కిష్కింధాకాండ పంచదశః సర్గలో, సుగ్రీవుడు రామునితో సీతా దేవి శోధనకు సంబంధించిన ప్రణాళికలను చర్చిస్తాడు. వానరసేనలు వివిధ దిక్కులలో బయలుదేరి వెతకమని ఆజ్ఞలు పొందుతారు. హనుమంతుడు, జాంబవంతుడు, ఆంగదుడు వంటి వానరులు తమ సేనలతో కలిసి సీతను వెతికే ప్రయత్నంలో పాల్గొంటారు. ఈ సర్గలో, వానరులు అడవులు, పర్వతాలు, నదులు, సముద్రతీరాలను దాటి వెతకడం ప్రారంభిస్తారు. వారి శోధనలో సీతను కనుగొనడానికి అడ్డంకులను అధిగమించడం కోసం తమ బలాన్ని, ధైర్యాన్ని చూపిస్తారు. సీతను రక్షించి రామునికి తిరిగి తీసుకురావాలని సంకల్పంతో వానరులు తమ ప్రయత్నాన్ని మరింత కట్టుదిట్టంగా కొనసాగిస్తారు.
ఉంది. ఆ సాయం ఎవరు, ఏ రూపంలో చేస్తున్నారో తెలియదు. ఇంతకూ సుగ్రీవునికి సాయం చేసే వాళ్లు ఎవరు? ఎక్కడ నుండి వచ్చారు? సుగ్రీవునికి సాయం చెయ్యాల్సిన అవసరం వారికి ఏముంది? బయట నుండి సాయం లేకుండా సుగ్రీవుడు ఇంతధైర్యంగా మరలా నీ మీదికి యుద్ధానికి కాలు దువ్వడు.
సుగ్రీవుడు బలవంతుడు కాకపోయినా బుద్ధిమంతుడు. నేర్పు కలవాడు. తనకు ఏ లాభమూ లేకుండా ఎవరితోనూ స్నేహం చెయ్యడు. ఇప్పుడు సుగ్రీవుడు ఎవరితో స్నేహం చేసాడో తెలుసుకోవడం అవసరం కదా! ఇటీవల మీ కుమారుడు అంగదుడు నాకు ఒక వార్త చెప్పాడు. దానిని ఇప్పుడు నీకు చెబుతున్నాను. మన సరిహద్దుల్లో కాపలా ఉండే గూఢచారులు అంగదునికి ఈ వార్త చెప్పారట.
అదేమిటంటే…… ఇక్ష్వాకు వంశములో పుట్టిన వారు, దశరథుని కుమారులు, రామ లక్ష్మణులు అనే పేరు గల వాళ్లు మన వనములో సంచరిస్తూ ఉన్నారట. వారితో సుగ్రీవునికి స్నేహం కలిసిందట. వారు సుగ్రీవుని కోరిక తీర్చడానికి ఒప్పుకున్నారట. ఇంక ఆ రాముడు ధనుస్సును ప్రయోగించడంలో గొప్ప నేర్పరి. బాణములను వేగంగా వేయగలడు. ఆ రాముడు ధర్మపరుడు. ఆపదలలో ఉన్నవారిని కాపాడే గుణం కలవాడు. మంచి లౌకిక జ్ఞానము శాస్త్రజ్ఞానము కలవాడు. తండ్రి ఆజ్ఞను పాలించేవాడు. రాముని యుద్ధంలో జయించడం అసాధ్యం అని తెలిసింది. అటువంటి వాడు ఇప్పుడు నీ సోదరుడు సుగ్రీవునికి సాయం చేస్తున్నాడట. కాబట్టి రామునితో నీకు విరోధము తగదు అని నా భావన. నీవు నా మీద కోపం తెచ్చుకోకపోతే నీకు ఒక విషయం చెబుతాను. సావధానంగా విను. నీకు తెలుసు.
సుగ్రీవుడు ఏ తప్పూ చేయలేదు. కాబట్టి నీ తమ్ముని ఆదరించు. అతని రాజ్యము అతనికి ఇవ్వు. సుగ్రీవునితో విరోధము మాను. నీవు సుగ్రీవునితోస్నేహం చేసుకుంటే, రాముడు కూడా నీకు స్నేహితుడు అవుతాడు. నాధా! సుగ్రీవుడు పరాయివాడు కాదు కదా! నీకు స్వంత తమ్ముడు. అతని మీద ప్రేమ చూపించాలి గానీ ద్వేషించకూడదు. ప్రస్తుతము నీకు నీ సోదరుడు సుగ్రీవునితో సంధి చేసుకొనడం తప్ప వేరు మార్గము లేదు. నేను నీ హితము కోరి ఈ మాటలు చెబుతున్నాను. నీవు నా భర్త కాబట్టి, నీ క్షేమమును నేను సదా కోరుతాను కాబట్టి చెబుతున్నాను. కోపము, ద్వేషము విడిచి పెట్టు. నా మాటవిను. సుగ్రీవునితో యుద్ధము మాను. ” అని తార తన భర్త వాలికి హితోపదేశము చేసింది. కాని తార మాటలు వాలికిరుచించలేదు.
(ఇది విదురుడు సుయోధనునికి హితము చెప్పినట్టు ఉంది కదా! వాలి– సుయోధనుడు. సుగ్రీవుడు– ధర్మరాజు. సుగ్రీవునితో రామునికి మైత్రి కుదిరింది. ధర్మరాజుతో కృష్ణునికి బంధుత్వతము మైత్రి రెండు ఉన్నాయి. ఇద్దరి మధ్యా రాజ్యము వలన తగాదా వచ్చింది. సుగ్రీవుని భార్యను వాలి అవమానిస్తే, ధర్మరాజు భార్యను సుయోధనుడు అవమానించాడు. వాలి సుగ్రీవుని అడవులకు తరిమితే, సుయోధనుడు ధర్మరాజును అడవులకు పంపాడు. అరణ్య వాసం తరువాత ధర్మరాజు యుద్ధం చేస్తే, అరణ్యవాసం తరువాత సుగ్రీవుడు వాలితో యుద్ధం చేసాడు. రాముని సాయంతో సుగ్రీవుడు వాలిని చంపితే, కృష్ణుడు చెప్పిన ఉపాయంతో భీముని చేతిలో సుయోధనుడు చచ్చాడు. కృష్ణుడు ఏ పక్కన ఉంటే అక్కడ జయం ఉంటుంది. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ జయం ఉంటుంది. విదురుడు సుయోధనునితో సంధి చేసుకోమంటే, ఇక్కడ తార కూడా వాలిని సంధిచేసుకోమని చెప్పింది. యుగాలు మారినా, కధలు వేరైనా, ధర్మం ఒకటే. అదే కలియుగంలో చిన్న సామెత రూపంలో ఉంది. పోరు నష్టము పొందు లాభము.)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ద్విసప్తతితమః సర్గ రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో ఖర, దూషణ, త్రిశిర అనే రాక్షసులు రాముడిని సమర్థించడానికి రావణుడి ఆజ్ఞలను అనుసరిస్తారు. రాక్షసులు భారీ సైన్యంతో రాముడిపై దాడి చేస్తారు. రాముడు తన ధైర్యం, శక్తితో ఆ రాక్షసులను ఎదుర్కొని, వారిని నాశనం చేస్తాడు. రాముడి ముఖంలో ధర్మం, సత్యం ప్రతిఫలిస్తాయి. ఖర, దూషణ, త్రిశిర రాక్షసులను సంహరించడంతో రాముడి పరాక్రమం, ధర్మపాలన మరింత వెలుగులోకి వస్తాయి.
తరువాత రామలక్ష్మణులు కబంధుని శరీరమును పెద్ద లోయ లోకి తోసి నిప్పుపెట్టారు. కబంధుని శరీరము పూర్తిగా కాలిపోగానే, ఆ చితిలోనుండి దివ్యమైన వస్త్రములను ధరించిన ఒక దివ్యపురుషుడు బయటకు వచ్చాడు.
“రామా! నీకు సీత ఎలా దొరుకుతుందో చెబుతాను విను. ప్రస్తుతము నీవు సీతా వియోగముతో, రాజ్యము పోగొట్టుకొని బాధపడుతున్నావు. నీ లాగానే రాజ్యము పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని బాధపడుతున్న వానితో నీవు స్నేహం చెయ్యి. నీకు లాభం కలుగుతుంది. ప్రస్తుతము నీకు అటువంటి మిత్రునితో స్నేహము అవసరము. వాని వలన నీవు మిత్రలాభమును పొందుతావు.
వాలి, సుగ్రీవుడు అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. వారు వానరులు. అందులో వాలి సుగ్రీవుని భార్యను అపహరించి, సుగ్రీవుని రాజ్యమునుండి వెళ్ల గొట్టాడు. ప్రస్తుతము ఆ సుగ్రీవుడు పంపానదీ తీరములో ఉన్న ఋష్యమూక పర్వతము మీద తన అనుచరులతో నివసిస్తున్నాడు. సుగ్రీవునితో పాటు ఇంకా నలుగురు వానరులు ఉన్నారు. సుగ్రీవుడు మహా పరాక్రమ వంతుడు, సత్యవంతుడు, వినయము కలవాడు. మంచి ధైర్యముకలవాడు. దానికి తోడు మంచి బుద్ధిమంతుడు. కాని కాలము కలిసి రాక, వాలి చేత సుగ్రీవుడు రాజ్యము నుండి బయటకు వెళ్లగొట్టబడ్డాడు. నీలాగే భార్యను, రాజ్యమును పోగొట్టుకొన్న సుగ్రీవుడు సీతను వెదకడంలో నీకు సాయం చెయ్యగలడు. నీవు సుగ్రీవునితో మైత్రి చెయ్యి నీకు శుభం కలుగుతుంది.
రామా! సీత కోసరము నీవు శోకింపరాదు. కాలమును ఎవరూ అతిక్రమించలేరు. ఏ కాలానికి ఏది జరగాలలో అది జరిగితీరుతుంది. నువ్వు దేనినీ ఆపలేవు. కాబట్టి నీవు వెంటనే సుగ్రీవుని వద్దకు పోయి అగ్ని సాక్షిగా అతనితో మైత్రి చేసుకో. అతడు వానరుడు కదా నాకేం సాయం చేస్తాడులే అని అనుకోకు. అతనిని అవమా నించకు. ప్రస్తుతము అతనికి ఇతరుల సాయం కావాలి. నీవు అతనికి సాయం చేస్తే అతడు నీకు సాయం చేస్తాడు. ఒకవేళ నీవు అతనికి సాయం చెయ్యలేకపోయినా, అతడు నీకు సాయం చెయ్య గలడు.
ఇంక సుగ్రీవుని గురించి చెబుతాను విను. సుగ్రీవుడు సూర్యునికి ఒక వివాహిత అయిన వానర స్త్రీ వలన జన్మించాడు. వాలికి భయపడి ఋష్యమూక పర్వతము మీద దాక్కుని ఉన్నాడు.
సుగ్రీవునకు ఈ లోకములో ఉన్న రాక్షసుల స్థావరములు అన్నీ బాగా తెలుసు. ఈ లోకంలో సూర్యుని కిరణములు ఎంతవరకూ ప్రసరిస్తాయో అంతమేరా సుగ్రీవునకు తెలుసు. అతడు వానరులను పంపి సీత జాడ తెలుసుకోగల సమర్థుడు.
కాబట్టి సుగ్రీవునితో స్నేహం చెయ్యి. నీభార్య సీత మేరుపర్వతము మీద ఉన్నా, పాతాళములో ఉన్నా వెతికి తీసుకురాగల శక్తి ఉన్నవాడు సుగ్రీవుడు” అని పలికాడు కబంధుడు.
కిష్కింధాకాండ చతుర్దశః సర్గలో, సుగ్రీవుడు తన వానర సేనలను సీతను వెతకడానికి అన్ని దిక్కులలో పంపించడానికి ఏర్పాట్లు చేస్తాడు. హనుమంతుడు, జాంబవంతుడు, ఆంగదుడు వంటి ప్రముఖ వానరులు వివిధ దిశలలో తమ సేనలను నడిపిస్తారు. సుగ్రీవుడు ప్రత్యేకంగా హనుమంతుడిని పిలిచి, అతని శక్తి, ధైర్యం గురించి ప్రస్తావిస్తూ సీతను కనుగొనడంలో అతని పాత్ర ఎంత ముఖ్యమో వివరించి చెప్పతాడు. హనుమంతుడు, సీతా దేవిని కనుగొనడంలో తన సమర్పణను ప్రదర్శిస్తాడు. ఈ సర్గలో, వానరులు తమ లక్ష్యాన్ని సాధించడానికి తమ శక్తి, నైపుణ్యాలను ఎలా ఉపయోగిస్తున్నారో చూడవచ్చు.
అందరూ కిష్కింధా నగరము ప్రవేశించారు. సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు.“రామా! ఇదే కిష్కింధా నగరము. ఇక్కడ ద్వారములు అన్నీ బంగారంతో నిర్మించారు. ఇక్కడ అనేక యంత్రములు అమర్చబడ్డాయి. వాలిని చంపడానికి తగిన కాలము సమీపించింది. నీవు దానిని సఫలం చేస్తావని ఆశిస్తున్నాను.” అని అన్నాడు అనుమానంగా అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుని మనసులోని సందేహాన్ని గ్రహించాడు రాముడు. అతని మనసులోని సందేహ నివృత్తి కోసరం ఇలా అన్నాడు.
“సుగ్రీవా! ఈ సారి వాలిని గుర్తు పట్టడంలో పొరపాటు జరగదు. ఎందుకంటే నీ మెడలో ఉన్న గజమాల నువ్వు సుగ్రీవుడు అని తెలియజేస్తుంది. ఒకే ఒక బాణంతో నేను వాలిని చంపుతాను. నీవు నిశ్చింతగా ఉండు. ఈ సారి వాలి నా కంటబడి తప్పించుకుంటే, నువ్వు నన్ను తప్పు పట్టు. నన్ను నిందించు. నీ ఎదురుగానే కదా నేను ఏడు సాలవృక్షములను ఛేధించాను. ఈ వాలిని చంపడం పెద్ద కష్టమేమీ కాదు. నన్ను నమ్ము.
నేను ఎన్ని కష్టములలో ఉన్నా ఎప్పుడూ అసత్యము చెప్పలేదు. ఇక మీదట కూడా అసత్యము చెప్పను. చెప్పలేను. నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను. ఇది సత్యము. నీలోని భయాన్ని వదిలిపెట్టు. ధైర్యంగా వాలితో యుద్ధం చెయ్యి. వాలిని యుద్ధానికి పిలువు. అతడు బయటకు వచ్చేట్టు చెయ్యి. నీవు యుద్ధమునకు పిలవగానే వాలి బయటకు వస్తాడు. ఎందుకంటే అతడు ఇప్పటి దాకా ఓటమి ఎరుగడు అని నువ్వే చెప్పావు కదా!
అతనికి తన బలము మీద పరాక్రమము మీద నమ్మకము ఎక్కువ. తనను తాను పొగుడుకుంటూ ఉంటాడు. కాబట్టి నీతో యుద్ధానికి వస్తాడు. నా చేతిలో చస్తాడు. మరొక విషయం. అతను ఇప్పుడు స్త్రీలతో కామభోగములు అనుభవిస్తూ ఉంటాడు. స్త్రీల మధ్య ఉన్న వాలి తనను ఎవడైనా ఎదిరిస్తే సహించలేడు. వెంటనే బయటకు వస్తాడు. కాబట్టి సుగ్రీవా! వాలిని యుద్ధానికి పిలువు.” అని అన్నాడు రాముడు సుగ్రీవునికి ధైర్యం చెబుతూ.
రాముడు పలికిన ధైర్యవచనాలకు సుగ్రీవుడు పొంగిపోయాడు. గట్టిగా గర్జించాడు. తొడ చరిచి వాలిని యుద్ధానికి పిలుస్తూ పెద్ద పెద్దగా రంకెలు వేసాడు. సుగ్రీవుడు అరుస్తున్న అరుపులకు, వేస్తున్న రంకెలకు, కిష్కింధ అదిరిపోయింది. వాలి బయటకు వచ్చేవరకూ సుగ్రీవుడు అలా అరుస్తూనే ఉన్నాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకసప్తతితమః సర్గం రామాయణంలో ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుంది. ఈ సర్గలో శూర్పణఖ రాముడిని, సీతను చూస్తూ మోహితురాలై, రాముని ప్రేమగా సమీపిస్తుంది. రాముడు తనకు సీత ఉన్నందున ఆమెను తిరస్కరిస్తాడు. నిరాశ చెందిన శూర్పణఖ, లక్ష్మణుడి వద్దకు వెళ్ళి, అతని ప్రేమను కోరుతుంది. తిరస్కరణతో కోపగించిన శూర్పణఖ సీతపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆగ్రహించిన లక్ష్మణుడు ఆమెను అడ్డుకుని, ఆమె నాసికను, చెవులను కత్తితో కోసి, భయానకమైన రాక్షస రూపంలో శూర్పణఖను పంపిస్తాడు.
కబంధశాపాఖ్యానమ్
పురా రామ మహాబాహో మహాబలపరాక్రమమ్ |
రూపమాసీన్మమాచింత్యం త్రిషు లోకేషు విశ్రుతమ్ ||
“ఓ రామా! నేను దనువు కుమారుడను. దానవుడను. నేను బ్రహ్మను గూర్చి తపస్సు చేసాను. నా తపస్సుకు మెచ్చి బ్రహ్మ నాకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. ఆ వర గర్వముతో నేను నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని. నా పూర్వ రూపము చాలా అందంగా ఉండేది. నేను దేవేంద్రునితో సమానంగా ప్రకాశిస్తూ ఉండేవాడిని. నేను కామరూపుడను కోరిన రూపము ధరించగలవాడను. నేను అప్పుడప్పుడు భయంకరమైన రూపములను ధరించి అరణ్యములో తపస్సుచేసుకొనుచున్న మునులను ఋషులను భయపెట్టేవాడిని.
ఒక సారి నేను ప్రస్తుతము ఉన్న కబంధ రూపములో స్థూలశిరుడు అనే పేరుగల ఋషిని భయపెట్టాను. అప్పుడు నాకు అవయవములు అన్నీ సక్రమంగానే ఉండేవి. కాని వికృతముగా ఉండే విధంగా ఆయనను భయపెట్టాను. ఆయనకు కోపం వచ్చింది. “నీవు ఇదే రూపంలోనే శాశ్వతంగా ఉండుదువుగాక!” అని శపించాడు. నాకు భయం వేసింది. ఆ ముని కాళ్ల మీద పడి శరణు వేడుకున్నాను. శాపమునకు విమోచనము ప్రసాదించమని అడిగాను. అప్పుడు ఆ ముని “రాముడు నీ దగ్గరకు వచ్చి నీ భుజములను ఖండించిన రోజు నీకు నీ స్వస్వరూపము వస్తుంది.” అని శాపవిమోచనము ప్రసాదించాడు. తరువాత నాకు ఈ వికృత రూపము వచ్చింది.
ఒక సారి నేను ఇంద్రుని ఎదిరించాను. ఇంద్రుడు తన వజ్రాయుధముతో నా తలమీద బుజాల మీద కొట్టాడు. దానితో నా తల పొట్టలోకి దూరిపోయింది. నా బాహువులు, నా కాళ్లు, తొడలు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. మరీ వికృతంగా తయారయ్యాను. నడవలేను. “ఇంద్రా! నన్ను ఈ విధంగా చేసావు. నేను ఆహారం ఎలా సంపాదించుకోవాలి? ఎలా జీవించాలి ?” అని అడిగాను. అప్పుడు ఇంద్రుడు నాకు ఒక యోజనము పొడవు ఉండే చేతులు, పొట్టలోనే ఒక నోరు ప్రసాదించాడు.
“రామలక్ష్మణులు ఎప్పుడు నీచేతులు ఖండిస్తారో అప్పుడు నీకు పూర్వరూపము వస్తుంది.” అని చెప్పాడు. అప్పటినుండి నేను నా చేతులు చాచి యోజనము లోపల ఉన్న జంతువులను నా చేతులతో పట్టి తింటూ మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీరు నా బాహువులు ఖండించి నాకు శాప విమోచన కలిగించారు.. మీరు నాకు దహన సంస్కారములు చేయండి. అప్పుడు నాకు పూర్వ రూపము వస్తుంది. ఇంతకూ మీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి. నేను మీకు తగిన సాయం చేస్తాను.” అని అన్నాడు కబంధుడు.
రాముడు ఇలా చెప్పాడు. “నేను, నా సోదరుడు లక్ష్మణుడు ఆశ్రమములో లేని సమయములో రావణుడు అనే రాక్షసుడు నా భార్య సీతను అపహరించాడు. మాకు అతని పేరు రావణుడు అనీ, అతను రాక్షస రాజు అనీ తెలుసు. అతను ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలియదు. మేము దారీ తెన్నూ లేకుండా సీత కోసరము వెతుకుతున్నాము. నీకు తెలిసినట్టయితే, మాకు ఆ రాక్షసుని గురించి తెలియచెయ్యి. మేము నీకు శాపవిమోచనము కావించాము కాబట్టి నీవు కూడా మాకు తగిన సాయం చెయ్యి. నీవు కోరినట్టు నీకు దహన సంస్కారములు చేస్తాము.” అని అన్నాడు రాముడు.
“రామా! నాకు ఎలాంటి దివ్యదృష్టి లేదు. అందుకని నేను ఆ రాక్షసుని గురించి చెప్పలేను. కాని మీకు సీత జాడ గురించి చెప్పగల వారిని గురించిన సమాచారము ఇవ్వగలను. అతనికి ఈ మూడు లోకములలో ఎవరు ఎక్కడ ఉన్నదీ బాగా తెలుసు. కొన్ని కారణాంతరాల వల్ల అతడు ముల్లోకములూ తిరిగాడు. నీవు అతనితో స్నేహం చేసి సీత జాడతెలుసుకో! రామా! సూర్యుడు అస్తమించ బోతున్నాడు. మీరు సూర్యాస్తమయమునకు ముందు నన్ను దహనం చేసి నాకు పూర్వరూపము వచ్చేట్టు చెయ్యండి.” అని చెప్పాడు కబంధుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తతితమః సర్గ (70వ సర్గ) రామాయణంలో కీలకమైన భాగం. ఈ సర్గలో, శూర్పణఖ రాముడు, లక్ష్మణుల చేతిలో అవమానానికి గురై తన సోదరుడు రావణుని దగ్గరకు వెళ్లి తన ఆవేదనను తెలియజేస్తుంది. సోదరి అవమానానికి రావణుడు ఆగ్రహంతో రగిలిపోతాడు. శూర్పణఖ వర్ణనలో సీత సౌందర్యాన్ని తెలుసుకొని, సీతను అపహరించాలని సంకల్పిస్తాడు. ఈ సర్గ రామాయణ కథలో కీలక మలుపు, రాముడు, సీతల జీవితాల్లో అనేక మార్పులను తీసుకురావడం, రాక్షసులపై రాముడు, లక్ష్మణులు ఎదుర్కొనే సవాళ్లను మరింత సంక్లిష్టతరం చేయడం జరుగుతుంది.
తన బాహుబంధములలో చిక్కిన రామలక్ష్మణులను చూచి కబంధుడు ఇలా అన్నాడు. “ఏంటి అలా చూస్తున్నారు. ఈరోజు మీ ఇద్దరినీ నాకు దేవుడు ఆహారంగా పంపాడు. మీరు ఎంత ప్రయత్నించినా నా నుండి తప్పించుకోలేరు. (అందుకే కబంధ హస్తాలు అనే సామెత వచ్చింది.) ఈ రోజు మీ ఇద్దరూ నాకు ఆహారం కాక తప్పదు.” అని అన్నాడు.
రాముడు ఆలోచించే పరిస్థితిలో లేదు. సీత పోయిన దుఃఖములో ఉన్న తాను కబంధుని హస్తాలలో చిక్కుకోడంతో రాముడు ఆలోచించే శక్తి కోల్పోయాడు. అప్పుడు లక్ష్మణుడు రాముని తో ఇలా అన్నాడు.
“రామా! ధైర్యం కోల్పోవద్దు. మనం ఇద్దరం వీడి హస్తాలలో బందీలుగా ఉన్నాము. ఈ పరిస్థితులను మనకు అనుకూలంగా మలచుకోవాలి. నీవు నీ శక్తిని అంతా కూడగట్టుకొని నీ చేతిలో ఉన్న ఖడ్గంతో నీ పక్కఉన్న చెయ్యినరుకు. నేను ఈ పక్క ఉన్న చెయ్యి నరుకుతాను. ఇందాకటి నుండి వీడిని పరిశీలిస్తున్నాను. వీడి శక్తి అంతా వీడి బాహువులలో ఉంది. వీడి బాహువులను ఖండిస్తే వీడు మనలను ఏమీ చెయ్యలేడు.” అని అన్నాడు లక్ష్మణుడు.
(ఇక్కడ ఒకటి గమనించండి. ఈ సూత్రం మనకు అందరికీ వర్తిస్తుంది. మనకు ఆపదలు వచ్చినపుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాముని వలె మనం ఆలోచించే శక్తి కోల్పోతాము. కాని మనం లక్ష్మణుని వలె ఆలోచించాలి. మనకు ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచుకోవాలి. తగిన ఉపాయం ఆలోచించాలి. ఆపదల నుండి బయట పడాలి. అంతేకాని, ఆపదలు వచ్చినప్పుడు మనలను మనం తిట్టుకుంటూ ఎదుటి వారిని తిట్టడం వలన ఏమీ ప్రయోజనం లేదు. రామాయణం నుండి దీనిని మనం గ్రహించి ఆచరణలో పెట్టి మన జీవితాలను సఫలం చేసుకోవాలి.)
లక్ష్మణుని మాటలు విన్నాడు కబంధుడు. రామలక్ష్మణులను తినబోయాడు. రాముడు, లక్ష్మణుడు వెంటనే స్పందించారు. క్షణం ఆలస్యం చేయకుండా కబంధుడి రెండు బాహువులను ఖడ్గములతో ఖండించారు. ఎప్పుడైతే చేతులు ఖండింపబడ్డాయో కబంధుడు పెద్దగా అరిచాడు కేకలు పెట్టాడు. వెనక్కు విరుచుకు పడ్డాడు.
ఖండింపబడిన తన బాహువులను చూచుకున్నాడు. కబంధుడు. రామలక్ష్మణుల వంక చూచి “ఎవరు మీరు?” అని అడిగాడు.
అప్పుడు లక్ష్మణుడు కబంధునితో “ఇతడు ఇక్ష్వాకు వంశములో జన్మించిన దశరథుని కుమారుడు రాముడు. నేను అతని తమ్ముడు లక్ష్మణుడను. కారణాంతరముల చేత మేము వనవాసము చేస్తున్నాము. మేము ఇంట లేని సమయమున ఎవడో రావణుడు అనే రాక్షసుడు రాముడి భార్య సీతను అపహరించాడు. మేము సీతను వెదుకుతూ నీకు చిక్కాము. ప్రాణాపాయ పరిస్థితులలో, మా ప్రాణాలు కాపాడుకోడానికి నీ చేతులు ఖండించాము. ఇంతకూ నీవు ఎవరవు? ఈ వికృత రూపం ఎందుకు వచ్చింది. ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు ఉన్నావు?” అని అడిగాడు లక్ష్మణుడు.
కబంధుడికి ఒక్కసారిగా ఇంద్రుడు చెప్పినమాటలు గుర్తుకు వచ్చాయి. “ఓ పుణ్యపురుషులారా! మీకు శుభం కలుగుగాక! నా అదృష్టం కొద్దీ నాకు మీ దర్శనభాగ్యం కలిగింది. నాకు మేలు చేయడానికే మీరు నా బాహువులను ఖండించారు. నాకు ఈ వికృతరూపము ఎలా వచ్చిందో మీకు సవిస్తరంగా తెలియజేస్తాను.” అని కబంధుడు తన పూర్వ వృత్తాంతమును రామలక్షణులకు ఈ విధంగా చెప్పాడు.
కిష్కింధాకాండ త్రయోదశః సర్గలో, సుగ్రీవుడు వానర సైన్యాలను నాలుగు దిక్కులుగా పంపి సీతా దేవిని వెతకమని ఆజ్ఞాపిస్తాడు. దిక్పాలకులైన హనుమంతుడు, జాంబవంతుడు, ఆంగదుడు, ఇతర ప్రముఖ వానరులు తమ సేనలతో ప్రయాణం ప్రారంభిస్తారు. సీతను కనుగొనడానికి వారి శోధనలో అడవులు, పర్వతాలు, నదులు, సముద్రతీరాలను అడ్డుగా పరిగణించకుండా దాటి వెళ్తారు. సీతా దేవి ఉన్న చోటును కనుగొనడం కోసం, వానరులు తమ శక్తి, తెలివి, ధైర్యాన్ని ఉపయోగిస్తారు. సుగ్రీవుడు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ, రాముని నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సంకల్పిస్తారు.
అందరూ కిష్కింధకు వెళుతున్నారు. ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు. తరువాత ధనుర్ధారియై రాముడు నడుస్తున్నాడు. రాముని వెనక సుగ్రీవుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు, తారుడు నడుస్తున్నారు. వారుకొండలను గుహలను, సరస్సులను దాటుకుంటూ వెళుతున్నారు. మార్గమధ్యంలో రాముడు ఒక వనమును చూచాడు. దాని గురించి సుగ్రీవుని అడిగాడు. సుగ్రీవుడు ఆ వనము గురించి ఇలా చెప్పసాగాడు.
“ఓ రామా! ఇక్కడ సప్తజనులు అనే మునులు ఉండేవారు. వారు జలములో తలకిందులుగా తపస్సు చేస్తూ ఉండేవారు. వారు ఆహారము తీసుకొనేవారు కాదు. ఏడురోజులకొక సారి గాలి మాత్రం పీల్చుకొనే వారు. ఆ ప్రకారంగా వారు ఏడు వందల సంవత్సరములు తపస్సుచేసి శరీరంతో స్వర్గమును చేరుకున్నారు. ఆ మునుల తపస్సు ప్రభావంతో ఈ వనములోకి దేవతలు గానీ, మనుషులు గానీ, జంతువులు గానీ ప్రవేశించలేవు. ఒకవేళ ప్రవేశిస్తే తిరిగి వెళ్లలేవు. ఈ వనములో నిత్యమూ మూడు అగ్నిహోత్రములు అనగా దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము మండుతూ ఉంటాయి. వాటినుండి వెలవడే పొగ అదుగో అలా కనపడుతూ ఉంటుంది. రామా! మీరు ఆ మునులకు నమస్కారం చేయండి. మీకు మేలు జరుగుతుంది.” అని అన్నాడు సుగ్రీవుడు. రాముడు, లక్ష్మణుడు ఆ మునులకు భక్తితో నమస్కరించారు. తరువాత వారందరూ కిష్కింధకు చేరుకున్నారు.
కిష్కింధాకాండ ద్వాదశః సర్గలో, రాముడు మరియు సుగ్రీవుడు సీతా ప్రస్తావన చేస్తారు. రాముడు సుగ్రీవుని సీతను వెతికే పనిని త్వరగా చేపట్టమని కోరతాడు. సుగ్రీవుడు రాముని కోపాన్ని పసిగట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయిస్తాడు. అనేక వానర సేనలను సమీకరించి, వివిధ ప్రాంతాలకు పంపించి, సీతా దేవిని కనుగొనాలని ఆజ్ఞాపిస్తాడు. హనుమంతుడు, జాంబవంతుడు, ఆంగదుడు మొదలైన ప్రముఖ వానరులు ప్రధాన పాత్రలుగా సీతను వెతకడానికి నిశ్చయించబడతారు. వారి కృషి మరియు ధైర్యంతో సీతను కనుగొనడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుంది.
సుగ్రీవుని మాటలను విన్న రాముడు, అతని మనసులో ఉన్న సందేహమును నివారించ నిశ్చయించుకున్నాడు. మారుమాటాడ కుండా తన ధనుస్సును చేత బట్టుకున్నాడు. శరమును సంధించాడు. ఒకే ఒక బాణంతో ఒక సాల వృక్షము కాదు, వరుసగా ఉన్న ఏడు సాలవృక్షములను పడగొట్టాడు. సుగ్రీవునికి నోట మాట రాలేదు. ఆశ్చర్యపోయాడు. తాను ఒక్క వృక్షమును కొట్ట మంటే ఏడు వృక్షములను కొట్టాడు రాముడు. రాముని కాళ్ల మీద సాష్టాంగ పడ్డాడు.
“రామా! చాలు చాలు. నీవు సాక్షాత్తు ఇంద్రుడినే చంపగల సమర్ధుడవు. నీకు వాలి ఒక లెక్కా! ఏడు సాలవృక్షములను కూల్చిన నీముందు ఎవడు నిలిచి యుద్ధము చేయగలడు? నీవు నాకు మిత్రుడుగా లభించినందుకు నా మనసంతా ఆనందంతో నిండి పోయింది. రామా! చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. వాలిని చంపి నాకు మనశ్శాంతిని చేకూర్చు.” అని అన్నాడు సుగ్రీవుడు.
“మిత్రమా! సుగ్రీవా! నీవు చెప్పినట్టే చేద్దాము. ముందు నీవు కిష్కింధకు వెళ్లు. నీ వెనువెంటనే మేము వస్తాము. నీవు వెళ్లి వాలిని యుద్ధానికి రమ్మని పిలువు. వాలితో యుద్ధము చెయ్యి. నేను చాటుగా ఉంది నా బాణముతో వాలిని చంపుతాను.” అని అన్నాడు రాముడు.
రాముని మాటల మీద నమ్మకంతో సుగ్రీవుడు కిష్కింధకు వెళ్లాడు. సుగ్రీవుని మంత్రులు, రాముడు, లక్ష్మణుడు అతని వెంటనే వెళ్లి సమీపములో ఉన్న పొదల మాటున దాగి ఉన్నారు. సుగ్రీవుడు పెద్దగా అరుస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. సుగ్రీవుని పిలుపు విని వాలి బయటకు వచ్చాడు.
తాను ఇంతకాలము ఎవరి కోసరం వెతుకుతున్నాడో ఆ సుగ్రీవుడు కంటపడేసరికి, వాలికి కోపం ముంచుకొచ్చింది. సుగ్రీవునితో తలపడ్డాడు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేసుకుంటున్నారు. రాముడు పొదల మాటున నిలబడి వాలిని తన బాణంతో కొట్టవలెనని శతవిధాలా ప్రయత్నించాడు. కానీ వాలి, సుగ్రీవుడు ఒకే రూపంలో ఉండటం వలన ఎవరు వాలి, ఎవరు సుగ్రీవుడు అని పోల్చుకోలేకపోయాడు. వాలికి బదులుగా సుగ్రీవుని కొడతానేమో అని భయపడ్డాడు. అందువలన బాణప్రయోగము చేయలేదు.
ఈ లోపల వాలి సుగ్రీవుని చావ చితక కొట్టాడు. వాలి కొట్టిన దెబ్బలకు సుగ్రీవుని శరీరం అంతా రక్తసిక్తము అయింది. ఆ దెబ్బలు తట్టుకోలేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతము మీదికి పారిపోయాడు. వాలి సుగ్రీవుని కొంత దూరం తరిమాడు. కాని సుగ్రీవుడు ఋష్యమూక పర్వతము మీదికి పోవడం చూచి, శాపానికి భయపడి వెనుదిరిగి పోయాడు. సుగ్రీవుని వెంట అతని మంత్రులు, రామలక్ష్మణులు వెళ్లారు.
రాముని చూచి సుగ్రీవుడు ఇలా అన్నాడు. “ఓ రామా! ఏమిటీ పని! వాలిని యుద్ధానికి పిలువ మన్నావు. వాలిని చంపుతానని నన్ను నమ్మించావు. కాని వాలి చేత నన్ను కొట్టించావు. చావు దెబ్బలు తిని పారిపోయి వచ్చాను. ఇలా ఎందుకు చేసావు. నేను వాలిని చంపను అని ముందే చెప్పి ఉంటే నేను అసలు వాలితో యుద్ధానికి పోను కదా!” అని దీనంగా పలికాడు.
సుగ్రీవుని చూచి రాముడు జాలి పడ్డాడు. “మిత్రమా! నేను ఏ పరిస్థితులలో బాణం వెయ్యలేదో వివరిస్తాను. కోపం లేకుండా విను. నీవు, వాలి, ఎత్తు, లావు, శరీర ఛాయ అన్నిటిలోనూ ఒకే విధంగా ఉన్నారు. నిన్ను, వాలిని, పోల్చుకోలేకపోయాను. నేను వదిలిన బాణం నీకు తగిలి నీవు మరణిస్తావేమో అని భయపడ్డాను. అప్పుడు మిత్రునికి ద్రోహం చేసినవాడిని అవుతానుకదా! అందుకని బాణం వదలలేదు. నా తొందరపాటుతో గానీ, పొరపాటున గానీ, ఆ బాణం నీకు తగిలితే. శాశ్వతంగా నీ వంటి మంచి మిత్రుని పోగొట్టుకున్నవాడిని అవుతాను కదా!
నేను నీకు అభయం ఇచ్చాను. వాలిని చంపకపోయినా బాధ లేదు కానీ నిన్ను చంపితే అభయం ఇచ్చిన వాడిని చంపిన పాపం నాకు చుట్టుకుంటుంది. నీవు లేకపోతే మాకు ఎవరు దిక్కు. కాబట్టి నీవు మరలా వాలిని యుద్ధానికి పిలువు. కాని నిన్ను గుర్తించుటకు ఒక ఆనవాలు పెట్టుకో. ఆ ఆనవాలు సాయంతో నేను వాలిని ఒకే ఒక బాణంతో నేలకూలుస్తాను. నీవు నిశ్చింతగా ఉండు.” అని అన్నాడు రాముడు.
రాముడు చుట్టూ చూచాడు. రామునికి ఎదురుగా ఒక పుష్టములతో కూడిన ఒక తీగ కనపడింది. “లక్ష్మణా! పుష్పములతో కూడిన ఆ తీగను తెచ్చి సుగ్రీవుని మెడలో హారంగా అలంకరించు.” అని అన్నాడు. వెంటనే లక్ష్మణుడు పోయి గజపుష్పములతో నిండి ఉన్న తీగను తీసుకొని వచ్చి సుగ్రీవుని మెడలో వేసాడు. ఎర్రగా ఉన్న ఆ పూలు సుగ్రీవుని మెడలో మెరిసిపోతున్నాయి. అందరూ కలిసి తిరిగి కిష్కింధకు వెళుతున్నారు.
కిష్కింధాకాండ ఏకాదశః సర్గః ఈ సర్గలో, హనుమంతుడు సుగ్రీవుని రాజ్యం వెళ్ళి రాముడు చెప్పిన విషయం వివరించి రాముని ప్రతిజ్ఞను గుర్తు చేస్తాడు. సుగ్రీవుడు వాలి వధ తర్వాత కూడా భయంతో ఉన్నాడని తెలుస్తుంది. రాముని రక్షణతో ధైర్యం పొందిన సుగ్రీవుడు, రాముడు ఇచ్చిన సూచనలను పాటించి వానరసేనను సుమారుగా నాలుగు దిక్కులుగా పంపిస్తాడు. ఈ సర్వలోక సముద్రతీరం దాటి సీతా దేవిని వెతకమని ఆజ్ఞాపిస్తాడు. ఈ విధంగా, సీతా దేవి యిచ్చిన అవరోధాలను అధిగమించి ఆమెను కాపాడటం కోసం వానరులు తమ శక్తిని ఉపయోగిస్తారు.
తనలో సంతోషాన్ని వృద్ధి చెందేట్టు రాముడు పలికిన మాటలకు సుగ్రీవుడు ఎంతో ఆనందించాడు. “రామా! నాకు ఆ మాత్రం తెలియదా! నీకు కోపం వస్తే ముల్లోకములనే భస్యం చేయగల శక్తి, సామర్థ్యము నీకు ఉంది. కాని వాలికి ఎంత పౌరుషము, పరాక్రమము ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా చేయమని నా కోరిక. రామా! వాలి సూర్యోదయానికి ముందే లేచి, ఏ మాత్రం శ్రమలేకుండా నాలుగు సముద్రములకు వెళ్లి, సంధ్యావందనము చేస్తాడు.
(ఇక్కడ ఒక చమత్కారము ఉంది. కన్యాకుమారి దగ్గరకు వెళితే, మూడు సముద్రాలు పక్క పక్కనే ఉన్నాయి. ఇంక నాలుగో సముద్రం అప్పట్లో ఉందేమో తెలియదు. ప్రస్తుతం హిమాలయాలు ఉన్నాయి. కాబట్టి అది అతిశయోక్తి కావచ్చును. పైగా పంపానది, ఋష్యమూకము కన్యాకుమారికి దగ్గరగానే ఉన్నాయి. వాలి ఏ మాత్రం శ్రమ లేకుండా మూడు సముద్రాలలో సంధ్యావందనము చేసాడు అనేది సంభవమే కదా! ఆలోచించండి.).
వాలి పర్వతముల మీద ఎక్కి పెద్ద పెద్ద రాళ్లను బంతుల మాదిరి పైకి ఎగరవేసి ఆడుకుంటూ ఉంటాడు. వాలి తన బల ప్రదర్శన కొరకు పెద్ద పెద్ద వృక్షములను పెకలించి వేస్తూ ఉంటాడు. దుందుభి అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు మహ బలవంతుడు. పెద్ద కొండ వంటి శరీరము కలవాడు. గర్వముచే మదించిన వాడు. వాడు ఒక సారి సముద్రుని వద్దకుపోయి తనతో యుద్ధానికి రమ్మని సముద్రుని పిలిచాడు. సముద్రుడు ఆ రాక్షసునితో ఇలా అన్నాడు. “ఓ దుందుభీ! నేను నీతో యుద్ధము చేయలేను. కానీ నీతో యుద్ధము చేయగల వీరుడి గురించి చెపుతాను.
హిమవంతుడు అనే పర్వత రాజు ఉన్నాడు. ఆయన సాక్షాత్తు మహాశివునికి మామగారు. ఆయన ఎంతో మంది మునులకు, ఋషులకు తపస్సుచేసుకోడానికి ఆశ్రయం ఇచ్చాడు. నీతో యుద్ధము చేయుటకు ఆయన సమర్థుడు.” అని చెప్పాడు సముద్రుడు. సముద్రుడు తనకు లొంగి పోయాడు అనే గర్వంతో దుందుభి హిమవంతుని వద్దకు వెళ్లాడు. హిమవంతుని పర్వత శిఖరములను పడగొట్టాడు. నలుమూలలకూ విసిరివేసాడు. అప్పుడు హిమవంతుడు దుందుభితో ఇలా అన్నాడు. ఎందుకు నా శిఖరము లను ధ్వంసం చేస్తావు. నా శిఖరముల మీద ఎంతో మంది మునులు, ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. వారి తపస్సుకు ఆటంకము కలిగించకు. నేను సాత్వికుడను. నాకు యుద్ధం చేయడం చేతకాదు.” అని అన్నాడు.
ఆ మాటలకు దుందుభి ఇలా అన్నాడు. “నీవు నాతో. చేయగలవనే నీ దగ్గరకు వచ్చాను. నీవు నాతో యుద్ధం చెయ్యి లేకపోతే నాతో యుద్ధం చేయగల పరాక్రమవంతుడు ఎవరో చూపించు.” అని అన్నాడు.
“ఓ దుందుభీ! ఇంద్రుని కుమారుడు, కిష్కింధ రాజ్యాధిపతి, అమిత ప్రతాపవంతుడు, వాలి నామధేయుడు ఉన్నాడు. అతడు నీతో యుద్ధము చేయగల సమర్థుడు. వెంటనే అతని వద్దకు పోయి అతనితో యుద్ధము చేయగల చెయ్యి. కాని ఇంతవరకూ యుద్ధములో వాలిని ఎవరూ గెలవ లేదు. అది గుర్తుపెట్టుకో.” అని చురక అంటించాడు. హిమవంతుడు.
దుందుభికి కోపం మిన్ను ముట్టింది. మారు మాటాడకుండా దుందుభి వాలి వద్దకు వెళ్లాడు. దుందుభి మహిష రూపం(దున్నపోతు) ధరించాడు. కిష్కింధా పుర ద్వారము వద్ద నిల్చి పెద్ద పెద్దగా రంకెలు వేసాడు. పక్కనే ఉన్న వృక్షములను పెకలించాడు. సింహద్వారములను తన కొమ్ములతో కుమ్ముతున్నాడు. దుందుభి చేస్తున్న ఆగడాలు అంత:పురంలో ఉన్న వాలి దృష్టికి వచ్చాయి. వాలి తన అంత:పుర స్త్రీలతో కలిసి బయటకు వచ్చాడు. దుందుభిని చూచాడు.
“ఓ దుందుభీ! నువ్వా! నీ సంగతి నాకు తెలుసు కానీ, వెళ్లి నీ ప్రాణాలు కాపాడుకో. నాతో అనవసరంగా యుద్ధం చేసి నీ ప్రాణాల మీదికి తెచ్చుకోకు.” అని అన్నాడు. ఆ మాటలకు దుందుభి కోపం మిన్నుముట్టింది. “వాలీ! అంతఃపుర స్త్రీ ముందు ప్రగల్భాలు పలుకకు.ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యి. లేకపోతే ఓడిపోయానని ఒప్పుకొని అంత:పురానికి వెళ్లు. నీకు మరొక అవకాశము ఇస్తున్నాను. రాత్రి అంతా నీ అంత:పుర స్త్రీలతో కామ సుఖాలు అనుభవించు. నీ వాళ్లందరికీ వీడ్కోలు చెప్పు. నీ కిష్కింధను ఆఖరు సారిగా తనివిదీరా చూసుకో. మరలా ఇంకొక సారి కామభోగములు అనుభవించు. రేపు ఉదయం నా వద్దకు రా! నాతో యుద్ధం చెయ్యి. నా చేతిలో నీకు చావు తప్పదు.
రేపటిదాకా ఎందుకు సమయం ఇస్తున్నాను అంటే ప్రస్తుతం నీవు మద్యం మత్తులో ఉన్నావు. అంతఃపుర స్త్రీలతో కామ సుఖాలు అనుభవిస్తున్నావు. నీ చేతిలో ఏ ఆయుధమూ లేదు. ఆయుధములు లేని వానినీ, మద్యం మత్తులో ఉన్నవాడినీ, ఏమరుపాటుగా ఉన్న వాడినీ, నీ వంటి బలం లేని వాడినీ, ఓడి పోయిన వాడినీ, నీ లాగా కామసుఖాలలో మునిగి తేలుతూ సగంలో లేచి వచ్చిన వాడినీ చంపడం మహా పాపం అని నాకు తెలుసు. అందుకే రేపు ఉదయం రా!” అని గర్వంతో పలికాడు దుందుభి.
ఆ మాటలకు వాలి నవ్వాడు. తనతో ఉన్న అంత:పుర కాంతలను లోపలకు పంపాడు. దుందుభి వద్దకు వచ్చాడు. “నేను మద్యం మత్తులో లేను. యుద్ధం చేసే ముందు మద్యం సేవించడం ఆచారం. అదే నేను చేసాను. నాతో యుద్ధానికి రా!” అని దుందుభిని యుద్ధానికి పిలిచాడు. తన తండ్రి దేవేంద్రుడు తనకు ఇచ్చిన మాలను మెడలో వేసుకున్నాడు. దుందుభి కొమ్ములు పట్టుకున్నాడు. దుందుభిని పట్టుకొని గిరా గిరా తిప్పి నేలకేసి కొట్టాడు. దుందుభికి దిమ్మ తిరిగింది.
చెవులలో నుండి రక్తం కారింది. పైకి లేచి వాలిని పట్టుకున్నాడు. వాలికి, దుందుభికి ఘోర యుద్ధం జరిగింది. ఒకరిని ఒకరు పిడికిళ్లతో గుద్దుతూ, కాళ్లతో తన్నుతూ, వృక్షములు, బండరాళ్లు ఒకరి మీద విసురుకుంటూ యుద్ధం ఒకరు చేసారు. యుద్ధం చేసే కొద్దీ దుందుభి బలం తగ్గుతూ ఉంది. వాలి బలం పెరుగుతూ ఉంది. వాలి, దుందుభిని పైకి ఎత్తి నేల మీద పడవేసి తొక్కుతున్నాడు. దుందుభి నవ రంధ్రముల నుండి రక్తం ధారాపాతంగా కారిపోతూ ఉంది. వాలి బలానికి తట్టుకోలేక దుందుభి ప్రాణాలు విడిచాడు. వాలి దుందుభి శరీరాన్ని రెండు చేతులతో పైకి ఎత్తి ఒక యోజన దూరంలో పడేట్టు విసిరి వేసాడు.
ఆ మాదిరి విసిరి వేయడంలో దుందుభి శరీరం నుండి కారిన రక్తం మతంగాశ్రమము మీద చల్లినట్టు పడింది. ఆ రక్తపు బిందువులను చూచి మతంగ మహర్షి కోపించాడు. ఆ రక్తము చల్లిన వాడు ఎవడా అని చూచాడు. మహర్షికి దున్నపోతురూపంలో చచ్చి పడి ఉన్న దుందుభి మృతకళేబరము కనిపించింది. ఆ మహర్షి తన తపోబలంతో ఆ పని చేసిన వాడు వాలి అని గ్రహించాడు. అనవసరంగా ఆ రాక్షసుని మృతకళేబరమును తన ఆశ్రమ ప్రాంతంలో విసిరివేసిన వాలిని శపించాడు.
“నా ఆశ్రమ ప్రాంతంలో ఈ రాక్షసుని శరీరాన్ని విసిరి, నా ఆశ్రమంలోని వృక్షములను నాశనం చేసి, ఈ దుష్టుని రక్తంతో కలుషితం చేసిన వాలి నా ఆశ్రమ ప్రాంతంలోకి కానీ, నా ఆశ్రమము నకు ఒక యోజన విస్తీర్ణములో గానీ ప్రవేశించకూడదు. అలా ప్రవేశిస్తే వెంటనే మరణిస్తాడు అంతే కాదు ఇప్పటి దాకా ఈ అరణ్యములో నివసించుచున్న వాలి అనుచరులు, వానరులు తక్షణమే ఈ వనమును విడిచి పెట్టి వెళ్లవలెను. నేను ఈ ఆశ్రమమును ఈ ఆశ్రమములోని వృక్షములను, లతలను కన్నబిడ్డలవలె కాపాడుకుంటున్నాను. ఆ వృక్షములను, లతలను వానరములు పాడుచేస్తున్నారు. కాబట్టి వానరజాతి అంతా ఈ ప్రాంతమును విడిచిపెట్టి వెళ్లాలి. వారికి ఒక్కరోజు గడువు ఇస్తున్నాను. ఒక్కరోజు లోగా వానరులందరూ వెళ్లకపోతే వారిని కూడా శపించవలసి వస్తుంది. రేపటి నుండి నా కంటబడిన వానరుడు శిల అయి పోతాడు.” అని వాలికి, వాలికి శాపం ఇచ్చాడు మతంగ మహర్షి.
ముని శాపము విషయం తెలుసుకొని వానరములు అన్నీ మతంగ మహర్షి వనము విడిచిపెట్టి వాలి వద్దకు వెళ్లాయి. “మీరంతా ఇక్కడకు ఎందుకు వచ్చారు. మీకు క్షేమమే కదా!” అని అడిగాడు. అప్పుడు ఆ వానరులు వాలికి, మతంగ మహర్షి ఇచ్చిన శాపము గురించి చెప్పారు. వెంటనే వాలి పరుగు పరుగున మతంగ ముని వద్దకు వెళ్లాడు. ఆయన కాళ్ల మీద పడి క్షమించమని ప్రార్థించాడు. కాని మహర్షి కనికరించలేదు.
ఆ నాటి నుండి వాలి శాపగ్రస్తుడయ్యాడు. ఈ ఋష్యమూక పర్వతము మీదికి వచ్చుటకు కానీ, కనీసము ఈ పర్వతము వంక కన్నెత్తి చూచుటకు కానీ భయపడేవాడు. నా అన్న వాలి ఇక్కడకు రాలేడని తెలిసి, నేను ఇక్కడ నివాసము ఏర్పరచుకొని నిర్భయంగా జీవించుచున్నాను. రామా! అదుగో ఆ నాడు వాలి విసిరిన దుందుభి అస్థిపంజరము కొండవలె ఎలా పడి ఉన్నదో చూడు. దాని పక్కనే ఏడు సాల వృక్షములు ఉన్నవి. వాలి అప్పుడప్పుడు వాటిని ఊపి వాటికి ఉన్న ఆకులు, పండ్లు రాలగొడుతూ ఉంటాడు.
మిత్రమా రామా! వాలి గురించి అతని బల పరాక్రమముల గురించి నీకు వివరంగా చెప్పాను. అటువంటి వాలిని నీవు చంప గలవా! ఆలోచించుకో!” అని రాముని మనసులో సందేహాన్ని రేకెత్తించాడు సుగ్రీవుడు. ఆ మాటలు విని లక్ష్మణుడు నవ్వాడు. “ఓ సుగ్రీవా! నీవు చెప్పావు సరే. ఇప్పుడు రాముడు ఏమి చేస్తే, నీవు రాముడు వాలిని చంపగలడు అని నమ్మగలవు” అని అడిగాడు.
ఇప్పుడు సుగ్రీవుడు తన మనసులో మాట బయట పెట్టాడు. “రామా! పూర్వము వాలి ఈ సాలవృక్షములు ఏడింటిని అటు ఇటు ఊపేవాడు అని చెప్పాను కదా! రాముడు తన బాణముతో ఈ సాల వృక్షములలో ఒక దానిని పడగొట్ట గలిగితే, రాముడు వాలిని చంపగలడు అని నమ్మడానికి అవకాశము ఉంది. పోనీ రాముడు అక్కడ ఉన్న దుందుభి అస్థిపంజరమును తన కాలితో ఎత్తి రెండు వందల ధనుస్సు ప్రమాణముల అవతల విసర గలిగితే అప్పుడు కూడా రాముడు వాలిని చంపగలడు అని నమ్ముతాను.” అని అన్నాడు. సుగ్రీవుడు. (ధనుస్సు పొడుగు 6 అడుగులు. అంటే రెండు గజాలు. 200 ధనుస్సులు అంటే 400 వందల గజాలు.).
సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు. “రామా! మరొక మాట. వాలి మహా బలవంతుడు. పరాక్రమశాలి. ఇప్పటి వరకూ ఎవరి చేతిలోనూ ఓడిపోవడం అనేది ఎరుగడు. వాలి దేవతలకు కూడా అజేయుడు. అందుకనే వాలికి భయపడి నేను ఇక్కడ తలదాచుకుంటున్నాను. వాలిని ఓడించుటకు కానీ, జయించుటకు కానీ ఎవరికీ సాధ్యము కాదు. ఇంక నా మాట చెప్పడం ఎందుకు. అందుకే ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అని అనుక్షణం భయపడుతూ నా మంత్రులతో సహా ఇక్కడ దాక్కున్నాను.
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే. నాకు వాలి పరాక్రమము గురించి తెలుసు. కానీ నీ పరాక్రమము గురించి నాకు తెలియదు. అని చెప్పి నిన్ను పరీక్షించవలెనని గానీ, నీ పరాక్రమమును వీరత్వమును శంకించిగానీ నేను ఇలా అనడం లేదు. వాలి వలన కలిగిన భయంతోనే ఇలా మాట్లాడుతున్నాను. కాని నిన్ను, నీ ఆకారాన్ని, నీ ధనుస్సును చూస్తే నీవు వాలిని చంపగలవని నమ్మకం నాకు ఉంది. నీ తేజస్సు అటువంటిది.” అని తాను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పాడు సుగ్రీవుడు.
రాముడు సుగ్రీవుడు చెప్పిన మాటలు అన్నీ శ్రద్ధగా విన్నాడు. “మిత్రమా సుగ్రీవా! నీవు నా మీద నమ్మకం పెట్టు. నీకు నా పరాక్రమము మీద నమ్మకము లేకుంటే. నేను నీకు నమ్మకం కలిగేట్టు చేస్తాను.” అని అన్నాడు. వెంటనే దుందుభి అస్థిపంజరము వద్దకు వెళ్లాడు. తన కాలి బొటనవేలితో ఆ అస్థి పంజరమును పదియోజనముల దూరం పడేటట్టు విసిరాడు. అది చూచిన సుగ్రీవునికి మనసులో మరొక సందేహము కలిగింది.. రాముని చూచి ఇలా అన్నాడు.
“మిత్రమా! వాలి ఈ కళేబరమును విసిరినపుడు ఇది పూర్తిగా రక్త మాంసములతో బరువుగా ఉండింది. ఇప్పుడు ఎండిపోయి, అస్థిపంజరంగా మారింది. తన మునుపటి బరువును కోల్పోయింది. దీనిని బట్టి నీ బలము అధికమా, వాలి బలము అధికమా అని నిర్ణయించలేము కదా! అందుకని, నీవు ధనుస్సుకు బాణము సంధించి ఆ సాలవృక్షమును కొట్టినచో నాకు నమ్మకము కలుగుతుంది. రామా! నాకు తెలుసు. నీవు ఆ సాలవృక్షమును కొట్టగలవు. ఈ ఒక్కపని చేసి నాలో ఉన్న సందేహమును తొలగించు.” అని తన మనసులో ఉన్న సందేహమును బయట పెట్టాడు సుగ్రీవుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకోనసప్తతితమః సర్గ (69వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాక్షసి శూర్పణఖ రాముడిని చూసి మోహిస్తుంది. ఆమె రాముడిని వివాహం చేసుకోవాలని కోరుతుంది, కానీ రాముడు ఆమెను తిరస్కరిస్తూ సీతకు తన భక్తిని ప్రదర్శిస్తాడు. నిరాశ చెందిన శూర్పణఖ లక్ష్మణుడిని ఆశ్రయిస్తుంది, కానీ అతనూ ఆమెను తిరస్కరిస్తాడు. కోపంతో శూర్పణఖ సీతపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు నరికేస్తాడు.
రామలక్ష్మణులు ఆ ప్రకారంగా జటాయువుకు ఉత్తర క్రియలు నిర్వర్తించి, దక్షిణ దిక్కుగా సీతను వెదుకుతూ వెళ్లారు. పొదలతో, పెద్ద పెద్ద వృక్షములతో, సూర్యరశ్మికూడా చొరకుండా ఉన్న కీకారణ్యములో వారు ప్రయాణిస్తున్నారు. అలా ప్రయాణిస్తూ జనస్థానము నుండి మూడు కోసుల దూరం వెళ్లారు. అలా వెళుతూ వారు అరణ్యము నంతా సీత కోసం అణువు అణువునా గాలిస్తున్నారు.
సీతను రావణుడు అనే రాక్షసుడు తీసుకువెళ్లాడు అని తెలుసు కానీ ఎక్కడకు తీసుకు వెళ్లాడో రామలక్ష్మణులకు తెలియదు. జటాయువు చెప్పలేదు. అందుకని అడవి అంతా గాలిస్తున్నారు. వారు క్రౌంచారణ్యము దాటారు. మతంగుని ఆశ్రమము వైపుకు వెళుతున్నారు.
వారికి మధ్యలో ఒక పర్వతము కనపడింది. ఆ పర్వతము దగ్గర ఒక పెద్ద గుహను వారుచూచారు. ఆ గుహలో అంతా చీకటి మయంగా ఉంది. రామలక్ష్మణులు ఆ గుహ వద్దకు వెళ్లారు. ఆ గుహ దగ్గర వారు వికృతాకారంతో ఉన్న ఒక రాక్షసి ని చూచారు. ఆ రాక్షసిని చూస్తే మామూలు మనుష్యులయితే భయంతో ప్రాణాలు విడుస్తారు.
అలాంటి రాక్షసికి రాముని వెనక నడుస్తున్న లక్ష్మణుడి మీద మోహం కలిగింది. లక్ష్మణుని పట్టుకొని తన వైపుకు లాక్కుంది. తన కోరిక తీర్చమని అడిగింది.
“ఓ సుందరాంగా! నా పేరు అయోముఖి. నేను నిన్ను ప్రేమించాను. నువ్వు నాకు కావాలి. మనం ఇద్దరం హాయిగా క్రీడిద్దాము.” అని లక్ష్మణుని పట్టుకొని లాగింది.
లక్ష్మణునికి ఒళ్లు మండింది.. అసలే అయాచితంగా వచ్చి పడిన కష్టాలతో సతమతమవుతున్న లక్ష్మణునికి ఆమె మాటలు విని ఒళ్లు మండి పోయింది. వెంటనే కత్తి తీసి అలవాటైన ప్రకారము, ఆ రాక్షసి ముక్కు చెవులు కోసాడు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనకు భయభ్రాంతురాలైన ఆ రాక్షసి అక్కడి నుండి పారిపోయింది. రాముడు ఇదేమీ పట్టించుకోలేదు. తన పాటికి తాను ముందుకు పోతున్నాడు. లక్ష్మణుడు వెంట నడుస్తున్నాడు.
కొంచెం దూరం పోగానే లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు. “అన్నయ్యా! నాకు బుజాలు అదురుతున్నాయి. మనసంతా కల్లోలంగా ఉంది. ఎన్నో అపశకునములు కనపడుతున్నాయి. మనకు ఏదో ఆపద జరగబోతున్నట్టు అనిపిస్తూ ఉంది. దానికి సిద్ధంగా ఉండు. కాని మరొక పక్క మనకు జయము కలిగే సూచనగా వంచులకము అని పక్షి కూతకూడా వినపడుతూ ఉంది. ” అని అన్నాడు.
రాముడు లక్ష్మణుని మాటలు విని ఏమీ పలకలేదు. మాట్లాడలేదు. ముందుకుపోతున్నాడు. ఇంతలో వారికి ఒక భయంకరమైన శబ్దము వినిపించింది. ఆ శబ్దానికి అడవిలో జంతువులు అన్నీ చెల్లాచెదురుగా పారిపోయాయి. లక్ష్మణుడు ఆ శబ్దము ఎటునుండి వచ్చినదో ఆ వైపుకు వెళ్లాడు.
ఒక పొదలో లక్ష్మణునికి ఒక భయంకరమైన రాక్షసుడు కనిపించాడు. ఆ రాక్షసుని పేరు కబంధుడు. ఆ రాక్షసునికి కేవలము శరీరము ఉంది. శిరస్సు లేదు. అతని పొట్ట వద్ద ముఖం ఉంది. వక్షస్థలములో ఒక కన్ను ఉంది. పొట్ట దగ్గర పెద్ద నోరు, ఆ నోట్లో పెద్దనాలుక ఉంది. ఆ రాక్షసుడు తన ఒంటి కంటితో ఎంతదూరం అయినా చూడగలడు. తన పొడుగాటి నాలుకను చాచి ఎంతటి జంతువునైనా నోట్లోకి లాక్కోగలడు. ఆ రాక్షసుని శరీరం పెద్ద పర్వతములాగా ఉంది. ఆ రాక్షసుని చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి. ఆ చేతులతో ఆ రాక్షసుడు ఎన్నో జంతువులను తన వైపుకు లాక్కుని తింటూఉండేవాడు.
ఇప్పుడు వాడి చేతులకు రామలక్ష్మణులు తగిలారు. ఆ రాక్షసుడు తన రెండు చేతులతో రామలక్ష్మణులను పట్టుకొని తన వైపుకు లాక్కుంటున్నాడు. రామలక్ష్మణులు నిస్సహాయంగా అతని చేతులలో బందీలుగా అయ్యారు.
లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! ఈ రాక్షసుడు నన్ను తినేస్తాడు. కనీసం నువ్వు అన్నా వీడిని ఎదిరించి బయటపడు. సీతను వెదుకు. నీకు జయం కలుగుతుంది.” అని అన్నాడు.
కాని రాముడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. కాని ధైర్యంగా ఉ న్నాడు. “లక్ష్మణా! ధైర్యంగా ఉండు. మనకేం భయం లేదు. నేను వీడిని సంహరిస్తాను.” అని అన్నాడు.
తన చేతులలో చిక్కికూడా రాముడు అలా అనడం కబంధునికి ఆశ్చర్యం కలిగించింది.
“ఓ వీరులారా! మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు. ఈ భయంకరమైన అడవిలోకి ఎందుకు వచ్చారు? మీరు ఎవరైనా ఈరోజు నాకు ఆహారంగా మారారు. నా చేతులకు చిక్కిన వారు బతికి బయటకు పోలేరు.” అని అన్నాడు కబంధుడు.
కబంధుని మాటలు విని రాముడు వ్యధ చెందాడు. “లక్ష్మణా! మరలా ఇదేమి కష్టము. మనకు కష్టము మీద కష్టము వచ్చి పడుతూ ఉంది. మనము వెతుకుతున్న సీత కనిపించలేదు సరికదా ఇప్పుడు మన ప్రాణం మీదికి వచ్చింది. కాల ప్రవాహంలో ఎంతటి వాళ్ళు అయినా కొట్టుకుపోవలసిందే కదా!” అని అన్నాడు రాముడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టషష్ఠితమః సర్గ (68వ సర్గ) రామాయణంలో ప్రముఖమైన అధ్యాయం. ఈ సర్గలో రాముడు, సీత మరియు లక్ష్మణుడితో కలిసి దండకారణ్యంలో విస్తృతంగా పర్యవేక్షణ చేస్తాడు. అక్కడ రాక్షసులు వారిని బాధించేందుకు ప్రయత్నిస్తారు, కానీ రాముడు ధైర్యంగా వారిని ఎదుర్కొంటాడు. ఈ సర్గలో సీతకు భయం తొలగించడం, రాక్షసులను నియంత్రించడం మరియు దండకారణ్యంలో శాంతిని స్థాపించడం వంటి అంశాలు ఉన్నాయి. వాల్మీకి మహర్షి ఈ కథను రచించి, భారతీయ సాంప్రదాయంలో విశేష ప్రాముఖ్యతను అందించాడు.
జటాయువు ఆఖరి క్షణాలలో ఉన్నాడు. అది చూచి రాముడు ఇలా అన్నాడు. “లక్ష్మణా! జటాయువు మనకు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. కానీ చెప్పలేకపోతున్నాడు. ఇతని కంఠస్వరము క్షీణిస్తూ ఉంది.” అన్నాడు.
జటాయువును చూచి “జటాయువూ! ఒక్కసారి కళ్లు తెరువు. మాట్లాడు. సీత గురించి చెప్పు. సీతను రావణుడు ఎందుకు తీసుకెళ్లాడు. ఎక్కడకు తీసుకెళ్లాడు. రావణునికి నేను ఏమీ అపకారము చేయలేదే. మరి సీతను ఎందుకు తీసుకెళ్లినట్టు? ఆ సమయంలో సీత ఎలా ఉంది. ఆమె ఏమైనా చెప్పిందా! ఇంతకూ ఆ రావణుడు అనే రాక్షసుడు ఎలా ఉంటాడు. అతని గురించి చెప్పు. అతను మహా పరాక్రమవంతుడా! అతని నివాసము ఎక్కడ. అతడు ఏమి చేస్తుంటాడు. జటాయూ! మాట్లాడు” అని ఆతురతగా అడుగుతున్నాడు రాముడు.
జటాయువు నెమ్మదిగా కళ్లు తెరిచాడు. రాముని వంక చూచి ఇలా అన్నాడు. “రామా! రావణుడు రాక్షసుడు. మాయావి. తన మాయతో అధికమైన వాయువును సృష్టించి, సీతను ఆకాశమార్గంలో తీసుకెళ్లాడు. అతడు దక్షిణ దిక్కుగా వెళ్లాడు. రామా! నా చూపు మందగిస్తోంది. నాకు ప్రాణాలు పోతున్నాయి. రావణుడు సీతను వింద ముహూర్తంలో అపహరించాడు. ఆ ముహూర్తంలో ఏవస్తువు పోయినా, తొందరలోనే ఆ వస్తువు తిరిగి తన యజమానికి లభిస్తుంది. ఆ విషయం రావణునికి తెలియదు. నీ సీత నీకు తొందరలోనే లభిస్తుంది. నీవు తొందరలలోనే రావణునితో యుద్ధము చేసి, రావణుని చంపి, నీ సీతను తిరిగి పొందుతావు.” అని అంటూ ఉండగానే జటాయువు నోటి నుండి రక్తం పడింది. కళ్లు మూతలు పడ్డాయి.
మరలా జటాయువు ఓపిక తెచ్చుకొని రామునితో “రామా! రావణుడు విశ్రవసుని కుమారుడు. కుబేరునికి సోదరుడు….” అని ఇంకా ఏమో చెప్పబోతూ ప్రాణాలు వదిలాడు జటాయువు.
అది తెలుసుకోలేని రాముడు “ఇంకా ఇంకా రావణుని గురించి చెప్పు” అని జటాయువును కుదిపి కుదిపి అడుగుతున్నాడు. జటాయువు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. జటాయువు తల వాల్చి కిందకు జారిపోయాడు.
జటాయువు చనిపోయాడని తెలుసుకున్న రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఈ జటాయువు నా తండ్రికి స్నేహితుడు. ఈ దండకారణ్యంలో తన మానాన తాను బతుకుతూ, నా కొరకు, సీతను రక్షించుట కొరకు, తన ప్రాణాలు సైతం బలిపెట్టాడు. ఇంకా ఎంతో కాలము బతకవలసిన వాడు మనకోసం ప్రాణాలు కోల్పోయాడు. కేవలము నాకు సాయం చెయ్యాలని, సీతను రక్షించాలని, రావణునితో యుద్ధం చేసి, రావణుని చేతిలో చంపబడ్డాడు.
మంచివారు, వీరులు, శూరులు, పరోపకారము చేసేవారు, మనుష్యులలోనే కాదు, జంతువుల లోనూ పక్షులలోనూ ఉంటారని ఈ జటాయువు నిరూపించాడు. ఈ జటాయువు మరణము, అందులోనూ నా కోసం మరణించడం నాకు అత్యంత దుఃఖమును కలిగించింది. సీతా వియోగము కన్నా ఎక్కువ దుఃఖము అనుభవిస్తున్నాను. నా తండ్రి నాకు ఎంత పూజనీయుడో ఈ జటాయువు కూడా అంతే పూజనీయుడు…
లక్ష్మణా! మనము ఈ జటాయువుకు దహన సంస్కారములు జరిపిద్దాము. కట్టెలు తీసుకురా!” అని అన్నాడు.
తరువాత రాముడు, లక్ష్మణుడు జటాయువుకు దహనసంస్కారములు చేసారు. రాముడు జటాయువు ఆత్మశాంతికి ప్రార్థించాడు. “ఓ జటాయువూ! ఎల్లప్పుడూ యజ్ఞములు చేసే వారికి, నిత్యము అగ్నిహోత్రము చేసేవారికి ఎటువంటి పుణ్యలోకములు లభిస్తాయో, ఆ పుణ్యలోకములు నీకు లభించుగాక! సన్యాసులకు, యుద్ధములో మరణించినవారికి ఎలాంటి ఉత్తమ లోకాలు లభిస్తాయో అవి నీకు లభించునుగాక! నా చేత దహన సంస్కారములు పొందిన నీవు ఉత్తమ లోకములు పొందుతావు!” అని పలికాడు రాముడు.
తరువాత లక్ష్మణుడు దర్భలను తీసుకొని వచ్చాడు. రోహి మృగములనుచంపి ఆ మాంసమును తీసుకొని వచ్చాడు. రాముడు దర్భలు నేలమీద పరిచాడు. రోహి మృగము మాంసముతో ముద్దలు చేసి ఆ దర్భల మీద పెట్టి జటాయువుకు మంత్రపూర్వకంగా పిండప్రదానము చేసాడు. తరువాత రాముడు లక్ష్మణుడు గోదావరీ నదికి వెళ్లి స్నానం చేసి శాస్త్రోక్తంగా జటాయువుకు జలతర్పణములు విడిచారు. రాముని చేత ఉత్తర క్రియలు జరిపించుకున్న జటాయువు ఉత్తమలోకములకు వెళ్లాడు. తరువాత రామలక్ష్మణులు సీతను వెదుక్కుంటూ అడవిలోకి వెళ్లారు.