Aranya Kanda Sarga 1 In Telugu – అరణ్యకాండ ప్రథమః సర్గః

Aranya Kanda Sarga 1 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” రామాయణంలోని అయిదు కాండల్లో మూడవది. ఇది రాముడు, సీత, లక్ష్మణులు దండకారణ్యంలో 14 ఏళ్ళ వనవాసం గడుపుతూ చేసిన అనుభవాలను వివరిస్తుంది. ప్రథమ సర్గలో, వారు అరణ్యంలో ప్రవేశించి, అటవీ జీవులను కలుస్తారు మరియు శరభంగ, సుతీక్ష్ణ మునులతో సమావేశమవుతారు.

|| మహర్షిసంఘః ||

ప్రవిశ్య తు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ |
దదర్శ రామో దుర్ధర్షస్తాపసాశ్రమమండలమ్ ||

1

కుశచీరపరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృత్తమ్ |
యథా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలమ్ ||

2

శరణ్యం సర్వభూతానాం సుసంమృష్టాజిరం తథా |
మృగైర్బహుభిరాకీర్ణం పక్షిసంఘైః సమావృతమ్ ||

3

పూజితం చోపనృత్తం చ నిత్యమప్సరసాం గణైః |
విశాలైరగ్నిశరణైః స్రుగ్భాండైరజినైః కుశైః ||

4

సమిద్భిస్తోయకలశైః ఫలమూలైశ్చ శోభితమ్ |
ఆరణ్యైశ్చ మహావృక్షైః పుణ్యైః స్వాదుఫలైర్వృతమ్ ||

5

బలిహోమార్చితం పుణ్యం బ్రహ్మఘోషనినాదితమ్ |
పుష్పైర్వన్యైః పరిక్షిప్తం పద్మిన్యా చ సపద్మయా ||

6

ఫలమూలాశనైర్దాంతైశ్చీరకృష్ణాజినాంబరైః |
సూర్యవైశ్వానరాభైశ్చ పురాణైర్మునిభిర్వృతమ్ ||

7

పుణ్యైశ్చ నియతాహారైః శోభితం పరమర్షిభిః |
తద్బ్రహ్మభవనప్రఖ్యం బ్రహ్మఘోషనినాదితమ్ ||

8

బ్రహ్మవిద్భిర్మహాభాగైర్బ్రాహ్మణైరుపశోభితమ్ |
స దృష్ట్వా రాఘవః శ్రీమాంస్తాపసాశ్రమమండలమ్ ||

9

అభ్యగచ్ఛన్మహాతేజా విజ్యం కృత్వా మహద్ధనుః |
దివ్యజ్ఞానోపపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయః ||

10

అభ్యగచ్ఛంస్తథా ప్రీతా వైదేహీం చ యశస్వినీమ్ |
తే తం సోమమివోద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణః ||

11

లక్ష్మణం చైవ దృష్ట్వా తు వైదేహీం చ యశస్వినీమ్ |
మంగళాని ప్రయుంజానాః ప్రత్యగృహ్ణన్ దృఢవ్రతాః ||

12

రూపసంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతామ్ |
దదృశుర్విస్మితాకారాః రామస్య వనవాసినః ||

13

వైదేహీం లక్ష్మణం రామం నేత్రైరనిమిషైరివ |
ఆశ్చర్యభూతాన్ దదృశుః సర్వే తే వనచారిణః ||

14

అత్రైనం హి మహాభాగాః సర్వభూతహితే రతమ్ |
అతిథిం పర్ణశాలాయాం రాఘవం సంన్యవేశయన్ ||

15

తతో రామస్య సత్కృత్య విధినా పావకోపమాః |
ఆజహ్రుస్తే మహాభాగాః సలిలం ధర్మచారిణః ||

16

మూలం పుష్పం ఫలం వన్యమాశ్రమం చ మహాత్మనః |
నివేదయిత్వా ధర్మజ్ఞాస్తతః ప్రాంజలయోఽబ్రువన్ ||

17

ధర్మపాలో జనస్యాస్య శరణ్యస్త్వం మహాయశాః |
పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురుః ||

18

ఇంద్రస్యేహ చతుర్భాగః ప్రజా రక్షతి రాఘవ |
రాజా తస్మాద్వరాన్భోగాన్భుంక్తే లోకనమస్కృతః ||

19

తే వయం భవతా రక్ష్యా భవద్విషయవాసినః |
నగరస్థో వనస్థో వా త్వం నో రాజా జనేశ్వరః ||

20

న్యస్తదండా వయం రాజన్ జితక్రోధా జితేంద్రియాః |
రక్షితవ్యాస్త్వయా శశ్వద్గర్భభూతాస్తపోధనాః ||

21

ఏవముక్త్వా ఫలైర్మూలైః పుష్పైర్వన్యైశ్చ రాఘవమ్ |
అన్యైశ్చ వివిధాహారైః సలక్ష్మణమపూజయన్ ||

22

తథాన్యే తాపసాః సిద్ధా రామం వైశ్వానరోపమాః |
న్యాయవృత్తా యథాన్యాయం తర్పయామాసురీశ్వరమ్ ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ప్రథమః సర్గః ||

Aranya Kanda Sarga 1 Meaning In Telugu

రాముడు సీత, లక్ష్మణుడు వెంటరాగా దండకారణ్యములోనికి ప్రవేశించాడు. ఆ దండకారణ్యములో ఎంతో మంది మహా మునులు ఆశ్రమములు కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉండటం చూచాడు రాముడు. ఆ మునుల ఆశ్రమముల దగ్గర వన్య మృగములు పరస్పర వైరము, భయమూ లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. పక్షుల కిల కిలారావములతో, వన్యప్రాణుల విహారములతో ఆ వనసీమలో ఉన్న ముని ఆశ్రమములు ఎంతో శోభాయమానంగా ఉన్నాయి.

ఆ మునుల ఆశ్రమములు విశాలమైన అగ్ని గృహములతోనూ, యజ్ఞమునకు కావలసిన సంభారములతోనూ, వేలాడుతున్న జింక చర్మములతోనూ, దర్భలతోనూ, అగ్నికార్యమునకు కావలసిన సమిధలతోనూ, నీళ్లతో నిండి ఉన్న పాత్రలతోనూ, తినడానికి కావలసిన ఫలములతోనూ నిండి ఉన్నాయి. ఒక పక్కనుండి వేదమంత్రములు చదువుతున్న ధ్వనులు, మరొక పక్క నుండి పూజా కార్యక్రమముల మంత్ర ధ్వనులు వీనుల విందుగా వినపడుతున్నాయి. ఆ ఆశ్రమములలో కేవలము తపస్సుచేసుకొనే మునులు మాత్రమే నివసిస్తున్నారు. రామలక్ష్మణులకు ఆ ప్రాంతము బ్రహ్మలోకము వలె కనిపించింది.

రాముడు, సీత, లక్ష్మణుడు తమ ఆశ్రమముల వంక రావడం ఆ మునులు చూచారు. వారంతా రామ లక్ష్మణులకు ఎదురు వెళ్లి స్వాగతము పలికారు. వారికి అర్ఘ్యము పాద్యము సమర్పించారు. కొందరు మునులు రామ లక్ష్మణుల దేహధారుఢ్యము, అంగసౌష్టవము చూచి ఆశ్చర్యపోయారు. వారిని రెప్ప వెయ్యకుండా చూస్తున్నారు.

ఆ మునులందరూ రామ లక్ష్మణులకు, సీతకు ఒక పర్ణశాలను చూపించారు. వారు అందులో నివాసము ఉండవచ్చునని తెలిపారు. కొందరు రామలక్ష్మణులకు నీళ్లు తెచ్చి ఇచ్చారు. మరి కొందరు తినడానికి మధురమైన ఫలములను తీసుకొని వచ్చి ఇచ్చారు. అందులో ముఖ్యులు, పెద్దవారు అయిన మునులు రాముని చూచి

“రామా! నీవు అయోధ్యకు మహారాజువు. రాజు లోక పూజ్యుడు. రాజు ప్రజలను ధర్మమార్గంలో నడిపిస్తాడు. రాజు దుష్టులను శిక్షిస్తాడు. ప్రజలను రక్షిస్తాడు. అందుకే రాజును అందరూ గౌరవించాలి, పూజించాలి. ప్రజారక్షకుడైన రాజు ఇంద్రునిలో నాలుగవ అంశ అని అంటారు. అందు చేతనే రాజు ప్రజల మన్ననలు పొందుతూ, రాజభోగములు ఇంద్రుని వలె అనుభవిస్తుంటాడు. ఈ ప్రదేశము అయోధ్యారాజ్యములో ఉంది. కాబట్టి నీవే మాకు రాజువు. నీవే మమ్ములను రక్షించాలి. నీవు ప్రస్తుతము వనములో ఉన్నావని రాజువు కాకపోవు. రాజు అయోధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా, రాజు రాజే.

రామా! మా సంగతి నీకు తెలుసు కదా! మేమే అన్ని సంగములను విడిచి పెట్టి జితేంద్రియులమై, ఆ అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాము. మాకు ఎవరైనా అపకారము చేసినా, వారి మీద కోపగించకోడానికి కూడా మేము ఇష్టపడము. కాబట్టి మా అందరినీ రాజువైన నీవే మా అందరినీ రక్షించాలి.” అని పలికారు.

తరువాత ఆ మునులు రామలక్ష్మణులకు, సీతకు అనేక ఫలములు, కంద మూలములు, ఇతరములైన ఆహార పదార్థములు తెచ్చి ఇచ్చారు. రాముడు వారు చెప్పిన మాటలను ఆలకించాడు. వారు ఇచ్చిన పదార్థములను, ఫలములను భక్తితో స్వీకరించాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము మొదటి సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ద్వితీయః సర్గః (2) >>

Balakanda Sarga 73 In Telugu – బాలకాండ త్రిసప్తతితమః సర్గః

Bala Kanda Sarga 73 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిసప్తతితమః సర్గలో, మేము ఏ ఆహ్వానం లేదా వివాహ కార్డు కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు లేదా ఈ వివాహం కోసం కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ సమానంగా మరియు వ్యక్తిగతంగా స్వాగతం. ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా నేరుగా అక్కడికి వెళ్దాం.

దశరథపుత్రోద్వాహః

యస్మింస్తు దివసే రాజా చక్రే గోదానముత్తమమ్ |
తస్మింస్తు దివసే శూరో యుధాజిత్సముపేయివాన్ ||

1

పుత్రః కేకయరాజస్య సాక్షాద్భరతమాతులః |
దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజానమిదమబ్రవీత్ ||

2

కేకయాధిపతీ రాజా స్నేహాత్కుశలమబ్రవీత్ |
యేషాం కుశలకామోఽసి తేషాం సంప్రత్యనామయమ్ ||

3

స్వస్రీయం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతిః |
తదర్థముపయాతోఽహమయోధ్యాం రఘునందన ||

4

శ్రుత్వా త్వహమయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ |
మిథిలాముపయాతాంస్తు త్వయా సహ మహీపతే ||

5

త్వరయాభ్యుపయాతోఽహం ద్రష్టుకామః స్వసుఃసుతమ్ |
అథ రాజా దశరథః ప్రియాతిథిముపస్థితమ్ ||

6

దృష్ట్వా పరమసత్కారైః పూజనార్హమపూజయత్ |
తతస్తాముషితో రాత్రిం సహ పుత్రైర్మహాత్మభిః ||

7

ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ |
ఋషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్ ||

8

యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితైః |
భ్రాతృభిః సహితో రామః కృతకౌతుకమంగళః ||

9

వసిష్ఠం పురతః కృత్వా మహర్షీనపరానపి |
వసిష్ఠో భగవానేత్య వైదేహమిదమబ్రవీత్ ||

10

రాజా దశరథో రాజన్కృతకౌతుకమంగళైః |
పుత్రైర్నరవరశ్రేష్ఠ దాతారమభికాంక్షతే ||

11

దాతృప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతి హి |
స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమమ్ ||

12

ఇత్యుక్తః పరమోదారో వసిష్ఠేన మహాత్మనా |
ప్రత్యువాచ మహాతేజా వాక్యం పరమధర్మవిత్ ||

13

కః స్థితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే |
స్వగృహే కో విచారోఽస్తి యథా రాజ్యమిదం తవ ||

14

కృతకౌతుకసర్వస్వా వేదిమూలముపాగతాః |
మమ కన్యా మునిశ్రేష్ఠ దీప్తా వహ్నేర్యథార్చిషః ||

15

సజ్జోఽహం త్వత్ప్రతీక్షోఽస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః |
అవిఘ్నం క్రియతాం రాజన్కిమర్థమవలంబతే ||

16

తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా |
ప్రవేశయామాస సుతాన్సర్వానృషిగణానపి ||

17

తతో రాజా విదేహానాం వసిష్ఠమిదమబ్రవీత్ |
కారయస్వ ఋషే సర్వామృషిభిః సహ ధార్మికైః ||

18

రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం ప్రభో |
తథేత్యుక్త్వా తు జనకం వసిష్ఠో భగవానృషిః ||

19

విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికమ్ |
ప్రపామధ్యే తు విధివద్వేదిం కృత్వా మహాతపాః ||

20

అలంచకార తాం వేదిం గంధపుష్పైః సమంతతః |
సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః ||

21

అంకురాఢ్యైః శరావైశ్చ ధూపపాత్రైః సధూపకైః |
శంఖపాత్రైః స్రువైః స్రుగ్భిః పాత్రైరర్ఘ్యాభిపూరితైః ||

22

లాజపూర్ణైశ్చ పాత్రౌఘైరక్షతైరపి సంస్కృతైః |
దర్భైః సమైః సమాస్తీర్య విధివన్మంత్రపూర్వకమ్ ||

23

అగ్నిమాధాయ వేద్యాం తు విధిమంత్రపురస్కృతమ్ |
జుహావాగ్నౌ మహాతేజా వసిష్ఠో భగవానృషిః ||

24

తతః సీతాం సమానీయ సర్వాభరణభుషితామ్ |
సమక్షమగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా ||

25

అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనమ్ |
ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ ||

26

ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా |
పతివ్రతా మహభాగా ఛాయేవానుగతా సదా ||

27

ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా |
సాధు సాధ్వితి దేవానామృషీణాం వదతాం తదా ||

28

దేవదుందుభినిర్ఘోషః పుష్పవర్షో మహానభూత్ |
ఏవం దత్త్వా తదా సీతాం మంత్రోదకపురస్కృతామ్ ||

29

అబ్రవీజ్జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః |
లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళాం చ మమాత్మజామ్ ||

30

ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మా భూత్కాలస్య పర్యయః |
తమేవముక్త్వా జనకో భరతం చాభ్యభాషత ||

31

పాణిం గృహ్ణీష్వ మాండవ్యాః పాణినా రఘునందన |
శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః ||

32

శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా |
సర్వే భవంతః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః ||

33

పత్నీభిః సంతు కాకుత్స్థా మా భూత్కాలస్య పర్యయః |
జనకస్య వచః శ్రుత్వా పాణీన్పాణిభిరస్పృశన్ ||

34

చత్వారస్తే చతసౄణాం వసిష్ఠస్య మతే స్థితాః |
అగ్నిం ప్రదక్షిణం కృత్వా వేదిం రాజానమేవ చ ||

35

ఋషీంశ్చైవ మహాత్మానః సభార్యా రఘుసత్తమాః |
యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకమ్ ||

36

కాకుత్స్థైశ్చ గృహీతేషు లలితేషు చ పాణిషు |
పుష్పవృష్టిర్మహత్యాసీదంతరిక్షాత్సుభాస్వరా ||

37

దివ్యదుందుభినిర్ఘోషైర్గీతవాదిత్రనిఃస్వనైః |
ననృతుశ్చాప్సరఃసంఘా గంధర్వాశ్చ జగుః కలమ్ ||

38

వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమదృశ్యత |
ఈదృశే వర్తమానే తు తూర్యోద్ఘుష్టనినాదితే ||

39

త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహుర్భార్యా మహౌజసః |
అథోపకార్యాం జగ్ముస్తే సదారా రఘునందనాః | [భార్యా]
రాజాప్యనుయయౌ పశ్యన్సర్షిసంఘః సబాంధవః ||

40

Balakanda Sarga 73 In Telugu Pdf With Meaning

దశరథుడు తన కుమారులచేత గోదానములు ఇప్పించు చున్న సమయంలో భరతుని మేనమామ యుధాజిత్తు అక్కడకు వచ్చాడు.

(భరతుని మేనమామ అంటే దశరథుని మూడవ భార్య, భరతుని తల్లి అయిన కైకేయి సోదరుడు అనగా కేకయ రాజు కుమారుడు).

కేకయ రాజ కుమారుడు, భరతునికి మేనమామ అయిన యుధాజిత్తును చూచి దశరథుడుఎంతో సంతోషించాడు. యుధాజిత్తు దశరథునితో ఇలా అన్నాడు.

“బావగారూ! మా తండ్రికేకయ రాజుగారు తమరిని కుశలము అడగమని అన్నాడు. ఇక్కడ మీరందరూ క్షేమమే కదా! మా తండ్రిగారు తన మేనల్లుడు అయిన భరతుని చూడవలెనని ముచ్చట పడు తున్నాడు. భరతుని నా వెంట తీసుకొని రమ్మని నన్ను పంపాడు. అందుకని నేను అయోధ్యానగరమునకు వెళ్లాను. మీరందరూ మీ కుమారుల వివాహమలు జరిపించుటకు విదేహ కు వెళ్లారని తెలిసి ఇక్కడకు వచ్చాను.” అని అన్నాడు యుధాజిత్తు.

దశరథుడు ఎంతో సంతోషంగా యుధాజిత్తుకు అతిథి సత్కారములు చేసాడు. అందరూ సంతోషంగా ఆ రాత్రి గడిపారు. మరునాడు ఉదయము అందరూ పెందలకడనే నిద్రలేచి ప్రాత:కాల సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకొన్నారు. తరువాత వారందరూ విశ్వామిత్రుడు, వసిష్ఠుడు మొదలగు ఋషులు ముందు నడువగా యజ్ఞవాటికకు చేరుకున్నారు.

పెళ్లి కుమారులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుభ ముహూర్తంలో తోరము కట్టడం మొదలగు మంగళ కార్యములు ఆచరించారు. తరువాత నలుగురు సోదరులు, పురోహితులు, అందరూ దశరథుని వద్దకు వెళ్లారు. దశరథుని అనుమతితో వసిష్ఠుడు జనక మహారాజు వద్దకు పోయి ఇలాఅన్నాడు.

“ఓ జనక మహారాజా! దశరథమహారాజు తన కుమారులకు కౌతుక మంగళకార్యములనుపూర్తిచేసుకొని తమరి కొరకు ఎదురు చూస్తున్నారు. కన్యాదాన కార్యక్రమము కన్యాదాతలైన మీ అనుమతితో జరగాలికదా! ” అని అన్నాడు.

“అదేమిటి మహర్షీ! మిథిల కూడా వారిదేకదా! వారికి అడ్డేమున్నది. వారునా అనుమతి కోసరం ఎదురు చూడ్డం ఏమిటి? అవశ్యం వారిని రమ్మనండి. ఇక్కడ నా కుమార్తెలు కూడా కౌతుక మంగళ కార్యములను పూర్తిచేసుకొని కల్యాణ వేదిక వద్దకు వచ్చి ఉన్నారు. నేను కూడా వేదిక వద్దకు వెళుతున్నాను. సుముహూర్తము సమీపించుచున్నది. ఇంక ఆలస్యము చేయకుండా దశరథుల వారిని వారి కుమారులను వివాహ వేదిక వద్దకు తోడ్కొని రెండు.” అని అన్నాడు జనకుడు.

జనకుని మాట మేరకు దశరథుడు, తనకుమారులతో సహా పురోహితులు ముందు నడువగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. జనకుడు వారి నందరినీ వివాహ వేదిక వద్దకు సాదరంగా ఆహ్వానించాడు. జనకుడు వసిష్ఠుని చూచి ఇలా అన్నాడు.

“ ఓ వసిష్ఠ మహర్షీ! తమరు ఈ వివాహమునకు పౌరోహిత్యము వహించాలి. నా కుమార్తెల వివాహములను దశరథపుత్రులతో వేదోక్తంగా జరిపించమని ప్రార్థిస్తున్నాను.” అని అన్నాడు.

ఆ మాటలకు వసిష్ఠుడు తన అంగీకారము తెలిపాడు. తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రుని, శతానందుని చెరి ఒక పక్క ఉంచుకొని వివాహ కార్యక్రమమును నిర్వర్తించడానికి ఉపక్రమించాడు.

వివాహ మండపము మధ్యలో ఉన్న అగ్ని కుండములో అగ్నిహోత్రమును ఉంచాడు. హెమ కుండము చుట్టు గంధము, పుష్పములు, సువర్ణ కలశములలో పాలికలు, అంకురార్పణ చేసిన కుంభములు, మూకుళ్లు, ధూప పాత్రలు, శంఖ పాత్రలు, హోమము చేయు సాధనములు, నేతితో నిండినపాత్రలు, లాజలతో నిండిన పాత్రలు, అక్షతలు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాడు. వసిష్ఠుడు శాస్త్రోక్తముగా అగ్నిని వేల్చాడు. దర్భలు అగ్నిహోత్రము చుట్టూ పరిచాడు. వేద మంత్రములను పఠిస్తూ హోమ కార్యక్రమమును నిర్వర్తించాడు.

తరువాత జనక మహారాజు సర్వాలంకార భూషిత అయిన తన కుమార్తె సీతను తీసుకొని వచ్చి అగ్ని హోత్రము వద్ద నిలబడి ఉన్న రాముని ఎదురుగా నిలబెట్టాడు. రాముని చూచి ఇలా అన్నాడు.

“ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ,
ప్రతీఛ్ఛ చైనాం భద్రం తే పాణిం గృష్ణాష్వ పాణినా|”

“ఓ రామా! ఈమె నా కుమార్తె సీత. నీకు సహధర్మచారిణి కావడానికి సిద్ధంగా ఉంది. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరించు. నీ హస్తముతో నా కుమార్తె సీత హస్తమును గ్రహింపుము. పాణిగ్రహణము చేయుము. ఓరామా! ఈమె పతివ్రతయై నిన్ను ఎల్లప్పుడూ నీడవలె వెన్నంటి ఉండగలదు.” అని పలుకుతూ జనక మహారాజు సీత చేతిని రామునికి అందించి జలమును వదిలాడు. కన్యాదానం చేసాడు.

ఆ సమయంలో ఆకాశం నుండి దేవతలు దుందుభులు మోగించారు. పూలవర్షము కురిపించారు. ఆ ప్రకారంగా సీతారాముల కల్యాణము వైభవంగా జరిపించాడు జనకుడు.

తరువాత జనకుడు లక్ష్మణుని పిలిచాడు. “లక్ష్మణా! ఈమె నా కుమార్తె ఊర్మిళ. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరింపుము. ఇంక ఆలస్యము చేయకుండా ఈమెను పాణిగ్రహణము గావించు.” అని తన కుమార్తె ఊర్మిళ చేతిని లక్ష్మణుని చేతికి అందించాడు.

తరువాత జనకుడు భరతుని చూచి ” ఓ భరతా! ఈమె నా కుమార్తె మాండవి. ఈమెను పాణిగ్రహణము గావించు.

ఓ శత్రుఘ్నా! ఈమె నా కుమార్తె శ్రుత కీర్తి. నీవు ఈమె పాణిని గ్రహించు.

ఓ రామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నులారా! మీరందరూ సౌమ్యులు. గుణవంతులు. మంచి ప్రవర్తన కలవారు. నాకుమార్తెలను మీ మీ భార్యలుగా స్వీకరించండి.” అని అన్నాడు.

అప్పుడు రాముడు సీత చేతిని, లక్ష్మణుడు ఊర్మిళ చేతిని, భరతుడు మాండవి చేతిని, శత్రుఘ్నుడు శ్రుతకీర్తి చేతిని పట్టుకొన్నారు. పాణిగ్రహణ మహోత్సవము జరిగిపోయింది. దశరథుని కుమారులు నలుగురు తమ తమ భార్యల చేతులను పట్టుకొని అగ్నికి నమ స్కారము చేసారు. తరువాత మామగారు జనకునికి నమస్కారము చేసారు. తరువాత పురోహితులు వసిష్ఠమహర్షికి నమస్కారము చేసారు. తరువాత వసిష్ఠుడు దశరథ కుమారుల వివాహ కార్యక్రమ మును వైభవోపేతంగా జరిపించాడు.

తరువాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ తమ భార్యల చేతులు పట్టుకొని అగ్నిహోత్రము చుట్టు మూడు సార్లు ప్రదక్షిణము చేసారు. ఆ ప్రకారంగా సీతా రాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శ్రుతకీర్తి శత్రుఘ్నులు దంపతులు అయ్యారు.

వివాహ కార్యక్రమము తరువాత రామ లక్ష్మణ, భరత శత్రుఘ్నులు తమ తమ భార్యలతో విడిది గృహములకు వెళ్లారు. వారి వెంట ఋషులు, పురోహితులు, బ్రాహ్మణులు కూడా వెళ్లారు. కుమారులను కోడళ్లను తృప్తిగా చూసుకుంటూ దశరథుడు కూడా వారి వెంట విడిదిగృహమునకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ చతుఃసప్తతితమః సర్గః (74) >>

Ayodhya Kanda Sarga 72 In Telugu – అయోధ్యాకాండ ద్విసప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 72

అయోధ్యాకాండ ద్విసప్తతితమః సర్గలో, రాముడు అరణ్యవాసం చేస్తుండగా, అయోధ్యలో ఆయన తండ్రి దశరథ మహారాజు ప్రాణాలు విడుస్తాడు. దశరథుడు రాముని వలన విడిపోయిన క్షోభలో ఉండి, రాముడు నగరాన్ని విడిచిపోవడం వల్ల బాధతో మరణించాడు. కైకేయి చిత్తవికారంతో ఉండగా, భరతుడు తన తల్లి చర్యలను దుఃఖించి, రాముని తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. భరతుడు తన సహోదరుడు శత్రుఘ్నునితో కలిసి రాముని అరణ్యంలో కలుసుకోవడానికి బయలుదేరుతాడు. ఈ సర్గలో దశరథుడి మరణం, భరతుడి ప్రతిజ్ఞ, మరియు రాముని తిరిగి పట్టణానికి ఆహ్వానించే యత్నం ప్రధానాంశాలు.

భరతసంతాపః

అపశ్యంస్తు తతస్తత్ర పితరం పితురాలయే |
జగామ భరతో ద్రష్టుం మాతరం మాతురాలయే || ౧ ||

అనుప్రాప్తం తు తం దృష్ట్వా కైకేయీ ప్రోషితం సుతమ్ |
ఉత్పపాత తదా హృష్టా త్యక్త్వా సౌవర్ణమానసమ్ || ౨ ||

స ప్రవిశ్యైవ ధర్మాత్మా స్వ గృహం శ్రీవివర్జితమ్ |
భరతః ప్రతిజగ్రాహ జనన్యాశ్చరణౌ శుభౌ || ౩ ||

సా తం మూర్ధన్యుపాఘ్రాయ పరిష్వజ్య యశస్వినమ్ |
అంకే భరతమారోప్య ప్రష్టుం సముపచక్రమే || ౪ ||

అద్య తే కతిచిద్రాత్ర్యశ్చ్యుతస్యాఽర్యక వేశ్మనః |
అపి నాధ్వశ్రమః శీఘ్రం రథేనాపతతస్తవ || ౫ ||

ఆర్యకస్తే సుకుశలీ యుధాజిన్మాతులస్తవ |
ప్రవాసాచ్చ సుఖం పుత్ర సర్వం మే వక్తుమర్హసి || ౬ ||

ఏవం పృష్ఠస్తు కైకేయ్యా ప్రియం పార్థివ నందనః |
ఆచష్ట భరతః సర్వం మాత్రే రాజీవలోచనః || ౭ ||

అద్య మే సప్తమీ రాత్రిశ్చ్యుతస్యార్యక వేశ్మనః |
అంబాయాః కుశలీ తాతః యుధాజిన్మాతులశ్చ మే || ౮ ||

యన్మే ధనం చ రత్నం చ దదౌ రాజా పరంతపః |
పరిశ్రాంతం పథ్యభవత్తతోఽహం పూర్వమాగతః || ౯ ||

రాజవాక్యహరైర్దూతైః త్వర్యమాణోఽహమాగతః |
యదహం ప్రష్టుమిచ్ఛామి తదంబా వక్తుమర్హసి || ౧౦ ||

శూన్యోఽయం శయనీయస్తే పర్యంకో హేమభూషితః |
న చాయమిక్ష్వాకు జనః ప్రహృష్టః ప్రతిభాతి మే || ౧౧ ||

రాజా భవతి భూయిష్ఠమిహాంబాయా నివేశనే |
తమహం నాద్య పశ్యామి ద్రష్టుమిచ్ఛన్నిహాగతః || ౧౨ ||

పితుర్గ్రహీష్యే చరణౌ తం మమాఖ్యాహి పృచ్ఛతః |
ఆహోస్విదంబ జ్యేష్ఠాయాః కౌసల్యాయా నివేశనే || ౧౩ ||

తం ప్రత్యువాచ కైకేయీ ప్రియవద్ఘోరమప్రియమ్ |
అజానంతం ప్రజానంతీ రాజ్య లోభేన మోహితా || ౧౪ ||

యా గతిః సర్వభూతానాం తాం గతిం తే పితా గతః |
రాజా మహాత్మా తేజస్వీ యాయజూకః సతాం గతిః || ౧౫ ||

తచ్ఛ్రుత్వా భరతః వాక్యం ధర్మాభిజనవాన్ శుచిః |
పపాత సహసా భూమౌ పితృశోకబలార్దితః || ౧౬ ||

హా హతోఽస్మీతి కృపణాం దీనాం వాచముదీరయన్ |
నిపపాత మహాబాహుర్బాహు విక్షిప్య వీర్యవాన్ || ౧౭ ||

తతః శోకేన సంవీతః పితుర్మరణ దుఃఖితః |
విలలాప మహాతేజాః భ్రాంతాకులిత చేతనః || ౧౮ ||

ఏతత్సురుచిరం భాతి పితుర్మే శయనం పురా |
శశినేవామలం రాత్రౌ గగనం తోయదాత్యయే || ౧౯ ||

తదిదం న విభాత్యద్య విహీనం తేన ధీమతా |
వ్యోమేవ శశినా హీనమప్ఛుష్క ఇవ సాగరః || ౨౦ ||

బాష్పముత్సృజ్య కంఠేన స్వార్తః పరిపీడితః |
ప్రచ్ఛాద్య వదనం శ్రీమద్వస్త్రేణ జయతాం వరః || ౨౧ ||

తమార్తం దేవసంకాశం సమీక్ష్య పతితం భువి |
నికృత్తమివ సాలస్య స్కంధం పరశునా వనే || ౨౨ ||

మత్తమాతంగసంకాశం చంద్రార్కసదృశం భువః |
ఉత్థాపయిత్వా శోకార్తం వచనం చేదమబ్రవీత్ || ౨౩ ||

ఉత్తిష్ఠోత్తిష్ఠ కిం శేషే రాజపుత్ర మహాయశః |
త్వద్విధా న హి శోచంతి సంతః సదసి సమ్మతాః || ౨౪ ||

దానయజ్ఞాధికారా హి శీలశ్రుతివచోనుగా |
బుద్ధిస్తే బుద్ధిసంపన్న ప్రభేవార్కస్య మందిరే || ౨౫ ||

స రుదిత్వా చిరం కాలం భూమౌ విపరివృత్య చ |
జననీం ప్రత్యువాచేదం శోకైః బహుభిరావృతః || ౨౬ ||

అభిషేక్ష్యతి రామం ను రాజా యజ్ఞం ను యక్ష్యతే |
ఇత్యహం కృతసంకల్పో హృష్టః యాత్రామయాసిషమ్ || ౨౭ ||

తదిదం హ్యన్యథాభూతం వ్యవదీర్ణం మనో మమ |
పితరం యో న పశ్యామి నిత్యం ప్రియహితే రతమ్ || ౨౮ ||

అంబ కేనాత్యగాద్రాజా వ్యాధినా మయ్యనాగతే |
ధన్యా రామాదయః సర్వే యైః పితా సంస్కృతస్స్వయమ్ || ౨౯ ||

న నూనం మాం మహారాజః ప్రాప్తం జానాతి కీర్తిమాన్ |
ఉపజిఘ్రేద్ధి మాం మూర్ధ్ని తాత సన్నమ్య సత్వరమ్ || ౩౦ ||

క్వ స పాణిః సుఖ స్పర్శస్తాతస్యాక్లిష్ట కర్మణః |
యేన మాం రజసా ధ్వస్తమభీక్ష్ణం పరిమార్జతి || ౩౧ ||

యో మే భ్రాతా పితా బంధుర్యస్య దాసోఽస్మి ధీమతః |
తస్య మాం శీఘ్రమాఖ్యాహి రామస్యాక్లిష్ట కర్మణః || ౩౨ ||

పితా హి భవతి జ్యేష్ఠో ధర్మమార్యస్య జానతః |
తస్య పాదౌ గ్రహీష్యామి స హీదానీం గతిర్మమ || ౩౩ ||

ధర్మవిద్ధర్మనిత్యశ్చ సత్యసంధో దృఢవ్రతః |
ఆర్యః కిమబ్రవీద్రాజా పితా మే సత్యవిక్రమః || ౩౪ ||

పశ్చిమం సాధు సందేశమిచ్ఛామి శ్రోతుమాత్మనః |
ఇతి పృష్టా యథాతత్త్వం కైకేయీ వాక్యమబ్రవీత్ || ౩౫ ||

రామేతి రాజా విలపన్ హా సీతే లక్ష్మణేతి చ |
స మహాత్మా పరం లోకం గతః గతిమతాం వరః || ౩౬ ||

ఇమాం తు పశ్చిమాం వాచం వ్యాజహార పితా తవ |
కాలధర్మపరిక్షిప్తః పాశైరివ మహాగజః || ౩౭ ||

సిద్ధార్థాస్తే నరా రామమాగతం సీతయా సహ |
లక్ష్మణం చ మహాబాహుం ద్రక్ష్యంతి పునరాగతమ్ || ౩౮ ||

తచ్ఛ్రుత్వా విషసాదైవ ద్వితీయా ప్రియశంసనాత్ |
విషణ్ణ వదనో భూత్వా భూయః పప్రచ్ఛ మాతరమ్ || ౩౯ ||

క్వ చేదానీం స ధర్మాత్మా కౌసల్యాఽఽనందవర్ధనః |
లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా చ సమం గతః || ౪౦ ||

తథా పృష్టా యథా తత్త్వమాఖ్యాతుముపచక్రమే |
మాతాస్య యుగపద్వాక్యం విప్రియం ప్రియ శంకయా || ౪౧ || [సుమహద్వాక్యం]

స హి రాజసుతః పుత్ర చీరవాసా మహావనమ్ |
దండకాన్ సహ వైదేహ్యా లక్ష్మణానుచరః గతః || ౪౨ ||

తచ్ఛ్రుత్వా భరతస్త్రస్తః భ్రాతుశ్చారిత్రశంకయా |
స్వస్య వంశస్య మాహాత్మ్యాత్ ప్రష్టుం సముపచక్రమే || ౪౩ ||

కచ్చిన్న బ్రాహ్మణధనం హృతం రామేణ కస్యచిత్ |
కచ్చిన్నాఢ్యో దరిద్రః వా తేనాపాపో విహింసితః || ౪౪ ||

కచ్చిన్న పరదారాన్వా రాజపుత్రోఽభిమన్యతే |
కస్మాత్స దండకారణ్యే భ్రూణహేవ వివాసితః || ౪౫ ||

అథాస్య చపలా మాతా తత్స్వకర్మ యథాతథమ్ |
తేనైవ స్త్రీస్వభావేన వ్యాహర్తుముపచక్రమే || ౪౬ ||

ఏవముక్తా తు కైకేయీ భరతేన మహాత్మనా |
ఉవాచ వచనం హృష్టా మూఢా పండితమానినీ || ౪౭ ||

న బ్రాహ్మణధనం కించిద్ధృతం రామేణ కస్యచిత్ |
కశ్చిన్నాఢ్యో దరిద్రః వా తేనాపాపో విహింసితః || ౪౮ ||

న రామః పరదారాంశ్చ చక్షుర్భ్యామపి పశ్యతి |
మయా తు పుత్ర శ్రుత్వైవ రామస్యైవాభిషేచనమ్ || ౪౯ ||

యాచితస్తే పితా రాజ్యం రామస్య చ వివాసనమ్ |
స స్వవృత్తిం సమాస్థాయ పితా తే తత్తథాఽకరోత్ || ౫౦ ||

రామశ్చ సహ సౌమిత్రిః ప్రేషితః సహ సీతయా |
తమపశ్యన్ ప్రియంపుత్రం మహీపాలో మహాయశాః || ౫౧ ||

పుత్రశోకపరిద్యూనః పంచత్వముపపేదివాన్ |
త్వయాత్విదానీం ధర్మజ్ఞ రాజత్వమవలంబ్యతామ్ || ౫౨ ||

త్వత్కృతే హి మయా సర్వమిదమేవం విధం కృతమ్ |
మా శోకం మా చ సంతాపం ధైర్యమాశ్రయ పుత్రక |
త్వదధీనా హి నగరీ రాజ్యం చైతదనామయమ్ || ౫౩ ||

తత్పుత్ర శీఘ్రం విధినా విధిజ్ఞైః
వసిష్ఠముఖ్యైః సహితో ద్విజేంద్రైః |
సంకాల్య రాజానమదీన సత్త్వమ్
ఆత్మానముర్వ్యామభిషేచయస్వ || ౫౪ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విసప్తతితమః సర్గః || ౭౨ ||

Ayodhya Kanda Sarga 72 Meaning In Telugu

భరతుడు అలా ఆలోచిస్తూ తన తండ్రి దశరథుని మందిరములో ప్రవేశించాడు. అక్కడ దశరథుడు కనిపించలేదు. వెంటనే తన తల్లి కైక మందిరమునకు వెళ్లాడు. కొడుకును చూడగానే కైక మనస్సు సంతోషంతో నిండిపోయింది. కొడుకుకు ఎదురువెళ్లింది. భరతుడు తల్లి కైక పాదములకు నమస్కరించాడు. కైక భరతుని లేవదీసి నుదుటిన ముద్దు పెట్టుకొని తన పక్కన కూర్చుండబెట్టుకొంది.

“నాయనా భరతా! నీ ప్రయాణము బాగా సాగిందా! తాతగారి ఇంట్లో ఎప్పుడు బయలుదేరావు. మార్గములో ఆయాసము కలగలేదు కదా! మీ తాతగారు, మేనమామ అంతా క్షేమంగా ఉన్నారా! ఇంకా కేకయ దేశపు విశేషములు ఏమిటి వివరంగా చెప్పు.” అని ఆతురతగా అడిగింది కైక చెప్పాడు. భరతుడు తల్లి అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు “అమ్మా! నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఏడుదినములు అయింది. అక్కడ తాతగారూ, మామయ్య అంతా క్షేమంగా ఉన్నారు. వారు మీకు, తండ్రి గారికి, పంపిన కానుకలు వెనుక తీసుకొని వస్తున్నారు. అమ్మా! అయోధ్యలో ప్రవేశించినప్పటి నుండి నా మనస్సులో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానాలు చెబుతావా అమ్మా!” అని అడిగాడు భరతుడు. కైక మాట్లాడలేదు. మౌనంగా ఉంది. భరతుడు ఇలాఅడిగాడు.

అమ్మా! నాన్న గారు ప్రతిరోజూ పడుకొనే బంగారు శయ్యమీద నాన్న గారు లేరు. కారణమేమి? ఈ మందిరములో పరిజనులందరి మొహంలో చింత, శోకము, ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. కారణమేమి? దశరథ మహారాజు గారు ఎక్కుడ సమయము నీ అంత:పురములోనే గడుపుతారు కదా! మరి ఇప్పుడు ఆయన నీ అంత:పురములో కనిపించడం లేదు. ఎందుకనీ? నేను చాలా రోజుల తరువాత వచ్చాను. నాన్న గారికి పాదాభి వందనము చేసి ఆయన ఆశీర్వాదము తీసుకొనవలెనని చాలా ఆతురతగా ఉన్నాను. ఆయన ఎక్కడ ఉన్నారు. నీ మందిరములో లేరు. కౌసల్య మందిరములో ఉన్నారా! చెప్పమ్మా! నేను నాన్నగారు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లాలి.” అని గుచ్చి గుచ్చి అడిగాడు.

ఇంక కైక తప్పించుకోలేక పోయింది. కాని నర్మగర్భంగా చెప్పసాగింది. “కుమారా భరతా! నీ తండ్రిగారు సాధారణంగా అన్ని జీవులు ఏ గతి పొందుతాయో అదే గతిని పొందారు.” అని చెప్పింది. భరతునికి అర్థం అయింది. తండ్రి మరణవార్త విని అలాగే కుప్పకూలిపోయాడు భరతుడు. అతనికి నోటమాట రాలేదు. దు:ఖంతో కుమిలిపోతున్నాడు. కైక భరతుని వద్దకు వచ్చి అతనిని లేపి పక్కన ఉన్న ఆసనము మీద కూర్చోపెట్టింది.
“భరతా! అదేమిటి అలా పడిపోయావు. నీ వంటి రాకుమారులు, కాబోయే మహారాజులు ఇలా దిగులు చెందవచ్చునా! నీ శోకము మాను.” అని ఊరడించింది కైక. కాని భరతునికి శోకము ఆగలేదు. పెద్దగా ఏడుస్తున్నాడు. “అమ్మా! వసిష్ఠులవారు శీఘ్రముగా రమ్మన్నారు అంటే రామునికి పట్టాభిషేకమునకు సుముహూర్తము నిశ్చయించినారేమో అనుకున్నాను. కాని ఇంతటి దుర్వార్త వినవలసి వస్తుందని అనుకోలేదు. అమ్మా! ఇంత హటాత్తుగా తండ్రిగారు చనిపోవుటకు కారణమేమి! ఏమైనా వ్యాధి సోకినదా! తండ్రిగారి అవసాన కాలములో దగ్గర ఉండి ఆయన అంత్యక్రియము జరిపించిన రాముడు ధన్యుడు. ఆ భాగ్యమునకు నేను నోచుకోలేదు. నేను వచ్చాను అని తెలియగానే నాకు ఎదురు వచ్చి నా శరీరమును అంతా నిమిరి, నా శిరమును ఆఘ్రాణించు తండ్రిగారు కనపడనప్పుడే అనుకున్నాను. ఇలాంటిది ఏదో జరిగి ఉంటుందని. నా తండ్రిగారి చేతి స్పర్శ అనుభవించు భాగ్యము ఈ జన్మకు లేదు కదా!

అమ్మా తండ్రి గారి తరువాత తండ్రి అంతటివాడు రాముడు. ఆయన నాకు అన్నగారే కాదు, తల్లి, తండ్రి, గురువు, దైవము. రామునికి నా రాక గురించి తెలపండి. నా తండ్రికి బదులు నా అన్నగారి పాదాలు పట్టుకొని ఆశీర్వాదము తీసుకుంటాను. రాముడు నన్ను ఆశీర్వదిస్తే నా తండ్రి ఆశీర్వదించినట్టే! అమ్మా! తండ్రిగారి మరణసమయములో నేను దగ్గర లేను కదా! నాతో చెప్పమని ఏమైనా చెప్పాడా అమ్మా! చెప్పమ్మా! నా తండ్రి గారి మాటలు యధాతథంగా చెప్పమ్మా!” అని కైకను ప్రార్థించాడు భరతుడు.

కైక జరిగింది చెప్పసాగింది. “కుమారా! నీ తండ్రి దశరథ మహారాజు తన ఆఖరి ఘడియలలో హా రామా! హా లక్ష్మణా! హా సీతా! అని వారిని తల్చుకుంటూ ప్రాణాలు వదిలాడు. ఇంకా ఇలా అన్నాడు. “రాముడు సీతతో లక్ష్మణునితో అయోధ్యకు తిరిగి వచ్చినపుడు చూచిన వారు ధన్యులు కదా!” అని అన్నాడు.

భరతునికి అనుమానం కలిగింది. “అమ్మా! రాముడు, లక్ష్మణుడు, సీత ఎక్కడకు వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఎప్పుడు వస్తారు.” అని అడిగాడు భరతుడు. తాను చెప్పబోవు సంగతులు భరతునికి సంతోషము కలిగిస్తాయి అనే భ్రమలో జరిగింది జరిగినట్టు చెప్పసాగింది కైక.
“కుమారా భరతా! నీ అన్న రాముడు నార చీరలు ధరించి భార్యాసమేతుడై, లక్ష్మణుని వెంటదీసుకొని అరణ్యములకు వెళ్లాడు.” అని చెప్పింది. భరతుడు ఆశ్చర్యపోయాడు. ధర్మము తప్ప మరొకటి తెలియని రాముడు ఏ తప్పుచేసాడని రాజ్యము నుండి వెడలి పోయాడు అని ఆలోచించాడు. తల్లి కైకను ఇలా అడిగాడు.

“అమ్మా! రాముడు ఏమి తప్పు చేసాడని రాజ్యమునుండి వెడలగొట్టబడ్డాడు. రాముడు బ్రాహ్మణుల సొత్తును దొంగిలించాడా! రాముడు ఎవరి నైనా నిరపరాధిని దండించాడా! లేక రాముడు ఇతర స్త్రీలను, ఇతరుల భార్యలను కామవాంఛతో కోరుకున్నాడా. లేక ఏమైనా భ్రూణ హత్య లాంటిది చేసాడా! రాముడు ఏ అపరాధమూ చెయ్యకుండా రాజ్యమునుండి ఎందుకు అరణ్యములకు పంపబడ్డాడు.” అని నిలదీసాడు భరతుడు. ఇంక చెప్పక తప్పదని అసలు విషయాన్ని చెప్పసాగింది కైక. “రాకుమారా! రాముడు నీవు చెప్పిన ఏ పాపమూ చెయ్యలేదు. నీ తండ్రి దశరథుడు రామునికి పట్టాభిషేకము చేయుటకు ముహూర్తము నిశ్చయించాడు. ఆ విషయమును విన్న నేను ఆందోళనపడ్డాను. వెంటనే నీ తండ్రి వద్దకు పోయి, నీకు యౌవరాజ్యము పట్టాభిషేకము చేయమనీ, రాముని పదునాలుగేళ్లు అరణ్యములకు పంపమని కోరాను. నీ తండ్రి నాకు ఇదివరలో ఇచ్చిన వరములను సఫలము చేయుటకు రాముని అరణ్యములకు పంపాడు. రాముని వెంట సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. రాముడు అరణ్యములకు పోవడంతో నీ తండ్రి దిగులుతో రాముని ఇంక చూడలేనేమోనని చింతతో మరణించాడు.

నాయనా భరతా! ఇదంతా నేను నీ కోసమే, నీ మేలు కోరి, నీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసాను. కాబట్టి వెంటనే నీవు రాజ్యాభిషిక్తుడివికా! ఈ తల్లి కోర్కె నెరవేర్చు. నీ తండ్రి మాట ప్రకారము రాముడు అడవులకు వెళ్లాడు. నా మాట ప్రకారము నీవు పట్టాభిషిక్తుడివి కా! కాబోయే మహారాజువు. నీవు దిగులు పడకూడదు. ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీకు దాయాదుల బాధ లేదు. నీ ఇష్టం వచ్చినట్టు అయోధ్యను పాలించు. నీవు వెంటనే వసిష్ఠుని కలిసి, నీ తండ్రికి శాస్త్రోక్తంగా అంత్య క్రియలు నిర్వర్తించి, తరువాత రాజ్యాభిషిక్తుడివి కా! అని పలికింది కైక.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రిసప్తతితమః సర్గః (73) >>

Ayodhya Kanda Sarga 71 In Telugu – అయోధ్యాకాండ ఏకసప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 71

అయోధ్యాకాండ ఏకసప్తతితమః సర్గంలో రాముడు, సీత మరియు లక్ష్మణులు అరణ్యంలో వాసం చేస్తున్నారు. ఈ సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ ఆ ప్రాంతంలోని వివిధ అటవీ ప్రాంతాలు మరియు అటవీ జీవులను చూశారు. వారు మునుల ఆశ్రమాలను సందర్శించి, వారి నుండి ఆశీర్వాదాలు తీసుకున్నారు. లక్ష్మణుడు రాముడి కోసం పర్ణశాల నిర్మించాడు. ఈ సర్గలో వారు తమ వాసస్థలం గురించి చర్చిస్తారు మరియు సుఖముగా అరణ్యవాసం కొనసాగిస్తారు. దురితములు అనుభవిస్తున్నప్పటికీ, రాముడు తన ధర్మాన్ని పాటిస్తాడు మరియు సీత, లక్ష్మణులు ఆయనతో కలిసి ఉంటారు.

