మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనవింశః సర్గలో, విశ్వామిత్ర మహర్షి దశరథుడు తాను నిర్వహిస్తున్న వైదిక కర్మను నిరంతరం భంగపరిచే రాక్షసుల నుండి రక్షించడానికి రాముడిని పంపమని అడుగుతాడు. తనకు మరియు దశరథుని ఆస్థానంలో ఉన్న ఇతర ఋషులకు రాముని సామర్థ్యాలు తెలుసునని మరియు రాముడు తన యుక్తవయస్సులో ఉన్నప్పటికీ, అతను రాక్షసులను సులభంగా చంపగలడని ఋషి దశరథ రాజును నొక్కి చెప్పాడు. కానీ ఈ అభ్యర్థనపై దశరథుడు కలత చెందాడు.
” ఓ దశరథ మహారాజా! ఇక్ష్వాకు వంశంలో పుట్టి, వసిష్ఠుని పురోహితుని గా గల నీవు ఇంతటి వినయ విధేయతలతో మాట్లాడటం సమంజసముగా ఉంది. నేను ఏమి కోరినా నెరవేరుస్తాను అన్నావు. నేను వచ్చిన కార్యము చెబుతాను. జాగ్రత్తగా విను. విన్న తరువాత నీ మాట నిలబెట్టుకో. నేను ఒక సిద్ధికొరకు ప్రయత్నిస్తున్నాను. దానికి కొన్ని నియమాలు అవలంబిస్తున్నాను. కాని ఆ నియమాలకు మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు అవరోధము కలిగిస్తున్నారు. నేను పూనిన వ్రతము సమాప్తి అయ్యే కాలములో ఆ రాక్షసులు యజ్ఞవేదిక మీద రక్తమును మాంసమును పడవేసి అపవిత్రము చేస్తున్నారు. ఆ ప్రకారంగా ఆ వ్రతము చెడిపోయింది. అందువల్ల నిరాశతో నీ వద్దకు వచ్చాను. నేను ఆ రాక్షసులను కట్టడి చేయగలను. కానీ వ్రత సమయములో కోపము తెచ్చుకోకూడదు. శపించకూడదు. ఆ కారణం చేత నాకు ఒక వీరుడి అవసరం వచ్చింది. నీ కుమారుడు, మహావీరుడు అయిన రాముని నాకు ఇమ్ము. రాముడు ఆ
రాక్షసులను సంహరించడానికి సమర్థుడు. రాముడు ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములలో కీర్తివంతుడౌతాడు. ఆ మారీచ సుబాహులను రాముడు తప్ప వేరెవ్వరూ చంపలేరు. నీవు పుత్ర వ్యామోహముతో వెనకాడకుము. నీ రాముని కి ఏం అపకారము కలగకుండా నీకు అప్పచెబుతాను.
ఓ దశరథ మహారాజా! రాముని గురించి నీకన్నా నాకు వసిష్ఠునకు మాత్రమే ఎక్కువగా తెలుసు. నీకు, నీ కుమారుడు రాముడు సామాన్యుడు గా కనపడుతున్నాడు. కాని రాముని అసలు స్వరూపము మా వంటి తపశ్శాలులకు మాత్రమే తెలుసు. ఓ రాజా! నీవు ధర్మాత్ముడవైతే, నీ రాముని కీర్తి ముల్లోకములకు తెలియవలెనంటే రాముని నా వెంట పంపు. నీ పురోహితుడు వసిష్ఠుని, మంత్రులను సంప్రదించి రాముని నా వెంట పంపు. కాని తొందరగా పంపు. ఎందుకంటే నా యాగము పదిదినములు జరుగుతుంది. ఆ పది దినములు రాముడు నా వెంట ఉండాలి. కాబట్టి సమయము మించి పోకుండా ఒక నిర్ణయము తీసుకో. నీకు క్షేమం కలుగుతుంది.” అని పలికాడు విశ్వామిత్రుడు.
విశ్వామిత్రుడు రాక్షసులను చంపడానికి రాముని పంపు అన్న మాట విన్నప్పటి నుండి దశరథుడు శోకంతో కుమిలిపోతున్నాడు. విశ్వామిత్రుని మాటలు దశరథునికి పిడుగుపాటు లాగా తగిలాయి. సింహాసనము మీద కూర్చోలేకపోయాడు దశరథుడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పందొమ్మిదవ సర్గ సంపూర్ణము.
“రామాయణం” లో అయోధ్యాకాండ పంచదశః సర్గం (15వ సర్గ)లో, రాముడు, సీత మరియు లక్ష్మణులు గంగానది ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడ, గౌహ్నుడు వారిని కలుస్తాడు. గౌహ్నుడు రాముని ప్రాముఖ్యతను తెలుసుకొని, తన సేవలను అర్పిస్తాడు. గౌహ్నుడు తన పడవలో రాముడు, సీత మరియు లక్ష్మణులను నదిని దాటిస్తాడు. నది దాటిన తర్వాత, రాముడు తన భవిష్యత్ ప్రణాళికలను చర్చిస్తాడు, దండకారణ్యంలో వాసం చేయాలని నిర్ణయిస్తాడు. ఈ సర్గలో రాముడి ధైర్యం, విధేయత, మరియు ధర్మపరమైన కట్టుబాట్లు స్పష్టంగా కనిపిస్తాయి. త్రయం గంగానది దాటి తమ వనవాసాన్ని కొనసాగిస్తారు.
వేదపారంగతులైన బ్రాహ్మణులు పొద్దుటే పట్టాభిషేక మండపమునకు చేరుకున్నారు. అయోధ్యా నగర మంత్రులు, సేనాధిపతులు, పురప్రముఖులు అందరూ పట్టాభిషేక మంటపము వద్దకు వచ్చారు. అందరి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు రామ పట్టాభిషేకము చూద్దామా అని ఉవ్విళ్లూరు తున్నారు.
రాముని జన్మ లగ్నము కర్కాటకము. అదే లగ్నంలో పుష్యమీ నక్షత్రంలో రాముని పట్టాభిషిక్తుని చేయవలెనని వేద పండితులు నిశ్చయం చేసారు. పట్టాభిషేక మంటపం చుట్టు పూర్ణకుంభాలు పెట్టబడి ఉన్నాయి. రాముడు ఎక్కడానికి స్వర్ణ రథం ఏర్పాటు చేసారు. రాముడు కూర్చోడానికి పులి చర్మము పరిచారు. అక్కడ ఉన్న బంగారు కలశములలో, గంగానదీ, యమునా నదీ, సరస్వతీ నదీ కలిసే చోట (త్రివేణీ సంగమము….ప్రస్తుతము అలహాబాద్) నుండి సేకరించిన జలము, ఇతర పుణ్యనదుల నుండీ, సరస్సులనుండీ, నదీనదముల నుండి, నాలుగు సముద్రముల నుండీ తెచ్చిన జలములను నింపి పట్టాభిషేకమునకు కావలసిన లాజలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పూలు, దర్భలు అన్నీ మండపము దగ్గర బంగారు పాత్రలలో అమర్చి ఉన్నాయి. సర్వాభరణ భూషితలైన వేశ్యలు అటూ ఇటూ తిరుగుతూ అన్ని పనులలో పాలుపంచుకుంటున్నారు. రాముడు పట్టాభిషిక్తుడు కాగానే, సింహాసనము మీద కూర్చోగానే ఆయనకు అటు ఇటు వింజామరలు వేయుటకు రత్నఖచితమైన వింజామరలు సిద్ధంగా ఉంచారు. అయోధ్య సామ్రాజ్యమునకు కాబోయే చక్రవర్తి అయిన రామునికి పట్టుటకు పాలనురగలాగా తెల్లగా స్వచ్ఛంగా మెరిసిపోయే పట్టు గొడుగు సిద్ధంగా ఉంచారు.
యువరాజు రాముని సేవించుటకు తెల్లని ఎద్దు, తెల్లటి గుర్రము, మదము కారే ఏనుగు రాజద్వారము బయట కట్టివేయబడి ఉన్నాయి. పట్టాభిషేక సమయంలో రాముని పక్కన ఉండటానికి ఎనిమందిమంది కన్యముత్తయిదువలు సకలమైన అలంకారములు చేసుకొని పట్టాభిషేక మంటపము దగ్గర నిలబడి ఉన్నారు. పట్టాభిషేక సమయములో మ్రోగించుటకు రకరకాల వాద్యములు, వాద్యకారులు సిద్ధంగా ఉన్నారు. రాముడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కాగానే రాముని, రాముని వంశములో మూల పురుషులను కీర్తించుటకు వందులు, మాగధులు ఒక పక్కగా నిలబడి ఉన్నారు.
పట్టాభిషేకమునకు కావలసిన సంభారాలు అన్నీ, అన్నివిధాలా అమర్చి ఉన్నాయి కానీ పట్టాభిషేకము నిర్వహించే దశరథ మహారాజు, పట్టాభిషేకము జరిపించుకొనే రాముడు అక్కడలేరు. వారి రాక కోసం అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వారిలో వారు గుసగుసలాడుకుంటున్నారు.
“సుముహూర్తము సమీపిస్తూ ఉంది. ఇంకా దశరథుడు, రాముడు, రాజమాతలు రాలేదు. ఏమయి ఉంటుంది. అసలు పట్టాభిషేకము జరుగుతుందా! లేదా!” అని వారిలో వారే అనుకుంటున్నారు.
ఇంకా కొంతమంది “మనమంతా పట్టాభిషేకము కొరకు అన్ని సంభారములు సమకూర్చుకొని సిద్ధంగా ఉన్నాము. దశరథమహారాజు ఇంకా రాలేదు. మనమంతా సిద్ధముగా ఉన్నట్టు దశరథమహారాజుకు ఎవరిద్వారా తెలియపరచాలి.” అని తమలో తాము అనుకుంటున్నారు. ఇంతలో సుమంత్రుడు అక్కడకు చేరుకున్నాడు. అక్కడ వేచి ఉన్న సామంతులను, పురప్రముఖులు సుమంత్రుని చూచి ఇలా అన్నారు.
“సుమంత్రా! ఏమి ఆలస్యము. రామ పట్టాభిషేకమునకు సుముహూ ర్తము మించిపోడుతున్నది. ఇంకా మహారాజు గారు రాలేదు. కారణం తెలియడం లేదు. నీ కేమైనా తెలుసునా!” అని అడిగారు. దానికి సుమంత్రుడు ఇలా అన్నాడు.
“దశరథమహారాజుగారి ఆజ్ఞ ప్రకారము నేను రాముని వద్దకు వెళుతున్నాను. మీరు అన్నట్టుగా సుముహూర్తము సమీపిస్తూ ఉంది. మీరందరూ సర్వ సంభారములతో ఎదురుచూస్తున్నారు. దశరథీ “మహారాజుగారు ఇంకా ఇక్కడకు రాలేదు. రాజుగారు పట్టాభిషేకమునకు సుముఖంగా ఉన్నాడా లేదా అన్న విషయం, రాజుగారు ఇంకా ఇక్కడకు రాకపోవ డానికి కారణము నాకూ తెలియదు. ఇప్పుడే నేను మహారాజు గారి వద్దకు వెళ్లి మీ మాటగా నేను మహారాజుగారిని అడుగు తాను. మీరందరూ దయతో ఓపికతో వేచిఉండండి.” అని పలికాడు.
వెంటనే సుమంత్రుడు రాజాంత: పురమునకు వెళ్లాడు. దశరథుని శయన మందిరములోకి ప్రవేశించాడు. బయట నిలబడి దశరథుని, ఆయన వంశమును స్తుతించాడు. ‘ఓ దశరథమహారాజా! తమకు జయమగుగాక! ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, శివుడు, కుబేరుడు వారి కృపను తమ మీద ప్రసరింతురు గాక! రాజేంద్రా! పట్టాభిషేక ముహూర్తము సమీపించుచున్నది. బ్రాహ్మణులు, సామంతులు, పురప్రముఖులు పట్టాభిషేకమంటపము వద్ద తమరి రాక కోసరము వేచి ఉన్నారు. తమరు వెంటనే అక్కడకు రావలసినది..” అని పలికాడు.
అప్పుడు దశరథుడు బయటకు వచ్చి సుమంత్రుని చూచి “రాముని ఇక్కడకు తీసుకొని రమ్మని ఈమె నీకు చెప్పింది కదా! నీవు రాముని ఇక్కడకు ఎందుకు తీసుకొని రాలేదు. నా ఆజ్ఞ ఎందుకు పాటించ లేదు. నేను చెబితే ఒకటి కైక చెబితే ఒకటీనా. నేను నిద్రించుటలేదు. మేలుకొనే ఉన్నాను. నన్ను ఎవరూ మేలుకొలుప నవసరము లేదు. నీవు వెంటనే రాముని ఇక్కడకు తీసుకొని రా. వెళ్లు.” అని ఆజ్ఞాపించాడు దశరథుడు. ఇంక చేసేది లేక సుమంత్రుడు రాజాజ్ఞ పాలించుటకు రాజాంతఃపురము నుండి బయటకు వచ్చాడు. రాముని రాజభవనము వద్దకు వచ్చాడు.
రాముని మందిరమును కూడా శోభాయమానంగా అలంక రించారు. రాముని భవనము ఎదుట కూడా ప్రజలు గుమి గూడి రాముని చూడటానికి వేచి ఉన్నారు. సుమంత్రుని రథము వారిని దాటుకుంటూ రామ మందిరము వద్దకు సమీపించింది. అయోధ్యా పౌరులు, జానపదులు, రాముని మిత్రులు అప్పటికే అక్కడకు చేరుకున్నారు. రాముని పట్టాభిషేక మంటపమునకు తీసుకొని పోవుటకు ఏర్పాటు చేయబడిన సుందరంగా అలంకరించిన మద గజము (మదించిన ఏనుగు) ద్వారము వద్ద వేచి ఉన్నది. వీరందరినీ దాటుకుంటా సుమంత్రుడు రాముని అంతఃపురములోకి ప్రవేశించాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఇది రామాయణం బాలకాండలోని 16వ సర్గ. ఈ సర్గలో, విష్వామిత్రుడు రామ-లక్ష్మణులను తనతో తీసుకువెళ్లి తాటకావనానికి చేరుకుంటాడు. తాటకావనం ఒక దివ్యమైన ప్రదేశం, కానీ తాటక అనే రాక్షసి వలన అది శూన్యంగా మారింది. విష్వామిత్రుడు రాముడిని తాటకను సంహరించమని ఆజ్ఞాపిస్తాడు.
విష్ణు మూర్తి దేవతల ప్రార్థనలను శ్రద్ధతో ఆలకించాడు. అన్ని విషయములు తెలిసి కూడా ఏమీ తెలియని వాని వలె వారితో ఇలా అన్నాడు.
“ ఓ దేవతలారా! నేను మనుష్యునిగా అవతారము ఎత్తుతాను. కాని లోక కంటకుడైన రావణుని ఎలా సంహరించాలి. దానికి ఉ పాయము ఏమి?” అని అడిగాడు. దానికి దేవతలు ఇలాఅన్నారు.
” ఓ మహావిష్ణూ! నీవు మనుష్య శరీరమును ధరించి, రావణుని తో యుద్ధము చేసి సంహరించు. అసలు జరిగిన విషయం ఏమిటంటే…… రావణాసురుడు చాలాకాలము బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసాడు. రావణుని తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ఆయనకు వరాలు ఇచ్చారు. ‘మనుషులతో తప్ప అతనికి వేరే వారిచేత మరణభయము లేకుండు గాక!’ అని వరం ప్రసాదించాడు. మానవులు బలహీనులని, వారంటే రావణునికి చులకన. అందుకని అటువంటి వరము కోరాడు. ఆ వరగర్వంతో రావణుడు ముల్లోకములోని దేవతలను, మునులను, మానవులను బాధించసాగాడు. కేవలము మనుష్యులు తప్ప అతనిని వేరే ఎవరూ చంపలేరు. మామూలు మనుష్యులకు రావణుని ముందు నిలబడే ధైర్యము లేదు. కాబట్టి తమరు మానవునిగా అవతరించి రావణుని సంహరించాలి.” అని వివరంగా చెప్పారు దేవతలు. దశరథునికి కుమారులుగా పుట్టడానికి నిశ్చయించుకొని, విష్ణుమూర్తి అంతర్థానము అయ్యాడు.
అయోధ్యలో దశరధుడు పుత్రులకొరకు యాగము చేస్తున్నాడు. ఆ హెూమ గుండము నుండి తేజోవంతుడైన, మహావీరుడు, మహాబలుడు, నల్లని ఎర్రని వస్త్రములను ధరించిన వాడు, రక్త వర్ణముకల ముఖము కలవాడు, దుందుభి వంటి కంఠధ్వని కలవాడు, సింహము వంటి కేశములు కలవాడు, శుభలక్షణములు కలవాడు, దివ్యమైన ఆభరణములు ధరించిన వాడు, పర్వతశిఖరము మాదిరి ధృఢమైన వాడు, పెద్దపులి వంటి పరాక్రమము కలవాడు, సూర్యుని వంటి తేజస్సుకలవాడు, భగభగమండే అగ్ని శిఖల మాదిరి వెలుగు చున్నవాడు, చేతిలో ఒక బంగారు కలశముతో, దానిమీద ఒక వెండి మూతతో, ఆ బంగారు పాత్ర నిండా పాయసముతో, ఒక భూతా కారము ఆవిర్భవించింది. ఆ భూతమును చూచి దశరధుడు చేతులు జోడించి నమస్కరించాడు.
“ఓమహానుభావా! తమరు ఎవరు? తమరికి నేను ఏమి సేవ చేయగలను.” అని ప్రార్థించాడు.
ఆ భూతము దశరధుని చూచి ఇలా పలికింది.
“ఓ దశరధమహారాజా! నన్ను ప్రజాపతి పంపాడు. ఈ పాయస పాత్రను మీకు ఇమ్మన్నాడు. ఇది దేవతలచేత తయారుచేయబడిన పాయసము. ఈ పాయసము సంతానమును, ఆయుష్షును, ఆరోగ్యమును, సంపదలను ప్రసాదిస్తుంది. నీవు పుత్రులను కోరి యాగము చేస్తున్నావు. ఈ పాయస పాత్రను నీ భార్యలకు ఇమ్ము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది.” అని పలికి ఆ దివ్యమైన పాయస పాత్రను దశరధుడికి ఇచ్చాడు.
దశరధుడు భక్తి శ్రద్ధలతో ఆ పాయస పాత్రను అందుకున్నాడు. తరువాత ఆ భూతమునకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించాడు. తరువాత ఆ భూతము అంతర్ధానము అయింది.
దశరధుడు సంతోషముతో ఆ పాయన అంతఃపురములో ప్రవేశించాడు. ఆ పాయసములో సగ భాగము కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన పాయసములో సగభాగం (అనగా నాల్గవ భాగము) సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగం (అనగా ఎనిమిదవ భాగము) కైకకు ఇచ్చాడు. మిగిలిన పాయసం (అనగా మిగిలిపోయిన ఎనిమిదవ భాగము) ఏంచెయ్యాలా అని ఆలోచించి, దానిని మరలా సుమిత్రకు ఇచ్చాడు.
ఈ ప్రకారంగా ప్రజాపతి ప్రసాదించిన పాయసమును దశరథుడు తన ముగ్గురు భార్యలకు పంచి ఇచ్చాడు. కాని దశరధుని భార్యలు తమకు పాయన పంపకంలో హెచ్చుతగ్గులు వచ్చినందుకు ఏ మాత్రం చింతింపక, పాయసము దొరికి తమకు పుత్రసంతానము కలగడమే మహాభాగ్యం అనుకొని సంతోషించారు.
కాల క్రమేణా కౌసల్య, సుమిత్ర, కైకేయిలు గర్భవతులయ్యారు. ఆ వార్త విని దశరధుడు పరమానంద భరితుడయ్యాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తదశః సర్గలో, రావణుని సంహరించడంలో రాముడికి సహాయం చేయమని బ్రహ్మ ఆదేశం మేరకు దేవతలు పూర్వీకులు వానర వీరులుగా మారారు. కోతి లాంటి వానర జాతి అనేక మంది ఖగోళ జీవులచే సంతానోత్పత్తి చేయబడింది, దీనికి విచిత్రమైన శక్తివంతమైన శరీరాకృతి మరియు రాముడికి సహాయం చేయడానికి ప్రత్యేక శక్తి ఉంది.
ఆ విధంగా విష్ణువు దశరథునికి పుత్రుడుగా జన్మించాలి అని నిర్ణయించుకొన్న తరువాత బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారితో ఇలా అన్నాడు.
శ్రీ మహావిష్ణువు రావణాసురుని సంహరించడానికి మానవ రూపంలో జన్మించబోతున్నాడు. మీరంతా ఆయనకు సాయంగా వెళ్లాలి. మీ మీ అంశలతో కామరూపులు, అత్యధిక బలవంతులు అయిన పుత్రులను సృష్టించండి. వారికి అన్ని మాయలు తెలిసి ఉండాలి. వారు శూరులు గానూ, వాయువేగముతో ప్రయాణించగలవారు గానూ అయి ఉండాలి. విష్ణువుతో సరి తూగ గల పరాక్రమ వంతులు అయి ఉండాలి. అదే కాకుండా నీతి మంతులు అయి ఉండాలి. వారు ఎవరి చేత గానీ, ఏ ఆయుధము చేత గానీ చంపబడకూడదు. సర్వ అస్త్ర సంపన్నులు అయి ఉండాలి. అటువంటి వారిని మీరందరూ అప్సరసల యందు, గంధర్వ స్త్రీలయందు సృష్టించండి. వారందరూ వానరులు అయి ఉండాలి. ఇంతకు ముందే జాంబవంతుడు అనే ఋక్ష శ్రేష్టుడు (ఎలుగుబంటి) నేను ఆవలించి నపుడు నా ముఖము నుండి పుట్టాడు. వీరందరూ ఆ జాంబవంతునికి తోడుగా ఉంటారు.” అని పలికాడు.
బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము దేవతలు అందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు.
దేవేంద్రుని అంశతో వాలి జన్మించాడు.
సూర్యుని అంశతో సుగ్రీవుడు జన్మించాడు.
బ్రహస్పతి అంశతో తారుడు అనే వానరుడు జన్మించాడు.
కుబేరుని అంశతో గంధమాధనుడు అనే వానరుడు పుట్టాడు.
