Ayodhya Kanda Sarga 24 In Telugu | అయోధ్యాకాండ చతుర్వింశః సర్గః

Ayodhya Kanda Sarga 24 In Telugu

అయోధ్యా కాండ చతుర్వింశః సర్గః రామాయణంలోని ఒక ముఖ్యమైన అధ్యాయం, ఇందులో పాత్రల భావోద్వేగాలు మరియు సందిగ్ధతలు ముందు వస్తాయి. ఈ విభాగంలో, దశరథ మహారాజు తన ప్రియమైన కుమారుడు రాముడు వనవాసానికి వెళ్లడం వలన, కైకేయికి ఇచ్చిన మాట యొక్క ఫలితాలను ఎలా ఎదుర్కొంటున్నాడో చూపిస్తుంది. ఈ అధ్యాయం ధర్మం (నైతిక కర్తవ్యము), త్యాగం మరియు ఆవశ్యకమైన బాధ వంటి అంశాలను ప్రదర్శిస్తుంది. ఈ హృదయ విదారక భాగం రాముని యాత్రలో తరువాత జరిగే సంఘటనలకు పునాదిగా ఉండి, ఇతిహాసంలో ఒక కీలక మలుపుగా నిలుస్తుంది.

కౌసల్యార్తిసమాశ్వాసనమ్

తం సమీక్ష్య త్వవహితం పితుర్నిర్దేశపాలనే |
కౌసల్యా బాష్పసంరుద్ధా వచో ధర్మిష్ఠమబ్రవీత్ ||

1

అదృష్టదుఃఖో ధర్మాత్మా సర్వభూతప్రియంవదః |
మయి జాతో దశరథాత్కథముంఛేన వర్తయేత్ ||

2

యస్య భృత్యాశ్చ దాసాశ్చ మృష్టాన్యన్నాని భుంజతే |
కథం స భోక్ష్యతే నాథో వనే మూలఫలాన్యయమ్ ||

3

క ఏతచ్ఛ్రద్దధేచ్ఛ్రుత్వా కస్య వా న భేవద్భయమ్ |
గుణవాన్దయితో రాజా రాఘవో యద్వివాస్యతే ||

4

నూనం తు బలవాఁల్లోకే కృతాంతః సర్వమాదిశన్ |
లోకే రామాభిరామస్త్వం వనం యత్ర గమిష్యసి ||

5

అయం తు మామాత్మభవస్తవాదర్శనమారుతః |
విలాపదుఃఖసమిధో రుదితాశ్రుహుతాహుతిః ||

6

చింతాబాష్పమహాధూమస్తవాదర్శనచిత్తజః |
కర్శయిత్వా భృశం పుత్ర నిఃశ్వాసాయాససంభవః ||

7

త్వయా విహీనామిహ మాం శోకాగ్నిరతులో మహాన్ |
ప్రధక్ష్యతి యథా కక్షం చిత్రభానుర్హిమాత్యయే ||

8

కథం హి ధేనుః స్వం వత్సం గచ్ఛంతం నానుగచ్ఛతి |
అహం త్వాఽనుగమిష్యామి పుత్ర యత్ర గమిష్యసి ||

9

తథా నిగదితం మాత్రా తద్వాక్యం పురుషర్షభః |
శ్రుత్వా రామోఽబ్రవీద్వాక్యం మాతరం భృశదుఃఖితామ్ ||

10

కైకేయ్యా వంచితో రాజా మయి చారణ్యమాశ్రితే |
భవత్యా చ పరిత్యక్తో న నూనం వర్తయిష్యతి ||

11

భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః |
స భవత్యా న కర్తవ్యో మనసాఽపి విగర్హితః ||

12

యావజ్జీవతి కాకుత్స్థః పితా మే జగతీపతిః |
శుశ్రూషా క్రియతాం తావత్స హి ధర్మః సనాతనః ||

13

ఏవముక్తా తు రామేణ కౌసల్యా శుభదర్శనా |
తథేత్యువాచ సుప్రీతా రామమక్లిష్టకారిణమ్ ||

14

ఏవముక్తస్తు వచనం రామో ధర్మభృతాం వరః |
భూయస్తామబ్రవీద్వాక్యం మాతరం భృశదుఃఖితామ్ ||

15

మయా చైవ భవత్యా చ కర్తవ్యం వచనం పితుః |
రాజా భర్తా గురుః శ్రేష్ఠః సర్వేషామీశ్వరః ప్రభుః ||

16

ఇమాని తు మహారణ్యే విహృత్య నవ పంచ చ |
వర్షాణి పరమప్రీతః స్థాస్యామి వచనే తవ ||

17

ఏవముక్తా ప్రియం పుత్రం బాష్పపూర్ణాననా తదా |
ఉవాచ పరమార్తా తు కౌసల్యా పుత్రవత్సలా ||

18

ఆసాం రామ సపత్నీనాం వస్తుం మధ్యే న మే క్షమమ్ |
నయ మామపి కాకుత్స్థ వనం వన్యాం మృగీమివ ||

19

యది తే గమనే బుద్ధిః కృతా పితురపేక్షయా |
తాం తథా రుదతీం రామో రుదన్వచనమబ్రవీత్ ||

20

జీవంత్యా హి స్త్రియా భర్తా దైవతం ప్రభురేవ చ |
భవత్యా మమ చైవాద్య రాజా ప్రభవతి ప్రభుః ||

21

న హ్యనాథా వయం రాజ్ఞా లోకనాథేన ధీమతా |
భరతశ్చాపి ధర్మాత్మా సర్వభూతప్రియం‍వదః ||

22

భవతీమనువర్తేత స హి ధర్మరతః సదా |
యథా మయి తు నిష్క్రాంతే పుత్రశోకేన పార్థివః ||

23

శ్రమం నావాప్నుయాత్కించిదప్రమత్తా తథా కురు |
దారుణశ్చాప్యయం శోకో యథైనం న వినాశయేత్ ||

24

రాజ్ఞో వృద్ధస్య సతతం హితం చర సమాహితా |
వ్రతోపవాసనిరతా యా నారీ పరమోత్తమా ||

25

భర్తారం నానువర్తేత సా తు పాపగతిర్భవేత్ |
భర్తుః శుశ్రూషయా నారీ లభతే స్వర్గముత్తమమ్ ||

26

అపి యా నిర్నమస్కారా నివృత్తా దేవపూజనాత్ |
శుశ్రూషామేవ కుర్వీత భర్తుః ప్రియహితే రతా ||

27

ఏష ధర్మః పురా దృష్టో లోకే వేదే శ్రుతః స్మృతః |
అగ్నికార్యేషు చ సదా సుమనోభిశ్చ దేవతాః ||

28

పూజ్యాస్తే మత్కృతే దేవి బ్రాహ్మణాశ్చైవ సువ్రతాః |
ఏవం కాలం ప్రతీక్షస్వ మమాగమనకాంక్షిణీ ||

29

నియతా నియతాహారా భర్తృశుశ్రూషణే రతా |
ప్రాప్స్యసే పరమం కామం మయి ప్రత్యాగతే సతి ||

30

యది ధర్మభృతాం శ్రేష్ఠో ధారయిష్యతి జీవితమ్ |
ఏవముక్తా తు రామేణ బాష్పపర్యాకులేక్షణా ||

31

కౌసల్యా పుత్రశోకార్తా రామం వచనమబ్రవీత్ |
గమనే సుకృతాం బుద్ధిం న తే శక్నోమి పుత్రక ||

32

వినివర్తయితుం వీర నూనం కాలో దురత్యయః |
గచ్ఛ పుత్ర త్వమేకాగ్రో భద్రం తేఽస్తు సదా విభో ||

33

పునస్త్వయి నివృత్తే తు భవిష్యామి గతక్లమా |
ప్రత్యాగతే మహాభాగే కృతార్థే చరితవ్రతే ||

34

పితురానృణ్యతాం ప్రాప్తే త్వయి లప్స్యే పరం సుఖమ్ |
కృతాంతస్య గతిః పుత్ర దుర్విభావ్యా సదా భువి ||

35

యస్త్వాం సంచోదయతి మే వచ ఆచ్ఛిద్య రాఘవ |
గచ్ఛేదానీం మహాబాహో క్షేమేణ పునరాగతః ||

36

నందయిష్యసి మాం పుత్ర సామ్నా వాక్యేన చారుణా |
అపీదానీం స కాలః స్యాద్వనాత్ప్రత్యాగతం పునః |
యత్త్వాం పుత్రక పశ్యేయం జటావల్కలధారిణమ్ ||

37

తథా హి రామం వనవాసనిశ్చితం
సమీక్ష్య దేవీ పరమేణ చేతసా |
ఉవాచ రామం శుభలక్షణం వచో
బభూవ చ స్వస్త్యయనాభికాంక్షిణీ ||

38

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్వింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 24 Meaning In Telugu

రాముని నిశ్చయమును విని కౌసల్య తల్లడిల్లి పోయింది. ఆమెకు నోట మాట రాలేదు. రాబోవు చీకటి రోజులను తలచు కొని తల్లడిల్లి పోయింది. “రామా! ప్రతిదినము మృష్టాన్నములు భుజించుటకు అలవాటు పడ్డవాడికి అడవులలో మున్యాశ్రమములలో వారు ఇచ్చు ఆకులు, దుంపలు, పండ్లతో ఎలా జీవిస్తావయ్యా? ఎందుకంటే అయోధ్యలో నీ సేవకులు కూడా నీ కన్నా మెరుగైన భోజనము చేస్తుంటారు కదా! నీవు అడవులలో కందమూలములు ఎలా తిని బతుకుతావు. రామా! నీవంటి సద్గుణములు కలవాడిని, ప్రీతి పాత్రుడిని, నిర్దయగా రాజు అరణ్యము లకు పంపుతున్నాడే ఇంక మాలాంటి వారిగతి ఏమిటి? రామా! నీవు వెళ్లిన తరువాత అయోధ్యలో ఉండటానికి మాకు భయంగా ఉంది.

రామా! నీవు చెప్పినది సత్యము. నీ లాంటి వాడినే అరణ్యము లకు పంపడానికి అనుకూలించిన విధి ఎంత బలమైనదో ఇప్పుడు తెలుస్తూ ఉంది. నీవు వెళ్లిన తరువాత నాకు ఇంక శోకమే మిగిలింది. ఆ శోకాగ్నిలో నేను దగ్ధం అవడం తథ్యం. అందుకే రామా! నన్ను కూడా నీ వెంట తీసుకొనిపో. నీవు ఎక్కడ ఉంటే అదే నాకు రాజమందిరము. పద పోదాము.” అని రాముని వెంట వెళ్లడానికి కౌసల్య

ఉద్యుక్తురాలయింది. తన కోసం శోకిస్తున్న తల్లి కౌసల్యను చూచి రాముడు ఇలా అన్నాడు. “అమ్మా! అన్నీ తెలిసిన నీవే ఇలా మాట్లాడితే నేనేమి అనగలను. నీకు తెలుసు గదా! కైక తండ్రి గారిని తన చెప్పుచేతల్లో ఉంచుకొని తన ఇష్టం వచ్చి నట్టు ఆడిస్తూ ఉంది. ఇంక నువ్వు కూడా ఇక్కడ లేక పోతే తండ్రి గారి పరిస్థితి ఏమిటి? ఆయన బాగోగులు ఎవరు చూచుకుంటారు. నీవు కూడా తండ్రిగారిని విడిచి పెట్టి నాతో అరణ్యములకు వస్తే, తండ్రిగారు జీవించడం కల్ల.

కాబట్టి నీవు తండ్రి గారిని చూచుకుంటే ఇక్కడే ఉండాలి. పైగా, నీ వంటి పతివ్రత భర్తను వదిలిపెట్టి అరణ్యములకు పోవడం అత్యంత క్రూరమైన పని. అది నీ వంటి సౌశీల్యవతులకు తగని పని. ఒక భార్యగా జీవితాంతము భర్తకు సేవ చెయ్యడం నీ కర్తవ్యము. ధర్మము. కాబట్టి నీవు ఇక్కడే ఉండి నీ ధర్మమును పాటించమని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను.” అన్నాడు రాముడు.

రాముని మాటలకు కౌసల్య బదులు చెప్పలేక పోయింది. “రామా! నీవు చెప్పినట్టే చేస్తాను.” అని మాత్రం అనగలిగింది. తల్లి మాటలకు రాముడు సంతోషించాడు. “అమ్మా! నా తండ్రి దశరథుడు మహారాజు, మనకందరికీ పూజనీయుడు. మనల నందరినీ ఆజ్ఞాపించగల సమర్థుడు. ఆయన ఆజ్ఞలను పాటించడం మన అందరి కర్తవ్యము. నీవు అలా చూస్తూ ఉండగానే పదునాలుగేళ్ల వనవాసము పూర్తి చేసుకొని వచ్చి నీ కళ్లముందు నిలబడతాను. నీవు ఏమి చెబితే అది చేస్తాను.” అని

అన్నాడు రాముడు. కుమారుని మాటలకు కౌసల్యకు ఒక పక్క దుఃఖము, మరొక పక్క సంతోషమూ కలిగాయి. కాని రాముడు వెళ్లిన తరువాత సవతుల మధ్య తన పరిస్థితి ఏమిటి అని తలచుకొనే సరికి ఆమెకు శరీరం వణికిపోయింది.
“రామా! నీవు లేని అయోధ్యలో నేను ఉండలేను. ఈ సవతులు నన్ను బతుకనీయరు. నన్ను నీ వెంట తీసుకొని పో” అని భోరున ఏడవసాగింది. వ్యవహారం మరలా మొదటికి వచ్చింది అనుకున్నాడు. రాముడు. తల్లి ఏడుపు చూచి రామునికి కూడా దుఃఖము పార్లుకొచ్చింది. తల్లిని ఎలా ఓదార్చాలో ఆమె నిర్ణయాన్ని ఎలా మార్చాలో తెలియలేదు రామునికి. ఏమైనా సరే మరలా మరొక సారి చెప్పి చూద్దాము అని అనుకున్నాడు రాముడు. తల్లి కౌసల్యతో ఇలా అన్నాడు.

“అమ్మా! అదేంటమ్మా అలా అంటావు. నీవు అయోధ్యకు పట్టమహిషిని. దశరథునికి పట్టపురాణివి. నిన్ను ఎవరేమంటారు. అందరూ నీ కనుసన్నలలో మెలగవలసిన వారే కదా! పైగా మహారాజు గారు నేవెంటనే ఉంటారు. నీకు అన్యాయం ఎందుకు జరుగుతుంది. రాజు ఉన్నంతకాలము నీవు అనాధవు ఎలా అవుతావు? పైగా నా తరువాత యువరాజు భరతుడు ఉంటాడు. భరతునికి నీవు అంటే పంచప్రాణాలు. పైగా భరతుడు ధర్మనిరతి ఎక్కువగా కలవాడు. ఎవరి మాటా విని అధర్మమునకు తలవంచడు. ఇంక నీకేం భయం. కాబట్టి ఆ భయాలు, అనుమానాలు నీ మనసులో నుండి తొలగించు. వృద్ధుడైన మహారాజును కనిపెట్టుకొని ఉండు.

ఒక భార్యగా అది నీ ధర్మము, కర్తవ్యము. అమ్మా! స్త్రీలు ఎన్ని వ్రతములు, ఉప వాసములు, పుణ్య కార్యములు చేసినను, భర్తను నిర్లక్ష్యము చేసిన భార్యకు నరక ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రము చెబుతుంది కదా! అలాగే ఏ దేవతలకూ పూజలు చేయకున్నా ఏ వ్రతములు ఆచరించకున్నా కేవలం భర్తను దైవంగా పూజించే భార్యకు ఉత్తమ లోకాలు కలుగుతాయి అని కూడా చెబుతారు కదా! భర్తకు అనుకూలవతిగా, ఆయనను జీవితాంతం విడిచిపెట్టకుండా ఉండటం భార్యకు పరమధర్మము అని వేదములు, శాస్త్రములు, శ్రుతులు, స్మృతులలో చెప్పబడింది కదా!

అమ్మా! నీవు అయోధ్యలో ఉండి తండ్రి గారిని సేవించు కుంటూ, నా క్షేమం కోసం వ్రతాలూ, పూజలూ చేస్తూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉంటే నేను అరణ్యాలలో ఏ బాధా లేకుండా క్షేమంగా ఉంటానమ్మా! నీవు చేసే పూజలూ, వ్రతాలూ నన్ను సదా ఆపదలనుండి రక్షిస్తూ ఉంటయమ్మా! నీవు ఇలా చేసావనుకో ఈ పదునాలుగేళ్లు ఇట్టే గడిచిపోతాయి. నేను ఇక్కడ లేని లోటు నీకు తెలియదు. నేను వచ్చిన తరువాత నీవు ఎలా చెబితే అలా చేస్తాను.” అని తల్లిని బుజ్జగించాడు రాముడు.

కౌసల్య కొడుకు మాటలకు మారు మాటాడలేకపోయింది. కళ్లు తుడుచుకొంది. “రామా! విధి బలీయమయింది. అంతకన్నా నీ నిశ్చయము బలమైంది. దానిని ఎవరూ మార్చలేరు. నీవు అరణ్యములకు క్షేమంగా వెళ్లిరా.

నీకు నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. నీకు సదా క్షేమము కలుగు గాక! నీవు వచ్చిన తరువాత నా దుఃఖములు అన్నీ తొలగి పోతాయి అనే ఆశతో నీ రాక కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తూ ఉంటాను. కాని రామా! మా అందరి మాటను కాదని నిన్ను అరణ్యము లకు వెళ్లమని ప్రేరేపించు చున్న ఆ దైవము యొక్క లీలలను ఎవరూ అర్థం చేసుకోలేరు.

రామా! నీ పద్నాలుగేళ్ల వనవాసము ఒక్కరోజులో గడిచిపోయి ఈరోజే నీవు వనములనుండి తిరిగి వచ్చే రోజు అయితే ఎంత బాగుంటుంది!’ అని ఆశాభావంతో పలికింది కౌసల్య. తనకు నమస్కరించిన రామునికి సదా మంగళం కలగాలని మనసారా ఆశీర్వదించింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది నాల్గవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచవింశః సర్గః (25) >>

Ayodhya Kanda Sarga 42 In Telugu – అయోధ్యాకాండ ద్విచత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 42 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ ద్విచత్వారింశః సర్గ, “దశరథాక్రందః”, రామాయణంలోని ఒక భావోద్వేగభరితమైన భాగం. ఈ సర్గలో, దశరథ మహారాజు రాముడు వనవాసానికి వెళ్లిన దుఃఖంలో ఉండి కన్నీళ్లు కారుస్తాడు. రాముడు తన దగ్గర లేనందుకు, అతను చనిపోయే సమయానికి కూడా తన కుమారుడిని చూడలేనందుకు, దశరథ మహారాజు గాఢమైన వ్యధతో విలపిస్తాడు. ఈ సర్గ దశరథుడి బాధ, అతని ప్రేమ, మరియు రాముడి వలన కలిగిన శూన్యతను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది. ఈ కథనం దశరథ మహారాజు, ఆయన కుమారుడు రాముడి మధ్య ఉన్న అనుబంధం, మరియు విధి పట్ల ఆయన బాధ్యతలను ప్రతిబింబిస్తుంది.

దశరథాక్రందః

యావత్తు నిర్యతస్తస్య రజోరూపమదృశ్యత |
నైవేక్ష్వాకువరస్తావత్సంజహారాత్మచక్షుషీ ||

1

యావద్రాజా ప్రియం పుత్రం పశ్యత్యత్యంతధార్మికమ్ |
తావద్వ్యవర్ధతేవాస్య ధరణ్యాం పుత్రదర్శనే ||

2

న పశ్యతి రజోఽప్యస్య యదా రామస్య భూమిపః |
తదాఽర్తశ్చ విషణ్ణశ్చ పపాత ధరణీతలే ||

3

తస్య దక్షిణమన్వాగాత్కౌసల్యా బాహుమంగనా |
వామం చాస్యాన్వగాత్పార్శ్వం కైకేయీ భరతప్రియా ||

4

తాం నయేన చ సంపన్నో ధర్మేణ వినయేన చ |
ఉవాచ రాజా కైకేయీం సమీక్ష్య వ్యథితేంద్రియః ||

5

కైకేయి మా మమాంగాని స్ప్రాక్షీస్త్వం దుష్టచారిణీ |
న హి త్వాం ద్రష్టుమిచ్ఛామి న భార్యా న చ బాంధవీ ||

6

యే చ త్వామనుజీవంతి నాహం తేషాం న తే మమ |
కేవలార్థపరాం హి త్వాం త్యక్తధర్మాం త్యజామ్యహమ్ ||

7

అగృహ్ణాం యచ్చ తే పాణిమగ్నిం పర్యణయం చ యత్ |
అనుజానామి తత్సర్వమస్మిన్ లోకే పరత్ర చ ||

8

భరతశ్చేత్ప్రతీతః స్యాద్రాజ్యం ప్రాప్యేదమవ్యయమ్ |
యన్మే స దద్యాత్పిత్రర్థం మామాం తద్దత్తమాగమత్ ||

9

అథ రేణుసముధ్వస్తం తముత్థాప్య నరాధిపమ్ |
న్యవర్తత తదా దేవీ కౌసల్యా శోకకర్శితా ||

10

హత్వేవ బ్రాహ్మణం కామాత్స్పృష్ట్వాఽగ్నిమివ పాణినా |
అన్వతప్యత ధర్మాత్మా పుత్రం సంచింత్య తాపసమ్ ||

11

నివృత్యైవ నివృత్యైవ సీదతో రథవర్త్మసు |
రాజ్ఞో నాతిబభౌ రూపం గ్రస్తస్యాంశుమతో యథా ||

12

విలలాప చ దుఃఖార్తః ప్రియం పుత్రమనుస్మరన్ |
నగరాంతమనుప్రాప్తం బుద్ధ్వా పుత్రమథాబ్రవీత్ ||

13

వాహనానాం చ ముఖ్యానాం వహతాం తం మమాత్మజమ్ |
పదాని పథి దృశ్యంతే స మహాత్మా న దృశ్యతే ||

14

యః సుఖేషూషధానేషు శేతే చందనరూషితః |
వీజ్యమానో మహార్హాభిః స్త్రీభిర్మమ సుతోత్తమః ||

15

స నూనం క్వచిదేవాద్య వృక్షమూలముపాశ్రితః |
కాష్ఠం వా యది వాఽశ్మానముపధాయ శయిష్యతే ||

16

ఉత్థాస్యతి చ మేదిన్యాః కృపణః పాంసుకుంఠితః |
వినిశ్శ్వసన్ప్రస్రవణాత్కరేణూనామివర్షభః ||

17

ద్రక్ష్యంతి నూనం పురుషాః దీర్ఘబాహుం వనేచరాః |
రామముత్థాయ గచ్ఛంతం లోకనాథమనాథవత్ ||

18

సా నూనం జనకస్యేష్టా సుతా సుఖసదోచితా |
కంటకాక్రమణక్రాంతా వనమద్య గమిష్యతి ||

19

అనభిజ్ఞా వనానాం సా నూనం భయముపైష్యతి |
శ్వాపదానర్ధితం శ్రుత్వా గంభీరం రోమహర్షణమ్ ||

20

సకామా భవకైకేయి విధవా రాజ్యమావస |
న హి తం పురుషవ్యాఘ్రం వినా జీవితుముత్సహే ||

21

ఇత్యేవం విలపన్రాజా జనౌఘేనాభిసంవృతః |
అపస్నాత ఇవారిష్టం ప్రవివేశ పురోత్తమమ్ ||

22

శూన్యచత్వరవేశ్మాంతాం సంవృతాపణదేవతామ్ |
క్లాంతదుర్బలదుఃఖార్తాం నాత్యాకీర్ణమహాపథామ్ ||

23

తామవేక్ష్య పురీం సర్వాం రామమేవానుచింతయన్ |
విలపన్ప్రావిశద్రాజా గృహం సూర్య ఇవాంబుదమ్ ||

24

మహాహ్రదమివాక్షోభ్యం సుపర్ణేన హృతోరగమ్ |
రామేణ రహితం వేశ్మ వైదేహ్యా లక్ష్మణేన చ ||

25

అథ గద్గదశబ్దస్తు విలపన్మనుజాధిపః |
ఉవాచ మృదుమందార్థం వచనం దీనమస్వరమ్ ||

26

కౌసల్యాయాం గృహం శీఘ్రం రామమాతుర్నయంతు మామ్ |
న హ్యన్యత్ర మమాశ్వాసో హృదయస్య భవిష్యతి ||

27

ఇతి బ్రువంతం రాజానమనయన్ద్వారదర్శినః |
కౌసల్యాయా గృహం తత్ర న్యవేశ్యత వినీతవత్ ||

28

తతస్తస్య ప్రవిష్టస్య కౌసల్యాయా నివేశనమ్ |
అధిరుహ్యాపి శయనం బభూవ లులితం మనః ||

29

పుత్రద్వయవిహీనం చ స్నుషయాఽపి వివర్జితమ్ |
అపశ్యద్భవనం రాజా నష్టచంద్రమివాంబరమ్ ||

30

తచ్చ దృష్ట్వా మహారాజో భుజముద్యమ్య వీర్యవాన్ |
ఉచ్చైఃస్వరేణ చుక్రోశ హారాఘవ జహాసి మామ్ ||

31

సుఖితా బత తం కాలం జీవిష్యంతి నరోత్తమాః |
పరిష్వజంతో యే రామం ద్రక్ష్యంతి పునరాగతమ్ ||

32

అథ రాత్ర్యాం ప్రపన్నాయాం కాలరాత్ర్యామివాత్మనః |
అర్ధరాత్రే దశరథః కౌసల్యామిదమబ్రవీత్ ||

33

రామం మేఽనుగతా దృష్టిరద్యాపి న నివర్తతే |
న త్వా పశ్యామి కౌసల్యే సాధుమాం పాణినా స్పృశ ||

34

తం రామమేవానువిచింతయంతం
సమీక్ష్య దేవీ శయనే నరేంద్రమ్ |
ఉపోపవిశ్యాధికమార్తరూపా
వినిశ్వసంతీ విలలాప కృచ్ఛ్రమ్ ||

35

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విచత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 42 Meaning In Telugu

రాముని రథము వెళుతున్నంత దూరమూ దశరథుడు అటువేపు చూస్తూనే ఉన్నాడు. రథము పోవు వేగముతో రేగిన ధూళితో రథము కనపడటం లేదు. రామునికి తనకూ దూరము పెరిగిపోతున్నట్టు భావించాడు దశరథుడు. దశరథునికి దుఃఖము ముంచుకొచ్చింది. ఇంక రాముడు తనకు కనపడడు అనే భావనను తట్టుకోలేకపోయాడు. అలాగే నేలమీద కూలబడ్డాడు. పక్కనే ఉన్న కౌసల్య, కైక ఆయననుపట్టుకున్నారు.

దశరథుడు కైక వంక దీనంగా చూచాడు. “ఓ కైకా! దయచేసి నన్ను తాకవద్దు. నీకూ నాకూ ఎలాంటి సంబంధము లేదు. నువ్వు నాకు భార్యవు కావు, బంధువుకావు. నీవు ఎవరని నన్ను తాకుతున్నావు. నీకే కాదు నీ వారికి కూడా నేను ఏమీ కాను. మీకూ నాకూ ఎలాంటి సంబంధము లేదు. నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని విడిచిపెట్టావో అదే క్షణంలో నేనూ నిన్ను విడిచిపెట్టాను. నీచేయి పట్టుకొని పాణిగ్రహణము చేసి అగ్నిహోత్రము చుట్టు మూడు ప్రదక్షిణములు చేసిన నాడు ముడివడిన మన బంధము నేటితో తెగిపోయినది. ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ మన ఇద్దరికీ ఎలాంటి సంబంధము లేదు. నీకూ నీ కుమారుడు భరతునికీ ఈ రాజ్యము కావాలి. తీసుకోండి. నన్ను విడిచిపెట్టండి. నేను చచ్చిపోయిన తరువాత మీరు నాకు జలతర్పణము విడవడానికి కూడా నేను అంగీకరించను. మీరు నా శవాన్ని కూడా తాకడానికి నేను అనుమతించను.” అని అన్నాడు దశరథుడు.

చేసేది లేక కైక ఆయనను విడిచిపెట్టింది. కౌసల్య దశరథుని పట్టుకొని లేవనెత్తి ఆయన రథములో కూర్చోపెట్టింది. తరువాత తన అంత:పురమునకు వెళ్లిపోయింది. దశరథుడు రాముని తల్చుకుంటూ తనలో తానే కుమిలిపోతున్నాడు. బ్రహ్మహత్యాపాతకము చేసిన వాడి మాదిరి భయంతో వణికిపోతున్నాడు. ఇంతలో వార్తాహరులువచ్చి రాముడు అయోధ్యను దాటి వెళ్లిపోయాడు అని చెప్పారు.

“అవును. రాముడు వెళ్లిపోయాడు. రాముడు వెళ్లిన రథచక్రముల జాడలు, రథమునకు కట్టిన గుర్రముల గిట్టల గుర్తులు మాత్రము అయోధ్యలో కనపడుతున్నాయి. రాముని జాడ మాత్రం కనపడటం లేదు. ప్రతిరోజూ చందనము పూసుకొని హంసతూలికా తల్పము మీద నిద్రించే రాముడు ఈ రోజు ఒళ్లంతా మట్టికొట్టుకొని ఉండగా, కటిక నేల మీద నిద్రిస్తాడు కాబోలు. మెత్తని తలగడ లేకుండా నిద్రించని రాముడు కటిక పాషాణమును తల కిందపెట్టుకొని నిద్రిస్తాడేమో! అయోధ్యలో స్నేహితులు, వందిమాగధులు వెంట రాగా
విహరించిన రాముడు రేపటి నుండి మునికుమారులు వెంట రాగా అడవులలో విహరిస్తాడేమో! మెత్తటి తివాచీల మీద నడిస్తేనే కంది పోయే సీత పాదాలు, రేపటి నుండి కటిక రాళ్ల మీద నడవాలి కాబోలు. క్రూరమృగములు అంటేనే భయపడే సీత రేపటినుండి ఆ క్రూర మృగముల భయంకరమైన అరుపులు వింటుందేమో!” అని తనలో తాను అనుకుంటున్నాడు దశరథుడు.

ఇంతలో కైక గుర్తుకు వచ్చింది.

“ఓకైకా! నీ కోరిక తీరిందా! నీకళ్లు చల్లబడ్డాయా! ఇంక నీ ఇష్టం. నీకు మొగుడు లేడు. నీవు విధవరాలవు. రాముడు లేని ఈ లోకంలో నేను ఉండను. నీవే ఈరాజ్యాన్ని పాలించుకో.”అని అరుస్తున్నాడు.

ఈ విధంగా దశరథుడు రాముని కోసరం శోకిస్తున్నాడు. వెనకకు తిరిగి పాడుబడినట్టు ఉన్న అయోధ్యలో ప్రవేశించాడు. అటు ఇటు చూస్తూ వెళుతున్నాడు. అయోధ్యలో ఏ ఇంటి ద్వారము తెరవ బడలేదు. ఏ ఇంటి ముందరా జనం లేరు. దేవాలయాలు, అంగళ్లు, అన్నీ మూసి ఉన్నాయి. రహదారుల మీద జనసంచారము లేదు. అటువంటి అయోధ్య వీధులగుండా దశరథుడు తన అంతఃపురము చేరుకున్నాడు.

ఆరోజు దాకా రాముని మాటలతో రాముని ఆటపాటలతో సందడిగా ఉన్న అంతఃపురము నిశ్శబ్దముగా ఉంది. నిర్మానుష్యమైన ఆ అంత:పురములో ఉండలేకపోయూడు దశరథుడు. “నేను ఇక్కడ ఉండలేను. నన్ను వెంటనే కౌసల్యమందిరమునకు తీసుకొని వెళ్లండి.” అని ఆదేశించాడు. వెంటనే పరిచారికలు దశరథుని కౌసల్య మందిరము నకు తీసుకొని వెళ్లారు. కౌసల్య మందిరములో దశరథుడు ఒక శయ్యమీద పడుకొన్నాడు.

కొడుకులు కోడళ్లు లేని ఆ గృహము దశరథునికి చంద్రుడులేని ఆకాశము మాదిరి అనిపించింది. ఉన్నట్టుండి దశరథుడు ఉ లిక్కిపడుతున్నాడు. ఏడుస్తున్నాడు. “రామా నన్ను విడిచి వెళ్లిపోయావా” అని అరుస్తున్నాడు. “పద్నాలుగేళ్ల వనవాసము ముగించుకొని నా రాముడు తిరిగి అయోధ్యకు వచ్చినపుడు, ఈ అయోధ్యా పౌరులం దరూ రామునికి ఘనస్వాగతము ఇస్తారు. అప్పటికి నేను ఉండను కదా! ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు కదా!” అని వాపోతున్నాడు. దశరథుడు.

రాత్రి అయింది. దశరథుడు భోజనము చేయలేదు. నిద్రపోలేదు. అర్థరాత్రి కౌసల్యను పిలిచాడు. “కౌసల్యా! నాకుకళ్లు కనిపించడం లేదు. నా దృష్టి రామునితో పాటు వెళ్లిపోయింది. రాముని చూచిన కళ్లతో నేను దేనినీ చూడలేను. నన్ను తాకు. నిన్ను గుర్తుపడతాను.” అని అన్నాడు దశరథుడు.

భర్తమాటలకు కౌసల్యకు దుఃఖము ముంచుకొచ్చింది. దశరథుని చేతి మీద తన చెయ్యివేసి నిమురుతూ ఆయన పక్కనే కూర్చుంది కౌసల్య.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబదిరెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రిచత్వారింశః సర్గః (43) >>

Balakanda Sarga 44 In Telugu – బాలకాండ చతుశ్చత్వారింశః సర్గః

Balakanda Sarga 44 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ – చతుశ్చత్వారింశః సర్గలో, విశ్వామిత్రుడు రాముడు, లక్ష్మణులతో సిద్దాశ్రమానికి చేరుకుంటాడు. రాముడు యజ్ఞానికి రక్షణగా ఉంటాడు. అప్పుడు మారీచుడు, సుబాహుడు దానవ సైన్యంతో యజ్ఞాన్ని భంగం చేయడానికి వస్తారు. రాముడు మారీచుడిని దూరం పంపి, సుబాహును చంపేస్తాడు. రాముని శక్తి విశ్వామిత్రుని ఆనందపరుస్తుంది. రాముడు ధైర్యం, కర్తవ్యం, ధర్మపరిపాలనతో యజ్ఞాన్ని రక్షిస్తాడు.

సాగరోద్ధారః

స గత్వా సాగరం రాజా గంగయాఽనుగతస్తదా |
ప్రవివేశ తలం భూమేర్యత్ర తే భస్మసాత్కృతాః ||

1

భస్మన్యథాప్లుతే రామ గంగాయాః సలిలేన వై |
సర్వలోకప్రభుర్బ్రహ్మా రాజానమిదమబ్రవీత్ ||

2

తారితా నరశార్దూల దివం యాతాశ్చ దేవవత్ |
షష్టిః పుత్రసహస్రాణి సగరస్య మహాత్మనః ||

3

సాగరస్య జలం లోకే యావత్ స్థాస్యతి పార్థివ |
సగరస్యాత్మజాస్తావత్స్వర్గే స్థాస్యంతి దేవవత్ ||

4

ఇయం హి దుహితా జ్యేష్ఠా తవ గంగా భవిష్యతి |
త్వత్కృతేన చ నామ్నాథ లోకే స్థాస్యతి విశ్రుతా ||

5

గంగా త్రిపథగా నామ దివ్యా భాగీరథీతి చ |
[* త్రీన్ పథో భావయంతీతి తతస్త్రిపథగా స్మృతా | *]
పితామహానాం సర్వేషాం త్వమేవ మనుజాధిప ||

6

కురుష్వ సలిలం రాజన్ప్రతిజ్ఞామపవర్జయ |
పూర్వకేణ హి తే రాజంస్తేనాతియశసా తదా ||

7

ధర్మిణాం ప్రవరేణాపి నైష ప్రాప్తో మనోరథః |
తథైవాంశుమతా తాత లోకేఽప్రతిమతేజసా ||

8

గంగాం ప్రార్థయతా నేతుం ప్రతిజ్ఞా నాపవర్జితా |
రాజర్షిణా గుణవతా మహర్షిసమతేజసా ||

9

మత్తుల్యతపసా చైవ క్షత్రధర్మే స్థితేన చ |
దిలీపేన మహాభాగ తవ పిత్రాతితేజసా ||

10

పునర్న శంకితా నేతుం గంగాం ప్రార్థయతాఽనఘ |
సా త్వయా సమతిక్రాంతా ప్రతిజ్ఞా పురుషర్షభ ||

11

ప్రాప్తోఽసి పరమం లోకే యశః పరమసంమతమ్ |
యచ్చ గంగావతరణం త్వయా కృతమరిందమ ||

12

అనేన చ భవాన్ప్రాప్తో ధర్మస్యాయతనం మహత్ |
ప్లావయస్వ త్వమాత్మానం నరోత్తమ సదోచితే ||

13

సలిలే పురుషవ్యాఘ్ర శుచిః పుణ్యఫలో భవ |
పితామహానాం సర్వేషాం కురుష్వ సలిలక్రియామ్ ||

14

స్వస్తి తేఽస్తు గమిష్యామి స్వం లోకం గమ్యతాం నృప |
ఇత్యేవముక్త్వా దేవేశః సర్వలోకపితామహః ||

15

యథాఽఽగతం తథాగచ్ఛద్దేవలోకం మహాయశాః |
భగీరథోఽపి రాజర్షిః కృత్వా సలిలముత్తమమ్ ||

16

యథాక్రమం యథాన్యాయం సాగరాణాం మహాయశాః |
కృతోదకః శుచీ రాజా స్వపురం ప్రవివేశ హ ||

17

సమృద్ధార్థో నరశ్రేష్ఠ స్వరాజ్యం ప్రశశాస హ |
ప్రముమోద చ లోకస్తం నృపమాసాద్య రాఘవ ||

18

నష్టశోకః సమృద్ధార్థో బభూవ విగతజ్వరః |
ఏష తే రామ గంగాయా విస్తరోఽభిహితో మయా ||

19

స్వస్తి ప్రాప్నుహి భద్రం తే సంధ్యాకాలోఽతివర్తతే |
ధన్యం యశస్యమాయుష్యం పుత్ర్యం స్వర్గ్యమతీవ చ ||

20

యః శ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ |
ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ ||

21

ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభమ్ |
యః శృణోతి చ కాకుత్స్థ సర్వాన్కామానవాప్నుయాత్ |
సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే ||

22

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుశ్చత్వారింశః సర్గః ||

Balakanda Sarga 44 Meaning In Telugu

భగీరథుని మనోరథమునెరవేరినది. గంగా జలము సగర పుత్రుల భస్మరాసుల మీద ప్రవహించినది. వారిని పునీతులను చేసినది. వారందరికీ స్వర్గలోక ప్రాప్తి కలిగించినది. అప్పుడు బ్రహ్మదేవుడు భగీరథునితో ఇలా పలికాడు.

” నీవు కోరినట్టు గంగ సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించినది. 60,000 మంది సగర కుమారులు స్వర్గమునకు వెళ్లినారు. సాగరములు ఉన్నంత వరకూ వారు స్వర్గములో ఉండగలరు. గంగను నీవు స్వర్గము నుండి భూమికి తీసుకొని వచ్చావు కాబట్టి ఆమె నీకు పుత్రికతో సమానము. అందుకని గంగ ఇప్పటి నుండి భాగీరథి అనే పేరులో పిలువబడుతుంది. ఈ గంగ దేవ లోకము నుండి భూలోకమునకు అక్కడి నుండి పాతాళమునకు ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపధ అనే పేరుతో కూడా పిలువ బడుతుంది.

ఓ భగీరథా! ఈ పవిత్ర గంగా జలముతో నీ పితరులకు తర్షణములు విడిచి నీ మాట నిలబెట్టుకో. ఎందుకంటే పూర్వము సగర చక్రవర్తి మనుమడు అంశుమంతుడు, దిలీపుడు, ఎవరూ ఈ పని చేయలేకపోయారు. దేవలోకములో ఉన్న గంగను భూలోకమునకు తీసుకొని వచ్చి మహోపకారము చేసావు. అఖండ మైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నావు. ఈ రోజు నుండి ప్రతిరోజూ ఈ పుణ్య గంగాజలములలో స్నానము చేసి పునీతుడవు కా! నీకు పుణ్యం వస్తుంది.” అని పలికాడు ‘బ్రహ్మ.. తరువాత బ్రహ్మ తనలోకమునకు వెళ్లిపోయాడు.

తరువాత భగీరథుడు తన పితరులకు, పితామహులకు, ప్రపితామహులకు జల తరణములు విడిచి వారికి పుణ్యలోకములు ప్రాప్తించేటట్టు చేసాడు.

ఓ రామా! ఇదీ గంగావతరణము కథ. ఈ గంగావతరణము కథ చదివిన వాడు, విన్న వాడు పాపములు నశించి పుణ్యలోకములు పొందుతాడు. రామా! సంధ్యాకాలము అయినది. వెళ్లి సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించెదము.” అని పలికాడు విశ్వామిత్రుడు.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలుబది నాలుగవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ పంచచత్వారింశః సర్గః (45) >>

Ayodhya Kanda Sarga 41 In Telugu – అయోధ్యాకాండ ఏకచత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 41 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ  ఏకచత్వారింశః సర్గ రామాయణంలోని ఒక ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో, రాముడు తన పిత దశరథ మహారాజు మరణ వార్త తెలుసుకుంటాడు. ఈ వార్త రాముడు, సీత మరియు లక్ష్మణులను మరింత దుఃఖంలోకి నెట్టివేస్తుంది. ఈ సర్గలో, రాముడు తన పిత ను స్మరించుకుంటూ, ఆయనతో గడిపిన అనుభవాలను తలుచుకుంటాడు. ఇది రాముడి వ్యక్తిత్వంలోని మరిన్ని పార్శ్వాలను మరియు అతని జీవితంలో కష్టకాలాలను పరిచయం చేస్తుంది. ఈ సంఘటనలు, రాముడి ధైర్యం, విధి నిష్ఠను, మరియు అతని ధార్మికతను ప్రతిఫలింపజేస్తాయి.

నగరసంక్షోభః

తస్మింస్తు పురుషవ్యాఘ్రే వినిర్యాతే కృతాంజలౌ |
ఆర్తశబ్దోఽథ సంజజ్ఞే స్త్రీణామంతఃపురే మహాన్ ||

1

అనాథస్య జనస్యాస్య దుర్బలస్య తపస్వినః |
యో గతిః శరణం చాసీత్స నాథః క్వను గచ్ఛతి ||

2

న క్రుధ్యత్యభిశప్తోఽపి క్రోధనీయాని వర్జయన్ |
క్రుద్ధాన్ప్రసాదయన్సర్వాన్సమదుఃఖః క్వచిద్గతః ||

3

కౌసల్యాయాం మహాతేజాః యథా మాతరి వర్తతే |
తథా యో వర్తతేఽస్మాసు మహాత్మా క్వ ను గచ్ఛతి ||

4

కైకేయ్యా క్లిశ్యమానేన రాజ్ఞా సంచోదితో వనమ్ |
పరిత్రాతా జనస్యాస్య జగతః క్వ ను గచ్ఛతి ||

5

అహో నిశ్చేతనో రాజా జీవలోకస్య సంప్రియమ్ |
ధర్మ్యం సత్యవ్రతం రామం వనవాసే ప్రవత్స్యతి ||

6

ఇతి సర్వా మహిష్యస్తాః వివత్సా ఇవ ధేనవః |
రురుదుశ్చైవ దుఃఖార్తాః సస్వరం చ విచుక్రుశుః ||

7

స తమంతఃపురే ఘోరమార్తశబ్దం మహీపతిః |
పుత్రశోకాభిసంతప్తః శ్రుత్వా చాసీత్సుదుఃఖితః ||

8

నాగ్నిహోత్రాణ్యహూయంత నాపచన్గృహమేధినః |
అకుర్వన్న ప్రజాః కార్యం సూర్యశ్చాంతరధీయత ||

9

వ్యసృజన్కబలాన్నాగాః గావో వత్సాన్నపాయయన్ |
పుత్రం ప్రథమజం లబ్ధ్వా జననీ నాభ్యనందత ||

10

త్రిశంకుర్లోహితాంగశ్చ బృహస్పతిబుధావపి |
దారుణాః సోమమభ్యేత్య గ్రహాః సర్వే వ్యవస్థితాః ||

11

నక్షత్రాణి గతార్చీంషి గ్రహాశ్చ గతతేజసః |
విశాఖాస్తు సధూమాశ్చ నభసి ప్రచకాశిరే ||

12

కాలికానిలవేగేన మహోదధిరివోత్థితః |
రామే వనం ప్రవ్రజితే నగరం ప్రచచాల తత్ ||

13

దిశః పర్యాకులాః సర్వాస్తిమిరేణేవ సంవృతాః |
న గ్రహో నాపి నక్షత్రం ప్రచకాశే న కించన ||

14

అకస్మాన్నాగరః సర్వో జనో దైన్యముపాగమత్ |
ఆహారే వా విహారే వా న కశ్చిదకరోన్మనః ||

15

శోకపర్యాయసంతప్తః సతతం దీర్ఘముచ్ఛ్వసన్ |
అయోధ్యాయాం జనః సర్వః శుశోచ జగతీపతిమ్ ||

16

బాష్పపర్యాకులముఖో రాజమార్గగతో జనః |
న హృష్టః లక్ష్యతే కశ్చిత్సర్వః శోకపరాయణః ||

17

న వాతి పవనః శీతో న శశీ సౌమ్యదర్శనః |
న సూర్యస్తపతే లోకం సర్వం పర్యాకులం జగత్ ||

18

అనర్థినః సుతాః స్త్రీణాం భర్తారో భ్రాతరస్తథా |
సర్వే సర్వం పరిత్యజ్య రామమేవాన్వచింతయన్ ||

19

యే తు రామస్య సుహృదః సర్వే తే మూఢచేతసః |
శోకభారేణ చాక్రాంతాః శయనం న జుహుస్తదా ||

20

తతస్త్వయోధ్యా రహితా మహాత్మనా
పురందరేణేవ మహీ సపర్వతా |
చచాల ఘోరం భయశోకపీడితా
సనాగయోధాశ్వగణా ననాద చ ||

21

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకచత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 41 Meaning In Telugu

ఎప్పుడైతే రాముడు అంత:పురస్త్రీలకు అందరికీ నమస్కరించి బయటు దేరాడో, వారందరూ ఏడవడం మొదలుపెట్టారు.

“ఇంత కాలమూ రాముడు మాకు రక్షకుడుగా ఉండేవాడు. ఆ రాముడు ఇప్పుడు ఏడీ! మనము ఎలా బతకాలి!” అని వాపోతున్నారు. రాముని మంచి గుణములను తలచుకుంటూ ఏడుస్తున్నారు.

“రాముడికి అసలు కోపమే రాదు. ఎవరి మీద కోపగించడు. ఒకవేళ ఎవరన్నా రాముని మీద కోపించిన, తిరిగి వారి మీద కోపింపడు. అటువంటి ఉత్తముడు రాముడు. అందరి కష్టసుఖములు తనవిగా అనుకొని ఆదరించెడి వాడు రాముడు. రాముడు తన తల్లి కౌసల్యను ఏ మాదిరి ఆదరించేవాడో మా అందరిని కూడా అంతే గౌరవంతో ఆదరించేవాడు. ఈ నాడు ఈ కైకేయి వలన మాకు రాముని అండలేకుండా పోయింది. అయినా కైక వరాలు కోరిందే అనుకో. మహారాజుగారు ఏదో ఒక వరం ఇచ్చి సరిపుచ్చవచ్చుకదా. ఆమె మాట విని రాముని వనములకు పంపాలా! బుద్ధిలేకపోతే సరి!” అని దశరథుని కూడా నిందిస్తున్నారు.

అసలే రాముడు అడవులకుపోయిన దుఃఖంతో ఉన్న దశరథునికి అంత:పుర స్త్రీల సూటిపోటీ మాటలు భరించరానివిగా ఉన్నాయి. కానీ ఏమీ అనలేడు. తను చేసిన పని అటువంటిది కదా!

రాముడు లేని అయోధ్యలో బ్రాహ్మణులు అగ్నిహోత్రములు వెలిగించలేదు. ఎవరి ఇంట్లో కూడా పొయ్యి వెలిగించలేదు. రాముడే లేని మాకు అన్నము ఎందుకు అని అనుకున్నారు ప్రజలు. వారి మూలపురుషుడైన సూర్యుడు కూడా మొహం చాటేసాడా అన్నట్టు ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఏనుగులు ఆహారం తీసుకోలేదు. ఆవులు తమ దూడలకు పాలు ఇవ్వలేదు.

అయోధ్యలో ఉన్న ప్రజలలో ఎవరి మొహంలోనూ సంతోషము ఆనందమూ కనపడలేదు. అందరూ రాముని గురించే ఆలోచిస్తున్నారు. అయోధ్యావాసులందరూ తమ తమ దైనందిన పనులు చెయ్యడంలో ఆసక్తి చూపడం లేదు. రామునికి ఏమవు తుందో ఏమో అని దిగులుతో ఉన్నారు. ఇంక రాముని స్నేహితులు అయితే ఏకంగా మంచానికి అతుక్కుపోయారు. లేవడానికి కూడా వారికి ఓపిక లేదు. రాముడు లేని అయోధ్య ప్రాణం లేని శరీరంలాగా తయారయింది. రాముని వియోగము భరించలేక అయోధ్యలోని ప్రజలేకాదు, పశువులు, ఏనుగులు, గుర్రములు, పక్షులు కూడా ఆహారం ముట్టకుండా విలపిస్తున్నాయి.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబదిఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్విచత్వారింశః సర్గః (42) >>

Balakanda Sarga 33 In Telugu – బాలకాండ త్రయస్త్రింశః సర్గః

Balakanda Sarga 33 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రయస్త్రింశః సర్గలో కుశనాభ కుమార్తెలు వాయుదేవుని చేష్టల గురించి నివేదిస్తారు. వారి ప్రవర్తనకు సంతోషించిన కుశనాభుడు ఆలోచించి, సాధువు రాజు బ్రహ్మదత్తతో వారి వివాహానికి ఏర్పాట్లు చేస్తాడు. వివాహానంతరం, బ్రహ్మదత్తుని చేతి స్పర్శతో ఆడపిల్లలు తమ వికృతమైన శరీరాలను వదిలించుకుని, వారు మళ్లీ గొప్ప అందగాళ్లవుతారు.

బ్రహ్మదత్తవివాహః

తస్య తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః |
శిరోభిశ్చరణౌ స్పృష్ట్వా కన్యాశతమభాషత ||

1

వాయుః సర్వాత్మకో రాజన్ప్రధర్షయితుమిచ్ఛతి |
అశుభం మార్గమాస్థాయ న ధర్మం ప్రత్యవేక్షతే ||

2

పితృమత్యః స్మ భద్రం తే స్వచ్ఛందే న వయం స్థితాః |
పితరం నో వృణీష్వ త్వం యది నో దాస్యతే తవ ||

3

తేన పాపానుబంధేన వచనం నప్రతీచ్ఛతా |
ఏవం బ్రువంత్యః సర్వాః స్మ వాయునా నిహతా భృశమ్ ||

4

తాసాం తద్వచనం శ్రుత్వా రాజా పరమధార్మికః |
ప్రత్యువాచ మహాతేజాః కన్యాశతమనుత్తమమ్ ||

5

క్షాంతం క్షమావతాం పుత్ర్యః కర్తవ్యం సుమహత్కృతమ్ |
ఐకమత్యముపాగమ్య కులం చావేక్షితం మమ ||

6

అలంకారో హి నారీణాం క్షమా తు పురుషస్య వా |
దుష్కరం తచ్చ యత్ క్షాంతం త్రిదశేషు విశేషతః ||

7

యాదృశీ వః క్షమా పుత్ర్యః సర్వాసామవిశేషతః |
క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞశ్చ పుత్రికాః ||

8

క్షమా యశః క్షమా ధర్మః క్షమయా విష్ఠితం జగత్ |
విసృజ్య కన్యా కాకుత్స్థ రాజా త్రిదశవిక్రమః ||

9

మంత్రజ్ఞో మంత్రయామాస ప్రదానం సహ మంత్రిభిః |
దేశే కాలే ప్రదానస్య సదృశే ప్రతిపాదనమ్ ||

10

ఏతస్మిన్నేవ కాలే తు చూలీ నామ మహామునిః |
ఊర్ధ్వరేతాః శుభాచారో బ్రాహ్మం తప ఉపాగమత్ ||

11

తప్యంతం తమృషిం తత్ర గంధర్వీ పర్యుపాసతే |
సోమదా నామ భద్రం తే ఊర్మిలాతనయా తదా ||

12

సా చ తం ప్రణతా భూత్వా శుశ్రూషణపరాయణా |
ఉవాస కాలే ధర్మిష్ఠా తస్యాస్తుష్టోఽభవద్గురుః ||

13

స చ తాం కాలయోగేన ప్రోవాచ రఘునందన |
పరితుష్టోఽస్మి భద్రం తే కిం కరోమి తవ ప్రియమ్ ||

14

పరితుష్టం మునిం జ్ఞాత్వా గంధర్వీ మధురస్వరా |
ఉవాచ పరమప్రీతా వాక్యజ్ఞా వాక్యకోవిదమ్ ||

15

లక్ష్మ్యా సముదితో బ్రాహ్మ్యా బ్రహ్మభూతో మహాతపాః |
బ్రాహ్మేణ తపసా యుక్తం పుత్రమిచ్ఛామి ధార్మికమ్ ||

16

అపతిశ్చాస్మి భద్రం తే భార్యా చాస్మి న కస్యచిత్ |
బ్రాహ్మేణోపగతాయాశ్చ దాతుమర్హసి మే సుతమ్ ||

17

తస్యాః ప్రసన్నో బ్రహ్మర్షిర్దదౌ పుత్రం తథావిధమ్ |
బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూలినః సుతమ్ ||

18

స రాజా సౌమదేయస్తు పురీమధ్యవసత్తదా |
కాంపిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజో యథా దివమ్ ||

19

స బుద్ధిం కృతవాన్రాజా కుశనాభః సుధార్మికః |
బ్రహ్మదత్తాయ కాకుత్స్థ దాతుం కన్యాశతం తదా ||

20

తమాహూయ మహాతేజా బ్రహ్మదత్తం మహీపతిః |
దదౌ కన్యాశతం రాజా సుప్రీతేనాంతరాత్మనా ||

21

యథాక్రమం తతః పాణీన్ జగ్రాహ రఘునందన |
బ్రహ్మదత్తో మహీపాలస్తాసాం దేవపతిర్యథా ||

22

స్పృష్టమాత్రే తతః పాణౌ వికుబ్జా విగతజ్వరాః |
యుక్తాః పరమయా లక్ష్మ్యా బభుః కన్యాః శతం తదా ||

23

స దృష్ట్వా వాయునా ముక్తాః కుశనాభో మహీపతిః |
బభూవ పరమప్రీతో హర్షం లేభే పునః పునః ||

24

కృతోద్వాహం తు రాజానం బ్రహ్మదత్తం మహీపతిః |
సదారం ప్రేషయామాస సోపాధ్యాయగణం తదా ||

25

సోమదాఽపి సుసంహృష్టా పుత్రస్య సదృశీం క్రియామ్ |
యథాన్యాయం చ గంధర్వీ స్నుషాస్తాః ప్రత్యనందత |
దృష్ట్వా స్పృష్ట్వా చ తాః కన్యాః కుశనాభం ప్రశస్య చ ||

26

తండ్రి మాటలు విన్న కుమార్తెలు ఆయనకు నమస్కరించి ఇలా అన్నారు.

“వాయుదేవుడు ధర్మము తప్పి మమ్ములను వివాహము చేసుకుంటాను అని అన్నాడు. మేము తిరస్కరించాము. మా తండ్రి గారు ఉన్నారు. మేము అస్వతంత్రులము. మా తండ్రి గారిని అడుగు.”అని అన్నాము. దానికి ఆయన కోపించి మమ్ములను దుర్బలులుగా చేసాడు. ఇదీ జరిగిన సంగతి.” అని చెప్పారు.

వారి మాటలు విన్న కుశ నాభుడు వారితో ఇలా అన్నాడు.

“కుమార్తెలారా! మీరు మంచి పని చేసారు. మీ ఓర్పును మెచ్చుకుంటున్నాను. మీరు వాయుదేవుని క్షమించి విడిచి పెట్టారు. పురుషులకు, స్త్రీలకు ఓర్పు అలంకారము. ఓర్పు దానము, ఓర్పు యజ్ఞము, ఓర్పు సత్యము, ఓర్పు కీర్తి. ఓర్పు ధర్మము. ఓర్పు మీదనే ఈ ధరణి అంతా నిలిచి ఉంది. కాని దేవతలకు ఓర్పు ఉండదు. కాబట్టి మీ ఓర్పును ప్రశంసిస్తున్నాను.” అని పలికాడు.

తరువాత కుశధ్వజుడు మంత్రులతో తన కుమార్తెల వివాహముల గురించి మంతనాలు సాగించాడు. ఆ సమయమున చూళి అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆయనకు సోమద అనే గంధర్వ కాంత పరిచర్యలు చేస్తూ ఉంది. ఆ గంధర్వ కన్య పరిచర్యలకు చూళి చాలా సంతోషించాడు.

“ఓ కన్యా! నీకు ఏమి కావాలో కోరుకో!” అని అడిగాడు.

“ఓ మహర్షీ! నాకు పుత్ర సంతానము కావాలి. కాని నాకు భర్త లేడు. నేను ఎవరికీ భార్యను కాను. అందుకే మీకు సేవలు చేస్తున్నాను. తమ వలన నాకు బ్రహ్మ తేజస్సు కలిగిన పుత్రుడు కలిగే వరమును ప్రసాదించండి.” అని అడిగింది.

చూళి ఆమె కోర్కెను మన్నించాడు. ఆమెకు తన తేజస్సుతో ఒక కుమారుడిని ప్రసాదించాడు. ఆయనే చూళి మానస పుత్రుడు. ఆయన పేరు బ్రహ్మదత్తుడు. సోమద కుమారుడైన బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరంలో నివసిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా కుశనాభుడు తన నూర్గురు కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహము చేయవలెనని నిశ్చయించుకున్నాడు. ఆ విషయం బ్రహ్మ దత్తునితో సంప్రదించాడు. ఈ వివాహానికి బ్రహ్మ దత్తుడు ఒప్పుకున్నాడు. కుశనాభుడు తన నూర్గురు కుమార్తెలను బ్రహ్మ దత్తునికి ఇచ్చి వివాహం జరిపించాడు.

బ్రహ్మ దత్తుని చేతి స్పర్శ తగలగానే వారికి వాయుదేవుని వలన కలిగిన దుర్బలత్వము తొలగిపోయింది. పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రకాశించారు.

బ్రహ్మ దత్తుడు తన నూర్గురు భార్యలతో కాంపిల్యల నగరం చేరుకున్నాడు. సోమద తన కోడళ్లను చూసి మురిసిపోయింది. వారి అందచందాలను చూసి ఎంతో సంతోషపడింది.

శ్రీమద్రామాయణము
బాల కాండ
ముప్పది మూడవ సర్గ సంపూర్ణము.

ఓంతత్సత్ ఓం తత్సత్ ఓంతత్సత్.

బాలకాండ చతుస్త్రింశః సర్గః (34) >>

Balakanda Sarga 42 In Telugu – బాలకాండ ద్విచత్వారింశః సర్గః

Balakanda Sarga 42 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ – ద్విచత్వారింశః సర్గలో, రాముడు విశ్వామిత్రుని వెంట యజ్ఞాన్ని రక్షించేందుకు సిద్దమవుతాడు. యాత్రలో, వారు తాడకాతో ఎదురవుతారు. తాడక, దానవుల రాణి, యజ్ఞాలను దుష్ప్రభావం చేస్తుంది. రాముడు తన ధైర్యం మరియు శక్తితో తాడకను సమరంలో సంహరిస్తాడు. ఈ సంఘటన రాముని శక్తి, ధర్మనిరతత, మరియు గురుభక్తిని చూపిస్తుంది.

భగీరథవరప్రదానమ్

కాలధర్మం గతే రామ సగరే ప్రకృతీజనాః |
రాజానం రోచయామాసురంశుమంతం సుధార్మికమ్ ||

1

స రాజా సుమహానాసీదంశుమాన్రఘునందన |
తస్య పుత్రో మహానాసీద్దిలీప ఇతి విశ్రుతః ||

2

తస్మిన్రాజ్యం సమావేశ్య దిలీపే రఘునందన |
హిమవచ్ఛిఖరే పుణ్యే తపస్తేపే సుదారుణమ్ ||

3

ద్వాత్రింశచ్చ సహస్రాణి వర్షాణి సుమహాయశాః |
తపోవనం గతో రామ స్వర్గం లేభే మహాయశాః ||

4

దిలీపస్తు మహాతేజాః శ్రుత్వా పైతామహం వధమ్ |
దుఃఖోపహతయా బుద్ధ్యా నిశ్చయం నాధ్యగచ్ఛత ||

5

కథం గంగావతరణం కథం తేషాం జలక్రియా |
తారయేయం కథం చైతానితి చింతాపరోఽభవత్ ||

6

తస్య చింతయతో నిత్యం ధర్మేణ విదితాత్మనః |
పుత్రో భగీరథో నామ జజ్ఞే పరమధార్మికః ||

7

దిలీపస్తు మహాతేజా యజ్ఞైర్బహుభిరిష్టవాన్ |
త్రింశద్వర్షసహస్రాణి రాజా రాజ్యమకారయత్ ||

8

అగత్వా నిశ్చయం రాజా తేషాముద్ధరణం ప్రతి |
వ్యాధినా నరశార్దూల కాలధర్మముపేయివాన్ ||

9

ఇంద్రలోకం గతో రాజా స్వార్జితేనైవ కర్మణా |
రాజ్యే భగీరథం పుత్రమభిషిచ్య నరర్షభః ||

10

భగీరథస్తు రాజర్షిర్ధార్మికో రఘునందన |
అనపత్యో మహాతేజాః ప్రజాకామః స చాప్రజాః ||

11

మంత్రిష్వాధాయ తద్రాజ్యం గంగావతరణే రతః |
స తపో దీర్ఘమాతిష్ఠద్గోకర్ణే రఘునందన ||

12

ఊర్ధ్వబాహుః పంచతపా మాసాహారో జితేంద్రియః |
తస్య వర్షసహస్రాణి ఘోరే తపసి తిష్ఠతః ||

13

అతీతాని మహబహో తస్య రాజ్ఞో మహాత్మనః |
సుప్రీతో భగవాన్బ్రహ్మా ప్రజానాం పతిరీశ్వరః ||

14

తతః సురగణైః సార్ధముపాగమ్య పితామహః |
భగీరథం మహాత్మానం తప్యమానమథాబ్రవీత్ ||

15

భగీరథ మహాభాగ ప్రీతస్తేఽహం జనేశ్వర |
తపసా చ సుతప్తేన వరం వరయ సువ్రత ||

16

తమువాచ మహాతేజాః సర్వలోకపితామహమ్ |
భగీరథో మహాభాగః కృతాంజలిరుపస్థితః ||

17

యది మే భగవన్ప్రీతో యద్యస్తి తపసః ఫలమ్ |
సగరస్యాత్మజాః సర్వే మత్తః సలిలమాప్నుయుః ||

18

గంగాయాః సలిలక్లిన్నే భస్మన్యేషాం మహాత్మనామ్ |
స్వర్గం గచ్ఛేయురత్యంతం సర్వే మే ప్రపితామహాః ||

19

దేయా చ సంతతిర్దేవ నావసీదేత్కులం చ నః |
ఇక్ష్వాకూణాం కులే దేవ ఏష మేఽస్తు వరః పరః ||

20

ఉక్తవాక్యం తు రాజానం సర్వలోకపితామహః |
ప్రత్యువాచ శుభాం వాణీం మధురాం మధురాక్షరామ్ ||

21

మనోరథో మహానేష భగీరథ మహారథ |
ఏవం భవతు భద్రం తే ఇక్ష్వాకుకులవర్ధన ||

22

ఇయం హైమవతీ గంగా జ్యేష్ఠా హిమవతః సుతా |
తాం వై ధారయితుం శక్తో హరస్తత్ర నియుజ్యతామ్ ||

23

గంగాయాః పతనం రాజన్పృథివీ న సహిష్యతి |
తాం వై ధారయితుం వీర నాన్యం పశ్యామి శూలినః ||

24

తమేవముక్త్వా రాజానం గంగాం చాభాష్య లోకకృత్ |
జగామ త్రిదివం దేవః సహ దేవైర్మరుద్గణైః ||

25

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విచత్వారింశః సర్గః ||

Balakanda Sarga 42 Meaning In Telugu

సగర చక్రవర్తి మరణించిన తరువాత ఆయన మనుమడు అంశు మంతుడు చక్రవర్తి అయ్యాడు. అంశు మంతుని కుమారుడు దిలీపుడు. అంశు మంతుడు దిలీపునకు రాజ్యము కట్టబెట్టి తాను తపస్సు చేసుకోడానికి అరణ్యములకు వెళ్లాడు.

దిలీపుడు తన పితామహులకు స్వర్గ లోక ప్రాప్తి కలిగించుటకు ఆకాశ గంగను భూమి మీదికి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు. కాని తగిన ఉపాయము దొరకలేదు. ఆ మనోవ్యధతోనే దిలీపుడు మరణించాడు.

ఆ దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథునికి పుత్ర సంతానము లేదు. భగీరథునికి సంతానము కావలెనని తీవ్రమైన కోరిక కలిగింది. దానికి తోడు తన ప్రపితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుట. ఈ రెండు కోరికలతో భగీరథుడు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు.

” ఓ భగీరథా! నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో” అని అడిగాడు బ్రహ్మ.

“దేవా! నాకు పుత్ర సంతానము ప్రసాదించండి. తరువాత ఆకాశ గంగను భూమీ మీదకు పంపండి. ఆ ఆకాశ గంగతో నా ప్రపితా మహులకు జలతర్పణము వదులుతాను.” అని కోరుకున్నాడు.

” ఓ భగీరథా! నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాని ఆకాశ గంగను భూమి మీదికి తేవడం అత్యతం కష్టమైన పని. కాని నీవు కోరావు కాబట్టి ఆ వరం కూడా ప్రసాదిస్తున్నాను. గంగాదేవి హిమవంతుని పెద్దకుమార్తె. హిమవంతుని రెండవ కుమార్తె ఉమను సదాశివుడు వివాహమాడాడు. ఆకాశము నుండి భూమి మీదికి దూకే గంగానదిని భరించే శక్తి ఆ మహేశ్వరునికి తప్ప వేరే ఎవరికీ లేదు. ఎందుకంటే ఆకాశము నుండి భూమి మీదికి దిగే గంగాప్రవాహాన్ని భరించే శక్తి భూమికి లేదు. మధ్యలో మహేశ్వరుడు ఆ గంగను భరించాలి. కాబట్టి నీవు మహేశ్వరుని ప్రార్థించి గంగాదేవిని వహించమని కోరాలి.” అని అన్నాడు బ్రహ్మదేవుడు.

బ్రహ్మదేవుడు ఈ విషయం గంగాదేవితో కూడా చెప్పాడు. ఆమె అనుమతి కూడా తీసుకున్నాడు. తరువాత బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలుబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓంతత్సత్

బాలకాండ త్రిచత్వారింశః సర్గః (43) >>

Balakanda Sarga 31 In Telugu – బాలకాండ ఏకత్రింశః సర్గః

Balakanda Sarga 31 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకత్రింశః సర్గలో ఋషి విశ్వామిత్రుడు మిథిలా రాజ్యానికి జనక రాజు యొక్క ఆచారానికి హాజరయ్యేందుకు మరియు యుగాల నుండి జనకుని రాజభవనంలో పూజించబడుతున్న శివుని పవిత్రమైన విల్లును చూడటానికి కూడా ప్రయాణిస్తాడు. ఇతర ఋషులు రాముడికి సూచించారు, అతను కూడా తమతో పాటు ఆ అద్భుత విల్లును చూడమని అక్కడికి వెళ్ళవచ్చు. వారంతా సిద్ధ ఆశ్రమం నుండి గంగా నదికి ఉపనది అయిన సోనా నది వైపు వెళ్లి ఒక రాత్రి దాని ఒడ్డున విడిది చేస్తారు.

మిథిలాప్రస్థానమ్

అథ తాం రజనీం తత్ర కృతార్థౌ రామలక్ష్మణౌ |
ఊషతుర్ముదితౌ వీరౌ ప్రహృష్టేనాంతరాత్మనా ||

1

ప్రభాతాయాం తు శర్వర్యాం కృతపౌర్వాహ్ణికక్రియౌ |
విశ్వామిత్రమృషీంశ్చాన్యాన్ సహితావభిజగ్మతుః ||

2

అభివాద్య మునిశ్రేష్ఠం జ్వలంతమివ పావకమ్ |
ఊచతుర్మధురోదారం వాక్యం మధురభాషిణౌ ||

3

ఇమౌ స్మ మునిశార్దూల కింకరౌ సముపాగతౌ |
ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావ కిమ్ ||

4

ఏవముక్తాస్తతస్తాభ్యాం సర్వ ఏవ మహర్షయః |
విశ్వామిత్రం పురస్కృత్య రామం వచనమబ్రువన్ ||

5

మైథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి |
యజ్ఞః పరమధర్మిష్ఠస్తస్య యాస్యామహే వయమ్ ||

6

త్వం చైవ నరశార్దూల సహాస్మాభిర్గమిష్యసి |
అద్భుతం చ ధనూరత్నం తత్రైకం ద్రష్టుమర్హసి ||

7

తద్ధి పూర్వం నరశ్రేష్ఠ దత్తం సదసి దైవతైః |
అప్రమేయబలం ఘోరం మఖే పరమభాస్వరమ్ ||

8

నాస్య దేవా న గంధర్వా నాసురా న చ రాక్షసాః |
కర్తుమారోపణం శక్తా న కథంచన మానుషాః ||

9

ధనుషస్తస్య వీర్యం హి జిజ్ఞాసంతో మహీక్షితః |
న శేకురారోపయితుం రాజపుత్రా మహాబలాః ||

10

తద్ధనుర్నరశార్దూల మైథిలస్య మహాత్మనః |
తత్ర ద్రక్ష్యసి కాకుత్స్థ యజ్ఞం చాద్భుతదర్శనమ్ ||

11

తద్ధి యజ్ఞఫలం తేన మైథిలేనోత్తమం ధనుః |
యాచితం నరశార్దూల సునాభం సర్వదైవతైః ||

12

ఆయాగభూతం నృపతేస్తస్య వేశ్మని రాఘవ |
అర్చితం వివిధైర్గంధైర్ధూపైశ్చాగరుగంధిభిః ||

13

ఏవముక్త్వా మునివరః ప్రస్థానమకరోత్తదా |
సర్షిసంఘః సకాకుత్స్థ ఆమంత్ర్య వనదేవతాః ||

14

స్వస్తి వోఽస్తు గమిష్యామి సిద్ధః సిద్ధాశ్రమాదహమ్ |
ఉత్తరే జాహ్నవీతీరే హిమవంతం శిలోచ్చయమ్ ||

15

ప్రదక్షిణం తతః కృత్వా సిద్ధాశ్రమమనుత్తమమ్ |
ఉత్తరాం దిశముద్దిశ్య ప్రస్థాతుముపచక్రమే ||

16

తం ప్రయాంతం మునివరమన్వయాదనుసారిణామ్ |
శకటీశతమాత్రం చ ప్రయాతే బ్రహ్మవాదినామ్ ||

17 [ప్రయాణే]

మృగపక్షిగణాశ్చైవ సిద్ధాశ్రమనివాసినః |
అనుజగ్ముర్మహాత్మానం విశ్వామిత్రం మహామునిమ్ ||

18

నివర్తయామాస తతః పక్షిసంఘాన్మృగానపి |
తే గత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే ||

19

వాసం చక్రుర్మునిగణాః శోణకూలే సమాగతాః |
తేఽస్తం గతే దినకరే స్నాత్వా హుతహుతాశనాః ||

20

విశ్వామిత్రం పురస్కృత్య నిషేదురమితౌజసః |
రామో హి సహసౌమిత్రిర్మునీంస్తానభిపూజ్య చ ||

21

అగ్రతో నిషసాదాథ విశ్వామిత్రస్య ధీమతః |
అథ రామో మహాతేజా విశ్వామిత్రం మహామునిమ్ ||

22

పప్రచ్ఛ నరశార్దూలః కౌతూహలసమన్వితః |
భగవన్కోన్వయం దేశః సమృద్ధవనశోభితః ||

23

శ్రోతుమిచ్ఛామి భద్రం తే వక్తుమర్హసి తత్త్వతః |
చోదితో రామవాక్యేన కథయామాస సువ్రతః |
తస్య దేశస్య నిఖిలమృషిమధ్యే మహాతపాః ||

24

Balakanda Sarga 31 In Telugu Pdf With Meaning

యాగమును సంరక్షించాము అన్న ఆనందంతో రామలక్ష్మణులు ఆ రాత్రి సుఖంగా నిద్రించారు.

మరునాడు ప్రాత:కాలమునే లేచి సంధ్యావందనాది కార్యములు పూర్తి చేసుకొని రామలక్ష్మణులు విశ్వామిత్రుడు, తదితర ఋషుల వద్దకు వెళ్లారు. వారు విశ్వామిత్రునికి భక్తితో నమస్కరించి ఇలా అన్నారు.

“ ఓ మహర్షీ! మేము నీ భటుల మాదిరి వచ్చినిలిచి ఉన్నాము. ఏమి చేయవలెనో ఆజ్ఞాపించండి.” అని చేతులుకట్టుకొని వినయంగా నిలబడ్డారు.

వారిని చూచిన మహర్షులు విశ్వామిత్రుని అనుమతితో ఇలా అన్నారు. ” ఓ రామా! మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞము చేయుచున్నాడు. మేము అందరమూ ఆ యజ్ఞమునకు పోవుచున్నాము. మీరు కూడా మా వెంట మిథిలకు వచ్చినచో అక్కడ ఉన్న ఒక మహాధనుస్సును చూడవచ్చును. ఆ ధనుస్సు సామాన్యమైనది కాదు. చాలా బలము కలది. భయంకరమైనది. ఆ ధనుస్సును

పూర్వము యజ్ఞములో దేవతలు జనకునికి ఇచ్చారు. దానిని దేవతలు, గంధర్వులు, అసురులు,రాక్షసులు ఎవరు కూడా ఎత్తలేరు. ఎక్కుపెట్టలేరు. ఇంక మానవుల సంగతి చెప్ప పనిలేదు కదా! అంతటి బలమైనది ఆ ధనుస్సు. ఎందుకంటే ఎంతో మంది రాజులు ఆ ధనుస్సును ఎత్తబోయి విఫలమయ్యారు. ఎవరూ ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారు. ప్రస్తుతము ఆ మహత్తర ధనుస్సు జనక మహారాజు పూజా మందిరములో పూజింపబడుతూ ఉంది.” అని పలికారు.

తరువాత విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో, తదితర ఋషులతో కూడా కలిసి మిథిలకు ప్రయాణము అయ్యాడు. అందరూ ఉత్తర దిక్కుగా వెళుతున్నారు. దాదాపు నూరు బండ్లలో అందరూ వెళు తున్నారు.

చాలా దూరము ప్రయాణము చేసి అందరూ శోణ నదీ తీరము చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే గడపాలను కున్నారు. సాయంకాలము చేయవలసిన సంధ్యావందనము, అగ్ని కార్యములను పూర్తి చేసుకొని అందరూ విశ్వామిత్రుని ముందు కూర్చున్నారు. ఆ సమయంలో రాముడు విశ్వామితుని ఇలా అడిగాడు.

“ఓ మహర్షీ! ప్రస్తుతము మనకు ఉన్న వనము ఫలములతోనూ పుష్పములతోనూ శోభిల్లుచున్నది. ఈ వనము పేరు ఏమి? దీని గురించి నాకు తెలియజేయండి.” అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.

శ్రీమద్రామాయణము
బాల కాండ
ముప్పది ఒకటవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ ద్వాత్రింశః సర్గః (32) >>

Balakanda Sarga 40 In Telugu – బాలకాండ చత్వారింశః సర్గః

Balakanda Sarga 40 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ – చత్వారింశః సర్గః:, విష్ణుమూర్తి వామనావతారం స్వీకరిస్తాడు మరియు మహాబలిని ఎదుర్కొంటాడు. వామనుడు మహాబలిని మూడు అడుగుల భూమి యాచిస్తాడు. మహాబలి తన దానాన్ని పునీతం చేసేందుకు వామనునికి ఆర్ద్రతతో అందివ్వాలని నిర్ణయిస్తాడు. వామనుడు రెండు అడుగులతో భూమి, ఆకాశాన్ని కవర్ చేస్తాడు. మూడవ అడుగు ఎక్కడ వేయాలో అడిగితే, మహాబలి తన తల వంచి ఆ అడుగును వేయమంటాడు.