అయోధ్యాగమనమ్

స ప్రాఙ్ముఖో రాజగృహాదభినిర్యాయ వీర్యవాన్ | [రాఘవః]
తతస్సుదామాం ద్యుతిమాన్ సంతీర్యావేక్ష్య తాం నదీమ్ || ౧ ||

హ్లాదినీం దూరపారాం చ ప్రత్యక్ స్రోతస్తరంగిణీమ్ |
శతద్రూమతరచ్ఛ్రీమాన్ నదీమిక్ష్వాకునందనః || ౨ ||

ఏలాధానే నదీం తీర్త్వా ప్రాప్య చాపరపర్పటాన్ |
శిలామాకుర్వతీం తీర్త్వా ఆగ్నేయం శల్యకర్తనమ్ || ౩ ||

సత్య సంధః శుచిః శ్రీమాన్ ప్రేక్షమాణః శిలావహామ్ |
అత్యయాత్ స మహాశైలాన్ వనం చైత్రరథం ప్రతి || ౪ ||

సరస్వతీం చ గంగాం చ యుగ్మేన ప్రతిపద్య చ | [ప్రత్యపద్యత]
ఉత్తరం వీరమత్స్యానాం భారుండం ప్రావిశద్వనమ్ || ౫ ||

వేగినీం చ కులింగాఖ్యాం హ్రాదినీం పర్వతావృతామ్ |
యమునాం ప్రాప్య సంతీర్ణో బలమాశ్వాసయత్తదా || ౬ ||

శీతీకృత్య తు గాత్రాణి క్లాంతానాశ్వాస్య వాజినః |
తత్ర స్నాత్వా చ పీత్వా చ ప్రాయాదాదాయ చోదకమ్ || ౭ ||

రాజపుత్రః మహారణ్యమనభీక్ష్ణోపసేవితమ్ |
భద్రః భద్రేణ యానేన మారుతః ఖమివాత్యయాత్ || ౮ ||

భాగీరథీం దుష్ప్రతరామంశుధానే మహానదీమ్ |
ఉపాయాద్రాఘవస్తూర్ణం ప్రాగ్వటే విశ్రుతే పురే || ౯ ||

స గంగాం ప్రాగ్వటే తీర్త్వా సమాయాత్కుటికోష్ఠికామ్ |
సబలస్తాం స తీర్త్వాఽథ సమాయాద్ధర్మవర్ధనమ్ || ౧౦ ||

తోరణం దక్షిణార్ధేన జంబూప్రస్థముపాగమత్ |
వరూథం చ యయౌ రమ్యం గ్రామం దశరథాత్మజః || ౧౧ ||

తత్ర రమ్యే వనే వాసం కృత్వాఽసౌ ప్రాఙ్ముఖో యయౌ |
ఉద్యానముజ్జిహానాయాః ప్రియకా యత్ర పాదపాః || ౧౨ ||

సాలాంస్తు ప్రియకాన్ప్రాప్య శీఘ్రానాస్థాయ వాజినః |
అనుజ్ఞాప్యాథ భరతః వాహినీం త్వరితః యయౌ || ౧౩ ||

వాసం కృత్వా సర్వతీర్థే తీర్త్వా చోత్తానకాం నదీమ్ |
అన్యా నదీశ్చ వివిధాః పార్వతీయైస్తురంగమైః || ౧౪ ||

హస్తి పృష్ఠకమాసాద్య కుటికామత్యవర్తత |
తతార చ నరవ్యాఘ్రః లౌహిత్యే స కపీవతీమ్ || ౧౫ ||

ఏకసాలే స్థాణుమతీం వినతే గోమతీం నదీమ్ |
[* వ్యపాయాద్రాఘస్తూర్ణం తీర్త్వా శోణాం మహానదీమ్ |*]
కలింగనగరే చాపి ప్రాప్య సాలవనం తదా || ౧౬ ||

భరతః క్షిప్రమాగచ్చత్ సుపరిశ్రాంతవాహనః |
వనం చ సమతీత్యాశు శర్వర్యామరుణోదయే || ౧౭ ||

అయోధ్యాం మనునా రాజ్ఞా నిర్మితాం సందదర్శ హ |
తాం పురీం పురుషవ్యాఘ్రః సప్తరాత్రోషితః పథి || ౧౮ ||

అయోధ్యామగ్రతర్దృష్ట్వా సారథిం వాక్యమబ్రవీత్ |
ఏషా నాతిప్రతీతా మే పుణ్యోద్యానా యశస్వినీ || ౧౯ ||

అయోధ్యా దృశ్యతే దూరాత్ సారథే పాండుమృత్తికా |
యజ్వభిర్గుణసంపన్నైః బ్రాహ్మణైః వేదపారగైః || ౨౦ ||

భూయిష్ఠమృద్ధైరాకీర్ణా రాజర్షిపరిపాలితా |
అయోధ్యాయాం పురా శబ్దః శ్రూయతే తుములో మహాన్ || ౨౧ ||

సమంతాన్నరనారీణాం తమద్య న శృణోమ్యహమ్ |
ఉద్యానాని హి సాయాహ్నే క్రీడిత్వోపరతైర్నరైః || ౨౨ ||

సమంతాద్విప్రధావద్భిః ప్రకాశంతే మమాన్యదా |
తాన్యద్యానురుదంతీవ పరిత్యక్తాని కామిభిః || ౨౩ ||

అరణ్య భూతేవ పురీ సారథే ప్రతిభాతి మే |
న హ్యత్ర యానైర్దృశ్యంతే న గజైర్న చ వాజిభిః || ౨౪ ||

నిర్యాంతః వాఽభియాంతః వా నరముఖ్యా యథాపురమ్ |
ఉద్యానాని పురా భాంతి మత్తప్రముదితాని చ || ౨౫ ||

జనానాం రతిసంయోగేష్వత్యంతగుణవంతి చ |
తాన్యేతాన్యద్య వశ్యామి నిరానందాని సర్వశః || ౨౬ ||

స్రస్తపర్ణైరనుపథం విక్రోశద్భిరివ ద్రుమైః |
నాద్యాపి శ్రూయతే శబ్దో మత్తానాం మృగపక్షిణామ్ || ౨౭ ||

సంరక్తాం మధురాం వాణీం కలం వ్యాహరతాం బహు |
చందనాగరుసంపృక్తో ధూపసమ్మూర్చితోఽతులః || ౨౮ ||

ప్రవాతి పవనః శ్రీమాన్ కిం ను నాద్య యథాపురమ్ |
భేరీమృదంగవీణానాం కోణసంఘట్టితః పునః || ౨౯ ||

కిమద్య శబ్దో విరతః సదాఽదీనగతిః పురా |
అనిష్టాని చ పాపాని పశ్యామి వివిధాని చ || ౩౦ ||

నిమిత్తాన్యమనోజ్ఞాని తేన సీదతి తే మనః |
సర్వథా కుశలం సూత దుర్లభం మమ బంధుషు || ౩౧ ||

తథా హ్యసతి సమ్మోహే హృదయం సీదతీవ మే |
విషణ్ణః శాంతహృదయస్త్రస్తః సంలులితేంద్రియః || ౩౨ ||

భరతః ప్రవివేశాశు పురీమిక్ష్వాకుపాలితామ్ |
ద్వారేణ వైజయంతేన ప్రావిశచ్ఛ్రాంతవాహనః || ౩౩ ||

ద్వాస్స్థైరుత్థాయ విజయం పృష్టస్తైః సహితో యయౌ |
స త్వనేకాగ్రహృదయో ద్వాస్స్థం ప్రత్యర్చ్య తం జనమ్ || ౩౪ ||

సూతమశ్వపతేః క్లాంతమబ్రవీత్తత్ర రాఘవః |
కిమహం త్వరయాఽఽనీతః కారణేన వినాఽనఘ || ౩౫ ||

అశుభాశంకి హృదయం శీలం చ పతతీవ మే |
శ్రుతా నో యాదృశాః పూర్వం నృపతీనాం వినాశనే || ౩౬ ||

ఆకారాంస్తానహం సర్వాన్ ఇహపశ్యామి సారథే |
సమ్మార్జనవిహీనాని పరుషాణ్యుపలక్షయే || ౩౭ ||

అసంయతకవాటాని శ్రీవిహీనాని సర్వశః |
బలికర్మవిహీనాని ధూపసమ్మోదనేన చ || ౩౮ ||

అనాశితకుటుంబాని ప్రభాహీనజనాని చ |
అలక్ష్మీకాని పశ్యామి కుటుంబిభవనాన్యహమ్ || ౩౯ ||

అపేతమాల్యశోభాన్యప్యసంమృష్టాజిరాణి చ |
దేవాగారాణి శూన్యాని న చాభాంతి యథాపురమ్ || ౪౦ ||

దేవతార్చాః ప్రవిద్ధాశ్చ యజ్ఞగోష్ఠ్యస్తథావిధాః |
మాల్యాపణేషు రాజంతే నాద్య పణ్యాని వా తథా || ౪౧ ||

దృశ్యంతే వణిజోఽప్యద్య న యథాపూర్వమత్ర వై |
ధ్యానసంవిగ్నహృదయాః నష్టవ్యాపారయంత్రితాః || ౪౨ ||

దేవాయతనచైత్యేషుదీనాః పక్షిగణాస్తథా |
మలినం చాశ్రు పూర్ణాక్షం దీనం ధ్యానపరం కృశమ్ || ౪౩ ||

సస్త్రీపుంసం చ పశ్యామి జనముత్కంఠితం పురే |
ఇత్యేవముక్త్వా భరతః సూతం తం దీనమానసః |
తాన్యరిష్టాన్యయోధ్యాయాం ప్రేక్ష్య రాజగృహం యయౌ || ౪౪ ||

తాం శూన్యశృంగాటకవేశ్మరథ్యామ్
రజోఽరుణ ద్వారకవాటయంత్రామ్ |
దృష్ట్వా పురీమింద్రపురప్రకాశామ్
దుఃఖేన సంపూర్ణతరః బభూవ || ౪౫ ||

బహూని పశ్యన్ మనసోఽప్రియాణి
యాన్యన్యదా నాస్య పురే బభూవుః |
అవాక్ఛిరా దీనమనా నహృష్టః
పితుర్మహాత్మా ప్రవివేశ వేశ్మ || ౪౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకసప్తతితమః సర్గః || ౭౧ ||

Ayodhya Kanda Sarga 71 Meaning In Telugu

భరత శత్రుఘ్నులు ఎక్కిన రథము అయోధ్య వైపు వేగంగా వెళుతూ ఉంది. శతద్రూనదిని దాటారు. శిలావహనదిని దాటారు. త్రివేణీ సంగమమును సమీపించారు. వీరమత్స్యదేశమును దాటి భారుండ వనమును ప్రవేశించారు. కులింగనదిని, యమునా నదిని దాటారు. అక్కడ కొంచెం సేపు విశ్రమించారు. ప్రాగ్వట పురమును దాటి గంగానదిని సమీపించారు. గంగానదిని దాటి ధర్మవర్థనము అనే గ్రామమును సమీపించారు. జంబూప్రస్థమును దాటి వరూధమనే గ్రామము చేరుకున్నారు. తరువాత ఉజ్జహాసనగరమును, సర్వతీర్థమును, ఉత్తానికా నదిని, కుటికానదిని, కపీవతి నదిని, స్థాణుమతీ నదిని, గోమతీ నదిని దాటారు. కళింగ నగరములో కొంచెము సేపు విశ్రమించారు. తరువాత సాలవనమును దాటారు. ఆ ప్రకారము ఏడు రోజులు అవిశ్రాంతంగా ప్రయాణము చేసి అయోధ్యానగరము చేరుకున్నారు.

ఎల్లప్పుడూ సందడిగా కళ కళ లాడుతూ ఉండే అయోధ్యానగరము కళాహీనంగా ఉంది. భరతునికి ఏం జరిగిందో కాలేదు. భరతుడు తన సారథిని చూచి అయోధ్యా నగరము అలా ఎందుకు ఉంది అని అడిగాడు. “సారధీ! ఎల్లప్పుడూ స్త్రీపురుషుల సంచారముతో సందడిగా ఉండే అయోధ్యానగరము ఇప్పుడు నిశ్వబ్దముగా ఉందేమి? ఎక్కడా రధములు వాహనములు కనపడటం లేదు. ఏమి కారణము? అయోధ్యానగరములోని గృహముల నుండి వాద్యముల గోష్టి మృదు మధురంగా వినపడటం లేదేమి? నాకు చాలా చెడ్డ శకునములు కనపడుతున్నాయి. కాని ఏం జరిగిందో అర్థం కావడం లేదు. నాకు కావలసిన వారికి ఏదో కీడు జరిగి ఉంటుంది అని నా మనసుకు తడుతూ ఉంది. నీ కేమైనా తెలుసా!” అని అడిగాడు భరతుడు. సారధి మాట్లాడలేదు. భరత శత్రుఘ్నులు అయోధ్యలోకి ప్రవేశించారు. మరలా సారథిని చూచి భరతుడు ఇలా అన్నాడు.

“ఓ సారధీ! అసలు నన్ను ఇంత తొందరగా ఎందుకు పిలిపించారు. నా మనస్సు ఏదో కీడు శంకిస్తూ ఉంది. ఎందుకంటే పూర్వము రాజులు మరణించినపుడు ఎలాంటి శకునములు, గుర్తులు కనపడతాయో అవన్నీ నాకు గోచరమవుతున్నాయి. అదీ కాకుండా అయోధ్యలో వీధులు దుమ్ముకొట్టుకొని ఉన్నాయి. ఎవరూ శుభ్రం చేస్తున్నట్టులేదు. దేవాలయములలో పూజలు వేదఘోషలు వినపడటం లేదు. ఎక్కడా పూలు అమ్ముతున్న ఛాయలు లేవు. యజ్ఞములు చేస్తున్నట్టు అగ్నిధూమములు కనిపించడం లేదు. వ్యాపార సంస్థలు అన్నీ మూసి ఉన్నాయి. ఏమి కారణము. నీకేమైనా తెలుసా!” అని అడిగాడు. సారధి మౌనంగా ఉన్నాడు. భరతుడు రాజభవనంలోకి ప్రవేశించాడు. రాజభవనం కూడా నిర్మానుష్యంగా ఉంది. పరిచారకుల సందడి కూడా లేదు. భరతుడు లోపలకు వెళుతున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్విసప్తతితమః సర్గః (72) >>

Balakanda Sarga 71 In Telugu – బాలకాండ ఏకసప్తతితమః సర్గః

Bala Kanda Sarga 71 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకసప్తతితమః సర్గలో, జనకుడు తన కుమార్తెలను రాముడు మరియు లక్ష్మణులకు వధువులుగా అర్పిస్తూ తన వంశాన్ని వివరిస్తాడు. అలా చేయడం ద్వారా, అతను తన సోదరుడు కుశధ్వజ గురించి మరింత వివరంగా చెప్పాడు, అతని కుమార్తెలు భరతుడు మరియు శత్రుఘ్నులకు కాబోయే భార్యలు. పెళ్లికి టైమింగ్స్ కూడా ఫిక్స్ చేస్తారు.

కన్యాదానప్రతిశ్రవః

ఏవం బ్రువాణం జనకః ప్రత్యువాచ కృతాంజలిః |
శ్రోతుమర్హసి భద్రం తే కులం నః పరికీర్తితమ్ ||

1

ప్రదానే హి మునిశ్రేష్ఠ కులం నిరవశేషతః |
వక్తవ్యం కులజాతేన తన్నిబోధ మహామునే ||

2

రాజాఽభూత్త్రిషు లోకేషు విశ్రుతః స్వేన కర్మణా |
నిమిః పరమధర్మాత్మా సర్వసత్త్వవతాం వరః ||

3

తస్య పుత్రో మిథిర్నామ ప్రథమో మిథిపుత్రకః |
ప్రథమాజ్జనకో రాజా జనకాదప్యుదావసుః ||

4

ఉదావసోస్తు ధర్మాత్మా జాతో వై నందివర్ధనః |
నందివర్ధనపుత్రస్తు సుకేతుర్నామ నామతః ||

5

సుకేతోరపి ధర్మాత్మా దేవరాతో మహాబలః |
దేవరాతస్య రాజర్షేర్బృహద్రథ ఇతి స్మృతః ||

6

బృహద్రథస్య శూరోఽభూన్మహావీరః ప్రతాపవాన్ |
మహావీరస్య ధృతిమాన్సుధృతిః సత్యవిక్రమః ||

7

సుధృతేరపి ధర్మాత్మా ధృష్టకేతుః సుధార్మికః |
ధృష్టకేతోస్తు రాజర్షేర్హర్యశ్వ ఇతి విశ్రుతః ||

8

హర్యశ్వస్య మరుః పుత్రో మరోః పుత్రః ప్రతింధకః |
ప్రతింధకస్య ధర్మాత్మా రాజా కీర్తిరథః సుతః ||

9

పుత్రః కీర్తిరథస్యాపి దేవమీఢ ఇతి స్మృతః |
దేవమీఢస్య విబుధో విబుధస్య మహీధ్రకః ||

10

మహీధ్రకసుతో రాజా కీర్తిరాతో మహాబలః |
కీర్తిరాతస్య రాజర్షేర్మహారోమా వ్యజాయత ||

11

మహారోమ్ణస్తు ధర్మాత్మా స్వర్ణరోమా వ్యజాయత |
స్వర్ణరోమ్ణస్తు రాజర్షేర్హ్రస్వరోమా వ్యజాయత ||

12

తస్య పుత్రద్వయం జజ్ఞే ధర్మజ్ఞస్య మహాత్మనః |
జ్యేష్ఠోఽహమనుజో భ్రాతా మమ వీరః కుశధ్వజః ||

13

మాం తు జ్యేష్ఠం పితా రాజ్యే సోఽభిషిచ్య నరాధిపః |
కుశధ్వజం సమావేశ్య భారం మయి వనం గతః ||

14

వృద్ధే పితరి స్వర్యాతే ధర్మేణ ధురమావహమ్ |
భ్రాతరం దేవసంకాశం స్నేహాత్పశ్యన్కుశధ్వజమ్ ||

15

కస్యచిత్త్వథ కాలస్య సాంకాశ్యాదగమత్పురాత్ |
సుధన్వా వీర్యవాన్రాజా మిథిలామవరోధకః ||

16

స చ మే ప్రేషయామాస శైవం ధనురనుత్తమమ్ |
సీతా కన్యా చ పద్మాక్షీ మహ్యం వై దీయతామితి ||

17

తస్యాఽప్రదానాద్బ్రహ్మర్షే యుద్ధమాసీన్మయా సహ |
స హతోఽభిముఖో రాజా సుధన్వా తు మయా రణే ||

18

నిహత్య తం మునిశ్రేష్ఠ సుధన్వానం నరాధిపమ్ |
సాంకాశ్యే భ్రాతరం వీరమభ్యషించం కుశధ్వజమ్ ||

19

కనీయానేష మే భ్రాతా అహం జ్యేష్ఠో మహామునే |
దదామి పరమప్రీతో వధ్వౌ తే మునిపుంగవ ||

20

సీతాం రామాయ భద్రం తే ఊర్మిలాం లక్ష్మణాయ వై |
వీర్యశుల్కాం మమ సుతాం సీతాం సురసుతోపమామ్ ||

21

ద్వితీయామూర్మిలాం చైవ త్రిర్దదామి న సంశయః |
రామలక్ష్మణయో రాజన్గోదానం కారయస్వ హ ||

22

పితృకార్యం చ భద్రం తే తతో వైవాహికం కురు |
మఘా హ్యద్య మహాబాహో తృతీయే దివసే విభో ||

23

ఫల్గున్యాముత్తరే రాజంస్తస్మిన్వైవాహికం కురు |
రామలక్ష్మణయో రాజన్దానం కార్యం సుఖోదయమ్ ||

24

 Balakanda Sarga 71 In Telugu Pdf With Meaning

ఆ ప్రకారంగా వసిష్ఠుడు దశరథుని వంశము గురించి చెప్పిన తరువాత, జనకుడు చేతులు జోడించి ఇలా అన్నాడు.

“ఓ దశరథ మహారాజా! తమరి వంశక్రమమును గూర్చి విని చాలా ఆనందించాను. కన్యాదాన సమయములో వధువు యొక్క వంశమును గూర్చి కూడా వివరించడం సాంప్రదాయము. కాబట్టి మా వంశ చరిత్రను వివరిస్తాను. అవధరించండి.

మాది మిథిలా నగరము. ఈ మిథిలా నగరమును నిర్మించిన వాడు మిథి అనే చక్రవర్తి. మిది, నిమి చక్రవర్తి కుమారుడు. ఆయనే మా వంశమునకు మూలపురుషుడు. మిథిని జనకుడు అని కూడా పిలుస్తారు. ఆయనే మా వంశములో మొట్ట మొదటి జనకుడు.

మిథి కుమారుడు ఉదావసువు. ఉదావసుని కుమారుడు నందివర్థనుడు. నంది వర్ధనుని కుమారుడు సుకేతువు. సుకేతుని కుమారుడు దేవరాతుడు. దేవరాతుని కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. మహావీరుని కుమారుడు సుధృతి. సుధృతి కుమారుడు దుష్టకేతువు. ఆయన రాజర్షి.

రాజర్షిఅయిన దుష్టకేతువు కుమారుడు హర్యశ్వుడు. హర్యశ్వుని కుమారుడు మరుడు. మరుని కుమారుడు ప్రతింధకుడు. ప్రతింధకుని కుమారుడు కీర్తిరథుడు. కీర్తిరథుని కుమారుడు దేవమీఢుడు. దేవమీఢుని కుమారుడు విబుధుడు. విబుధుని కుమారుడు మహీధ్రకుడు. మహీధ్రకుని కుమారుడు కీర్తిరాతుడు. ఆయన కూడా రాజర్షి.

రాజర్షి అయిన కీర్తిరాతునికి మహారోముడు జన్మించాడు. మహారోముని కుమారుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు. ఆ హ్రస్వరోమునికి ఇరువురు కుమారులు పుట్టారు. అందులో పెద్దవాడను నేను. రెండవ వాడు నా తమ్ముడు కుశధ్వజుడు.

మా తండ్రిగారైన హ్రస్వరోమ మహారాజు నన్ను ఈ మిథిలా నగరమునకు రాజుగా చేసాడు. నా తమ్ముని బాధ్యతను నాకు అప్పగించి ఆయన వనములకు వెళ్లాడు. కాలవశాత్తు నా తండ్రిగారు స్వర్గస్థులయ్యారు. నేను నా తమ్ముని పోషణభారము వహించి రాజ్యము చేస్తున్నాను.

కొంత కాలము తరువాత సాంకాశ మహారాజు సుధన్వుడు నా రాజ్యము మీదికి దండెత్తి వచ్చాడు. నా వద్ద ఉన్న శివధనుస్సును, నా కుమార్తె సీతను తనకు ఇవ్వమని నాకు వర్తమానము పంపాడు. నేను నా కుమార్తెను గానీ శివధనుస్సును గానీ సుధన్వునికి ఇవ్వడానికి అంగీకరించలేదు. మా ఇరువురికి యుద్ధము జరిగింది.

నేను సుధన్వుని యుద్ధములో ఓడించి వధించాను. సాంకాశ పురమును ఆక్రమించుకున్నాను. తరువాత నా తమ్ముడు కుశధ్వజుని సాంకాశ పురమునకు రాజుగా పట్టాభిషిక్తుని చేసాను.

ఓ వసిష్ట మునీంద్రా! మా సోదరులలో నేను పెద్ద వాడను. నా కుమార్తె పేరు సీత. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తె పేరు ఊర్మిళ. సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహము జరిపించడానికి సంకల్పించాను. ఈ విషయమును ఏ మాత్రము సందేహమునకు తావు లేకుండా మూడు మారులు నొక్కి చెప్పుచున్నాను. నా కుమార్తెలైన సీత, ఊర్మిళ లను దశరథమహారాజు కుమారులైన రామునికి లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపించుటకు ఎంతో ఆనందించుచున్నాను.

ఓ దశరథ మహారాజా! రామ లక్ష్మణులతో గోదానము మొదలగు శుభకార్యములను చేయించండి. పితృకార్యము జరిపించిన తదుపరి వివాహమహోత్సవమును జరిపించెదను.

ఓ దశరథ మహారాజా! నేడు మఘా నక్షత్రము. నేటికి మూడవ రోజున అనగా ఉత్తరఫల్గునీ నక్షత్రములో వివాహము జరిపించెదము. ఈ రెండు రోజులలో రామ లక్ష్మణుల చేత గోదానము మొదలగు దానములు ఇచ్చు కార్యక్రములు నిర్వర్తింపుడు.” అని వినయంతో పలికాడు జనకుడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ద్విసప్తతితమః సర్గః (72) >>

Ayodhya Kanda Sarga 54 In Telugu | అయోధ్యాకాండ చతుఃపంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 54 In Telugu

అయోధ్యా కాండ సర్గ 54 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం.  సీతా,రామ,లక్ష్మణులు మరునాడు ఉదయమే నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకొని ఆ ప్రదేశము విడిచి వెళ్లిపోయారు. వారు అలా నడుస్తూ గంగానదీ యమునా నదీ కలిసే ప్రయాగ క్షేత్రమునకు చేరుకున్నారు. అప్పటికి చీకటి పడింది. “లక్ష్మణా! మనము గంగా యమునా సంగమ స్థానమునకు చేరుకున్నట్టున్నాము… అని రాముడు అన్నా సందర్భం లోనిది…

భరద్వాజాశ్రమాభిగమనమ్

తే తు తస్మిన్ మహావృక్షౌషిత్వా రజనీం శివామ్ |
విమలేఽభ్యుదితే సూర్యే తస్మాద్దేశాత్ ప్రతస్థిరే ||

1

యత్ర భాగీరథీం గంగాం యమునాఽభిప్రవర్తతే |
జగ్ముస్తం దేశముద్దిశ్య విగాహ్య సుమహద్వనమ్ ||

2

తే భూమిభాగాన్ వివిధాన్ దేశాంశ్చాపి మనోరమాన్ |
అదృష్టపూర్వాన్ పశ్యన్తస్తత్ర తత్ర యశస్వినః ||

3

యథాక్షేమేణ గచ్ఛన్ సః పశ్యంశ్చ వివిధాన్ ద్రుమాన్ |
నివృత్తమాత్రే దివసే రామః సౌమిత్రిమబ్రవీత్ ||

4

ప్రయాగమభితః పశ్య సౌమిత్రే ధూమమున్నతమ్ |
అగ్నేర్భగవతః కేతుం మన్యే సన్నిహితః మునిః ||

5

నూనం ప్రాప్తాస్మ సమ్భేదం గంగా యమునయోర్వయమ్ |
తథా హి శ్రూయతే శబ్దః వారిణో వారిఘట్టితః ||

6

దారూణి పరిభిన్నాని వనజైః ఉపజీవిభిః |
భరద్వాజాశ్రమే చైతే దృశ్యంతే వివిధా ద్రుమాః ||

7

ధన్వినౌ తౌ సుఖం గత్వా లంబమానే దివాకరే |
గంగాయమునయోః సంధౌ ప్రాపతుర్నిలయం మునేః ||

8

రామస్త్వాశ్రమమాసాద్య త్రాసయన్ మృగపక్షిణః |
గత్వా ముహూర్తమధ్వానం భరద్వాజముపాగమత్ ||

9

తతస్త్వాశ్రమమాసాద్య మునేర్దర్శనకాంక్షిణౌ |
సీతయాఽనుగతౌ వీరౌ దూరాదేవావతస్థతుః ||

10

స ప్రవిశ్య మహాత్మానమృషిం శిష్యగణైర్వృతమ్ |
సంశితవ్రతమేకాగ్రం తపసా లబ్ధచక్షుషమ్ ||

11

హుతాగ్నిహోత్రం దృష్ట్వైవ మహాభాగం కృతాంజలిః |
రామః సౌమిత్రిణా సార్ధం సీతయా చాభ్యవాదయత్ ||

12

న్యవేదయత చాత్మానం తస్మై లక్ష్మణపూర్వజః |
పుత్రౌ దశరథస్యావాం భగవన్ రామలక్ష్మణౌ ||

13

భార్యా మమేయం వైదెహీ కల్యాణీ జనకాత్మజా |
మాం చానుయాతా విజనం తపోవనమనిందితా ||

14

పిత్రా ప్రవ్రాజ్యమానం మాం సౌమిత్రిరనుజః ప్రియః |
అయమన్వగమద్భ్రాతా వనమేవ దృఢ వ్రతః ||

15

పిత్రా నియుక్తా భగవన్ ప్రవేక్ష్యామస్తపోవనమ్ |
ధర్మమేవ చరిష్యామస్తత్ర మూలఫలాశనాః ||

16

తస్య తద్వచనం శ్రుత్వా రాజపుత్రస్య ధీమతః |
ఉపానయత ధర్మాత్మా గామర్ఘ్యముదకం తతః ||

17

నానావిధానన్నరసాన్ వన్యమూలఫలాశ్రయాన్ |
తేభ్యో దదౌ తప్తతపాః వాసం చైవాభ్యకల్పయత్ ||

18

మృగ పక్షిభిరాసీనః మునిభిశ్చ సమంతతః |
రామమాగతమభ్యర్చ్య స్వాగతేనాహ తం మునిః ||

19

ప్రతిగృహ్య చ తామర్చాముపవిష్టం స రాఘవమ్ |
భరద్వాజోఽబ్రవీద్వాక్యం ధర్మయుక్తమిదం తదా ||

20

చిరస్య ఖలు కాకుత్స్థ పశ్యామి త్వామిహాగతమ్ |
శ్రుతం తవ మయా చేదం వివాసనమకారణమ్ ||

21

అవకాశో వివిక్తోఽయం మహానద్యోః సమాగమే |
పుణ్యశ్చ రమణీయశ్చ వసత్విహ భగాన్ సుఖమ్ ||

22

ఎవముక్తస్తు వచనం భరద్వాజేన రాఘవః |
ప్రత్యువాచ శుభం వాక్యం రామః సర్వహితేరతః ||

23

భగవన్నితాసన్నః పౌరజానపదో జనః |
సుదర్శమిహ మాం ప్రేక్ష్య మన్యేఽహమిమమాశ్రమమ్ ||

24

ఆగమిష్యతి వైదెహీం మాం చాపి ప్రేక్షకో జనః |
అనేన కారణేనాహమిహ వాసం న రోచయే ||

25

ఎకాన్తే పశ్య భగవన్నాశ్రమస్థానముత్తమమ్ |
రమేత యత్ర వైదేహీ సుఖార్హా జనకాత్మజా ||

26

ఎతచ్ఛ్రుత్వా శుభం వాక్యం భరద్వాజో మహామునిః |
రాఘవస్య తతః వాక్యమర్థ గ్రాహకమబ్రవీత్ ||

27

దశక్రోశైతస్తాత గిరిర్యస్మిన్నివత్స్యసి |
మహర్షిసేవితః పుణ్యః సర్వతః సుఖదర్శనః ||

28

గోలాంగూలానుచరితః వానరర్క్షనిషేవితః |
చిత్ర కూటైతి ఖ్యాతః గంధమాదనసన్నిభః ||

29

యావతా చిత్రకూటస్య నరః శృంగాణ్యవేక్షతే |
కళ్యాణాని సమాధత్తే న పాపే కురుతే మనః ||

30

ఋషయస్తత్ర బహవః విహృత్య శరదాం శతమ్ |
తపసా దివమారూడాః కపాలశిరసా సహ ||

31

ప్రవివిక్తమహం మన్యే తం వాసం భవతః సుఖమ్ |
ఇహ వా వనవాసాయ వస రామ మయా సహ ||

32

స రామం సర్వ కామైస్తం భరద్వాజః ప్రియాతిథిమ్ |
సభార్యం సహ చ భ్రాత్రా ప్రతిజగ్రాహ ధర్మవిత్ ||

33

తస్య ప్రయాగే రామస్య తం మహర్షిముపేయుషః |
ప్రపన్నా రజనీ పుణ్యా చిత్రాః కథయతః కథాః ||

34

సీతాతృతీయః కాకుత్స్థః పరిశ్రాన్తః సుఖోచితః |
భరద్వాజాశ్రమే రమ్యే తాం రాత్రిమవసత్సుఖమ్ ||

35

ప్రభాతాయాం రజన్యాం తు భరద్వాజముపాగమత్ |
ఉవాచ నరశార్దూలో మునిం జ్వలితతేజసమ్ ||

36

శర్వరీం భవనన్న్ అద్య సత్య శీల తవాశ్రమె |
ఉషితాః స్మేహ వసతిమనుజానాతు నో భవాన్ ||

37

రాత్ర్యాం తు తస్యాం వ్యుష్టాయాం భరద్వాజోఽబ్రవీదిదమ్ |
మధుమూలఫఽలోపేతం చిత్ర కూటం వ్రజేతి హ ||

38

వాసమౌపయికం మన్యే తవ రామ మహాబల |
నానానగగణోపేతః కిన్నరోరగసేవితః ||

39

మయూరనాదాభిరుతో గజరాజనిషేవితః |
గమ్యతాం భవతా శైలశ్చిత్రకూటః స విశ్రుతః ||

40

పుణ్యశ్చ రమణీయశ్చ బహుమూలఫలాయుతః |
తత్ర కుంజరయూథాని మృగయూథాని చాభితః ||

41

విచరన్తి వనాంతేఽస్మిన్ తాని ద్రక్ష్యసి రాఘవ |
సరిత్ప్రస్రవణప్రస్థాన్ దరీకందరనిర్దరాన్ |
చరతః సీతయా సార్ధం నందిష్యతి మనస్తవ ||

42

ప్రహృష్టకోయష్టికకోకిల స్వనైః
వినాదితం తం వసుధాధరం శివమ్ |
మృగైశ్చ మత్తైః బహుభిశ్చ కుంజరైః
సురమ్యమాసాద్య సమావసాశ్రమమ్ ||

43

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుఃపంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 54 Meaning In Telugu

సీతా,రామ,లక్ష్మణులు మరునాడు ఉదయమే నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకొని ఆ ప్రదేశము విడిచి వెళ్లిపోయారు. వారు అలా నడుస్తూ గంగానదీ యమునా నదీ కలిసే ప్రయాగ క్షేత్రమునకు చేరుకున్నారు. అప్పటికి చీకటి పడింది. “లక్ష్మణా! మనము గంగా యమునా సంగమ స్థానమునకు చేరుకున్నట్టున్నాము.

ఒక నదీజలాలతో మరొక నదీజలాలు కొట్టుకుంటున్న శబ్దము వినపడుతూ ఉంది. ఇక్కడే ఏదో ఒక ముని ఆశ్రమము ఉండాలి. ఎందు కంటే ఇక్కడ వంట చేసుకోడానికి కట్టెలు కొట్టి కొన్ని ఇక్కడే పడవేసినట్టున్నట్టు కనపడుతూ ఉంది.” అని అన్నాడు.

రామలక్ష్మణులు అలా నడుస్తూ భరద్వాజముని ఆశ్రమము చేరుకున్నారు. భరద్వాజముని ఉన్న కుటీరము బయట రామలక్ష్మణులు, సీత నిలబడ్డారు. ఎవరూ బయటకు రాలేదు. అందుకని రాముడు కుటీరములోకి వెళ్లాడు. కుటీరము లోపల అగ్నిహోత్రము ముందు, శిష్యుల మధ్య అగ్ని మాదిరివెలుగుతున్న భరద్వాజమహర్షిని చూచాడు రాముడు. రాముడు, లక్ష్మణుడు, సీత ఆయనకు నమస్కరించారు. రాముడు తమ్ముతాము పరిచయం చేసుకున్నాడు.

“ ఓ భగవాన్ భరద్వాజ మహర్షీ! ప్రణామాలు. మేము అయోధ్యాధిపతి దశరథుని కుమారులకు. రామలక్ష్మణులకు. ఈమె నా అర్ధాంగి సీత. జనక మహారాజు కుమార్తె. నా తండ్రి తన భార్య కైకకు ఇచ్చిన మాట ప్రకారము, నేను వనవాసమునకు వచ్చాను. నా తమ్ముడు, నా మిత్రుడు అయిన లక్ష్మణుడు కూడా నా వెంట వచ్చాడు.

సీత కూడా నన్ను అనుసరించి అడవులకు వచ్చింది. మా తండ్రి మాట ప్రకారము వనవాసము చేస్తూ అడవులలో దొరికే పండ్లు ఫలములు దుంపలు తింటూ, నేల మీద పడుకుంటూ వనవాసము పూర్చిచేయాలని అనుకుంటున్నాము.”అని వినయంగా అన్నాడు రాముడు.

రాముని మాటలువిన్న భరద్వాజుడు వారికి అర్ఘ్యమును, పాద్యమును ఇచ్చాడు. మధుపర్కమును ఇచ్చాడు. అడవిలో దొరికే పండ్లు వారికి తినడానికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా భరద్వాజుడు రామునికి స్వాగత సత్కారాలు చేసాడు.
“ఓ రామా! చాలా కాలం తరువాత నిన్ను చూస్తున్నాను. నిన్ను మహారాజు అడవులకు పంపాడు అన్న విషయం కూడా విన్నాను.

ఈ గంగా యమున సంగమము వద్ద జనములు ఎక్కువగా ఉండరు. ప్రశాంతంగా ఉంటుంది. ఫలములు, పుష్పములు సమృద్ధిగా దొరుకుతాయి. కాబట్టి, నీవు ఇక్కడ ఆశ్రమము నిర్మించుకొని సుఖముగా ఉండవచ్చును.” అని అన్నాడు భరద్వాజుడు. ఆ మాటలు వినిన రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! ఈ ప్రదేశమునకు సమీపములో జనపదాలు ఉన్నాయి. నేను, సీతా

లక్ష్మణులతో సహా ఇక్కడ ఉన్నాను అని తెలిసి, ఆ జనపదాలలో ఉన్న ప్రజలు నన్ను చూడ్డానికి ఇక్కడకు వస్తారు. అది నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడ నివసించలేను. కాబట్టి నాకు ఏకాంతముగా ఉన్న ప్రదేశము ఎక్కడ ఉందో చెప్పండి. అక్కడ ఉంటాము.” అని అన్నాడు రాముడు.

ఆమాటలు విన్న భరద్వాజుడు ఇలాఅన్నాడు. “ఓ రామా! ఇక్కడి నుండి పది క్రోసుల దూరములో చిత్రకూటము అనే పర్వతము ఉంది. ఆ పర్వతము గంధమాధన పర్వతముతో సమానమైన ఖ్యాతి చెందినది. అక్కడ వానరములు మొదలగు చిన్న చిన్న జంతువులు విరివిగా సంచరిస్తుంటాయి.

ఆ పర్వతము మీద ఎందరో మహాఋషులు తపస్సుచేసుకుంటున్నారు. అదిమీరు ఉండటానికి తగిన ప్రదేశము. అక్కడ క్రూరమృగములకు, వికృతమైన ఆలోచనలకు తావు లేదు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నీవు నివాసము ఏర్పాటు చేసుకొని నీ వనవాసము పూర్తిచేయుము. లేని ఎడల, ఇక్కడే నా ఆశ్రమ ప్రాంతంలో ఒక కుటీరము నిర్మించుకొని ఇక్కడే ఉండి నీ వనవాస కాలము గడుపుము.” అని అన్నాడు భరద్వాజుడు.

ఇంతలో రాత్రి అయింది. ఆ రాత్రికి సీతారామలక్ష్మణులు భరద్వాజ ఆశ్రమములోనే గడిపారు. మరునాడు ఉదయము రాముడు భరద్వాజుని వద్దకుపోయి ఇలా అన్నాడు. “ఓ మునీంద్రా! నిన్న రాత్రి మాకు ఆశ్రయము ఇచ్చినందుకు కృతజ్ఞులము. మేము ఇక్కడి నుండి వెళ్లుటకు అనుమతి ఇవ్వండి.” అని ప్రార్థించాడు రాముడు.

“రామా! నీవు చిత్రకూటమునకు పొమ్ము. అక్కడ మీకు ఫలములు, తేనె, దుంపలు సమృద్ధిగా లభిస్తాయి. అక్కడి సెలయేళ్లలో మీకు స్వచ్ఛమైన నీళ్లు లభిస్తాయి. నీవు, సీత, విహరించడానికి ఎన్నో సుందర ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ మీరు సుఖంగా వనవాసము చేయవచ్చును. మీరు ఉండటానికి అదియే యుక్తమైన ప్రదేశము.” అని అన్నాడు భరద్వాజుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబది నాలుగవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచపంచాశః సర్గః (౫౫) >>

Ayodhya Kanda Sarga 49 In Telugu – అయోధ్యాకాండ ఏకోనపంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 49 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ ఏకోనపంచాశః సర్గ, “జానపదాక్రోశః”, రామాయణంలోని ఒక భావోద్వేగభరితమైన భాగం. ఈ సర్గలో, రాముడు వనవాసం కోసం బయలుదేరిన తర్వాత గ్రామస్తులు అతని లేమితో తీవ్ర దుఃఖంలో మునిగిపోతారు. రాముడి పట్ల వారి ప్రేమను, విశ్వాసాన్ని, మరియు అతడి లేమి వల్ల కలిగిన బాధను గ్రామస్తులు వ్యక్తం చేస్తారు. రాముడు తన ధర్మాన్ని, వినయాన్ని, మరియు ప్రజల పట్ల ఉన్న ప్రేమను గుర్తు చేసుకుంటూ వారు ఆవేదనతో విలపిస్తారు. ఈ సర్గ గ్రామస్తుల ఆక్రందన, రాముడి పట్ల వారి అభిమానం, మరియు అతని వాంఛను ప్రతిబింబిస్తుంది.

జానపదాక్రోశః

రామోఽపి రాత్రిశేషేణ తేనైవ మహదంతరమ్ |
జగామ పురుషవ్యాఘ్రః పితురాజ్ఞామనుస్మరన్ ||

1

తథైవ గచ్ఛతస్తస్య వ్యపాయాద్రజనీ శివా |
ఉపాస్య స శివాం సంధ్యాం విషయాంతం వ్యగాహత ||

2

గ్రామాన్వికృష్టసీమాన్తాన్పుష్పితాని వనాని చ |
పశ్యన్నతియయౌ శీఘ్రం శనైరివ హయోత్తమైః |
శృణ్వన్వాచో మనుష్యాణాం గ్రామసంవాసవాసినామ్ ||

3

[* విగర్హితాం హి కైకేయీం క్రూరాం క్రూరేణ కర్మణా | *]
రాజానం ధిగ్దశరథం కామస్య వశమాగతమ్ ||

4

హా నృశంసాఽద్య కైకేయీ పాపా పాపానుబంధినీ |
తీక్ష్ణా సంభిన్నమర్యాదా తీక్ష్ణకర్మణి వర్తతే ||

5

యా పుత్రమీదృశం రాజ్ఞః ప్రవాసయతి ధార్మికమ్ |
వనవాసే మహాప్రాజ్ఞం సానుక్రోశం జితేంద్రియమ్ ||

6

కథం నామ మహాభాగా సీతా జనకనందినీ |
సదా సుఖేష్వభిరతా దుఃఖాన్యనుభవిష్యతి ||

7

అహో దశరథో రాజా నిస్స్నేహః స్వసుతం ప్రియమ్ |
ప్రజానామనఘం రామం పరిత్యక్తుమిహేచ్ఛతి ||

8

ఏతా వాచో మనుష్యాణాం గ్రామసంవాసవాసినామ్ |
శృణ్వన్నతియయౌ వీరః కోసలాన్కోసలేశ్వరః ||

9

తతః వేదశ్రుతిం నామ శివవారివహాం నదీమ్ |
ఉత్తీర్యాభిముఖః ప్రాయాదగస్త్యాధ్యుషితాం దిశమ్ ||

10

గత్వా తు సుచిరం కాలం తతః శివజలాం నదీమ్ |
గోమతీం గోయుతానూపామతరత్సాగరంగమామ్ ||

11

గోమతీం చాప్యతిక్రమ్య రాఘవః శీఘ్రగైర్హయైః |
మయూరహంసాభిరుతాం తతార స్యందికాం నదీమ్ ||

12

స మహీం మనునా రాజ్ఞా దత్తామిక్ష్వాకవే పురా |
స్ఫీతాం రాష్ట్రావృతాం రామః వైదేహీమన్వదర్శయత్ ||

13

సూత ఇత్యేవ చాభాష్య సారథిం తమభీక్ష్ణశః |
హంసమత్తస్వరః శ్రీమానువాచ పురుషర్షభః ||

14

కదాఽహం పునరాగమ్య సరయ్వాః పుష్పితే వనే |
మృగయాం పర్యాటిష్యామి మాత్రా పిత్రా చ సంగతః ||

15

రాజర్షీణాం హి లోకేఽస్మిన్ రత్యర్థం మృగయా వనే |
కాలే కృతాం తాం మనుజైర్ధన్వినామభికాంక్షితామ్ ||

16

నాత్యర్థమభికాంక్షామి మృగయాం సరయూవనే |
రతిర్హ్యేషాఽతులా లోకే రాజర్షిగణసమ్మతా ||

17

స తమధ్వానమైక్ష్వాకః సూతం మధురయా గిరా |
తంతమర్థమభిప్రేత్య యయౌ వాక్యముదీరయన్ ||

18

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనపంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 49 Meaning In Telugu

తనతో వచ్చిన అయోధ్యావాసులు నిద్ర లేవకముందే లేచిన రాముడు తన ప్రయాణం కొనసాగించాడు. సూర్యోదయము అయేటప్పటికి చాలా దూరం వచ్చేసారు. రామ లక్ష్మణులు ప్రాతఃసంధ్యను పూర్తి చేసుకొని మరలా ప్రయాణం అయ్యారు. అనేక గ్రామాల గుండా ప్రయాణిస్తున్నారు. ఆ గ్రామ ప్రజలు రాముని వనవాసము గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

“ఆ దశరథుడు కామానికి వశుడై తన భార్య కైక మాటలు విని కన్నకుమారుని అడవులకు వెళ్లగొట్టాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి మాట కాదనలేక అడవులకు వెళ్లాడు ఏమి ఆశ్చర్యము. అయినా రాముడు అడవులకు వెళ్లాడు. ఆయనతో పాటు సీత ఎందుకు వెళ్లాలి? సుకుమారి అయిన సీత అడవులలో ఎలా ఉండగలదు? రామునితోపాటు సీత కూడా అన్ని కష్టాలు పడవలసిన దేనా! ఎంత దారుణము.” అని రక రకాలుగా అనుకుంటున్నారు.

వారి మాటలు వింటూ రాముడు అరణ్యముల వంక సాగుతున్నాడు. వారు వేదశ్రుతి అనే నదిని దాటారు. దక్షిణ దిక్కుగా ఉన్న అగస్త్య ఆశ్రమము వైపు ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తూ వారు గోమతీ నదీ తీరానికి చేరుకున్నారు. గోమతీ నదిని దాటిన తరువాత వారు స్యందికా నదిని చేరుకున్నారు. ఆ నదిని కూడా దాటి వారు పూర్వము మను చక్రవర్తి రాముని మూల పురుషుడైన ఇక్షాకువునకు ఇచ్చిన విశాలమైన భూములలోకి ప్రవేశించారు. ఆ భూమి నంతనూ రాముడు సీతకు చూపించి దాని గురించిన వృత్తాంతమును సీతకు వివరించాడు. సారవంతమైన ఆ భూముల గుండా వారు ప్రయాణం చేస్తున్నారు. అనేక వన్యప్రాణులతో నిండిన అడవులలో గుండా వారు వెళుతున్నారు. అప్పుడు సుమంత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు.

“సుమంత్రా! నేను వనవాసము ముగించుకొని తిరిగివచ్చి తల్లితండ్రుల దర్శనము చేసుకొని ఈ వనసీమలలో ఎప్పుడు తనివిదీరా వేటాడెదనో కదా! వేట క్షత్రియులకు ఉచితమే కానీ నాకు ఎందుకో సరయూనదీతీరములో ఉన్న ఈవనములలో వేటాడవలెనని కోరిక అంతగా లేదు. అసలు నాకు వేట మీద అంత మక్కువ లేదు. అరణ్యములలో వాటి మానాన అవి బతుకుతున్న అమాయకమైన ఆ ప్రాణులను, కేవలం మన ఆనందం కోసరం, వేట మిషతో చంపడం పాపం కదా! అందుకనే నాకు వేట మీద అంతగా కోరిక లేదు. కాని క్రూర మృగములు విజృంభించినపుడు వేటాడక తప్పదు.” అని వేట గురించి ముచ్చటించుకుంటూ రాముడు సుమంత్రుడు నడిపే రథం మీద ప్రయాణిస్తున్నాడు.

శ్రీమద్రామాయణము,
అయోధ్యాకాండము నలుబదితొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచాశః సర్గః (50) >>

Ayodhya Kanda Sarga 70 In Telugu – అయోధ్యాకాండ సప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 70

అయోధ్యాకాండ సప్తతితమః సర్గ రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో, భరతుడు తన తల్లి కైకేయి మీద ఆగ్రహంతో తన బాధను వ్యక్తం చేస్తాడు. భరతుడు రాముడు తప్ప మరెవ్వరూ రాజ్యం పాలించే అర్హత కలిగినవారు కాదని కైకేయికి చెప్పుతాడు. భరతుడు రాముని అన్వేషణ కోసం, ఆయనను తిరిగి తీసుకురావడానికి నిర్ణయించుకుంటాడు. దశరథ మహారాజు మరణం, రాముని వనవాసం కారణంగా అయోధ్య నగరం విషాదంలో మునిగిపోతుంది. భరతుడు రాముని తిరిగి తీసుకురావడానికి పండితులతో, మంత్రులతో కలిసి వనానికి బయలుదేరుతాడు. ఈ సర్గ భరతుని ధర్మపాలన, రాముని పట్ల అతని భక్తి, కుటుంబ బాంధవ్యాలను ప్రధానంగా ప్రతిబింబిస్తుంది.

భరతప్రస్థానమ్

భరతే బ్రువతి స్వప్నం దూతాస్తే క్లాంతవాహనాః |
ప్రవిశ్యాసహ్య పరిఖం రమ్యం రాజ గృహం పురమ్ || ౧ ||

సమాగమ్య తు రాజ్ఞా చ రాజపుత్రేణ చార్చితాః |
రాజ్ఞః పాదౌ గృహీత్వా తు తమూచుర్భరతం వచః || ౨ ||

పురోహితస్త్వాం కుశలం ప్రాహ సర్వే చ మంత్రిణః |
త్వరమాణశ్చ నిర్యాహి కృత్యమాత్యయికం త్వయా || ౩ ||

ఇమాని చ మహార్హాణి వస్త్రాణ్యాభరణాని చ |
ప్రతిగృహ్య విశాలాక్ష మాతులస్య చ దాపయ || ౪ ||

అత్ర వింశతికోట్యస్తు నృపతేర్మాతులస్య తే |
దశకోట్యస్తు సంపూర్ణాస్తథైవ చ నృపాత్మజ || ౫ ||

ప్రతిగృహ్య చ తత్సర్వం స్వనురక్తః సుహృజ్జనే |
దూతానువాచ భరతః కామైః సంప్రతిపూజ్య తాన్ || ౬ ||

కచ్చిత్ సుకుశలీ రాజా పితా దశరథో మమ |
కచ్చిచ్చారోగతా రామే లక్ష్మణే చ మహాత్మని || ౭ ||

ఆర్యా చ ధర్మనిరతా ధర్మజ్ఞా ధర్మదర్శినీ |
అరోగా చాపి కౌసల్యా మాతా రామస్య ధీమతః || ౮ ||

కచ్చిత్ సుమిత్రా ధర్మజ్ఞా జననీ లక్ష్మణస్య యా |
శత్రుఘ్నస్య చ వీరస్య సాఽరోగా చాపి మధ్యమా || ౯ ||

ఆత్మకామా సదా చండీ క్రోధనా ప్రాజ్ఞ మానినీ |
అరోగా చాపి మే మాతా కైకేయీ కిమువాచ హ || ౧౦ ||

ఏవముక్తాస్తు తే దూతాః భరతేన మహాత్మనా |
ఊచుః సంప్రశ్రయం వాక్యమిదం తం భరతం తదా || ౧౧ ||

కుశలాస్తే నరవ్యాఘ్ర యేషాం కుశలమిచ్ఛసి |
శ్రీశ్చ త్వాం వృణుతే పద్మా యుజ్యతాం చాపి తే రథః || ౧౨ ||

భరతశ్చాపి తాన్ దూతాన్ ఏవముక్తోఽభ్యభాషత |
ఆపృచ్చేఽహం మహారాజం దూతాః సంత్వరయంతి మామ్ || ౧౩ ||

ఏవముక్త్వా తు తాన్ దూతాన్ భరతః పార్థివాత్మజః |
దూతైః సంచోదితః వాక్యం మాతామహమువాచ హ || ౧౪ ||

రాజన్ పితుర్గమిష్యామి సకాశం దూతచోదితః |
పునరప్యహమేష్యామి యదా మే త్వం స్మరిష్యసి || ౧౫ ||

భరతేనైవముక్తస్తు నృపో మాతామహస్తదా |
తమువాచ శుభం వాక్యం శిరస్యాఘ్రాయ రాఘవమ్ || ౧౬ ||

గచ్ఛ తాతానుజానే త్వాం కైకేయీసుప్రజాస్త్వయా |
మాతరం కుశలం బ్రూయాః పితరం చ పరంతప || ౧౭ ||

పురోహితం చ కుశలం యే చాన్యే ద్విజ సత్తమాః |
తౌ చ తాత మహేష్వాసౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ || ౧౮ ||

తస్మై హస్త్యుత్తమాంశ్చిత్రాన్ కంబలానజినాని చ |
అభిసత్కృత్య కైకేయో భరతాయ ధనం దదౌ || ౧౯ ||

రుక్మనిష్కసహస్రే ద్వే షోడశాశ్వశతాని చ |
సత్కృత్య కైకేయీపుత్రం కేకయో ధనమాదిశత్ || ౨౦ ||

తథాఽమాత్యానభిప్రేతాన్ విశ్వాస్యాంశ్చ గుణాన్వితాన్ |
దదావశ్వపతిః క్షిప్రం భరతాయానుయాయినః || ౨౧ ||

ఐరావతానైంద్రశిరాన్ నాగాన్వై ప్రియదర్శనాన్ |
ఖరాన్ శీఘ్రాన్ సుసంయుక్తాన్ మాతులోఽస్మై ధనం దదౌ || ౨౨ ||

అంతఃపురేఽతి సంవృద్ధాన్ వ్యాఘ్రవీర్యబలాన్వితాన్ |
దంష్ట్రాఽఽయుధాన్ మహాకాయాన్ శునశ్చోపాయనం దదౌ || ౨౩ ||

స దతం కేకయేంద్రేణ ధనం తన్నాభ్యనందత |
భరతః కైకయీపుత్రః గమనత్వరయా తదా || ౨౪ ||

బభూవ హ్యస్య హృదతే చింతా సుమహతీ తదా |
త్వరయా చాపి దూతానాం స్వప్నస్యాపి చ దర్శనాత్ || ౨౫ ||

స స్వవేశ్మాభ్యతిక్రమ్య నరనాగశ్వసంవృతమ్ |
ప్రపేదే సుమహచ్ఛ్రీమాన్ రాజమార్గమనుత్తమమ్ || ౨౬ ||

అభ్యతీత్య తతోఽపశ్యదంతః పురముదారధీః |
తతస్తద్భరతః శ్రీమానావివేశానివారితః || ౨౭ ||

స మాతా మహమాపృచ్ఛ్య మాతులం చ యుధాజితమ్ |
రథమారుహ్య భరతః శత్రుఘ్నసహితో యయౌ || ౨౮ ||

రథాన్ మండల చక్రాంశ్చ యోజయిత్వా పరః శతమ్ |
ఉష్ట్ర గోఽశ్వఖరైః భృత్యా భరతం యాంతమన్వయుః || ౨౯ ||

బలేన గుప్తః భరతః మహాత్మా
సహార్యకస్యాఽత్మ సమైరమాత్యైః |
ఆదాయ శత్రుఘ్నమపేతశత్రుః
గృహాత్ యయౌ సిద్ధైవేంద్రలోకాత్ || ౩౦ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తతితమః సర్గః || ౭౦ ||

Ayodhya Kanda Sarga 70 Meaning In Telugu

భరతుడు తనకు వచ్చిన కల గురించి తనస్నేహితునికి చెబుతున్న సమయంలో అయోధ్యనుండి వచ్చిన దూతలు భరతుని వద్దకు వచ్చారు. కేకయ రాజును కలుసుకున్నారు. కేకయ రాజు కుమారుడు యుధామన్యుని కలుసుకున్నారు. అయోధ్యనుండి తెచ్చిన కానుకలు వారికి సమర్పించారు. కేకయ రాజు అనుమతితో భరతునితో ఇలా అన్నారు.

“రాజకుమారా! తమ కులగురువు వసిష్ఠుడు, తక్కిన గురువులు తమరి కుశలము అడగమని చెప్పారు. వసిష్ఠుల వారికి నీతో అత్యవసరంగా చర్చించవలసిన అవసరము ఉన్నదట. అందుకని తమరిని వెంటనే అయోధ్యకు బయలుదేరి రమ్మని చెప్పారు. అ దూతలు వసిష్ఠుడు చెప్పినట్టు చెప్పారు.

భరతుడు ఆ దూతలకు కానుకలు ఇచ్చి సత్కరించాడు. “దూతలారా! నా తండ్రి దశరథుడు క్షేమంగా ఉన్నాడా. నా అన్న రాముడు, లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారా! రాముని తల్లి కౌసల్య ఆరోగ్యంగా ఉన్నదా! లక్ష్మణ, శత్రుఘ్నుల తల్లి సుమిత్రాదేవి క్షేమంగా ఉన్నదా! స్వాతిశయము కలదీ, ఎల్లప్పుడూ తన సుఖము మాత్రమే చూచుకొనేదీ, కోపస్వభావము కలదీ, గర్విష్టీ అయిన మా తల్లి కైక క్షేమంగా ఉన్నదా! మా అమ్మ నాతో చెప్పమని ఏమైనా సమాచారము పంపినదా! ” అని ఆతురతగా అడిగాడు భరతుడు.

ఆ మాటలకు దూతలు ఇలా బదులు చెప్పారు. “రాకుమారా! నీవు ఎవరెవరినీ అయితే అడిగావో వారందరూ క్షేమంగా ఉన్నారు. నిన్ను లక్ష్మీదేవి వరించినది. (నిన్ను రాజ్యలక్ష్మి వరించినది. అయోధ్యకు రాజు కాబోతున్నావు అని నర్మగర్భంగా చెప్పారు). తమరు మాత్రం వెంటనే అయోధ్యకు బయలుదేరండి.” అని అన్నారు. దూతలు తొందర పెట్టడం చూచిన భరతుడు తన మేనమామ, తాతగారికి నమస్కరించి వారితో ఇలా అన్నాడు.

“మహారాజా! అయోధ్యనుండి నన్నుతీసుకొని పోవుటకు దూతలు వచ్చారు. మా కులగురువు వసిష్టులవారు నన్ను వెంటనే రమ్మన్నారట. అందుకని నాకు అనుమతి ఇస్తే నేను, శత్రుఘ్నుడు అయోధ్యకు వెళతాము. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాము.” అనికేకయ రాజు అనుమతి కోరాడు భరతుడు. కేకయ రాజు సంతోషంగా అనుమతించాడు. “నాయనా! భరతా! నీ తండ్రి దశరథుని, నీ తల్లి కైక క్షేమము అడిగినట్టు చెప్పు. పురోహితులు వసిష్ఠునికి, బ్రాహ్మణులకు నా నమస్కారములు తెలియచెయ్యి. నీసోదరులు రామ లక్ష్మణులకు నా ఆశీర్వచనములు తెలియచెయ్యి.” అని పలికాడు.

తరువాత కేకయ రాజు అనేక విలువైన వస్తువులను కానుకలను అయోధ్యకు పంపాడు. భరత శత్రుఘ్నులకు కూడా విలువైన కానుకలు ఇచ్చాడు. మార్గములో సహాయానికి విశ్వాసము గల సైనికులను పంపాడు. భరతునికి తనకు వచ్చిన స్వప్నము, ఇప్పుడు దూతలు తొందర పెట్టడం చూచి ఏదో కీడు శంకిస్తున్నాడు. అందుకని తాతగారు, మేనమామ ఇచ్చిన కానుకలు అతనికి సంతోషము కలిగించడం లేదు. భరత శత్రుఘ్నులు రథంఎక్కారు. వారు ఎక్కిన రథము అయోధ్యకు బయలుదేరింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బదియవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకసప్తతితమః సర్గః (71) >>

Balakanda Sarga 69 In Telugu – బాలకాండ ఏకోనసప్తతితమః సర్గః

Balakanda Sarga 69 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనసప్తతితమః సర్గలో, దశరథుడు మిథిలాకు వస్తాడు మరియు జనకుడు ఇక్ష్వాకులు అని పిలువబడే పట్టాభిషేక వంశానికి చెందినవాడు కాబట్టి అతన్ని గౌరవప్రదంగా స్వీకరిస్తాడు. అప్పుడు, రాజభోగాలు మరియు ప్రోటోకాల్ యొక్క సాధారణ మార్పిడి తర్వాత, వారందరూ హాయిగా మిథిలాలో ఉంటారు.

దశరథజనకసమాగమః

తతో రాత్ర్యాం వ్యతీతాయాం సోపాధ్యాయః సబాంధవః |
రాజా దశరథో హృష్టః సుమంత్రమిదమబ్రవీత్ ||

1

అద్య సర్వే ధనాధ్యక్షా ధనమాదాయ పుష్కలమ్ |
వ్రజంత్వగ్రే సువిహితా నానారత్నసమన్వితాః ||

2

చతురంగబలం సర్వం శీఘ్రం నిర్యాతు సర్వశః |
మమాజ్ఞాసమకాలం చ యానయుగ్మమనుత్తమమ్ ||

3

వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః |
మార్కండేయః సుదీర్ఘాయురృషిః కాత్యాయనస్తథా ||

4

ఏతే ద్విజాః ప్రయాంత్వగ్రే స్యందనం యోజయస్వ మే |
యథా కాలాత్యయో న స్యాద్దూతా హి త్వరయంతి మామ్ ||

5

వచనాత్తు నరేంద్రస్య సా సేనా చతురంగిణీ |
రాజానమృషిభిః సార్ధం వ్రజంతం పృష్ఠతోఽన్వగాత్ ||

6

గత్వా చతురహం మార్గం విదేహానభ్యుపేయివాన్ |
రాజా తు జనకః శ్రీమాన్ శ్రుత్వా పూజామకల్పయత్ ||

7

తతో రాజానమాసాద్య వృద్ధం దశరథం నృపమ్ |
జనకో ముదితో రాజా హర్షం చ పరమం యయౌ ||

8

ఉవాచ చ నరశ్రేష్ఠో నరశ్రేష్ఠం ముదాన్వితః |
స్వాగతం తే మహారాజ దిష్ట్యా ప్రాప్తోఽసి రాఘవ ||

9

పుత్రయోరుభయోః ప్రీతిం లప్స్యసే వీర్యనిర్జితామ్ |
దిష్ట్యా ప్రాప్తో మహాతేజా వసిష్ఠో భగవానృషిః ||

10

సహ సర్వైర్ద్విజశ్రేష్ఠైర్దేవైరివ శతక్రతుః |
దిష్ట్యా మే నిర్జితా విఘ్నా దిష్ట్యా మే పూజితం కులమ్ ||

11

రాఘవైః సహ సంబంధాద్వీర్యశ్రేష్ఠైర్మహాత్మభిః |
శ్వః ప్రభాతే నరేంద్ర త్వం నిర్వర్తయితుమర్హసి ||

12

యజ్ఞస్యాంతే నరశ్రేష్ఠ వివాహమృషిసమ్మతమ్ |
తస్య తద్వచనం శ్రుత్వా ఋషిమధ్యే నరాధిపః ||

13

వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠః ప్రత్యువాచ మహీపతిమ్ |
ప్రతిగ్రహో దాతృవశః శ్రుతమేతన్మయా పురా ||

14

యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయమ్ |
ధర్మిష్ఠం చ యశస్యం చ వచనం సత్యవాదినః ||

15

శ్రుత్వా విదేహాధిపతిః పరం విస్మయమాగతః |
తతః సర్వే మునిగణాః పరస్పరసమాగమే ||

16

హర్షేణ మహతా యుక్తాస్తాం నిశామవసన్సుఖమ్ |
[* అధికపాఠః –
అథ రామో మహాతేజా లక్ష్మణేన సమం యయౌ |
విశ్వామిత్రం పురస్కృత్య పితుః పాదావుపస్పృశన్ |
*]
రాజా చ రాఘవౌ పుత్రౌ నిశామ్య పరిహర్షితః ||

17

ఉవాస పరమప్రీతో జనకేనాభిపూజితః |
జనకోఽపి మహాతేజాః క్రియాం ధర్మేణ తత్త్వవిత్ |
యజ్ఞస్య చ సుతాభ్యాం చ కృత్వా రాత్రిమువాస హ ||

18

Balakanda Sarga 69 In Telugu Pdf With Meaning

రాత్రి గడిచి తెల్లవారింది. దశరథుడు తెల్లరాజుజామున లేచి కాలకృత్యములు సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకొని తన మంత్రి సుమంతుని పిలిపించాడు.

“సుమంతా! రాముని వివాహమునకు మనకు మిథిలకు వెళు తున్నాము. ముందు ధనరాసులు, రత్నములు, ఆభరణములతో కొంతమంది వెళ్లాలి. తరువాత మా వెంట చతురంగ బలములు బయలుదేరాలి. మన పురోహితులు వసిష్ఠుడు, వామదేవుడు, మహాఋషులు జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, కాత్యాయనుడు కూడా వస్తున్నారు. వారి ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి. ఆలస్యము చేయవద్దు.” అని ఆదేశాలు ఇచ్చాడు.

సుమంతుడు దశరథుని ప్రయాణానికి తగు ఏర్పాట్లు చేసాడు. నాలుగు రోజుల ప్రయాణము తరువాత అందరూ మిథిలకు చేరుకున్నారు. జనకుడు వారిని తగు మర్యాదలతో ఆహ్యానించాడు. అతిథి సత్కారములు, విడిది ఏర్పాట్లు చేసాడు. దశరథ మహారాజును కలుసుకొని జనకుడు ఇలా అన్నాడు.

“ఓ దశరథమహారాజా! తమరికి మిథిలాధిపతి జనకుడు స్వాగతము పలుకుతున్నాడు. తమరి రాకతో మా మిథిలా నగరము పావనముఅయింది. తమరి కుమారుల పరాక్రమము అనుపమానము, అద్వితీయము. మా భాగ్యము కొద్దీ వసిష్ఠ మహర్షి మా నగరమునకు వచ్చారు. మాకు ఎంతో ఆనందముగా ఉంది.

ఓ దశరథమహారజా! మా భాగ్య వశమున రఘువంశ రాజులతో వియ్యమందడంతో అన్ని విఘ్నములు తొలగిపోయాయి. మా కులము పావనమయింది. రేపు నేను తలపెట్టిన యజ్ఞము పూర్తి అయిన తరువాత వివాహ మహోత్సవ కార్యక్రమము జరుపుటకు అనుమతిని ఇవ్వండి.” అని అన్నాడు జనకుడు.

అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు. “ఓ జనకమహారాజా! తమరు కన్యాదాతలు. తమరు కన్యాదానం చేస్తేనే కదా మేము కన్యను స్వీకరించేది. కాబట్టి కన్యాదాన ముహూర్త నిర్ణయము మీది. తమరు ఎలా చెపుతారో అలాగే చేస్తాము.” అని అన్నాడు దశరథుడు.

ఆ మాటలకు జనకుడు ఎంతో సంతోషించాడు. ఆ రాత్రికి దశరధుడు, ఆయన వెంట వచ్చిన మునులు, పురోహితులు, పరివారము మిథిలానగరములో సుఖంగా గడిపారు. దశరథుడు విశ్వామిత్రుని వద్ద ఉన్న రామలక్ష్మణులను చూచి ఎంతో
ఆనందించాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరువదితొమ్మిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ సప్తతితమః సర్గః (70) >>

Ayodhya Kanda Sarga 48 In Telugu – అయోధ్యాకాండ అష్టచత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 48 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ అష్టచత్వారింశః సర్గ, “పౌరాంగనావిలాపః”, రామాయణంలోని ఒక భావోద్వేగభరితమైన భాగం. ఈ సర్గలో, రాముడు వనవాసానికి వెళ్లిన తరువాత అయోధ్యలోని మహిళలు తీవ్ర విషాదంలో మునిగిపోతారు. రాముడి ప్రస్థానం వాళ్ళు అనుభవించిన వియోగాన్ని, దుఃఖాన్ని ఈ సర్గలో విపులంగా వర్ణించబడింది. రాముడి వినయం, ధర్మం, మరియు ప్రజల పట్ల అతని ప్రేమను గుర్తుచేసుకుంటూ మహిళలు ఆవేదనతో విలపిస్తారు. ఈ సర్గలో, మహిళల ఆక్రందన, రాముడి పట్ల వారి అభిమానం, మరియు వియోగం వలన కలిగిన బాధ హృదయానికి హత్తుకునేలా చూపబడుతుంది.

పౌరాంగనావిలాపః

తేషామేవం విషణ్ణానాం పీడితానామతీవ చ |
బాష్పవిప్లుతనేత్రాణాం సశోకానాం ముమూర్షయా ||

1

అనుగమ్య నివృత్తానాం రామం నగరవాసినామ్ |
ఉద్గతానీవ సత్త్వాని బభూవురమనస్వినామ్ ||

 2

స్వం స్వం నిలయమాగమ్య పుత్రదారైః సమావృతాః |
అశ్రూణి ముముచుః సర్వే బాష్పేణ పిహితాననాః ||

3

న చాహృష్యన్న చామోదన్వణిజో న ప్రసారయన్ |
న చాశోభంత పణ్యాని నాపచన్గృహమేధినః ||

4

నష్టం దృష్ట్వా నాభ్యనందన్విపులం వా ధనాగమమ్ |
పుత్రం ప్రథమజం లబ్ధ్వా జననీ నాభ్యనందత ||

5

గృహే గృహే రుదంత్యశ్చ భర్తారం గృహమాగతమ్ |
వ్యగర్హయంత దుఃఖార్తాః వాగ్భిస్తోత్రైరివ ద్విపాన్ ||

6

కిం ను తేషాం గృహైః కార్యం కిం దారైః కిం ధనేన వా |
పుత్రైర్వా కిం సుఖైర్వాఽపి యే న పశ్యంతి రాఘవమ్ ||

7

ఏకః సత్పురుషో లోకే లక్ష్మణః సహ సీతయా |
యోఽనుగచ్ఛతి కాకుత్స్థం రామం పరిచరన్వనే ||

8

ఆపగాః కృతపుణ్యాస్తాః పద్మిన్యశ్చ సరాంసి చ |
యేషు స్నాస్యతి కాకుత్స్థో విగాహ్య సలిలం శుచి ||

9

శోభయిష్యంతి కాకుత్స్థమటవ్యో రమ్యకాననాః |
ఆపగాశ్చ మహానూపాః సానుమంతశ్చ పర్వతాః ||

10

కాననం వాఽపి శైలం వా యం రామోఽభిగమిష్యతి |
ప్రియాతిథిమివ ప్రాప్తం నైనం శక్ష్యంత్యనర్చితుమ్ ||

11

విచిత్రకుసుమాపీడాః బహుమంజరిధారిణః |
రాఘవం దర్శయిష్యంతి నగా భ్రమరశాలినః ||

12

అకాలే చాఽపి ముఖ్యాని పుష్పాణి చ ఫలాని చ |
దర్శయిష్యంత్యనుక్రోశాద్గిరయో రామమాగతమ్ ||

13

ప్రస్రవిష్యంతి తోయాని విమలాని మహీధరాః |
విదర్శయంతః వివిధాన్భూయశ్చిత్రాంశ్చ నిర్ఝరాన్ ||

14

పాదపాః పర్వతాగ్రేషు రమయిష్యంతి రాఘవమ్ |
యత్ర రామో భయం నాత్ర నాస్తి తత్ర పరాభవః ||

15

స హి శూరో మహాబాహుః పుత్రో దశరథస్య చ |
పురా భవతి నో దూరాదనుగచ్ఛామ రాఘవమ్ ||

16

పాదచ్ఛాయా సుఖా భర్తుస్తాదృస్య మహాత్మనః |
స హి నాథో జనస్యాస్య స గతిః స పరాయణమ్ ||

17

వయం పరిచరిష్యామః సీతాం యూయం తు రాఘవమ్ |
ఇతి పౌరస్త్రియో భర్తృన్దుఃఖార్తాస్తత్తదబ్రువన్ ||

18

యుష్మాకం రాఘవోఽరణ్యే యోగక్షేమం విధాస్యతి |
సీతా నారీజనస్యాస్య యోగక్షేమం కరిష్యతి ||

19

కో న్వనేనాప్రతీతేన సోత్కంఠితజనేన చ |
సంప్రీయేతామనోజ్ఞేన వాసేన హృతచేతసా ||

20

కైకేయ్యా యది చేద్రాజ్యం స్యాదధర్మ్యమనాథవత్ |
న హి నో జీవితేనార్థః కుతః పుత్రైః కుతో ధనైః ||

21

యయా పుత్రశ్చ భర్తా చ త్యక్తావైశ్వర్యకారణాత్ |
కం సా పరిహరేదన్యం కైకేయీ కులపాంసనీ ||

22

కైకేయ్యా న వయం రాజ్యే భృతకా నివసేమహి |
జీవంత్యా జాతు జీవంత్యః పుత్రైరపి శపామహే ||

23

యా పుత్రం పార్థివేంద్రస్య ప్రవాసయతి నిర్ఘృణా |
కస్తాం ప్రాప్య సుఖం జీవేదధర్మ్యాం దుష్టచారిణీమ్ ||

24

ఉపద్రుతమిదం సర్వమనాలంబమనాయకమ్ |
కైకేయ్యా హి కృతే సర్వం వినాశముపయాస్యతి ||

25

న హి ప్రవ్రజితే రామే జీవిష్యతి మహీపతిః |
మృతే దశరథే వ్యక్తం విలోపస్తదనంతరమ్ ||

26

తే విషం పిబతాలోడ్య క్షీణపుణ్యాః సుదుర్గతాః |
రాఘవం వాఽనుగచ్ఛధ్వమశ్రుతిం వాఽపి గచ్ఛత ||

27

మిథ్యా ప్రవ్రాజితః రామః సభార్యః సహలక్ష్మణః |
భరతే సన్నిసృష్టాః స్మః సౌనికే పశవో యథా ||

28

పూర్ణచంద్రాననః శ్యామో గూఢజత్రురరిందమః |
ఆజానుబాహుః పద్మాక్షో రామో లక్ష్మణపూర్వజః ||

29

పూర్వాభిభాషీ మధురః సత్యవాదీ మహాబలః |
సౌమ్యశ్చ సర్వలోకస్య చంద్రవత్ప్రియదర్శనః ||

30

నూనం పురుషశార్దూలో మత్తమాతంగవిక్రమః |
శోభయుశ్యత్యరణ్యాని విచరన్స మహారథః ||

31

తాస్తథా విలపంత్యస్తు నగరే నాగరస్త్రియః |
చుక్రుశుర్దుఃఖసంతప్తా మృత్యోరివ భయాగమే ||

32

ఇత్యేవం విలపంతీనాం స్త్రీణాం వేశ్మసు రాఘవమ్ |
జగామాస్తం దినకరో రజనీ చాభ్యవర్తత ||

33

నష్టజ్వలనసంపాతా ప్రశాంతాధ్యాయసత్కథా |
తిమిరేణాభిలిప్తేవ సా తదా నగరీ బభౌ ||

34

ఉపశాంతవణిక్పణ్యా నష్టహర్షా నిరాశ్రయా |
అయోధ్యా నగరీ చాసీన్నష్టతారమివాంబరమ్ ||

35

తథా స్త్రియో రామనిమిత్తమాతురాః
యథా సుతే భ్రాతరి వా వివాసితే |
విలప్య దీనా రురుదుర్విచేతసః
సుతైర్హి తాసామధికో హి సోఽభవత్ ||

36

ప్రశాంతగీతోత్సవనృత్తవాదనా
వ్యపాస్తహర్షా పిహితాపణోదయా |
తదా హ్యయోధ్యా నగరీ బభూవ సా
మహార్ణవః సంక్షపితోదకో యథా ||

37

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టచత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 48 Meaning In Telugu

రామునితో వెళ్లిన పౌరులు తిరిగి రావడం చూచారు అయోధ్యపుర స్త్రీలు. వారు రాముని తిరిగి తీసుకొని వస్తారు అని ఎంతో ఆశతో ఉన్నారు. వారి ఆశలు అన్నీ నిరాశలు అయ్యాయి. రాముని అడవిలో వదిలి ఇళ్లు చేరిన పౌరులు తమ తమ భార్యా పుత్రులకు తమ ముఖములు చూపించలేక పోయారు. అయోధ్యలో ఎవరూ తమ తమ ఇళ్లలో వంటచేసుకోలేదు. దేవాలయములలో పూజలు జరగలేదు. వర్తకవాణిజ్యములు మూతబడ్డాయి.

రాముడు అడవులకు పోయినందుకు ప్రతి ఇంటిలోనూ దు:ఖము శోకము తాండిస్తూ ఉంది. రాముని లేని అయోధ్యలో తమకు సుఖసంతోషాలు ఎక్కడివని అందరూ అనుకుంటున్నారు. ఈ లోకంలో ఎవరన్నా పుణ్యము చేసుకున్న వాడు ఉన్నాడు అంటే అతడు లక్ష్మణుడే. ఎందుకంటే అతడు ఒక్కడే రాముడి వెంట అరణ్యములకు వెళ్లాడు. రామునికి సేవచేస్తున్నాడు. ఇది వారందరి నిశ్చితాభిప్రాయము. రామునికి అనునిత్యమూ ఫలములను ఇస్తూ సేవ చేసే వృక్షములు తమ కన్నా ఎంతో మేలు అని అనుకొన్నారు. సీతారాములకు ఆనందం కలిగించే వివిధరకములైన పూలు తమకన్నా ఎంత పుణ్యం చేసు కున్నాయి అని అనుకొన్నారు.

కొండల మీదినుండి పర్వతముల మీది నుండి జలజలపారే సెల ఏళ్లు రామునికి స్నానమునకు కావలసిన నీటిని సమకూరు స్తున్నాయి. ఇవి తమ కన్నా ఎంతో మేలైనవి అని అనుకొన్నారు. తాము అయోధ్యలో ఉన్నా సుఖపడలేమని, రాముని తో పాటు అరణ్యములలో ఉంటేనే తాము సుఖసంతోషాలతో ఉండగల మని అనుకొన్నారు. అయోధ్యావాసము తమకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదని వారి నిశ్చితాభిప్రాయము.

ప్రస్తుతము అయోధ్యకు రాణి కైక. దశరథుడు నామమాత్రపు రాజు. రాజ్యము కొరకు రాముని, తనభర్తను వదిలి వేసిన కైక ఇంక ఎవరిని లక్ష్యపెడుతుంది. కైక రాజ్యములో ఆమెకు సేవకులుగా ఎంతమాత్రము ఉండజాలము అని అందరూ అనుకున్నారు. రాముని అడవికి పంపిన దుర్మార్గురాలు. ఆమె పాలనలో ఎవరు సుఖపడతారు. సుఖంగా జరుగుతున్న అయోధ్య పాలన, కైక వలన అస్తవ్యస్తము అయింది. సర్వనాశనము అయింది.

రాముడు అరణ్యములకు వెళ్లాడు, రాముని చూడనిదో దశరథుడు జీవించలేడు. దశరథుని మరుణానంతరము అయోధ్యలో సుఖము, సంతోషము కరువవుతాయి. అంతా శోకమయం అవుతుంది. అయోధ్యా వాసుల పుణ్యము అంతరించింది. అందుకే రాముడు మనలను విడిచి వెళ్లిపోయాడు. ఇప్పుడు రాముడు వెంట అడవులకు వెళ్లడమో లేక విషంతాగి చావడమో రెండే మార్గాలు అయోధ్యా వాసులకు మిగిలి ఉన్నాయి. అంతేగాని భరతుని పాలనలో బతకడం అసాధ్యము. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు వెన్నెల
ఉంటాయి.”

ఈ ప్రకారంగా అయోధ్యలో ఉన్న స్త్రీపురుషులు ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు. ఇంతలో సూర్యాస్తమయము అయింది. చీకట్లు అలుముకుంటున్నాయి. నగరంలో జనసంచారము తగ్గిపోయింది. ఆరోజు అయోధ్యలో ఉన్న ప్రజలు తమ తమ కుమారు లను, సోదరులను పోగొట్టుకున్నట్టు శోకసముద్రంలో మునిగి పోయారు. అయోధ్యలో ఎటువంటి వినోదకార్యక్రమములు, ఉత్సవములు జరగడం లేదు. అయోధ్యలో ఆనందమే కరువైపోయింది. చంద్రుడి లేని ఆకాశమువలె నీరులేని సముద్రము వలె రాముడు లేని అయోధ్య అనాధ అయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకోనపంచాశః సర్గః (49) >>