మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీ స్కాంద పురాణము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఆశ్రయ పరిత్యాగ దోషము.
ఆశ్రయ పరిత్యాగ దోషము
ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్చాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామన మూర్తి తోసహా లక్షీకటాక్షం కొజకు తీర్భయాత్రులకు బయలుదేరారు. అట్ని మహనీయులు దర్శింప కోరిన పుణ్యక్షేత్తాలు తీర్ధాలు ఉన్న మన భారతదేశం ధన్యము. అట్బి అమ్మ కడుపున పుట్సిన మనము ధన్యులము.
మహదానందంతో వారెన్నో తీర్ధాలు దర్శించినారు. ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది. ఆ చెట్టు తొజ్బలో ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది. అది చూచి ఇంద్దాది దేవతలు “ఓ శుకవరా! ఈ వృక్షం బాగా శుష్కించియున్నది. పూలూ ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. ఐనను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు” అని అడిగినారు. చిలుక ఇలా బదులిచ్చింది
“ఓ దేవతలారా! ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యంగల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్స ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపడం ఎవరి తరము? ఒకప్పుడు నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఎండ వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసిన అది కృతఘ్నత అవుతుంది. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి తీదు కదా! నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలున్నూ”.
ఇలా ధర్మం మాట్లాడిన శుకరాజుని చూచి దేవేంద్రుడిలా అన్నాడు “ఓ శుక రాజమా! నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు”. అప్పుడు చిలుక ఇలా చెప్పింది “నేను ఎన్నడూ మిత్రద్దోహం చేయలేదు. తల్శిదండ్రులయందు అనురాగం కలవాడను. నా భార్యను బాగా చూనుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్నవారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాలవలన నాకు నిర్మలజ్నానం కలిగింది”.
చిలుక మాటలకు సతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు. “అయ్యా! నేను ఏ లోకాలనీ కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయుతే నాకు ఈ చెట్టు ఇవ్వడమేకాని నేన్నడును దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి” అని శుకము బదులిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు. ఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరు. తీర్భయాత్రులు కొనసాగించి చివరకు లక్షీకటాక్షం సంపాదించారు. తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్పాప్తించింది.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
మనకు నీడనిచ్చిన ఇంటిని మనకు అన్నంపెట్నిన నేలతల్సిని (దేశాన్ని) ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెబుతున్నది. అట్టు త్యజించినవాడు కృతఘ్నుడొతాడని శుకరాజం చెప్పింది. అలాగే మనం మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్న వారందరితో కృతజ్నతా భావంతో మెలగాలని శుకరాజు మనకు చెప్పాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు అష్టలక్ష్మీ స్తోత్రం గురించి తెలుసుకుందాం. అష్టలక్ష్మీ స్తోత్రం ఒక ప్రముఖమైన హిందూ ప్రార్థనా సంస్కృతిలో ఒక పవిత్ర స్తోత్రము. ఈ స్తోత్రం మహాలక్ష్మిని స్తుతిస్తుంది, అష్టలక్ష్మీలు మహాలక్ష్మి దేవికి అంగములగా అనిపిస్తాయి. ఈ స్తోత్రంలో లక్ష్మీదేవికి అనుగ్రహించే స్వర్ణదాత మహాలక్ష్మీకి అర్పించిన స్తుతులు ఉన్నాయి. ఈ స్తోత్రంలో ఆధ్యాత్మికత, ఐశ్వర్యం, ప్రేమ, క్షమా, శాంతి, సౌందర్యము, శక్తి, ధర్మము, కీర్తి, ధన సంపాదన, ఆరోగ్య లభ్యం లక్ష్మీ అనుగ్రహాన్ని చెందడంలో అందరికీ ఆశీస్సులు నివసించటం వంటి విషయాలు చెప్పబడినవి.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హనుమత్ పంచరత్నం పఠించడం వల్ల మేధస్సు, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత, అనారోగ్యాల నుండి విముక్తి, తెలివి యొక్క పదును మరియు మెరుగైన వక్తృత్వం మరియు సంభాషణ నైపుణ్యాలు వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు హనుమాన్ పంచరత్నం గురించి తెలుసుకుందాం.
Hanuman Pancharatnam Sthotram In Telugu – శ్రీ హనుమత్పంచరత్నం స్తోత్రం (తెలుగు)
ఈ పోస్ట్ లో ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 2
కీర్తన : ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు
సంఖ్య : 461
పుట: 311
రాగం: సాళంగనాట
సాళంగనాట
61 ఇహమెట్టో పరమబెట్టో ఇంక నాకు
సహజమై హరియే శరణము నాకు
||పల్లవి||
చిత్తమిది యొకటే చింత వేనేలసంఖ్య
పొత్తుల హరిఁదలఁచఁ బొద్దులేదు
జొత్తుల కన్నులు రెండు చూపులైతే ననంతాలు
తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు
||ఇహ||
చేతు లివియు రెండే చేష్టలు లక్షోపలక్ష
యీతల హరిఁ బూజించ నిచ్చ లేదు
జాతి నాలిక వొకటే చవులు కోటానఁగోటి
రీతి హరినామ ముచ్చరించ వేళ లేదు
||ఇహ||
వీను లివి రెండే వినికి కొలఁదిలేదు
పూని హరిభక్తి విన బుద్ధి లేదు
యీనటన శ్రీవేంకటేశుఁ డిటు చూచినను
తానే యేలె నిఁకఁ దడఁబాటు లేదు.
||ఇహ||461
అవతారిక:
నాకు ఇహలోకంతోకాని, పరలోకంతోకాని పనిలేదయ్యా! నా సహజగుణం ఒక్కటే. అది హరియే దిక్కని శరణాగతితో జీవితాంతం గడుపుట, అంటున్నారు అన్నమాచార్యులవారు. మానవజీవితం అన్నాక… మనస్సులో చింతలు తప్పవు, అనవసరమైన వాటినుంచి చూపులను మరల్చలేము, చేతులతో ఏవేవో వ్యర్థమైన పనులు చేస్తూనేవుంటాము, దేన్నిపడితే దాన్ని లొట్టలేసుకొని తింటాననే దౌర్భాగ్యపు నా నాలుకవున్నది, ఉన్నవి రెండే అయినా అంతేలేకుండా అన్నీ వినే చెవులున్నాయి. ఇవన్నీ భ్రష్టు పట్టిస్తూనేవున్నాయి. హరిభక్తి మీద బుద్ధినిలవటం లేదు. ఓ శ్రీవేంకటేశ్వరా! శరణు మహాప్రభో శరణు… అంటున్నారు.
భావ వివరణ:
ఓ మానవులారా! ఇక నాకు ఇహమెట్టో (ఇహలోకంలో ఏమవుతుందో) పరమెట్టో (ఊర్ధ్వలోకాలలో ఏమవుతుందో) పనిలేదు. నాకు సహజమైన (సహజసిద్ధంగా నిజాయితీగల) శరణాగతి హరియే (శ్రీహరి మాత్రమే).
నాది యెంత విచిత్రమైన పరిస్థితి అంటే… నాకున్న చిత్తము (మనస్సు) ఒక్కటే కాని దానికున్న చింతలు మాత్రం వేవేలు (వేలసంఖ్యలో వున్నాయి). నేను పెట్టుకొన్న పొత్తులతో (సంగత్వంతో) హరిని తలచుటకు పొద్దులేదు (తీరికేలేదు), జొత్తులకన్నులు (ఎఱ్ఱబారిన కళ్ళు) రెండే, కాని అవి చూచే చూపులకు అనవసరమైన వ్యాపకాలు మాత్రం అనంతం. కాని తత్తరించి (ఆరాటపడి) హరిని దగ్గరనుంచి చూడాలని మాత్రం వాటికుండదు.
నా ఈ చేతులు చూశారా! నాకున్నవి రెండే చేతులు. కాని ఇవి చేసే చేష్టలున్నాయే, అవి లక్షోపలక్ష (అనేక లక్షలు). కాని ఈతల (ఇటుచూస్తే) శ్రీహరిని పూజించాలంటేమాత్రం ఈ చేతులకి ఇచ్చలేదు (కోరిక పుట్టదు). ఇక, జాతి నాలిక (అతిసామాన్య ఔన్నత్యంగల నాలిక) నాకూ ఒక్కటే వున్నది. కాని దానికి కావలసిన చవులు (రుచులు) మాత్రం కోటానుకోట్లు. కాని రీతి (విధాయకంగా) హరినామాన్ని వుచ్చరించటానికి (అనుటకు) వేళలేదు (సమయం దొరకడంలేదు).
వీనులివి రెండే (నాకున్న చెవులు రెండు మాత్రమే). కాని ఇవి వినాలనుకొనే మాటలకి అంతుపొంతులేదు. వాటికి పూనికతో హరిభక్తి గురించి వినండి అంటే వాటికి బుద్ధిలేదు. ఇట్లాంటి నటన (నడవడితో) వున్న నన్ను శ్రీవేంకటేశుడు, ఇటుచూచి, తానే పోనీలే వీడు అర్భకుడు అని జాలిపడి యేలె నన్ను (స్వీకరించి పాలించాడు). అమ్మయ్య! ఇక తడబాటు (తత్తరబాటు) లేదు. ఆయన రక్షణలో బ్రతికేస్తున్నాను. భయం వదిలేశాను.
అరణ్యకాండ పంచసప్తతితమః సర్గః అరణ్యకాండ లోని ఈ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో వాసం ఉంటున్నారు. ఆ సమయంలో శూర్పణఖ రాముడిని చూసి ఆకర్షితురాలవుతుంది. ఆమె రాముడిని పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. రాముడు తాను సీతకు అంకితమై ఉన్నానని, ఆమెకు తగినవాడు లక్ష్మణుడని చెప్పి, ఆమెను లక్ష్మణుడి వద్దకు పంపిస్తాడు. లక్ష్మణుడు కూడా ఆమెను తిరస్కరిస్తాడు. శూర్పణఖ తన అసలు రూపంలోకి మారి సీతను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. క్షణంలోనే లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవిని కత్తితో కోసివేస్తాడు. శూర్పణఖ రక్తమోడుతూ లంకకు పారిపోతుంది.
శబరి తన భౌతిక శరీరమును విడిచి ఉత్తమలోకములు పొందిన తరువాత రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు.
“లక్ష్మణా! మనము ఆశ్చర్యకరమైన ఈ వనమును చూచినాము. ఏడు సముద్రములు కలిసిన ఈ తీర్థములలో స్నానము చేసాము. మన పితరులకు జలతర్పణములు విడిచాము. మనకు ఉన్న అశుభములు అన్నీ తొలగిపోయాయి. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. మనము ఇప్పుడు పంపాసరస్సు దగ్గర ఉన్న ఋష్యమూక పర్వతమునకు పోవుదము. వానరులకు రాజు అయిన సుగ్రీవుని చూడవలెనని అతనితో మైత్రిచేసుకొనవలెనని నాకు చాలా ఆతురతగా ఉంది. ఎందుకంటే సీతాన్వేషణ కార్యక్రమము సుగ్రీవుని మీదనే ఆధారపడి ఉంది” అని అన్నాడురాముడు.
“అలాగే అన్నయ్యా! మనము తొందరగా ఋష్యమూక పర్వతము వద్దకు పోవుదము.” అని అన్నాడు లక్ష్మణుడు. తరువాత రామలక్ష్మణులు పంపాసరోవరతీరమునకు చేరుకున్నారు. ఆ పంపాసరోవరము చాలా మనోహరంగా ఉంది. ఆ సరోవరం నిండా తామరపూలు పూచి ఉన్నాయి. ఆ సరోవరము పక్కనే ఉన్న మతంగ సరస్సు లో రాముడు స్నానం చేసాడు. తరువాత రామలక్ష్మణులు అనేక వృక్షములతో నిండి ఉన్న వనములో ప్రవేశించారు. దాని పక్కనే ఉన్న ఋష్యమూక పర్వతమును చూచారు.
“లక్ష్మణా! అదే ఋష్యమూక పర్వతము దాని మీదనే ఋక్షరజస్సు అనే వానరుని కుమారుడు సుగ్రీవుడు తన అనుచరులతో నివసిస్తున్నాడు. లక్ష్మణా! నీవు సుగ్రీవుని వద్దకు పోయి మన రాక గురించి చెప్పు. నీకు తెలుసు కదా! నేను రాజ్యమును, నా భార్య సీతను పోగొట్టుకొని అపారమైన దుఃఖములో ఉన్నాను. నీవు వెళ్లి నా బదులుగా సుగ్రీవునికి మన గురించి చెప్పు” అని అన్నాడు రాముడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ త్రిసప్తతితమః సర్గ రామాయణంలో కీలకమైన అధ్యాయం. ఈ సర్గలో రావణుడు తన చెల్లెలు శూర్పణఖ రాముడిచేతిలో అవమానించబడిన విషయాన్ని తెలుసుకుని ఆగ్రహిస్తాడు. సీతను అపహరించడానికి రావణుడు మారీచుడి సహాయంతో పన్నాగం వేస్తాడు. మారీచుడు మాయమ్రుగం రూపంలో కనిపించి, సీతను ఆకర్షిస్తాడు. సీత అతన్ని పట్టుకోవాలని రాముడిని పంపిస్తుంది. రాముడు అతన్ని అనుసరించి అటవీ లోతుల్లోకి వెళ్ళాడు. ఇది రావణుడు సీతను అపహరించడానికి సువర్ణావకాశంగా మారుతుంది.
కబంధుడు ఇంకా రామునితో ఇలా అన్నాడు. “ఓ రామా! నీవు ఇక్కడి నుండి పశ్చిమ దిక్కుగా వెళ్లు. నీకు దారితో ఫలవృక్షములు, పూలు సమృద్ధిగా పూచే చెట్లు కనిపిస్తాయి. నీవు ఆ వనము దాటిన తరువాత మరొక వనము కనిపిస్తుంది. ఆ వనములో ఉన్న వృక్షములు అన్ని ఋతువులలోనూ పూలు, పండ్లు ఇస్తాయి. అదీ ఆ వనము మహాత్మ్యము. మీరు ఆ వనము దాటితే పంపా సరోవరము చేరుకుంటారు.
ఆ పంపా సరస్సు కలువలతోనూ, పద్మములతోనూ నిండుగా ఉంటుంది.. ఆ సరస్సులో హంసలు, క్రౌంచపక్షులు, ఇంకా ఇతర రకములైన పక్షులు సమృద్ధిగా ఉంటాయి. మీరు ఆ వనములో ఉన్న పండ్లను, సరస్సులో ఉన్న చేపలను తిని ఆ సరస్సులో ఉన్న నీరు తాగి మీ ఆకలి దప్పులు తీర్చుకోవచ్చును. మనోహరమైన ఆ వనములో ప్రవేశించగానే నీ శోకము తీరిపోతుంది.
పూర్వము ఆ వనములో మతంగ మహాముని శిష్యులు
నివసించేవారు. ఆ శిష్యులు తమ గురువుగారికి కావలసిన సమిధలు, పండ్లు పూలు తెచ్చేటప్పుడు వారి శరీరమునుండి కారిన చెమట వలన ఆ వనములో పండ్ల చెట్లు పూల చెట్లు మొలిచాయి. అందుకని ఆ చెట్లకు పూచిన పూలు ఎప్పటికీ వాడిపోవు.
ఆ మతంగ మహాముని శిష్యులైన ఋషులకు సేవ చేసిన శబరి అనే సన్యాసిని ఇంకా ఆ వనములో నివసిస్తూ ఉంది. ఆ శబరి నీ దర్శనము కోసరం ఎదురు చూస్తూ ఉంది. నీ దర్శనభాగ్యము కలిగిన తరువాత ఆమె పరలోకము చేరుకుంటుంది.
ఆ పంపా సరస్సు పశ్చిమంగా ఒక ఆశ్రమము ఉంది. ఆ ఆశ్రమములో ఇప్పటికీ మతంగ మహాముని ఏర్పరచిన నియమాలు పాటింపబడుతున్నాయి. ఆ ఆశ్రమమును అడవి జంతువులు గానీ ఇతరులు గానీ పాడు చేయలేరు.
పంపా సరస్సు పక్కనే ఋష్యమూక పర్వతము ఉంది. ఆ పర్వతము మీద చిన్న చిన్న ఏనుగులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఆ పర్వతము బ్రహ్మచే సృష్టింపబడినది అని అంటారు. ఆ పర్వతము మీద నిద్రించిన వారికి స్వపములో ఏమి కనిపిస్తుందో మెలుకువ రాగానే అది లభిస్తుంది.. మనసులో చెడు ఆలోచనలు ఉన్నవారు ఆ పర్వతము ఎక్కలేరు. ఒకవేళ ఎక్కినా, నిద్రపోతున్నపుడు రాక్షసులు వారిని చంపుతారు. ఆ ఋష్యమూక పర్వతముమీద ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలోనే సుగ్రీవుడు తన అనుచరులతో నివసిస్తున్నాడు. సుగ్రీవుడు అతని నలుగురు అనుచరులు అప్పుడప్పుడు పర్వతశిఖరము మీద కు వచ్చి కొంతసేపు విహరించి మరలా గుహాంతర్భాగమునకు వెళు తుంటారు. నీవు వెంటనే వెళ్లి ఆ సుగ్రీవుని కలుసుకో. అతనితో మైత్రి చెయ్యి. నీకు శుభం కలుగుతుంది.” అని పలికాడు కబంధుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుః సప్తతితమః సర్గ రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్తాడు. సీత రాముని కోసం విలపిస్తూ, రావణుని వేధింపులను తిప్పికొడుతుంది. మార్గమధ్యలో జటాయువు రావణుని ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ రావణుడు అతనిని గాయపరుస్తాడు. సీత తన ఆభరణాలను కిందకు విసిరి, వాటిని వానరులు కనుగొంటారు. రాముడు, లక్ష్మణుడితో కలిసి సీతను వెతుకుతూ జటాయువును కలుస్తాడు. జటాయువు సీత అపహరణ వివరాలు చెప్పి, తన ప్రాణాలను కోల్పోతాడు.
తరువాత రామలక్ష్మణులు పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేసి పంపాసరోవరము చేరుకున్నారు. వారు సుగ్రీవుని వెతుక్కుంటూ వెళు తున్నారు. వారు పంపా సరోవరము పశ్చిమదిక్కుకు చేరుకున్నారు. అక్కడ వాళ్లకు శబరి నివసించే ఆశ్రమము కనపడింది. వారు ఆ ఆశ్రమము దగ్గర ఉన్న శబరిని చూచారు.
రామలక్ష్మణులను చూచిన శబరి సంభ్రమంతో లేచి వారికి ఎదురు వచ్చింది. రామలక్ష్మణుల పాదములకు నమస్కరించింది. వారికి అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది. అడవిలో తాను సేకరించిన పళ్లను వారికి సమర్పించింది. (ఎంగిలి పళ్లను ఇచ్చింది అన్న విషయం వాల్మీకి రామాయణంలో లేదు). రాముడు శబరిని పరామర్శించాడు.
“ఓ మాతా! నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉందా! నీ తపస్సు సిద్ధించిందా!” అని అడిగాడు.
“రామా! ఈ రోజు నీ దర్శన భాగ్యంతో నా తపస్సు సిద్ధించింది. నీ రాకకోసరమే నేను వేచిఉన్నాను. నీ రాకతో నేను చేసిన తపస్సు, నేను చేసిన గురుసేవ సార్ధకం అయ్యాయి. నీ దయా దృష్టి తగిలి నేను ఉత్తమ లోకములకు వెళ్లగలను. నేను సేవచేసిన మునులందరూ ఉత్తమలోకములు పొందారు. నేను మాత్రము నీ దర్శనము కొరకు ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే నీగురించి వారే నాకు చెప్పారు. “ఇక్ష్వాకు వంశములో పుట్టిన రాముడు లక్ష్మణ సమేతుడై నీ ఆశ్రమమునకు రాగలడు. నీవు రామునికి అతిథి సత్కారములు చేసి తరించు.” అని చెప్పారు. అప్పటి నుండి మీ రాక కోసరం ఎదురు చూస్తున్నాను… రామా! నీవు ఎప్పుడు వస్తావో ఏమోఅని ఈ పంపాతీరంలో దొరికే తినే పదార్థములనుసేకరించి ఉంచాను వాటిని నీవుస్వీకరించు.” అని అన్నది శబరి.
శబరి మాటలకు రాముడు ఎంతో సంతోషించాడు. శబరితో ఇలా అన్నాడు. “ఓ శబరీ! దనువు అనే వాని నుండి నీ గురించి, ఈ ప్రాంతము గురించి, విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షముగా చూడాలని అనుకుంటున్నాను.” అని అన్నాడు.
అప్పుడు శబరి తన వెంట రామలక్ష్మణులను తీసుకొని వెళ్లి ఆ వనము నంతా చూపించింది. “రామా! ఈ వనము మతం వనము అని ప్రసిద్ధిచెందింది. మతంగ మహాముని శిష్యులైన నా గురువులు ఇక్కడ ఎన్నో యజ్ఞాలు చేసారు. ఆ ఋషులు ఇక్కడే దేవతలకు పుష్పములు సమర్పించారు. వారు స్మరించగానే సప్తసముద్రములు ఇక్కడకు వచ్చాయి. ఆ సముద్రములలో వారు స్నానము చేసి ఆరవేసిన నార చీరలు ఇంకా వేలాడుతున్నాయి చూడు. వారి ప్రభావము చేత ఇక్కడ పూచిన పూలు వాడిపోవు. ఫలములు చెడిపోవు.
రామా! నీకు ఈ వనములోని విశేషములు అన్నీ చూపించాను. ఇంక నాకు అనుమతి ఇస్తే ఈ దేహమును విడిచిపెడతాను. ఉత్తమ లోకములు పొందిన నా గురువులను చేరుకుంటాను.” అని పలికింది శబరి.
ఆ శబరి మాటలు విన్న రామలక్ష్మణులు ఎంతో సంతోషించారు. శబరికి అనుజ్ఞ ఇచ్చారు. అప్పుడు శబరి తన శరీరమును అగ్నిలో ఆహుతి చేసి ఉత్తమలోకములకు వెళ్లిపోయింది. శబరి తన తపోబలము చేత తాను సేవించిన గురువులు పొందిన ఉత్తమ లోకాలు పొందింది.
కిష్కింధాకాండ త్రింశః సర్గః, ఈ సర్గలో హనుమంతుడు, వాలి హతమైన తరువాత, సుగ్రీవుని రాముడి వద్దకు తీసుకువస్తాడు. రాముడు సుగ్రీవునికి కిష్కింధ రాజ్యాన్ని అప్పగించతాడు. సుగ్రీవుడు తన సైన్యంతో కిష్కింధ చేరుకొని వాలి పంతుల్ని, మిత్రుల్ని సాంత్వన పరుస్తాడు. అనంతరం, సుగ్రీవుడు తన భార్య తారతోపాటు, సర్వమాన్యుల సమక్షంలో రాముడి ఆజ్ఞానుసారం రాజ్యపదవిని స్వీకరిస్తాడు. ఆ తరువాత సుగ్రీవుడు, హనుమంతుడు మరియు ఇతర వానరులు రాముని సేవలో ఉంటారు. హనుమంతుడు, రాముడు సీతా మాతను రక్షించడానికి తీసుకునే చర్యలపై చర్చిస్తారు.
వర్షాకాలము గడిచి పోయినను సుగ్రీవుడు తన వద్దకు రాలేదని రాముడు చింతిస్తున్నాడు. సుగ్రీవుడు కామాసక్తుడై తనకు ఇచ్చిన మాటను మరచినాడని, తన భార్య సీతను తలచుకొని దు:ఖిస్తున్నాడు. “ఈ శరత్కాలములో పండువెన్నెలలో సీతతో కూడా విహరించవలసిన తాను ఈ ప్రకారము భార్యావియోగము అనుభవించవలసి వచ్చినదే అని మనసులో ఆరాటపడుతున్నాడు. రాముడు. ఒకవేళ బతికి ఉంటే సీత ఈ శరత్కాల రాత్రులను ఎలా గడుపుతూ ఉందో అని ఆలోచిస్తున్నాడు. సీత తన దగ్గర లేకపోవడంతో రాముడు శరత్కాల వైభవాలను ఆస్వాదించలేకపోతున్నాడు.
మరలా తన అన్నగారు రాముడు సీత గురించి ఆలోచించడం చూచాడు లక్ష్మణుడు. మరలా రాముని ఉత్తేజపరచి కార్యోన్ముఖుడిని చేయదలిచాడు. రామునితో ఇలా అన్నాడు.
“రామా! ఏమిటీ వెర్రి! ఈ ప్రకారము కామానికి వశుడు కావడం వలన ప్రయోజనము ఏముంది! దీని వలన మానసిక స్థైర్యము నశించడం తప్ప వేరే ఏమీ జరగదు. ఏ కార్యమూ సిద్ధించదు. కాబట్టి నీవు నీ మనసులో నుండి చింతను తొలగించి, మనసును నిర్మలం చేసుకొని, కాగల కార్యము నందు శ్రద్ధ చూపు. ధైర్యము చేత ఏ కార్యము నైననూ సిద్ధింప చేసుకొన వచ్చును కదా! మనం ధైర్యంగా ఉంటే దైవము కూడా మనకు తోడుపడుతుంది. ముందు సుగ్రీవుడు మనకు ఎంత వరకూ సాయ పడగలడో ఆలోచించాలి.” అని లక్ష్మణుడు రామునికి కర్తవ్యమును బోధించాడు. రాముడు లక్ష్మణునితో ఇలాఅన్నాడు. “లక్ష్మణా! అప్పుడప్పుడు నా మనసు అలా దైన్యము చెందుతూ ఉంటుంది. నీ మాటలతో మరలా ధైర్యము తెచ్చుకుంటూ ఉంటాను. మనము తల పెట్టిన కార్యమును నెరవేరేట్టు చూడాలి.
లక్ష్మణా! వర్షాకాలము పూర్తి అయినది. వర్షములు ఆగిపోయినవి. శరత్కాలము ప్రవేశించినది. ఆకాశము నిర్మలంగా ఉంది. రాత్రుళ్లు చంద్రుడు తన కాంతితో ఈ జగత్తును అంతా తేజోమయం చేస్తున్నాడు. నేలంతా తడి ఆరిపోయి నడవడానికి అనుకూలంగా ఉంది. రాజులు శత్రురాజుల మీద దండయాత్రలు చేయుటకు తగు సమయము ఆసన్నమయింది. కానీ సుగ్రీవుడు ఎందుకో ఇంకా నా వద్దకురాలేదు. కనీసము సీతను వెదకడానికి ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపించడం లేదు.
నేనేమో ఇక్కడ సీతా వియోగ దుఃఖంతో అలమటిస్తుంటే, అక్కడ సుగ్రీవుడు కామభోగాలలో మునిగి తేలుతున్నాడు. అటు రాజ్యం పోగొట్టుకొని, ఇటు భార్యను పోగొట్టుకొని బాధ పడుతున్న నా మీద సుగ్రీవునికి దయ కలగడం లేదు. సుగ్రీవుడు తన పని అయిపోయింది కదా అని నిర్లక్ష్యంగా ఉన్నాడు.
“ఈ రాముడు తండ్రి చేత రాజ్యము నుండి వెళ్ల గొట్టబడిన అనాధ. పైగా రావణుడు అతని భార్యను అపహరించాడు. నా శరణు వేడాడు. ప్రస్తుతము నేనే రామునికి దిక్కు” అని సుగ్రీవుడు నన్ను అవమానిస్తున్నాడు. సుగ్రీవుడు, తన పని పూర్తి కాగానే, నాతో చేసుకొన్న ఒడంబడికను మరచి పోయినట్టున్నాడు. లక్ష్మణా! నీవు కిష్కింధకు పోయి, సుగ్రీవుని కలిసి నా మాటగా చెప్పు.
” మిత్రుని వలన తన పనిపూర్తి కాగానే, తాను మిత్రునికి ఇచ్చిన మాట మరచిన వాడు అధముడు. అది పుణ్యమైనను, పాపమైనను, మిత్రునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొనేవాడు ఉత్తముడు. తనకు సంబంధించిన పనులు పూర్తి అయిన తరువాత, ఇంకా పనులు పూర్తి కాని మిత్రులకు ఎవరైతే సాయం చెయ్యరో అటువంటి వారి మాంసమును కుక్కలు కూడా ముట్టవు. ఇది ధర్మము.
సుగ్రీవుడు మరలా నా ధనుష్టంకారమును వినదలచు కొన్నాడో ఏమో అడిగి తెలుసుకో. ఈ సారి నేను బాణం ఎక్కుబెడితో అది సుగ్రీవుని మీదనే అవుతుంది. సుగ్రీవుడు లేకపోయినా నీ సాయంతో నేను కార్యం సాధించగలను. కానీ, సుగ్రీవుడు తన పని పూర్తి అయిన తరువాత, మనలను మరచిపోయినట్టున్నాడు. అది గుర్తు చెయ్యి. సుగ్రీవుడు మనలను వర్షాకాలము వరకూ ఆగమన్నాడు. వర్షాకాలము అయిపోయినా, సుగ్రీవుడు ఇంకా మద్యపాన మత్తులో, కామభోగములలో మునిగి తేలుతున్నాడు. ఇంకా మత్తు వదిలినట్టు లేదు. మనలను పూర్తిగా మరచినట్టున్నాడు.
లక్ష్మణా! నీవు పోయి సుగ్రీవుని కలిసి, నాకు కోపం వస్తే జరిగే పరిణామాలను అతనికి తెలియజెయ్యి.
“సుగ్రీవా! వాలి వెళ్లిన మార్గము ఇంకా మూసివేయబడ లేదు. నీ కోసం ఇంకా తెరిచి ఉంచాను. వాలి వెళ్లిన మార్గంలో వెళ్లడానికి ప్రయత్నించకు. ఓ సుగ్రీవా! నేను వాలిని ఒక్క బాణంతోనే చంపాను. కానీ మాట తప్పిన నిన్ను మాత్రం బంధు మిత్రులతో సహా చంపుతాను.
ఓ సుగ్రీవా! అశాశ్వతములైన కామసుఖములను విడిచి పెట్టి, శాశ్వతమైన ధర్మాన్ని అనుసరించు. పూర్వము నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకో. అంతేకాని, నా బాణములకు ఎరగా మారి, పరలోకంలో ఉన్నవాలిని కలవడానికి ప్రయత్నించకు.”
అని నా మాటగా చెప్పు. ఇంకా నీకు తోచినవి, మనకు హితము చేకూర్చే మాటలు చెప్పు. ఇంక ఆలస్యముచేయకు.” అని రాముడు లక్ష్మణునితో అన్నాడు.
కిష్కింధాకాండ ఏకోనత్రింశః సర్గః, ఈ సర్గలో హనుమంతుడు లంకా నుంచి తిరిగి రావడంతో రాముడు హర్షం పొందుతాడు. హనుమంతుడు సీతకు సంబంధించిన చూడు, రాక్షసుల గురించి రాముడికి వివరించతాడు. హనుమంతుడు సీతమ్మత చేతులు రాముడి పాదుకలను తీసుకొని వచ్చి, రాముడికి అందిస్తాడు. హనుమంతుడు సీతా మాత రాముడిని స్మరించి ఉంచిన అంగుళి రింగును కూడా రాముడికి చూపిస్తాడు. రాముడు సీతా మాతకు భరోసా కల్పిస్తాడు. హనుమంతుడు సీతని రక్షించడానికి తీసుకువెళ్లే విధానాలపై చర్చిస్తాడు. రాముడు, సుగ్రీవుడు, హనుమంతుడు మరియు ఇతర వానరులు లంకా యుద్ధానికి సన్నద్ధమవుతారు.
వర్షాకాలము పూర్తి అయింది. శరదృతువు ప్రవేశించింది. ఆకాశం నిర్మలమయింది. కాని సుగ్రీవుడు ఇంకా కామభోగములలో మునిగి తేలుతున్నాడు. అంత:పురము విడిచి రావడం లేదు. స్త్రీల సాహచర్యంలోనే గడుపుతున్నాడు. తన భార్య రుమతోనూ, తన అన్న భార్య తార సాహచర్యంలోనూ ఆనందంగా గడుపుతున్నాడు.
(స్వాం చ పత్నీమభిప్రేతాం తారాం చాపి సమీప్సితామ్, విహరన్తమహోరాత్రం అంటే తన భార్యను, తానుకోరిన తారను అహోరాత్రాలు విహరిస్తున్నాడు… అని ఉంది. అలాగే ముప్పది ఒకటవ సర్గలో కూడా ఈ క్రింది శ్లోకము ఉంది. “తారయా సహితః కామాసక్త:” అంటే తారతో కలిసి కామాసక్తుడై ఉన్నవాడు అనిఉంది. అంటే వాలి చని పోయిన తరువాత వాలి భార్య తార సుగ్రీవుని వశం అయిందని అర్ధం అవుతూ ఉంది. మరి వాలి చేసిన తప్పే సుగ్రీవుడు చేస్తున్నాడు కదా! అంటే సుగ్రీవుడు బతికి ఉండగానే వాలి, సుగ్రీవుని భార్య రుమను అనుభవించాడు. కానీ సుగ్రీవుడు, వాలి చనిపోయిన తరువాత, వాలి భార్య తారను అనుభవించాడు అని అర్థం చెప్పుకోవాలి.)
సుగ్రీవుడు కనీసం మంత్రులకు కూడా దర్శనం ఇవ్వడం లేదు. కార్యభారము అంతా మంత్రులకు అప్పచెప్పాడు. ఇంక ఎవరి వల్లా తనకు ఆపదలేదు అని నిర్భయంగా స్వేచ్ఛగా విహరిస్తున్నాడు. సుగ్రీవుని వ్యవహారము హనుమంతునికి నచ్చలేదు. రాముడికి ఇచ్చిన మాట, చేసిన వాగ్దానము సుగ్రీవునికి గుర్తుచేయాలని అనుకున్నాడు. సుగ్రీవుని వద్దకు పోయి ఇలా అన్నాడు. ” ఓ రాజా! నీవు రాముని మూలంగా ఈ రాజ్యమును, కీర్తిని సంపాదించుకున్నావు. ఇంక నీవు, నీ మిత్రుడు రామునికి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవలసిన సమయము ఆసన్నమయింది. నీవు రాముని కార్యము నిర్వర్తించాలి.
మిత్రుల విషయంలో బాగా ప్రవర్తించే వాళ్లు కీర్తిమంతులు అవుతారు. ఒక రాజుకు తన కోశాగారము, సైన్యము, తన మిత్రులు, తన ప్రభుత్వము ఈ నాలుగు అత్యంత ముఖ్యమైనవి. అందుకని, నీ మిత్రుడు రామునికి ఇచ్చిన మాట నెరవేర్చు. మిత్రునికి ఇచ్చిన మాట నెరవేర్చని వాడు అన్ని కష్టాలను ఎదుర్కొంటాడు.
రాజా! ఏకార్యము చేసినా సకాలంలో చెయ్యకపోతే, తరువాత ఎంత గొప్పగా చేసినా దానికి ఫలితం ఉండదు. పైగా ఆ పనిచెయ్యనట్టే అవుతుంది. ఓ రాజా! రాముని కార్యం చెయ్యడంలో ఇప్పటికే కాలం మించిపోయింది. ఇప్పటికైనా రామకార్యములో నిమగ్నమవ్వు. వానలు తగ్గిపోయాయి. సీతాన్వేషణ ప్రారంభించడానికి ఇప్పటికే సమయం దాటిపోయింది. వానాకాలము ఆగిపోయింది, సమయం మించి పోయింది అని రామునికి తెలిసినా, నిన్ను తొందర పెట్టడం మంచిది కాదని రాముడు నీకోసం ఎదురుచూస్తున్నాడు. రాముడు నీకు మేలు చేసాడు. తిరిగి రాముడికి మేలు చెయ్యడానికి ఆలస్యం చెయ్యడం మంచిదికాదు. రాముడు వచ్చి నీ మాటను నీకు గుర్తుచేసే వరకూ ఆగకు. అప్పటిదాకా ఆగితే, నీవు కావాలని ఆలస్యము చేసినట్టు అవుతుంది.
ఓ రాజా! నీకు ఏ సాయమూ చేయని వారికి కూడా నీవు సాయం చేస్తావు కదా! మరి నీకు ఇంత సాయం చేసిన రామునికి సాయం చెయ్యడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? వానరులను పిలిచి వారికి సీతాన్వేషణకు ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదు? రాముడు తన బాణములతో దేవతలను, రాక్షసులను అంతమొందించ గల సామర్ధ్యము కలవాడు. కానీ నీ సాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు చేసిన ప్రతిజ్ఞను నెరవేరుస్తావా లేదా అని వేచి ఉన్నాడు.
కాబట్టి ఓ వానర రాజా! నీకు ముందుగా ఉపకారము చేసిన రామునికి ప్రత్యుపకారము చేయడానికి ఉద్యమించు. మేమందరమూ నీ కొరకు ఎదురుచూస్తున్నాము. నీ ఆజ్ఞ అయితే మేము భూమ్యాకాశములను గాలించి సీత జాడ తెలుసుకుంటాము. నీ అధీనములో ఒక కోటి కంటే ఎక్కువ సంఖ్యలో వానరులు ఉన్నారు. వారిని రామకార్యమునకు తగిన విధంగా నియోగించు. త్వరపడు.” అని హితబోధ చేసాడు హనుమంతుడు. తనమంత్రి అయిన హనుమంతుని మాటలను శ్రద్ధగా విన్నాడు సుగ్రీవుడు. వెంటనే నీలుని పిలిపించాడు. సీతాన్వేషణ కొరకు వానర సేనలను అన్నిదిక్కులనుండి కిష్కింధకు రప్పించమని ఆదేశాలు ఇచ్చాడు. సమస్త వానరసేనలను తన ముందు నిలుప మని ఆదేశాలు ఇచ్చాడు. “పదిహేను దినములలో వానరులందరూ కిష్కింధ చేరు కోవాలి. ఆ గడువు మించితే మరణదండన విధించబడుతుంది.” అని వానరులను ఆదేశించాడు. హనుమంతుని, అంగదుని కొంతమంది వానర ప్రముఖులను కలిసికొనమని ఆదేశించాడు. ఆ ప్రకారంగా ఆదేశాలు ఇచ్చిన సుగ్రీవుడు అంతఃపురమునకు వెళ్లిపోయాడు.
కిష్కింధాకాండ అష్టావింశః సర్గః, ఈ సర్గలో సుగ్రీవుడు తన వానర సేనను సీతా మాత కోసం అన్వేషణ ప్రారంభించాలని ఆదేశిస్తాడు. సేనను ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, తూర్పు అనే నాలుగు దిశల్లో పంపుతాడు. సేనకు నాయకత్వం వహించడానికి ప్రధాన వానరులను నియమిస్తాడు. హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు దక్షిణ దిశలో అన్వేషణకు బయలుదేరుతారు. రాముడు హనుమంతుడికి తన రింగును అందించి, సీతా మాతకు చూపించమని ఆదేశిస్తాడు. ఈవిధంగా, వానర సేన సీతా మాత కోసం విస్తృతంగా అన్వేషణ మొదలుపెడుతుంది.
వర్షాకాలము మొదలయింది. ఆకాశమంతా మేఘావృతము అయింది. వేసవి కాలము అంతా ఆకాశము సూర్య కిరణముల ద్వారా నీటిని తాగి, వర్షాకాలములో ఆ జలములను మరలా భూమి మీదికి వదులుతూ ఉంది. ఆకాశమునుండి కారుతున్న వర్షపు ధారలు సీత కళ్ల నుండి కారుతున్న కన్నీళ్ల మాదిరి కనపడుతున్నాయి రామునికి.
మేఘాలు వర్షిస్తున్నాయి. నదులన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి. నెమళ్లు నర్తిస్తున్నాయి. అప్పటి వరకూ నిద్రాణంగా ఉన్న రకరకాలైన కప్పజాతులు, వర్షము పడగానే భూమిపైకి వచ్చి రణగొణధ్వనులు చేస్తున్నాయి. నదులన్నీ గట్లు తెంచుకొని ప్రవహిస్తూ తమ నాధుడైన సముద్రుని చేరుటకు ఉరకలు వేస్తున్నాయి. ఇవన్నీ చూచి రాముడు ఇలా అనుకుంటున్నాడు.
“అయోధ్యలో కూడా సరయూ నది నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది. భరతుడు కూడా తన దైనందిన కర్మలు పూర్తి చేసుకొని ఆషాఢ మాస వ్రతమును ప్రారంభించి ఉంటాడు. భరతుడు అయోధ్యలో వ్రతాలు చేస్తుంటే నేను ఇక్కడ భార్యను పోగొట్టు కొని దు:ఖిస్తున్నాను.
సుగ్రీవుడు ఎప్పుడు వస్తాడో ఏమో! ఒకవేళ వచ్చినా ఈ వర్షాకాలంలో వానరులు వెళ్లి వెతకడం అసాధ్యం కదా! అందుకే సుగ్రీవుడు వర్షాకాలము అయిపోయిన తరువాత వస్తాడు. అప్పుడు సీతను వెదకడం సులభం అవుతుంది. సుగ్రీవుని కోసరం వేచి ఉండక తప్పదు” అని అనుకొన్నాడు రాముడు.