కపిలదర్శనమ్

దేవతానాం వచః శ్రుత్వా భగవాన్ వై పితామహః |
ప్రత్యువాచ సుసంత్రస్తాన్కృతాంతబలమోహితాన్ ||

1

యస్యేయం వసుధా కృత్స్నా వాసుదేవస్య ధీమతః |
[* మహిషీ మాధవస్యైషా స ఏష భగవాన్ ప్రభుః | *]
కాపిలం రూపమాస్థాయ ధారయత్యనిశం ధరామ్ ||

2

తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాః |
పృథివ్యాశ్చాపి నిర్భేదో దృష్ట ఏవ సనాతనః ||

3

సగరస్య చ పుత్రాణాం వినాశోఽదీర్ఘజీవినామ్ |
పితామహవచః శ్రుత్వా త్రయస్త్రింశదరిందమ ||

4

దేవాః పరమసంహృష్టాః పునర్జగ్ముర్యథాగతమ్ |
సగరస్య చ పుత్రాణాం ప్రాదురాసీన్మహాత్మనామ్ ||

5

పృథివ్యాం భిద్యమానాయాం నిర్ఘాతసమనిఃస్వనః |
తతో భిత్త్వా మహీం కృత్స్నాం కృత్వా చాభిప్రదక్షిణమ్ ||

6

సహితాః సాగరాః సర్వే పితరం వాక్యమబ్రువన్ |
పరిక్రాంతా మహీ సర్వా సత్త్వవంతశ్చ సూదితాః ||

7

దేవదానవరక్షాంసి పిశాచోరగకిన్నరాః | [పన్నగాః]
న చ పశ్యామహేఽశ్వం తమశ్వహర్తారమేవ చ ||

8

కిం కరిష్యామ భద్రం తే బుద్ధిరత్ర విచార్యతామ్ |
తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం రాజసత్తమః ||

9

సమన్యురబ్రవీద్వాక్యం సగరో రఘునందన |
భూయః ఖనత భద్రం వో నిద్భిద్య వసుధాతలమ్ ||

10

అశ్వహర్తారమాసాద్య కృతార్థాశ్చ నివర్తథ |
పితుర్వచనమాస్థాయ సగరస్య మహాత్మనః ||

11

షష్టిః పుత్రసహస్రాణి రసాతలమభిద్రవన్ |
ఖన్యమానే తతస్తస్మిన్దదృశుః పర్వతోపమమ్ ||

12

దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలమ్ |
సపర్వతవనాం కృత్స్నాం పృథివీం రఘునందన ||

13

శిరసా ధారయామాస విరూపాక్షో మహాగజః |
యదా పర్వణి కాకుత్స్థ విశ్రమార్థం మహాగజః ||

14

ఖేదాచ్చాలయతే శీర్షం భూమికంపస్తదా భవేత్ |
తం తే ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజమ్ ||

15

మానయంతో హి తే రామ జగ్ముర్భిత్వా రసాతలమ్ |
తతః పూర్వాం దిశం భిత్వా దక్షిణాం బిభిదుః పునః ||

16

దక్షిణస్యామపి దిశి దదృశుస్తే మహాగజమ్ |
మహాపద్మం మహాత్మానం సుమహాపర్వతోపమమ్ ||

17

శిరసా ధారయంతం తే విస్మయం జగ్మురుత్తమమ్ |
తతః ప్రదక్షిణం కృత్వా సగరస్య మహాత్మనః ||

18

షష్టిః పుత్రసహస్రాణి పశ్చిమాం బిభిదుర్దిశమ్ |
పశ్చిమాయామపి దిశి మహాంతమచలోపమమ్ ||

19

దిశాగజం సౌమనసం దదృశుస్తే మహాబలాః |
తం తే ప్రదక్షిణం కృత్వా పృష్ట్వా చాపి నిరామయమ్ ||

20

ఖనంతః సముపక్రాంతా దిశం హైమవతీం తతః |
ఉత్తరస్యాం రఘుశ్రేష్ఠ దదృశుర్హిమపాండురమ్ ||

21

భద్రం భద్రేణ వపుషా ధారయంతం మహీమిమామ్ |
సమాలభ్య తతః సర్వే కృత్వా చైనం ప్రదక్షిణమ్ ||

22

షష్టిః పుత్రసహస్రాణి బిభిదుర్వసుధాతలమ్ |
తతః ప్రాగుత్తరాం గత్వా సాగరాః ప్రథితాం దిశమ్ ||

23

రోషాదభ్యఖనన్సర్వే పృథివీం సగరాత్మజాః |
తే తు సర్వే మహత్మానో భిమవేగా మహబలాః ||

24

దదృశుః కపిలం తత్ర వాసుదేవం సనాతనమ్ |
హయం చ తస్య దేవస్య చరంతమవిదూరతః ||

25

ప్రహర్షమతులం ప్రాప్తాః సర్వే తే రఘునందన |
తే తం హయహరం జ్ఞాత్వా క్రోధపర్యాకులేక్షణాః ||

26

ఖనిత్రలాంగలధరా నానావృక్షశిలాధరాః |
అభ్యధావంత సంక్రుద్ధాస్తిష్ఠ తిష్ఠేతి చాబ్రువన్ ||

27

అస్మాకం త్వం హి తురగం యజ్ఞీయం హృతవానసి |
దుర్మేధస్త్వం హి సంప్రాప్తాన్విద్ధి నః సగరాత్మజాన్ ||

28

శ్రుత్వా తు వచనం తేషాం కపిలో రఘునందన |
రోషేణ మహతావిష్టో హుంకారమకరోత్తదా ||

29

తతస్తేనాప్రమేయేణ కపిలేన మహాత్మనా |
భస్మరాశీకృతాః సర్వే కాకుత్స్థ సగరాత్మజాః ||

30

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చత్వారింశః సర్గః ||

Balakanda Sarga 40 Meaning In Telugu

భయంతో వణికి పోతున్న దేవతలతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు.

” ఓ దేవతలారా! భయపడకండి. ఈ భూమి ఆ సర్వేశ్వరుడు విష్ణువుకు చెందినది. ఆయన కపిలావతారములో ఈ భూమిని రక్షిస్తున్నాడు. ఆ సగర కుమారులను ఆయనే శిక్షిస్తాడు. ఆ సగర కుమారుల చావు కపిలుని చేతిలో ఉంది.” అని అన్నాడు.

ఆ మాటలు విన్న దేవతలు తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. సగర కుమారులు భూమిని తవ్వుతూనే ఉన్నారు. కాని వారికి యజ్ఞాశ్వము కనపడలేదు. కాని వారికి ఒక పెద్ద శబ్దము వినిపించింది. కాని వారు ఆ శబ్దమును లక్ష్యపెట్టలేదు. తమ తండ్రి సగరుని వద్దకు తిరిగి వచ్చారు.

“తండ్రీ! మీరు చెప్పినట్టు మేము భూమి అంతా తవ్వాము. యక్ష, గంధర్వ, నాగ జాతులను చంపాము. కాని మాకు యజ్ఞాశ్వము కనపడలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి.” అని అడిగారు.

కుమారుల మాటలు విన్న సగరుడికి కోపం మిన్నుముట్టింది.

“మీరు ఇంకా భూమిని తవ్వండి. అశ్వమును పట్టండి. అశ్వము లేకుండా తిరిగిరాకండి.” అని ఆజ్ఞాపించాడు సగరుడు.

సగరకుమారులు మరలా భూమిని తవ్వడం మొదలెట్టారు. అందరూ పాతాళ లోకము చేరుకున్నారు.

వారికి భూమండలమును మోస్తున్న విరూపాక్షము అనే ఏనుగు కనపడింది. సగరకుమారులు దానికి నమస్కరించి మరలా తవ్వనారంభించారు. వారికి తూర్పుదిక్కుగా మరొక ఏనుగు కనిపించింది. దాని పేరు మహాపద్మము అనే దిగ్గజము. అది కూడా తన శిరస్సు మీద భూమండలమును మోస్తున్నది. ఆ ఏనుగును చూచి సగర కుమారులు ఆశ్చర్య పోయారు. సగరకుమారులు ఆ ఏనుగుకు కూడా ప్రదక్షిణము చేసి నమస్కారము చేసారు. ఆ సారి పశ్చిమ దిక్కుగా తవ్వసాగారు. పశ్చిమ దిక్కున కూడా వారికి భూమండలము తన శిరస్సున మోస్తున్న సౌమనసము అనే దిగ్గజము కనిపించింది. వారు ఆ దిగ్గజమునకు కూడా నమస్కరించి, ఉత్తర దిక్కుగా త్వరం భించారు. ఉత్తరదిక్కున కూడా వారికి భూమండలము ను మోస్తున్న భద్ర అనే దిగ్గజము కనిపించింది. సగర కుమారులు ఆ దిగ్గజమునకు కూడా పూజాదికములు నిర్వహించి నమస్కరించారు.

తరువాత వారు ఈశాన్య దిక్కుగా తవ్వనారంభించారు. ఈశాన్య దిక్కుగా వారికి గడ్డిమేయుచున్న యజ్ఞాశ్వము కనిపించింది. ఆ అశ్వమునకు కొంత దూరంలో మహావిష్ణు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు.

అశ్వమును చూడగానే వారి శరీరాలు కోపంతో కంపించాయి. ఆ కపిలుడే తమ అశ్వమును దొంగిలించాడు అని అనుకొని తమ వద్దఉన్న ఆయుధములతో కపిలుని మీదికి దూకారు.

“ఓరీ! నీవేనా మా యజ్ఞాశ్వమును దొంగిలించినది. మేము ఎవరమో తెలియునా! మేము సగర చక్రవర్తి కుమారులము. మా యజ్ఞాశ్వమునే దొంగిలిస్తావా!” అంటూ కపిలుని చుట్టుముట్టారు.

కపిలుడు కళ్లు తెరిచాడు. వారిని చూచాడు. ఒక్కసారి కోపంతో హుంకరించాడు. ఆ కపిలుని హుంకారం లోనుండి పుట్టిన అగ్నిలో సగరుని కుమారులు 60,000 మంది భస్మం అయిపోయారు.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలభయ్యవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ఏకచత్వారింశః సర్గః (41) >>

Balakanda Sarga 29 In Telugu – బాలకాండ ఏకోనత్రింశః సర్గః

Balakanda Sarga 29 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనత్రింశః సర్గలో, రాముడు మరియు లక్ష్మణులు పూర్వ అధ్యాయంలో సిద్ధ ఆశ్రమాన్ని, సిద్ధ ఆశ్రమాన్ని విచారించారు, దీని కోసం ఋషి విశ్వామిత్రుడు ఆ సన్యాసం వారసత్వం గురించి తెలియజేస్తాడు, ఎందుకంటే అది ఒకప్పుడు వామ్నా అవతారంలో విష్ణువుకు చెందినది. విశ్వామిత్రుడు దాని గురించి మరియు వామన అనే మరుగుజ్జు సన్యాసి బాలుడు భూమిపై చెడును ఎలా నిర్మూలించాడో వివరిస్తాడు. ఈ రామావతారంలో కూడా అలాగే చేయమని విశ్వామిత్ర మహర్షి నుండి రాముడికి ఒక సూచన.

సిద్ధాశ్రమః

అథ తస్యాప్రమేయస్య తద్వనం పరిపృచ్ఛతః |
విశ్వామిత్రో మహాతేజా వ్యాఖ్యాతుముపచక్రమే ||

1

ఇహ రామ మహాబాహో విష్ణుర్దేవవరః ప్రభుః |
వర్షాణి సుబహూన్యేవ తథా యుగశతాని చ ||

2

తపశ్చరణయోగార్థమువాస సుమహాతపాః |
ఏష పూర్వాశ్రమో రామ వామనస్య మహాత్మనః ||

3

సిద్ధాశ్రమ ఇతి ఖ్యాతః సిద్ధో హ్యత్ర మహాతపాః |
ఏతస్మిన్నేవ కాలే తు రాజా వైరోచనిర్బలిః ||

4

నిర్జిత్య దైవతగణాన్సేంద్రాంశ్చ సమరుద్గణాన్ |
కారయామాస తద్రాజ్యం త్రిషు లోకేషు విశ్రుతః ||

5

[* యజ్ఞం చకార సుమహాన్ అసురేంద్రో మహాబలః | *]
బలేస్తు యజమానస్య దేవాః సాగ్నిపురోగమాః |
సమాగమ్య స్వయం చైవ విష్ణుమూచురిహాశ్రమే ||

6

బలిర్వైరోచనిర్విష్ణో యజతే యజ్ఞముత్తమమ్ |
అసమాప్తే క్రతౌ తస్మిన్ స్వకార్యమభిపద్యతామ్ ||

7

యే చైనమభివర్తంతే యాచితార ఇతస్తతః |
యచ్చ యత్ర యథావచ్చ సర్వం తేభ్యః ప్రయచ్ఛతి ||

8

స త్వం సురహితార్థాయ మాయాయోగముపాశ్రితః |
వామనత్వం గతో విష్ణో కురు కల్యాణముత్తమమ్ ||

9

ఏతస్మిన్నంతరే రామ కశ్యపోఽగ్నిసమప్రభః |
అదిత్యా సహితో రామ దీప్యమాన ఇవౌజసా ||

10

దేవీసహాయో భగవన్దివ్యం వర్షసహస్రకమ్ |
వ్రతం సమాప్య వరదం తుష్టావ మధుసూదనమ్ ||

11

తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకమ్ |
తపసా త్వాం సుతప్తేన పశ్యామి పురోషోత్తమమ్ ||

12

శరీరే తవ పశ్యామి జగత్సర్వమిదం ప్రభో |
త్వమనాదిరనిర్దేశ్యస్త్వామహం శరణం గతః ||

13

తమువాచ హరిః ప్రీతః కశ్యపం ధూతకల్మషమ్ |
వరం వరయ భద్రం తే వరార్హోఽసి మతో మమ ||

14

తచ్ఛ్రుత్వా వచనం తస్య మారీచః కశ్యపోఽబ్రవీత్ |
అదిత్యా దేవతానాం చ మమ చైవానుయాచతః ||

15

వరం వరద సుప్రీతో దాతుమర్హసి సువ్రత |
పుత్రత్వం గచ్ఛ భగవన్నదిత్యా మమ చానఘ ||

16

భ్రాతా భవ యవీయాంస్త్వం శక్రస్యాసురసూదన |
శోకార్తానాం తు దేవానాం సాహాయ్యం కర్తుమర్హసి ||

17

అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్తే భవిష్యతి |
సిద్ధే కర్మణి దేవేశ ఉత్తిష్ఠ భగవన్నితః ||

18

అథ విష్ణుర్మహాతేజా అదిత్యాం సమజాయత |
వామనం రూపమాస్థాయ వైరోచనిముపాగమత్ ||

19

త్రీన్క్రమానథ భిక్షిత్వా ప్రతిగృహ్య చ మానదః |
ఆక్రమ్య లోకాఁల్లోకాత్మా సర్వలోకహితే రతః ||

20

మహేంద్రాయ పునః ప్రాదాన్నియమ్య బలిమోజసా |
త్రైలోక్యం స మహాతేజాశ్చక్రే శక్రవశం పునః ||

21

తేనైష పూర్వమాక్రాంత ఆశ్రమః శ్రమనాశనః |
మయాపి భక్త్యా తస్యైష వామనస్యోపభుజ్యతే ||

22

ఏతమాశ్రమమాయాంతి రాక్షసా విఘ్నకారిణః |
అత్రైవ పురుషవ్యాఘ్ర హంతవ్యా దుష్టచారిణః ||

23

అద్య గచ్ఛామహే రామ సిద్ధాశ్రమమనుత్తమమ్ |

తదాశ్రమపదం తాత తవాప్యేతద్యథా మమ |
[* ఇత్యుక్త్వా పరమప్రీతో గృహ్య రామం సలక్ష్మణమ్ | *]
ప్రవిశన్నాశ్రమ పదం వ్యరోచత మహామునిః ||

24

శశీవ గతనీహారః పునర్వసుసమన్వితః |
తం దృష్ట్వా మునయః సర్వే సిద్ధాశ్రమనివాసినః ||

25

ఉత్పత్యోత్పత్య సహసా విశ్వామిత్రమపూజయన్ |
యథార్హం చక్రిరే పూజాం విశ్వామిత్రాయ ధీమతే ||

26

తథైవ రాజపుత్రాభ్యామకుర్వన్నతిథిక్రియామ్ |
ముహూర్తమివ విశ్రాంతౌ రాజపుత్రావరిందమౌ ||

27

ప్రాంజలీ మునిశార్దూలమూచతూ రఘునందనౌ |
అద్యైవ దీక్షాం ప్రవిశ భద్రం తే మునిపుంగవ ||

28

సిద్ధాశ్రమోఽయం సిద్ధః స్యాత్సత్యమస్తు వచస్తవ |
ఏవముక్తో మహాతేజా విశ్వామిత్రో మహామునిః ||

29

ప్రవివేశ తతో దీక్షాం నియతో నియతేంద్రియః |
కుమారావపి తాం రాత్రిముషిత్వా సుసమాహితౌ ||

30

ప్రభాతకాలే చోత్థాయ పూర్వాం సంధ్యాముపాస్య చ |
స్పృష్టోదకౌ శుచీ జప్యం సమాప్య నియమేన చ |
హుతాగ్నిహోత్రమాసీనం విశ్వామిత్రమవందతామ్ ||

31

రాముడు ఆ వనమును గురించి ప్రశ్నించగా, విశ్వామిత్రుడు ఇలా బదులు చెప్పాడు.

” ఓ రామా! ఈ ప్రదేశములోనే శ్రీ మహా విష్ణువు వంద యుగముల పాటు తపస్సు చేసాడు. వామనావతారమునకు ముందు శ్రీ మహా విష్ణువు ఇక్కడనే నివసించేవాడు. కశ్యపుడు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందినందువలన, దీనిని సిద్ధాశ్రమము అని అంటారు. శ్రీ మహా విష్ణువు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్న కాలంలో బలి చక్రవర్తి దేవత లందరినీ జయించి ముల్లోకములనూ పరిపాలిస్తున్నాడు. ఆ బలి చక్రవర్తి ఒక సారి యాగము చేస్తున్నాడు. ఆ సమయంలో దేవతలందరూ ఇక్కడ తపస్సు చేస్తున్నా విష్ణు మూర్తి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు.

ఓ విష్ణూ! బలి చక్రవర్తి యజ్ఞము చేస్తున్నాడు. అది పూర్తి అయే లోపలనే మన కార్యము పూర్తి కావాలి. ఈ యాగ సమయములో బలి చక్రవర్తి ఎవరు ఏది అడిగితే దానిని కాదు లేదు అనకుండా ఇస్తున్నాడు.

ఓ దేవా! నీవు దేవతల మేలు కోరి, వామనుడిగా బలి చక్రవర్తి యొద్దకు పోయి, మాకు మేలు చేయుము. ” అని ప్రార్థించారు.

అదే సమయంలో కశ్యపుడు తన భార్యా సమేతంగా వేయి సంవత్సరములు విష్ణువును గూర్చి తపస్సు చేసాడు. తరువాత విష్ణువును ఇలా ప్రార్థిస్తున్నాడు.

” ఓ పురుషోత్తమా! నీవు తపోమయు డవు. తపోరాశివి. తపోమూర్తివి. తపమే నీ రూపము. అట్టి నిన్ను నా తపో మహిమ వలన చూడగలుగుతున్నాను. నీకు ఆది, అంతము లేదు. నీవు సర్వాంతర్యామివి. నిన్ను శరణు వేడుచున్నాను. ” అని ప్రార్థించాడు.

అప్పుడు విష్ణువు కశ్యపునకు ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కశ్యపుడు ఇలా అడిగాడు.

“భగవాన్! నీవు నాకు అదితికి పుత్రుడుగా జన్మించు. దేవేంద్రునికి తమ్ముడుగా జన్మించు. దేవతలకు మేలు కలిగించు. నా ఇన్ని సంవత్సరములు తపస్సు ఫలిస్తుంది. నీ అనుగ్రహంతో ఈ ప్రదేశము సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి చెందుతుంది. హే భగవాన్! నాకు పుత్రుడుగా జన్మించి నన్ను కృతార్ధుడిని చెయ్యి” అని ప్రార్థించాడు కశ్యపుడు.

కశ్యపుడు కోరుకున్నట్టు విష్ణు మూర్తి, కశ్యపునకు అదితికి వామనుడిగా జన్మించాడు. వెంటనే బలిచక్రవర్తి వద్దకు వెళ్లాడు. తనకు మూడు అడుగుల స్థలము కావాలి అని అడిగాడు. బలి చక్రవర్తి వెంటనే వామనుడు అడిగిన మూడు అడుగుట స్థలమును ఇస్తూ నీటిని ధారపోసాడు. వామనుడు బలి చక్రవర్తి నుండి మూడు అడుగుల స్థలమును గ్రహించాడు. వెంటనే త్రివిక్రముడిగా పెరిగాడు. ముల్లోకములను ఆక్రమించాడు. బలి చక్రవర్తిని ఓడించాడు. స్వర్గాధిపత్యమును మరలా మహేంద్రునికి అప్పగించాడు. దాంతోముల్లోకములు మరలా మహేంద్రుని అధీనంలోకి వచ్చాయి. వామనుడి మీద ఉన్న భక్తి చేత నేను కూడా ఇదే ఆశ్రమములో నివసిస్తున్నాను. ఇక్కడనే నేను యజ్ఞము చేస్తున్నాను. రాక్షసులు ఇక్కడకు వచ్చి నా యజ్ఞమును పాడు చేస్తున్నారు. నీవు వారిని ఇక్కడే సంహరించాలి.

రామా! ఇప్పుడు మనము సిద్ధాశ్రమములో ప్రవేశిస్తున్నాము. రామా! ఈ ఆశమములో నీవు స్వేచ్ఛగా ఉండవచ్చు. ” అని అన్నాడు ఈ విశ్వామిత్రుడు.

రామ లక్ష్మణులు విశ్వామిత్రుని ఆశ్రమములో ప్రవేశించారు. విశ్వామిత్రుడు రావడం చూచి ఆ ఆశ్రమములో ఉన్న మునులందరూ వచ్చి విశ్వామిత్రుని, రామలక్ష్మణులను సాదరంగా లోపలకు తీసుకొని వెళ్లారు. వారిని పూజంచారు. అతిథి సత్కారములు చేసారు. రామ లక్ష్మణులు కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు.

తరువాత వారు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నారు.

“ఓ విశ్వామిత్ర మహర్షీ! తమకుశుభం కలుగుతుంది. తమరు ఈ రోజునుండే యాగము ప్రారంభించండి. మేము యాగ రక్షణ చేస్తాము.” అని అన్నారు.

ఆ మాటలు విన్న విశ్రామిత్రుడు ఎంతో సంతోషించాడు. యాగ దీక్షను స్వీకరించాడు. రామ లక్ష్మణులు ఆ రాత్రి అంతా జాగరూకతతో ఉన్నారు. మరునాడు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ప్రాత:కాల సంధ్యావందనము ఆచరించి, విశ్వామిత్రుని వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించి, ఆయనతో ఇలా అన్నారు.

వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై తొమ్మిదవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ త్రింశః సర్గః (30) >>

Ayodhya Kanda Sarga 10 In Telugu – అయోధ్యాకాండ దశమః సర్గః

Ayodhya Kanda Sarga 10 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ దశమ సర్గ రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు, సీత, మరియు లక్ష్మణులు వనవాసం కోసం అయోధ్యను విడిచి వెళ్ళిన తరువాత జరిగే సంఘటనలు చిత్రించబడ్డాయి. వారి వనవాస ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, కష్టాలు, మరియు వారు కలసిన వ్యక్తులను ఈ సర్గ వివరంగా వర్ణిస్తుంది. అలాగే, అయోధ్యలో ఉన్న దశరథ మహారాజు మరియు ఇతర కుటుంబ సభ్యుల మనోభావాలను కూడా ఈ సర్గ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సర్గ ద్వారా రాముడు మరియు అతని కుటుంబం ఎదుర్కొనే దుఃఖం, త్యాగం, మరియు ధైర్యం వంటి అంశాలు పాఠకుల హృదయాలను తాకుతాయి.

కైకేయ్యనునయః

విదర్శితా యదా దేవీ కుబ్జయా పాపయా భృశమ్ |
తదా శేతే స్మ సా భూమౌ దిగ్ధవిద్ధేవ కిన్నరీ ||

1

నిశ్చిత్య మనసా కృత్యం సా సమ్యగితి భామినీ |
మంథరాయై శనైః సర్వమాచచక్షే విచక్షణా ||

2

సా దీనా నిశ్చయం కృత్వా మంథరావాక్యమోహితా |
నాగకన్యేవ నిశ్వస్య దీర్ఘముష్ణం చ భామినీ ||

3

ముహూర్తం చింతయామాస మార్గమాత్మసుఖావహమ్ |
సా సుహృచ్చార్థకామా చ తన్నిశమ్య సునిశ్చయమ్ ||

4

బభూవ పరమప్రీతా సిద్ధిం ప్రాప్యేవ మంథరా |
అథ సా మర్షితా దేవీ సమ్యక్కృత్వా సునిశ్చయమ్ ||

5

సంవివేశాబలా భూమౌ నివేశ్య భృకుటీం ముఖే |
తతశ్చిత్రాణి మాల్యాని దివ్యాన్యాభరణాని చ ||

6

అపవిద్ధాని కైకేయ్యా తాని భూమిం ప్రపేదిరే |
తయా తాన్యపవిద్ధాని మాల్యాన్యాభరణాని చ ||

7

అశోభయంత వసుధాం నక్షత్రాణి యథా నభః |
క్రోధాగారే నిపతితా సా బభౌ మలినాంబరా ||

8

ఏకవేణీం దృఢం బధ్వా గతసత్త్వేవ కిన్నరీ |
ఆజ్ఞాప్య తు మహారాజో రాఘవస్యాభిషేచనమ్ ||

9

ఉపస్థాసమనుజ్ఞాప్య ప్రవివేశ నివేశనమ్ |
అద్య రామాభిషేకో వై ప్రసిద్ధ ఇతి జజ్ఞివాన్ ||

10

ప్రియార్హాం ప్రియమాఖ్యాతుం వివేశాంతఃపురం వశీ |
స కైకేయ్యా గృహం శ్రేష్ఠం ప్రవివేశ మహాయశాః ||

11

పాండురాభ్రమివాకాశం రాహుయుక్తం నిశాకరః |
శుకబర్హిణసంఘుష్టం క్రౌంచహంసరుతాయుతమ్ ||

12

వాదిత్రరవసంఘుష్టం కుబ్జావామనికాయుతమ్ |
లతాగృహైశ్చిత్రగృహైశ్చంపకాశోకశోభితైః ||

13

దాంతరాజతసౌవర్ణవేదికాభిః సమాయుతమ్ |
నిత్యపుష్పఫలైర్వృక్షైర్వాపీభిశ్చోపశోభితమ్ ||

14

దాంతరాజతసౌవర్ణైః సంవృతం పరమాసనైః |
వివిధైరన్నపానైశ్చ భక్ష్యైశ్చ వివిధైరపి ||

15

ఉపపన్నం మహార్హైశ్చ భూషణైస్త్రిదివోపమమ్ |
తత్ప్రవిశ్య మహారాజః స్వమంతఃపురమృద్ధిమత్ ||

16

న దదర్శ ప్రియాం రాజా కైకేయీం శయనోత్తమే |
స కామబలసంయుక్తో రత్యర్థం మనుజాధిపః ||

17

అపశ్యన్దయితాం భార్యాం పప్రచ్ఛ విషసాద చ |
న హి తస్య పురా దేవీ తాం వేలామత్యవర్తత ||

18

న చ రాజా గృహం శూన్యం ప్రవివేశ కదాచన |
తతో గృహగతో రాజా కైకేయీం పర్యపృచ్ఛత ||

19

యథాపురమవిజ్ఞాయ స్వార్థలిప్సుమపండితామ్ |
ప్రతిహారీ త్వథోవాచ సంత్రస్తా రచితాంజలిః ||

20

దేవ దేవీ భృశం కృద్ధా క్రోధాగారమభిదృతా |
ప్రతిహార్యా వచః శ్రుత్వా రాజా పరమదుర్మనాః ||

21

విషసాద పునర్భూయో లులితవ్యాకులేంద్రియః |
తత్ర తాం పతితాం భూమౌ శయానామతథోచితామ్ ||

22

ప్రతప్త ఇవ దుఃఖేన సోఽపశ్యజ్జగతీపతిః |
స వృద్ధస్తరుణీం భార్యాం ప్రాణేభ్యోఽపి గరీయసీమ్ ||

23

అపాపః పాపసంకల్పాం దదర్శ ధరణీతలే |
లతామివ వినిష్కృత్తాం పతితాం దేవతామివ ||

24

కిన్నరీమివ నిర్ధూతాం చ్యుతామప్సరసం యథా |
మాయామివ పరిభ్రష్టాం హరిణీమివ సంయతామ్ ||

25

కరేణుమివ దిగ్ధేన విద్ధాం మృగయునా వనే |
మహాగజ ఇవారణ్యే స్నేహాత్పరిమమర్శ తామ్ ||

26

పరిమృశ్య చ పాణిభ్యామభిసంత్రస్తచేతనః |
కామీ కమలపత్రాక్షీమువాచ వనితామిదమ్ ||

27

న తేఽహమభిజానామి క్రోధమాత్మని సంశ్రితమ్ |
దేవి కేనాభిశప్తా౭సి కేన వాఽసి విమానితా ||

28

యదిదం మమ దుఃఖాయ శేషే కళ్యాణి పాంసుషు |
భూమౌ శేషే కిమర్థం త్వం మయి కళ్యాణచేతసి ||

29

భూతోపహతచిత్తేవ మమ చిత్తప్రమాథినీ |
సంతి మే కుశలా వైద్యాస్త్వభితుష్టాశ్చ సర్వశః ||

30

సుఖితాం త్వాం కరిష్యంతి వ్యాధిమాచక్ష్వ భామినీ |
కస్య వా తే ప్రియం కార్యం కేన వా విప్రియం కృతమ్ ||

31

కః ప్రియం లభతామద్య కో వా సుమహదప్రియమ్ |
మా రోదీర్మా చ కార్షీస్త్వం దేవి సంపరిశోషణమ్ ||

32

అవధ్యో వధ్యతాం కో వా కోవా వధ్యః విముచ్యతామ్ |
దరిద్రః కో భవేదాఢ్యో ద్రవ్యవాన్ వాఽప్యకించనః ||

33

అహం చైవ మదీయాశ్చ సర్వే తవ వశానుగాః |
న తే కించిదభిప్రాయం వ్యాహంతుమహముత్సహే ||

34

ఆత్మనో జీవితేనాపి బ్రుహి యన్మనసేచ్ఛసి |
బలమాత్మని జానంతీ న మాం శంకితుమర్హసి ||

35

కరిష్యామి తవ ప్రీతిం సుకృతేనాపి తే శపే |
యావదావర్తతే చక్రం తావతీ మే వసుంధరా ||

36

ప్రాచీనాః సింధుసౌవీరాః సౌరాష్ట్రా దక్షిణాపథాః |
వంగాంగమగధా మత్స్యాః సమృద్ధాః కాశికోసలాః ||

37

తత్ర జాతం బహుద్రవ్యం ధనధాన్యమజావికమ్ |
తతో వృణీష్వ కైకేయి యద్యత్త్వం మనసేచ్ఛసి ||

38

కిమాయాసేన తే భీరు ఉత్తిష్ఠోత్తిష్ఠ శోభనే |
తత్త్వం మే బ్రూహి కైకేయి యతస్తే భయమాగతమ్ ||

39

తత్తే వ్యపనయిష్యామి నీహారమివ భాస్కరః | [రశ్మివాన్]
తథోక్తా సా సమాశ్వస్తా వక్తుకామా తదప్రియమ్ |
పరిపీడయితుం భూయో భర్తారముపచక్రమే ||

40

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే దశమః సర్గః ||

Ayodhya Kanda Sarga 10 Meaning In Telugu

కైక, మంధర, ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో దశరథుడు వస్తే ఇలా మాట్లాడాలో మరొకసారి వివరంగా మాట్లాడు కున్నారు. తరువాత కైక కోపగృహంలో ప్రవేశించింది. ఆభరణాలు అన్నీ విసిరికొట్టింది. వెంట్రుకలు గట్టిగా ముడివేసింది. మాసిన బట్టలు కట్టుకుంది. నేలమీద బోర్లాపడుకొని తెచ్చిపెట్టుకున్న బాధను అభినయిస్తూ ఉంది.

ఇంతలో మరునాడు జరగ వలసిన రామ పట్టాభిషేకమునకు చేయవలసిన ఏర్పాట్ల గురించి తగు సూచనలు ఇచ్చిన దశరథుడు, వసిష్ఠుడు వామదేవుడు మొదలగు పెద్దల అనుజ్ఞ తీసుకొని, ఈ విషయమును ముందుగా కైకకు తెలుపవలెనని, వడి వడిగా కైక ఉన్న మందిరమునకు వచ్చాడు.

ఎప్పుడూ కళకళలాడే కైకేయీ మందిరము నిశ్శబ్దముగా ఉంది. శయన మందిరములో కైక కనిపించలేదు. దాసదాసీలు అటు ఇటు తిరుగుతున్నారు. కానీ కైక జాడ మాత్రం కానరాలేదు. ఎప్పుడెప్పుడు కైకతో రామ పట్టాభిషేక వార్త చెబుదామా అని వచ్చిన దశరథ మహారాజు కైక కనపడకపోయేసరికి నిరాశపడ్డాడు. అన్ని గదులు తిరిగాడు. ఎక్కడా కైకజాడ లేదు.

ఎప్పుడూ తను వస్తున్న వర్తమానము ముందుగానే తెలుసు కొని కైక తనకు ఎదురు వచ్చి స్వాగతించి లోపలకు తీసుకొని వెళ్లేది. కాని ఈ మాదిరి ఎప్పుడూ జరగలేదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు దశరథుడు. అక్కడ నిలబడి ఉన్న కైక ఆంతరంగిక పరిచారికలను పిలిచి కైక గురించి అడిగాడు. నిజానికి అలా అడగడం అవమానం. కాని తప్పలేదు. అడిగాడు.

వారు దశరథునికి నమస్కరించి వినయంగా “మహారాజా! కైకేయీ మహారాణీవారు. కోపగృహంలో ఉన్నారు.”అని చెప్పారు.

ఆశ్చర్యపోయాడు దశరథుడు. కైకేయికి తన మీద కోపమా! ఎందుకు! ఏమీ కారణము! అని తనలో తాను తర్కించుకుంటున్నాడు. దశరథుడు. మెల్ల మెల్ల గా కైకేయీ పడుకొని ఉన్న కోపగృహమునకు వెళ్లాడు. నేలమీద పడుకొని ఉన్న తన ప్రియమైన భార్య కైకను చూచి దశరథునికి దుఃఖము ముంచుకొచ్చింది. దెబ్బతగిలిన లేడిలాగా, దేవలోకము నుండి విసిరివేయబడ్డ దేవకన్యలాగ నేలమీద పడి ఉన్న కైకను చూచి చలించిపోయాడు. వెళ్లి ఆమె పక్కనే నేల మీద కూర్చున్నాడు. ఆమె శరీరాన్ని తన చేతితో మెల్లిగా నిమిరాడు. నెమ్మది అయిన స్వరంతో ఆమెతో ఇలా అన్నాడు.

“దేవీ! ఏమిటీ ఈ అలుక. దేనికి ఈ అలుక. నామీద కోపం ఎందుకు. నేను చేసిన అపరాధము ఏమి? నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా! లేక ఎవరన్నా నిన్ను అవమానించారా! నిన్ను ఈ పరిస్థితిలో చూస్తుంటే నాకు దుఃఖము ముంచుకొస్తూ ఉంది. నీవు ఏం కోరితే అది తీర్చే నేను ఉండగా నీకు ఈ కోపమేల? నీ మనసు ఎందుకు కష్టపెట్టుకుంటావు?

అయ్యో ఇన్ని అడుగుతున్నాను. నీ ఆరోగ్యము సంగతే అడగ లేదు. నీకు ఆరోగ్యము సరిగా లేదా! రాజ వైద్యులను పిలిపించనా! నీకు శరీరంలో ఉన్న బాధ ఏమిటో చెప్పు. పోనీ నీకు ఎవరికైనా మేలు చెయ్యాలని అనుకొంటున్నావా. ఎవరైనా సరే వాళ్లకు ఏం కావాలంటే అది ఇస్తాను. పోనీ నీకు ఎవరి మీదనన్నా కోపం ఉందా చెప్పు. వాళ్లను కఠినంగా శిక్షిస్తాను.

అయ్యో దేవీ! ఏమీ చెప్పకుండా ఎందుకు ఇలా నీ శరీరాన్ని శోషింపచేసుకుంటావు. ఇదిగో ఒకే మాట. చెబుతున్నాను విను. నీవు కోరితే చంప కూడని వాడి నన్నా ఒక్క క్షణంలో చంపేస్తాను. లేక ఉరిశిక్ష వేసినవాడినన్నా నిర్దోషిగా వదిలేస్తాను. కటిక దరిద్రుడిని సకల ఐశ్వర్యవంతుడిని చేస్తాను. లేక ధనవంతుడిని వాడి ధనం అంతా లాక్కొని వాడిని బికారిని చేస్తాను.

దేవీ! నన్ను ఆజ్ఞాపించు. సంభవాన్ని అసంభవంగానూ, అసంభవాన్ని సంభవంగానూ చేస్తాను. కాని నీ కోపం మాత్రం విడిచిపెట్టు. ఇంతెందుకు. నేను నా మంత్రులు, పరివారమూ ఈ రాజ్యము అంతా నీ అధీనమే కదా. నీకు అడ్డేముంది. మేమంతా నీ ఆజ్ఞకు బద్ధులమే కదా! ఇంకా ఈ దిగులు ఎందుకు దేవీ. ఇంతకూ నీకు ఏం కావాలో చెప్పు. నీ కోరికను నా ప్రాణాలు ఇచ్చి అయిన సరే నెరవేరుస్తాను.

నేను యజ్ఞయాగములు చేసి సంపాదించిన పుణ్యఫలము మీద ఒట్టుపెట్టు కొని చెబుతున్నాను. నీ కోరిక ఏదో చెప్పు. నెరవేరుస్తాను. ఈ దేశమే నీది. ఈ రాజ్యమే నీది. ఇందులో ఉన్న సమస్త సంపదలు నీవి. నీకు అడ్డేముంది. కోరుకో! నీ ఇష్టం వచ్చినవి కోరుకో!

నీకు మన రాజ్యము ఎంత ఉందో తెలుసు కదా! ఈ భూమి మీద రథచక్రములు ఎంత మేర తిరుగుతాయో అంత భూమి నా అధీనంలో ఉంది. తూర్యు దిక్కున ఉన్న అన్ని రాజ్యములు, సింధు దేశము. సౌవీర దేశము, సౌరాష్ట్ర దేశమూ, దక్షిణమున ఉన్న అన్ని రాజ్యములు, ఇంకా వంగ, అంగ, మగధ, మత్స్య దేశములు, కాశీరాజ్యము, కోసల రాజ్యమూ అన్నీ మన అధీనములు. ఈ రాజ్యములలో ఉన్న సమస్త సంపదలు మన అధీనములు. ఆ సంపదలలో నీకేది కావాలో కోరుకో ఇస్తాను.

ఓ లలనా మణీ! ఇంతకూ నీ దుఃఖ కారణము, భయ కారణము ఏమి. నాకు చెప్పవా. చెబితేనే కదా నాకు తెలిసేది. ఏం జరిగిందో చెప్పకపోతే నేనేం చేయను చెప్పు.” అని సకలవిధాలా అనునయించాడు దశరథుడు.

దశరథుని మాటలు అన్నీ విన్న కైక “ఇనుము బాగా కాలి సమ్మెటదెబ్బలకు అనుకూలంగా ఉంది. మనం ఎలా వంచితే అలా వంగుతుంది.” అని మనసులో అనుకొంది కైక.

ఇప్పుడు తన మనసులోని మాట మెల్ల మెల్లగా నేర్పుగా బయట పెట్టడానికి ఉద్యుక్తురాలయింది కైక.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

(ఇంతకుముందు సర్గలో మనకు మంధర పాత్ర వచ్చింది. ఈ సర్గలో దశరథుని పాత్ర ప్రాముఖ్యం వహించింది. మంధర కైకేయి దాసి. పుట్టింటి నుండి వచ్చింది. సాధారణంగా మంథర మాటకు విలువ ఇస్తుంది కైక. కాని కైకకు రాముడు అంటే చిన్నప్పటినుండి ఎంతో ప్రేమ, మక్కువ. తన కుమారుడు భరతుని తో పాటుపెంచింది. రామునికి పట్టాభిషేకము అంటే ఎంతో సంతోషించింది. ఆ మాట చెప్పిన మంథరకు బహుమానం కూడా ఇచ్చింది.

కైక దశరథుని భార్య. బాగా చదువుకున్నది. విచక్షణా జ్ఞానం కలది అనుకోవాలి. కాని చెప్పుడు మాటలకు మోసపోయింది. ఒకే విషయం పదే పదే చెప్పడం వల్ల అది నిజం అవుతుంది అంటారు పెద్దలు. రాముడు అయోధ్యలో ఉంటే భరతునికి భవిష్యత్తులేదు అనేమాటను పదే పదే వల్లించింది మంథర. రకరకాలుగా వర్ణించి చెప్పింది. అది దాని ఆలోచన. ఒక దాసి అంతకన్నా ఉన్నతంగా ఎలా ఆలోచించగలదు! కాని ఆ మాటలను గుడ్డిగా నమ్మేసింది కైక.

చెప్పుడు మాటలు వినరాదు అని మనకు అందరికీ తెలుసు. కాని సోదాహరణంగా నిరూపించాడు వాల్మీకి. ఎందరో ఎన్నో చెబుతుంటారు. కాని ప్రతివాడూ తన విచక్షణా జ్ఞానం ఉపయోగించాలి.

ఒకాయన ఆఫీసుకు వెళ్లాడు. ఆయన భార్యకు ఆమె తల్లి హాస్పిటల్ లో చేరిందని ఫోన్ వస్తుంది. ఆమె హడావిడిగా బయటకు వస్తుంది. పక్కింటి రామారావు తన బైక్ మీద అప్పుడే బయటకు వెళు తుంటాడు. హాస్పిటల్ దాకా లిఫ్టుఅడుగుతుంది ఆమె. ఆయన సరే అంటాడు. ఆయన వెనక బైక్ మీద కూర్చుని హాస్పిటలుకు వెళుతుంది. వీళ్లిద్దరూ బైక్ మీద వెళ్లడం ఒక అనుమాన పక్షిచూస్తాడు. దానికి కాస్త మసాలా తగిలించి ఆమె భర్తకు “నీ భార్య ఎవరితోనో తిరుగుతూ ఉంది” అని నూరిపోస్తాడు. వాడు నమ్మేస్తాడు. వ్యవహారం విడాకుల దాకా వెళుతుంది. ఇది సర్వసాధారణం. అతడు కాస్త విచక్షణా జ్ఞానం ఉపయోగించి “నాతో ఇన్నాళ్లు పవిత్రంగా నమ్మకంగా కాపురం చేసిన భార్య ఈనాడు సడన్ గా ఎందుకు పరాయివాడితో తిరుగుతుంది” అని కొన్ని క్షణాలు తర్కించుకుంటే నిజానిజాలు బయటపడతాయి. వాళ్ల కాపురంలో కలతలు రావు. అలాగే “రాముడు నా కుమారుడికి ఇంత ద్రోహం చేస్తాడా. మంథర మాటలలో నిజం ఎంత” అని కైక కొంచెం ఆలోచించి ఉంటే రామాయణం మరొక విధంగా ఉండేది. కాబట్టి చెప్పుడు మాటలు వినడం, తొందరగా నిర్ణయాలు తీసుకోడం ఆత్మహత్యాసదృశం అని మనకు బోధ చేస్తుంది రామాయణం.

తరువాత ఈ సర్గలో దశరథుని పాత్ర. దశరథుడు అయోధ్యకు మహారాజు. ఎన్నో యజ్ఞములు యాగములు చేసాడు. వసిష్ఠుని పురోహితునిగా కలవాడు. జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడు. ఆయన భార్య కైక. మూడో భార్య కైక మీద ఆయనకు అధికమైన ప్రేమ ఉందని, ఆయనకు ముద్దులభార్యఅని నానుడి. కాని ఆ విషయం మనకు ఎక్కడా కనపడలేదు. పైగా పాయసం పంచడంలో కైకకు ఎనిమిదవ వంతు మాత్రమే ఇచ్చాడు దశరథుడు. అదీ ఒక వంతు మాత్రం ఇచ్చాడు. రెండవ ఎనిమిదవ భాగం సుమిత్రకు ఇచ్చాడు. దశరథునికి కైక మీద అత్యధిక ప్రేమ ఉంటే సగభాగం ఇచ్చి ఉండేవాడు కదా! కాబట్టి కైక మీద దశరథునికి అధికమైన ప్రేమ ఉంది అనడానికి ఆధారాలు లేవు.

కాని రాబోవు సర్గలలో ఒక విషయం ప్రస్ఫుటంగా అర్థం. అవుతుంది. కౌసల్య పేరుకు పట్టపు రాణి అయినా ఆమెను దశరథుడు నిరాదరించాడు. ఏనాడూ తక్కిన భార్యలతో సమానంగా చూడలేదు. అందుకే కౌసల్య సవతులందరిలో నిరాదరణకు గురి అయింది. రాముడు వనవాసమునకు వెళితో సవతులు తనను బతకనివ్వరు అనివాపోతుంది. దీనిని బట్టి దశరథుడు కైకను ఎక్కువగా ఆదరించాడు అని మనకు తెలుస్తూ ఉంది.

అలాంటి కైక మంథర మాటలు విని కోపగృహంలో పడుకొని ఉంది. దశరథుడు కోపగృహం ప్రవేశించాడు. కోపకారణం అడిగాడు. ఆమె బదులు చెప్పలేదు. అప్పుడు మొదలెట్టాడు. ఈ రాజ్యం నీది అన్నాడు. నేను, నా పరివారము, నీకు దాసులము అన్నాడు. చంపదగని వాడినికూడా నువ్వు కావాలంటే చంపుతాను అన్నాడు. చంపదగిన వాడిని కూడా నువ్వు ఊ అంటే వదిలేస్తాను అన్నాడు. (అంటే నీ కోసం హంతకులను వదిలేస్తాను, నిరపరాధులను ఉ రితీస్తాను అని అర్థం). నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాను అంటాడు.

దశరథుడు లాంటి చక్రవర్తి తన భార్య కేవలం కోపంతో ఉంది అన్నంత మాత్రాన ఇంత దిగజారిపోవాలా! పోనీ అన్నీ అబద్ధాలు చెప్పాడు అని అనుకుంటే ఆయన సత్యసంధుడు అని పేరు. మరి వాల్మీకి ఎందుకు అలా రాసాడు? కారణం స్పష్టంగా కనపడుతూనే ఉంది. ఎంతటివారలైనా కాంత దాసులే. రాబోవు కాలంలో జరగబోయే పరిణామాన్ని త్రేతాయుగంలోనే చెప్పాడు వాల్మీకి. నేడు మనం ఎన్నో స్త్రీ సంబంధమైన స్కాండల్సు వింటున్నాము. చూస్తున్నాము. ఎంతటి గొప్పవారైనా తాను కోరుకున్న స్త్రీ ముందు దాసోహం అంటారు. సమస్తం ధారపోయడానికి సిద్ధపడతారు . వాళ్లు చదువుకున్న ఉన్నత విద్యలు, పదవులు, సంస్కారము, ఏవీ గుర్తుకురావు. అడ్డురావు. సమస్తం ఆమెతోడిదే లోకం అన్నట్టు ప్రవర్తిస్తారు. చివరకు ఊబిలో పడిపోతారు. అలాంటి ప్రమాదాల నుండి జాగ్రత్త పడమని వాల్మీకి ఈ సంఘటనల ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు.

అలాగే అహల్య వృత్తాంతం కూడా. అహల్య తన భర్త గౌతముని కాకుండా పరాయి పురుషుడితో కామక్రీడలు కొనసాగించింది. ఫలితం వెంటనే అనుభవించింది. కొన్ని వందల సంవత్సరాల పాటు అచేనంగా ఒంటరిగా దుమ్ము ధూళిలో పడి ఉంది. ఈరోజుల్లో కూడా పరాయి పురుషుడి మోజులో పడిన స్త్రీలు, స్వంత భర్తను, పిల్లలను హతమార్చడం లాంటి సంఘటనలు వింటున్నాము. వెంటనే కటకటాల పాలవుతున్నారు. శిక్షలు అనుభవిస్తున్నారు.

ఈ రోజుల్లో స్త్రీలు పతివ్రతలు కానక్కరలేదు. కనీసం భర్తకు విధేయతగా ఉంటేచాలు. సంసారం సాఫీగా గడిచిపోతుంది. ఈ సందేశాన్ని మనకు అహల్య వృత్తాంతం ద్వారా అందించాడు వాల్మీకి.

రామాయణం కేవలం ఆధ్యాత్మిక కావ్యంగా కాకుండా ఒక సామాజిక గ్రంధంగా చదవగలిగితే ఇలాంటి సూక్తులు ఎన్నో మనకు మన దైనందిన జీవితంలో ఉపకరిస్తాయి అని నా భావన.)

అయోధ్యాకాండ ఏకాదశః సర్గః (11) >>