Itani Neragakuntenila In Telugu – ఈతని నెఱగకుంటేనిల

ఈ పోస్ట్ లో ఈతని నెఱగకుంటేనిల కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఈతని నెఱగకుంటేనిల – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన : ఈతని నెఱగకుంటేనిల
సంఖ్య : 536
పుట: 360
రాగం: లలిత

లలిత

45 ఈతని నెఱఁగకుంటే నిల స్వామిద్రోహము
ఘాతల నేఱు గుడిచి కాలువ పొగడుట.

||పల్లవి||

హరిపాదముననే యడఁగె లోకములెల్ల
హరినాభినే పౌడమి రదివో బ్రహ్మాదులు
హరినామము వేదాల కాదియు నంత్యము నాయ
హరిదాసులే వశిష్ఠాదు లిందరును.

||ఈత||

విష్ణుఁడే యమృత మిచ్చె
విష్ణుఁడే ధరణి మోఁచె విశ్వమంతాను
విష్ణుచక్రమున దైత్యవీరులెల్లా నడఁగిరి
విష్ణువుముఖమునందే విప్రులు జనించిరి.

||ఈత||

పరమపుశ్రీపతివే భారతరామాయణాలు
పరమాత్ముఁ డితఁడే పలుజీవులయందెల్లా
పరము చేచేతఁ జూపె పట్టి శ్రీవేంకటేశుఁడు
పరమానంద మొసఁగు భక్తులకు నితఁడు.

||ఈత||536

అవతారిక:

జగద్భర్త నారాయణుడు. మనకు భోజనమిచ్చి అది అరిగేశక్తినిచ్చి పుట్టినదాది తుది శ్వాసదాకా రక్షించేది పురుషోత్తముడే. ఆయన గురించి తెలియకపోవటం కన్న స్వామి ద్రోహం వుంటుందా. లౌకికంగా చూచినా మనకు వుద్యోగం ఇచ్చి, నెలనెలా జీతం ఇచ్చి పోషిస్తున్న మన యజమాని గురించి తెలుసుకోనివాడు ద్రోహియే కదా! అన్నమాచార్యులవారిలో కవి దీనిని నిరసిస్తూ ఏటినీరు తాగి కాలువనీళ్ళను పొగడటం అంటే ఇదే… అని దెప్పిపొడుస్తున్నారు. ప్రతి జీవిలోనూ అంతర్యామిగా వున్న ఈ శ్రీవేంకటేశుడే పరము చేచేత పట్టి జూపె అంటున్నారు.

భావ వివరణ:

ఓ భక్తులారా! ఈతని (ఈ నారాయణుని యెరుగకుంటే (తెలియకపోతే) ఇల (భూమిపై) ఇంతకంటే స్వామిద్రోహం మరియొకటుంటుందా? ఘాతల దెబ్బతిన్నవాడు దీనావస్థలో) నీటినీల్ళ తాగి ప్రాణం నిలబెట్టుకొని, కాలువలో నీళ్ళు బాగుంటాయి అని పొగడటంలాంటిదే… ఇది కూడా అవునా?

విశ్వంలోని పదునాలుగు భువనాలూ ఈ శ్రీహరిపాదం కిందనే వున్నాయి. | ఒక్క తొక్కుడుతో అన్నీ చితక్కొట్టగలడు. అంతెందుకు సృష్టికర్త బ్రహ్మ మొదలైన వారంతా ఆయన నాభి (బొడ్డు) లోంచి పుట్టినవారేకదా! అసలు జ్ఞానానికి మూలమైన వేదముపుట్టిందే శ్రీహరి నామములోనుంచి వేదాంతము కూడా ఆయనే కదా! వశిష్ఠుడు మొదలైన సప్తఋషలు యెవ్వరనుకున్నారు? వారంతా హరిదాసులే.

ఆయన మహిమనెంతని పొగడగలం చెప్పండి? దేవతలు అమరులవటానికి కారణమైన అమృతం తెప్పించింది ఆయనే కదా! ఆదివరాహమై ఈ భూమిని మోసినవాడు శ్రీహరే కదా! రోజుకి 24 గంటలు, | సంవత్సరానికి 365 రోజులు 6 గంటలు (దాదాపుగా) సమయంపట్టేట్లు ఈ | భూమి ఒక గొప్ప సమయపాలన గతి నిర్దేవంతో నడుస్తున్నదే అదెవరివల్ల జరుగుతున్నది? రాక్షసులనందరినీ సుదర్శన చక్రంతో అడ్డగించినదెవరు? నేటికీ వేదవిజ్ఞానం విస్తరింపచేస్తున్న విప్రులు జన్మించింది కూడా ఆయన ముఖంలోనుంచే కదా!

భారత రామాయణాది పురాణవాఙ్మయం పుట్టిందే శ్రీహరి కథామృమును విస్తరింపజేయుటకు కదా! సర్వ జీవులయందున్న పరమాత్ముడు అంతర్యామీ ఈ దేవదేవుడే కదా! నేడు శ్రీవేంకటేశుడై పరము (మోక్షమును) చేనేతపట్టి (అభయవరద హస్తాలతో పట్టి) చూపుతూ భక్తులకు పరమానందమునిస్తున్న ఏడుకొండల యేలికయై భక్తులని అనుగ్రహిస్తున్నది ఈతడే కదా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment