ఈ పోస్ట్ లో హరిహరి యిందరికి నబ్బురముగాని యిది కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
హరిహరి యిందరికి నబ్బురముగాని యిది – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 4
కీర్తన: హరిహరి యిందరికి నబ్బురముగాని యిది
సంఖ్య : 363
పుట: 244
రాగం: లలిత
లలిత
99 హరిహరి యిందరికి నబ్బురముగాని
యిది పరగ నీదాసుఁడే పరతత్వవేది
||పల్లవి||
పొలసి మశకమండుఁ బొడమేటి జీవుని
తలఁపు బ్రహ్మాండాలు దాఁటిపోయీనీ
నిలవెంత నీఁటెంత నీమాయ లివి భువి
బలిమిఁ దెలియువాఁడె పరతత్వవేది
||హరి||
తగిలి చూచిన నాత్మఁ దనుఁ గానరాదుగాని
జగమెల్ల దానైతే సరి గనీని
చిగురెంత చేగెంత శ్రీపతి యిందులో నీ-
పగటు దెలియువాఁడే పరతత్వవేది
||హరి||
యేవంకఁ దనబుద్ధి యెక్కడనుండునోకాని
శ్రీవేంకటేశ నిన్నుఁ జింతించీని
పూవెంత ఫలమెంత పురుషోత్తముఁడ నీ –
భావమెరుఁగువాఁడె పరతత్వవేది
||హరి||363
అవతారిక:
ఓ శ్రీహరీ! నీదాసుడొక్కడే పరతత్వవేది. (నీయొక్క పరా ప్రకృతిని తెలిసినవాడు). మిగిలినవారందరికీ నీ పరతత్వం అబ్బురముగానే వుంటుంది. ఒక మశకము (దోమ) ఎగురుతున్నదంటే జీవాత్మ రూపంలో నీవు దాంట్లో వుండబట్టే. ఆ ఆత్మ నాలోనూ వున్నది. కానీ కానరాదు. ఈ ఆత్మలన్నీ నీవే అవటంచేత జీవాత్మ పరమాత్మయై అద్వైత సిద్ధాంత ప్రతిపాదన సరైనదే అనిపిస్తున్నది. ఓ పురుషోత్తమా! నీ ఈ భావము తెలిసినవాడే నిజమైన పరతత్వవేది అంటున్నారు అన్నమాచార్యులవారు.
భావ వివరణ:
ఓశ్రీహరీ! ఇందరికి (ఇంతమందికి అబ్బురముగానిది (ఆశ్చర్యకరము కానిది ఇదే. అదేమిటంటే… నీదాసుడే ఈ జగతియందు భగవంతుని | పరతత్వము తెలిసినవాడగుచున్నాడు.
మశకమున (దోమయందు) పొలసి పొడమేటి (సంచరించుచు నెలకొన్న) జీవుడితలపులు చూడబోతే బ్రహ్మాండములను దాటిపోతున్నాయి. ఏమిటీ అద్భుతమాయ!! ఇది యెంతవున్నతమైనది! ఎంత నీటైనది (ఎంత మురిపెము కలిగించునది!) ఈ భువిలో దీనిని తెలియగలవాడెవడు? ఒకవేళ ఎవడన్నావుంటే… వాడేనయ్యా! | పరతంత్రుడంటే
తగిలి (పూని) వెదకినా ఆత్మ తాను కనబడదు. కాని సరిగా చూడగలిగితే జగమంతా అది నిండివుంటుంది. ఇదెట్లా సాధ్యమని ఆశ్చర్యపడుతున్నారా? అక్కరలేదండీ… చెట్టు చిగురిస్తున్నప్పుడు ఆ చిగురు యెంత అల్పమైనది!!. కాని దాని చేగు (చేవ లేక బలం) యెంత వుంటుంది. (అది మాను అయితే ఇంటి దూలమై కప్పునే మోస్తుంది కదా!) ఇది నీ దివ్యశక్తి. ఓ శ్రీపతీ! ఇందులో నీ పగలు (ప్రకాశము) తెలియగలమొనగాడెవడు? ఎవడన్నావుంటే వాడేనయ్యా! పరతంత్రుడంటే.
నరుడు తన బుద్ధి యేవంకనున్నా యెక్కడున్నా, ఓ శ్రీవేంకటేశా! నిన్ను జింతించీని (దానించునా?) నీకృప కలిగితే అట్లా చేయగలడు. వాడెలావుంటాడో యెవరికి తెలుసు? పూవు ఎంత సున్నితము, | కోమలముగా వుంటుంది. పండుయెంత పెద్దగా రాయిలా వుంటుంది. రుచిగా కూడా వుంటుందే!! ఓ పురుషోత్తమా! నీ ఈ భావము (లీల) యెరుగగలిగినవాడేనయ్యా! పరతంత్రుడంటే.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు
- తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
- అంజినీదేవి కొడుకు హనుమంతుడు
- అప్పడైన హరియెక్కె నదివో తేరు
- అడియా నడియనయ్య యఖిలలోకైకనాథ
- చేకొని కొలువరో శ్రీనరసింహము
- రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు
- ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
- జగములేలేవాడవు జనార్దనుడవు
- వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు
- కరేణ కిం మాం గృహీతుం తే
- చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