Sadanandamu Sarveshwara Ni In Telugu – సదానందము సర్వేశ్వర నీ

ఈ పోస్ట్ లో సదానందము సర్వేశ్వర నీ- కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సదానందము సర్వేశ్వర నీ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : సదానందము సర్వేశ్వర నీ-
సంఖ్య : 369
పుట: 248
రాగం: దేవగాంధారి

దేవగాంధారి

53 సదానందము సర్వేశ్వర నీ-
పదారవిందముపై భక్తి

||పల్లవి||

నయనానందము నరులకు సురలకు
జయమగు హరి నీసాకారము
నయమగుశ్రవణానందము వినినను
క్రియగలిగిననీకీర్తనము

||సదా||

చెలఁగి యందరికి జిహ్వానందము
పలుమరుఁ గొనునీప్రసాదము
నలుగడ దేహానందము బుధులకు
బలునీపాద ప్రణామములు

||సదా||

ధరఁ బరమానందము నీదాస్యము
గరిమల శ్రీవేంకటవిభుఁడా
నరహరి నిత్యానందము నినుఁ దగ-
నరవిరిఁ జేయసమారాధనము

||సదా||369

అవతారిక:

ప్రతిజీవీ సంతోషం కోసమే జీవిస్తాడు. సంతోషంకోసమే వెంపర్లాడతాడు. అయితే రేయింబవళ్ళలాగా, సంతోషమూ దు:ఖమూ రెండూ సదా (కలకాలంవుండేవి కావు) వస్తుంటాయి పోతుంటాయి. మరి సదానందము (యెప్పుడూ ఆనందాన్నిచ్చే దేమిటి? ఆ సర్వేశ్వరుడి పాదారవిందములపై భక్తి అని అంటున్నారు అన్నమాచార్యులవారు. నయనాందము, శ్రవణానందము, జిహ్వానందము, దేమానందము, పరమానందము, నిత్యానందము – యేమిటేమిటో వివరిస్తున్నారు విని తరించండి. జ్ఞానము అంటే ఇదే సుమా!

భావ వివరణ:

ఓ సర్వేశ్వరా! నా పదారవిందములపై భక్తి (నీపాదపత్మములపై అచంచలమైన భక్తిప్రపత్తి) సదానందము (సర్వకాల సర్వావస్థలయందు ఆనందమునొసగునది).

నరులకు సురులకు నయనానందమయుయేది? (కన్నులకు ఆనందము నొసగునదేమిటి?) శ్రీహరీ! సర్వులకు జయము నొసగే నీసాకార (ఆకారముతో కూడిన) రూపముకంటే నయనానందకరము మరొకటి లేదు. ఇక వినినను (వినుటకు) నయముగ (స్వాంతనము కలిగించే శ్రవణానందము (చెవులకు ఆనందకరమైనది యేది? క్రియగలిగిన (పూనిక గలిగిన) నీ నామసంకీర్తనము మాత్రమే ఆ శ్రవణానందము నీయగలదు.

జిహ్వా (నాలుక) కలిగించే ఆనందమువల్ల నేనరులు దేనినైనా భుజించగలుగుతున్నారు. చెలగి (అతిశయించి) అందరికీ అట్టి జిహ్వానందము కలిగించునది యేదీ? యెన్నోసార్లు స్వీకరించే ఆస్వామి ప్రసాదమే జిహ్వానందకరము. ఇక లుధులకు (బుద్ధిమంతులకు) దేహమునకు ఆనందము కలిగించునదేది? నలుగడ (అనిచోట్లలో) బలమైన నీపాదములకు జేయు ప్రణామములు (సాష్టాంగవందనములే) దేహానందము గరిమల (మహిమగల శ్రీవేంకటేశ్వరుడా! ధరలో (భూలోకంలో) పరమానందమునొసగునదేది? నీకు చేసే దాస్యమే (భృత్యునిగా జీవించుటే) ఓనరహరీ! నిత్యానందము (ప్రతిరోజూ ఆనందము) నొసగునదేది? తగునట్లు అరవిరి (వినమృలై ముకుళిత హస్తములతో) జేయు నీసమారాధనమే నిత్యానందములు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment