Pralapanavacanai : Phalamihakim In Telugu – ప్రలపనవచనై: ఫలమిహకిం

ఈ పోస్ట్ లో ప్రలపనవచనై: ఫలమిహకిం కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ప్రలపనవచనై: ఫలమిహకిం – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన : ప్రలపనవచనై: ఫలమిహకిం
సంఖ్య : 39
పుట:27
రాగం: శుద్ధ వసంతం రచ్చెతాళం

శుద్ధవసంతం-రచ్చెతాళం

89 ప్రలపనవచనైః ఫలమిహకిం
చల చల కుడ్యక్షాళనయా కిం

||పల్లవి||

ఇతర వధూ మోహితం త్వాం ప్రతి
హితవచనై రీహితు మిహ కిం
సతతం తవానుసరణమిదం మమ
గతజల సేతూకరణ విదానీం

||ప్రలప||

వికలవినయ దుర్విటం త్వాం ప్రతి
సుకుమారారస్తుతం కిం
ప్రకటబహల కోపనం మమ తే
సకల చర్విత చర్వణమేవ

||ప్రలప||

శిరసా నతసుస్థిరం త్వాం ప్రతి
విరసాలాపన విధినా కిం
తిరువేంకటగిరి దేవ త్వదీయ-
విరహవిలపనం వృథాచరణం

||ప్రలప||

అవతారిక:

అద్భుతమైన సంస్కృత కీర్తననావిష్కరిస్తున్నారు అన్నమాచార్యులవారు. కృష్ణుని మాయమాటలు నమ్మి మోసపోయాననుకొని చింతిస్తున్న నాయిక నిర్వేదంతో అంటున్న పలుకులివి. ఎందుకు ప్రేలాపనలవంటి మాటలు మాట్లాడతావు. దానివల్ల యేమిలాభం? పోపోవయ్యా! అని ఆవిడ విసుక్కొంటున్నది. నీకు నమస్కరించినందువల్ల ప్రయోజనమేమిటి అనేంత నిస్పృహకు లోనైంది ఆమె.

భావ వివరణ:

ప్రేలాపనలవంటి మాటల వలన ప్రయోజనమేమిటి? పోపోవయ్యా! | పో గోడను నీళ్ళతో కడిగినందువలన ప్రయోజనమేమిటి?

ఇతర వధూటీమణులయందు వ్యామోహము గలిగిన నీకు హితవు బోధించాలని చూడటం ఎంత అవివేకమైన పని? నిన్నే నమ్ముకొన్న నన్ను కల్లబొల్లి కబుర్లతో ప్రసన్నురాలను చేయాలని చూచెదవు, యెందుకు? | గతజల సేతుబంధనము వలన కలిగే ప్రయోజనమేమిటి?

నీవు కపటివి. కపట వినయములు. నీవు దుర్మతివైన విటుడవు. నీకు సున్నితమైన స్తుతులవలన ప్రయోజనమేమిటి? నాయందు గొప్ప | క్రోధమును ప్రకటిస్తున్నావు. ఇదంతా చర్వితచరణమే.

నీయందు స్థిరమైనట్టి నా నమస్కారములు, విరసాలాపనలు అవుతుంటే… యేమి ప్రయోజనము కలుగుతుంది? ఓ తిరువేంకటగిరి దేవా! నీయందు విరహవేదన నిష్ప్రయోజనమవుతున్నది ప్రభూ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment