Ettare Aratulu Yiyyare Kanukalu In Telugu – ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు

ఈ పోస్ట్ లో ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు
సంఖ్య: 31
పుట: 21
రాగం: బౌళి

బౌళి

101 ఎత్తరే ఆరతులు యియ్యరే కానుకలు
యిత్తల నేఁగివచ్చీని యిందిరానాథుఁడు

||పల్లవి||

గరుడధ్వజపు తేరు కనకమయపు తేరు
సిరులతో వేదములచేరుల తేరు
సురలు మునులుఁ బట్టి సొంపుతోడఁ దియ్యంగాను
యిరవుగ నేఁగివచ్చీ నిందిరానాథుఁడు

||ఎత్త||

జీవకోట్లున్న తేరు శేషుఁడే రూపైన తేరు
వేవేలు సింగారముల వెలయు తేరు
మావరుస నిత్యులును ముక్తులును గొలువఁగా
యీవల నేఁగివచ్చీ నిందిరానాథుఁడు

||ఎత్త||

పంచభూతముల తేరు బ్రహ్మాండమైన తేరు
మించిన శ్రీవేంకటాద్రిమీఁదటి తేరు
కొంచక యలమేల్మంగఁ గూడి వచ్చీ నదె తేరు
యెంచరాని మహిమలు నిందిరానాథుఁడు

||ఎత్త|| 31

అవతారిక:

శ్రీవేంకటేశ్వరుని రథము తిరువీధులగుండా సాగుతున్నది. ఇందిరానాథుడు ఇటువైపు వచ్చేస్తున్నాడు, ఓ ప్రజలారా! రండి… హారతులీయండి… కానుకలనీయండి… మీ జన్మ తరింపజేసికోండి అని మంగళం పాడుతున్నారు. అన్నమాచార్యులవారు. ఈ తేరు, పంచభూతముల మూలరూపమైన పరమాత్ముని | బ్రహ్మాండమైన తేరు అని కీర్తిస్తున్నారు. జీవకోట్లన్నీ ఇందులోనే అదృశ్యరూపంలో వున్నాయట. సురులు మునులు ఈ తేరుని పట్టుకొని సొంపుగా లాగుతున్నారట. ఏరీ కనుపించరేమి? అని జుట్టు పీక్కోకండి. మనకు వారినిచూచే శక్తీ, అర్హతా, భక్తీ యేవీ లేవు. స్వామి సశరీరుడై తన దేవేరులతో వారికి కనుపిస్తాడు. కాని మనకు | అంత అదృష్టం లేదు.

భావ వివరణ:

ఓ ప్రజలారా! ఇందిరానాథుడు ఇటు వూరేగి యిత్తల వస్తున్నాడు (ఇటువైపు వచ్చుచున్నాడు). ఎత్తరో ఆరతులు (హారతులను యెత్తిచూపండి). మీ శక్తి కొలది కానుకలు స్వామికి సమర్పించుకోండి.

ఈ స్వామి యెన్ని రకములైన రథములనెక్కాడో చూడండి. | గరుడధ్వజముతో నొప్పిన తేరు బంగారము రాసులైన తేరు. నాలుగు వేదములు దీనికి చేరులు (పట్టుకొని గుంజుటకు వుపయోగించిన నాలుగు త్రాళ్ళు). దేవతలు మునులు అదృశ్యరూపులై దీనిని లాగి తరిస్తున్నారు. ఈవిధంగా ఇరవుగా (సొంపుగా) ఇందిరానాథుడు వూరేగివస్తున్నాడు.

సృష్ఠిలోని జీవకోట్లన్నీ సూక్షరూపంలో వున్నాయి, ఈ రథంలో ఉన్నాయి. ఇది మనకు రథములా కనిపిస్తున్నది కానీ ఆదిశేషుడు చుట్టలు చుట్టుకొని తన | పడగలను స్వామికి గొడుగులాపట్టినాడు. వేవేల సింగారములు (అనేకమైన అలంకరణలతో) ఈ తేరు కన్నులపండువగా వున్నది. నారదాది నిత్యులూ, సనక సనందనాది ఋషులు, వ్యాసాంబరీషులవంటి ముక్తులు (ముక్తిపొందినవారు)… మూడు వరుసలలో నిలిచి సేవిస్తున్నారు. ఈవిధముగా ఇందిరానాథుడు వూరేగివస్తున్నాడు.

బ్రహ్మాండమైన ఈ తేరులో పరమాత్మ పంచభూతముల రూపములో విలసిల్లుతున్నాడు. ఈ తేరు మించిన (వృత్కృష్టమైన శ్రీవేంకటాద్రిపై సాగిపోతున్నది. అదిగో ఈ ఇందిరానాథుడు కొంచక (తగ్గక) తన దేవేరి అలమేల్మంగతో గూడి ఈ తేరుపై వస్తున్నాడు. ఈ మహానుభావుడు యెంచరాని మహిమలు కలవాడు. ఈయనయొక్క అనుగ్రహం పొంది మీజన్మ చరితార్థం చేసికొనండి. ఒక్కసారి ముక్తకంఠంతో అనండి

శ్లో॥ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే।
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం||

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment