ఈ వెన్నలు దొంగిలించే గొల్లపిల్లవాడు ఆ తిరుమలేశుడా!! రెండు మద్ది చెట్లను ఇతడు వుద్ధతితో తోసినాడు అంటున్నారు అన్నమయ్య. ఈ కీర్తనలో వాడిన భాష తెలుగునుడికారములతో బహు పసందుగా వుంది. ఈయన కంసుని పుట్టచెండుసేసినాడు అంటున్నారు. అంటే బంతిలా ఆడుకొన్నాడన్నమాట. అదేవిధంగా “కోటికి బడెగె గాను కొండయెత్తెను” అంటే జగత్ప్రసిద్ధుడై గోవర్ధనము అనే కొండను యెత్తినాడు అని అర్థం చెప్పుకోవాలి. ముగురు వేల్పులకు మూలభూతి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలకారణమైన పరమపురుషుడు ఈ బాలుడు అని | కీర్తిస్తున్నారు. ఇప్పుడాయన యెత్తినది రామకృష్ణావతారమట. అంటే?
భావ వివరణ:
ఆహా! యేమిటీవింత!! అతడు (ఆదిదేవుడైన పరమాత్మ) ఇతడా (ఈ బాలుడా). వీడు వెన్నలనన్నింటినీ రేపల్లెలో దొంగిలించినాడు. ఏతులకు (ఉద్ధతితో) తమ పెరటిలో బహుకాలమునుంచివున్న రెండు మద్ది చెట్లను ఇల తోసినాడు (నేలపై పడతోసినాడు).
ఈతడు ఆ దేవకీదేవి గర్భవాసము నుండి జన్మించిన ఇంద్రనీల మాణిక్యము. మానవకాంతగా వచ్చిన పూతన అనే రాక్షసి చనుబ్రాలు తాగి పొదలినాడు (వర్ధిల్లినాడు). ఈతడు ఆ వసుదేవుని ఇంట వెలసిన నిధానము (పాతర వంటి నిధి). తన మేనమామయైన కంసుని చేతనే (ప్రాణాలతో) పుట్టచెండుసేసినాడు (బంతి ఆట ఆడుకొన్నాడు).
ఈ బాలుడే పెరిగి పెద్దవాడై పాండవుల తల్లి గొంతిదేవికి (కుంతీదేవికి) మేనల్లుడై అత్తా అనిపిలిచి ఆమెకు అభయమొసగినాడు. ఇతడే “కోటికిన్ |పడెగెగాను కొండయెత్తెను” (జగత్ ప్రసిద్ధమైన గోవర్ధనపర్వతమును యెత్తి | తన చిటికిన వ్రేలిపై నిలబెట్టాడు). పాటించి (ఆదరించి) పెంచిన తల్లి యశోదాదేవికి ఇతడు భాగ్యమై, మరు జన్మలో కూడా వకుళాదేవియైన ఆమెకు బిడ్డ శ్రీనివాసుడై అమ్మా అని పిలిచాడు. గోపికలను వాటమై (మరిగి) వలపించుకొనినాడు.
ఈతడు, ఆ ముగ్గురు వేలుపులకు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, | మహేశ్వరులకు) మూలభూతి మాలకారణమైన పరమపురుషుడు. అయినా జిగి (వెలుగులు జిమ్మి) ఆవులను పెయ్యలను కాచినాడు. మిగుల (అధికుడై మిగిలిపోయి) శ్రీవేంకటాద్రిపైని వేంకటేశ్వరుడు కూడా ఇతడేనా? అవునయ్యా! నిజము. ఇప్పుడు బలరామకృష్ణుల అవతారమెత్తిన ఈ బాలుడే ఆ పరమాత్మ.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీ గర్గభాగవతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీకృష్ణ లీలలు – వత్సాసుర భంజనమ్ కథ.
శ్రీకృష్ణ లీలలు – వత్సాసుర భంజనమ్
బలరామకృష్ణులకు గోవులనుగాచే వయస్సు వచ్చినది. నీలాంబరధారి అయిన బలరాముడు పీతాంబరధారి అయిన శ్రీకృష్ణుడు గోవులను చక్కగా అలంకరించి గోపాలురతో కలిసి పచ్చిక బయళ్ళలో విహరించుచుండేవారు. కాళిందీనదీ తీరము వారికి ప్రియమైన విహారస్థలమయ్యెను. తన మధుర వేణుగానముతో పరమాత్మ జీవులకు సామవేద సారాన్ని బోధించేవాడు. బ్రహ్మానందముతో గోవులు గోపబాలురు పశుపక్షాదులు ఆ వేదవేద్యుని వేణుగానం వినుచుండెడివి. శ్రీకృష్ణుడు గోపాలురు ఎన్నో ఆటాలాడేవారు. వారు పక్షులనీడలలో పఱుగులెట్టేవారు. నెమళ్ళ లేళ్ళ గుంపుల వెంటబడేవారు. కోతికొమ్మంచులు బిళ్ళంగోళ్ళు ఆడేవారు. యమునా నదిలో జలకాలాడేవారు.
ఒకసారి వారు వివిధ జంతువులను అనుకరిస్తూ ఆడుచుండగా కంసప్రేరితుడైన వత్సాసురుడు వచ్చి శ్రీకృష్ణుని ఆలమందలో కలిసి పోయాడు. సర్వజ్ఞుడైన స్వామి అదిగమనించాడు. మెల్లమెల్లగా వచ్చి ఆ వత్సాసురుడు పరమాత్మను తన్నాడు. నందకిశోరుడు వాడి కాళ్ళు పట్టుకొని గిరగిరా త్రిప్పి వెలగచెట్టుకేసి కొట్టాటు. మృతినొందిన ఆ వత్సాసురుడి నుంచి తేజము బయటికి వచ్చి పరమాత్మలో కలిసిపోయింది.
Vatsasura Bhanjanam Story In English
వత్సాసురుని వృత్తాంతము:
మురాసురుడనే రాక్షసుని కుమారుడు ప్రమీలుడు. వాడు దురాశకులోనై కపటవిప్రవేషం ధరించి సర్వాభీష్టఫలదాయిని అయిన నందినీధేనువును తనకు దానమిమ్మని వసిష్ఠుని కోరినాడు. నందినీధేనువు వాడి కుటిలత్వం గ్రహించి అసురస్వభావము గల లేగదూడవు కమ్మని శపించింది. పశ్చాత్తాపముతో శరణువేడిన ప్రమీలుని కరుణించి ఆ నందిని “చేసిన పాపమునకు ఫలమనుభవించక తప్పదు. పాపము తీరిన తరువాత నా అనుగ్రహము వలన నీవు పరమాత్మ చేతిలో మరణిస్తావు. అలా ముక్తిని పొందుతావు” అని ఆశీర్వదించింది.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం
కుటిలత్వము ఉండరాదని మనకీ కథ ద్వారా తెలిసినది. కపటవేషము వేసి మోసగించబోయిన ప్రమీలుని శపించినది నందినీధేనువు. కావున ఇతరుల నెన్నడూ మోసం చేయరాదు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీ గర్గభాగవతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీకృష్ణ లీలలు – తృణావర్త భంజనమ్ కథ.
శ్రీకృష్ణ లీలలు – తృణావర్త భంజనమ్
ముద్దుకృష్ణుని ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆడించుచున్నది మహాభాగ్యశాలి అయిన యశోదాదేవి. అప్పుడు తృణావర్తుడనే రక్కసుడు పెద్ద సుడిగాలి రూపములో అక్కడికి వచ్చెను. కొండంత బరువెక్కిన తయుని భారము భరించలేక యశోద శ్రీకృష్ణుని నేలపైకి దించెను. జంతువులు ప్రజలు ఇంటిపైకప్పులు సైతం ఆ పెనుగాలికి ఎగురదొడగెను. ధూళి రేగగా శ్రీకృష్ణుడు యశోదకు గోపికలకు కనబడలేదు. ఆందోళనతో వారు ఆ పరమాత్ముని వెదుకసాగిరి.
చిన్నికృష్ణుడు తృణావర్తుని వెంట మింటికెగసి ఆతని వీపుపైకి ఎక్కెను. అండపిండవేదోండ సహతులను గుప్తగతి బొజ్జలో ఉంచుకొన్న స్వామి భారము మోయలేక ఆతని క్రిందికి వసరికొట్టబోయెను తృణావర్తుడు. పాపం పండిన దానవుని గొంతునులిమి శ్రీకాంతుడు భూభారము దించెను.
నేలగూలి ప్రాణములువిడిచిన అసురుని శరీరముపై ఏమీ ఎఱగనట్టు ఆడుకుంటున్న బాలకృష్ణుని చూసి బాలకుడు క్షేమముగా ఉన్నాడని సంతోషించి యశోద శ్రీకృష్ణుని ముద్దాడి దిష్టి తీసి వేదాశీర్వచనము చేయించెను. ఎన్నో గో భూదానములు పండిత మండలికి ఇప్పించెను.
తృణావర్తుని వృత్తాంతము
పూర్వం పాండుదేశమును సహస్రాక్షుడను మహారాజు పరిపాలించుచుండెడివాడు. ఆతుడు మిక్కిలి భగవద్భక్తుడే కాని స్త్రీలోలుడు. సీతమ్మ చెప్పినట్టు (సత్యసంధః కథ చూడండి) ఎవడైతే వ్యసనాలకు దూరముగా ఉంటాడో వాడే ధర్మమార్గాన నడువగలడు. కామాంధుడైన ఆ సహస్రాక్షుడు దూర్వాసమహర్షి వచ్చాడని ఎఱిగియూ ఆతనికి నమస్కరించలేదు. వ్యసనపరుడై పూజ్యపూజావ్యతిక్రమ దోషము చేసిన సహస్రాక్షుని రాక్షసుడివి కమ్మని ఆ మహర్షి శపించెను. తన తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తముతో శరణువేడిన ఆ సహస్రాక్షుని మహర్షి మన్నించి “రాజా! ఈ దుష్కార్యమునకు ఫలితమనుభవింపక తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థము కదా! కానీ భక్తుడవైన నీకు పరమాత్ముడైన శ్రీకృష్ణుని పాదస్పర్శచే కైవల్యము ప్రాప్తించును” అని ఆశీర్వదించెను. ఆ సహస్రాక్షుడే తృణావర్తుడు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం
మానవుడు అన్ని వ్యసనములనుండి ఎల్లవేళలా దూరముగా ఉండవలెను. పరమ భక్తుడైనా ఒక్క స్త్రీలోలత్వం అనే వ్యసనము వలన దుష్కర్మ చేసి శాపగ్రస్తుడైనాడు సహస్రాక్షుడు.
మాడుకూరు అనే గ్రామములో వెలసిన మాధవరాయనిపై సరస శృంగార కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. ఈయన మంచివాడే, కాని మంచుమాయగాడట. మంచువలె చల్లనైనవాడే కాని మాయగాడట. నాయిక మానమునంటి వేడుకొంటాడట. ఇక మౌనంగావుండటం ఆవిడవల్ల యేమవుతుంది చెప్పండి. మహానుభావా! నేను మగని చాటు ‘మగనాలి’ నన్నా వినిపించుకోడట. నేను ‘ఓపను’ అన్నాకూడా వదలడట. శ్రీవేంకటాద్రిపై కూడా ‘యెమ్మెలు’ చూపిస్తున్నావా నామీద అంటున్నారు. కొంచెం తికమకపెట్టే కీర్తనే ఇది. శృంగార భక్తిని రుచి చూడండి.
భావ వివరణ:
ఓ మాధవరాయా! నీవు మంచివాడవు. అంతే… నేను నీకు నిజమే చెబుతున్నాను. మాడుకూరిలో వెలసిన మాధవరాయా! నీవు చల్లే మాయలు మంచు మాయలు. మంచు అస్థిత్వమువలె, నీ వలపు మాయ నీ అస్థిరమైనది.
మోనాన వుండి నన్ను (నేను మౌనంగా వుంటే) ముట్టి వేడుకొంటావు (నన్ను తాకుతూ బ్రతిమిలాడతావు) నా మానము నంటి మరీ మాటలు కలుపుతావు. నేను నీయెదుటకు వచ్చి నా మౌనం వదలి నీతో యెదురుమాట్లాడేదాకా, మానవుగా (వదలిపెట్టవు కదా!) ఓ మాడుకూరి మాధవరాయా! నీతో వేగటం కష్టమే స్వామీ!
ఎగసక్కెములు (పరాచికాలు ఆడుకొంటూ మా ఇంట్లో దూరుతావు. నేను మగనాలిని (మగనిచాటు పెళ్ళాన్ని) అన్నా నన్ను విడిచిపెట్టవు. బగివాయక కూర్చుండి (నాపక్కనే కూర్చుండి) తొడపై చేతులు వేస్తావు. ఇదేమి అఘాయిత్యము? నేనేమి నీ మగువనా? (పెండ్లామునా? ఓ మాడుకూరి మాధవరాయా! ఇదేమన్నా మర్యాదగా వున్నదా ప్రభూ!
స్వామీ! నీ చిలిపి చేష్టలకు నేను ఓపను (తాళను) అన్నా, నన్ను పోనియవు. ఒడిసిపట్టి ఆక్రమింతువు. మాపుదాకా (చీకటిపడేదాకా చీకాకు పెడతావు). ఇట్లా అయితే యెట్లు ముడిపడుతుంది? కోపుగా (అందముగా) శ్రీవేంకటాద్రిమీద కూడి నీవే వేంకటేశ్వరుడవై నీ యెమ్మెలు (వన్నెలు) మాపైన చూపిస్తున్నావా? ఓ మాడుకూరి మాధవరాయా! మేము చరితార్థులమైనాము ప్రభూ!
నీతికథలు మానవత్వంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తాయి . వివేకం, సహనం, ధైర్యం, సంపత్తి, ముక్కువ, ప్రేమ, సహానుభూతి, ధర్మం మరియు సంయమనం వంటి గుణాలు నీతికథలు అభివృద్ధి చేస్తాయి. అవి మన జీవనాన్ని ఆధరపరచి, మానవత్వాన్ని ఉన్నతముగా చేస్తాయి. నీతికథలు నేరుగా చాలా మంది మనుషులు మీదుగా ప్రభావితం అవుతున్నారు. నీతికథలు అనేవి సమాజాన్ని సమృద్ధం చేస్తాయి, అంతర్ముఖతను అభివృద్ధి చేస్తాయి మరియు సామాజిక సంగతులను ప్రేమ, సహనం, సహానభూతి, మరియు సంక్షేమంతో ప్రభావితం చేస్తాయి. నీతికథలు, మానవాళికి ఎలా నడుచుకోవాలి అనే మార్గాన్ని నిర్దేశిస్తుంటాయి. నీతి కథలలోని సారాంశాన్ని అర్ధం చేసుకొని వాటిని ఆచరింపబడడం వలన జీవితంలో సుఖసంతోషాలు వెళ్లి విరుస్తాయి. మొదలగు నీతి కథలు కోసం ఈ క్రింది లింకులు ద్వారా తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీ గర్గభాగవతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీకృష్ణ లీలలు – శకటాసుర భంజనమ్ కథ.
శ్రీకృష్ణ లీలలు – శకటాసుర భంజనమ్
“ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమబలలారా వీనులలర
మన యశోద చిన్ని మగవాని గనెనట చూచివత్తమమ్మ సుదతులారా”
అంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ వ్రజభామలందఱూ చిన్ని కృష్ణుని చూడ వచ్చారు. బాలకృష్ణుని కురులు ముడిచి పరిమళ పుష్పములతో అలంకరించారు. ఆ చిన్ని శిశువు నుదుట కస్తూరి దిద్ది కాటుక పెట్టారు. చెవి పోగులు పులిగోరు చంద్రహారము బాలునికి ధరింపచేశారు. బోసి నవ్వులొకిస్తున్న జగన్నాథుని బుగ్గన గడ్డముపై చుక్కలు పెట్టారు. చేతులకు కడియాలు ముంజేతులకు మురుగులు మొలకు బంగారుత్రాడు కట్టారు. బాలుని రూపములో ఉన్న శేషశాయికి నీరాజనాలిచ్చి “ఉయ్యాలా బాలునూచెదరు” అంటూ బాలుని బండీ క్రిందనున్న పసిడి తొట్టిలో పడుకోబెట్టి లాలి పాటలు పాడారు. వ్రజభామలు ఎన్నో కానుకలు పిండివంటలు మొదలగునవి ఇచ్చారు.
ఈ కోలాహలంలో కంసప్రేరితుడైన శకటాసురుడు వాయు రూపములో వచ్చి పరమాత్మపై బండిని పడద్రోశాడు. ముద్దులొలికిస్తూ చిన్నికృష్ణుడు ఆ శకటమును (బండిని) తన్నాడు. రివ్వున బండీ ఎగిరి శకటునిపై పడి ఆతని తల వ్రక్కలయ్యెను. బండిపైనున్న క్షీర దధి భాండములు క్రింద పడి పగిలెను.
అలికిడి వినిన వ్రజభామలు కలవరుముతో చూడగా బాలకృష్ణుడు కేరింతలుకొట్టుచూ ఆడుకుంటున్నాడు. ఈ లీలను చూచిన గోపబాలురు జరిగిన సంగతి వ్రజభామలకు చెప్పిరి. ఆశ్చర్యపడి నందనందునకు ఎఱ్ఱని నీటితో దిష్టితీసి భూసురులచేత వేదాశీర్వచనములు చేయించి లోకరక్షకునకు రక్షకట్టిరి.
