విద్యార్థులకు నీతి సూక్తులు

విద్యార్థులకు నీతి సూక్తులు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు, మన పెద్దవాళ్ళు తెలుగులో నేటి తరానికి అందించిన సూక్తులు మీ అందరికోసం… ఈ బ్లాగ్ లో వున్నా సూక్తులు మీ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని ఆసిస్తూ… మీ భక్తివేద్.కం.

సూక్తులు

  • సమాజంలో మంచి మార్పు తేవాలని పాపమాతడు ఎంత ప్రయత్నిస్తున్నాడో కానీ చుట్టూవున్న కోతులు కొండ ముచ్చులు అతని చిలుక పలుకులు వింటాయా.
  • జీవించినంతకాలం నాపై రాళ్ళు వేసిన యీ ప్రపంచం కళ్ళ కద్దుకుంటున్నది నా మృతదేహాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నది నా శవాన్ని!
  • వచ్చేటప్పుడు గోచీ లేకుండా వచ్చి పోయేటపుడు అడ్రసు లేకుండా పోయే మనిషి మధ్యకాలంలో ఎంత హంగామా చేస్తున్నాడు ఎంతమందికి ఎన్ని సమస్యలు సృష్టి స్తున్నాడు!
  • భార్యకు కొన్ని విషయాలు చెప్పాలి పిల్లలకు కొన్ని విషయాలు చెప్పాలి స్నేహితులకు మరికొన్ని చెప్పాలి అందరికీ అన్నీ చెప్పాద్దు.
  • అద్దాల మేడలు – రంగు రంగుల గోడలు దేశాభివృద్ధికి కావు గీటు రాళ్ళు మనిషిలో నైతిక విలువలు, సమాజంలో సుఖశాంతులే అసలు సిసలైన గీటు రాళ్లు.
  • జీవితమనే పరుగు పందెంలో బోల్తాపదేలా పరుగెత్తకు ఎంత దూరం పరిగెత్తినా చివరి పరుగు సమాధివరకే !
  • నీవొక మొద్దు సన్నాసివి నీకు చస్తే చదువురాదని నిరుత్సాహపరిచే అధ్యాపకుడు ఎంత బుద్దిమంతుడో చెప్పండి.
  • ప్రభుత్వ యంత్రాంగంలో పని చేసే ప్రతి సోదరుడు చెట్టుకు వేరులాంటి వాడు ఇంటికి పునాది లొంటి వాడు.
  • బండ రాయిని పగలగొట్టే వాణ్ణి చూడండి ఎంత నిబ్బరంతో ఎన్ని దెబ్బలు కొడ్తున్నాడు నూరు దెబ్బలకు పగలని రాయినీ నూట ఒక్క దెబ్బకు పగులగొట్టి చూపిస్తాడు.

నీతి సూక్తులు

  • కండలు కరిగేలా కష్టించు కొండలను పిండి కొట్టే శక్తి సంపాదించు కాలం ఎదురు తిరిగినా కండలను కొండలుగా పెంచి నీ కార్యం సాధించు.
  • తలచిన పని తలచినట్టుగా కాలేదని తలపట్టుకొని కూర్చుంటే అవుతుందా? తల తాకట్టు పెట్టో తలనీలాలిచ్చో సాధించాలి నీ ధ్యేయం.
  • కష్టాలెన్ని వచ్చినా క పా నష్టాలెన్నో భరించినా కన్నీళ్ళు తుడ్చే ఆప్తుడు కనీసం ఒకడుంటే చాలు.
  • పదిమంది నడచిన రహదారిలో నడిస్తే నీ ప్రత్యేకతేమున్నది నీదైన ఒక దారిలో నడిచి నీ దారిని రహదారిగా మార్చు.
  • ప్రజలకు కావల్సింది నీ తెలివితేటలు కాదు నీ సిరిసపందలు కావు నీలోని మంచితనం.
  • ఆడుతూ ప్రారంభించిన పని పాడుతూ పూర్తిచేశాడు అన్నిటికీ అనుమానపడే పక్షి ఏమీ సాధించలేక పోయాడు.
  • పనిలో ప్రతికూలత వచ్చిందని ఆ పనికి తిలోదకాలిస్తే ఎలా? గాలి ప్రతికూలంగా వున్నపుడే కదా గాలిపటం ఎగిరేది అలా అలా !
  • ఏ దిశకు అంధకారం ఆపరిస్తుందో ఆ దిశనుండే ఆశాకిరణం ఉదయిస్తున్నది ఎక్కడ తారలు అస్తమిస్తున్నవో అక్కడి నుండే సూర్యుడుదయిస్తున్నాడు.
  • తీర్పు చెప్పేవాడికి నేర్పు అవసరం పాఠం చెప్పేవాడికి ఓర్పు అవసరం.
  • శారీరక బడలిక వల్ల రాదు జబ్బు మానసిక రుగ్మతవల్ల వస్తుంది ఎన్ని మైళ్ళు నడిచినా ఎన్ని గంటలు పని చేసినా అనుకున్న పని అయితే అలసటెక్కడిది?
  • లక్షలు సంపాదించే లక్షాధికారీ జీవితంలో ఏదో కొరవడిందని బాధపడుతున్నావా నీవు కోరుకునే తృప్తి కిళ్ళీకొట్టు వాడి కళ్లలో కనిపిస్తుంది చూడు!
  • జైలు జీవితమనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలలో ఒకడు కటకటాల వెనుక కఠిన బాధలు తలుచుకొని కన్నీరు కారుస్తుంటే మరొకడు అనంతాకాశంలోని తారలను చూసి ఆనందించాడట!
  • ఎదుటివాడి బాగుచూసి అసూయపడకు నీకూ అవకాశమొస్తుంది నిరాశపడకు.
  • కష్టాల కడలిలో కన్నీళ్ళు త్రాగడం నేర్పుకో నిరాశా నిస్పృహల నివారణకు ఆత్మధైర్యం పెంచుకో యీ ప్రపంచంలో నీవనుకున్నది సాధించాలనుకుంటే ప్రాణభీతిని విడిచి పరిస్థితులతో పోరాడటం నేర్చుకో.
  • నీ జీవితాన్ని తూచి చూడు నీవు పనిచేసే త్రాసులో ఎంతకాలం పని చేశావనేది కాదు ఎంత సాధించావనేది ముఖ్యం !
  • నీవు నాటిన కొమ్మ వటవృక్షంగా మారి వందమందికి నీడనిస్తుంది నీవు నిర్మించిన ఆకాశహర్మ్యం పంద కుటుంబాలకు ఆశ్రయమిస్తుంది నీవు నాటిన విషబీజం సమాజంలో చిచ్చుపెట్టి వందలమంది ప్రాణాలు తీస్తుంది.

మరిన్ని సూక్తులు మీకోసం:

Kushika Maharaju Katha In Telugu – కుశిక మహారాజు కథ

kushika-maharaja-katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే…కుశిక మహారాజు కథ.

కుశిక మహారాజు కథ

ఒకసారి మహాతోజోమయుడైన చ్యవన మహర్షి కుశిక మహారాజును పరీక్షించుటకు ఆయన కడకు వచ్చెను. వచ్చుచున్న చ్యవన మహర్షిని చూచి కుశికుడు ఎదురేగి ఆర్ఘ్యపాద్యాదులిచ్చి “మహాత్మా! మీ రాకతో మా నగరము పావనమైనది. ఏదో బలీయమైన కారణముంటేగాని మీ వంటి తపోధనులు రారు. మీ అభీష్టమేమో సెలవియ్యండి. మీకు సేవచేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి” అని అర్థించాడు. చ్యవనుడు “రాజా! నీ వినయవిధేయతలకు మెచ్చితిని. నీకడ కొన్నాళ్ళు ఉండవలెనని వచ్చితిని. నాకేలోటు రాకుండా నీవు నీ భార్య నాకు పరిచర్యలు చేయాలి. నా కోరిక తీర్చగలవా?” అని అన్నాడు. సాధు సజ్జన సేవే మహాభాగ్యమని కుశికుడు చ్యవనుడుండడానికి హృద్యమైన మందిరం చూపించాడు.

రాజదంపతులు చ్యవనుడు ఆ సాయంకాలం ఆహ్నికాలు దేవతార్చన చేసుకొన్నారు. తరువాత మునీశ్వరునకు మృష్టాన్నమిచ్చి సంతృప్తి పఱచినాడు కుశికుడు. భోజనానంతరము చ్యవనుడు “రాజా! నేనిక నిద్రిస్తాను. నీవు నీ భార్య నిద్రాహారాలు మాని నా పాదసేవ చేయండి. నా అంతటనేను లేవనంతవరకు నన్ను లేపకండి” అని యోగనిద్రలోకి వెళ్ళిపోయాడు చ్యవనుడు. మహర్షి పాదసేవే మహాభాగ్యం అని కుశికుడు అతని అర్ధాంగి ఏకాగ్రచిత్తంతో పాదసేవ చేయసాగారు.

ఇలా 21 దివసములు గడిచాయి. మఱునాడు చ్యవనుడు మేల్కొని ఏమీ మాట్లాడకుండా అంతఃపురం వదలి నడువసాగాడు. ముని వెంటపోయిన రాజదంపతులను తన మాయతో భయభ్రాంతుల్ని చేశాడు. మరల నిదుర పోయాడు. కుశిక దంపతులు యథావిధిగా పాదసేవ చేశారు. మళ్ళీ 21 దినములు కడచెను. ఆ తరువాత “రాజా! నేను రథమెక్కి యాచకులకు సువర్ణము రత్నములు గోవులు అశ్వములు దానమిచ్చుచుందును. మీరిద్దరు నా రథమును గుఱ్ఱములకు బదులుగా లాగవలెను” అన్నాడు. కుశికుడు ముందర రాణి వెనుక ఉండి రథములాగినారు. చ్యవనుడు మునికోలతో రక్తం వచ్చేటట్టు వారిని కొట్టుచు యాచకులకు వస్తువులిచ్చుచూ రథంమీద వెళ్ళాడు. రథం ఊరి చివరికి వెళ్ళాక ముని రథము దిగి ఏమాత్రమూ చలించని రాజదంపతులని చూశాడు. కుశికుడు అతని భార్య మనస్సులలో కొంచెంకూడా కోపంగానీ వినుకుగానీ మరి ఏ వికారము కానీ లేవు. వారి నిర్మల హృదయం ఆశ్చర్యంతో చూసి ముని వారి శరీములు తాకి ఇలా అన్నాడు “రాజా మీరింక వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. జీపు గంగాతీరం వద్దనున్న వనానికి రండి”.

వారి శరీరముల పైని గాయాలు అన్ని మాసిపోయాయి! కుశికుడు “మహాత్మా! నీ చర్యలు అద్భుతాలు. మాకే శ్రమ లేదు. మీబోటి మహనీయుల మహిమ ఎఱుగుట ఎవరి తరము”? అని అన్నాడు. మఱునాడు చ్యవనుడు చెప్పిన ప్రదేశానికి కుశికుడు అతని భార్య వచ్చారు. అక్కడ స్వర్గమును బోలు దివ్య భవనమున్నది. రాజు రాణి ఆ దివ్య భవమును చూచి మిక్కిలి ఆనందమునొందిరి. చ్యవన మహర్షి వారిని దగ్గరికి పిలిచి “రాజా! మీ శాంత స్వభావము లోకోత్తరం. మీ సాధుజన సేవాభావం అద్వితీయం. ఇంత ఇంద్రియ నిగ్రహము కలమీకు వరమిచ్చెద కోరుకొనుము” అని అన్నాడు.

కుశికుడు “మౌనివరేణ్య! నీ సేవా భాగ్యము దొఱకుటే మాకు వరము. మీ దయే చాలు. మాకింకే కోరికా లేదు” అన్నాడు. రాజదంపతుల వైరాగ్యబుద్ధికి మెచ్చి చ్యవనుడిలా అన్నాడు “ఓ రాజా! మీ వంశమునేకాక ఈ విశ్వాన్నే తరింపచేసే మునిమనుమడు పుడతాడు. అతడు బ్రహ్మర్షి అయ్యి పరమాత్మ అయిన శ్రీ రామునకు గురుస్థానమున ఉండగలడు. అతడు విశ్వామిత్రుడు. నీ వలన కౌశికుడే నామధేయంతో ప్రసిద్ధికెక్కుతాడు” (కుశికుని కొడుకు కుశనాభుడు. అతని కొడుకు గాధీరాజు. ఆయన పుత్రుడే విశ్వామిత్రుడు).

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

సాధుసేవ యొక్క ప్రాధాన్యత శాంత స్వభావము యొక్క ఔన్నత్యం మనకు కుశిక దంపతులు బోధించారు. వారు 21 దినములు నిద్రాహారాలు మాని ఏకాగ్రచిత్తంతో మునీశ్వరునికి పాదసేవ చేశారు. మహర్షి మునికోలతో కొట్టి వారిచేత రథం లాగించినా వారికే మాత్రము కోపము రాలేదు. విరాగులైన కుశిక దంపతులు ధన్యులు.

మరిన్ని నీతికథలు మీకోసం:

అద్భుతమైన తెలుగు సూక్తులు

అద్భుతమైన తెలుగు సూక్తులు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు, మన పెద్దవాళ్ళు తెలుగులో నేటి తరానికి అందించిన సూక్తులు మీ అందరికోసం… ఈ బ్లాగ్ లో వున్నా సూక్తులు మీ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని ఆసిస్తూ… మీ భక్తివేద్.కం.

సూక్తులు

  • తనకోసం బ్రతికేవాడు స్వార్ధపూరిత మనిషి భార్యా పిల్లల కొరకు బ్రతికేవాడు సాదాసీదా మనిషి పది మంది శ్రేయస్సు కోరేవాడు మంచిమనిషి సర్వజనుల శ్రేయస్సు కోరేవాడు మహా మనీషి.
  • గతమంతా నాస్తికాదు అది నీ అనుభవాల ఆస్తి వర్తమానం ఒక వరం భవిష్యత్ ఓ కల-వరం.
  • అసత్యం నుండి సత్యమార్గంలో పయనించు చీకటి నుండి వెలుగులోకి వెళ్ళు మృత్యుభయం విడిచి ముందుకునడు అప్పుడు నీకు అపజయమనేది వుండదు.
  • పనిలో నిమగ్నమై పట్టుదలతో పనులు చేసేవారికి ఆరోగ్యం చెడిపోదు ముసలితనం రాదు.
  • లోకం నన్ను గుర్తించలేదని వూరికే బాధపడేకన్నా లోకాన్ని నేను అర్థం చేసుకున్నానా అని ఆలోచించడం మిన్న !
  • దష్టులు భయానికి లొంగుతారు శిష్టులు ప్రియానికి లొంగుతారు లోభులు డబ్బుకు లొంగుతారు ప్రశంసలకు అందరూ లొంగుతారు.
  • సిరులు వెదజల్లు ఒక చిరునవ్వు తేనెలొలుకు ఒక చిన్న పలుకు మురిపించు నెంత ముభావినైనా కరిగించునెంత కఠినాత్మునైనా !
  • కాకీ పక్షే – కోయిలా పక్షే నోరువిప్పితే తెలుస్తుంది ఏది ఏదో! రాముడూ మనిషే – రంగడూ మనిషే మాట్లాడితే తెలుస్తుంది ఎవరేమిటో!
  • విద్యాలయాల్లో విద్య నేర్చుకోవాలని లేదు కార్యాలయాల్లో పని చేయాలని లేదు సంసార జీవితంలో సఖ్యత కోరుకోడం లేదు అన్నీ తెలుసుననే అహంభావంతో ఏదీ నేర్చుకోడం లేదు.
  • భయభక్తుల్లేకుండా త్రాగి జజారులో నాట్యంచేసే బ్రదర్ కారునడిపే మరో సోదరుడు నీలాగే త్రాగిన మైకంలో వుంటే నీ ఎముకలు పిండి కాగలవు నీ భార్యా పిల్లల బ్రతుకులు బండలు కాగలవు.

అద్భుతమైన సూక్తులు

  • మనిషి మనస్తత్వం మహా విచిత్రమైనది కార్యం సాధిస్తే తన కార్యదీక్షే కారణ మంటాడు అందులో అపజయం కలిగితే ఆ దయామయుడి దయ మాత్రం లేదంటాడు.
  • తప్పొకరు చేస్తున్నారు – శిక్ష మరొకరు అనుభవిస్తున్నారు యీ ప్రపంచ రీతి అర్ధం కాదు తప్పు చేసిన వాడు తప్పించు కుంటున్నాడు అమాయకుడేమో బలి అయిపోతున్నాడు!
  • భూమికన్నా ఓర్పుగలది తల్లి ఆకాశం కన్నా ఉన్నతుడు తండ్రి తండ్రి కన్నా ఉన్నతుడు గురువు అన్నిటికన్నా గొప్పది ఆత్మశక్తి.
  • ఒక చెంప మీద కొట్టినపుడు మరో చెంప చూపమన్నారు పెద్దలు ఆ సూత్రం పనిచేయనపుడు కొట్టినవాడి రెండు చెంపలు వాయగొట్టడమే న్యాయం !
  • నీ విద్యుక్తధర్మాన్ని నిర్యక్ష్యం చేస్తే నీ పనివారే నిన్ను లెక్కబెట్టరు నీ బంధుమిత్రులే నిన్ను ఖాతరుచేయరు నీ భార్యా బిడ్డలే చిన్నచూపు చూస్తారు!
  • నేను వీరుణ్ణి శూరుణ్ణి అని విర్రవీగకు కరెంటులేని రాత్రి నాల్గు దోమలు చాలు తెల్లవారే సరికి నీ భరతంపట్టి నీ అవతారాన్నే మార్చివేయడానికి !
  • సగం కడుపుకు తినాలి కంటి నిండా నిద్రపోవాలి రెట్టింపు నీరు త్రాగాలి నాలుగు రెట్లు నవ్వాలి.
  • కడుపుబ్బునటుల లడ్డూలు తిని కడుపు నొప్పితో బాధపడుతున్న భోజన ప్రియుడికి డాక్టరుగారొక మందు గోలివ్వగా గోలిపట్టే ఖాళీవుంటే మరో లడ్డు పట్టించే వాణ్ని అన్నాడట!
  • డబ్బుంటే పవర్ కావాలి పవర్ కావాలంటే పాలిటిక్స్ లో చేరాలి డబ్బుండి పవర్ లేకపోతే అన్నం రుచిండదు పవరుండి డబ్బు రాకపోతే నిద్రపట్టడు.
  • బీదవాడి గుడిసె గాలివానకు ఎగిరి పోతుందేమోననే భయం ధనవంతుడి భవనం ఇన్కంటాక్సు బాకీలకింద పోతుందేమోననే భయం.

మరిన్ని సూక్తులు మీకోసం:

తెలుగు సూక్తులు మీ అందరికోసం…

సూక్తులు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు, మన పెద్దవాళ్ళు తెలుగులో నేటి తరానికి అందించిన సూక్తులు మీ అందరికోసం… ఈ బ్లాగ్ లో వున్నా సూక్తులు మీ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని ఆసిస్తూ… మీ భక్తివేద్.కం.

సూక్తులు

  • ఒక మేధావితో ఓ గంట కాలక్షేపం వంద పుస్తకాలు చదివిన దానితో సమానం ఒక సత్పురుషుడితో ఓ గంట కాలక్షేపం వంద పుణ్యక్షేత్రాల సందర్శనంతో సమానం.
  • కుంభ వర్షం కురిసినా బోర్లించిన కుండలో నీరు నిలవనట్లే, ఆత్మ విశ్వాసం లేని వాడు విశ్వమంతా తిరిగినా వీసమెత్తు సాధించలేడు.
  • నీ మనసు ఒక అద్దంలాంటిది నీ అంతరాత్మ ఒక జ్యోతిలాంటిది, ఆ అద్దంలో చూసి నీ తప్పులు దిద్దుకో, ఆ జ్యోతి వెలుగులో నీ మార్గం తెలుసుకో.
  • అదే పనిగా చింతించవలదు మిత్రమా చితి – చనిపోయిన మనిషిని కాల్చి వేస్తే, చింత – బ్రతికున్న మనిషినే కాల్చి వేస్తుంది.
  • రేపు అనేది ఒక ప్రామిసరీ నోటు, నిన్న అనేది ఒక చెల్లని చెక్కు, నేడు అనేదే నీ జేబులోని రెడీ క్యాష్ సద్వినియోగం చేస్తే లభిస్తుంది శభాష్!
  • ఓ మనిషీ! పృథివి గర్వించదగిన అవతారానివి నీవు, తెలివితేటలు, శక్తియుక్తులు పుణికి పుచ్చు కొని పుట్టావు, కొండలను పిండికొట్టగలవు, నదీజలాల దారులు మళ్ళించగలవు, స్వయంకృషితో నీ జన్మభూమిని స్వర్గ – సీమగ మలచుకోలేవా?
  • దీపం మాట్లాడదు వెలుగునిస్తుంది. లైట్ హౌస్ కేక పెట్టదు దారి చూపిస్తుంది. మనసున్న మనిషి ప్రగల్భాలు పలుకడు పున్నమి వెన్నెలలా ప్రేమానురాగాలు పంచుతాడు.
  • మంచీ చెడుల కలయికయే మనిషి జీవితం మంచిని తీసుకో చెడును వదులుకో, అరటి తొక్కను తీసి లోపలి పండు తిన్నట్లు వడ్లమీది పొట్టు తీసి బియ్యం వండుకున్నట్లు.
  • సమాజంలోని మాలిన్యాన్నినిర్మూలించడానికి, నీకున్నసామర్ధ్యం చాలదని నిరాశచెందకు, కొవ్వొత్తి ఒకటి చాలు కొండంత చీకటిని పారద్రోలి, కొంత వెలుగును ప్రసాదించడానికి!
  • కాస్త స్వార్థమే లేకపోతే మనిషికి మనుగడే లేదు స్వార్థమే జీవిత పరమార్ధమైతే మనిషి లేడు – మనుగడ లేదు!
  • ఎండకు కండువా కప్పుకో, వర్షంవస్తే ఛత్రం విప్పుకో, దుష్టుడు కనిపిస్తే ప్రక్కకు తప్పుకో చివరకు నీ గమ్యం చేరుకో.
  • పొగిడేవాడిని జాగ్రత్తగా కనిపెట్టు అరనిమిషంలో అందలం ఎక్కిస్తాడు అరచేతిలో వైకుంఠం జూపిస్తాడు ఖాళీ విస్తరి మాత్రమే వడ్డిస్తాడు.

తెలుగు సూక్తులు

  • అందమైన ఆకర్షణ లెన్నో వున్న యీ ప్రపంచంలో మనకు నియమావళి అనే ఓ కళ్ళెం వుంటేనే మన జీవితం సరైన దారిలో నడుస్తుంది కళ్ళకు గంతలు కట్టిన గుఱ్రంలా.
  • క్షేత్ర మెరిగి విత్తనం వేయాలి పాత్రనెరిగి దానం చేయాలి జీతమెరిగి కోత బెట్టాలి మనిషి నెరిగి వాతపెట్టాలి.
  • పరిస్థితులు అనుకూలిస్తే పనులు అవుతాయని ఎదురు చూస్తే యీ జన్మ సరిపోదు, చుట్టూ వున్న పరిస్థితులను అనుకూలించేలా మలుచుకోగలిగితేనే నీ గొప్పతనం.
  • అధికారం, ఐశ్వర్యం అన్నీ వున్నవాడు ఏం చేసినా చెల్లుతుందనే అహంతో గుఱ్రం బదులు గాడిదనెక్కితే నడి వీధిలో నడ్డి విరిగేలా పడ్డాడట.
  • హృదయ పూర్వకంగా చేయని దానం అధికార దర్పంతో చేసిన దానం పేరు ప్రతిష్టలు ఆశించి చేసే దానం దానం కాదు – లంచంతో సమానం.
  • నీవు పెట్టిన అన్నం మూడు గంటల్లో జీర్ణమైపోతుంది నీవు చేసిన మేలు మాత్రం మూడు తరాల వరకు నిలుస్తుంది.
  • కవితకందని వస్తువు లేదు, గాయకుని కందని రాగం లేదు, మనసుకందని భావం లేదు మేధస్సుకందనిదేదీ లేదు.
  • చెప్పుల్లేవని ఏడ్చేవాడికి, కాళ్ళులేని వాడు కనిపించేవరకు, అర్ధంకాలేదట తానెంతటి అదృష్టవంతుడో!
  • మనిషికి మంచీ చెడూ అనే ఆలోచన లేకపోతే నీతి నియమం పాటించాలనే వివేకం లేకపోతే కనిపించినదంతా కావాలనే ఆశ చావకపోతే మనిషికీ – గొడ్డుకు తేడా ఏముంది?
  • చెప్పడం తేలిక – చేయడం కష్టం తప్పుల్లేకుండా చేయడం మహా కష్టం ఏమీ చేయనివాడు ఏదో ఒకటి చేసేవాణ్ణి విమర్శించడం మహా తేలిక.
  • మట్టిలో కలిసిపోయే ముందు మంచి పనులు కొన్ని చేయండి, ఒక ఇంటిలో దీపం పెట్టండి, ఒక అభాగ్యుడి జీవితంలో ఆహ్లాదం నింపండి!
  • తనకోసం బ్రతికేవాడు స్వార్ధపూరిత మనిషి భార్యా పిల్లల కొరకు బ్రతికేవాడు సాదాసీదా మనిషి పది మంది శ్రేయస్సు కోరేవాడు మంచిమనిషి సర్వజనుల శ్రేయస్సు కోరేవాడు మహా మనీషి.
  • వేయి మందిలో ఓ వీరుడు పుట్టవచ్చు, పది వేల పామరులకు ఓ పండితుడు పుట్టవచ్చు పది లక్షల మందిని పట్టి పట్టి వెదికినా, ఓ దాత దొర్కడం చాల కష్టం.

మరిన్ని సూక్తులు మీకోసం:

మానవ నేస్తాలు సూక్తులు

మానవ నేస్తాలు సూక్తులు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు, మన పెద్దవాళ్ళు తెలుగులో నేటి తరానికి అందించిన సూక్తులు మీ అందరికోసం… ఈ బ్లాగ్ లో వున్నా సూక్తులు మీ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని ఆసిస్తూ… మీ భక్తివేద్.కం.

సూక్తులు

  • లక్షణంగా పెద్ద చదువులు చదువుకోవాలన్నా సలక్షణమైన ఉద్యోగం కావాలన్నా లక్షలకు లక్షలు సంపాదించాలన్నా ఆత్మవిశ్వాసం కావాలన్నా!
  • చెప్పేవాడు చాదస్త్రం చెపుతుంటే వ్రాసేవాడు వాస్తవాలు (వ్రాయకపోతే వివేకమున్నవాడెవడూ వినడు ఇంగిత జ్ఞానమున్నవాడెవడూ చదవడు!
  • వచ్చిన కష్టం పోదని భయపడితే బండలాంటి వాడిక్కూడా గుంట జబ్బొస్తుంది వచ్చిన సమస్యకు పరిమ్మారం దొరికితే ఎంత పెద్ద జబ్బయినా పారిపోతుంది!
  • గొప్పలు చెప్పుకోడంలో లేదు ప్రగల్భాలు పలకడంలో లేదు చేసేపని ఏదైనా భ్రద్దగా చేయటంలో వుంది నీ గొప్పతనం.
  • చేయగలిగిన వృత్తి చేపట్టు ఆ వృత్తి ఏదైనా ఫర్వాలేదు చేసే పనిలో సామర్ధ్యం చూపించి నీ వృత్తికి పదినుందిలో మెప్పు తెచ్చుకో.
  • వందమష్రళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో ప్రారంభించినట్లే జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నూరు మెట్లెక్కి నీ ఆశాసౌధం చేరుకో.
  • జీవితంలో సదా ఆనందం పండాలని ఆశించే మనిషీ అది లభించలేదని నిరుత్సాహంతో కృంగి పోయే బదులు మానవజన్మ వడ్డించిన విస్తరి కాదని తెలుసుకుంటే బాగుపడతావు ఓ మనిషీ.
  • అభిమానం చూపడం తప్పుకాదు దురభిమానం పనికిరాడు ప్రేమించడం తప్పుకాదు ద్వేషిచడం పనికిరాదు.
  • సంస్కారం తెలుపునది సంస్కృతి సంస్కృతి నేర్పునది సంస్కృతం అందుకే సంస్కృతం నేర్చుకో సంస్కారవంతుడవు కా!
  • ఇహపరాల గురించిన చర్చలతో ఇందుగల డందుగలడనే దండకంతో దరిద్రనారాయణుల కడుపులు ఎలా నింపగలము?

మానవ సూక్తులు

  • ఆకలితో నకనకలాడిపోతున్నాను ఇంత అన్నం పెట్టు తల్దీ అని ఆర్ధిస్తే రేపురా బాబూ పరమాన్నం పెడ్డాను అన్నదట ఓ పుణ్యా్మురాలు !
  • కష్టం చేయకుండా క్రమశిక్షణ లేకుండా ప్రపంచంలో ఏది సాధించాలన్నా కష్టమే ధనలక్ష్మి కావాలన్నా, జయలక్ష్మి కావాలన్నా కార్యోన్ముఖుడవై కర్తవ్య పాలన చేయాలన్నా.
  • పది ఇస్తే పరమ మిత్రుడు వంద ఇస్తే పరము పూజ్యుడు వేయి అడిగినపుడు ఇవ్వలేకపోతే ఆ పరమ పూజ్యుదే పరమ – దుర్మార్లుడు.
  • మనిషి మనస్సు మహావిచిత్రమైనది అన్నీ అనుభవించి తీరాలంటుంది కానీ దీనికో అద్భుతప్పున గుణమున్నది ఏది అలవాటుబేస్తే అదే కావాలంటుంది.
  • హంగామా చేస్తే పని అవుతుందనుకుంటాం బెదిరిస్తే ఎదుటివాడు పారిపోతాడనుకుంటాం కోర్టుకెక్కితే న్యాయం జరుగుతుందనుకుంటాం చివరకు అప్పులపాలై అన్నీ పోగొట్టుకుంటాం.
  • ఒక దినం పెళ్ళికొరకు సంవత్సరం పొడుగునా హడావిడి చేసినట్ల జీవితమంతా నానా హంగమా చేస్తున్నాం ఒక దినం ప్రాణం వదలిపోవడానికి !
  • లోభిని చూసీ డబ్బు నవ్వుతుంది భోగిని చూస్ ఇంద్రియములు నవ్వుచున్నవి క్షణికమైన శరీరమును చూసుకొని మురిసే మూర్షున్ని చూసీ మృత్యువు నవ్వుచున్నది.
  • బియ్యంలో కల్తీ నెయ్యిలో కల్తీ ఉప్పులో కల్తీ పప్పులో కల్తీ ప్రాణదానం చేసే మందులో కల్తీ అసలు వీళ్ళ బ్రతుకులే కల్తీ.
  • కల్తీ కల్తీ ఎటు చూసినా కల్తీయే కల్తీలేని-నికార సైనదొక్కటే స్వార్థం – స్వార్థం.
  • నేను – నా ఇల్లు నా ఆస్తి – నా పిల్లలు అనే మత్తు అంతా ఒక్కసారే దిగిపోతుంది ఆ మృత్యుదేవత పిలుపు రాగానే!
  • ఇంటి ఇల్లాలుకు ఆభరణాలపై మోజు యజమానికి క్లబ్బులో పేకాట మోజు పిల్లకు సినిమాలు, టీవీలపై మోజు ఈ మోజులతో ఆ సంసారం ఈ బాగుపడేదేరోజు?
  • నదిలో కొట్టుకుపోతున్న వాడొకడు తదేక దీక్షతో దేవున్ని ప్రార్థిస్తూ ఆ ప్రక్కనే వెళ్ళే పడవను పట్టించుకోక ప్రాణాలు పోగొట్టుకున్నాడు స్వర్గాని కెళ్ళాక ‘నిన్ను నమ్ముకుంటే నన్ను నట్టేట ముంచావేమి స్వామీ’ అని అడిగితే పంపించిన పడవను కాదని కళ్ళు మూసుకుని జపం చేసుకునేంత మూర్ఖుడవనుకోలేదు భక్తా అన్నాడట ఆ దేవుడు.
  • చిన్న పిల్లాడిని వూరికే కొట్టొద్దురా అన్నాడట తండ్రి తన కొడుకుతో నా బిడ్డను హద్దులో పెట్టుకునే హక్కు నాకు లేదా అన్నాడట కొడుకు తండ్రితో నా కొడుకును హద్దులో పెట్టే హక్కు నాకు లేకుండా పోయిందన్నాడట ఆ తండ్రి ఆ వేదనతో.
  • ఎన్నిరోజుల నుంచి త్రాగుతున్నాను ఎన్ని సీసాలు ఖాళీ చేశాను నా పిచ్చి కానీ త్రాగితే పోయేదా ఈ మనోవ్యధ?
  • ఎందుకు బాబూ నన్ను అంతగా దూషిస్తున్నావు నాకు తెలిసి నీకెప్పుడూ సాయం చేసినట్టు లేదే!

మరిన్ని సూక్తులు మీకోసం:

Kavachalu – కవచాలు

Kavachalu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాస అన్ని కలిగి స్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించిన చో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… కవచముల గురించి క్లూప్తం గా ఈ క్రింద ఇచ్చిన లింకుల నందు ఇవ్వబడినది. అవి ఏమిటో తెలుసుకుందాం…

Kavachalu – కవచాలు

Kapotha Kapothi Katha In Telugu – కపోత కపోతి కథ

Kapotha Kapotha Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కపోత కపోతి కథ.

కపోత కపోతి కథ

అడవిలో వేటకోసం వెళ్ళిన ఓ బోయవాడు కుండపోతగా వర్షం పడటంతో ఓ చెట్టు నీడలో ఆశ్రయం తీసుకున్నాడు. ఆ చెట్టు మీద ఓ పావురాల జంట కాపురముంటున్నాయి. ప్రొద్దుననగా వెళ్ళిన కపోతి తిరిగి రాకపోవడంతో ఎంతో దిగులుగా ఉన్నది కపోతం. ఆ పావురం అలసి ఉన్న బోయవాడిని చూసింది. పక్కనే ఉన్న వలను వేట సామాను చూసి భయపడింది. “ఎప్పుడో ప్రొద్దుననగా వెళ్ళింది. ఎక్కడున్నదో ఎలాగున్నదో? నా ప్రాణేశ్వరికి ఎట్టి ఆపద సంభవించలేదు కదా? అది లేని నా జీవనం శూన్యం శోకమయం. నా హృదయేశ్వరి ఏ బోయవాడి చేతులోనో చిక్కలేదు. కదా” అని బాధపడింది. ఇంతలో వాన తగ్గుముఖం పట్టిందికానీ చలి మృత్యుదేవతలా ఆ వనాన్ని కబళించింది. పావురం యొక్క శోకం విని ఆడ పావురం “ఇక్కడ ఈ బోయవాడి వలలో ఉన్నాను ప్రాణనాథ”! అని అన్నది. “హతవిధి! ఈ వలలో చిక్కుకున్నావా” అని బిగ్గరగా ఏడ్వసాగింది. మగ పాపురం.

“శరీరాలు శాశ్వతాలు కావు. మంచి ఒక్కటే మిగిలివుండేది. ఎల్లప్పుడూ మనకు తోడు పుండేదదే. ఆర్హుడైనవాని శరణుజొచ్చిన వాని కాపాడటం కంటే గొప్ప ధర్మం లేదని పెద్దలంటారు. పాపం! ఈ బోయవాడు ఆర్హుడై మన గూటి దగ్గరకు వచ్చాడు. నా గురించి విచారణ మాని అతిథి ఐన ఈతని సంగతి చూడు” మని ఆడ పావురం అమృత వాక్యాలు పలికింది.

వెంటనే ఆ బోయవాని ముందు నిలిచి ఆ కపోతశ్రేష్ఠుడిలా అన్నాడు “అయ్యా! నీవు బాగా అలసినట్టున్నావు. నేనేమి సేవ చేయగలనో చెప్పండి”. బోయవాడు “ఓ పావురమా! నీవెంత దయగలదానవు! చలితో నా శరీరం గడ్డకట్టుకు పోతున్నట్టుంది. ఈ చలినుండి నన్ను కాపాడు” అన్నాడు. పావురం వెంటనే గూటిలో దాచుకున్న ఎండు పుల్లలు తెచ్చి చలిమంట చేసింది. ఆ పావురం చేసిన సహాయానికెంతో సంతోషించి ఆ బోయవాడు చలి కాచుకున్నాడు. చలి తగ్గిన బోయవాడు “గువ్వా! ఎంతో ఆకలిగా వుంది” అన్నాడు. కొంతసేపాలోచించి “అయ్యా! పక్షుల దగ్గర దాచిపెట్టుకునే ఆహారం ఉండదుకదా. “పరోపకారార్థం ఇదం శరీరం” అని మా పెద్దలు చెప్పారు. నా శరీరాన్ని తప్ప నేనేదీ ఇవ్వలేను. దీన్ని తీసుకుని మీ క్షుద్బాధ తీర్చుకోండి” అని బోయవాడు ఆశ్చర్యపోయి చూస్తుండగా ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అందులో దూకింది పావురము.

ఆ దృశ్యం చూసి బోయవాడికి జ్ఞానోదయం అయ్యింది. “ఆహా! ఈ పావురము ఎంత గొప్పది! నా ఆకలి తీర్చుటకు తన శరీరాన్ని భార్యాపిల్లల్ని ప్రలోభాన్ని విడిచి శరీరం తృణప్రాయంగా ఎంచి ఆహుతిచ్చింది. ఏమి త్యాగం! ఏమి దయ! రూపంలో చిన్నదే ఐనా గుణంలో మేటిది. ఇక నేను హింస చేయను. మోహం విడుస్తాను” అని అనుకున్నాడు. వలలోని పక్షులన్నిటినీ విడిచి పెట్టాడు. వెంటనే అగ్ని దగ్గరకు వెళ్ళి ఆ ఆడ పావురం ఇలా ఏడ్చింది “నీవు లేనిది క్షణమైనా మనజాలను. నాకెవరు దిక్కు? బ్రతుకులోను మరణంలోను నీతోనే ఉంటాను”. అగ్ని ప్రదక్షిణం చేసి శరీరత్యాగం చేసింది ఆ కపోతి. ఇంతలో ఓ దివ్య విమానము వచ్చి ఆ పావురాల జంటను ఊర్ధ్వలోకాలకు తీసుకొని వెళ్ళడం పూర్వ జన్మసుకృతం వలన ఆ బోయవాడు చూడగలిగాడు. కడకు అతడూ దివ్యత్వం పొందాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

దయ కరుణ పరోపకారం త్యాగం అనే పదాలకు నిర్వచనం చెప్పాయి పావురాలు. తనకు హాని చేసిన వేటగాడి సైతం కాపాడమని “అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడె ధన్యుడు సుమతీ” అని హితబోధ చేసింది. ఆకలిగొన్న వాడికి తన శరీరాన్నే ఆహారంగా సమర్పించిన పావురం యొక్క త్యాగం అద్వితీయం.

మరిన్ని నీతికథలు మీకోసం:

Raghumaharaju Kautsudu In Telugu | రఘుమహారాజు – కౌత్సుడు

raghumaharaju-kautsudu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… రఘుమహారాజు – కౌత్సుడు నీతికథ.

రఘుమహారాజు – కౌత్సుడు

పూర్వం శ్రీ రామ చంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించుచుండెడివాడు. ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొక్క గురుకులంలో 1000 తక్కువ కాకుండా శిష్యులుండే వారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. వరతంతుడనే ముని యొక్క గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు “నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. స్వాధ్యాయం (శాస్త్ర పఠనం మొదలైనవి) ఎప్పటికీ మఱువకు” అని అన్నారు.

శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు “అయ్యా! నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుడిని చేశారు. తల్లిదండ్రులను మఱిపించే ప్రేమాభిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి”. “నిరువేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనా” అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు. ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు “నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము”.

గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌత్సునికి. రాజు తండ్రివంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు. అంతకు ముందు రోజే రఘుమహారాజు విశ్వజిత్ అనే మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం దానం చేశాడు! కౌత్సుడొచ్చేసరికి రఘుమహారాజు మట్టిపాత్రలలో పూలు పెట్టుకుని దైవపూజ చేస్తున్నాడు. రఘుమహారాజు దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు. కౌత్సుని చూచి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు. “రాజా! అది కష్టములే. నేను వెళతాను” అంటూ వెళిపోతున్న కౌత్సుని పిలిచి రాజు “వట్టి చేతులతో వెను తిరిగి పోవటమా! సంశయించక అడుగు నాయనా” అని అన్నాడు. వచ్చిన పని చెప్పి తలదించుకుని నిలుచున్నాడు కౌత్సుడు. “జేపు ప్రొద్దున్న రా. నీవు కోరిన ధనం ఇస్తా” అని చెప్పి పంపాడు రఘుమహారాజు.

పురత: (అందరికంటే ముందుగా) హితం చేసే వాడు పురోహితుడని ఎఱిగిన రఘుమహారాజు తన గురువైన వసిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి సమస్యను వివరించాడు. మహాజ్ఞాని అయిన వసిష్ఠుడు “రాజా! నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధిలేదు. ఇంద్రునిపై దండెత్తు” అని హితం చెప్పాడు. విజయ భేరీలు మ్రోగాయి. ఆ భీకర భేరీనినాదాలు వజ్ర చెవులకు వినిపించాయి. రఘుమహారాజు రాజ్యంనుంచి వస్తున్నాయని తెలుసుకొని దేవేంద్రుడు “ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు. ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమని” ఆజ్ఞాపించాడు. రాచబంట్లు కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు. దండయాత్రకు స్వస్తిచెప్పి కౌత్సుడు రాగానే “మీ ధనం కోశాగారాల్లో ఉంది. తీసుకు వెళ్ళండి” అన్నాడు.

తను అడిగినదానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు “రాజా! నాకు కావలసినవి 14 రాశులే. మిగతా ధనం నాది కాదు” అని వెళ్ళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు. “మరి ఈ ధనమెవరిది?” అని రఘుమహారాజు మిగిలినదంతా దేవేంద్రునికి పంపివేశాడు! అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది. ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలూ నేర్పే గురువులు గురుపుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియ చేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం.
  2. రఘుమహారాజు యొక్క దానగుణం ఈ కథలో వ్యక్తమైంది. ఆతడు సంపాదించినదంతా దానం చేసేవాడు. దానం చేయటానికి మళ్ళీ సంపాదించేవాడు.
  3. కౌత్సుడియొక్క రఘుమహారాజుయొక్క నిజాయితీ శ్లాఘనీయం. ధర్మపరంగా వారికెంతకావాలో అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Satyasandhah In Telugu – సత్యసంధః

satyasandhah

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే…సత్యసంధః నీతికథ.

సత్యసంధః

మునివేష ధారులైన శ్రీరామ సీతా లక్ష్మణులు శరభంగముని ఆశ్రమము చేరిరి. శ్రీ రాముని కమనీయ దివ్యమంగళ స్వరూపమును చూచుచూ శరభంగుడు శరీర త్యాగము చేసి విష్ణుపదమును చేరెను. అనంతరము దండకారణ్యములో నివసించు మునీశ్వరులందరూ శ్రీ రామ చంద్రుని దర్శనార్థం శరభంగ ముని ఆశ్రమమునకు వచ్చినారు.

ఆ మునీంద్రులను చూచి మాయామానుష రూపుడైన శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతంగా వారందఱికి సాష్టాంగ ప్రణామములు చేసెను. ఆ మునులు సర్వజ్ఞుడైన శ్రీ రామస్వామిని స్తుతించి సమస్త ముని ఆశ్రములు చూచి వారిని అనుగ్రహించమని కోరిరి. మునీంద్రుల వెంట సీతారామలక్ష్మణులు తపోవనములను చూచుటకు బయలుదేరిరి. ఆ ప్రదేశములలో చాలా చోట్ల పుజ్జెలు ఎముకల గుట్టలు కానవచ్చెను. “పవిత్రమైన ఈ తపోభూములలో ఈ అస్థికలు ఎలా వచ్చాయి”? అని ప్రశ్నించాడు స్వామి. వారు “సర్వేశ్వరా! సమాధిస్థితిలో ఉన్న మునీశ్వరులను దుష్టులైన రాక్షసులు తనివేయగా మిగిలిన ఎముకలివి” అని తమ దైన్యత వ్యక్తపఱచినారు. కళ్ళు చెమ్మగిల్లిన స్వామి “ఈ దండకారణ్యమును రాక్షసులనుండి విముక్తము చేసెదను” అని ప్రతిజ్ఞ చేసెను. పరమానందముతో మునులు ధర్మస్థాపకుడైన శ్రీ రామునికి జయ జయ ధ్వానాలు చేసినారు.

సీతారామలక్ష్మణులు అగస్త్యమునిని సేవించి సుతీక్షుని వద్ద నెలవు తీసుకుని పంచవటికి వస్తుండగా పరమ సాధ్వీమణి లోకమాత జానకీ ఈ విధముగా భర్తతో మధుర సంభాషణము చేసినది “ప్రాణనాథా! ధర్మవర్తనము అతి సూక్షమైన పద్ధతిని అవలంభించవలెను. ఎవడైతే ప్రలోభాలకు వ్యసనాలకూ దూరముగా ఉంటాడో వాడే సర్వదా ధర్మపరుడై ఉండగలడు. మనము ప్రస్తుతము మునివేషములలో ఉన్నాము. తపము ఆచరించుట మన కర్తవ్యం. తపస్సునకు శాంతి పునాది. అయిననూ మనము ధనుర్బాణములు ఏల ధరించి రాక్షసులను సంహరించుచున్నాము?”. రాక్షసులతో ప్రత్యక్షముగా వైరము లేకుండానే మునులను రక్షించుట అనే “వ్యసనంతో” రాక్షసులను సంహరించుట తనకు ఇష్టములేద న్నట్టు సూచిస్తూ ఆ పతివ్రతాశిరోమణి శ్రీ రామునకు ఈ నీతికథ చెప్పినది.

“పూర్వం ఒక మునివల్లభుడు ప్రశాంతమైన ఓ ఆశ్రమములో తపమాచరిస్తూ ఉండేవాడు. అతడు సత్యవాది. ఆయన సత్యప్రభావముచే జంతువులు కూడా సహజ వైషమ్యాలను మఱచి హాయిగా సహజీవనం చేసేవి. అలా ఉండగా దేవేంద్రుడు అతని పరీక్షించుటకై భటుని వేషంలో పచ్చి “స్వామీ! ఈ కత్తిని మీ వద్ద భద్రంగా ఉంచండి. మళ్ళీ వచ్చి నేను తీసుకుంటాను” అని అన్నాడు. బ్రాహ్మణుడు ఆయుధములు పట్టరాదని శాస్త్రము. ఎంతో కాలము ఆ ఆయుధం సమీపంలో ఉన్న కారణముగా ఆ మునిలో క్రూర లక్షణాలు బైటపడ్డాయి! ఆయుధం దగ్గర ఉండుటచే ఆ ముని తన కర్తవ్యాన్ని విస్మరించి హింసమీద అభిరుచి కలిగినవాడై కూర కృత్యాలుచేసి చివరికి ఘోర నరకమును పొందినాడు. తపస్సు చేసే మనమెక్కడ? దుష్టసంహారం చేసే క్షత్రియ ధర్మమెక్కడ? స్వామీ! చపల బుద్ధితో నాకు తెలిసినది చెప్పాను. నీవు సత్యసంధుడవు. ఏది సత్యమో ఏది అసత్యమో నీవే నిర్ణయించు” అని అనిన జానకితో శ్రీ రాముడిలా ఉన్నాడు.

“దండకారణ్యము లోని మునులు నిరాడంబరముగా తపస్సు చేయుచుండగా మాంసభక్షకులైన రాక్షసులు వారిని భక్షిస్తున్నారు. ఈ మునీశ్వరులు ఆ మదాంధులకు శాపం ఇచ్చుటకు సమర్థులై కూడా శాపం ఇవ్వలేదు. వారిని చంపినా కూడా కోపము తెచ్చుకోకుండా పరమశాంత చిత్తంతో తపమాచరిస్తున్నారు. దీనులై నన్ను ఆశ్రయించినప్పుడు రాక్షస సంహారము చేసెదనని ప్రతిజ్ఞ చేసినాను. అసలు ఆ యోగులు అడిగేవరకూ నేను ఆగనక్కరలేదు. ఎందుకంటే నా తండ్రిగారు భరతునకు నగర రాజ్యము నాకు వనరాజ్యము ప్రసాదిస్తున్నానని స్పష్టముగా చెప్పిరి. కావున తపముచేసినా దుష్టులను శిక్షించటం ఆర్తులను రక్షించటం వనరాజుగా నా కర్తవ్యం.

సీతా! నేను నా ప్రాణాలనైనా వదులుతా. నా ప్రియభాత అయిన లక్షణునైనా విడనాడుతాను. చివరకు నా హృదయేశ్వరివైన నిన్నైనా వదులుతాను కానీ సత్యమును మాత్రమూ ఎన్నడునూ వీడజాలను! అందునా ఇట్టి తాపసులకు ఇచ్చిన ప్రతిజ్ఞ ఎప్పటికీ విడువలేను”. ఇలా అద్భుతంగా సంభాషణము చేసి సుందరములైన వనభూముల వైపు నడువసాగారు. ఇట్టి సత్యసంధుడైన శ్రీ రాముని పాద స్పర్శ పొందిన ఈ భారతభూమి ధన్యం. భారతీయులు ధన్యులు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. వ్యాస భగవానుడు చెప్పినట్టు సత్యం ఈ 13 విధాలైనది: నిష్పక్షపాతం ఆత్మనిగ్రహం అణకువ సిగ్గు ఓరిమి తాలిమి సంయమం దయ అహింస అనసూయత త్యాగం చింతన శీలసంపద. ఇన్ని విషయాలను సమగ్రంగా ఆలోచించి వీటిని అనుసంధానము చేసుకుని ఎల్లవేళలా సత్యమే ఆచరించినాడు శ్రీ రాముడు. ధర్మసమ్మతమైన ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను కాపాడటానికి ఏమైనా వదులుతాను కానీ సత్యాన్ని మాత్రము విడువనని అన్నాడు.
  2. మంచైనా చెడైనా చాలాకాలం సహవాసం చేస్తే ఆ గుణాలకు దెగ్గరవుతాయనే నీతికథను మనకు సీతమ్మ చెప్పినది. అందుకే మన పెద్దలు సత్సంగత్యమే చేయమని అంటారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Vrathalu – వ్రతాలు

Vrathalu

వ్రతములు మనస్సును ఆరోగ్యకరముగా, ధర్మప్రియముగా, సామాజిక సహజముగా నిర్వహించే మార్గములు. ఇవి ఆత్మశుద్ధి, మానసిక శాంతి, అంతర్ముఖ సౌమ్యత, సమాజ భద్రత మరియు భగవద్భక్తిని ఉన్నతముగా చేస్తాయి. వ్రతములు మన జీవితాన్ని సరళముగా, సాధారణముగా మరియు మొండిగా ఉంచుతాయి. వ్రతములు మనస్సును ద్యానంలో, ధర్మపథములో, సంయవనంలో ఉంచుతాయి.

ఇవి మన జీవితంలో నేర్పించిన ప్రతీ అదృష్టం ఒక అత్యంత ప్రాముఖ్యత మరియు అద్భుతమైన మూలకము. వ్రతములు మన మనసును సరళముగా మరియు శుద్ధిగా చేస్తాయి, మన సమాజానికి కల్యాణం, సమృద్ధి, శాంతి మరియు సౌమ్యతను అందిస్తాయి. ఏ ఏ వ్రతాలు చేస్తే ఏమి ఫలితం వస్తుంది ఈ క్రింది లింకులను అనుసరించండి.

Vrathalu – వ్రతాలు