Viveka Margramlo Povali In Telugu – వివేక మార్గంలో పోవాలి

Viveka Margramlo Povali In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వివేక మార్గంలో పోవాలి నీతికథ.

వివేక మార్గంలో పోవాలి

మహా విద్వాంసుడూ, భారత వంశ సామ్రాజ్యానికి ప్రధానమంత్రీ. అయిన విదురుడు తన ప్రభువు అవివేశాన్ని వేలెత్తి చూపుతూ చెపు తున్నాడు.

ప్రభూ! ధనవంతుడున్నాడే వాడు హాయిగా సుఖపడుతూ భోగ మయ జీవితం గడుపుతూ తృప్తి పడకూడదు. పదిమందికీ పెట్టి, పేద వారికి దానధర్మాలు చేస్తూండాలి. దానం చేసేటప్పుడు చిరాకుతో, విసు గుతో చెయ్యకూడదు. సంతోషంతో చేస్తే పుచ్చుకున్న వాడు కూడా అనం దిస్తాడు. దానివల్ల మన పుణ్యం పెరుగుతుంది. అదే ధనానికి ఫలం.

వేద వేదాంగాలు చదివినవారుంటారు. వారు నిత్యం సత్కర్మలే చేస్తూ లోక కళ్యాణం కోసం పాటుపడాలి. శాస్త్రాలు చదివిని వారందరూ అందులో చెప్పిన సదాచారాలను తాము ఆచరించి ఎదుటి వారికి బోధిం చాలి.

ఆత్మబలం కనక ఉన్నట్లయితే ఎన్ని వివత్తులు మీదపడ్డా తట్టుకో గలం. అది లేని నాడు ఏ చిన్న కష్టం వచ్చినా క్రుంగిపోతాం.

ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము. క్రోధాన్ని శాంతంతో జయించాలి. దుష్టులను మంచి మాటలతో మరలించాలి. లోభబుద్ధి ఉంటే అది పోవడానికి దానగుణం అలవరచుకోవాలి. అసత్యాన్ని పత్యమే జయిస్తుంది.

దొంగలు, జూదరులు, సోమరిపోతులు, కాముకులు, కృతఘ్నులు, వా స్తితులు- వీరందరూ అవఖ్యాతినే పొందుతారు.

విద్యావంతుడు కానివాడి జీవితం నిరర్థకం. అలానే సంతానం లేని దాంపత్య జీవితమూనూ.

విశ్రాంతి లేకుండా తిరిగే వారికి త్వరగా ముపలితనం వస్తుంది. పదిమంది చేత అవమానాల పాలయిన వాడి మనస్సుకి వార్ధక్యం ప్రాప్తి స్తుంది. నిరంతరం మననం చేసుకోక పోతే విద్య నిలవదు.

అన్నిటికంటె లోభం మహాచెడ్డది. ఎందుకంటే
ఈ ప్రపంచంలో ఉండే బంగారం, మణులూ, రత్నాలూ, ధాన్యాలూ, అన్నీ లభించినా యింకా ఏదో దొరకలేదని ఏడుస్తూనే ఉంటాడు లోభి. అందువల్లనే మానవుడు ముందుగా లోభ గుణాన్ని విడిచి పెట్టాలంటారు.

నడ్డిపంచి పని చేసేవాడికి ఏ లోటూ రాదు. సజ్జమలతో సహవాసం చేసే వానికి అపకీర్తి రాదు. వీరిద్దరూ సర్వ సుఖాలూ పొందుతారు.

గుంతలను దోషులుగా ప్రచారం చెయ్యడం కంటె మరణం లేదు. ఇతరులను నిందిస్తూ కూర్చోవడం కంటే దరిద్రం లేదు.

విద్యార్థులయిన వారు సోమరితనాన్ని దరి చేర నివ్వకూడదు. వ్యామోహాలకు లొంగరాదు. మదోన్మత్తులు కాకూడదు. చపలచిత్తులు కాకూడదు. సర్వ సుఖ భోగాలలో తేలియాడే వారికి చదువు రాదు. విద్యా భ్యాస కాలంలో వివయాన్నీ, క్లేశసహనాన్ని అలవరచుకోవాలి. అప్పుడే విద్య అంటుతుంది.

ప్రభూ!
మరొక్క ముఖ్యమయిన మాట. సావధానంగా వినండి. ఈ శరీరం శాశ్వతం కాదు. ఆత్మ మాత్రమే నిత్యం. అంమచేత దానిని గురించే యోచన చెయ్యాలి.

ధన ధాన్య సమృద్ధమూ, రత్న మాణిక్య సంపన్నమూ అయిన ఈ భూమండలం అంతటినీ పాలించిన మహారాజు కూడా మరణానంతరం తనతో ఒక్క గడ్డి పరక కూడా పట్టుకుపోలేడు అన్నీ యిక్కడ విడిచి పోవలసిందే.

ఈ విషయం మీకు తెలియనిదని చెప్పడం లేదు. తెలిసిన వాటిని మళ్లీ గుర్తు చేసుకోవడం మన విధి.

కష్టపడి పెంచి, పోషించి, విద్యాబుద్ధులు నేర్పి, సంపదలన్నీ -యిచ్చిన తండ్రి మరణిస్తే, యిన్నీ అనుభవించే ఆ కొడుకు ఏం చేస్తు న్నాడు?

ఇంతసేపు ఏడ్చి, వల్లకాటికి తీసుకుపోయి బూడిద చేస్తున్నాడు. అంతేగదా ! ఆ తరువాత హాయిగా జీవితం సాగిస్తున్నాడు. ఇది లోక వ్యవహారం.

ఆ మరణించిన వాడి సిరి సంపదలన్నీ బంధువులు పంచుకు తింటు న్నారు. ఆ శరీరాన్ని బూడిద చేస్తే పంచ భూతాలలో కలసిపోతుంది.

పాతిపెడితే నక్కలూ, గ్రద్దలూ తింటున్నాయి.
పువ్వులూ, కాయలూ లేని చెట్లమీదికి పక్షులు కూడా చేరవు. అలానే మరణించిన వాడితో ఎవరూ పోరు.

ఎటొచ్చీ – వాడు చేసిన పుణ్య, పాపకర్మల ఫలం మాత్రం కూడా వెడుతుంది. కనుకనే దాన ధర్మాలూ, పుణ్యకార్యాలూ చెయ్యాలని పెద్దలు చెబుతున్నారు.

మనం చెయ్యవలసిన పనులు మనం చేసుకుంటూ పేదసాదలను ఆవరంతో చూస్తుండాలి. పతితులను రక్షించడానికి ప్రయత్నించాలి.
గురువులనుందు భక్తి కలిగి శ్రద్ధతో వారి బోధలు వింటూ, వారిని సేవించుకోవాలి.

ఎప్పుడూ పత్యమే పలకాలి అసత్య భాషణానికి అవకాశం యివ్వకూడదు.

ధనవంతులు దానధర్మాలతో త్యాగబుద్ధిని ఎలా అలవర్చుకుంటారో, అలానే బలపరాక్రమాలు కలవారు ఎదుటి వారిని హింసించడానికి దానిని వినియోగించరాదు.

దుర్బలులకు సాయపడడానికే వీరులు కృషి చెయ్యాలి.
అన్ని దానాల కంటే శ్రేష్ఠమయినది అన్నదానం.
అదే కదా ప్రాణానికి ఆధారం.
అలానే జీవితంలో ప్రధానమయినది ధర్మ మార్గాన నడవడం.
అంతకంటె ఏమీలేదు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Vidura Neethi Patinchi Sukhinchandi In Telugu – విదుర నీతి పాటించి సుఖించండి

Vidura neethi Patinchi Sukhinchandi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విదుర నీతి పాటించి సుఖించండి నీతికథ.

విదుర నీతి పాటించి సుఖించండి

(ఈ కథ ఉద్యోగపర్వంలో ఉంది.)

వెళ్ళాడు.
వచ్చాడు సంజయుడు.
తష్కప్రియాలతోవెళ్ళి, శూన్యహస్తాలతో తిరిగివచ్చాడు. వస్తూనే ధృతరాష్ట్రమహారాజును దర్శించి, రాయబారం విఫలమయిందని, విశేషా అన్నీ మరుసటి ఉదయం మహాసభలో కురు, గురు, వృద్ధబాంధవమంత్రి, సామంత, దండనాథులందరూ ఉండగా వివరంగా చెపుతానని స్వగృహ నికి వెళ్ళాడు.

సంజయుడు వెళ్ళడంతో మహారాజు మనసు మథనపడసాగింది. కుటుంబకలహం ఏ పరిణామాలకు దారితీస్తుందో అనే ఆందోళనతో ఆ వృద్ధ రాజు హృదయంలో కల్లోలం పుట్టింది. రాత్రికి రాత్రి మనశ్శాంతి కలిగించే ప్రియవాక్యాలు వింటూ నిద్రపోదామని మహామంత్రి విమరునికి కబురు చేశాడు. కౌరవసామ్రాజ్యానికి నిండు గౌరవం తెచ్చే మంత్రి పదవిని నిరా డంబరంగా నిర్వహించే నిరహంకారుడు, నిశ్చలమనస్కుడైన విదురుడు మహారాజు పిలుపును రాత్రివేళ అందుకోవడం అదే మొదటి సారి.

మొదటిసారే ఆయినా ఆ దీవిశారదుడు నిశ్చలచిత్తంతో రాజమంది రానికి విచ్చేసి తనరాకను ద్వారపాలకునిద్వారా మహారాజుకి తెలిమ జేశాడు.

తక్షణం లోవలకు రమ్మని అనుజ్ఞ అయింది.
విదురుడువచ్చి నమస్కరించి, రాజాఙ్ఞానుసారం ఆసీమ డయ్యాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు తనకు నిద్ర పట్టటంలేదనీ, హృదయానికి శాంతి కలిగించేమాటలు చెప్పవలసిందనీ అడిగాడు.

‘మహారాజా! మీకు నిద్రపట్టడంలేదంటే నాకు చిత్రంగా ఉంది. బలవంతునితో విరోధం తెచ్చుకున్న దుర్బలులకూ, ఇతరుల సంపదను హరించినవారికీ, కామం పెచ్చు పెరిగినవారికి, దొంగలకుమాత్రమే రాత్రి నిద్రపట్టదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ లక్షణాలన్నీ మీకున్నట్లు వే నెరుగుదును. అటువంటప్పుడు మీకు నిద్రపట్టకపోవడానికి కారణం ఏమిటో నా కవగాహన కావడంలేదు’.

అని ఎదురుప్రశ్న వేయడంతో ధృతరాష్ట్రుడు కొంచెం చికాగ్గా- “నేను నీ ముఖంనుండి ధర్మప్రవచనమే కోరుతున్నాను’ అన్నాడు.

‘ మహారాజా ! ఉత్తమగుణాలూ, ఉన్నతాశయాలూ, ఉదాత్త ధర్మాలూకల ధర్మరాజు త్రిలోకాధీశుడు కాగలడు. కాగలిగిన శక్తి ఉన్నా ఆ కుంతీసుతుడు మీ మాటకెన్నడూ ఎదురు చెప్పలేదు. అయినా మీరు వారిని కారడవులకు పంపారు. మీకు బుద్ధిలేదనీ, ధర్మజ్ఞులుగారనీ అవలేం. అయినా వాటిని అనుసరించేవృష్టి మీకు లోపించింది. వారికి రావలసిన రాజ్యభాగంకూడా వారి కివ్వలేని స్థితిలో ఉన్నారు మీరు.

దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణాది అయోగ్యులపై అపరిమిత మైన విశ్వాసం ఉంచి ఈ సామ్రాజ్యభారం అంతా వారిచేతులలో ఉంచారు.

అలా ఉంచి శాంతిని వాంఛించడం వివేకమా మహారాజా?
సాత్త్విక స్వభావమూ, ఉద్యోగయత్నము, క్లేశపహనమూ, ధర్మబద్ధ దృష్టికల పురుషుడు ఎన్నడూ వంచితుడుకాడు. ఇటువంటి విద్వాంసులు దుష్టులకు దూరంగా ఉంటారు. మహారాజా! ధర్మార్థాలను అమసరిస్తూ, లోకవ్యవహారం గ్రహిస్తూ, భోగచింతలేకుండా పురుషార్థాలు సేవిస్తూ, అప్రస్తుతప్రసంగాలు చెయ్యకుండా, దుర్లభాలు వాంఛించ కుండా, పోయినవాటికోసం శోకించకుండా, ఎటువంటి వివత్తులువచ్చినా, ధైర్యంకోల్పోకుండా, ప్రారంభించిన పనిని నిర్విఘ్నంగా పరిసమాప్తం । చెయ్యనిదే విడువకుండా, సోమరితనాన్ని దరిజేరనివ్వకుండా, మనస్సును స్వాధీనంలో ఉంచుకోగలవాడే విద్వాంసుడు.

ఆదరిస్తే ఆనందిస్తూ, అనాదరానికి ఆగ్రహం పొందడం విద్వాం మఖ లక్షణంకాదు. వారిహృదయం గంభీరంగా గంగావడి చదృశంగా ఉంటుంది. విద్వాంమలబుద్ధి విద్యను అనుసరిస్తుంది. విద్య వారి బుద్ధికి థా. బీ. 4

అదుపులో ఉంటుంది. విద్యా వివేకమూ, లేకుండా గర్వంతో చరించే వాడు మూర్ఖుడు. దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతూ, లేనిపోని ఆశలు పెట్టుకునేవాడూ, అంతే.

స్వీయ ధర్మం విడిచి, యితరుల మార్గాలసాగేవాడూ, స్నేహితు లతో అసంబద్ధంగా చరించేవాడూ, శత్రువులతో సఖ్యంగా ఉంటూ, బల వంతునితో వైరం పెంచుకునేవాడూ, మిశ్రశూన్యుడూ, ఎదుటివారు కోర కుండానే సంభాషించేవాడూ, కృతఘ్నులను విశ్వసించేవాడూ, పరులలో దోషాలే చూచేవాడూ, అకారణంగా ఆవేశానికి లొంగేవాడూ, అనర్హులకు ఉపదేశాలిచ్చేవాడూ …. వీరందరూ మూర్ఖులే ప్రభూ!

విద్యా, దానాలు ఎంత విరివిగా ఉన్నా, ఆ రెండింటిలో అహం కారం లేకుండా ఉండేవాడే విద్వాంసుడు.

తనపోషణలో ఉన్నవారికి భోజనభాజనాలు సమకూర్చకుండా తన పొట్టనింపుకునేవాడు వరమమూర్ఖుడు. విషంఉన్నదే. అది త్రాగినవానినే చంపుతుంది. వాడిమొన కలిగిన బాణం గుచ్చుకున్న వాడే యమసదనం చేరుతాడు. మరి ప్రజలో ! ….

ఈ ప్రజాసమూహం ప్రభువును పదభ్రష్టునిచేసి, పరలోకానికే పంపగలదు.

విధి నిషేధాలు

మహారాజా!
ఏకాకిగా – అంటే ఒంటరిగా భోజనంచెయ్యకూడదు. విషము నమ స్యలు ఎదురయినప్పుడు తనకుతానై నిశ్చయాలు తీసుకోకూడదు. ఒంట రిగా ప్రయాణం చెయ్యకూడదు. అందరూ న్వి దిస్తూంటే ఒక్కడుగా మేల్కొని ఉండరాదు,

వహనశక్తి కలవారిలో అసమర్థత ఉంటుందని అంటారు. కాని, అసమర్థులలో సహనం ఉండనే ఉండదు. క్షమ కంటే బలీయ మయినది లేదు. అది పురుషులకు అలంకారంకూడా.

అల్పబుద్ధులనూ, అదే పనిగా ఆలోచించే వారినీ, త్వరత్వరగా నిర్ణయాలు మార్చేవారినీ, స్తోత్ర పాఠకులనూ రహస్య సమాలోచనకు ఆహ్వానించ కూడదు.

కుటుంబంలోని వృద్ధులనూ, దారిద్యంలో వడ్డ ఉన్నత కుటుంబీ కులనూ, అటువంటి దశనే అనుభవించే స్నేహితులనూ, సంతాన విహి నయై, భర్తను కోల్పోయిన సోదరినీ, ఆదరించి ఆశ్రయమిచ్చి పోషించాలి.

సమయం, సందర్భం లేకుండా కోపం తెచ్చుకునేవాడూ, సేవ కుల కష్ట సుఖాలతో నిమిత్తం లేకుండా వారిచేత సేవ చేయించుకునే వాడూ, వారి కృషికి తగిన వేతనాలూ, బహుమతులూ యివ్వని ప్రభు వును అచిరకాలంలోనే ప్రజలు క్రిందికి దింపుతారు.

ప్రభూ పన్నులు వసూలు చేయడంలో కూడా అధికారులు చాలా జాగరూకతతో వ్యవహరించాలి. పూలదండలు కట్టివాడు మొక్కకి ఏ చేటు రాకుండా దాన్ని పెంచుతూనే పువ్వులు కోపెట్టు, పన్నులు వమాలు చెయ్యాలే తప్ప, బొగ్గులవ్యాపారిలా చెట్టు మొదలంటా నరకకూడదు.

గో, నారీ, విప్రజనులమీద, స్వజనంమీద శౌర్యం ప్రకటించే వారు అరముగ్గిన పండులా నేల కూలుతారు.

విశాల ప్రాంతంలో ఒక్కటిగా పెరిగే చెట్టు గట్టి వేళ్ళతో బలంగా పెరుగవచ్చు. కాని ఒక్క గాలివాన వివరిందో మహారాజాః సమూలంగా నేలకూలి పోతుంది. అదే వృక్ష సమూహం మధ్యలో ఉంటే అప్పుడది అంత సులభంగా గాలికి వరిగిపోదు. అందు చేతనే వజ్జములు సంఘంగా ఉండాలనీ, వారంతా పరస్పర సహకారంతో చరించాలనీ, బుధులు చెపుతూ ఉంటారు.

ఆకాశాన్ని పిడికిటి పోటుతో వంచేద్దామనుకునే వాడూ, ఇంద్రధనస్సును తవ బాహు బలంతో పంచుదామమకునేవాడూ, మార్యకిరణాలను దోసిట పడదామనుకునే వాడూ, వీరందరూ మూర్ఖులే అంటారు స్వాయం భువనుమవుం

ప్రియం – హితం

మనకు ప్రీతికలిగే మాటలు చెప్పేవారు అయాచితంగానే అనే కులు లభిస్తారు. కాని, మన శ్రేయస్సుకోరి హితవు చెప్పేవాడు దొరకడు. ఓవేళ హితబోధ చేసే వారున్నా, వినేవాడుండడు. ధర్మదృష్టి విడువ కుండా స్వామియొక్క ప్రియాప్రియాలతో నిమిత్తం లేకుండా హితవు చెప్పగలవాడే ఉత్తమ సేవకుడు.

