Balakanda Sarga 36 In Telugu – బాలకాండ షట్త్రింశః సర్గః

Balakanda Sarga 36 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ షట్త్రింశః సర్గః: రామాయణంలోని బాలకాండలో షట్త్రింశః సర్గః కీలకమైన భాగం. ఈ సర్గలో, రాముడు విశ్వామిత్రుని ఆధ్వర్యంలో యజ్ఞాలను రక్షించడానికి సిద్ధమవుతాడు. తన భుజబలం, ధైర్యంతో తాటకను సంహరిస్తాడు. తాటక వధతో రాముడు తన వీరత్వాన్ని ప్రదర్శించి, ఋషులు, మునులు ఆనందంతో ఉప్పొంగుతారు. ఈ సర్గలో విశ్వామిత్రుడు రాముడికి అస్త్రశాస్త్రాలను నేర్పుతాడు, దీని వలన రాముడు మరింత శక్తివంతుడవుతాడు.

ఉమామాహాత్మ్యమ్

ఉక్తవాక్యే మునౌ తస్మిన్నుభౌ రాఘవలక్ష్మణౌ |
అభినంద్య కథాం వీరావూచతుర్మునిపుంగవమ్ ||

1

ధర్మయుక్తమిదం బ్రహ్మన్కథితం పరమం త్వయా |
దుహితుః శైలరాజస్య జ్యేష్ఠాయా వక్తుమర్హసి ||

2

విస్తరం విస్తరజ్ఞోఽసి దివ్యమానుషసంభవమ్ |
త్రీన్పథో హేతునా కేన ప్లావయేల్లోకపావనీ ||

3

కథం గంగా త్రిపథగా విశ్రుతా సరిదుత్తమా |
త్రిషు లోకేషు ధర్మజ్ఞ కర్మభిః కైః సమన్వితా ||

4

తథా బ్రువతి కాకుత్స్థే విశ్వామిత్రస్తపోధనః |
నిఖిలేన కథాం సర్వామృషిమధ్యే న్యవేదయత్ ||

5

పురా రామ కృతోద్వాహో నీలకంఠో మహాతపాః | [శితికంఠో]
దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే ||

6

శితికంఠస్య దేవస్య దివ్యం వర్షశతం గతమ్ |
తస్య సంక్రీడమానస్య మహాదేవస్య ధీమతః ||

7

న చాపి తనయో రామ తస్యామాసీత్పరంతప |
తతో దేవాః సముద్విగ్నాః పితామహపురోగమాః ||

8

యదిహోత్పద్యతే భూతం కస్తత్ప్రతిసహిష్యతే |
అభిగమ్య సురాః సర్వే ప్రణిపత్యేదమబ్రువన్ ||

9

దేవ దేవ మహాదేవ లోకస్యాస్య హితే రత |
సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి ||

10

న లోకా ధారయిష్యంతి తవ తేజః సురోత్తమ |
బ్రాహ్మేణ తపసా యుక్తో దేవ్యా సహ తపశ్చర ||

11

త్రైలోక్యహితకామార్థం తేజస్తేజసి ధారయ |
రక్ష సర్వానిమాఁల్లోకాన్నాలోకం కర్తుమర్హసి ||

12

దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకమహేశ్వరః |
బాఢమిత్యబ్రవీత్సర్వాన్పునశ్చేదమువాచ హ ||

13

ధారయిష్యామ్యహం తేజస్తేజస్యేవ సహోమయా |
త్రిదశాః పృథివీ చైవ నిర్వాణమధిగచ్ఛతు ||

14

యదిదం క్షుభితం స్థానాన్మమ తేజో హ్యనుత్తమమ్ |
ధారయిష్యతి కస్తన్మే బ్రువంతు సురసత్తమాః ||

15

ఏవముక్తాస్తతో దేవాః ప్రత్యూచుర్వృషభధ్వజమ్ |
యత్తేజః క్షుభితం హ్యేతత్తద్ధరా ధారయిష్యతి ||

16

ఏవముక్తః సురపతిః ప్రముమోచ మహీతలే |
తేజసా పృథివీ యేన వ్యాప్తా సగిరికాననా ||

17

తతో దేవాః పునరిదమూచుశ్చాథ హుతాశనమ్ |
ప్రవిశ త్వం మహాతేజో రౌద్రం వాయుసమన్వితః ||

18

తదగ్నినా పునర్వ్యాప్తం సంజాతః శ్వేతపర్వతః |
దివ్యం శరవణం చైవ పావకాదిత్యసన్నిభమ్ ||

19

యత్ర జాతో మహాతేజాః కార్తికేయోఽగ్నిసంభవః |
అథోమాం చ శివం చైవ దేవాః సర్షిగణాస్తదా ||

20

పూజయామాసురత్యర్థం సుప్రీతమనసస్తతః |
అథ శైలసుతా రామ త్రిదశానిదమబ్రవీత్ ||

21

అప్రియస్య కృతస్యాద్య ఫలం ప్రాప్స్యథ మే సురాః |
ఇత్యుక్త్వా సలిలం గృహ్య పార్వతీ భాస్కరప్రభా ||

22

సమన్యురశపత్సర్వాన్క్రోధసంరక్తలోచనా |
యస్మాన్నివారితా చైవ సంగతిః పుత్రకామ్యయా ||

23

అపత్యం స్వేషు దారేషు నోత్పాదయితుమర్హథ |
అద్యప్రభృతి యుష్మాకమప్రజాః సంతు పత్నయః ||

24

ఏవముక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీమపి |
అవనే నైకరూపా త్వం బహుభార్యా భవిష్యసి ||

25

న చ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధకలుషీకృతా |
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్ఛతీ ||

26

తాన్సర్వాన్వ్రీడితాన్దృష్ట్వా సురాన్సురపతిస్తదా |
గమనాయోపచక్రామ దిశం వరుణపాలితామ్ ||

27

స గత్వా తప ఆతిష్ఠత్పార్శ్వే తస్యోత్తరే గిరేః |
హిమవత్ప్రభవే శృంగే సహ దేవ్యా మహేశ్వరః ||

28

ఏష తే విస్తరో రామ శైలపుత్ర్యా నివేదితః |
గంగాయాః ప్రభవం చైవ శృణు మే సహలక్ష్మణః ||

29

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్త్రింశః సర్గః ||

Balakanda Sarga 36 Meaning In Telugu

అంత వరకువిన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

ఓ మహర్షీ! హిమవంతుని పెద్ద కుమార్తె గంగ ఎందుకని మూడు మార్గములలో ప్రవహిస్తూ ఉంది. ఎందుకని గంగానదీ ముల్లోకములలో పవిత్రమైన నదిగా ప్రసిద్ధి చెందింది. వివరించండి.” అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.

“మహాశివుడు తన భార్య ఉమాదేవితో సురత సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. కానీ ఉమా దేవికి మహాశివునికి ఎంత కాలానికి పుత్ర సంతానము కలగ లేదు. దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది. మహాశివునికి, ఉమాదేవికి పుట్టబోయే పుత్రుని భరించే శక్తి ఈ లోకాలకు ఉందా అని. దేవతలందరు బ్రహ్మదేవుని తీసుకొని మహా శివుని వద్దకు వెళ్లారు.

బ్రహ్మ దేవుడు మహాశివునితో ఇలా అన్నాడు. ” ఓ మహాదేవా! మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడయిన పుత్రుని ముల్లోకములు భరించలేవు. కాబట్టి మీరు ఉమాదేవి తపస్సు చేయండి. మీ తేజస్సును మీ యందే నిక్షిప్తం చేసుకోండి.” అని ప్రార్థించారు.

వారి ప్రార్థనను మన్నించాడు మహాదేవుడు. “దేవతలారా! మీరు చెప్పినట్టే చేసిదను. కాని నా వీర్యమును ఎవరు ధరిస్తారో తెలియజేయండి.” అని అన్నాడు.

దేవతలందరూ ముక్త కంఠంతో “మీ వీర్యమును భూదేవి ధరిస్తుంది” అని పలికారు. ఆ ప్రకారమే మహాశివుడు తన వీర్యమును భూదేవి యందు నిక్షిప్తం చేసాడు. ఆ వీర్యము భూమి అంతా వ్యాపించింది.

అప్పుడు దేవతలు అగ్ని దేవుని చూచి ” ఓ అగ్నిదేవా ! నీవు వాయు దేవుని సాయంతో మహాదేవుని వీర్యమును నీలో నిక్షిప్తము చేసుకో” అని ప్రార్థించారు. అప్పుడు అగ్నిదేవుడు మహాశివుని వీర్యమును తనలో ధరింపజేసుకొన్నాడు.

మహాదేవుని వీర్యము ప్రభావము వలన అగ్ని దేవుని లో నుండి మహా వీరుడు కుమారస్వామి జన్మించాడు. అప్పుడు దేవతలు అందరూ మహా శివుని ఉమాదేవిని భక్తితో పూజించారు. ఇదంతా చూచి ఉ మాదేవికి పట్టరాని కోపం వచ్చింది.

” ఓ దేవతలారా! నేను నా భర్తయందు పుత్రుని కనవలెనని కోరికతో ఉన్నాను. దానికి మీరు అడ్డు తగిలారు. నా భర్త వీర్యమును భూమిలో అగ్నిలో నిక్షిప్తం చేసారు. కాబట్టి మీరందరికీ మీ భార్యలవలన సంతానము కలుగకుండు గాక!” అని తీవ్రంగా శపించింది.

తన భర్త వీర్యమును ధరించిన భూదేవిని కూడా ఉమాదేవి శపించింది.

“ఓ భూదేవీ! నీవు అనేక రూపములతో అనేక మంది భర్తలకు భార్యగా ప్రవర్తించు. నావలెనే నీకు కూడా పుత్రుల వలన ఆనందము కలుగ కుండు గాక!” అని శపించింది.

తరువాత మహా శివుడు ఉమా దేవితో సహా పశ్చిమదిక్కుగా పోయి హిమవత్పర్వతము మీద ఉత్తర దిక్కుగా ఉన్న కైలాస గిరి మీద తపస్సు చేసాడు.

ఓరామా! ఇప్పుడు నీకు గంగాదేవి కథ చెబుతాను విను. అని విశ్వామిత్రుడు గంగాదేవి యొక్క కథ చెప్పసాగాడు.

శ్రీమద్రామాయణము
బాల కాండ ముప్పది ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ సప్తత్రింశః సర్గః (37) >>

Balakanda Sarga 25 In Telugu – బాలకాండ పంచవింశః సర్గః

Balakanda Sarga 25 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచవింశః సర్గలో, విశ్వామిత్ర మహర్షి తాటాకా అనే రాక్షసుడి పుట్టుక, వివాహం మరియు శాపాన్ని వివరిస్తాడు మరియు ఆమె సమాజం పట్ల క్రూరంగా ప్రవర్తించే స్త్రీని చంపడానికి ఎటువంటి సంకోచం లేకుండా ఆమె ముప్పును తొలగించమని రాముడిని కోరింది.

తాటకావృత్తాంతః

అథ తస్యాప్రమేయస్య మునేర్వచనముత్తమమ్ |
శ్రుత్వా పురుషశార్దూలః ప్రత్యువాచ శుభాం గిరమ్ ||

1

అల్పవీర్యా యదా యక్షాః శ్రూయంతే మునిపుంగవ |
కథం నాగసహస్రస్య ధారయత్యబలా బలమ్ ||

2

తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః |
[* హర్షయన్ శ్లక్ష్ణయా వాచా సలక్ష్మణమరిందమమ్ | *]
విశ్వామిత్రోఽబ్రవీద్వాక్యం శృణు యేన బలోత్తరా ||

3

వరదానకృతం వీర్యం ధారయత్యబలా బలమ్ |
పూర్వమాసీన్మహాయక్షః సుకేతుర్నామ వీర్యవాన్ ||

4

అనపత్యః శుభాచారః స చ తేపే మహత్తపః |
పితామహస్తు సుప్రీతస్తస్య యక్షపతేస్తదా ||

5

కన్యారత్నం దదౌ రామ తాటకాం నామ నామతః |
బలం నాగసహస్రస్య దదౌ చాస్యాః పితామహః ||

6

న త్వేవ పుత్రం యక్షాయ దదౌ బ్రహ్మా మహాయశాః |
తాం తు జాతాం వివర్ధంతీం రూపయౌవనశాలినీమ్ ||

7

జంభపుత్రాయ సుందాయ దదౌ భార్యాం యశస్వినీమ్ |
కస్యచిత్త్వథ కాలస్య యక్షీ పుత్రం వ్యజాయత ||

8

మారీచం నామ దుర్ధర్షం యః శాపాద్రాక్షసోఽభవత్ |
సుందే తు నిహతే రామ సాగస్త్యం మునిపుంగవమ్ ||

9

తాటకా సహ పుత్రేణ ప్రధర్షయితుమిచ్ఛతి |
భక్షార్థం జాతసంరంభా గర్జంతీ సాఽభ్యధావత ||

10

ఆపతంతీం తు తాం దృష్ట్వా అగస్త్యో భగవానృషిః |
రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యాజహార సః ||

11

అగస్త్యః పరమక్రుద్ధస్తాటకామపి శప్తవాన్ |
పురుషాదీ మహాయక్షీ విరూపా వికృతాననా ||

12

ఇదం రూపం విహాయాథ దారుణం రూపమస్తు తే |
సైషా శాపకృతామర్షా తాటకా క్రోధమూర్ఛితా ||

13

దేశముత్సాదయత్యేనమగస్త్యచరితం శుభమ్ |
ఏనాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమదారుణామ్ ||

14

గోబ్రాహ్మణహితార్థాయ జహి దుష్టపరాక్రమామ్ |
న హ్యేనాం శాపసంస్పృష్టాం కశ్చిదుత్సహతే పుమాన్ ||

15

నిహంతుం త్రిషు లోకేషు త్వామృతే రఘునందన |
న హి తే స్త్రీవధకృతే ఘృణా కార్యా నరోత్తమ ||

16

చాతుర్వర్ణ్యహితార్థాయ కర్తవ్యం రాజసూనునా |
నృశంసమనృశంసం వా ప్రజారక్షణకారణాత్ ||

17

పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా |
రాజ్యభారనియుక్తానామేష ధర్మః సనాతనః ||

18

అధర్మ్యాం జహి కాకుత్స్థ ధర్మో హ్యస్యా న విద్యతే |
శ్రూయతే హి పురా శక్రో విరోచనసుతాం నృప ||

19

పృథివీం హంతుమిచ్ఛంతీం మంథరామభ్యసూదయత్ |
విష్ణునా చ పురా రామ భృగుపత్నీ దృఢవ్రతా ||

20

అనింద్రం లోకమిచ్ఛంతీ కావ్యమాతా నిషూదితా |
ఏతైరన్యైశ్చ బహుభీ రాజపుత్ర మహాత్మభిః ||

21

అధర్మనిరతా నార్యో హతాః పురుషసత్తమైః |
తస్మాదేనాం ఘృణాం త్యక్త్వా జహి మచ్ఛాసనాన్నృప ||

22

విశ్వామిత్రుని మాటలు శ్రద్ధగా విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

” ఓ మునిపుంగవా! సాధారణంగా యక్షులు తక్కువ బలం కలవారు అంటారు కదా. యక్షిణి అయిన తాటకకు అంత బలం, వీరత్వము ఎలా వచ్చింది.” అని అడిగాడు.

దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. “ఓ రామా! పూర్వము సుకేతుడు అనే బలవంతుడు అయిన యక్షుడు ఉండేవాడు. అతనికి సంతానము లేదు. సంతానము కొరకు అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసాడు. సుకేతుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి వరము కావాలో కోరుకో అని అడిగాడు. ఆ యక్షుడు సంతానము కావాలి అని అడిగాడు. బ్రహ్మదేవుడు వేయి ఏనుగుల బలవంతురాలైన కుమార్తెను ప్రసాదించాడు కాని పుత్ర సంతానము మాత్రము ఇవ్వలేదు. ఆమె పేరు తాటక.

తాటక పెరిగి పెద్దది అయింది. సుకేతుడు తన కుమార్తె తాటకను సుందుడు అనే వాడికి ఇచ్చి వివాహం చేసాడు. సుందుడికి, తాటకకు మహా బలవంతుడు అయిన మారీచుడు అనే కుమారుడు జన్మించాడు.

అగస్త్యుని శాపము వలన సుందుడు మరణించాడు. అప్పుడు తాటక, మారీచుడు ఇద్దరూ కలిసి అగస్త్యుని చంపి తినడానికి అతని మీదికి వెళ్లారు.అప్పుడు అగస్త్యుడు మారీచుని “నీవు రాక్షసుడివి కా!” అని శపించాడు. తాటకను “నీవు వికృత రూపంతో, భయంకరంగా మనుష్యులను చంపి తింటూ, జీవించు” అని శపించాడు. అప్పటి నుండి తాటక అగస్యుడు సంచరించిన ఈ వనమును నాశనం చేయసాగింది.

ఓ రామా! తాటక స్త్రీ అని సంకోచించ వద్దు. ఆమె దుర్మార్గురాలు. లోకకంటకు రాలు. మునులను, బ్రాహ్మణులను రక్షించుటకు ఆమె సంహరించు. ఈమెకు ఉన్న వరములు, శాపములు వలన ఈమెను నీవు తప్ప వేరెవ్వరూ సంహరించలేరు.

లోకము యొక్క హితము కోరి రాజు స్త్రీ, పురుష బేధము లేకుండా ఎవరినైనా సంహరించవచ్చును. రాజు ప్రజలను రక్షించ డానికి చేసే పని పాపము అయినా సరే రాజుకు ఆపాపము అంటదు. ఇది రాజ్యపాలనలో ముఖ్యసూత్రము. ధర్మానికి విరుద్ధంగా, ప్రజలకు కంటకంగా పరిణమించిన తాటకను సంహరించడం పాపము కాదు.

పూర్వము విరోచనుని కుమార్తె, భూదేవిని చంపబోయింది. అప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపాడు. పూర్వము శుక్రాచార్యుని తల్లి, లోకములో ఇంద్రుడు ఉండకూడదు, అనే కోరికతో తీవ్రంగా తపస్సుచేసింది. ధర్మ విరుద్ధమైన ఆమె తపస్సును భగ్నం చేసి ఆమెను చంపాడు విష్ణువు.

ఓ రామా! వీరే కాదు. ధర్మవిరుద్ధంగా ప్రవర్తించిన స్త్రీలను ఎందరినో చంపారు. కాబట్టి నీవు కూడా స్త్రీ అని సంకోచించక తాటకను సంహరించు.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఐదవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ షడ్వింశః సర్గః (26) >>

Ayodhya Kanda Sarga 33 In Telugu – అయోధ్యాకాండ త్రయస్త్రింశః సర్గః

Ayodhya Kanda Sarga 33

అయోధ్యాకాండము త్రయస్త్రింశః సర్గము (32వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో, లక్ష్మణుడు రాముని మాటలు విని బాధపడతాడు. రాముని అనుసరించాలని నిర్ణయిస్తాడు. సీత కూడా అరణ్యవాసానికి రాముడితో పాటు వెళ్లాలని కోరుతుంది. చివరికి రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. అటు, ప్రజలు రాముని వెనక వెళ్లాలని నిర్ణయిస్తారు. ఈ సర్గ రాముని త్యాగం, సీత లక్ష్మణుల భక్తిని మరియు ప్రజల ప్రేమను చూపిస్తుంది. అరణ్యవాసానికి బయలుదేరిన రాముడు, సీత, లక్ష్మణుల ప్రయాణం ఈ సర్గలో ప్రధానాంశంగా ఉంటుంది.

పౌరవాక్యమ్

దత్త్వా తు సహ వైదేహ్యా బ్రాహ్మణేభ్యో ధనం బహు |
జగ్మతుః పితరం ద్రష్టుం సీతయా సహ రాఘవౌ || ౧ ||

తతో గృహీతే దుష్ప్రేక్షే త్వశోభేతాం తదాయుధే |
మాలాదామభిరాబద్ధే సీతయా సమలంకృతే || ౨ ||

తతః ప్రాసాదహర్మ్యాణి విమానశిఖరాణి చ |
అధిరుహ్య జనః శ్రీమానుదాసీనో వ్యలోకయత్ || ౩ ||

న హి రథ్యాః స్మ శక్యంతే గంతుం బహుజనాకులాః |
ఆరుహ్య తస్మాత్ప్రాసాదాన్దీనాః పశ్యంతి రాఘవమ్ || ౪ ||

పదాతిం వర్జితచ్ఛత్రం రామం దృష్ట్వా తదా జనాః |
ఊచుర్బహువిధా వాచః శోకోపహతచేతసః || ౫ ||

యం యాంతమనుయాతి స్మ చతురంగబలం మహత్ |
తమేకం సీతయా సార్ధమనుయాతి స్మ లక్ష్మణః || ౬ ||

ఐశ్వర్యస్య రసజ్ఞః సన్కామినాం చైవ కామదః |
నేచ్ఛత్యేవానృతం కర్తుం పితరం ధర్మగౌరవాత్ || ౭ ||

యా న శక్యా పురా ద్రష్టుం భూతైరాకాశగైరపి |
తామద్య సీతాం పశ్యంతి రాజమార్గగతా జనాః || ౮ ||

అంగరాగోచితాం సీతాం రక్తచందనసేవినీమ్ |
వర్షముష్ణం చ శీతం చ నేష్యంత్యాశు వివర్ణతామ్ || ౯ ||

అద్య నూనం దశరథః సత్త్వమావిశ్య భాషతే |
న హి రాజా ప్రియం పుత్రం వివాసయితుమిచ్ఛతి || ౧౦ ||

నిర్గుణస్యాపి పుత్రస్య కథం స్యాద్విప్రవాసనమ్ |
కిం పునర్యస్య లోకోఽయం జితో వృత్తేన కేవలమ్ || ౧౧ ||

ఆనృశంస్యమనుక్రోశః శ్రుతం శీలం దమః శమః |
రాఘవం శోభయంత్యేతే షడ్గుణాః పురుషర్షభమ్ || ౧౨ ||

తస్మాత్తస్యోపఘాతేన ప్రజాః పరమపీడితాః |
ఔదకానీవ సత్త్వాని గ్రీష్మే సలిలసంక్షయాత్ || ౧౩ ||

పీడయా పీడితం సర్వం జగదస్య జగత్పతేః |
మూలస్యేవోపఘాతేన వృక్షః పుష్పఫలోపగః || ౧౪ ||

మూలం హ్యేష మనుష్యాణాం ధర్మసారో మహాద్యుతిః |
పుష్పం ఫలం చ పత్రం చ శాఖాశ్చాస్యేతరే జనాః || ౧౫ ||

తే లక్ష్మణ ఇవ క్షిప్రం సపత్న్యస్సహబాంధవాః |
గచ్ఛంతమనుగచ్ఛామో యేన గచ్ఛతి రాఘవః || ౧౬ ||

ఉద్యానాని పరిత్యజ్య క్షేత్రాణి చ గృహాణి చ |
ఏకదుఃఖసుఖా రామమనుగచ్ఛామ ధార్మికమ్ || ౧౭ ||

సముద్ధృతనిధానాని పరిధ్వస్తాజిరాణి చ |
ఉపాత్తధనధాన్యాని హృతసారాణి సర్వశః || ౧౮ ||

రజసాఽభ్యవకీర్ణాని పరిత్యక్తాని దైవతైః |
మూషకైః పరిధావద్భిరుద్బిలైరావృతాని చ || ౧౯ ||

అపేతోదకధూమాని హీనసమ్మార్జనాని చ |
ప్రణష్టబలికర్మేజ్యామంత్రహోమజపాని చ || ౨౦ ||

దుష్కాలేనేవ భగ్నాని భిన్నభాజనవంతి చ |
అస్మత్త్యక్తాని వేశ్మాని కైకేయీ ప్రతిపద్యతామ్ || ౨౧ ||

వనం నగరమేవాస్తు యేన గచ్ఛతి రాఘవః |
అస్మాభిశ్చ పరిత్యక్తం పురం సంపద్యతాం వనమ్ || ౨౨ ||

బిలాని దంష్ట్రిణః సర్వే సానూని మృగపక్షిణః |
త్యజంత్యస్మద్భయాద్భీతాః గజాః సింహా వనాన్యపి || ౨౩ ||

అస్మత్త్యక్తం ప్రపద్యంతాం సేవ్యమానం త్యజంతు చ |
తృణమాంసఫలాదానాం దేశం వ్యాలమృగద్విజమ్ || ౨౪ ||

ప్రపద్యతాం హి కైకేయీ సపుత్రా సహబాంధవైః |
రాఘవేణ వనే సర్వే సహవత్స్యామ నిర్వృతాః || ౨౫ ||

ఇత్యేవం వివిధా వాచో నానాజనసమీరితాః |
శుశ్రావ రామః శ్రుత్వా చ న విచక్రేఽస్య మానసమ్ || ౨౬ ||

స తు వేశ్మ పితుర్దూరాత్కైలాసశిఖరప్రభమ్ |
అభిచక్రామ ధర్మాత్మా మత్తమాతంగవిక్రమః || ౨౭ ||

వినీతవీరపురుషం ప్రవిశ్య తు నృపాలయమ్ |
దదర్శావస్థితం దీనం సుమంత్రమవిదూరతః || ౨౮ ||

ప్రతీక్షమాణోఽపి జనం తదాఽఽర్త-
-మనార్తరూపః ప్రహసన్నివాథ |
జగామ రామః పితరం దిదృక్షుః
పితుర్నిదేశం విధివచ్చికీర్షుః || ౨౯ ||

తత్పూర్వమైక్ష్వాకసుతో మహాత్మా
రామో గమిష్యన్వనమార్తరూపమ్ |
వ్యతిష్ఠత ప్రేక్ష్య తదా సుమంత్రం
పితుర్మహాత్మా ప్రతిహారణార్థమ్ || ౩౦ ||

పితుర్నిదేశేన తు ధర్మవత్సలో
వనప్రవేశే కృతబుద్ధినిశ్చయః |
స రాఘవః ప్రేక్ష్య సుమంత్రమబ్రవీ-
-న్నివేదయస్వాగమనం నృపాయ మే || ౩౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయస్త్రింశః సర్గః || ౩౩ ||

Ayodhya Kanda Sarga 33 Meaning In Telugu

రాముడు, లక్ష్మణుడు, సీత తమకు ఉన్నదంతా బ్రాహ్మణు లకు దానము చేసిన తరువాత, వారు ముగ్గురూ దశరథుని వద్ద సెలవు తీసుకొనడానికి ఆయన మందిరమునకు వెళ్లారు. అప్పటికే రామపట్టాభిషేకము నిలిచి పోయినది అను వార్త దావానలము మాదిరి అయోధ్య అంతా పాకిపోయింది. దశరథుని మందిరమునకు వెళ్లు సీతారామలక్ష్మణులను చూచుటకు జనము వీధులలో బారులు తీరి నిలబడ్డారు. అందరి ముఖాలలో దైన్యము కనబడుతూ ఉంది. రాజలాంఛనములైన ఛత్రచామరములు లేకుండా కాలినడకన వెళు తున్న రాముని చూచి అయోధ్య ప్రజలు దు:ఖము ఆపుకోలేక పోయారు.

కేవలము తండ్రి మాటను మన్నించడానికి రాజ్యమును వదులుకొన్నాడు రాముడు అని అందరూ చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా వారు సీతను ముఖాముఖి చూడలేదు. ఎండ అంటే అసలు తెలియని సీత ఈనాడు భర్త వెంట నడిచి వెళుతుంటే అందరూ ఆశ్చర్యం చూస్తున్నారు.
కొందరు ఆశావాదులు మాత్రము “రాజు రాజ్యమును ఇవ్వక పోతే మానె, రాముని ఊరువెళ్ల గొట్టడం ఎందుకు. ఏదో ఊరికే అని ఉంటాడు. రాముడు ఎక్కడకూ వెళ్లడు.” అని తమలో తాము సర్దిచెప్పుకుంటున్నారు.

మరి కొంతమంది “ఆ… ఈరోజుల్లో చెడ్డవాడైన కొడుకును కూడా మమకారంతో ఇంటి నుండి బయటకు పొమ్మనడం లేదు. అలాంటిది రాముని వంటి సుగుణాల రాసిని ఇంటినుండి ఎందుకు పొమ్మంటాడు. అదేమీ కాదు. మనం పొరపాటు వినిఉంటాము.”అని తమలో తాము అనుకుంటున్నారు.

కాని అందరూ రాముడు తమను విడిచి అడవులకు వెళు తున్నాడు అనే మాటను కూడా జీర్ణం చేసుకోలేక పోతున్నారు. ఇన్నాళ్లు తమ కష్టసుఖాలలో పాలుపంచుకున్న రాముడు ఇలా అర్థాంతరంగా అడవులకు వెళ్లడంలోని ఆంతర్యం వారికి అవగతం కావడం లేదు. ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు.

ఇంతలో కొంతమందికి ఒక ఆలోచన వచ్చింది. “రాముడు లేని అయోధ్యలో మనం మాత్రం ఎందుకు. మనం కూడా రాముని వెంట అరణ్యములకు వెళుదాము. రాముడు ఎక్కడ ఉంటే అదే మనకు అయోధ్య” అని రాముని వెంట వెళ్లడానికి సిద్ధం అయ్యారు.

ఆ మాట ఆనోటా ఆనోటా పాకి అందరూ రాముని వెంట అడవులకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో కైకేయీ వల్లనే ఇదంతా జరిగింది అని అందరికీ తెలిసిపోయింది. దాంతో వారి ఆలోచన బలపడింది.

“మనం అంతా అయోధ్యను విడిచి వెళ్లిపోతే ఇక్కడెవరుం టారు. ఇండ్లు అన్నీ పాడుపడిపోతాయి. అగ్నిహోత్రములు వెలగవు. పంటలు పండించే వాళ్లు ఉండరు. వీళ్లకు పనిపాటలు చేసేవాళ్లు ఉండరు. ఈ పాడుబడ్డ శ్మశానములాంటి అయోధ్యను కైక ఒక్కతే ఏలుకుంటుంది” అని కసిదీరా అనుకొన్నారు.

మరికొందరు “రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. అరణ్యమే అయోధ్య. ఈ అయోధ్య అరణ్యము అవుతుంది.” అని శపిస్తున్నారు. ఇంకొంత మంది అయితే “ఒరేయ్! మనం అంతా రాముని వెంట అడవులకు వెళితే, మనలను చూచి, అడవులలో ఉన్న క్రూరమృగములు, ఏనుగులు, పాములు, తేళ్లు అన్నీ అడవులు వదిలి అయోధ్యలోకి వస్తాయి. అప్పుడు కైకకు మంచి శాస్త్రిఅవుతుంది. మనం అంతా రాముని పాలనలో అడవిలో సుఖంగా ఉంటే ఇక్కడ అయోధ్యలో కైక క్రూరమృగముల బారిన పడి నానా బాధలు పడుతుంది” అని కసిదీరా తిడుతున్నారు.

ఈ మాటలన్నీ రాముడు, సీత లక్ష్మణుడు వింటూ ముందుకు నడుస్తున్నారు. ముగ్గురూ దశరథమహారాజు మందిరమునకు సమీపించారు. మందిరము లోపల సుమంత్రుడు దీనంగా మొహం పెట్టుకొని కూర్చుని ఉన్నాడు. అతని చుట్టు కొంతమంది పౌరులు గుమిగూడి ఉన్నారు.
వారందరినీ చూచి రాముడు చిరునవ్వు నవ్వి వారిని పలకరించాడు. “సుమంత్రా! నేను, సీత, లక్ష్మణుడు వచ్చామని మహారాజు గారికి మనవి చెయ్యి.” అని అన్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుస్త్రింశః సర్గః (33) >>

Balakanda Sarga 34 In Telugu – బాలకాండ చతుస్త్రింశః సర్గః

Balakanda Sarga 34 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ చతుస్త్రింశః సర్గః: రామాయణంలోని బాలకాండలో చతుస్త్రింశః సర్గం ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో విష్ణుమూర్తి వామనావతారాన్ని ధరించి, సుగ్రీవుడి సహాయంతో మహాబలివనితిని మోసగించి, ఆవిడలో హరికృష్ణుడు అవతరించాడని వివరిస్తుంది. సీతా హరణం గురించి విన్న రాముడు, లక్ష్మణుడు హనుమంతుని సహాయం తీసుకోవాలని నిర్ణయిస్తారు. రాముడి ధైర్యం, లక్ష్మణుడి నిబద్ధత హనుమంతుడిని ఆకర్షిస్తాయి.

విశ్వామిత్రవంశవర్ణనమ్

కృతోద్వాహే గతే తస్మిన్బ్రహ్మదత్తే చ రాఘవ |
అపుత్రః పుత్రలాభాయ పౌత్రీమిష్టిమకల్పయత్ ||

1

ఇష్ట్యాం తు వర్తమానాయాం కుశనాభం మహీపతిమ్ |
ఉవాచ పరమోదారః కుశో బ్రహ్మసుతస్తదా ||

2

పుత్ర తే సదృశః పుత్రో భవిష్యతి సుధార్మికః |
గాధిం ప్రాప్స్యసి తేన త్వం కీర్తిం లోకే చ శాశ్వతీమ్ ||

3

ఏవముక్త్వా కుశో రామ కుశనాభం మహీపతిమ్ |
జగామాకాశమావిశ్య బ్రహ్మలోకం సనాతనమ్ ||

4

కస్యచిత్త్వథ కాలస్య కుశనాభస్య ధీమతః |
జజ్ఞే పరమధర్మిష్ఠో గాధిరిత్యేవ నామతః ||

5

స పితా మమ కాకుత్స్థ గాధిః పరమధార్మికః |
కుశవంశప్రసూతోఽస్మి కౌశికో రఘునందన ||

6

పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రతా |
నామ్నా సత్యవతీ నామ ఋచీకే ప్రతిపాదితా ||

7

సశరీరా గతా స్వర్గం భర్తారమనువర్తినీ |
కౌశికీ పరమోదారా సా ప్రవృత్తా మహానదీ ||

8

దివ్యా పుణ్యోదకా రమ్యా హిమవంతముపాశ్రితా |
లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ ||

9

తతోఽహం హిమవత్పార్శ్వే వసామి నిరతః సుఖమ్ |
భగిన్యాం స్నేహసంయుక్తః కౌశిక్యాం రఘునందన ||

10

సా తు సత్యవతీ పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్ఠితా |
పతివ్రతా మహాభాగా కౌశికీ సరితాం‍వరా ||

11

అహం హి నియమాద్రామ హిత్వా తాం సముపాగతః |
సిద్ధాశ్రమమనుప్రాప్య సిద్ధోఽస్మి తవ తేజసా ||

12

ఏషా రామ మమోత్పత్తిః స్వస్య వంశస్య కీర్తితా |
దేశస్య చ మహాబాహో యన్మాం త్వం పరిపృచ్ఛసి ||

13

గతోఽర్ధరాత్రః కాకుత్స్థ కథాః కథయతో మమ |
నిద్రామభ్యేహి భద్రం తే మా భూద్విఘ్నోఽధ్వనీహ నః ||

14

నిష్పందాస్తరవః సర్వే నిలీనా మృగపక్షిణః |
నైశేన తమసా వ్యాప్తా దిశశ్చ రఘునందన ||

15

శనైర్వియుజ్యతే సంధ్యా నభో నేత్రైరివావృతమ్ |
నక్షత్రతారాగహనం జ్యోతిర్భిరవభాసతే ||

16

ఉత్తిష్ఠతే చ శీతాంశుః శశీ లోకతమోనుదః |
హ్లాదయన్ ప్రాణినాం లోకే మనాంసి ప్రభయా విభో ||

17

నైశాని సర్వభూతాని ప్రచరంతి తతస్తతః |
యక్షరాక్షససంఘాశ్చ రౌద్రాశ్చ పిశితాశనాః ||

18

ఏవముక్త్వా మహాతేజా విరరామ మహామునిః |
సాధు సాధ్వితి తే సర్వే మునయో హ్యభ్యపూజయన్ ||

19

కుశికానామయం వంశో మహాన్ధర్మపరః సదా |
బ్రహ్మోపమా మహాత్మానః కుశవంశ్యా నరోత్తమాః ||

20

విశేషేణ భవానేవ విశ్వామిత్రో మహాయశాః |
కౌశికీ చ సరిచ్ఛ్రేష్ఠా కులోద్ద్యోతకరీ తవ ||

21

ఇతి తైర్మునిశార్దూలైః ప్రశస్తః కుశికాత్మజః |
నిద్రాముపాగమచ్ఛ్రీమానస్తం గత ఇవాంశుమాన్ ||

22

రామోఽపి సహసౌమిత్రిః కించిదాగతవిస్మయః |
ప్రశస్య మునిశార్దూలం నిద్రాం సముపసేవతే ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుస్త్రింశః సర్గః ||

Balakanda Sarga 34 Meaning In Telugu

ఆ ప్రకారంగా కుమార్తెల వివాహము వైభవంగా జరిపించాడు. కుశనాభుడు. కుమార్తెలు అత్తవారి ఇంటికి వెళ్లారు. అప్పుడు తనకు పుత్రసంతానము కావాలని అనుకున్నాడు కుశనాభుడు. పుత్రసంతానము కోసరము పుత్రకామేష్టి యాగము చేసాడు.

ఆయాగము జరుగుతున్న సమయములో కుశుడు తన కుమారుడైన కుశనాభునితో ఇలా అన్నాడు. “కుమారా! నీకు సకల సద్గుణ సంపన్నుడు ధార్మికుడు అయిన కుమారుడు జన్మించగలడు.” అనిపలికి తాను బ్రహ్మ లోకమునకు వెళ్లిపోయాడు.

కొంత కాలము జరిగింది. కుశనాభునకు గాధి అనే కుమారుడు జన్మించాడు. ఓ రామా! ఆ గాధి నా తండ్రి. శుకుని వంశమున పుట్టడం చేత నేను కౌశికుడు అనే పేరుతో కూడా పిలువబడు తున్నాను. నాకు ఒక జ్యేష్ట సోదరి (అక్కగారు) ఉండేది. ఆమెను నా తండ్రి గాధి ఋచకుడు అను వానికి ఇచ్చి వివాహము చేసాడు. ఆమె తన భర్తతో పాటు సశరీరంగా స్వర్గమునకు వెళ్లింది.

ఆమె ఈ భూమి మీద కౌశికి అనే పేరుతో ఒక మహానదిగా ప్రహిస్తూ ఉంది. దివ్యమైన పుణ్యోదకములతో కూడిన ఆ కౌశికీ నది సకల లోకములకు హితము కలిగించడం కోసరం హిమవత్పర్వతము మీద ప్రవహిస్తూ ఉంది. నేను నా సోదరి మీద ఉన్న ప్రేమతో ఆ మహానదీ తీరమున ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాను.

రామా! ఈ యాగము చేయుట కొరకు సిద్ధాశ్రమమునకు వచ్చాను. నీవలన యాగమును నిర్విఘ్నముగా పూర్తిచేయ గలిగాను. నా కార్యము సిద్ధించింది. ఓరామా! నీవు అడిగినట్టు నా గురించి, నా జన్మ గురించి నీకు చెప్పాను. రామా! ఇప్పటికే అర్ధ రాత్రి దాటినది. ఇంక మీరు నిద్రకు ఉపక్రమించండి. మరలా రేపు ఉదయమే మనము ప్రయాణము సాగించాలి కదా!” అని అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని వృత్తాంతమును విన్న రామ లక్ష్మణులు, మహా మునులుఅందరూ ఆయనను అభినందించారు.

“ఓ విశ్వామిత్ర మహర్షీ! మీ వలనకుశ వంశము పూజ్యమైనది. మీరు బ్రహ్మ దేవునితో సమానమైన వారు. మీ అక్కగారు పేరుతో ప్రవహించు కౌశికీ నది మీ వంశమునకు కీర్తి తెచ్చింది.” అని కౌశికీ నదిని పొగిడారు. తరువాత అందరూ తమ తమ నివాసములలో నిద్రకు ఉపక్రమించారు.

శ్రీమద్రామాయణము
బాలకాండ ముప్పదినాలుగవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓంతత్సత్.

బాలకాండ పంచత్రింశః సర్గః (35) >>

Balakanda Sarga 23 In Telugu – బాలకాండ త్రయోవింశః సర్గః

Balakanda Sarga 23 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రయోవింశః సర్గలో, రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి గంగా నది మరియు సరయు నది సంగమించే ప్రదేశంలో ఒక ఆశ్రమంలో నివసిస్తున్నారు. ఒకసారి శివుడు తన మూడవ కన్నుతో ఈ ప్రదేశంలో ప్రేమ దేవుడైన మన్మథుని భౌతిక స్వరూపాన్ని కాల్చివేసాడు.

కామాశ్రమవాసః

ప్రభాతాయాం తు శర్వర్యాం విశ్వామిత్రో మహామునిః |
అభ్యభాషత కాకుత్స్థౌ శయానౌ పర్ణసంస్తరే ||

1

కౌసల్యాసుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ||

2

తస్యర్షేః పరమోదారం వచః శ్రుత్వా నృపాత్మజౌ |
స్నాత్వా కృతోదకౌ వీరౌ జేపతుః పరమం జపమ్ ||

3

కృతాహ్నికౌ మహావీర్యౌ విశ్వామిత్రం తపోధనమ్ |
అభివాద్యాభిసంహృష్టౌ గమనాయోపతస్థతుః ||

4

తౌ ప్రయాతౌ మహావీర్యౌ దివ్యం త్రిపథగాం నదీమ్ |
దదృశాతే తతస్తత్ర సరయ్వాః సంగమే శుభే ||

5

తత్రాశ్రమపదం పుణ్యమృషీణాముగ్రతేజసామ్ |
బహువర్షసహస్రాణి తప్యతాం పరమం తపః ||

6

తం దృష్ట్వా పరమప్రీతౌ రాఘవౌ పుణ్యమాశ్రమమ్ |
ఊచతుస్తం మహాత్మానం విశ్వామిత్రమిదం వచః ||

7

కస్యాయమాశ్రమః పుణ్యః కో న్వస్మిన్వసతే పుమాన్ |
భగవన్ శ్రోతుమిచ్ఛావః పరం కౌతూహలం హి నౌ ||

8

తయోస్తద్వచనం శ్రుత్వా ప్రహస్య మునిపుంగవః |
అబ్రవీచ్ఛ్రూయతాం రామ యస్యాయం పూర్వ ఆశ్రమః ||

9

కందర్పో మూర్తిమానాసీత్కామ ఇత్యుచ్యతే బుధైః |
తపస్యంతమిహ స్థాణుం నియమేన సమాహితమ్ ||

10

కృతోద్వాహం తు దేవేశం గచ్ఛంతం సమరుద్గణమ్ |
ధర్షయామాస దుర్మేధా హుంకృతశ్చ మహాత్మనా ||

11

దగ్ధస్య తస్య రుద్రేణ చక్షుషా రఘునందన | [అవదగ్ధస్య]
వ్యశీర్యంత శరీరాత్స్వాత్సర్వగాత్రాణి దుర్మతేః ||

12

తస్య గాత్రం హతం తత్ర నిర్దగ్ధస్య మహాత్మనా |
అశరీరః కృతః కామః క్రోధాద్దేవేశ్వరేణ హ ||

13

అనంగ ఇతి విఖ్యాతస్తదాప్రభృతి రాఘవ |
స చాంగవిషయః శ్రీమాన్యత్రాంగం స ముమోచ హ ||

14

తస్యాయమాశ్రమః పుణ్యస్తస్యేమే మునయః పురా |
శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే ||

15

ఇహాద్య రజనీం రామ వసేమ శుభదర్శన |
పుణ్యయోః సరితోర్మధ్యే శ్వస్తరిష్యామహే వయమ్ ||

16

అభిగచ్ఛామహే సర్వే శుచయః పుణ్యమాశ్రమమ్ |
స్నాతాశ్చ కృతజప్యాశ్చ హుతహవ్యా నరోత్తమ ||

17

[* ఇహ వాసః పరో రామ సుఖం వస్త్యామహే వయమ్ | *]
తేషాం సంవదతాం తత్ర తపోదీర్ఘేణ చక్షుషా |
విజ్ఞాయ పరమప్రీతా మునయో హర్షమాగమన్ ||

18

అర్ఘ్యం పాద్యం తథాఽఽతిథ్యం నివేద్య కుశికాత్మజే |
రామలక్ష్మణయోః పశ్చాదకుర్వన్నతిథిక్రియామ్ ||

19

సత్కారం సమనుప్రాప్య కథాభిరభిరంజయన్ |
యథార్హమజపన్సంధ్యామృషయస్తే సమాహితాః ||

20

తత్ర వాసిభిరానీతా మునిభిః సువ్రతైః సహ |
న్యవసన్సుసుఖం తత్ర కామాశ్రమపదే తదా ||

21

కథాభిరభిరామభిరభిరామౌ నృపాత్మజౌ |
రమయామాస ధర్మాత్మా కౌశికో మునిపుంగవః ||

22

Balakanda Sarga 23 In Telugu Pdf With Meaning

మరునాడు సూర్యోదయం కాబోతున్నది. సూర్యోదయానికి ముందు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తన మృదుమధురమైన మాటలతో నిద్రలేపాడు.

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సన్ధ్య ప్రవర్తతే।
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్॥

కౌసల్య గర్భవాసాన జన్మించిన ఉత్తమ పుత్రుడవైన ఓ రామా! ప్రాత: కాల సంధ్యకు సమయము ఆసన్నమైనది. ఓ రామా! నిద్ర లే! ప్రాత:కాల 3! కృత్యములు. సంధ్యావందనాది కార్యక్రములు నీవు చేయవలసి ఉన్నది.

(పైశ్లోకము అందరికీ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతములో మొదటి శ్లోకంగానే తెలుసు. ఆ శ్లోకము మూలం వాల్మీకి రామాయణంలో ఉందని కొద్దిమందికి మాత్రమేతెలుసు. అందుకే ఈ శ్లోకమును ఇక్క యధాతథంగా రాసాను).

విశ్వామిత్రుని మాటలు విన్న రామ లక్ష్మణులు వెంటనే నిద్ర లేచారు. కాలకృత్యములు తీర్చుకొన్నారు. స్నానము, సంధ్యావందనము ఆచరించారు. సూర్యునికి అర్ఘ్యము ఇచ్చారు. గాయత్రీ మంత్రము పఠించారు. తరువాత ముగ్గురూ తమ ప్రయాణము కొనసాగించారు.

వారు సరయూనదీ గంగానదిలో కలిసే సంగమస్థానము చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న పురాతనమైన ముని ఆశ్రమములను చూచారు. ఆ ఆశ్రమములను చూచిన రామలక్ష్మణులు “ఓ మహర్షీ! ఈ ఆశ్రమములు ఎవరివి?’ ఈ ఆశ్రమములలో ఎవరు ఉంటారు?”. అని అడిగారు.

దానికి విశ్వామిత్రుడు ఇలా సమాధానము చెప్పాడు. “ఓ రామా! ప్రస్తుతము మన్మధుడు దేహము లేకుండా అనంగుడిగా ఉన్నాడు కానీ, పూర్వము మన్మధుడు దేహము కలవాడు. మన్మధునికి కాముడు అని పేరు. పూర్వము శివుడు ఈ ప్రదేశములో తపస్సు చేసుకునేవాడు. తరువాత శివుడు వివాహం చేసుకొని వెళ్లిపోయాడు. . అటువంటి శివుని మన్మథుడు ఎదిరించాడు. అప్పుడు శివుడు హంకరించి, మన్మధుని వంక కోపంగా చూచాడు. శివుని కోపాగ్నికి మన్మధుడు భస్మము అయిపోయాడు. మన్మధుని శరీర అవయవములు అన్ని చోట్లా చెల్లాచెదరుగా పడిపోయాయి. అప్పుడు మన్మధుడు శరీరం లేనివాడు అయ్యాడు.

పూర్వము పరమశివుడు తపస్సు చేసిన ఆశ్రమము ఇదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఋషులు అందరూ పూర్వము పరమశివునికి శిష్యులుగాఉండేవారు. వారే ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వీరు ధర్మపరులు. వీరికి పాపం అటే ఏమిటో తెలియదు. మనము ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపుఉదయము మన ప్రయాణము కొనసాగిద్దాము. మనము ఇప్పుడు స్నానము, సంధ్య ఆచరించి, శుచులై ఈ ఆశ్రమములలోని ప్రవేశిద్దాము” అని అన్నాడు విశ్వామిత్రుడు.

వీరు ఈ ప్రకారము మాట్లాడుకుంటూ ఉండగా, ఆ ఆశ్రమములలో ఉన్న ఋషులు వీరి రాకను చూచి ఎంతో ఆనందించారు. రామలక్ష్మణులను విశ్వామిత్రుని సాదరంగా ఆహ్వానిచి సత్కరించారు. తరువాత ఆ ఋషులు సాయంసంధ్యాసమయంలో చేయ వలసిన సంధ్యావందనము, గాయత్రీజపము కార్యములు ఏకాగ్రచిత్తంతో చేసారు.

ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఆ ఆశ్రమములో నిద్రించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మార్గాయాసము తెలియకుండా అనేక పుణ్య కథలను చెప్పి ఆనందింపచేస్తూ ఉన్నాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై మూడవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ చతుర్వింశః సర్గః (24) >>

Ayodhya Kanda Sarga 23 In Telugu | అయోధ్యాకాండ త్రయోవింశః సర్గః

Ayodhya Kanda Sarga 23 In Telugu

అయోధ్యా కాండ, సర్గ 23లో, కథ నాటకీయ మలుపు తిరుగుతుంది, రాజా దశరథుడు ఇచ్చిన రెండు వరాలను కైకేయి ప్రయత్నిం చేయడం వల్ల. ఈ కీలక అధ్యాయం కైకేయి రాముడిని పద్దెనిమిదేళ్లు అడవికి నడి ఇవ్వడం మరియు ఆమె కుమారుడు భరతుడిని అయోధ్య రాజుగా పట్టాభిషేకం చేయడం కోసం… ఈ వార్త రాజా దశరథుడిని దెబ్బతీస్తుంది, ఎందుకంటే అతను రాముడిపై ప్రేమ మరియు తన వాగ్దానాలను నిలబెట్టుకోవాలనే కట్టుబాటు మధ్య కొట్టుమిట్టాడుతాడు. ఈ సర్గలో చూపించిన భావోద్వేగాలు మరియు కలకలం కర్తవ్య, ప్రేమ మరియు విధి యొక్క సంక్లిష్ట ఆటలని హైలైట్ చేస్తుంది, ఈ మహాకావ్యంలో ఉన్న తదుపరి సంఘటనలకు పునాదిని వేస్తుంది.

లక్ష్మణక్రోధః

ఇతి బ్రువతి రామే తు లక్ష్మణోఽధశ్శిరా ముహుః |
శ్రుత్వా మధ్యం జగామేవ మనసా దుఃఖహర్షయోః ||

1

తదా తు బద్ధ్వా భ్రుకుటీం భ్రువోర్మధ్యే నరర్షభః |
నిశశ్వాస మహాసర్పో బిలస్థ ఇవ రోషితః ||

2

తస్య దుష్ప్రతివీక్షం తద్భృకుటీసహితం తదా |
బభౌ క్రుద్ధస్య సింహస్య ముఖస్య సదృశం ముఖమ్ ||

3

అగ్రహస్తం విధున్వంస్తు హస్తిహస్తమివాత్మనః |
తిర్యగూర్ధ్వం శరీరే చ పాతయిత్వా శిరోధరామ్ ||

4

అగ్రాక్ష్ణా వీక్షమాణస్తు తిర్యగ్భ్రాతరమబ్రవీత్ |
అస్థానే సంభ్రమో యస్య జాతో వై సుమహానయమ్ ||

5

ధర్మదోషప్రసంగేన లోకస్యానతిశంకయా |
కథం హ్యేతదసంభ్రాంతస్త్వద్విధో వక్తుమర్హతి ||

6

యథా దైవమశౌండీరం శౌండీర క్షత్రియర్షభ |
కిం నామ కృపణం దైవమశక్తమభిశంససి ||

7

పాపయోస్తే కథం నామ తయోః శంకా న విద్యతే |
సంతి ధర్మోపధాః శ్లక్ష్ణా ధర్మాత్మన్కిం న బుధ్యసే ||

8

తయోః సుచరితం స్వార్థం శాఠ్యాత్పరిజిహీర్షతోః |
యది నైవం వ్యవసితం స్యాద్ధి ప్రాగేవ రాఘవ ||

9

తయోః ప్రాగేవ దత్తశ్చ స్యాద్వరః ప్రకృతశ్చ సః |
లోకవిద్విష్టమారబ్ధం త్వదన్యస్యాభిషేచనమ్ ||

10

నోత్సహే సహితుం వీర తత్ర మే క్షంతుమర్హసి |
యేనేయమాగతా ద్వైధం తవ బుద్ధిర్మహామతే ||

11

స హి ధర్మో మమ ద్వేష్యః ప్రసంగాద్యస్య ముహ్యసి |
కథం త్వం కర్మణా శక్తః కైకేయీవశవర్తినః ||

12

కరిష్యసి పితుర్వాక్యమధర్మిష్ఠం విగర్హితమ్ |
యద్యయం కిల్బిషాద్భేదః కృతోఽప్యేవం న గృహ్యతే ||

13

జాయతే తత్ర మే దుఃఖం ధర్మసంగశ్చ గర్హితః |
మనసాఽపి కథం కామం కుర్యాస్త్వం కామవృత్తయోః ||

14

తయోస్త్వహితయోర్నిత్యం శత్ర్వోః పిత్రభిధానయోః |
యద్యపి ప్రతిపత్తిస్తే దైవీ చాపి తయోర్మతమ్ ||

15

తథాఽప్యుపేక్షణీయం తే న మే తదపి రోచతే |
విక్లబో వీర్యహీనో యః స దైవమనువర్తతే ||

16

వీరాః సంభావితాత్మానో న దైవం పర్యుపాసతే |
దైవం పురుషకారేణ యః సమర్థః ప్రబాధితుమ్ ||

17

న దైవేన విపన్నార్థః పురుషః సోఽవసీదతి |
ద్రక్ష్యంతి త్వద్య దైవస్య పౌరుషం పురుషస్య చ ||

18

దైవమానుషయోరద్య వ్యక్తా వ్యక్తిర్భవిష్యతి |
అద్య మత్పౌరుషహతం దైవం ద్రక్ష్యంతి వై జనాః ||

19

యద్దైవాదాహతం తేఽద్య దృష్టం రాజ్యాభిషేచనమ్ |
అత్యంకుశమివోద్దామం గజం మదబలోద్ధతమ్ ||

20

ప్రధావితమహం దైవం పౌరుషేణ నివర్తయే |
లోకపాలాః సమస్తాస్తే నాద్య రామాభిషేచనమ్ ||

21

న చ కృత్స్నాస్త్రయో లోకాః విహన్యుః కిం పునః పితా |
యైర్వివాసస్తవారణ్యే మిథో రాజన్సమర్థితః ||

22

అరణ్యే తే వివత్స్యంతి చతుర్దశ సమాస్తథా |
అహం తదాశాం ఛేత్స్యామి పితుస్తస్యాశ్చ యా తవ ||

23

అభిషేకవిఘాతేన పుత్రరాజ్యాయ వర్తతే |
మద్బలేన విరుద్ధాయ న స్యాద్దైవబలం తథా ||

24

ప్రభవిష్యతి దుఃఖాయ యథోగ్రం పౌరుషం మమ |
ఊర్ధ్వం వర్షసహస్రాంతే ప్రజాపాల్యమనంతరమ్ ||

25

ఆర్యపుత్రాః కరిష్యంతి వనవాసం గతే త్వయి |
పూర్వం రాజర్షివృత్త్యా హి వనవాసో విధీయతే ||

26

ప్రజా నిక్షిప్య పుత్రేషు పుత్రవత్పరిపాలనే |
స చేద్రాజన్యనేకాగ్రే రాజ్యవిభ్రమశంకయా ||

27

నైవమిచ్ఛసి ధర్మాత్మన్రాజ్యం రామ త్వమాత్మని |
ప్రతిజానే చ తే వీర మా భూవం వీరలోకభాక్ ||

28

రాజ్యం చ తవ రక్షేయమహం వేలేవ సాగరమ్ |
మంగళైరభిషించస్వ తత్ర త్వం వ్యాపృతో భవ ||

29

అహమేకో మహీపాలానలం వారయితుం బలాత్ |
న శోభార్థావిమౌ బాహూ న ధనుర్భూషణాయ మే ||

30

నాసిరాబంధనార్థాయ న శరాః స్తంభహేతవః |
అమిత్రదమనార్థం మే సర్వమేతచ్చతుష్టయమ్ ||

31

న చాహం కామయేఽత్యర్థం యః స్యాచ్ఛత్రుర్మతో మమ |
అసినా తీక్ష్ణధారేణ విద్యుచ్చలితవర్చసా ||

32

ప్రగృహీతేన వై శత్రుం వజ్రిణం వా న కల్పయే |
ఖడ్గనిష్పేషనిష్పిష్టైర్గహనా దుశ్చరా చ మే ||

33

హస్త్యశ్వనరహస్తోరుశిరోభిర్భవితా మహీ |
ఖడ్గధారాహతా మేఽద్య దీప్యమానా ఇవాద్రయః ||

34

పతిష్యంతి ద్విపా భూమౌ మేఘా ఇవ సవిద్యుతః |
బద్ధగోధాంగులిత్రాణే ప్రగృహీతశరాసనే ||

35

కథం పురుషమానీ స్యాత్పురుషాణాం మయి స్థితే |
బహుభిశ్చైకమత్యస్యన్నైకేన చ బహూన్ జనాన్ ||

36

వినియోక్ష్యామ్యహం బాణాన్ నృవాజిగజమర్మసు |
అద్య మేఽస్త్రప్రభావస్య ప్రభావః ప్రభవిష్యతి ||

37

రాజ్ఞశ్చాప్రభుతాం కర్తుం ప్రభుత్వం చ తవ ప్రభో |
అద్య చందనసారస్య కేయురామోక్షణస్య చ ||

38

వసూనాం చ విమోక్షస్య సుహృదాం పాలనస్య చ |
అనురూపావిమౌ బాహూ రామ కర్మ కరిష్యతః |
అభిషేచనవిఘ్నస్య కర్తౄణాం తే నివారణే ||

39

బ్రవీహి కోఽద్యైవ మయా వియుజ్యతాం
తవాసుహృత్ప్రాణయశః సుహృజ్జనైః |
యథా తవేయం వసుధా వశే భవే-
-త్తథైవ మాం శాధి తవాస్మి కింకరః ||

40

విమృజ్య బాష్పం పరిసాంత్వ్య చాసకృ-
-త్స లక్ష్మణం రాఘవవంశవర్ధనః |
ఉవాచ పిత్ర్యే వచనే వ్యవస్థితం
నిబోధ మామేవ హి సౌమ్య సత్పథే ||

41

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయోవింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 23 Meaning In Telugu

రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా బుద్ధిగా విన్నాడు లక్ష్మణుడు. కాని లక్ష్మణుని మనసులో కోపం అగ్ని వలె మండుతూ ఉంది. నుదురు ముడుతలు పడింది. దీర్ఘంగా శ్వాస తీస్తున్నాడు. అప్పుడు లక్ష్మణుని మొహం కోపంతో ఉన్న సింహంలా ఉంది. రాముని మొహంలోకి సూటిగా చూడలేక క్రీగంటితో చూస్తూ ఇలా అన్నాడు.

“అన్నయ్యా! ! కేవలము తండ్రిమాటను పాటించడం కోసం ఏమైనా చెయ్యాలనో, తండ్రి మాటను ధిక్కరిస్తే లోకము ఏమను కుంటుందో అనే భయంతోనూ నీవు అరణ్యములకుపోవడం అంత బాగాలేదు. పైగా దైవనిర్ణయము అంటున్నావు. దైవము ఇలా చేస్తుందా. దైవానికి ఒకరి మీద కోపము మరొకరి మీద ద్వేషము ఎందుకుం టుంది. కాబట్టి దీనిని దైవనిర్ణయము అనడానికి వీలులేదు. ఇదంతా కుయుక్తితో కైక, ఆమె మాటలకు తలూపిన దశరథుడు, చేసిన కుతంత్రము. ముందు వారిద్దరినీ అనుమానించాలి.

కైక దశరథుడు పైకి ధర్మములు బోధిస్తూ, లోలోపల నీకు అపకారము చేస్తున్నారు. ‘ఆడిన మాట తప్పకూడదు’ అనే ధర్మాన్ని అడ్డుపెట్టుకొని నీ రాజ్యము అపహరిస్తున్నారు. ఇది అధర్మము. ఇది నీకు అర్ధం కావడం లేదు.

నా ఉద్దేశంలో కైక, దశరథుడు కలిసి ఆడిన నాటకము. లేకపోతే ఎన్నడో ఇస్తాను అన్న వరములు ఇప్పుడు కోరడం ఏమిటి? అసలు దశరథుడు వరాలు ఇస్తాను అని కైకకు మాట ఇచ్చాడు అని ఎవరికి తెలుసు. ఒకవేళ వరాలు ఇచ్చిఉంటే ఇన్నాళ్లు ఎందుకు ఊరుకుంటాడు. ఎప్పుడో తీర్చి ఉండేవాడు కదా! కాబట్టి కైక ఈ వరాలు కోరడం, వాటిని ఈ సమయంలో అడగడం, రాజు ఇవ్వడం, అంతా బూటకం. నిన్ను అడ్డు తొలగించుకోడానికి దశరథుడు, కైక కలిసి ఆడుతున్న నాటకము.

నీవు జ్యేష్టుడవు. రాజ్యము జ్యేష్టునికే చెందుతుంది. అది లోక ధర్మము. కాబట్టి నీవు అరణ్యములకు వెళ్లడం నేను సహించను. నన్ను మన్నించు. నీ బుద్ధిని పెడతోవ పట్టిస్తున్న ఈ ధర్మాచరణమును నేను ఖండిస్తున్నాను. నీకు శక్తి యుక్తులు ఉండి కూడా, నీ తండ్రి దశరథుడు, నీ తల్లికైక మాటలకు ఎందుకు తలూపుతున్నావో అర్థం కావడం లేదు. కైక చేస్తున్నది కపటోపాయము అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాని దానిని నీవు కపటము అని గ్రహించలేకపోవడం దురదృష్టము.

ధర్మంగా నడిచే వారిపట్ల మనం కూడా ధర్మంగా ప్రవర్తించాలి. కాని కైక, దశరథుడు లాంటి అధర్మ వర్తనులపట్ల ధర్మాచరణము యోగ్యము కాదు. పైగా అది నిందింపతగినది. రామా! నీ తండ్రి దశరథుడు, నీ తల్లి కైక నీ క్షేమమును కోరేవారు కాదు. వారు నీకు శత్రువులు. అటువంటి వారి కోరికను తీర్చాలని నీవు మనసులో కూడా తలచడం మహాపాపము.

నీవు అన్నట్టే వారి చేయు పనులు దైవనిర్ణయములు అని అనుకొందాము. దైవనిర్ణయమైనా, అది అధర్మము అయినపుడు దానిని పాటించకపోవడమే ధర్మము.

చేతకాని వాళ్లు, పిరికివాళ్లు, దైవము మీద ఆధారపడతారు. మన లాంటి వీరులు, దైర్యవంతులు దైవము మీద ఆధారపడరు. దైవనిర్ణయములను లెక్క చెయ్యరు. నీ స్వశక్తితో, వీరత్వముతో నీవు దైవనిర్ణయమును ఎదిరించినా, దైవము నిన్ను ఏమీ చెయ్యదు, చెయ్యలేదు. ఎందుకంటే నీవు ధర్మము ప్రకారము నడుచుకుంటు నావు కాబట్టి.

అయినా చూద్దాము. మానవునికి ఉండే శక్తి ఎంతో, దైవమునకు ఉండే శక్తి ఎంతో నేడు తేలిపోతుంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. నీవు చెప్పినట్టు నీ పట్టాభిషేకమును ఏ దైవమైనా అడ్డు కుంటూ ఉంటే, ఆ దైవమును నేను నా స్వశక్తితో ఎదిరిస్తాను. నీ పట్టాభిషేకమును నేను జరిపిస్తాను. ఏ దైవము అడ్డుకుంటుందో చూస్తాను.

రామా! ఆ దైవమే కాదు, దిక్పాలకులు, ముల్లోకములు ఒకటై వచ్చినా సరే నీ పట్టాభిషేకమును ఆపలేరు. ఇంక ఆ దశరథుడు ఒక లెక్కా! ఎవరైతే రహస్యంగా నీకు పదునాలుగేళ్లు వనవాసము విధించారో, వారినే అరణ్యాలకు పంపుతాను. కైక ఆశలు ఈ జన్మలో నెరవేరకుండా చేస్తాను. నన్ను ఎదిరించిన వాడిని ఆ దైవము కూడా రక్షించలేదు.

రామా! నేను అంటున్నాను. నీవు అయోధ్యను వెయ్యి సంవత్స రాలు పాలిస్తావు. తరువాత నీ కుమారులు పాలిస్తారు. భరతుడు కలలో కూడా రాజు కాడు, కాలేడు. నీ తండ్రి రాజ్యము నీకు సంక్రమించినట్టే, నీ రాజ్యము నీ కుమారులకు సంక్రమిస్తుంది. అదే ధర్మము.

రామా! దశరధుడు కామాతురుడై ఉన్నాడు, ఆయన మనసు సరిగా పనిచెయ్యడంలేదు. అందుకని రాజు మాటలు పాటించ నవసరము లేదు. నీవు పట్టాభిషేకము చేసుకోడానికి సిద్ధంగా ఉండు. నీకు రక్షణగా నేను ఉంటాను. ఎవరైనా అడ్డం వస్తే వారి అంతు తేలుస్తాను.

రామా! నా చేతులు, నా చేతుల్లో ఉన్న ఈ ధనుర్బాణములు కేవలం అలంకారము కొరకే కాదు. శత్రువులను ఎదిరించడానికి కూడా పనికి వస్తాయి. నాతో శత్రుత్వము వహించి నాకు ఎదురు నిలిచిన వాడిని నేను బతకనివ్వను. ఆ దేవేంద్రుడు వచ్చి నా ఎదుట నిలిచినా సరే వాడి తలతెగి కిందపడటం తథ్యం.

ఓ శ్రీరామచంద్ర మహారాజా! నన్ను ఆజ్ఞాపించండి. ఈ మాదిరి అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంటున్న దశరథుని మహారాజ పదవి నుండి తొలగించి నిన్ను అయోధ్యకు మహారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. ఎవరడ్డు వస్తారో చూస్తాను. ఈ దాసుడు తమరి ఆజ్ఞ కోసరము ఎదురుచూస్తున్నాడు.” అని ఆవేశంతో అంటున్న లక్ష్మణుని తన సౌమ్యమైన మాటలతో ఓదార్చి

“లక్ష్మణా! నన్ను ఆజ్ఞాపించమన్నావు. అందుకని ఆజ్ఞాపిస్తున్నాను.

నీకూ నాకూ తండ్రిమాటను పాటించడమే ధర్మము. ఇదే నా నిర్ణయము.” అని స్థిరంగా పలికాడు రాముడు.

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము ఇరువదిమూడవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ చతుర్వింశః సర్గః (24) >>

Ayodhya Kanda Sarga 8 In Telugu – అయోధ్యాకాండ అష్టమః సర్గః

Ayodhya Kanda Sarga 8 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండంలో అష్టమః సర్గ ఒక ప్రధానమైన అధ్యాయం. ఈ భాగంలో అయోధ్య నగరంలో జరిగే కీలకమైన సంఘటనలను, ముఖ్యంగా పాత్రలు ఎదుర్కొనే భావోద్వేగ మరియు నైతిక సంక్షోభాలను వివరించబడింది. ఈ అధ్యాయంలో రాజకుటుంబంలోని సున్నితమైన సంబంధాలను పరిశీలించి, కర్తవ్య, ధర్మం మరియు నిర్ణయాల ప్రభావం వంటి అంశాలను స్పష్టంగా చూపిస్తుంది. అష్టమః సర్గ మనిషి అనుభవాల సారాన్ని అందించడంలో ముఖ్య పాత్ర వహించి, రామాయణం యొక్క సమగ్ర నైతిక కథనాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ అధ్యాయం భవిష్యత్తులో పాత్రలు ఎదుర్కొనే సవాళ్లు మరియు కష్టాలను సూచిస్తూ, రామాయణం బోధించే సానాతన విలువలను పాఠకులకు తెలియజేస్తుంది.

మంథరోపజాపః

మంథరా త్వభ్యసూయైనాముత్సృజ్యాభరణం చ తత్ |
ఉవాచేదం తతో వాక్యం కోపదుఃఖసమన్వితా ||

1

హర్షం కిమిదమస్థానే కృతవత్యసి బాలిశే |
శోకసాగరమధ్యస్థం నాత్మానమవబుధ్యసే || [నావబుధ్యసే]

2

మనసా ప్రహసామి త్వాం దేవి దుఃఖార్దితా సతీ |
యచ్ఛోచితవ్యే హృష్టాఽసి ప్రాప్యేదం వ్యసనం మహత్ ||

3

శోచామి దుర్మతిత్వం తే కా హి ప్రాజ్ఞా ప్రహర్షయేత్ |
అరేః సపత్నీపుత్రస్య వృద్ధిం మృత్యోరివాగతామ్ ||

4

భరతాదేవ రామస్య రాజ్యసాధారణాద్భయమ్ |
తద్విచింత్య విషణ్ణాస్మి భయం భీతాఽద్ధి జాయతే ||

5

లక్ష్మణో హి మహేష్వాసో రామం సర్వాత్మనా గతః |
శత్రుఘ్నశ్చాపి భరతం కాకుత్స్థం లక్ష్మణో యథా ||

6

ప్రత్యాసన్నక్రమేణాపి భరతస్యైవ భామిని |
రాజ్యక్రమో విప్రకృష్టస్తయోస్తావద్యవీయసోః || [తయోస్తావత్కనీయసోః]

7

విదుషః క్షత్రచారిత్రే ప్రాజ్ఞస్య ప్రాప్తకారిణః |
భయాత్ప్రవేపే రామస్య చింతయంతీ తవాత్మజమ్ ||

8

సుభగా ఖలు కౌసల్యా యస్యాః పుత్రోఽభిషేక్ష్యతే |
యౌవరాజ్యేన మహతా శ్వః పుష్యేణ ద్విజోత్తమైః ||

9

ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషమ్ |
ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవ త్వం కృతాంజలిః ||

10

ఏవం చేత్త్వం సహాస్మాభిస్తస్యాః ప్రేష్యా భవిష్యసి |
పుత్రశ్చ తవ రామస్య ప్రేష్యభావం గమిష్యతి ||

11

హృష్టాః ఖలు భవిష్యంతి రామస్య పరమాః స్త్రియః |
అప్రహృష్టా భవిష్యంతి స్నుషాస్తే భరతక్షయే ||

12

తాం దృష్ట్వా పరమప్రీతాం బ్రువంతీం మంథరాం తతః |
రామస్యైవ గుణాన్దేవీ కైకేయీ ప్రశశంస హ ||

13

ధర్మజ్ఞో గురుభిర్దాంతః కృతజ్ఞః సత్యవాక్ఛుచిః |
రామో రాజ్ఞః సుతో జ్యేష్ఠో యౌవరాజ్యమతోఽర్హతి ||

14

భ్రాతౄన్భృత్యాంశ్చ దీర్ఘాయుః పితృవత్పాలయిష్యతి |
సంతప్యసే కథం కుబ్జే శ్రుత్వా రామాభిషేచనమ్ ||

15

భరతశ్చాపి రామస్య ధ్రువం వర్షశతాత్పరమ్ |
పితృపైతామహం రాజ్యం ప్రాప్నుయాత్పురుషర్షభః || [అవాప్తాపురుషర్షభః]

16

సా త్వమభ్యుదయే ప్రాప్తే వర్తమానే చ మంథరే |
భవిష్యతి చ కల్యాణే కిమర్థం పరితప్యసే ||

17

యథా మే భరతో మాన్యస్తథా భూయోఽపి రాఘావః |
కౌసల్యాతోఽతిరిక్తం చ సోఽనుశుశ్రూషతే హి మామ్ ||

18

రాజ్యం యది హి రామస్య భరతస్యాపి తత్తథా |
మన్యతే హి యథాఽఽత్మానం తథా భ్రాతౄంస్తు రాఘవః ||

19

కైకేయ్యా వచనం శ్రుత్వా మంథరా భృశదుఃఖితా |
దీర్ఘముష్ణం వినిశ్వస్య కైకేయీమిదమబ్రవీత్ ||

20

అనర్థదర్శినీ మౌర్ఖ్యాన్నాత్మానమవబుధ్యసే |
శోకవ్యసనవిస్తీర్ణే మజ్జంతీ దుఃఖసాగరే ||

21

భవితా రాఘవో రాజా రాఘవస్యాను యః సుతః |
రాజవంశాత్తు కైకేయీ భరతః పరిహాస్యతే ||

22

న హి రాజ్ఞః సుతాః సర్వే రాజ్యే తిష్ఠంతి భామిని |
స్థాప్యమానేషు సర్వేషు సుమహాననయో భవేత్ ||

23

తస్మాజ్జ్యేష్ఠే హి కైకేయి రాజ్యతంత్రాణి పార్థివాః |
స్థాపయంత్యనవద్యాంగి గుణవత్స్వితరేష్వపి ||

24

అసావత్యంతనిర్భగ్నస్తవ పుత్రో భవిష్యతి |
అనాథవత్సుఖేభ్యశ్చ రాజవంశాచ్చ వత్సలే ||

25

సాహం త్వదర్థే సంప్రాప్తా త్వం తు మాం నావబుధ్యసే |
సపత్నివృద్ధౌ యా మే త్వం ప్రదేయం దాతుమిచ్ఛసి ||

26

ధ్రువం తు భరతం రామః ప్రాప్య రాజ్యమకంటకమ్ |
దేశాంతరం వా నయితా లోకాంతరమథాఽపి వా ||

27

బాల ఏవ హి మాతుల్యం భరతో నాయితస్త్వయా |
సన్నికర్షాచ్చ సౌహార్దం జాయతే స్థావరేష్వపి ||

28

భరతస్యాప్యనువశః శత్రుఘ్నోఽపి సమాగతః |
లక్ష్మణశ్చ యథా రామం తథాసౌ భరతం గతః ||

29

శ్రూయతే హి ద్రుమః కశ్చిచ్ఛేత్తవ్యో వనజీవిభిః |
సన్నికర్షాదిషీకాభిర్మోచితః పరమాద్భయాత్ ||

30

గోప్తా హి రామం సౌమిత్రిర్లక్ష్మణం చాపి రాఘవః |
అశ్వినోరివ సౌభ్రాత్రం తయోర్లోకేషు విశ్రుతమ్ ||

31

తస్మాన్న లక్ష్మణే రామః పాపం కించిత్కరిష్యతి |
రామస్తు భరతే పాపం కుర్యాదితి న సంశయః ||

32

తస్మాద్రాజగృహాద్దేవ వనం గచ్ఛతు తే సుతః |
ఏతద్ధి రోచతే మహ్యం భృశం చాపి హితం తవ ||

33

ఏవం తే జ్ఞాతిపక్షస్య శ్రేయశ్చైవ భవిష్యతి |
యది చేద్భరతో ధర్మాత్పిత్ర్యం రాజ్యమవాప్స్యసి ||

34

స తే సుఖోచితో బాలో రామస్య సహజో రిపుః |
సమృద్ధార్థస్య నష్టార్థో జీవిష్యతి కథం వశే ||

35

అభిద్రుతమివారణ్యే సింహేన గజయూథపమ్ |
ప్రచ్ఛాద్యమానం రామేణ భరతం త్రాతుమర్హసి ||

36

దర్పాన్నిరాకృతా పూర్వం త్వయా సౌభాగ్యవత్తయా |
రామమాతా సపత్నీ తే కథం వైరం న యాతయేత్ ||

37

యదా హి రామః పృథివీమవాప్స్యతి
ప్రభూతరత్నాకరశైలపత్తనామ్ |
తదా గమిష్యస్యశుభం పరాభవం
సహైవ దీనా భరతేన భామిని ||

38

యదా హి రామః పృథివీమవాప్స్యతి
ధ్రువం ప్రనష్టో భరతో భవిష్యతి |
అతో హి సంచింతయ రాజ్యమాత్మజే
పరస్య చైవాద్య వివాసకారణమ్ ||

39

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టమః సర్గః ||

Ayodhya Kanda Sarga 8 Meaning In Telugu

కైక తనకు బహుమానముగా ఇచ్చిన ఆభరణమును విసిరి కొట్టింది మంధర.

“అయ్యో ఎంత తెలివి తక్కువదానివమ్మా నువ్వు. దుఃఖించ తగ్గ సమయంలో సంతోషంతో కేరింతలు కొడుతున్నావు. ముంచు కొస్తున్న ఆపదను గుర్తింలేకున్నావు. నిన్ను, నీ అమాయకత్వాన్ని చూచి నాకు నవ్వు వస్తోంది.

అది కాదమ్మా! నాకు తెలియక అడుగుతాను. సవతి కొడుక్కు పట్టాభిషేకం జరుగుతుంటే సంతోషించే దానివి నువ్వు ఒక్కదానివే కనపడుతున్నావు. నీ చావును నువ్వే కొనితెచ్చుకుంటున్నావు. ఈ రాజ్యము ఎవరిది? దశరథునిది. ఆయనకు రాముడొక్కడే కాదు కదా! భరతుడు కూడా కుమారుడే కదా! భరతునికి కూడా రాజ్యాధి కారము ఉన్నది కాబట్టి రామునికి భరతుని చూస్తే భయము. అందుకే భరతుడు ఇంటలేని సమయములో పట్టాభిషేకము చేసుకుం టున్నాడు. ఈ విషయం ఆలోచించే కొద్దీ నాకు దుఃఖము ఆగటం లేదు తల్లీ నీకు ఎలా ఉందో గాని.

ఇంకో విషయం గమనించావా! రాముడు లక్ష్మణుడు ఒకటి. భరతుడు శత్రుఘ్నుడు ఒకటి. రాముని తరువాత భరతుడు పుట్టాడు. అందుకనీ, రాముని తరువాత రాజ్యాధికారము భరతునికే చెందాలి. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు చిన్నవాళ్లు. రాముడు విద్వాంసుడు. రాజనీతి కోవిదుడు. ధనుర్విద్యాపారంగతుడు. అందుకే, నీ కొడుకు భరతుని అమాయకుడిని చేసి రాజ్యం మొత్తం కాజెయ్యాలని చూస్తున్నాడు. రాముడు. ఆ విషయం నువ్వు గ్రహించలేకున్నావు. నాకు మాత్రం వణుకు పుడుతూ ఉంది.

అయినా ఏమనుకొని ఏమి లాభం. అదృష్టం అంతా ఆ కౌసల్యది. ఆమె కొడుకు యువరాజు కాబోతున్నాడు. నువ్వు ఆమెకు దాసిగా ఉండాల్సిందే. ఆమె ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. నువ్వు కౌసల్యకు దాసివి అయితే నీ కొడుకు భరతుడు రామునికి దాసుడు అవుతాడు. నీ కోడలు రాముని భార్యకు దాసి అవుతుంది. మీ కుటుంబానికి దాస్యవృత్తి తప్పదు. …” అని ఇంకా ఏమో అనబోతుంటే మంథరను వారించింది కైక.

మంథరా! ఇంకచాలు ఆపు. రాముడు అంటే ఎవరనుకున్నావు? అన్ని ధర్మములు తెలిసినవాడు. గురు ముఖతా విద్య నేర్చుకున్నవాడు. పరుల ఎడల కృతజ్ఞతా భావము కలవాడు. ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివాడు. అన్నిటి మించి రాముడు జ్యేష్టుడు. రాజ్య సంప్రదాయ ప్రకారము జ్యేష్టుడే రాజ్యమునకు యువరాజు. ఇందులో తప్పేముంది. దు:ఖించడానికి కేముంది. అసలు నీకు రాముని గురించి నీచ భావము ఎలా కలిగింది. రాముడు యువరాజు అయినా తన తమ్ములను తనతో సమానంగా గౌరవిస్తాడు. ఆదరిస్తాడు. రామ పట్టాభి షేక వార్త వినగానే సంతోషించక ఇలా దుఃఖిస్తావెందుకు? నువ్వు చెప్పినట్టు రాముని తరువాత భరతునిదే కదా రాజ్యాధికారము. రాముడు పరిపాలించిన తరువాత భరతుడే తదుపరి రాజు అవుతాడు. ఇందులో సందేహమేమున్నది. ఈ సంతోష సమయంలో సంతోషిం చాలి గానీ దుఃఖించడం అవివేకుల లక్షణం.

మంథరా! ఇంకో మాట చెబుతున్నాను విను. నాకు భరతుడు ఎంతో రాముడూ అంతే. రాముడు నన్ను తన తల్లి కౌసల్య కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అభిమానిస్తాడు. గౌరవిస్తాడు. అటువంటి రాముని గురించి నా ఎదుట నిందిస్తావా! రాముడు రాజు అయితే ఒకటీ భరతుడు రాజు అయితే ఒకటీనా! రాముడు రాజు అయితే నా కుమారుడు భరతుడు కూడా రాజు అయినట్టే! అందుకే ఆ చెడ్డ ఆలోచనలుమాని రాముని రాజ్యాభిషేకమును చూచి ఆనందించు.” అని చీవాట్లు పెట్టింది కైక.

కాని మంథర మారలేదు. దీర్ఘంగా నిట్టూర్చింది. కైక వంక జాలిగా చూసింది. “ఒక పక్క నువ్వు ఎక్కిన పడవను నీ శత్రువు ముంచుతుంటే. నువ్వు ఆ శత్రువునే పొగుడుతున్నావా! ఎంత అమాయకురాలివమ్మా! నువ్వు చెప్పినట్టు రాముడు రాజు అవుతాడు. రాముని తరువాత రాముని కొడుకు రాజు అవుతాడు కానీ భరతుడు ఎలా రాజు అవుతాడు? అసలు అప్పుడు నీ పేరు, నీ కొడుకు భరతుని పేరు ఎవరు తల్చుకుంటారు? అందరూ ‘యువరాజా’ ‘యువరాజా’ అంటూ రాముని కొడుకు వెంట పడతారు. నీ కొడుకు మొహం ఎవరు చూస్తారు.

ఒక రాజుకు నలుగురు కుమారులు ఉంటే అందరూ రాజులు కారు కదా! అందులో జ్యేష్టునికి కానీ, జ్యేష్టుడు పనికి రాని పక్షంలో గుణవంతుడైన తరువాత వాడికి కానీ, రాజ్యాభిషేకము చేస్తారు. ఇది వంశాచారము. అందుకే నా మాటవిను. రాముడు అడ్డు తొలగితే నీ కొడుకే రాజు అవుతాడు. లేకపోతే నీ కొడుకు అనాధ అవుతాడు. రాచమర్యాదలకు సుఖాలకు దూరం అవుతాడు. ఇదంతా నీ మేలుకోరి చెబుతున్నాను. నువ్వేమో రామ పట్టాభిషేక వార్త తెలిసి నాకు కానుకలు ఇస్తున్నావు. ఏంటో!

నీకు ఇంకో రహస్యం తెలుసా! రాముడు రాజు కాగానే, భరతుడు తనకు పోటీ రాకుండా భరతుని దేశాంతరం పంపేస్తాడు. లేకపోతే చంపిస్తాడు. తన మార్గ నిష్కంటకం చేసుకుంటాడు. అసలు నీ కొడును మేనమామతో కూడా పంపడానికి ఇదే కారణము. నీ కొడుకు ఎదురుగా లేడు కనుక నీ భర్తకు నీ కొడుకుమీద ప్రేమ తగ్గిపోయింది. రాముడు ఎదురుగా ఉన్నాడు కనుక రాముని యువరాజును చేస్తున్నాడు. అందుకనే, ఈ పట్టాభిషేక విషయం కనీసం నీకు గానీ, నీ కుమారుడు భరతునికి కానీ తెలియనీయలేదు. ఇదంతా నీ మీద జరుగుతున్న కుట్ర. అది నీవు తెలుసుకోలేకున్నావు. నేనేం చెయ్యను.

భరతుడు ఇక్కడ ఉంటే ఎక్కడ తన యౌవరాజ్య పట్టాభిషేకానికి అడ్డు పడతాడో అని ముందుగానే పథకం ప్రకారం మేనమామ ఇంటి పంపించారు. అసలు భరతుడు కూడా తన కళ్లెదుట ఉంటే నీ భర్త దశరథుడు నీ మీద ఉన్న ప్రేమతో నీ కుమారుడు భరతునికే పట్టాభిషేకము చేసేవాడు కదా! ఇదంతా రాముడు లక్ష్మణుడు కలిసి చేసిన కుట్ర.

రాముని లక్ష్మణుడు ఏమీ చెయ్యడు. రామునికి లక్ష్మణుడు అడ్డురాడు. కాని భరతుడు తనకు పోటీ వస్తాడని చంపించడానికైనా వెనకాడడు రాముడు. అది తెలుసుకో! ఇక్కడకు వచ్చి రాముని చేతిలో చచ్చే కంటే నీ కుమారుడు అటునుండి అటే ఏ అరణ్యములకో పోవడం
మంచిది.

కాబట్టి నా మాటవిను. ధర్మం ప్రకారము భరతుడు కూడా యువరాజు పదవికి అర్హుడు. అయోధ్యకు ఉత్తరాధికారి. అప్పుడు నీకు, నీ బంధువులకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయోధ్యాధీశుని తల్లిగా నిన్ను అందరూ గౌరవిస్తారు. లేకపోతే నీకు దాస్యము నీ కొడుక్కు చావు రాసి పెట్టి ఉంది. నీ కొడుకును బాలుడిని అమాయకుడిని చేసి ఆడిస్తున్నారు. నీ కొడుకు కూడా రాజ్యమునకు అర్హుడు కాబట్టి, రామునికి భరతుడు సహజ శత్రువు. ఏనుగును సింహము కబళించినట్టు నీ కొడును రాముడు కబళిస్తాడు. నా మాటవిని నీ కొడుకును రక్షించుకో!

నీకు గుర్తుందా! నువ్వు నీ భర్తకు ముద్దుల భార్యవు. అందుకని నువ్వు కౌసల్యను ఎన్నోసార్లు హేళన చేసావు. అంతకు అంతా ఇప్పుడు నీ మీద పగ తీర్చుకుంటుంది. సందేహము లేదు. ఇంతెందుకమ్మా! రేపు ఆ కాస్త పట్టాభిషేకము కానీ. ఎల్లుండినుండి నీ గతి, నీ కొడుకు గతి ఏమవుతుందో చూడు! నేనుచెప్పడం ఎందుకు. మీ రిద్దరూ అత్యంత దయనీయ స్థితిలో అవమానాలపాలవుతారు. ఇంతెందుకమ్మా! ఒకసారి రాముడు రాజైతే నీ కుమారునికి నాశనము తప్పదు. ఇది యదార్థము. కాబట్టి రాముని పట్టాభిషేకము జరగకుండా ఉండే ఉపాయము ఆలోచించు.” అని పలికింది మంథర.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము ఎనిమిదవ సర్గసంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ నవమః సర్గః (9) >>

Balakanda Sarga 32 In Telugu – బాలకాండ ద్వాత్రింశః సర్గః

Balakanda Sarga 32 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్వాత్రింశః సర్గలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులు అయోధ్యకు చేరిన తరువాత జరిగే సంఘటనలు వివరించబడ్డాయి. దశరథ మహారాజు వారిని సంతోషంగా స్వాగతిస్తాడు. కైకేయి, సుమిత్ర, కౌసల్యలు సీతను తమ కోడలిగా ఆహ్వానిస్తారు. రామ-సీతల వివాహానికి ప్రజలు ఆనందంతో మురిసిపోతారు. ఈ సందర్భంలో, దశరథుడు తన సింహాసనాన్ని రాముడికి అప్పగించాలని నిర్ణయిస్తాడు.

కుశనాభకన్యోపాఖ్యానమ్

బ్రహ్మయోనిర్మహానాసీత్కుశో నామ మహాతపాః |
అక్లిష్టవ్రతధర్మజ్ఞః సజ్జనప్రతిపూజకః ||

1

స మహాత్మా కులీనాయాం యుక్తాయాం సుగుణోల్బణాన్ |
వైదర్భ్యాం జనయామాస చతురః సదృశాన్సుతాన్ ||

2

కుశాంబం కుశనాభం చ అధూర్తరజసం వసుమ్ |
దీప్తియుక్తాన్మహోత్సాహాన్ క్షత్రధర్మచికీర్షయా ||

3

తానువాచ కుశః పుత్రాన్ధర్మిష్ఠాన్సత్యవాదినః |
క్రియతాం పాలనం పుత్రా ధర్మం ప్రాప్స్యథ పుష్కలమ్ ||

4

కుశస్య వచనం శ్రుత్వా చత్వారో లోకసంమతాః |
నివేశం చక్రిరే సర్వే పురాణాం నృవరాస్తదా ||

5

కుశాంబస్తు మహాతేజాః కౌశాంబీమకరోత్పురీమ్ |
కుశనాభస్తు ధర్మాత్మా పురం చక్రే మహోదయమ్ ||

6

అధూర్తరజసో రామ ధర్మారణ్యం మహీపతిః |
చక్రే పురవరం రాజా వసుశ్చక్రే గిరివ్రజమ్ ||

7

ఏషా వసుమతీ రామ వసోస్తస్య మహాత్మనః |
ఏతే శైలవరాః పంచ ప్రకాశంతే సమంతతః ||

8

సుమాగధీ నదీ పుణ్యా మగధాన్విశ్రుతా యయౌ |
పంచానాం శైలముఖ్యానాం మధ్యే మాలేవ శోభతే ||

9

సైషా హి మాగధీ రామ వసోస్తస్య మహాత్మనః |
పూర్వాభిచరితా రామ సుక్షేత్రా సస్యమాలినీ ||

10

కుశనాభస్తు రాజర్షిః కన్యాశతమనుత్తమమ్ |
జనయామాస ధర్మాత్మా ఘృతాచ్యాం రఘునందన ||

11

తాస్తు యౌవనశాలిన్యో రూపవత్యః స్వలంకృతాః |
ఉద్యానభూమిమాగమ్య ప్రావృషీవ శతహ్రదాః ||

12

గాయంత్యో నృత్యమానాశ్చ వాదయంత్యశ్చ సర్వశః |
ఆమోదం పరమం జగ్ముర్వరాభరణభూషితాః ||

13

అథ తాశ్చారుసర్వాంగ్యో రూపేణాప్రతిమా భువి |
ఉద్యానభూమిమాగమ్య తారా ఇవ ఘనాంతరే ||

14

తాః సర్వగుణసంపన్నా రూపయౌవనసంయుతాః |
దృష్ట్వా సర్వాత్మకో వాయురిదం వచనమబ్రవీత్ ||

15

అహం వః కామయే సర్వా భార్యా మమ భవిష్యథ |
మానుషస్త్యజ్యతాం భావో దీర్ఘమాయురవాప్స్యథ ||

16

చలం హి యౌవనం నిత్యం మానుషేషు విశేషతః |
అక్షయం యౌవనం ప్రాప్తా అమర్యశ్చ భవిష్యథ ||

17

తస్య తద్వచనం శ్రుత్వా వాయోరక్లిష్టకర్మణః |
అపహాస్య తతో వాక్యం కన్యాశతమథాబ్రవీత్ ||

18

అంతశ్చరసి భూతానాం సర్వేషాం త్వం సురోత్తమ |
ప్రభావజ్ఞాశ్చ తే సర్వాః కిమస్మానవమన్యసే ||

19

కుశనాభసుతాః సర్వాః సమర్థాస్త్వాం సురోత్తమ |
స్థానాచ్చ్యావయితుం దేవం రక్షామస్తు తపో వయమ్ ||

20

మా భూత్స కాలో దుర్మేధః పితరం సత్యవాదినమ్ |
నావమన్యస్వ ధర్మేణ స్వయం‍వరముపాస్మహే ||

21

పితా హి ప్రభురస్మాకం దైవతం పరమం హి నః |
యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి ||

22

తాసాం తద్వచనం శ్రుత్వా వాయుః పరమకోపనః |
ప్రవిశ్య సర్వగాత్రాణి బభంజ భగవాన్ప్రభుః ||

23

తాః కన్యా వాయునా భగ్నా వివిశుర్నృపతేర్గృహమ్ |
ప్రాపతన్భువి సంభ్రాంతాః సలజ్జాః సాశ్రులోచనాః ||

24

స చ తా దయితా దీనాః కన్యాః పరమశోభనాః |
దృష్ట్వా భగ్నాస్తదా రాజా సంభ్రాంత ఇదమబ్రవీత్ ||

25

కిమిదం కథ్యతాం పుత్ర్యః కో ధర్మమవమన్యతే |
కుబ్జాః కేన కృతాః సర్వా వేష్టంత్యో నాభిభాషథ |
ఏవం రాజా వినిశ్వస్య సమాధిం సందధే తతః ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్వాత్రింశః సర్గః ||

Balakanda Sarga 32 Meaning In Telugu

” ఓ రామా! పూర్వము కుశుడు అనే మహా తపస్వి ఉండే వాడు. అతడు బ్రహ్మదేవుని కుమారుడు. అతడు సకల ధర్మములను తెలిసిన వాడు. మంచి వాడు. విదర్భ రాజకుమారి ఆయన భార్య వారికి నలుగురు కుమారులు. వారిపేర్లు కుశాంబుడు. కుశనాభుడు. అధూర్తజసుడు. వసువు. వారందరూ తండ్రి వలె ధర్మాత్ములు. సుగుణ వంతులు.

ఆయనకు రాజ్యపాలన చేయవలెనని కోరిక కలిగింది. అప్పుడు ఆ కుశుడు తన పుత్రులతో ఇలా అన్నాడు. ” ఓ పుత్రులారా! మీరు ధర్మమును అనుసరించి రాజ్యపాలన చెయ్యండి.” అని అన్నాడు.

తండ్రి మాటను అనుసరించి ఆ నలుగురూ జనపదములను నిర్మించారు.

కుశాంబుని చేత నిర్మింప బడిన నగరము పేరు కౌశాంబి.

కుశనాధుని చేత నిర్మింప బడిన నగరము పేరు మహోదయము.

అధూర్త రజసుడు నిర్మించిన నగరము పేరు ధర్మారణ్యము.

వసువు నిర్మించిన నగరము పేరు గిరివ్రజపురము.

మనము ఇప్పుడు ఉన్న ప్రాంతము ఆ వసువు నివసించిన గిరివ్రజపురము భూమి. దీని చుట్టూ ఐదు పర్వతములు ఉన్నాయి. మగధ దేశములో పుట్టిన శోణ నది ఈ ఐదు పర్వతముల మధ్య ప్రవహించుచున్నది. ఈ శోణ నది తూర్పునుండి పడమరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ పరీవాహక ప్రాంతము అన్నీ సస్యశ్యామలములైన పంట పొలాలతో నిండి ఉన్నాయి.

కుశనాభుని భార్య ఘృతాచి. వారికి నూర్గురు కుమార్తెలు. ఆ కన్యలందరూ లోకోత్తర సౌందర్య వతులు. వారికి యుక్త వయసు వచ్చింది.

ఒకరోజు ఆ కన్యలందరూ వన విహారము చేస్తున్నారు. అప్పుడు వాయుదేవుడు వారిని చూచి ఇలా అన్నాడు. “నేను వాయుదేవుడను. నేను మీ అందరనూ వివాహమాడదలిచాను. మీరు నన్ను వివాహం చేసుకుంటే మీకు దైవత్వము సిద్ధిస్తుంది. దానితో పాటు మీరు కలకాలము జీవిస్తారు. మీ మానవులకు యౌవనము కొద్ది కాలమే ఉంటుంది. కాని మా దేవతలు నిత్య యౌవనులుగా ఉంటారు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి.” అని అన్నాడు వాయుదేవుడు.

ఆ మాటలను పరిహాసంగా తీసుకున్నారు ఆ కన్యలు.

” ఓ వాయుదేవా! నీవు సకల జీవరాసులలో సంచరిస్తుంటావు. అందరికీ ప్రాణ దాతవు. నీ శక్తి మాకు తెలుసు. కాని నీవు ఇలా మాట్లాడటం బాగాలేదు. మేము కుశనాభుని కుమార్తెలము. మాకు నిన్ను శపించే శక్తి కలదు కాని మా తపశ్శక్తిని మేము వృధా చేయము. ఎందుకంటే మేము స్వతంత్రు లము కాము. మా తండ్రి మాటను జవదాటము. మేమే కాదు ఈ లోకంలో ఏ కన్యకూడా తల్లి తండ్రుల మాటను జవదాటే దుస్థితి కలుగకుండు గాక! మాకు మా తండ్రి ప్రభువు. దైవము. మా తండ్రి మమ్ములను ఎవరికి ఇచ్చి వివాహము చేస్తాడో వారినో మేము వివాహము చేసుకుంటాము.” అని చెప్పారు ఆ కన్యలు.

వారి మాటలకు వాయుదేవునకు కోపం వచ్చింది. వెంటనే వాయుదేవుడు తన మహిమ చేత వారి శరీరములు అన్నీ బలము లేకుండా చేసాడు. ఏ మాత్రం బలము లేని ఆ కన్యలు ఎలాగోలాగ అంత:పురము చేరుకున్నారు. కిందపడిపోయారు. బాధతో కన్నీరు కారుస్తున్నారు.

వారి తండ్రి అయిన కుశనాభుడు కుమార్తె ల దుస్థితి చూచాడు. వారితో ఇలా అన్నాడు.

” ఓ పుత్రికలారా! ఏమిజరిగింది? మీకు ఈ దుస్థితి ఎలా దాపురించింది. దీనికి కారణం ఎవరు.” అని అడిగాడు.

శ్రీమద్రామాయణము
బాల కాండ ముప్పది రెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ త్రయస్త్రింశః సర్గః (33) >>

Ayodhya Kanda Sarga 32 In Telugu – అయోధ్యాకాండ ద్వాత్రింశః సర్గః

Ayodhya Kanda Sarga 32

అయోధ్యాకాండ ద్వాత్రింశ సర్గ రామాయణంలో కీలక ఘట్టం. ఈ సర్గలో భరతుడు, కైకేయి కుమారుడు, రాముడిని తిరిగి తీసుకురావడానికి చింతించడాన్ని వివరిస్తుంది. భరతుడు తన తల్లి కైకేయి చేసిన తప్పును తెలుసుకుని, దాని ఫలితంగా తండ్రి దశరథుని మరణం మరియు రాముడు అడవికి వెళ్లడం కారణంగా దుఃఖంలో మునిగిపోతాడు. అతను రాముడిని తిరిగి తీసుకురావడం కోసం దండకారణ్యానికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఈ సర్గలో భరతుడు తన ధర్మం, కర్తవ్యాన్ని గుర్తుచేసుకుంటాడు. రాముడి పట్ల తన ప్రేమను మరియు సత్కారాన్ని వ్యక్తం చేస్తాడు. భరతుని కృతజ్ఞత, పాశ్చాత్యత్వం మరియు కుటుంబానుబంధాలు ప్రధాన అంశాలుగా ఉంటాయి.

విత్తవిశ్రాణనమ్

తతః శాసనమాజ్ఞాయ భ్రాతుః శుభతరం ప్రియమ్ |
గత్వా స ప్రవివేశాశు సుయజ్ఞస్య నివేశనమ్ || ౧ ||

తం విప్రమగ్న్యగారస్థం వందిత్వా లక్ష్మణోఽబ్రవీత్ |
సఖేఽభ్యాగచ్ఛ పశ్య త్వం వేశ్మ దుష్కరకారిణః || ౨ ||

తతః సంధ్యాముపాస్యాశు గత్వా సౌమిత్రిణా సహ |
జుష్టం తత్ప్రావిశల్లక్ష్మ్యా రమ్యం రామనివేశనమ్ || ౩ ||

తమాగతం వేదవిదం ప్రాంజలిః సీతయా సహ |
సుయజ్ఞమభిచక్రామ రాఘవోఽగ్నిమివార్చితమ్ || ౪ ||

జాతరూపమయైర్ముఖ్యైరంగదైః కుండలైః శుభైః |
సహేమసూత్రైర్మణిభిః కేయూరైర్వలయైరపి || ౫ ||

అన్యైశ్చ రత్నైర్బహుభిః కాకుత్స్థః ప్రత్యపూజయత్ |
సుయజ్ఞం స తదోవాచ రామః సీతాప్రచోదితః || ౬ ||

హారం చ హేమసూత్రం చ భార్యాయై సౌమ్య హారయ |
రశనాం చాధునా సీతా దాతుమిచ్ఛతి తే సఖే || ౭ ||

అంగదాని విచిత్రాణి కేయూరాణి శుభాని చ |
ప్రయచ్ఛతి సఖే తుభ్యం భార్యాయై గచ్ఛతీ వనమ్ || ౮ ||

పర్యంకమగ్ర్యాస్తరణం నానారత్నవిభూషితమ్ |
తమపీచ్ఛతి వైదేహీ ప్రతిష్ఠాపయితుం త్వయి || ౯ ||

నాగః శత్రుంజయో నామ మాతులోఽయం దదౌ మమ |
తం తే గజసహస్రేణ దదామి ద్విజపుంగవ || ౧౦ ||

ఇత్యుక్తః స హి రామేణ సుయజ్ఞః ప్రతిగృహ్య తత్ |
రామలక్ష్మణసీతానాం ప్రయుయోజాఽశిషః శుభాః || ౧౧ ||

అథ భ్రాతరమవ్యగ్రం ప్రియం రామః ప్రియంవదః |
సౌమిత్రిం తమువాచేదం బ్రహ్మేవ త్రిదశేశ్వరమ్ || ౧౨ ||

అగస్త్యం కౌశికం చైవ తావుభౌ బ్రాహ్మణోత్తమౌ |
అర్చయాహూయ సౌమిత్రే రత్నైః సస్యమివాంబుభిః || ౧౩ ||

తర్పయస్వ మహాబాహో గోసహస్రైశ్చ మానద |
సువర్ణై రజతైశ్చైవ మణిభిశ్చ మహాధనైః || ౧౪ ||

కౌసల్యాం చ సుమిత్రాం చ భక్తః పర్యుపతిష్ఠతి | [య ఆశీర్భిః]
ఆచార్యస్తైత్తిరీయాణామభిరూపశ్చ వేదవిత్ || ౧౫ ||

తస్య యానం చ దాసీశ్చ సౌమిత్రే సంప్రదాపయ |
కౌశేయాని చ వస్త్రాణి యావత్తుష్యతి స ద్విజః || ౧౬ ||

సూతశ్చిత్రరథశ్చార్యః సచివః సుచిరోషితః |
తోషయైనం మహార్హైశ్చ రత్నైర్వస్త్రైర్ధనైస్తథా || ౧౭ ||

పశుకాభిశ్చ సర్వాభిర్గవాం దశశతేన చ |
యే చేమే కఠకాలాపా బహవో దండమాణవాః || ౧౮ ||

నిత్యస్వాధ్యాయశీలత్వాన్నాన్యత్కుర్వంతి కించన |
అలసాః స్వాదుకామాశ్చ మహతాం చాపి సమ్మతాః || ౧౯ ||

తేషామశీతియానాని రత్నపూర్ణాని దాపయ |
శాలివాహసహస్రం చ ద్వే శతే భద్రకాంస్తథా || ౨౦ ||

వ్యంజనార్థం చ సౌమిత్రే గోసహస్రముపాకురు |
మేఖలీనాం మహాసంఘః కౌసల్యాం సముపస్థితః || ౨౧ ||

తేషాం సహస్రం సౌమిత్రే ప్రత్యేకం సంప్రదాపయ |
అంబా యథా చ సా నందేత్కౌసల్యామమ దక్షిణామ్ || ౨౨ ||

తథా ద్విజాతీంస్తాన్సర్వాంల్లక్ష్మణార్చయ సర్వశః |
తతః స పురుషవ్యాఘ్రస్తద్ధనం లక్ష్మణః స్వయమ్ || ౨౩ ||

యథోక్తం బ్రాహ్మణేంద్రాణామదదాద్ధనదో యథా |
అథాబ్రవీద్బాష్పకలాంస్తిష్ఠతశ్చోపజీవినః || ౨౪ ||

సంప్రదాయ బహుద్రవ్యమేకైకస్యోపజీవనమ్ |
లక్ష్మణస్య చ యద్వేశ్మ గృహం చ యదిదం మమ || ౨౫ ||

అశూన్యం కార్యమేకైకం యావదాగమనం మమ |
ఇత్యుక్త్వా దుఃఖితం సర్వం జనం తముపజీవినమ్ || ౨౬ ||

ఉవాచేదం ధనాధ్యక్షం ధనమానీయతామితి |
తతోఽస్య ధనమాజహ్రుః సర్వమేవోపజీవినః || ౨౭ ||

స రాశిః సుమహాంస్తత్ర దర్శనీయో హ్యదృశ్యత |
తతః స పురుషవ్యాఘ్రస్తద్ధనం సహలక్ష్మణః || ౨౮ ||

ద్విజేభ్యో బాలవృద్ధేభ్యః కృపణేభ్యో హ్యదాపయత్ |
తత్రాసీత్పింగలో గార్గ్యస్త్రిజటో నామ వై ద్విజః || ౨౯ ||

ఉంఛవృత్తిర్వనే నిత్యం ఫాలకుద్దాలలాంగలీ |
తం వృద్ధం తరుణీ భార్యా బాలానాదాయ దారకాన్ || ౩౦ ||

అబ్రవీద్బ్రాహ్మణం వాక్యం దారిద్ర్యేణాభిపీడితా |
అపాస్య ఫాలం కుద్దాలం కురుష్వ వచనం మమ || ౩౧ ||

రామం దర్శయ ధర్మజ్ఞం యది కించిదవాప్స్యసి |
భార్యాయా వచనం శ్రుత్వా శాటీమాచ్ఛాద్య దుశ్ఛదామ్ || ౩౨ || [స భార్యా]

స ప్రాతిష్ఠత పంథానం యత్ర రామనివేశనమ్ |
భృగ్వంగిరసమం దీప్త్యా త్రిజటం జనసంసది || ౩౩ ||

ఆ పంచమాయాః కక్ష్యాయా నైనం కశ్చిదవారయత్ |
స రాజపుత్రమాసాద్య త్రిజటో వాక్యమబ్రవీత్ || ౩౪ ||

నిర్ధనో బహుపుత్రోఽస్మి రాజపుత్ర మహాయశః |
ఉంఛవృత్తిర్వనే నిత్యం ప్రత్యవేక్షస్వ మామితి || ౩౫ ||

తమువాచ తతో రామః పరిహాససమన్వితమ్ |
గవాం సహస్రమప్యేకం న తు విశ్రాణితం మయా || ౩౬ ||

పరిక్షిపసి దండేన యావత్తావదవాప్య్ససి |
స శాటీం త్వరితః కట్యాం సంభ్రాంతః పరివేష్ట్య తామ్ || ౩౭ ||

ఆవిద్ధ్య దండం చిక్షేప సర్వప్రాణేన వేగితః |
స తీర్త్వా సరయూపారం దండస్తస్య కరాచ్చ్యుతః || ౩౮ ||

గోవ్రజే బహుసాహస్రే పపాతోక్షణసన్నిధౌ |
తం పరిష్వజ్య ధర్మాత్మా ఆ తస్మాత్సరయూతటాత్ || ౩౯ ||

ఆనయామాస తా గోపైస్త్రిజటాయాశ్రమం ప్రతి |
ఉవాచ చ తతో రామస్తం గార్గ్యమభిసాంత్వయన్ |
మన్యుర్న ఖలు కర్తవ్యః పరిహాసో హ్యయం మమ || ౪౦ ||

ఇదం హి తేజస్తవ యద్దురత్యయం
తదేవ జిజ్ఞాసితుమిచ్ఛతా మయా |
ఇమం భవానర్థమభిప్రచోదితో
వృణీష్వ కిం చేదపరం వ్యవస్యతి || ౪౧ ||

బ్రవీమి సత్యేన న తేఽస్తి యంత్రణా
ధనం హి యద్యన్మమ విప్రకారణాత్ |
భవత్సు సమ్యక్ర్పతిపాదనేన త-
-న్మయాఽఽర్జితం ప్రీతియశస్కరం భవేత్ || ౪౨ ||

తతః సభార్యస్త్రిజటో మహాముని-
-ర్గవామనీకం ప్రతిగృహ్య మోదితః |
యశోబలప్రీతిసుఖోపబృంహణీ-
-స్తదాఽఽశిషః ప్రత్యవదన్మహాత్మనః || ౪౩ ||

స చాపి రామః ప్రతిపూర్ణమానసో
మహద్ధనం ధర్మబలైరుపార్జితమ్ |
నియోజయామాస సుహృజ్జనేఽచిరా-
-ద్యథార్హసమ్మానవచఃప్రచోదితః || ౪౪ ||

ద్విజః సుహృద్భృత్యజనోఽథవా తదా
దరిద్రభిక్షాచరణశ్చ యోఽభవత్ |
న తత్ర కశ్చిన్న బభూవ తర్పితో
యథార్హసమ్మాననదానసంభ్రమైః || ౪౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వాత్రింశః సర్గః || ౩౨ ||

Ayodhya Kanda Sarga 32 Meaning In Telugu

అన్నగారి ఆదేశము మేరకు లక్ష్మణుడు వసిష్ఠుని కుమారుడైన సుయజ్ఞుని ఇంటికి వెళ్లాడు. అప్పుడు సుయజ్ఞుడు అగ్నికార్యము చేసుకుంటున్నాడు. అతనిని చూచి లక్ష్మణుడు ఇలా అన్నాడు. “మిత్రమా! రాముడు నిన్ను తీసుకొని రమ్మన్నాడు. రాముడు ఏంచేస్తున్నాడో నువ్వే స్వయంగా వచ్చి చూడు.”అని అన్నాడు లక్ష్మణుడు.

సుయజ్ఞుడు అగ్ని కార్యమును, సంధ్యావందనమును ముగించుకొని లక్ష్మణుని వెంట రాముని మందిరమునకు వెళ్లాడు. సుయజ్ఞుని చూడగానే రాముడు లేచి అతనికి దగ్గరగా వచ్చాడు. సీతను కూడా రమ్మన్నాడు. సీతారాములు సుయజ్ఞుని చుట్టూ తిరిగి నమస్కారము చేసారు. తన దగ్గర ఉన్న ఆభరణములు, ధనము సుయజ్ఞునికి ఇచ్చాడు. ఇంకా ఇలా అన్నాడు.

నా “మిత్రమా! నేను నాభార్య అరణ్యములకుపోతున్నాము. నేను నా ఆభరణములు అన్నీ నీకు ఇచ్చాను. సీత కూడా తనవద్ద ఉన్న ఆభరణములను నీ భార్యకు ఇవ్వవలెనని అనుకుంటూ ఉన్నది. దయతో స్వీకరించు. అవే కాకుండా నేను నాకు నా మేనమామ ఇచ్చిన ఏనుగులు కూడా నీకు ఇస్తున్నాను. స్వీకరించు.” అని అన్నాడు.

సుయజ్ఞుడు సీతారాములు ఇచ్చినవి అన్నీ స్వీకరించి సీతారాములను ఆశీర్వదించాడు. తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఇప్పుడు నువ్వు బ్రాహ్మణోత్తములైన అగస్త్యుని, కౌశికునీ పిలిపించి వారిని అర్చించి వారికి నీ వద్ద ఉన్న అమూల్య ఆభరణములు, రత్నములు వారికి దానంగా ఇవ్వు. తరువాత తైత్తిరీయ ఆచార్యులను, వేద పండితులను మనము లేని సమయములో మనతల్లులకు ప్రతిరోజూ ఆశీర్వచనములను అందించే బ్రాహ్మణోత్తములను పిలిపించి వారికి ధన, కనక, వస్తు వాహనములను దానముగా ఇమ్ము. మన తండ్రి గారికి అనుకూలుడైన మంత్రి చిత్రరథుడు మన ఇంట్లోనే ఉ న్నాడు. అతడిని పిలిపించి అతనికి కూడా రత్మములు, వస్త్రములు, వాహనములు దానముగా ఇమ్ము. మన వేదపాఠశాలలలో నిత్యము వేదమును నేర్చుకొను విద్యార్థులు ఉన్నారు. వారికి కూడా రథములు, వాహనములు, గోవులను, రుచికరమైన మంచి మంచి ఆహార పదార్థములను దానంగా ఇమ్ము. ఇంకా మన తల్లులు సంతోష పడేట్టు వారు ఎవరికి దానం చెయ్యమంటే వారికి దానములుచెయ్యి. మన తల్లుల సంతోషమే మనకు ముఖ్యం.” అని అన్నాడు రాముడు.

రాముడు ఆదేశించి నట్టు లక్ష్మణుడు దానములు విరివిగా చేసాడు. రాముడు కూడా అప్పటి వరకూ తనకు సేవచేస్తూ తనను అనుసరించి ఉన్న సేవకులకు అపారంగా ధనాన్ని పంచిపెట్టాడు.

“సేవకులారా! నేను లక్ష్మణుడు తిరిగి వచ్చువరకూ మా మందిరములను జాగ్రత్తగా చూస్తూ ఉండండి. వీటిలో మేము ఉన్నట్టే సుయజ్ఞుడు సీతారాములు ఇచ్చినవి అన్నీ స్వీకరించి సీతారాములను ఆశీర్వదించాడు.

తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఇప్పుడు నువ్వు బ్రాహ్మణోత్తములైన అగస్త్యుని, కౌశికునీ పిలిపించి వారిని అర్చించి వారికి నీ వద్ద ఉన్న అమూల్య ఆభరణములు, రత్నములు వారికి దానంగా ఇవ్వు. తరువాత తైత్తిరీయ ఆచార్యులను, వేద పండితులను మనము లేని సమయములో మనతల్లులకు ప్రతిరోజూ ఆశీర్వచనములను అందించే బ్రాహ్మణోత్తములను పిలిపించి వారికి ధన, కనక, వస్తు వాహనములను దానముగా ఇమ్ము. మన తండ్రి గారికి అనుకూలుడైన మంత్రి చిత్రరథుడు మన ఇంట్లోనే ఉ న్నాడు. అతడిని పిలిపించి అతనికి కూడా రత్మములు, వస్త్రములు, వాహనములు దానముగా ఇమ్ము. మన వేదపాఠశాలలలో నిత్యము వేదమును నేర్చుకొను విద్యార్థులు ఉన్నారు. వారికి కూడా రథములు, వాహనములు, గోవులను, రుచికరమైన మంచి మంచి ఆహార పదార్థములను దానంగా ఇమ్ము. ఇంకా మన తల్లులు సంతోష పడేట్టు వారు ఎవరికి దానం చెయ్యమంటే వారికి దానములుచెయ్యి. మన తల్లుల సంతోషమే మనకు ముఖ్యం.” అని అన్నాడు రాముడు.
రాముడు ఆదేశించి నట్టు లక్ష్మణుడు దానములు విరివిగా చేసాడు. రాముడు కూడా అప్పటి వరకూ తనకు సేవచేస్తూ తనను అనుసరించి ఉన్న సేవకులకు అపారంగా ధనాన్ని పంచిపెట్టాడు.

“సేవకులారా! నేను లక్ష్మణుడు తిరిగి వచ్చువరకూ మా మందిరములను జాగ్రత్తగా చూస్తూ ఉండండి. వీటిలో మేము ఉన్నట్టే అందరూ అనుకోవాలి. అలాగా వీటిని అనుదినమూ శుభ్రం చేసి దీపములు వెలిగించి ఉంచండి.” అని ఆదేశించాడు. తరువాత రాముడు లక్ష్మణుడు కలిసి అపార మైన ధనమును బ్రాహ్మణులకు బాలురకు వృద్ధులకు పంచిపెట్టారు.

ఆ సమయంలో అయోధ్యలో త్రిజటుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు భార్య బిడ్డలు ఉన్నారు. కానీ కడుపేదవాడు. అడవులలో కందమూలములు తవ్వుకొని జీవిస్తూ ఉండేవాడు. రాముడు దానములు చేస్తున్నాడని విని అతని భార్య అతనితో ఇలా అంది. “రాముడు దానములు విరివిగా చేస్తున్నాడట. మీరుకూడా వెళ్లి ఏమైనా అడగండి.” అని త్రిజటుని రాముని వద్దకు పంపింది. త్రిజటుడు రాముని వద్దకు వెళ్లాడు. తన పరిస్థితి గురించి చెప్పి ఏమైనా దానం చెయ్యమని అడిగాడు. అప్పుడు రాముడు అతనితో ఇలాఅన్నాడు. “నేను ఇప్పటి దాకా గోదానము చెయ్యలేదు. నువ్వు నీ చేతిలో ఉన్న గునపమును ఎంత దూరము విసరగలవో అంత దూరము పట్టే గోవులను నీకు ఇస్తాను.” అని అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు తన చేతిలో ఉన్న చిన్నగునపమును బలంగా విసిరాడు. అది సరయూ నదీ తీరంలో వెళ్లి పడింది. రాముడు అంతమేరా పట్టే ఆవులను త్రిజటునికి దానంగా ఇచ్చాడు.

“ఓ బ్రాహ్మణోత్తమా! ఏదో పరిహాసమునకు మిమ్ములను గునపము విసరమన్నాను. నా అజ్ఞానానికి మన్నించండి. మీకు ఇంకా ఏమి కావాలో కోరుకోండి. నేను నా ధనమును అంతా బ్రాహ్మణులకు దానంగా ఇస్తున్నాను. ఇంత అని నియమము లేదు. నీ ఇష్టం వచ్చినంత కోరుకో” అని అన్నాడు రాముడు.

“రామా! నాకు ఇవి చాలు. ఇంక ఏమీ అక్కరలేదు.” అని రాముని ఆశీర్వదించాడు. తరువాత రాముడు తనవద్ద ఇంకా మిగిలిన ధనమును అంతా తన మిత్రులకు దానంగా ఇచ్చాడు. ఆ సమయంలో రాముని చేతిమీదుగా దానం తీసుకోని వాడు అయోధ్యలో లేడు అంటే అతిశయోక్తిలేదు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రయస్త్రింశః సర్గః (౩౩) >>

Ayodhya Kanda Sarga 31 in Telugu – అయోధ్యాకాండ ఏకత్రింశః సర్గః

Ayodhya Kanda Sarga 31

రామాయణం యొక్క అయోధ్యాకాండలో ఏకత్రింశ సర్గ రాముడి తన పుత్రుడు రాముడు, సీత మరియు లక్ష్మణుడు అడవికి వెళ్ళిన దుఃఖంతో ఉన్న రాజా దశరథుడు, తన గత దోషాలపై పశ్చాత్తాపం చెంది, కౌసల్యకి తన కథను చెప్పడం గురించి ఉంటుంది. ఆయన గతంలో శ్రవణ కుమారుడిని పొరపాటున వేట వేస్తూ, అతని తల్లిదండ్రులకు దుఃఖం కలిగించాడని చెప్పడం కీలకం. దశరథుడు తన కర్మ ఫలం గా ఇప్పుడు రాముడిని వదలవలసి వచ్చింది. ఈ సర్గలో దశరథుని దుఃఖం, పశ్చాత్తాపం మరియు రాముడి గురించి వేదనను వ్యక్తం చేస్తుంది. ఈ సంఘటనలు దశరథుని మరణానికి దారితీస్తాయి, రాజ్యం లో విషాదం నెలకొల్పుతుంది.

లక్ష్మణవనానుగమనభ్యనుజ్ఞా

ఏవం శ్రుత్వా తు సంవాదం లక్ష్మణః పూర్వమాగతః |
బాష్పపర్యాకులముఖః శోకం సోఢుమశక్నువన్ || ౧ ||

స భ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య రఘునందనః |
సీతామువాచాతియశా రాఘవం చ మహావ్రతమ్ || ౨ ||

యది గంతుం కృతా బుద్ధిర్వనం మృగగజాయుతమ్ |
అహం త్వాఽనుగమిష్యామి వనమగ్రే ధనుర్ధరః || ౩ ||

మయా సమేతోఽరణ్యాని బహూని విచరిష్యసి |
పక్షిభిర్మృగయూథైశ్చ సంఘుష్టాని సమంతతః || ౪ ||

న దేవలోకాక్రమణం నామరత్వమహం వృణే |
ఐశ్వర్యం వాఽపి లోకానాం కామయే న త్వయా వినా || ౫ ||

ఏవం బ్రువాణః సౌమిత్రిర్వనవాసాయ నిశ్చితః |
రామేణ బహుభిః సాంత్వైర్నిషిద్ధః పునరబ్రవీత్ || ౬ ||

అనుజ్ఞాతశ్చ భవతా పూర్వమేవ యదస్మ్యహమ్ |
కిమిదానీం పునరిదం క్రియతే మే నివారణమ్ || ౭ ||

యదర్థం ప్రతిషేధో మే క్రియతే గంతుమిచ్ఛతః |
ఏతదిచ్ఛామి విజ్ఞాతుం సంశయో హి మమానఘ || ౮ ||

తతోఽబ్రవీన్మహాతేజా రామో లక్ష్మణమగ్రతః |
స్థితం ప్రాగ్గామినం వీరం యాచమానం కృతాంజలిమ్ || ౯ ||

స్నిగ్ధో ధర్మరతో వీరః సతతం సత్పథే స్థితః |
ప్రియః ప్రాణసమో వశ్యో భ్రాతా చాసి సఖా చ మే || ౧౦ ||

మయాఽద్య సహ సౌమిత్రే త్వయి గచ్ఛతి తద్వనమ్ |
కో భరిష్యతి కౌసల్యాం సుమిత్రాం వా యశస్వినీమ్ || ౧౧ ||

అభివర్షతి కామైర్యః పర్జన్యః పృథివీమివ |
స కామపాశపర్యస్తో మహాతేజా మహీపతిః || ౧౨ ||

సా హి రాజ్యమిదం ప్రాప్య నృపస్యాశ్వపతేః సుతా |
దుఃఖితానాం సపత్నీనాం న కరిష్యతి శోభనమ్ || ౧౩ ||

న స్మరిష్యతి కౌసల్యాం సుమిత్రాం చ సుదుఃఖితామ్ |
భరతో రాజ్యమాసాద్య కైకేయ్యాం పర్యవస్థితః || ౧౪ ||

తామార్యాం స్వయమేవేహ రాజానుగ్రహణేన వా |
సౌమిత్రే భర కౌసల్యాముక్తమర్థమిమం చర || ౧౫ ||

ఏవం మమ చ తే భక్తిర్భవిష్యతి సుదర్శితా |
ధర్మజ్ఞ గురుపూజాయాం ధర్మశ్చాప్యతులో మహాన్ || ౧౬ ||

ఏవం కురుష్వ సౌమిత్రే మత్కృతే రఘునందన |
అస్మాభిర్విప్రహీణాయా మాతుర్నో న భవేత్సుఖమ్ || ౧౭ ||

ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః శ్లక్ష్ణయా గిరా |
ప్రత్యువాచ తదా రామం వాక్యజ్ఞో వాక్యకోవిదమ్ || ౧౮ ||

తవైవ తేజసా వీర భరతః పూజయిష్యతి |
కౌసల్యాం చ సుమిత్రాం చ ప్రయతో నాత్ర సంశయః || ౧౯ ||

అధికపాఠః –
యది దుఃస్థో న రక్షేత భరతో రాజ్యముత్తమమ్ |
ప్రాప్య దుర్మనసా వీర గర్వేణ చ విశేషతః || ౨౦ ||

తమహం దుర్మతిం క్రూరం వధిష్యామి న సంశయః |
తత్పక్ష్యానపి తాన్సర్వాంస్త్రైలోక్యమపి కిం ను సా || ౨౧ ||

కౌసల్యా బిభృయాదార్యా సహస్రమపి మద్విధాన్ |
యస్యాః సహస్రం గ్రామాణాం సంప్రాప్తముపజీవినమ్ || ౨౨ ||

తదాత్మభరణే చైవ మమ మాతుస్తథైవ చ |
పర్యాప్తా మద్విధానాం చ భరణాయ యశస్వినీ || ౨౩ ||

కురుష్వ మామనుచరం వైధర్మ్యం నేహ విద్యతే |
కృతార్థోఽహం భవిష్యామి తవ చార్థః ప్రకల్పతే || ౨౪ ||

ధనురాదాయ సశరం ఖనిత్రపిటకాధరః |
అగ్రతస్తే గమిష్యామి పంథానమనుదర్శయన్ || ౨౫ ||

ఆహరిష్యామి తే నిత్యం మూలాని చ ఫలాని చ |
వన్యాని యాని చాన్యాని స్వాహారాణి తపస్వినామ్ || ౨౬ ||

భవాంస్తు సహ వైదేహ్యా గిరిసానుషు రంస్యతే |
అహం సర్వం కరిష్యామి జాగ్రతః స్వపతశ్చ తే || ౨౭ ||

రామస్త్వనేన వాక్యేన సుప్రీతః ప్రత్యువాచ తమ్ |
వ్రజాపృచ్ఛస్వ సౌమిత్రే సర్వమేవ సుహృజ్జనమ్ || ౨౮ ||

యే చ రాజ్ఞో దదౌ దివ్యే మహాత్మా వరుణః స్వయమ్ |
జనకస్య మహాయజ్ఞే ధనుషీ రౌద్రదర్శనే || ౨౯ ||

అభేద్య కవచే దివ్యే తూణీ చాక్షయసాయకౌ |
ఆదిత్యవిమలౌ చోభౌ ఖడ్గౌ హేమపరిష్కృతౌ || ౩౦ ||

సత్కృత్య నిహితం సర్వమేతదాచార్యసద్మని |
స త్వమాయుధమాదాయ క్షిప్రమావ్రజ లక్ష్మణ || ౩౧ ||

స సుహృజ్జనమామంత్ర్య వనవాసాయ నిశ్చితః |
ఇక్ష్వాకుగురుమాగమ్య జగ్రాహాయుధముత్తమమ్ || ౩౨ ||

తద్దివ్యం రఘుశార్దూలః సత్కృతం మాల్యభూషితమ్ |
రామాయ దర్శయామాస సౌమిత్రిః సర్వమాయుధమ్ || ౩౩ ||

తమువాచాత్మవాన్రామః ప్రీత్యా లక్ష్మణమాగతమ్ |
కాలే త్వమాగతః సౌమ్య కాంక్షితే మమ లక్ష్మణ || ౩౪ ||

అహం ప్రదాతుమిచ్ఛామి యదిదం మామకం ధనమ్ |
బ్రాహ్మణేభ్యస్తపస్విభ్యస్త్వయా సహ పరంతప || ౩౫ ||

వసంతీహ దృఢం భక్త్యా గురుషు ద్విజసత్తమాః |
తేషామపి చ మే భూయః సర్వేషాం చోపజీవినామ్ || ౩౬ ||

వసిష్ఠపుత్రం తు సుయజ్ఞమార్యం
త్వమానయాశు ప్రవరం ద్విజానామ్ |
అభిప్రయాస్యామి వనం సమస్తా-
-నభ్యర్చ్య శిష్టానపరాన్ద్విజాతీన్ || ౩౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకత్రింశః సర్గః || ౩౧ ||

Ayodhya Kanda Sarga 31 Meaning In Telugu

సీతారాములు వనవాస విషయము గురించి వాదించు కుంటున్నప్పుడు లక్ష్మణుడు అక్కడకు వచ్చాడు. బయట ఉండి వారి మాటలు అన్నీ విన్నాడు. ఆ దంపతుల అన్యోన్యతకు చలించి పోయాడు. అన్న రాముని కాళ్ల మీదపడ్డాడు.

“రామా! క్రూరమృగములతో నిండిన అరణ్యములలో నీకు తోడుగా ఉండడానికి సుకుమారి అయిన వదిన రాగా లేనిది నేను నీ వెంట రాలేనా. నేనుకూడా నీ వెంట వస్తాను. నీకు ముందు ఉండి దారి చూపిస్తాను. రామా! చిన్నప్పటి నుండి నేను నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఇప్పుడు కూడా ఉండలేను. నీవు లేని ఈ అయోధ్య కానీ, త్రిలోకాధి పత్యము కానీ నాకు అక్కరలేదు.” అన్నాడు లక్ష్మణుడు.

ఇప్పటి దాకా తల్లి కౌసల్యను భార్య సీతను వనవాసమునకు రావద్దని వాదించాడు. తల్లి ఒప్పుకుంది. భార్య ఒప్పుకోలేదు. ఇప్పుడు తమ్ముడు లక్ష్మణుని వంతు వచ్చింది. యధాప్రకారము లక్ష్మణుని కూడా తన వెంట అడవులకు రావద్దని నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు రాముడు. లక్ష్మణుడు ససేమిరా ఒప్పుకోలేదు.

“రామా! నన్ను నీ వెంట అరణ్యమునకు ఎందుకు రావద్దు అంటున్నావో కారణం చెప్పు” అని నిలదీసాడు. దానికి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! నీవు నాకు మంచి స్నేహితుడవు. ధర్మతప్పకుండా చరించే వాడివి. వీరుడివి. ఎల్లప్పుడూ సన్మార్గములో పయనిస్తావు. అదీ కాకుండా నాకు నీవు ప్రాణంతో సమానం. నేను ఏది చెబితే అది చేస్తావు. అటువంటి నీవు నాతో పాటు వనమునకు వస్తే నా తల్లి కౌసల్య, నీ తల్లి సుమిత్ర ఒంటరి వాళ్లు అవుతారుకదా! వారి ఆలనాపాలనా ఎవరు చూస్తారు. వారి గురించి ఎవరు పట్టించుకుంటారు. కాబట్టి నీవు అయోధ్యలో ఉండటమే ధర్మము.

ప్రస్తుతము మన తండ్రి దశరథుడు తన భార్య కైక మోహ పాశములో చిక్కుకొని ఉన్నాడు. భరతుని పట్టాభిషేకము తరువాత కైక తన సవతులైన మన తల్లులను ఎన్ని కష్టముల పాలు చేస్తుందో ఏమో. ఇంక భరతుడు కూడా తన తల్లి కైక మాటలను విని మన తల్లుల గురించి పట్టించుకోడు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వాళ్లను జాగ్రత్తగా చూచుకోవాలి కదా! నీవు అలా చేసావనుకో నీకు నా మీదున్న ప్రేమ, భక్తి ప్రకటితమవుతుంది. తల్లులకు సేవ చెయ్యడం కన్నా పరమ ధర్మము ఏముంటుంది. కనీసము నా మొహం చూచి అయినా నీవు ఇక్కడే ఉండి తల్లుల సంరక్షణ చూసుకో.” అని రాముడు లక్ష్మణునితో అన్నాడు.

కాని లక్ష్మణుడు ఆ మాటలకు ఒప్పుకోలేదు. “రామా! అదేమిటి అలా అంటావు. నీవు అంటే భరతునికి భయం, భక్తి, గౌరవము. నీ పరాక్రమమునకు భయపడి భరతుడు మన తల్లులను అత్యధికంగా గౌరవిస్తాడు కానీ అవమానించడు. ఇందులో ఎలాంటి సంశయము లేదు.

అదీ కాకుండా నీ తల్లి కౌసల్యకు ఆమె పుట్టింటి ఆస్తి వెయ్యి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలలో ప్రజలు ఆమెను అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తారు. వాటి మీద వచ్చే ఆదాయంతో ఆమె వెయ్యిమందిని పోషించ గలదు. అందుకని మన తల్లుల గురించి మనకు భయం లేదు. కాబట్టి నన్ను నీతో కూడా రావడానికి అనుమతించు. నాజన్మ ధన్యము అవుతుంది. అరణ్యములలో నీవు సీత విహరిస్తూ ఉంటే మీకు సేవలు చేసుకుంటూ ఉంటాను. మీకు కావలసినవిఅన్నీ అమరుస్తాను.”అని అన్నాడు లక్ష్మణుడు.

ఇంక ఎంత చెప్పినా లక్ష్మణుడు వినడు అనుకున్నాడు రాముడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! నీ నిర్ణయము నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మనము వనవాసము పోవుటకు తగిన ఏర్పాట్లు చెయ్యి. నీ స్నేహితులందరికీ చెప్పి వారి దగ్గర సెలవు తీసుకొని రా. వెళ్లు. లక్ష్మణా!జనక మహారాజు యజ్ఞమునకు మనము వెళ్లినపుడు, వరుణ దేవుడు మన ఇద్దరికీ ఒక దివ్య ధనుస్సు, అక్షయతూణీరములు, దివ్య కవచములు, రెండు ఖడ్గములు ప్రసాదించాడు కదా. వాటిని మనము గురువుగారు వసిష్ఠుల వారి ఇంట్లో ఉంచి పూజిస్తున్నాము కదా. వాటిని మన వెంట తీసుకొని రా. అని అన్నాడు రాముడు. అన్నగారి మాట ప్రకారము లక్ష్మణుడు తనమిత్రుల వద్ద సెలవు తీసుకొని, వసిష్ఠువారి ఇంటి నుండి ఆయుధములను తీసుకొన్నాడు. వాటిని తీసుకొని వచ్చి రాముడికి చూపించాడు.

“లక్ష్మణా! నేను వనవాసమునకు వెళుతున్నాను కదా! అందుకనీ నా వద్ద ఉన్న ధనము, ఆభరణములు సదాచారులైన బ్రాహ్మణులకు దానంగా ఇవ్వతలచుకొన్నాను. నీవు వెళ్లి వసిష్ఠుని కుమారుడు సుయజ్ఞుని నీ వెంట తీసుకొని రా. ఆయనతో కూడా సదాచార పరాయణులైన అనేక మంది బ్రాహ్మణులను తీసుకొని రా. నా ధనము, ఆభరణములు వారికి దానంగా ఇస్తాను.” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్వాత్రింశః సర్గః (32) >>