Aranya Kanda Sarga 9 In Telugu – అరణ్యకాండ నవమః సర్గః

Aranya Kanda Sarga 9 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ నవమ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యంలో మరింత లోతుగా ప్రవేశిస్తారు. అక్కడ, రాక్షసులకు భయంకరంగా కనిపించే విరాఢుడిని ఎదుర్కొంటారు. విరాఢుడు సీతను అపహరించాలని ప్రయత్నిస్తాడు, కానీ రాముడు, లక్ష్మణుడు అతనితో తీవ్రంగా యుద్ధం చేసి, అతనిని సంహరిస్తారు.

సీతాధర్మావేదనమ్

సుతీక్ష్ణేనాభ్యనుజ్ఞాతం ప్రస్థితం రఘునందనమ్ |
హృద్యయా స్నిగ్ధయా వాచా భర్తారమిదమబ్రవీత్ ||

1

అయం ధర్మః సుసూక్ష్మేణ విధినా ప్రాప్యతే మహాన్ |
నివృత్తేన తు శక్యోఽయం వ్యసనాత్కామజాదిహ ||

2

త్రీణ్యేవ వ్యసనాన్యత్ర కామజాని భవంత్యుత |
మిథ్యా వాక్యం పరమకం తస్మాద్గురుతరావుభౌ ||

3

పరదారాభిగమనం వినా వైరం చ రౌద్రతా |
మిథ్యా వాక్యం న తే భూతం న భవిష్యతి రాఘవ ||

4

కుతోఽభిలాషణం స్త్రీణాం పరేషాం ధర్మనాశనమ్ |
తవ నాస్తి మనుష్యేంద్ర న చాభూత్తే కదాచన ||

5

మనస్యపి తథా రామ న చైతద్విద్యతే క్వచిత్ |
స్వదారనిరతస్త్వం చ నిత్యమేవ నృపాత్మజ ||

6

ధర్మిష్ఠః సత్యసంధశ్చ పితుర్నిర్దేశకారకః |
సత్యసంధ మహాభాగ శ్రీమల్లక్ష్మణపూర్వజ ||

7

త్వయి సత్యం చ ధర్మశ్చ త్వయి సర్వం ప్రతిష్ఠితమ్ |
తచ్చ సర్వం మహాబాహో శక్యం ధర్తుం జితేంద్రియైః ||

8

తవ వశ్యేంద్రియత్వం చ జానామి శుభదర్శన |
తృతీయం యదిదం రౌద్రం పరప్రాణాభిహింసనమ్ ||

9

నిర్వైరం క్రియతే మోహాత్తచ్చ తే సముపస్థితమ్ |
ప్రతిజ్ఞాతస్త్వయా వీర దండకారణ్యవాసినామ్ ||

10

ఋషీణాం రక్షణార్థాయ వధః సంయతి రక్షసామ్ |
ఏతన్నిమిత్తం చ వనం దండకా ఇతి విశ్రుతమ్ ||

11

ప్రస్థితస్త్వం సహ భ్రాత్రా ధృతబాణశరాసనః |
తతస్త్వాం ప్రస్థితం దృష్ట్వా మమ చింతాకులం మనః ||

12

త్వద్వృత్తం చింతయంత్యా వై భవేన్నిఃశ్రేయసం హితమ్ |
న హి మే రోచతే వీర గమనం దండకాన్ప్రతి ||

13

కారణం తత్ర వక్ష్యామి వదంత్యాః శ్రూయతాం మమ |
త్వం హి బాణధనుష్పాణిర్భ్రాత్రా సహ వనం గతః ||

14

దృష్ట్వా వనచరాన్సర్వాన్కచ్చిత్కుర్యాః శరవ్యయమ్ |
క్షత్రియాణాం చ హి ధనుర్హుతాశస్యేంధనాని చ ||

15

సమీపతః స్థితం తేజో బలముచ్ఛ్రయతే భృశమ్ |
పురా కిల మహాబాహో తపస్వీ సత్యవాక్ శుచిః ||

16

కస్మింశ్చిదభవత్పుణ్యే వనే రతమృగద్విజే |
తస్యైవ తపసో విఘ్నం కర్తుమింద్రః శచీపతిః ||

17

ఖడ్గపాణిరథాగచ్ఛదాశ్రమం భటరూపధృత్ |
తస్మింస్తదాశ్రమపదే నిశితః ఖడ్గ ఉత్తమః ||

18

స న్యాసవిధినా దత్తః పుణ్యే తపసి తిష్ఠతః |
స తచ్ఛస్త్రమనుప్రాప్య న్యాసరక్షణతత్పరః ||

19

వనే తం విచరత్యేవ రక్షన్ ప్రత్యయమాత్మనః |
యత్ర గచ్ఛత్యుపాదాతుం మూలాని చ ఫలాని చ ||

20

న వినా యాతి తం ఖడ్గం న్యాసరక్షణతత్పరః |
నిత్యం శస్త్రం పరివహన్ క్రమేణ స తపోధనః ||

21

చకార రౌద్రీం స్వాం బుద్ధిం త్యక్త్వా తపసి నిశ్చయమ్ |
తతః స రౌద్రేఽభిరతః ప్రమత్తోఽధర్మకర్శితః ||

22

తస్య శస్త్రస్య సంవాసాజ్జగామ నరకం మునిః |
ఏవమేతత్పురా వృత్తం శస్త్రసంయోగకారణమ్ ||

23

అగ్నిసంయోగవద్ధేతుః శస్త్రసంయోగ ఉచ్యతే |
స్నేహాచ్చ బహుమానాచ్చ స్మారయే త్వాం న శిక్షయే ||

24

న కథంచన సా కార్యా గృహీతధనుషా త్వయా |
బుద్ధిర్వైరం వినా హంతుం రాక్షసాన్దండకాశ్రితాన్ ||

25

అపరాధం వినా హంతుం లోకాన్వీర న కామయే |
క్షత్రియాణాం తు వీరాణాం వనేషు నిరతాత్మనామ్ ||

26

ధనుషా కార్యమేతావదార్తానామభిరక్షణమ్ |
క్వ చ శస్త్రం క్వ చ వనం క్వ చ క్షాత్రం తపః క్వ చ ||

27

వ్యావిద్ధమిదమస్మాభిర్దేశధర్మస్తు పూజ్యతామ్ |
తదార్య కలుషా బుద్ధిర్జాయతే శస్త్రసేవనాత్ ||

28

పునర్గత్వా త్వయోధ్యాయాం క్షత్రధర్మం చరిష్యసి |
అక్షయా తు భవేత్ప్రీతిః శ్వశ్రూశ్వశురయోర్మమ ||

29

యది రాజ్యం పరిత్యజ్య భవేస్త్వం నిరతో మునిః |
ధర్మాదర్థః ప్రభవతి ధర్మాత్ప్రభవతే సుఖమ్ ||

30

ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్ |
ఆత్మానం నియమైస్తైస్తైః కర్శయిత్వా ప్రయత్నతః ||

31

ప్రాప్యతే నిపుణైర్ధర్మో న సుఖాల్లభ్యతే సుఖమ్ |
నిత్యం శుచిమతిః సౌమ్య చర ధర్మం తపోవనే |
సర్వం హి విదితం తుభ్యం త్రైలోక్యమపి తత్త్వతః ||

32

స్త్రీచాపలాదేతదుదాహృతం మే
ధర్మం చ వక్తుం తవ కః సమర్థః |
విచార్య బుద్ధ్యా తు సహానుజేన
యద్రోచతే తత్కురు మా చిరేణ ||

33

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే నవమః సర్గః ||

Aranya Kanda Sarga 9 Meaning In Telugu PDF

రాముడు, లక్ష్మణుడు, సీత అరణ్యమార్గములో పోతూ ఉన్నారు. అప్పుడు సీత రాముని చూచి ఇలా పలికింది.

“నాధా! ధర్మము, ధర్మ సంపాదన చాలా నిశితమైనవి. కోరికలకు, వ్యసనములకు దూరంగా ఉన్నవారే ధర్మముగా జీవించగలరు. వ్యసనములకు మూలము కామము. కామము వలన ముఖ్యంగా మూడు వ్యసనములు కలుగుతాయి. అందులో మొదటిది అసత్యము పలకడం. రెండవది పరుల భార్యలను కోరడం. మూడవది ఎదుటి వారి మీద ఎలాంటి విరోధము లేకుండానే వారిని హింసించడం.

ఇంక నీ సంగతి తీసుకుంటే నీవు సత్యవాక్పరిపాలకుడవు. అసత్యము పలకడం అంటే ఎలాంటిదో నీకు తెలియదు. ఇంక నీకు పరస్త్రీలమీద వాంఛ మనసులో కానీ, వాక్కులో కానీ, కర్మలో గానీ లేదు. అది నాకు తెలుసు. నీవు తండ్రిమాటకు విలువ ఇచ్చి రాజ్యమును త్యజించి, అడవులకు వచ్చావు. పైగా నీవు జితేంద్రియుడవు. ఇంతకన్నా సుగుణములు ఇంకా ఏమి కావాలి.

ఇంక మూడవది ఎదుటి వారిమీద ఎలాంటి వైరభావము లేకపోయినా, వారిని వధించడం. ఈ వ్యసనము నీకు ఎందుకో వచ్చింది. కారణం తెలియదు. ఈ దండకారణ్యములో నివసించు రాక్షసులను చంపుతానని ఋషులకు మాట ఇచ్చావు. ఆ కార్యక్రమము మీద నీవు లక్ష్మణునితో కలిసి ఆయుధములు ధరించి బయలుదేరావు. ఇది చూచి నా మనసు చాలా వికలమయింది. దీని గురించి నేను అన్ని విధాలా ఆలోచించాను. నా మనసుకు సరిఅయిన సమాధానము దొరకలేదు.

నీవు ఈ విధంగా ధనుర్బాణములను, కత్తులను ధరించి దండకారణ్యములోనికి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే చేతిలో ధనుర్బాణములు ఉంటే దొరికిన మృగాన్ని చంపాలి అన్న ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినపుడు అమాయకమైన మృగాలను చంపకుండా వదులుతావా! చేతిలో ధనుస్సు, కత్తి ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా హింస చేయవలెనని బుద్ధిపుట్టడం క్షత్రియులకు సహజం. దీని గురించి నీకు ఒక కథ చెబుతాను.

ఒక వనములో ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సుకు విఘ్నం కలిగించాలని అనుకున్నాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఒక భటుని రూపంలో చేతిలో ఒక కత్తితో ఆ ఋషి దగ్గరకు వచ్చాడు. “ఓ మహాత్మా! నేను అత్యవసరమైన పని మీద వెళుతున్నాను. నేను వచ్చువరకు ఈ ఖడ్గమును తమరి దగ్గర ఉంచండి. నా పని అయిపోయిన తరువాత వచ్చి తీసుకుంటాను.” అని అన్నాడు. ఆ ఋషి సరే అన్నాడు. ఆ ఖడ్గమును తన ఆశ్రమములో ఒక మూల పెట్టించాడు. భటుని రూపంలో ఉన్న ఇంద్రుడు వెళ్లిపోయాడు.

తాను ఆశ్రమములో లేని సమయములో ఆ కత్తిని ఎవరైనా ఎత్తుకుపోతారని, ఆఋషి ఎప్పుడూ ఆ కత్తిని తనతోపాటు తీసుకొని వెళుతూ ఉండేవాడు. ఎల్లప్పుడూ కత్తి అతని వద్ద ఉండటంతో ఆ కత్తిని ఉపయోగించడం మొదలు పెట్టాడు. ఆ ఋషి బుద్ధి క్రూరంగా మారిపోయింది. వినోదం కొరకు ఏదో ఒక జంతువును చంపడం అలవాటు అయింది. క్రమంగా అతని బుద్ధి తపస్సు మీదినుండి వేటమీదికి మళ్లింది. తుదకు ఆ ఋషికి నరకం సంప్రాప్తించింది. ఇంద్రుడి కోరిక నెరవేరింది.

నాథా! సత్త్వగుణ సంపన్నుడు అయిన ఆ ఋషి కూడా ఎల్లప్పుడూ ఆయుధము తన వద్ద ఉండటం వల్ల, అతని మనసు క్రూరంగా మారిపోయింది. ఆయుధములకు ఆ శక్తి ఉంది. ఆయుధము, అగ్ని రెండూ ప్రమాదహేతువులు అని మీకు తెలియనిది కాదు. మీ దగ్గర నాకు ఉన్న చనువు వలన మీకు చెబుతున్నాను. అంతేగానీ ఈ విషయములు అన్నీ మీకు తెలియవు అని కాదు.

నాధా! ఈ అడవిలో ఉన్న రాక్షసులకు మీకూ ఎలాంటి వైరము లేదు. వారు మనకు ఎలాంటి అపకారమూ చేయలేదు. కేవలము మీ వద్ద ఆయుధములు ఉన్న కారణంగా వాళ్లను చంపాలి అని అనుకుంటున్నారు. ఆ ఆలోచన మంచిది కాదు అని నా అభిప్రాయము. వారు ఏ అపరాధమూ చేయకుండా వారిని శిక్షించడం లోకసమ్మతం కాదు. ప్రజలు దానిని హర్షించరు.

ప్రజారక్షణ కోసరం ఆయుధములను ధరించడం క్షత్రియధర్మము. దానిని నేను కాదనను. కాని మీరు ప్రస్తుతము ముని వృత్తిలో ఉన్నారు. మీరు క్షత్రియధర్మము పాటించడం అనుచితము అని నా అభిప్రాయము. అయినా అడవులు ఎక్కడ! ఆయుధములు ఎక్కడ! క్షత్రియధర్మమెక్కడ! తపోవృత్తి ఎక్కడ! ఇవి పరస్పరమూ విరుద్ధముగా ఉన్నాయి కదా! కాబట్టి మీరు దేశధర్మమును పాటించడం మంచిది. అంటే మీరు ప్రస్తుతము వనములో ముని వృత్తిలో ఉన్నారు కాబట్టి మునుల వలె ప్రవర్తించడం మంచిది. అంతేకానీ హింసకు పాల్పడకూడదు.

మీరు అయోధ్యకు వెళ్లిన తరువాత మీ ఇష్టం వచ్చినట్టు ఆయుధములు ధరించి క్షత్రియ ధర్మమును పాటించవచ్చును. నీ తల్లి తండ్రులు నిన్ను నార చీరలు ధరించి. జటలు కట్టుకొని వనవాసము చేయమని నిర్దేశించారు. వారి ఆజ్ఞప్రకారము ముని వృత్తిలో ఉంటే వారూ సంతోషిస్తారు. అదే ధర్మము. ధర్మాచరణమే మీ కర్తవ్యము. కాబట్టి నాధా! మీరు అడవులలో ఉన్నారు కాబట్టి మంచి బుద్ధితో సత్వగుణమును, తపోధర్మమును పాటించండి. క్షాత్రమును వదిలిపెట్టండి. అనవసరంగా నీకు ఏ మాత్రం హాని చేయని వారిని హింసించకండి.

ఏదో స్త్రీ చాపల్యంతో మాట్లాడాను. ఏమీ అనుకోకండి. ఎందుకంటే తమరికి తెలియని ధర్మము లేదు. నేను చెప్పానని కాకుండా ఈ విషయం లక్ష్మణునితో కూడా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి.” అని సీత మెత్త మెత్తగా తన అభిప్రాయాన్ని రామునికి తెలియజేసింది.

శ్రీమద్రామాయణము
అరణ్య కాండము తొమ్మిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ దశమః సర్గః (10) >>

Aranya Kanda Sarga 17 In Telugu – అరణ్యకాండ సప్తదశః సర్గః

Aranya Kanda Sarga 17 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” సప్తదశః సర్గలో, శూర్పణఖ, రామాయణంలోని సమస్య రాక్షసత్వం ఇక్కడ ప్రవేశిస్తుంది. ఆమె రాముడి కుటీరానికి చేరుకుని రాముడికి తన భార్యను అందజేస్తుంది. ఆమె రావణుడి సోదరి మరియు ఆమె భర్త విద్యుత్ జిహ్వాను రావణుడు ఒంటరిగా చంపాడు, అతని స్వంత సోదరిని వితంతువుగా మార్చాడు. పాత రాక్షసి అయిన ఆమె సీతను విడిచిపెట్టి రాముడు తనను వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది.

శూర్పణఖాభావావిష్కరణమ్

కృతాభిషేకో రామస్తు సీతా సౌమిత్రిరేవ చ |
తస్మాద్గోదావరీతీరాత్తతో జగ్ముః స్వమాశ్రమమ్ ||

1

ఆశ్రమం తముపాగమ్య రాఘవః సహలక్ష్మణః |
కృత్వా పౌర్వాహ్ణికం కర్మ పర్ణశాలాముపాగమత్ ||

2

ఉవాస సుఖితస్తత్ర పూజ్యమానో మహర్షిభిః |
లక్ష్మణేన సహ భ్రాత్రా చకార వివిధాః కథాః ||

3

స రామః పర్ణశాలాయామాసీనః సహ సీతయా |
విరరాజ మహాబాహుశ్చిత్రయా చంద్రమా ఇవ ||

4

తథాసీనస్య రామస్య కథాసంసక్తచేతసః |
తం దేశం రాక్షసీ కాచిదాజగామ యదృచ్ఛయా ||

5

సా తు శూర్పణఖా నామ దశగ్రీవస్య రక్షసః |
భగినీ రామమాసాద్య దదర్శ త్రిదశోపమమ్ ||

6

సింహోరస్కం మహాబాహుం పద్మపత్రనిభేక్షణమ్ |
ఆజానుబాహుం దీప్తాస్యమతీవ ప్రియదర్శనమ్ ||

7

గజవిక్రాంతగమనం జటామండలధారిణమ్ |
సుకుమారం మహాసత్త్వం పార్థివవ్యంజనాన్వితమ్ ||

8

రామమిందీవరశ్యామం కందర్పసదృశప్రభమ్ |
బభూవేంద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహితా ||

9

సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరీ |
విశాలాక్షం విరూపాక్షీ సుకేశం తామ్రమూర్ధజా ||

10

ప్రీతిరూపం విరూపా సా సుస్వరం భైరవస్వరా |
తరుణం దారుణా వృద్ధా దక్షిణం వామభాషిణీ ||

11

న్యాయవృత్తం సుదుర్వృత్తా ప్రియమప్రియదర్శనా |
శరీరజసమావిష్టా రాక్షసీ వాక్యమబ్రవీత్ ||

12

జటీ తాపసరూపేణ సభార్యః శరచాపధృత్ |
ఆగతస్త్వమిమం దేశం కథం రాక్షససేవితమ్ ||

13

కిమాగమనకృత్యం తే తత్త్వమాఖ్యాతుమర్హసి |
ఏవముక్తస్తు రాక్షస్యా శూర్పణఖ్యా పరంతపః ||

14

ఋజుబుద్ధితయా సర్వమాఖ్యాతుముపచక్రమే |
అనృతం న హి రామస్య కదాచిదపి సమ్మతమ్ ||

15

విశేషేణాశ్రమస్థస్య సమీపే స్త్రీజనస్య చ |
ఆసీద్దశరథో నామ రాజా త్రిదశవిక్రమః ||

16

తస్యాహమగ్రజః పుత్రో రామో నామ జనైః శ్రుతః |
భ్రాతాయం లక్ష్మణో నామ యవీయాన్ మామనువ్రతః ||

17

ఇయం భార్యా చ వైదేహీ మమ సీతేతి విశ్రుతా |
నియోగాత్తు నరేంద్రస్య పితుర్మాతుశ్చ యంత్రితః ||

18

ధర్మార్థం ధర్మకాంక్షీ చ వనం వస్తుమిహాగతః |
త్వాం తు వేదితుమిచ్ఛామి కథ్యతాం కాఽసి కస్య వా ||

19

న హి తావన్మనోజ్ఞాంగీ రాక్షసీ ప్రతిభాసి మే |
ఇహ వా కిం నిమిత్తం త్వమాగతా బ్రూహి తత్త్వతః ||

20

సాఽబ్రవీద్వచనం శ్రుత్వా రాక్షసీ మదనార్దితా |
శ్రూయతాం రామ వక్ష్యామి తత్త్వార్థం వచనం మమ ||

21

అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణీ |
అరణ్యం విచరామీదమేకా సర్వభయంకరా ||

22

రావణో నామ మే భ్రాతా బలీయాన్ రాక్షసేశ్వరః |
వీరో విశ్రవసః పుత్రో యది తే శ్రోత్రమాగతః ||

23

ప్రవృద్ధనిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబలః |
విభీషణస్తు ధర్మాత్మా న తు రాక్షసచేష్టితః ||

24

ప్రఖ్యాతవీర్యౌ చ రణే భ్రాతరౌ ఖరదూషణౌ |
తానహం సమతిక్రాంతా రామ త్వాపూర్వదర్శనాత్ ||

25

సముపేతాఽస్మి భావేన భర్తారం పురుషోత్తమమ్ |
అహం ప్రభావసంపన్నా స్వచ్ఛందబలగామినీ ||

26

చిరాయ భవ మే భర్తా సీతయా కిం కరిష్యసి |
వికృతా చ విరూపా చ న చేయం సదృశీ తవ ||

27

అహమేవానురూపా తే భార్యారూపేణ పశ్య మామ్ |
ఇమాం విరూపామసతీం కరాలాం నిర్ణతోదరీమ్ ||

28

అనేన తే సహ భ్రాత్రా భక్షయిష్యామి మానుషీమ్ |
తతః పర్వతశృంగాణి వనాని వివిధాని చ ||

29

పశ్యన్సహ మయా కాంత దండకాన్విచరిష్యసి |
ఇత్యేవముక్తః కాకుత్స్థః ప్రహస్య మదిరేక్షణామ్ ||

30

ఇదం వచనమారేభే వక్తుం వాక్యవిశారదః ||

31

Aranya Kanda Sarga 17 In Telugu Pdf Download

రాముడు ఆశ్రమానికి వచ్చిన తరువాత అగ్నిహోత్రము మొదలగు కార్యములు నిర్వర్తించాడు. సీతతో, లక్ష్మణునితోనూ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆశ్రమము బయట కూర్చుని ఉన్నాడు. ఇంతలో జటాయువు వారి వద్దకు వచ్చాడు.

“రామా! నేను ఇక్కడకు వచ్చి చాలాకాలము అయినది. నాకు నా బంధువులను, మిత్రులను చూడవలెనని కోరికగా ఉన్నది. నేను పోయి నా బంధుమిత్రులను చూచి వెంటనే వస్తాను. అనుజ్ఞ ఇవ్వండి.” అని అడిగాడు. రాముడు సంతోషంతో సమ్మతించాడు. జటాయువు వెళ్లిపోయాడు.

కొంత సేపు తరువాత ఒక రాక్షస స్త్రీ ఆ ప్రదేశమునకు వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ. రావణుని చెల్లెలు. ఆమె అక్కడకు వచ్చి రాముని చూచింది. బలిష్టమైన బాహువులతో, సింహము వక్షస్థలము వలె విశాలమైన వక్షస్థలముతో, తామర రేకుల వంటి కన్నులతో, ఆజానుబాహుడైన రాముని చూచింది. జగన్మోహనాకారుడైన రాముని చూచి శూర్పణఖ మోహపరవశురాలయింది. మన్మధుడు ఆమె మీద పుష్పబాణములు ప్రయోగించాడు.

రాముని మొహం చాలా అందంగా ఉంటే, శూర్పణఖ ముఖం వికృతంగా ఉంది. రాముని నడుము సన్నగా ఉంటే, ఆమెది బానపొట్ట. రాముని కళ్లు విశాలంగా ఉంటే, ఆమె కళ్లు వికృతంగా ఉన్నాయి. రాముని జుట్టు అందంగా ఉంటే ఆమె జుట్టు ఎర్రగా వికారంగా ఉంది. రామునిది మోహనాకారమైతే ఆమెది వికారరూపము.

రాముని కంఠస్వరము మధురంగా ఉంటే ఆమె కంఠధ్వని గార్ధభమును తలపిస్తూ ఉంది. రాముడు నవయౌవనుడు. ఆమె వయసుమళ్లిన స్త్రీ. రాముని మాటలు మృదువుగా ఉంటే ఆమె భాష గ్రామ్యంగా కఠోరంగా ఉంది. రాముని ప్రవర్తన ధర్మపరంగా ఉంటే ఆమెది అధర్మ ప్రవర్తన.

రాముని చూస్తే ఆనందం కలిగితే ఆమెను చూస్తే ఏహ్యభావము కలుగుతూఉంది. ఇలా హస్తిమశకాంతర వైవిధ్యము ఉన్న శూర్పణఖ రాముని చూచి మోహించింది.

తన సహజరూపంతో పోతే రాముడు తనను వరించడని, వెంటనే తన రూపంమార్చింది. నవయౌవన వతిగా తయారయింది. రాముని సమీపించింది.

“ఓ సుందరాకారా! నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఈమె నీ భార్య అనుకుంటాను. భార్యాసమేతంగా భయంకరమైన ఈ అడవిలో ఎందుకు ఉన్నావు. నీ వాలకం చూస్తుంటే నీవు గృహస్తులా లేవే. జటాజూటములు ధరించి ముని కుమారుని వలె ఉన్నావు. నీ చేతిలో ఉన్న ధనుర్బాణములను బట్టి నీవు క్షత్రియుడవు అని తెలుస్తూ ఉంది. ఇంతకూ నీవు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏ పనిమీద వచ్చావు? నిజం చెప్పు.” అని నిలదీసింది శూర్పణఖ.

అప్పుడు రాముడు ఆమెతో ఇలా అన్నాడు. “ఓ తరుణీ! నా పేరు రాముడు. నేను అయోధ్యాధీశుడు దశరథుని కుమారుడను. ఈమె నాభార్య సీత. అతను నా తమ్ముడు లక్ష్మణుడు. మీము మా తండ్రిగారి ఆజ్ఞమేరకు వనవాసము చేస్తున్నాము. ఇంతకూ నీవు ఎవరు? నీ నివాసము ఎక్కడ? నీ భర్తపేరు ఏమిటి?” అని అడిగాడు రాముడు. దానికి శూర్పణఖ ఇలా బదులు చెప్పింది.

“ఓరామా! నేను ఒక రాక్షస స్త్రీని. నా పేరు శూర్పణఖ. నేను రాక్షస స్త్రీని అయినా నేను కామరూపము ధరించు శక్తి కలదానను. ఈ అరణ్యమే నా నివాసము. విశ్రవసుని కుమారుడు రావణుడు నా అన్న. మహా పరాక్రమ వంతుడు. నీవు ఆయన గురించి వినేవుంటావు. ఆయన తమ్ముడు, మహాబలవంతుడైన కుంభకర్ణుడు.

ఎల్లప్పుడూ నిద్రాదేవిని సేవిస్తుంటాడు. రాక్షస వంశములో తప్పపుట్టిన వాడు విభీషణుడు. ఆయన కూడా నా సోదరుడే. ఇక్కడే జనస్థానములో నివాసము ఏర్పరచుకున్న ఖరుడు, దూషణుడు కూడా నా సోదరులే. నేనువారి వద్దనే ఉంటున్నాను.

తొలిసారిగా అతిలోకమన్మధాకారుడవైన నిన్ను చూచాను. నీ మోహంలో పడ్డాను. నిన్ను ప్రేమించాను. నా మనసులో నువ్వే నా భర్తవు అని అనుకొన్నాను. దానికి తిరుగులేదు. ఈమె నీ భార్య అంటున్నావు. నేను ఉన్నానుగా. ఇంకా ఈమెతో నీకు ఏం పని. నా అందంతో పోలిస్తే ఈసీత వికారంగా ఉంది కదూ! ఈమెను వదిలెయ్యి.

నువ్వు ఊ అంటే నేను ఈమెను నీ తమ్ముని విరుచుకొని తింటాను. తరువాత మనం ఇద్దరం ఈ అరణ్యములో, పర్వతశిఖరములలో ఆనందంగా విహరిద్దాము. నాతో వచ్చెయ్యి” అని పలికింది శూర్పణఖ.

(శూర్పణఖ మాటలు వింటుంటే మీకు ఏమనిపిస్తూ ఉంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్స్టెట్ శూర్పణఖతోనే మొదలయిందా అనిపించడం లేదూ!

ఇంకా చూడండి….ఈ కాలం కుర్రాళ్లు అనేమాట….. “నేను నిన్ను చూడగానే ఫిక్స్ అయ్యాను. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించాలి, నేను ఫిక్స్ అయ్యానుగా….. తప్పదు. లేకుంటే ఆసిడ్ పోస్తా, బ్లేడుతో గొంతుకోస్తా. నాకు దక్కనిది వేరే ఎవరికీ దక్కడానికి వీలులేదు. అడ్డం వచ్చిన వాళ్లని నరుకుతా” ఇవే కదా నేటి డైలాగులు.

ఈ తరహా ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి. ఇది శూర్పణఖతోనే మొదలయినట్టుంది. ఈ నాటిదాకా కొనసాగుతూ ఉంది. నాడు శూర్పణఖ కూడా తాను రాముడికి ఇష్టమా లేదా అని ఆలోచించలేదు. ఈ నాడు కూడా కుర్రాళ్లు తనంటే ఆ అమ్మాయికి ఇష్టమా లేదా అని ఆలోచించరు.

ఏదో ఒక లాగ లైన్ లో పెట్టడానికీ, బుట్టలో వేసుకోడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే ఉందిగా అంటారు. అదీకాకపోతే చంపడం, చావడం. దీనికి ప్రతీక శూర్పణఖ కామం. దీనిని లవ్ అనరు. కామం(లస్ట్) అంటారు. అది తెలుసుకోవాలి.)

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదిహేడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ అష్టాదశః సర్గః (18) >>

Ayodhya Kanda Sarga 92 In Telugu – అయోధ్యాకాండ ద్వినవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 92

రామాయణంలోని అయోధ్యాకాండ ద్వినవతితమ (92వ) సర్గలో, మంత్రుడు భరతుని వద్దకు చేరి, దశరథ మహారాజు మరణాన్ని, రాముని అరణ్యవాసాన్ని తెలిపాడు. భరతుడు, ఈ వార్త విని గుండె పగిలినట్టు బాధపడతాడు. ఆతరువాత భరతుడు, సతీమణి మాండవితో కలసి అయోధ్యకు ప్రయాణిస్తాడు. అక్కడ, రాజభవనం వదలి సుమంత్రుడు, వసిష్ఠుడు మరియు ఇతర మంత్రులు భరతుని స్వాగతం పలుకుతారు. భరతుడు, కైకేయిని చూడగానే, ఆమె కృత్యాన్ని ధిక్కరిస్తాడు. వసిష్ఠుడు, భరతుని రాముని పిలవడానికి, సింహాసనం పైకి తీసుకురావడానికి సూచిస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మబద్ధత, రామునిపై ప్రేమను, అయోధ్య ప్రజల దుఃఖాన్ని తెలుపుతుంది.

భరద్వాజామంత్రణమ్

తతస్తాం రజనీం వ్యుష్య భరతః సపరిచ్ఛదః |
కృతాతిథ్యో భరద్వాజం కామాదభిజగామ హ || ౧ ||

తమృషిః పురుషవ్యాఘ్రం ప్రాంజలిం ప్రేక్ష్య చాగతమ్ |
హుతాగ్నిహోత్రో భరతం భరద్వాజోఽభ్యభాషత || ౨ ||

కచ్చిదత్ర సుఖా రాత్రిస్తవాస్మద్విషయే గతా |
సమగ్రస్తే జనః కచ్చిదాతిథ్యే శంస మేఽనఘ || ౩ ||

తమువాచాంజలిం కృత్వా భరతోఽభిప్రణమ్య చ |
ఆశ్రమాదభినిష్క్రాంతమృషిముత్తమతేజసమ్ || ౪ ||

సుఖోషితోఽస్మి భగవన్ సమగ్రబలవాహనః |
తర్పితః సర్వకామైశ్చ సామాత్యో బలవత్త్వయా || ౫ ||

అపేతక్లమసంతాపాః సుభిక్షాః సుప్రతిశ్రయాః |
అపి ప్రేష్యానుపాదాయ సర్వే స్మ సుసుఖోషితాః || ౬ ||

ఆమంత్రయేఽహం భగవన్ కామం త్వామృషిసత్తమః |
సమీపం ప్రస్థితం భ్రాతుర్మైత్రేణేక్షస్వ చక్షుషా || ౭ ||

ఆశ్రమం తస్య ధర్మజ్ఞ ధార్మికస్య మహాత్మనః |
ఆచక్ష్వ కతమో మార్గః కియానితి చ శంస మే || ౮ ||

ఇతి పృష్టస్తు భరతం భ్రాతృదర్శనలాలసమ్ |
ప్రత్యువాచ మహాతేజాః భరద్వాజో మహాతపాః || ౯ ||

భరతార్ధతృతీయేషు యోజనేష్వజనే వనే |
చిత్రకూటో గిరిస్తత్ర రమ్యనిర్దరకాననః || ౧౦ ||

ఉత్తరం పార్శ్వమాసాద్య తస్య మందాకినీ నదీ |
పుషిపతద్రుమసంఛన్నా రమ్యపుష్పితకాననా || ౧౧ ||

అనంతరం తత్సరితశ్చిత్రకూటశ్చ పర్వతః |
తయోః పర్ణకుటీ తాత తత్ర తౌ వసతో ధ్రువమ్ || ౧౨ ||

దక్షిణేనైవ మార్గేణ సవ్యదక్షిణమేవ వా |
గజవాజిరథాకీర్ణాం వాహినీం వాహినీపతే || ౧౩ ||

వాహయస్వ మహాభాగ తతో ద్రక్ష్యసి రాఘవమ్ |
ప్రయాణమితి తచ్ఛ్రుత్వా రాజరాజస్య యోషితః || ౧౪ ||

హిత్వా యానాని యానార్హాః బ్రాహ్మణం పర్యవారయన్ |
వేపమానా కృశా దీనా సహ దేవ్యా సుమిత్రయా || ౧౫ ||

కౌసల్యా తత్ర జగ్రాహ కరాభ్యాం చరణౌ మునేః |
అసమృద్ధేన కామేన సర్వలోకస్య గర్హితా || ౧౬ ||

కైకేయీ తస్య జగ్రాహ చరణౌ సవ్యపత్రపా |
తం ప్రదక్షిణమాగమ్య భగవంతం మహామునిమ్ || ౧౭ ||

అదూరాద్భరతస్యైవ తస్థౌ దీనమనాస్తదా |
తతః పప్రచ్ఛ భరతం భరద్వాజో దృఢవ్రతః || ౧౮ ||

విశేషం జ్ఞాతుమిచ్ఛామి మాతౄణాం తవ రాఘవ |
ఏవముక్తస్తు భరతో భరద్వాజేన ధార్మికః || ౧౯ ||

ఉవాచ ప్రాంజలిర్భూత్వా వాక్యం వచనకోవిదః |
యామిమాం భగవన్ దీనాం శోకానశనకర్శితామ్ || ౨౦ ||

పితుర్హి మహిషీం దేవీం దేవతామివ పశ్యసి |
ఏషా తం పురుషవ్యాఘ్రం సింహవిక్రాంతగామినమ్ || ౨౧ ||

కౌసల్యా సుషువే రామం ధాతారమదితిర్యథా |
అస్యావామభుజం శ్లిష్టా యైషా తిష్ఠతి దుర్మనాః || ౨౨ ||

కర్ణికారస్య శాఖేవ శీర్ణపుష్పా వనాంతరే |
ఏతస్యాస్తు సుతౌ దేవ్యాః కుమారౌ దేవవర్ణినౌ || ౨౩ ||

ఉభౌ లక్ష్మణశత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ |
యస్యాః కృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితో గతౌ || ౨౪ ||

రాజపుత్రవిహీనశ్చ స్వర్గం దశరథో గతః |
క్రోధనామకృతప్రజ్ఞాం దృప్తాం సుభగమానినీమ్ || ౨౫ ||

ఐశ్వర్యకామాం కైకేయీమనార్యామార్యరూపిణీమ్ |
మమైతాం మాతరం విద్ధి నృశంసాం పాపనిశ్చయామ్ || ౨౬ ||

యతోమూలం హి పశ్యామి వ్యసనం మహదాత్మనః |
ఇత్యుక్త్వా నరశార్దూలో బాష్పగద్గదయా గిరా || ౨౭ ||

స నిశశ్వాస తామ్రాక్షో నాగః క్రుద్ధ ఇవ శ్వసన్ |
భరద్వాజో మహర్షిస్తం బ్రువంతం భరతం తథా || ౨౮ ||

ప్రత్యువాచ మహాబుద్ధిరిదం వచనమర్థవత్ |
న దోషేణావగంతవ్యా కైకేయీ భరత త్వయా || ౨౯ ||

రామప్రవ్రాజనం హ్యేతత్ సుఖోదర్కం భవిష్యతి |
దేవానాం దానవానాం చ ఋషీణాం భావితాత్మనామ్ || ౩౦ ||

హితమేవ భవిష్యద్ధి రామప్రవ్రాజనాదిహ |
అభివాద్య తు సంసిద్ధః కృత్వా చైనం ప్రదక్షిణమ్ || ౩౧ ||

ఆమంత్ర్య భరతః సైన్యం యుజ్యతామిత్యచోదయత్ |
తతో వాజిరథాన్యుక్త్వా దివ్యాన్హేమపరిష్కృతాన్ || ౩౨ ||

అధ్యారోహత్ప్రయాణార్థీ బహూన్బహువిధో జనః |
గజకన్యా గజాశ్చైవ హేమకక్ష్యాః పతాకినః || ౩౩ ||

జీమూతా ఇవ ఘర్మాంతే సఘోషాః సంప్రతస్థిరే |
వివిధాన్యపి యానాని మహాంతి చ లఘూని చ || ౩౪ ||

ప్రయయుః సుమహార్హాణి పాదైరేవ పదాతయః |
అథ యానప్రవేకైస్తు కౌసల్యాప్రముఖాః స్త్రియః || ౩౫ ||

రామదర్శనకాంక్షిణ్యః ప్రయయుర్ముదితాస్తదా |
చంద్రార్కతరుణాభాసాం నియుక్తాం శిబికాం శుభామ్ || ౩౬ ||

ఆస్థాయ ప్రయయౌ శ్రీమాన్ భరతః సపరిచ్ఛదః |
సా ప్రయాతా మహాసేనా గజవాజిరథాకులా || ౩౭ ||

దక్షిణాం దిశమావృత్య మహామేఘ ఇవోత్థితః |
వనాని తు వ్యతిక్రమ్య జుష్టాని మృగపక్షిభిః |
గంగాయాః పరవేలాయాం గిరిష్వపి నదీషు చ || ౩౮ ||

సా సంప్రహృష్టద్విజవాజియోధా
విత్రాసయంతీ మృగపక్షిసంఘాన్ |
మహద్వనం తత్ప్రతిగాహమానా
రరాజ సేనా భరతస్య తత్ర || ౩౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వినవతితమః సర్గః || ౯౨ ||

Ayodhya Kanda Sarga 92 Meaning In Telugu

మరునాడు తెల్లవారింది. భరతుడు భరద్వాజుని వద్దకు పోయి రాముని వద్దకు పోవుటకు ఆయన అనుమతి కోరాడు. అప్పుడే అగ్నికార్యము ముగించుకొని కూర్చుని ఉన్న భరద్వాజుని ఎదుట చేతులు జోడించి నిలబడ్డాడు భరతుడు.

“ఓ భరతా! నీవు నీ పరివారమూ రాత్రి సుఖంగా గడిపారా! మీకు మా ఆతిథ్యము సంతోషాన్ని కలిగించిందా! మీరు మా ఆతిథ్యముతో తృప్తి చెందారా!” అని అడిగాడు భరద్వాజుడు.

“మహర్షీ! తమరు మాకు ఇచ్చిన ఆతిథ్యము మాకు మా పరివారమునకు ఎంతో సంతోషము కలిగించింది. మా వారందరూ
హాయిగా భుజించి నిద్రించారు. నేను నా రాముని వద్దకు పోవడానికి తమరి అనుమతి కోరుతున్నాను. రాముడు ఎక్కడ ఆశ్రమము నిర్మించుకున్నాడో, అది ఇక్కడికి ఎంత దూరం ఉన్నదో, అక్కడకు పోవడానికి మార్గము ఏమిటో తెలియజేయవలసినదిగా కోరుతున్నాను.” అని అడిగాడు భరతుడు.

“ఓ భరతా! ఇక్కడికి మూడున్నర క్రోసుల దూరములో చిత్రకూటము అనే పర్వతము ఉంది. అక్కడే మందాకినీ నది ప్రహిస్తూ ఉంది. అక్కడ ఒక నిర్జన ప్రదేశములో రాముడు పర్ణశాలను నిర్మించుకొని నివసిస్తున్నాడు. నీవు ఇక్కడినుండి నీ సేనలతో, పరివారముతో, దక్షిణముగా గానీ, నైఋతి దిశగా గానీ ప్రయాణం చేస్తే రాముని పర్ణశాలకు చేరుకుంటావు.” అని చెప్పాడు భరద్వాజుడు.

ఇంతలో దశరథుని భార్యలు అక్కడకు చేరుకున్నారు. అందరూ భరద్వాజుని కాళ్లకు నమస్కరించారు. “భరతా!నీ తల్లులను నాకు పరిచయం చెయ్యి” అని అడిగాడు భరద్వాజుడు.

“ఓ మహర్షీ! దీనంగా ఉండి ఉపవాసములతో శరీరం శుష్కింప చేసుకున్న ఈమె దశరథమహారాజు పట్టమహిషి కౌసల్యాదేవి. రాముని కన్న పుణ్యమూర్తి. ఆమెకు ఎడమ పక్కగా నిలబడి ఉన్న ఆమె లక్ష్మణ, శత్రుఘ్నుల తల్లి సుమిత్ర. వారి పక్కనే తలవంచుకొని ఉన్న ఆమె నా తల్లి కైకేయి. కోపస్వభావురాలు. ఏ మాత్రమూ వివేచన లేనిది. గర్విష్ఠి. అందము, ఐశ్యర్యము, అధికారమునకే ప్రాధాన్యం ఇస్తూ వాటి కోసరం ఏమి చెయ్యడానికైనా వెనుకాడని వ్యక్తి. ఈమె కారణంగానే నా అన్న రాముడు అడవుల పాలయ్యాడు. నా తండ్రి అకాలమృత్యువు వాత పడ్డాడు. నేను ఈనాడు పడుతున్న ఇన్ని బాధలకు ఈమెయే మూలకారణము.” అని అన్నాడు భరతుడు.

భరతుని మాటలు సావధానముగా విన్న భరద్వాజుడు ఇలాఅన్నాడు. “ఓ భరతా! అలా మాట్లాడకూడదు. ఇందులో నీ తల్లి దోషము ఏమాత్రమూ లేదు. రాముని అరణ్యవాసము భవిష్యత్తులో ఎన్నో శుభములకు సూచన మాత్రమే. నీ కైక కేవలము నిమిత్త మాత్రురాలు. రాముడు అరణ్యములకు రావడం వలన ఇక్కడ ఉన్న మునులకు, ఋషులకు, దేవతలకు హితము చేకూరుతుంది.’ అని పలికాడు భరద్వాజుడు.

తరువాత భరతుడు ఆయనకు నమస్కరించి ప్రయాణము నకు సిద్ధం కమ్మని తన సైన్యమునకు ఆదేశాలు ఇచ్చాడు. అందరూ తమ తమ రథములను ఎక్కారు. సైన్యం కదిలింది. వారు దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగించారు. కొండలు గుట్టలుదాటిప్రయాణము చేస్తున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రినవతితమః సర్గః (93) >>

Ayodhya Kanda Sarga 91 In Telugu – అయోధ్యాకాండ ఏకనవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 91

అయోధ్యాకాండం రామాయణంలోని కీలకమైన భాగం. దీని 79వ సర్గలో రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యానికి వెళ్ళారు. 90వ సర్గలో ఋషులు రాముని సత్కరించారు. 100వ సర్గలో, దశరథ మహారాజు రాముని విడిచి, ఆయన కోసం విరహంతో మరణిస్తారు. ఈ సర్గలో కౌసల్య, సుమిత్ర, కైకేయిలు దుఃఖంలో కూరుకుపోతారు. దశరథుడి అంత్యక్రియలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంలో, భరతుడు, శత్రుఘ్నుడు రావడంతో అశ్వమేధ యాగం జరుగుతుంది. భరతుడు రాముని తిరిగి పిలవడానికి చిత్తం చేస్తాడు. ఈ సర్గ రామాయణ కథనంలో భావోద్వేగభరితమైన ఘట్టంగా నిలుస్తుంది, రాముని, సీత, లక్ష్మణుల పరితాపం, అయోధ్య ప్రజల దుఃఖాన్ని వివరిస్తుంది.

భరద్వాజాతిథ్యమ్

కృతబుద్ధిం నివాసాయ తత్రైవ స మునిస్తదా |
భరతం కైకయీపుత్రమాతిథ్యేన న్యమంత్రయత్ || ౧ ||

అబ్రవీద్భరతస్త్వేనం నన్విదం భవతా కృతమ్ |
పాద్యమర్ఘ్యం తథాఽఽతిథ్యం వనే యదుపపద్యతే || ౨ ||

అథోవాచ భరద్వాజో భరతం ప్రహసన్నివ |
జానే త్వాం ప్రీతిసంయుక్తం తుష్యేస్త్వం యేన కేనచిత్ || ౩ ||

సేనాయాస్తు తవైతస్యాః కర్తుమిచ్ఛామి భోజనమ్ |
మమ ప్రీతిర్యథారూపా త్వమర్హో మనుజాధిప || ౪ ||

కిమర్థం చాపి నిక్షిప్య దూరే బలమిహాగతః |
కస్మాన్నేహోపయాతోఽసి సబలః పురుషర్షభ || ౫ ||

భరతః ప్రత్యువాచేదం ప్రాంజలిస్తం తపోధనమ్ |
ససైన్యో నోపయాతోఽస్మి భగవన్ భగవద్భయాత్ || ౬ ||

రాజ్ఞా చ భగవన్నిత్యం రాజపుత్రేణ వా సదా |
యత్నతః పరిహర్తవ్యా విషయేషు తపస్వినః || ౭ ||

వాజిముఖ్యా మనుష్యాశ్చ మత్తాశ్చ వరవారణాః |
ప్రచ్ఛాద్య భగవన్భూమిం మహతీమనుయాంతి మామ్ || ౮ ||

తే వృక్షానుదకం భూమిమాశ్రమేషూటజాంస్తథా |
న హింస్యురితి తేనాహమేకైవ సమాగతః || ౯ ||

ఆనీయతామితః సేనేత్యాజ్ఞప్తః పరమర్షిణా |
తతస్తు చక్రే భరతః సేనాయాః సముపాగమమ్ || ౧౦ ||

అగ్నిశాలాం ప్రవిశ్యాథ పీత్వాఽపః పరిమృజ్య చ |
ఆతిథ్యస్య క్రియాహేతోర్విశ్వకర్మాణమాహ్వయత్ || ౧౧ ||

ఆహ్వయే విశ్వకర్మాణమహం త్వష్టారమేవ చ |
ఆతిథ్యం కర్తుమిచ్ఛామి తత్ర మే సంవిధీయతామ్ || ౧౨ ||

ఆహ్వయే లోకపాలాంస్త్రీన్ దేవాన్ శక్రముఖాంస్తథా |
ఆతిథ్యం కర్తుమిచ్ఛామి తత్ర మే సంవిధీయతామ్ || ౧౩ ||

ప్రాక్స్రోతసశ్చ యా నద్యః ప్రత్యక్స్రోతసైవ చ |
పృథివ్యామంతరిక్షే చ సమాయాంత్వద్య సర్వశః || ౧౪ ||

అన్యాః స్రవంతు మైరేయం సురామన్యాః సునిష్ఠితామ్ |
అపరాశ్చోదకం శీతమిక్షుకాండరసోపమమ్ || ౧౫ ||

ఆహ్వయే దేవగంధర్వాన్ విశ్వావసుహహాహుహూన్ |
తథైవాప్సరసో దేవీర్గంధర్వ్వీశ్చాపి సర్వశః || ౧౬ ||

ఘృతాచీమథ విశ్వాచీం మిశ్రకేశీమలంబుసామ్ |
నాగదంతాం చ హేమాం చ హిమామద్రికృతస్థలామ్ || ౧౭ ||

శక్రం యాశ్చోపతిష్ఠంతి బ్రహ్మాణం యాశ్చ యోషితః |
సర్వాస్తుంబురుణా సార్థమాహ్వయే సపరిచ్ఛదాః || ౧౮ ||

వనం కురుషు యద్దివ్యం వాసోభూషణపత్త్రవత్ |
దివ్యనారీఫలం శశ్వత్తత్కౌబేరమిహైతు చ || ౧౯ ||

ఇహ మే భగవాన్ సోమో విధత్తామన్నముత్తమమ్ |
భక్ష్యం భోజ్యం చ చోష్యం చ లేహ్యం చ వివిధం బహు || ౨౦ ||

విచిత్రాణి చ మాల్యాని పాదపప్రచ్యుతాని చ |
సురాదీని చ పేయాని మాంసాని వివిధాని చ || ౨౧ ||

ఏవం సమాధినా యుక్తస్తేజసాఽప్రతిమేన చ |
శీక్షాస్వరసమాయుక్తం తపసా చాబ్రవీన్మునిః || ౨౨ ||

మనసా ధ్యాయతస్తస్య ప్రాఙ్ముఖస్య కృతాంజలేః |
ఆజగ్ముస్తాని సర్వాణి దైవతాని పృథక్పృథక్ || ౨౩ ||

మలయం దర్దురం చైవ తతః స్వేదనుదోఽనిలః |
ఉపస్పృశ్య వవౌ యుక్త్యా సుప్రియాత్మా సుఖః శివః || ౨౪ ||

తతోభ్యవర్తంత ఘనాః దివ్యాః కుసుమవృష్టయః | [వర్షంత]
దివ్యదుందుభిఘోషశ్చ దిక్షు సర్వాసు శుశ్రువే || ౨౫ ||

ప్రవవుశ్చోత్తమా వాతాః ననృతుశ్చాప్సరోగణాః |
ప్రజగుర్దేవగంధర్వాః వీణాః ప్రముముచుస్స్వరాన్ || ౨౬ ||

స శబ్దో ద్యాం చ భూమిం చ ప్రాణినాం శ్రవణాని చ |
వివేశోచ్చారితః శ్లక్ష్ణః సమో లయగుణాన్వితః || ౨౭ ||

తస్మిన్నుపరతే శబ్దే దివ్యే శ్రోతృసుఖే నృణామ్ |
దదర్శ భారతం సైన్యం విధానం విశ్వకర్మణః || ౨౮ ||

బభూవ హి సమా భూమిః సమంతాత్పంచయోజనా |
శాద్వలైర్బహుభిశ్ఛన్నా నీలవైడూర్యసన్నిభైః || ౨౯ ||

తస్మిన్బిల్వాః కపిత్థాశ్చ పనసా బీజపూరకాః |
ఆమలక్యో బభూవుశ్చ చూతాశ్చ ఫలభూషణాః || ౩౦ ||

ఉత్తరేభ్యః కురుభ్యశ్చ వనం దివ్యోపభోగవత్ |
ఆజగామ నదీ దివ్యా తీరజైర్బహుభిర్వృతా || ౩౧ ||

చతుఃశాలాని శుభ్రాణి శాలాశ్చ గజవాజినామ్ |
హర్మ్యప్రాసాదసంబాధాస్తోరణాని శుభాని చ || ౩౨ ||

సితమేఘనిభం చాపి రాజవేశ్మసు తోరణమ్ |
దివ్యమాల్యకృతాకారం దివ్యగంధసముక్షితమ్ || ౩౩ ||

చతురశ్రమసంబాధం శయనాసనయానవత్ |
దివ్యైః సర్వరసైర్యుక్తం దివ్యభోజనవస్త్రవత్ || ౩౪ ||

ఉపకల్పితసర్వాన్నం ధౌతనిర్మలభాజనమ్ |
క్లృప్తసర్వాసనం శ్రీమత్ స్వాస్తీర్ణశయనోత్తమమ్ || ౩౫ ||

ప్రవివేశ మహాబాహురనుజ్ఞాతో మహర్షిణా |
వేశ్మ తద్రత్నసంపూర్ణం భరతః కేకయీసుతః || ౩౬ ||

అనుజగ్ముశ్చ తం సర్వే మంత్రిణః సపురోహితాః |
బభూవుశ్చ ముదా యుక్తాః దృష్ట్వా తం వేశ్మసంవిధిమ్ || ౩౭ ||

తత్ర రాజాసనం దివ్యం వ్యజనం ఛత్రమేవ చ |
భరతో మంత్రిభిః సార్ధమభ్యవర్తత రాజవత్ || ౩౮ ||

ఆసనం పూజయామాస రామాయాభిప్రణమ్య చ |
వాలవ్యజనమాదాయ న్యషీదత్సచివాసనే || ౩౯ ||

ఆనుపూర్వ్యానిషేదుశ్చ సర్వే మంత్రిపురోహితాః |
తతః సేనాపతిః పశ్చాత్ ప్రశాస్తాచ నిషేదతుః || ౪౦ ||

తతస్తత్ర ముహూర్తేన నద్యః పాయసకర్దమాః |
ఉపాతిష్ఠంత భరతం భరద్వాజస్య శాసనాత్ || ౪౧ ||

తాసాముభయతః కూలం పాండుమృత్తికలేపనాః |
రమ్యాశ్చావసథా దివ్యాః బ్రహ్మణస్తు ప్రసాదజాః || ౪౨ ||

తేనైవ చ ముహూర్తేన దివ్యాభరణభూషితాః |
ఆగుర్వింశతిసాహస్రాః బ్రహ్మణా ప్రహితాః స్త్రియః || ౪౩ ||

సువర్ణమణిముక్తేన ప్రవాలేన చ శోభితాః |
ఆగుర్వింశతిసాహస్రాః కుబేరప్రహితాః స్త్రియః || ౪౪ ||

యాభిర్గృహీతపురుషః సోన్మాద ఇవ లక్ష్యతే |
ఆగుర్వింశతిసాహస్రా నందనాదప్సరోగణాః || ౪౫ ||

నారదస్తుంబురుర్గోపః ప్రవరాః సూర్యవర్చసః |
ఏతే గంధర్వరాజానో భరతస్యాగ్రతో జగుః || ౪౬ ||

అలంబుసా మిశ్రకేశీ పుండరీకాఽథ వామనా |
ఉపానృత్యంస్తు భరతం భరద్వాజస్య శాసనాత్ || ౪౭ ||

యాని మాల్యాని దేవేషు యాని చైత్రరథే వనే |
ప్రయాగే తాన్యదృశ్యంత భరద్వాజస్య తేజసా || ౪౮ ||

బిల్వా మార్దంగికా ఆసన్ శమ్యాగ్రాహా విభీతకాః |
అశ్వత్థానర్తకాశ్చాసన్ భరద్వాజస్య శాసనాత్ || ౪౯ ||

తతః సరలతాలాశ్చ తిలకా నక్తమాలకాః |
ప్రహృష్టాస్తత్ర సంపేతుః కుబ్జా భూత్వాఽథ వామనాః || ౫౦ ||

శింశుపామలకీజంబ్వో యాశ్చాన్యాః కాననేషు తాః |
మాలతీ మల్లికా జాతిర్యాశ్చాన్యాః కాననే లతాః || ౫౧ ||

ప్రమదావిగ్రహం కృత్వా భరద్వాజాశ్రమేఽవదన్ |
సురాః సురాపాః పిబత పాయసం చ బుభుక్షితాః || ౫౨ ||

మాంసాని చ సుమేధ్యాని భక్ష్యంతాం యావదిచ్ఛథ |
ఉచ్ఛాద్య స్నాపయంతి స్మ నదీతీరేషు వల్గుషు || ౫౩ ||

అప్యేకమేకం పురుషం ప్రమదాః సప్తచాష్ట చ |
సంవాహంత్యః సమాపేతుర్నార్యో రుచిరలోచనాః || ౫౪ ||

పరిమృజ్య తథాఽన్యోన్యం పాయయంతి వరాంగనాః |
హయాన్ గజాన్ ఖరానుష్ట్రాంస్తథైవ సురభేః సుతాన్ || ౫౫ ||

అభోజయన్వాహనపాస్తేషాం భోజ్యం యథావిధి |
ఇక్షూంశ్చ మధులాజాంశ్చ భోజయంతి స్మ వాహనాన్ || ౫౬ ||

ఇక్ష్వాకువరయోధానాం చోదయంతో మహాబలాః |
నాశ్వబంధోఽశ్వమాజానాన్న గజం కుంజరగ్రహః || ౫౭ ||

మత్తప్రమత్తముదితా చమూః సా తత్ర సంబభౌ |
తర్పితాః సర్వకామైస్తే రక్తచందనరూషితాః || ౫౮ ||

అప్సరోగణసంయుక్తాః సైన్యా వాచముదైరయన్ |
నైవాయోధ్యాం గమిష్యామో నగమిష్యామ దండకాన్ || ౫౯ ||

కుశలం భరతస్యాస్తు రామస్యాస్తు తథా సుఖమ్ |
ఇతి పాదాతయోధాశ్చ హస్త్యశ్వారోహబంధకాః || ౬౦ ||

అనాథాస్తం విధిం లబ్ధ్వా వాచమేతాముదైరయన్ |
సంప్రహృష్టా వినేదుస్తే నరాస్తత్ర సహస్రశః || ౬౧ ||

భరతస్యానుయాతారః స్వర్గోఽయమితి చాబ్రువన్ |
నృత్యంతి స్మ హసంతి స్మ గాయంతి స్మ చ సైనికాః || ౬౨ ||

సమంతాత్పరిధావంతి మాల్యోపేతాః సహస్రశః |
తతో భుక్తవతాం తేషాం తదన్నమమృతోపమమ్ || ౬౩ ||

దివ్యానుద్వీక్ష్య భక్ష్యాంస్తానభవద్భక్షణే మతిః |
ప్రేష్యాశ్చేట్యశ్చ వధ్వశ్చ బలస్థాశ్చ సహస్రశః || ౬౪ ||

బభూవుస్తే భృశం దృప్తాః సర్వే చాహతవాససః |
కుంజరాశ్చ ఖరోష్ట్రాశ్చ గోశ్వాశ్చ మృగపక్షిణః || ౬౫ ||

బభూవుః సుభృతాస్తత్ర నాన్యో హ్యన్యమకల్పయత్ |
నాశుక్లవాసాస్తత్రాసీత్ క్షుధితో మలినోఽపి వా || ౬౬ ||

రజసా ధ్వస్తకేశో వా నరః కశ్చిదదృశ్యత |
ఆజైశ్చాపి చ వారాహైర్నిష్ఠానవరసంచయైః || ౬౭ ||

ఫలనిర్యూహసంసిద్ధైః సూపైర్గంధరసాన్వితైః |
పుష్పధ్వజవతీః పూర్ణాః శుక్లస్యాన్నస్య చాభితః || ౬౮ ||

దదృశుర్విస్మితాస్తత్ర నరా లౌహీః సహస్రశః |
బభూవుర్వనపార్శ్వేషు కూపాః పాయసకర్దమాః || ౬౯ ||

తాశ్చకామదుఘా గావో ద్రుమాశ్చాసన్మధుస్రుతః | [మధుశ్చ్యుతః]
వాప్యో మైరేయపూర్ణాశ్చ మృష్టమాంసచయైర్వృతాః || ౭౦ ||

ప్రతప్తపిఠరైశ్చాపి మార్గమాయూరకౌక్కుటైః |
పాత్రీణాం చ సహస్రాణి స్థాలీనాం నియుతాని చ || ౭౧ ||

న్యర్బుదాని చ పాత్రాణి శాతకుంభమయాని చ |
స్థాల్యః కుంభ్యః కరంభ్యశ్చ దధిపూర్ణాః సుసంస్కృతాః || ౭౨ ||

యౌవనస్థస్య గౌరస్య కపిత్థస్య సుగంధినః |
హ్రదాః పూర్ణా రసాలస్య దధ్నః శ్వేతస్య చాపరే || ౭౩ ||

బభూవుః పాయసస్యాన్యే శర్కరాయాశ్చ సంచయాః |
కల్కాంశ్చూర్ణకషాయాంశ్చ స్నానాని వివిధాని చ || ౭౪ ||

దదృశుర్భాజనస్థాని తీర్థేషు సరితాం నరాః |
శుక్లానంశుమతశ్చాపి దంతధావనసంచయాన్ || ౭౫ ||

శుక్లాంశ్చందనకల్కాంశ్చ సముద్గేష్వవతిష్ఠతః |
దర్పణాన్ పరిమృష్టాంశ్చ వాససాం చాపి సంచయాన్ || ౭౬ ||

పాదుకోపానహాశ్చైవ యుగ్మాని చ సహస్రశః |
ఆంజనీః కంకతాన్కూర్చాన్ శస్త్రాణి చ ధనూంషి చ || ౭౭ ||

మర్మత్రాణాని చిత్రాణి శయనాన్యాసనాని చ |
ప్రతిపానహ్రదాన్ పూర్ణాన్ ఖరోష్ట్రగజవాజినామ్ || ౭౮ ||

అవగాహ్య సుతీర్థాంశ్చ హ్రదాన్ సోత్పలపుష్కరాన్ |
ఆకాశవర్ణప్రతిమాన్ స్వచ్ఛతోయాన్సుఖప్లవాన్ || ౭౯ ||

నీలవైడూర్య్యవర్ణాంశ్చ మృదూన్యవససంచయాన్ |
నిర్వాపార్థాన్ పశూనాం తే దదృశుస్తత్ర సర్వశః || ౮౦ ||

వ్యస్మయంత మనుష్యాస్తే స్వప్నకల్పం తదద్భుతమ్ |
దృష్ట్వాఽఽతిథ్యం కృతం తాదృక్ భరతస్య మహర్షిణా || ౮౧ ||

ఇత్యేవం రమమాణానాం దేవానామివ నందనే |
భరద్వాజాశ్రమే రమ్యే సా రాత్రిర్వ్యత్యవర్తత || ౮౨ ||

ప్రతిజగ్ముశ్చ తా నద్యో గంధర్వాశ్చ యథాగతమ్ |
భరద్వాజమనుజ్ఞాప్య తాశ్చ సర్వా వరాంగనాః || ౮౩ ||

తథైవ మత్తా మదిరోత్కటాః
నరాస్తథైవ దివ్యాగురుచందనోక్షితాః |
తథైవ దివ్యా వివిధాః స్రగుత్తమాః
పృథక్ప్రకీర్ణా మనుజైః ప్రమర్దితాః || ౮౪ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకనవతితమః సర్గః || ౯౧ ||

Ayodhya Kanda Sarga 91 Meaning In Telugu

ఆ రాత్రికి భరద్వాజుడు భరతునికి అతని పరివారమునకు సేనలకు భోజన సదుపాయములను చెయ్యాలని అనుకున్నాడు. దానికి భరతుడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! మీరు వసిష్ఠుల వారికి, నాకూ అర్ఘ్యము పాద్యము ఫలములు ఇచ్చి సత్కరించారు కదా! అది చాలు నాకు.” అని అన్నాడు.

“భరతా! నీవు ఏదీ కోరవు అని నాకు తెలుసు. కాని కాదనకుండా నా ఆతిధ్యము స్వీకరించు. నీవు నీ పరివారమును, సైన్యమును ఎందుకు దూరంగా ఉంచావు. మా ఆశ్రమమునకు తీసుకొని రావలసినది.” అని అన్నాడు భరద్వాజుడు.

దానికి భరతుడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! తమ ఆశ్రమ ప్రశాంతతకు భంగము కలిగించడం ఇష్టం లేక, తమరి మీద ఉన్న భయ భక్తులతో నేను నాపరివారమును సైన్యమును దూరంగా ఉంచి వచ్చాను. అదీ కాకుండా రాజులు తమ మందీ మార్బలములను, మునులకు దూరంగా ఉంచాలని రాజధర్మము కదా! నా వెంట చతురంగ బలములు వస్తూ ఉన్నాయి. అవి ఇక్కడకు వస్తే ఇక్కడి వృక్ష సంపద, జలసంపద కలుషితము అవుతాయి. అందుకని తీసుకొని రాలేదు.” అని అన్నాడు భరతుడు.

దానికి భరద్వాజుడు నవ్వి “మాకు ఏమీ అసౌకర్యము లేదు. నీ సేనలను ఇక్కడకు రమ్మని చెప్పు” అని ఆదేశించాడు. ఆ ప్రకారము భరతుని సేనలు భరద్వాజుని ఆశ్రమము వద్దకు వచ్చాయి.

భరద్వాజుడు అగ్ని గృహములోనికి ప్రవేశించి భరతుని పరివారమునకు ఆతిథ్యము ఇచ్చుటకు విశ్వకర్మను ఆహ్వానించాడు. దేవేంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడుమొదలగు లోక పాలకులను ఆహ్యానించాడు. భూమి మీద ఉన్న నదులను ఆహ్వానించాడు. దేవతలను, గంధర్వులను, అప్సరసలను ఆహ్వానించాడు. స్వర్గము నుండి, బ్రహ్మలోకమునుండి దేవతా స్త్రీలను ఆహ్వానించాడు. కుబేరునికి, దివ్యమైన వస్త్రములను తీసుకు రమ్మని ఆదేశించాడు.

పిలిచి భరతుని పరివారమునకు సైన్యమునకు కావలసిన ఆహార పదార్థములను, భక్ష్యములను, పానీయములను, మాంసాహారములను, ఫలములను సమకూర్చమని ఆదేశించాడు.

భరద్వాజుడు ఆహ్వానించిన దేవతలందరూ భరద్వాజుని వద్దకు వచ్చారు. ఆయన ఆదేశములు స్వీకరించారు. భరతునికి, ఆయన పరివారమునకు, సైన్యమునకు కావలసిన ఏర్పాట్లు చేసారు. వాయుడు మంద్రంగా వీచ సాగాడు. అప్సరసలు తమ నృత్యగానవినోదములతో వారిని ఆనందపరచసాగారు. విశ్వకర్మ ఆ రాత్రి వారందరూ ఉండటానికి ఒక విశాలమైన మందిరమును సృష్టించాడ భరతుడు తన పురోహితుడు వసిష్ఠుడు, తమ్ముడు శత్రుఘ్నుడు, తన తల్లులతో ఆ భవనములోనికి ప్రవేశించాడు. ఆ భవనములో ఒక పెద్ద రాజ సభ అందులో ఒక సింహాసనము ఉంది. భరతుడు ఆ సింహాసనమునకు నమస్కరించి, తాను పక్కన ఉన్న ఆసనము మీద కూర్చున్నాడు. బ్రహ్మలోకము నుండి వచ్చిన స్త్రీలు, కుబేరుడు పంపగా వచ్చిన స్త్రీలు వారికి సేవలు చేయసాగారు. అప్సరసలు భరతుని తమ నృత్యగానవినోదములతో సంతోషపరచారు.

భరతుని వెంట వచ్చిన వారు. పరివారము, సైనికులు తిన్నంత తిని, తాగి మైమరచిపోయారు. ఆహా ఇంతటి విందు వినోదము తాము ఎప్పటికీ చూడలేము అని అనుకొన్నారు. తాము రాముని వద్దకు కానీ, అయోధ్యకు కానీ రాము. ఇక్కడే ఉంటాము అనితాగిన మత్తులో శపధాలు చేసారు. భరతుని వెంట వచ్చిన వారు. పరివారము, సైనికులు తిన్నంత తిని, తాగి మైమరచిపోయారు. ఆహా ఇంతటి విందు వినోదము తాము ఎప్పటికీ చూడలేము అని అనుకొన్నారు. తాము రాముని వద్దకు కానీ, అయోధ్యకు కానీ రాము. ఇక్కడే ఉంటాము అనితాగిన మత్తులో శపధాలు చేసారు.

తెల్లవారగానే అవేమీ ఉండవు. అంతా మిధ్య అని వారికి తెలియదు. సైనికులకే కాదు, వారి వాహనములు అయిన గుర్రములు ఏనుగులకు, ఒంటెలకు కూడా రుచికరమైన ఆహారము సమకూర్చబడింది. అడిగే వారు లేకపోవడంతో సైనికులు ఇష్టం వచ్చినట్టు తింటూ తాగుతూ స్వైరవిహారం చేసారు. అప్సరసలతో పాలు నృత్యం చేసారు. కేకలుపెడుతున్నారు.

(ఇక్కడ వాల్మీకి మహర్షి ఒక శ్లోకం రాసాడు. భరద్వాజుడు ఇచ్చిన ఆతిథ్యము ఆ మనుషులకు అనగా భరతుని పరివారమునకు, సైనికులకు స్వప్నంలో జరిగినట్టు ఉంది. ఆ రాత్రి గడవగానే అప్పరసలు అందరూ వచ్చిన వారు వచ్చినట్టుగానే వెళ్లిపోయారు. తాగిన మత్తులో జోగుతున్న సైనికులు మాత్రం అక్కడ పడి ఉన్నారు. రాత్రి కనపడ్డ భవనాలు లేవు, ఆహార పదార్థాలు లేవు. పానీయాలు లేవు. అడవి అందులో చెట్లు ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనము అనుభవించే సుఖాలు సంతోషాలు అన్నీ మిధ్య. ఏవీ శాశ్వతాలు కావు. తెల్లవారగానే కరిగిపోతాయి. అని ఈ సన్నివేశాన్ని వివరించడం ద్వారా లోకానికి తెలియజెప్పాడు వాల్మీకి.)

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్వినవతితమః సర్గః (92) >>

Ayodhya Kanda Sarga 80 In Telugu – అయోధ్యాకాండ అశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 80

అయోధ్యాకాండం అశీతితమ (80వ) సర్గలో, వసిష్ఠుడు దశరథ మహారాజుకు దేనుబుడు అనే విశిష్టమైన ఘీతోపాహారాన్ని సమర్పిస్తాడు. ఈ సమయంలో, దశరథ మహారాజు రాముని వలసకు వెళ్లడం మరియు తన కొడుకుతో విడిపోవడం వల్ల బాధతో ఉంటుంది. వసిష్ఠుడు ధైర్యం చెబుతూ, రాజ్యం పరిపాలన గురించి ఆలోచనలతో నిమగ్నమవుతాడు. దశరథుడు రాముని ఆకస్మిక ప్రయాణం గురించి మాట్లాడుకుంటూ, కైకేయి చేసిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తాడు. వసిష్ఠుడు దశరథుని ధైర్యం చెప్పి, కౌసల్య, సుమిత్ర మరియు కైకేయిలను సాంత్వన పరుస్తాడు. ఈ సర్గ దశరథ మహారాజు యొక్క భావోద్వేగాలు, రాముని పట్ల అతని అపార ప్రేమను, రాముని విడిపోవడం వలన అతని ఆవేదనను ప్రతిబింబిస్తుంది.

మార్గసంస్కారః

అథ భూమి ప్రదేశజ్ఞాః సూత్రకర్మవిశారదాః |
స్వకర్మాభిరతాః శూరాః ఖనకా యంత్రకాస్తథా || ౧ ||

కర్మాంతికాః స్థపతయః పురుషా యంత్రకోవిదాః |
తథా వర్ధకయశ్చైవ మార్గిణో వృక్షతక్షకాః || ౨ ||

కూపకారాః సుధాకారాః వంశకర్మకృతస్తథా |
సమర్థా యే చ ద్రష్టారః పురతస్తే ప్రతస్థిరే || ౩ ||

స తు హర్షాత్తముద్దేశం జనౌఘో విపులః ప్రయాన్ |
అశోభత మహావేగః సముద్ర ఇవ పర్వణి || ౪ ||

తే స్వవారం సమాస్థాయ వర్త్మకర్మణి కోవిదాః |
కరణైః వివిధోపేతైః పురస్తాత్సంప్రతస్థిరే || ౫ ||

లతావల్లీశ్చ గుల్మాంశ్చ స్థాణూనశ్మన ఏవ చ |
జనాస్తే చక్రిరే మార్గం చిందంతః వివిధాన్ ద్రుమాన్ || ౬ ||

అవృక్షేషు చ దేశేషు కేచిద్వృక్షానరోపయన్ |
కేచిత్కుఠారైష్టంకైశ్చ దాత్రైశ్ఛిందన్ క్వచిత్ క్వచిత్ || ౭ ||

అపరే వీరణస్తంబాన్ బలినో బలవత్తరాః |
విధమంతి స్మ దుర్గాణి స్థలాని చ తతస్తతః || ౮ ||

అపరేఽపూరయన్కూపాన్ పాంసుభిః శ్వభ్రమాయతమ్ |
నిమ్నభాగాంస్తతః కేచిత్ సమాంశ్చక్రుః సమంతతః || ౯ ||

బబంధుర్బంధనీయాంశ్చ క్షోద్యాన్ సంచుక్షుదుస్తదా |
బిభిదుర్భేదనీయాంశ్చ తాంస్తాన్దేశాన్నరాస్తదా || ౧౦ ||

అచిరేణైవ కాలేన పరివాహాన్బహూదకాన్ |
చక్రుర్బహు విధాకారాన్ సాగరప్రతిమాన్బహూన్ || ౧౧ ||

నిర్జలేషు చ దేశేషు ఖానయామాసురుత్తమాన్ |
ఉదపానాన్బహువిధాన్ వేదికాపరిమండితాన్ || ౧౨ ||

ససుధాకుట్టిమతలః ప్రపుష్పితమహీరుహః |
మత్తోద్ఘుష్ట ద్విజగణః పతాకాభిరలంకృతః || ౧౩ ||

చందనోదకసంసిక్తర్నానా కుసుమభూషితః |
బహ్వశోభత సేనాయాః పంథాః సురపథోపమః || ౧౪ ||

ఆజ్ఞాప్యాథ యథాఽజ్ఞప్తి యుక్తాస్తేఽధికృతా నరాః |
రమణీయేషు దేశేషు బహుస్వాదుఫలేషు చ || ౧౫ ||

యో నివేశస్త్వభిప్రేతః భరతస్య మహాత్మనః |
భూయస్తం శోభయామాసుః భూషాభిర్భూషణోపమమ్ || ౧౬ ||

నక్షత్రేషు ప్రశస్తేషు ముహూర్తేషు చ తద్విదః |
నివేశాన్ స్థాపయామాసుర్భరతస్య మహాత్మనః || ౧౭ ||

బహుపాంసుచయాశ్చాపి పరిఖాపరివారితాః |
తంత్రేంద్ర కీలప్రతిమాః ప్రతోలీవరశోభితాః || ౧౮ ||

ప్రాసాద మాలావితతాః సౌధప్రాకార సంవృతాః |
పతాకా శోభితాః సర్వే సునిర్మిత మహాపథాః || ౧౯ ||

విసర్పద్భిరివాకాశే విటంకాగ్రవిమానకైః |
సముచ్చ్రితైర్నివేశాస్తే బభుః శక్రపురోపమాః || ౨౦ ||

జాహ్నవీం తు సమాసాద్య వివిధద్రుమకాననామ్ |
శీతలామలపానీయాం మహామీనసమాకులామ్ || ౨౧ ||

సచంద్రతారాగణమండితం యథా
నభః క్షపాయామమలం విరాజతే |
నరేంద్రమార్గస్స తథా వ్యరాజత
క్రమేణ రమ్యః శుభశిల్పినిర్మితః || ౨౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అశీతితమః సర్గః || ౮౦ ||

Ayodhya Kanda Sarga 80 Meaning In Telugu

అమాత్యులు భరతుని ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేసారు.. ఆయాప్రదేశముల స్వభావములను తెలిసిన వారు, నేలను త్రవ్వేవారు, కొలతలు వేసేవారు, యంత్ర కోవిదులు, శిల్పులు, తగిన యంత్రములను నడుపువారు, చెక్కపని వారు, బావులు తవ్వువారు, మార్గములు వేయువారు, వారిని పర్యవేక్షించేవారు ఎవరెవరు ఏ యే పనులకు నియమింపబడ్డారో ఆ పనులను సమర్ధవంతంగా చేస్తున్నారు.

ముందుగా, భరతుడు, ఆయన సైన్యము, రధములు, శకటములు అడవులలో పోవుటకు, మార్గములు, రహదారులు వేస్తున్నారు. అడ్డంగా ఉన్న చెట్లను, పొదలను, తీగలను నరికి మార్గము చేస్తున్నారు. నేలంతా చదును చేస్తున్నారు. పల్లము ప్రదేశములలో మట్టిపోసి, ఎత్తైన ప్రదేశములను చదును చేసి, గుంతలను కప్పివేసి, మార్గములు ఏర్పరుస్తున్నారు. దారిలో సైన్యములకు, భరతుని అనుసరించు వారికీ, కావలసిన నీరు కాలవల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. నదులు కాలువలు లేని ప్రదేశములలో బావులుత్రవ్వి నీటిని పైకి తోడుతున్నారు. సేనలు నడచు మార్గమును సున్నముతో గట్టిచేసారు. దారిలో పూలచెట్లు నాటించారు. పతాకములతో అలంకరించారు.

ఈ పనులన్నీ చేయుటకు జ్యోతిష్కులు మంచి ముహూర్తములు నిర్ణయించారు. దారిలో భరతుడు, అంత:పురస్త్రీలు, రాజోద్యోగులు విడిది చేయుటకు వివిధములైన గృహములు నిర్మించారు. భరతుడు విడిది చేయు గృహమును ఇతర గృహముల కంటే బాగా అలంకరించారు. ఆ విధముగా కట్టబడిన విడిది గృహములు సరయూనది నుండి గంగానది వరకూ వ్యాపించి ఉ న్నాయి. ఆ ప్రకారంగా భరతుని ప్రయాణమునకు ఏర్పాట్లు చేయబడ్డాయి. (ఆ రోజుల్లో కూడా దేశాధినేత ప్రయాణమునకు నేడు చేసిన మాదిరే ఏర్పాట్లు చేయడం, అప్పటికప్పుడు అన్నీ అమర్చడం నేడు కూడా. చూస్తూనే ఉంటాం.)

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకాశీతితమః సర్గః (81) >>

Aranya Kanda Sarga 16 In Telugu – అరణ్యకాండ షోడశః సర్గః

Aranya Kanda Sarga 16 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” షోడశః సర్గలో, ఒక రోజు సూర్యోదయానికి ముందు రాముడు సీత మరియు లక్ష్మణులతో కలిసి రోజూ స్నానం చేయడానికి గోదావరి నదికి వెళ్తాడు. దారిలో లక్ష్మణుడు చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ శీతాకాలాన్ని స్తుతిస్తాడు. అలా చేయడం ద్వారా అతను రాణి కైకేయిపై అసహనం వ్యక్తం చేస్తాడు మరియు రాముడు దానిని ఖండించాడు.

హేమంతవర్ణనమ్

వసతస్తస్య తు సుఖం రాఘవస్య మహాత్మనః |
శరద్వ్యపాయే హేమంత ఋతురిష్టః ప్రవర్తతే ||

1

స కదాచిత్ప్రభాతాయాం శర్వర్యాం రఘునందనః |
ప్రయయావభిషేకార్థం రమ్యాం గోదావరీం నదీమ్ ||

2

ప్రహ్వః కలశహస్తస్తం సీతయా సహ వీర్యవాన్ |
పృష్ఠతోఽనువ్రజన్ భ్రాతా సౌమిత్రిరిదమబ్రవీత్ ||

3

అయం స కాలః సంప్రాప్తః ప్రియో యస్తే ప్రియంవద |
అలంకృత ఇవాభాతి యేన సంవత్సరః శుభః ||

4

నీహారపరుషో లోకః పృథివీ సస్యశాలినీ |
జలాన్యనుపభోగ్యాని సుభగో హవ్యవాహనః ||

5

నవాగ్రయణపూజాభిరభ్యర్చ్య పితృదేవతాః |
కృతాగ్రయణకాః కాలే సంతో విగతకల్మషాః ||

6

ప్రాజ్యకామా జనపదాః సంపన్నతరగోరసాః |
విచరంతి మహీపాలా యాత్రాస్థా విజిగీషవః ||

7

సేవమానే దృఢం సూర్యే దిశమంతకసేవితామ్ |
విహీనతిలకేవ స్త్రీ నోత్తరా దిక్ప్రకాశతే ||

8

ప్రకృత్యా హిమకోశాఢ్యో దూరసూర్యశ్చ సామ్ప్రతమ్ |
యథార్థనామా సువ్యక్తం హిమవాన్ హిమవాన్ గిరిః ||

9

అత్యంతసుఖసంచారా మధ్యాహ్నే స్పర్శతః సుఖాః |
దివసాః సుభగాదిత్యాశ్ఛాయాసలిలదుర్భగాః ||

10

మృదుసూర్యాః సనీహారాః పటుశీతాః సమారుతాః |
శూన్యారణ్యా హిమధ్వస్తా దివసా భాంతి సామ్ప్రతమ్ ||

11

నివృత్తాకాశశయనాః పుష్యనీతా హిమారుణాః |
శీతా వృద్ధతరా యామాస్త్రియామా యాంతి సామ్ప్రతమ్ ||

12

రవిసంక్రాంతసౌభాగ్యస్తుషారారుణమండలః |
నిఃశ్వాసాంధ ఇవాదర్శశ్చంద్రమా న ప్రకాశతే ||

13

జ్యోత్స్నీ తుషారమలినా పౌర్ణమాస్యాం న రాజతే |
సీతేవ చాతపశ్యామా లక్ష్యతే న తు శోభతే ||

14

ప్రకృత్యా శీతలస్పర్శో హిమవిద్ధశ్చ సామ్ప్రతమ్ |
ప్రవాతి పశ్చిమో వాయుః కాలే ద్విగుణశీతలః ||

15

బాష్పచ్ఛన్నాన్యరణ్యాని యవగోధూమవంతి చ |
శోభంతేఽభ్యుదితే సూర్యే నదద్భిః క్రౌంచసారసైః ||

16

ఖర్జూరపుష్పాకృతిభిః శిరోభిః పూర్ణతండులైః |
శోభంతే కించిదానమ్రాః శాలయః కనకప్రభాః ||

17

మయూఖైరుపసర్పద్భిర్హిమనీహారసంవృతైః |
దూరమభ్యుదితః సూర్యః శశాంక ఇవ లక్ష్యతే ||

18

అగ్రాహ్యవీర్యః పూర్వాహ్ణే మధ్యహ్నే స్పర్శతః సుఖః |
సంరక్తః కించిదాపాండురాతపః శోభతే క్షితౌ ||

19

అవశ్యాయనిపాతేన కించిత్ప్రక్లిన్నశాద్వలా |
వనానాం శోభతే భూమిర్నివిష్టతరుణాతపా ||

20

స్పృశంస్తు విపులం శీతముదకం ద్విరదః సుఖమ్ |
అత్యంతతృషితో వన్యః ప్రతిసంహరతే కరమ్ ||

21

ఏతే హి సముపాసీనా విహగా జలచారిణః |
న విగాహంతి సలిలమప్రగల్భా ఇవాహవమ్ ||

22

అవశ్యాయతమోనద్ధా నీహారతమసా వృతాః |
ప్రసుప్తా ఇవ లక్ష్యంతే విపుష్పా వనరాజయః ||

23

బాష్పసంఛన్నసలిలా రుతవిజ్ఞేయసారసాః |
హిమార్ద్రవాలుకైస్తీరైః సరితో భాంతి సామ్ప్రతమ్ ||

24

తుషారపతనాచ్చైవ మృదుత్వాద్భాస్కరస్య చ |
శైత్యాదగాగ్రస్థమపి ప్రాయేణ రసవజ్జలమ్ ||

25

జరాజర్ఝరితైః పద్మైః శీర్ణకేసరకర్ణికైః |
నాలశేషైర్హిమధ్వస్తైర్న భాంతి కమలాకరాః ||

26

అస్మింస్తు పురుషవ్యాఘ్రః కాలే దుఃఖసమన్వితః |
తపశ్చరతి ధర్మాత్మా త్వద్భక్త్యా భరతః పురే ||

27

త్యక్త్వా రాజ్యం చ మానం చ భోగాంశ్చ వివిధాన్ బహూన్ |
తపస్వీ నియతాహారః శేతే శీతే మహీతలే ||

28

సోఽపి వేలామిమాం నూనమభిషేకార్థముద్యతః |
వృతః ప్రకృతిభిర్నిత్యం ప్రయాతి సరయూం నదీమ్ ||

29

అత్యంతసుఖసంవృద్ధః సుకుమారః సుఖోచితః |
కథం న్వపరరాత్రేషు సరయూమవగాహతే ||

30

పద్మపత్రేక్షణో వీరః శ్యామో నిరుదరో మహాన్ |
ధర్మజ్ఞః సత్యవాదీ చ హ్రీనిషేధో జితేంద్రియః ||

31

ప్రియాభిభాషీ మధురో దీర్ఘబాహురరిందమః |
సంత్యజ్య వివిధాన్ భోగానార్యం సర్వాత్మనా శ్రితః ||

32

జితః స్వర్గస్తవ భ్రాత్రా భరతేన మహాత్మనా |
వనస్థమపి తాపస్యే యస్త్వామనువిధీయతే ||

33

న పిత్ర్యమనువర్తంతే మాతృకం ద్విపదా ఇతి |
ఖ్యాతో లోకప్రవాదోఽయం భరతేనాన్యథా కృతః ||

34

భర్తా దశరథో యస్యాః సాధుశ్చ భరతః సుతః |
కథం ను సాంబా కైకేయీ తాదృశీ క్రూరశీలినీ ||

35

ఇత్యేవం లక్ష్మణే వాక్యం స్నేహాద్బ్రువతి ధార్మికే |
పరివాదం జనన్యాస్తమసహన్ రాఘవోఽబ్రవీత్ ||

36

న తేఽంబా మధ్యమా తాత గర్హితవ్యా కథంచన |
తామేవేక్ష్వాకునాథస్య భరతస్య కథాం కురు ||

37

నిశ్చితాపి హి మే బుద్ధిర్వనవాసే దృఢవ్రతా |
భరతస్నేహసంతప్తా బాలిశీక్రియతే పునః ||

38

సంస్మరామ్యస్య వాక్యాని ప్రియాణి మధురాణి చ |
హృద్యాన్యమృతకల్పాని మనః ప్రహ్లాదనాని చ ||

39

కదా న్వహం సమేష్యామి భరతేన మహాత్మనా |
శత్రుఘ్నేన చ వీరేణ త్వాయా చ రఘునందన ||

40

ఇత్యేవం విలపంస్తత్ర ప్రాప్య గోదావరీం నదీమ్ |
చక్రేఽభిషేకం కాకుత్స్థః సానుజః సహ సీతయా ||

41

తర్పయిత్వాథ సలిలైస్తే పితౄన్ దైవతాని చ |
స్తువంతి స్మోదితం సూర్యం దేవతాశ్చ సమాహితాః ||

42

కృతాభిషేకః స రరాజ రామః
సీతాద్వితీయః సహ లక్ష్మణేన |
కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా
రుద్రః సనందీ భగవానివేశః ||

43

Aranya Kanda Sarga 16 In Telugu Pdf Download

రాముడు సీతతో సహా పంచవటిలో ఆనందంగా గడుపు తున్నాడు. ఇంతలో శరదృతువు ముగిసి, హేమంత ఋతువు ప్రవేశించింది. చలికాలము మొదలయింది.

ఒక రోజు రాముడు పొద్దునే గోదావరినదికి స్నానానికి వెళ్లాడు. రాముని వెంట సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. ఆ హేమంత ఋతువు అందాలను చూచి లక్ష్మణుడు రాముని తో ఇలా అన్నాడు.

“రామా! నీకు హేమంత ఋతువు అంటే ఎంతో ఇష్టం కదా. ఇప్పుడు హేమంత ఋతువు ప్రవేశించింది. మంచు కురుస్తూ ఉంది. నదీజలాలు స్నానానికి అనుకూలంగా లేవు. చలికి వెచ్చగా అగ్నిహోత్రము దగ్గర ఉండవలెనని కోరికగా ఉంది. పంటలు బాగా పండి కొత్త ధాన్యములు ఇంటికి చేరుతున్నాయి.

ఉత్తరాయనము రాగానే పితృదేవతలను పూజించి జనులు తరిస్తున్నారు. వర్షాకాలము ముగియడంతో రాజులు ఇతర రాజ్యముల మీదికి దండెత్తడానికి ఆసక్తిగా ఉన్నారు. అసలే మంచుతో కప్పబడిన హిమవత్పర్వతము సూర్యుడు భూమికి దూరంగా ఉండటంతో ఇంకా ఎక్కువ మంచుతో శోభిల్లుతోంది..

మనుష్యులు మధ్యాహ్నపు ఎండలో హాయిగా ఉంటున్నారు. రాత్రిళ్లు చలితో వణుకుతున్నారు. పగటి భాగమున కూడా సూర్యుడు తన తీక్షతను కోల్పోయాడు. పగలు కూడా చలిగాలులు వీస్తున్నాయి. అడవులలో జంతువులు కూడా తిరగడం లేదు. గుహలకే పరిమిత మైనాయి. మంచు కురవడంతో రాత్రిళ్లు ఎవరూ ఆరుబయట పడుకోడం లేదు.

చంద్రుడు గుండ్రంగా అందంగా ఉంటాడు. కాని అందాలు ఇప్పుడు సూర్యునికి సంక్రమించాయి. సూర్యుడు కూడా మంచు చేత కప్పబడి, తీక్షత తగ్గి, పూర్ణ చంద్రుని వలె ప్రకాశిస్తున్నాడు. పడమటి దిశనుండి చలిగాలులు వీస్తున్నాయి.

రాత్రి అంతా చలిగా ఉండి, పొద్దున్నే సూర్యోదయం కాగానే పక్షులు కిలా కిలా రావాలతో రెక్కలు విప్పుకొని ఎగిరిపోతున్నాయి. సూర్యకిరణములను పొగ మంచు కప్పడం వలన, సూర్యుడు బాగా పైకి వచ్చినా తీవ్రత తగ్గి నిండు చంద్రుని వలె కనపడుతున్నాడు. ఎండ కొద్ది కొద్దిగా నేల మీద పాకుతూ ఉంది. కాని వేడిగా లేదు.

మధ్యాహ్నము ఎండ చాలా సుఖంగా ఉంది. ఈ అడవిలో ఉన్న పచ్చిక మీద పడ్డ మంచు బిందువులు, పొద్దుటి ఎండలో ముత్యాలమాదిరి ప్రకాశిస్తున్నాయి.

రామా! అటు చూడు! పాపము ఆ ఏనుగు నీళ్లు తాగుదామని తన తొండమును నీటిలో పెట్టి, నీళ్లు జివ్వుమని చల్లగా తగలగానే తన తొండమును వెనక్కు లాగేసుకుంది. అంతెందుకు ఆ పక్షులు కూడా ఆ చల్లదనానికి నీటిలో దిగడానికి జంకుతున్నాయి. రామా! ఈ నదిలో నీరుకూడా అధికంగా చల్లగా ఉండటం వలన తాగడానికి వీలులేకుండా ఉంది కదా!

రామా! అడవిలో ఉన్న మన పరిస్థితి ఇలా ఉంది కదా! మరి అయోధ్యలో భరతుడు ఎలా ఉన్నాడో! నీ యందు భక్తితో అయోధ్యలో ఉన్నా అరణ్యములో ఉన్నట్టు ఉన్నాడేమో! రాజభోగములను విడిచిపెట్టి, నేల మీద పడుకుంటూ, మన మాదిరి ఫలములను ఆహారముగా తీసుకుంటూ జీవనము గడుపుతున్నాడేమో! రామా! మనము స్నానానికి గోదావరి నదికి వచ్చినట్టు భరతుడు కూడా సరయూనదికి స్నానానికి వెళుతూ ఉంటాడనుకుంటాను.

దక్షిణాపథములో ఉన్న మనకే ఇంత చలిగాఉంటే ఉత్తరదేశంలో అయోధ్యలో ఉన్న భరతునికి ఇంకెంత చలిగా ఉందో కదా! ఈ తెల్లవారుజామున సరయూనదిలో ఎలా స్నానం చేస్తున్నాడో కదా! ఎందుకంటే, భరతుడు అయోధ్యలో ఉన్నా, అరణ్యములో ఉన్నా నిన్ను అనుసరిస్తున్నాడు. నీ రాకకై తపిస్తున్నాడు. అటువంటి వాడు స్వర్గలోకాధిపత్యమునకు అర్హుడు.

రామా! సాధారణంగా కుమారుడికి తల్లి బుద్ధులు, కుమార్తెకు తండ్రి బుద్ధులు వస్తాయి అంటారు. కానీ, భరతుడికి తల్లి కైకకు ఉన్న ఏమాత్రమూ రాలేదు. అయినా రామా! దశరథ మహారాజు భార్యగా ఉండి, భరతునికి కన్నతల్లిగా ఉన్న కైకకు ఇంత కుటిలబుద్ధి ఎలా వచ్చిందో తెలియదు కదా.!…” అని లక్ష్మణుడు ఇంకా ఏదో చెప్పబోతుంటే రాముడు అడ్డుకున్నాడు.

“లక్షణా! దయచేసి నీవు ఎట్టి పరిస్థితులలోనూ మాత కైకను దూషించకూడదు. నేను వనవాసము చెయ్యాలని చేస్తున్నాను. ఇందులో ఆమె ప్రమేయము ఎంత మాత్రమూ లేదు. నా బాధ అంతా ఒకటే. భరత శత్రుఘ్నులు నా దగ్గర లేరే అని. అంతే కానీ ఈ వనవాసము నాకు ఎంతో ఆనందమూ కలిగిస్తూ ఉంది. నువ్వు, భరత శత్రుఘ్నులు ఎప్పుడు నా దగ్గరగా ఉంటారో కదా అని ఆతురతగా ఎదురుచూస్తున్నాను.” అని అన్నాడు రాముడు.

ఈ విధంగా మాట్లాడుకుంటూ అందరూ గోదావరీ తీరము చేరుకున్నారు. అందరూ గోదావరిలో దిగి స్నానాలు చేసారు. సీతా రామ లక్ష్మణులు గోదావరిలో పితృతర్పణము, దేవ తరణము, నిర్వర్తించారు. సూర్యోదయ కాలములో అర్ఘ్యము విడిచారు. తరువాత అందరూ ఆశ్రమమునకు వెళ్లారు.

(వాల్మీకి ఈ సర్గలో కేవలము శరదృతువు ఎలా ఉంటుందో వర్ణించాడు. ఈ రోజుల్లో ఈ జనారణ్యాలలో ఉన్న మనకు, పల్లెసీమలలో హేమంత ఋతువులో, ప్రకృతి సౌందర్యము ఎలా ఉంటుందో చూడ్డం కుదరడం లేదు. అందుకని ఆ ప్రకృతి అందాలను మనముందు ఆవిష్కరించాడు మహర్షి వాల్మీకి.)

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదహారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ సప్తదశః సర్గః (17) >>

Aranya Kanda Sarga 8 In Telugu – అరణ్యకాండ అష్టమః సర్గః

Aranya Kanda Sarga 8 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టమ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణుడు అగస్త్య మహర్షిని కలుసుకుని ఆయన ఆశీర్వాదం పొందుతారు. అగస్త్యుడు రాముడికి దివ్య ఆయుధాలను అందజేస్తాడు, వాటితో రాక్షసులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. రాముడు, లక్ష్మణుడు ఆ ఆయుధాలను స్వీకరించి, ధైర్యంగా దండకారణ్యంలో రాక్షసులను ఎదుర్కొంటారు.

సుతీక్ష్ణాభ్యనుజ్ఞా

రామస్తు సహసౌమిత్రిః సుతీక్ష్ణేనాభిపూజితః |
పరిణామ్య నిశాం తత్ర ప్రభాతే ప్రత్యబుధ్యత ||

1

ఉత్థాయ తు యథాకాలం రాఘవః సహ సీతయా |
ఉపాస్పృశత్సుశీతేన జలేనోత్పలగంధినా ||

2

అథ తేఽగ్నిం సురాంశ్చైవ వైదేహీ రామలక్ష్మణౌ |
కాల్యం విధివదభ్యర్చ్య తపస్విశరణే వనే ||

3

ఉదయంతం దినకరం దృష్ట్వా విగతకల్మషాః |
సుతీక్ష్ణమభిగమ్యేదం శ్లక్ష్ణం వచనమబ్రువన్ ||

4

సుఖోషితాః స్మ భగవంస్త్వయా పూజ్యేన పూజితాః |
ఆపృచ్ఛామః ప్రయాస్యామో మునయస్త్వరయంతి నః ||

5

త్వరామహే వయం ద్రష్టుం కృత్స్నమాశ్రమమండలమ్ |
ఋషీణాం పుణ్యశీలానాం దండకారణ్యవాసినామ్ ||

6

అభ్యనుజ్ఞాతుమిచ్ఛామః సహైభిర్మునిపుంగవైః |
ధర్మనిత్యైస్తపోదాంతైర్విశిఖైరివ పావకైః ||

7

అవిషహ్యాతపో యావత్సూర్యో నాతివిరాజతే |
అమార్గేణాగతాం లక్ష్మీం ప్రాప్యేవాన్వయవర్జితః ||

8

తావదిచ్ఛామహే గంతుమిత్యుక్త్వా చరణౌ మునేః |
వవందే సహ సౌమిత్రిః సీతయా సహ రాఘవః ||

9

తౌ సంస్పృశంతౌ చరణావుత్థాప్య మునిపుంగవః |
గాఢమాలింగ్య సస్నేహమిదం వచనమబ్రవీత్ ||

10

అరిష్టం గచ్ఛ పంథానం రామ సౌమిత్రిణా సహ |
సీతయా చానయా సార్ధం ఛాయయేవానువృత్తయా ||

11

పశ్యాశ్రమపదం రమ్యం దండకారణ్యవాసినామ్ |
ఏషాం తపస్వినాం వీర తపసా భావితాత్మనామ్ ||

12

సుప్రాజ్యఫలమూలాని పుష్పితాని వనాని చ |
ప్రశస్తమృగయూథాని శాంతపక్షిగణాని చ ||

13

ఫుల్లపంకజషండాని ప్రసన్నసలిలాని చ |
కారండవవికీర్ణాని తటాకాని సరాంసి చ ||

14

ద్రక్ష్యసే దృష్టిరమ్యాణి గిరిప్రస్రవణాని చ |
రమణీయాన్యరణ్యాని మయూరాభిరుతాని చ ||

15

గమ్యతాం వత్స సౌమిత్రే భవానపి చ గచ్ఛతు |
ఆగంతవ్యం త్వయా తాత పునరేవాశ్రమం మమ ||

16

ఏవముక్తస్తథేత్యుక్త్వా కాకుత్స్థః సహలక్ష్మణః |
ప్రదక్షిణం మునిం కృత్వా ప్రస్థాతుముపచక్రమే ||

17

తతః శుభతరే తూణీ ధనుషీ చాయతేక్షణా |
దదౌ సీతా తయోర్భ్రాత్రోః ఖడ్గౌ చ విమలౌ తతః ||

18

ఆబధ్య చ శుభే తూణీ చాపౌ చాదాయ సస్వనౌ |
నిష్క్రాంతావాశ్రమాద్గంతుముభౌ తౌ రామలక్ష్మణౌ ||

19

శ్రీమంతౌ రూపసంపన్నౌ దీప్యమానౌ స్వతేజసా |
ప్రస్థితౌ ధృతచాపౌ తౌ సీతయా సహ రాఘవౌ ||

20

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే అష్టమః సర్గః ||

Aranya Kanda Sarga 8 Meaning In Telugu

సీతా రామ లక్ష్మణులు మరునాడు ఉదయం నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు. రాముడు సుతీక్షుని వద్దకు వెళ్లాడు.

“మహాత్మా! రాత్రి మీ ఆతిధ్యము స్వీకరించాము. మాకు చాలా సంతోషము అయింది. మీరు అనుమతి ఇస్తే మేము ముగ్గురమూ, మాతో వచ్చిన మునులు కలిసి, ఈ అరణ్యములో ఉన్న ముని ఆశ్రమములను చూచి వస్తాము. ఆ మునుల ఆశీర్వాదములు తీసుకుంటాము.” అని అన్నాడు రాముడు..

“రామా! నీకు శుభమగు గాక! నీ ఇష్టము ప్రకారము ఈ వనములో ఉన్న ముని ఆశ్రమములను అన్నిటినీ దర్శించు. ఈ వనములో ఫలములు, పుష్పములు సమృద్ధిగా ఉన్నాయి. నిర్మలమైన నీరు కలలా జలాశయములు ఎన్నో ఉన్నాయి. కొండలమీది నుండి నేల మీదికి దుముకుచున్న జలపాతములు కూడా చాలాఉన్నాయి. జింకలు, నెమళ్లు తదితర వన్యప్రాణులు మీకు కనువిందు చేస్తాయి. ఈ అడవిలో ఉన్న అందాలన్నీ తనివిదీరా చూడండి. మరలా మన ఆశ్రమమునకు చేరుకోండి.” అని అన్నాడు.

“మహర్షీ! అలాగే చేస్తాను.” అని ఆ మహర్షికి నమస్కరించి, లక్ష్మణుడు, సీత, మునులతో వనములోకి వెళ్లడానికి ప్రయాణము అయ్యాడు. సీత రామునికి లక్ష్మణునికి ధనుర్బాణములు, ఖడ్గములు తెచ్చి ఇచ్చింది. వాటిని రామలక్ష్మణులు ధరించారు. ఆయుధధారులైన రామ లక్ష్మణులు, సీతతో కలిసి ఆ అరణ్యములో ప్రయాణం చేస్తున్నారు.

శ్రీమద్రామాయణము
అరణ్య కాండము ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ నవమః సర్గః (9) >>

Aranya Kanda Sarga 15 In Telugu – అరణ్యకాండ పంచదశః సర్గః

Aranya Kanda Sarga 15 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” పంచదశః సర్గలో, రాముడు గోదావరి నదికి సమీపంలోని పంచవటిలో పర్ణ శాల, గడ్డి కుటీర నిర్మాణ పనిని అప్పగిస్తాడు . లక్ష్మణుడు తన నైపుణ్యంతో హాయిగా ఉండే ఒక కుటీరాన్ని నిర్మించాడు మరియు గృహప్రవేశ కార్యక్రమం తర్వాత వారు దానిలోకి ప్రవేశిస్తారు. రాముడు లక్ష్మణుడిని అతని నిర్మాణ పనిని మెచ్చుకుంటాడు మరియు కృతజ్ఞతాపూర్వకంగా అతను లక్ష్మణుడిని ఆలింగనం చేసుకుంటాడు మరియు రాముడి పట్ల లక్ష్మణునికి ఉన్న శ్రద్ధ గురించి తన హృదయాన్ని వ్యక్తం చేస్తాడు.

పంచవటీపర్ణశాలా

తతః పంచవటీం గత్వా నానావ్యాలమృగాయుతామ్ |
ఉవాచ భ్రాతరం రామః సౌమిత్రిం దీప్తతేజసమ్ ||

1

ఆగతాః స్మ యథోద్దిష్టమముం దేశం మహర్షిణా |
అయం పంచవటీదేశః సౌమ్య పుష్పితపాదపః ||

2

సర్వతశ్చార్యతాం దృష్టిః కాననే నిపుణో హ్యసి |
ఆశ్రమః కతరస్మిన్నో దేశే భవతి సమ్మతః ||

3

రమతే యత్ర వైదేహీ త్వమహం చైవ లక్ష్మణ |
తాదృశో దృశ్యాతాం దేశః సన్నికృష్టజలాశయః ||

4

వనరామణ్యకం యత్ర స్థలరామణ్యకం తథా |
సన్నికృష్టం చ యత్ర స్యాత్ సమిత్పుష్పకుశోదకమ్ ||

5

ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః సంయతాంజలిః |
సీతాసమక్షం కాకుత్స్థమిదం వచనమబ్రవీత్ ||

6

పరవానస్మి కాకుత్స్థ త్వయి వర్షశతం స్థితే |
స్వయం తు రుచిరే దేశే క్రియాతామితి మాం వద ||

7

సుప్రీతస్తేన వాక్యేన లక్ష్మణస్య మహాత్మనః |
విమృశన్ రోచయామాస దేశం సర్వగుణాన్వితమ్ ||

8

స తం రుచిరమాక్రమ్య దేశమాశ్రమకర్మణి |
హస్తౌ గృహీత్వా హస్తేన రామః సౌమిత్రిమబ్రవీత్ ||

9

అయం దేశః సమః శ్రీమాన్ పుష్పితైస్తరుభిర్వృతః |
ఇహాశ్రమపదం సౌమ్య యథావత్కర్తుమర్హసి ||

10

ఇయమాదిత్యసంకాశైః పద్మైః సురభిగంధిభిః |
అదూరే దృశ్యతే రమ్యా పద్మినీ పద్మశోభితా ||

11

యథాఽఽఖ్యాతమగస్త్యేన మునినా భావితాత్మనా |
ఇయం గోదావరీ రమ్యా పుష్పితైస్తరుభిర్వృతా ||

12

హంసకారండవాకీర్ణా చక్రవాకోపశోభితా |
నాతిదూరేణ చాసన్నే మృగయూథనిపీడితాః ||

13

మయూరనాదితా రమ్యాః ప్రాంశవో బహుకందరాః |
దృశ్యంతే గిరయః సౌమ్య ఫుల్లైస్తరుభిరావృతాః ||

14

సౌవర్ణై రాజతైస్తామ్రైర్దేశే దేశే చ ధాతుభిః |
గవాక్షితా ఇవాభాంతి గజాః పరమభక్తిభిః ||

15

సాలైస్తాలైస్తమాలైశ్చ ఖర్జూరపనసామ్రకైః |
నివారైస్తిమిశైశ్చైవ పున్నాగైశ్చోపశోభితాః ||

16

చూతైరశోకైస్తిలకైశ్చంపకైః కేతకైరపి |
పుష్పగుల్మలతోపేతైస్తైస్తైస్తరుభిరావృతాః ||

17

చందనైః స్పందనైర్నీపైః పనసైర్లికుచైరపి |
ధవాశ్వకర్ణఖదిరైః శమీకింశుకపాటలైః ||

18

ఇదం పుణ్యమిదం మేధ్యమిదం బహుమృగద్విజమ్ |
ఇహ వత్స్యామి సౌమిత్రే సార్ధమేతేన పక్షిణా ||

19

ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః పరవీరహా |
అచిరేణాశ్రమం భ్రాతుశ్చకార సుమహాబలః ||

20

పర్ణశాలాం సువిపులాం తత్ర సంఘాతమృత్తికామ్ |
సుస్తంభాం మస్కరైర్దీర్ఘైః కృతవంశాం సుశోభనామ్ ||

21

శమీశాఖాభిరాస్తీర్య దృఢపాశావపాశితామ్ |
కుశకాశశరైః పర్ణైః సుపరిచ్ఛాదితాం తథా ||

22

సమీకృతతలాం రమ్యాం చకార లఘువిక్రమః |
నివాసం రాఘవస్యార్థే ప్రేక్షణీయమనుత్తమమ్ ||

23

స గత్వా లక్ష్మణః శ్రీమాన్నదీం గోదావరీం తదా |
స్నాత్వా పద్మాని చాదాయ సఫలః పునరాగతః ||

24

తతః పుష్పబలిం కృత్వా శాంతిం చ స యథావిధి |
దర్శయామాస రామాయ తదాశ్రమపదం కృతమ్ ||

25

స తం దృష్ట్వా కృతం సౌమ్యమాశ్రమం సహ సీతయా |
రాఘవః పర్ణశాలాయాం హర్షమాహారయద్భృశమ్ ||

26

సుసంహృష్టః పరిష్వజ్య బాహుభ్యాం లక్ష్మణం తదా |
అతిస్నిగ్ధం చ గాఢం చ వచనం చేదమబ్రవీత్ ||

27

ప్రీతోఽస్మి తే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభో |
ప్రదేయో యన్నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః ||

28

భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ |
త్వాయా పుత్రేణ ధర్మాత్మా న సంవృత్తః పితా మమ ||

29

ఏవం లక్ష్మణముక్త్వా తు రాఘవో లక్ష్మివర్ధనః |
తస్మిన్దేశే బహుఫలే న్యవసత్సుసుఖం వశీ ||

30

కంచిత్కాలం స ధర్మాత్మా సీతయా లక్ష్మణేన చ |
అన్వాస్యమానో న్యవసత్ స్వర్గలోకే యథామరః ||

31

రాముడు, లక్ష్మణుడు, సీత, జటాయువు అందరూ కలిసి పంచవటి ని చేరుకున్నారు.

రాముడు లక్ష్మణుని చూచి “లక్ష్మణా! ఇక్కడ పూలు చక్కగా పుప్పించి ఉన్నాయి. ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. నేల చదునుగా ఉంది. పక్కనే సెల ఏళ్లు ఉన్నాయి. అగస్త్యుడు చెప్పిన పంచవటి ఇదే కావచ్చును. ఇక్కడ మనము పర్ణశాల నిర్మించు కొనుటకు అనవైన ప్రదేశము చూడుము. లక్ష్మణా! జలాశయము పక్కన, దగ్గరగా ఫలవృక్షములు ఉన్న చోట, దర్భలు, సమిధలు దొరకుచోట, తగిన ప్రదేశమును నిర్ణయింపుము. ” అని పలికాడు.

“రామా! అట్లు కాదు. స్థల నిర్ణయములో నీ కన్నా సమర్థుడు లేడు. నీవు సీత కలిసి ఆలోచించి స్థల నిర్ణయము చెయ్యండి. అక్కడ నేను సుందరమైన ఆశ్రమమును నిర్మించెదను.” అని అన్నాడు.

రాముడు, సీత చుట్టపక్కల ప్రదేశములు తిరిగి గోదావరీ నదీ తీరంలో ఉన్న సమతల ప్రదేశమును ఎన్నుకొన్నారు.

“లక్ష్మణా! ఈ ప్రదేశములో పర్ణశాలను నిర్మింపుము. ఈ ప్రదేశము మనకు అనుకూలముగా ఉంది. పక్కనే గోదావరీ నది ప్రవహించుచున్నది. మనకు జలమునకు కొదవ లేదు. ఈ సమతల ప్రదేశములో ఫల వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. చుట్టూ పర్వతములు పెట్టని కోటలాగా ప్రకాశిస్తున్నాయి. ఆ పర్వతముల మీద మామిడి, అశోక, చంపక, చందన, శమీ, కింశుక వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. అదీ కాకుండా ఇక్కడ ఉన్న వటవృక్షముల మీద అనేక పక్షిజాతులునివసిస్తున్నాయి. జటాయువు కూడా ఈ చెట్ల మీద నివసించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పర్ణశాల నిర్మించుటకు ఇదే అనువైన చోటు.” అని అన్నాడు రాముడు.

రాముని మాటను శిరస్సున దాల్చాడు లక్షణుడు. రాముడు కోరినట్టు అక్కడ ఒక సుందరమైన పర్ణశాలను నిర్మించాడు. మట్టితో గోడలు కట్టాడు. మధ్యలో స్తంభాలు పాతాడు. పొడుగాటి వెదుళ్లతో నిలువుగా అడ్డంగా కట్టాడు. దానిమీద తాళ ఆకులు, దాని మీద రెల్లు గడ్డి కప్పాడు. పర్ణశాల ముందు ఉన్న స్థలమును చదునుచేసాడు. చుట్టు కంచె కట్టాడు. ఆ ప్రకారంగా ఒక సుందరమైన పర్ణశాలను లక్ష్మణుడు నిర్మించాడు.

తరువాత లక్ష్మణుడు గోదావరికి వెళ్లి స్నానము చేసి అక్కడ పుష్పించిన తామర పువ్వులు కోసుకొని వచ్చాడు. లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాలను చూచి సీతారాములు ముగ్ధులయ్యారు. రాముడు లక్ష్మణుని కౌగలించుకొని “లక్ష్మణా! నా కోరిక మేరకు మనకు ఒక అనువైన పర్ణశాలను నిర్మించినందుకు నీకు నేనేమి ఇవ్వగలను నా గాఢపరిష్వంగము తప్ప” అంటూ లక్ష్మణుని ప్రేమతో కౌగలించుకున్నాడు రాముడు. రాముని ప్రేమకు లక్ష్మణుడు పొంగిపోయాడు. ఆ ఆశ్రమములో రాముడు, సీత, లక్ష్మణుడు సుఖంగా నివసించసాగారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదునైదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ షోడశః సర్గః (16) >>

Aranya Kanda Sarga 7 In Telugu – అరణ్యకాండ సప్తమః సర్గః

Aranya Kanda Sarga 7 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తమ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారి సాహసాలు, రాక్షసులతో జరిగిన ఘర్షణలు, వనవాసంలో ఎదురైన కష్టాలు వివరించబడతాయి. మహర్షి అగస్త్యుని ఆశీర్వాదం అందుకుంటారు.

సుతీక్ష్ణాశ్రమః

రామస్తు సహితో భ్రాత్రా సీతయా చ పరంతపః |
సుతీక్ష్ణస్యాశ్రమపదం జగామ సహ తైర్ద్విజైః ||

1

స గత్వాఽదూరమధ్వానం నదీస్తీర్త్వా బహూదకాః |
దదర్శ విపులం శైలం మహామేఘమివోన్నతమ్ ||

2

తతస్తదిక్ష్వాకువరౌ సంతతం వివిధైర్ద్రుమైః |
కాననం తౌ వివిశతుః సీతయా సహ రాఘవౌ ||

3

ప్రవిష్టస్తు వనం ఘోరం బహుపుష్పఫలద్రుమమ్ |
దదర్శాశ్రమమేకాంతే చీరమాలాపరిష్కృతమ్ ||

4

తత్ర తాపసమాసీనం మలపంకజటాధరమ్ |
రామః సుతీక్ష్ణం విధివత్తపోవృద్ధమభాషత ||

5

రామోఽహమస్మి భగవన్భవంతం ద్రష్టుమాగతః |
త్వం మాఽభివద ధర్మజ్ఞ మహర్షే సత్యవిక్రమ ||

6

స నిరీక్ష్య తతో వీరం రామం ధర్మభృతాం వరమ్ |
సమాశ్లిష్య చ బాహుభ్యామిదం వచనమబ్రవీత్ ||

7

స్వాగతం ఖలు తే వీర రామ ధర్మభృతాం వర |
ఆశ్రమోఽయం త్వయాక్రాంతః సనాథ ఇవ సాంప్రతమ్ ||

8

ప్రతీక్షమాణస్త్వామేవ నారోహేఽహం మాహాయశః |
దేవలోకమితో వీర దేహం త్యక్త్వా మహీతలే ||

9

చిత్రకూటముపాదాయ రాజ్యభ్రష్టోఽసి మే శ్రుతః |
ఇహోపయాతః కాకుత్స్థ దేవరాజః శతక్రతుః ||

10

ఉపాగమ్య చ మాం దేవో మహాదేవః సురేశ్వరః |
సర్వాఁల్లోకాంజితానాహ మమ పుణ్యేన కర్మణా ||

11

తేషు దేవర్షిజుష్టేషు జితేషు తపసా మయా |
మత్ప్రసాదాత్సభార్యస్త్వం విహరస్వ సలక్ష్మణః ||

12

తముగ్రతపసా యుక్తం మహర్షిం సత్యవాదినమ్ |
ప్రత్యువాచాత్మవాన్రామో బ్రహ్మాణమివ కాశ్యపః ||

13

అహమేవాహరిష్యామి స్వయం లోకాన్మహామునే |
ఆవాసం త్వహమిచ్ఛామి ప్రదిష్టమిహ కాననే ||

14

భవాన్సర్వత్ర కుశలః సర్వభూతహితే రతః |
ఆఖ్యాతః శరభంగేణ గౌతమేన మహాత్మనా ||

15

ఏవముక్తస్తు రామేణ మహర్షిర్లోకవిశ్రుతః |
అబ్రవీన్మధురం వాక్యం హర్షేణ మహతాఽఽప్లుతః ||

16

అయమేవాశ్రమో రామ గుణవాన్రమ్యతామిహ |
ఋషిసంఘానుచరితః సదా మూలఫలాన్వితః ||

17

ఇమమాశ్రమమాగమ్య మృగసంఘా మహాయశాః |
అటిత్వా ప్రతిగచ్ఛంతి లోభయిత్వాకుతోభయాః ||

18

నాన్యో దోషో భవేదత్ర మృగేభ్యోఽన్యత్ర విద్ధి వై |
తచ్ఛ్రుత్వా వచనం తస్య మహర్షేర్లక్ష్మణాగ్రజః ||

19

ఉవాచ వచనం ధీరో వికృష్య సశరం ధనుః |
తానహం సుమహాభాగ మృగసంఘాన్సమాగతాన్ ||

20

హన్యాం నిశితధారేణ శరేణాశనివర్చసా |
భవాంస్తత్రాభిషజ్యేత కిం స్యాత్కృచ్ఛ్రతరం తతః ||

21

ఏతస్మిన్నాశ్రమే వాసం చిరం తు న సమర్థయే |
తమేవముక్త్వా వరదం రామః సంధ్యాముపాగమత్ ||

22

అన్వాస్య పశ్చిమాం సంధ్యాం తత్ర వాసమకల్పయత్ |
సుతీక్ష్ణస్యాశ్రమే రమ్యే సీతయా లక్ష్మణేన చ ||

23

తతః శుభం తాపసభోజ్యమన్నం
స్వయం సుతీక్ష్ణః పురుషర్షభాభ్యామ్ |
తాభ్యాం సుసత్కృత్య దదౌ మహాత్మా
సంధ్యానివృత్తౌ రజనీమవేక్ష్య ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే సప్తమః సర్గః ||

Aranya Kanda Sarga 7 Meaning In Telugu

రాముడు, సీతతోనూ, లక్ష్మణుని తోనూ, ఇంకా కొందరు మునులతోనూ సుతీక్ష మహర్షి ఆశ్రమమునకు వెళ్లాడు. సుతీక్ష మహర్షి ఆశ్రమము ఒక మహారణ్యములో చదునైన ప్రదేశములో ఉంది. ఆ అడవిలో ఫలవృక్షములు పుష్కలంగా ఉన్నాయి.

రాముడు ఆ ఆశ్రమములో ప్రవేశించాడు. తపస్సులో ఉన్న సుతీక్ష మహర్షిని చూచాడు. భక్తితో నమస్కరించాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు.

“ఓ మహర్షీ! నా పేరు రాముడు అయోధ్యాధి పతి దశరథుని కుమారుడను. తండ్రి ఆజ్ఞ మేరకు, నా భార్య, సోదరునితో కలిసి అరణ్యవాసము చేస్తున్నాను. శరభంగ మహర్షి ఆదేశము మేరకు తమ దగ్గరకు వచ్చాను. కళ్లు తెరిచి నాతో మాట్లాడండి.” అని ప్రార్థించాడు.

సుతీక్ష మహర్షి కళ్లు తెరిచాడు. రాముని చూచాడు. పరమానందంతో రాముని కౌగలించుకున్నాడు.

“రామా! నీకు స్వాగతము. నీరాకచే మా ఆశ్రమమునకు ఒక నాధుడు దొరికినట్టయింది. రామా! నీ గురించి విన్నాను. నీవు అరణ్యములలో సంచరిస్తున్నావని తెలిసి నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాను. దేవేంద్రుడు వచ్చి నన్ను స్వర్గలోకమునకు ఆహ్వానించాడు. నేను స్వర్గమునకు వెళ్లవలెనని నిశ్చయించుకున్నాను. కాబట్టి నేను ఆర్జించిన తపోఫలమును నీకు ధారపోస్తాను. నీవు స్వీకరించు.” అని అన్నాడు.

అప్పుడు రాముడు ఆ మహర్షితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నీ గురించి శరభంగ మహర్షి వలన విని ఉన్నాను. తమరు నాకు ఉండటానికి తగిన ప్రదేశమును నిర్ణయిస్తారని శరభంగ మహర్షి చెప్పాడు.” అని అన్నాడు.

“రామా! ఈ అడవిలో ఈ ప్రాంతము నివాసయోగ్యమైనది. ఇక్కడ ఫలవృక్షములు, పూదోటలు విస్తారముగా ఉన్నాయి. పర్ణశాల నిర్మించుకోడానికి అనువైన చదునైన ప్రదేశము ఉంది. కాబట్టి నీవు పర్ణశాల నిర్మించుకొని ఇక్కడే ఉండవచ్చును. కాని ఈ ప్రదేశమునకు పెద్ద పెద్ద జంతువులు గుంపులు గుంపులుగా వస్తాయి. కాని అవి ఎవరికీ హాని చెయ్యవు. కాసేపు అటూ ఇటూ తిరిగి వెళ్లిపోతాయి. అది తప్ప ఇక్క ఏ విధమైన భయము లేదు. ప్రశాంతంగా ఉంటుంది.” అని అన్నాడు సుతీక్ష మహర్షి.

అప్పుడు రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నాకు మృగముల వలన భయము లేదు. నేను వనవాసిని కాను కదా. క్షత్రియుడను. ఈ ధనుర్బాణములతో మనకు హాని కలిగించు మృగములను చంపగలను. కాని నేను మృగములను చంపడం సహజంగా దయాళువులైన మీకు కష్టం కలిగించవచ్చును. కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ కాలము ఉండలేను అనిపిస్తూ ఉంది.” అని అన్నాడు రాముడు.

తరువాత రాముడు, లక్ష్మణుడు సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు. సుతీక్ష మహర్షి రామలక్ష్మణులకు, సీతకు, వారితో వచ్చిన మునులకు ఫలములను ఇచ్చి సత్కరించాడు. ఆ రాత్రికి వారు సుతీక్షుని ఆశ్రమములోనే ఉన్నారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ అష్టమః సర్గః (8) >>

Ayodhya Kanda Sarga 83 In Telugu – అయోధ్యాకాండ త్ర్యశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 83 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ  త్ర్యశీతితమః సర్గ, “భరతవనప్రస్థానమ్”, రామాయణంలో ఒక ప్రాధాన్యభరితమైన భాగం. ఈ సర్గలో భరతుడు తన సైన్యంతో, మంత్రులతో, మరియు ప్రజలతో కలిసి రాముడిని తిరిగి తీసుకురావాలన్న పట్టుదలను చూపిస్తాడు. భరతుడు తన అన్న రాముడిని తిరిగి తెచ్చేందుకు చేసిన ఈ యాత్ర, అతని విధేయతను, ధర్మపరాయణతను, మరియు కుటుంబ ప్రేమను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది.

భరతవనప్రస్థానమ్

తతః సముత్థితః కాల్యమాస్థాయ స్యందనోత్తమమ్ |
ప్రయయౌ భరతః శీఘ్రం రామదర్శనకాంక్షయా ||

1

అగ్రతః ప్రయయుస్తస్య సర్వే మంత్రిపురోధసః |
అధిరుహ్య హయైః యుక్తాన్ రథాన్సూర్యరథోపమాన్ ||

2

నవనాగసహస్రాణి కల్పితాని యథావిధి |
అన్వయుర్భరతం యాంతమిక్ష్వాకు కులనందనమ్ ||

3

షష్ఠీ రథసహస్రాణి ధన్వినో వివిధాయుధాః |
అన్వయుర్భరతం యాంతం రాజపుత్రం యశస్వినమ్ ||

4

శతం సహస్రాణ్యశ్వానాం సమారూఢాని రాఘవమ్ |
అన్వయుర్భరతం యాంతం సత్యసంధం జితేంద్రియమ్ ||

5

కైకేయీ చ సుమిత్రా చ కౌసల్యా చ యశస్వినీ |
రామానయన సంహృష్టా యయుర్యానేన భాస్వతా ||

6

ప్రయాతాశ్చార్యసంఘాతాః రామం ద్రష్టుం సలక్ష్మణమ్ |
తస్యైవ చ కథాశ్చిత్రాః కుర్వాణా హృష్టమానసాః ||

7

మేఘశ్యామం మహాబాహుం స్థిరసత్త్వం దృఢవ్రతమ్ |
కదా ద్రక్ష్యామహే రామం జగతః శోకనాశనమ్ ||

8

దృష్ట ఏవ హి నః శోకమపనేష్యతి రాఘవః |
తమః సర్వస్య లోకస్య సముద్యన్నివ భాస్కరః ||

9

ఇత్యేవం కథయంతస్తే సంప్రహృష్టాః కథాశ్శుభాః |
పరిష్వజానాశ్చాన్యోన్యం యయుర్నాగరికా జనాః ||

10

యే చ తత్రాపరే సర్వే సమ్మతా యే చ నైగమాః |
రామం ప్రతి యయుర్హృష్టాః సర్వాః ప్రకృతయస్తదా ||

11

మణికారాశ్చ యే కేచిత్ కుంభకారాశ్చ శోభనాః |
సూత్రకర్మకృతశ్చైవ యే చ శస్త్రోపజీవినః ||

12

మాయూరకాః క్రాకచికా రోచకాః వేధకాస్తథా |
దంతకారాః సుధాకారాస్తథా గంధోపజీవినః ||

13

సువర్ణకారాః ప్రఖ్యాతాస్తథా కంబలధావకాః |
స్నాపకోచ్ఛాదకా వైద్యా ధూపకాః శౌండికాస్తథా ||

14

రజకాస్తున్నవాయాశ్చ గ్రామఘోషమహత్తరాః |
శైలూషాశ్చ సహ స్త్రీభిర్యయుః కైవర్తకాస్తథా ||

15

సమాహితా వేదవిదో బ్రాహ్మణా వృత్తసమ్మతాః |
గోరథైః భరతం యాంతమనుజగ్ముః సహస్రశః ||

16

సువేషాః శుద్ధ వసనాస్తామ్ర మృష్టానులేపనాః |
సర్వే తే వివిధైః యానైః శనైర్భరతమన్వయుః ||

17

ప్రహృష్టముదితా సేనా సాఽన్వయాత్కైకయీ సుతమ్ |
భ్రాతురానయనే యాంతం భరతం భ్రాతృవత్సలమ్ ||

18

తే గత్వా దూరమధ్వానం రథయానాశ్వకుంజరైః |
సమాసేదుస్తతో గంగాం శృంగిబేరపురం ప్రతి ||

19

యత్ర రామసఖో వీరో గుహో జ్ఞాతిగణైర్వృతః |
నివసత్యప్రమాదేన దేశం తం పరిపాలయన్ ||

20

ఉపేత్య తీరం గంగాయాశ్చక్రవాకైరలంకతమ్ |
వ్యవతిష్ఠత సా సేనా భరతస్యానుయాయినీ ||

21

నిరీక్ష్యానుగతాం సేనాం తాం చ గంగాం శివోదకామ్ |
భరతః సచివాన్ సర్వాన్ అబ్రవీద్వాక్యకోవిదః ||

22

నివేశయత మే సైన్యమభిప్రాయేణ సర్వతః |
విశ్రాంతః ప్రతరిష్యామః శ్వైదానీమిమాం నదీమ్ ||

23

దాతుం చ తావదిచ్ఛామి స్వర్గతస్య మహీపతేః |
ఔర్ధ్వదేహనిమిత్తార్థమ్ అవతీర్యోదకం నదీమ్ ||

24

తస్యైవం బ్రువతోఽమాత్యాస్తథా ఇత్యుక్త్వా సమాహితాః |
న్యవేశయంస్తాం ఛందేన స్వేన స్వేన పృథక్ పృథక్ ||

25

నివేశ్య గంగామను తాం మహానదీమ్
చమూం విధానైః పరిబర్హశోభినీమ్ |
ఉవాస రామస్య తదా మహాత్మనో
విచింతయానో భరతర్నివర్తనమ్ ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్ర్యశీతితమః సర్గః ||

Ayodhya Kanda Sarga 83 Meaning In Telugu

మరునాడు ఉదయము భరతుడు నిద్ర లేచాడు. ప్రాతఃకాల సంధ్యావందనాదికార్యకమములు నిర్వర్తించాడు. తన రథముఎక్కి బయలుదేరాడు. భరతుని వెంట పురోహితులు, మంత్రులు తమ తమ వాహనములలో బయలుదేరారు.

భరతుని వెనక 9,000 ఏనుగులు, 60,000 రథములు, వాటిలో ధనుస్సులు ధరించిన సైనికులు, ఒక లక్ష మంది ఆశ్విక సైన్యము రక్షణగా బయలుదేరింది. కౌసల్య, కైకేయీ, సుమిత్ర తమ తమ రథములలో భరతుని వెంట రాముని వద్దకు బయలుదేరారు. రాజకుటుంబము వారికి సన్నిహితంగా ఉన్నవారు, వర్తకులుకూడా రాముని వద్దకు బయలుదేరారు. వీరు కాకుండా వివిధ చేతి వృత్తులవారు ఎప్పుడు ఎవరి అవసరము వస్తుందో అని భరతుని వెంట బయలుదేరారు. వారి వెనక వేదములు వల్లిస్తూ బ్రాహ్మణులు ఎడ్లబండ్ల మీద భరతుని అనుసరించారు.

వారందరూ శృంగిభేర పురము దగ్గర ప్రవహించుచున్న గంగానదిని సమీపించారు. భరతుడు అక్కడ ఆగాడు. అమాత్యులను పురోహితులను సైన్యాధ్యక్షులను చూచి ఇలా అన్నాడు.

“ఈ రాత్రికి మనము ఈ గంగానదీ తీరములో విడిది. చేద్దాము. రేపు ఉదయము మన ప్రయాణము కొనసాగిస్తాము. నేను నా తండ్రికి గంగానదిలో జలతరణములు విడుస్తాను. మీరందరూ సేనలతో విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు.

భరతుని ఆదేశము మేరకు అందరూ ఆ రాత్రికి గంగానదీ తీరమున విడిదిచేసారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతురశీతితమః సర్గః (84) >>