సేవకుల జీవనభారం గ్రహించి వారికి వేతనా లివ్వకపోయినా, మంత్రులు భోగవంచితు అయినా ఆ ప్రభువు వడచ్యుతుడు కాక తప్పదు.

ప్రభువుమాట పెడచెవిని పెట్టి యితర కార్యాలలో తిరిగే సేవకుని, అహంకారంతో ప్రభువుకు ప్రతికూలంగా చరించేవానినీ, మరుక్షణమే పదవి నుండి తొలగించాలి. ప్రభువుకు గల బలాలలో బాహుబలం మెద టిదే అయినా, దాన్ని ఘనంగా భావించరాదు. ఇక రెండవ బలం ఉత్తముడయిన మంత్రి. తరువాత ధనబలం. పితృ, పితామహప్రాప్త మున్నదే అది సహజం. అన్నింటినీ మించినది బుద్ధిబలం. స్త్రీ – సౌభాగ్యశాలిని. కనుక ఆమె గృహాలంకారం. అందుకే ఆమెను రక్షించు కోవడం పురుషుని విధి.

మహారాజా ! సర్వసద్గుణ సంపన్నులూ, ధర్మ మర్మజ్ఞులూ అయిన పాండవులతో విరోధం ఉచితం కాదు. అందుచేత వారిభాగం వారికిచ్చి సంతోషించండి’ అన్నాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Ennadu Parushyapu Matalaadaradu In Telugu – ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు

Ennadu Parushyapu Matalaadaradu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు కథ. 

ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు

నహుష మహారాజు ప్రియంవద యొక్క పుత్రుడు యయాతి. అతడు ఎంతో కాలము ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేసి యోగ్యుడు పితృవాక్య పరిపాలకుడు అయిన పూరువునికి రాజ్యభారమొసగి వైరాగ్యముతో తపోవనాలకు తపస్సుకై వెళ్ళిపోయాడు. వేదవేదాంగ పాఱంగులైన పండితులను తోడుగా తీసుకుని కందమూలాదులను భుజిస్తూ కఠిన నియమ వ్రతాలతో తపస్సు సాగించాడు. యయాతి ఆ తపోవనాలలో ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు. హవిస్సులతో దేవతలను తర్పణలతో పితృదేవతలను సంతోషపెట్టాడు. కామ క్రోధాది అరిషడ్వర్గాలను జయించి సహస్ర దివ్యవర్షములు తీవ్ర నిష్ఠతో తపస్సు చేశాడు. ముప్పది ఏండ్లు నిరాహారిగా ఒక్క ఏడాది వాయుభక్షణ చేసి తరువాత పంచాగ్నుల మధ్యలో నిలిచి తపస్సు చేశాడు. అటు తరువాత ఒక్క ఏడాది సముద్రమధ్యములో ఒంటికాలుమీద నిలబడి ఏకాగ్రతతో తపస్సు చేశాడు. ఇలా తపస్సు చేసి తన అనంత పుణ్యనిధి ప్రభావంవల్ల దివ్యవిమానములో దేవలోకానికి వెళ్ళాడు.

అక్కడ దేవర్షుల పూజలందుకొని బ్రహ్మలోకం చేరాడు. అక్కడ అనేక కల్పములు ఉండి బ్రహ్మర్షుల చేత పూజలందుకొన్నాడు! ఆ తరువాత ఇంద్రలోకాని వచ్చాడు. ధర్మాత్ముడు మహాతపశ్శక్తి సంపన్నుడు అయిన యయాతి వచ్చాడని తెలిసి దేవేంద్రుడు స్వయముగా వచ్చి అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించాడు. మహావిభవోపేతుడైన ఇంద్రుడు ఆ యయాతిని యథావిధి పూజించి ఇలా అన్నాడు “ఏమి తపస్సు చేశావయ్య మహానుభావా? నువ్వు సామాన్యుడవు కావు! శతసహస్ర వర్షముల తపస్సు సామాన్యులకు సాధ్యమా?”.

సాక్షాత్ దేవేంద్రుడంతటివాడు ఇలా పొగిడేసరికి యయాతి ప్రారబ్ధవశాత్తు ఇలా పారుష్య వాక్యాలు అన్నాడు “ఓ అమరేంద్రా! సుర దైత్య యక్ష రాక్షస నర ఖేచర సిద్ధ మునిగణముల తపస్సులు నా తపస్సుకు సాటిరావు”. “ఔరా! ఇంత గొప్పవాడయ్యికూడా గర్వమును వీడలేదు కదా!” అని అనుకొని ఇంద్రుడు యయాతితో “మహనీయులైన మహర్షుల తపస్సులను గర్వముతో కించపఱచినావు. లోకశ్రేయస్సుకై తమ జీవితాలను ధారపోసిన ఆ మహనీయులనెన్నడూ అవమానించరాదు. ఓ యయాతి! ఈ ఒక్క మాటతో నీవు సంపాదించుకొన్న తపశ్శక్తి అంతా అంతరించిపోయింది. ఇక నీకు ఈ లోకములో ఉండటానికి అర్హతలేదు. అధోలోకానికి పో” అని శపించాడు.

తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపముతో శరణువేడి యయాతి “ఓ దేవేంద్రా! ఏ క్షణాన నేను పూజ్యులైన మహర్షులను అవమానించానో ఆ క్షణమే నా శక్తి అంతా కరిగిపోయింది. నన్ను అధోలోకాలకు పంపకు. నాకు సత్సంగత్యం లేకుండా చేయకు. సత్ భువనములో సత్పురుషుల సాంగత్యములో నన్ను ఉండనివ్వు” అని ప్రార్థించాడు. పశ్చాత్తాపముతో కుమిలిపోతున్న యయాతిని కరుణించి దేవేంద్రుడు యయాతికి సద్భువనములో నివసించుటకు అనుజ్ఞ ఇచ్చాడు.

సద్భువనములో ఉండి ఆ యయాతి అచిరకాలములోనే అనంత తపశ్శక్తిని మళ్ళీ సంపాదించాడు. అహంకారమును పూర్తిగా విడిచి మహాతేజోమయుడయ్యాడు. ఇలా ఉండగా ఒకసారి ఆ యయాతి దౌహిత్రులైన అష్టకుడు ప్రతర్దనుడు వసుమంతుడు ఔసీనరుడు మరియు శిబి సద్భువనమునకు వచ్చిరి. అనంతపుణ్యసంపదతో వెలిగిపోతున్న యయాతిని పూజించి “స్వామి! మీరెవరు” అని అడిగారు. యయాతి తన కథను చెప్పి “నాయనలారా! ఎంత కొంచెమైనా గర్వము ఎన్నడు ఉండరాదు. గర్వముతో నేను పారుష్యవాక్యములు మాట్లాడి ఉత్తములైన మహర్షులను అవమానించినాను. మీరెన్నడు అట్టి తప్పుచేయవద్దు. వాక్పారుష్యము విషము కన్నా అగ్ని కన్నా భయంకరమైనది” అని హితవు చెప్పాడు. యాయాతిని తమ తాతగారిగా గుర్తించి నమస్కరించి ఆయనవద్ద ఎన్నో రహస్యములైన ధర్మోపదేశాలు పొందారు అష్టకాదులు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. గర్వము అహంకారము ఎంత కొంచెముగా ఉన్నా హాని కాలుగచేస్తాయి. ఒక్కచిన్న పారుష్యవాక్యము వలన తన తపశ్శక్తినంతా పోగొట్టుకున్నాడు యయాతి.
  2. ఎన్నడూ ఉత్తములను అవమానించరాదు. మహర్షుల తపస్సులు తన తపస్సుతో సాటిరావని అని యయాతి వారిని అవమానించాడు.
  3. ఒక సజ్జనుడెన్నడూ తప్పుచేయడు. పొరబాటుగా చేసినా దానికి పశ్చాత్తాపము చెంది ఆ తప్పు నెన్నడు మళ్ళీ చేయడు. సజ్జనుడైన యయాతి తను చేసిన తప్పును దౌహిత్రుల వద్ద చెప్పుకొని ఆ తప్పు చేయవద్దని హితవు చెప్పాడు.
  4. ఒక మనిషి యొక్క ఉద్ధారణకు సత్సంగత్యం చాలా అవసరము. ఈ విషయం తెలిసిన యయాతి సత్సంగత్య భాగ్యము కలిగించమి ఇంద్రుని కోరుకున్నాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Bharatuni Katha In Telugu – భరతుని కథ | శ్రీమద్భాగవతం లోని కథ

Bharatuni katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… భరతుని కథ.

భరతుని కథ

శ్రీ హరి అంశతో పుట్టిన భరతుడు కణ్వాశ్రమంలో తన బాల్యాన్ని గడిపినాడు. వనమే అతని క్రీడారంగం మృగాలే అతని స్నేహితులు. ఆ బలశాలి సింహం పిల్లలతో ఆటలాడే వాడు! ఆ పసివాడి బలపరాక్రమాలు చూచి ఆశ్చర్యచకిత అయ్యేది తల్లి శకుంతల. స్వయంగా కణ్వమహర్షే భరతునికి జాతక కర్మలు చేసి విద్యాబుద్ధులు నేర్పినాడు. కుమారుడైన భరతుని తీసుకుని కణ్వ మహర్షి అనుజ్ఞపై ఆ సాధ్వి దుష్యంతుని వద్దకు వెళ్ళింది.

రాజు యొక్క జీవతం కత్తిమీద సాము వంటిది. అతడు ఏది చేసినా ప్రజల హితం కోరి వారి ఆమొదంపైనే చేయాలి. శకుంతల భరతుని తీసుకొని వచ్చి ఈతడే నీ వారసుడు అని చూపినది. ఆ విషయం నిజం అని తనకి శకుంతలకి కణ్వమహర్షికే తెలుసు. అది ప్రజులకు విశ్వసనీయమైన రీతిలో తెలియ చేయాలని తలచి ఆ ధర్ముడే రక్షిస్తాడని నమ్మి ఏమనక ఊరకున్నాడు దుష్యంతుడు. అప్పుడు ధర్మాత్ముడైన దుష్యంతుని కరుణించి ఆకాశవాణి అందఱికీ తెలిసే లాగా స్పష్టంగా ఈ భరతుడే దుష్యంతుని పుత్రుడు కాబోవు చక్రవర్తి అని చెప్పినది. ఆ వాక్కు విని దుష్యంతుడు శకుంతల సంతసించి పుత్రినికి పట్టాభిషేకం చేసి ఐహిక విషయాల మీద మనసు పెట్టక తపోవనాలకు వెళ్ళిపోయారు.

భరతుడు సమర్థమైన తన భుజస్కంధాలపైన ఈ భూభారాన్నంతా నిలిపి ధర్మపాలన చేశాడు. ధర్మస్థాపన కోసమే యుద్ధం చేసేవాడు. తన దిగ్విజయ యాత్రలో సనాతన ధర్మానికి విరుద్ధమైన శక కబర బర్బర కష కిరాతక హూణ మ్లేచ్ఛ దేశాల రాజులను అణచాడు. పాతాళంలో దేవతాస్త్రీలను చెఱబెట్టిన రాక్షసులను శిక్షించి ఆ స్త్రీలను వారి భర్తలకు అప్పగించినాడు. త్రిపురరాక్షసులను జయించి దేవతలను వారి వారి పదవులయందు నిలబెట్టినాడు. సత్యం శౌచం దయ తపస్సు స్థిరంగా భరతుని రాజ్యంలో ఉండటంతో ప్రకృతి సహజంగా జనాలు కోరినవన్నీ ఇచ్చేది.

ఈ భూమండలం అంతా భరతుని పాలనలో ఉన్నా కర్మ భూమి అయిన ఈ భరతఖండంలోనే అన్ని యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు చేశాడు. దీర్ఘతపుడను మర్షిని పురోహితునిగా చేసుకుని యమునా తీరమునందు 78 అశ్వమేధయాగాలు చేశాడు. గంగాతీరం పొడుగునా 55 అశ్వమేధాలు చేసి దేవేంద్రుని అతిశయించిన వైభవంతో శోభించినాడు.

పదమూడువేల యనభైనాలుగు పాడి ఆవుల మందను ద్వంద్వం అంటారు. అట్టి వేయి ద్వంద్వాలను దూడలతోపాటు బంగారముతో గిట్టలు కొమ్ములు అలంకరించి బాగా పండితులైన వేయి మంది విప్రోత్తములకి దానం చేశాడు. బంగారు నగలతో శోభించేవీ తెల్లని దంతాలు కలవీ అయిన పధ్నాలుగులక్షల నల్లని ఏనుగులను మష్కారతీర్థం ఒడ్డున దాన మిచ్చినాడు!

కుబేరునితో సమానమైన సంపద సాటిలేని శౌర్యం దేవేంద్రునితో సమానమైన విభవం మహర్షులతో సరితూగే తపశ్శక్తి ఉండికూడా భరతుడు ఎన్నడూ గర్వించక అర్థశరీరాలు తృణప్రాయంగా భావించి శాంతికాముకుడై భగవత్భక్తితో జీవించాడు. ఈ విధముగా ఇరవైయేడువేల యేండ్లు రాజ్యపాలన చేసినాడు. ఈ భరతుని సంతతి వారము కనుక మనం భారతీయులం అయ్యాము.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

ఒక మనిషి నిజంగా మనస్సుపెట్టి ధర్మబుద్ధితో పరిశ్రమ చేస్తే దేవతలనే మించిన మహామనీషి అవుతాడని భరతుడు మనకు నిరూపించాడు. అతడు తన బలపరాక్రమాలను ఉపయోగించి యుద్ధములలో విజయుడై భూమండలం అంతటా ధర్మస్థాపన చేశాడు. ప్రజల హితార్థం ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు. నభూతో నభవిష్యతి అనే రీతిలో ఎన్నో దాన ధర్మాలు చేసి యశశ్వి అయ్యాడు.

భారతీయుల ఆధ్యాత్మ చింతన ఈ కథలో మనకు తెలిసింది. దుష్యంతుడు శకుంతల అన్ని ఐశ్వర్యాలను రాజభోగాలను పుత్రపౌత్రాది ఆకర్షణను త్యజించి తపోవనాలకి వెళ్ళి తపస్సు చేసుకొన్నారు. అలాగని కర్తవ్యాన్ని విస్మరించకుండా ఎంతో కాలం ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసి కర్తవ్యం పూర్తి చేసుకొని ఆ తరువాతే వానప్రస్థం స్వీకరించారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Shuchilenidi Satpurusha Darsanam Labhinchadu In Telugu – శుచిలేనిది సత్పురుషదర్శనం లభించదు

Shuchilenidi Satpurusha Darsanam Labhinchadu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శుచిలేనిది సత్పురుషదర్శనం లభించదు కథ. 

శుచిలేనిది సత్పురుషదర్శనం లభించదు

వేదప్రవర్తకుడైన పైలమహర్షికి ఉదంకుడను ఉత్తమ శిష్యుడుండెడివాడు. అతడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపస్సంపన్నుడు. గురుదేవతా అనుగ్రహం వలన అణిమాద్యష్టసిద్ధులు జ్ఞానము పొందిన మహానుభావుడు ఉదంకుడు.

ఒకరోజు గురుపత్ని అతనికి ఒకకార్యమును అప్పచెప్పినది “నాయనా! మనదేశ మహారాజైన పౌష్యుడు ధర్మాత్ముడు. ఆయన ధర్మపత్ని ఉత్తమురాలు. ఒక వ్రతము చేయటానికి నాకు ఆ సాధ్వి కుండలాలు కావాలి. ఆమెను అర్థించి అవి తీసుకొనిరా”. గురుపత్ని ఆజ్ఞను శిరసావహించుటకై ఉదంకుడు వెంటనే ధర్మాత్ముడైన పౌష్యమహారాజు వద్దకు బయలుదేరినాడు. దారిలో అరణ్యమార్గములో వెళుతుండగా ఒక మహావృషభము మీదనున్న దివ్యపురుషుని చూచినాడు. అతడు సూర్యుని వలె వెలిగిపోతున్నాడు. ఆ దివ్యపురుషుడు ఉదంకునికి అనుగ్రహముతో పవిత్రమైన గోమయమును ఆరగించుటకు ఇచ్చెను. అమృతప్రాయమైన గోయమును భుజించి గురుపత్ని ఆజ్ఞ త్వరగా నెరవేర్చుటకై ఆ మహాపురుషుని వద్ద సెలవు తీసుకొని పౌష్యుని రాజ్యమును చేరుకున్నాడు.

పౌష్యుడు ఉదంకునికి యథావిధి సత్కారాలు చేసి రాకకు కారణమేమియో తెలుపుమని ఉదంకుని ప్రార్థించినాడు. ఉదంకుడు తన గురుపత్నిగారి ఆజ్ఞను రాజుకు తెలిపినాడు. “ఆహా! లోకశ్రయస్సును కోరే మీవంటి తాపసులను సేవించుటకంటే అదృష్టమేమున్నది? మహానుభావా నా రాణి వద్దకు వెళ్ళి నా మాటగా చెప్పి కుండలములను తీసుకొనుము” అని పౌష్యుడు చెప్పినాడు. వెంటనే ఉదంకుడు మహారాణిగారి మందిరమును చేరుకున్నాడు. కానీ ఆయనకు ఎక్కడా పౌష్యరాణి కనబడలేదు! తరిగివచ్చి “రాజా! నాకు మహారాణి కనబడలేదు. నీవే ఆ కుండలములను తెప్పించి ఇవ్వు” అని అడిగినాడు.

అప్పుడు పౌష్యమహారాజు ఇలా అన్నాడు “భూవినుత! నీవంటి త్రిభువన పావనుని అశుచివి అని ఎట్లా అనగలను? నా రాణి మహాపతివ్రత కావున అశుచులకు కనబడదు”. ఉదంకుడు ఎందులకు తనకు అశుచి వచ్చినదో ఆలోచించినాడు. తాను గురుపత్నీ కార్యమును త్వరగా పూర్తిచేసే తొందరలో ఆ మహాపురుషుడు ఇచ్చిన గోమయాన్ని భుజించిన తరువాత ఆచమించలేదని గుర్తుకు వచ్చినది. వెంటనే కాళ్ళూ చేతులు అన్ని కడుక్కుని కేశవ నామాదులతో ఆచమనము చేసి శిచియై మహారాణి అంతఃపురమునకు వెళ్ళినాడు. అక్కడ యథాస్థానములో మహారాణిని చూసి ఆమె పాతివ్రత్య మహాత్మ్యమునకు ఆశ్చర్యపోయి “మహారాణీ! మా గురుపత్ని వ్రతార్థము మీ కుండలములు కోరి వచ్చినాను” అని ప్రార్థించినాడు. ఆ పతివ్రతామతల్లి తన కుండలములు ఇట్టి తాపసులకు ఉపకరిస్తున్నాయని సంతోషించి ఉదంకునకు కుండములను ఇచ్చి పంపివేసినది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

శుచిత్వము సత్పురుషుల సందర్శనమునకు ప్రథమ సోపానము. ఉదంకుడు భోజనము తరువాత తొందరలో ఉండి కాళ్ళుకడుక్కుని ఆచమించనందున ఎంతగొప్పవాడైనా ఆయనకు పతివ్రత అయిన పౌష్యరాణి కనబడలేదు. కావున మనమన్ని వేళలా ముఖ్యముగా సత్పురుష, దైవ సందర్శనమునకు వెళ్ళునప్పుడు శుచిగా ఉండవలయును. ఇదే కారణముగా అర్జునుడు, అశ్వత్థామ బ్రహ్మాస్త్రప్రయోగమునకు ముందు శుచులై మంత్రప్రయోగము చేసినారు (ద్రౌపదీదేవి కథ చూడండి). బకాసురుని యుద్ధమునకు ముందు భీమసేనుడు ఆహారము భుజించి శుచిఅయ్యి తరువాతనే యుద్ధముచేసినాడు (బకాసురవధ కథ చూడండి). అవంతీరాజు, విక్రమార్కుడు పుష్కరిణిలో స్నానము చేసిన తరువాతనే కాళీ ఆలయములోకి ప్రవేశించినారు (విక్రమార్కుని కథ చూడండి).

మరిన్ని నీతికథలు మీకోసం:

Bhaktha Puramdaradasu Katha In Telugu – భక్త పురందరదాసు కథ

Bhaktha Purandaradasa Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… భక్త పురందరదాసు కథ. 

భక్త పురందరదాసు కథ

పూర్వం విక్రమార్క శకం 16వ శతాబ్దములో నవనిధి శ్రీనివాసనాయకుడనే గొప్పధనవంతుడు ఉండేవాడు. అతడు పరమ లోభి. భార్య సరస్వతీబాయి భక్తురాలు దానగుణశీలి. పతియే ప్రత్యక్షదైవమని నమస్కరించిన ఆ సాధ్వితో శ్రీనివాసనాయకుడిలా అనేవాడు “ఏమని ఆశీర్వదించను? అంకా దానధర్మాలు చేయమనా?” “స్వామీ! మీ ఆనుజ్ఞ తీసుకునే నేనీ వ్రతము ఆచరించితిని కదా!” అని బదులిచ్చిన భార్యతో “ఆ! ఆ! పొందితివి పొందితివి. తులసీపూజయే కదా ఖర్చు ఉండదులే అనుకున్నాను. కాని ఆ పేరుతో దంపతి పూజలు దానాలు ఒక్కటేమిటి అన్నీ చేశావు. నీ సుపుత్రుడు వరదుడు లెక్క చూపిన తరువాతే నాకీ విషయం తెలిసింది. నువ్విలాంటి నాగులు వ్రతాలు చేస్తే చాలు మనమందఱము తలకొక జోలె పట్టుకోవలసి వస్తుంది” అని అనేవాడు శ్రీనివాసనాయకుడు.

“రామ! రామ! అట్లా అనకండి. భగవంతుడు మనకు ఇచ్చినప్పుడే దానాదులు చేయకుంటే లేనప్పుడీయ గలమా”? అని సత్యం పలికిన సరస్వతీబాయితో శ్రీనివాసనాయకుడు “ఇందులో భగవంతుడిచ్చినది ఏమున్నది? మా తాతముత్తాతలు మా నాన్నగారు నేను ఎంతో శ్రమించి ఆర్జించినదే కదా!” అని అనేవాడు. “దానధర్మాదులకు ఉపయోగపడని ధనమెందులకు స్వామి? ఇట్టి సత్కార్యములే సద్గతులకు చద్ది మూటలని సాధుసజ్జనులంటారు” అని హితవు చెప్పిన భార్యతో భర్త “ఆ సన్యాసుల మాటలకేమిలే వాళ్ళలానే అంటారు. అవన్నీ ఆచరిస్తూ కూర్చుంటే మనకు మిగిలేది బూడిదే! చూడు సరస్వతీ! ధనమూలమిదం జగత్ అన్నారు. ఆ సిరి యొక్క గరిమ ఎంతో కష్టపడి సంపాదించిన నాకు తెలుసు” అని అనేవాడు. ఆ భార్యా భర్తల సంభాషణములు ఇలా ఉండేవి!

శ్రీనివాసనాయకుని అనంత పూర్వజన్మ పుణ్యమో లేక సరస్వతీబాయి అఖండ సౌశీల్య మహాత్మ్యమో పుట్టు లోభి అయిన శ్రీనివాసనాయకుని భక్త పురందరదాసుగా మార్చా అనుకున్నాడు పాండురంగ విఠ్ఠలుడు. ఏ దుర్గుణాన్నైనా నివారించవచ్చును కానీ లోభగుణాన్ని మార్చుట దుష్కరం అని అనుకున్న స్వామి స్వయంగా ఆ శ్రీనివాసనాయకుని వద్దకు ఒక బ్రాహ్మణుని వేషంలో వచ్చాడు. ఎవరి పాదాలకు సకల చరాచర జీవులు ముక్తికై చేతులుజోడించి నమస్కరిస్తాయో అట్టి స్వామి శ్రీనివాసనాయకుని ముందర నిలిచి ఏదైనా దానమివ్వమని యాచించేవాడు! కసురుకుంటూ వెళ్ళగొట్టేవాడు నాయకుడు.

భగవంతుడు శ్రీనివాసనాయకుడెన్ని అవమానాలు చేసినా రోజూ పుత్రవాత్సల్యంతో వచ్చి ఏదో ఒకటి దానమిమ్మని అర్థించేవాడు. భగవంతుడు ఎన్ని సార్లు అడిగినా ఆ శ్రీనివాసనాయకుడు ఒక్కసారికూడా ఏమీ ఇవ్వలేదు. ఇలా ప్రతిరోజు ఆ లక్ష్మీపతి శ్రీనివాసనాయకుని మార్చడం కోసం పడరాని పాట్లు పడ్డాడు. బహుశః ఇందుకేనేమో ఆ భగవంతుడు ఆశ్రితపక్షపాతి అని నిందింపబడినాడు. నీవే తప్ప ఇతరమెఱుగనని శరణువేడిన సరస్వతీబాయిని రక్షించటానికే నేమో ప్రాయశః స్వామి ఇన్ని పాట్లుపడ్డాడు. లేదా కర్మయే పరమాత్మ అన్న నిజం నిరూపించేలా శ్రీనివాసనాయకుని పూర్వజన్మల పుణ్యానికి ఫలముగా ఇలా అనుగ్రహించదలచినాడో స్వామి. ఆ పన్నగశాయి లీలలు అర్థం చేసుకోవటం ఎవరి తరము?

“ఏమైనా సరే నీకేమీ ఇవ్వను” అని నిక్కచ్చగా అన్నాడు ఒకరోజు విప్రవేషంలో ఉన్న భగవంతుని చూసి శ్రీనివాసనాయకుడు. “అయ్యా! వీడు నా ఒక్కగానొక్క కొడుకు. వీడికి ఉపనయనం చేయాలని సంకల్పించాను. ఓం ప్రథమంగా మీ వద్దకొచ్చాను. మీరు దయతో ఏది ఇచ్చినా తీసుకుంటాను” అని అడిగాడు భగవంతుడు. “ఏది ఇచ్చినా తీసుకుంటావా?” అని రెట్టిస్తూ “నేను ఇచ్చేది కిం అనక తీసుకు వెళిపోవాలి” అని అంటూ ఇల్లంతా వెతికి వెతికి తుప్పు పట్టిన కాణీ బిళ్ళ తెచ్చి విఠ్ఠలునికి ఇచ్చి పంపించి “పీడా వదిలింది” అనుకున్నాడు.

ఏదో పనిమీద నాయకుడు బయటికెళ్ళాడోలేదో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు విఠ్ఠలనాథుడు. “అమ్మా! నాకు సహాయం చేయండి” అని అన్నాడు స్వామి. “ఇందాకే కదయ్య మా ఆయనిచ్చారు?” అని అన్నది ఆ ఇల్లాలు. ఆ తుప్పుపట్టిన కాణీ చూపించాడు స్వామి. ఖిన్నురాలై నిస్సహాయిగా నిలుచున్న ఆమెను చూసి పరమాత్మ “అమ్మా! మీ ముక్కెర ఇప్పిస్తే నా అవసరం తీరుతుంది” అని అన్నాడు. నీళ్ళునములుతూ యాచించిన ఆ పేద బ్రాహ్మణుని చూసి జాలిపడి సరస్వతీబాయి వెంటనే తన ముక్కెర తీసి ఇచ్చింది. మనసారా ఆశీర్వదించి ముక్కెర తీసుకుని స్వామి వెళ్ళిపోయాడు.

విప్రునికి ముక్కెర ఇచ్చింది కాని భర్తకు ఏమని సమాధానం చెబుతుంది? ఏమి చేయాలిరా భగవంతుడా అని వ్యాకుల పడుతుండగా ఆమె ప్రాణాలపాలిటి రెండో కాలునిలా శ్రీనివాసనాయకుడు వచ్చి “ఏదీ నీ ముక్కెర?” అని ప్రశ్నించాడు. లోభికి ధనం తప్ప ఇంకేదీ కానరాదు కదా! ఎక్కడుందో వెతికి తెమ్మన్నాడు భర్త. “రంగ రంగ! ఏమి లీల స్వామి? నాకు దిక్కెవ్వరు?” అని భగవంతునికి మొరపెట్టుకుంది సరస్వతీబాయి. “ఇది ఏమైనా సత్యయుగమా చమత్కారాలు జరగడానికి?” అని అనుకుని మరణమే శరణ్యమని నిశ్చయించుకున్నది.

ప్రేమతో అటుకులిచ్చినందుకే స్వామి సుదామునికి అనంత ఐశ్వర్యాలు కడకు కైవల్యమిచ్చాడు. ఇక అవసరానికి ఏమీ సంకోచించక అడిగనదే తడవుగా ముక్కెర ఇచ్చిన ఆ సాధ్విని మఱుస్తాడా స్వామి? “సాధ్వీ! నీ దానగుణానికి భక్తికి మెచ్చాను. ముక్కెర ధారపోసి ముక్తేశుడనైన నన్ను కొన్నావు. ఇదుగో! ముక్తిని తులతూచిన నీ ముక్కెర” అన్న భగవంతుని అంతర్వాణి వినిపించింది సరస్వతీబాయికి. ఎంతో సంతోషంతో ముక్కెర తీసుకొని భర్త దగ్గరకు వెళ్ళింది. అదిచూసి అవాక్కయ్యాడు నాయకుడు. విప్రుడు తన వద్దకే వచ్చి ముక్కెర అమ్మాడు. విషయము తెలిసింది ఆ దంపతులకు. రోజూ విప్రవేషంలో వచ్చి యాచించినది ఆ విఠ్ఠలేశుడే అని అవగతమైంది ఆ దంపతులకు. “వడివాయక తిరిగే ప్రాణబంధుడు స్వామి” అన్న సత్యం తెలుసుకున్నాడు నాయకుడు. ఆ రోజునుండి ఎన్నో దానధర్మాలుచేస్తూ భగవంతుని భక్తితో కొలుస్తూ తరించారు ఆ దంపతులు. దాదాపు నాలుగు లక్షల సంకీర్తనలు గానంచేసి భక్త పురందరదాసుగా ప్రసిద్ధికెక్కాడు శ్రీనివాసనాయకుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. కర్మఫలం అమోఘమైనది. శ్రీనివాసనాయకుని పూర్వ పుణ్యం వలన భగవంతుడు స్వయంగా వచ్చి అతనిలోని లోభగుణాన్ని పోగొట్టి కాపాడినాడు.
  2. ఇంటికి దీపం ఇల్లాలు అని పెద్దలంటారు. ఆ సూక్తికి తార్కాణం సరస్వతీబాయి. సుశీలవతి అయిన సరస్వతీబాయి తన సుగుణాలతో స్వామిని మెప్పించి తనను తానే కాక తన భర్తను కుడా తరింపచేసింది.
  3. లోభం చాలా భయంకరమైన దుర్గుణము. సాక్షాత్ ఆ భగవంతునికే శ్రీనివాసనాయకుని లోభగుణం మార్చడానికి అంత శ్రమ పడవలసి వచ్చింది. మనమెన్నడూ ధనకాంక్షులము కారాదని దానధర్మాలు చేయాలని మనకీ కథద్వారా తెలిసినది.

మరిన్ని నీతికథలు మీకోసం:

Bhartruhari Katha In Telugu – భర్తృహరి కథ

Bhartruhari Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

విక్రమార్కుని సాహసగాధల నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… భర్తృహరి కథ. 

భర్తృహరి కథ

మహానుభావుడైన కేశవశర్మకు నలుగురు ఉత్తములైన పుత్రులు దైవానుగ్రహము వలన కలిగినారు. సంస్కృత వ్యాకరణకర్త దివ్య శివమహిన్మా: స్తుతికర్త అయిన కాత్యాయన వరరుచి, అతిలోక సాహవంతుడు ధర్మాత్ముడు మహాకాళీభక్తుడు అయోధ్యాలయ పునరుద్ధారకుడు శకకర్త అయిన విక్రమార్కుడు, పండితుడు మహావివేకవంతుడు కాళీ అనుగ్రహపాత్రుడు అయిన భట్టి మరియు సంస్కృత మహాకవి సుభాషిత రత్నావళికర్త వాక్యప్రదీప, రాహత, కారిక గ్రంథకర్త అయిన భర్తృహరి ఆయన నలుగురు కుమారులు. కేశవశర్మ యోగ్యుడైన భర్తృహరికి రాజ్యభారమప్పగించి వానప్రస్థమును స్వీకరించాడు. చిన్నప్పటినుంచి భర్తృహరి సాధుసజ్జనుల సేవలుచేస్తూ ఉండేవాడు.

భర్తృహరి రాజ్యములో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధనానికి పేదకాని గుణానికి కాదు. సౌశీల్యుడు మంత్రతంత్రశాస్త్ర కోవిదుడు అయిన ఆ విప్రోత్తముడు భువనేశ్వరీదేవి ఉపాసకుడు. మాత ఆ పరమభక్తుని అనుగ్రహించదలచి ఆయన ముందు ప్రత్యక్షమై “కుమారా! నీ గుణసంపదను భక్తిని మెచ్చినాను. ఈ దివ్యఫలం తీసుకో. ఈ ఫలం తిన్నవాడికి జరామరణాలు ఉండవు!” అని ఆజ్ఞాపించింది జగజ్జనని.

గుణాగ్రగణ్యుడైన ఆ బ్రాహ్మణుడు ఇలా ఆలోచించాడు “నేను ఒక పేదబ్రాహ్మణుడను. అమృతత్వము సంపాదించిననూ నేను ఎవరిని కాపాడగలను? ఈ పండు కనక మన మహారాజుగారు తింటే ఎందఱో నిర్భాగ్యులను రక్షించగలడు. అప్పుడే నేనీ ఫలమును సద్వినియోగము చేసినవాడను అవుతాను”. ఇలా తలచి ఆ బ్రాహ్మణుడు మహారాజైన భర్తృహరి వద్దకు వెళ్ళి అతనిని ఆశీర్వదించి ఆ దివ్యఫలాన్ని అతనికిచ్చి వచ్చేశాడు!

ఫలము యొక్క మహిమను అర్థంచేసుకోలేక భర్తృహరి ఆ ఫలమును తన ప్రియురాలైన అనంగసేనకు ఇచ్చివేసాడు. కుటిలాత్మురాలైన ఆ అనంగసేన తన సఖుడైన అశ్వపోషకునికి ఆ దివ్యఫలం ఇచ్చింది. మూర్ఖుడైన ఆ అశ్వపోషకుడు తన దాసికి ఆ ఫలాన్ని ఇచ్చాడు. ఆమె తనకు ప్రియుడైన ఒక గోపాలకునికి ఫాలాన్ని ఇవ్వగా వాడు దానిని తన ప్రియురాలికిచ్చాడు. ఆ చిన్నది పశువులపెంట ఉన్న బుట్టలో పండును పెట్టి రాజమార్గముగుండా ఆ బుట్టను తలపైపెట్టుకొని తన ఇంటికి వెళ్ళింది. భర్తృహరి ఆ పండును చూశాడు. బ్రాహ్మణుడు మహాత్యాగం చేసి లోకహితార్థం తనకిచ్చిన దివ్యఫలం చివరికి పెంటబుట్టలో చేరిందని బాధపడ్డాడు. ఆ పండు ఎంతమంది చేతులు మారిందో తెలుసుకున్నాడు.

ఒక్కసారిగా భర్తృహరికి వైరాగ్యం వచ్చింది. సంసారం మీద విరక్తి పుట్టింది. తను ఎవరినైతే ప్రియులు అనుకుంటున్నాడో వాళ్ళు నిజమైన ప్రియులు కాదని పరమేశ్వరుడొక్కడే ప్రాణబంధుడని తెలుసుకున్నాడు. మిథ్యాజగత్తులోని విషయభోగాలను త్యజించి రెమేశునిపై అనురక్తుడై వైరాగ్యముతో తపోవనాలకు వెళ్ళడనికి సిద్ధపడ్డాడు. దేవీప్రసాదమైన ఆ దివ్యఫలాన్ని తన రాజ్యసర్వస్వాన్ని యోగ్యుడైన విక్రమార్కుని చేతిలో పెట్టి తపస్సుకై వెళ్ళిపోయాడు.

మహౌదార్యుడైన విక్రమాదిత్యుడు తన వద్దకు వచ్చిన దీనుడైన ఒక బ్రాహ్మాణునిపై జాలిపడి ఆ దివ్యఫలాన్ని అతనికి ఇచ్చివేశాడు!!

రత్నైర్మాహార్హైస్తుతుషుర్న దేవా న భేజిరే భీమ విషేణ భీతిమ్|
సుధాం వినా న పరయుర్విరామం న నిశ్చితార్థాద్విరమన్తి ధీరాః||

– భర్తృహరి నీతిశతకమ్

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

విప్రోత్తముని సద్భావము మనకు కనువిప్పుకావాలి. లోకంలో జనాలు వృద్ధాప్యం రాకూడదు మృత్యువు రాకూడదు అని తపిస్తుంటే ఆ బ్రాహ్మణుడు జరామరణ రహితముగా చేసే దివ్యఫలాన్ని లోకహితార్థం మహారాజుకు ఇచ్చివేశాడు. స్వధర్మపాలలనో పరాకాష్టను చూపిన ఆ భూసురుడు ధన్యుడు.

