Balakanda Sarga 50 In Telugu – బాలకాండ పంచాశః సర్గః

Balakanda Sarga 50 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ పంచాశః సర్గ అంటే 50వ సర్గ. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకువెళతాడు. మార్గమధ్యలో, వారు గంగానదిని దాటుతారు. సారథి సుమంతుడు గంగానది మహిమలను వివరించగా, రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రునితో కలిసి గంగానదిని గౌరవంగా దర్శిస్తారు. తరువాత, గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు.

జనకసమాగమః

తతః ప్రాగుత్తరాం గత్వా రామః సౌమిత్రిణా సహ |
విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్ ||

1

రామస్తు మునిశార్దూలమువాచ సహలక్ష్మణః |
సాధ్వీ యజ్ఞసమృద్ధిర్హి జనకస్య మహాత్మనః ||

2

బహూనీహ సహస్రాణి నానాదేశనివాసినామ్ |
బ్రాహ్మణానాం మహాభాగ వేదాధ్యయనశాలినామ్ ||

3

ఋషివాటాశ్చ దృశ్యంతే శకటీశతసంకులాః |
దేశో విధీయతాం బ్రహ్మన్యత్ర వత్స్యామహే వయమ్ ||

4

రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః |
నివేశమకరోద్దేశే వివిక్తే సలిలాయుతే ||

5

విశ్వామిత్రమనుప్రాప్తం శ్రుత్వా స నృపతిస్తదా |
శతానందం పురస్కృత్య పురోహితమనిందితమ్ ||

6

ప్రత్యుజ్జగామ సహసా వినయేన సమన్వితః |
ఋత్విజోఽపి మహాత్మానస్త్వర్ఘ్యమాదాయ సత్వరమ్ ||

7

విశ్వామిత్రాయ ధర్మేణ దదుర్మంత్రపురస్కృతమ్ |
ప్రతిగృహ్య తు తాం పూజాం జనకస్య మహాత్మనః ||

8

పప్రచ్ఛ కుశలం రాజ్ఞో యజ్ఞస్య చ నిరామయమ్ |
స తాంశ్చాపి మునీన్పృష్ట్వా సోపాధ్యాయపురోధసః ||

9

యథాన్యాయం తతః సర్వైః సమాగచ్ఛత్ప్రహృష్టవత్ |
అథ రాజా మునిశ్రేష్ఠం కృతాంజలిరభాషత ||

10

ఆసనే భగవానాస్తాం సహైభిర్మునిపుంగవైః | [సత్తమైః]
జనకస్య వచః శ్రుత్వా నిషసాద మహామునిః ||

11

పురోధా ఋత్విజశ్చైవ రాజా చ సహ మంత్రిభిః |
ఆసనేషు యథాన్యాయముపవిష్టాన్సమంతతః ||

12

దృష్ట్వా స నృపతిస్తత్ర విశ్వామిత్రమథాబ్రవీత్ |
అద్య యజ్ఞసమృద్ధిర్మే సఫలా దైవతైః కృతా ||

13

అద్య యజ్ఞఫలం ప్రాప్తం భగవద్దర్శనాన్మయా |
ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే మునిపుంగవ ||

14

యజ్ఞోపసదనం బ్రహ్మన్ప్రాప్తోఽసి మునిభిః సహ |
ద్వాదశాహం తు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణః ||

15

తతో భాగార్థినో దేవాన్ద్రష్టుమర్హసి కౌశిక |
ఇత్యుక్త్వా మునిశార్దూలం ప్రహృష్టవదనస్తదా ||

16

పునస్తం పరిపప్రచ్ఛ ప్రాంజలిః ప్రణతో నృపః |
ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్యపరాక్రమౌ ||

17

గజసింహగతీ వీరౌ శార్దూలవృషభోపమౌ |
పద్మపత్రవిశాలాక్షౌ ఖడ్గతూణీధనుర్ధరౌ ||

18

అశ్వినావివ రూపేణ సముపస్థితయౌవనౌ |
యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ ||

19

కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వా మునే |
పుండరీకవిశాలాక్షౌ వరాయుధధరావుభౌ ||

20

బద్ధగోధాంగులిత్రాణౌ ఖడ్గవంతౌ మహాద్యుతీ |
కాకపక్షధరో వీరౌ కుమారావివ పావకీ ||

21

రూపైదార్యర్గుణైః పుంసాం దృష్టిచిత్తాపహారిణౌ |
ప్రకాశ్య కులమస్మాకం మాముద్ధర్తుమిహాగతౌ ||

22

[* వరాయుధధరౌ వీరౌ కస్య పుత్రౌ మహామునే | *]
భూషయంతావిమం దేశం చంద్రసూర్యావివాంబరమ్ |
పరస్పరస్య సదృశౌ ప్రమాణేంగితచేష్టితైః ||

23

[కాకపక్షధరౌ వీరౌ]
కస్య పుత్రౌ మునిశ్రేష్ఠ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః |
తస్య తద్వచనం శ్రుత్వా జనకస్య మహాత్మనః ||

24

న్యవేదయన్మహాత్మానౌ పుత్రౌ దశరథస్య తౌ |
సిద్ధాశ్రమనివాసం చ రాక్షసానాం వధం తథా ||

25

తచ్చాగమనమవ్యగ్రం విశాలాయాశ్చ దర్శనమ్ |
అహల్యాదర్శనం చైవ గౌతమేన సమాగమమ్ |
మహాధనుషి జిజ్ఞాసాం కర్తుమాగమనం తథా ||

26

ఏతత్సర్వం మహాతేజా జనకాయ మహాత్మనే |
నివేద్య విరరామాథ విశ్వామిత్రో మహామునిః ||

27

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచాశః సర్గః ||

Balakanda Sarga 50 Meaning In Telugu

యాభయ్యవ సర్గ

రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు మునులు అందరూ మిథిలా నగరము చేరుకున్నారు. జనకుడు చేయు యాగమునకు వచ్చిన ఆహూతులతో మిథిలా నగరము క్రిక్కిరిసి పోయింది. యాగమునకు వచ్చిన మునులకు వేసిన ఋషివాటికలతో మిథిలా నగరము నిండిపోయింది.

అప్పుడు రాముడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు. “ఓ మునీంద్రా! ఇక్కడ అంతా జనసమ్మర్దముగా ఉంది. మనకు ఉండుటకు తగిన ప్రదేశమును నిర్ణయింపుడు.” అని అన్నాడు.

అప్పుడు విశ్వామిత్రుడు జనసమ్మర్దములేని ప్రదేశములో, జలము బాగా దొరికే ప్రదేశములో తమకు అతిథిగృహమును ఏర్పాటు చేసాడు. ఇంతలో జనకునకు విశ్వామిత్రుడు యాగమునకు వచ్చాడు అన్న విషయం తెలిసింది.

జనక మహారాజు తన పురోహితుడు అయిన శతానందుని, ఋత్విక్కులను వెంట బెట్టుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రునకు అర్ఘ్యము పాద్యము అర్పించి పూజించాడు. జనకుడు ఇచ్చిన ఆతిథ్యమును సంతోషంతో స్వీకరించాడు విశ్వామిత్రుడు.

“ఓ జనక మహారాజా! నీకు క్షేమమేనా! నీ రాజ్యములో ప్రజలు క్షేమముగా ఉన్నారా! యజ్ఞము ఎట్టి అవాంతరములు లేకుండా సక్రమంగా జరుగుతూ ఉందా!” అని అడిగాడు.

తరువాత విశ్వామిత్రుడు అక్కడకు వచ్చిన ఋత్విక్కులను, ఉపా ధ్యాయులను, పురోహితులను ఉచిత రీతిని కుశల ప్రశ్నలు వేసి వారి క్షేమములు అడిగాడు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునికి నమస్కరించి ఆయనకు ఉచితాసనము సమర్పించాడు. విశ్వా

మిత్రుడు ఆసనము మీద కూర్చున్నాడు. తరువాత ఋత్విక్కులు, పురోహితులు, మంత్రులు కూడా తమ తమ ఆసనముల మీద కూర్చున్నారు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

” ఓ మహర్షీ! మహాత్ములు, పుణ్యాత్ములు అయిన మీరు ఈ యజ్ఞమునకు వచ్చి నన్ను ధన్యుడిని చేసారు. తమరి దర్శనభాగ్యముతో నా యజ్ఞము సఫలమైనది. తమరి అనుగ్రహము నాకు పూర్తిగా లభించింది. ఓ విశ్వామిత్ర మహర్షీ! యజ్ఞము సమాప్తమగుటకు ఇంక పన్నెండు దినములు మిగిలి ఉన్నది. తరువాత వారి వారి హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అందరూ వస్తారు.” అని అన్నాడు…

తరువాత జనకుని దృష్టి రామలక్ష్మణుల మీద పడింది. వారిని చూచి జనకుడు విశ్వామిత్రుని ఇలా అడిగాడు.

“ఓ మహర్షి! ఈ రాకుమారులు ఎవరు? వీరు మహా పరాక్రమ వంతుల మాదిరి కనపడుతున్నారు. వీరి నేత్రములు పద్మపత్రముల మాదిరి ఉన్నవి. వీరు దేవతల మాదిరి ప్రకాశిస్తున్నారు. వీరు ఇరువురూ ఒకే పోలికలతో ఉన్నారు. ఇప్పుడిప్పుడే యౌవనములోకి అడుగుపెడుతున్నారు. వీరు ధనుర్బాణములను, ఖడ్గములను ధరించి ఉన్నారు. వీరిని చూస్తుంటే సూర్య చంద్రులు ఒకే సారి ప్రకాశిస్తున్నట్టు ఉంది. వీరు ఏ దేశము రాకుమారులు? మీ వెంట కాలి నడకన వచ్చుటకు కారణమేమి? మా దేశమునకు ఏ పనిమీద వచ్చారు? సెలవియ్యండి.” అని వినయంగా అడిగాడు.

అప్పుడు విశ్వామిత్రుడు జనకునితో ఇలా అన్నాడు.

“ఓ జనకమహారాజా! వీరు క్షత్రియ కుమారులు. అయోధ్యా నగరమునకు అధిపతి అయిన ఇక్ష్వాకు వంశమునకు చెందిన దశరథ మహారాజునకు పుత్రులు. నేను సిద్ధాశ్రమములో ఒక యజ్ఞము తలపెట్టాను. ఆ యజ్ఞమును రాక్షసులు భగ్నం చేస్తున్నారు. అందుకని వీరిని వారి తండ్రి అనుమతితో యాగ సంరక్షణకు తీసుకొని వచ్చాను. వీరు ఇరువురు రాక్షసులను సంహరించి యాగమును సంరక్షించారు. తరువాత అహల్యా దర్శనము చేసుకొని, గౌతమ మహామునిని కలుసుకొని, అనంతరము మిథిలకు వచ్చారు. నీ వద్ద ఉన్న ధనుస్సును చూడటానికి కుతూహలపడుతున్నారు.” అని విశ్వామిత్రుడు జనకునితో రామ లక్ష్మణులకు గురించి వివరంగా చెప్పాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభయ్యవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ ఏకపంచాశః సర్గః (51) >>

Balakanda Sarga 52 In Telugu – బాలకాండ ద్విపంచాశః సర్గః

Balakanda Sarga 52 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్విపంచాశః సర్గ అంటే 52వ సర్గ. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకువెళతాడు. మిథిలాకు చేరుకున్న తరువాత, వారు జనక మహారాజును కలుస్తారు. జనకుడు రామలక్ష్మణులను చూసి ఆనందపడి, వారిని ఆత్మీయంగా స్వాగతిస్తాడు. జనకుడు సీతా స్వయంవరానికి సంబంధించిన వివరాలను వారికి వివరిస్తాడు.

వసిష్ఠాతిథ్యమ్

స దృష్ట్వా పరమప్రీతో విశ్వామిత్రో మహాబలః | [తం]
ప్రణమ్య విధినా వీరో వసిష్ఠం జపతాం వరమ్ ||

1

స్వాగతం తవ చేత్యుక్తో వసిష్ఠేన మహాత్మనా |
ఆసనం చాస్య భగవాన్వసిష్ఠో వ్యాదిదేశ హ ||

2

ఉపవిష్టాయ చ తదా విశ్వామిత్రాయ ధీమతే |
యథాన్యాయం మునివరః ఫలమూలాన్యుపాహరత్ ||

3

ప్రతిగృహ్య చ తాం పూజాం వసిష్ఠాద్రాజసత్తమః |
తపోగ్నిహోత్రశిష్యేషు కుశలం పర్యపృచ్ఛత ||

4

విశ్వామిత్రో మహాతేజా వనస్పతిగణే తథా |
సర్వత్ర కుశలం చాహ వసిష్ఠో రాజసత్తమమ్ ||

5

సుఖోపవిష్టం రాజానం విశ్వామిత్రం మహాతపాః |
పప్రచ్ఛ జపతాం శ్రేష్ఠో వసిష్ఠో బ్రహ్మణః సుతః ||

6

కచ్చిత్తే కుశలం రాజన్కచ్చిద్ధర్మేణ రంజయన్ |
ప్రజాః పాలయసే రాజన్ రాజవృత్తేన ధార్మిక ||

7

కచ్చిత్తే సంభృతా భృత్యాః కచ్చిత్తిష్ఠంతి శాసనే |
కచ్చిత్తే విజితాః సర్వే రిపవో రిపుసూదన ||

8

కచ్చిద్బలేషు కోశేషు మిత్రేషు చ పరంతప |
కుశలం తే నరవ్యాఘ్ర పుత్రపౌత్రే తవానఘ ||

9

సర్వత్ర కుశలం రాజా వసిష్ఠం ప్రత్యుదాహరత్ |
విశ్వామిత్రో మహాతేజా వసిష్ఠం వినయాన్వితః ||

10

కృత్వోభౌ సుచిరం కాలం ధర్మిష్ఠౌ తాః కథాః శుభాః |
ముదా పరమయా యుక్తౌ ప్రీయేతాం తౌ పరస్పరమ్ ||

11

తతో వసిష్ఠో భగవాన్కథాంతే రఘునందన |
విశ్వామిత్రమిదం వాక్యమువాచ ప్రహసన్నివ ||

12

ఆతిథ్యం కర్తుమిచ్ఛామి బలస్యాస్య మహాబల |
తవ చైవాప్రమేయస్య యథార్హం సంప్రతీచ్ఛ మే ||

13

సత్క్రియాం తు భవానేతాం ప్రతీచ్ఛతు మయోద్యతామ్ |
రాజా త్వమతిథిశ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః ||

14

ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహామతిః |
కృతమిత్యబ్రవీద్రాజా పూజావాక్యేన మే త్వయా ||

15 [ప్రియ]

ఫలమూలేన భగవన్విద్యతే యత్తవాశ్రమే |
పాద్యేనాచమనీయేన భగవద్దర్శనేన చ ||

16

సర్వథా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజితః |
గమిష్యామి నమస్తేఽస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా ||

17

ఏవం బ్రువంతం రాజానం వసిష్ఠః పునరేవ హి |
న్యమంత్రయత ధర్మాత్మా పునః పునరుదారధీః ||

18

బాఢమిత్యేవ గాధేయో వసిష్ఠం ప్రత్యువాచ హ |
యథా ప్రియం భగవతస్తథాస్తు మునిసత్తమ ||

19

ఏవముక్తో మహాతేజా వసిష్ఠో జపతాం వరః |
ఆజుహావ తతః ప్రీతః కల్మాషీం ధూతకల్మషః ||

20

ఏహ్యేహి శబలే క్షిప్రం శృణు చాపి వచో మమ |
సబలస్యాస్య రాజర్షేః కర్తుం వ్యవసితోఽస్మ్యహమ్ ||

21

భోజనేన మహార్హేణ సత్కారం సంవిధత్స్వ మే |
యస్య యస్య యథాకామం షడ్రసేష్వభిపూజితమ్ ||

22

తత్సర్వం కామధుక్ క్షిప్రమభివర్ష కృతే మమ |
రసేనాన్నేన పానేన లేహ్యచోష్యేణ సంయుతమ్ |
అన్నానాం నిచయం సర్వం సృజస్వ శబలే త్వర ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విపంచాశః సర్గః ||

Balakanda Sarga 52 Meaning In Telugu

విశ్వామిత్రుడు వసిష్ఠుని చూచి వినయంగా నమస్కారం చేసాడు. వసిష్ఠమహర్షి విశ్వామిత్రుని సాదరంగా తన ఆశ్రమమునకు ఆహ్వానిం చాడు. అర్ఘ్యము పాద్యము ఉచితాసనము ఇచ్చి సత్కరించాడు. ఫలములను, కందమూలములను ఆహారంగా ఇచ్చాడు.

అప్పుడు విశ్వామిత్రుడు వసిష్ఠుని ఇలా అడిగాడు. “ఓ మహర్షీ! మీకు మీ శిష్యులకు క్షేమమే కదా! మీ ఆశ్రమములో అందరూ సుఖంగా ఉన్నారు కదా! మీ తపస్సు అగ్నిహోత్రములు నిర్విఘ్నముగా కొనసాగుతున్నాయి కదా! ” అని అడిగాడు.

విశ్వామిత్ర మహారాజా! తమ పాలనలో మేమందరమూ సుఖంగానే ఉన్నాము. మీరు ఎలా ఉన్నారు. మీరు క్షేమంగా ఉన్నారా! మీరు ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నారు కదా! రాజధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు కదా! నీ రాజ్యములో నీ సేవకులు నీ మాట మీరకుండా నిన్ను సేవిస్తున్నారు కదా! నీ పాలనలో వారందరూ సుఖంగా ఉన్నారు కదా! నీవు శత్రుసంహారము చేసి, శాంతి స్థాపన చేసావు కదా! ఓ విశ్వామిత్రా! నీ సేనలు, నీ కోశాగారము, నీ మిత్రులు, నీ పుత్రులు అందరూ క్షేమమే కదా! ” అని కుశల ప్రశ్నలు అడిగాడు వసిష్ఠుడు.

వసిష్ఠుడు అడిగిన దానికి “ఓ మహర్షీ! తమరి దయవలన అంతా సవ్యంగానే ఉంది. మేమందరమూ కుశలముగానే ఉన్నాము.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రుడు ఎన్నో విషయములను పరస్పరం చర్చించుకున్నారు. అలా కొంచెము సేపు మాట్లాడుకున్న తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్ర మహారాజా! మీరు మీ పరివారము ఈ రోజు మాకు అతిథులు. అతిథులను సత్కరించడం మన సంప్రదాయము. అందువలన, నీకును నీ పరివారమునకూ నేను అతిథి సత్కారములు చేస్తాను. దయతో అంగీకరించు.” అని అడిగాడు.

“ఓ వసిష్ట మహర్షీ! మీరు మాకు మీ ఆశ్రమములో దొరికే ఫలములు కందమూలములు ఇచ్చారు. మేము ఆరగించాము. మీతో మనస్సు విప్పి మాట్లాడాము. అదే మాకు మీరు ఇచ్చే ఆతిథ్యము, అతిథి సత్కారము. తమరు అనుజ్ఞ ఇస్తే ఇంక మేము వెళ్లి వస్తాము.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

కాని వసిష్ఠుడు ఒప్పుకొనలేదు. తప్పకుండా తాను ఇచ్చు ఆతిథ్యము స్వీకరించవలెనని బలవంతం చేసాడు. ఎట్టకేలకు విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు.

వెంటనే వసిష్ఠుడు తన వద్దఉన్న కామధేనువును పిలిచాడు.

“ఓ కామధేనువా! ఈరోజు విశ్వామిత్రుడు తన పరివారముతో మన ఆశ్రమమునకు వచ్చారు. వారికి మనకు అతిథి సత్కారములు చేయవలెను. దానికి తగిన ఏర్పాట్లు చెయ్యి. ఎవరికి ఏది ఇష్టమో దానిని వారికి అందించేటట్టు ఏర్పాటు చెయ్యి. రక రకాల అన్నములు, భక్ష్యములు, లేహ్యములు, చోష్యములు, పానీయములు మొదలగు ఆహార పదార్థములు సమృద్ధిగా సమకూర్చుము. ఎవరికీ ఎట్టి లోపము రానీయవద్దు.” అని పలికాడు వసిష్ఠుడు.

శ్రీమద్రామాయణము,
బాలకాండము యాభైరెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ త్రిపంచాశః సర్గః (53) >>

Balakanda Sarga 54 In Telugu – బాలకాండ చతుఃపంచాశః సర్గః

Balakanda Sarga 54 In Telugu
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము బాలకాండ చతుఃపంచాశః సర్గః రామాయణంలో, ఈ సర్గలో రాముడు సీతను వివాహం చేసుకున్న తరువాత, జనక మహారాజు కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు బహుమతులు ఇస్తారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు తమ పత్నులతో కలిసి అయోధ్యకు తిరుగు ప్రయాణమవుతారు. వారి ప్రయాణం సంతోషకరంగా సాగుతుంది. ఈ సందర్భంగా, రాముడు, సీత భవిష్యత్ జీవితంపై చర్చించుకుంటారు.

పప్లవాదిసృష్టిః

కామధేనుం వసిష్ఠోఽపి యదా న త్యజతే మునిః |
తదాస్య శబలాం రామ విశ్వామిత్రోఽన్వకర్షత ||

1

నీయమానా తు శబలా రామ రాజ్ఞా మహాత్మనా |
దుఃఖితా చింతయామాస రుదంతీ శోకకర్శితా ||

2

పరిత్యక్తా వసిష్ఠేన కిమహం సుమహాత్మనా |
యాఽహం రాజభటైర్దీనా హ్రియేయ భృశదుఃఖితా ||

3

కిం మయాఽపకృతం తస్య మహర్షేర్భావితాత్మనః |
యన్మామనాగసం భక్తామిష్టాం త్యజతి ధార్మికః ||

4

ఇతి సా చింతయిత్వా తు వినిఃశ్వస్య పునః పునః |
నిర్ధూయ తాంస్తదా భృత్యాన్ శతశః శత్రుసూదన ||

5

జగామానిలవేగేన పాదమూలం మహాత్మనః |
శబలా సా రుదంతీ చ క్రోశంతీ చేదమబ్రవీత్ ||

6

వసిష్ఠస్యాగ్రతః స్థిత్వా మేఘదుందుభిరావణీ | [రుదంతీ మేఘనిఃస్వనా]
భగవన్కిం పరిత్యక్తా త్వయాఽహం బ్రహ్మణః సుత ||

7

యస్మాద్రాజభటా మాం హి నయంతే త్వత్సకాశతః |
ఏవముక్తస్తు బ్రహ్మర్షిరిదం వచనమబ్రవీత్ ||

8

శోకసంతప్తహృదయాం స్వసారమివ దుఃఖితామ్ |
న త్వాం త్యజామి శబలే నాపి మేఽపకృతం త్వయా ||

9

ఏష త్వాం నయతే రాజా బలాన్మత్తో మహాబలః |
న హి తుల్యం బలం మహ్యం రాజా త్వద్య విశేషతః ||

10

బలీ రాజా క్షత్రియశ్చ పృథివ్యాః పతిరేవ చ |
ఇయమక్షౌహిణీ పూర్ణా సవాజిరథాసంకులా ||

11

హస్తిధ్వజసమాకీర్ణా తేనాసౌ బలవత్తరః |
ఏవముక్తా వసిష్ఠేన ప్రత్యువాచ వినీతవత్ ||

12

వచనం వచనజ్ఞా సా బ్రహ్మర్షిమమితప్రభమ్ |
న బలం క్షత్రియస్యాహుర్బ్రాహ్మణో బలవత్తరః ||

13

బ్రహ్మన్బ్రహ్మబలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరమ్ |
అప్రమేయబలం తుభ్యం న త్వయా బలవత్తరః ||

14

విశ్వామిత్రో మహావీర్యస్తేజస్తవ దురాసదమ్ |
నియుంక్ష్వ మాం మహాతేజ త్వద్బ్రహ్మబలసంభృతామ్ ||

15

తస్య దర్పబలం యత్తన్నాశయామి దురాత్మనః |
ఇత్యుక్తస్తు తయా రామ వసిష్ఠస్తు మహాయశాః ||

16

సృజస్వేతి తదోవాచ బలం పరబలారుజమ్ |
తస్య తద్వచనం శ్రుత్వా సురభిః సాసృజత్తదా ||

17

తస్యా హుంభారవోత్సృష్టాః పప్లవాః శతశో నృప |
నాశయంతి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః ||

18

బలం భగ్నం తతో దృష్ట్వా రథేనాక్రమ్య కౌశికః |
స రాజా పరమక్రుద్ధో రోషవిస్ఫారితేక్షణః ||

19 [క్రోధ]

పప్లవాన్నాశయామాస శస్త్రైరుచ్చావచైరపి |
విశ్వామిత్రార్దితాన్దృష్ట్వా పప్లవాన్ శతశస్తదా ||

20

భూయ ఏవాసృజత్కోపాచ్ఛకాన్యవనమిశ్రితాన్ |
తైరాసీత్సంవృతా భూమిః శకైర్యవనమిశ్రితైః ||

21

ప్రభావద్భిర్మహావీర్యైర్హేమకింజల్కసన్నిభైః |
దీర్ఘాసిపట్టిశధరైర్హేమవర్ణాంబరావృతైః ||

22

నిర్దగ్ధం తద్బలం సర్వం ప్రదీప్తైరివ పావకైః |
తతోఽస్త్రాణి మహాతేజా విశ్వామిత్రో ముమోచ హ |
తైస్తైర్యవనకాంభోజాః పప్లవాశ్చాకులీకృతాః ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుఃపంచాశః సర్గః ||

Balakanda Sarga 54 Meaning In Telugu

ఈ ప్రకారంగా వసిష్ఠుడు కామధేనువు ఇవ్వడానికి ఎంతకూ ఒప్పుకోలేదు. అందుకని విశ్వామిత్రుడు తన పరివారంతో ఆ కామ ధేనువును బలవంతంగా లాక్కొని పోతున్నాడు.

ఈ దుశ్చర్యకు ఆ కామధేనువు దీనంగా ఏడిచింది. తనలో తాను ఇలా అనుకొంది. “ఇదేమిటి. ఈ రాజు నన్ను బలవంతంగా లాక్కొని పోతున్నాడు. ఇంతకాలము నేను వసిస్థుని వద్ద ఉన్నాను కదా. వసిష్ఠుడు నన్ను విడిచి పెట్టినాడా! లేక పోతే ఈ మహారాజు నన్ను ఇలా ఎందుకు బలవంతంగా తీసుకొని పోతాడు. ఈ మహర్షికి నేను ఏమి అపకారం చేసాను. ఇంతకాలము మహర్షికి ఇష్టమైన పనులే చేసాను కదా. ఈ రోజుకూడా వసిష్ఠుని ఆదేశానుసారము ఈ మహారాజుకు విందు భోజనము సమకూర్చాను కదా! మరి ఎందుకు నన్ను వదిలివేసాడు. ఆయననే అడుగుతాను.” అని తనలో తాను అనుకుంది.

వెంటనే ఒక్కసారి హుంకరించింది. తనను పట్టుకొన్న భటులను విదిల్చి కొట్టింది. పరుగుపరుగున వసిష్ఠుని వద్దకు వెళ్లింది. ఏడుస్తూ వసిష్ఠునితో ఇలా పలికింది.

‘ ఓ బ్రహ్మర్షీ! దుర్మార్గులైన రాజ భటులు నన్ను నీ వద్దనుండి లాక్కొని పోతున్నారు. నన్ను వారికి ఇచ్చేసావా. నేను ఏం అపరాధము చేసానని నన్ను వాళ్లకి ఇచ్చావు.” అని అడిగింది కామధేనువు.

ఆ మాటలు విన్న వసిష్ఠుని హృదయం తల్లడిల్లిపోయింది. తాను కూడా దు:ఖించాడు. ఆ కామధేనువుతో వసిష్ఠుడు ఇలాఅన్నాడు.

“ఓ కామధేనువా! నేను నిన్ను విడవలేదు. నువ్వు ఏ అపరాధమూ చెయ్యలేదు. నువ్వు నాకు ఏ అపకారమూ చెయ్యలేదు. బలవంతుడైన ఆ రాజు నిన్ను బలవంతంగా నా వద్దనుండి తీసుకొని పోతున్నాడు. నా వంటి వాడు బలవంతుడైన ఆ రాజుతో ఎలా పోరాడ గలడు. అతడు ఈ ప్రాంతమునకు రాజు. పరాక్రమవంతుడైన క్షత్రియుడు. ఆయన వద్ద అశ్వములు, ఏనుగులు, సైన్యము ఉన్నాయి. దాదాపు ఆ రాజు వద్ద ఒక అక్షౌహిణి సైన్యము ఉంది. కాబట్టి అతడు నా కంటే ఎంతో బలవంతుడు. ఆయనను నేను ఎలా ఎదుర్కోను. నిన్ను ఎలా రక్షించుకోను. ” అని అన్నాడు వసిష్ఠుడు.

“ఓ బ్రహ్మర్షీ! విశ్వామిత్రునిది క్షత్రియ బలము. నీకు ఉన్న బ్రహ్మ బలమునకు అది సాటి రాదు. అతని కన్నా నీవే బలవంతుడివి. నీ తేజస్సు ముందర ఆ రాజు క్షణకాలము కూడా నిలువలేడు. ఓ మహర్షీ! నీ ‘బ్రహ్మ బలంతో నన్ను ఆజ్ఞాపించు. అతని సైన్యమును సర్వనాశనము చేస్తాను.” అని పలికింది కామధేనువు.

వెంటనే వసిష్ఠుడు పైకి లేచాడు. “ఓ కామధేనువూ! నీవు ఆ రాజుకు దీటైన సైన్యమును సృష్టించు.” అని ఆజ్ఞాపించాడు.

మహాఋషి ఆజ్ఞమేరకు కామధేనువు ఒక్కసారి అంబా అని హుంకరించింది. ఆ హుంకారము నుండి అపారమైన సేనలను సృష్టింపబడ్డాయి. ఆ సేనలు విశ్వామిత్రుని సేనలమీద పడి వారిని ఓడించాయి. తరిమికొట్టాయి.

తన కళ్ల ఎదుటే తన సైన్యము నాశనం కావడం చూచాడు విశ్వామిత్రుడు. తానే స్వయంగా రథం ఎక్కాడు. కామధేనువు సృష్టించిన సేనలను ఎదుర్కొన్నాడు. ఆ సేనలను నాశనం చేసాడు.

ఇది చూచింది కామధేనువు. కోపంతో ఊగిపోయింది. మరలా అపారమైన సేనలను సృష్టించింది. ఆ సేనలు విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేసాయి. అది చూచిన విశ్వామిత్రుడు దివ్యాస్త్రములను ప్రయోగించి కామధేనువు సృష్టించిన సేనలను చెల్లాచెదరు చేసాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభైనాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ పంచపంచాశః సర్గః (55) >>

Balakanda Sarga 41 In Telugu – బాలకాండ ఏకచత్వారింశః సర్గః

Balakanda Sarga 41 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకచత్వారింశః సర్గలో అంశుమాన్ యొక్క గుర్రం కోసం అన్వేషణలో కపిల తన తండ్రి-మామలను బూడిదలో పెట్టాడని తెలుస్తుంది. అతను వారి ఆత్మలకు నివాళిగా జల సమర్పణ చేయాలనుకున్నప్పుడు అతనికి నీరు దొరకలేదు. అప్పుడు గరుడ, విష్ణువు యొక్క డేగ వాహనం మరియు అంశుమాన్ యొక్క మామ అయిన గంగా నదిని భూమిపైకి తీసుకురావాలని అతనికి సలహా ఇస్తాడు, తద్వారా ఆత్మలు శుద్ధి చేయబడి స్వర్గానికి వెళతాయి.

సగరయజ్ఞసమాప్తిః

పుత్రాంశ్చిరగతాన్ జ్ఞాత్వా సగరో రఘునందన |
నప్తారమబ్రవీద్రాజా దీప్యమానం స్వతేజసా ||

1

శూరశ్చ కృతివిద్యశ్చ పూర్వైస్తుల్యోఽసి తేజసా |
పితౄణాం గతిమన్విచ్ఛ యేన చాశ్వోఽపహారితః ||

2

అంతర్భౌమాని సత్వాని వీర్యవంతి మహాంతి చ |
తేషాం త్వం ప్రతిఘాతార్థం సాసిం గృహ్ణీష్వ కార్ముకమ్ ||

3

అభివాద్యాభివాద్యాంస్త్వం హత్వా విఘ్నకరానపి |
సిద్ధార్థః సన్నివర్తస్వ మమ యజ్ఞస్య పారగః ||

4

ఏవముక్తోంశుమాన్సమ్యక్సగరేణ మహాత్మనా |
ధనురాదాయ ఖడ్గం చ జగామ లఘువిక్రమః ||

5

స ఖాతం పితృభిర్మార్గమంతర్భౌమం మహాత్మభిః |
ప్రాపద్యత నరశ్రేష్ఠస్తేన రాజ్ఞాభిచోదితః ||

6

దైత్యదానవరక్షోభిః పిశాచపతగోరగైః | [దేవ]
పూజ్యమానం మహాతేజా దిశాగజమపశ్యత ||

7

స తం ప్రదక్షిణం కృత్వా దృష్ట్వా చైవ నిరామయమ్ |
పితౄన్స పరిపప్రచ్ఛ వాజిహర్తారమేవ చ ||

8

దిశాగజస్తు తచ్ఛ్రుత్వా ప్రత్యాహాంశుమతో వచః |
ఆసమంజ కృతార్థస్త్వం సహాశ్వః శీఘ్రమేష్యసి ||

9

తస్య తద్వచనం శ్రుత్వా సర్వానేవ దిశాగజాన్ |
యథాక్రమం యథాన్యాయం ప్రష్టుం సముపచక్రమే ||

10

తైశ్చ సర్వైర్దిశాపాలైర్వాక్యజ్ఞైర్వాక్యకోవిదైః |
పూజితః సహయశ్చైవ గంతాసీత్యభిచోదితః ||

11

తేషాం తద్వచనం శ్రుత్వా జగామ లఘువిక్రమః |
భస్మరాశీకృతా యత్ర పితరస్తస్య సాగరాః ||

12

స దుఃఖవశమాపన్నస్త్వసమంజసుతస్తదా |
చుక్రోశ పరమార్తస్తు వధాత్తేషాం సుదుఃఖితః ||

13

యజ్ఞీయం చ హయం తత్ర చరంతమవిదూరతః |
దదర్శ పురుషవ్యాఘ్రో దుఃఖశోకసమన్వితః ||

14

స తేషాం రాజపుత్రాణాం కర్తుకామో జలక్రియామ్ |
సలిలార్థీ మహాతేజా న చాపశ్యజ్జలాశయమ్ ||

15

విసార్య నిపుణాం దృష్టిం తతోఽపశ్యత్ఖగాధిపమ్ |
పితౄణాం మాతులం రామ సుపర్ణమనిలోపమమ్ ||

16

స చైనమబ్రవీద్వాక్యం వైనతేయో మహాబలః |
మా శుచః పురుషవ్యాఘ్ర వధోఽయం లోకసమ్మతః ||

17

కపిలేనాప్రమేయేన దగ్ధా హీమే మహాబలాః |
సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికమ్ ||

18

గంగా హిమవతో జ్యేష్ఠా దుహితా పురుషర్షభ |
తస్యాం కురు మహాబాహో పితౄణాం తు జలక్రియామ్ ||

19

భస్మరాశీకృతానేతాన్ ప్లావయేల్లోకపావనీ |
తయా క్లిన్నమిదం భస్మ గంగయా లోకకాంతయా ||

20

షష్టిం పుత్రసహస్రాణి స్వర్గలోకం నయిష్యతి |
గచ్ఛ చాశ్వం మహాభాగ సంగృహ్య పురుషర్షభ ||

21

యజ్ఞం పైతామహం వీర సంవర్తయితుమర్హసి |
సుపర్ణవచనం శ్రుత్వా సోంశుమానతివీర్యవాన్ ||

22

త్వరితం హయమాదాయ పునరాయాన్మహాయశాః |
తతో రాజానమాసాద్య దీక్షితం రఘునందన ||

23

న్యవేదయద్యథావృత్తం సుపర్ణవచనం తథా |
తచ్ఛ్రుత్వా ఘోరసంకాశం వాక్యమంశుమతో నృపః ||

24

యజ్ఞం నిర్వర్తయామాస యథాకల్పం యథావిధి |
స్వపురం చాగమచ్ఛ్రీమానిష్టయజ్ఞో మహీపతిః ||

25

గంగాయాశ్చాగమే రాజా నిశ్చయం నాధ్యగచ్ఛత |
అగత్వా నిశ్చయం రాజా కాలేన మహతా మహాన్ |
త్రింశద్వర్షసహస్రాణి రాజ్యం కృత్వా దివం గతః ||

26

Balakanda Sarga 41 In Telugu Pdf With Meaning

ఇక్కడ సగరుడు తన కుమారుల రాక కోసరం ఎదురు చూస్తున్నాడు. ఎన్నాళ్లకూ తన కుమారులు యజ్ఞాశ్వముతో తిరిగి రాలేదు. అందుకని సగరుడు తన మనుమడైన అంశుమంతుని పిలిచి అతనితో ఇలా అన్నాడు.

“కుమారా! నీవు వీరుడవు. పరాక్రమవంతుడవు. నీ పినతండ్రులు యజ్ఞాశ్వము కొరకు వెళ్లి చాలా కాలం అయింది. వారు ఇంకా తిరిగి రాలేదు. నీవు పోయి వారి జాడ కనుక్కొని రా. యజ్ఞాశ్వముతో తిరిగి రా! జాగ్రత్త! నీవు మహాబలవంతులతో పోరాడవలసి ఉంటుంది. కాబట్టి కావలసిన అస్త్ర శస్త్ర ములను తీసుకొని వెళ్లు. నీకు నమస్కరించిన వారికి తిరిగి నమస్కరించు. నిన్ను ఎదిరించినవారిని నాశనం చెయ్యి. విజయుడవై తిరిగిరా!” అని పలికాడు.

సగరుడి మనుమడు అయిన అంశుమంతుడు తాతగారికి నమస్కరించి తన పినతండ్రులను వెతుకుతూ బయలుదేరాడు. అంశు మంతుడు తన పిన తండ్రులు తవ్విన మార్గమును వెతుకు కుంటూ వెళ్లాడు. దారిలో అంశుమంతుడు దిగ్గజములను చూచాడు. వారిని తన పినతండ్రుల జాడను గురించి అడిగాడు. ఆ దిగ్గజములు చూపిన మార్గములో వెళ్లి అంశుమంతుడు తన పినతండ్రుల భస్మరాసుల వద్దకు వెళ్లాడు. తన పిన తండ్రులు అలా భస్మరాసులుగా మారడం చూచి ఎంతో బాధపడ్డాడు. పక్కనే పచ్చిమేయుచున్న యజ్ఞాశ్వమును చూచాడు.

ఇంక మిగిలింది తన పిన తండ్రులకు తర్పణములు విడవాలి. దానికి జలము కావాలి. చుట్టూ చూచాడు ఎక్కడా జలాశయము కనపడలేదు. అప్పుడు గరుడుడు అక్కడకు వచ్చాడు. గరుడుడు వరుసకు సగర పుత్రులకు మేనమామ అవుతాడు. గరుడుడు అంశు మంతుని చూచి ఇలా అన్నాడు.

“కుమారా! నీ పినతండ్రుల మరణమునకు చింతింపకుము. వారి మరణమునకు లోకములు అంతా హర్షిస్తున్నాయి. నీ పినతండ్రులు అటువంటి దుర్మార్గులు. నీ పిన తండ్రులు కపిల మహర్షి శాపముతో భస్మము అయ్యారు. వీరికి ఉదక తర్షణము ఇవ్వడం ఉచితము కాదు. నీవు గంగానదిలో వీరికి తర్పణములు విడువుము. ఆ గంగానదీమ తల్లి వీరి భస్మరాసులను తడిపినపుడు మాత్రమే వీరికి స్వర్గలోక ప్రాప్తి కలుగ గలదు. కాబట్టి నీవు వీరిని గురించి చింతింపక హయమును తీసుకొని పోయి నీ తాతగారి యజ్ఞమును నిర్వర్తింపుము.” అని అన్నాడు.

గరుడుని మాట ప్రకారము అంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకొని తన పురమును చేరుకున్నాడు. యజ్ఞ దీక్షలో ఉన్న సగర చక్రవర్తితో జరిగినది అంతా చెప్పాడు. గరుడుడు తనకు తెలిపిన విషయములు అన్నీ చెప్పాడు. యజ్ఞాశ్వమును ఆయనకు అప్పగించాడు.

సగరుడు తన కుమారుల మరణమునకు చింతించాడు. తరువాత తేరుకొని యధావిధిగా యజ్ఞమును పూర్తిచేసాడు. ఇప్పుడు గంగను తీసుకొని వచ్చి కుమారుల భస్మరాసులను తడపడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు సగరుడు. ఎందుకంటే పవిత్ర గంగాజలం వారి భస్మరాసుల మీద పారితే గానీవారికి స్వర్గలోకము సిద్ధించదు. గంగ దేవతల అధీనములో స్వర్గములో ప్రవహిస్తూ ఉంది. దానిని భూమి మీదకు తీసుకొని వచ్చు ఉపాయము దొరకలేదు సగరునకు.

సగరుడు 30,000 సంవత్సరములు రాజ్యపాలన చేసాడు కానీ గంగను మాత్రము భూమి మీదకు తీసుకొని రాలేకపోయాడు. కాలము తీరి సగరుడు స్వర్గస్థుడయ్యాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలుబది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ద్విచత్వారింశః సర్గః (42) >>

Sri Sainatha Mahima Stotram In Telugu – శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం

Sri Sainatha Mahima Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం గురించి తెలుసుకుందాం…

శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం

సదా సత్స్వరూపం చిదానందకందం
జగత్సంభవస్థానసంహార హేతుమ్
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

భవధ్వాంతవిధ్వంసమార్తాండ మీడ్యం
మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యమ్,
జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

భవాం భోధిమగ్నార్ధితానాం జనానాం
స్వపాదాశ్రితానాం స్వభక్తిప్రియాణాం
సముద్ధారణార్థం కలౌ సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్యప్రియం తమ్:
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే
భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవామ్
నృణాం కుర్వతాం భుక్తిముక్తిప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

అనేకాశ్రుతాతర్క్యలీలావిలా సైః
సమావిష్కృతేశాన భాస్వత్ప్రభావమ్
అహంభావహీనం ప్రసన్నాత్మభావమ్
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

సతాం విశ్రమారామమేవాభిరామం
సదా సజ్జనై సంస్తుతం సన్నమద్భిః
జానామోదదం భక్తభద్రప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

అజన్మాద్య మేకం పరంబ్రహ్మ సాక్షాత్
స్వయం సంభవం రామమేవావతీర్ణమ్
భవద్దర్శనా త్సంపునీతః ప్రభో హం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.

శ్రీసాయీశ! కృపానిధేఽఖిలనృణాం – సర్వార్థసిద్ధిప్రద
యుష్మత్పాదరజఃప్రభావమతులం – ధాతాపి వక్తాల క్షమః
సద్భక్త్యా శరణం కృతాంజలిపుటః – సంప్రాప్తితోఽస్మి
ప్రభో శ్రీమత్సాయిపరేశ పారకమలా – న్నాన్య చ్ఛరణ్యం మమ.

సాయీరూపధరరాఘవోత్తమం
భక్తాకామవిబుధద్రుమప్రభుమ్
మాయమోహాహతచిత్తశుద్ధయే
చింతయా మ్యహ మహర్నిశం ముదా.

శరత్సుధాంసుప్రతిమప్రకాశం
కృపాతపత్రం తవ సాయినాథ
త్వదీయ పాదబ్జ సమాశ్రితానాం
స్వచ్ఛాయయా తాప మపాంకరోతు.

ఉపాసనదైవత సాయినాథ
స్తవైర్మయోపాసనానా స్తుత స్త్వమ్
రమే న్మనో మే తవ పాదయుగ్మే
భృంగో యథాఌ జ్ఞే మకరందలుబ్ధః.

అనేకజన్మార్జితపాపసంక్షయో
భవేద్భత్పాదసరోజ దర్శనాత్
క్షమస్వ సర్వా నపరాధపుంజకాన్
ప్రసీద సాయీశ! గురో! దయానిధే.

శ్రీసాయినాథచరాణామృతపూతచిత్తా
స్తత్పాదసేవనరతా సృతతం చ భక్త్యా
సంసారజన్య దురితౌఘ వినిర్గతాస్తే
కైవల్యధామ పరమం సమవాప్నువంతి.

స్తోత్రమేత త్పఠేద్భక్త్యా యోనరస్తన్మనాస్పదా సదా
సద్గురోః సాయినాథస్య – కృపాపాత్రం భవేద్భవం.

మరిన్ని స్తోత్రములు:

Balakanda Sarga 56 In Telugu – బాలకాండ షట్పంచాశః సర్గః

Balakanda Sarga 56 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ షట్పంచాశః సర్గః రామాయణంలో, ఈ సర్గలో రాముడు సీతతో కలిసి అయోధ్యకు చేరుకున్న తరువాత వారికి ఘన స్వాగతం లభిస్తుంది. దశరథ మహారాజు తన కుమారుల వివాహంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు తమ పత్నులతో సంతోషంగా జీవనం ప్రారంభిస్తారు. ప్రజలు రాముడు మరియు సీతను ఆదర్శ దంపతులుగా కీర్తిస్తారు.

|| బ్రహ్మతేజోబలమ్ ||

ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహాబలః |
ఆగ్నేయమస్త్రముత్క్షిప్య తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్ ||

1

బ్రహ్మదండం సముత్క్షిప్య కాలదండమివాపరమ్ |
వసిష్ఠో భగవాన్క్రోధాదిదం వచనమబ్రవీత్ ||

2

క్షత్రబంధో స్థితోఽస్మ్యేష యద్బలం తద్విదర్శయ |
నాశయామ్యద్య తే దర్పం శస్త్రస్య తవ గాధిజ ||

3

క్వ చ తే క్షత్రియబలం క్వ చ బ్రహ్మబలం మహత్ |
పశ్య బ్రహ్మబలం దివ్యం మమ క్షత్రియపాంసన ||

4

తస్యాస్త్రం గాధిపుత్రస్య ఘోరమాగ్నేయముద్యతమ్ |
బ్రహ్మదండేన తచ్ఛాంతమగ్నేర్వేగ ఇవాంభసా ||

5

వారుణం చైవ రౌద్రం చ ఐంద్రం పాశుపతం తథా |
ఐషీకం చాపి చిక్షేప కుపితో గాధినందనః ||

6

మానవం మోహనం చైవ గాంధర్వం స్వాపనం తథా |
జృంభణం మాదనం చైవ సంతాపనవిలాపనే ||

7

శోషణం దారణం చైవ వజ్రమస్త్రం సుదుర్జయమ్ |
బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవ చ ||

8

పైనాకాస్త్రం చ దయితం శుష్కార్ద్రే అశనీ ఉభే |
దండాస్త్రమథ పైశాచం క్రౌంచమస్త్రం తథైవ చ ||

9

ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవ చ |
వాయవ్యం మథనం చైవ అస్త్రం హయశిరస్తథా ||

10

శక్తిద్వయం చ చిక్షేప కంకాలం ముసలం తథా |
వైద్యాధరం మహాస్త్రం చ కాలాస్త్రమథ దారుణమ్ ||

11

త్రిశూలమస్త్రం ఘోరం చ కాపాలమథ కంకణమ్ |
ఏతాన్యస్త్రాణి చిక్షేప సర్వాణి రఘునందన ||

12

వసిష్ఠే జపతాం శ్రేష్ఠే తదద్భుతమివాభవత్ |
తాని సర్వాణి దండేన గ్రసతే బ్రహ్మణః సుతః ||

13

తేషు శాంతేషు బ్రహ్మాస్త్రం క్షిప్తవాన్గాధినందనః |
తదస్త్రముద్యతం దృష్ట్వా దేవాః సాగ్నిపురోగమాః ||

14

దేవర్షయశ్చ సంభ్రాంతా గంధర్వాః సమహోరగాః |
త్రైలోక్యమాసీత్సంత్రస్తం బ్రహ్మాస్త్రే సముదీరితే ||

15

తదప్యస్త్రం మహాఘోరం బ్రాహ్మం బ్రాహ్మేణ తేజసా |
వసిష్ఠో గ్రసతే సర్వం బ్రహ్మదండేన రాఘవ ||

16

బ్రహ్మాస్త్రం గ్రసమానస్య వసిష్ఠస్య మహాత్మనః |
త్రైలోక్యమోహనం రౌద్రం రూపమాసీత్సుదారుణమ్ ||

17

రోమకూపేషు సర్వేషు వసిష్ఠస్య మహాత్మనః |
మరీచ్య ఇవ నిష్పేతురగ్నేర్ధూమాకులార్చిషః ||

18

ప్రాజ్వలద్బ్రహ్మదండశ్చ వసిష్ఠస్య కరోద్యతః |
విధూమ ఇవ కాలాగ్నిర్యమదండ ఇవాపరః ||

19

తతోఽస్తువన్మునిగణా వసిష్ఠం జపతాం వరమ్ |
అమేయం తే బలం బ్రహ్మంస్తేజో ధారయ తేజసా ||

20

నిగృహీతస్త్వయా బ్రహ్మన్విశ్వామిత్రో మహాతపాః |
ప్రసీద జపతాం శ్రేష్ఠ లోకాః సంతు గతవ్యథాః ||

21

ఏవముక్తో మహాతేజాః శమం చక్రే మహాతపాః |
విశ్వామిత్రోఽపి నికృతో వినిఃశ్వస్యేదమబ్రవీత్ ||

22

ధిగ్బలం క్షత్రియబలం బ్రహ్మతేజోబలం బలమ్ |
ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతాని మే ||

23

తదేతత్సమవేక్ష్యాహం ప్రసన్నేంద్రియమానసః |
తపో మహత్సమాస్థాస్యే యద్వై బ్రహ్మత్వకారణమ్ ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్పంచాశః సర్గః ||

Balakanda Sarga 56 Meaning In Telugu

వసిష్ఠుడు రెండవ యమ దండము మాదిరి ప్రకాశిస్తున్న తన బ్రహ్మ దండము పట్టుకొని “ఓరి దుష్టుడా! నా బ్రహ్మ తేజస్సు ముందర నీ క్షత్రియ బలము అస్త్రశస్త్రములు క్షణకాలము కూడా నిలువ లేవు. నీ అస్త్రశస్త్రములను సర్వనాశనం చేస్తాను” అని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు.

విశ్వామిత్రుడు వసిష్ఠుని లెక్క చెయ్యలేదు. వసిష్ఠునిమీద ఆగ్నేయాస్త్రము ప్రయోగించాడు. వసిష్టుని బ్రహ్మదండము ముందు ఆ ఆగ్నేయాస్త్రము నీటి ముందు అగ్ని మాదిరి శాంతించింది. వెనక్కు తిరిగి పోయింది. తరువాత విశ్వామిత్రుడు తాను మహాశివుని వలన పొందిన వారుణాస్త్రము, రుద్ర అస్త్రము, ఇంద్రాస్త్రము, పాశు పతాస్త్రము, ఇషీకాస్త్రము, మానవాస్త్రము, మోహనాస్త్రము, గాంధర్వాస్త్రము, స్వపనాస్త్రము, జృంభణాస్త్రము, మాదనాస్త్రము, సంతాపనాస్త్రము, విలాపనాస్త్రము, శోషణాస్త్రము, ధారణాస్త్రము, వజ్రాస్త్రము, బ్రహ్మపాశము, వరుణ పాశము, పైనాక, దైత అస్త్రములు, శుష్కము, అర్ధము, దారుణము మొదలగు అస్త్రములు, దండము, పైశాచము, క్రౌంచము అను అస్త్రములు, ధర్మ చక్రము, కాల చక్రము, విష్ణుచక్రములను, వాయవ్యాస్త్రము, మదనాస్త్రము, హయశిరోస్త్రము, కంకాళము, ముసలము అను ఆయుధములు, విద్యాధరము అనే మహాస్త్రము, కాలాస్త్రము, త్రిశూలము, కపాలాస్త్రము, కంకణాస్త్రము మొద చిత్ర విచిత్ర అస్త్రములను వసిష్ఠుని మీద ప్రయోగించాడు.

విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆ అస్త్రములను అన్నింటినీ వసిస్థుని బ్రహ్మదండము అవలీలగా మింగేసింది. ఇంక విశ్వామిత్రుని వద్ద మిగిలింది బ్రహ్మాస్త్రము. దానిని కూడా వసిష్ఠుని మీద ప్రయో గించాడు విశ్వామిత్రుడు. ఆ బ్రహ్మాస్త్రము వినాశనాన్ని సృష్టించింది. లోకములు అన్నీ ఆ బ్రహ్మ అస్త్ర శక్తికి మండిపోతున్నాయి. ముల్లోకములు తల్లడిల్లిపోతున్నాయి.

దేవతలు, గంధర్వులు అందరూ వసిష్ఠుని వద్దకు వెళ్లారు. బ్రహ్మాస్త్రమును శాంతింపచేయమని ప్రార్థించారు. బ్రహ్మ తేజస్సు వెదజల్లుతున్న వసిష్టుని బ్రహ్మ దండము విశ్వామిత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునుకూడా మింగేసింది. లోకాలు శాంతించాయి.

ఆ సమయంలో వసిష్ఠుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. వసిష్ఠుని దేహం నుండి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. వసిష్ఠుని చేతిలోని బ్రహ్మ దండము యమ దండము మాదిరి ప్రజ్వరిల్లుతూ ఉంది. అప్పుడు దేవతలందరూ వసిష్ఠుని ఇలా ప్రార్థించారు.

” ఓ మహర్షీ! నీ బ్రహ్మ తేజస్సు అమోఘమైనది. బ్రహ్మాస్త్రము తేజస్సును నీ బ్రహ్మ తేజస్సులో ఐక్యము చేసుకో. నువ్వు శాంతించు. నీ దండమును శాంతింపచెయ్యి.” అని ప్రార్థించారు.

దేవతల ప్రార్థనను మన్నించ వసిష్ఠుడు శాంతించాడు. బ్రహ్మాస్త్రము వసిష్ఠుని బ్రహ్మతేజస్సులో లీనమైపోయింది.

ఇంత చేసిన విశ్వామిత్రునికి భంగపాటు మిగిలింది. అవమానభారంతో కుంగిపోయాడు. క్షాత్రము కన్నా బ్రహ్మ తేజస్సు గొప్పది అని తెలుసుకొన్నాడు.

“ఆహా! ఏమి ఆశ్చర్యము. వసిష్ఠుని బ్రహ్మ తేజస్సు ముందు నా అస్త్ర శస్త్రములు అన్నీ వృధా అయిపోయాయి. ఆయన బ్రహ్మ దండము నా అస్త్రములను అన్నీ మింగేసింది. కాబట్టి క్షాత్రము నిరుపయోగము. బ్రహ్మ తేజము కొరకు ప్రయత్నము చేస్తాను. మనస్సును ఇంద్రియము లను నిగ్రహిస్తాను. బ్రాహ్మణత్వము సిద్ధించడం కొరకు తీవ్రమైన తపస్సు చేస్తాను” అని అనుకొన్నాడు విశ్వామిత్రుడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభై ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ సప్తపంచాశః సర్గః (57) >>

Sri Surya Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి

sri surya ashtottara shatanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

శ్రీ సూర్య హిందూ పరంపరలో పూజించబడును దేవుడు. ఆకాశము మరియు పృథ్వి లో ఉన్న ప్రతి జీవిత నిర్మాణకు ఆధారముగా చిత్రింపబడుతుంది. సూర్యుడు ప్రకాశము మరియు ఉష్మాలను అంతరించి ప్రాణికులను పుష్టిగా చేస్తాడు. జీవితమును వ్యవస్థించి ధర్మ, ఆరోగ్య, ఐశ్వర్య మరియు సమృద్ధిని అందిస్తాడు. సూర్యుడు జననమరణ చక్రాన్ని సృష్టించుకొన్నాడు, మరణములను అంతర్గతంగా మార్చుకొన్నాడు.

శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి

  1. ఓం అరుణాయ నమః |
  2. ఓం శరణ్యాయ నమః |
  3. ఓం కరుణారససింధవే నమః |
  4. ఓం అసమానబలాయ నమః |
  5. ఓం ఆర్తరక్షకాయ నమః |
  6. ఓం ఆదిత్యాయ నమః |
  7. ఓం ఆదిభూతాయ నమః |
  8. ఓం అఖిలాగమవేదినే నమః |
  9. ఓం అచ్యుతాయ నమః |
  10. ఓం అఖిలజ్ఞాయ నమః |
  11. ఓం అనంతాయ నమః |
  12. ఓం ఇనాయ నమః |
  13. ఓం విశ్వరూపాయ నమః |
  14. ఓం ఇజ్యాయ నమః |
  15. ఓం ఇంద్రాయ నమః |
  16. ఓం భానవే నమః |
  17. ఓం ఇందిరామందిరాప్తాయ నమః |
  18. ఓం వందనీయాయ నమః |
  19. ఓం ఈశాయ నమః |
  20. ఓం సుప్రసన్నాయ నమః |
  21. ఓం సుశీలాయ నమః |
  22. ఓం సువర్చసే నమః |
  23. ఓం వసుప్రదాయ నమః |
  24. ఓం వసవే నమః |
  25. ఓం వాసుదేవాయ నమః |
  26. ఓం ఉజ్జ్వలాయ నమః |
  27. ఓం ఉగ్రరూపాయ నమః |
  28. ఓం ఊర్ధ్వగాయ నమః |
  29. ఓం వివస్వతే నమః |
  30. ఓం ఉద్యత్కిరణజాలాయ నమః |
  31. ఓం హృషీకేశాయ నమః |
  32. ఓం ఊర్జస్వలాయ నమః |
  33. ఓం వీరాయ నమః |
  34. ఓం నిర్జరాయ నమః |
  35. ఓం జయాయ నమః |
  36. ఓం ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః |
  37. ఓం ఋషివంద్యాయ నమః |
  38. ఓం రుగ్ఘంత్రే నమః |
  39. ఓం ఋక్షచక్రచరాయ నమః |
  40. ఓం ఋజుస్వభావచిత్తాయ నమః |
  41. ఓం నిత్యస్తుత్యాయ నమః |
  42. ఓం ౠకారమాతృకావర్ణరూపాయ నమః |
  43. ఓం ఉజ్జ్వలతేజసే నమః |
  44. ఓం ౠక్షాధినాథమిత్రాయ నమః |
  45. ఓం పుష్కరాక్షాయ నమః |
  46. ఓం లుప్తదంతాయ నమః |
  47. ఓం శాంతాయ నమః |
  48. ఓం కాంతిదాయ నమః |
  49. ఓం ఘనాయ నమః |
  50. ఓం కనత్కనకభూషాయ నమః |
  51. ఓం ఖద్యోతాయ నమః |
  52. ఓం లూనితాఖిలదైత్యాయ నమః |
  53. ఓం సత్యానందస్వరూపిణే నమః |
  54. ఓం అపవర్గప్రదాయ నమః |
  55. ఓం ఆర్తశరణ్యాయ నమః |
  56. ఓం ఏకాకినే నమః |
  57. ఓం భగవతే నమః |
  58. ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః |
  59. ఓం గుణాత్మనే నమః |
  60. ఓం ఘృణిభృతే నమః |
  61. ఓం బృహతే నమః |
  62. ఓం బ్రహ్మణే నమః |
  63. ఓం ఐశ్వర్యదాయ నమః |
  64. ఓం శర్వాయ నమః |
  65. ఓం హరిదశ్వాయ నమః |
  66. ఓం శౌరయే నమః |
  67. ఓం దశదిక్సంప్రకాశాయ నమః |
  68. ఓం భక్తవశ్యాయ నమః |
  69. ఓం ఓజస్కరాయ నమః |
  70. ఓం జయినే నమః |
  71. ఓం జగదానందహేతవే నమః |
  72. ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమః |
  73. ఓం ఔచ్చస్థాన సమారూఢరథస్థాయ నమః |
  74. ఓం అసురారయే నమః |
  75. ఓం కమనీయకరాయ నమః |
  76. ఓం అబ్జవల్లభాయ నమః |
  77. ఓం అంతర్బహిః ప్రకాశాయ నమః |
  78. ఓం అచింత్యాయ నమః |
  79. ఓం ఆత్మరూపిణే నమః |
  80. ఓం అచ్యుతాయ నమః |
  81. ఓం అమరేశాయ నమః |
  82. ఓం పరస్మై జ్యోతిషే నమః |
  83. ఓం అహస్కరాయ నమః |
  84. ఓం రవయే నమః |
  85. ఓం హరయే నమః |
  86. ఓం పరమాత్మనే నమః |
  87. ఓం తరుణాయ నమః |
  88. ఓం వరేణ్యాయ నమః |
  89. ఓం గ్రహాణాంపతయే నమః |
  90. ఓం భాస్కరాయ నమః |
  91. ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః |
  92. ఓం సౌఖ్యప్రదాయ నమః |
  93. ఓం సకలజగతాంపతయే నమః |
  94. ఓం సూర్యాయ నమః |
  95. ఓం కవయే నమః |
  96. ఓం నారాయణాయ నమః |
  97. ఓం పరేశాయ నమః |
  98. ఓం తేజోరూపాయ నమః |
  99. ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః |
  100. ఓం హ్రీం సంపత్కరాయ నమః |
  101. ఓం ఐం ఇష్టార్థదాయ నమః |
  102. ఓం అనుప్రసన్నాయ నమః |
  103. ఓం శ్రీమతే నమః |
  104. ఓం శ్రేయసే నమః |
  105. ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమః |
  106. ఓం నిఖిలాగమవేద్యాయ నమః |
  107. ఓం నిత్యానందాయ నమః |
  108. ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః |

మరిన్ని అష్టోత్తరములు

Balakanda Sarga 39 In Telugu – బాలకాండ ఏకోనచత్వారింశః సర్గః

Balakanda Sarga 39 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనచత్వారింశః సర్గలో సగర చక్రవర్తి విడుదల చేసిన కర్మ గుర్రాన్ని ఇంద్రుడు ఆచారానికి ఆటంకం కలిగించడానికి లాక్కున్నాడు. గుర్రం లేకుండా కర్మ ముగింపుకు వెళ్లదు. అప్పుడు సగరుడు తన అరవై వేల మంది కుమారులను ఆ గుర్రం కోసం వెతకమని ఆజ్ఞాపించాడు, అది భూమిపై కనిపించకపోతే భూమిని తవ్వమని అడుగుతాడు. మరియు భూమిపై గుర్రం కనిపించనప్పుడు యువరాజులు భూమిని తవ్వి, భూలోకంలో నివసించే జీవుల దుఃఖానికి గురవుతారు.

పృథివీవిదారణమ్

విశ్వామిత్రవచః శ్రుత్వా కథాంతే రఘునందన |
ఉవాచ పరమప్రీతో మునిం దీప్తమివానలమ్ ||

1

శ్రోతుమిచ్ఛామి భద్రం తే విస్తరేణ కథామిమామ్ |
పూర్వకో మే కథం బ్రహ్మన్యజ్ఞం వై సముపాహరత్ ||

2

తస్య తద్వచనం శ్రుత్వా కౌతూహలసమన్వితః |
విశ్వామిత్రస్తు కాకుత్స్థమువాచ ప్రహసన్నివ ||

3

శ్రూయతాం విస్తరో రామ సగరస్య మహాత్మనః |
శంకరశ్వశురో నామ హిమవానచలోత్తమః ||

4

వింధ్యపర్వతమాసాద్య నిరీక్షేతే పరస్పరమ్ |
తయోర్మధ్యే ప్రవృత్తోఽభూద్యజ్ఞః స పురుషోత్తమ ||

5

స హి దేశో నరవ్యాఘ్ర ప్రశస్తో యజ్ఞకర్మణి |
తస్యాశ్వచర్యాం కాకుత్స్థ దృఢధన్వా మహారథః ||

6

అంశుమానకరోత్తాత సగరస్య మతే స్థితః |
తస్య పర్వణి సంయుక్తం యజమానస్య వాసవః ||

7

రాక్షసీం తనుమాస్థాయ యజ్ఞీయాశ్వమపాహరత్ |
హ్రియమాణే తు కాకుత్స్థ తస్మిన్నశ్వే మహాత్మనః ||

8

ఉపాధ్యాయగణాః సర్వే యజమానమథాబ్రువన్ |
అయం పర్వణి వేగేన యజ్ఞీయాశ్వోఽపనీయతే ||

9

హర్తారం జహి కాకుత్స్థ హయశ్చైవోపనీయతామ్ |
[* అధికపాఠః –
యజ్ఞచ్ఛిద్రం భవత్యేతత్సర్వేషామశివాయ నః |
తత్తథా క్రియతాం రాజన్ యథాచ్ఛిద్రః క్రతుర్భవేత్ |
*]
ఉపాధ్యాయవచః శ్రుత్వా తస్మిన్సదసి పార్థివః ||

10

షష్టిం పుత్రసహస్రాణి వాక్యమేతదువాచ హ |
గతిం పుత్రా న పశ్యామి రక్షసాం పురుషర్షభాః ||

11

మంత్రపూతైర్మహాభాగైరాస్థితో హి మహాక్రతుః |
తద్గచ్ఛత విచిన్వధ్వం పుత్రకా భద్రమస్తు వః ||

12

సముద్రమాలినీం సర్వాం పృథివీమనుగచ్ఛత |
ఏకైకం యోజనం పుత్రా విస్తారమభిగచ్ఛత ||

13

యావత్తురగసందర్శస్తావత్ఖనత మేదినీమ్ |
తం చైవ హయహర్తారం మార్గమాణా మమాజ్ఞయా ||

14

దీక్షితః పౌత్రసహితః సోపాధ్యాయగణో హ్యహమ్ |
ఇహ స్థాస్యామి భద్రం వో యావత్తురగదర్శనమ్ ||

15

ఇత్యుక్తా హృష్టమనసో రాజపుత్రా మహాబలాః | [తే సర్వే]
జగ్ముర్మహీతలం రామ పితుర్వచనయంత్రితాః ||

16

[* గత్వ తు పృథివీం సర్వమదృష్టా తం మహబలాః | *]
యోజనాయామవిస్తారమేకైకో ధరణీతలమ్ |
బిభిదుః పురుషవ్యాఘ్ర వజ్రస్పర్శసమైర్నఖైః ||

17

శూలైరశనికల్పైశ్చ హలైశ్చాపి సుదారుణైః |
భిద్యమానా వసుమతీ ననాద రఘునందన ||

18

నాగానాం వధ్యమానానామసురాణాం చ రాఘవ |
రాక్షసానాం చ దుర్ధర్షః సత్త్వానాం నినదోఽభవత్ ||

19

యోజనానాం సహస్రాణి షష్టిం తు రఘునందన |
బిభిదుర్ధరణీం వీరా రసాతలమనుత్తమమ్ ||

20

ఏవం పర్వతసంబాధం జంబూద్వీపం నృపాత్మజాః |
ఖనంతో నృపశార్దూల సర్వతః పరిచక్రముః ||

21

తతో దేవాః సగంధర్వాః సాసురాః సహపన్నగాః |
సంభ్రాంతమనసః సర్వే పితామహముపాగమన్ ||

22

తే ప్రసాద్య మహాత్మానం విషణ్ణవదనాస్తదా |
ఊచుః పరమసంత్రస్తాః పితామహమిదం వచః ||

23

భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సగరాత్మజైః |
బహవశ్చ మహాత్మానో హన్యంతే జలవాసినః ||

24 [వధ్యంతే]

అయం యజ్ఞహరోఽస్మాకమనేనాశ్వోఽపనీయతే |
ఇతి తే సర్వభూతాని హింసంతి సగరాత్మజః ||

25

శ్రీ రాముడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! సగరుడు తాను సంకల్పించిన యజ్ఞమును ఎలా నిర్వహించాడు. తెలియ జేయండి.” అని అడిగాడు.

విశ్వామిత్రుడు ఇలా చెప్పనారంభించాడు. ” ఓ రామా! సగరుని యజ్ఞము హిమాచలము వింధ్యపర్వతము మధ్య జరిగింది. సగరుడు యజ్ఞాశ్వమును విడిచి పెట్టాడు. సగరుని మనుమడైన అంశు మంతుడు ఆ యజ్ఞాశ్వమునకు రక్షణగా వెంట బయలుదేరాడు. సగరుడు యజ్ఞము చేయడం ఇష్టం లేని ఇంద్రుడు రాక్షస రూపం ధరించి వచ్చి యజ్ఞాశ్వమును అపహరించాడు. అశ్వము కనపడలేదు. ఋత్తిక్కులందరూ సగరునితో ఇలా అన్నారు.

“ ఓ సగర చక్రవర్తీ! యజ్ఞాశ్వమును ఎవరో అపహరించారు. యజ్ఞాశ్వము లేనిదే యజ్ఞము జరగదు. కాబట్టి యజ్ఞాశ్వమును తీసుకొని రావలెను.” అని అన్నారు.

ఆ మాటలు విన్న సగరుడు తన 60,000 మంది కుమారులతో ఇలా అన్నాడు. “ ఓ కుమారులారా! ఇది మంత్రములతో పవిత్రమైన స్థలము. ఇక్కడకు రాక్షసులు రాలేరు. ఇది రాక్షసుల పని కాదు. కాబట్టి మీరు భూమండలము అంతా వెదకండి. భూమి ఉపరి తలము మీద దొరకకపోతే మీ రందరూ ఒక్కొకరు ఒక్కొక్క యోజనము చొప్పున భూమిని తవ్వండి. అశ్వము దొరికే వరకు తవ్వండి. యజ్ఞాశ్వమును తీసుకొని రండి. మీరు అశ్వమును తీసుకొని వచ్చే వరకూ నేను.ఋత్విక్కులు, నా మనుమడు ఇక్కడనే మీ కోసము నిరీక్షిస్తూ ఉంటాము.” అని పలికాడు సగరుడు..

తండ్రి ఆజ్ఞ ప్రకారము సగర పుత్రులు యజ్ఞాశ్వమును వెదుకుతూ వెళ్లారు. వారికి ఎక్కడా అశ్వము కనపడలేదు. వారు భూమిని తవ్వ నారంభించారు. వారు అలా భూమిని తవ్వుతూ ఉండగా ఎన్నో సరములు, అసురులు బయటకు వచ్చారు. 60,000 మంది సగర పుత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము వంతున అరవై వేల యోజనములు తవ్వారు. భూమి అంతా పాతాళంగా మారి పోయింది. పెద్ద గొయ్యిగా తయారయింది. సగర పుత్రులు జంబూ ద్వీపము అంతా తవ్వేశారు.

ఇది చూచి దేవతలరు, గంధర్వులు, నాగులు అందరూ బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లారు. “ఓ బ్రహ్మ దేవా! యజ్ఞాశ్వము కొరకు సగర పుత్రులు భూమి నంతా తవ్వుతున్నారు. పాతాళంలో తపస్సు చేసుకుంటున్న ఋషులను చంపుతున్నారు. దొరికన వాడిని దొరికనట్టు చంపుతున్నారు. ఎన్నో జీవజాలములు నశించి పోతున్నాయి. నీ సృష్టి అంతా సర్వ నాశనము అయి పోతోంది. మీరే కాపాడాలి.” అని బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు.

శ్రీమద్రామాయణము
బాల కాండ ముప్పది తొమ్మిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ చత్వారింశః సర్గః (40) >>

Ratha Sapthami In Telugu – రథ సప్తమి

Rathasapthami

రథ సప్తమి

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు రథ సప్తమి విశిష్టత, రథ సప్తమి పండుగ ఎందుకు జరుపుకుంటారు, మరియు రథ సప్తమి గురించి తెలుసుకుందాం.

రథ సప్తమి విశిష్టత

సమస్త సృష్టికి శ్రీసూర్యనారాయణుడు పంచకల్యాణి అశ్యములు పూనిన రథముపై సంచరిస్తూ, తన ప్రభాత కిరణాల వెలుగుతో మేలుకొలుపు పొందుతాడు. భాస్కరుడు, ఆదిత్యుడు, కశ్వపుడు, భానుడు, ఆదిత్యుడు, రవి అనే పర్యాయనామాలతో ఆకంతిమూర్తిని ప్రస్తుతిస్తారు.
జన్మకుండలిలో రవి మహర్ధశ రవి అంతర్దశ అను కాలము లుంటుందని ఈ దశల, ప్రభావం మానవుల జీవితం మీద అమితమైన ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య శాస్త్రము ఉద్ఘాటిస్తున్నది. దీనివలన సూర్యభగవానుడు వెలుగుల దేవుడేకాక మానవులజీవితంలో ఉచ్ఛ నీచ స్థితులను నిర్దేశించే విధాత అని తేట తెల్లమవుతున్నది.

“తేజ స్కామో విభావసుమ్” అంటే తేజస్సును పొందగోరువారు సూర్యుని ఆరాధించాలని భాగవతమందు చెప్పబడినది.

“ఆరోగ్యం భాస్కరదాచ్చేత్” నిత్యం ప్రాతఃకాలమునందు సూర్యుని దర్శించి నమస్కారప్రణామాలు చేయుట వలన ఆరోగ్యం చేకూరును (మత్స్యపురాణం) “దినేశం సుఖార్ధం” సకల సుఖములను ఆదిత్యుని ఆరాధన అందించును (స్కాంధపురాణం).

సూర్యభగవానుని ఆరాధించటం వలన శుభఫలితాలను పొందవచ్చునని పురాణములు, వేదములు కొన్ని వృత్తాంతముల వలన తేటతెల్లమవుతున్నది.

“ఉదయం బ్రహ్మ స్వరూపో మధ్యాహ్నేతు మహేశ్వరః
సాయంకాలే సదా విష్ణుఃత్రిమూర్తి శ్చ దివాకరః”

ఈశ్లోకమునందు సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మవలెను, సాయంత్రం విష్ణువు వలెను, మధ్యాన్నం మహేశ్వరుడు వలెను త్రిమూర్తుల అంశతో ప్రకాశిస్తాడని చెప్పబడింది. కనుకనే శ్రీసూర్యనారాయణుని ఆరాధన వలన త్రిమూర్తులను ఆరాధించి పొందు ఫలములను పొందవచ్చునని శాస్త్రఉవాచ.

రథ సప్తమి ఎందుకు జరుపుకుంటారు?

“మాఘ మాసే సితేపక్ష సప్తమ న్యాద్ర దన్యతు
తత్ర స్కానంచ దానంచ తత్పర్యం చాక్షయం భవేత్”

మాఘమాసం ప్రిబ్రవరి, శుక్లపక్షంలో వచ్చే రథ సప్తమినాడు సూర్య భగవానుడు భూమికి దగ్గరగా రావటం జరుగుతుంది. ఈ సమయంలో సూర్యభగవానుడి శక్తి భూమిమీద పుష్కలంగా ప్రసరిస్తూ ఉంటుంది.

“సూర్య గ్రహణ తుల్యాతు శుక్లా మాఘస్వసప్తమే.

ఈ సప్తమ శుభదినంగా సూర్యగ్రహణంగా పరిగణిస్తూ ఆ రోజు దీక్షలు, వ్రతాలు, నోములు చేబడతారు ఇది విశేష ఫలం ఇస్తుందని నమ్మకం ఈ సప్తమినే “ రథ సప్తమీ” అంటారు.

అయపు వేళసప్తమి తిధిఉండి సాయంత్రంకల్లా “అష్టమి” వస్తే అద్భుతమైన అపురూపమైన రహస్యమైన మంత్రములను జపం చేయుట మంత్ర తంత్ర యంత్ర పివ్వల ఉపాసనను చేయుట వలన విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చునని పూర్వీకులునుండి బలమైన నమ్మకం కలదు.

రథ సప్తమి నాడు సూర్యభగవానుడు నక్షత్రరధము నెక్కి ఆకాశమంతా తిరుగుతాడు, అందుకే రధసప్తమినాడు ఆకాశములో నక్షత్రములు రధాకారములో కనిపిస్తాయని ఇతిహాసంలో ఉన్నది. రధసప్తమినాడు తలమీద జిల్లేడు, రేగు ఆకులను ఉంచుకుని తలనిండాస్నానం చేస్తారు ఇలా స్నానంచేయుట వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చుని ధర్మశాస్త్రం ప్రవచిస్తోంది. తలస్నానం చేయునపుడు సూర్యుని యొక్క పన్నెండు నామములను స్మరిస్తూ తల, మెడ, కాళ్ళు, చేతులు, భుజాలు, కళ్ళు, హృదయం. నాభి, పాదాలపై ఆకులను ఉంచుకుని స్నానం చేస్తారు ఇలా చెయ్యడం వల్ల ఈ అంగములపై సూర్యుని శుభదృష్టి ప్రసరించి రోగములు నాశనమవుతాయని నమ్మకం.

“సప్త సప్త మహా సప్త సప్త ద్వీపా వసుంధర
సప్తార వర్ణమాదాయ సప్తమీ రథ సప్తమి”

ఈ శ్లోకం స్నాన మాచరించునప్పుడు పరించాలి.

సమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే॥

యద్యజ్ఞన్మ కృతం పాపం మయా జన్మసు సప్తమ
తన్మేరోగం చ శోకంచ మాకరీ హంతు సప్తమీ ॥

ఏతజ్ఞన్మ కృతం పాపం యజ్ఞన్మాంతారార్జితం
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞతేచయే పునః ॥

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ ॥

ఆర్ధ్యం – “ఓననా సర్వలోకాం సప్తమీ సప్త సప్తిగా
సప్త వ్యాహృతికే దేవీ నమస్తే సూర్యమండలే”

సప్తమాదేవతని సూర్యమండలాన్ని నమస్కరించి జిల్లేడు, రేగు, చందనం, అక్షింతలు కలిపిన నీటిని లేక క్షీరమును రాగి పాత్రతో ఆర్ఘ్యమివ్వడం శుభం.

రథ సప్తమి యొక్క పూజావిధానం:

ఎర్ర చందనంతో పద్మాన్నిగీసి ఎర్రని పువ్వులతో ఆదిత్యుని పన్నెండు నామాలతో పూజించాలి.

నామాలు

  • మిత్రాయ నమః
  • రవేనమః
  • సూర్యా నమః
  • భానవే నమః
  • ఖగాయ నమః
  • పూషాయ నమః
  • హిరణ్యగర్భాయ నమః
  • మరీచయే నమః
  • ఆదిత్యాయ నమః
  • సనిత్రేయనమః
  • ఆర్కాయ నమః
  • భాస్కరాయ నమః

సూర్యదర్శనం జిల్లేడు అకుకు రంధ్రం చేసి దాని మధ్య నుండి చేసుకొనుట శుభం సూర్యగాయత్రిని 108 సార్లు జపించి, సూర్యుని శాంతి రత్నములను పూజించుట సాంప్రదాయం.

పూజనివేదన
ఆవు పేడతో చేసిన శ్రేష్ఠమైన పిడకలమీద క్షీరాన్నమును వండి చిక్కుడు ఆకులు మీదనుంచి నైవేద్యం పెట్టవలెను సృష్టికి వెలుగును, శక్తిని ప్రసాదించు అదిత్యుని ఆరాధించుట వలన శుభము శ్రేష్టము కనుక ఈవిధమైన పూజా విధానములను రథ సప్తమినాడు ఆచరించుట వలన సూర్యభగవానుని అనుగ్రహమును పొందవచ్చును.

మరిన్ని పండుగలు:

Balakanda Sarga 48 In Telugu – బాలకాండ అష్టచత్వారింశః సర్గః

Balakanda Sarga 48 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము బాలకాండ అష్టచత్వారింశః సర్గః రామాయణంలో, ఈ సర్గలో విష్వామిత్ర మహర్షి రామ, లక్ష్మణుల్ని సీతా స్వయంవరానికి తీసుకువెళతారు. రాముడు శివ ధనుస్సును విరచి సీతను గెలుచుకుంటాడు. ఈ సందర్భంలో, పరశురాముడు రాముడి శక్తిని పరీక్షించడానికి వస్తాడు. రాముడు శాంతంగా పరశురాముడి పరీక్షను తట్టుకుని తన శౌర్యాన్ని నిరూపిస్తాడు.

|| శక్రాహల్యాశాపః ||

పృష్ట్వా తు కుశలం తత్ర పరస్పరసమాగమే |
కథాంతే సుమతిర్వాక్యం వ్యాజహార మహామునిమ్ ||

1

ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్యపరాక్రమౌ |
గజసింహగతీ వీరౌ శార్దూలవృషభోపమౌ ||

2

పద్మపత్రవిశాలాక్షౌ ఖడ్గతూణీధనుర్ధరౌ |
అశ్వినావివ రూపేణ సముపస్థితయౌవనౌ ||

3

యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ |
కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వా మునే ||

4

భూషయంతావిమం దేశం చంద్రసూర్యావివాంబరమ్ |
పరస్పరస్య సదృశౌ ప్రమాణేంగితచేష్టితైః ||

5

కిమర్థం చ నరశ్రేష్ఠౌ సంప్రాప్తౌ దుర్గమే పథి |
వరాయుధధరౌ వీరౌ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ||

6

తస్య తద్వచనం శ్రుత్వా యథావృత్తం న్యవేదయత్ |
సిద్ధాశ్రమనివాసం చ రాక్షసానాం వధం తథా ||

7

విశ్వామిత్రవచః శ్రుత్వా రాజా పరమహర్షితః |
అతిథీ పరమౌ ప్రాప్తౌ పుత్రౌ దశరథస్య తౌ ||

8

పూజయామాస విధివత్సత్కారార్హౌ మహాబలౌ |
తతః పరమసత్కారం సుమతేః ప్రాప్య రాఘవౌ ||

9

ఉష్య తత్ర నిశామేకాం జగ్మతుర్మిథిలాం తతః |
తాన్దృష్ట్వా మునయః సర్వే జనకస్య పురీం శుభామ్ ||

10

సాధు సాధ్వితి శంసంతో మిథిలాం సమపూజయన్ |
మిథిలోపవనే తత్ర ఆశ్రమం దృశ్య రాఘవః ||

11

పురాణం నిర్జనం రమ్యం పప్రచ్ఛ మునిపుంగవమ్ |
శ్రీమదాశ్రమసంకాశం కిం న్విదం మునివర్జితమ్ ||

12

శ్రోతుమిచ్ఛామి భగవన్కస్యాయం పూర్వ ఆశ్రమః |
తచ్ఛ్రుత్వా రాఘవేణోక్తం వాక్యం వాక్యవిశారదః ||

13

ప్రత్యువాచ మహాతేజా విశ్వామిత్రో మహామునిః |
హంత తే కథయిష్యామి శృణు తత్త్వేన రాఘవ ||

14

యస్యైతదాశ్రమపదం శప్తం కోపాన్మహాత్మనా |
గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్మహాత్మనః ||

15

ఆశ్రమో దివ్యసంకాశః సురైరపి సుపూజితః |
స చేహ తప ఆతిష్ఠదహల్యాసహితః పురా ||

16

వర్షపూగాననేకాంశ్చ రాజపుత్ర మహాయశః |
కదాచిద్దివసే రామ తతో దూరం గతే మునౌ ||

17

తస్యాంతరం విదిత్వా తు సహస్రాక్షః శచీపతిః |
మునివేషధరోఽహల్యామిదం వచనమబ్రవీత్ ||

18

ఋతుకాలం ప్రతీక్షంతే నార్థినః సుసమాహితే |
సంగమం త్వహమిచ్ఛామి త్వయా సహ సుమధ్యమే ||

19

మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన |
మతిం చకార దుర్మేధా దేవరాజకుతూహలాత్ ||

20

అథాబ్రవీత్సురశ్రేష్ఠం కృతార్థేనాంతరాత్మనా |
కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్ఛ శీఘ్రమితః ప్రభో ||

21

ఆత్మానం మాం చ దేవేశ సర్వదా రక్ష మానద |
ఇంద్రస్తు ప్రహసన్వాక్యమహల్యామిదమబ్రవీత్ ||

22

సుశ్రోణి పరితుష్టోఽస్మి గమిష్యామి యథాగతమ్ |
ఏవం సంగమ్య తు తయా నిశ్చక్రామోటజాత్తతః ||

23

స సంభ్రమాత్త్వరన్రామ శంకితో గౌతమం ప్రతి |
గౌతమం స దదర్శాథ ప్రవిశంతం మహామునిమ్ ||

24 [తం]

దేవదానవదుర్ధర్షం తపోబలసమన్వితమ్ |
తీర్థోదకపరిక్లిన్నం దీప్యమానమివానలమ్ ||

25

గృహీతసమిధం తత్ర సకుశం మునిపుంగవమ్ |
దృష్ట్వా సురపతిస్త్రస్తో వివర్ణవదనోఽభవత్ ||

26

అథ దృష్ట్వా సహస్రాక్షం మునివేషధరం మునిః |
దుర్వృత్తం వృత్తసంపన్నో రోషాద్వచనమబ్రవీత్ ||

27

మమ రూపం సమాస్థాయ కృతవానసి దుర్మతే |
అకర్తవ్యమిదం తస్మాద్విఫలస్త్వం భవిష్యసి ||

28

గౌతమేనైవముక్తస్య సరోషేణ మహాత్మనా |
పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్ ||

29

తథా శప్త్వా స వై శక్రమహల్యామపి శప్తవాన్ |
ఇహ వర్షసహస్రాణి బహూని త్వం నివత్స్యసి ||

30

వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ |
అదృశ్యా సర్వభూతానామాశ్రమేఽస్మిన్నివత్స్యసి ||

31

యదా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజః |
ఆగమిష్యతి దుర్ధర్షస్తదా పూతా భవిష్యసి ||

32

తస్యాతిథ్యేన దుర్వృత్తే లోభమోహవివర్జితా |
మత్సకాశే ముదా యుక్తా స్వం వపుర్ధారయిష్యసి ||

33

ఏవముక్త్వా మహాతేజా గౌతమో దుష్టచారిణీమ్ |
ఇమమాశ్రమముత్సృజ్య సిద్ధచారణసేవితే |
హిమవచ్ఛిఖరే రమ్యే తపస్తేపే మహాతపాః ||

34

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టచత్వారింశః సర్గః ||

Balakanda Sarga 48 Meaning In Telugu

సుమతి విశ్వామిత్రుడు పరస్పరము క్షేమసమాచారములు అడిగి తెలుసుకున్నారు. తరువాత సుమతి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

“ఓ విశ్వామిత్ర మహర్షి! నీతో పాటు ఇద్దరు రాకుమారులు వచ్చారు. వారి మొహంలో దేవతలతో సమానమైన తేజస్సు కనపడుతూ ఉంది. వారి నడక సింహము నడకను పోలిఉంది. వారు అమితమైన బల పరాక్రమ ములు కలవారిగా కన్పట్టుచున్నారు. వారు విల్లు అమ్ములు ధరించి ఉన్నారు కాబట్టి క్షత్రియ కుమారుల వలె ఉన్నారు. ఇప్పుడిప్పుడే యౌవనము లోకి అడుగుపెడుతున్నారు. వారి సౌందర్యము అశ్వినీ దేవతలను మరిపించుచున్నది. వీరు ఎవరు? ఏ దేశపు రాకుమారులు? వీరి తల్లి తండ్రులు ఎవరు? మీ వెంట ఈ దుర్గమమైన అరణ్యములలో కాలి నడకన తిరుగుటకు కారణమేమి? తమరికి అభ్యంతరము లేకపోతే తెలపండి.” అని అడిగాడు సుమతి.

విశ్వామిత్రుడు సుమతికి తాను సిద్ధ ఆశ్రమములో నివసించుట, ఆశ్రమములో యాగము చేయ సంకల్పించుట, దానిని రాక్షసులు భగ్నచేయ ప్రయత్నించుట, తాను అయోధ్యకు పోయి దశరథుని రామలక్ష్మణులను యాగ సంరక్షణ కొరకు పంపమని అర్థించుట, దశరథుడు రామలక్ష్మణులను తన వెంట పంపుట, రామలక్ష్మణులు రాక్షసులను చంపుట, యాగమును రక్షించుట, తరువాత తాను రామలక్ష్మణులతో కలిసి మిథిలకు పోతూ దారిలో సుమతిని చూచుట వరకూ అన్ని విషయములు చెప్పాడు.

విశ్వామిత్రుని మాటలకు సుమతి ఎంతో సంతోషించాడు. దశరథపుత్రులైన రామ లక్ష్మణులకు అతిధి సత్కారములు చేసాడు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, సుమతి మందిరములో విశ్రమించారు. మరునాడు వారు మిథిలకు ప్రయాణము అయ్యారు.

మిథిలా నగరము సమీపమునకు వచ్చారు. అక్కడ వారికి నిర్మానుష్యంగా ఉన్న ఒక ఆశ్రమము కనపడింది. ఆ ఆశ్రమమును రాముడు చూచాడు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! ఈ వనము ఎవరిది? ఇక్కడ ఎవ్వరూ లేరు. దీనికి కారణమేమి?” అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.

“ఓ రామా! ఇది గౌతమ ముని ఆశ్రమము. ఆయన భార్య పేరు అహల్య గౌతముడు ఈ ఆశ్రమములో తపస్సు చేసుకుంటూ ఉండే వాడు. ఒక రోజు దేవేంద్రుడు గౌతమముని ఆశ్రమములో లేని సమయమున, ఆయన వేషము వేసుకొని ఆశ్రమములో ప్రవేశించాడు. అహల్యను చూచి ఇలా అన్నాడు.

“ఓ సుందరీ! నేను కాముకుడను. నిన్ను కామించాను. కాముకులు సమయము కొరకు వేచి ఉండరు కదా! నేను నీతో రతి సంగమ మును కోరుచున్నాను.” అని అన్నాడు..

తన భర్త వేషములో వచ్చిన వాడు దేవేంద్రుడు అని తెలుసుకున్నది అహల్య అహల్యకు దేవేంద్రునితో రతిక్రీడ సలుప వలెనని దుర్బుద్ధి పుట్టింది. దేవేంద్రుని మీద ఉన్న కోరికతో అతనితో రతిక్రీడకు అంగీకరించింది. తరువాత అహల్య సంతృప్తి చెందిన మనస్సుతో దేవేంద్రునితో ఇలా అన్నది.

“ఓ దేవేంద్రా! నేను కృతార్థురాలను అయ్యాను. (కోరిక తీరినదానను అయ్యాను). దేవేంద్రా! ఇక్కడి నుండి తొందరగా వెళ్లిపొండి. నా భర్త గౌతముడు వస్తే మన ఇద్దరికీ ప్రమాదము.”అని అంది అ

అహల్య మాటలకు ఇంద్రుడు నవ్వాడు. ” ఓ సుందరీ! నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో తృప్తిగా ఉంది. నేను ఎలా వచ్చానో అలాగే వెళతాను.” అని అన్నాడు ఇంద్రుడు.

ఓ రామా! ఆ ప్రకారంగా అహల్యతో సంగమించిన ఇంద్రుడు, ఎక్కడ గౌతముడు వచ్చి తనను చూస్తాడేమో అని భయపడుతూ, గౌతముని ఆశ్రమము నుండి త్వర త్వరగా బయటకు వచ్చాడు. ఇంతలో గౌతముడు, సమిధలను, దర్భలను తీసుకొని, ఆశ్రమమునకు రానే వచ్చాడు. తన వేషములో ఉన్న ఇంద్రుని చూచాడు. జరిగిన విషయం గ్రహించాడు.

గౌతముని చూచిన ఇంద్రుని మొహం వెల వెల బోయింది. ముని వేషములో ఉన్న ఇంద్రుని చూచి గౌతముడు ఇలా అన్నాడు.

“ఓ దుర్మతీ! నేను ఆశ్రమములో లేని సమయమున నా వేషము ధరించి నా ఆశ్రమములో ప్రవేశించి నాభార్యతో సంగమించిన నీకు ఇదే నా శాపము. నీ వృషణములు కిందపడిపోవు గాక!” అని శపించాడు. గౌతముని శాపము ఫలించింది. ఇంద్రుని వృషణములు నేల మీద పడిపోయాయి.

తరువాత గౌతముడు అహల్యను చూచాడు. తన భర్త ఇంద్రుని శపించడం చూచి గడ గడా వణికిపోయింది. గౌతముడు తన భార్య అహల్యను చూచి ఇలా అన్నాడు.

‘అహల్యా! నీవు పాపం చేసావు. అందుకని నీవు ఇక్కడ అదృశ్యరూపంలో వేల సంవత్సరములు, మట్టిలో దొర్లుతూ, నిరాహారంగా, కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ, తపస్సు చేసుకుంటూ, ఈ ఆశ్రమములో పడి ఉండు.

దశరథ కుమారుడైన రాముడు ఈ ఆశ్రమములో ప్రవేశించినపుడు నీకు శాపవిముక్తి కాగలదు. నీవు రాముని పూజించి ఆయనకు ఆతిధ్యము ఇచ్చి, శాపవిమోచనము పొందిన తరువాత, నీలో ఉన్న మోహము నశించి, పరిశుద్ధురాలవై నన్ను చేరగలవు.” అని పలికాడు.

తరువాత గౌతముడు ఈ ఆశ్రమమును విడిచి హిమవత్పర్వము నకు వెళ్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము నలభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ఏకోనపంచాశః సర్గః (49) >>