మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు లలితాష్టోత్తరశతనామస్తోత్రరత్నమ్గురించి తెలుసుకుందాం…
Lalitha Ashtottara Satha Nama Sthotra Ratnam In Telugu
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దుర్గా సప్తశతి అర్గళా స్తోత్రముగురించి తెలుసుకుందాం…
Durga Saptashati Argalaa Sthotram In Telugu
దుర్గా సప్తశతి అర్గళా స్తోత్రమ్
అస్య శ్రీ అర్దశాస్తోత్రమంత్రస్య విష్ణు ఋషిః అనుష్టు వృందః | శ్రీమహాలక్ష్మీ దేవతా మంత్రోదితా దేవో బీజం | నవార్లో మంత్ర శ్శక్తిః | శ్రీ సప్తశతీమంత్రస్తత్వం శ్రీ జగదంబా ప్రీత్యర్థే స్తోత్రపాఠాంగత్వేన జపే వినియోగః ॥ ఓం నమ శ్చండికాయై |
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రముగురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలిత అష్టకం గురించి తెలుసుకుందాం…
పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.
Sri Raghavendra Swamy Japa Vidhanam Telugu
పూజా అనేది అభిమానం, ప్రేమ, భక్తి మరియు అభివృద్ధికి స్థానము. ఇది మనస్సును ప్రశాంతత, ధ్యానం మరియు సమాధానాన్ని అందిస్తుంది. పూజా అనేది ధర్మ, ఆధ్యాత్మికత మరియు సంస్కృతి వ్యాపకంగా సంబంధించిన అమూల్యమైన పద్ధతి. శ్రీ రాఘవేంద్రస్వామి జప విధానము, పూజ గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా అష్టకారికలు స్తోత్రముగురించి తెలుసుకుందాం…
Sri Lalitha Ashtakarika Sthotram (Avirbhava Stuti)
అష్టకారికలు
హోమాగ్ని నుండి శ్రీ లలితాదేవిని రమ్మని ఆహ్వానిస్తూ చెప్పిన శ్లోకములు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సరస్వతీ ప్రార్థన గురించి తెలుసుకుందాం…
సీ॥ మల్లెలు, చంద్రుండు, మంచు, ముత్తెపు దండ వలె శోభమెరిసెడి వాణియీమె ధవళ కాంతుల నొప్పి ధరియుంచు నీ తల్లి శుభ్ర వస్త్రంబును శోభగూర్ప ఉత్తమ వీణియ నొప్పు హస్తంబుల తెల్లకమలమె ఆ దేవి పీట బ్రహ్మ విష్ణువులును పరమేశ్వరుడు తాము నుతియింతురీమెను నోరు పండ.
తే॥ జడము నెలకొన, తాను, అజ్ఞానమందు
దాని పూర్తిగా తొలగించు తల్లియీమె
దేవి భగవతి విద్యల దేవి ఈమె
ఓ సరస్వతి రక్షించు ఉన్నతముగ.
తా॥ మల్లెపూలు, చంద్రుడు, మంచుకొండ, ముత్యాలదండ, వలె మెరిసి పోతున్న తెల్లటికాంతినిచ్చు శుభ్రమైన తెల్లని వస్త్రములు శోభకలిగిస్తుండగా, ఉత్తమమైన వీణియను చేతులలో ధరించి తెల్లటి పద్మమున కూర్చుని ఆ త్రిమూర్తులు తమ నోరుపండునట్లు నుతించుచుండగా, అజ్ఞాన జనితమైన జడత్వమును ఆమె సంపూర్తిగా తొలగ చేయగలదు. అట్టి భగవతీ విద్యలరాణి, ఓ సరస్వతీ నన్ను చక్కగా రక్షించుము తల్లీ!
తా॥ ఓ సరస్వతీ! శరత్కాల పద్మమువంటి నీ ముఖము యొక్క దర్శన భాగ్యము కల్పించుము. నీవు మా కోరికలను తీర్చుదానవు. ఎల్లవేళల పండితులకు గురువులకు నీ సన్నిధి దొరుకుగాక.
తే॥ ఎల్లయెడల సరస్వతి ఈయవమ్మ
వరములను నాకు వలయు రూపమును దాల్చు
వాణి! ఓయమ్మ! పద్మ సంభవుని రాణి!
విద్య మొదలిడ సిద్ధిని వేడెదమ్మ!
తా॥ ఓ సరస్వతీ! నాకు ఎప్పుడూ కోరిన వరములిచ్చి కరుణించుము. కావలసిన రూపమును ధరించగల ఓ వాణీ! నలువరాణీ విద్యను ఆరంభము చేయుటకు ముందు ఓ తల్లీ సిద్ధించు కృపను వేడెదను.
శా || 4
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా సూక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందుబింబాననా.
తా॥ ఈ జగత్తుకంతటికీ మోహనరూపివైన ఓ సరస్వతీదేవీ తెల్లటి పద్మముల వంటి కన్నులుగల భగవతీ! పూర్ణచంద్ర బింబము వంటి ముఖముగల ఓతల్లీ! నిన్ను ధ్యానించి పుస్తకమును నాచేత ధరించితిని. నీవు నామనసున నిలిచి విరివిగా మంచిమాటలను, శబ్దములను శోభకలుగునట్లుగా పలుకుము. నామాట యందు ప్రీతిపూర్వకముగా నుండుము.
తా॥ కైటభాసుర సంహారి ఆ శ్రీమహావిష్ణువు యొక్క ప్రియమైన కోడలివైన నా తల్లీ! సరస్వతీ నీ కాటుక కన్నులనుండి కారిన కన్నీరు నీ కుచద్వయముపై పడునట్లు రోదించెదవెందుకు? స్వర్ణగర్భుడైన ఆ బ్రహ్మ సతీమణీ! నిన్ను నా క్షుద్బాధ తీర్చుకొనుటకు తీసుకొనిపోయి అక్కడ యున్న ఆ కర్ణాట కిరాత కీచకులకు అమ్ముకోను. త్రికరణశుద్ధిగా చెప్పు నామాట నమ్ము.
తా॥ తల్లీ! నూతన పద్మము వలె ప్రకాశించు హస్త పద్మములు గల దాన, శరచ్చంద్రుని వెన్నెల వలె ఆడంబరమైన సుందర రూపముగల దేవీ, ధరించిన నగలయొక్క రత్నదీపముల వంటి వెలుగులు ముద్దిడుచున్న దిక్కులుగల అమ్మా వేదవిదితమైన సహజ సిద్ధ ప్రభావముగల దాన, భావగగన వీధిలో యధేచ్ఛగా విహరించు సరస్వతీ మాతా! నన్ను దయజూడుము.
తా॥ ఓ సరస్వతీ దేవీ! శరత్కాల మేఘము (తెల్లగా) వలెను, చంద్రుని వలెను, కర్పూరము వలెను, పటిక వలెను, హంసవలెను, మల్లెల దండవలెను, మంచువలెను, సముద్రపు నురగవలెను, మంచుకొండ వలెను, ఆదిశేషుని వలెను, తెల్ల మందారము వలెను, పాల సముద్రము వలెను, తెల్లని పద్మము వలెను, ఆకాశ గంగవలెను, శుభకరమైన తెలుపు రంగుతో స్వచ్ఛముగా శోభించు నిన్ను నామనస్సున ఎప్పుడు చూడగల్గుదునో కదా!