“అంతా మిథ్య తలంచిచూచిన” అన్న సత్యాన్ని తెలుసుకున్నాడు భర్తృహరి. లౌకిక విషయాలను విడిచి మోక్షమార్గోన్ముఖుడైనాడు. ఆయన మనకు అందించిన సుభాషితాలను చదివి అర్థంచేసుకుని మన నిత్యజీవితములో అనుసంధానం చేసుకోవడం మన కర్తవ్యము.

విక్రమార్కుని ఔదార్యము గొప్పది. దీనుడైన విప్రునికి దివ్యఫలాన్ని దానం చేసి తన త్యాగబుద్ధిని మనకు చూపినాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Indradyumna Katha In Telugu – ఇంద్రద్యుమ్నుని కథ

Indradyumnuni katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఇంద్రద్యుమ్నుని కథ. 

ఇంద్రద్యుమ్నుని కథ – Indradyumna Katha In Telugu

పూర్వం ఇంద్రద్యుమ్నుడనే రాజేంద్రుడు ఉండేవాడు. అతడు ఎన్నో దానధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందినాడు. లెక్కగట్టలేనన్ని గో భూ హిరణ్య దానములు పాత్రులైన వారికిచ్చి అనంత పుణ్యసంపదను ఆర్జించుకొన్నాడు. రాజర్షి అయ్యి ప్రజారంజకముగా పాలన చేసినాడు. అలా ఎన్నో వర్షములు రాజ్యపాలనము చేసి తన పుణ్యనిధి ప్రభావముతో కాలం చెల్లాక స్వర్గం చేరుకొన్నాడు. చాలాకాలము స్వర్గభోగాలు అనుభవించిన తరువాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రద్యుమ్నుని పిలిపించి

“మహాత్మా! నీవు అనేక దానధర్మాలు చేసి ఎంతో పుణ్యమును ఆర్జించినావు కనుక ఇంత దీర్ఘకాలము స్వర్గములో ఉండగలిగినావు. కానీ పరమేశ్వరుని శరణువేడి ఆయన కృపతో పోందెడి మోక్షపదము ఒక్కటే శాశ్వతమైనది (ఇతరములు శాశ్వతములు కావు). నీ పుణ్యఫలమును అనుభవించినావు కావున సర్గమును వీడు సమయము వచ్చినది” అని చెప్పినాడు. స్వర్గాధిపతి మాటలు విని ఇంద్రద్యుమ్నుడు ఇంతకొద్ది కాలములోనే తన పుణ్యరాసులు ఎలా కరిగిపోయినాయి? అని ఆశ్చర్యపోయినాడు. అది చూసి శచీపతి “రాజా! భూలోకములో నిన్ను కానీ నీవుచేసిన సత్కర్మలను కానీ గుర్తుపెట్టుకొన్న వానిని నాకు చూపిస్తే నీవు స్వర్గములోనే ఉండవచ్చు. చేసిన దానములు మహనీయములు కాకపోతే జనులు చిరకాలము గుర్తుంచుకొనరు కదా! కావున నీ దానములను ఎంతకాలము ప్రజలు ఉపయోగింతురో అంతకాలము నీవిక్కడనుండవచ్చు” అని హితవు చెప్పినాడు. ఇంద్రుని ఆజ్ఞతీసుకొని అట్టివారు ఉన్నారేమో వెదకటానికి బయలుదేరినాడు ఇంద్రద్యుమ్నుడు.

Story Of King Indradyumna

చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్దకువెళ్ళి నమస్కరించి “ఓ తపస్విచంద్రమా! నన్ను మీరు ఎఱుగుదురా”? అని అడిగినాడు. అప్పటికి ఎంతోకాలముగా తీర్థయాత్రలుచేసి ఉపవాస వ్రతాలు చేసి కృశించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తులేదని చెప్పినాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు “స్వామి! చిరంజీవులైన మీకంటే ముందుపుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా”? అని అడిగినాడు. “పవిత్ర హిమాలయ పర్వత ప్రాంతములో ప్రావారకర్ణం అనే గుడ్లగూబ ఉన్నది” అని బదులిచ్చినాడు మార్కండేయ మహర్షి.

వెంటనే ఆ ఉలూకము వద్దకు చేరి “అయ్యా! నెన్నెఱుగుదువా”? అని ప్రశ్నించినాడు. తెలియదు అని చెప్పి “ఇక్కడికి కొన్ని యోజనాల దూరములో ఇంద్రద్యుమ్నమను సరోవరమున్నది. ఆ సరోవరములో నాడీజంఘమనే కొంగ ఉన్నది” అని ప్రావారకర్ణం చెప్పగా ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మదేవుని స్నేహితుడైన నాడీజంఘుని వద్దకు చేరి “ఓ బకరాజా! నన్ను మీరు గుర్తుపట్టినారా”? ప్రశ్నించినాడు. “లేదు. ఈ సరోవరములో ఆకూపారమనే తాబేలు ఉన్నది. అది నాకంటే పెద్దది. దానికి నీవు తెలుసేమో కనుక్కో” అని చెప్పినది.

ఇంద్రద్యుమ్నుని చూడగానే ఆకూపార కళ్ళుచెమ్మగిల్లాయి “అయ్యా! వెయ్యి యజ్ఞములు సాంగముగా చేసి వెయ్యి యూపస్తంభాలు కట్టించినావు. ఆ యజ్ఞదానాలలో లెక్కకట్టలేనన్ని గోదానాలు ఇచ్చినావు. నీవు దానము ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి యింత సరోవరము అయినది. ఇది అంతా నీ చలవే” అని కృతజ్ఞతాపూర్వకముగా చెప్పినది. మరుక్షణం దేవతలు దివ్యవిమానములో ఇంద్రద్యుమ్నుని స్వర్గానికి తీసుకొని వెళ్ళినారు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. మన సత్కీర్తి భూలోకములో ఉన్నంత కాలము సర్గలోకము కరతలామలకము. ఆకూపార ఇంద్రద్యుమ్నుడు చేసిన దానములు మరువలేదు కావున ఇంద్రద్యుమ్నునికి పునః సర్గలోక ప్రాప్తి కలిగినది. కానుక మనము నలుగురుకీ ఉపకరించే పనులు చేయాలి. అవియే మనలను రక్షించు సంపదలు (ధనము కాదు).
  2. దేవేంద్రుడు చెప్పినట్టు మోక్షము ఒక్కటే శాశ్వతపదము. ఇంత పుణ్యాత్ముడు కాబట్టే మహావిష్ణువు గజేంద్ర రూపములో ఉన్న ఇంద్రద్యుమ్నునిచే “నీవేతప్ప హితః పరంబెఱుగను …” అని అనిపించి అతనికి శాశ్వతమైన మోక్షమును ప్రసాదించినాడు (గజేంద్ర మోక్షము కథ). కావున మోక్షమునకు పుణ్యమే ప్రథమ సోపానము.

మరిన్ని నీతికథలు మీకోసం:

Govardhana Giri Pooja In Telugu – గోవర్ధన గిరి పూజ

Govardhana Giri Pooja

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గోవర్ధన గిరి పూజ.

గోవర్ధన గిరి పూజ

నందవ్రజములో ప్రతి ఏట ఇంద్రయాగము చేసేవారు. ఏడేళ్ళ పసిబాలుడైన శ్రీ కృష్ణ పరమాత్మ సదస్యులందరి ముందర తండ్రియైన నందుని ఇలా ప్రశ్నించాడు “ఇంద్రయాగము చేయుటలోని ఆంతర్యమేమిటి”? నందుడు “కృష్ణ! యజ్ఞ యాగములు కృతజ్ఞతును ప్రకటించే సాధనములు. మనకు హితము కలిగించే వేల్పులకు కృతజ్ఞత చూపడమే యజ్ఞం యొక్క ముఖ్యోద్దేశం. కృతజ్ఞుడే కాని కృతఘ్నుడు సహాయమునకు అర్హుడుకాడు కదా! ఈ కారణముగా లోకహితార్థం యజ్ఞం చేయుట ఆచారం” అని చెప్పాడు.

తండ్రియొక్క సత్యవాక్కులు విని శ్రీ కృష్ణుడిలా అన్నాడు “తండ్రీ! ఫలము కేవలము దేవతలవల్లనే కలుగదు. ఫలసిద్ధికి ముఖ్యమైన హేతువు కర్మ. ఒక మనిషి తానెన్ని సత్కార్యాలు చేశాడన్నది ముఖ్యం. అందుకే కర్మయే భగవంతుడని అనవచ్చు. స్వధర్మమాచరీంచిన వాడికి దైవము చేరువలో నుండును.

పరమాత్మ అవ్యక్తుడు సర్వవ్యాపకుడు నిరాకారుడు. అలాగే దేవతలుకూడా మనకు కనబడరు. కానీ సూక్ష్మ బుద్ధితో పరీక్షిస్తే ఈ ప్రకృతి (ఆది శక్తి) పరమాత్మ యొక్క ప్రత్యక్షస్వరూపం. కావున ప్రత్యక్షంగా మనకు కనిపించే ప్రకృతిని వదిలివేయుట మంచిది కాదు. మనము వేటిమీద ప్రత్యక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నామో వాటినికూడా పూజించి మన కృతజ్ఞతా భావాన్ని సుస్థిరం చేసుకోవాలి.

మనం ఈ గోవర్ధన గిరి వద్ద నివసిస్తాము. గోసంపదతో బ్రతుకు వారము. కావున గోవర్ధన గిరి పూజ గోమాత పూజ మనకు అత్యంత ప్రధానమ్. అందునా గోవర్ధనగిరి గోవిందుని వక్షఃస్థలం నుండి పుట్టి పులస్త్య మహర్షి అనుగ్రహంచే ఇచటికి వచ్చింది”. పరమాత్ముని అమృతవాక్యాలు విన్న వ్రజవృద్ధుడైన సన్నందుడు “ఓ నందనందన! నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాటలు మాకు శిరోధార్యములు. గోవర్ధనగిరి పూజావిధానము మాకు తెలుపుము” అని అన్నాడు. పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు:

“గిరి పాదభాగమును శుభ్రపఱచి గోమయముతో అలుకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలొనర్చి భక్తితో శోడషోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్పపూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనమీయవలెను. విప్రసంతర్పణ గోపూజ అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను”.

శ్రీ కృష్ణుడు అలా పూజావిధానం తెలిపి “పూజకి వచ్చేముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవపూజ మాతాపితపూజ అన్నీ చేసుకుని రండి. వృద్ధులను బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి పశు పక్షాదులకి కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చి రండి” అని చెప్పాడు.

ఓ శుభదివసమున వ్రజవాసులు గోవర్ధన గిరిపూజకు తండోపతండాలుగా తఱలి వచ్చారు. యాదవుల గురువైన గర్గ మహర్షి పురోహితులు వచ్చారు. నవనందులు వృషభానుడు బంగారు పల్లకీలో రాధాదేవి వచ్చిరి. దేవతలు అప్సరసలు రాజర్షులు మహర్షులు పార్వతీ పరమేశ్వరులు విచ్చేసినారు. భక్తి శ్రద్ధలతో పూజావిధిని అనుసరించి గోవర్ధన గిరి పూజ చేశారు వ్రజవాసులు. వ్రజవాసుల భక్తికి మెచ్చి గోవర్ధనుడు సహస్రబాహులతో మానవాకృతిలో వచ్చి అందరిని ఆశీర్వదించాడు. శ్రీ కృష్ణ పరమాత్మకీ జై గోవర్ధనగిరిరాజుకీ జై అను జయజయ ధ్వానాలు భూనభోంతరాళముల ప్రతిధ్వనించాయి. వ్రజ చరిత్రలో అది ఓ సువర్ణ ఘట్టమ్.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. ప్రాకృతిక వనరులను నాశనం చేయడం స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. ఇదే శ్రీ కృష్ణుడు మనకిచ్చిన సందేశం.
  2. దైవసేవ మాతాపితసేవ భూతదయ అన్ని మానవుడి కర్తవ్యాలని గుర్తుచేశాడు శ్రీ కృష్ణుడు. అందుకే పూజకు వచ్చేముందు వృద్ధులకు బాలులకు పశు పక్షాదులకు ఆహారం సమకూర్చి రమ్మన్నాడు.
  3. మన సంస్కృతి ప్రకారము పూజా విధానము ఎట్టిదో శ్రీ కృష్ణుడు తెలిపాడు. భక్తి శ్రద్ధలతో విధినసురించి చేసిన పూజ ఫలించి గోవర్ధనుడు సాక్షాత్కరించాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sankha Likhitula Katha In Telugu – శంఖ లిఖితుల కథ

Sankha Likhitula Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శంఖ లిఖితుల కథ. 

శంఖ లిఖితుల కథ

పూర్వం శంఖుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వారు బాహుదానదీ తీరములో ఆశ్రమాలను నిర్మించుకొని తపస్సు చేయసాగినారు. ఇలా ఉండగా ఒకరోజు అన్నగారిని చూడలనిపించి లిఖితుడు శంఖుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. అన్నగారు ఎక్కడో బయటికి వెళ్ళారని తెలుసుకొని ఆశ్రమములోని ఒక చెట్టునీడలో కూర్చుని దాని పండ్లలు తింటూ అన్నగారికోసం నిరీక్షించాడు. వేద వేదాంగ పారంగతుడైన శంఖుడు వచ్చి తన తమ్ముని చూసి సంతోషించాడు. ఆతడు పండ్లను ఆరగించటం చూచి “తమ్ముడూ! ఈ పండ్లు నీకెక్కడివిరా?” అని అడిగాడు. లిఖితుడు చెప్పినది విని “ప్రియసోదరా! ఇది తప్పు కదా! అజమానినైన నేను లేని సమయములో నా అనుమతిని పొందకనే ఫలములను తీసుకునుట అపరాధమని నీవెఱుగవా? మన మహారాజుగారి వద్దకు వెళ్ళి నీవు చేసిన తప్పుకి తగిన శిక్షని అనుభవించి రా!” అని అన్న అయిన శంఖుడు ఆజ్ఞాపించినాడు.

తండ్రి తరువాత తండ్రంతటి అన్న మాట తప్పని లిఖితుడు వెంటనే సుద్యుమ్న మహారాజు వద్దకు పరుగెట్టాడు. మునీంద్రుడు వచ్చాడని తెలియగానే ధర్మాత్ముడైన సుద్యుమ్న మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులర్పించి పూజించాడు. అప్పుడు లిఖితుడు “పార్థివకులభూషణ! ఈ పూజలకు నేను అనర్హుడిని. నేను మా అన్నగారు లేని సమయములో ఆయన ఇంటికి వెళ్ళి చెట్టుకున్న పండ్లను ఆయన అనుమతి లేకుండా కోసుకొని తిన్నాను. కనుక నేను చేసిని ఈ దొంగతనానికి తగిన రీతిలో శిక్షవేసి నన్ను రక్షించు. రాజదండన పొందిన వానికి యమదండన ఉండదని మా అన్నగారు నాకు హితవు చెప్పారు” అని ప్రార్థించాడు. “తపశ్శక్తితో లోకాలకు హితవు చేసే మిమ్ము ఎట్లు శిక్షించము?” అని నచ్చచెప్పినా లిఖితుడు తన పట్టువదలలేదు.

చివరికి సుద్యుమ్నుడు దండనీతి శాత్రాన్ని అనుసరించి లిఖితుని చేతులు నరికించాడు. లిఖితుడు ఎంతో సంతోషించి మహారాజును మనసారా ఆశీర్వదించి అన్నగారి వద్దకు పరుగెట్టాడు. శిక్షను అనుభవించి పునీతుడై వస్తున్న తమ్ముని చూచి శంఖుడు “నాయనా! మంచి పని చేశావు. నీవంటి ఉత్తముని వలన మన వంశమంతా ఉద్ధరింపబడుతుంది.

మద్యపానము, గురుపత్నిని ఆశించడము, విప్పుని చంపడము, విప్పుని ధనమును అపహరించడము (లిఖితుడు తెలియక చేసిన తప్పు ఇదే) మరియు ఈ పనులను చేసేవారితో కలిసి తిరగడము ఇవ్వి పంచమహాపాతకాలు. నువ్వు తగిన రాజదండన పొంది పాప విముక్తుడ వైనావు. ఈ బాహుదానదీ పుణ్యజలాలలో మునిగి దేవమునిపితృ తర్పణాలు ఇవ్వు” అని ఆజ్ఞాపించాడు. వెంటనే అన్నగారి ఆజ్ఞపాటించాడు లిఖితుడు. లిఖితుడు బాహుదా నదిలో మునక వేశాడోలేదో తన బాహువులు వచ్చేశాయి! ఆశ్చర్యచకితుడై అన్నగారికి నమస్కరించాడు. శంఖుడు “ప్రియసోదరా! నువ్వు చేసిన తప్పుకు శిక్షను అనుభవించి పునీతుడవైనావు కావున భగవంతుడు నిన్ను కరుణించినాడు. బాహుదానదీ మహాత్మ్యము నా తపశ్శక్తి ప్రభావము నీ చేతులు మొలవటానికి దోహదం చేశాయి. దండనీతిని సక్రమముగా అనుసరించి నిన్ను కాపాడిన సుద్యుమ్న మహారాజు కూడా ధన్యుడు” అని చెప్పాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. దండనీతి యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. ఏ తప్పుకు ఏ శిక్షను అనుభవించాలో వవరించి ఈ దండనీతి శాస్త్రము మనలను యమబాధలనుండి కాపాడుతుంది.
  2. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. ఈ విషయము తెలిసిన శంఖుడు తమ్మునిపైన అనుగ్రహముతో మహారాజువద్దకు వెళ్ళి దండన అనుభవించిర మ్మనాడు.
  3. అన్నగారు చెప్పిన హితవును వెంటనే అనుసరించి లిఖితుడు తనంతట తాను రాజు వద్దకు వెళ్ళి చేసిన తప్పొక్కుకుని దండించమని ప్రార్థించినాడు. దండన అనుభవించి పునీతుడైనాడు.
  4. ఈ కథలో అందఱూ తమ కర్తవ్యములను బాగా పాటించి మనకు మార్గదర్శకులైనారు. విపులైన శంఖలిఖితులు లోకహితార్థం తప్పస్సులు చేసుకుంటూ కాలము గడిపినారు. దండనీతికోవిదుడైన సుద్యుమ్న మహారాజు లిఖితునికి తగిన శిక్షవేశాడు. లిఖితుడు అన్నగారి మాట జవదాటలేదు. శంఖుడు తమ్ముని శ్రేయస్సునే కోరినాడు.

మరిన్ని నీతికథలు మీకోసం: