ఈ పోస్ట్ లో అంజలిరంజలిరయం తే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
అంజలిరంజలిరయం తే – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 5
కీర్తన : అంజలిరంజలిరయం తే
సంఖ్య : 289
పుట 197
రాగం: శ్రీరాగం
శ్రీరాగం
87 అంజలిరంజలిరయం తే
కిం జనయసి మమ భేదం వచనై:
||పల్లవి||
మాం కిం భజసే మయా కింతే
త్వం కోవా మే తవ కా౭హం
కిం కార్యమితో గేహే మమ తే
శంకాం వినా కిం సమాగతోసి
||అంజలి||
నను వినయోక్తేర్న యోగ్యా హం
పున: పునస్త్వం పూజ్యోసి
దినదిన కలహవిధినా తే కిం
మనసిజజనక రమారమణ
||అంజలి||
దైవం బలవత్తరం భువనే
నైవ రోచతే నర్మ మయి
ఏవమేవ భవదిష్టం కురు కురు
శ్రీ వేంకటాద్రి శ్రీనివాస.
||అంజలి||
అవతారిక:
చక్కటి సంస్కృత కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. నాయిక శ్రీవేంకటేశ్వరునిపై అలిగింది. నీకు దండం పెడతాను నన్నెందుకు మాటలతో ఏడిపిస్తావు. అని రుసరుసలాడిందామె. నీవెవరివి? నేనెవరిని? పోపోవయ్యా! అని పోట్లాడింది. కాని ఆయన లేకుండా క్షణం |వుండలేదామె. చివరికి నీ ఇష్టం మహాప్రభో! అని లొంగిపోయింది.
భావ వివరణ:
నీకు ఈ నమస్కారములు, వందనములు. నాకు నీ మాటలతో యెందుకు దుఃఖమును కలిగిస్తున్నావు?
దేవా! నన్నెందుకు తలచెదవు? నాతో నీకేమిటి? నీవెవరవు? నీకు నేనేమవుతాను? నీవు నాకేమవుతావు? పనివున్నదయ్యా? నాపై నీకు శంకలేకుంటే ఇక్కడికెందుకు వచ్చావు?
ఓ మనసిజ జనకా! (మన్మధునికి తండ్రీ) నీ వినయపు మాటలకు నేను యోగ్యురాలనా? కానయ్యా! నీవు మరల మరల పూజింపదగిన వాడివైయున్నావు. దినదినమూ జరిగే ఈ కలహాలతో నీకేమి పనిలే? ఓ | రమారమణా! నేను దీనితో విసిగిపోయాను.
భువనములో దైవమే బలవత్తరమైనది. నాయందు నీవంచనలు నాకు రుచించవు. పోనీలే, నీకేది ఇష్టమో అదేచేయుము. ఓ వేంకటాద్రిపైనున్న శ్రీనివాసా! నేనేమనగలను?
మరిన్ని అన్నమయ్య కీర్తనలు
- తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
- అంజినీదేవి కొడుకు హనుమంతుడు
- అప్పడైన హరియెక్కె నదివో తేరు
- అడియా నడియనయ్య యఖిలలోకైకనాథ
- చేకొని కొలువరో శ్రీనరసింహము
- రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు
- ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
- జగములేలేవాడవు జనార్దనుడవు
- వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు
- కరేణ కిం మాం గృహీతుం తే
- చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