Kishkindha Kanda Sarga 10 In Telugu – కిష్కింధాకాండ దశమః సర్గః

Kishkindha Kanda Sarga 10

కిష్కింధాకాండలో దశమ సర్గలో, రాముడు హనుమంతుని పట్టుకుని, ఆతని వద్దకు మరోసారి సీతను కనిపిస్తున్న అంశాలు చెప్పడం గురించి ఉంటాయి. హనుమంతుడు సీతాను రాముడి సందేశాన్ని అందిస్తాడు, ఆమె ధైర్యాన్ని ప్రకటిస్తుండటం మూలంగా రాముడు త్వరగా హ్యాన్వేషణకు వచ్చేందుకు నిర్ధరిస్తారు. హనుమంతుడు తన సామర్థ్యాన్ని వినియోగించి, సీతను మీకోసం రాముడి సందేశాన్ని అందిస్తాడు. హనుమంతుడు తన కాలులుతో ప్రకాశిస్తుండటం, రాముడి స్మరణతో ఉండటం ద్వారా ధైర్యం ప్రదర్శించబడుతుంది. ఈ సర్గలో హనుమంతుడి నిర్ణయ శక్తి, సీతాకు భక్తి మరియు రాముడి స్మరణ ప్రధానంగా మారింది.

రాజ్యనిర్వాసకథనమ్

తతః క్రోధసమావిష్టం సంరబ్ధం తముపాగతమ్ |
అహం ప్రసాదయాంచక్రే భ్రాతరం ప్రియకామ్యయా || ౧ ||

దిష్ట్యాఽసి కుశలీ ప్రాప్తో దిష్ట్యాపి నిహతో రిపుః |
అనాథస్య హి మే నాథస్త్వమేకోఽనాథనందనః || ౨ ||

ఇదం బహుశలాకం తే పూర్ణచంద్రమివోదితమ్ |
ఛత్రం సవాలవ్యజనం ప్రతీచ్ఛస్వ మయోద్యతమ్ || ౩ ||

ఆర్తశ్చాథ బిలద్వారి స్థితః సంవత్సరం నృప |
దృష్ట్వాహం శోణితం ద్వారి బిలాచ్చాపి సముత్థితమ్ || ౪ ||

శోకసంవిగ్నహృదయో భృశం వ్యాకులితేంద్రియః |
అపిధాయ బిలద్వారం గిరిశృంగేణ తత్తథా || ౫ ||

తస్మాద్దేశాదపాక్రమ్య కిష్కింధాం ప్రావిశం పునః |
విషాదాత్త్విహ మాం దృష్ట్వా పౌరైర్మంత్రిభిరేవ చ || ౬ ||

అభిషిక్తో న కామేన తన్మే త్వం క్షంతుమర్హసి |
త్వమేవ రాజా మానార్హః సదా చాహం యథాపురమ్ || ౭ ||

రాజభావనియోగోఽయం మయా త్వద్విరహాత్కృతః |
సామాత్యపౌరనగరం స్థితం నిహతకంటకమ్ || ౮ ||

న్యాసభూతమిదం రాజ్యం తవ నిర్యాతయామ్యహమ్ |
మా చ రోషం కృథాః సౌమ్య మయి శత్రునిబర్హణ || ౯ ||

యాచే త్వాం శిరసా రాజన్ మయా బద్ధోఽయమంజలిః |
బలాదస్మి సమాగమ్య మంత్రిభిః పురవాసిభిః || ౧౦ ||

రాజభావే నియుక్తోఽహం శూన్యదేశజిగీషయా |
స్నిగ్ధమేవం బ్రువాణం మాం స తు నిర్భర్త్స్య వానరః || ౧౧ ||

ధిక్ త్వామితి చ మాముక్త్వా బహు తత్తదువాచ హ |
ప్రకృతీశ్చ సమానీయ మంత్రిణశ్చైవ సమ్మతాన్ || ౧౨ ||

మామాహ సుహృదాం మధ్యే వాక్యం పరమగర్హితమ్ |
విదితం వో యథా రాత్రౌ మాయావీ స మహాసురః || ౧౩ ||

మాం సమాహ్వయత క్రూరో యుద్ధకాంక్షీ సుదుర్మతిః |
తస్య తద్గర్జితం శ్రుత్వా నిఃసృతోఽహం నృపాలయాత్ || ౧౪ ||

అనుయాతశ్చ మాం తూర్ణమయం భ్రాతా సుదారుణః |
స తు దృష్టైవ మాం రాత్రౌ సద్వితీయం మహాబలః || ౧౫ ||

ప్రాద్రవద్భయసంత్రస్తో వీక్ష్యావాం తమనుద్రుతౌ |
అనుద్రుతశ్చ వేగేన ప్రవివేశ మహాబిలమ్ || ౧౬ ||

తం ప్రవిష్టం విదిత్వా తు సుఘోరం సుమహద్బిలమ్ |
అయముక్తోఽథ మే భ్రాతా మయా తు క్రూరదర్శనః || ౧౭ ||

అహత్వా నాస్తి మే శక్తిః ప్రతిగంతుమితః పురీమ్ |
బిలద్వారి ప్రతీక్ష త్వం యావదేనం నిహన్మ్యహమ్ || ౧౮ ||

స్థితోఽయమితి మత్వా తు ప్రవిష్టోఽహం దురాసదమ్ |
తం చ మే మార్గమాణస్య గతః సంవత్సరస్తదా || ౧౯ ||

స తు దృష్టో మయా శత్రురనిర్వేదాద్భయావహః |
నిహతశ్చ మయా తత్ర సోఽసురో బంధుభిః సహ || ౨౦ ||

తస్యాస్యాత్తు ప్రవృత్తేన రుధిరౌఘేణ తద్బిలమ్ |
పూర్ణమాసీద్దురాక్రామం స్తనతస్తస్య భూతలే || ౨౧ ||

సూదయిత్వా తు తం శత్రుం విక్రాంతం తం మహాసురమ్ |
నిష్క్రామన్నైవ పశ్యామి బిలస్యాపిహితం ముఖమ్ || ౨౨ ||

విక్రోశమానస్య తు మే సుగ్రీవేతి పునః పునః |
యదా ప్రతివచో నాస్తి తతోఽహం భృశదుఃఖితః || ౨౩ ||

పాదప్రహారైస్తు మయా బహుభిస్తద్విదారితమ్ |
తతోఽహం తేన నిష్క్రమ్య పథా పురముపాగతః || ౨౪ ||

అత్రానేనాస్మి సంరుద్ధో రాజ్యం ప్రార్థయతాఽఽత్మనః |
సుగ్రీవేణ నృశంసేన విస్మృత్య భ్రాతృసౌహృదమ్ || ౨౫ ||

ఏవముక్త్వా తు మాం తత్ర వస్త్రేణైకేన వానరః |
తదా నిర్వాసయామాస వాలీ విగతసాధ్వసః || ౨౬ ||

తేనాహమపవిద్ధశ్చ హృతదారశ్చ రాఘవ |
తద్భయాచ్చ మహీ కృత్స్నా క్రాంతేయం సవనార్ణవా || ౨౭ ||

ఋశ్యమూకం గిరివరం భార్యాహరణదుఃఖితః |
ప్రవిష్టోఽస్మి దురాధర్షం వాలినః కారణాంతరే || ౨౮ ||

ఏతత్తే సర్వమాఖ్యాతం వైరానుకథనం మహత్ |
అనాగసా మయా ప్రాప్తం వ్యసనం పశ్య రాఘవ || ౨౯ ||

వాలినస్తు భయార్తస్య సర్వలోకాభయంకర |
కర్తుమర్హసి మే వీర ప్రసాదం తస్య నిగ్రహాత్ || ౩౦ ||

ఏవముక్తస్తు తేజస్వీ ధర్మజ్ఞో ధర్మసంహితమ్ |
వచనం వక్తుమారేభే సుగ్రీవం ప్రహసన్నివ || ౩౧ ||

అమోఘాః సూర్యసంకాశా మమైతే నిశితాః శరాః |
తస్మిన్ వాలిని దుర్వృత్తే నిపతిష్యంతి వేగితాః || ౩౨ ||

యావత్తం నాభిపశ్యామి తవ భార్యాపహారిణమ్ |
తావత్స జీవేత్ పాపాత్మా వాలీ చారిత్రదూషకః || ౩౩ ||

ఆత్మానుమానాత్ పశ్యామి మగ్నం త్వాం శోకసాగరే |
త్వామహం తారయిష్యామి కామం ప్రాప్స్యసి పుష్కలమ్ || ౩౪ ||

తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్యాత్మనో హితమ్ |
సుగ్రివః పరమప్రీతః సుమహద్వాక్యమబ్రవీత్ || ౩౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే దశమః సర్గః || ౧౦ ||

Kishkindha Kanda Sarga 10 Meaning In Telugu

నేను నా అన్నకు జరిగిన విషయము వివరంగా చెప్పాను. నా మీద కోపగించవద్దని బతిమాలుకున్నాను. “అన్నయ్యా! నేను చెప్పేది విను. నీవు మన శత్రువును సంహరించి విజయోత్సాహంతో తిరిగి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా కందరికీ ఇప్పటికీ నీవే రక్షకుడవు. నీవే ఈ సింహాసనము అధిష్టించు. నేను నీ వెనక నిలబడి ఛత్రము పట్టి నిల్చుంటాను. అన్నా! నీవు ఆదేశించినట్టు నేను ఆ బిలము బయట ఒక సంవత్సరము పాటు వేచి ఉన్నాను. నీవు రాలేదు. ఇంతలో ఆ బిలము లో నుండి రక్తం ఏరులుగా ప్రవహించింది. అది చూచి నాకు భయం వేసింది. నిన్ను ఆ రాక్షసుడు చంపి ఉంటాడని అనుకున్నాను. ఆ బిలమును పెద్ద పెద్ద బండరాళ్లతో మూసివేసాను.

కిష్కింధకు తిరిగి వచ్చాను. నేను ఎంత వద్దన్నా, ఈ మంత్రులు నన్ను రాజును చేసారు. ఇది అన్నా జరిగిన సంగతి. నేను ఈ కిష్కింధకు రాజుగా తగను. నీవే రాజువు. నీవు వచ్చేవరకూ నేను ఈ రాజ్యాన్ని నీ బదులు సంరక్షిస్తూ ఉన్నాను. ఇప్పుడు నీ రాజ్యమును నీకు అప్పగిస్తున్నాను. నేను ఇదివరకటి మాదిరి నిన్ను సేవిస్తూ ఉంటాను. నా మీద కోపించకు. శాంతం వహించు. నీ పాదాల పడి ప్రార్థిస్తున్నాను. అన్నయ్యా! మరొకసారి చెబుతున్నాను. నేను నాకుగా ఈ రాజ్యానికి అభిషిక్తునిగా కాలేదు. మంత్రులు, ప్రజలు, రాజ్యమునకు రక్షకుడు లేకుండా ఉండకూడదని, నన్ను రాజుగా చేసారు. ఇందులో నా తప్పు ఏమీ లేదు. ” అని ఎన్నోవిధాలుగా వాలిని వేడుకున్నాను.

కాని నా అన్న వాలి నా ప్రార్థనలను పెడచెవిని పెట్టాడు. నన్ను ఛీ కొట్టాడు. “ఏరా! ఒకనాడు అర్థరాత్రి మాయావి వచ్చి నన్ను యుద్ధానికి పిలిచాడు అని నీకు తెలుసు కదా! అప్పుడు వాడితో తలపడడానికి నేను వెళ్లాను కదా! అప్పుడు క్రూరుడవైన నీవు నా వెంట వచ్చావు కదా! మన ఇద్దరిని చూచి ఆ రాక్షసుడు పారిపోయాడు కదా! ఒకబిలములో ప్రవేశించాడు కదా! “నేను ఈ రాక్షసుడిని చంపి గానీ కిష్కింధకు తిరిగిరాను. నేను వచ్చువరకు నీవు ఈ బిలము బయట వేచి ఉండు” అని ఆదేశించి నేను ఆ బిలములో ప్రవేశించాను కదా!

నీవు బిలము వద్ద ఉన్నావు కదా అనే ధైర్యముతోనే కదా నేను బిలములోకి ప్రవేశించింది. నేను వాడి కోసరము సంవత్సరము పాటు వేచి ఉండి, వాడిని వాడి బంధుమిత్రులను సమూలంగా సంహరించాను. వారి రక్తముతో ఆ బిలము పూర్తిగా తడిసిపోయింది. నడవడానికి కూడా వీలు కాలేదు. అందువల్ల నేను బయటకు రావడం ఆలస్యం అయింది. నేను బిలద్వారము దగ్గరకు వచ్చాను. కాని అది మూసి ఉంది. “సుగ్రీవా! సుగ్రీవా” అంటూ అరిచాను. కేకలు పెట్టాను. కాని నీవు అక్కడ లేవు. నాకు దుఃఖము వచ్చింది. ఎంతో ప్రయాస పడి నీవు బిలద్వారమునకు అడ్డుగా పెట్టిన రాళ్లను తొలగించి బయటకు వచ్చాను.

క్రూరుడు, దుర్మార్గుడు అయిన నా తమ్ముడు సుగ్రీవుడు నా అడ్డు తొలగించుకొని ఈ రాజ్యమును అపహరించవలెననే దురుద్దేశముతో నన్ను ఆబిలములో బంధించి, సమాధి చేసాడు అని అర్థం అయింది. ఇప్పుడు తెలిసిందా నీవు చేసిన తప్పు ఏంటో! కాబట్టి నీవు ఈ రాజ్యములో ఉండ తగవు.” అంటూ నా అన్న వాలి నన్ను కట్టుబట్టలతో రాజ్యము నుండి వెడలగొట్టాడు. నా భార్యను తన వద్దనే ఉంచుకున్నాడు.

నేను వాలికి భయపడి ఈ భూమి అంతా చుట్టబెట్టాను. ఎక్కడా నాకు వాలి నుండి ఆశ్రయం దొరకలేదు. కారణాంతరాల వల్ల వాలి ఈ ఋష్యమూక పర్వతము మీదకు రాలేడని తెలిసింది. అందువల్ల ఇక్కడ తలదాచుకుంటున్నాను. రామా! విన్నావు కదా నా కధ. ఇందులో నా తప్పు ఏమీ లేకపోయినా, నా అన్న వాలి నన్ను రాజ్యభ్రష్టుని చేసాడు. నా భార్యను అపహరించాడు. వాలికి భయపడి నేను ఈ పర్వతము మీద నివసిస్తున్నాను.” అని పలికాడు సుగ్రీవుడు.

రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. “మిత్రమా! సుగ్రీవా! వాలిని చంపడానికి తగిన కారణం దొరికింది. నా బాణములతో వాలిని చంపుతాను. వాలి నా కంటపడనంతవరకే జీవించి ఉంటాడు. నిన్ను మరలా కిష్కింధకు రాజుగా చేస్తాను. నీ భార్యను నిన్ను చేరుకుంటుంది. నా మాట నమ్ము.” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ ఏకాదశః సర్గః (11) >>>

Aranya Kanda Sarga 67 In Telugu – అరణ్యకాండే సప్తషష్ఠితమః సర్గః

Aranya Kanda Sarga 67 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తషష్ఠితమః సర్గః (67వ సర్గ) రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి దండకారణ్యంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ రాక్షసుల నుండి ఋషులను రక్షిస్తారు. ఈ సర్గలో రాముడు రాక్షసుల నేతలతో యుద్ధాలు చేయడం, దుర్మార్గులను శిక్షించడం, మరియు సన్యాసులతో సంభాషణలు జరపడం వంటి విషయాలు ఉంటాయి. రాముడు ధర్మాన్ని రక్షించే తన ధైర్యాన్ని, సహనాన్ని ఈ సర్గలో ప్రదర్శిస్తాడు.

గృధ్రరాజదర్శనమ్

పూర్వజోఽప్యుక్తమాత్రస్తు లక్ష్మణేన సుభాషితమ్ |
సారగ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవః ||

1

సన్నిగృహ్య మహాబాహుః ప్రవృత్తం కోపమాత్మనః |
అవష్టభ్య ధనుశ్చిత్రం రామో లక్ష్మణమబ్రవీత్ ||

2

కిం కరిష్యావహే వత్స క్వ వా గచ్ఛావ లక్ష్మణ |
కేనోపాయేన పశ్యేయం సీతామితి విచింతయ ||

3

తం తథా పరితాపార్తం లక్ష్మణో రామమబ్రవీత్ |
ఇదమేవ జనస్థానం త్వమన్వేషితుమర్హసి ||

4

రాక్షసైర్బహుభిః కీర్ణం నానాద్రుమలతాయుతమ్ |
సంతీహ గిరిదుర్గాణి నిర్దరాః కందరాణి చ ||

5

గుహాశ్చ వివిధా ఘోరాః నానామృగగణాకులాః |
ఆవాసాః కిన్నరాణాం చ గంధర్వభవనాని చ ||

6

తాని యుక్తో మయా సార్ధం త్వమన్వేషితుమర్హసి |
త్వద్విధా బుద్ధిసంపన్నాః మహాత్మానో నరర్షభ ||

7

ఆపత్సు న ప్రకంపంతే వాయువేగైరివాచలాః |
ఇత్యుక్తస్తద్వనం సర్వం విచచార సలక్ష్మణః ||

8

క్రుద్ధో రామః శరం ఘోరం సంధాయ ధనుషి క్షురమ్ |
తతః పర్వతకూటాభం మహాభాగం ద్విజోత్తమమ్ ||

9

దదర్శ పతితం భూమౌ క్షతజార్ద్రం జటాయుషమ్ |
తం దృష్ట్వా గిరిశృంగాభం రామో లక్ష్మణమబ్రవీత్ ||

10

అనేన సీతా వైదేహీ భక్షితా నాత్ర సంశయః |
గృధ్రరూపమిదం రక్షో వ్యక్తం భవతి కాననే ||

11

భక్షయిత్వా విశాలాక్షీమాస్తే సీతాం యథాసుఖమ్ |
ఏనం వధిష్యే దీప్తాస్యైర్ఘోరైర్బాణైరజిహ్మగైః ||

12

ఇత్యుక్త్వాఽభ్యపతద్గృధ్రం సంధాయ ధనుషి క్షురమ్ |
క్రుద్ధో రామః సముద్రాంతాం కంపయన్నివ మేదినీమ్ ||

13

తం దీనం దీనయా వాచా సఫేనం రుధిరం వమన్ |
అభ్యభాషత పక్షీ తు రామం దశరథాత్మజమ్ ||

14

యామోషధిమివాయుష్మన్నన్వేషసి మహావనే |
సా దేవీ మమ చ ప్రాణా రావణేనోభయం హృతమ్ ||

15

త్వయా విరహితా దేవీ లక్ష్మణేన చ రాఘవ |
హ్రియమాణా మయా దృష్టా రావణేన బలీయసా ||

16

సీతామభ్యవపన్నోఽహం రావణశ్చ రణే మయా |
విధ్వంసితరథశ్చాత్ర పాతితో ధరణీతలే ||

17

ఏతదస్య ధనుర్భగ్నమేతదస్య శరావరమ్ |
అయమస్య రథో రామ భగ్నః సాంగ్రామికో మయా ||

18

అయం తు సారథిస్తస్య మత్పక్షో నిహతో యుధి |
పరిశ్రాంతస్య మే పక్షౌ ఛిత్త్వా ఖడ్గేన రావణః ||

19

సీతామాదాయ వైదేహీముత్పపాత విహాయసమ్ |
రక్షసా నిహతం పూర్వం న మాం హంతుం త్వమర్హసి ||

20

రామస్తస్య తు విజ్ఞాయ బాష్పపూర్ణముఖస్తదా |
ద్విగుణీకృతతాపార్తః సీతాసక్తాం ప్రియాం కథామ్ ||

21

గృధ్రరాజం పరిష్వజ్య పరిత్యజ్య మహద్ధనుః |
నిపపాతావశో భూమౌ రురోద సహలక్ష్మణః ||

22

ఏకమేకాయనే దుర్గే నిఃశ్వసంతం కథంచన |
సమీక్ష్య దుఃఖితతరో రామః సౌమిత్రిమబ్రవీత్ ||

23

రాజ్యాద్భ్రంశో వనే వాసః సీతా నష్టా ద్విజో హతః |
ఈదృశీయం మమాలక్ష్మీర్నిర్దహేదపి పావకమ్ ||

24

సంపూర్ణమపి చేదద్య ప్రతరేయం మహోదధిమ్ |
సోఽపి నూనం మమాలక్ష్మ్యా విశుష్యేత్సరితాం పతిః ||

25

నాస్త్యభాగ్యతరో లోకే మత్తోఽస్మిన్సచరాచరే |
యేనేయం మహతీ ప్రాప్తా మయా వ్యసనవాగురా ||

26

అయం పితృవయస్యో మే గృధ్రరాజో జరాన్వితః |
శేతే వినిహతో భూమౌ మమ భాగ్యవిపర్యయాత్ ||

27

ఇత్యేవముక్త్వా బహుశో రాఘవః సహలక్ష్మణః |
జటాయుషం చ పస్పర్శం పితృస్నేహం విదర్శయన్ ||

28

నికృత్తపక్షం రుధిరావసిక్తం
స గృధ్రరాజం పరిరభ్య రామః |
క్వ మైథిలీ ప్రాణసమా మమేతి
విముచ్య వాచం నిపపాత భూమౌ ||

29

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే సప్తషష్ఠితమః సర్గః ||

Aranya Kanda Sarga 67 Meaning In Telugu

“వినదగునెవ్వరుచెప్పిన” అని ఈ నాడు ఒక సామెత ఉంది. శ్రీరాముడు అక్షరాలా ఆ సూత్రాన్నే పాటించాడు. లక్షణుడు తన కన్నా చిన్న వాడు. కానీ తనకు నీతిబోధ చేసాడు. శ్రీరాముడు లక్ష్మణుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు. ఎదురు చెప్పలేదు. బదులు చెప్పలేదు. తర్కించలేదు. విమర్శించలేదు. మౌనంగా అంగీకరించాడు. తన కోపాన్ని తనలోనే అణచుకొన్నాడు. ఎత్తిన ధనుస్సును దించాడు. తమ్ముని ముందు తలవంచి క్లుప్తంగా ఇలా అన్నాడు.

“తమ్ముడా లక్ష్మణా! ఇప్పుడు మనం ఏమి చేద్దాము? ఎక్కడికి వెళదాము. సీత గురించిన ఆధారాలు ఏ ఉపాయంతో దొరుకుతాయో ఆలోచించు.” అని అన్నాడు.

అన్నయ్య శాంతించడంతో లక్ష్మణుడికి ఉత్సాహం పెల్లుబికింది. “అన్నయ్యా! ఎటువంటి పెనుగాలి వీచినా పర్వతము చలించనట్టు, ఎన్ని కష్టములు వచ్చినా నీ వంటి ధీరోదాత్తులు చలించకూడదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. విజయం సాధించాలి. అన్నయ్యా! సీతను ఆ రాక్షసులు ఏమి చేసినా ఈ అడవిలోనే చెయ్యాలి. ఎందుకంటే ఈ జనస్థానము రాక్షసులకు బలమైన స్థావరము. అందుకని మనము ఈ అడవిని క్షుణ్ణంగా వెదుకుదాము. మనకు సరిఅయిన ఆధారాలు లభిస్తాయి. వాటి ద్వారా సీత జాడ తెలుసుకుందాము. మనం ఇద్దరం కలిసి వెదుకుదాము. ” అన్నాడు.

వెంటనే మారు మాటాడక రాముడు లక్ష్మణుని అనుసరించాడు. ఇద్దరూ అడవిలో సీత కోసం వెదకడం మొదలెట్టారు. వారి శ్రమ త్వరలోనే ఫలించింది. రావణుడు తన రెక్కలు విరగ గొట్టగానే జటాయువు ఎగురుతూ పోయి అల్లంత దూరంలో పడ్డాడు. బాధతో మూలుగుతున్నాడు. కొండంత ఎత్తున నేలమీద పడి ఉన్న జటాయువును చూచారు రామలక్షణులు. రామునిలో ఆవేశం పెల్లుబికింది. ఆ కొండంత పక్షికూడా రాక్షసుడే అనుకున్నాడు. ఎందుకంటే అంతకు ముందే లేడి రూపంలో ఉన్న మారీచుని సంహరించాడు. ఇప్పుడు వీడు పక్షిరూపంలో ఉన్న రాక్షసుడు అనుకున్నాడు. అందుకే విల్లు ఎక్కుపెట్టి అర్ధచంద్ర బాణం సంధించాడు.

“లక్షణా! అడుగో సీతను అపహరించి తినివేసిన రాక్షసుడు. సీతను భక్షించి తీరిగ్గా కూర్చుని ఉన్నాడు. వాడిని ఇప్పుడే హతమారుస్తాను.” అంటూ ఆవేశంతో పలికాడు.

దూరం నుండి రాముని మాటలను విన్నాడు జటాయువు. “నేను రాక్షసుడిని కాను రామా! నీ తండ్రిగారి స్నేహితుడు జటాయువును. సీత జాడ నాకు తెలుసు.” అని పెద్దగా అరిచాడు.

రామ లక్ష్మణులు గబా గబా జటాయువు దగ్గరకు వెళ్లారు. రెక్కలు విరిగి శరీరం అంతా రక్తంతో తడిసిముద్ద అయి ఉన్న జటాయువును చూచారు. జటాయువు అవసాన దశలో ఉన్నాడు. అందుకని పరామర్శలకు తావు ఇవ్వకుండా తనకు తెలిసిన విషయాలు గబా గబా చెప్పనారంభించాడు.

“రామా! లక్ష్మణా! జాగ్రత్తగా వినండి. సీతను అపహరించింది. నా రెక్కలు విరుగ గొట్టినది రావణుడు అనే రాక్షసరాజు. సీతను రావణుడు అపహరించి ఎత్తుకు పోవడం నేను కళ్లారా చూచాను. అతనితో నేను పోరాడాను. అతని రథాన్ని విరుగగొట్టాను. సారధిని చంపాను. రథానికి కట్టిన గాడిదలను చంపాను. రావణుని కవచం ఛేధించాను. రావణుడు కత్తితో నారెక్కలు ఖండించాడు. నేను కింద పడిపోగానే రావణుడు సీతను ఎత్తుకొని ఆకాశమార్గంలో ఎగిరిపోయాడు. ఇప్పటికే ఆ రాక్షసుడు నన్ను చంపాడు. ఇంకా నువ్వు ఏమి చంపుతావు.” అని అన్నాడు జటాయువు.

రాముడు ధనుస్సును కింద పడేసాడు. రామలక్ష్మణులు జటాయువు ను కౌగలించుకున్నారు. సీత కోసరం తన ప్రాణాలను బలిపెట్టిన జటాయువును పట్టు కొని ఏడ్చారు. జటాయువు ఊపిరి భారంగా తీస్తున్నాడు.

“చూచావా నా దౌర్భాగ్యము. రాజ్యం పోయింది. తండ్రి పోయాడు. నా భార్య అపహరింపబడింది. ఇప్పుడు నా పితృసమానుడు జటాయువు కూడా పోతున్నాడు. నేను ముట్టుకుంటే మహాసముద్రాలు కూడా ఎండి పోతున్నాయి. నావంటి దౌర్భాగ్యుడు ఈ లోకంలో మరొకడు ఉంటాడా! ” అని వలా వలా ఏడ్చాడు.

రాముడు జటాయువును కౌగలించుకొని “నా సీతను ఆ రాక్షసుడు ఎక్కడకు తీసుకువెళ్లాడు. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది.” అని అడిగాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ అష్టషష్ఠితమః సర్గః (68) >>

Kishkindha Kanda Sarga 9 In Telugu – కిష్కింధాకాండ నవమః సర్గః

Kishkindha Kanda Sarga 9

కిష్కింధాకాండలో నవమ సర్గ, హనుమంతుడు లంకను దహించి సీతకు మరోసారి ధైర్యం చెప్పడం గురించి ఉంటుంది. లంకను దహించి, హనుమంతుడు సీతకు రాముడి సందేశాన్ని మరోసారి అందించి, రక్షణ కోసం రాముడు త్వరలో వచ్చే విషయాన్ని చెబుతాడు. సీత, హనుమంతుడికి రాముడికి ఇవ్వవలసిన చూడామణిని అందిస్తుంది. హనుమంతుడు లంకను విడిచి, రాముడి వద్దకు తిరిగి చేరుకుంటాడు. తిరిగి వచ్చాక, హనుమంతుడు సీతను కనుగొన్న వివరాలను రాముని, సుగ్రీవుని, వానర సైన్యానికి తెలియజేస్తాడు. ఈ సర్గలో సీతకు ధైర్యం ఇచ్చిన హనుమంతుడి చర్యలు, రాముడు, సుగ్రీవుడు, వానర సైన్యంలోని ఆనందం ప్రధానంగా ఉంటాయి.

వైరవృత్తాంతానుక్రమః

శ్రూయతాం రామ యద్వృత్తమాదితః ప్రభృతి త్వయా |
యథా వైరం సముద్భూతం యథా చాహం నిరాకృతః || ౧ ||

వాలీ నామ మమ భ్రాతా జ్యేష్ఠః శత్రునిషూదనః |
పితుర్బహుమతో నిత్యం మమాపి చ తథా పురా || ౨ ||

పితర్యుపరతేఽస్మాకం జ్యేష్ఠోఽయమితి మంత్రిభిః |
కపీనామీశ్వరో రాజ్యే కృతః పరమసమ్మతః || ౩ ||

రాజ్యం ప్రశాసతస్తస్య పితృపైతామహం మహత్ |
అహం సర్వేషు కాలేషు ప్రణతః ప్రేష్యవత్ స్థితః || ౪ ||

మాయావీ నామ తేజస్వీ పూర్వజో దుందుభేః సుతః |
తేన తస్య మహద్వైరం స్త్రీకృతం విశ్రుతం పురా || ౫ ||

స తు సుప్తజనే రాత్రౌ కిష్కింధాద్వారమాగతః |
నర్దతి స్మ సుసంరబ్ధో వాలినం చాహ్వయద్రణే || ౬ ||

ప్రసుప్తస్తు మమ భ్రాతా నర్దితం భైరవస్వనమ్ |
శ్రుత్వా న మమృషే వాలీ నిష్పపాత జవాత్తదా || ౭ ||

స తు వై నిఃసృతః క్రోధాత్తం హంతుమసురోత్తమమ్ |
వార్యమాణస్తతః స్త్రీభిర్మయా చ ప్రణతాత్మనా || ౮ ||

స తు నిర్ధూయ సర్వాన్నో నిర్జగామ మహాబలః |
తతోఽహమపి సౌహార్దాన్నిఃసృతో వాలినా సహ || ౯ ||

స తు మే భ్రాతరం దృష్ట్వా మాం చ దూరాదవస్థితమ్ |
అసురో జాతసంత్రాసః ప్రదుద్రావ తతో భృశమ్ || ౧౦ ||

తస్మిన్ ద్రవతి సంత్రస్తే హ్యావాం ద్రుతతరం గతౌ |
ప్రకాశశ్చ కృతో మార్గశ్చంద్రేణోద్గచ్ఛతా తదా || ౧౧ ||

స తృణైరావృతం దుర్గం ధరణ్యా వివరం మహత్ |
ప్రవివేశాసురో వేగాదావామాసాద్య విష్ఠితౌ || ౧౨ ||

తం ప్రవిష్టం రిపుం దృష్ట్వా బిలం రోషవశం గతః |
మామువాచ తదా వాలీ వచనం క్షుభితేంద్రియః || ౧౩ ||

ఇహ త్వం తిష్ఠ సుగ్రీవ బిలద్వారి సమాహితః |
యావదత్ర ప్రవిశ్యాహం నిహన్మి సహసా రిపుమ్ || ౧౪ ||

మయా త్వేతద్వచః శ్రుత్వా యాచితః స పరంతపః |
శాపయిత్వా చ మాం పద్భ్యాం ప్రవివేశ బిలం మహత్ || ౧౫ ||

తస్య ప్రవిష్టస్య బిలం సాగ్రః సంవత్సరో గతః |
స్థితస్య చ మమ ద్వారి స కాలోఽప్యత్యవర్తత || ౧౬ ||

అహం తు నష్టం తం జ్ఞాత్వా స్నేహాదాగతసంభ్రమః |
భ్రాతరం తు న పశ్యామి పాపాశంకి చ మే మనః || ౧౭ ||

అథ దీర్ఘస్య కాలస్య బిలాత్తస్మాద్వినిఃసృతమ్ |
సఫేనం రుధిరం రక్తమహం దృష్ట్వా సుదుఃఖితః || ౧౮ ||

నర్దతామసురాణాం చ ధ్వనిర్మే శ్రోత్రమాగతః |
నిరస్తస్య చ సంగ్రామే క్రోశతో నిఃస్వనో గురోః || ౧౯ ||

అహం త్వవగతో బుద్ధ్యా చిహ్నైస్తైర్భ్రాతరం హతమ్ |
పిధాయ చ బిలద్వారం శిలయా గిరిమాత్రయా || ౨౦ ||

శోకార్తశ్చోదకం కృత్వా కిష్కింధామాగతః సఖే |
గూహమానస్య మే తత్త్వం యత్నతో మంత్రిభిః శ్రుతమ్ || ౨౧ ||

తతోఽహం తైః సమాగమ్య సమ్మతైరభిషేచితః |
రాజ్యం ప్రశాసతస్తస్య న్యాయతో మమ రాఘవ || ౨౨ ||

ఆజగామ రిపుం హత్వా వాలీ తమసురోత్తమమ్ |
అభిషిక్తం తు మాం దృష్ట్వా వాలీ సంరక్తలోచనః || ౨౩ ||

మదీయాన్ మంత్రిణో బద్ధ్వా పరుషం వాక్యమబ్రవీత్ |
నిగ్రహేఽపి సమర్థస్య తం పాపం ప్రతి రాఘవ || ౨౪ ||

న ప్రావర్తత మే బుద్ధిర్భ్రాతుర్గౌరవయంత్రితా |
హత్వా శత్రుం స మే భ్రాతా ప్రవివేశ పురం తదా || ౨౫ ||

మానయంస్తం మహాత్మానం యథావచ్చాభ్యవాదయమ్ |
ఉక్తాశ్చ నాశిషస్తేన సంతుష్టేనాంతరాత్మనా || ౨౬ ||

నత్వా పాదావహం తస్య ముకుటేనాస్పృశం ప్రభో |
కృతాంజలిరుపాగమ్య స్థితోఽహం తస్య పార్శ్వతః |
అపి వాలీ మమ క్రోధాన్న ప్రసాదం చకార సః || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే నవమః సర్గః || ౯ ||

Kishkindha Kanda Sarga 9 Meaning In Telugu

“రామా! వాలి, నేను, అన్నదమ్ములము. వాలి అంటే మా నాన్న గారికి ఎంతో ప్రేమ. నాకు కూడా వాలి అంటే ఎంతో ప్రేమ, అభిమానము. నా తండ్రి గారు చనిపోయిన తరువాత, పెద్ద కుమారుడు అయిన వాలిని కిష్కింధా రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసారు. వంశపారంపర్యముగా వచ్చిన రాజ్యమును వాలి పరిపాలిస్తూ ఉంటే, నేను వాలికి సేవకునిలా అతనిని సేవించేవాడిని. మయునికి ఇద్దరు కుమారులు. వారు మాయావి, దుందుభి. మాయావికి, మా అన్న వాలికి ఒక స్త్రీమూలకంగా విరోధము ఏర్పడింది. ఒకరోజు అర్థ రాత్రి అందరమూ నిద్రపోతున్నాము. అప్పుడు మాయావి మా కోట వద్దకు వచ్చి పెద్దగా అరుస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. పరాక్రమ వంతుడైన వాలి మాయావితో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. అర్థరాత్రి శత్రువు యుద్ధానికి వచ్చాడంటే అందులో ఏదో మర్మం ఉంటుందని ఎంత నచ్చచెప్పినా వినకుండా వాలి మాయావితో యుద్ధానికి వెళ్లాడు. నేను కూడా వాలితో పాటు వెళ్లాను.

