రియంతీ లక్షితా త్వయా || ౨౩ ||

రక్షసా రౌద్రరూపేణ మమ ప్రాణైః ప్రియా ప్రియా |
క్వ వా వసతి తద్రక్షో మహద్వ్యసనదం మమ || ౨౪ ||

యన్నిమిత్తమహం సర్వాన్నాశయిష్యామి రాక్షసాన్ |
హరతా మైథిలీం యేన మాం చ రోషయతా భృశమ్ |
ఆత్మనో జీవితాంతాయ మృత్యుద్వారమపావృతమ్ || ౨౫ ||

మమ దయితతరా హృతా వనాంతా-
-ద్రజనిచరేణ విమథ్య యేన సా |
కథయ మమ రిపుం త్వమద్య వై
ప్లవగపతే యమసన్నిధిం నయామి || ౨౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే షష్ఠః సర్గః || ౬ ||

Kishkindha Kanda Sarga 6 Meaning In Telugu

సుగ్రీవుడు రాముని చూచి ఇలా అన్నాడు. “రామా! నీ గురించి హనుమంతుడు నాకు అంతా చెప్పాడు. నీవు నీ సోదరుడు లక్ష్మణుడు ఈ అరణ్యవాసము ఎందుకు చేస్తున్నారో వివరంగా చెప్పాడు. నీ భార్య సీతను మీరు లేని సమయమున ఒక రాక్షసుడు అపహరించిన విషయం కూడా చెప్పాడు. నీవు నాకు మిత్రుడవు అయినావు. ఇంక నీ దు:ఖమును విడిచి పెట్టు. నీ భార్య సీత ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొని వచ్చి నీకు అప్పగిస్తాను. నీ దు:ఖాన్ని తొలగిస్తాను. నీ భార్య ఆకాశములో ఉన్నా, పాతాళములో ఉన్నా వెతికి తీసుకొని వస్తాను. ఇది సత్యము. నేను మాట తప్పను.

రామా! నీవు చెబుతుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తూ ఉంది. ఒక రోజు మేమందరమూ ఈ పర్వత శిఖరము మీద కూర్చుని ఉండగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని అపహరించుకు పోవడం, ఆమె రామా, రామా అని అరవడం మేము చూచాము. ఆమె సీతయే. సందేహము లేదు. ఆ రాక్షసుడు రావణుడు అయి ఉంటాడు. ఆమె అలా ఏడుస్తూ తన పైనున్న వస్త్రములో కొన్ని ఆభరణములను మూటగా కట్టి జారవిడిచినది. ఆ మూట మా దగ్గర పడింది. మేము వాటిని మా దగ్గరే ఉంచాము. వాటిని నీకు చూపిస్తాను. ఆ ఆభరణములను నీవు గుర్తు పట్టగలవేమో చూడు.”అని అన్నాడు సుగ్రీవుడు.

ఆ మాటలు విని రాముడు ఉత్సాహంగా “మిత్రమా! ఆ ఆభరణములు వస్త్రము త్వరగా తీసుకొనిరా. నా సీత ఆభరణములు, వస్త్రము నేను చూడాలి.” అని ఆతురతగా అన్నాడు రాముడు. సుగ్రీవుడు వెంటనే పక్కనేఉన్న గుహలోకి వెళ్లాడు.

క్షణములో ఒక ఉత్తరీయములో కట్టబడిన ఆభరణములను తీసుకొని వచ్చాడు. “రామా! ఇదే ఆ వస్త్రము. ఇవే ఆ ఆభరణములు. చూడు. ఇవి నీ భార్య సీతకు చెందినవేమో!”అని అన్నాడు.

రాముడు ఆ ఉత్తరీయమును, ఆభరణములను చూచాడు. రాముని కళ్లనిండా నీళ్లు కమ్మాయి. ఏమీ కనిపించడం లేదు మనసు వశం తప్పింది. “హా సీతా!” అంటూ కిందపడి పోయాడు. రాముడు ఆ ఆభరణములను ఉత్తరీయమును తన గుండెలకు హత్తుకున్నాడు. రాముని శ్వాస భారంగా వస్తూ ఉంది. నోట మాట రావడం లేదు. ఉ ద్వేగంతో ఉన్నాడు. రాముని కళ్ల నుండి నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఏడుస్తూ లక్ష్మణుని వంక చూచాడు.

“లక్ష్మణా! సీతను ఆ రాక్షసుడు అపహరించుకు పోతున్నప్పుడు సీత జారవిడిచిన ఆభరణములు, ఉత్తరీయము చూడు. ఇవి మెత్తని గడ్డి మీద పడి ఉంటాయి. అందుకనే విరిగిపోకుండా ఉ న్నాయి. లక్ష్మణా! సీత ఆభరణములను నీవు గుర్తు పట్టగలవా!”అని అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు.

“రామా! నాకు సీత ధరించే ఏ ఆభరణముల గురించి అంతగా తెలియదు. నేను ప్రతిరోజూ ఆమెకు పాదాభివందనము చేయునపుడు ఆమె కాళ్లకు ధరించే నూపురములు చూస్తూ ఉంటాను. కాబట్టి అవి మాత్రమే గుర్తు పట్టగలను.” అని అన్నాడు. (లక్ష్మణుడు చెప్పినట్టుగా రాయబడి ఉన్న ఈ శ్లోకము ప్రాచ్య ప్రతిలో లేదు అని పండితుల అభిప్రాయము.)

ఆ ఆభరణములను చూచి రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. “సుగ్రీవా! ఇవి నిస్సంశయముగా నా సీత ఆభరణములే. ఇది నా సీత ధరించిన ఉత్తరీయము. సీతను అపహరించిన ఆ రాక్షసుడు సీతను ఏ దేశమునకు తీసుకొని వెళ్లాడో చెప్పగలవా? ఆ రాక్షసుడు. ఎక్కడ ఉంటాడో చెప్పగలవా? వాడి మూలంగా రాక్షస జాతి అంతా సర్వనాశనం అవుతుంది. ఇది సత్యము. సీతను అపహరించి ఆ రాక్షసుడు తన మృత్యువును తానే కొని తెచ్చుకున్నాడు. సుగ్రీవా! చెప్పు. ఆ రాక్షసుడి గురించిన వివరాలు చెప్పు. వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు. ఇప్పుడే వాడిని సంహరిస్తాను.” అని కోపావేశంతో ఊగిపోతూ అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ సప్తమః సర్గః (7) >>

Kishkindha Kanda Sarga 18 In Telugu – కిష్కింధాకాండ అష్టాదశః సర్గః

Kishkindha Kanda Sarga 18

కిష్కింధాకాండంలో అష్టాదశం సర్గంలో, రాముడు హనుమంతుడిని సుగ్రీవుడి ప్రయత్నాలను మెరుగుపరచడానికి అధ్యాయంలో చేరుకున్నారు. హనుమంతుడు తన సౌమ్యతనంతో సుగ్రీవుడిని విశ్వాసంతో ప్రేరేపిస్తాడు. రాముడు లక్ష్మణుడి సహాయంతో రాముడిని ప్రకటించడం, వానరుల సేనల నుంచి రావాలని ప్రస్తావించడం కింద తన సౌమ్యంతో సుగ్రీవుడిని ప్రేరేపిస్తాడు.

వాలివధసమర్థనమ్

ఇత్యుక్తః ప్రశ్రితం వాక్యం ధర్మార్థసహితం హితమ్ |
పరుషం వాలినా రామో నిహతేన విచేతసా || ౧ ||

తం నిష్ప్రభమివాదిత్యం ముక్తతోయమివాంబుదమ్ |
ఉక్తవాక్యం హరిశ్రేష్ఠముపశాంతమివానలమ్ || ౨ ||

ధర్మార్థగుణసంపన్నం హరీశ్వరమనుత్తమమ్ |
అధిక్షిప్తస్తదా రామః పశ్చాద్వాలినమబ్రవీత్ || ౩ ||

ధర్మమర్థం చ కామం చ సమయం చాపి లౌకికమ్ |
అవిజ్ఞాయ కథం బాల్యాన్మామిహాద్య విగర్హసే || ౪ ||

అపృష్ట్వా బుద్ధిసంపన్నాన్ వృద్ధానాచార్యసమ్మతాన్ |
సౌమ్య వానర చాపల్యాత్కిం మాం వక్తుమిహేచ్ఛసి || ౫ ||

ఇక్ష్వాకూణామియం భూమిః సశైలవనకాననా |
మృగపక్షిమనుష్యాణాం నిగ్రహప్రగ్రహావపి || ౬ ||

తాం పాలయతి ధర్మాత్మా భరతః సత్యవాగృజుః |
ధర్మకామార్థతత్త్వజ్ఞో నిగ్రహానుగ్రహే రతః || ౭ ||

నయశ్చ వినయశ్చోభౌ యస్మిన్ సత్యం చ సుస్థితమ్ |
విక్రమశ్చ యథాదృష్టః స రాజా దేశకాలవిత్ || ౮ ||

తస్య ధర్మకృతాదేశా వయమన్యే చ పార్థివాః |
చరామో వసుధాం కృత్స్నాం ధర్మసంతానమిచ్ఛవః || ౯ ||

తస్మిన్నృపతిశార్దూలే భరతే ధర్మవత్సలే |
పాలయత్యఖిలాం భూమిం కశ్చరేద్ధర్మనిగ్రహమ్ || ౧౦ ||

తే వయం ధర్మవిభ్రష్టం స్వధర్మే పరమే స్థితాః |
భరతాజ్ఞాం పురస్కృత్య నిగృహ్ణీమో యథావిధి || ౧౧ ||

త్వం తు సంక్లిష్టధర్మా చ కర్మణా చ విగర్హితః |
కామతంత్రప్రధానశ్చ న స్థితో రాజవర్త్మని || ౧౨ ||

జ్యేష్ఠో భ్రాతా పితా చైవ యశ్చ విద్యాం ప్రయచ్ఛతి |
త్రయస్తే పితరో జ్ఞేయా ధర్మే పథి హి వర్తినః || ౧౩ ||

యవీయానాత్మనః పుత్రః శిష్యశ్చాపి గుణోదితః |
పుత్రవత్తే త్రయశ్చింత్యా ధర్మశ్చేదత్ర కారణమ్ || ౧౪ ||

సూక్ష్మః పరమదుర్జ్ఞేయః సతాం ధర్మః ప్లవంగమ |
హృదిస్థః సర్వభూతానామాత్మా వేద శుభాశుభమ్ || ౧౫ ||

చపలశ్చపలైః సార్ధం వానరైరకృతాత్మభిః |
జాత్యంధ ఇవ జాత్యంధైర్మంత్రయన్ ద్రక్ష్యసే ను కిమ్ || ౧౬ ||

అహం తు వ్యక్తతామస్య వచనస్య బ్రవీమి తే |
న హి మాం కేవలం రోషాత్త్వం విగర్హితుమర్హసి || ౧౭ ||

తదేతత్కారణం పశ్య యదర్థం త్వం మయా హతః |
భ్రాతుర్వర్తసి భార్యాయాం త్యక్త్వా ధర్మం సనాతనమ్ || ౧౮ ||

అస్య త్వం ధరమాణస్య సుగ్రీవస్య మహాత్మనః |
రుమాయాం వర్తసే కామాత్ స్నుషాయాం పాపకర్మకృత్ || ౧౯ ||

తద్వ్యతీతస్య తే ధర్మాత్కామవృత్తస్య వానర |
భ్రాతృభార్యావమర్శేఽస్మిన్ దండోఽయం ప్రతిపాదితః || ౨౦ ||

న హి ధర్మవిరుద్ధస్య లోకవృత్తాదపేయుషః |
దండాదన్యత్ర పశ్యామి నిగ్రహం హరియూథప || ౨౧ ||

న హి తే మర్షయే పాపం క్షత్రియోఽహం కులోద్భవః |
ఔరసీం భగినీం వాపి భార్యాం వాప్యనుజస్య యః || ౨౨ ||

ప్రచరేత నరః కామాత్తస్య దండో వధః స్మృతః |
భరతస్తు మహీపాలో వయం చాదేశవర్తినః || ౨౩ ||

త్వం తు ధర్మాదతిక్రాంతః కథం శక్యముపేక్షితుమ్ |
గురుర్ధర్మవ్యతిక్రాంతం ప్రాజ్ఞో ధర్మేణ పాలయన్ || ౨౪ ||

భరతః కామవృత్తానాం నిగ్రహే పర్యవస్థితః |
వయం తు భరతాదేశం విధిం కృత్వా హరీశ్వర || ౨౫ ||

త్వద్విధాన్ భిన్నమర్యాదాన్ నియంతుం పర్యవస్థితాః |
సుగ్రీవేణ చ మే సఖ్యం లక్ష్మణేన యథా తథా || ౨౬ ||

దారరాజ్యనిమిత్తం చ నిఃశ్రేయసి రతః స మే |
ప్రతిజ్ఞా చ మయా దత్తా తదా వానరసన్నిధౌ || ౨౭ ||

ప్రతిజ్ఞా చ కథం శక్యా మద్విధేనానవేక్షితుమ్ |
తదేభిః కారణైః సర్వైర్మహద్భిర్ధర్మసంహితైః || ౨౮ ||

శాసనం తవ యద్యుక్తం తద్భవాననుమన్యతామ్ |
సర్వథా ధర్మ ఇత్యేవ ద్రష్టవ్యస్తవ నిగ్రహః || ౨౯ ||

వయస్యస్యాపి కర్తవ్యం ధర్మమేవానుపశ్యతః |
శక్యం త్వయాపి తత్కార్యం ధర్మమేవానుపశ్యతా || ౩౦ ||

శ్రూయతే మనునా గీతౌ శ్లోకౌ చారిత్రవత్సలౌ |
గృహీతౌ ధర్మకుశలైస్తత్తథా చరితం హరే || ౩౧ ||

రాజభిర్ధృతదండాస్తు కృత్వా పాపాని మానవాః |
నిర్మలాః స్వర్గమాయాంతి సంతః సుకృతినో యథా || ౩౨ ||

శాసనాద్వా విమోక్షాద్వా స్తేనః స్తేయాద్విముచ్యతే |
రాజా త్వశాసన్పాపస్య తదవాప్నోతి కిల్బిషమ్ || ౩౩ ||

ఆర్యేణ మమ మాంధాత్రా వ్యసనం ఘోరమీప్సితమ్ |
శ్రమణేన కృతే పాపే యథా పాపం కృతం త్వయా || ౩౪ ||

అన్యైరపి కృతం పాపం ప్రమత్తైర్వసుధాధిపైః |
ప్రాయశ్చిత్తం చ కుర్వంతి తేన తచ్ఛామ్యతే రజః || ౩౫ ||

తదలం పరితాపేన ధర్మతః పరికల్పితః |
వధో వానరశార్దూల న వయం స్వవశే స్థితాః || ౩౬ ||

శృణు చాప్యపరం భూయః కారణం హరిపుంగవ |
యచ్ఛ్రుత్వా హేతుమద్వీర న మన్యుం కర్తుమర్హసి || ౩౭ ||

న మే తత్ర మనస్తాపో న మన్యుర్హరియూథప |
వాగురాభిశ్చ పాశైశ్చ కూటైశ్చ వివిధైర్నరాః || ౩౮ ||

ప్రతిచ్ఛన్నాశ్చ దృశ్యాశ్చ గృహ్ణంతి సుబహూన్ మృగాన్ |
ప్రధావితాన్వా విత్రస్తాన్ విస్రబ్ధాంశ్చాపి నిష్ఠితాన్ || ౩౯ ||

ప్రమత్తానప్రమత్తాన్వా నరా మాంసార్థినో భృశమ్ |
విధ్యంతి విముఖాంశ్చాపి న చ దోషోఽత్ర విద్యతే || ౪౦ ||

యాంతి రాజర్షయశ్చాత్ర మృగయాం ధర్మకోవిదః |
తస్మాత్త్వం నిహతో యుద్ధే మయా బాణేన వానర || ౪౧ ||

అయుధ్యన్ప్రతియుధ్యన్వా యస్మాచ్ఛాఖామృగో హ్యసి |
దుర్లభస్య చ ధర్మస్య జీవితస్య శుభస్య చ || ౪౨ ||

రాజానో వానరశ్రేష్ఠ ప్రదాతారో న సంశయః |
తాన్న హింస్యాన్న చాక్రోశేన్నాక్షిపేన్నాప్రియం వదేత్ || ౪౩ ||

దేవా మనుష్యరూపేణ చరంత్యేతే మహీతలే |
త్వం తు ధర్మమవిజ్ఞాయ కేవలం రోషమాస్థితః || ౪౪ ||

ప్రదూషయసి మాం ధర్మే పితృపైతామహే స్థితమ్ |
ఏవముక్తస్తు రామేణ వాలీ ప్రవ్యథితో భృశమ్ || ౪౫ ||

న దోషం రాఘవే దధ్యౌ ధర్మేఽధిగతనిశ్చయః |
ప్రత్యువాచ తతో రామం ప్రాంజలిర్వానరేశ్వరః || ౪౬ ||

యత్త్వమాత్థ నరశ్రేష్ఠ తదేవం నాత్ర సంశయః |
ప్రతివక్తుం ప్రకృష్టే హి నాప్రకృష్టస్తు శక్నుయాత్ || ౪౭ ||

తదయుక్తం మయా పూర్వం ప్రమాదాదుక్తమప్రియమ్ |
తత్రాపి ఖలు మే దోషం కర్తుం నార్హసి రాఘవ || ౪౮ ||

త్వం హి దృష్టార్థతత్త్వజ్ఞః ప్రజానాం చ హితే రతః |
కార్యకారణసిద్ధౌ తే ప్రసన్నా బుద్ధిరవ్యయా || ౪౯ ||

మామప్యగతధర్మాణం వ్యతిక్రాంతపురస్కృతమ్ |
ధర్మసంహితయా వాచా ధర్మజ్ఞ పరిపాలయ || ౫౦ ||

న త్వాత్మానమహం శోచే న తారాం న చ బాంధవాన్ |
యథా పుత్రం గుణశ్రేష్ఠమంగదం కనకాంగదమ్ || ౫౧ ||

స మమాదర్శనాద్దీనో బాల్యాత్ప్రభృతి లాలితః |
తటాక ఇవ పీతాంబురుపశోషం గమిష్యతి || ౫౨ ||

బాలశ్చాకృతబుద్ధిశ్చ ఏకపుత్రశ్చ మే ప్రియః |
తారేయో రామ భవతా రక్షణీయో మహాబలః || ౫౩ ||

సుగ్రీవే చాంగదే చైవ విధత్స్వ మతిముత్తమామ్ |
త్వం హి శాస్తా చ గోప్తా చ కార్యాకార్యవిధౌ స్థితః || ౫౪ ||

యా తే నరపతే వృత్తిర్భరతే లక్ష్మణే చ యా |
సుగ్రీవే చాంగదే రాజంస్తాం త్వమాధాతుమర్హసి || ౫౫ ||

మద్దోషకృతదోషాం తాం యథా తారాం తపస్వినీమ్ |
సుగ్రీవో నావమన్యేత తథాఽవస్థాతుమర్హసి || ౫౬ ||

త్వయా హ్యనుగృహీతేన రాజ్యం శక్యముపాసితుమ్ |
త్వద్వశే వర్తమానేన తవ చిత్తానువర్తినా || ౫౭ ||

శక్యం దివం చార్జయితుం వసుధాం చాపి శాసితుమ్ |
త్వత్తోఽహం వధమాకాంక్షన్వార్యమాణోఽపి తారయా || ౫౮ ||

సుగ్రీవేణ సహ భ్రాత్రా ద్వంద్వయుద్ధముపాగతః |
ఇత్యుక్త్వా సన్నతో రామం విరరామ హరీశ్వరః || ౫౯ ||

స తమాశ్వాసయద్రామో వాలినం వ్యక్తదర్శనమ్ |
సామసంపన్నయా వాచా ధర్మతత్త్వార్థయుక్తయా || ౬౦ ||

న సంతాపస్త్వయా కార్య ఏతదర్థం ప్లవంగమ |
న వయం భవతా చింత్యా నాప్యాత్మా హరిసత్తమ || ౬౧ ||

వయం భవద్విశేషేణ ధర్మతః కృతనిశ్చయాః |
దండ్యే యః పాతయేద్దండం దండ్యో యశ్చాపి దండ్యతే || ౬౨ ||

కార్యకారణసిద్ధార్థావుభౌ తౌ నావసీదతః |
తద్భవాన్ దండసంయోగాదస్మాద్విగతకిల్బిషః || ౬౩ ||

గతః స్వాం ప్రకృతిం ధర్మ్యాం ధర్మదృష్టేన వర్త్మనా |
త్యజ శోకం చ మోహం చ భయం చ హృదయే స్థితమ్ || ౬౪ ||

త్వయా విధానం హర్యగ్ర్య న శక్యమతివర్తితుమ్ |
యథా త్వయ్యంగదో నిత్యం వర్తతే వానరేశ్వర |
తథా వర్తేత సుగ్రీవే మయి చాపి న సంశయః || ౬౫ ||

స తస్య వాక్యం మధురం మహాత్మనః
సమాహితం ధర్మపథానువర్తినః |
నిశమ్య రామస్య రణావమర్దినో
వచః సుయుక్తం నిజగాద వానరః || ౬౬ ||

శరాభితప్తేన విచేతసా మయా
ప్రదూషితస్త్వం యదజానతా ప్రభో |
ఇదం మహేంద్రోపమ భీమవిక్రమ
ప్రసాదితస్త్వం క్షమ మే నరేశ్వర || ౬౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే అష్టాదశః సర్గః || ౧౮ ||

Kishkindha Kanda Sarga 18 Meaning In Telugu

వాలి అన్న మాటలు అన్నీ ఓపికగా విన్నాడు రాముడు. వాలి మౌనం వహించగానే రాముడు వాలి చేసిన ఆరోపణలను అన్నీ సమర్థవంతంగా తిప్పికొట్టాడు.

“ఓ వాలీ! నీకు ధర్మము, అర్థము, కామము అంటే ఏమిటో తెలియవు. లోక మర్యాదలు తెలియవు. నన్ను మాత్రము నీ ఇష్టం వచ్చినట్టు నిందించావు. నాతో మాట్లాడే ముందు. నన్ను నిందించే ముందు, నీవు నీ పెద్దలతో, పండితులతో చర్చించి ఉండాల్సింది. ఈ అరణ్యములు, పర్వతములు, సమస్తజంతుజాలము అన్నీ ఇక్ష్వాకు వంశపు రాజులకు చెందినవి. ఈ అడవిలోని జంతు జాలమును. మనుష్యులను, రాక్షసులను రక్షించడానికి కానీ, శిక్షించడానికి కానీ, ఇక్ష్వాకు వంశము రాజులకే అధికారము కలదు. ప్రస్తుతము ఈ భూమినంతా భరతుడు పరిపాలిస్తున్నాడు. అతడు నిత్యసత్యవ్రతుడు. ధర్మము తెలిసినవాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయగల సమర్ధుడు. భరతుడు దేశ,కాల,మాన పరిస్థితులను గుర్తెరిగి పాలించే రాజు.

భరతుని ఆజ్ఞమేరకు, ధర్మరక్షణ చేయుటకు, మేము ఈ ప్రాంతం అంతా సంచరిస్తున్నాము. ధర్మనిరతుడైన భరతుని పాలనలో అధర్మమునకు తావు లేదు. ధర్మవిరుద్ధముగా ఎవరూ ప్రవర్తించరు. కాని మేము భరతుని ఆజ్ఞమేరకు ధర్మవిరుద్ధముగా ప్రవర్తించే వారిని గుర్తించి, వారిని తగిన విధంగా శిక్షిస్తూ, ధర్మరక్షణ చేస్తూ ఉంటాము. ఆ క్రమంలో మేము నీ రాజ్యమునకు వచ్చాము. నీవు ధర్మాతిక్రమణ చేసినట్టు ఋజువు అయింది. కామభోగములకు ప్రాధాన్యము ఇచ్చి, నిందార్హమైన పనులుచేసినట్టు మా దృష్టికి వచ్చింది.

నీకు ధర్మం గురించి చెబుతాను విను. జన్మనిచ్చిన తండ్రి, తనకన్నా ముందు పుట్టిన అన్న, విద్య చెప్పిన గురువు, వీరు ముగ్గురూ కన్న తండ్రితో సమానము. అలాగే, తన కన్నా తరువాత పుట్టిన తమ్ముడు, తన కుమారుడు, తన శిష్యుడు. పుత్రసమానులు. ఓ వానరా! సత్పురుషులు ఆచరించే ధర్మమును కేవలము ఆత్మతో తెలుసువలెనే కానీ, బాహ్య కర్మల వలన తెలుసుకోలేరు. గుడ్డి వాడిని మరొక గుడ్డివాడు నడిపించినట్టు, చంచల స్వభావుడవైన నీవు, నీ మాదిరే చంచల స్వభావులైన నీ తోటి వానరులతో ఆలోచించి ధర్మాధర్మనిర్ణయము చేయగలవా!

నీవు ఇంతవరకూ నేను నిన్ను చంపాను అన్న కోపంతో మాట్లాడావు. నేను నిన్ను ఎందుకు చంపానో చెబుతాను విను. నీ తమ్ముని భార్య నీకు కోడలి వంటిది. నీవు ధర్మము తప్పి నీ సోదరుడు జీవించి ఉండగానే అతని భార్య రుమను కామాంధుడవై నీ వద్ద ఉంచుకున్నావు. ఓ వానరా! నీవు ధర్మమును అతిక్రమించి నీ తమ్ముడి భార్మను కామవాంఛతో తాకావు కాబట్టి, నీవు చేసిన పాపమునకు నీకు మరణదండన విధించడమైనది. లోకాచారమును మరిచి, ధర్మవిరుద్ధముగా ప్రవర్తించు వారికి మరణ దండనే సరి అయిన ప్రాయశ్చిత్తము.

నేను ఉత్తమ కులములో పుట్టిన క్షత్రియుడను. ఇటువంటి అధర్మకార్యము సహించను. ఎవరైనా కామము చేత తన కుమార్తెను, సోదరిని, తమ్ముని భార్యను కోరితే, వారికి దండన విధించడం క్షత్రియ ధర్మము. ఆ ధర్మమే నేను నిర్వర్తించాను. మరలా చెబుతున్నాను. ఈ భూమి అంతా భరతుని రాజ్యములోనిది. మేము భరతుని ఆజ్ఞను పాలిస్తున్నాము. ధర్మరక్షణ చేస్తున్నాము. నీవు ధర్మమార్గము తప్పి నడుస్తున్నావు అని తెలిసి కూడా నిన్ను ఎలా క్షమించగలము. ధర్మము ప్రకారము రాజ్యము చేయు భరతుడు అధర్మపరులను నాశనం చేస్తాడు. మేము భరతుని ఆజ్ఞమేరకు నీవంటి అధర్మపరులను శిక్షించడానికి కంకణము కట్టుకున్నాము.

ఓ వానర రాజా! నీవు అన్నట్టు నేను సుగ్రీవునితో స్నేహం చేసాను కానీ, ధర్మబద్ధంగా స్నేహము చేసాను. దానికి మూలము రాజ్యము, నా భార్యసీత. సుగ్రీవుడు నాకు సాయం చేస్తాడు. నేను అతనికి సాయం చేస్తాను. రెండూ ధర్మబద్ధంగా చేసే సహాయాలే. నేను వానరుల ఎదుట, నిన్ను చంపి సుగ్రీవునికి రాజ్యము ఇప్పిస్తానని ప్రతిజ్ఞ చేసాను. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాను. ఇందులో తప్పేముంది. ధర్మబద్ధంగా చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడం క్షత్రియ ధర్మం కదా!

నేను పైన చెప్పిన కారణముల వలన నీకు ధర్మబద్ధంగా తగిన దండన విధింపబడింది. ఆ దండన నీవు అంగీకరించక తప్పదు. నీకు దండన విధించడం ధర్మసమ్మతము అని నీవు గ్రహించాలి. నేను ధర్మమును పాటిస్తున్నాను కాబట్టి స్నేహితుడ వైన నీకు దండన విధించి ఉపకారమే చేసాను.

ఈ సందర్భంలో నీకు మనువుచెప్పిన మాటలు వినిపిస్తాను. విను. పాపములు చేసిన మానవులు, రాజులచే దండింపబడి, వారు చేసిన పాపములనుపోగొట్టుకొని, పుణ్యాత్ములై స్వర్గమునకు వెళ్తారు. చేసిన పాపమునకు దండన అనుభవిస్తే, ఆ పాపము పోతుంది. ఆ నేరము చేసిన వాడు పాపము నుండి విముక్తుడవుతాడు. ఒక వేళ రాజు పాపము చేసిన వాడికి దండన విధించకపోతే, ఆ పాపము రాజుకు సంక్రమిస్తుంది. పూర్వము మాంధాత అనే చక్రవర్తి, నీవు చేసినటువంటి పాపమే చేసిన ఒక వ్యక్తిని దండించకుండా వదిలిపెట్టాడు. దాని ఫలితంగా, అతడు చేసిన పాపము మాంధాతకు సంక్రమించింది. ఒక్క మాంధాత కాదు. ఎంతో మంది రాజులు, దండించతగిన వారిని దండించకుండా వదిలిపెట్టి, పాపములను పొందారు.

ఓ వానర రాజా! నేనేదో స్వతంత్రంగా ప్రవర్తించి నిన్ను చంపాను అని అనుకోవద్దు. నేనుస్వతంత్రుడను కాను. ధర్మశాస్త్రము ప్రకారము నడుచుకోవలసిన వాడను. నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలులేదు.

ఓ వానర రాజా! నిన్ను దండించుటకు మరొక కారణము కూడా చెబుతాను విను. మానవులకు, ప్రత్యేకించి క్షత్రియులకు, వేట నిషిద్ధము కాదు. జంతువులను వేటాడేటప్పుడు మాటు వేసిచంపడం సర్వసాధారణం. వేటలో మృగములు పరుగెత్తుతున్నా, భయపడి నిలిచిపోయినా, ఏమరిపాటుగా ఉన్నా, అటువంటి మృగములను చంపడం పాపం కాదు. ధర్మము తెలిసిన ఎంతో మంది రాజర్షులు కూడా వేటకు వెళ్లేవారు. నీవు వానరుడవు. మృగజాతికి చెందినవాడివి. అందుకని క్షత్రియధర్మము ప్రకారము నిన్ను వేటాడాను. నీవు నాతో యుద్ధం చేస్తున్నా లేక సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నా, నువ్వు వానరుడివే కదా! నువ్వు నాతో యుద్ధం చేసేటప్పుడు మాత్రమే చంపాలి అనే నియమం లేదు. అందుకని ఒక రాజుగా నిన్ను దండించే ప్రక్రియలో భాగంగా నిన్ను చంపాను.

రాజులు ధర్మమును రక్షించడానికే పుట్టారు. క్షత్రియులు మానవరూపంలో భూమి మీద నడయాడుతున్న దేవతలు. అందుచేత దండన విధించిన రాజులను నిందించడం ధర్మం కాదు. నేను మా తండ్రి తాతల నుండి అనుసరిస్తున్న ధర్మము ప్రకారము నీకు దండన విధించాను. నీవేమో ధర్మం తెలియక నన్ను నిందించావు.” అని అనునయంగా చెప్పాడు రాముడు.

రాముని మాటలు విన్న వాలికి కనువిప్పు కలిగింది. ధర్మము తెలుసుకున్న వాలి, రాముని యందు తప్పులేదని గ్రహించాడు. అప్పుడు వాలి రామునికి నమస్కరించి ఇలా అన్నాడు.

“ఓ రామా! నీవు చెప్పినది అక్షరసత్యము. ఏ సందేహమూ లేదు. ధర్మం తెలియకుండా, అజ్ఞానంతో నేను పలికిన మాటలను పట్టించుకోవద్దు. నీవు అన్ని ధర్మములను తెలిసిన వాడవు. ప్రజలకు మేలుచెయ్యాలని ఎల్లప్పుడూ కోరుకొనేవాడివి. అందుకని ధర్మాధర్మ నిర్ణయమునకు నీవే సమర్థుడివి.

ఓ రామా! నేను అధర్మంగా ప్రవర్తించాను. తగిన దండన అనుభవించాను. రామా! నా దిగులు అంతా నా కుమారుడు అంగదుడి గురించి. అంగదుడు చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెరిగాడు. నేను కనపడకపోతే ఆహారమూ నీరూ ముట్టడు. నా కుమారుడు చిన్నవాడు. లోకానుభవము లేదు. వాడిని నీవు రక్షించాలి. నీవు సుగ్రీవుని యందు ఎంతటి అనురాగం చూపుతావో అదే మాదిరి అంగదుని కూడా దయతో చూడు.

ఓ రామా! నీవు నీ తమ్ములు లక్ష్మణుని, భరతుని ఏ విధంగా మన్నిస్తావో, అదే మాదిరి సుగ్రీవునీ, అంగదునీ మన్నించు. చేసిన తప్పంతా నాదే. ఇందులో నా భార్య తారకు ప్రమేయం లేదు. నేను చేసిన అపరాధమునకు నా భార్య తారను నా తమ్ముడు సుగ్రీవుడు అవమానించకుండా చూడు. నా భార్య తార నీ గురించి చెప్పి నన్ను వారించినా, నేను ఆమె మాటలను పెడచెవిని బెట్టి సుగ్రీవునితో యుద్ధానికి తలపడినందుకు ఫలితంగా నీ చేతిలో మరణిస్తున్నాను.” అనిపలికి మౌనంగా ఉన్నాడు వాలి.

వాలి పలికిన పలుకులు విన్న రాముడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. “ఓ వానర రాజా! నీ కొడుకు అంగదుని గురించి, నీ భార్య తార గురించి నీవు దిగులు చెందవద్దు. మరొక మాట. నేను నిన్ను అనవసరంగా అన్యాయంగా చంపానని నీవు మనసులో బాధపడవద్దు. నీవేదో మహా పాపము చేసావని తలంచ వద్దు. నీవు పొరపాటు చేసావు. నేను నిన్ను దండించడానికి నిశ్చయించుకున్నాను. శిక్షింప తగ్గవాడిని శిక్షించిన రాజు, శిక్ష అనుభవించతగి ఉండి. ఆ శిక్షను అనుభవించిన నేరస్తుడు, ఇద్దరూ ఉత్తమ గతులుపొందుతారు. ఆ కారణం చేత తప్పు చేసిన నీవు నేను విధించిన దండనతో నీవు చేసిన పాపములు అన్నీ తొలగిపోయాయి. నీవు ఇప్పుడు నీ సహజమైన వాలి స్థితిని (సుగ్రీవుని వెళ్లగొట్టి అతని భార్య రుమను కామంతో పొందక ముందు ఉన్న స్థితి) పొందావు.

ఓ వాలీ! ఇది దైవ నిర్ణయము. దీనిని తప్పించుకోలేవు. కాబట్టి నీలో ఉన్న కోపమును మోహమును విడిచి శాంతము వహించు. నీవు కోరినట్టు గానే, అంగదుడు ఇప్పటిదాకా నీ పట్ల ఎంతటి అనురాగాన్ని, ప్రేమను ప్రదర్శిస్తున్నాడో, సుగ్రీవుని పట్ల, నా పట్ల అదే అనురాగాన్ని ప్రదర్శించగలడు.” అని వాలిని అనునయించాడు రాముడు.

రాముని మాటలను విని వాలి “ఓ రామా! నీవు నన్ను బాణంతో కొట్టి చంపావు అన్న కోపంలో శక్తి తగ్గి, కోపం పెరిగి, నిన్ను ఏమేమోఅన్నాను. నన్నుక్షమించు.” అని అన్నాడు వాలి. తాను చేసిన ఆరోపణలకు రాముడు ఇచ్చిన సమాధానానికి హేతుబద్ధమైన ప్రతిసమాధానాన్ని ఇవ్వలేకపోయాడు వాలి. పైగా అవసాన దశలో ఉన్నాడు. శరీరం క్షణక్షణానికి క్షీణించి పోతూ ఉంది. శక్తి తగ్గిపోతూ ఉంది. వాలి ప్రాణాలు అతని దేహన్ని విడువ డానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సమయంలో వాలి స్పృహ తప్పి పడిపోయాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము 18 సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ ఏకోనవింశః సర్గః (19) >>>

Kishkindha Kanda Sarga 17 In Telugu – కిష్కింధాకాండ సప్తదశః సర్గః

Kishkindha Kanda Sarga 17

కిష్కింధాకాండం సప్తదశం సర్గంలో, రాముడు వాల్మీకి రాజ్యాభిషేకానికి స్థలాన్ని తయారు చేస్తారు. సుగ్రీవుడు అంగదుని దాదాపు వానరులను అందించి, అంగదుని విధిని పాలిస్తున్నారు. రాముని నేతృత్వంలో వానరులు యుద్ధానికి సిద్ధమయ్యారు. కాకసాయే, నల మరియు నీల పంచపర్వాలను ప్రధాన వానర సైన్యాలను నడిపిస్తారు. ఇంద్రజిత్తుని సంహారానికి రాముడు అంగదుని నిర్దేశాలు ఇస్తారు. ఈ సర్గంలో సుగ్రీవుడు రాముని విశ్వాసాన్ని గెలిచేందుకు అనేక చర్యలు తీసుకుంటారు.

రామాధిక్షేపః

తతః శరేణాభిహతో రామేణ రణకర్కశః |
పపాత సహసా వాలీ నికృత్త ఇవ పాదపః || ౧ ||

స భూమౌ న్యస్తసర్వాంగస్తప్తకాంచనభూషణః |
అపతద్దేవరాజస్య ముక్తరశ్మిరివ ధ్వజః || ౨ ||

తస్మిన్నిపతితే భూమౌ వానరాణాం గణేశ్వరే |
నష్టచంద్రమివ వ్యోమ న వ్యరాజత భూతలమ్ || ౩ ||

భూమౌ నిపతితస్యాపి తస్య దేహం మహాత్మనః |
న శ్రీర్జహాతి న ప్రాణా న తేజో న పరాక్రమః || ౪ ||

శక్రదత్తా వరా మాలా కాంచనీ వజ్రభూషితా |
దధార హరిముఖ్యస్య ప్రాణాంస్తేజః శ్రియం చ సా || ౫ ||

స తయా మాలయా వీరో హైమయా హరియూథపః |
సంధ్యానురక్తపర్యంతః పయోధర ఇవాభవత్ || ౬ ||

తస్య మాలా చ దేహశ్చ మర్మఘాతీ చ యః శరః |
త్రిధేవ రచితా లక్ష్మీః పతితస్యాపి శోభతే || ౭ ||

తదస్త్రం తస్య వీరస్య స్వర్గమార్గప్రభావనమ్ |
రామబాణాసనోత్క్షిప్తమావహత్ పరమాం గతిమ్ || ౮ ||

తం తదా పతితం సంఖ్యే గతార్చిషమివానలమ్ |
బహుమాన్య చ తం వీరం వీక్షమాణం శనైరివ || ౯ ||

యయాతిమివ పుణ్యాంతే దేవలోకాత్పరిచ్యుతమ్ |
ఆదిత్యమివ కాలేన యుగాంతే భువి పాతితమ్ || ౧౦ ||

మహేంద్రమివ దుర్ధర్షం మహేంద్రమివ దుఃసహమ్ |
మహేంద్రపుత్రం పతితం వాలినం హేమమాలినమ్ || ౧౧ ||

సింహోరస్కం మహాబాహుం దీప్తాస్యం హరిలోచనమ్ |
లక్ష్మణానుగతో రామో దదర్శోపససర్ప చ || ౧౨ ||

తం దృష్ట్వా రాఘవం వాలీ లక్ష్మణం చ మహాబలమ్ |
అబ్రవీత్ప్రశ్రితం వాక్యం పరుషం ధర్మసంహితమ్ || ౧౩ ||

త్వం నరాధిపతేః పుత్రః ప్రథితః ప్రియదర్శనః |
కులీనః సత్త్వసంపన్నస్తేజస్వీ చరితవ్రతః || ౧౪ ||

పరాఙ్ముఖవధం కృత్వా కో ను ప్రాప్తస్త్వయా గుణః |
యదహం యుద్ధసంరబ్ధః శరేణోరసి తాడితః || ౧౫ ||

[* అధికశ్లోకః –
కులీనః సత్త్వసంపన్నస్తేజస్వీ చరితవ్రతః |
రామః కరుణవేదీ చ ప్రజానాం చ హితే రతః ||
*]

సానుక్రోశో జితోత్సాహః సమయజ్ఞో దృఢవ్రతః |
ఇతి తే సర్వభూతాని కథయంతి యశో భువి || ౧౬ ||

దమః శమః క్షమా ధర్మో ధృతిః సత్యం పరాక్రమః |
పార్థివానాం గుణా రాజన్ దండశ్చాప్యపరాధిషు || ౧౭ ||

తాన్ గుణాన్ సంప్రధార్యాహమగ్ర్యం చాభిజనం తవ |
తారయా ప్రతిషిద్ధోఽపి సుగ్రీవేణ సమాగతః || ౧౮ ||

న మామన్యేన సంరబ్ధం ప్రమత్తం యోద్ధుమర్హతి |
ఇతి మే బుద్ధిరుత్పన్నా బభూవాదర్శనే తవ || ౧౯ ||

స త్వాం వినిహతాత్మానం ధర్మధ్వజమధార్మికమ్ |
జానే పాపసమాచారం తృణైః కూపమివావృతమ్ || ౨౦ ||

సతాం వేషధరం పాపం ప్రచ్ఛన్నమివ పావకమ్ |
నాహం త్వామభిజానామి ధర్మచ్ఛద్మాభిసంవృతమ్ || ౨౧ ||

విషయే వా పురే వా తే యదా నాపకరోమ్యహమ్ |
న చ త్వామవజానే చ కస్మాత్త్వం హంస్యకిల్బిషమ్ || ౨౨ ||

ఫలమూలాశనం నిత్యం వానరం వనగోచరమ్ |
మామిహాప్రతియుద్ధ్యంతమన్యేన చ సమాగతమ్ || ౨౩ ||

లింగమప్యస్తి తే రాజన్ దృశ్యతే ధర్మసంహితమ్ |
కః క్షత్రియకులే జాతః శ్రుతవాన్నష్టసంశయః || ౨౪ ||

ధర్మలింగప్రతిచ్ఛన్నః క్రూరం కర్మ సమాచరేత్ |
రామ రాజకులే జాతో ధర్మవానితి విశ్రుతః || ౨౫ ||

అభవ్యో భవ్యరూపేణ కిమర్థం పరిధావసి |
సామ దానం క్షమా ధర్మః సత్యం ధృతిపరాక్రమౌ || ౨౬ ||

పార్థివానాం గుణా రాజన్ దండశ్చాప్యపరాధిషు |
వయం వనచరా రామ మృగా మూలఫలాశనాః || ౨౭ ||

ఏషా ప్రకృతిరస్మాకం పురుషస్త్వం నరేశ్వరః |
భూమిర్హిరణ్యం రూప్యం చ విగ్రహే కారణాని చ || ౨౮ ||

అత్ర కస్తే వనే లోభో మదీయేషు ఫలేషు వా |
నయశ్చ వినయశ్చోభౌ నిగ్రహానుగ్రహావపి || ౨౯ ||

రాజవృత్తిరసంకీర్ణా న నృపాః కామవృత్తయః |
త్వం తు కామప్రధానశ్చ కోపనశ్చానవస్థితః || ౩౦ ||

రాజవృత్తైశ్చ సంకీర్ణః శరాసనపరాయణః |
న తేఽస్త్యపచితిర్ధర్మే నార్థే బుద్ధిరవస్థితా || ౩౧ ||

ఇంద్రియైః కామవృత్తః సన్ కృష్యసే మనుజేశ్వర |
హత్వా బాణేన కాకుత్స్థ మామిహానపరాధినమ్ || ౩౨ ||

కిం వక్ష్యసి సతాం మధ్యే కర్మ కృత్వా జుగుప్సితమ్ |
రాజహా బ్రహ్మహా గోఘ్నశ్చోరః ప్రాణివధే రతః || ౩౩ ||

నాస్తికః పరివేత్తా చ సర్వే నిరయగామినః |
సూచకశ్చ కదర్యశ్చ మిత్రఘ్నో గురుతల్పగః || ౩౪ ||

లోకం పాపాత్మనామేతే గచ్ఛంత్యత్ర న సంశయః |
అధార్యం చర్మ మే సద్భీ రోమాణ్యస్థి చ వర్జితమ్ || ౩౫ ||

అభక్ష్యాణి చ మాంసాని త్వద్విధైర్ధర్మచారిభిః |
పంచ పంచనఖా భక్ష్యా బ్రహ్మక్షత్రేణ రాఘవ || ౩౬ ||

శల్యకః శ్వావిధో గోధా శశః కూర్మశ్చ పంచమః |
చర్మ చాస్థి చ మే రాజన్ న స్పృశంతి మనీషిణః || ౩౭ ||

అభక్ష్యాణి చ మాంసాని సోఽహం పంచనఖో హతః |
తారయా వాక్యముక్తోఽహం సత్యం సర్వజ్ఞయా హితమ్ || ౩౮ ||

తదతిక్రమ్య మోహేన కాలస్య వశమాగతః |
త్వయా నాథేన కాకుత్స్థ న సనాథా వసుంధరా || ౩౯ ||

ప్రమదా శీలసంపన్నా ధూర్తేన పతినా యథా |
శఠో నైకృతికః క్షుద్రో మిథ్యాప్రశ్రితమానసః || ౪౦ ||

కథం దశరథేన త్వం జాతః పాపో మహాత్మనా |
ఛిన్నచారిత్రకక్ష్యేణ సతాం ధర్మాతివర్తినా || ౪౧ ||

త్యక్తధర్మాంకుశేనాహం నిహతో రామహస్తినా |
అశుభం చాప్యయుక్తం చ సతాం చైవ విగర్హితమ్ || ౪౨ ||

వక్ష్యసే చేదృశం కృత్వా సద్భిః సహ సమాగతః |
ఉదాసీనేషు యోఽస్మాసు విక్రమస్తే ప్రకాశితః || ౪౩ ||

అపకారిషు తం రాజన్ న హి పశ్యామి విక్రమమ్ |
దృశ్యమానస్తు యుధ్యేథా మయా యది నృపాత్మజ || ౪౪ ||

అద్య వైవస్వతం దేవం పశ్యేస్త్వం నిహతో మయా |
త్వయాఽదృశ్యేన తు రణే నిహతోఽహం దురాసదః || ౪౫ ||

ప్రసుప్తః పన్నగేనేవ నరః పాపవశం గతః |
సుగ్రీవప్రియకామేన యదహం నిహతస్త్వయా || ౪౬ ||

మామేవ యది పూర్వం త్వమేతదర్థమచోదయః |
మైథిలీమహమేకాహ్నా తవ చానీతవాన్ భవేత్ || ౪౭ ||

కంఠే బద్ధ్వా ప్రదద్యాం తే నిహతం రావణం రణే |
న్యస్తాం సాగరతోయే వా పాతాలే వాపి మైథిలీమ్ || ౪౮ ||

ఆనయేయం తవాదేశాచ్ఛ్వేతామశ్వతరీమివ |
యుక్తం యత్ప్రాప్నుయాద్రాజ్యం సుగ్రీవః స్వర్గతే మయి || ౪౯ ||

అయుక్తం యదధర్మేణ త్వయాఽహం నిహతో రణే |
కామమేవంవిధో లోకః కాలేన వినియుజ్యతే |
క్షమం చేద్భవతా ప్రాప్తముత్తరం సాధు చింత్యతామ్ || ౫౦ ||

ఇత్యేవముక్త్వా పరిశుష్కవక్రః
శరాభిఘాతాద్వ్యథితో మహాత్మా |
సమీక్ష్య రామం రవిసన్నికాశం
తూష్ణీం బభూవామరరాజసూనుః || ౫౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే సప్తదశః సర్గః || ౧౭ ||

Kishkindha Kanda Sarga 17 Meaning In Telugu

రాముని బాణం దెబ్బ తిన్న వాలినేల మీద పడిపోయాడు. శరీరం పడిపోయింది కానీ అతని తేజస్సు తగ్గలేదు. వాలి మెడలో ఉన్న ఇంద్రమాల, అతని గుండెల్లో గుచ్చుకున్న రామ బాణము అతనిలో ఉన్న తేజస్సును సడలిపోనివ్వడం లేదు.

తన బాణము దెబ్బకు వాలి పడి పోగానే, రాముడు, లక్ష్మణుడు వాలి దగ్గరకు వెళ్లారు. వాలి ముందు గౌరవ సూచకంగా తలవంచి నిలబడ్డారు. కొన ఊపిరితో ఉన్న వాలి రాముని చూచాడు. యుద్ధంలో గెలిచాను అన్న గర్వంతో ఉన్న రామునితో తనలో ఉన్న గర్వం తగ్గని వాలి ఇలా అన్నాడు. వాలి మాటల్లో రాముని పట్ల వినయం ఉంది. కాని పౌరుషం తగ్గలేదు. ధర్మబద్ధంగా మాట్లాడుతున్నాడు వాలి.

“నేను సుగ్రీవునితో యుద్ధం చేస్తూ నీ మూలంగా మరణిస్తున్నాను. నేను నీతో యుద్ధం చేయడం లేదు కదా! నీవంక తిరిగి నీ తో యుద్ధం చేయని వాడిని చంపి నీవు ఏం సాధించావు? నేను విన్నదానిని బట్టి రాముడు కులీనుడు. సత్త్వగుణ సంపన్నుడు. తేజస్వి. వ్రతనిష్ట కలవాడు. రాముడు కరుణామయుడు. ఎల్లప్పుడూ ప్రజలహితం కోరేవాడు. ఇతరుల పట్ల జాలి, దయ కలవాడు. ఉత్సాహవంతుడు. సమయస్ఫూర్తి కలవాడు. ధృడమైన బుద్ధికలవాడు. ఈ లోకంలో ఉన్న వారంతా నిన్ను పై గుణములతో కీర్తిస్తుంటారు కదా! పైగా నీవు రాజువు. రాజైన వాడు ఇంద్రియనిగ్రహము, ఓర్పు, ధైర్యము, బలము, పరాక్రమము, తప్పుచేసిన వారిని దండించే గుణము కలిగి ఉండాలి.

నీవు సుగ్రీవునికి అండగా, మిత్రుడుగా ఉన్నావని తార చెప్పింది. కానీ సకల సద్గుణ సంపన్నుడవైన నీవు తప్పు చేయవని నేను సుగ్రీవునితో యుద్ధానికి తలపడ్డాను. నేను సుగ్రీవునితో యుద్ధం చేసేటప్పుడు నీవు నాకు కనపడలేదు. (అంటే రాముడు చెట్టు చాటునో పొదలమాటునో దాక్కుని ఉన్నాడని వాలి అంటున్నాడు.) కాని నీ బాణం దెబ్బనాకు తగిలింది. అంటే నేను సుగ్రీవునితో యుద్ధం చేస్తుంటే, నీవు నాకు కనపడకుండా మాటు వేసి నన్ను కొట్టావు అని నేను అనుకుంటున్నాను.

ధర్మాత్ముడవు అని పేరుగాంచిన నీ బుద్ధి ఇంత చెడ్డదనీ, నీవు ధర్మాత్ముడు అనే ముసుగులో అధర్మాలను ఆచరించే దుర్మార్గుడవు అనీ, పాపాత్ముడవనీ, గడ్డితో కప్పబడిన నేలబావి లాంటి వాడివనీ నాకు తెలియక, నేను సుగ్రీవునితో ధర్మయుద్ధానికి తలపడ్డాను. రామా! నీవు సాత్వికుని వేషంలో ఉన్న పాపాత్ముడివి, నివురు కప్పిన నిప్పులాంటి వాడివి అని తెలుసుకోలేకపోయాను.

రామా! నేను నీ దేశానికి రాలేదు. నీ నగరానికి రాలేదు. నీ దేశంలో కానీ, నీ నగరంలో కానీ ఏ నేరమూ, తప్పూ చేయలేదు. నిన్ను నేను ఎన్నడూ అవమానించలేదు. నీకు ఎటువంటి అపకారము చేయలేదు. నామానాన నేను అడవులలో ఉంటూ ఫలములు, మూలములు తింటూ బతుకుతున్నాను. నీవు నరుడవు. నేను కాయలు పండ్లు తినే వానరమును. పాపం చెయ్యడం అంటే ఏమిటో నాకు తెలియదు. నేను నీతో యుద్ధం చేయడం లేదు. మరొకరితో యుద్ధం చేస్తున్నాను. అటువంటి నన్ను ఏ కారణంతో చంపావు?

రామా! నీవు రాజులలో ప్రసిద్ధుడవు. ఎన్నో శాస్త్రములను చదివావు. ప్రస్తుతము జటలు, నారచీరలు ధరించి మునివేషములో ఉన్నావు. ముని వేషములో ఉన్న నీవు ఇటువంటి క్రూరమైన పని చేయడం తగునా!

రామా! నీవు రఘు వంశములో పుట్టావు. పైకి మాత్రం ధర్మానికి ప్రతిరూపంగా కనపడతావు. కాని లోలోపల దుష్టుడివి. నీవు క్రూరత్వానికి ప్రతిరూపం. లోకానికి మాత్రం ధర్మాత్ముడు, మంచి వాడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. రామా! రాజుకు ఉండవలసిన గుణములు ఏవంటే—సామము, దానము, క్షమ, ధర్మగుణము, సత్యము పలకడం, పరాక్రమము, ధైర్యము. ఇవీ రాజుకు ఉండవలసిన గుణములు. రామా! మేము అడవులలో ఉంటూ ఆకులు, కాయలు, పండ్లు తిని బతికే వానరులము. నీవు నరుడివి. నరులకు రాజువు. మీకు అనుభవించడానికి రాజ్యము, వెండి, బంగారము కావాలి. కాని ఎక్కడో మారుమూల ఉన్న నా అరణ్యరాజ్యము నీకు ఎందుకు?

నీతిగా ఉంటడం, వినయము కలిగి ఉండటం, దండించతగినవారిని దండించడం, నిరపరాధులను విడిచిపెట్టడం, ఇవీ రాజు పాటించవలసిన ధర్మములు. రాజులు ఈ ధర్మములకు లోబడి ప్రవర్తించాలి కానీ వారి ఇష్టము వచ్చినట్టు ప్రవర్తించరాదు. కాని నీవు రాజువై ఉండీ పై ధర్మములను పాటించలేదు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. నీకు నీ కోరికలు తీరాలి. దాని కోసం ఏమి చెయ్యడానికైనా వెనుదీయవు. పైగా నీకు కోపం ఎక్కువ. నీ మనస్సు నిలకడలేదు. రాజధర్మములను ఆచరించడంలో నీకు | స్థిరమైన బుద్ధిలేదు. ఆయుధము నీ చేతిలో ఉంది కదా అని అందరినీ చంపుకుంటూపోతావు. అదీ నీ తత్త్వము.

ఓ మనుజేశ్వరా! రామా! నీకు ధర్మాచరణములో శ్రద్ధ, భక్తి లేవు. నీవు కామానికి దాసుడవు. నీ కోరికలు ఎటు లాగితే అటు వెళతావు. నాకు తెలిసీ నేను ఏ అపరాధమూ చెయ్యలేదు. అటువంటి నన్ను అకారణంగా చంపావు. ఈ చర్యను లోకుల ముందు, సాటి రాజుల ముందు, ఎలా సమర్ధించుకుంటావు?

ఓ రామా! రాజును, బ్రాహ్మణుని, గోవును, అమాయకమైన జంతువులను నిర్దాక్షిణ్యంగా చంపేవాడు, వేదప్రమాణమును నమ్మని వాడు, ఇతరుల మీద చాడీలు చెప్పేవాడు, మిత్రుడికి ద్రోహం చేసేవాడు, గురువుగారి భార్యను కామించేవాడు, నరకానికి వెళతారు. నేను మనిషినికాను జంతువును. నన్ను అకారణంగా చంపావు. నీకు ఏ గతి పడుతుందో ఆలోచించుకో?

నేను జంతువును కాబట్టి నన్ను వేటాడావు అని అనుకోడానికీ వీలు లేదు. ఎందుకంటే నన్ను వేటాడి, చంపినందువలన నీకు ఏమన్నా ప్రయోజనము ఉందా అంటే అదీలేదు. నా చర్మము దేనికీ పనికిరాదు. నా వెంట్రుకలు, ఎముకలు, మీ వంటి మంచివారు తాకను కూడా తాకరు. నా మాంసము తినడానికి పనికిరాదు. ఏ ప్రయోజనమూ లేకుండా నన్ను ఎందుకు వేటాడావు?

రామా! నీ క్రూర బుద్ధిని ఊహించిన నా భార్య నాకు హితోపదేశము చేసింది. కానీ గర్వాంధుడనై ఆమె ఉపదేశము పెడచెవిని పెట్టాను. తగిన ఫలితము అనుభవించాను. ఒక శీలవతికి దుర్మార్గుడైన భర్త ఉన్నా ఒకటే లేకా ఒకటే. అలాగే నీ రాజ్యానికి, ఈ భూమికి, దుర్మార్గుడైన, శీలవంతుడుకాని నీవంటిరాజు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే! దొంగచాటుగా దెబ్బతీసేవాడివి, ఇతరులకు అకారణంగా హాని చేసేవాడివి, నీచ బుద్ధి కలవాడివి, పైకి మాత్రం మంచి వాడిగా కనిపిస్తూ లోపల కుచ్ఛితమైన బుద్ధి కలవాడివి, పాపాత్ముడవు అయిన నీవు ఆ దశరథునికి కుమారుడిగా ఎలా జన్మించావో అర్థం కావడం లేదు. సత్పురుషులు, యోగ్యులు అయిన వాళ్లు నిందించే పనిని నీవు చేసావు. వారి ముందు నీ చర్యను ఎలా సమర్ధించుకుంటావు?

రామా! నేను నీకు శత్రువును కాను. మిత్రుడను కాను. నీవు నిజంగా వీరుడవు, పరాక్రమ వంతుడివి అయితే నీ శత్రువులతో యుద్ధం చేసి గెలువు. అదీ వీరత్వము అంటే! నేను నీకు శత్రువును అని నీవు అనుకుంటే, నాతో యుద్ధమే చేయాల్సింది. ఈ పాటికి నిన్ను యమునికి అతిథిగా పంపి ఉండేవాడిని. నన్ను ఎదిరించి పోరాడే ధైర్యము లేక, చేత కాక, చాటున ఉండి నన్ను చంపావు.

మద్యము మత్తులో నిద్రించు వాడిని పాము కాటు వేసినట్టు, నువ్వు నన్ను చాటునుండి చంపావు. నీ భార్యను వెతికి పెట్టడానికి నీవు సుగ్రీవునితో స్నేహం చేసావు అని నాకు తెలిసింది. దానికి ప్రతిఫలంగా సుగ్రీవునికి మేలు చేయడానికి నన్ను చంపావు.

రాజ్యభ్రష్టుడైన సుగ్రీవునితో స్నేహం చెయ్యడానికికి బదులుగా నీవు నా వద్దకు వచ్చి నాతో స్నేహం చేసి ఉంటే నేను ఆ రావణుని కాళ్లు చేతులు కట్టితెచ్చి నీ పాదాల ముందు పడవేసేవాడిని. ఆకాశములో గానీ, పాతాళములోకానీ, నీ సీత ఎక్కడ ఉన్నా వెతికి తెచ్చి నీకు అప్పగించి ఉండేవాడిని.

రామా! సుగ్రీవుడు నాసోదరుడు. నా తరువాత కిష్కింధకు రాజు అవుతాడు. అది ధర్మమే. కానీ నీవు నన్ను చాటునుండి చంపడం మాత్రం అధర్మము. క్షమించరాని నేరము. నీకు చేతనయితే నీవు చేసిన కార్యము ధర్మబద్ధము అని నిరూపించుకో.” అని పలికి వాలి మౌనంగా ఉండిపోయాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము పదిహేడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ అష్టాదశః సర్గః (18) >>>

Kishkindha Kanda Sarga 16 In Telugu – కిష్కింధాకాండ షోడశః సర్గః

Kishkindha Kanda Sarga 16

కిష్కింధాకాండంలో షోడశం సర్గం రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మరియు వానర సేన కూడా ప్రణయ కలాపాలు చేస్తుంటారు. సుగ్రీవుడు మాటలతో అలంకరించబడి, వివాహ సంస్కారాలను పాలిస్తాడు. అయోధ్యలో రాజ్యాభిషేకం చేయడంతో శ్రీరాముడు వానర సేనల సహాయాన్ని అందించేందుకు ముందుగా, రాజకీయ సహాయాన్ని సుగ్రీవుడు మాత్రం అందించడంతో రాముని ప్రియుడు మరియు భక్తుడగా చూడగలడు.

వాలిసంహారః

తామేవం బ్రువతీం తారాం తారాధిపనిభాననామ్ |
వాలీ నిర్భర్త్సయామాస వచనం చేదమబ్రవీత్ || ౧ ||

గర్జతోఽస్య చ సంరంభం భ్రాతుః శత్రోర్విశేషతః |
మర్షయిష్యామ్యహం కేన కారణేన వరాననే || ౨ ||

అధర్షితానాం శూరాణాం సమరేష్వనివర్తినామ్ |
ధర్షణామర్షణం భీరు మరణాదతిరిచ్యతే || ౩ ||

సోఢుం న చ సమర్థోఽహం యుద్ధకామస్య సంయుగే |
సుగ్రీవస్య చ సంరంభం హీనగ్రీవస్య గర్జతః || ౪ ||

న చ కార్యో విషాదస్తే రాఘవం ప్రతి మత్కృతే |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి || ౫ ||

నివర్తస్వ సహ స్త్రీభిః కథం భూయోఽనుగచ్ఛసి |
సౌహృదం దర్శితం తారే మయి భక్తిః కృతా త్వయా || ౬ ||

ప్రతియోత్స్యామ్యహం గత్వా సుగ్రీవం జహి సంభ్రమమ్ |
దర్పమాత్రం వినేష్యామి న చ ప్రాణైర్విమోక్ష్యతే || ౭ ||

అహం హ్యాజిస్థితస్యాస్య కరిష్యామి యథేప్సితమ్ |
వృక్షైర్ముష్టిప్రహారైశ్చ పీడితః ప్రతియాస్యతి || ౮ ||

న మే గర్వితమాయస్తం సహిష్యతి దురాత్మవాన్ |
కృతం తారే సహాయత్వం సౌహృదం దర్శితం మయి || ౯ ||

శాపితాసి మమ ప్రాణైర్నివర్తస్వ జనేన చ |
అహం జిత్వా నివర్తిష్యే తమహం భ్రాతరం రణే || ౧౦ ||

తం తు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదినీ |
చకార రుదతీ మందం దక్షిణా సా ప్రదక్షిణమ్ || ౧౧ ||

తతః స్వస్త్యయనం కృత్వా మంత్రవద్విజయైషిణీ |
అంతఃపురం సహ స్త్రీభిః ప్రవిష్టా శోకమోహితా || ౧౨ ||

ప్రవిష్టాయాం తు తారాయాం సహ స్త్రీభిః స్వమాలయమ్ |
నగరాన్నిర్యయౌ క్రుద్ధో మహాసర్ప ఇవ శ్వసన్ || ౧౩ ||

స నిష్పత్య మహాతేజా వాలీ పరమరోషణః |
సర్వతశ్చారయన్ దృష్టిం శత్రుదర్శనకాంక్షయా || ౧౪ ||

స దదర్శ తతః శ్రీమాన్ సుగ్రీవం హేమపింగళమ్ |
సుసంవీతమవష్టబ్ధం దీప్యమానమివానలమ్ || ౧౫ ||

స తం దృష్ట్వా మహావీర్యం సుగ్రీవం పర్యవస్థితమ్ |
గాఢం పరిదధే వాసో వాలీ పరమరోషణః || ౧౬ ||

స వాలీ గాఢసంవీతో ముష్టిముద్యమ్య వీర్యవాన్ |
సుగ్రీవమేవాభిముఖో యయౌ యోద్ధుం కృతక్షణః || ౧౭ ||

శ్లిష్టముష్టిం సముద్యమ్య సంరబ్ధతరమాగతః |
సుగ్రీవోఽపి తముద్దిశ్య వాలినం హేమమాలినమ్ || ౧౮ ||

తం వాలీ క్రోధతామ్రాక్షః సుగ్రీవం రణపండితమ్ |
ఆపతంతం మహావేగమిదం వచనమబ్రవీత్ || ౧౯ ||

ఏష ముష్టిర్మయా బద్ధో గాఢః సన్నిహితాంగుళిః |
మయా వేగవిముక్తస్తే ప్రాణానాదాయ యాస్యతి || ౨౦ ||

ఏవముక్తస్తు సుగ్రీవః క్రుద్ధో వాలినమబ్రవీత్ |
తవ చైవ హరన్ ప్రాణాన్ ముష్టిః పతతు మూర్ధని || ౨౧ ||

తాడితస్తేన సంక్రుద్ధస్తమభిక్రమ్య వేగితః |
అభవచ్ఛోణితోద్గారీ సోత్పీడ ఇవ పర్వతః || ౨౨ ||

సుగ్రీవేణ తు నిస్సంగం సాలముత్పాట్య తేజసా |
గాత్రేష్వభిహతో వాలీ వజ్రేణేవ మహాగిరిః || ౨౩ ||

స తు వాలీ ప్రచలితః సాలతాడనవిహ్వలః |
గురుభారసమాక్రాంతో నౌసార్థ ఇవ సాగరే || ౨౪ ||

తౌ భీమబలవిక్రాంతౌ సుపర్ణసమవేగినౌ |
ప్రవృద్ధౌ ఘోరవపుషౌ చంద్రసూర్యావివాంబరే || ౨౫ ||

పరస్పరమమిత్రఘ్నౌ ఛిద్రాన్వేషణతత్పరౌ |
తతోఽవర్ధత వాలీ తు బలవీర్యసమన్వితః || ౨౬ ||

సూర్యపుత్రో మహావీర్యః సుగ్రీవః పరిహీయతే |
వాలినా భగ్నదర్పస్తు సుగ్రీవో మందవిక్రమః || ౨౭ ||

వాలినం ప్రతి సామర్షో దర్శయామాస రాఘవమ్ |
వృక్షైః సశాఖైః సశిఖైర్వజ్రకోటినిభైర్నఖైః || ౨౮ ||

ముష్టిభిర్జానుభిః పద్భిర్బాహుభిశ్చ పునః పునః |
తయోర్యుద్ధమభూద్ఘోరం వృత్రవాసవయోరివ || ౨౯ ||

తౌ శోణితాక్తౌ యుద్ధ్యేతాం వానరౌ వనచారిణౌ |
మేఘావివ మహాశబ్దైస్తర్జయానౌ పరస్పరమ్ || ౩౦ ||

హీయమానమథోఽపశ్యత్సుగ్రీవం వానరేశ్వరమ్ |
ప్రేక్షమాణం దిశశ్చైవ రాఘవః స ముహుర్ముహుః || ౩౧ ||

తతో రామో మహాతేజా ఆర్తం దృష్ట్వా హరీశ్వరమ్ |
శరం చ వీక్షతే వీరో వాలినో వధకారణాత్ || ౩౨ ||

తతో ధనుషి సంధాయ శరమాశీవిషోపమమ్ |
పూరయామాస తచ్చాపం కాలచక్రమివాంతకః || ౩౩ ||

తస్య జ్యాతలఘోషేణ త్రస్తాః పత్రరథేశ్వరాః |
ప్రదుద్రువుర్మృగాశ్చైవ యుగాంత ఇవ మోహితాః || ౩౪ ||

ముక్తస్తు వజ్రనిర్ఘోషః ప్రదీప్తాశనిసన్నిభః |
రాఘవేణ మహాబాణో వాలివక్షసి పాతితః || ౩౫ ||

తతస్తేన మహాతేజా వీర్యోత్సిక్తః కపీశ్వరః |
వేగేనాభిహతో వాలీ నిపపాత మహీతలే || ౩౬ ||

ఇంద్రధ్వజ ఇవోద్ధూతః పౌర్ణమాస్యాం మహీతేలే |
ఆశ్వయుక్సమయే మాసి గతశ్రీకో విచేతనః || ౩౭ ||

నరోత్తమః కాలయుగాంతకోపమం
శరోత్తమం కాంచనరూప్యభూషితమ్ |
ససర్జ దీప్తం తమమిత్రమర్దనం
సధూమమగ్నిం ముఖతో యథా హరః || ౩౮ ||

అథోక్షితః శోణితతోయవిస్రవైః
సుపుష్పితాశోక ఇవానలోద్ధతః |
విచేతనో వాసవసూనురాహవే
విభ్రంశితేంద్రధ్వజవత్క్షితిం గతః || ౩౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే షోడశః సర్గః || ౧౬ ||

Kishkindha Kanda Sarga 16 Meaning In Telugu

తార చెప్పిన మాటలు వాలి పెడచెవిని పెట్టాడు. తారను నాకు చెప్పేంత దానివా అని కసురుకున్నాడు. విదిలించి కొట్టాడు. పురుషాహంకారము అతని ఆలోచనా శక్తిని హరించి వేసింది.

“నా కన్నా బలహీనుడు నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తుంటే నేను ముందూ వెనకా ఆలోచిస్తూ కూర్చోవాలా! కుదరదు. నీవు భయస్తురాలవు. పిరికిదానికి. నా వంటి వీరుడు శూరుడు యుద్ధానికి వెనుదీయ్యడం కన్నా మరణించడం మేలు. శత్రువు యుద్ధానికి కాలు దువ్వుతుంటే, ఓర్పుతో ఉండటం మరణం కన్నా సహించరానిది. ఇంక రాముని గూర్చి నాకు భయం లేదు. నీవే అన్నావు కదా. రాముడు ధర్మాత్ముడు. ఆర్తజనులను రక్షించేవాడు అని.

అటువంటి రాముడు అధర్మానికి ఎలా ఒడిగడతాడు. సుగ్రీవుని కోసరం పాపం ఎలా చేస్తాడు? ఏదో స్త్రీసహజమైన చాపల్యంతో నీకు తోచింది చెప్పావు. ఇంకచాలు లోపలకు వెళ్లు.

పిచ్చిదానా! నేను నా సోదరుని చంపుతాను అనుకున్నావా! లేదు. నేను కేవలం సుగ్రీవుని అహంకారము అణిచి బుద్ధి చెప్పి పంపేస్తాను. అంతే. ప్రస్తుతము సుగ్రీవుడు రాజ్యం కోరడం లేదు. యుద్ధం కోరుకుంటున్నాడు. వాడు కోరుకున్న యుద్ధాన్ని వాడికి ఇస్తాను. నీకు నా మీద ఉన్న ప్రేమకొద్దీ, నీ బుద్ధికి తోచిన ఉపాయము చెప్పావు. అది చాలు. ఇంక లోపలకు వెళ్లు. నేను చిటికలో సుగ్రీవుని గర్వము అణిచి అతనిని పారిపోయేట్టు చేసి వస్తాను.” అని పలికాడు వాలి.

తార ఇంక చేసేది లేక దుఃఖిస్తూ వాలికి ప్రదక్షిణ పూర్వక నమస్కారము చేసింది. భర్త విజయాన్ని కాంక్షిస్తూ అతనికి వీరతిలకము దిద్దింది. అంతఃపుర కాంతలతో సహా లోపలకు వెళ్లింది. వాలి కోపంతో బుసలు కొడుతూ నగరం బయటకు వచ్చాడు. సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడా అని నలుదిక్కులా చూస్తున్నాడు. అల్లంత దూరంలో నడుముకు ధట్టికట్టుకొని ధైర్యంగా నిలబడి రంకెలు వేస్తున్న సుగ్రీవుని చూచాడు. వాలి కోపంతో సుగ్రీవుని వైపుకు వెళ్లాడు.

వాలి మెడలో ఇంద్రుడు ఇచ్చిన బంగారు మాల ఉంది. సుగ్రీవుని మెడలో రాముడు వేసిన గజపుష్పమాల ఉంది. సుగ్రీవుని చూచి వాలి ఇలా అన్నాడు. “ఒరేయ్ సుగ్రీవా! ఈ పిడికిలితో గట్టిగా గుద్దితే చస్తావురా! నాతో ఎందుకురా నీకు” అని అన్నాడు.

“ఓ వాలీ! నాకూ పిడికిలి ఉంది. నేనూ నీ తల మీద ఒక గుద్దు గుద్దితే తలపగిలి చస్తావు.” అని మాటకు మాట బదులు చెప్పాడు సుగ్రీవుడు. ఇంక వాలి ఊరుకోలేకపోయాడు. సుగ్రీవుని పిడికిలితో మోదాడు. సుగ్రీవునికి ఒళ్లంతా రక్తసిక్తము అయింది. సుగ్రీవుడు పక్కనే ఉన్న సాలవృక్షమును పీకి వాలి మీదికి విసిరాడు. ఆ వృక్షము దెబ్బకు వాలి కదిలిపోయాడు. వాలి సుగ్రీవులు ద్వంద్వయుద్ధమునకు తలపడ్డారు. ఒకరితో ఒకరు ఘోరంగా పోరాడుతున్నారు. తన మెడలో ఉన్న సువర్ణమాల మహిమతో వాలి బలము క్షణక్షణము వృద్ధి చెందుతుంటే, సుగ్రీవుని బలము క్షీణించసాగింది. కాని పట్టుదలతో యుద్ధం చేస్తున్నాడు. రాముని సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.

వాలి సుగ్రీవులు కొమ్మలతోనూ, రాళ్లతోనూ, చెట్లతోనూ, గోళ్లతోనూ, పిడికిళ్లతోనూ ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు. ఇద్దరి దేహముల నుండి రక్తం కారుతూ ఉంది. వాలి దెబ్బకు తట్టుకోలేక సుగ్రీవుడు దిక్కులు చూస్తున్నాడు. సుగ్రీవుని బలం సన్నగిల్లింది అని గ్రహించాడు రాముడు. వాలిని చంపడానికి బాణం ఎక్కుపెట్టాడు. ధనుస్సును ఆకర్ణాంతము లాగి, వాలి మీదికి గురి చూచి, బాణమును వదిలాడు. రాముడు వదిలిన బాణము సరిగ్గా వాలి వక్షస్థలమును చీల్చుకుంటూ వీపు నుండి బయటకు వచ్చింది. ఆ బాణము దెబ్బతిన్న వాలి, పక్షిమాదిరి నేలకూలాడు. ఆ రోజు ఆశ్వయుజ శుద్ధపౌర్ణమి. ఆరోజు వాలి నేలకూలాడు. వాలికి క్రమ క్రమంగా స్పృహ తప్పుతూ ఉంది. గొంతులో గుర గుర శబ్దం వస్తూ ఉంది. వాలియుద్ధరంగంలో దీనంగా పడి ఉన్నాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము పదునారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ సప్తదశః సర్గః (17) >>>