శకటాసురుని వృత్తాంతము:
హిరణ్యలోచనుని పుత్రుడైన ఉత్కచుడు చాలా క్రూరుడు. ఒకసారి అతడు తన స్వాభావికమైన క్రూరత్వముచే లోమశ మహర్షి ఆశ్రములోనున్న వృక్షలతాదులను పెఱికివేశాడు! ఆతని క్రూరబుద్ధిని చూసి ఆ మహర్షి “ఓరీ! పాము కుసుసము విడిచినట్టు నీవు ఈ దేహము విడువుము” అని శపించినాడు. పశ్చాత్తాపముతో మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు ఉత్కచుడు. “పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు. అయిననూ నీవు చేసిన కర్మకు శిక్ష తప్పదు. ద్వాపరమున శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను విధించును. ఆ పురుషోత్తముని పాద స్పర్శతో నీకు శాపవిముక్తి కలుగుతుంది” అని శాపావశానం చెప్పాడు లోమశ మహర్షి. ఆ ఉత్కచుడే శకటాసురుడు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం
క్రూరత్వం కడు దుష్టస్వభావము అసురలక్షనము. తోటి మానవులు జంతువులతోనే కాక వృక్షములతో కూడా మైత్రీభావముతో ఉండవలెనని మనకు ఈ కథ ద్వారా తెలిసినది. మన శాస్త్రాల ప్రకారం ఒక చెట్టును ఊరికే నఱకడం మహాపాపమ్. అవసరార్థం ఒక వృక్షమును నఱికితే దానికి బదులు నాలుగు వృక్షములు నాటమని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఉత్కచుడు ఊరికే ఎన్నో వృక్షములను పెఱికివేసి ఆ తప్పుకు శిక్ష అనుభవించాడు.
హరిహరీ! నీమాయామహిమ క్రమంగా తెలిసికొనునట్లు నన్ను కరుణించితివి, గదే! నేను ధన్యుడనయ్యాను తండ్రీ! నీవే నాపాలి దైవము, నా తల్లివి, తండ్రివి, గురుడవు. నీవే నా ప్రాణానివి. అందుకని నీవే కౌతుకమున నన్నేలితివి. ఈ జీవితానికి ఇది చాలు స్వామి. నేను కళ్ళు తెరిచినా కళ్ళుమూసినా నీ మూర్తే కనబడుతున్నది ఇక ఈ బ్రతుకునకింతకంటే కావలసిందేమి వున్నది ప్రభూ!
భావ వివరణ:
ఓ శ్రీహరీ! నీమాయామహిమల యొక్క తీరుతెన్నులు యెలావుంటాయో | వాటిని సరవి (క్రమముగ) తెలియునట్లు నన్ను అనుగ్రహింపుము ప్రభూ!
దేవా! నేను నిన్నే దేవునిగా తలచెదను. నిన్నే నా తల్లిగాను తండ్రిగాను తలచెదను. మలసి (తిరిగి) అంతలోనే ఆ విషయం మరచిపోతాను. ఏమిటి ప్రభూ! నీమాయ? ఇంతలోనే కలవలె అన్నీ మరచిపోయి యేదో పోగొట్టుకున్నవాడిలా బాధపడి నలిగిపోతాను. ఈ భ్రాంతికి కడగనరాదు (అంతము కనబడదు).
ఒకపరి (ఒకసారి) వూరకనే నీకు మ్రొక్కెదను. ఒకపరి నీవు నా | ప్రభువువని కీర్తిస్తూ మొక్కుతాను. ఒకపరి సృష్ఠి కంతటికి ఆదిమూలము | నీవేనని నమ్ముతాను. నీవు నా పక్షాన వున్నావని ఉక్కున (స్థైర్యము గలవాడనై) గర్వించి ఉబ్బుదును (సంతోషిస్తాను). అటుపై సగ్గుదును (తగ్గిపోతాను). కక్కసమైనది (యెంతో బాధ కలుగుతుంది). కడకనరాదు (దీనికి అంతూ పొంతూ తెలియదు).
ఓ దేవా! నీ దివ్య సుందరమూర్తిని జూచి నీవు మమ్ము సులభముగా అనుగ్రహింతువని తలచెదను. జగములన్నిటికి ఇది సోద్యము (సంభ్రమకరము) అని చూతును. ఓ శ్రీవేంకటేశ్వరా! ఈ విధముగా | నన్ననుగ్రహించితివి. నాకు యెంతో కౌతుకము (ఆనందము) కలుగుచున్నది. దానికి కడ కనరాదు (అంతు తెలియకుండా వున్నది). నేను ధన్యుడను తండ్రీ!
శ్రీవేంకటేశ్వరుని రథము తిరువీధులగుండా సాగుతున్నది. ఇందిరానాథుడు ఇటువైపు వచ్చేస్తున్నాడు, ఓ ప్రజలారా! రండి… హారతులీయండి… కానుకలనీయండి… మీ జన్మ తరింపజేసికోండి అని మంగళం పాడుతున్నారు. అన్నమాచార్యులవారు. ఈ తేరు, పంచభూతముల మూలరూపమైన పరమాత్ముని | బ్రహ్మాండమైన తేరు అని కీర్తిస్తున్నారు. జీవకోట్లన్నీ ఇందులోనే అదృశ్యరూపంలో వున్నాయట. సురులు మునులు ఈ తేరుని పట్టుకొని సొంపుగా లాగుతున్నారట. ఏరీ కనుపించరేమి? అని జుట్టు పీక్కోకండి. మనకు వారినిచూచే శక్తీ, అర్హతా, భక్తీ యేవీ లేవు. స్వామి సశరీరుడై తన దేవేరులతో వారికి కనుపిస్తాడు. కాని మనకు | అంత అదృష్టం లేదు.
భావ వివరణ:
ఓ ప్రజలారా! ఇందిరానాథుడు ఇటు వూరేగి యిత్తల వస్తున్నాడు (ఇటువైపు వచ్చుచున్నాడు). ఎత్తరో ఆరతులు (హారతులను యెత్తిచూపండి). మీ శక్తి కొలది కానుకలు స్వామికి సమర్పించుకోండి.
ఈ స్వామి యెన్ని రకములైన రథములనెక్కాడో చూడండి. | గరుడధ్వజముతో నొప్పిన తేరు బంగారము రాసులైన తేరు. నాలుగు వేదములు దీనికి చేరులు (పట్టుకొని గుంజుటకు వుపయోగించిన నాలుగు త్రాళ్ళు). దేవతలు మునులు అదృశ్యరూపులై దీనిని లాగి తరిస్తున్నారు. ఈవిధంగా ఇరవుగా (సొంపుగా) ఇందిరానాథుడు వూరేగివస్తున్నాడు.
సృష్ఠిలోని జీవకోట్లన్నీ సూక్షరూపంలో వున్నాయి, ఈ రథంలో ఉన్నాయి. ఇది మనకు రథములా కనిపిస్తున్నది కానీ ఆదిశేషుడు చుట్టలు చుట్టుకొని తన | పడగలను స్వామికి గొడుగులాపట్టినాడు. వేవేల సింగారములు (అనేకమైన అలంకరణలతో) ఈ తేరు కన్నులపండువగా వున్నది. నారదాది నిత్యులూ, సనక సనందనాది ఋషులు, వ్యాసాంబరీషులవంటి ముక్తులు (ముక్తిపొందినవారు)… మూడు వరుసలలో నిలిచి సేవిస్తున్నారు. ఈవిధముగా ఇందిరానాథుడు వూరేగివస్తున్నాడు.
బ్రహ్మాండమైన ఈ తేరులో పరమాత్మ పంచభూతముల రూపములో విలసిల్లుతున్నాడు. ఈ తేరు మించిన (వృత్కృష్టమైన శ్రీవేంకటాద్రిపై సాగిపోతున్నది. అదిగో ఈ ఇందిరానాథుడు కొంచక (తగ్గక) తన దేవేరి అలమేల్మంగతో గూడి ఈ తేరుపై వస్తున్నాడు. ఈ మహానుభావుడు యెంచరాని మహిమలు కలవాడు. ఈయనయొక్క అనుగ్రహం పొంది మీజన్మ చరితార్థం చేసికొనండి. ఒక్కసారి ముక్తకంఠంతో అనండి
శ్లో॥ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే। చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం||
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే…యుధిష్ఠిరుని ధర్మబుద్ధి నీతికథ.
యుధిష్ఠిరుని ధర్మబుద్ధి
చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్ద పుణ్యకథలు వినిన తరువాత ధర్మాత్ములైన పాండవులు పరమసాధ్వి అయిన ద్రౌపదీదేవి పురోహితుడైన ధౌమ్యుల వారు ద్వైతవనానికి చేరారు. అక్కడ ఉండగా ఒక రోజు ఒకానొక భూసురోత్తముడు పఱుగులిడుతూ వచ్చి “ఓ ధర్మనందనా! యజ్ఞార్థము నేను అరణి (నిప్పు పుట్టించెడు కొయ్య) అరణ్యమునుండి కొనివచ్చి వాటిని ఒక తరుశాఖ మీద పెట్టి మిగిలిన ఏర్పాట్లు చేయుచుండగా ఒక జింక ఎక్కడి నుంచో పఱుగు పఱుగున వచ్చి ఆ వృక్షము ప్రక్కగా వెళ్ళినంత దాని కొమ్ములకు నా అరణి చిక్కుకుంది. అలా నా అరణి తీసుకుని ఆ జింక మళ్ళీ అడవిలోకి పారిపోయింది. నా నిత్యకర్మకు అంతరాయం కలుగ కుండా నా అరిణి తెచ్చి కాపాడు” అని వేడుకున్నాడు.
ఆర్తరక్షణే ప్రథమ కర్తవ్యం అని భావించే ధర్మజుడు వెంటనే తన విల్లందుకుని తన తమ్ములతో పాటు ఆ జింక వెళ్ళిన వైపున పఱుగు తీశాడు. అద్భుత వేగంతో పోతున్న ఆ జింక ఎంత ప్రయత్నించినా వారికి చిక్కలేదు. అలా ఎంతో దూరం ఆ జింక వెనకాల పఱుగెట్టారు పాండవులు. తీవ్రమైన అలసట దప్పిక వారిని బాధించాయి అయినా కర్తవ్య పాలనార్థం జింకను వెంబడిస్తూనేవున్నారు. చివరికి వారు దట్టమైన కాఱడవి లోపలికి చేరుకున్నారు. అక్కడ ఆ జింక కనుమఱుగైపోయింది. మానవ ప్రయత్నం విఫలంకాగా ఎంతో శ్రమతో ఆయాసపడుతున్న పాండవులు ఒక పెద్ద మఱిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు “నిరంతరము సత్యమార్గమును అనుసరించుచూ ధర్మముతప్పకుండా చెరించే మనకు ఈ దుర్గతి ఎందుకు పట్టినదో? ఒక జింకను పట్టి ఆ బ్రాహ్మణుని అరణి తిరిగి ఇవ్వలేక పోతున్నామే. హతవిధి”! అది విని ప్రాజ్ఞుడైన యుధిష్ఠిరుడు ఇలా బదులిచ్చాడు.
“నాయనా! సుఖము దుఃఖము మనము పూర్వం చేసిన కర్మ బట్టే ఉంటాయి. సత్కర్మలకు సత్ఫలము దుష్కర్మలకు దుఃఖము తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థం. కర్మ వశముగా కాక ఏదీ జరుగదు”. భీమనేడు ఆ సత్యవాక్కులు విని “అయితే పరసతి పరమపతివ్రత పైగా ఏకవస్త్ర (రజస్వల) గా ఉన్న పాంచాలీ దేవిని కురుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకువచ్చిన అతిదురాత్ముడైన దుశ్శాశనుని అక్కడే వధించకుండా ఊరక ఉన్నందుకే మనకి ఈ దుర్గతి పట్టి ఉండ వచ్చు” అని అన్నాడు. అది విని శ్రీ కృష్ణ ప్రియ సఖుడైన అర్జునుడిలా అన్నాడు “ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఇష్టంవచ్చినట్టు కురువృద్ధుల ముందర నోటికి వచ్చినట్టు మాట్లాడిన ఆ కర్ణుని నోరుమూయించక ఓర్చుకున్నందుకే మనకీ దుఃఖములు”. అప్పుడు సహదేవుడు “దుష్టశీలుడైన దుర్యోధనుడు అధర్మ జూదం ఆడి మనలను మోసగించినపుడే దుష్టశిక్షణ చేయనందులకే మనకీ దుర్గతి పట్టినది” అని అన్నాడు (జ్యూదంలో పందెం కాసేవాడే ఆడాలన్నది నియమం. అలా కాకుండా తను ధనంవొడ్డి శకునిచే ఆడించి గెలుచుట అధర్మం అని సహదేవుని ఆంతర్యం).
ఇలా వేయివిధాల మాటలాడు తున్న సోదరులను చూచి అజాతశత్రుడైన పాండవాగ్రజుడు అందఱికంటే చిన్న అయిన సహదేవునితో ఇలా అన్నాడు “నాయనా! నీ సోదరులందరూ తీవ్ర దాహముతో ప్రాణాలు కడపట్టుకు ఉన్నారు. ఈ వృక్షం ఎక్కి దగ్గరలో ఏదైనా జలధార ఉన్నదే మో చూడు”. వెంటనే సహదేవుడు ఆ చెట్టెక్కి నలువైపులా చూశాడు. దగ్గరలోనే అతి మనోహరమైన తటాకమున్నదని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు “నీవు వెళ్ళి నీరు త్రాగి దప్పిక తీర్చుకొని మాకు కూడా కొంత జలం పట్టుకు రా” అని సహదేవునితో అన్నాడు. సహదేవుడు వెళ్ళి తటాకములోని నీరు త్రాగబోతుండగా ఒక అశరీరవాణి ఇలా పలికింది “ఓ మాద్రీ నందన! ఈ జలములు నా ఆధీనములో ఉన్నాయి. నీవు ఇవి త్రాగదలుచు కుంటే ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు”. దాహముతో తపిస్తున్న సహదేవుడు ఆ మాటలు పట్టించుకోకుండా నీళ్ళు త్రాగినాడు. మఱుక్షణం నిశ్చేష్టుడై పడిపోయాడు.
ఆ తరువాత నకుల అర్జున భీములు ఒక్కొక్కరుగా ధర్మరాజు ఆనతిమీద తమ్ములను వెదుకుటకు వచ్చి సాహసించి ఆ తటాకములో నుండీ నీరు త్రాగి మృతుల వలె ఆ తీరమువద్ద పడిపోయినారు. ఎంతకీ తిరిగి రాని సోదరులను వెతుకుతూ చివరికి ధర్మనందనుడు కూడా ఆ తటాకానికి చేరుకున్నాడు. యుధిష్ఠిరుడు తీరమువద్ద పడివున్న తన ప్రియ సోదరులను చూచి ఆశ్చర్యపోయాడు. వారికేమైనదో అని దుఃఖించాడు. అసమానశూరులు వీరాధివీరులైన ఆ నలుగురు ఏ కారణంబుగా ఈ స్థితిలో ఉన్నారో అని బాధపడ్డాడు. పుణ్యచరిత అయిన కుంతీ దేవికి ఈ విషయము తెలిసిన ఎంత దుఃఖించునో అని తలచినాడు. “భీష్మ విదురాది పెద్దలు అడిగితే ఏమి సమాధానము చెప్పాలి?” అని ఇట్లు పరిపరి విధముల వగచి దాహముతో ప్రాణాలుపోతున్న ఆ ధర్మజుడు తటాకములోని జలములు త్రాగుటకు ఉపక్రమించెను. మఱల ఆ
అశరీరవాణి ఇట్లనియె “నీ సోదరులు సాహసించి ఈ నీరు త్రాగి మరణించిరి. నీవీ నీరు త్రాగవలెనన్న నా ప్రశ్నలకు విమల బుద్ధితో సమాధానములు ఇవ్వవలెను”. “అయ్యా! నీవు శివుడవో అగ్నిదేవుడవో వాయుదేవుడవో ఇంద్రుడవో? ఇట్టి అజేయులకు ఈ స్థితిని ఇంకెవరు కల్పించగలరు? నాయందు దయ ఉంచి మీ నిజరూపంబు చూపి నా భయము తొలగించండి” అని వేడుకొనిన అతి ఘోరాకృతిలో ఉన్న యక్షుడు యుధిష్ఠిరుని ఎదుట నిల్చి నా ప్రశ్నలకు ఉత్తరములు ఇయ్యమని అడిగెను. సహజ వినయ సౌశీల్యుడైన ధర్మనందనుడు అతనికి ప్రణమిల్లి “దేవా మీ చిత్తము. కానీ నాబోటి వానికి మీ ప్రశ్నలకు జవాబులిచ్చుట సాధ్యమా? అయినా నాకు తెలిసినంతలో చెప్తాను” అని అన్నాడు.
