Ayodhya Kanda Sarga 6 In Telugu – అయోధ్యాకాండ షష్ఠః సర్గః

Ayodhya Kanda Sarga 6 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. షష్ఠః సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో పాటు ఆయోధ్యలో ఉన్న సందర్భాలపై దృష్టి సారిస్తాడు. ఈ సర్గ రాముని వైయక్తిక జీవితం, కుటుంబ బంధాలు మరియు ఆయోధ్యలోని ప్రజల అనురాగం పై కేంద్రీకృతమై ఉంది. రాముడు తన పితృ వాక్య పరిపాలనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో, తండ్రి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం సకల కష్టాలను ఎలా స్వీకరించాడో ఈ సర్గలో వివరించబడుతుంది.

పౌరోత్సేకః

గతే పురోహితే రామః స్నాతో నియతమానసః |
సహ పత్న్యా విశాలాక్ష్యా నారాయణముపాగమత్ ||

1

ప్రగృహ్య శిరసా పాత్రీం హవిషో విధివత్తదా |
మహతే దైవతాయాజ్యం జుహావ జ్వలితేఽనలే ||

2

శేషం చ హవిషస్తస్య ప్రాశ్యాశాస్యాత్మనః ప్రియమ్ |
ధ్యాయన్నారాయణం దేవం స్వాస్తీర్ణే కుశసంస్తరే ||

3

వాగ్యతః సహ వైదేహ్యా భూత్వా నియతమానసః |
శ్రీమత్యాయతనే విష్ణోః శిశ్యే నరవరాత్మజః ||

4

ఏకయామావశిష్టాయాం రాత్ర్యాం ప్రతివిబుధ్య సః |
అలంకారవిధిం కృత్స్నం కారయామాస వేశ్మనః ||

5

తత్ర శృణ్వన్సుఖా వాచః సూతమాగధవందినామ్ |
పూర్వాం సంధ్యాముపాసీనో జజాప యతమానసః ||

6

తుష్టావ ప్రణతశ్చైవ శిరసా మధుసూదనమ్ |
విమలక్షౌమసంవీతో వాచయామాస చ ద్విజాన్ ||

7

తేషాం పుణ్యాహఘోషోఽథ గంభీరమధురస్తదా |
అయోధ్యాం పూరయామాస తూర్యఘోషానునాదితః ||

8

కృతోపవాసం తు తదా వైదేహ్యా సహ రాఘవమ్ |
అయోధ్యానిలయః శ్రుత్వా సర్వః ప్రముదితో జనః ||

9

తతః పౌరజనః సర్వః శ్రుత్వా రామాభిషేచనమ్ |
ప్రభాతాం రజనీం దృష్ట్వా చక్రే శోభయితుం పురీమ్ ||

10

సితాభ్రశిఖరాభేషు దేవతాయతనేషు చ |
చతుష్పథేషు రథ్యాసు చైత్యేష్వట్టాలకేషు చ ||

11

నానాపణ్యసమృద్ధేషు వణిజామాపణేషు చ |
కుటుంబినాం సమృద్ధేషు శ్రీమత్సు భవనేషు చ ||

12

సభాసు చైవ సర్వాసు వృక్షేష్వాలక్షితేషు చ |
ధ్వజాః సముచ్ఛ్రితాశ్చిత్రాః పతాకాశ్చాభవంస్తదా ||

13

నటనర్తకసంఘానాం గాయకానాం చ గాయతామ్ |
మనఃకర్ణసుఖా వాచః శుశ్రువుశ్చ తతస్తతః ||

14

రామాభిషేకయుక్తాశ్చ కథాశ్చక్రుర్మిథో జనాః |
రామాభిషేకే సంప్రాప్తే చత్వరేషు గృహేషు చ ||

15

బాలా అపి క్రీడమానాః గృహద్వారేషు సంఘశః |
రామాభిషేకసంయుక్తాశ్చక్రురేవ మిథః కథాః ||

16

కృతపుష్పోపహారశ్చ ధూపగంధాధివాసితః |
రాజమార్గః కృతః శ్రీమాన్పౌరై రామాభిషేచనే ||

17

ప్రకాశీకరణార్థం చ నిశాగమనశంకయా |
దీపవృక్షాంస్తథా చక్రురనురథ్యాసు సర్వశః ||

18

అలంకారం పురస్యైవం కృత్వా తత్పురవాసినః |
ఆకాంక్షమాణా రామస్య యౌవరాజ్యాభిషేచనమ్ ||

19

సమేత్య సంఘశః సర్వే చత్వరేషు సభాసు చ |
కథయంతో మిథస్తత్ర ప్రశశంసుర్జనాధిపమ్ ||

20

అహో మహాత్మా రాజాయమిక్ష్వాకుకులనందనః |
జ్ఞాత్వా యో వృద్ధమాత్మానం రామం రాజ్యేఽభిషేక్ష్యతి ||

21

సర్వే హ్యనుగృహీతాః స్మ యన్నో రామో మహీపతిః | [సర్వేప్య]
చిరాయ భవితా గోప్తా దృష్టలోకపరావరః ||

22

అనుద్ధతమనా విద్వాన్ధర్మాత్మా భ్రాతృవత్సలః |
యథా చ భ్రాతృషు స్నిగ్ధస్తథాస్మాస్వపి రాఘవః ||

23

చిరం జీవతు ధర్మాత్మా రాజా దశరథోఽనఘః |
యత్ప్రసాదేనాభిషిక్తం రామం ద్రక్ష్యామహే వయమ్ ||

24

ఏవం‍విధం కథయతాం పౌరాణాం శుశ్రువుస్తదా |
దిగ్భ్యో విశ్రుతవృత్తాంతాః ప్రాప్తా జానపదా జనాః || [దిగ్భ్యోఽపి]

25

తే తు దిగ్భ్యః పురీం ప్రాప్తాః ద్రష్టుం రామాభిషేచనమ్ |
రామస్య పూరయామాసుః పురీం జానపదా జనాః ||

26

జనౌఘైస్తైర్విసర్పద్భిః శుశ్రువే తత్ర నిస్వనః |
పర్వసూదీర్ణవేగస్య సాగరస్యేవ నిస్వనః ||

27

తతస్తదింద్రక్షయసన్నిభం పురం
దిదృక్షుభిర్జానపదైరుపాగతైః |
సమంతతః సస్వనమాకులం బభౌ
సముద్రయాదోభిరివార్ణవోదకమ్ ||

28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షష్ఠః సర్గః ||

Ayodhya Kanda Sarga 6 Meaning In Telugu

వసిష్ఠుడు తన మందిరము నుండి వెళ్లిపోయిన తరువాత రాముడు, సీతతో కలిసి మంగళ స్నానము చేసి, భక్తితో శ్రీ మహా విష్ణువును పూజించాడు. తరువాత అగ్నికార్యము నిర్వర్తించాడు. శ్రీ మహావిష్ణు మంత్రములు జపిస్తూ అగ్నిలో నేతిని హెూమం చేసాడు. అగ్నిలో వేల్చగా మిగిలిన హవిస్సును తాను భుజించాడు. తరువాత తన భార్య సీతతో కూడా దర్భలతో చేసిన చాప మీద పడుకున్నాడు.

మరునాడు తెల్లవారుజామునే నిద్రలేచాడు. తన మందిరమును చక్కగా అలంకరింపచేసాడు. ఇంతలో వంది మాగధులు వచ్చి స్తోత్రపాఠములతో వారి వంశచరిత్రను చక్కగా రామునికి వినిపించారు. రాముడు ప్రాతఃకాల సంధ్యావందనము నిర్వర్తించాడు. గాయత్రీ మాతను ఉపాసించాడు. బ్రాహ్మణులు పుణ్యాహవాచనము చేసారు.

రామపట్టాభిషేకము జరుగబోవుచున్నదని అయోధ్యా నగర పౌరులందరూ తెల్లవారుజామునే మేల్కొన్నారు. పురమును అంతా అలంకరించారు. రాజ ప్రాసాదముల మీద, కార్యాలయముల మీద, దేవాలయముల మీద పతాకములను ఎగురవేసారు. గాయకులు పాటలు పాడుతున్నారు. నర్తకులు చక్కగా తయారయి రాజభవనమునకు వెళ్లుటకు సిద్ధమవుతున్నారు. నర్తకులు నర్తిస్తున్నారు. అందరూ మంగళకరమైన మాటలు మాట్లాడు కుంటున్నారు. ఎవరి నోట విన్నా రాముని గుణగణములు, రామ పట్టాభిషేకము గురించి మాటలు వినబడుతున్నాయి. రామ పట్టాభిషేకం గురించి తప్ప ఎవరూ మరొక మాట మాట్లాడుకోవడం లేదు. రామ పట్టాభిషేక మహోత్సవము ఎంతసేపు జరుగుతుందో, చీకటి పడుతుందేమో అని పట్ట పగలే చిత్ర విచిత్రములైన దీపములు వీధులలో వెలిగించి పెట్టారు.

తాను వృద్ధుడైన సంగతి ఎరింగి దశరథుడు తగిన నిర్ణయం తీసుకొన్నాడని, ఇంక నుంచి రాముని పాలనలో తాము సుఖ సంతోషాలు అనుభవిస్తామని అయోధ్యావాసులు పొంగిపోతున్నారు. రాముడు తామందరినీ తన సోదరుల మాదిరి వాత్సల్యముతో ఆదరిస్తాడని జనులంతా ఆనంద పరవశులౌతున్నారు. రాముని పట్టాభిషేక వార్త విన్న చుట్టుపక్కల జనపదములలో నివసించు జానపదులు తండోప తండములుగా అయోధ్యకు తరలి వస్తున్నారు. వారందరితోటీ అయోధ్యానగరము క్రిక్కింరిసిపోయింది. వారందరూ మాట్లాడుకుంటూ కేరింతలు కొడుతుంటే వారి ఘోష సముద్రఘోషను మరిపిస్తూ ఉంది. ఆ రోజు అయోధ్యానగరము మహేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

వాల్మీకి రామాయణంలో ఈ విధంగా ఉంటే వ్యాసుడు రచించిన బ్రహ్మాండపురాణంలో భాగమయిన ఆధ్యాత్మ రామాయణంలో ఒక కొత్త విషయం ఉంది. అదేమి టంటే…..

ఒక రోజు నారదుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు. రాముని తో ఇలా అన్నాడు. “ఓ రామా! నన్ను బ్రహ్మ నీవద్దకుపంపాడు. నీకు నీ తండ్రి దశరథుడు పట్టాభిషేకము చేయవలెనని నిశ్చయించాడు. కాని నీ జననము రావణ సంహారము కొరకు జరిగినది కదా! నీవు రాజ్యపాలన చేస్తుంటే, రావణ సంహారము మాటేమిటి? భూభారము తగ్గించుటకు నీకు రాక్షస సంహారము చేయవలయును కదా! రామా! నీవు దేని కొరకు అవతరించితివో ఆ విషయము మరిచిపోవద్దు” అని అన్నాడు. దానికి రాముడు ఇలా అన్నాడు. “నారదమహర్షీ! నాకు తెలియని విషయము ఏమున్నది. నేను ఆడిన మాట తప్పను. రాక్షస సంహారము చేసెదను. కాలము తీరిన దైత్యులను సంహరించెదను. రేపే దండకారణ్య ప్రయాణము. పదునాలుగు సంవత్సరములు అరణ్య వాసము చేసెదను. సీతాపహరణము మిషతో రావణుని సంహరించెదను.. ఇది సత్యము.” అని రాముడు నారదునితో అన్నాడు. రాముని మాటలకు సంతోషించిన నారదుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. (ఇక్కడ రాముడు సామాన్య మానవుడు కాదు. కారణ జన్ముడు. సాక్షాత్తు విష్ణు అవతారము, భూత, భవిష్యత్ వర్తమానములు తెలిసినవాడు అని చెప్పబడింది.)

తరువాత వసిష్ఠుడు రామునితో ఉపవాసవ్రతము చేయించిన తరువాత వెళ్లిపోయాడు. ఆ సమయంలో దేవలోకంలో దేవతలు సరస్వతీదేవి వద్దకు వెళ్లారు. “అమ్మా సరస్వతీ దేవీ! నీవు ఇప్పుడు వెంటనే భూలోకమునకు వెళ్లాలి. నీవు రామునికి జరుగబోవు పట్టాభిషేకమునకు విఘ్నము కలిగించాలి. ఇది బ్రహ్మదేవుని ఆదేశము. అమ్మా! నీవు ముందుగా మంధర అనే దాసి వాక్కులో ప్రవేశించాలి. తరువాత కైకేయి వాక్కులో ప్రవేశించాలి. శ్రీరాముని పట్టాభిషేక ప్రయత్నము భగ్నము అయిన తరువాత మరలా తిరిగిరావాలి.” అని ప్రార్థించారు. సరస్వతీ దేవి దేవతల ప్రార్థన మన్నించి అయోధ్యా నగరమునకు వచ్చి మంధర వాక్కులో ప్రవేశించింది.

(ఈ సంఘటనలు మనకు ఆధ్యాత్మ రామాయణంలో కనపడతాయి. ఇంక ఈ సందర్భంలో తులసీరామాయణం లో ఏముందో తెలుసుకుందాము.)

అయోధ్యలో పౌరులందరూ రామపట్టాభిషేక సందర్భములో ఉత్సవాలు జరుపుకుంటుంటే దేవలోకములో దేవతలు విచారంగా ఉ న్నారు. వారందరూ సరస్వతీదేవి వద్దకు పోయి ఇలా అన్నారు.

“అమ్మా! రామ పట్టాభిషేకము జరుగబోవుచున్నది. నీవు ఎలాగైనా దానిని భగ్నము చేసి, రాముని అరణ్యములకు పంపాలి. దాని వలన దేవతల కార్యము సఫలమవుతుంది.” అని అన్నారు. ఆ మాటలకు సరస్వతీ దేవి నేను ఇటువంటి పాడు పని చెయ్యాలా అని చింతించింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. అప్పుడు దేవతలు ఇలా అన్నారు.

“అమ్మ తమరు ఈ పని చేసినందువలన తమరికి ఏ దోషమూ అంటదు. ఇది దేవ కార్యము. రాముడు సామాన్య మానవుడు కాడు. భేదమోదములకు అతీతుడు. సుఖము దుఃఖము సామాన్య మానవులకు కానీ రామునికి అంటవు. కాబట్టి తమరు అయోధ్యకు వెళ్లాలి.” అని ప్రార్థించారు.

అప్పుడు సరస్వతీ దేవి తనలో తాను ఇలా అనుకొన్నది.

“ఆహా! ఈ దేవతలు ఎంత అల్పబుద్ధులు. వీరు ఉండేచోటు అత్యున్నత స్థానమైన స్వర్గము. కానీ వీరి బుద్ధులు మాత్రము పరమ నీచములు. ఇతరులు బాగుపడుతుంటే చూచి సహించలేరు. పోనీ. ఇదీ ఒకందుకు మంచిదే… రాముడు వనవాసము వెళితే రాక్షససంహారము జరుగుతుంది. రామాయణ కధ లోకంలో ప్రచారం అవుతుంది. ఎంతో మంది కవులు గాయకులు రామ కథను గానం చేస్తారు. నేను ఆ కవులు గాయకుల నాలుకల మీద నాట్యం చేస్తుంటాను. రామ కథను గానం చేస్తుంటాను. దీనివలన భూలోకంలో నా పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.” అని అనుకొన్నది సరస్వతీ దేవి. దేవతల కోరిక ప్రకారము అయోధ్యకు వచ్చింది. ఇదీ తులసీరామాయణంలో ఉన్నకధ.

పై చెప్పిన కధా సంఘటనలు వాల్మీకి రామాయణంలో లేవు. రాముడు వనవాసమునకు పోవడంలో దేవరహస్యాలు ఏమీ లేవు. మామూలు మానవుల్లో ఎలా జరుగుతుందో అలా జరిగింది.

దశరథుడు భరతుడు ఇంటలేని సమయంలో కావాలనే రామ పట్టాభిషేకమునకు ముహూర్తము నిర్ణయించాడు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది.

యుగధర్మము ప్రకారము రాజ్యము జ్యేష్టునికి చెందుతుంది. దశరథుని కుమారులలో పెద్దవాడు రాముడు. అందుకని రామునికి పట్టాభిషేకం చెయ్యడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని భరతుడు ఏమైనా పేచీ పెడతాడేమో అని దశరథుడు సందేహించాడు. అందుకని భరతుడు లేని వేళ పట్టాభిషేకము నిర్ణయించాడు.

వాల్మీకి రామాయణము ప్రకారము ఇందులో దేవతల ప్రసక్తికానీ, దేవరహస్యము కానీ ఏమీలేవు.

అయోధ్యాకాండ సప్తమః సర్గః (7) >>

Balakanda Sarga 26 In Telugu – బాలకాండ షడ్వింశః సర్గః

Balakanda Sarga 26 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ షడ్వింశః సర్గలో సీతాస్వయంవరంలోని ప్రధాన సంఘటనలు వివరించబడ్డాయి. జనక మహారాజు తన కుమార్తె సీతకు తగిన వరుడిని కనుగొనేందుకు స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. అనేకమంది మహారథులు మరియు రాజులు శివధనస్సును ఎత్తడానికి ప్రయత్నిస్తారు కానీ విఫలమవుతారు. వారి ప్రయత్నాలన్నీ విఫలమవగా, శ్రీరాముడు ధనస్సును తూటాలకు విరచి తన శక్తిని ప్రదర్శిస్తాడు.

తాటకావధః

మునేర్వచనమక్లీబం శ్రుత్వా నరవరాత్మజః |
రాఘవః ప్రాంజలిర్భూత్వా ప్రత్యువాచ దృఢవ్రతః ||

1

పితుర్వచననిర్దేశాత్పితుర్వచనగౌరవాత్ |
వచనం కౌశికస్యేతి కర్తవ్యమవిశంకయా ||

2

అనుశిష్టోఽస్మ్యయోధ్యాయాం గురుమధ్యే మహాత్మనా |
పిత్రా దశరథేనాహం నావజ్ఞేయం చ తద్వచః ||

3

సోఽహం పితుర్వచః శ్రుత్వా శాసనాద్బ్రహ్మవాదినః |
కరిష్యామి న సందేహస్తాటకావధముత్తమమ్ ||

4

గోబ్రాహ్మణహితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ |
తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముద్యతః ||

5

ఏవముక్త్వా ధనుర్మధ్యే బద్ధ్వా ముష్టిమరిందమః |
జ్యాఘోషమకరోత్తీవ్రం దిశః శబ్దేన నాదయన్ ||

6

తేన శబ్దేన విత్రస్తాస్తాటకావనవాసినః |
తాటకా చ సుసంక్రుద్ధా తేన శబ్దేన మోహితా ||

7

తం శబ్దమభినిధ్యాయ రాక్షసీ క్రోధమూర్ఛితా |
శ్రుత్వా చాభ్యద్రవద్వేగాద్యతః శబ్దో వినిఃసృతః ||

8

తాం దృష్ట్వా రాఘవః క్రుద్ధాం వికృతాం వికృతాననామ్ |
ప్రమాణేనాతివృద్ధాం చ లక్ష్మణం సోఽభ్యభాషత ||

9

పశ్య లక్ష్మణ యక్షిణ్యా భైరవం దారుణం వపుః |
భిద్యేరన్దర్శనాదస్యా భీరూణాం హృదయాని చ ||

10

ఏనాం పశ్య దురాధర్షాం మాయాబలసమన్వితామ్ |
వినివృత్తాం కరోమ్యద్య హృతకర్ణాగ్రనాసికామ్ ||

11

న హ్యేనాముత్సహే హంతుం స్త్రీస్వభావేన రక్షితామ్ |
వీర్యం చాస్యా గతిం చాపి హనిష్యామీతి మే మతిః ||

12

ఏవం బ్రువాణే రామే తు తాటకా క్రోధమూర్ఛితా |
ఉద్యమ్య బాహూ గర్జంతీ రామమేవాభ్యధావత ||

13

విశ్వామిత్రస్తు బ్రహ్మర్షిర్హుంకారేణాభిభర్త్స్య తామ్ |
స్వస్తి రాఘవయోరస్తు జయం చైవాభ్యభాషత ||

14

ఉద్ధూన్వానా రజో ఘోరం తాటకా రాఘవావుభౌ |
రజోమోహేన మహతా ముహూర్తం సా వ్యమోహయత్ ||

15

తతో మాయాం సమాస్థాయ శిలావర్షేణ రాఘవౌ |
అవాకిరత్సుమహతా తతశ్చుక్రోధ రాఘవః ||

16

శిలావర్షం మహత్తస్యాః శరవర్షేణ రాఘవః |
ప్రతిహత్యోపధావంత్యాః కరౌ చిచ్ఛేద పత్రిభిః ||

17

తతశ్ఛిన్నభుజాం శ్రాంతామభ్యాశే పరిగర్జతీమ్ |
సౌమిత్రిరకరోత్క్రోధాద్ధృతకర్ణాగ్రనాసికామ్ ||

18

కామరూపధరా సద్యః కృత్వా రూపాణ్యనేకశః |
అంతర్ధానం గతా యక్షీ మోహయంతి చ మాయయా ||

19 [స్వమాయయా]

అశ్మవర్షం విముంచంతీ భైరవం విచచార సా |
తతస్తావశ్మవర్షేణ కీర్యమాణౌ సమంతతః ||

20

దృష్ట్వా గాధిసుతః శ్రీమానిదం వచనమబ్రవీత్ |
అలం తే ఘృణయా రామ పాపైషా దుష్టచారిణీ ||

21

యజ్ఞవిఘ్నకరీ యక్షీ పురా వర్ధేత మాయయా |
వధ్యతాం తావదేవైషా పురా సంధ్యా ప్రవర్తతే ||

22

రక్షాంసి సంధ్యాకాలేషు దుర్ధర్షాణి భవంతి హి |
ఇత్యుక్తస్తు తదా యక్షీమశ్మవృష్ట్యాభివర్షతీమ్ ||

23

దర్శయన్ శబ్దవేధిత్వం తాం రురోధ స సాయకైః |
సా రుద్ధా శరజాలేన మాయాబలసమన్వితా ||

24

అభిదుద్రావ కాకుత్స్థం లక్ష్మణం చ వినేషుదీ |
తామాపతంతీం వేగేన విక్రాంతామశనీమివ ||

25

శరేణోరసి వివ్యాధ సా పపాత మమార చ |
తాం హతాం భీమసంకాశాం దృష్ట్వా సురపతిస్తదా ||

26

సాధు సాధ్వితి కాకుత్స్థం సురాశ్చ సమపూజయన్ |
ఉవాచ పరమప్రీతః సహస్రాక్షః పురందరః ||

27

సురాశ్చ సర్వే సంహృష్టా విశ్వామిత్రమథాబ్రువన్ |
మునే కౌశిక భద్రం తే సేంద్రాః సర్వే మరుద్గణాః ||

28

తోషితాః కర్మణా తేన స్నేహం దర్శయ రాఘవే |
ప్రజాపతేః కృశాశ్వస్య పుత్రాన్సత్యపరాక్రమాన్ ||

29

తపోబలభృతాన్బ్రహ్మన్రాఘవాయ నివేదయ |
పాత్రభూతశ్చ తే బ్రహ్మంస్తవానుగమనే ధృతః ||

30

కర్తవ్యం చ మహత్కర్మ సురాణాం రాజసూనునా |
ఏవముక్త్వా సురాః సర్వే జగ్ముర్హృష్టా యథాగతమ్ ||

31

విశ్వామిత్రం పురస్కృత్య తతః సంధ్యా ప్రవర్తతే |
తతో మునివరః ప్రీతస్తాటకావధతోషితః ||

32

మూర్ధ్ని రామముపాఘ్రాయ ఇదం వచనమబ్రవీత్ |
ఇహాద్య రజనీం రామ వసేమ శుభదర్శన ||

33

శ్వః ప్రభాతే గమిష్యామస్తదాశ్రమపదం మమ |
విశ్వామిత్రవచః శ్రుత్వా హృష్టో దశరథాత్మజః ||

34

ఉవాస రజనీం తత్ర తాటకాయా వనే సుఖమ్ |
ముక్తశాపం వనం తచ్చ తస్మిన్నేవ తదాహని |
రమణీయం విబభ్రాజ యథా చైత్రరథం వనమ్ ||

35

నిహత్య తాం యక్షసుతాం స రామః
ప్రశస్యమానః సురసిద్ధసంఘైః |
ఉవాస తస్మిన్మునినా సహైవ
ప్రభాతవేలాం ప్రతిబోధ్యమానః ||

36

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షడ్వింశః సర్గః ||

Balakanda Sarga 26 Meaning In Telugu

విశ్వామిత్ర మహర్షి మాటలను శ్రద్ధగా విన్న రాముడు వినయంతో ఇలా అన్నాడు. ” ఓ మహర్షి! మా తండ్రి దశరథుడు నన్ను తమరి వెంట పంపాడు. తమరు ఏమి చెబితే అలా చెయ్యమన్నాడు. నా తండ్రి గారి మాటను జవదాటలేను. అందుకే తమరి మాట నాకు శిరోధార్యము. తమరు ఏం చెబితే అలా చేస్తాను. గోవులు, బ్రాహ్మణుల యొక్క హితము కొరకు, లోక క్షేమము కొరకు తమరు చెప్పినట్టే చేస్తాను.” అని పలికాడు రాముడు.

వెంటనే తన ధనుస్సు చేతిలోకి తీసుకున్నాడు. వింటి నారిని గట్టిగా లాగి వదిలాడు. ఆ శబ్దానికి తాటకా వనములోని వారందరి గుండెలు అదిరిపోయాయి. భయంతో గడా గడా వణికిపోయారు. ఆ శబ్దము విన్న తాటక పరుగు పరుగున ఆ శబ్దము వచ్చిన వైపుకు వచ్చింది.

వికారంగా ఉన్న తాటకిని చూచి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఆ భయంకరాకారముతో ఉన్న యక్షిణిని చూడు. పిరికి వాళ్లు అయితే ఆమెను చూచి గుండె ఆగి చనిపోతారు కదా! ఆమె మాయావి. అందుకని ఈమె ముక్కు చెవులు కోసి వదిలేద్దాము. ఎందుకంటే ఈమె స్త్రీ. అదే ఈమెను రక్షిస్తూ ఉంది. కాబట్టి ఈమెను చంపకుండా ఈమె పరాక్రమును నశింప చేస్తాను.” అని అన్నాడు రాముడు.

రాముడు అలా లక్ష్మణుడితో చెబుతూ ఉండగానే తాటకి రాముని మీదికి గర్జిస్తూ దూకింది. ఇంతలో విశ్వామిత్రుడు కోపంతో హుంకరించాడు. తాటకిని అదిలించాడు. రామలక్ష్మణులకు స్వస్తి వాచకం పలికాడు. రాముడికి జయం కలగాలని ఆశీర్వదించాడు.

విశ్వామిత్రుని హుంకారమునకు తాటకి భయపడలేదు. తన మాయా శక్తిచేత వారి మీద రాళ్ల వర్షము కురిపించింది. రాముడికి కోపం వచ్చింది. వెంటనే తాటకి మీద శరవర్షము కురిపించి ఆ రాళ్ల వర్షమును ఆపు చేసాడు.

తాటకి ఊరుకోలేదు. తన చేతులుచాచి రాముని మీదికి వచ్చింది. రాముడు తన బాణములతో తాటకి రెండు చేతులు ఖండించాడు. లక్ష్మణుడు ఒక కత్తి తీసుకొని తాటకి ముక్కు, చెవులు కోసి ఆమెను విరూపిని చేసాడు. అయినా తాటకి ఊరుకోలేదు. తన మాయా శక్తితో వివిధము లైన ఆకారములను ధరించి మరలా రామ లక్ష్మణుల మీద రాళ్ల వర్షము కురిపించింది. రామలక్ష్మణుల మీద రాళ్ల వర్షం కురుస్తుంటే విశ్వామిత్రుడు చూచాడు.

అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! ఆమె మీద జాలి చూపకు. ఈమె పాపాత్మురాలు. దుర్మార్గురాలు. ఈమె మాయావి. వివిధములైన రూపములను ధరించగలదు. రాత్రి సమీపించుచున్నది. ఈ లోపలే ఈమెను చంపి వెయ్యి సంధ్యాకాలములో రాక్షసుల బలం పెరుగుతుంది. త్వరపడు.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

విశ్వామిత్రుని మాటలు విన్న రాముడు వెంటనే శబ్దవేధి బాణాన్ని ఎక్కుపెట్టాడు.

(శబ్ద వేధి అంటే, టార్గెట్ కనిపించనపుడు, కేవలం శబ్దం ఆధారంగా, శబ్దమును విని టార్గెట్ ను కొట్టడం).

తాటక నుండి వచ్చు శబ్దమును బట్టి రాముడు బాణాన్ని విడిచాడు. ఆ బాణం సూటిగా తాటకిని తాకింది. రామ బాణం తగిలిన తాటకి రెట్టించిన కోపంతో రాముని మీదికి ఉరికింది. రాముడు మరొక బాణంతో తాటకి వక్షస్థలము మీద కొట్టాడు. ఆ బాణము సరిగా తాటకి గుండెలోంచి దూసుకుపోయింది. తాటకి కిందపడి మరణించింది.

తాటకి మరణించడం చూచి దేవతలు అంతా సంతోషించారు. దేవతల అందరి బదులు దేవేంద్రుడు విశ్వామిత్రుని తో ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! నీవు రాముని యందుఎక్కువ వాత్సల్యము చూపుము. భృశాశ్వునిచే సృష్టింప బడిన అస్త్ర శస్త్రములను అన్నింటినీ రామునికి ఉపదేశింపుము. ఎందు కంటే రాముడు భవిష్యత్తులో లోక కంటకులైన రాక్షసులను సంహరించవలసి ఉన్నది. ” అని పలికాడు.

తరువాత దేవేంద్రుడు దేవతలు వెళ్లిపోయారు. ఇంతలో సంధ్యాసమయము అయింది. తాటకను చంపిన రాముని సంతోషంతో చూచాడు విశ్వామిత్రుడు. వాత్సల్యంలో అతని తల నిమిరాడు.

‘ ఓ రామా! సంధ్యాసమయము అయినది. మనము ఈ రాత్రికి ఇచ్చటనే విశ్రమించి రేపు ఉదయము మన ప్రయాణము కొన సాగిద్దాము” అని అన్నాడు. రామ లక్ష్మణులు దానికి అంగీకరించారు.

అందరూ ఆరాత్రికి తాటకా వనములో విశ్రమించారు. మరునాడు ఉదయము విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేల్కొలిపాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ సప్తవింశః సర్గః (27) >>

Ayodhya Kanda Sarga 19 In Telugu – అయోధ్యాకాండ ఏకోనవింశః సర్గః

Ayodhya Kanda Sarga 19

అయోధ్యాకాండ ఏకోనవింశః సర్గంలో, దశరథుడు రాముని వనవాసానికి పంపడానికి నిర్ణయించుకుంటాడు. కౌసల్య, సుమిత్రలు శోకంతో విలపిస్తారు. రాముడు, సీత, లక్ష్మణులు వనానికి వెళ్లడానికి సిద్ధపడతారు. ప్రజలు రాముని వెంబడిస్తారు. వదినీతో పాటు అనుసరించేందుకు సుమిత్రతో మాట్లాడతారు. రాముడు ధైర్యంగా ఉండి కైకేయితో మాట్లాడుతూ తండ్రి ఆజ్ఞను పాటించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. ఈ సర్గలో, రాముని ధైర్యం, దశరథుడి వేదన, కుటుంబం, ప్రజల దుఃఖం ప్రాముఖ్యత వహిస్తాయి. రాముడు తన ధర్మం కోసం వనవాసం కోసం సిద్ధపడడం, కుటుంబం, ప్రజల పట్ల తన బాధ్యతలను నిర్దేశించడం ఈ సర్గలో ప్రాముఖ్యత వహిస్తుంది.

రామప్రతిజ్ఞా

తదప్రియమమిత్రఘ్నో వచనం మరణోపమమ్ |
శ్రుత్వా న వివ్యథే రామః కైకేయీం చేదమబ్రవీత్ || ౧ ||

ఏవమస్తు గమిష్యామి వనం వస్తుమహం త్వితః |
జటాఽజినధరో రాజ్ఞః ప్రతిజ్ఞామనుపాలయన్ || ౨ ||

ఇదం తు జ్ఞాతుమిచ్ఛామి కిమర్థం మాం మహీపతిః |
నాభినందతి దుర్ధర్షో యథాపురమరిందమః || ౩ ||

మన్యుర్న చ త్వయా కార్యో దేవి బ్రూమి తవాగ్రతః |
యాస్యామి భవ సుప్రీతా వనం చీరజటాధరః || ౪ ||

హితేన గురుణా పిత్రా కృతజ్ఞేన నృపేణ చ |
నియుజ్యమానో విస్రబ్ధః కిం న కుర్యామహం ప్రియమ్ || ౫ ||

అలీకం మానసం త్వేకం హృదయం దహతీవ మే |
స్వయం యన్నాహ మాం రాజా భరతస్యాభిషేచనమ్ || ౬ ||

అహం హి సీతాం రాజ్యం చ ప్రాణానిష్టాన్ధనాని చ |
హృష్టో భ్రాత్రే స్వయం దద్యాం భరతాయాప్రచోదితః || ౭ ||

కిం పునర్మనుజేంద్రేణ స్వయం పిత్రా ప్రచోదితః |
తవ చ ప్రియకామార్థం ప్రతిజ్ఞామనుపాలయన్ || ౮ ||

తదాశ్వాసయ హీమం త్వం కిం న్విదం యన్మహీపతిః |
వసుధాసక్తనయనో మందమశ్రూణి ముంచతి || ౯ ||

గచ్ఛంతు చైవానయితుం దూతాః శీఘ్రజవైర్హయైః |
భరతం మాతులకులాదద్యైవ నృపశాసనాత్ || ౧౦ ||

దండకారణ్యమేషోఽహమితో గచ్ఛామి సత్వరః |
అవిచార్య పితుర్వాక్యం సమా వస్తుం చతుర్దశ || ౧౧ ||

సా హృష్టా తస్య తద్వాక్యం శ్రుత్వా రామస్య కైకయీ |
ప్రస్థానం శ్రద్దధానా హి త్వరయామాస రాఘవమ్ || ౧౨ ||

ఏవం భవతు యాస్యంతి దూతాః శీఘ్రజవైర్హయైః |
భరతం మాతులకులాదుపావర్తయితుం నరాః || ౧౩ ||

తవ త్వహం క్షమం మన్యే నోత్సుకస్య విలంబనమ్ |
రామ తస్మాదితః శీఘ్రం వనం త్వం గంతుమర్హసి || ౧౪ ||

వ్రీడాఽన్వితః స్వయం యచ్చ నృపస్త్వాం నాభిభాషతే |
నైతత్కించిన్నరశ్రేష్ఠ మన్యురేషోఽపనీయతామ్ || ౧౫ ||

యావత్త్వం న వనం యాతః పురాదస్మాదభిత్వరన్ |
పితా తావన్న తే రామ స్నాస్యతే భోక్ష్యతేఽపి వా || ౧౬ ||

ధిక్కష్టమితి నిశ్వస్య రాజా శోకపరిప్లుతః |
మూర్ఛితో న్యపతత్తస్మిన్పర్యంకే హేమభూషితే || ౧౭ ||

రామోఽప్యుత్థాప్య రాజానం కైకేయ్యాఽభిప్రచోదితః |
కశయేవాహతో వాజీ వనం గంతుం కృతత్వరః || ౧౮ ||

తదప్రియమనార్యాయాః వచనం దారుణోదయమ్ |
శ్రుత్వా గతవ్యథో రామః కైకేయీం వాక్యమబ్రవీత్ || ౧౯ ||

నాహమర్థపరో దేవి లోకమావస్తుముత్సహే |
విద్ధి మామృషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితమ్ || ౨౦ ||

యదత్రభవతః కించిచ్ఛక్యం కర్తుం ప్రియం మయా |
ప్రాణానపి పరిత్యజ్య సర్వథా కృతమేవ తత్ || ౨౧ ||

న హ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరమ్ |
యథా పితరి శుశ్రూషా తస్య వా వచనక్రియా || ౨౨ ||

అనుక్తోఽప్యత్రభవతా భవత్యా వచనాదహమ్ |
వనే వత్స్యామి విజనే వర్షాణీహ చతుర్దశ || ౨౩ ||

న నూనం మయి కైకేయి కించిదాశంససే గుణమ్ |
యద్రాజానమవోచస్త్వం మమేశ్వరతరా సతీ || ౨౪ ||

యావన్మాతరమాపృచ్ఛే సీతాం చానునయామ్యహమ్ |
తతోఽద్యైవ గమిష్యామి దండకానాం మహద్వనమ్ || ౨౫ ||

భరతః పాలయేద్రాజ్యం శుశ్రూషేచ్చ పితుర్యథా |
తథా భవత్యా కర్తవ్యం స హి ధర్మః సనాతనః || ౨౬ ||

స రామస్య వచః శ్రుత్వా భృశం దుఃఖహతః పితా |
శోకాదశక్నువన్బాష్పం ప్రరురోద మహాస్వనమ్ || ౨౭ ||

వందిత్వా చరణౌ రామో విసంజ్ఞస్య పితుస్తదా |
కైకేయ్యాశ్చాప్యనార్యాయాః నిష్పపాత మహాద్యుతిః || ౨౮ ||

స రామః పితరం కృత్వా కైకేయీం చ ప్రదక్షిణమ్ |
నిష్క్రమ్యాంతఃపురాత్తస్మాత్స్వం దదర్శ సుహృజ్జనమ్ || ౨౯ ||

తం బాష్పపరిపూర్ణాక్షః పృష్ఠతోఽనుజగామ హ |
లక్ష్మణః పరమక్రుద్ధః సుమిత్రాఽఽనందవర్ధనః || ౩౦ ||

ఆభిషేచనికం భాండం కృత్వా రామః ప్రదక్షిణమ్ |
శనైర్జగామ సాపేక్షో దృష్టిం తత్రావిచాలయన్ || ౩౧ ||

న చాస్య మహతీం లక్ష్మీం రాజ్యనాశోఽపకర్షతి |
లోకకాంతస్య కాంతత్వాచ్ఛీతరశ్మేరివ క్షపా || ౩౨ ||

న వనం గంతుకామస్య త్యజతశ్చ వసుంధరామ్ |
సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్తవిక్రియా || ౩౩ ||

ప్రతిషిధ్య శుభం ఛత్రం వ్యజనే చ స్వలంకృతే |
విసర్జయిత్వా స్వజనం రథం పౌరాంస్తథా జనాన్ || ౩౪ ||

ధారయన్మనసా దుఃఖమింద్రియాణి నిగృహ్య చ |
ప్రవివేశాత్మవాన్వేశ్మ మాతురప్రియశంసివాన్ || ౩౫ ||

సర్వో హ్యభిజనః శ్రీమాన్ శ్రీమతః సత్యవాదినః |
నాలక్షయత రామస్య కించిదాకారమాననే || ౩౬ ||

ఉచితం చ మహాబాహుర్న జహౌ హర్షమాత్మనః |
శారదః సముదీర్ణాంశుశ్చంద్రస్తేజ ఇవాత్మజమ్ || ౩౭ ||

వాచా మధురయా రామః సర్వం సమ్మానయఞ్జనమ్ |
మాతుః సమీపం ధర్మాత్మా ప్రవివేశ మహాయశాః || ౩౮ ||

తం గుణైః సమతాం ప్రాప్తో భ్రాతా విపులవిక్రమః |
సౌమిత్రిరనువవ్రాజ ధారయన్దుఃఖమాత్మజమ్ || ౩౯ ||

ప్రవిశ్య వేశ్మాతిభృశం ముదాఽన్వితం
సమీక్ష్య తాం చార్థవిపత్తిమాగతామ్ |
న చైవ రామోఽత్ర జగామ విక్రియాం
సుహృజ్జనస్యాత్మవిపత్తిశంకయా || ౪౦ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనవింశః సర్గః || ౧౯ ||

Ayodhya Kanda Sarga 19 Meaning In Telugu

తన తల్లి కైక మాటలు విన్న రాముడు ఏ మాత్రం బాధ పడలేదు. “అమ్మా! కైకా! అన్నీ నీవు చెప్పినట్లే జరుగుతాయమ్మా. నేను తండ్రి గారి మాట ప్రకారము జటలు, నార చీరలు ధరించి అరణ్యవాసము చేస్తాను. ఈ చిన్న విషయానికి తండ్రి గారు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. తండ్రిగారి మాట నేను ఎప్పుడు కాదన్నాను. ఆయన మాట నేను కాదు అని అంటే కదా వారు బాధ పడాలి. వారి మాట నాకు శిరోధార్యము.

అమ్మా! నాకు జన్మనిచ్చిన వాడు నా తండ్రి. నన్ను పెంచి, పెద్దచేసి, నాకు విద్యాబుద్ధులు చెప్పించాడు. అటువంటి తండ్రి మాటను నేను కాదంటానా అమ్మా! కాని తండ్రిగారు ఈ విషయము నాకు స్వయంగా చెప్పిఉంటే బాగుండేది. తండ్రిగారు “రామా! నేను భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము చేయదలిచాను” అని ఒక్కమాట నాతో అంటే నేను రాజ్యమును భరతునికి అప్పగించి ఉండేవాడిని. ఒక్క రాజ్యమే కాదు తండ్రిగారు కోరితే నా సర్వస్వమును భరతునికి అర్పిస్తాను. ఇందులో సందేహము లేదు.

అమ్మా! నీవు తండ్రి గారిని ఓదార్చు. అమ్మా! అమ్మా! చూడమ్మా. తండ్రి గారు నా మొహం లోకి చూడలేక నేల చూపులు చూస్తూ కన్నీరు కారుస్తున్నారు. నేను తండ్రిగారి మాటలను పాటిస్తాను అని చెప్పమ్మా. వెంటనే నేను భరతుని తీసుకొని వచ్చుటకు దూతలను కేకయ దేశమునకు పంపుతాను.

అమ్మా! నా తండ్రిగారి మాటలు మంచివా, మంచివి కావా అని నేను తర్కించను. తండ్రి గారి నిర్ణయం నాకు అనుకూలమా ప్రతికూలమా అని ఆలోచించను. తండ్రిగారి మాటలను తప్పకుండా పాటిస్తాను. పదునాలుగేళ్లు వనవాసము చేస్తాను. నా మాట నమ్మండి.”అని నిశ్చయంగా అన్నాడు రాముడు.

అప్పుడు రాముని మాటలలో నమ్మకం కుదిరింది కైకకు. కైక మనసు సంతోషంతో పరవళ్లు తొక్కింది. కాని పైకి మాత్రం ఆ సంతోషమును బహిర్గతము చేయలేదు. రాముని తొందరపెట్టసాగింది.

“రామా! వెంటనే వేగముగా పరుగెత్తే గుర్రముల మీద దూతలను భరతుని మేనమామ ఇంటికి పంపు. భరతుడు వెంటనే ఇక్కడకు రావాలి. భరతుడు వచ్చువరకు నీవు ఆగనవసరం లేదు. నీవు వెంటనే అరణ్యములకు ప్రయాణమై వెళ్లు. నీ తండ్రి గారు స్వయంగా నీతో చెప్పలేదని సందేహించకు. పాపం మీ తండ్రిగారు నీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని తనలో తనే మధనపడుతున్నాడు. నీవు ఇక్కడ ఉంటే ఆ బాధతో నీ తండ్రి ఆహారము కానీ, నీరు కానీ ముట్టడు. కాబట్టి నీవు తక్షణం వనములకు వెళితేనే ఆయన ఆహారం తీసుకుంటాడు.” అని పలికిన కైక వంక అసహ్యంగా చూచాడు దశరథుడు.

రాముని మొహంలోకి చూడలేక మరలా తల దించుకున్నాడు. రామునికి విషయం అర్థం అయింది. తన తల్లి కైకతో ఇలా అన్నాడు. “అమ్మా! నేను ఎల్లప్పుడూ ధర్మమును తప్పను. తండ్రి మాటలను పాటిస్తాను. నా తండ్రి మాట ముందు ఈ రాజ్యము, భోగములు నాకు గడ్డిపరక తో సమానము. అమ్మా! నీకు ఇందాకే చెప్పాను. నా తండ్రి గారి మాటను నెరవేర్చడానికి నేను నా ప్రాణములను కూడా లెక్కచెయ్యను. ఇంక ఈ వనవాసము ఒక లెక్కలోది కాదు.

అమ్మా! తమరికి తెలియనిది ఏమున్నది. పుత్రునికి తండ్రికి సేవచెయ్యడం, తండ్రి మాటను పాటించడం కన్నా వేరే ధర్మము ఏముంటుంది. తండ్రి గారి నోటివెంట నా వనవాసము గురించి ఒక మాట కూడా రాక పోయినా, నీవు చెప్పావు కాబట్టి ఆ మాటలు నా తండ్రి గారు చెప్పినట్టే భావిస్తాను.

అదికాదమ్మా! నేను నీ పుత్రుడను. నాపై నీకు సర్వాధి కారములు ఉన్నాయి. భరతుని రాజ్యాభిషేకము గురించి నాతో ఒక్క మాట చెబితే సరిపోయేది కదా. దీనికి తండ్రి గారిని ఇంత బాధపెట్ట వలెనా! అంటే ఈ రాముడి మీద తమరికి నమ్మకం లేదా అమ్మా! నాకు తమరు ఒకటీ, మా తండ్రి ఒకటి కాదు. మీ ఇద్దరి మాటా ఒకటే. ఇంక నాకు సెలవు ఇప్పించండి. నేను వెళ్లి మా తల్లి కౌసల్య దగ్గర అనుమతి తీసుకొని, నా భార్య సీతను ఊరడించి, తరువాత అరణ్యవాసమునకు వెళతాను. అమ్మా! తండ్రిగారిని జాగ్రత్తగా చూచుకొనమని భరతునికి చెప్పమ్మా! ఎందుకంటే తండ్రికి సేవచెయ్యడం మన సనాతన ధర్మం.” అని అన్నాడు రాముడు.

రాముని ఒక్కొక్క మాటా వింటుంటే దశరథుననికి దు:ఖము పొర్లుకొని వస్తూ ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నోటమాట రావడం లేదు. శరీరం వశం తప్పుతూ ఉంది. తూలిపోతున్నాడు. అయినా నిలదొక్కు ఉంటున్నాడు. రాముడు తండ్రి పాదములకు, కైక పాదము లకు నమస్కరించాడు. తరువాత రాజ మందిరము నుండి బయటకు వచ్చాడు.

ఇదంతా ద్వారము వద్ద వేచి ఉన్న లక్ష్మణుడు వింటూ ఉన్నాడు. కోపంతో రగిలిపోతున్నాడు. కాని అన్నగారి మొహం చూచి కోపాన్ని అణుచుకుంటున్నాడు. రాముడు బయటకు రాగానే రాముని వెనకగా వెళ్లాడు. రాముడు అక్కడ అమర్చిన పట్టాభిషేక ద్రవ్యములకు నమస్కరించాడు. సమస్తము త్యజించిన యోగివలె అక్కడి నుండి వెళుతున్నాడు. ఛత్రమును చామరమును వద్దన్నాడు. తన వెంట వచ్చిన స్నేహితులను వెళ్లిపొమ్మన్నాడు. రథమును కూడా వద్దన్నాడు. పాదచారియై తన తల్లి కౌసల్య మందిరమునకు వెళ్లాడు.

ఇంతజరిగినా రాముని మొహం మీద ఉన్న చిరునవ్వు చెరగలేదు. అందరినీ చిరునవ్వుతూ పలకరిస్తున్నాడు. రాముని వెంట ఉన్న లక్ష్మణుడు మాత్రం కోపంతో రగిలిపోతున్నాడు. కోపం ఆపుకోలేకపోతున్నాడు. లక్ష్మణుని కోపం అతని మొహంలో స్పష్టంగా కనపడుతూ ఉంది. రాముడు కౌసల్యాభవనములో ప్రవేశించేటప్పటికి ఆమె భవనమంతా ఆనందోత్సాహాలతో నిండి ఉంది. రాముడు తన మొహంలో ఏ మాత్రం వికారము కనపడ్డా ఆ ఆనందంఅంతా విషాదంగా మారుతుందని గ్రహించి, తన పెదవుల మీద చిరునవ్వు చెరగనీయకుండా తల్లివద్దకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ వింశః సర్గః (20) >>

Ayodhya Kanda Sarga 18 In Telugu – అయోధ్యాకాండ అష్టాదశః సర్గః

Ayodhya Kanda Sarga 18

“రామాయణం” లో అయోధ్యాకాండ అష్టాదశః సర్గం (18వ సర్గ)లో, భరతుడు రాముని కాళ్లకు నమస్కరించి, అయోధ్యకు తిరిగి రావాలని కోరతాడు. భరతుని ప్రేమను చూసి రాముడు హృదయపూర్వకంగా స్పందించి, కానీ తన వనవాసం నిబద్ధతను గుర్తు చేస్తాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకొని తిరిగి రాజధానికి వెళతాడు. రాముడు తన పాదుకలను భరతుడికి అప్పగించి, భరతుని ధర్మాన్ని పాటించమని చెప్పాడు. ఈ సర్గలో, రాముడి ధైర్యం, విధేయత, మరియు భరతుని పితృభక్తి ప్రధానాంశాలు. రాముడు తన ధర్మాన్ని పాటిస్తూ, భరతుడు తన యజ్ఞాన్ని నిర్వహించడంలో ఒకరికొకరు స్ఫూర్తిగా నిలుస్తారు.

వనవాసనిదేశః

స దదర్శాసనే రామో నిషణ్ణం పితరం శుభే |
కైకేయీసహితం దీనం ముఖేన పరిశుష్యతా || ౧ ||

స పితుశ్చరణౌ పూర్వమభివాద్య వినీతవత్ |
తతో వవందే చరణౌ కైకేయ్యాః సుసమాహితః || ౨ ||

రామేత్యుక్త్వా చ వచనం బాష్పపర్యాకులేక్షణః |
శశాక నృపతిర్దీనో నేక్షితుం నాభిభాషితుమ్ || ౩ ||

తదపూర్వం నరపతేర్దృష్ట్వా రూపం భయావహమ్ |
రామోఽపి భయమాపన్నః పదా స్పృష్ట్వేవ పన్నగమ్ || ౪ ||

ఇంద్రియైరప్రహృష్టైస్తం శోకసంతాపకర్శితమ్ |
నిఃశ్వసంతం మహారాజం వ్యథితాకులచేతసమ్ || ౫ ||

ఊర్మిమాలినమక్షోభ్యం క్షుభ్యంతమివ సాగరమ్ |
ఉపప్లుతమివాదిత్యముక్తానృతమృషిం యథా || ౬ ||

అచింత్యకల్పం హి పితుస్తం శోకముపధారయన్ |
బభూవ సంరబ్ధతరః సముద్ర ఇవ పర్వణి || ౭ ||

చింతయామాస చ తదా రామః పితృహితే రతః |
కిం స్విదద్యైవ నృపతిర్న మాం ప్రత్యభినందతి || ౮ ||

అన్యదా మాం పితా దృష్ట్వా కుపితోఽపి ప్రసీదతి |
తస్య మామద్య సంప్రేక్ష్య కిమాయాసః ప్రవర్తతే || ౯ ||

స దీన ఇవ శోకార్తో విషణ్ణవదనద్యుతిః |
కైకేయీమభివాద్యైవ రామో వచనమబ్రవీత్ || ౧౦ ||

కచ్చిన్మయా నాపరాద్ధమజ్ఞానాద్యేన మే పితా |
కుపితస్తన్మమాచక్ష్వ త్వం చైవైనం ప్రసాదయ || ౧౧ ||

అప్రసన్నమనాః కిం ను సదా మాం ప్రతి వత్సలః |
వివర్ణవదనో దీనో న హి మామభిభాషతే || ౧౨ ||

శారీరో మానసో వాఽపి కచ్చిదేనం న బాధతే |
సంతాపో వాఽభితాపో వా దుర్లభం హి సదా సుఖమ్ || ౧౩ ||

కచ్చిన్న కించిద్భరతే కుమారే ప్రియదర్శనే |
శత్రుఘ్నే వా మహాసత్త్వే మాతౄణాం వా మమాశుభమ్ || ౧౪ ||

అతోషయన్మహారాజమకుర్వన్వా పితుర్వచః |
ముహూర్తమపి నేచ్ఛేయం జీవితుం కుపితే నృపే || ౧౫ ||

యతోమూలం నరః పశ్యేత్ప్రాదుర్భావమిహాత్మనః |
కథం తస్మిన్న వర్తేత ప్రత్యక్షే సతి దైవతే || ౧౬ ||

కచ్చిత్తే పరుషం కించిదభిమానాత్పితా మమ |
ఉక్తో భవత్యా కోపేన యత్రాస్య లులితం మనః || ౧౭ ||

ఏతదాచక్ష్వ మే దేవి తత్త్వేన పరిపృచ్ఛతః |
కిం నిమిత్తమపూర్వోఽయం వికారో మనుజాధిపే || ౧౮ ||

ఏవముక్తా తు కైకేయీ రాఘవేణ మహాత్మనా |
ఉవాచేదం సునిర్లజ్జా ధృష్టమాత్మహితం వచః || ౧౯ ||

న రాజా కుపితో రామ వ్యసనం నాస్య కించన |
కించిన్మనోగతం త్వస్య త్వద్భయాన్నాభిభాషతే || ౨౦ ||

ప్రియం త్వామప్రియం వక్తుం వాణీ నాస్యోపవర్తతే |
తదవశ్యం త్వయా కార్యం యదనేనాశ్రుతం మమ || ౨౧ ||

ఏష మహ్యం వరం దత్త్వా పురా మామభిపూజ్య చ |
స పశ్చాత్తప్యతే రాజా యథాఽన్యః ప్రాకృతస్తథా || ౨౨ ||

అతిసృజ్య దదానీతి వరం మమ విశాంపతిః |
స నిరర్థం గతజలే సేతుం బంధితుమిచ్ఛతి || ౨౩ ||

ధర్మమూలమిదం రామ విదితం చ సతామపి |
తత్సత్యం న త్యజేద్రాజా కుపితస్త్వత్కృతే యథా || ౨౪ ||

యది తద్వక్ష్యతే రాజా శుభం వా యది వాఽశుభమ్ |
కరిష్యసి తతః సర్వమాఖ్యాస్యామి పునస్త్వహమ్ || ౨౫ ||

యది త్వభిహితం రాజ్ఞా త్వయి తన్న విపత్స్యతే |
తతోఽహమభిధాస్యామి న హ్యేష త్వయి వక్ష్యతి || ౨౬ ||

ఏతత్తు వచనం శ్రుత్వా కైకేయ్యా సముదాహృతమ్ |
ఉవాచ వ్యథితో రామస్తాం దేవీం నృపసన్నిధౌ || ౨౭ ||

అహో ధిఙ్నార్హసే దేవి వక్తుం మామీదృశం వచః |
అహం హి వచనాద్రాజ్ఞః పతేయమపి పావకే || ౨౮ ||

భక్షయేయం విషం తీక్ష్ణం మజ్జేయమపి చార్ణవే |
నియుక్తో గురుణా పిత్రా నృపేణ చ హితేన చ || ౨౯ ||

తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితమ్ |
కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్నాభిభాషతే || ౩౦ ||

తమార్జవసమాయుక్తమనార్యా సత్యవాదినమ్ |
ఉవాచ రామం కైకేయీ వచనం భృశదారుణమ్ || ౩౧ ||

పురా దైవాసురే యుద్ధే పిత్రా తే మమ రాఘవ |
రక్షితేన వరౌ దత్తౌ సశల్యేన మహారణే || ౩౨ ||

తత్ర మే యాచితో రాజా భరతస్యాభిషేచనమ్ |
గమనం దండకారణ్యే తవ చాద్యైవ రాఘవ || ౩౩ ||

యది సత్యప్రతిజ్ఞం త్వం పితరం కర్తుమిచ్ఛసి |
ఆత్మానం చ నరశ్రేష్ఠ మమ వాక్యమిదం శృణు || ౩౪ ||

సన్నిదేశే పితుస్తిష్ఠ యథాఽనేన ప్రతిశ్రుతమ్ |
త్వయాఽరణ్యం ప్రవేష్టవ్యం నవ వర్షాణి పంచ చ || ౩౫ ||

భరతస్త్వభిషిచ్యేత యదేతదభిషేచనమ్ |
త్వదర్థే విహితం రాజ్ఞా తేన సర్వేణ రాఘవ || ౩౬ ||

సప్త సప్త చ వర్షాణి దండకారణ్యమాశ్రితః |
అభిషేకమిమం త్యక్త్వా జటాజినధరో వస || ౩౭ ||

భరతః కోసలపురే ప్రశాస్తు వసుధామిమామ్ |
నానారత్నసమాకీర్ణాం సవాజిరథకుంజరామ్ || ౩౮ ||

ఏతేన త్వాం నరేంద్రోఽయం కారుణ్యేన సమాప్లుతః |
శోకసంక్లిష్టవదనో న శక్నోతి నిరీక్షితుమ్ || ౩౯ ||

ఏతత్కురు నరేంద్రస్య వచనం రఘునందన |
సత్యేన మహతా రామ తారయస్వ నరేశ్వరమ్ || ౪౦ ||

ఇతీవ తస్యాం పరుషం వదంత్యాం
న చైవ రామః ప్రవివేశ శోకమ్ |
ప్రవివ్యథే చాపి మహానుభావో
రాజా తు పుత్రవ్యసనాభితప్తః || ౪౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టాదశః సర్గః || ౧౮ ||

Ayodhya Kanda Sarga 18 Meaning In Telugu

రాముడు తండ్రిగారైన దశరథ మహారాజు అంత:పురములో ప్రవేశించాడు. లక్ష్మణుడు ద్వారము బయట నిలబడ్డాడు. న్నతాసనముమీద కూర్చొని ఉన్న తండ్రి గారిని చూచాడు రాముడు. తండ్రి మొహములో ఆనందము కనపడటం లేదు. ఏదో చింత తండ్రిమొహంలో కనపడటం చూచాడు రాముడు.

రాముడు ముందుగా తన తండ్రి దశరథునకు పాదాభి వందనము చేసాడు. తరువాత పక్కనే నిలబడిఉన్న తన తల్లి కైకకు పాదాభివందనము చేసాడు.

దశరథుడు రాముని వంక దీనంగా చూచాడు. “రామా!” అని ఒక్కమాట అతికష్టం మీద అన్నాడు. దుఃఖము పొంగుకొని రాగా తల వంచుకొని తలను చేత్తో పట్టుకొని కూర్చున్నాడు.

తండ్రిగారి పరిస్థితి చూచి రాముడు ఆశ్చర్యపోయాడు. ఇంతకు ముందు తండ్రిని ఇలాంటి పరిస్థితిలో ఎన్నడూ చూడలేదు రాముడు. ఎంతటి క్లిష్టమైన రాచకార్యములలో మునిగి ఉన్నా, తనను చూడగానే దశరథుడు “నాయనా! రామా!

నా దగ్గరకు రా!” అని ఆప్యాయంగా పిలిచి తన పక్కనే కూర్చోపెట్టుకొనే వాడు. అలాంటిది ఇప్పుడు, తన పట్టాభిషేక సమయములో, ఇంతటి సంతోష సమయంలో, తండ్రిగారు ఇలా చింతా క్రాంతమైన ముఖంతో ఉండటం రామునికి ఆశ్చర్యం కలిగించింది. తనను ఎప్పుడూ సంతో షంగా పలకరించే తండ్రి ఇలా ముభావంగా ఉండటానికి కారణం తెలియక తల్లడిల్లిపోతున్నాడు రాముడు.

కైక వంక చూచాడు. “అమ్మా! తండ్రిగారికి నా వలన ఏమైనా అపరాథము జరిగిందా! నేను ఏమన్నా పొరపాటు చేసానా! నా తండ్రి నా మీద కోపంగా ఉండటానికి కారణమేమి? అమ్మా! నీవైనా తండ్రి గారికి నా మీద అనుగ్రహం కలిగేట్టు చెయ్యమ్మా! లేకపోతే ఎప్పుడూ నేనంటే ప్రసన్నంగా ఉండే తండ్రిగారు ఈరోజు నా మీద కోపంగా  అమ్మా! తండ్రిగారికి శరీరంలో బాగా లేదా! రాజవైద్యులను సంప్రదించారా అమ్మా! లేక మానసికంగా ఏమైనా బాధపడుతున్నారా! చెప్పమ్మా! అమ్మా! మానవులకు సుఖదు:ఖాలు సహజం కదమ్మా!

అమ్మా! వారి మేనమామ గారింట్లో భరతుడు, శత్రుఘ్నుడు క్షేమంగా ఉన్నారు కదా! వారి కేమీ కాలేదు కదా! అమ్మా! మీకు గానీ, మా తల్లి కౌసల్యకు గానీ సుమిత్రకు గానీ అసౌకర్యము ఏమీ కలగలేదు కదా!

అమ్మా! నాన్నగారి దుఃఖము పోగొట్టడానికి ఏమైనా చేస్తాను అమ్మా! తండ్రిగారు దుఃఖపడుతుంటే నేను క్షణకాలం కూడా జీవించలేనమ్మా! ఎందుకంటే నాకు ఈ జన్మను, ఈ శరీరాన్ని ఇచ్చింది నా తండ్రి. ఈ శరీరం ఆయన అధీనము. ఆయన కోసం, ఆయన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను.

అమ్మా! నాకు ఒక సందేహము. తమరికి మా తండ్రి గారికీ ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా! మీరేమన్నా తండ్రిగారిని అనకూడని మాటలు అన్నారా! అమ్మా! నిజం చెప్పమ్మా! ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తరువాత నా తండ్రిని నేను ఎప్పుడూ ఇటువంటి దీనస్థితిలో చూడలేదు.” అని కైకను బతిమాలాడు రాముడు.

రాముని ఆవేదన చూచి ఇదే సమయము అని అనుకొంది కైక. తన మనసులో మాట బయట పెట్టింది. “రామా! మీ తండ్రిగారికి శరీరంలో ఎలాంటి జబ్బూలేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. కాని తన మనసులో ఉన్న విషయం నీతో ఎలా చెప్పాలా అని మధనపడుతున్నారు. ఆ విషయం నీతో చెప్పడానికి భయపడుతున్నాడు కూడా.” అని ఒక క్షణం ఆగింది కైక. “చెప్పమ్మా! తండ్రిగారు నాతో చెప్పడానికి సంకోచిస్తున్న విషయం ఏమిటి? త్వరగా చెప్పమ్మా!” అని తొందర పెట్టాడు రాముడు. “ఏమీ లేదు రామా! చాలా స్వల్పమైన విషయం. పూర్వము దేవాసుర యుద్ధంలో మీ తండ్రిగారు నాకు రెండు వరములు ప్రసాదించారు. ఆ వరములు ఇప్పుడు నేను కోరుకున్నాను. ఆ వరముల గురించి నీతో చెప్పడానికి భయపడుతున్నారు మీ తండ్రిగారు.

రామా! ధర్మము నీకు తెలుసుకదా! సత్యము పలకడం, ఆడినమాట తప్పక పోవడం ఉత్తములకు పరమ ధర్మము కదా! మీ తండ్రి నీ కోసరం ఆడినమాట తప్పుతాను అని అంటున్నాడు. ఇదేమి న్యాయం?” అని పలికింది కైక.

రాముడు.
“అమ్మా! ఆ వరాలు ఏమిటమ్మా. నాతో చెప్పమ్మా!” అని అడిగాడు “అవి నీకు దు:ఖము కలిగించేవి రామా! నీవు ఏమీ అనుకోనంటే చెబుతాను. విన్న తరువాత నన్ను దూషించకూడదు. అసలు ఈ వరాల సంగతి మీ తండ్రిగారే నీకు చెప్పాలి. కానీ నీకు చెప్పడానికి నీతండ్రి సంకోచిస్తున్నాడు.” అని మరలా ఆగింది కైక.

ఈ సందిగ్ధము భరించలేకపోతున్నాడు రాముడు.
“అమ్మా! నా సంగతి తెలిసికూడా నీవు ఇలా మాట్లాడటం తగునా అమ్మా! నా తండ్రిగారు చెబితే నేను నా ప్రాణములు కూడా గడ్డిపోచలాగా విడిచిపెడతాను. అగ్నిలో దూకమన్నా దూకుతాను. విషం తాగమన్నా తాగుతాను. సముద్రంలో దూకమన్నా దూకుతాను.

అమ్మా! నా తండ్రి ఏది చెబితే అది చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అమ్మా! నేను రెండు మాటలు మాట్లాడను. నాది ఒకే మాట. చెప్పమ్మా! నేనేం చెయ్యాలి? నా తండ్రి దుఃఖము ఎలా పోగొట్టాలి?” అని అడిగాడు రాముడు.

కైకకు లోలోపల ఎంతో సంతోషంగా ఉంది. రాముడు దారిలోకి వచ్చాడు అనుకొంది. తన కోరికలు తీరే సమయం ఎంతోదూరం లేదు అనుకొంది. మెల్ల మెల్లగా తన మనసులో ఉన్న కోరికలు బయటపెట్టింది.

“పూర్వము జరిగిన దేవాసుర యుద్ధములో నేను నీ తండ్రి దశరథుని ప్రాణములు కాపాడినపుడు ఆయన నాకు రెండు వరములు ఇచ్చాడు. అవి ఇప్పుడు నేను కోరాను. అందులో మొదటిది. భరతుని అయోధ్యకు పట్టాభిషిక్తుని చేయడం. రెండవది నీవు పదునాలుగు సంవత్సరములు నారచీరలు ధరించి, కందమూలములు తింటూ దండకారణ్యములో వనవాసము చెయ్యడం.

నీ తండ్రి మాటను నిలబెట్టాలన్నా, నీవు పలికిన మాటలు, చేసిన ప్రతిజ్ఞ, నిలుపుకోవాలన్నా నేను చెప్పినట్టు చేయాలి. మీ తండ్రి గారి ఆజ్ఞ పాలించడం నీ ధర్మం. అందుకని నీవు పదునాలుగు సంవత్సరములు వనవాసము చెయ్యాలి. నీ పట్టాభిషేకము కొరకు నీ జరిగిన ఏర్పాట్లతోనే నీకు బదులు భరతునికి పట్టాభిషేకము జరగాలి. భరతుడు రాజ్యము చేస్తుంటే, అతనికి నీవు అడ్డు కాకుండా వనములలో ఉండాలి.

ఈ విషయములను నీతో చెప్పడానికి నీ తండ్రి సంకోచి స్తున్నాడు. బాధపడుతున్నాడు. అందుకని ఆయన మాటలుగా నేను నీకు చెబుతున్నాను. నీ తండ్రి మాటను నిలబెట్టి, ఆయన కీర్తిని ముల్లోకాలలో వ్యాపింపజెయ్యి. కుమారుడుగా అదే నీ కర్తవ్యము కదా! నీ సత్యవాక్పరిపాలన వలన నీ తండ్రి తరిస్తాడు.” అని పలికింది కైక.

కైక ఆ మాదిరి చెబుతూ ఉంటే దశరథుడు కోపంతో రగిలిపోతున్నాడు. బాధతో కుమిలిపోతున్నాడు. రాముని మొహం చూడలేక సిగ్గుతో తలదించుకున్నాడు. కాని రాముడు మాత్రము చిరునవ్వుతో తల్లి కైక మాటలు విన్నాడు. ఆయన మొహంలో ఏ మాత్రం బాధ కనిపించలేదు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదునెనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకోనవింశః సర్గః (19) >>

Balakanda Sarga 24 In Telugu – బాలకాండ చతుర్వింశః సర్గః

Balakanda Sarga 24 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఇది రామాయణం బాలకాండలోని 24వ సర్గ. ఈ సర్గలో, రాముడు శివధనుస్సును సమర్థంగా తేగలగడం చూసి, జనక మహారాజు ఆశ్చర్యానికి గురవుతాడు. వెంటనే, సీతాదేవిని రాముడికి వరించాలనే నిర్ణయం తీసుకుంటాడు. జనక మహారాజు తన దూతలను అయోధ్యకు పంపించి, రాముడి తండ్రి దశరథ మహారాజుకు ఈ శుభవార్తను తెలియజేస్తాడు. దశరథుడు ఈ విషయం విని, సంతోషంతో మిథిలాపురికి బయలుదేరతాడు.

తాటకావనప్రవేశః 

తతః ప్రభాతే విమలే కృతాఽఽహ్నికమరిందమౌ |
విశ్వామిత్రం పురస్కృత్య నద్యాస్తీరముపాగతౌ ||

1

తే చ సర్వే మహాత్మానో మునయః సంశ్రితవ్రతాః |
ఉపస్థాప్య శుభాం నావం విశ్వామిత్రమథాబ్రువన్ ||

2

ఆరోహతు భవాన్నావం రాజపుత్రపురస్కృతః |
అరిష్ఠం గచ్ఛ పంథానం మా భూత్కాలస్య పర్యయః ||

3

విశ్వామిత్రస్తథేత్యుక్త్వా తానృషీనభిపూజ్య చ |
తతార సహితస్తాభ్యాం సరితం సాగరం‍గమామ్ ||

4

తతః శుశ్రావ తం శబ్దమతిసంరంభవర్ధనమ్ |
మధ్యమాగమ్య తోయస్య సహ రామః కనీయసా ||

5

అథ రామః సరిన్మధ్యే పప్రచ్ఛ మునిపుంగవమ్ |
వారిణో భిద్యమానస్య కిమయం తుములో ధ్వనిః ||

6

రాఘవస్య వచః శ్రుత్వా కౌతూహలసమన్వితమ్ |
కథయామాస ధర్మాత్మా తస్య శబ్దస్య నిశ్చయమ్ ||

7

కైలాసపర్వతే రామ మనసా నిర్మితం సరః |
బ్రహ్మణా నరశార్దూల తేన ఇదం మానసం సరః ||

8

తస్మాత్సుస్రావ సరసః సాఽయోధ్యాముపగూహతే |
సరఃప్రవృత్తా సరయూః పుణ్యా బ్రహ్మసరశ్చ్యుతా ||

9

తస్యాయమతులః శబ్దో జాహ్నవీమభివర్తతే |
వారిసంక్షోభజో రామ ప్రణామం నియతః కురు ||

10

తాభ్యాం తు తావుభౌ కృత్వా ప్రణామమతిధార్మికౌ |
తీరం దక్షిణమాసాద్య జగ్మతుర్లఘువిక్రమౌ ||

11

స వనం ఘోరసంకాశం దృష్ట్వా నృపవరాత్మజః |
అవిప్రహతమైక్ష్వాకః పప్రచ్ఛ మునిపుంగవమ్ ||

12

అహో వనమిదం దుర్గం ఝిల్లికాగణనాదితమ్ |
భైరవైః శ్వాపదైః కీర్ణం శకుంతైర్దారుణారుతైః ||

13

నానాప్రకారైః శకునైర్వాశ్యద్భిర్భైరవైఃస్వనైః |
సింహవ్యాఘ్రవరాహైశ్చ వారణైశ్చోపశోభితమ్ ||

14

ధవాశ్వకర్ణకకుభైర్బిల్వతిందుకపాటలైః |
సంకీర్ణం బదరీభిశ్చ కిం న్వేతద్దారుణం వనమ్ ||

15

తమువాచ మహాతేజా విశ్వామిత్రో మహామునిః |
శ్రూయతాం వత్స కాకుత్స్థ యస్యైతద్దారుణం వనమ్ ||

16

ఏతౌ జనపదౌ స్ఫీతౌ పూర్వమాస్తాం నరోత్తమ |
మలదాశ్చ కరూశాశ్చ దేవనిర్మాణనిర్మితౌ ||

17

పురా వృత్రవధే రామ మలేన సమభిప్లుతమ్ |
క్షుధా చైవ సహస్రాక్షం బ్రహ్మహత్యా సమావిశత్ ||

18

తమింద్రం స్నాపయన్దేవా ఋషయశ్చ తపోధనాః |
కలశైః స్నాపయామాసుర్మలం చాస్య ప్రమోచయన్ ||

19

ఇహ భూమ్యాం మలం దత్త్వా దత్త్వా కారూశమేవ చ |
శరీరజం మహేంద్రస్య తతో హర్షం ప్రపేదిరే ||

20

నిర్మలో నిష్కరూశశ్చ శుచిరింద్రో యదాఽభవత్ |
దదౌ దేశస్య సుప్రీతో వరం ప్రభురనుత్తమమ్ ||

21

ఇమౌ జనపదౌ స్ఫీతౌ ఖ్యాతిం లోకే గమిష్యతః |
మలదాశ్చ కరూశాశ్చ మమాంగమలధారిణౌ ||

22

సాధు సాధ్వితి తం దేవాః పాకశాసనమబ్రువన్ |
దేశస్య పూజాం తాం దృష్ట్వా కృతాం శక్రేణ ధీమతా ||

23

ఏతౌ జనపదౌ స్ఫీతౌ దీర్ఘకాలమరిందమ |
మలదాశ్చ కరూశాశ్చ ముదితౌ ధనధాన్యతః ||

24

కస్యచిత్వథ కాలస్య యక్షీ వై కామరూపిణీ |
బలం నాగసహస్రస్య ధారయంతీ తదా హ్యభూత్ ||

25

తాటకా నామ భద్రం తే భార్యా సుందస్య ధీమతః |
మారీచో రాక్షసః పుత్రో యస్యాః శక్రపరాక్రమః ||

26

వృత్తబాహుర్మహావీర్యో విపులాస్యతనుర్మహాన్ |
రాక్షసో భైరవాకారో నిత్యం త్రాసయతే ప్రజాః ||

27

ఇమౌ జనపదౌ నిత్యం వినాశయతి రాఘవ |
మలదాంశ్చ కరూశాంశ్చ తాటకా దుష్టచారిణీ ||

28

సేయం పంథానమావృత్య వసత్యధ్యర్ధయోజనే |
అత ఏవ చ గంతవ్యం తాటకాయా వనం యతః ||

29

స్వబాహుబలమాశ్రిత్య జహీమాం దుష్టచారిణీమ్ |
మన్నియోగాదిమం దేశం కురు నిష్కంటకం పునః ||

30

న హి కశ్చిదిమం దేశం శక్నోత్యాగంతుమీదృశమ్ |
యక్షిణ్యా ఘోరయా రామ ఉత్సాదితమసహ్యయా ||

31

ఏతత్తే సర్వమాఖ్యాతం యథైతద్దారుణం వనమ్ |
యక్ష్యా చోత్సాదితం సర్వమద్యాపి న నివర్తతే ||

32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుర్వింశః సర్గః ||

Balakanda Sarga 24 Meaning In telugu

మరునాడు ఉదయమే రామ లక్ష్మణులు, విశ్వామిత్రుడు ప్రాతః కాలము లో చేయవలసిన సంధ్యావందనాది కార్యక్రములు ముగించుకొని ప్రయాణము సాగించారు. గంగానదీ తీరమునకు వచ్చారు.

అక్కడ ఉన్న మునులు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు నదిని దాటడానికి ఒక నావను తీసుకొని వచ్చారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఆ నావను ఎక్కి గంగా నదిని దాటుతుండగా నది మధ్యలో నీరు బ్రద్దలగుతున్నట్టు పెద్దగా శబ్దం వచ్చింది. “మహర్షీ! ఆ శబ్దము ఏమిటి?” అని రామ లక్ష్మణులు విశ్వామిత్రుని అడిగారు. దాని గురించి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు.

” ఓ రామా! పూర్వము బ్రహ్మ దేవుడు తన సంకల్ప మాత్రం చేత హిమాచలము మీద ఒక సరస్సును నిర్మించాడు. దానికి మానస సరోవరము అని పేరు. ఆ సరస్సులో నుండి ఒక నది పుట్టింది. దాని పేరు సరయూ నది. ఆ సరయూ నది అయోధ్య మీదుగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ సరయూ నది మానస సరోవరమునుండి పుట్టుటచే పవిత్రమైనది. ఆ సరయూ నది ఈ ప్రదేశములో గంగానదిలో కలియుచున్నది. ఆ రెండు నదుల సంగమము వలననే ఈ ధ్వని పుట్టింది.” అని చెప్పాడు విశ్వామిత్రుడు.

రామ లక్ష్మణులు ఆ నదులకు భక్తితో నమస్కరించారు. తరువాత వారు గంగానది ఆవల ఒడ్డుకు చేరుకున్నారు. త్వర త్వరగా ప్రయాణము చేస్తున్నారు. మార్గ మధ్యంలో వారికి ఒక మానవ సంచారము లేని నిర్జనమైన అడవి కనపడింది. ఆ అడవి చాలా భయంకరంగా లోపలకు పోవడానికి వీలులేకుండా ఉంది. ఆ అడవిలో అనేక క్రూర జంతువులు సంచరిస్తున్నట్టు వాటి అరుపులు వినిపిస్తున్నాయి. ఆ వనము గురించి చెప్పమని రామలక్ష్మణులు అడిగారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.

” ఓ రామలక్ష్మణులారా! పూర్వము ఈ ప్రదేశములో రెండు రాజ్యములు ఉండేవి. ఇంద్రుడు వృత్రాసురుని సంహరించాడు. దాని వలన ఇంద్రునికి బ్రహ్మ హత్యా పాతకము చుట్టుకుంది. ఆ పాతకము వలన ఇంద్రునికి ఆకలి వేయసాగింది. అప్పుడు దేవతలు, ఋషులు దేవేంద్రునికి మంత్రించిన నీటితో స్నానం చేయించారు. దేవేంద్రుడు తనకు అంటుకున్న ఆకలిని, బ్రహ్మ హత్య వలన కలిగిన మయలను ఈ ప్రదేశంలో వదిలిపెట్టాడు. అప్పుడు ఇంద్రుడు శుచి అయినాడు.

ఇంద్రుడు ఈ రెండు దేశములు మలదము కరూశము అనే పేర్లతో పిలువ బడుతాయి అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి ఈ రెండు దేశములు ధనధాన్యములతో కళ కళ లాడుతున్నాయి.

కొంత కాలము తర్వాత ఒక యక్షిణి ఇక్కడకు వచ్చింది. ఆ యక్షిణి మహా బలశాలి. ఆ యక్షిణి సుందు అనే రాక్షసుని భార్య. ఆమె కుమారుడే మారీచుడు అనే రాక్షసుడు. ఆ మారీచుడు గొప్ప బలవంతుడు. మాయావి. ఎల్లప్పుడూ ప్రజలను బాధిస్తూ ఉండేవాడు.

తాటక అనే రాక్షసి ఈ రెండు దేశములను నాశనం చేసింది. ఇలా అరణ్యములుగా మార్చింది. ఆ అరణ్యములలో తన నివాసము ఏర్పరచు కున్నది. అందుకే దీనిని తాటక వనము అని అంటారు. ఈ అరణ్యము లోనికి ఎవరూ పోవడానికి సాహసించరు. ఇప్పుడు నువ్వు ఆ తాటక అనే రాక్షసిని సంహరించాలి. అది ఈ రెండు రాజ్యములను సర్వ నాశనము చేసింది. దానిని చంపితే గానీ ఇక్కడి మానవులు సుఖంగా జీవించలేరు.” అని విశ్వామిత్రుడు రాముడితో ఆ తాటక వృ త్తాంతము వివరంగా చెప్పాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై నాల్గవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ పంచవింశః సర్గః (25) >>

Ayodhya Kanda Sarga 17 In Telugu – అయోధ్యాకాండ సప్తదశః సర్గ

Ayodhya Kanda Sarga 17

“రామాయణం” లో అయోధ్యాకాండ సప్తదశః సర్గం (17వ సర్గ)లో, దశరథుడు రాముని వలసపంపిన బాధతో మరణిస్తాడు. భరతుడు, కైకేయి చేసిన దుష్టపనులను తెలుసుకొని, రాముని కోసం బయలుదేరతాడు. తన తండ్రి మరణం విన్న రాముడు, సీత మరియు లక్ష్మణులతో కలిసి సంతాపం వ్యక్తం చేస్తాడు. భరతుడు రాముని వనవాసం నుంచి తిరిగి రావాలని అభ్యర్థిస్తాడు, కానీ రాముడు తన ధర్మాన్ని పాటించి, వనవాసం కొనసాగించాలని నిర్ణయిస్తాడు. ఈ సర్గలో రాముడి ధైర్యం, విధేయత మరియు భరతుడి ప్రేమ, వాత్సల్యం ప్రధానాంశాలు. అతి క్లిష్ట సమయాల్లో కూడా రాముడు తన ధర్మపరమైన కట్టుబాట్లను పాటించడంలో నిలుస్తాడు.

రామాగమనమ్

స రామో రథమాస్థాయ సంప్రహృష్టసుహృజ్జనః |
పతాకాధ్వజసంపన్నం మహార్హాగరుధూపితమ్ || ౧ ||

అపశ్యన్నగరం శ్రీమాన్నానాజనసమాకులమ్ |
స గృహైరభ్రసంకాశైః పాండురైరుపశోభితమ్ || ౨ ||

రాజమార్గం యయౌ రామః మధ్యేనాగరుధూపితమ్ |
చందనానాం చ ముఖ్యానామగరూణాం చ సంచయైః || ౩ ||

ఉత్తమానాం చ గంధానాం క్షౌమకౌశాంబరస్య చ |
అవిద్ధాభిశ్చ ముక్తాభిరుత్తమైః స్ఫాటికైరపి || ౪ ||

శోభమానమసంబాధైస్తం రాజపథముత్తమమ్ |
సంవృతం వివిధైః పణ్యైర్భక్ష్యైరుచ్చావచైరపి || ౫ ||

దదర్శ తం రాజపథం దివి దేవపథం యథా |
దధ్యక్షతహవిర్లాజైర్ధూపైరగరుచందనైః || ౬ ||

నానామాల్యోపగంధైశ్చ సదాఽభ్యర్చితచత్వరమ్ |
ఆశీర్వాదాన్బహూన్ శృణ్వన్సుహృద్భిః సముదీరితాన్ || ౭ ||

యథాఽర్హం చాపి సంపూజ్య సర్వానేవ నరాన్యయౌ |
పితామహైరాచరితం తథైవ ప్రపితామహైః || ౮ ||

అద్యోపాదాయ తం మార్గమభిషిక్తోఽనుపాలయ |
యథా స్మ లాలితాః పిత్రా యథా పూర్వైః పితామహైః || ౯ ||

తతః సుఖతరం రామే వత్స్యామః సతి రాజని |
అలమద్య హి భుక్తేన పరమార్థైరలం చ నః || ౧౦ ||

యథా పశ్యామ నిర్యాంతం రామం రాజ్యే ప్రతిష్ఠితమ్ |
తతో హి నః ప్రియతరం నాన్యత్కించిద్భవిష్యతి || ౧౧ ||

యథాభిషేకో రామస్య రాజ్యేనామితతేజసః |
ఏతాశ్చాన్యాశ్చ సుహృదాముదాసీనః కథాః శుభాః || ౧౨ ||

ఆత్మసంపూజనీః శృణ్వన్యయౌ రామో మహాపథమ్ |
న హి తస్మాన్మనః కశ్చిచ్చక్షుషీ వా నరోత్తమాత్ || ౧౩ ||

నరః శక్నోత్యపాక్రష్టుమతిక్రాంతేఽపి రాఘవే |
యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి || ౧౪ ||

నిందితః స వసేల్లోకే స్వాత్మాఽప్యేనం విగర్హతే |
సర్వేషాం హి స ధర్మాత్మా వర్ణానాం కురుతే దయామ్ || ౧౫ ||

చతుర్ణాం హి వయస్థానాం తేన తే తమనువ్రతాః |
చతుష్పథాన్దేవపథాంశ్చైత్యాన్యాయతనాని చ || ౧౬ ||

ప్రదక్షిణం పరిహరన్జగామ నృపతేః సుతః |
స రాజకులమాసాద్య మేఘసంఘోపమైః శుభైః || ౧౭ ||

ప్రాసాదశృంగైర్వివిధైః కైలాసశిఖరోపమైః |
ఆవారయద్భిర్గగనం విమానైరివ పాండరైః || ౧౮ ||

వర్ధమానగృహైశ్చాపి రత్నజాలపరిష్కృతైః |
తత్పృథివ్యాం గృహవరం మహేంద్రభవనోపమమ్ || ౧౯ ||

రాజపుత్రః పితుర్వేశ్మ ప్రవివేశ శ్రియా జ్వలన్ |
స కక్ష్యా ధన్విభిర్గుప్తాస్తిస్రోఽతిక్రమ్య వాజిభిః || ౨౦ ||

పదాతిరపరే కక్ష్యే ద్వే జగామ నరోత్తమః |
స సర్వాః సమతిక్రమ్య కక్ష్యా దశరథాత్మజః |
సన్నివర్త్య జనం సర్వం శుద్ధాంతం పునరభ్యగాత్ || ౨౧ ||

తతః ప్రవిష్టే పితురంతికం తదా
జనః స సర్వో ముదితో నృపాత్మజే |
ప్రతీక్షతే తస్య పునర్వినిర్గమం
యథోదయం చంద్రమసః సరిత్పతిః || ౨౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తదశః సర్గః || ౧౭ ||

Ayodhya Kanda Sarga 17 Meaning In Telugu

రాముడు అయోధ్యా పురవీధుల గుండా వెళుతున్నాడు. శోభాయమానంగా అలంకరించిన అయోధ్యానగరాన్ని తనివిదీరా చూస్తున్నాడు. రాజమార్గములో అటు ఇటా నిలబడ్డ పౌరులు రాముని దీవిస్తున్నారు.

“ఓ రామా! నీవు అయోధ్యానగరమునక పట్టాభిషిక్తుడవై నీ తాత ముత్తాతలు అనుసరించిన ధర్మమార్గమును అనుసరించి ప్రజలను పాలింపుము. నీ పాలనలో ప్రజలు నీ తండ్రిపాలనలో కన్నా ఎక్కువగా సుఖిస్తారు.” అని మనసారా దీవిస్తున్నారు. ఇంకొంతమంది. “ఆహా! పట్టాభిషేకము చేసుకోబోతున్న రాముని చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. ఇంక మనకు అన్నపానీయాలు అక్కరలేదు.” అని అనుకొంటున్నారు.

ఇంకొంత మంది రాముడు వెళ్లినంత సేపూ అలాగే చూస్తున్నారు. ఈ రోజు రాముని చూడని జన్మ కూడా ఒక జన్మేనా అని అనుకొంటున్నారు.
ఆ ప్రకారంగా రాముడు అయోధ్యాపురవీధుల గుండా వెళు తున్నాడు. తుదకు దశరథమహారాజు మందిరము చేరుకున్నాడు. రాముడు మహారాజు మందిరము బయట రథము దిగి నడుచుకుంటూ అంతఃపురములోనికి వెళ్లాడు. రామునితో వచ్చిన వాళ్లందరూ రాజ మందిరము బయటనే నిలబడ్డారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదిహేడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అష్టాదశః సర్గః (18) >>

Balakanda Sarga 22 In Telugu – బాలకాండ ద్వావింశః సర్గః

Balakanda Sarga 22 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఇది రామాయణం బాలకాండలోని 22వ సర్గ. ఈ సర్గలో, విష్వామిత్రుడు రాముడు, లక్ష్మణులతో కలిసి మిథిలాపురికి చేరుకుంటారు. మిథిలాపురి చేరుకున్న తరువాత, వారు జనక మహారాజు నిర్వహించిన శివధనుర్థ్సవం గురించి తెలుసుకుంటారు. శివధనుస్సు ఒక మహా శక్తివంతమైన విల్లు, దానిని ఎవరైతే తీరిగించగలరో, ఆ వ్యక్తి సీతాదేవిని వరించవచ్చు. ఈ విషయం రాముడికి తెలిసిన వెంటనే, ఆయన ధనుస్సును చూడాలని ఆసక్తి చూపిస్తాడు.

విద్యాప్రదానమ్

తథా వసిష్ఠే బ్రువతి రాజా దశరథః సుతమ్ |
ప్రహృష్టవదనో రామమాజుహావ సలక్ష్మణమ్ ||

1

కృతస్వస్త్యయనం మాత్రా పిత్రా దశరథేన చ |
పురోధసా వసిష్ఠేన మంగలైరభిమంత్రితమ్ ||

2

స పుత్రం మూర్ధ్న్యుపాఘ్రాయ రాజా దశరథః ప్రియమ్ |
దదౌ కుశికపుత్రాయ సుప్రీతేనాంతరాత్మనా ||

3

తతో వాయుః సుఖస్పర్శో విరజస్కో వవౌ తదా |
విశ్వామిత్రగతం దృష్ట్వా రామం రాజీవలోచనమ్ ||

4

పుష్పవృష్టిర్మహత్యాసీద్దేవదుందుభినిఃస్వనైః |
శంఖదుందుభినిర్ఘోషః ప్రయాతే తు మహాత్మని ||

5

విశ్వామిత్రో యయావగ్రే తతో రామో మహాయశాః |
కాకపక్షధరో ధన్వీ తం చ సౌమిత్రిరన్వగాత్ ||

6

కలాపినౌ ధనుష్పాణీ శోభయానౌ దిశో దశ |
విశ్వామిత్రం మహాత్మానం త్రిశీర్షావివ పన్నగౌ |
అనుజగ్మతురక్షుద్రౌ పితామహమివాశ్వినౌ ||

7

తదా కుశికపుత్రం తు ధనుష్పాణీ స్వలంకృతౌ |
బద్ధగోధాంగులిత్రాణౌ ఖడ్గవంతౌ మహాద్యుతీ ||

8

కుమారౌ చారువపుషౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ |
అనుయాతౌ శ్రియా జుష్టౌ శోభయేతామనిందితౌ ||

9 [దీప్త్యా]

స్థాణుం దేవమివాచింత్యం కుమారావివ పావకీ |
అధ్యర్ధయోజనం గత్వా సరయ్వా దక్షిణే తటే ||

10

రామేతి మధురాం వాణీం విశ్వామిత్రోఽభ్యభాషత |
గృహాణ వత్స సలిలం మా భూత్కాలస్య పర్యయః ||

11

మంత్రగ్రామం గృహాణ త్వం బలామతిబలాం తథా |
న శ్రమో న జ్వరో వా తే న రూపస్య విపర్యయః ||

12

న చ సుప్తం ప్రమత్తం వా ధర్షయిష్యంతి నైరృతాః |
న బాహ్వోః సదృశో వీర్యే పృథివ్యామస్తి కశ్చన ||

13

త్రిషు లోకేషు వై రామ న భవేత్సదృశస్తవ |
న సౌభాగ్యే న దాక్షిణ్యే న జ్ఞానే బుద్ధినిశ్చయే ||

14

నోత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవానఘ |
ఏతద్విద్యాద్వయే లబ్ధే భవితా నాస్తి తే సమః ||

15

బలా చాతిబలా చైవ సర్వజ్ఞానస్య మాతరౌ |
క్షుత్పిపాసే న తే రామ భవిష్యేతే నరోత్తమ ||

16

బలామతిబలాం చైవ పఠతస్తవ రాఘవ |
[* గృహాణ సర్వలోకస్య గుప్తయే రఘునందన | *]
విద్యాద్వయమధీయానే యశశ్చాప్యతులం త్వయి ||

17

పితామహసుతే హ్యేతే విద్యే తేజఃసమన్వితే |
ప్రదాతుం తవ కాకుత్స్థ సదృశస్త్వం హి ధర్మిక ||

18

కామం బహుగుణాః సర్వే త్వయ్యేతే నాత్ర సంశయః |
తపసా సంభృతే చైతే బహురూపే భవిష్యతః ||

19

తతో రామో జలం స్పృష్ట్వా ప్రహృష్టవదనః శుచిః |
ప్రతిజగ్రాహ తే విద్యే మహర్షేర్భావితాత్మనః ||

20

విద్యాసముదితో రామః శుశుభే భూరివిక్రమః |
సహస్రరశ్మిర్భగవాన్ శరదీవ దివాకరః ||

21

గురుకార్యాణి సర్వాణి నియుజ్య కుశికాత్మజే |
ఊషుస్తాం రజనీం తీరే సరయ్వాః సుసుఖం త్రయః ||

22

దశరథనృపసూనుసత్తమాభ్యాం
తృణశయనేఽనుచితే సహోషితాభ్యామ్ |
కుశికసుతవచోఽనులాలితాభ్యాం
సుఖమివ సా విబభౌ విభావరీ చ ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్వావింశః సర్గః ||

Balakanda Sarga 22 Meaning In Telugu

వసిష్ఠుని మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. వెంటనే స్వయంగా వెళ్లి రాముని, రాముని వెంట లక్ష్మణుని సభా భవనము నకు తీసుకొని వచ్చాడు. కౌసల్య, సుమిత్ర, దశరథుడు కలిసి రామునికి లక్ష్మణునికి మంగళాచరణము చేసారు. తమ పుత్రులను ప్రియమారా ముద్దులు పెట్టుకున్నారు. దశరథుడు రాముని, లక్ష్మణుని విశ్వామిత్రుని చేతిలో పెట్టాడు. రాముడు, లక్ష్మణుడు వెంట నడువగా, విశ్వామిత్రుడు సభాభవనము నుండి బయలుదేరాడు.

ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, ఆయన వెనుక కోదండము చేతబూని కోదండ రాముడు, రాముని వెనుక ధనుర్ధారియైన లక్ష్మణుడు నడుస్తున్నారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఒకటిన్నర యోజనములు నడిచాడు. వారందరూ సరయూ నదికి దక్షిణ ప్రాంతమునకు చేరుకున్నారు.

అప్పుడు విశ్వామిత్రుడు రాముని “రామా!” అంటూ ప్రేమగా పిలిచాడు. రాముడు విశ్వామిత్రుని దగ్గరగా వచ్చాడు.

“రామా! నీవు ఆచమనము చేసి నా దగ్గరకు రా! నీకు బల, అతిబల అనే విద్యలను ఉపదేశిస్తాను. ఈ విద్యలను నీవు నేర్చుకుంటే నీకు ఆకలి, దప్పిక, శ్రమ, జ్వరము, ఉండవు.. నిన్ను ఎలాంటి రాక్షసులు కూడా ఏమీ చేయలేరు. రామా! నీవు ఈ విద్యలు నేర్చుకుంటే నీ తో సమానమైన వీరుడు, పరాక్రమ వంతుడు ముల్లోకములలో ఉండడు.

రామా! సౌభాగ్యమునందు గానీ, సామర్ధ్యము నందు గానీ, జ్ఞానము నందు గానీ, బుద్ధి యందు గానీ, నీతో సమానమైన వాడు ముల్లోకములలో లేడు. దానికి తోడు నీవు ఈ బల, అతిబల అనే విద్యలు నేర్చుకుంటే, నీతో సమానమైన వాడు వర్తమానములో గానీ, భవిష్యత్తులో గాని ఉండడు, ఉండబోడు. ఈ విద్యలు బ్రహ్మదేవునిచే సృష్టింపబడినవి, వాటిని అభ్యసించుటకు నీవే తగినవాడవు.” అని పలికాడు విశ్వామిత్రుడు.

ఆ మాటలను సావధానంగా విన్న రాముడు వెంటనే ఆచమనము చేసి విశ్వామి ముందు కూర్చున్నాడు. నిశ్చలమైన మనస్సుతో రాముడు విశ్వామిత్రుని వద్ద నుండి బల, అతిబల అనే విద్యలను స్వీకరించాడు. ఆ రోజు రాత్రి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులతో కలిసి సరయూ తీరమున విశ్రమించాడు. అంతకు ముందు అలవాటు లేని దర్భ చాపలపై పడుకొనుటకు రామ లక్ష్మణులు కొంచం ఇబ్బంది పడ్డారు. కాని విశ్వామిత్రుడు వారిని బుజ్జగించి పడుకోబెట్టాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై రెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ త్రయోవింశః సర్గః (23) >>

Balakanda Sarga 21 In Telugu – బాలకాండ ఏకవింశః సర్గః

Balakanda Sarga 21 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము.  బాలకాండ లోని ఏకవింశః సర్గలో, ఋషి విశ్వామిత్రుని కోపం దశరథ రాజుపై చూపబడింది. విశ్వామిత్ర ఋషిని శాంతింపజేయడానికి, వశిష్ట ఋషి జోక్యం చేసుకుని, రాముడిని విశ్వామిత్ర ఋషితో పంపమని దశరథ రాజును ఒప్పించాడు. అలా చేస్తున్నప్పుడు, వశిష్ట ఋషి విశ్వామిత్ర మహర్షి యొక్క సామర్థ్యాలను, అతని ఆయుధ జ్ఞానాన్ని వివరించాడు. రాముడిని విశ్వామిత్రునితో పంపిస్తే ఆ ఆయుధాలన్నీ రాముడికి ఇవ్వబడతాయని వశిష్ఠుడు కూడా సూచిస్తాడు. చివరికి దశరథుడు రాముని పంపడానికి అంగీకరించాడు.

వసిష్ఠవాక్యమ్

తచ్ఛ్రుత్వా వచనం తస్య స్నేహపర్యాకులాక్షరమ్ |
సమన్యుః కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతిమ్ ||

1

పూర్వమర్థం ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్ఛసి |
రాఘవాణామయుక్తోఽయం కులస్యాస్య విపర్యయః ||

2

యదీదం తే క్షమం రాజన్గమిష్యామి యథాగతమ్ |
మిథ్యాప్రతిజ్ఞః కాకుత్స్థ సుఖీ భవ సబాంధవాః ||

3

తస్య రోషపరీతస్య విశ్వామిత్రస్య ధీమతః |
చచాల వసుధా కృత్స్నా వివేశ చ భయం సురాన్ ||

4

త్రస్తరూపం తు విజ్ఞాయ జగత్సర్వం మహానృషిః |
నృపతిం సువ్రతో ధీరో వసిష్ఠో వాక్యమబ్రవీత్ ||

5

ఇక్ష్వాకూణాం కులే జాతః సాక్షాద్ధర్మ ఇవాపరః |
ధృతిమాన్సువ్రతః శ్రీమాన్న ధర్మం హాతుమర్హసి ||

6

త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ |
స్వధర్మం ప్రతిపద్యస్వ నాధర్మం వోఢుమర్హసి ||

7

సంశ్రుత్యైవం కరిష్యామీత్యకుర్వాణస్య రాఘవ |
ఇష్టాపూర్తవధో భూయాత్తస్మాద్రామం విసర్జయ ||

8

కృతాస్త్రమకృతాస్త్రం వా నైవం శక్ష్యంతి రాక్షసాః |
గుప్తం కుశికపుత్రేణ జ్వలనేనామృతం యథా ||

9

ఏష విగ్రహవాన్ధర్మ ఏష వీర్యవతాం వరః |
ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణమ్ ||

10

ఏషోఽస్త్రాన్వివిధాన్వేత్తి త్రైలోక్యే సచరాచరే |
నైనమన్యః పుమాన్వేత్తి న చ వేత్స్యంతి కేచన ||

11

న దేవా నర్షయః కేచిన్నాసురా న చ రాక్షసాః |
గంధర్వయక్షప్రవరాః సకిన్నరమహోరగాః ||

12

సర్వాస్త్రాణి కృశాశ్వస్య పుత్రాః పరమధార్మికాః |
కౌశికాయ పురా దత్తా యదా రాజ్యం ప్రశాసతి ||

13

తేఽపి పుత్రా కృశాశ్వస్య ప్రజాపతిసుతాసుతాః |
నైకరూపా మహావీర్యా దీప్తిమంతో జయావహాః ||

14

జయా చ సుప్రభా చైవ దక్షకన్యే సుమధ్యమే |
తే సువాతేఽస్త్రశస్త్రాణి శతం పరమభాస్వరమ్ ||

15

పంచాశతం సుతాఁల్లేభే జయా నామ పరాన్పురా |
వధాయాసురసైన్యానామమేయాన్ కామరూపిణః ||

16

సుప్రభాఽజనయచ్చాపి పుత్రాన్పంచాశతం పునః |
సంహారాన్నామ దుర్ధర్షాన్దురాక్రామాన్బలీయసః ||

17

తాని చాస్త్రాణి వేత్త్యేష యథావత్కుశికాత్మజః |
అపూర్వాణాం చ జననే శక్తో భూయశ్చ ధర్మవిత్ ||

18

తేనాస్య మునిముఖ్యస్య సర్వజ్ఞస్య మహాత్మనః |
న కించిదప్యవిదితం భూతం భవ్యం చ రాఘవ ||

19

ఏవం వీర్యో మహాతేజా విశ్వామిత్రో మహాతపాః | [మహాయశాః]
న రామగమనే రాజన్సంశయం గంతుమర్హసి ||

20

తేషాం నిగ్రహణే శక్తః స్వయం చ కుశికాత్మజః |
తవ పుత్రహితార్థాయ త్వాముపేత్యాభియాచతే ||

21

ఇతి మునివచనాత్ప్రసన్నచిత్తో
రఘువృషభశ్చ ముమోద భాస్వరాంగః |
గమనమభిరురోచ రాఘవస్య
ప్రథితయశాః కుశికాత్మజాయ బుధ్యా ||

22

Balakanda Sarga 21 In Telugu Pdf With Meaning

ఎప్పుడైతే దశరథుడు రాముని యాగ సంరక్షణార్ధము విశ్వామిత్రుని వెంట పంపను అని అన్నాడో, విశ్వామిత్రుడు ఆగ్రహోదగ్రుడు అయ్యాడు. ఆయన కోపం తారస్థాయి కి చేరుకుంది.

“దశరథీ! ఇక్ష్వాకుల వంశములో జన్మించిన నీవు ఆడిన మాట తప్పావు. ఇది రఘు వంశము వారికి ఉచితము కాదు. ఆడిన మాటను తప్పడం నీకు ఉచితము అని తోస్తే నేను వచ్చిన దారినే వెళ్లిపోతాను. ఇచ్చిన మాటను తప్పిన నీవు నీ భార్యాబిడ్డలతో సుఖంగాఉండు.” అనిఅన్నాడు విశ్వామిత్రుడు కోపంగా.

విశ్వామిత్రునికి కోపం వచ్చింది అని తెలుసుకున్నాడు పురోహితుడు, కులగురువు వసిష్టుడు. వెంటనే లేచాడు. దశరథుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు.

“ఓ దశరథ మహారాజా! నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. ధర్మ సంస్థాపనకు కంకణము కట్టుకున్నావు. మంచి ధైర్యవంతుడివి. అటువంటి నీవు ఈ మాదిరి పుత్ర వ్యామోహంతో ధర్మము తప్పి ఆడిన మాట తప్పడం తగునా! నీవు నీ ధర్మమును ఆచరించి. అధర్మమును విడిచిపెట్టు. ఆడిన మాట తప్పడం అంటే నీవు ఇప్పటి దాకా సంపాదించుకున్న పుణ్యమును నశింపచేసుకోవడమే. కాబట్టి నీవు ఇచ్చిన మాట ప్రకారము రాముని విశ్వామిత్రుని వెంట పంపు.

ఓ దశరథ మహారాజా! నా మాట విను. విశ్వామిత్రుడు వెంట ఉంటే నీ రామునికి వచ్చిన భయం ఏమీ లేదు. ఎందుకంటే విశ్వామిత్రునికి తెలియని అస్త్ర శస్త్రములు ఏమీ లేవు. ఆయనకు తెలిసిన అస్త్ర శస్త్రములు దేవతలకు, రాక్షసులకు, గంధర్వులకు ఎవరికీ తెలియవు. పూర్వము భృశాశ్వసుడు తనకు తెలిసిన అస్త్ర శస్త్రములు అన్నీ విశ్వామిత్రునికి ఇచ్చాడు. ఆ అస్త్రములు సామాన్యమైనవి కావు. అవి భృశాశ్వసునకు దక్షప్రజాపతి కుమార్తెలకు జన్మించిన అస్త్రములు. అవి గొప్ప పరాక్రమము, శక్తి కలవి.

పూర్వము దక్షప్రజాపతి కుమార్తె జయ అను ఆమె రాక్షసులను సంహరించుటకు యాభై మంది పుత్రులను కన్నది. వారు కామ రూపులు, మహాబలురు. పరాక్రమవంతులు. వారే ఇప్పుడు అస్త్ర రూపములలో విశ్వామిత్రుని వద్ద ఉన్నారు. అవే కాదు ఈ విశ్వామిత్రుడు కొత్త కొత్త అస్త్రములను సృష్టించుటలో కూడా సమర్ధుడు. అటువంటి మహాపురుషుని వెంట రాముని పంపుటకు ఎందుకు సందేహిస్తావు?

నీకు ఇంకో విషయం తెలుసా! ఆ రాక్షసులను చంపడానికి విశ్వామిత్రునకు ఒక క్షణం కూడా పట్టదు. కాని నీకు నీ కుమారులకు పేరు ప్రతిష్ఠలు తీసుకు రావడానికే నీ దగ్గరకు వచ్చి నీ కుమారుడు రాముని పంపమని అర్థిస్తున్నాడు. ఈ విషయం నీవు అర్థం చేసుకొని రాముని విశ్వామిత్రుని వెంట పంపు.” అని పలికాడు.

కులగురువు వసిష్టుని మాటలకు ప్రసన్నుడయ్యాడు దశరథుడు. రాముని విశ్వామిత్రుని వెంట పంపుటకు అంగీకరించాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఒకటవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ ద్వావింశః సర్గః (22) >>

Balakanda Sarga 20 In Telugu – బాలకాండ వింశః సర్గః

Balakanda Sarga 20 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఇది రామాయణం బాలకాండ వింశః సర్గః: ఇందులో, విష్వామిత్ర మహర్షి రామ-లక్ష్మణులతో కలిసి సిద్ధాశ్రమంలో ప్రవేశిస్తారు. అక్కడ వారు యజ్ఞం ప్రారంభిస్తారు. రాక్షసులు యజ్ఞాన్ని భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. రాముడు తన వీర్యాన్ని ప్రదర్శించి, రాక్షసులను సంహరిస్తాడు. యజ్ఞం విజయవంతంగా పూర్తవుతుంది. విష్వామిత్రుడు రాముడి ధైర్యాన్ని మరియు శక్తిని ప్రశంసిస్తాడు.

దశరథవాక్యమ్

తచ్ఛ్రుత్వా రాజశార్దూలో విశ్వామిత్రస్య భాషితమ్ |
ముహూర్తమివ నిఃసంజ్ఞః సంజ్ఞావానిదమబ్రవీత్ ||

1

ఊనషోడశవర్షో మే రామో రాజీవలోచనః |
న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః ||

2

ఇయమక్షౌహిణీ పూర్ణా యస్యాహం పతిరీశ్వరః |
అనయా సంవృతో గత్వా యోద్ధాఽహం తైర్నిశాచరైః ||

3

ఇమే శూరాశ్చ విక్రాంతా భృత్యా మేఽస్త్రవిశారదాః |
యోగ్యా రక్షోగణైర్యోద్ధుం న రామం నేతుమర్హసి ||

4

అహమేవ ధనుష్పాణిర్గోప్తా సమరమూర్ధని |
యావత్ప్రాణాన్ధరిష్యామి తావద్యోత్స్యే నిశాచరైః ||

5

నిర్విఘ్నా వ్రతచర్యా సా భవిష్యతి సురక్షితా |
అహం తత్ర గమిష్యామి న రామం నేతుమర్హసి ||

6

బాలో హ్యకృతవిద్యశ్చ న చ వేత్తి బలాబలమ్ |
న చాస్త్రబలసంయుక్తో న చ యుద్ధవిశారదః ||

7

న చాసౌ రక్షసాం యోగ్యః కూటయుద్ధా హి తే ధ్రువమ్ |
విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే ||

8

జీవితుం మునిశార్దూల న రామం నేతుమర్హసి |
యది వా రాఘవం బ్రహ్మన్నేతుమిచ్ఛసి సువ్రత ||

9

చతురంగసమాయుక్తం మయా చ సహ తం నయ |
షష్టిర్వర్షసహస్రాణి జాతస్య మమ కౌశిక ||

10

దుఃఖేనోత్పాదితశ్చాయం న రామం నేతుమర్హసి |
చతుర్ణామాత్మజానాం హి ప్రీతిః పరమికా మమ ||

11

జ్యేష్ఠం ధర్మప్రధానం చ న రామం నేతుమర్హసి |
కిం వీర్యా రాక్షసాస్తే చ కస్య పుత్రాశ్చ కే చ తే ||

12

కథం ప్రమాణాః కే చైతాన్రక్షంతి మునిపుంగవ |
కథం చ ప్రతికర్తవ్యం తేషాం రామేణ రక్షసామ్ ||

13

మామకైర్వా బలైర్బ్రహ్మన్మయా వా కూటయోధినామ్ |
సర్వం మే శంస భగవన్కథం తేషాం మయా రణే ||

14

స్థాతవ్యం దుష్టభావానాం వీర్యోత్సిక్తా హి రాక్షసాః |
తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రోఽభ్యభాషత ||

15

పౌలస్త్యవంశప్రభవో రావణో నామ రాక్షసః |
స బ్రహ్మణా దత్తవరస్త్రైలోక్యం బాధతే భృశమ్ ||

16

మహాబలో మహావీర్యో రాక్షసైర్బహుభిర్వృతః |
శ్రూయతే హి మహావీర్యో రావణో రాక్షసాధిపః ||

17

సాక్షాద్వైశ్రవణభ్రాతా పుత్రో విశ్రవసో మునేః |
యదా స్వయం న యజ్ఞస్య విఘ్నకర్తా మహాబలః ||

18

తేన సంచోదితౌ ద్వౌ తు రాక్షసౌ సుమహాబలౌ |
మారీచశ్చ సుబాహుశ్చ యజ్ఞవిఘ్నం కరిష్యతః ||

19

ఇత్యుక్తో మునినా తేన రాజోవాచమునిం తదా |
న హి శక్తోఽస్మి సంగ్రామే స్థాతుం తస్య దురాత్మనః ||

20

స త్వం ప్రసాదం ధర్మజ్ఞ కురుష్వ మమ పుత్రకే |
మమ చైవాల్పభాగ్యస్య దైవతం హి భవాన్గురుః ||

21

దేవదానవగంధర్వా యక్షాః పతగపన్నగాః |
న శక్తా రావణం సోఢుం కిం పునర్మానవా యుధి ||

22

స హి వీర్యవతాం వీర్యమాదత్తే యుధి రాక్షసః |
తేన చాహం న శక్నోమి సంయోద్ధుం తస్య వా బలైః ||

23

సబలో వా మునిశ్రేష్ఠ సహితో వా మమాత్మజైః |
కథమప్యమరప్రఖ్యం సంగ్రామాణామకోవిదమ్ ||

24

బాలం మే తనయం బ్రహ్మన్నైవ దాస్యామి పుత్రకమ్ |
అథ కాలోపమౌ యుద్ధే సుతౌ సుందోపసుందయోః ||

25

యజ్ఞవిఘ్నకరౌ తౌ తే నైవ దాస్యామి పుత్రకమ్ |
మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ ||

26

తయోరన్యతరేణాహం యోద్ధా స్యాం ససుహృద్గణః |

[* అన్యథా త్వనునేష్యామి భవంతం సహ బాంధవైః | *]

ఇతి నరపతిజల్పనాద్ద్విజేంద్రం
కుశికసుతం సుమహాన్వివేశ మన్యుః |
సుహుత ఇవ మఖేఽగ్నిరాజ్యసిక్తః
సమభవదుజ్జ్వలితో మహర్షివహ్నిః ||

27

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే వింశః సర్గః ||

Balakanda Sarga 20 Meaning In Telugu

దశరథుడు విశ్వామిత్రునితో దుఃఖముతో కూడిన గద్గద స్వరంతో ఇలా అన్నాడు.

“ఓ మునీశ్వరా! నా రాముడు పదహారు సంవత్సరములు కూడా నిండని బాలుడు. రామునికి రాక్షసులతో యుద్ధము చేయగల శక్తి పరాక్రమములు ఉన్నవి అని నేను అనుకోడం లేదు. నా వద్ద ఒక అక్షౌహిణి సైన్యము ఉంది. నేను దానికి అధిపతిని. నేను నా సైన్యముతో వెళ్లి ఆ రాక్షసులను హతమారుస్తాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను ధనుర్ధారినై నా శరీరంలో ప్రాణములు ఉన్నంత వరకూ యాగ సంరక్షణ చేస్తాను.

ఈ పనికి రాముడు అనవసరం కదా మునీంద్రా! ఎందుకంటే రాముడు వయసులో చిన్నవాడు. యుద్ధ తంత్రములు తెలియని వాడు. ఇంకా యుద్ధ విద్యలు పూర్తి గానేర్వని వాడు. అందులోనూ మాయావులైన రాక్షసులతో యుద్ధం చేయడం రామునికి చేత కాదు.

ఓ మునీంద్రా! రాముడు నాకు ప్రాణంతో సమానం. రాముడు లేనిది నేను జీవించలేను. రాముని నా నుండి వేరు చేయకండి. కావాలంటే నన్ను నా సైన్యమును తీసుకొని వెళ్లండి. రాముడు నా పెద్దకుమారుడు. చాలాకాలం తరువాత కలిగిన పుత్ర సంతానము. రాముని నేను పంపలేను.

ఇంతకూ మునీంద్రా! ఆ రాక్షసులు ఎవరు? ఎక్కడి వారు? ఎవరి కుమారులు? వారి పరాక్రమమేమి? వారికి అండగా ఎవరు ఉన్నారు? వారిని ఎలా ఎదుర్కోవాలి?” అని వినయంగా అడిగాడు. దశరథుడు. దానికి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు.

“ఓ దశరథమహారాజా! పౌలస్త్య వంశంలో పుట్టిన వాడు, విశ్రవసుని కుమారుడు, కుబేరుని సోదరుడు అయిన రావణుడు అనే రాక్షస అంశ కలవాడు ఉన్నాడు. వాడు మహా బలవంతుడు. వీర్య వంతుడు. బ్రహ్మ చేత వరములు పొందిన వాడు. లెక్కలేనన్ని రాక్షస సైన్యము కలవాడు. బ్రహ్మ ఇచ్చిన వరములతో గర్వించి ముల్లోకముల లోని వారిని బాధిస్తున్నాడు. మారీచుడు, సుబాహుడు అనే వారు రావణుని సహచరులు. వారే ఇప్పుడు నేను చేయు యాగమునకు విఘ్నము కలుగ చేస్తున్నారు.” అని చెప్పాడు విశ్వామిత్రుడు.

ఆ మాటలు విన్న దశరథుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! మీరు చెప్పినదానిని బట్టి చూస్తుంటే నేను ఆ రాక్షసుల ముందు నిలువ లేను అని అనుకుంటున్నాను. అటువంటప్పుడు నా చిన్ని రాముడు వారిని ఎదిరించగలడా! తమరు చెప్పినట్టు దేవ, దానవ, గంధర్వులే రావణునికి ఎదురు నిలువ లేనపుడు మానవులము మేమెంత! కాబట్టి నేను గానీ నా కుమారులు గానీ ఆ రాక్షసులతో యుద్ధ చేయలేము. నా కుమారుడు రాముడు నన్ను పున్నామ నరకమునుండి రక్షించే వాడు. అతనిని తమరి వెంట రాక్షసులతో యుద్ధమునకు పంపలేను. సాక్షాత్తు యమునితో సమానమైన ఆ మారీచ సుబాహులను రాముడు ఎదుర్కొనలేడు. నేను వచ్చినా వారిలో ఒకరితో మాత్రమే యుద్ధము చేయగలను. ఈ సారికి మమ్ములను మన్నించి వదిలివేయండి.” అని ప్రార్థించాడు దశరథుడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవయ్యవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ ఏకవింశః సర్గః (21) >>

Ayodhya Kanda Sarga 5 In Telugu – అయోధ్యాకాండ పంచమః సర్గః

Ayodhya Kanda Sarga 5 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. పంచమః సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో పాటు ఆయోధ్యలో ఉన్న సందర్భాలపై దృష్టి సారిస్తాడు. ఈ సర్గ రాముని వైయక్తిక జీవితం, కుటుంబ బంధాలు మరియు ఆయోధ్యలోని ప్రజల అనురాగం పై కేంద్రీకృతమై ఉంది. రాముడు తన పితృ వాక్య పరిపాలనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో, తండ్రి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం సకల కష్టాలను ఎలా స్వీకరించాడో ఈ సర్గలో వివరించబడుతుంది.

వ్రతచర్యావిధానమ్

సందిశ్య రామం నృపతిః శ్వోభావిన్యభిషేచనే |
పురోహితం సమాహూయ వసిష్ఠం చేదమబ్రవీత్ ||

1

గచ్ఛోపవాసం కాకుత్స్థం కారయాద్య తపోధన |
శ్రీయశోరాజ్యలాభాయ వధ్వా సహ యతవ్రతమ్ ||

2

తథేతి చ స రాజానముక్త్వా వేదవిదాం వరః |
స్వయం వసిష్ఠో భగవాన్యయౌ రామనివేశనమ్ ||

3

ఉపవాసయితుం రామం మంత్రవన్మంత్రకోవిదః |
బ్రాహ్మం రథవరం యుక్తమాస్థాయ సుదృఢవ్రతః ||

4

స రామభవనం ప్రాప్య పాండురాభ్రఘనప్రభమ్ |
తిస్రః కక్ష్యా రథేనైవ వివేశ మునిసత్తమః ||

5

తమాగతమృషిం రామస్త్వరన్నివ ససంభ్రమః |
మానయిష్యన్స మానార్హం నిశ్చక్రామ నివేశనాత్ ||

6

అభ్యేత్య త్వరమాణశ్చ రథాభ్యాశం మనీషిణః |
తతోఽవతారయామాస పరిగృహ్య రథాత్స్వయమ్ ||

7

స చైనం ప్రశ్రితం దృష్ట్వా సంభాష్యాభిప్రసాద్య చ |
ప్రియార్హం హర్షయన్రామమిత్యువాచ పురోహితః ||

8

ప్రసన్నస్తే పితా రామ యౌవరాజ్యమవాప్స్యసి |
ఉపవాసం భవానద్య కరోతు సహ సీతయా ||

9

ప్రాతస్త్వామభిషేక్తా హి యౌవరాజ్యే నరాధిపః |
పితా దశరథః ప్రీత్యా యయాతిం నహుషో యథా ||

10

ఇత్యుక్త్వా స తదా రామముపవాసం యతవ్రతమ్ |
మంత్రవిత్కారయామాస వైదేహ్యా సహితం మునిః ||

11

తతో యథావద్రామేణ స రాజ్ఞో గురురర్చితః |
అభ్యనుజ్ఞాప్య కాకుత్స్థం యయౌ రామనివేశనాత్ ||

12

సుహృద్భిస్తత్ర రామోఽపి సుఖాసీనః ప్రియంవదైః |
సభాజితో వివేశాఽథ తాననుజ్ఞాప్య సర్వశః ||

13

ప్రహృష్టనరనారీకం రామవేశ్మ తదా బభౌ | [హృష్టనారీనరయుతం]
యథా మత్తద్విజగణం ప్రఫుల్లనలినం సరః ||

14

స రాజభవనప్రఖ్యాత్తస్మాద్రామనివేశనాత్ |
నిఃసృత్య దదృశే మార్గం వసిష్ఠో జనసంవృతమ్ || [నిర్గత్య]

15

బృందబృందైరయోధ్యాయాం రాజమార్గాః సమంతతః |
బభూవురభిసంబాధాః కుతూహలజనైర్వృతాః ||

16

జనబృందోర్మిసంఘర్షహర్షస్వనవతస్తదా |
బభూవ రాజమార్గస్య సాగరస్యేవ నిస్వనః ||

17

సిక్తసంమృష్టరథ్యా చ తదహర్వనమాలినీ |
ఆసీదయోధ్యా నగరీ సముచ్ఛ్రితగృహధ్వజా ||

18

తదా హ్యయోధ్యానిలయః సస్త్రీబాలాబలో జనః |
రామాభిషేకమాకాంక్షన్నాకాంక్షదుదయం రవేః ||

19

ప్రజాలంకారభూతం చ జనస్యానందవర్ధనమ్ |
ఉత్సుకోఽభూజ్జనో ద్రష్టుం తమయోధ్యామహోత్సవమ్ ||

20

ఏవం తం జనసంబాధం రాజమార్గం పురోహితః |
వ్యూహన్నివ జనౌఘం తం శనై రాజకులం యయౌ ||

21

సితాభ్రశిఖరప్రఖ్యం ప్రాసాదమధిరుహ్య సః |
సమీయాయ నరేంద్రేణ శక్రేణేవ బృహస్పతిః ||

22

తమాగతమభిప్రేక్ష్య హిత్వా రాజాసనం నృపః |
పప్రచ్ఛ స చ తస్మై తత్కృతమిత్యభ్యవేదయత్ ||

23

తేన చైవ తదా తుల్యం సహాసీనాః సభాసదః |
ఆసనేభ్యః సముత్తస్థుః పూజయంతః పురోహితమ్ ||

24

గురుణా త్వభ్యనుజ్ఞాతో మనుజౌఘం విసృజ్య తమ్ |
వివేశాంతఃపురం రాజా సింహో గిరిగుహామివ ||

25

తదగ్ర్యరూపం ప్రమదాజనాకులం [గణాకులం]
మహేంద్రవేశ్మప్రతిమం నివేశనమ్ |
విదీపయంశ్చారు వివేశ పార్థివః
శశీవ తారాగణసంకులం నభః ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచమః సర్గః ||

Ayodhya Kanda Sarga 5 Meaning In Telugu

తన దగ్గరనుండి రాముడు వెళ్లిపోయిన తరువాత దశరథుడు తన పురోహితుడు వసిష్ఠుని పిలిపించాడు. ఆయనతో ఇలా అన్నాడు.

“ఓ వసిష్ఠ మహామునీ! రేపే రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము నిశ్చయించాము కదా. అందుకని మీరు రాముని మందిరమునకు వెళ్లి, రాజ్యము, యశస్సు, సంపదలు కలిగేటట్టు రామునితో, సీతతో ఈ రోజు ఉపవాసవ్రతము చేయించండి.” అని అన్నాడు.

దశరథుని ఆదేశాను సారము వసిష్ఠుడు రాముని మందిరమునకు వెళ్లాడు. తన మందిరమునకు వచ్చిన వసిష్ఠునికి రాముడు ఎదురు వచ్చి, స్వాగత సత్కారములు చేసాడు. ఉచితా సనము మీద కూర్చో పెట్టాడు. అప్పుడు వసిష్ఠుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! రేపు ఉదయము నీకు యౌవరాజ్య పట్టాభిషేకము చేయవలెనని నీ తండ్రి దశరథుడు సంకల్పించాడు. ఆ సందర్భంలో నీవు ఈరోజు రాత్రి నీ భార్య సీతతో సహా ఉపవాస వ్రతము చేయాలి.” అని అన్నాడు. రాముడు సరే అన్నాడు. వసిష్ఠుడు రామునితో సీతతో వేదోక్తంగా ఉపవాసవ్రతము చేయించాడు. రాముడు సీత తమ గురువు గారైన వసిష్ఠును యధోచితంగా పూజించారు. తరువాత వసిష్ఠుడు రాముని మందిరము నుండి వెళ్లిపోయాడు.

ఈ వార్తవిన్న రాముని మిత్రులు, బంధువులు రాముని మందిరమునకు చేరుకున్నారు. రాముడు వారందరితో ప్రేమతో మాట్లాడాడు. రాముని మందిరము అంతా ఆ రాత్రి బంధుమిత్రులతో కళకళలాడింది.

మరునాడే పట్టాభిషేక మహోత్సవము కావడంతో అయోధ్యానగర వీధులన్నీ జనంతో కిట కిట లాడుతున్నాయి. నగరమంతా పచ్చని మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. పుర వీధులు అన్నీ పన్నీటితో తడిపారు. అరటి స్తంభాలు కట్టారు. తోరణాలు కట్టారు. జండాలతో అలంకరించారు. ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు. స్త్రీలు, బాలురు, వృద్ధులు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు రామ పట్టాభిషేకము చూద్దామా అని ఉవ్విళ్లూరుతున్నారు. రామ మందిరము నుండి బయలు దేరిన వసిష్ఠుడు, దారిలో క్రిక్కిరిసి ఉన్న జనమును తోసుకుంటూ అతి ప్రయాసతో దశరథుని భవనమును చేరుకున్నాడు. దశరథుని కలుసుకున్నాడు.

” ఓ వసిష్ట మహామునీ! రామునితో నేను చెప్పినవి అన్నీ చేయించారా!” అని అడిగాడు.

“అంతా మీరుచెప్పినట్టే చేయించాను.” అని చెప్పాడు వసిష్ఠుడు.

అప్పటిదాకా దశరథుడు పురప్రముఖులతో మంతనాలు సాగిస్తున్నాడు. వసిష్టుడు వచ్చిన తరువాత, వారందరినీ పంపివేసాడు. తాను కూడా తన అంతఃపురములోకి వెళ్లాడు.

శ్రీమదామాయణము
అయోధ్యాకాండము ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ షష్ఠః సర్గః (6) >>