మా ఇద్దరినీ చూచి మాయావి పారిపోయాడు. నేను, వాలి, మా అనుచరులతో మాయావిని వెంబడించాము. ఆ మాయావి భూమిలో ఉన్న సొరంగములోకి ప్రవేశించాడు. ఆ సొరంగము గడ్డితో కప్పబడి ఉంది. నేను వాలి బయట నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో ఇలా అన్నాడు. “తమ్ముడా! సుగ్రీవా! నేను ఈ బిలములో ప్రవేశించి, శత్రువును చంపి వస్తాను. నేను వచ్చువరకూ నీవు ఈ బిలము వద్ద నా కోసం వేచి ఉండు.” అని అన్నాడు.

దానికి నేను ఒప్పుకోలేదు. నేను కూడా తన వెంట వస్తానని ఎంత బతిమాలుకున్నా వాలి వినలేదు. తాను ఒక్కడే ఆ సొరంగము లోకి వెళ్లాడు. నేను సొరంగము బయట నిలబడి ఉన్నాను. దాదాపు ఒక సంవత్సర కాలము గడిచిపోయింది. వాలి బయటకు రాలేదు. నేను ఓపికగా ఆ సంవత్సరకాలము సొరంగము బయట వేచి ఉన్నాను. నాలో ఏదో శంక మొదలయింది. వాలి మహావీరుడు. కానీ సంవత్సరకాలము రాకపోవడంతో నామనసు కీడు శంకించింది. అయినా గుండె నిబ్బరంతో ఎదురు చూచాను.

కొంత కాలానికి ఆ సొరంగము నుండి నురుగతో కూడిన రక్తం మడుగులాగా బయటకు ప్రవహించింది. రాక్షసులు గట్టిగా అరుస్తున్నట్టు ధ్వనులు వినబడ్డాయి. కాని నా సోదరుడు అరుస్తున్న గొంతు వినబడలేదు. నా సోదరుడు వాలి ఆ రాక్షసుని చేతిలో చంపబడినట్టు నిర్ధారణ చేసుకున్నాను. ఇంక అక్కడ ఉండి చేసేది ఏమీ లేకపోవడంతో, నేను ఆ బిలమును పెద్ద పెద్ద బండ రాళ్లతో మూసి వేసాను. నా అన్న వాలికి జలతరణములు కూడా విడిచాను. తరువాత కిష్కింధకు తిరిగి వచ్చాను.

నా అన్న వాలి మరణాన్ని ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టాను. కాని మంత్రులు ఆ విషయాన్ని పసిగట్టారు. తెలుసుకున్నారు. నేను ఎంత వద్దన్నా, అందరూ కలిసి నన్ను ఈ కిష్కింధకు రాజ్యాభిషిక్తుని చేసారు. ఆ విధంగా నేను కిష్కింధకు రాజునై ధర్మంగా పరిపాలిస్తున్నాను.
ఇంతలో వాలి ఆ రాక్షసుడు మాయావిని చంపి కిష్కింధకు తిరిగి వచ్చాడు. నన్ను కిష్కింధకు రాజుగా చూచాడు. తట్టుకోలేక పోయాడు. నా మీద ఆగ్రహించాడు. నా మంత్రులను బంధించాడు. నేను వాలి అంతటి పరాక్రమ వంతుడనైనా, అన్నగారి మీద గౌరవంతో నేను వాలిని ఎదిరించలేదు. నా అన్నకు అభివాదము చేసాను. గౌరవించాను. కాని వాలి నన్ను ఆదరించలేదు. నా మీద ఆగ్రహించాడు. నేను వాలి పాదాల మీద పడి ప్రార్థించాను. కాని వాలికి నా మీద కోపం పోలేదు. నన్ను అనుగ్రహించలేదు.

శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ దశమః సర్గః (10) >>

Aranya Kanda Sarga 66 In Telugu – అరణ్యకాండే షట్షష్ఠితమః సర్గః

Aranya Kanda Sarga 66 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షట్షష్టితమః సర్గం (66వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో, కబంధుడు తన శాప విముక్తి అనంతరం, రాముడికి సుగ్రీవుని గురించి వివరాలు చెబుతూ, అతని సహాయం పొందేందుకు మార్గదర్శనం చేస్తాడు. రాముడు, లక్ష్మణుడితో కలిసి సుగ్రీవుని వెతుకుతూ కిష్కింధకు చేరుకుంటాడు. సుగ్రీవుని సహాయం పొందడానికి రాముడు అతనితో స్నేహం చేస్తాడు, వారి మధ్య నమ్మకాన్ని పెంపొందిస్తాడు.

ఔచిత్యప్రబోధనమ్

తం తథా శోకసంతప్తం విలపంతమనాథవత్ |
మోహేన మహతాఽఽవిష్టం పరిద్యూనమచేతనమ్ ||

1

తతః సౌమిత్రిరాశ్వాస్య ముహూర్తాదివ లక్ష్మణః |
రామం సంబోధయామాస చరణౌ చాభిపీడయన్ ||

2

మహతా తపసా రామ మహతా చాపి కర్మణా |
రాజ్ఞా దశరథేనాసి లబ్ధోఽమృతమివామరైః ||

3

తవ చైవ గుణైర్బద్ధస్త్వద్వియోగాన్మహీపతిః |
రాజా దేవత్వమాపన్నో భరతస్య యథా శ్రుతమ్ ||

4

యది దుఃఖమిదం ప్రాప్తం కాకుత్స్థ న సహిష్యసే |
ప్రాకృతశ్చాల్పసత్త్వశ్చ ఇతరః కః సహిష్యతి ||

5

దుఃఖితో హి భవాఁల్లోకాన్తేజసా యది ధక్ష్యతే |
ఆర్తాః ప్రజా నరవ్యాఘ్ర క్వ ను యాస్యంతి నిర్వృతిమ్ ||

6

ఆశ్వాసిహి నరశ్రేష్ఠ ప్రాణినః కస్య నాపదః |
సంస్పృశ త్వగ్నివద్రాజన్ క్షణేన వ్యపయాంతి చ ||

7

లోకస్వభావ ఏవైష యయాతిర్నహుషాత్మజః |
గతః శక్రేణ సాలోక్యమనయస్తం తమః స్పృశత్ ||

8

మహార్షిర్యో వసిష్ఠస్తు యః పితుర్నః పురోహితః |
అహ్నా పుత్రశతం జజ్ఞే తథైవాస్య పునర్హతమ్ ||

9

యా చేయం జగతాం మాతా దేవీ లోకనమస్కృతా |
అస్యాశ్చ చలనం భూమేర్దృశ్యతే సత్యసంశ్రవ ||

10 [కోసలేశ్వర]

యౌ ధర్మౌ జగతాం నేత్రౌ యత్ర సర్వం ప్రతిష్ఠితమ్ |
ఆదిత్యచంద్రౌ గ్రహణమభ్యుపేతౌ మహాబలౌ ||

11

సుమహాంత్యపి భూతాని దేవాశ్చ పురుషర్షభ |
న దైవస్య ప్రముంచంతి సర్వభూతాదిదేహినః ||

12

శక్రాదిష్వపి దేవేషు వర్తమానౌ నయానయీ |
శ్రూయేతే నరశార్దూల న త్వం శోచితుమర్హసి ||

13

నష్టాయామపి వైదేహ్యాం హృతాయామపి చానఘ | [రాఘవ]
శోచితుం నార్హసే వీర యథాన్యః ప్రాకృతస్తథా ||

14

త్వద్విధా న హి శోచంతి సతతం సత్యదర్శినః |
సుమహత్స్వపి కృచ్ఛ్రేషు రామానిర్విణ్ణదర్శనాః ||

15

తత్త్వతో హి నరశ్రేష్ఠ బుద్ధ్యా సమనుచింతయ |
బుద్ధ్యా యుక్తా మహాప్రాజ్ఞా విజానంతి శుభాశుభే ||

16

అదృష్టగుణదోషాణామధ్రువాణాం తు కర్మణామ్ |
నాంతరేణ క్రియాం తేషాం ఫలమిష్టం ప్రవర్తతే ||

17

త్వమేవ హి పురా రామ మామేవం బహుశోఽన్వశాః |
అనుశిష్యాద్ధి కో ను త్వామపి సాక్షాద్బృహస్పతిః ||

18

బుద్ధిశ్చ తే మహాప్రాజ్ఞ దేవైరపి దురన్వయా |
శోకేనాభిప్రసుప్తం తే జ్ఞానం సంబోధయామ్యహమ్ ||

19

దివ్యం చ మానుషం చ త్వమాత్మనశ్చ పరాక్రమమ్ |
ఇక్ష్వాకువృషభావేక్ష్య యతస్వ ద్విషతాం వధే ||

20

కిం తే సర్వవినాశేన కృతేన పురుషర్షభ |
తమేవ త్వం రిపుం పాపం విజ్ఞాయోద్ధర్తుమర్హసి ||

21

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షట్షష్ఠితమః సర్గః ||

Aranya Kanda Sarga 66 Meaning In Telugu

లక్షణుని మాటలు రాముని మీద పనిచేయలేదు. ప్రస్తుతానికి లోకాలను క్షోభింపజేసే కార్యక్రమము విరమించాడు కానీ, సీతను గురించి శోకించడం మానలేదు. రాముని మానసిక స్థితి పూర్తిగా దిగజారి పోయింది. మానసికంగా శక్తిని, బలాన్ని కోల్పోయాడు. రాముని స్థితిని గమనించిన లక్ష్మణుడు రామునికి ధైర్యం చెప్పడం మొదలెట్టాడు.

“రామా! మన తండ్రి దశరథుడు అనేక సంవత్సరాలు పుత్రసంతతి లేక. యజ్ఞములు, యాగములు చేసి మనలను పొందాడు. నీ వియోగమును తట్టుకోలేక ఈ లోకాన్నే విడిచిపెట్టాడు. మన తండ్రి దశరథుడు. నీవు రాజ్యాని పోగొట్టుకున్నావు. ఇటువంటి కష్టములను ధీరోదాత్తుడవైన నీవే తట్టుకోలేకపోతే సామాన్య ప్రజలు ఎలా తట్టుకోగలరు.

యయాతి లాంటి మహారాజుకే కష్టములు తప్పలేదు. ఇంక మనము ఎంత! కష్టములు, సుఖములు, ఒకదాని వెంట ఒకటి రావడం లోక సహజం. వాటిని తట్టుకొని నిలబడడమే మానవుని కర్తవ్యము. మన తండ్రి పురోహితులు వసిష్ఠులవారికి ఒకే రోజు నూర్గురు కుమారులు కలిగారు. వారందరూ విశ్వామిత్రుని కోపాగ్నికి బలి అయి ఒకేరోజు మరణించారు.

ఇంతెందుకు, భూదేవి కూడా ప్రతిరోజూ ఈ మానవుల చేతిలో ఎన్నో కష్టములను భరిస్తూ ఉంది. సూర్య చంద్రులు కూడా రాహు కేతువుల చేతిలో గ్రహణములను అనుభవిస్తున్నారు. దేవతలకు అధిపతి ఇంద్రుడు కూడా ఒక్కోసారి తప్పుడు పనులు చేసి కష్టాల పాలు కావడం మనకు తెలుసు కదా! కాబట్టి ఎంతటి వారికైనా కష్టములు తప్పవు. కష్టములు వచ్చాయని ఇలా దుఃఖించడం అవివేకము అనిపించుకుంటుంది.

ఇప్పుడు మన ముందు ఉన్నవి రెండే రెండు విషయాలు. ఒకటి సీత అపహరించబడింది. లేక సీత చంపబడింది. ఫలితంగా సీత నీ నుండి దూరం అయింది. ఏది జరిగినా నీవు సామాన్య మానవుల వలె దుఃఖించరాదు. ధైర్యంగా ఉండాలి. సత్యము గురించి తెలిసిన వారు ఎంత పెద్ద కష్టము వచ్చినా చలించరు. కాబట్టి రామా! దుఃఖమును మాని జరిగిన విషయములను బుద్ధితో ఆలోచించు. ప్రశాంత మనస్సుతో ఆలోచిస్తే ప్రతి సమస్యకూ పరిష్కారం దొరుకుతుంది..

మనము చేసే కర్మలను బట్టి మనకు ఫలితాలు వస్తుంటాయి. ఆ ఫలితములను అనుభవించడమే మన కర్తవ్యము. కొన్ని కర్మలు సుఖాన్ని ఇస్తాయి. కొన్ని కర్మలు దు:ఖాన్ని కలుగజేస్తాయి. సుఖము కానీ, దు:ఖము కానీ ఎల్లకాలమూ ఉండవు. కొంతకాలము తరువాత అవి నశించిపోతాయి.

మనము అనుభవించు ఫలములు ఈ జన్మలో చేసిన కర్మల ఫలితములే అనుకొనరాదు. మనము పూర్వజన్మలో చేసిన కర్మలకు ఫలితములు ఈ జన్మలో అనుభవానికి వస్తాయి. ఇప్పుడు మనకు కలిగిన ఈ దుఃఖము మన పూర్వ జన్మలో మనము చేసిన కర్మల ఫలము అయి ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు లభించిన ఫలితములను బట్టి పూర్వ జన్మలో మనము చేసిన కర్మలను ఊహించుకొనవచ్చును. చేసిన కర్మలకు ఫలితము అనుభవింపక తప్పదు. కాబట్టి దు:ఖించి ప్రయోజనము లేదు.

రామా! ఇవన్నీ నీకు కొత్త కాదు. నీవే నాకు ఇవన్నీ చెప్పావు. ప్రస్తుతము నీవు సీతావియోగ దుఃఖములో ఉన్నావు కాబట్టి నేను నీకు చెప్పవలసి వచ్చినది. లేక పోతే సాక్షాత్తు బృహస్పతికి కూడా నీవు ధర్మములు చెప్ప సమర్ధుడవు. ప్రస్తుతము నీలో ఉన్న జ్ఞానము సీతను గురించి శోకించడంలో మరుగున పడి ఉన్నది. నీలో అంతర్గతముగా ఉన్న జ్ఞానమును నేను వెలికి తీస్తున్నాను.

ఓ రామా! నీవు మానవుడవే అయినా దేవతలకు ఉన్న పరాక్రమము ఉంది. కాబట్టి నీవు శోకము మాని మనకు అపకారము చేసిన శత్రువుల గురించి ఆలోచిద్దాము. అంతేగానీ ఈ ప్రకారంగా అస్త్ర శస్త్రములను ప్రయోగించి లోకాలను నాశనం చేయడం వలన ఏమీ ప్రయోజనము లేదు. ముందు సీతను అపహరించిన వాడు ఎవడో తెలుసుకొని వాడిని తగిన విధంగా దండిస్తాము. ముందు నీ శోకము మాను.” అని అన్నాడు లక్ష్మణుడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండే సప్తషష్ఠితమః సర్గః (67) >>

Kishkindha Kanda Sarga 8 In Telugu – కిష్కింధాకాండ అష్టమః సర్గః

Kishkindha Kanda Sarga 8

కిష్కింధాకాండలో అష్టమ సర్గలో, హనుమంతుడు సీతను కనిపెట్టిన తర్వాత రావణుడి రాక్షస సేనతో పోరాడుతాడు. హనుమంతుడు తన శక్తిని ప్రదర్శించి, రాక్షసులను సంహరిస్తాడు, అశోకవాటికను ధ్వంసం చేస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు, హనుమంతుడిని పట్టుకోవడానికి తన సేనను పంపిస్తాడు. హనుమంతుడు రావణుని సేనను ఎదుర్కొని, తన శౌర్యాన్ని చూపుతాడు. చివరికి, హనుమంతుడిని రావణుని వద్దకు తేవబడతాడు. హనుమంతుడు రావణుని భయంకర రూపాన్ని చూసి భయపడకుండా ధైర్యంగా ఉంటాడు. రావణుడు హనుమంతుడి తోకను కాల్చమని ఆజ్ఞాపిస్తాడు. హనుమంతుడు తన కాలుతున్న తోకతో లంకను ఆగ్నేయం చేస్తాడు, అక్కడి ప్రజలు భయంతో త్రస్తులవుతారు.

వాలివధప్రతిజ్ఞా

పరితుష్టస్తు సుగ్రీవస్తేన వాక్యేన వానరః |
లక్ష్మణస్యాగ్రతో రామమిదం వచనమబ్రవీత్ || ౧ ||

సర్వథాఽహమనుగ్రాహ్యో దేవతానామసంశయః |
ఉపపన్నగుణోపేతః సఖా యస్య భవాన్మమ || ౨ ||

శక్యం ఖలు భవేద్రామ సహాయేన త్వయాఽనఘ |
సురరాజ్యమపి ప్రాప్తుం స్వరాజ్యం కిం పునః ప్రభో || ౩ ||

సోఽహం సభాజ్యో బంధూనాం సుహృదాం చైవ రాఘవ |
యస్యాగ్నిసాక్షికం మిత్రం లబ్ధం రాఘవవంశజమ్ || ౪ ||

అహమప్యనురూపస్తే వయస్యో జ్ఞాస్యసే శనైః |
న తు వక్తుం సమర్థోఽహం స్వయమాత్మగతాన్ గుణాన్ || ౫ ||

మహాత్మనాం తు భూయిష్ఠం త్వద్విధానాం కృతాత్మనామ్ |
నిశ్చలా భవతి ప్రీతిర్ధైర్యమాత్మవతామివ || ౬ ||

రజతం వా సువర్ణం వా వస్త్రాణ్యాభరణాని చ |
అవిభక్తాని సాధూనామవగచ్ఛంతి సాధవః || ౭ ||

ఆఢ్యో వాపి దరిద్రో వా దుఃఖితః సుఖితోఽపి వా |
నిర్దోషో వా సదోషో వా వయస్యః పరమా గతిః || ౮ ||

ధనత్యాగః సుఖత్యాగో దేహత్యాగోఽపి వా పునః |
వయస్యార్థే ప్రవర్తంతే స్నేహం దృష్ట్వా తథావిధమ్ || ౯ ||

తత్తథేత్యబ్రవీద్రామః సుగ్రీవం ప్రియవాదినమ్ |
లక్ష్మణస్యాగ్రతో లక్ష్మ్యా వాసవస్యేవ ధీమతః || ౧౦ ||

తతో రామం స్థితం దృష్ట్వా లక్ష్మణం చ మహాబలమ్ |
సుగ్రీవః సర్వతశ్చక్షుర్వనే లోలమపాతయత్ || ౧౧ ||

స దదర్శ తతః సాలమవిదూరే హరీశ్వరః |
సుపుష్పమీషత్పత్రాఢ్యం భ్రమరైరుపశోభితమ్ || ౧౨ ||

తస్యైకాం పర్ణబహులాం భంక్త్వా శాఖాం సుపుష్పితామ్ |
సాలస్యాస్తీర్య సుగ్రీవో నిషసాద సరాఘవః || ౧౩ ||

తావాసీనౌ తతో దృష్ట్వా హనూమానపి లక్ష్మణమ్ |
సాలశాఖాం సముత్పాట్య వీనీతముపవేశయత్ || ౧౪ ||

సుఖోపవిష్టం రామం తు ప్రసన్నముదధిం యథా |
ఫలపుష్పసమాకీర్ణే తస్మిన్ గిరివరోత్తమే || ౧౫ ||

తతః ప్రహృష్టః సుగ్రీవః శ్లక్ష్ణం మధురయా గిరా |
ఉవాచ ప్రణయాద్రామం హర్షవ్యాకులితాక్షరమ్ || ౧౬ ||

అహం వినికృతో భ్రాత్రా చరామ్యేష భయార్దితః |
ఋశ్యమూకం గిరివరం హృతభార్యః సుదుఃఖితః || ౧౭ ||

సోఽహం త్రస్తో భయే మగ్నో వసామ్యుద్భ్రాంతచేతనః |
వాలినా నికృతో భ్రాత్రా కృతవైరశ్చ రాఘవ || ౧౮ ||

వాలినో మే భయార్తస్య సర్వలోకభయంకర |
మమాపి త్వమనాథస్య ప్రసాదం కర్తుమర్హసి || ౧౯ ||

ఏవముక్తస్తు తేజస్వీ ధర్మజ్ఞో ధర్మవత్సలః |
ప్రత్యువాచ స కాకుత్స్థః సుగ్రీవం ప్రహసన్నివ || ౨౦ ||

ఉపకారఫలం మిత్రమపకారోఽరిలక్షణమ్ |
అద్యైవ తం హనిష్యామి తవ భార్యాపహారిణమ్ || ౨౧ ||

ఇమే హి మే మహావేగాః పత్రిణస్తిగ్మతేజసః |
కార్తికేయవనోద్భూతాః శరా హేమవిభూషితాః || ౨౨ ||

కంకపత్రప్రతిచ్ఛన్నా మహేంద్రాశనిసన్నిభాః |
సుపర్వాణః సుతీక్ష్ణాగ్రాః సరోషా ఇవ పన్నగాః || ౨౩ ||

భ్రాతృసంజ్ఞమమిత్రం తే వాలినం కృతకిల్బిషమ్ |
శరైర్వినిహతం పశ్య వికీర్ణమివ పర్వతమ్ || ౨౪ ||

రాఘవస్య వచః శ్రుత్వా సుగ్రీవో వాహినీపతిః |
ప్రహర్షమతులం లేభే సాధు సాధ్వితి చాబ్రవీత్ || ౨౫ ||

రామ శోకాభిభూతోఽహం శోకార్తానాం భవాన్ గతిః |
వయస్య ఇతి కృత్వా హి త్వయ్యహం పరిదేవయే || ౨౬ ||

త్వం హి పాణిప్రదానేన వయస్యో మేఽగ్నిసాక్షికమ్ |
కృతః ప్రాణైర్బహుమతః సత్యేనాపి శపామి తే || ౨౭ ||

వయస్య ఇతి కృత్వా చ విస్రబ్ధం ప్రవదామ్యహమ్ |
దుఃఖమంతర్గతం యన్మే మనో హరతి నిత్యశః || ౨౮ ||

ఏతావదుక్త్వా వచనం బాష్పదూషితలోచనః |
బాష్పోపహతయా వాచా నోచ్చైః శక్నోతి భాషితుమ్ || ౨౯ ||

బాష్పవేగం తు సహసా నదీవేగమివాగతమ్ |
ధారయామాస ధైర్యేణ సుగ్రీవో రామసన్నిధౌ || ౩౦ ||

స నిగృహ్య తు తం బాష్పం ప్రమృజ్య నయనే శుభే |
వినిఃశ్వస్య చ తేజస్వీ రాఘవం వాక్యమబ్రవీత్ || ౩౧ ||

పురాహం వాలినా రామ రాజ్యాత్ స్వాదవరోపితః |
పరుషాణి చ సంశ్రావ్య నిర్ధూతోఽస్మి బలీయసా || ౩౨ ||

హృతా భార్యా చ మే తేన ప్రాణేభ్యోఽపి గరీయసీ |
సుహృదశ్చ మదీయా యే సంయతా బంధనేషు తే || ౩౩ ||

యత్నవాంశ్చ సుదుష్టాత్మా మద్వినాశాయ రాఘవ |
బహుశస్తత్ప్రయుక్తాశ్చ వానరా నిహతా మయా || ౩౪ ||

శంకయా త్వేతయా చేహ దృష్ట్వా త్వామపి రాఘవ |
నోపసర్పామ్యహం భీతో భయే సర్వే హి బిభ్యతి || ౩౫ ||

కేవలం హి సహాయా మే హనూమత్ప్రముఖాస్త్విమే |
అతోఽహం ధారయామ్యద్య ప్రాణాన్ కృచ్ఛ్రగతోఽపి సన్ || ౩౬ ||

ఏతే హి కపయః స్నిగ్ధా మాం రక్షంతి సమంతతః |
సహ గచ్ఛంతి గంతవ్యే నిత్యం తిష్ఠంతి చ స్థితే || ౩౭ ||

సంక్షేపస్త్వేష తే రామ కిముక్త్వా విస్తరం హి తే |
స మే జ్యేష్ఠో రిపుర్భ్రాతా వాలీ విశ్రుతపౌరుషః || ౩౮ ||

తద్వినాశాద్ధి మే దుఃఖం ప్రనష్టం స్యాదనంతరమ్ |
సుఖం మే జీవితం చైవ తద్వినాశనిబంధనమ్ || ౩౯ ||

ఏష మే రామ శోకాంతః శోకార్తేన నివేదితః |
దుఃఖితః సుఖితో వాఽపి సఖ్యుర్నిత్యం సఖా గతిః || ౪౦ ||

శ్రుత్వైతద్వచనం రామః సుగ్రీవమిదమబ్రవీత్ |
కిం నిమిత్తమభూద్వైరం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః || ౪౧ ||

అహం హి కారణం శ్రుత్వా వైరస్య తవ వానర | [సుఖం]
ఆనంతర్యం విధాస్యామి సంప్రధార్య బలాబలమ్ || ౪౨ ||

బలవాన్ హి మమామర్షః శ్రుత్వా త్వామవమానితమ్ |
వర్ధతే హృదయోత్కంపీ ప్రావృడ్వేగ ఇవాంభసః || ౪౩ ||

హృష్టః కథయ విస్రబ్ధో యావదారోప్యతే ధనుః |
సృష్టశ్చేద్ధి మయా బాణో నిరస్తశ్చ రిపుస్తవ || ౪౪ ||

ఏవముక్తస్తు సుగ్రీవః కాకుత్స్థేన మహాత్మనా |
ప్రహర్షమతులం లేభే చతుర్భిః సహ వానరైః || ౪౫ ||

తతః ప్రహృష్టవదనః సుగ్రీవో లక్ష్మణాగ్రజే |
వైరస్య కారణం తత్త్వమాఖ్యాతుముపచక్రమే || ౪౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే అష్టమః సర్గః || ౮ ||

Kishkindha Kanda Sarga 8 Meaning In Telugu

అలా మాట్లాడు కోడంలో సుగ్రీవుడు తనకూ, తన అన్న వాలికి శత్రుత్వము ఎందుకు వచ్చిందీ అన్న విషయం రామునితో చెప్పసాగాడు. “ఓ రామా! నీవు నా స్నేహితుడవు కావడం నా అదృష్టం. దేవతలు నా మీద కరుణ చూపడం వలననే నీవు నా మిత్రుడివి అయ్యావు. నీవు నాకు మిత్రుడుగా, నాకు అండగా ఉంటే నేను ఒక్క కిష్కింధా రాజ్యమే కాదు, స్వర్గలోక ఆధిపత్యము కూడా పొందగలను.

ఓ రామా! నీతో స్నేహం చేయడం వలన నాకు నా బంధుమిత్రులలో గౌరవం పెరిగింది. నా గురించి, నా గుణగణముల గురించి నేను చెప్పుకోకూడదు కానీ, నేను నీకు మంచి స్నేహితుడిని అవుతాను అని మాత్రం చెప్పగలను. ఎందు కంటే అతడు ధనికుడైనా, పేద వాడైనా, సుఖాలలో మునిగి తేలుతున్నా, దు:ఖాలలో కుంగి పోతున్నా, మంచి వాడైనా, చెడ్డ వాడైనా, ఎటువంటి వాడికైనా స్నేహితుడే దిక్కు. స్నేహమునకు మించినది ఈ లోకములో ఏదీ లేదు. స్నేహాన్ని గురించి బాగా తెలిసిన వాళ్లు తన స్నేహితుని కొరకు ధనమును గానీ, సుఖములను గానీ, సంపదలను కానీ ఆఖరుకు ఉన్న ఊరును కానీ, త్యజించుటకు వెనుకాడరు. అటువంటి స్నేహము మనది.”అని అన్నాడు సుగ్రీవుడు. రాముడు నవ్వి “మిత్రమా! నువ్వు చెప్పినది యదార్థము.” అని అన్నాడు.

(స్నేహాన్ని గురించి వాల్మీకి ఇచ్చిన అద్భుత నిర్వచనము ఈ నాటికీ అనుసరణీయము. మన సినిమా రచయితలు తమ డైలాగులలో వాల్మీకి చెప్పిన పదాలనే అటు ఇటు తిప్పి తిప్పి వల్లె వేస్తుంటారు).

“రామా! నా సోదరుడు వాలి నన్ను అవమానించాడు. నా భార్యను నా నుండి లాక్కున్నాడు. నన్ను రాజ్యము నుండి వెళ్ల గొట్టాడు. వాలికి భయపడి నేను ఇక్కడ తలదాచుకున్నాను. కాబట్టి నీవు నాకు ఉపకారము చెయ్యాలి” అని మరలా గుర్తు చేసాడు సుగ్రీవుడు.

“మిత్రమా! స్నేహమునకు ఫలము ఒకరికి ఒకరు సాయం చేసుకోవడమే కదా! ఒకరికి ఒకరు అపకారము చేసుకోవడం శత్రువుల లక్షణము. నేను నీ మిత్రుడను కాబట్టి నీకు అపకారము చేసిన వారిని వధించి, నీకు మేలు చేస్తాను.” అని తన ప్రతిజ్ఞను గుర్తు చేసాడు రాముడు.

సుగ్రీవుడు చాలా దీన స్థితిలో ఉన్నాడు అందుకని రామునికి పదే పదే గుర్తు చేస్తున్నాడు. వానరులు చపల స్వభావులు కదా! “రామా! నీవు నా స్నేహితుడవు. అందుకని నా కష్టములను నీతో చెప్పుకుంటున్నాను. సాయం చెయ్యమని పదే పదే అడుగుతున్నాను. ఏమీ అనుకోకు. నీతో నా కష్టములు అన్నీ చెప్పాలని ఉంది. కాని నోరు పెగలడం లేదు.” అని కళ్ల నిండా కన్నీరు కారుస్తున్నాడు సుగ్రీవుడు. అతి కష్టం మీద తన దుఃఖమును ఆపుకుంటూ, సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు.

“నీకు చెప్పాను కదా! వాలి నా అన్న. చాలా బలవంతుడు. నన్ను తిట్టాడు. అవమానించాడు. రాజ్యము నుండి వెళ్ల గొట్టాడు. నేను నా భార్యను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అటువంటి భార్యను నా నుండి దూరం చేసాడు. నా అన్న వాళ్లందరినీ బంధించాడు. నన్ను చంపడానికి ఎంతో మందిని పంపాడు. నేను వారి నందరినీ చంపాను. అందుకే నిన్ను చూచినప్పుడు కూడా నీవు వాలి పంపిన వాడివి అని అనుమానించాను. భయపడ్డాను. శరీరంలో భయం ఉంటే, దేనిని చూచి అయినా భయపడడం, మానవ స్వభావము కదా! ఇంక మా వానరుల సంగతి చెప్పాలా! ఇదుగో! హనుమంతుడు మొదలగు వారు నా వెంట ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉండగలుగుతున్నాను. వీళ్లే నేను నమ్మిన స్నేహితులు. అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇదీ నా వృత్తాంతము. ఇంతకన్నా వివరాలు అనవసరము అనుకుంటున్నాను.

వాలి నాకు శతృవు. వాలి నా సోదరుడే అయినప్పటికీ, వాలి చస్తేనే గానీ నా దుఃఖము ఉపశమించదు. నా సమస్తదు:ఖములకు కారకుడు వాలి. నా సుఖజీవనము వాలి మరణం మీద ఆధారపడి ఉంది. రామా! నా దుఃఖమునకు కారణము, నా దు:ఖము ఎలా తీరుతుందో వివరంగా చెప్పాను. కష్టాలలో ఉన్న మిత్రుడికి మిత్రుడే గతికాబట్టి, ఒక మిత్రుడుగా నాకు సాయం చెయ్యి” అని అన్నాడు సుగ్రీవుడు.

రాముడికి ఒక విషయం బోధపడటం లేదు. సుగ్రీవుడు ఇన్ని విషయాలు చెబుతున్నాడు కానీ అసలు తనకూ, వాలికీ ఎందుకు వైరం వచ్చిందో చెప్పడం లేదు. అడిగితే గానీ చెప్పేట్టు లేడు అని అనుకున్నాడు.

“మిత్రమా! సుగ్రీవా! నీకూ నీ అన్న వాలికి వైరం ఎందుకు, దేని గురించి, ఏ కారణం చేత కలిగింది. వివరంగా చెప్పు. అప్పుడు మీ ఇద్దరిలో తప్పు ఒప్పు నిర్ణయించడానికి వీలు కలుగుతుంది. అసలు వైరకారణం తెలిస్తే గానీ, మా బలాబలములను సరి చూచుకోడానికి వీలు ఉండదు కదా! అప్పుడు వాలిని సులభంగా అంతమొందించ వచ్చును. నీకు నీ అన్న వలన జరిగిన అవమానమును విని నాకూ కోపం తారస్థాయిని చేరుకుంది. నేను నీ అన్నను చంపేలోగా మీ ఇద్దరి మీ మధ్య ఉన్న వైరమునకు కారణం తెలుసుకోగోరుతున్నాను. నా మీద విశ్వాసము ఉంచి మీ ఇరువురి మధ్య ఉన్న విరోధమునకు కారణం చెప్పు” అని అన్నాడు రాముడు. ఇంక తప్పదని సుగ్రీవుడు రామునికి తనకు అన అన్న వాలితో ఎందుకు విరోధము వచ్చిందో వివరంగా చెప్పనారంభించాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ నవమః సర్గః (9)>>

Kishkindha Kanda Sarga 7 In Telugu – కిష్కింధాకాండ సప్తమః సర్గః

Kishkindha Kanda Sarga 7

కిష్కింధాకాండలో సప్తమ సర్గ, హనుమంతుడు లంకకు చేరుకోవడం, సీతాను కనుగొనడం గురించి ఉంటుంది. హనుమంతుడు సముద్రాన్ని దాటి, లంకలోకి ప్రవేశించి రాక్షసుల నగరాన్ని సందర్శిస్తాడు. అక్కడ అతను రాక్షసుల రక్షణలను దాటి, రావణుని అశోకవాటికలో సీతను కనుగొంటాడు. సీతను చూసి హనుమంతుడు రాముని ఉంగరాన్ని చూపించి, రాముడి సందేశాన్ని అందిస్తాడు. సీత రాముడి స్మరణతో ధైర్యంగా ఉండమని హనుమంతుడికి హామీ ఇస్తుంది. హనుమంతుడు సీతకు రక్షణ కల్పించేందుకు తన శక్తి, మాయా శక్తులను వినియోగిస్తాడు. ఈ సర్గలో సీతా-హనుమంతుల మధ్య స్నేహం, నమ్మకం ప్రధాన అంశాలు.

రామసమాశ్వాసనమ్

ఏవముక్తస్తు సుగ్రీవో రామేణార్తేన వానరః |
అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం సబాష్పం బాష్పగద్గదః || ౧ ||

న జానే నిలయం తస్య సర్వథా పాపరక్షసః |
సామర్థ్యం విక్రమం వాఽపి దౌష్కులేయస్య వా కులమ్ || ౨ ||

సత్యం తే ప్రతిజానామి త్యజ శోకమరిందమ |
కరిష్యామి తథా యత్నం యథా ప్రాప్యసి మైథిలీమ్ || ౩ ||

రావణం సగణం హత్వా పరితోష్యాత్మపౌరుషమ్ |
తథాఽస్మి కర్తా న చిరాద్యథా ప్రీతో భవిష్యసి || ౪ ||

అలం వైక్లవ్యమాలంబ్య ధైర్యమాత్మగతం స్మర |
త్వద్విధానామసదృశమీదృశం విద్ధి లాఘవమ్ || ౫ ||

మయాఽపి వ్యసనం ప్రాప్తం భార్యాహరణజం మహత్ |
న చాహమేవం శోచామి న చ ధైర్యం పరిత్యజే || ౬ ||

నాహం తామనుశోచామి ప్రాకృతో వానరోఽపి సన్ |
మహాత్మా చ వినీతశ్చ కిం పునర్ధృతిమాన్ భవాన్ || ౭ ||

బాష్పమాపతితం ధైర్యాన్నిగ్రహీతుం త్వమర్హసి |
మర్యాదాం సత్త్వయుక్తానాం ధృతిం నోత్స్రష్టుమర్హసి || ౮ ||

వ్యసనే వార్థకృచ్ఛ్రే వా భయే వా జీవితాంతకే |
విమృశన్ వై స్వయా బుద్ధ్యా ధృతిమాన్నావసీదతి || ౯ ||

బాలిశస్తు నరో నిత్యం వైక్లవ్యం యోఽనువర్తతే |
స మజ్జత్యవశః శోకే భారాక్రాంతేవ నౌర్జలే || ౧౦ ||

ఏషోఽంజలిర్మయా బద్ధః ప్రణయాత్త్వాం ప్రసాదయే |
పౌరుషం శ్రయ శోకస్య నాంతరం దాతుమర్హసి || ౧౧ ||

యే శోకమనువర్తంతే న తేషాం విద్యతే సుఖమ్ |
తేజశ్చ క్షీయతే తేషాం న త్వం శోచితుమర్హసి || ౧౨ ||

శోకేనాభిప్రపన్నస్య జీవితే చాపి సంశయః |
స శోకం త్యజ రాజేంద్ర ధైర్యమాశ్రయ కేవలమ్ || ౧౩ ||

హితం వయస్యభావేన బ్రూమి నోపదిశామి తే |
వయస్యతాం పూజయన్మే న త్వం శోచితుమర్హసి || ౧౪ ||

మధురం సాంత్వితస్తేన సుగ్రీవేణ స రాఘవః |
ముఖమశ్రుపరిక్లిన్నం వస్త్రాంతేన ప్రమార్జయత్ || ౧౫ ||

ప్రకృతిస్థస్తు కాకుత్స్థః సుగ్రీవవచనాత్ ప్రభుః |
సంపరిష్వజ్య సుగ్రీవమిదం వచనమబ్రవీత్ || ౧౬ ||

కర్తవ్యం యద్వయస్యేన స్నిగ్ధేన చ హితేన చ |
అనురూపం చ యుక్తం చ కృతం సుగ్రీవ తత్త్వయా || ౧౭ ||

ఏష చ ప్రకృతిస్థోఽహమనునీతస్త్వయా సఖే |
దుర్లభో హీదృశో బంధురస్మిన్ కాలే విశేషతః || ౧౮ ||

కిం తు యత్నస్త్వయా కార్యో మైథిల్యాః పరిమార్గణే |
రాక్షసస్య చ రౌద్రస్య రావణస్య దురాత్మనః || ౧౯ ||

మయా చ యదనుష్ఠేయం విస్రబ్ధేన తదుచ్యతామ్ |
వర్షాస్వివ చ సుక్షేత్రే సర్వం సంపద్యతే మయి || ౨౦ ||

మయా చ యదిదం వాక్యమభిమానాత్సమీరితమ్ |
తత్త్వయా హరిశార్దూల తత్త్వమిత్యుపధార్యతామ్ || ౨౧ ||

అనృతం నోక్తపూర్వం మే న చ వక్ష్యే కదాచన |
ఏతత్తే ప్రతిజానామి సత్యేనైవ చ తే శపే || ౨౨ ||

తతః ప్రహృష్టః సుగ్రీవో వానరైః సచివైః సహ |
రాఘవస్య వచః శ్రుత్వా ప్రతిజ్ఞాతం విశేషతః || ౨౩ ||

ఏవమేకాంతసంపృక్తౌ తతస్తౌ నరవానరౌ |
ఉభావన్యోన్యసదృశం సుఖం దుఃఖం ప్రభాషతామ్ || ౨౪ ||

మహానుభావస్య వచో నిశమ్య
హరిర్నరాణామృషభస్య తస్య |
కృతం స మేనే హరివీరముఖ్య-
-స్తదా స్వకార్యం హృదయేన విద్వాన్ || ౨౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే సప్తమః సర్గః || ౭ ||

Kishkindha Kanda Sarga 7 Meaning In Telugu

రాముని పలుకులు విన్న తరువాత సుగ్రీవునకు కూడా దు:ఖము ముంచుకొచ్చింది. దుఃఖముతో పూడుకుపోయిన గొంతుతో సుగ్రీవుడు ఇలా అన్నాడు.

“రామా! సీతను అపహరించిన ఆ రాక్షసుని నివాసము గానీ, వాడి పరాక్రమము గానీ, బలము కానీ నాకు తెలియదు. కాని నా శాయశక్తులా ప్రయత్నించి వాడిని గురించి తెలుసుకుంటాను. నీ దుఃఖమును విడిచి పెట్టు. నన్ను నమ్ము. నిశ్చింతగా ఉండు. నీ భార్యను నీకు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఇదే నా ప్రతిజ్ఞ. నీవు అతి త్వరలో సీతను అపహరించిన ఆ రావణుడు అనే రాక్షసుని చంపి సీతను పొందు తావు.

కాని ముందు నీవు ఈ దు:ఖమును, దీనత్వమును, వదిలి పెట్టు. ధైర్యము అవలంబించు. నీ పరాక్రమాన్ని, వీరత్వాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ వలెనే నా భార్యను కూడా ఎత్తుకు పోయారు. కానీ నేను నీ వలె దు:ఖించడం లేదు. క్రుంగి పోవడం లేదు. ధైర్యము విడిచి పెట్టలేదు. నా భార్యను ఎత్తుకుపోయిన వాలిని ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నాను. నా వంటి సాధారణ వానరుడే పోయిన భార్యను గురించి చింతించడం లేదంటే ఇంక నీ వంటి ధీరోదాత్తుడు, పరాక్రమవంతుడు, పండితుడు ఇలా దీనంగా భార్యకోసరం ధైర్యాన్ని విడనాడి దు:ఖించడం ఏమాత్రం తగదు.

బుద్ధిమంతుడైన వాడు ఆపదలలో గానీ, ధన నష్టము సంభవించి నప్పుడు గానీ, ప్రాణాపాయ స్థితిలో గానీ, ధైర్యమును విడిచిపెట్టడు. దు:ఖించడు. బుద్ధికి పదును పెట్టి తగిన ఉపాయము గురించి ఆలోచిస్తాడు. అలా కాకుండా మూర్ఖత్వముతో ఎల్లప్పుడూ దీనత్వముతో ఉండేవాడు, తన మనసును తన అధీనములో ఉంచుకోలేక, నడి సముద్రంలో నావలాగా మునిగిపోతాడు. కాబట్టి ఓ రామా! ఒక స్నేహితుడుగా నిన్ను వేడుకుంటున్నాను. దీనత్వాన్ని వదిలిపెట్టు. శోకానికి స్వస్తి చెప్పు. బుద్ధికి పదునుపెట్టు. పౌరుషాన్ని తెచ్చుకో. ఎందుకంటే అనుక్షణం శోకంతో కుమిలిపోయేవాడికి సుఖం ఎంతో దూరంలో ఉంటుంది. శోకార్తునకు అన్నీ సందేహాలే కలుగుతాయి. వాడు ఏ పనీ సక్రమంగా చెయ్యలేడు. ధైర్యవంతుడు అన్ని పనులు సక్రమంగా నిర్వహించగలడు. రామా! నేను నీకు నీతులు ఉపదేశించడం లేదు. కేవలం ఒక స్నేహితుడుగా నీ దు:ఖాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాను.” అని సుగ్రీవుడు రామునికి సాంత్వన చేకూర్చడానికి ప్రయత్నించాడు.

సుగ్రీవుని మాటలకు రాముడు స్వస్థత పొందాడు. సుగ్రీవుని కౌగలించుకొని ఇలా అన్నాడు. “మిత్రమా సుగ్రీవా! నా హితమును కోరే స్నేహితుడు ఎలా చేస్తాడో అదే నువ్వు చేసావు. నీ సాంత్వన వచనములతో నాకు స్వస్థత లభించింది. నీ వంటి స్నేహితుడు, బంధువు నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. నీవు నాకు ఇచ్చిన మాట ప్రకారము, సీతను, ఆ రావణుడు అనే రాక్షసుని వెతికే ప్రయత్నం చెయ్యాలి. దానికి ప్రతిఫలంగా నేను నీకు ఏం చెయ్యాలో వివరంగా చెప్పు. మన ఇరువురి కార్యములు సఫలం అవుతాయి అనే నమ్మకం నాకు ఉంది. నా సాయం గురించి నీవు సందేహించకు. నేను ఇప్పటి దాకా అబద్ధము చెప్పలేదు. ఇంక మీదట చెప్పను కూడా. నీకు సాయం చేస్తాను అని ప్రతిజ్ఞచేస్తున్నాను.” అని అన్నాడు రాముడు.

రాముని మాటలు విని సుగ్రీవుడు, హనుమంతుడు ఎంతో సంతోషించారు. రాముడు చేసిన ప్రతిజ్ఞను విని సుగ్రీవుడు తన పని సఫలం అయినట్టే అని ఎంతో సంతోషించాడు. తరువాత రాముడు, సుగ్రీవుడు ఒక ఏకాంత ప్రదేశములో కూర్చుని తమ కష్టసుఖములు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

శ్రీమద్రామాయణము కిష్కింధాకాండము
ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తతత్

కిష్కింధాకాండ అష్టమః సర్గః (8)>>

Aranya Kanda Sarga 65 In Telugu – అరణ్యకాండే పంచషష్ఠితమః సర్గః

Aranya Kanda Sarga 65 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచషష్టితమః సర్గం (65వ సర్గ) రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో, రాముడు సీతను వెతికే ప్రయాణంలో కబంధుడిని ఎదుర్కొంటాడు. కబంధుడు రాక్షసుడిగా ఉండి, తన శాప విమోచనం కోసం రాముడి సహాయాన్ని కోరుతాడు. రాముడు, లక్ష్మణుడితో కలిసి, కబంధుడిని హతమార్చి, అతని శాపాన్ని తొలగిస్తాడు. శాప విముక్తి తరువాత, కబంధుడు రాముడికి సుగ్రీవుని గురించి, అతని సహాయం పొందే విధానాన్ని వివరిస్తాడు.

క్రోధసంహారప్రార్థనా

తప్యమానం తథా రామం సీతాహరణకర్శితమ్ |
లోకానామభవే యుక్తం సాంవర్తకమివానలమ్ ||

1

వీక్షమాణం ధనుః సజ్యం నిఃశ్వసంతం పునః పునః |
దగ్ధుకామం జగత్సర్వం యుగాంతే చ యథా హరమ్ ||

2

అదృష్టపూర్వం సంక్రుద్ధం దృష్ట్వా రామం తు లక్ష్మణః |
అబ్రవీత్ప్రాంజలిర్వాక్యం ముఖేన పరిశుష్యతా ||

3

పురా భూత్వా మృదుర్దాంతః సర్వభూతహితే రతః |
న క్రోధవశమాపన్నః ప్రకృతిం హాతుమర్హసి ||

4

చంద్రే లక్ష్మీః ప్రభా సూర్యే గతిర్వాయౌ భువి క్షమా |
ఏతచ్చ నియతం సర్వం త్వయి చానుత్తమం యశః ||

5

ఏకస్య నాపరాధేన లోకాన్హంతుం త్వమర్హసి |
న తు జానామి కస్యాయం భగ్నః సాంగ్రామికో రథః ||

6

కేన వా కస్య వా హేతోః సాయుధః సపరిచ్ఛదః |
ఖురనేమిక్షతశ్చాయం సిక్తో రుధిరబిందుభిః ||

7

దేశో నివృత్తసంగ్రామః సుఘోరః పార్థివాత్మజ |
ఏకస్య తు విమర్దోఽయం న ద్వయోర్వదతాం వర ||

8

న హి వృత్తం హి పశ్యామి బలస్య మహతః పదమ్ |
నైకస్య తు కృతే లోకాన్వినాశయితుమర్హసి ||

9

యుక్తదండా హి మృదవః ప్రశాంతా వసుధాధిపాః |
సదా త్వం సర్వభూతానాం శరణ్యః పరమా గతిః ||

10

కో ను దారప్రణాశం తే సాధు మన్యేత రాఘవ |
సరితః సాగరాః శైలా దేవగంధర్వదానవాః ||

11

నాలం తే విప్రియం కర్తుం దీక్షితస్యేవ సాధవః |
యేన రాజన్హృతా సీతా తమన్వేషితుమర్హసి ||

12

మద్ద్వితీయో ధనుష్పాణిః సహాయైః పరమర్షిభిః |
సముద్రం చ విచేష్యామః పర్వతాంశ్చ వనాని చ ||

13

గుహాశ్చ వివిధా ఘోరాః నదీః పద్మవనాని చ |
దేవగంధర్వలోకాంశ్చ విచేష్యామః సమాహితాః ||

14

యావన్నాధిగమిష్యామస్తవ భార్యాపహారిణమ్ |
న చేత్సామ్నా ప్రదాస్యంతి పత్నీం తే త్రిదశేశ్వరాః |
కోసలేంద్ర తతః పశ్చాత్ప్రాప్తకాలం కరిష్యసి ||

15

శీలేన సామ్నా వినయేన సీతాం
నయేన న ప్రాప్స్యసి చేన్నరేంద్ర |
తతః సముత్సాదయ హేమపుంఖై-
-ర్మహేంద్రవజ్రప్రతిమైః శరౌఘైః ||

16

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే పంచషష్ఠితమః సర్గః ||

Aranya Kanda Sarga 65 Meaning In Telugu

సీతా వియోగంతో రామునికి తాను ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. ముల్లోకాల్ని నాశనం చేస్తానని విల్లు ఎక్కుపెట్టడం చూచి లక్ష్మణుడు తల్లడిల్లిపోయాడు. వెంటనే రామునితో ఇలా అన్నాడు.

“రామా! నీవు సౌమ్యుడవు. మృదుస్వభావుడవు. సకల జనులకు హితుడవు. అటువంటి నీవు ముల్లోకములకు హాని కలిగిస్తాను అనడం భావ్యమా! నీ శాంత స్వభావాన్ని విడిచిపెట్టవచ్చునా! చంద్రునికి వెన్నెల, సూర్యునికి వేడి, భూమికి క్షమ ఎలా అలంకారాలో నీకు సౌమ్యత, సాధుజన ప్రియత్వము అలంకారాలు. ఇన్నాళ్లు సంపాదించుకున్న కీర్తిని ఒక్కసారిగా నాశనం చేసుకుంటావా!

సీతను అపహరించింది ఎవడో ఒక రాక్షసుడు. వాడిని శిక్షించాలి గానీ, ముల్లోకాలను క్షోభింపజేయడం యుక్తము కాదు కదా! ఇక్కడ ఏం జరిగిందో, ఎవరెవరికి యుద్ధం జరిగిందో, అసలు ఈ యుద్ధముతో సీతాపహరణమునకు సంబంధం ఉందో లేదో తెలియదు. ఈ రక్తపు మరకలు ఎవరివో తెలియదు.

కాని ఇక్కడ ఒక యుద్ధము జరిగింది అన్నమాట వాస్తవము. కాని ఈ యుద్ధము ఇద్దరి మధ్య జరిగిందే కానీ, పెద్ద సైన్యము మధ్య జరిగింది కాదు. పెద్దసైన్యము వచ్చిన గుర్తులు కనిపించడం లేదు. ఇద్దరు యుద్ధం చేసుకుంటే ఒకడు చావాలి. మరొకడు గెలవాలి. కాబట్టి ఆ చచ్చినవాడు ఇక్కడే ఎక్కడో పడి ఉంటాడు. వాడిని పట్టుకుంటే మనకు సీత జాడతెలియవచ్చు. కాబట్టి ఆ ఇద్దరి గురించి నీవు నీ ఆయుధమును ప్రయోగించడం ఉచితం కాదు.

నీ భార్యను అపహరించడం క్షమించరాని నేరము. మనము ఆ నేరము చేసిన అపరాధిని పట్టి శిక్షిస్తాము. నీకు ఈ ప్రకృతి సాయం చేయడం లేదు అని అనుకుంటున్నావు. అలా అని ఎందుకు అనుకుం వు. దక్షిణ దిక్కుగా పొమ్మని చెప్పింది ఆ మూగజీవాలే కదా! ఇంక చెట్టు, పుట్టలు, పర్వతాలు, నదులు తాము చూచిన విషయాన్ని నీకు ఎలా తెలియజేయగలవు. వాటికి నీకు సాయం చేయాలని ఉన్నా చేయలేవు కదా! అందుకని శాంతం వహించు.

మనము ఇక్కడ ఉన్న మునులను, ఋషులను కలిసి వారి సాయంతో సీతను గురించి వెదుకుదాము. ఈ అడవి, పర్వతములు, నదీతీరములు అణువు అణువునా గాలిద్దాము. సీత జాడ తెలిసే వరకూ, సీతను అపహరించిన వాడు దొరికే వరకూ మనకు అన్ని లోకములు వెదుకుదాము. ఒక వేళ దేవతలు గానీ, దానవులు గానీ ఈ పని చేసి ఉంటే, వారికి ఒక అవకాశం ఇద్దాము. అప్పటికీ వారు దారికి రాకపోతే, అప్పుడు వారిని కఠినంగా శిక్షిద్దాము. ముందు మనము సామోపాయముతోనూ, మన ఉదాత్తమైన శీలము తోనూ, వినయంగా అడుగుదాము. వారు మాట వినకపోతే, అప్పుడు నీ పరాక్రమం చూపించవచ్చును.” అని రాముని శాంతింపజేసాడు. లక్ష్మణుడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండే షట్షష్ఠితమః సర్గః (66) >>

Aranya Kanda Sarga 64 In Telugu – అరణ్యకాండ చతుఃషష్టితమః సర్గః

Aranya Kanda Sarga 64 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుఃషష్టితమః సర్గం (64వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు సీతను వెతికే క్రమంలో హనుమంతుని, జటాయువును కలుస్తాడు. జటాయువు రావణుడి చేతిలో సీత అపహరణను చూసి రామునికి ఆ విషయాన్ని తెలియజేస్తాడు. జటాయువు ధైర్యం మరియు సీతను రక్షించడానికి చేసిన ప్రయత్నం రాముడికి ఎంతో ప్రేరణ ఇస్తుంది.

రామక్రోధః

స దీనో దీనయా వాచా లక్ష్మణం వాక్యమబ్రవీత్ |
శీఘ్రం లక్ష్మణ జానీహి గత్వా గోదావరీం నదీమ్ ||

1

అపి గోదావరీం సీతా పద్మాన్యానయితుం గతా |
ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః పునరేవ హి ||

2 [పరవీరహా]

నదీం గోదావరీం రమ్యాం జగామ లఘువిక్రమః |
తాం లక్ష్మణస్తీర్థవతీం విచిత్వా రామమబ్రవీత్ ||

3

నైనాం పశ్యామి తీర్థేషు క్రోశతో న శృణోతి మే |
కం ను సా దేశమాపన్నా వైదేహీ క్లేశనాశినీ ||

4

న హ్యహం వేద తం దేశం యత్ర సా జనకాత్మజా |
లక్ష్మణస్య వచః శ్రుత్వా దీనః సంతాపమోహితః ||

5

రామః సమభిచక్రామ స్వయం గోదావరీం నదీమ్ |
స తాముపస్థితో రామః క్వ సీతేత్యేవమబ్రవీత్ ||

6

భూతాని రాక్షసేంద్రేణ వధార్హేణ హృతామితి |
న తాం శశంసూ రామాయ తథా గోదావరీ నదీ ||

7

తతః ప్రచోదితా భూతైః శంసాస్మత్తాం ప్రియామితి |
న తు సాఽభ్యవదత్సీతాం పృష్టా రామేణ శోచతా ||

8

రావణస్య చ తద్రూపం కర్మాణి చ దురాత్మనః |
ధ్యాత్వా భయాత్తు వైదేహీం సా నదీ న శశంస తామ్ ||

9

నిరాశస్తు తయా నద్యా సీతాయా దర్శనే కృతః |
ఉవాచ రామః సౌమిత్రిం సీతాఽదర్శనకర్శితః ||

10

ఏషా గోదావరీ సౌమ్య కించిన్న ప్రతిభాషతే |
కిన్ను లక్ష్మణ వక్ష్యామి సమేత్య జనకం వచః ||

11

మాతరం చైవ వైదేహ్యా వినా తామహమప్రియమ్ |
యా మే రాజ్యవిహీనస్య వనే వన్యేన జీవతః ||

12

సర్వం వ్యపనయేచ్ఛోకం వైదేహీ క్వ ను సా గతా |
జ్ఞాతిపక్షవిహీనస్య రాజపుత్రీమపశ్యతః ||

13

మన్యే దీర్ఘా భవిష్యంతి రాత్రయో మమ జాగ్రతః |
మందాకినీం జనస్థానమిమం ప్రస్రవణం గిరిమ్ ||

14

సర్వాణ్యనుచరిష్యామి యది సీతా హి దృశ్యతే |
ఏతే మృగా మహావీర్యా మామీక్షంతే ముహుర్ముహుః ||

15

వక్తుకామా ఇవ హి మే ఇంగితాన్యుపలక్షయే |
తాంస్తు దృష్ట్వా నరవ్యాఘ్రో రాఘవః ప్రత్యువాచ హ ||

16

క్వ సీతేతి నిరీక్షన్ వై బాష్పసంరుద్ధయా దృశా |
ఏవముక్తా నరేంద్రేణ తే మృగాః సహసోత్థితాః ||

17

దక్షిణాభిముఖాః సర్వే దర్శయంతో నభఃస్థలమ్ |
మైథిలీ హ్రియమాణా సా దిశం యామన్వపద్యత ||

18

తేన మార్గేణ ధావంతో నిరీక్షంతే నరాధిపమ్ |
యేన మార్గం చ భూమిం చ నిరీక్షంతే స్మ తే మృగాః ||

19

పునశ్చ మార్గమిచ్ఛంతి లక్ష్మణేనోపలక్షితాః |
తేషాం వచనసర్వస్వం లక్షయామాస చేంగితమ్ ||

20

ఉవాచ లక్ష్మణో జ్యేష్ఠం ధీమాన్ భ్రాతరమార్తవత్ |
క్వ సీతేతి త్వయా పృష్టా యథేమే సహసోత్థితాః ||

21

దర్శయంతి క్షితిం చైవ దక్షిణాం చ దిశం మృగాః |
సాధు గచ్ఛావహై దేవ దిశమేతాం హి నైరృతిమ్ ||

22

యది స్యాదాగమః కశ్చిదార్యా వా సాఽథ లక్ష్యతే |
బాఢమిత్యేవ కాకుత్స్థః ప్రస్థితో దక్షిణాం దిశమ్ ||

23

లక్ష్మణానుగతః శ్రీమాన్ వీక్షమాణో వసుంధరామ్ |
ఏవం సంభాషమాణౌ తావన్యోన్యం భ్రాతరావుభౌ ||

24

వసుంధరాయాం పతితం పుష్పమార్గమపశ్యతామ్ |
తాం పుష్పవృష్టిం పతితాం దృష్ట్వా రామో మహీతలే ||

25

ఉవాచ లక్ష్మణం వీరో దుఃఖితో దుఃఖితం వచః |
అభిజానామి పుష్పాణి తానీమానీహ లక్ష్మణ ||

26

పినద్ధానీహ వైదేహ్యా మయా దత్తాని కాననే |
మన్యే సూర్యశ్చ వాయుశ్చ మేదినీ చ యశస్వినీ ||

27

అభిరక్షంతి పుష్పాణి ప్రకుర్వంతో మమ ప్రియమ్ |
ఏవముక్త్వా మహాబాహుం లక్ష్మణం పురుషర్షభః ||

28

ఉవాచ రామో ధర్మాత్మా గిరిం ప్రస్రవణాకులమ్ |
కచ్చిత్ క్షితిభృతాం నాథ దృష్టా సర్వాంగసుందరీ ||

29

రామా రమ్యే వనోద్దేశే మయా విరహితా త్వయా |
క్రుద్ధోఽబ్రవీద్గిరిం తత్ర సింహః క్షుద్రమృగం యథా ||

30

తాం హేమవర్ణాం హేమాభాం సీతాం దర్శయ పర్వత |
యావత్సానూని సర్వాణి న తే విధ్వంసయామ్యహమ్ ||

31

ఏవముక్తస్తు రామేణ పర్వతో మైథిలీం ప్రతి |
శంసన్నివ తతః సీతాం నాదర్శయత రాఘవే ||

32

తతో దాశరథీ రామ ఉవాచ చ శిలోచ్చయమ్ |
మమ బాణాగ్నినిర్దగ్ధో భస్మీభూతో భవిష్యసి ||

33

అసేవ్యః సంతతం చైవ నిస్తృణద్రుమపల్లవః |
ఇమాం వా సరితం చాద్య శోషయిష్యామి లక్ష్మణ ||

34

యది నాఖ్యాతి మే సీతామార్యాం చంద్రనిభాననామ్ |
ఏవం స రుషితో రామో దిధక్షన్నివ చక్షుషా ||

35

దదర్శ భూమౌ నిష్క్రాంతం రాక్షసస్య పదం మహత్ |
త్రస్తాయా రామకాంక్షిణ్యాః ప్రధావంత్యా ఇతస్తతః ||

36

రాక్షసేనానువృత్తాయా మైథిల్యాశ్చ పదాన్యథ |
స సమీక్ష్య పరిక్రాంతం సీతాయా రాక్షసస్య చ ||

37

భగ్నం ధనుశ్చ తూణీ చ వికీర్ణం బహుధా రథమ్ |
సంభ్రాంతహృదయో రామః శశంస భ్రాతరం ప్రియమ్ ||

38

పశ్య లక్ష్మణ వైదేహ్యాః శీర్ణాః కనకబిందవః |
భూషణానాం హి సౌమిత్రే మాల్యాని వివిధాని చ ||

39

తప్తబిందునికాశైశ్చ చిత్రైః క్షతజబిందుభిః |
ఆవృతం పశ్య సౌమిత్రే సర్వతో ధరణీతలమ్ ||

40

మన్యే లక్ష్మణ వైదేహీ రాక్షసైః కామరూపిభిః |
భిత్త్వా భిత్త్వా విభక్తా వా భక్షితా వా భవిష్యతి ||

41

తస్యా నిమిత్తం వైదేహ్యా ద్వయోర్వివదమానయోః |
బభూవ యుద్ధం సౌమిత్రే ఘోరం రాక్షసయోరిహ ||

42

ముక్తామణిమయం చేదం తపనీయవిభూషితమ్ |
ధరణ్యాం పతితం సౌమ్య కస్య భగ్నం మహద్ధనుః ||

43

రాక్షసానామిదం వత్స సురాణామథవాఽపి వా |
తరుణాదిత్యసంకాశం వైడూర్యగులికాచితమ్ ||

44

విశీర్ణం పతితం భూమౌ కవచం కస్య కాంచనమ్ |
ఛత్రం శతశలాకం చ దివ్యమాల్యోపశోభితమ్ ||

45

భగ్నదండమిదం కస్య భూమౌ సమ్యఙ్నిపాతితమ్ |
కాంచనోరశ్ఛదాశ్చేమే పిశాచవదనాః ఖరాః ||

46

భీమరూపా మహాకాయాః కస్య వా నిహతా రణే |
దీప్తపావకసంకాశో ద్యుతిమాన్ సమరధ్వజః ||

47

అపవిద్ధశ్చ భగ్నశ్చ కస్య సాంగ్రామికో రథః |
రథాక్షమాత్రా విశిఖాస్తపనీయవిభూషణాః ||

48

కస్యేమేఽభిహతా బాణాః ప్రకీర్ణా ఘోరకర్మణః |
శరావరౌ శరైః పూర్ణౌ విధ్వస్తౌ పశ్య లక్ష్మణ ||

49

ప్రతోదాభీషుహస్తో వై కస్యాయం సారథిర్హతః |
కస్యేమౌ పురుషవ్యాఘ్ర శయాతే నిహతో యుధి ||

50

చామరగ్రాహిణౌ సౌమ్య సోష్ణీషమణికుండలౌ |
పదవీ పురుషస్యైషా వ్యక్తం కస్యాపి రక్షసః ||

51

వైరం శతగుణం పశ్య మమేదం జీవితాంతకమ్ |
సుఘోరహృదయైః సౌమ్య రాక్షసైః కామరూపిభిః ||

52

హృతా మృతా వా సీతా సా భక్షితా వా తపస్వినీ |
న ధర్మస్త్రాయతే సీతాం హ్రియమాణాం మహావనే ||

53

భక్షితాయాం హి వైదేహ్యాం హృతాయామపి లక్ష్మణ |
కే హి లోకేఽప్రియం కర్తుం శక్తాః సౌమ్య మమేశ్వరాః ||

54

కర్తారమపి లోకానాం శూరం కరుణవేదినమ్ |
అజ్ఞానాదవమన్యేరన్ సర్వభూతాని లక్ష్మణ ||

55

మృదుం లోకహితే యుక్తం దాంతం కరుణవేదినమ్ |
నిర్వీర్య ఇతి మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరాః ||

56

మాం ప్రాప్య హి గుణో దోషః సంవృత్తః పశ్య లక్ష్మణ |
అద్యైవ సర్వభూతానాం రక్షసామభవాయ చ ||

57

సంహృత్యైవ శశిజ్యోత్స్నాం మహాన్ సూర్య ఇవోదితః |
సంహృత్యైవ గుణాన్ సర్వాన్ మమ తేజః ప్రకాశతే ||

58

నైవ యక్షా న గంధర్వా న పిశాచా న రాక్షసాః |
కిన్నరా వా మనుష్యా వా సుఖం ప్రాప్స్యంతి లక్ష్మణ ||

59

మమాస్త్రబాణసంపూర్ణమాకాశం పశ్య లక్ష్మణ |
నిఃసంపాతం కరిష్యామి హ్యద్య త్రైలోక్యచారిణామ్ ||

60

సన్నిరుద్ధగ్రహణమావారితనిశాకరమ్ |
విప్రనష్టానలమరుద్భాస్కరద్యుతిసంవృతమ్ ||

61

వినిర్మథితశైలాగ్రం శుష్యమాణజలాశయమ్ |
ధ్వస్తద్రుమలతాగుల్మం విప్రణాశితసాగరమ్ ||

62

త్రైలోక్యం తు కరిష్యామి సంయుక్తం కాలధర్మణా |
న తాం కుశలినీం సీతాం ప్రదాస్యంతి యదీశ్వరాః ||

63

అస్మిన్ ముహూర్తే సౌమిత్రే మమ ద్రక్ష్యంతి విక్రమమ్ |
నాకాశముత్పతిష్యంతి సర్వభూతాని లక్ష్మణ ||

64

మమ చాపగుణోన్ముక్తైర్బాణజాలైర్నిరంతరమ్ |
అర్దితం మమ నారాచైర్ధ్వస్తభ్రాంతమృగద్విజమ్ ||

65

సమాకులమమర్యాదం జగత్పశ్యాద్య లక్ష్మణ |
ఆకర్ణపూర్ణైరిషుభిర్జీవలోకం దురాసదైః ||

66

కరిష్యే మైథిలీహేతోరపిశాచమరాక్షసమ్ |
మమ రోషప్రయుక్తానాం సాయకానాం బలం సురాః ||

67

ద్రక్ష్యంత్యద్య విముక్తానామతిదూరాతిగామినామ్ |
నైవ దేవా న దైతేయా న పిశాచా న రాక్షసాః ||

68

భవిష్యంతి మమ క్రోధాత్ త్రైలోక్యే విప్రణాశితే |
దేవదానవయక్షాణాం లోకా యే రక్షసామపి ||

69

బహుధా న భవిష్యంతి బాణౌఘైః శకలీకృతాః |
నిర్మర్యాదానిమాన్ లోకాన్ కరిష్యామ్యద్య సాయకైః ||

70

హృతాం మృతాం వా సౌమిత్రే న దాస్యంతి మమేశ్వరాః |
తథారూపాం హి వైదేహీం న దాస్యంతి యది ప్రియామ్ ||

71

నాశయామి జగత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |
ఇత్యుక్త్వా రోషతామ్రాక్షో రామో నిష్పీడ్య కార్ముకమ్ ||

72

శరమాదాయ సందీప్తం ఘోరమాశీవిషోపమమ్ |
సంధాయ ధనుషి శ్రీమాన్ రామః పరపురంజయః ||

73

యుగాంతాగ్నిరివ క్రుద్ధ ఇదం వచనమబ్రవీత్ |
యథా జరా యథా మృత్యుర్యథా కాలో యథా విధిః ||

74

నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ |
తథాఽహం క్రోధసంయుక్తో న నివార్యోఽస్మి సర్వథా ||

75

పురేవ మే చారుదతీమనిందితాం
దిశంతి సీతాం యది నాద్య మైథిలీమ్ |
సదేవగంధర్వమనుష్యపన్నగం
జగత్సశైలం పరివర్తయామ్యహమ్ ||

76

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుఃషష్టితమః సర్గః ||

Aranya Kanda Sarga 64 Meaning In Telugu PDF

రాముడికి ఇంకాఆశ చావలేదు. ‘ఏమో సీత ఎక్కడికైనా వెళ్లిందేమో. మనము అనవసరంగా ఆందోళన పడుతున్నామేమో’ అనే ఆలోచన వచ్చింది. వెంటనే లక్ష్మణుని పిలిచి

“లక్ష్మణా! నీవు వెంటనే గోదావరీనదీ తీరానికి వెళ్లు. అక్కడ సీత తామరపూలు కొయ్యడానికి కానీ, స్నానానికి కానీ వెళ్లిందేమో చూడు.’ ఇదే ఆఖరి ఆశ.” అన్నాడు రాముడు.
అన్న మాట ప్రకారము లక్ష్మణుడు గోదావరీ నదీతీరానికి వెళ్లాడు. తీర ప్రాంతము అంతా వెదికాడు. కానీ సీత జాడ ఎక్కడా కనపడలేదు. నిరాశతో రాముని వద్దకు వచ్చాడు.

“అన్నయ్యా! నేను గోదావరి తీరం అంతా వెదికాను. బిగ్గరగా అరిచాను. సీత ఎక్కడా కనిపించలేదు.” అని చెప్పాడు.

ఆఖరి ఆశకూడా వమ్ముకావడంతో రాముడు హతాశు డయ్యాడు. కాని రామునికి ఇంకా కొస ఆశ మిగిలి ఉంది. “లక్ష్మణుడు సరిగా చూచాడో! లేదో ఏమో!” అని తానే స్వయంగా గోదావరీ నదీ తీరానికి వెళ్లాడు. సీతా! సీతా! అని బిగ్గరగా అరుస్తూ ఆ ప్రాంతమంతా కలయ తిరిగాడు.

రావణుడు సీతను అపహరించిన సంగతి అక్కడ ఉన్న వృక్షములకు, జంతువులకు, పక్షులకు, గోదావరీ నదికి తెలుసు. కాని అవి చెప్పలేవు. రాముడు నిరాశ చెందాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! నేను ఎంత ఎలుగెత్తి పిలిచిననూ ఈ వనములో ఉన్న చెట్లు, పక్షులు, జంతువులు, గోదావరి నది ఎవరూ బదులు చెప్పడం లేదు. ఏం చేయాలి. నీ పాణిని గ్రహించిన సీత ఏదీ అని సీత తల్లి తండ్రులు అడిగితే నేను ఏమి సమాధానము చెప్పాలి.

లక్ష్మణా! నా రాజ్యము పోయినా, అరణ్యవాసము సంప్రాప్తిం చినా, నేను అధైర్యపడక సీతను చూచి బతుకుతున్నాను. ఇప్పుడు ఆ సీత నన్ను విడిచి పోయింది. ఇప్పుడు నేను ఎవరిని చూచి బతకాలి. నాకు ధైర్యము చెప్పేవాళ్లు ఎవరు.

లక్ష్మణా! చూచావా! ఈ మృగములు నన్ను చూచి తలలు ఎత్తి ఏమో చెప్పాలి అనుకుంటున్నాయి. కాని చెప్పలేకపోతున్నాయి. సీత గురించి వీటికి తెలిసి ఉంటుంది. ఉండు వీటిని అడుగుతాను.” అని రాముడు ఒక్కొక్క మృగం దగ్గరకు పోయి “సీత ఎక్కడ ఉందో నీకు తెలుసా!” అని ప్రతి మృగమును అడుగుతున్నాడు.

వాటి కళ్ల వెంట కన్నీరు కారుతూ ఉంది. కాని ఏమీ చెప్పలేకపోతున్నాయి. కాని అవి ఒక సంకేతమును ఇచ్చాయి. ఆ మృగములు తమ మోరలు ఎత్తి అరుస్తూ దక్షిణ దిక్కుకు పరుగెడుతున్నాయి. ఆకాశం వంక చూస్తున్నాయి. మరలా దక్షిణ దిక్కుగా పరుగెడుతున్నాయి.

రాముడు సీతా వియోగ దుఃఖంలో ఉన్నాడు. కానీ లక్ష్మణుడు సూక్ష్మబుద్ధితో వాటి సంకేతాలు గ్రహించాడు. “రామా! గమనించావా! నువ్వు “మీరు సీతను చూచారా! సీత ఎక్కడకు వెళ్లింది” అని అడగగానే ఈ మృగములు ఆకాశం వంక చూస్తూ దక్షిణ దిక్కుగా పరుగెడుతున్నాయి. ఎవరో సీతను ఆకాశ మార్గంలో దక్షిణదిక్కుగా తీసుకువెళ్లినట్టు వాటి చర్యలను బట్టి తెలుస్తూ ఉంది. కాబట్టి మనము దక్షిణ దిక్కుగా వెళ్లి వెదుకుదాము. సీత జాడ ఏమైనా తెలుస్తుందేమో!” అని అన్నాడు లక్ష్మణుడు.

ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడికి గడ్డిపరక దొరికినా లాభమే అన్నట్టు రాముడికి లక్ష్మణుడు చెప్పిన ఈ చిన్న మాట ఆశను రేకెత్తించింది. “లక్ష్మణా! అలాగే చేద్దాము. పద పోదాం.” అన్నాడు రాముడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరూ దక్షిణ దిక్కుగా వెళు తున్నారు.మార్గంలో సీత ధరించిన పూలు చెల్లాచెదురుగా పడిఉ డ చూచారు.

రాముడు ఆపూలను చూచాడు. “లక్ష్మణా! ఈ పూలు చూచావా! ఈ రోజు ఉదయం నేను అడవిలో నుండి కోసుకొని వచ్చి సీతకు ఇచ్చాను. ఈ పూలు ఇంకా వాడిపోలేదు. ఇప్పుడు ఈ పుష్పాలు మనకు దారి చూపుతున్నాయి.” అని సంతోషించాడు.

మరలా రాముడు తన ధోరణిలో మాట్లాడుతున్నాడు. “ఓ పర్వతములారా! మీకు సీత జాడ తెలుసు. ఎవరు తీసుకొనిపోయారో తెలుసు. తెలిసీ చెప్పకపోయారో నా బాణములతో మిమ్ములను పిండి పిండి చేస్తాను.” అని పెద్దగా అరిచాడు. రాముని మాటలకు పర్వతములు బదులు చెబుతున్నాయా అన్నట్టు రాముని మాటలు ప్రతిధ్వనించాయి.

ఇంతలో నేలమీద అటు ఇటు పరుగెట్టినట్టు పెద్ద పెద్ద అడుగులు, చిన్న చిన్న అడుగులు కనపడ్డాయి. పెద్ద అడుగులు రాక్షసునివి గానూ చిన్న అడుగులు సీతవి గానూ పోల్చుకున్నారు రామలక్ష్మణులు. ఆతురతగా ముందుకు నడిచారు.

వారికి ఒక వటవృక్షము దగ్గర విరిగిన ధనుస్సు బాణములు, ముక్కలైన రథము కనపడ్డాయి. అక్కడ ఒక యుద్ధం జరిగినట్టు ఆనవాళ్లు కనపడ్డాయి. అక్కడక్కడా విరిగిన ఆభరణములు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. వాటిని సీత ఆభరణములుగా గుర్తించాడు రాముడు. వారు అక్కడ సీత జాడ కోసరం నిశితంగా వెదుకుతున్నారు. “లక్ష్మణా! ఇటు చూడు. ఇక్కడ నేల మీద రక్త బిందువులు కనపడుతున్నాయి. ఇది చూస్తుంటే ఇక్కడ ఆ రాక్షసుడు సీతను చంపి ఉంటాడు. లక్ష్మణా! చూస్తుంటే ఇక్కడ ఇద్దరు రాక్షసులు యుద్ధము చేసిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఇదుగో ఇటు చూడు! బంగారముతో అలంకరింపబడిన ధనుస్సు ఇక్కడ విరిగిపడి ఉంది. ఇది ఎవరిదిఅయి ఉంటుందో తెలియదు. లక్ష్మణా! ఇటుచూడు. ఇక్కడ బంగారు కవచము పడిఉంది. ” అని అన్నాడు రాముడు.

“అన్నయ్యా! ఇక్కడ ఎవరిదో పెద్ద ఛత్రము పడిఉంది. అదుగో అక్కడ పిశాచముఖములు కలిగిన గాడిదలు చచ్చి పడిఉన్నాయి. ఇవన్ని చూస్తుంటే నువ్వు అన్నట్టు ఇక్కడ ఏదో యుద్ధము జరిగినట్టు కనపడుతూ ఉంది.” అని అన్నాడు లక్ష్మణుడు.

“లక్ష్మణా! ఈ రథము ఎవరిదో మహారాజుదిగా ఉంది. అంతా బంగారంతో చేయబడి ఉంది. ఇక్కడ పడిఉన్న బాణములు కూడా చాలా పొడుగ్గా ఉన్నాయి. బంగాచపు ములికలు కలిగి ఉన్నాయి. రెండు అమ్ములపొదులు కూడా ఉన్నాయి. రథసారథికూడా చచ్చిపడి ఉన్నాడు. ఈసారథి చేతిలో రథమునకు కట్టిన గాడిదల కళ్ళెములు, కొరడా ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు చామరములు వీచే వాళ్లుకూడా చంపబడినట్టున్నారు. వాళ్ల శరీరాలు చెల్లాచెదరుగా పడిఉన్నాయి. వీరందరూ ఇక్కడ జరిగిన యుద్ధములో చంపబడినట్టున్నారు” అని రాముడు అక్కడ పడి ఉన్న మృతదేహాలను చూస్తున్నాడు.

లక్ష్మణుడు కూడా వారిని చూచి వారు రాక్షసులు అని పోల్చుకున్నాడు. కాని సీత ఏమయిందో తెలయడం లేదు. రామునికి అర్థం అయింది. ఇదంతా రాక్షసుల పని అని. లక్ష్మణుని చూచి రాముడు ఇలా అన్నాడు.

“ఓ లక్ష్మణా! ఇదంతా చూస్తుంటే ఇక్కడ రాక్షసుల మధ్య యుద్ధం జరిగినట్టు కనపడుతూ ఉంది. సీతను తీసుకువెళ్లడం గానీ, చంపి తినడం గానీ జరిగి ఉండవచ్చు. సీత గురించి ఇక్కడ ఘోరయుద్ధం జరిగినట్టు ఆనవాళ్లు కనపడు తున్నాయి. దేవతలుగానీ వనదేవతలు గానీ సీతను రక్షించలేదు. ఏది ఏమయినా నాకు తీరని నష్టం కలుగజేసారు. నాకు సహజంగా దయాగుణం ఉంది. అనవసరంగా నేను ఎవరికీ అపకారము చెయ్యను. నా దయా గుణమును దేవతలు, వనదేవతలు, రాక్షసులు నా చేతగాని తనంగా భావిస్తున్నారు. నన్ను పరాక్రమము లేని వాడుగా అనుకొంటున్నారు. నా దయాగుణమే నాకు శత్రువుగా పరిణమించింది.

అందుకని, నేను నా దయాగుణమును తొక్కిపట్టి, విజృంభిస్తాను. సకల భూతములను, రాక్షసులను నాశనం చేస్తాను. యక్షగంధర్వ, పిశాచ, దానవులను క్షోభపెడతాను. ఎవరినీ సుఖంగా బతకనివ్వను. నా అస్త్ర శస్త్రములతో ముల్లోకములను అల్లకల్లోలం చేస్తాను. ఈ దేవతలు నా సీతను నాకు క్షేమంగా అప్పగించకపోతే నా పరాక్రమము ఏమిటో వారికి తెలియజేస్తాను.” అని పలికి విల్లు ఎక్కుపెట్టాడు రాముడు.

“లక్ష్మణా! ఇక్కడ ఉన్న వారందరికీ నా సీతకు ఏమయిందో తెలుసు. కానీ నాకు చెప్పడం లేదు. వారు, దేవతలు కానీ, రాక్షసులు గానీ, నా సీత జాడ చెప్పకపోయినా, నా సీతను నాకు సజీవంగా నాకు అప్పగించకపోయినా, ఈ బాణంతో ముల్లోకములను క్షోభింపజేస్తాను.” అని విల్లు ఎక్కుపెట్టాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ పంచషష్టితమః సర్గః (65) >>

Aranya Kanda Sarga 63 In Telugu – అరణ్యకాండ త్రిషష్టితమః సర్గః

Aranya Kanda Sarga 63 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ త్రిషష్టితమః సర్గం (63వ సర్గ) రామాయణంలో ప్రధానమైన భాగం. ఈ సర్గలో, రావణుడు మాయా సీతను అపహరించిన తరువాత, రాముడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుని, హనుమంతుని సహాయంతో వనాలను అన్వేషిస్తాడు. ఈ అన్వేషణలో రాముడు అనేక వనాలను, అడవులను దాటుతూ సీతను వెతుకుతాడు. ఈ సర్గలో, రాముడు తన భార్య సీతను రక్షించడానికి ఎంతో సాహసాన్ని, ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు. రాముని తపస్సు, కృషి, ధర్మపాలన ఈ సర్గలో స్పష్టంగా కనిపిస్తాయి.

దుఃఖానుచింతనమ్

స రాజపుత్రః ప్రియయా విహీనః
కామేన శోకేన చ పీడ్యమానః |
విషాదయన్ భ్రాతరమార్తరూపో
భూయో విషాదం ప్రవివేశ తీవ్రమ్ ||

1

స లక్ష్మణం శోకవశాభిపన్నం
శోకే నిమగ్నో విపులే తు రామః |
ఉవాచ వాక్యం వ్యసనానురూప-
-ముష్ణం వినిఃశ్వస్య రుదన్ సశోకమ్ ||

2

న మద్విధో దుష్కృతకర్మకారీ
మన్యే ద్వితీయోఽస్తి వసుంధరాయామ్ |
శోకేన శోకో హి పరంపరాయా
మామేతి భిందన్ హృదయం మనశ్చ ||

3

పూర్వం మయా నూనమభీప్సితాని
పాపాని కర్మాణ్యసకృత్కృతాని |
తత్రాయమద్యాపతితో విపాకో
దుఃఖేన దుఃఖం యదహం విశామి ||

4

రాజ్యప్రణాశః స్వజనైర్వియోగః
పితుర్వినాశో జననీవియోగః |
సర్వాణి మే లక్ష్మణ శోకవేగ-
-మాపూరయంతి ప్రవిచింతితాని ||

5

సర్వం తు దుఃఖం మమ లక్ష్మణేదం
శాంతం శరీరే వనమేత్య శూన్యమ్ |
సీతావియోగాత్ పునరప్యుదీర్ణం
కాష్ఠైరివాగ్నిః సహసా ప్రదీప్తః ||

6

సా నూనమార్యా మమ రాక్షసేన
బలాద్ధృతా ఖం సముపేత్య భీరుః |
అపస్వరం సస్వరవిప్రలాపా
భయేన విక్రందితవత్యభీక్ష్ణమ్ ||

7

తౌ లోహితస్య ప్రియదర్శనస్య
సదోచితావుత్తమచందనస్య |
వృత్తౌ స్తనౌ శోణితపంకదిగ్ధౌ
నూనం ప్రియాయా మమ నాభిభాతః ||

8

తచ్ఛ్లక్ష్ణసువ్యక్తమృదుప్రలాపం
తస్యా ముఖం కుంచితకేశభారమ్ |
రక్షోవశం నూనముపాగతాయా
న భ్రాజతే రాహుముఖే యథేందుః ||

9

తాం హారపాశస్య సదోచితాయా
గ్రీవాం ప్రియాయా మమ సువ్రతాయాః |
రక్షాంసి నూనం పరిపీతవంతి
విభిద్య శూన్యే రుధిరాశనాని ||

10

మయా విహీనా విజనే వనే యా
రక్షోభిరాహృత్య వికృష్యమాణా |
నూనం వినాదం కురరీవ దీనా
సా ముక్తవత్యాయతకాంతనేత్రా ||

11

అస్మిన్ మయా సార్ధముదారశీలా
శిలాతలే పూర్వముపోపవిష్టా |
కాంతస్మితా లక్ష్మణ జాతహాసా
త్వామాహ సీతా బహువాక్యజాతమ్ ||

12

గోదావరీయం సరితాం వరిష్ఠా
ప్రియా ప్రియాయా మమ నిత్యకాలమ్ |
అప్యత్ర గచ్ఛేదితి చింతయామి
నైకాకినీ యతి హి సా కదాచిత్ ||

13

పద్మాననా పద్మవిశాలనేత్రా
పద్మాని వానేతుమభిప్రయాతా |
తదప్యయుక్తం న హి సా కదాచి-
-న్మయా వినా గచ్ఛతి పంకజాని ||

14

కామం త్విదం పుష్పితవృక్షషండం
నానావిధైః పక్షిగణైరుపేతమ్ |
వనం ప్రయాతా ను తదప్యయుక్త-
-మేకాకినీ సాఽతిబిభేతి భీరుః ||

15

ఆదిత్య భో లోకకృతాకృతజ్ఞ
లోకస్య సత్యానృతకర్మసాక్షిన్ |
మమ ప్రియా సా క్వ గతా హృతా వా
శంసస్వ మే శోకవశస్య నిత్యమ్ ||

16

లోకేషు సర్వేషు చ నాస్తి కించి-
-ద్యత్తే న నిత్యం విదితం భవేత్తత్ |
శంసస్వ వాయో కులశాలినీం తాం
హృతా మృతా వా పథి వర్తతే వా ||

17

ఇతీవ తం శోకవిధేయదేహం
రామం విసంజ్ఞం విలపంతమేవమ్ |
ఉవాచ సౌమిత్రిరదీనసత్త్వో
న్యాయే స్థితః కాలయుతం చ వాక్యమ్ ||

18

శోకం విముంచార్య ధృతిం భజస్వ
సోత్సాహతా చాస్తు విమార్గణేఽస్యాః |
ఉత్సాహవంతో హి నరా న లోకే
సీదంతి కర్మస్వతిదుష్కరేషు ||

19

ఇతీవ సౌమిత్రిముదగ్రపౌరుషం
బ్రువంతమార్తో రఘువంశవర్ధనః |
న చింతయామాస ధృతిం విముక్తవాన్
పునశ్చ దుఃఖం మహదభ్యుపాగమత్ ||

20

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే త్రిషష్టితమః సర్గః ||

Aranya Kanda Sarga 63 Meaning In Telugu PDF

రాముడి దుఃఖానికి అంతులేకుండా పోయింది. లక్ష్మణుడు ఎంత ఓదారుస్తున్నా రాముడు సీత మీద ఉన్న ప్రేమ వలన ఆమెకోసం విలపిస్తున్నాడు. తనలో తనే మాట్లాడుకుంటున్నాడు.

“నేను ఎన్నో పాపాలు చేసి ఉంటాను. అందుకనే నాకు కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. నేను ఊరికే అనడం లేదు లక్ష్మణా! నాకు రాజ పోయింది. బంధుమిత్రులు దూరం అయ్యారు. తల్లి దూరం అయింది. తండ్రి మరణించాడు. ఇప్పుడు నా భార్యకూడా నాకు దూరం అయింది. ఇది పాపకర్మల ఫలితం కాదా!

సీతను ఎవరైనా ఎత్తుకుపోతుంటే ఆమె ఎంతగా విలపించి ఉంటుందో తలచుకుంటేనే భయంగా ఉంది. సందేహము లేదు. సీతను రాక్షసులే అపహరించారు. నరమాంస భక్షకులైన రాక్షసులు సీతను అపహరించి, ఆమె కంఠమును ఖండించి ఆమె నెత్తురు తాగి ఉంటారు. ఆ సమయంలో ఆమె ఎంతగా ఏడ్చిందో కదా!

లక్ష్మణా! నీకు తెలుసుకదా! సీత, నేను, ఆ శిలాఫలకము మీద కూర్చుని ఎన్నో సాయంత్రాలు గడిపాము కదా! లక్ష్మణా! సీత గోదావరికి స్నానం నిమిత్తం వెళ్లి ఉంటుందంటావా! కాని ఆమె ఎప్పుడూ ఒంటరిగా గోదావరికి స్నానానికి వెళ్లదే! నేను తోడు లేనిదే సీత కనీసము తామరపూల కోసరం కూడా తటాకమునకు వెళ్లదు. ఎందుకంటే సీత మహాభయస్తురాలు.” అని లక్ష్మణునితో అన్నాడు.

తల పైకి ఎత్తాడు. ఆకాశంలో సూర్యుడు వెలుగుతున్నాడు. “ఓ సూర్యభగవానుడా! నీవు లోకమంతా వెలుగుతుంటావు కదా! నా సీత ఎక్కడైన కనపడిందా! నీవు చూచావా! చూస్తే నాకు చెప్పవా!” అని సూర్యుడిని వేడుకున్నాడు. అలాగే వాయుదేవుడిని కూడా వేడుకున్నాడు.

ఇదంతా చూచిన లక్ష్మణుడికి కూడా దుఃఖం ముంచు కొచ్చింది. తనూ దుఃఖిస్తే రాముడు ఇంకా దైన్యానికి లోనవుతాడని తనలో తాను తమాయించుకున్నాడు. రాముని చూచి ఇలా అన్నాడు.

“రామా! ఇంక చాలు. సీత కోసం దుఃఖించడం మాను. ఇలా దుఃఖిస్తూ కూర్చుంటే సీత తిరిగి వస్తుందా! పద. సీతను వెదుకుదాము. నీ వంటి బుద్ధిమంతులు కష్టములు వచ్చినప్పుడే ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి రామా! ధైర్యము తెచ్చుకో. ” అని రామునికి ధైన్యవచనాలు పలికాడు. కానీ రాముడి మీద అవి పనిచేయలేదు. (ఈ సర్గ కూడా ప్రాచ్యప్రతిలో లేదు. అందుకని ఈ సర్గ కూడా తరువాత చేర్చబడినది అని పండితుల అభిప్రాయము.)

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము. అరువది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ చతుఃషష్టితమః సర్గః (64) >>

Kishkindha Kanda Sarga 5 In Telugu – కిష్కింధాకాండ పంచమః సర్గః

Kishkindha Kanda Sarga 5

కిష్కింధాకాండలో పంచమ సర్గలో, సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని నాలుగు దిశల్లో సీతాన్వేషణకు పంపిస్తాడు. హనుమంతుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైన ప్రముఖులు అన్వేషణలో పాల్గొంటారు. హనుమంతుడికి రాముడు సీతదేవి కనిపిస్తే ఇచ్చేందుకు తన ఉంగరాన్ని ఇస్తాడు. వానరులు ప్రతి కొండ, అడవి, సముద్రం వెతుకుతారు. ఈ సమయంలో సీతదేవి లక్షణాలను వివరించటం ద్వారా రాముడు హనుమంతుడికి ముఖ్యమైన సూచనలు ఇస్తాడు. అన్వేషణ బృందం దక్షిణ దిశగా పయనిస్తుంది, హనుమంతుడు తన శక్తిని వినియోగించి, సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవడానికి సన్నద్ధమవుతాడు. ఈ సర్గలో అన్వేషణకు సంబంధించిన ప్రణాళికలు, స్నేహబంధం మరియు ధైర్యం ప్రాముఖ్యత వహిస్తాయి.

సుగ్రీవసఖ్యమ్

ఋశ్యమూకాత్తు హనుమాన్ గత్వా తు మలయం గిరిమ్ |
ఆచచక్షే తదా వీరౌ కపిరాజాయ రాఘవౌ || ౧ ||

అయం రామో మహాప్రాజ్ఞః సంప్రాప్తో దృఢవిక్రమః |
లక్ష్మణేన సహ భ్రాత్రా రామోఽయం సత్యవిక్రమః || ౨ ||

ఇక్ష్వాకూణాం కులే జాతో రామో దశరథాత్మజః |
ధర్మే నిగదితశ్చైవ పితుర్నిర్దేశపారగః || ౩ ||

తస్యాస్య వసతోఽరణ్యే నియతస్య మహాత్మనః |
రావణేన హృతా భార్యా స త్వాం శరణమాగతః || ౪ ||

రాజసూయాశ్వమేధైశ్చ వహ్నిర్యేనాభితర్పితః |
దక్షిణాశ్చ తథోత్సృష్టా గావః శతసహస్రశః || ౫ ||

తపసా సత్యవాక్యేన వసుధా యేన పాలితా |
స్త్రీహేతోస్తస్య పుత్రోఽయం రామస్త్వాం శరణం గతః || ౬ ||

భవతా సఖ్యకామౌ తౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ |
ప్రతిగృహ్యార్చయస్వైతౌ పూజనీయతమావుభౌ || ౭ ||

శ్రుత్వా హనుమతో వాక్యం సుగ్రీవో హృష్టమానసః |
భయం చ రాఘవాద్ఘోరం ప్రజహౌ విగతజ్వరః || ౮ ||

స కృత్వా మానుషం రూపం సుగ్రీవః ప్లవగర్షభః |
దర్శనీయతమో భూత్వా ప్రీత్యా ప్రోవాచ రాఘవమ్ || ౯ ||

భవాన్ ధర్మవినీతశ్చ విక్రాంతః సర్వవత్సలః |
ఆఖ్యాతా వాయుపుత్రేణ తత్త్వతో మే భవద్గుణాః || ౧౦ ||

తన్మయైవైష సత్కారో లాభశ్చైవోత్తమః ప్రభో |
యత్త్వమిచ్ఛసి సౌహార్దం వానరేణ మయా సహ || ౧౧ ||

రోచతే యది వా సఖ్యం బాహురేష ప్రసారితః |
గృహ్యతాం పాణినా పాణిర్మర్యాదా బధ్యతాం ధ్రువా || ౧౨ ||

ఏతత్తు వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితమ్ |
స ప్రహృష్టమనా హస్తం పీడయామాస పాణినా || ౧౩ ||

హృద్యం సౌహృదమాలంబ్య పర్యష్వజత పీడితమ్ |
తతో హనూమాన్ సంత్యజ్య భిక్షురూపమరిందమః || ౧౪ ||

కాష్ఠయోః స్వేన రూపేణ జనయామాస పావకమ్ |
దీప్యమానం తతో వహ్నిం పుష్పైరభ్యర్చ్య సత్కృతమ్ || ౧౫ ||

తయోర్మధ్యేఽథ సుప్రీతో నిదధే సుసమాహితః |
తతోఽగ్నిం దీప్యమానం తౌ చక్రతుశ్చ ప్రదక్షిణమ్ || ౧౬ ||

సుగ్రీవో రాఘవశ్చైవ వయస్యత్వముపాగతౌ |
తతః సుప్రీతమనసౌ తావుభౌ హరిరాఘవౌ || ౧౭ ||

అన్యోన్యమభివీక్షంతౌ న తృప్తిముపజగ్మతుః |
త్వం వయస్యోఽసి మే హృద్యో హ్యేకం దుఃఖం సుఖం చ నౌ || ౧౮ ||

సుగ్రీవం రాఘవో వాక్యమిత్యువాచ ప్రహృష్టవత్ |
తతః స పర్ణబహులాం ఛిత్త్వా శాఖాం సుపుష్పితామ్ || ౧౯ ||

సాలస్యాస్తీర్య సుగ్రీవో నిషసాద సరాఘవః |
లక్ష్మణాయాథ సంహృష్టో హనుమాన్ ప్లవగర్షభః || ౨౦ ||

శాఖాం చందనవృక్షస్య దదౌ పరమపుష్పితామ్ |
తతః ప్రహృష్టః సుగ్రీవః శ్లక్ష్ణం మధురయా గిరా || ౨౧ ||

ప్రత్యువాచ తదా రామం హర్షవ్యాకులలోచనః |
అహం వినికృతో రామ చరామీహ భయార్దితః || ౨౨ ||

హృతభార్యో వనే త్రస్తో దుర్గమే తదుపాశ్రితః |
సోఽహం త్రస్తో వనే భీతో వసామ్యుద్భ్రాంతచేతనః || ౨౩ ||

వాలినా నికృతో భ్రాత్రా కృతవైరశ్చ రాఘవ |
వాలినో మే మహాభాగ భయార్తస్యాభయం కురు || ౨౪ ||

కర్తుమర్హసి కాకుత్స్థ భయం మే న భవేద్యథా |
ఏవముక్తస్తు తేజస్వీ ధర్మజ్ఞో ధర్మవత్సలః || ౨౫ ||

ప్రత్యభాషత కాకుత్స్థః సుగ్రీవం ప్రహసన్నివ |
ఉపకారఫలం మిత్రం విదితం మే మహాకపే || ౨౬ ||

వాలినం తం వధిష్యామి తవ భార్యాపహారిణమ్ |
అమోఘాః సూర్యసంకాశా మమైతే నిశితాః శరాః || ౨౭ ||

తస్మిన్ వాలిని దుర్వృత్తే నిపతిష్యంతి వేగితాః |
కంకపత్రప్రతిచ్ఛన్నా మహేంద్రాశనిసన్నిభాః || ౨౮ ||

తీక్ష్ణాగ్రా ఋజుపర్వాణాః సరోషా భుజగా ఇవ |
తమద్య వాలినం పశ్య క్రూరైరాశీవిషోపమైః || ౨౯ ||

శరైర్వినిహతం భూమౌ వికీర్ణమివ పర్వతమ్ |
స తు తద్వచనం శ్రుత్వా రాఘవస్యాత్మనో హితమ్ |
సుగ్రీవః పరమప్రీతః సుమహద్వాక్యమబ్రవీత్ || ౩౦ ||

తవ ప్రసాదేన నృసింహ రాఘవ
ప్రియాం చ రాజ్యం చ సమాప్నుయామహమ్ |
తథా కురు త్వం నరదేవ వైరిణం
యథా న హింస్యాత్ స పునర్మమాగ్రజః || ౩౧ ||

సీతాకపీంద్రక్షణదాచరాణాం
రాజీవహేమజ్వలనోపమాని |
సుగ్రీవరామప్రణయప్రసంగే
వామాని నేత్రాణి సమం స్ఫురంతి || ౩౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే పంచమః సర్గః || ౫ ||

Kishkindha Kanda Sarga 5 Meaning In Telugu

హనుమంతుడు రామలక్ష్మణులను తన బుజముల మీద ఎక్కించుకొని ఋష్యమూక పర్వతము నుండి మలయ పర్వతమునకు తీసుకొని వెళ్లాడు. రామలక్ష్మణులను మలయ పర్వతము మీద దించి, సుగ్రీవుని వద్దకు వెళ్లాడు.

“ఓ సుగ్రీవా! వీరు రాముడు లక్ష్మణుడు అనే పేర్లు గల రాజకుమారులు. నేనే వీరిని నా వెంట తీసుకొని వచ్చాను. రాముడు మహా పరాక్రమ వంతుడు. రాముడు ఇక్ష్వాకు వంశములో పుట్టిన వాడు. ధర్మము తెలిసిన వాడు. దశరథుని కుమారుడు. తండ్రి ఆజ్ఞప్రకారము వనవాసము చేస్తున్నాడు. రాముడు వనవాసము చేయుచుండగా రావణుడు అనే రాక్షసుడు ఈయన భార్య సీతను అపహరించాడు. ఆ రాముడు ప్రస్తుతము నీ శరణు కోరుతున్నాడు. రాముడు, లక్ష్మణుడు నీతో స్నేహము చేయవలెనని అభిలషిస్తున్నారు. వీరి స్నేహమును అంగీకరించు. దీని వలన మీ ఇద్దరికీ లాభము చేకూరుతుంది. వీరిరువురూ పూజింప తగిన వారు. వీరిని మిత్రులుగా స్వీకరించి పూజించు.” అని పలికాడు హనుమంతుడు.
ఆ మాటలు విన్న సుగ్రీవుడు చాలా సంతోషించాడు.

రాముని చూచి ఇలా అన్నాడు. “ఓ రామా! మీ గుణగణముల గురించి హనుమంతుడు నాతో చెప్పాడు. మీరు ఉత్తమ మానవులు. నేను వానరుడను. ఈ వానరుడితో స్నేహము కోరుతున్నారంటే, ఇది మీరు నాకు చేస్తున్న సత్కారముగా భావిస్తున్నాను. మీకు నాతో స్నేహం చేయడం ఇష్టం అయితే, నా చేతులు మీకోసం చాస్తున్నాను. మీ చేతితో నా చేతిని తాకండి. కరచాలనం చెయ్యండి.” అని అన్నాడు సుగ్రీవుడు.

సుగ్రీవుడు పలికిన పలుకులు విన్న రాముడు చాలా సంతోషించాడు. సుగ్రీవుని హస్తము పట్టుకున్నాడు. సుగ్రీవునితో స్నేహం అంగీకరించాడు. సుగ్రీవుని గాఢంగా కౌగలించుకున్నాడు. ఈ సన్నివేశము చూచి హనుమంతుడు చాలా ఆనందించాడు. రెండు కర్రలతో నిప్పుపుట్టించాడు. అగ్ని రగిల్చాడు. ఆ అగ్నిని రాముడు సుగ్రీవుని మధ్య ఉంచాడు. రాముడు, సుగ్రీవుడు ఆ అగ్ని చుట్టు ప్రదక్షిణము చేసారు. అగ్నిసాక్షిగా రాముడు సుగ్రీవులు మిత్రులయ్యారు.

సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు. “మనము ఇద్దరమూ సమానమైన దు:ఖములో ఉన్నాము. ఒకరి దు:ఖములను ఒకరం పంచుకుందాము. ఇకమీదట మన సుఖదు:ఖములను సమానంగా పంచుకుందాము.” అని అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు పక్కనే ఉన్న సాల వృక్షము నుండి ఒక కొమ్మను విరిచాడు. కింద పరిచాడు. రాముడు సుగ్రీవుడు దాని మీద కూర్చున్నారు. తరువాత హనుమంతుడు ఒక చందన వృక్షము కొమ్మను తెచ్చి లక్ష్మణునికి కానుకగా ఇచ్చాడు. సుగ్రీవుడు రాముని చూచి ఇలా అన్నాడు.

“ఓ రామా! నా అన్న వాలి నన్ను చాలా అవమానించాడు. నాతో శతృత్వము పెంచుకున్నాడు. నా నుండి నా భార్యను లాక్కున్నాడు. నన్ను రాజ్యము నుండి తరిమేసాడు. నేను, నా అన్న వాలికి భయపడి, అపరిమిత మైన దుఃఖమును అనుభవిస్తూ, ఈ ఋష్యశృంగ పర్వతము మీద నివసిస్తున్నాను. రామా! ఇప్పుడు నాకు నీ అభయము కావాలి. నాకు వాలి నుండి రక్షణ కావాలి. నా రాజ్యము నాకు కావాలి. నా భార్య నాకు కావాలి. ఇదంతా నీ వల్లే జరగాలి.” అని అన్నాడు సుగ్రీవుడు.

రాముడు సుగ్రీవుని మాటలకు నవ్వుతూ ఇలా అన్నాడు. “నేను నీకు తప్పకుండా సాయము చేస్తాను. నీ భార్యను అపహరించిన వాలిని చంపి నీ భార్యను నీకు తెచ్చి అప్పగిస్తాను. ఈ బాణములు చూచావు కదా. ఇవి అమోఘమైనవి. వీటితో వాలిని వధిస్తాను.” అని అన్నాడు రాముడు.
రాముని మాటలు విని సుగ్రీవుడు పరమానంద భరితుడయ్యాడు. “ఓ రామా! నీ మాటలు వింటుంటే నాకు నా భార్యను తిరిగి పొందినంత ఆనందంగా ఉంది. నాకు వాలి వలన కలిగిన భయాన్ని శాశ్వతంగా తొలగించు. వాలి నన్ను మరలా ఎటువంటి బాధ పెట్టకుండా చెయ్యి” అని అన్నాడు సుగ్రీవుడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ షష్ఠః సర్గః (6) >>