ఆ యక్షుని ప్రశ్నలకు ధర్మజుడు అద్భుతరీతలో ఉత్తరములను ఇచ్చినాడు. సంతృప్తుడైన యక్షుడు “మహాత్మా! నా ప్రశ్నలన్నిటికీ నీవు సదుత్తరములు ఇచ్చి నన్ను మెప్పించినావు. నీ తమ్ములలో ఒకని ప్రాణంబులిచ్చెద. కోరుకొనుము” అని వరమొసంగినాడు. శ్యామాంగుడైన నకులుని బ్రతికించ మని ధర్మరాజు కోరగా యక్షుడు ఆశ్చర్యముగా ఇలా ప్రశ్నించాడు “భీమార్జునులు అతిభీమబలులు. భీమసేనుడు అతని భుజబలముచే నిన్ను నీ సోదరులను అనేక మాఱులు మత్సరముచే చంపాలనుకొన్న దుర్యోధనుని కుయుక్తుల బాఱినుండి కాపాడినాడు. ఇక అర్జునునికి సాటి రాగల వీరుడు ఈ లోకంలో లేడు. ఆతడే మఱల నీ రాజ్యము నీకు అప్పించగలడు. వీరిలో ఒక్కరిని కోరక నకులుని ఎందులకు కోరినావు”? సమవర్తి అయిన యుధిష్ఠిరుడు ఇలా ధర్మము మాట్లాడినాడు “కుంతీదేవి కుమారులైన ముగ్గురిలో నేను మిగిలినాను.
అలాగే మాత యగు మాద్రీదేవి ఇద్దరు పుత్రులలో ఒకడైనా బ్రతకాలి కదా! అందుకే నకులుని బ్రతికించమని కోరినాను. ఇట్లు కాక అన్యుల బ్రతికించమని కోరి అధర్మము చేయలేను”. ధర్మజుని ధర్మబుద్ధికి మెచ్చి ఆ యక్షుడు “నీ తమ్ములందఱిని బ్రతికించెదను” అని కరుణించినాడు. వెంటనే ఆ నలుగురు లేచి కూర్చున్నారు. వారందరి దాహమూ తీరిపోయినది. ఆ యక్షుడి శక్తి చూచి ఆశ్చర్యపోయి “దేవా! నీవు సామాన్య యక్షుడవు కావు. ఇంద్రుడవో వరుణుడవో అగ్ని వాయుదేవుడవో లేక ధర్మప్రభువైన నా తండ్రి యముడవో చెప్పుము” అని ప్రార్థింప ధర్ముడు కరుణించి తన నిజ స్వరూపము చూపి వారికి ఆనందము కలిగించినాడు.
“ఓ రాజా! నేను యమధర్మరాజును. సత్యము శౌచము దయ దానం తపం శమము దాంతి యశము జ్ఞానము యుక్తి నా మూర్తులు. నీ ధర్మబుద్ధి పరీక్షించుటకు వచ్చినాను. నీ ధర్మవర్తనమునకు మెచ్చినాను. ఏమి వరము కావలయునో కోరుకొనుము” అని కాలుడు అడిగినాడు. అప్పుడు పాండవాగ్రజుడు ఆ ధర్ముని స్తుతించి “అయ్యా! నా ఆశ్రమము వద్ద ఉండే విప్రోత్తముడి అరణి ఒక హరిణము ఎత్తుకుపోయింది. ఆ మహనీయుని నిత్యకర్మకు లోపము రాకుండా అతనికి ఆ అరణి ఇప్పించు స్వామి”! అని కోరినాడు. అంతట ఆ ధర్ముడు తానే మృగ రూపమున వచ్చెనని ధర్మరాజుకు ఎఱింగించి అతనికి విపుని అరణి ఇచ్చెను.
“నాయనా! రానున్న అజ్ఞాతవాసములో మీకు కావలిసిన రూపములు నా అనుగ్రహం వల్ల కలుగుతాయి. ఇందువల్ల అసత్య దోషం కలుగకుండా మీరు అజ్ఞాతవాస కాలము పూర్తిచేయగలుగుతారు. నాయనా ధర్మరాజా! నీ కర్తవ్య దీక్షకు మెచ్చి ఇంకొక వరమిస్తాను కోరుకో” అని కాలుడన్నాడు. అప్పుడు ధర్మనందనుడు “స్వామీ! నీ అనుగ్రహము కన్న నాకు కావలసిన దేమున్నది. నా మనసులో అప్పుడూ క్రోధమోహాలు రాకుండా ఎల్లప్పుడూ ధర్మమార్గాన ఉండేటట్లు ఆశీర్వదించండి” అని కోరినాడు. అటులనే దీవించించి యముడు అదృశ్యమయ్యాక పాండవులు ఆశ్రమము చేరి భూసురునకు అరణి ఇచ్చి ఆనందముగ ఉండసాగిరి.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
సజ్జనులు ఎన్నడూ ధర్మమార్గమును వీడరు. ధర్మరాజు నకులుని కోరి ధర్మవర్తనము ఎంత సూక్ష్మమైనదో మనకు వివరించినాడు. వరం కోరుకో మనినప్పుడు ధర్మజుడు తనకై ఏదీ కోరకుండా విపుని అరణి ఇప్పించమని కోరినాడు!
ధర్మశాస్త్రానుసారము తమ్ముని వెదుకుటకు అన్న వెళ్ళాలి కానీ అన్నను వెదుకుటకు తమ్ముడు పోరాదు. అన్నను వెదుక వలసిన పరిస్థితి తమ్మునికి వస్తే గురువువెళ్ళి వెదకాలి. ఈ ధర్మసూక్ష్మం తెలిసిన యుధిష్ఠిరుడు ముందు సహదేవుని పంపి అతని వెదుకుటకు నకులుని ఆ తరువాత అర్జునుని ఆపైన భీమసేనుని పంపెను.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే…మయూరధ్వజుని కథ.
మయూరధ్వజుని కథ
ధర్మరాజు చేసే అశ్వమేధయాగం లోని యాగాశ్వాన్ని వీరధర్మం పాటిస్తూ పట్టుకున్నాడు మయూరధ్వజుడనే రాజు. అతడు ధర్మాత్ముడు అమితపరాక్రమవంతుడు శ్రీ కృష్ణుని పరమ భక్తుడు. యాగాశ్వం విడిపించుటకై మయూరధ్వజునితో యుద్ధం చేయటానికి పచ్చారు శ్రీ కృష్ణార్జునులు. శ్రీ కృష్ణుడు కూడా అర్జునుని ప్రార్థనపై యుద్ధం చేశాడు. భగవంతునితో యుద్ధం చేయకూడదని ఉన్నా యుద్ధనీతి పాటించి ప్రతి బాణాం వేసే ముందు శ్రీ కృష్ణ నామ స్మరణ చేస్తూ యుద్ధం చేశాడు మయూరధ్వజుడు. భక్తులచేతిలో ఓడిపోవటం భగవంతునికి పరిపాటి. అందుకే శ్రీకృష్ణార్జునులు మయూరధ్వజుని గెలవలేకపోయారు. “ఈతని సంహరించి యాగాశ్వం సంపాదించకూడదా” అని అడిగిన అర్జునునితో శ్రీ కృష్ణుడు “ఫల్గుణా! నీ గాండీవం కాని నా సుదర్శన చక్రం కాని ఈ పరమభక్తుని మీద పని చేయవు. ఈతని ధర్మబుద్ధి నీకెఱిగించెద” అని అన్నాడు.
మఱునాడు శ్రీ కృష్ణార్జునులు విప్రవేషం ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులై వెళ్ళారు. అతిథులకు తగు మర్యాద చేసి మయూరధ్వజుడు తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు. అది విని మాఱువేషంలో ఉన్న పరంధాముడిలా అన్నాడు “రాజా! నీ ఇంట భుజించుటకు వ్యవధి లేదు. మాకొక చిక్కు వచ్చినది. అది తీరిన తరువాతే మేము ఇతరములు ఆలోచిస్తాము”. “అయ్యా! మీ కష్టమేమిటో చెప్పండి. నా చేతనైన సహాయం చేస్తాను” అని మయూరధ్వజుడు వేడినాడు. “రాజా! మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుని ఓ పెద్దపులి పట్టుకుంది. ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత ఒక అశరీరవాణి ఇలా పలికింది “మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడు అవుతాడు”. నాకు పుత్రభిక్ష పెట్టమని నిన్ను ప్రార్థిస్తున్నాను” అని శౌరి బదులిచ్చాడు.
“ఆహా! ఈనాటికి కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది. ఒక పసివాడి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతోంది. దీని కన్నా నేను కోరు తగ్గది ఏమీ లేదు. నిస్సందేహంగా నా శరీరములోని అర్ధభాగమును తీసుకుని ఆ వ్యాఘేశ్వరునికి సమర్పించండి” అని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే తన భార్యాబిడ్డలను పిలిచి తన శరీరాన్ని రెండుగా చేసి అతిథులకు ఇచ్చి వేయమన్నాడు. ఏ పరమధర్మ సంరక్షణార్థమో ఏ మహత్తర కార్యానికో మయూరధ్వజుడిలా చేయమని వుంటాడని గ్రహించి ఎంతో బాధను దిగమ్రింగుకోని మయారధ్వజుని శరీరాన్ని ఛేదించడం మెదలుపెట్టారు. మహాశ్చర్యకరమైన ఈ త్యాగాన్ని అనిమిషులై చూస్తున్న శ్రీ కృష్ణార్జునులకు ఓ వింత కనబడింది.
మయూరధ్వజుని ఎడమ కన్ను నుండి కన్నీళ్ళు కారుతున్నాయి. సర్వజ్ఞుడైన స్వామి అది చూసి కేవలం ఆ భక్తుని గొప్పతనం ప్రపంచానికి చాటడానికి ఇలా అన్నాడు “రాజా! బాధపడుతూ దానం ఇవ్వకూడదు. సంతోషముగా మనస్ఫూర్తిగా చాస్తేనే అది త్యాగమవుతుంది. ఎదుటి వాడి కష్టాలు చూసి బాధపడటం దివ్యత్వం. మనని చూసి మనమే కన్నీరు కార్చడం నైచ్యమ్”.
“అయ్యా! నా శరీరం మనస్ఫూర్తిగానే మీకు సమర్పించాను. కాని నా శరీరము యొక్క కుడి భాగమే పరోపకారార్థం నివియోగ పడుతోంది. ఎడ మ భాగ శరీరం “నాకా అదృష్టం లేదే” అని విచారిస్తూ కన్నీరు కారుస్తోంది. మిగిలిన శరీరం దేనికీ ఉపయోగపడకుండానే నాశనమవుతున్నదనే నా బాధ” అని అమృతవాక్కులు పలికాడు మయూరధ్వజుడు. ఆ రాజు పరోపకార బుద్ధికి సంతోషించి శ్రీ కృష్ణుడు తన నిజరూపం చూపించి మయూరధ్వజునికి యథా రూపం కల్పించి దీవించాడు. మయూరధ్వజుడు నరనారాయణులకు మ్రొక్కి యాగాశ్వాన్ని సమర్పించి కృతార్థుడైనాడు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
మయూరధ్వజుని పరోపకారబుద్ధి అనన్యం అసామాన్యం. శ్రీ కృష్ణుడు అడిగినదే తడవుగా సంతోషముగా బాలుని ప్రాణ రక్షణ కోసం తన శరీరాన్ని త్యాగంచేయటానికి సిద్ధపడ్డాడు. అంతేకాక అర్ధ శరీరమే ఉపకరిస్తున్నది మిగిలిన శరీరం వ్యర్థమవుతున్నదని చింతించాడు.