Sri Shiva Mangala Ashtakam In Telugu – మంగళాష్టకం

Sri Shiva Mangala Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంగళాష్టకం గురించి తెలుసుకుందాం…

Sri Shiva Mangala Ashtakam Telugu

మంగళాష్టకం

భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ||

వృషారూఢాయ భీమాయ వ్యాఘ్ర చర్మాంబరాయచ
పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ||

భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే
రుద్రాక్షమాలా భూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ||

సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే
సచ్చిదానంద రూపాయ ప్రమథేశాయ మంగళమ్ ||

మృత్యుజయాయ సాంబాయ సృష్టి స్థిత్యంతకారిణే
త్ర్యంబకాయ శాంతాయ త్రికోలకేశాయ మంగళమ్ ||

గంగాధరాయ సోమాయ నమో నమో హరిహరాత్మనే
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ ||

సదాశివ స్వరూపాయ సమస్తత్పురుషాయ చ
అఘోరాయచ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ ||

చాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదమ్
తస్యాం భీష్ట ప్రదం శంభోః యః పఠేన్మంగళాష్టకమ్ ||

మరిన్ని అష్టకములు

Sri Sainatha Ashtakam In Telugu – శ్రీ సాయినాథ అష్టకం

Sri Sainatha Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయినాథ అష్టకం గురించి తెలుసుకుందాం.

శ్రీ సాయినాథాయ నమః

షిర్డిక్షేత్ర నివాసాయ, సిరిసంపదదాయినే,
సిద్ధి మంత్రస్వరూపాయం సాయినాథాయ మంగళం.
రఘుపతి రాఘవ రాజారాం, పతితపావన సాయీరాం,
ఈశ్వర్ అల్లా తేరానాం, సబ్కో సమ్మతే భగవాన్.

శ్రీ సాయినాథ అష్టకం

పత్రి గ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం
భక్తా బీష్టప్రదం దేవం సాయినాధం నమామ్యహం.

మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమేశుభే
ద్విజరాజం తమోఘాతం సాయినాధం నమామ్యహం.

జగదుద్ధారణార్ధంయోనర రూప ధరోవిభుః
యోగినంచ మహాత్మానం సాయినాధం నమామ్యహం.

సాక్షాత్కారంచయోలభేస్వాత్మా రామోగురోర్ముఖాత్
నిర్మలంచ మమతాఘాతం సాయినాధం నమామ్యహం.

యస్య దర్శన మాత్రేణ నశ్యంతి వ్యాధికోటయః
సర్వే పాపాః ప్రణశ్యంతి సాయినాధం నమామ్యహం.

నరసింహాది శిష్యాణాం దదే యోనుగ్రహం గురుః
భవ బంధాపహర్తారం సాయినాధం నమామ్యహం.

ధనహీన దరిద్రాన్యః సమదృక్షైవ వశ్యతి
కరుణాసాగరం దేవం సాయినాధం నమామ్యహం.

సమాధిస్థా2 పియో భక్త్యాసమభీష్టార్థ దానతః
అచింత్య మహిమానంతం సాయినాథం నమామ్యహం.

మరిన్ని అష్టకములు

Vishwanath Ashtakam In Telugu – విశ్వనాథాష్టకమ్

విశ్వనాథాష్టకమ్ - Vishwanathashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు విశ్వనాథాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Vishwanath Ashtakam Lyrics

విశ్వనాథాష్టకమ్

గంగాతరంగ కమనీయజటాకలాపం
గౌరీనిరంతర విభూషిత వామభాగమ్
నారాయణప్రియ మనంగ మదాపహారం
వారాణసీపురపతింభజవిశ్వనాథమ్

1

వాచామగోచర మనేక గుణస్వరూపం
వాగీశవిష్ణుసుర సేవిత పాదపీఠమ్
వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్.

2

భూతాధిపం భుజగభూషణభూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్।
పాశాంకుశాభయవర ప్రదశూలపాణిం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్.

3

శీతాంశుశోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానలవిశోషిత పంచబాణమ్|
నాగాధిపద్రచితభాసుర కర్ణపూరం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్.

4

పంచాననం దురితమత్తమతంగజానాం
నాగాంతకం దనుజపుఙ్గవపన్నగానామ్|
దావాలనం మరణశోకజరాటవీనాం
వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్.

5

తేజోమయం సగుణనిర్గుణ మద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయమ్
నాగాత్మకం సకలనిష్కళ మాత్మరూపం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్

6

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపేరతించ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హృత్కమలమధ్యగతం ప్రవేశం
వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్.

7

రాగాదిరోషరమితం స్వజనానురాగం
వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం
మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం
వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్.

8

వారణసీపురపతేః స్తవనం శివస్య
వ్యాసోక్త మష్టక మిదం పఠితా మనుష్య
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్యదేహవిలయే లభతే చ మోక్షమ్.

విశ్వనాథాష్టక మిదం యఃపఠే చ్ఛివసన్నిధౌ శివలోక మవాప్నోతి శివేనసహమోదతే.॥

మరిన్ని అష్టకములు

Achyutashtakam In Telugu- అచ్యుతాష్టకమ్

Achyutashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు అచ్యుతాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Achyutashtakam Lyrics Telugu

అచ్యుతాష్టకమ్

అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్,
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే.

1

అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికారాధితమ్,
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే.

2

విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీరాగిణే జానకీజానయే,
వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే
కంసవిధ్వంసినే వంశినే తే నమః.

3

కృష్ణ ! గోవింద ! హేరామ ! నారాయణ !
శ్రీపతే ! వాసుదేవాజిత ! శ్రీనిధే !
అచ్యుతానంత ! హే మాధవాధోక్షజ !
ద్వారకానాయక ! ద్రౌపదీరక్షక !

4

రాక్షసక్షోభితః సీతయా శోభితో
దండకారణ్య భూపుణ్యతాకారణః,
లక్ష్మణేనాన్వితో వానరైః సేవితో
గస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్.

5

ధేను కారిష్టకృద్ ద్వేషిహా
కేశిహా కంసహృద్వంశికావాదకః,
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా.

6

విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం
ప్రావృడంభోదవత్రోల్లసద్విగ్రహమ్,
వన్యయా మాలయా శోభితోరఃస్థలం
లోహితాంఘ్రద్వయం వారిజాక్షం భజే.

7

కుంచితైః కుంతలైః భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్కుండలం గండయోః
హారకేయూరకం కంకణప్రోజ్జ్వలం
కింకిణీమంజులం శ్యామలం తం భజే.

8

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషస్సస్పృహమ్,
వృత్తతః సుందరం కర్తృవిశ్వంభర
స్తస్యవశ్యో హరిర్జాయతే సత్వరమ్.

ఇతి శ్రీ మచ్ఛంకరాచార్యకృతమచ్యుతాష్టకం సంపూర్ణమ్

మరిన్ని అష్టకములు

Mahalakshmi Ashtakam In Telugu – మహాలక్ష్మ్యష్టకమ్

Sri Mahalakshmi Ashtakam In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మహాలక్ష్మ్యష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Sri Mahalakshmi Ashtakam Telugu Lyrics

మహాలక్ష్మ్యష్టకమ్

శ్లో॥ 1

నమస్తేస్తు మహామాయే, శ్రీ పీఠే సురపూజితే।
శంఖ చక్ర గదా హస్తే, మహాలక్ష్మి నమోస్తుతే॥

తే॥ ఓ మహామాయ రూపిణీ! నమసుమములు
నీవు శ్రీపీఠ వాసివి దేవవినుత
శంఖ చక్ర గదా హస్త! జనని! జేతు
వందనం మహాలక్ష్మిశ్రీవనితకిపుడు

తా॥ ఓ మహామాయా స్వరూపిణి నీకు నమస్కారము. నీవు శ్రీపీఠ నివాసినివి. దేవతలందరిచే కొని యాడబడి పూజించబడు దానవు. ఓ శంఖ చక్ర గదాధరీ తల్లీ! మహాలక్ష్మీ నీకు వందన మొనరించెదను.

శ్లో॥ 2

నమస్తే గరుడా రూఢీ, డోలాసుర భయంకరి।
సర్వ పాపహరే దేవి, మహాలక్ష్మి నమోస్తుతే॥

తే॥ దండములు గరుడారూఢ తల్లికిత్తు
భయము డోలాసురునికి నీవలన కలిగె
సర్వ పాపముల్ నీవల్ల సమసిపోవు
వందనం మహాలక్ష్మి శ్రీవనిత కిపుడు

తా॥ గరుత్మంతుని అధిరోహించు తల్లికి వందనము చేతును. నీవలన డోలాసురునికి భయము కలిగినది. నీవలన అన్ని పాపములు నశించును. తల్లీ! మహాలక్ష్మీ నీకు వందనమొనరించెదను.

శ్లో॥ 3

సర్వజ్ఞే సర్వవరదే, సర్వ దుష్ట భయంకరీ
సర్వ దుఃఖహరే దేవి, మహాలక్ష్మి నమోస్తుతే॥

తే॥ సర్వమును దెలిసిన తల్లి సర్వ వరద
సర్వ దుష్ట భయంకరి జనని నీవె
సర్వ దుఃఖముల్ బాపెద వుర్వియందు
వందనం మహాలక్ష్మి శ్రీవనితకిపుడు

తా॥ సర్వము తెలిసిన ఓ తల్లీ నీవు అందరినీ అనుగ్రహించుదానవు. దుర్మార్గులందరికీ నీవు
భయంకరివి. ఈలోకంలో దుఃఖములన్నీ తొలగించు దానవు. ఓ మహాలక్ష్మీ నీకు ఇదే నమస్కరించు చున్నాను.

శ్లో॥ 4

సిద్ధి బుద్ధి ప్రదే దేవి, భుక్తి ముక్తి ప్రదాయిని।
మంత్రమూర్తే సదాదేవి, మహాలక్ష్మి నమోస్తుతే

తే॥ సిద్ధి బుద్ధుల జేకొన జేయు దేవి
భుక్తి ముక్తులనీ లక్ష్మిబూని యిచ్చు
మంత్రముల అధీష్ఠానమీ మాత నిజము
వందనం మహాలక్ష్మి శ్రీవనితకిపుడు

తా॥ సిద్ధిబుద్ధులను కలుగజేయు దేవి తిండి మోక్షములన ఈ లక్ష్మి పూనుకుని అందించును. ఈ తల్లి మంత్రములకు అధిష్ఠానదేవత ఓ మహాలక్ష్మి నీకు ఇపుడు నమస్కరించు చున్నాను.

శ్లో॥ 5

ఆద్యన్తరహితే దేవి, ఆదిశక్తి మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే, మహాలక్ష్మి నమోస్తుతే

తే॥ ఆది అంతముల్ లేనిదా ఆదిశక్తి
యోగ మెరిగిన దాయమ్మ యోగలభ్య
ఈమె విష్ణుప్రియయును మహేశ్వరీమె
వందనం మహాలక్ష్మిశ్రీవనితకిపుడు

తా॥ ఆ ఆదిశక్తికి ఆదియు అంత్యములు లేవు. యోగముచే లభించు ఆ దేవి యోగ విద్య నెరిగిన తల్లి. ఈమె శ్రీమహావిష్ణువుకు ప్రియురాలు మహేశ్వరి. ఆ మహాలక్ష్మికి ఇదే నమస్కరించు చున్నాను.

Mahalakshmi Ashtakam Telugu

శ్లో॥ 6

స్థూల సూక్ష్మ, మహారౌద్రే, మహాశక్తే మహోదరే।
మహాపాపహరే దేవి, మహాలక్ష్మి నమోస్తుతే॥

తే॥ స్థూలమైనది భీకరి సూక్ష్మముయును
పెద్ద యుదరము పెనుశక్తి వెలయుచుండె
పాపములద్రుంచ జననియు పావనియును
వందనం మహాలక్ష్మిశ్రీవనిత కిపుడు

తా॥ స్థూలమైనదియు సూక్ష్మమైనదియు పెద్ద ఉదరము గలదియు, మహాశక్తియు అయిన సర్వపాప సంహారిణి పరమపావని, ఓ మహాలక్ష్మి నీకు వందనము సమర్పిస్తున్నాను.

శ్లో॥ 7

పద్మాసనస్థితే దేవి, పరబ్రహ్మ స్వరూపిణి
పరమేశ్వరి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే

తే॥ పద్మమే ఆసనంబైన పద్మజనిత
వెలసె పరబ్రహ్మ రూపిణై తలచిచూడ
సర్వజగతికి మూలమౌ జనని ఈమె
వందనం మహాలక్ష్మి శ్రీవనితకిపుడు

తా॥ పద్మము ఆసనమైన ఈ దేవి పద్మమునుంచి పుట్టినది. ఈమె పరబ్రహ్మరూపిణై వెలసి యున్నది. సర్వజగత్తుకి ఈమె తల్లి. అట్టి ఓ మహాలక్ష్మి నీకు ఇదే నా నమస్కారము.

శ్లో॥ 8

శ్వేతాంబరధరే దేవి, నానాలంకార భూషితే।
జగత్ స్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే॥

తే॥ రమ్యమౌ పెక్కునగలు అలంకరించి
శ్వేత వస్త్రధారిణియైన శ్రీలతాంగి
జగము నిలిపిన ఈ తల్లి జగతి జనని
వందనం మహాలక్ష్మి శ్రీవనితకిపుడు

తా॥ పలు సుందరాభరణాలచే అలంకరించబడిన ఈమె తెల్లని వస్త్రమును ధరించిన తరుణి. జగత్తునంతటిని ఉద్ధరించు ఈ తల్లి జగజ్జనని. ఓ మహాలక్ష్మి నీకు నమస్కరించెదను.

శ్లో॥ 9

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం, యఃపఠేద్భక్తి మాన్నరః।
సర్వసిద్ధి మవాప్నోతి, రాజ్యం ప్రాప్నోతి సర్వదా॥

తే॥ తాము ఈ మహాలక్ష్మ్యాష్టకమును ప్రీతి
భక్తి శ్రద్ధతో చదువరే ప్రార్ధనందు
సర్వసిద్ధులు కలుగును జయము కల్గు
రాజ్యభోగములీ మహాలక్ష్మి యిచ్చు

తా॥ ఈ మహాలక్ష్మి అష్టకమును ప్రేమగా భక్తిగా శ్రద్ధగా తమరు ప్రార్ధనలొ పఠించినచో సర్వ సిద్ధులూ కలుగును. విజయములు కలుగును. ఈ మహాలక్ష్మి రాజ్యభోగముకూడా కలుగ జేయును.

శ్లో॥ 10

ఏకకాలే పఠేన్నిత్యం, మహాపాప వినాశనమ్॥
ద్వికాలేయః పఠేన్నిత్యం, ధనధాన్య సమన్వితః॥
త్రికాలంయః పఠేన్నిత్యం, మహాశత్రు వినాశనమ్
మహాలక్ష్మీర్భవేన్నిత్యం, ప్రసన్నా వరదా శుభా॥

(ఇన్ద్రకృత శ్రీమహాలక్ష్మ్యష్ఠక స్తోత్రం సంపూర్ణమ్)

తే॥ పఠనమొకసారి నిత్యము పాపముక్తి
రెండుసార్లైన ధనధాన్య ‘మెండు’ కలుగ
మూడు మారుల శత్రుల ముప్పు దొలగు
శ్రీమహాలక్ష్మి సర్వదా చేయు శుభము

తా॥ ఈ అష్టకము ఒకసారి పఠించిన ప్రతిదినమూ పాప విముక్తి కలుగును. రెండు పర్యాయములైనచొ సమృద్ధిగా ధనధాన్య లాభము, మూడు మారులకు శత్రుభయనాశనము చేసి శ్రీమహాలక్ష్మి సర్వదా శుభములిచ్చుగాక.

(ఇది ఇంద్రుడు చెప్పిన శ్రీమహాలక్ష్మి అష్టకము)

మరిన్ని అష్టకములు:

Sri Veerabrahma Swamy Ashtakam In Telugu – శ్రీ వీరబ్రహ్మష్టకము

Sri Veerabrahma Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వీరబ్రహ్మష్టకము గురించి తెలుసుకుందాం…

శ్రీ వీరబ్రహ్మష్టకము

హైందవ మహమ్మదీయ సఖ్యముకొఱకు
సర్వ మానవ ధర్మంబు చాటి చెప్పి,
“ఆలకింపుఁ డమృతపుత్రు లంద”ఱనెడి
విశ్వధర్మ నిర్ణేత భావింతు నెపుడు.

ఎవని యానతి యవస మహీళు లేని
అలరు ఒత్తుగా శీర్షములందుఁ దాల్చి,
పాలన మొనర్తు ధార్మిక ప్రభుత నెఱపి
అట్టి గురునందు నాచిత్తమలరుఁగాళ.

కులమునకుఁ గాక యోగ్యతకును గుణమ్ము
నకును మన్నన యొసఁగి యంత్యజున కేని,
ఔపనిషదర్థ పీయూష మందఁ జేయు
నట్టి దేశికు చరణమ్ము లాశ్రయింతు.

యతుల కేగాని ముక్తి, గృహస్థ తతికి
దూరమనెడు నపోహముఁ దొలఁగఁ జేసి,
గేస్తుధర్మమ్ము ప్రకటించు గృహివరేణ్యు
డెపుడు వసియించుఁగాత నా హృదయ సీను.

అల సనాతన ఋషి ధర్మ మైన శిల్ప
కర్మయోగముఁ బూని నైష్కర్య సిద్ధిఁ
జాటె నే కర్మకుశలుఁ డా సంయమీంద్రుఁ
డొసఁగి ప్రోచుత సత్రియా యోగదీతు.

ఘనతరాష్టాంగ యోగంబు కాలి పోయి
శుష్క వేదాంతమున యోగశూన్య మైన
జగమునన్ యోగమార్గ సంస్థాపన మ్మొ
సరు యోగేశ్వరుఁడు శరణమ్ము నాకు.

ఎవఁడు శ్రుత్యంతముల నెల్ల నేర్పరించి
లుఁగు తత్త్వాలలోఁ బ్రబోధించినాఁడొ;
ఆ త్రయీమూర్తి రుచిరపాదాబ్జ సీమఁ
జేరి నటియించుఁగాత నా చిత్త భృంగి.

ఆతఁడు తమోరజస్సుల కవల వెలుఁగు
సత్వమూర్తి, త్రయీశిర స్సార రూపి,
వెలుఁగులకు వెల్గు, ప్రణవైకవేద్య నిత్య
తత్త్వ మా వీర గురుఁడు ప్రత్యక్ష మగుత

మరిన్ని అష్టకములు

Sri Krishna Prema Ashtakam In Telugu – శ్రీ కృష్ణ ప్రేమాష్టకమ్

Sri Krishna Prema Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ కృష్ణ ప్రేమాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Sri Krishna Prema Ashtakam Telugu

శ్రీ కృష్ణ ప్రేమాష్టకమ్

అసారే సంసారే విషయ విషపూరే పటుతరే
ప్రవాహే ఘోరే మాం మలినతరమోహేన పతితమ్ !
భ్రమన్తం ధావన్తం మనసి విలపన్తం కరుణయా
సముద్ధర్తుం కృష్ణా వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

1

అనాథానాం నాథః పరమకరుణా పూర్ణహృదయో
ఘనానందాకారో జఘన విలసద్భాహు యుగళః,
సనాథం మాం కుర్వన్సదయ వర రాధావనితయా
ఘనశ్యామః కృష్ణో వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

2

సదా బృందారణ్యే కలిమలహరే యామునతటే
ముదా గోపీబృందే లసదమల గోలోకనిలయే,
విహర్తా గోపాలో మధుర మురళీగాన నిరతో
ఘనశ్యామః కృష్ణో వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

3

మతిర్మే శ్రీరాధాపతిచరణ పద్మేషు విశతాత్
రతిర్గోపీకాంతే లసతు రసనా నామ జపతాత్,
గతిర్మే గోవిన్దో భవతు నిరతం పూర్ణదయయా
ఘనశ్యామః కృష్ణా వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

4

పితా మాతా భ్రాతా సుతహిత కళత్రాది సకలం
పతిర్బంధుర్మిత్రం విభురపి శరణ్యోస్తు భగవాన్,
గతిర్మే గోపీశః కిమపి న హి కృష్ణాత్పరతరం
స గోపాలః ప్రేమ్ల్లో వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

5

గురు ర్భావానందః శమిత హృదయ స్మేరవదన
స్స మాం దీనం హీనం విషయ విషతృష్ణా పరివృతమ్,
సుధావృష్ట్యా దృష్ట్యా పరమ కృపయా పాతు మనిశం
ఘనశ్యామో భూత్వా వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

6

నమామి శ్రీకృష్ణం సజలజలద శ్యామలతనుం
భజామి శ్రీకృష్ణం మధురమధురం తస్యచరితమ్,
ప్రజామి శ్రీకృష్ణం శరణ మహమవ్యాజకృపయా
ఘనశ్యామః కృష్ణో వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

7

పరాధీనం దీనం చపలమతిహీనం కరుణయా
పరిత్రాతుం నేతుం న్వపదమపహర్తుం భవభయమ్,
గదాధారీ శౌరిః కలికలుష హారీ ధృతగిరి
స్సదామేఘశ్యామో వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

8

విశ్వనాథ కృతం ప్రాతః ప్రబోధాష్టక మాదరాత్,
పఠతాం హృదయే నిత్యం సదా వసతు కేశవః.

ఇతి శ్రీకృష్ణ ప్రేమాష్టకం సంపూర్ణమ్

మరిన్ని అష్టకములు

Sri Mahalakshmi Ashtakam In Telugu | శ్రీ మహాలక్ష్మి అష్టకం

Sri Mahalakshmi Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Sri Mahalakshmi Ashtakam Telugu

శ్రీ మహాలక్ష్మి అష్టకం

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే ||

నమస్తే గరుడారూఢ డోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ |
సర్వపాపహ రే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||

సిద్ధి బుద్ధి ప్రదే దేవీ భుక్తి ముక్తి ప్రదాయినీ |
మంత్రమూర్తే సదాదేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||

ఆద్యంత రహితే, దేవీ ఆదిశక్తి మ హేశ్వరీ |
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోసుతే ||

స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహాపాహ రే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||

పద్మాసన స్థితే దేవీపరబ్రహ్మస్వరూపిణీ |
పరమేశీ జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే ||

శ్వేతాంబర ధరే దేవీ నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే ||

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భ క్తిమాన్నర: |
సర్వసిద్ధిమవాప్నోతిరాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్వం మహాపాపవినాశనమ్ |
ద్వికాలం య: పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితమ్ ||

త్రికాలం య: పఠేన్నిత్యం మహాశతృ వినాశనం |
మహాలక్ష్మీ ర్భవేన్నిత్యం ప్రసన్నావరదా శుభా ||

మహాలక్ష్మీ ర్భవేన్నిత్యం ప్రసన్నావరదా శుభా |
ఇత్యేంద్రకృత మహాలక్ష్మ్యష్టకస్తవం సంపూర్ణం ||

ఫలశ్రుతి:

సర్వసంకటనాశనము, ఇష్టకామ్యార్థ సిద్ధి, ఉద్యోగలాభం, రాజభోగం, సర్వపాపవినాశనము, అష్టయిశ్వర్య ప్రాప్తి.

మరిన్ని అష్టకములు:

Krishna Ashtakam In Telugu – కృష్ణాష్టకమ్

Krishna Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు కృష్ణాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Krishna Ashtakam Lyrics Telugu

కృష్ణాష్టకమ్

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్,
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్.

1

అతసీపుష్పసంకాశం, హారనూపురశోభితమ్,
రత్నకంకణకేయూరం, కృష్ణం వందే జగద్గురుమ్.

2

కుటిలాలకసంయుక్తం, పూర్ణచంద్రనిభాననమ్,
విలసత్కుండలధరం, కృష్ణం వందే జగద్గురుమ్.

3

మందారగంధసంయుక్తం, చారుహాసం చతుర్భుజమ్
బర్హిపింఛావచూడాంగం, కృష్ణం వందే జగద్గురుమ్.

4

ఉత్ఫుల్లపద్మపత్రాక్షం, నీలజీమూతసన్నిభమ్,
యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురుమ్.

5

రుక్మిణీకేళిసంయుక్తం, పీతాంబరసుశోభితమ్,
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్.

6

గోపికానాం కుచద్వంద్వకుంకుమాంకితవక్షసమ్,
శ్రీనికేతం మహేష్వాసం, కృష్ణం వందే జగద్గురుమ్.

7

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్,
శంఖచక్రధరం దేవం, కృష్ణం వందే జగద్గురుమ్.

8

కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్,
కోటిజన్మకృతం పాపం, స్మరణేన వినశ్యతి.

ఇతి శ్రీకృష్ణాష్టకం సంపూర్ణమ్

మరిన్ని అష్టకములు

Uma Maheshwara Ashtakam In Telugu – ఉమామహేశ్వరాష్టకమ్

ఉమామహేశ్వరాష్టకమ్ (Umamaheswarashtakam)

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఉమామహేశ్వరాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Uma Maheshwara Ashtakam Lyrics

ఉమామహేశ్వరాష్టకమ్

పితామహ శిరచ్ఛేద ప్రవీణ కరపల్లవ,
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః

1

నిశుంభశుంభప్రముఖదైత్య శిక్షణదక్షిణే,
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

2

శైలరాజస్య జామాత శ్శశిరేఖావతంసక
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

3

శైలరాజాత్మజే మాత శ్శాతకుంభనిభ ప్రభే
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

4

భూతనాథ పురారాతే భుజంగామృతభూషణ
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

5

పాదప్రణతభక్తానాం పారిజాతగుణాధికే
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

6

హాలాస్యేశ దయామూర్తే హాలాహల లసద్గళ
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

7

నితంబినీ మహేశస్య కదంబవననాయికే
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

8

మరిన్ని అష్టకములు