అగ్ని అంశతో నీలుడు, అశ్వినీ దేవతల అంశలతో మైందుడు, ద్వివిదుడు, వరుణుని అంశతో సుషేణుడు, పర్జన్యుని అంశతో శరభుడు, వాయుదేవునికి హనుమంతుడు, ఇంకా అనేకానేక దేవతల అంశలతో లక్షల కొద్దీ వారనులు సృజింపబడ్డారు.
వారందరూ కాపరూపులు, బలశాలురు. ఆ వానరులు ఏ దేవతల అంశలతో జన్మించారో ఆ వానరులకు ఆయా దేవతల శక్తులు, బలపరాక్రమములు సంక్రమించాయి. ఆ వానరులందరూ యుద్ధ విద్యలో కౌశలము కలవారు. వారి ఆయుధములు శిలలు, వృక్షములు, వారి గోళ్లు, దంతములు. వారందర ఋక్షవత పర్వతము మీద నివసిస్తున్నారు.
ఆ వానరులందరూ తమ తమ నాయకులుగా వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలగు వారిని సేవిస్తున్నారు. అమిత బలశాలి అయిన వాలి తన బాహు బలముతో వానరులందరినీ రక్షిస్తున్నాడు. ఆ వానరులు ఈ భూమి అంతా ఆక్రమించి ఉన్నారు. ఆ వానరులందరూ శ్రీ రామునికి సహాయము చేయుటకు సృష్టింప బడ్డారు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదిహేడవ సర్గ సంపూర్ణము.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం (Mangala Gowri Puja). ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రావణ మంగళగౌరీ వ్రత విధానము గురించి తెలుసుకుందాం…
Sravana Mangala Gowri Vratham (Puja, Katha) In Telugu
శ్రావణ మంగళగౌరీ వ్రతకల్పం
పూజా సామాగ్రి
పసుపు
కుంకుము
పండ్లు
పూలు
తమలపాకులు
ఒక్కలు
అగరబత్తులు
కర్పూరం
గంధం
అక్షతలు
కొబ్బరికాయ
నేతి దీపము
తైలదీపము
వస్త్రము (ప్రత్తితో తయారు చేయవచ్చు)
నాలుగు తోరములు
5 జ్యోతులు
కత్తి
ఇనుపకాడ
నానబెట్టిన శనగలు
నైవేద్యము
కొబ్బరి, పండ్లు, పిండి వంటలు
పూజా మంటపము
పసుపుతో గౌరిని, వినాయకుడిని చేసి రెండు తమలపాకుల మీద ఉంచాలి. అవే అన్ని మంగళవారములు వాడచ్చు. నీళ్ళు, ఉద్దరిణ, హరివాణం.
సాంప్రదాయ పద్ధతులు
1. ప్రాతః కాలం లేచి ఏర్పాట్లు చేయాలి.
2. స్నానము చేసాక 100 గ్రా. బియ్యం పిండి, 10 గ్రా. బెల్లం, నీళ్ళు కలిపి గట్టి ముద్ద చేయాలి (పిష్టము). దాన్ని 5 భాగాలు చేయాలి. 5 ప్రమిదలు చేసి నెయ్యి వేసి వత్తులు వేసి దీపం వెలిగించాలి.
3. దారం మూరెడు తీసుకుని 5 వరసలు తీసి, దానికి 5 గ్రంధులు (ముడులు) వేయాలి. ముడులలో పూవులు పెట్టచ్చు. 4 తోరాలు ఇలా (1 అమ్మవారికి 2 మీకు 3 కాటుక చేసే కత్తికి 4 మొదటి వాయనం ఇచ్చే స్త్రీకి) చేయాలి.
4. తల్లికి మొదటి వాయనం ఇవ్వాలి. కుదరని పక్షంలో ఎవరైన ముత్తైదువకి ఇవ్వాలి. దక్షిణ, పసుపు, కుంకుమ రవికె గుడ్డ యిచ్చి వీలుంటే భోజనం పెట్టాలి.
5. మొదటి సంవత్సరం 5 గురికి తర్వాత 10 మందికి ఇలా పెంచు కుంటూ పోవాలి. కుదరక పోతే ఐదుగురికే ప్రతి ఏడు ఇవ్వచ్చు.
6. వాయనం ఇచ్చే స్త్రీని గౌరీగా భావించి పాదాలకు పసుపు రాసి శెనగలు, పళ్ళు, పూలు, తాంబూలం కాటుక ఇచ్చి నమస్కారం చేసి ఆశీర్వాదం పొందాలి.
7. నెయ్యి జ్యోతులు (పిష్టము) సాయంత్రంలోగా తినాలి. మీరు తినలేక పోతే 5 సువాసినులకు వాయంనంతో కూడా యిచ్చి వాళ్ళని తినమనవచ్చు.
8. 5వ సంవత్సరం పూర్తి అయ్యాక ఉద్యాపనకి 32 అరిసెలు ఒక కొత్త పాత్రలో పెట్టి రవికె గుడ్డ వాసన కట్టాలి. పసుపు, కుంకుమ, మంగళ సూత్రాలు మట్టెలు పెట్టి ఎవరైనా పెళ్ళిలో కొత్త పెళ్ళికూతురుకి వాయనం ఇవ్వాలి.
9. మొదటి మంగళవారము పుట్టింట్లో చేసుకోవాలి. కుదరని పక్షంలో వాళ్ళింట్లోనే చేసుకోవచ్చు. పూజలో పెట్టిన దక్షిణ సొమ్మును ఎవరైనా బ్రాహ్మణుడికి గాని, కుదరని పక్షంలో ఏదైనా గుడిలో హుండీలో గాని ‘పరమేశ్వరి అర్పణం’ అని వేయాలి.
నేను అనేక జన్మలనుండి ఇప్పటి వరకు చేస్తూ వస్తున్న పాపములు హరించి పోవుటకు ఈశ్వరుని ప్రీతి కొరకు, శుభప్రదమైన ఈ ముహూర్తమందు శ్రీమహావిష్ణువు ఆజ్ఞ చేత సృష్టి కార్యము నిర్వహిస్తున్న ఇప్పటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క జీవితకాలంలోని రెండవ సగభాగం లో జరుగుతున్న శ్వేత వరాహకల్పమందు, అందులో వైవస్వత మన్వంతరము నందు, అందులో 28వ మహా యుగములోని కలియుగంలోని 4 భాగాలలోని మొదటి నాలుగవ భాగమందు ఈ విశ్వంలోని జంబూద్వీపమందున్న భరతవర్షమునందు భరత ఖండమందు, మేరు పర్వతమునకు దక్షిణ దిక్కునందు శ్రీశైల క్షేత్రమునకు …………….. దిక్కునందు, (కృష్ణా, గోదావరి, కావేరి) …………………. జీవనదుల మద్యనున్న భూభాగమందు, వసతి గృహమందు, (స్వగృహమైతే స్వగృహమందు) చాంద్రమాన ప్రకారంగా ఇప్పటి …………………….. సంవత్సరంలో దక్షిణాయనమందు, వర్షఋతువులోని శ్రావణ మాసంలో శుక్లపక్షము (పౌర్ణమి ముందైతే) కృష్ణపక్షము (అమావాస్య ముందైతే) మంగళవారమందు శుభమైన ఈ రోజున ………………….. గోత్రం, ………………. పేరు నాయొక్క, నాకుటుంబ సభ్యుల యొక్క అన్ని పాపములు నశించుటకు మాకందరికి క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్యములు సిద్ధించుటకు, ధర్మము, ధనము, కోరికలు, మోక్షము అనే నాలుగు పురుషార్ధములు సిద్ధించుటకు ప్రత్యేకించి నేను నా జీవిత పర్యంతము పసుపు కుంకుమలతో సుఖముగా జీవించుటకు, మంచి ప్రవర్తన కలిగిన కుమార్తెలు, కుమారులు, మనుమలు, మనుమరాళ్ళు కలుగుటకు, శ్రావణ మంగళ గౌరి ప్రీతి కొరకు, నాశక్తి మేరకు నేను ఏర్పాటుచేసిన పూజా ద్రవ్యములతో, యథా శక్తిగా శ్రీసూక్తమంత్రములతో, కలశములోని శ్లోకములతో అమ్మవారికి 16 ఉపచారములతో కూడిన పూజను, ఆ పూజ తర్వాత కథా శ్రవణమును చేయుచున్నాను. ఏ విఘ్నములు లేకుండా పూజ జరుగుటకై వినాయకుని పూజచేస్తున్నాను.
కలశపూజ
తదంగం కలశారాధనం కరిష్యే, కలశం శుద్ధోదకైః గంధ పుష్పాక్షతై రభ్యర్చ్య – (పరిశుద్ధమైన నీరు నింపిన కలశమును గంధముతోడను, అక్షతల తోడను అలంకరించవలెను. అలంకరించిన పూవును నీటిలో వేసి (మధ్యవేలు పక్కవేలుతో పూవు పట్టుకొని నీటిలోకదుపుతూ క్రింద శ్లోకమును పఠించవలెను. అనంతరము కుడిచేతి వ్రేళ్ళతో కలశమందలి జలమును తాకుచు ఈ క్రింది శ్లోకములను శ్రద్ధగా పఠించవలయును.)
ఈ విధముగా చదివి కలశములోని జలమును పూజాద్రవ్యములపై చల్లి, తరువాత తన తలపై చల్లుకొనవలయును. అనంతరము పసుపుతోగాని, స్వర్ణముతోగాని సిద్ధము చేసికొనిన గౌరీదేవిపై కలశోదకమును చల్లవలెను
అథగణపతిపూజా
మంత్రః: గణానాం త్వా గణపతిగ్ం హవామహే,
కవిం కవీనా ముపమశ్రవస్తమం,
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత,
ఆ న శ్శృణ్వ న్నూతిభి స్సీదసాదనమ్.
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః మహానైవేద్యం సమర్పయామి అని చదువుచు కళాశాంతర్గత జలమును తన కుడిదిక్కుగా చల్లుకొనవలెను. అనంతరము ఏయే పదార్ధములు నైవేద్యముగా పెట్టుచుండిమో ఆయా పదార్థములపై పువ్వులతో కలశమునందలి నీరుజల్లవలెను. వానిచుట్టు వీరు త్రిప్పవలెను. ‘అమృతమస్తు’ అనుచు కలశోదకమును పళ్ళెములో వేయవలెను. ‘అమృతోపస్తరణమసి’ అని శ్రీ మంగళ గౌరిదేవికి పదార్థములు సమర్పించవలెను.
ఓం ప్రాణాయ స్వాహా – ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా – ఓం ఉదానాయ స్వాహా – ఓం సమానాయ స్వాహా ॥
అని చెప్పి ఎడమచేయి ఆనించి కుడిచేతిలో ఒక పువ్వునుంచుకొని శ్రీశ్రీ మంగళగౌరీదేవికి నైవేద్య మొసగవలెను.
మధ్యే మధ్యే ఉదకం సమర్పయామి.
అమృతాభిధానమసి, ఉత్తరపోశనం సమర్పయామి.
హస్తా ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ్యాచమనీయం సమర్పయామి అని అయిదుసార్లు ఒక పువ్వుతో ఉదకము జల్లవలెను.
హ్రీం శ్రీం మంగళగౌరీదేవతాయై నమః
ముఖమండనార్ధం తాంబూలం సమర్పయామి.
అనుచు వివిధ సుగంధ ద్రవ్య పరిమళ సంయుతమైన తాంబూలమును మంగళగౌరి చెంత నుంచవలెను.
హ్రీం శ్రీం మంగళగౌరీదేవతాయై నమః
ఆనంద నీరాజనం సమర్పయామి.
అని హారతి వెలగించి మహిమాన్వితశక్తి అయిన దేవికి చూపించుచు మంగళహారతి పాడవలెను.
మంగళహారతి
చల్లని చూపులతో ఎల్లవారల బ్రోచు మంగళగౌరికి జయమంగళం
ఎల్లవేళల బ్రోచే ఉల్లమునగల అమ్మ మంగళగౌరికి శ్రీమంగళం
శ్రద్ధతో పూజించి భక్తితో ప్రార్ధించ
వెంటనే దయచూపు దేవి మా అంబికకు
||జయ||
వృద్ధులూ, పిన్నలూ అందరూ హృదయాల ధ్యానించు గారికి
||జయ||
సర్వశోకమ్ములూ సర్వవిధ బాధలూ
పూజించ తొలగించు మాతల్లి గారికి
సర్వవేళల గాని ఏ వేళను గాని పూజించ మేలేయు తల్లి మా గారికి
పాపములనెల్ల పటాపంచలుగ జేయుచూ
కరుణనే వర్షించు దయామతల్లికి
అనంతరము 16 వత్తులు గల ఆవునేతి దీపాలు వెలుగజేసి తరువాత కథ వినవలెను. కాటుక ధరించి దేవీ ప్రసాదముగు పూవును తలయందును, కుంకుమను నుదుటను ధరించవలెను.
శ్రీమంగళగౌరీ పూజావిధానము సంపూర్ణము
శ్రీ శ్రావణమంగళగౌరీ వ్రత కథ
ఒకప్పుడు సూత మహాముని శౌనకాది మహర్షులకు చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరీ మహత్యమును, నారదమునీంద్రులు సావిత్రీదేవి కుపదేశించిన మంగళగౌరీ వ్రత కథయు, పూజావిధానమును, ఒకరోజు ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు.
“ద్రౌపదీ! పరాశక్తియే మంగళగౌరీగ పేరు పొందింది. ఏ స్త్రీల పైనైతే మంగళగౌరీ దేవి కటాక్షము ఉంటుందో వారికి వైధవ్యము ఉండదు. సర్వవిధ సౌభాగ్యములు కలుగుతాయి. ఈ పూజను శ్రావణ మాసములో వచ్చే మంగళవారములు చేయాలి.
మంగళగౌరిదేవి పసుపు, కుంకుమ, పూలు, సుగంధం మొదలైన మంగళ ద్రవ్యాలలోను ఆవు నేతితో వెలిగించిన దీపంలోనూ భాసిల్లుతుంది. ఆమెను పూజించి పునీతులైన స్త్రీలెందరో ఉన్నారు.
త్రిపురాసురుని చంపటానికి వెళ్ళే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. ఆమెను పూజించటం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. మను వంశజుడైన ‘మండు’ డనే రాజు గౌరీదేవి వ్రత ప్రభావము వల్లనే చాలా కాలము భూలోకములో సర్వసంపదలతో రాజ్యమేలాడు.
అతనికి అటువంటి గౌరీదేవిని పూజించి, వైధవ్యము తొలగించుకొని అదృష్టవంతురాలైన ఒక స్త్రీ గురించి చెప్తాను విను. చాలా కాలము కిందట మాహిష్మతీ నగరాన్ని జయపాలుడనే రాజు పాలించుచుండెను. అపైశ్వర్యములు ఉన్నా పిల్లలు లేరు. అందు కోసం అతను బాధపడని రోజు లేదు, చేయని పూజలు లేవు. నోచని నోములులేవు. మొక్కని దేవుడు లేడు, చేయని పుణ్యకార్యము లేదు. కాని ఫలితం మాత్రం శూన్యం.
చివరకు పరమేశ్వరునికి అతనిపై కరుణ కలిగి, ఒక సన్యాసి రూపంలో అతని అంతఃపురం ముందు నిల్చుని ‘భవతీ భిక్షాం దేహి’ అని పిల్చాడు. కాని జయపాలుని భార్య పళ్ళెంలో అన్నీ సమకూర్చుకుని తెచ్చేలోగా వెళ్ళిపోయాడు. ఇలా వరసగా మూడు రోజులు జరిగింది. జయపాలుని భార్య ఈ విషయం భర్తకి చెప్పి బాధపడితే అతను ‘ఓ భార్యామణీ! అతడు ప్రతిరోజూ మధ్యాహ్నం కదా వస్తున్నాడు. అతను వచ్చే సమయానికి ముందే అన్నీ సిద్ధం చేసుకుని కూర్చో! అతను రాగానే వేయచ్చు’ అన్నాడు.
ఈ సలహా బాగుందనిపించి సరే అంది. అయినా ఆమె కర్మ పరిపక్వం కాలేదింకా! అట్లాగే సన్యాసి వచ్చేసరికి ఆమె బంగారు పళ్ళెంతో ఎదురెళ్ళినా ఆ సన్యాసి ‘పుత్ర పౌత్రులు లేని నిర్భాగ్యులు మీరు! అలాంటి వారి దగ్గర ఆతిథ్యము కాని, భిక్షకాని స్వీకరించము’ అన్నాడు. అప్పుడు ఆమె సంతానము కలుగు మార్గము చెప్పి పుణ్యము కట్టుకోమని బతిమాలింది. అందుకా సన్యాసి ‘నేను చెప్పబోయేది శ్రద్ధగా విని వీభర్తకు చెప్పు నీకోరిక తీరుతుంది’ అన్నాడు.
‘నీ భర్తను తూర్పువైపు ఒంటరిగా వీల వస్త్రం ధరించి, వీలం గుఱ్ఱం పైన వెళ్ళమను. అతని గుఱ్ఱం అడవిలో ఎక్కడైతే అలసటతో కింద పడుతుందో అక్కడ తవ్వనును. అక్కడ ఒక బంగారు దేవాలయముంటుంది. అందులోని భగవతిని పూజించితే మీ కోరిక తీరుతుంది అని చెప్పి పరమేశ్వరుడు అంతర్థాన మయ్యాడు. జయపాలుడు కూడా స్వామి చెప్పినదంతా తూచా తప్పకుండా పాటించి భవాని దేవాలయమున భవానిని ప్రార్థించాడు. అతని భక్తికి మెచ్చి భవాని ప్రత్యక్షమయి ఏం కావాలో కోరుకోమంటే సంతానం కావాలన్నాడు. అప్పుడు ఆ తల్లి! ‘వైధవ్యము కల కూతురు కావాలా ? అల్పాయుష్కుడు, సజ్జనుడైన కొడుకు కావాలా ?’ అంది. అతను ఆలోచించి పున్నామ నరకం నుండి తప్పించే కొడుకే కావాలన్నాడు. అప్పుడాదేవి తన పక్కనే ఉన్న గణపతి దగ్గరనున్న మామిడిచెట్లు మీది ఫలాన్ని అతని భార్య కిమ్మని చెప్పి అంతర్ధాన మయింది. జయపాలుడు ఆశకొద్దీ దాని మీదున్న పండ్లవ్నీ కోసాడు. కాని అన్నీ మాయమయి ఒక్కటే మిగిలింది. గణపతికి అలాకోసి నందుకు కోపం వచ్చి నీ ఈ చర్యవల్ల నీకు పుట్టబోయే కొడుకు పదహారో ఏటనే పాము కాటువల్ల మరణిస్తాడని శాపం ఇచ్చాడు.
ఫల ఫలితంగా జయపాలునికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ‘శివుడు’ అని నామకరణ చేసారు. అతన్ని అల్లారుముద్దుగా పెంచు కుంటున్నారు. ఒకరోజు అతనికి ఆయుష్షు తీరిందని యమభటులు వచ్చారు. అప్పుడు జయపాలుని భార్య తన ముద్దుముచ్చట తీరనే లేదు కొన్నాళ్ళు ఆగి రమ్మని కోరింది. ‘ఈశ్వర వరప్రసాదుడు’ కాబట్టి యమభటులు ఏమీ చేయలేక వెళ్ళిపోయారు.
తల్లి ఎందుకో దుఃఖిస్తూండటం చూసి శివుడు కారణమడిగాడు. తల్లి అతని జన్మ వృత్తాంతం చెప్పింది. వెంటనే శివుడు ‘నేను పోయి ఆ ఈశ్వరుడినే అడుగుతాను. నువ్వు చింతపడకు. నాకు తోడుగా మామయ్యని పంపు. కాశీకి పాయి విశ్వేశ్వరుని వేడుతాము’ అన్నాడు. ఇంట్లో ఒక తులసి మొక్కని నాటి దానికి రోజూ పూజచేయమని తనకేదన్నా ఆపద కలిగితే ఆ తులసి వాడిపోతుందని చెప్పి బయలుదేరాడు.
త్రోవలో వాళ్ళు ప్రతిష్ఠాన పురము చేరారు. అక్కడ ఒక తోటలో కొందరు అమ్మాయిలు పూలుకోస్తూంటే అందులో ఒకమ్మాయి సుశీల అనే అమ్మాయిని ‘ముండ’ ‘రండ’ అని తిట్టింది. దానికా సుశీల మా అమ్మ మంగళ గౌరీ వ్రతం చేస్తుంది. కాబట్టి మా వంశంలో ఎవరూ ముండలు రండలు ఉండరు అని కోపంగా అంత వరకూ కోసిన పూలనునేల మీదికి విసిరేసింది. ఆశ్చర్యంగా కింద పడ్డ పూలన్నీ చెట్లమీదకి చేరిపోయాయి.
ఈ వింత చూసిన శివుడు ‘ఈ అమ్మాయికి ఏదో మహిమ ఉన్నట్లుంది. ఇలాంటి అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుండును” అనుకున్నాడు.
సరిగ్గా అదే సమయానికి పక్కన ఉన్న గుడిలో సుశీల తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకు పూజచేసి ‘ఓ దేవదేవా! మా చిన్నారి తల్లికి తగ్గ భర్తని నీవే చూపించాలి!’ అని వేడుకున్నారు. అలా వేడుకుని గుడి బయటకి రాగానే కనిపించిన స్పురద్రూపి యైన శివుడ్ని చూసి, అతని పేరు ‘శివుడు’ ని తెలుసుకొని ఆ పరమ శివుడే ఈ శివుడ్ని పంపారని భావించి, అతని మేనమామతో సంప్రదించి రాత్రికి రాత్రే పెళ్ళి జరిపించారు. వాళ్ళపెళ్ళిలో సుశీల తల్లి తన కూతురికి తను చేసిన మంగళగౌరి నోము ఉద్యాపన చేసింది.
తర్వాత భార్యా భర్తలు భోజనం చేసి బ్రహ్మచర్య వ్రతులై దర్భాసనం మీద పడుకున్నారు. ఆ రాత్రి మంగళగౌరి ముత్తయిదువు రూపంలో సుశీలకి కలలో కనబడి, నీ భర్త అల్పాయుష్కుడు. ఈ రాత్రితో అతని ఆయువు మూడింది. నేను చెప్పినట్లు చేయి. కాసేపటికి ఒక కృష్ణసర్పము అతని కాలేయటానికి వస్తుంది. నువ్వు పాలున్న ఒక కుండను తెచ్చి ఆ పాము ఎదురుగా పెట్టు. ఆ పాము ఆ కుండలో కెళ్ళగానే నీవు ఒక వస్త్రాన్ని దానిపై కప్పేసి గట్టిగా కట్టేసి, మీ అమ్మకు దానిని వాయనంగా ఇయ్యి. నీ భర్తకి గండం గడుస్తుంది! అన్నది.
సుశీల వెంటనే లేచి కూర్చుంది. గౌరీదేవి చెప్పినట్లే జరిగింది. కాళ్ళపారాణి ఇంకా ఆరని పాదం, తన భర్త తొడమీద ఉంచి ఎత్తుగా నున్న కుండని తీసింది. సుశీల కూడా గౌరీదేవి చెప్పినట్లు ఆ కృష్ణ సర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేసింది. కాసేపటికి ఆమె భర్త లేచి ఆకలేస్తుంది ఏమన్నా పెట్టమంటే అలాగే కొన్ని భక్ష్యములు పెట్టింది. అతను అవన్నీ తింటుండగా అతని చేతికున్న ఉంగరం జారిపడిపోయింది. అతను చూసుకోలేదు. తర్వాత ఇద్దరూ నిద్రపోయారు. తెల్లవారక ముందే శివుడు మేనమామతో వెళ్ళిపోయాడు. శివుడికి శివకటాక్ష సిద్ధికోసం బయలుదేరానన్న తన కర్తవ్యం గుర్తొచ్చి కాశీకి వెళ్ళిపాయాడు, భార్యకి ఏవివరం చెప్పకుండానే. సుశీల లేచి చూసి భర్త పక్కన లేకపోవటం చూసి ఖిన్నురాలై అతని చేతినుంచి జారిన ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంది.
ఉంగరం వదిలి వెళ్ళిన తన పతిదేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, అతన్ని తాను గుర్తించటానికి వీలుగా అతనికి అతిధిమర్యాదలు చేయటానికి వీలుగా ఒక సత్రం కట్టించమని సుశీల తన తండ్రిని కోరింది. తండ్రి ఆమె కోరిక తీర్చాడు. సుశీల ఆ ఉంగరం ధరించి అతిథులకి రోజూ కాళ్ళు కడుగు తుండేది. దాదాపు ఏడాది అవుతుండగా కాశీ వెళ్ళిన శివుడు అతని మేనమామ వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. దోవలో అతనికి, తను చనిపోతునట్లూ అప్పుడు మంగళగౌరియు, యమదూతలు తన విషయంలో వాదించుకుంటున్నట్లు కల వచ్చింది. వాళ్ళు మరలా ప్రతిష్ఠాన పురం కొచ్చి ఈ అన్నదాన సత్రం దగ్గరికి వచ్చారు. సుశీల అతని కాళ్ళు కడుగుతుండగా గుర్తుపట్టి, అతనే తన భర్త అని తల్లిదండ్రులకి చెప్పింది. తన స్వప్న వృత్తాంతం చెప్పగానే అతన్ని పరీక్షించగా ఉంగరం అతనికి సరిగ్గా సరిపోయింది. ఆ కుండ తెచ్చి చూస్తే అందులో ముత్యాల హారం ఉంది. అదే దేవి ప్రసాదంగా స్వీకరించారు. దైవకృపవల్ల ఆ కాళ్ళపారాణి ఆరని కాలిగుర్తు అతని తొడమీద కనబడింది. శివుడు కూడా తను ఎందుకుఅలా వెళ్ళాడో వివరించాడు. శివుడు భార్యతో కూడి తన తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరాడు.
పుట్టింట్లో మంగళగౌరీ నోము నోచుకుని, భర్తతో కలిసి అత్తమామల ఊరు వచ్చింది సుశీల. అన్నాళ్ళుగా కొడుకు జాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అతని తల్లితండ్రులు అంధులై పోయారు. సుశీల మంగళ గౌరీ నోములో పట్టిన కాటుక వారి కళ్ళకు పెట్టగానే వారికి తిరిగి చూపు వచ్చింది. కొడుకుని తిరిగి కళ్ళారా చూసుకున్న వారి ఆనందానికి అవధులు లేవు. అల్పాయుష్కుడైన తన కొడుకు ఆయుష్షు ఎలా వృద్ధి అయిందన్నాడు జయపాలుడు.
దానికంతా కారణం తాను నోచిన నోములేనని మంగళగౌరీ కృప అని తన స్వప్న వృత్తాంతం తెలిపింది. పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు. ఆపురుషుడికి మంచి ఆయుష్షు లేకపోయినా అతన్ని చేసుకున్న భార్యాశిరోమణి చేసిన పుణ్యకార్యాలవల్ల పూజా విధముల వల్ల అతనికి మేలే జరుగుతుంది అన్న విషయం వెల్లడి అవుతోంది.
ఓ ద్రౌపదీ! మంగళగౌరీ వ్రతముతో ప్రసాదముతో వైధవ్యం లేకుండా చేసికొనవచ్చు అని చెప్పాడు కృష్ణుడు. ఓ ద్రౌపదీ! మంగళగౌరీ వ్రతముతో ప్రసాదముతో వైధవ్యం లేకుండా చేసికొనవచ్చు అని చెప్పాడు కృష్ణుడు.
వ్రత ఉద్యాపనం
ఈ వ్రతం పెళ్ళి అయిన సంవత్సరం నుంచి ప్రారంభించి, అయిదు సంవత్సరాలు చేయాలి అయిదవ సంవత్సరం ఆఖరి శ్రావణ మంగళ వారమున పగటి వేళ మంగళగౌరిని యథావిధిగా పూజించాలి. దంపతులు ఉపవాసం ఉండాలి. రాత్రివేళ మంటపము మొదలైనవి పెట్టి, అక్కడ 16 కలశాలు పెట్టాలి. అందులో ఉమా మహేశ్వరులని, బ్రహ్మని, విఘ్నేశ్వరుని, స్కందుని, శేవీ పురందరులని, సప్త మాతృకలను, సావిత్రిని, లక్ష్మీనారాయణులని, సర్వ దేవతలను, నవగ్రహములను పూజించాలి. శక్తి లేకపోతే 5 కలశాలే చాలు. లేదా 2 పెట్టినా చాలు. మర్నాడు స్నానం చేసి బెల్లము, జీలకఱ్ఱ, పరమాన్నము, నెయ్యి, రావి సమిధలు, గరికపోచలతో హోమము చేయాలి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే, శరణ్యే త్ర్యంబకే దేవి ! నారాయణి నమోస్తుతే అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవిజ్ఞాన సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధనా శ్శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ అను మంత్రమే ప్రధానము. 6 పాత్రలలో, మంగళ ద్రవ్యాలతో ముల్లై దువులకు వాయనములు ఇవ్వాలి.
16 వత్తుల దీపములు పదహారింటిని వెలిగించాలి. ముత్తైదు వులను, దంపతులను భోజన చందన తాంబూలాది సత్కారములతో పూజించి ఆనంద పరచాలి. ఇది చాలా మహిమగల వ్రతము. ఈ నోము నోచుకున్న వారందరూ మంగళగౌరి కృపతో ‘యావజ్జీవ మాంగల్య సౌభాగ్య పుత్ర పౌత్ర ఆయురారోగ్యములతో వర్థిల్లుగాక.’ ప్రతి సంవత్సరం మొదటి మంగళవారం చేసిన పసుపు గౌరిని, గణపతిని అన్ని వారాలకి వాడచ్చు. అన్ని వారాలు అయ్యాక ‘మహాగణపతయే సర్వమంగళ రూప మంగళ గౌర్యై ఉద్యాపన సమర్పయామి’ అని ఉద్యాపన చేయాలి.
“రామాయణం” లో అయోధ్యాకాండ చతుర్దశః సర్గం (14వ సర్గ) చాలా ముఖ్యమైనది. ఈ సర్గలో, రాముడు, సీత మరియు లక్ష్మణులు వనవాసానికి బయలుదేరడం ప్రారంభమవుతుంది. రాముడు తన తల్లి కౌసల్యతో వీడ్కోలు చెబుతాడు. కౌసల్య తన బాధను వ్యక్తం చేస్తుంది, కానీ రాముడు ఆమెను సాంత్వన చేస్తాడు మరియు ధర్మాన్ని పాటించాల్సిన అవసరాన్ని వివరిస్తాడు. తదుపరి, రాముడు తన సోదరి శాంతాతో మరియు సుమిత్రతో కూడా వీడ్కోలు చెప్పి ఆశీర్వాదాలను పొందుతాడు. సుమిత్ర తన కుమారుడు లక్ష్మణుని ధైర్యాన్ని ప్రశంసిస్తుంది మరియు రాముని సేవ చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సర్గలో, రాముడు, సీత మరియు లక్ష్మణులు రథంలో బయలుదేరి, అయోధ్య నగరాన్ని విడిచిపోతారు. ప్రజలు తీవ్ర విచారంలో వీరి వెంబడి నడుస్తారు, కానీ రాముడు వారిని సాంత్వన చేస్తాడు. రాముడి ధైర్యం, విధేయత మరియు ధర్మపరమైన కట్టుబాట్లు ఈ సర్గలో స్పష్టంగా కనిపిస్తాయి.
కైక మరలా తన ధోరణిలో దశరథునితో ఇలా అంది.
“ఓ దశరథమహారాజా! నీవు నీ ప్రాణాపాయ దశలో నాకు ఇస్తాను అన్న వరాలు రెండింటి ఈనాడు నేను కోరాను. ఆ మాత్రానికే ఇలా నేల మీదపడి దొర్లి దొర్లి ఏడవవలెనా! ఇది ఒక మహారాజుకు మర్యాదగా ఉంటుందా! ఆడిన మాట తప్పకపోవడం, ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడటం ఏనాటినుంచో ఉన్న ధర్మము. నేను అదే చెబుతున్నాను. తమరిని సత్యము ధర్మమును పాటించమంటున్నాను. ఆడినమాట తప్పవద్దు అని అంటున్నాను. ఇదేనా నేను చేసిన తప్పు. మీపూర్వులైన శిబిచక్రవర్తి, అలర్కుడు అనుసరించిన మార్గమునే మీరూ అనుసరించి కీర్తి ప్రతిష్టలు పొందమంటున్నాను. అదేనా నేను చేసిన పాపం.
“సత్యము పరబ్రహ్మస్వరూపము. ధర్మమునకు సత్యమే మూలము” అని మీకు నేను చెప్పదగిన దానిని కాదు. తాము సర్వజ్ఞులు. తమరికి అన్నీ తెలుసు. ఆ సత్యనిష్టను, ధర్మనిరతిని నేను పాటించమంటున్నాను. అన్న మాటను నిటబెట్టుకోమంటున్నాను. ధర్మము పాటించమంటున్నాను. నాకు ఇస్తానన్న వరాలు ప్రసాదించండి. అదే నేను కోరేది. నేనేమీ కొత్తగా కోరడం లేదు. నీవు ఆనాడు ఇస్తాను అన్న వరాలే ఈ నాడు అడుగుతున్నాను. అదే ధర్మము. ఆ ధర్మాన్ని నిలపడం కోసం రాముని అడవులకు పంపండి. మరొక మాట వద్దు. “రాముని అడవులకు పంపాలి”, “రాముని అడవులకు పంపాలి” “రాముని అడవులకు పంపాలి” అని మూడు మార్లు నొక్కి చెబుతున్నాను.
ఓ దశరథమహారాజా! మీరు నాకు ఇచ్చిన వరములను తీర్చకపోయినట్టయితే మీరు నన్ను వదిలివేసినట్టే భావిస్తాను. భర్త వదలిన భార్యకు మరణమే శరణ్యము అందుకని నేను మీ ఎదురుగుండా ప్రాణత్యాగము చేసుకుంటాను. ఇది తథ్యము.” అని నిక్కచ్చిగా చెప్పింది కైక. దశరథునికి ఆఖరు ఆశ కూడా అడుగంటి పోయింది. రామునికి వనవాసము తథ్యము అనుకున్నాడు. కుప్పకూలిపోయాడు. అతని హృదయము బరువెక్కింది. ముఖము వివర్ణమయింది. కళ్లు కనిపించడం లేదు.
మరలా ధైర్యము కూడగట్టుకున్నాడు. కైకతో తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు. ” ఓసీ పాపీ! కైకా! అగ్నిసాక్షిగా నేను నీ పాణిగ్రహణము చేసాను. నీ పాణిగ్రహణము రోజు నేను ఏ చేతిని పట్టుకున్నానో ఆ చేతిని వదిలివేస్తున్నాను. దానితో పాటు నీ వలన నాకు పుట్టిన కుమారుని కూడా వదిలివేస్తున్నాను. ఇంక నీకూ నాకూ సంబంధం లేదు. నీవునా భార్యవు కావు. భరతుడు నా కుమారుడూ కాడు. నీవు నా కుమారుడు రాముని పట్టాభిషేకము చెడగొట్టావు. నేను మరణించిన తరువాత నీ కుమారుడు నాకు తిలోదకములు వదల నవసరము లేదు. రాముడే నాకు ఉత్తరక్రియలు నిర్వర్తిస్తాడు.
రాముని పట్టాభిషేకము అని నేను ప్రకటించగానే జనము హర్షధ్వానాలు చేసారు. ఇప్పుడు నేను రాముని అడవులకు పంపుతున్నాను అని తెలిసి అయోధ్యలో ఉన్న జనము దు:ఖములో మునిగిపోతారు. వారి దుఃఖము నేను చూడలేను. అందుకే రాముడు అరణ్యములకు పోకముందే నేను ప్రాణములు విడుస్తాను.” అని అన్నాడు దశరథుడు. ఇంతలో తెల తెల వారుతూ ఉంది.పక్షులు కిల కిలారావాలు చేస్తున్నాయి. కాని కైకకు ఇవేమీ పట్టలేదు. తనపట్టు నెగ్గించు కోవాలనే కోరిక తప్ప. అందుకే దీనంగా నేలమీద పడి ఉన్న దశరథుని చూచి ఇలా అంది.
” ఓ దశరథమహారాజజా! ఎందుకు చెప్పిన మాటలే చెప్పి నీవు బాధపడి అందరినీ బాధపెడతావు. జరగాల్సిన కార్యక్రమం చూడు. రాముని పిలిపించు. అతనికి నీ నిర్ణయాన్ని వినిపించు. రాముని వనవాసమునకు పంపించు. భరతునికి పట్టాభిషేకము ప్రకటించు. తూర్పు తెల్లవారుతోంది. త్వరగా కానివ్వండి.” అని తొందరపెట్టింది.
ఆ మాటలకు దశరథుడు చెళ్లున కొరడాతో కొట్టిన గుర్రము మాదిరి పైకి లేచాడు. నిర్వేదంగా ఉన్నాడు. ఆయన బుద్ధిపనిచేయడం మాని వేసింది.
“నేను ధర్మానికి కట్టుబడ్డాను. ధర్మబద్ధుడను. నేను రాముని చూడాలని అనుకుంటున్నాను. రాముని పిలిపించండి.” అని అన్నాడు. అప్పటికే తెల్లవారింది. శుభముహూర్తము సమీపిస్తూ ఉంది. వసిష్ఠుడు పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు తన శిష్యులు తీసుకొని వస్తుంటే అయోధ్యలో ప్రవేశించాడు.
అప్పటికే రాజవీధులన్నీ పన్నీటితో తడిపారు. పతాకాలు కట్టారు. తోరణాలు కట్టారు. రాజవీధులన్నీ రకరకాల పూలతో అలంకరించారు. చుట్టు పక్కల గ్రామాలనుండి వచ్చిన ప్రజలతో, అయోధ్య ప్రజలతో వీధులు క్రిక్కిరిసిపోయాయి. ప్రజలందరూ రామ పట్టాభిషేకము చూడ్డానికి ఉవ్విళ్లూరుతున్నారు.
వసిష్ఠుడు రాజమందిరము దగ్గరకు వచ్చాడు. అప్పటికే బ్రాహ్మణులు అసంఖ్యాకంగా అక్కడికి చేరుకున్నారు. వారిని చూచి వసిష్ఠుడు ఎంతో సంతోషించాడు. వారి మధ్యనుండి దారి చేసుకుంటూ రాజభవనము లోకి ప్రవేశించాడు. సుమంత్రుడు వసిష్ఠునికి ఎదురుగా వచ్చాడు. సుమంత్రుడు వసిష్ఠునికి నమస్కరించాడు. “సుమంత్రా! నీవు వెంటనే దశరథ మహారాజు వద్దకు పోయి నేను వచ్చినట్టు వారికి మనవి చెయ్యి. రామ పట్టాభిషేకమునకు కావాల్సిన సంభారములు అన్ని సిద్ధంగా ఉన్నాయి. అభిషేకమునకు గంగాజలమూ, పుణ్య నదీజలములు, సముద్రజలము సిద్ధంగా ఉన్నాయి. నవధాన్యాలు, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలూ, పూలు, పాలు, కన్యముత్తయిదువలు, ఏనుగులు, రథములు, ఖడ్గములు, ధనుర్బాణములు, పల్లకీలు, ఛత్రచామరములు, వింజామరములు, బంగారు కలశములు, తెల్లని ఎద్దు, తెల్లని గుర్రములు, పులి చర్మమూ, అగ్నిహోత్రము, రకరకాల వాద్య విశేషములు, చక్కగా అలంకరించుకున్న స్త్రీలు, గురువులు, విప్రులు, గోవులు, అయోధ్యాప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ రామ పట్టాభిషేకమునకు సిద్ధంగా ఉన్నారు. సూర్యోదయము అయింది.
శుభముహూర్తము సమీపిస్తూ ఉంది. కాబట్టి సుమంత్రా! నీవు రాజు గారి వద్దకు పోయి మేము వచ్చామని చెప్పి, తొందరగా సిద్ధంకమ్మను.” అని అన్నాడు వసిష్ఠుడు. ఆ మాటలు విన్న సుమంత్రుడు వసిష్ఠునికి నమస్కరించి దశరధుని వద్దకు వెళ్లాడు. అప్పటిదాకా జరిగిన విషయములు ఏవీ తెలియవు సుమంత్రునకు. అందుకని దశరథుని స్తుతించడం మొదలెట్టాడు. “మహారాజు దశరథులవారికి జయీభవ. విజయీభవ. ఈ పట్టాభిషేక మహోత్సవము తమరికి అపరిమితమైన సంతోషించు గాక! దేవేంద్రుని సారధి మాతలి ఇంద్రుని స్తుతించి నట్టు నేను దేవేంద్ర సమానుడైన తమరిని స్తుతిస్తున్నాను. స్వయంభువు, వేదవేదాంగ ములను సృష్టించిన వాడూ అయిన బ్రహ్మను స్తుతించినట్టు నేను తమరిని స్తుతిస్తున్నారు. ఉదయమే సూర్యుడు, రాత్రి చంద్రుడూ వచ్చి భూదేవిని మేల్కొలిపి నట్టు నేను తమరిని మేల్కొలుపుతున్నాను.
ఓ మహారాజా! సూర్యోదయము అయింది. రామ పట్టాభి షేకమునకు కావాల్సిన సంభారములు అన్ని సిద్ధంచేయబడ్డాయి. ఓ దశరథమహారాజా! తమరు వెంటనే మేల్కొని మంగళ స్నానం చేసి, రామ పట్టాభిషేకమునకు సిద్ధం కావాలని వసిష్ఠులవారి ఆదేశము. ఓ మహారాజా! తమరికి సూర్య చంద్రులు, శివకేశవులు, అగ్ని వరుణుడు, ఇంద్రుడు తమరికి సకలైశ్వర్యములు కలిగించుగాక! ఓ దశరథమహారాజా! వసిష్ఠులవారు బ్రాహ్మణసమూహములతో రాజద్వారము వద్ద తమరి రాక కోసం వేచిఉన్నారు. తమరు తొందరగా వచ్చి రామ పట్టాభిషేకమునకు అనుజ్ఞ ఇవ్వవలసినదిగా వేడుకొనుచున్నాను.” అనిపలుకుతున్న సుమంత్రుని పలుకులు విన్న దశరథునికి దు:ఖము ఇంకా ఎక్కువ అయింది. అమంగళము జరగబోతూ ఉంటే సుమంత్రుని మంగళవాచకములు దశరథునికి కర్ణకఠోరంగా వినిపించాయి.
“ఆపు. ఇంక చాలు” అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు సుమంత్రుడు భయపడిపోయాడు. ఒక పక్కకు ఒదికి నిలబడ్డాడు. ఇదంతా చూస్తూ ఉన్న కైక అక్కడకు వచ్చింది. “సుమంత్రా! రాత్రి అంతా మహారాజుగారు పట్టాభిషేక సన్నాహముల గురించి చర్చించి చర్చించి రాత్రి అంతా నిద్రలేకుండా గడిపారు. అందువలన కొంచెం చిరాకుగా ఉన్నారు. నీవు పోయి మహారాజు గారు రమ్మన్నారని చెప్పి శీఘ్రముగా రాముని ఇక్కడకు తీసుకొని రా.” అని ఆజ్ఞాపించింది కైక.
“అలాగే మహారాణీ! తమ ఆజ్ఞ నెరవేరుస్తాను. రాముని ఇక్కడకు వెంటనేరమ్మని మనవిచేస్తాను.” అని పలికి సుమంత్రుడు అక్కడినుండి వెళ్లిపోయాడు. అప్పటికే రాజద్వారము వద్ద నిలబడి ఉ న్న సామంతరాజులను, అయోధ్యలోని ధనవంతులను, పౌరులను చూచాడు సుమంత్రుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ రామాయణ కావ్యంలో రెండవ విభాగము. ఇందులో 119 సర్గలు ఉన్నాయి. అయోధ్య కాండ సర్గ 21 లో, రాముని వనవాసానికి సిద్ధమైన సందర్భంగా సీతా దేవి, లక్ష్మణుడు మరియు ఆయనను కలిసి ప్రస్థానం చేస్తారు. ఈ అధ్యాయంలో, వారి వనవాసానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, సంభాషణలు మరియు పరిణామాలు వివరించబడతాయి. సీతా దేవి తన భర్త రాముని తో పాటు వనవాసం చేయడానికి నిర్ణయించుకుంటుంది మరియు లక్ష్మణుడు తన అన్నను వదిలి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇది కుటుంబ బంధాలు, నిబద్ధత మరియు ధర్మం పట్ల వారికి ఉన్న కట్టుబాటును ప్రతిబింబిస్తుంది.
రాముడు అరణ్యములకు పోతాను అని చెప్పడం, ఆ మాటలు విని కౌసల్య భోరున ఏడవడం అంతా చూస్తున్నాడు లక్ష్మణుడు. వారిని చూచి ఇలా అన్నాడు.
“అమ్మా కౌసల్యా! అన్నా రామా! ఒక స్త్రీ కోరిన కోరికలు నెరవేర్చడం కోసరం రాముడు అడవులకు వెళ్లడం నాకు అసలే ఇష్టం లేదు. మన తండ్రి దశరథుడు కామపీడితుడు, భోగలాలసుడు. విషయ వాంఛలకు లోబడ్డవాడు. అలాంటి రాజు, కైక మాటలకు లోబడి ఏమైనా మాట్లాడవచ్చును. కాని అది ఆచరణయోగ్యము కాదు. ఎందుకంటే రాముడు అయోధ్యనుండి వెడలగొట్టబడవలసిన తప్పు ఏమీ చేయలేదు. చేయడు కూడా. అటువంటప్పుడు రాముడు అడవులకు ఎందుకు వెళ్లాలి.
రామునికి పరమ శత్రువు కూడా రాముని గురించి చెడ్డగా మాట్లాడడు. ధర్మాచరణము చేయు వాడు ఎవరూ గుణవంతుడు, ఋజువర్తనుడు అయిన కుమారుని అడవులకు పంపడు. రాజధర్మము తెలిసిన వాడు ఎవడూ దశరథ మహారాజు మాటలను ధర్మ సమ్మతము గా అంగీకరింపడు. ధర్మసమ్మతము కాని రాజు ఆదేశములను మనము పాటించ నవసరము లేదు. రాజ్యం వీరభోజ్యము. నాకు అనుమతి ఇవ్వండి బలప్రయోగంతో రాజ్యము స్వాధీనము చేసుకుంటాను. ఎవరు అడ్డు వస్తారో చూస్తాను.
రామా! నేను నీ పక్క ధనుస్సు పట్టుకొని నిలబడి ఉండగా నీ నీడను కూడా ఎవరూ తాకలేరు. రామా! ఈ అయోధ్యా నగరము నీది. ఈ అయోధ్యలో నీకు ఎవరైనా అపకారము చేయడానికి సాహసిస్తే, ఈ అయోధ్యానగరాన్నే నేలమట్టం చేస్తాను.
రామా! ఈ లోకం తీరే అంత. మెతకగా ఉంటే నెత్తికెక్కుతారు.
భరతునికి పట్టాభిషేకము చెయ్యాలి అనే వాడు ఎవడినైనాసరే భరతుని పక్షానమాట్లాడే ఎవడి నైనా సరే వాడిని వధిస్తాను. కైక పక్షము వహించి, కైక మీది ప్రేమతో నిన్ను అడవులకు పంపుతున్న మన తండ్రి దుర్మార్గుడు. దుర్మార్గుడు బంధింపతగినవాడు. అందుకని దశరథుని బంధించెదను. అవసరమైతే వధిస్తానుకూడా. గురువు అయినా సరే, దుర్మార్గుడు అయితే అతడు శిక్షార్హుడు.
రామా! మన తండ్రి ఎవరి అండచూచుకొని, పెద్దవాడైన నిన్ను కాదని రాజ్యమును భరతునికి ఇవ్వదలచుకున్నాడో అర్థం కావడం లేదు. నీతో నాతో విరోధము పెట్టుకొని భరతునికి రాజ్యాభిషేకము చేసే ధైర్యము దశరధునికి ఎక్కడిది?
అమ్మా! కౌసల్యాదేవీ! నాకు రాముడు అంటే ప్రాణము. నా ధనుస్సు మీద నేను చేసిన యజ్ఞయాగముల మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. రాముడు సామాన్యుడు కాడు. రాముడు అరణ్యములలోనూ అగ్నిలోనూ ప్రవేశింపగలడు. కానీ, దేనికైనా సరే,
రాముని కన్నా ముందు నేను ఉంటాను. నేను ఉండగా మీకు ఎలాంటి భయము లేదు. నిశ్చింతగా ఉండండి.” అని ఆవేశంతో పలికాడు అక్ష్మణుడు.
ఆవేశంతో పలికిన లక్ష్మణుని మాటలు విన్న కౌసల్య రాముని తో దు:ఖిస్తూ ఇలాఅంది. “రామా! నీ తమ్ముడు లక్ష్మణుని మాటలు విన్నావు కదా! నీకు ఇష్టం అయితే ఆ ప్రకారము చెయ్యి. అధర్మపరురాలు అయిన నా సవతి కైకేయీ మాటలు మనము పాటించ నవసరము లేదు. నీవు అరణ్యములకు వెళ్ల నవసరము లేదు.
రామా! నీకు అన్ని ధర్మములు తెలుసు. మాతృసేవ చెయ్యడం పరమ ధర్మము. కాబట్టి నీవు అయోధ్యలో ఉండి ఈ వృద్యాప్యంలో నా దగ్గర ఉండి నాకు సేవలు చెయ్యి. నీ ధర్మమును ఆచరించు. రామా! పూర్వము కాశ్యపుడు తన తల్లికి సేవలు చేసి తరించాడు. రామా! నీకు నీ తండ్రి ఎంతటి పూజనీయుడో, నేనూ అంతటి పూజనీయురాలనే కదా. కాబట్టి నేను చెబుతున్నాను. నీవు అరణ్యములకు వెళ్ల నవసరము లేదు. అరణ్యములకు వెళ్లుటకు నేను అనుమతి ఇవ్వను. నీవు నా దగ్గర ఉండి నాకు సేవలు చేసుకో.
నీవు అరణ్యములలో ఉంటే నేను ఇక్క మృష్టాన్నములు ఎలా భుజించగలను. నీతోపాటు ఉంటూ ఆకులు అలములు తినడం నాకు ఎంతో ఇష్టం. అలా కాకుండా నీవు అరణ్యములకు వెళితే నేను అన్నపానీయములను తీసుకోకుండా ప్రాయోపవేశము చేస్తాను. క్రుంగి, కృశించి మరణిస్తాను. నీ కోసరం నిన్ను తల్చుకుంటూ నేను మరణిస్తే నీకు దుర్గతులు కలుగుతాయి. తర్వాత నీ ఇష్టం.” అని పలికింది.
కౌసల్య తమ్ముడు లక్ష్మణుని మాటలూ, తల్లి కౌసల్య మాటలూ సావధానంగా విన్నాడు రాముడు. వారితో ఇలా అన్నాడు.
“అమ్మా! నాకు నా తండ్రి దైవసమానుడు. ఆయన ఆజ్ఞను ధిక్కరించే శక్తి నాకు లేదు. కాబట్టి నిన్ను వేడుకుంటున్నాను. నన్ను అరణ్యములకు వెళ్లనీ. పూర్వము పితృవాక్య పరిపాలన కొరకు కండు మహర్షి గోవును కూడా చంపాడు. మన వంశములోని సగర కుమారులు తండ్రి ఆజ్ఞ మేరకు భూమి నంతా తవ్వారు. ఆ ప్రయత్నంలో తమ ప్రాణాలు కోల్పోయారు. అంతెందుకు, తన తండ్రి జమదగ్ని ఆజ్ఞమేరకు, పరశు రాముడు, తన తల్లి రేణుకను గొడ్డలితో నరికి చంపాడు. అమ్మా!
మన పూర్వీకులందరూ పితృవాక్పరిపాలనకు తమ ప్రాణాలు కూడా అర్పించారు. నేను నా తండ్రి మాట మేరకు కేవలం అరణ్యములకు పోతున్నాను. నా పూర్వీకులు ఆచరించిన ధర్మమునే నేనూ ఆచరిస్తున్నాను.
ఈనాడు నేను నా స్వార్థము కొరకు, పితృవాక్యమును పాటించకుండా, కొత్త ధర్మమును సృష్టించలేను. తండ్రి మాటను పాటించిన వాడికి దోషము అంటదు. తండ్రిమాటను ధిక్కరించి నేను నా పూర్వీకులముందు దోషిగా నిలబడలేను.” అని తల్లితో పలికిన రాముడు తమ్ముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“తమ్ముడా లక్ష్మణా! నీకు నా మీద ఎంత ప్రేమ, వాత్సల్యము గౌరవము ఉన్నాయో నాకు తెలుసు. నా తల్లికి ధర్మసూక్ష్మములు వేదాంత రహస్యములు తెలియక పోవడం వలన, పామరత్వం చేత దుఃఖము పొందుతూ ఉంది.
లక్ష్మణా! ఈ లోకంలో ధర్మాచరణ ఎంతో ముఖ్యము. ధర్మము నందే సత్యము ప్రతిష్ఠితమై ఉన్నది. తండ్రిగారు తన ధర్మమును తాను పాటించారు. తల్లికి వరాలు ఇస్తాను అన్నారు. ఆమె కోరుకొన్నది ఇవ్వడం రాజు ధర్మము. ఆ ధర్మమును ఆయన నిర్వర్తించాడు.
పితృవాక్పరిపాలన నా ధర్మము. కాబట్టి నా ధర్మమును నేను నిర్వర్తించాలి కదా! ధర్మమును ఆశ్రయించిన వాడు తండ్రికి, తల్లికి, గురువుకు ఇచ్చిన మాటను తప్పకూడదు. నా తండ్రి మాటలను నా తల్లి కైకేయీ నాకు చెప్పింది. ఇందులో ఆమె తప్పేముంది. తండ్రి మాటలను ఆచరించడం నా ధర్మము.
కాని క్షత్రియ ధర్మము వేరుగా ఉంటుంది. బలవంతంగా రాజ్యము ఆక్రమించుకోడం క్షత్రియ ధర్మము. ప్రస్తుతము మనకు కులధర్మమే ముఖ్యము. క్షత్రియ ధర్మము కాదు. నీవు కూడా క్షత్రియ ధర్మమును పక్కనపెట్టి ధర్మాచరణము చెయ్యి. నీ కోపము వదిలి పెట్టు. నేను చెప్పిన మాటలను ఆచరించు.” అని అన్నాడు రాముడు.
తరువాత తల్లి కౌసల్యను చూచి చేతులు జోడించి ఇలా అన్నాడు. “అమ్మా! నేను అరణ్యములకు పోవడానికి నాకు అనుమతి ఇవ్వు. దీనికి మారు పలికితే నా మీద ఒట్టు. నా ప్రయాణమునకు కావలసిన వస్తువులను సేకరించు. అమ్మా! పదునాలుగు సంవత్స రములు ఎంతలో అయిపోతాయి. ఇలా వెళ్లి అలాతిరిగి వస్తాను. నామాట నమ్ము. అమ్మా! నీ మనసులో నా గురించి దుఃఖించకు.
తండ్రిమాట ప్రకారము వెళుతున్నాను. నీ మాట ప్రకారము తిరిగి వస్తాను. అమ్మా! మనకందరకూ పెద్ద తండ్రి గారు. నీవు, నేను, సీత లక్ష్మణుడు, అందరమూ తండ్రిగారి మాటను గౌరవించాలి కదా! అదియే కదా సనాతనధర్మము. అమ్మా! ఇంక నా పట్టాభిషేకమునకు ఏర్పాట్లు చేయడం ఆపి, నా వనవాసమునకు ఏర్పాట్లు చెయ్యి.” అని అన్నాడు రాముడు.
రాముడు అలా మాట్లాడుతుంటే కౌసల్యకు ఏమనాలో తోచలేదు. రాముని చూచి ఇలా అంది. “రామా! నీవు సనాతన ధర్మము గురించి చెప్పావు. సనాతన ధర్మములో తండ్రి మాటకు ఎంత విలువ ఇవ్వాలో తల్లి మాటకూ అంతే విలువ ఇవ్వాలి కదా. కాబట్టి నేను చెబుతున్నాను. నీ తల్లి మాట ప్రకారము నీ తల్లిని విడిచి నీవు వెళ్లవద్దు. నన్ను దు:ఖముల పాలు చెయ్యవద్దు. నేను నీకు తల్లిని, గురువును. నేను నీకు వనములకు పోవడానికి అనుజ్ఞ ఇవ్వను. నీవు వెళ్లడానికి వీలు లేదు.
రామా! నీవు లేని ఈ బ్రతుకు నిరర్థకము. నేను చచ్చి స్వర్గానికి వెళ్లినా, అక్కడ లభించే అమృతము కూడా నీకుసాటి రాదు. నీవు ముహూర్తకాలము నా ఎదుట ఉంటేచాలు, ఏ స్వర్గసుఖములు దానికి సమానం కావు. రామా! నన్ను విడిచి వెళ్లకు.” అంటూ దీనంగా ఏడుస్తున్న తల్లిని చూచి రాముని మనస్సు ద్రవించి పోయింది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు రామునికి. అందుకని లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“లక్ష్మణా! నీవు కూడా తల్లిగారితో చేరి నన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది ధర్మమా! తల్లిగారు చూడు ఎలా పరితపిస్తూ ఉందో. ఆమెను ఊరడించాల్సింది పోయి, ఆమెను, నన్ను, నీ మాటలతో బాధపెట్టావు.
లక్ష్మణా! అర్థకామములు ధర్మ సమ్మతము లైనపుడే అవి మంచి ఫలములను ఇస్తాయి. అందుకని అర్థకామముల కంటే ధర్మమునకే ప్రాధాన్యము. ధర్మాచరణము అత్యంత ఆవశ్యకము. మనము ఎల్లప్పుడూ ధర్మసమ్మతములైన పనులను చేయడంలోనే ఆసక్తి కలిగి ఉండాలి.
కేవలము అర్థము, కామము తో కూడిన పనులను చేయడం వలన రాగ ద్వేషములు ప్రబలుతాయి. అవి ధర్మపరులకు మంచివి కావు. మన తండ్రి వృద్ధుడు. మనకు పూజ్యుడు. ఆయన కామ ప్రకోపంతో గానీ, కోపంతో గానీ మనలను ఒక పనిచెయ్యమని చెప్పినప్పుడు, అది ధర్మంకాదు అని మనం నిరాకరించడం, ధర్మాచరణము అనిపించుకోదు. కేవలము దుష్టులు మాత్రమే అలా చేస్తారు.
లక్ష్మణా! మన తండ్రిగారు నీకు, నాకు తండ్రి, గురువు, దైవము. అలాగే మన తల్లి గారికి ఆయన భర్త. భర్త మాట భార్యకు శిరోధార్యము. కాబట్టి మనందరికీ దశరథ మహారాజు ఆజ్ఞను పాటించడం తప్ప మరోమార్గము లేదు. పైగా, తన భర్త అయిన దశరథమహారాజు గారు జీవించిఉండగా, భర్తను వదిలిపెట్టి, తల్లిగారు నా వెంట అడవులకు ఎలా రాగలరు. అది ధర్మము కాదు.”
అని తల్లి వంక తిరిగి“అమ్మా! నాకు అరణ్యములకు వెళ్లుటకు అనుమతి ఇవ్వు. పదునాలుగు సంవత్సరముల తరువాత నేను క్షేమంగా అయోధ్యకు తిరిగి రావాలని నన్ను ఆశీర్వదించు. నా తండ్రి మాటను పాటించడం, నాపూర్వీకులు నడిచిన బాటలో నడవడం–వీటితో పోలిస్తే, ఈ తుచ్ఛమైన రాజ్యభోగములు నాకు తృణప్రాయములు. కేవలం రాజ్యం కోసరం శాశ్వత కీర్తి ప్రతిష్టలను వదులుకోలేను.
అమ్మా! ఈ జీవితము నీటి బుడగ వంటిది. నాలుగు రోజులు రాజ్యం పాలించడం కోసరం, ధర్మము తప్పి, అధర్మంగా రాజ్యమును కైవసం చేసుకోవడం మంచిది కాదు.” అని తన మనస్సులో ఉన్న మాటను అమ్మకు, తమ్ముడికి స్పష్టం చేసాడు. తల్లికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారముచేసాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. చతుర్థ సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో పాటు ఆయోధ్యలో ఉన్న సందర్భాలపై దృష్టి సారిస్తాడు. ఈ సర్గ రాముని వైయక్తిక జీవితం, కుటుంబ బంధాలు మరియు ఆయోధ్యలోని ప్రజల అనురాగం పై కేంద్రీకృతమై ఉంది. రాముడు తన పితృ వాక్య పరిపాలనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో, తండ్రి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం సకల కష్టాలను ఎలా స్వీకరించాడో ఈ సర్గలో వివరించబడుతుంది. ఈ విధంగా చతుర్థ సర్గ రాముని ధర్మ నిష్ఠ, కర్తవ్య నిబద్ధత మరియు తన కుటుంబ సభ్యులపై ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తుంది.
మాత్రాశీఃపరిగ్రహః
గతేష్వథ నృపో భూయః పౌరేషు సహ మంత్రిభిః |
మంత్రయిత్వా తతశ్చక్రే నిశ్చయజ్ఞః స నిశ్చయమ్ ||
తరువాత దశరథుడు మంత్రులతో మరలా దీర్ఘంగా ఆలోచించాడు. మరునాడే పుష్యమీ నక్షత్రము. అందుకని, ఆలస్యం లేకుండా రాముని మరునాడు పుష్యమీ నక్షత్రము ఘడియలలో పట్టాభిషిక్తుని చేయవలెనని నిశ్చయించాడు. మంత్రులందరూ ఆ నిర్ణయానికి తమ ఆమోదము తెలిపారు.
తరువాత దశరథుడు సభాభవనము నుండి తన అంతఃపురమునకు వెళ్లాడు. సుమంత్రుని పిలిచి రాముని తన మందిరమునకు తీసుకొని రమ్మని ఆదేశించాడు. దశరథుని ఆదేశాను సారము సుమంత్రుడు రాముని వద్దకు వెళ్లాడు.
“ఇప్పుడేగా తండ్రి గారి వద్దనుండి వచ్చాను మరలా ఎందుకు వచ్చావు?” అని అడిగాడు.
“దశరథమహారాజుగారు తమరిని చూడాలని అనుకుంటున్నారు. మీరు మీ తండ్రి గారి వద్దకు వెళ్లాలో లేదో మీరే నిర్ణయించు కోండి.” అని అన్నాడు సుమంత్రుడు. మారు మాటాడకుండా రాముడు సుమంత్రునితో కూడా దశరథుని వద్దకు వచ్చాడు. తండ్రి గారికి నమస్కరించి, ఆయన ఎదుట చేతులు కట్టుకొని నిలబడ్డాడు రాముడు. దశరథుడు రాముని ప్రేమగా లేవనెత్తి కౌగలించుకొని, పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చోపెట్టాడు.
“రామా! నేను చెప్పబోవు మాటలు శ్రద్ధగా విను. నాకు వయసు అయిపోయింది. వృద్ధుడను అయ్యాను. రాజభోగాలు తనివిదీరా అనుభవించాను. ఎన్నో యజ్ఞములు, యాగములను చేసాను. ఈ భూలోకంలో సాటిలేని మేటి వీరులను సంతానంగా కలిగి ఉన్నాను. దేవ ఋణము, ఋషి ఋణము, పితృ ఋణము, విప్ర ఋణము, ఆత్మఋణము తీర్చుకున్నాను. ఇంక నీ పట్టాభిషేకము మాత్రము మిగిలి ఉన్నది. నీవు ఈ అయోధ్యకు రాజు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకని నిన్ను యౌవరాజ్యాభిషిక్తుని చేయ సంకల్పించాను.
ఎందుకనో నాకు కొన్ని దుశ్శకునములు పొడసూపుతున్నాయి. నా జాతకములో చెడ్డ గ్రహము లైన సూర్య, అంగారక, రాహు గ్రహములు ఉచ్ఛస్థితిలో ఉన్నట్టు జ్యోతిష్కులు చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో నాకు మరణము కానీ, లేక తీవ్రమైన ఆపద కాని సంభవించే అవకాశం ఉంది. మనస్సు చంచల మైనది. ఏ నిముషానికి ఎలా ఆలోచిస్తుందో తెలియదు. అందుకే నాకు చాలా తొందరగా ఉంది. నా మనసులో మరొక ఆలోచన పొడసూపక ముందే నీ యౌవరాజ్యపట్టాభిషేకము జరిగిపోవాలి అని అనుకుంటున్నాను.
ఈ రోజు పునర్వసు నక్షత్రము. రేపు చంద్రుడు పుష్యమీ నక్షత్రములో ఉంటాడు. ఆ శుభ ముహూర్తము లో నీ పట్టాభిషేకము జరిగిపోవాలి. ఈ సందర్భములో నీవు ఈ రోజు రాత్రి అంతా నీ భార్య సీతతో సహా ఉపవాసము చేసి దర్భాసనము మీద నిద్రపోవాలి.
ప్రస్తుతము భరతుడు అయోధ్యలో లేడు. భరతుడు అయోధ్యలో లేని సమయములోనే నీ పట్టాభిషేకము జరగాలని నా కోరిక. అంటే భరతుడు దుర్మార్గుడు అనికాదు. నీ సోదరుడు భరతుడు ఎల్లప్పుడూ నిన్ను అనుసరించి ఉంటూ నీ క్షేమమునే కోరుతుంటాడు. పైగా భరతుడు ధర్మాత్ముడు, దయాళువు. ఇంద్రియములను జయించిన వాడు. కానీ, మనస్సు చంచలమైనది. ఎటువంటి ధర్మాత్ముల మనస్సులు కూడా చలింపవని నమ్మకము లేదు కదా. ఎప్పుడు ఎవరికి ఎలాంటి బుద్ధిపుడుతుందో ఎవరికి తెలుసు! నీ పట్టాభిషేక వార్త విని నీ తమ్ముడు భరతుని మనస్సు కూడా మారుతుందే మో అని నా అనుమానము. అందుకని ఈ తొందర. ఇంక నీవు వెళ్లవచ్చు.” అని పలికాడు దశరథుడు.
తండ్రి చెప్పిన మాటలు సావధానంగా విన్న రాముడు, తండ్రి గారి వద్ద సెలవు తీసుకొని నేరుగా తన తల్లి కౌసల్య అంతఃపురమునకు వెళ్లాడు. రాముని పట్టాభిషేక వార్త అంతకు మునుపే కౌసల్యకు తెలియడంతో, ఆమె సీతను, సుమిత్రను, లక్ష్మణుని తన వద్దకు పిలిపించుకొంది. కౌసల్య పట్టుబట్టలు ధరించి లక్ష్మీదేవికి పూజచేస్తూ ఉంది. ఆమె పక్కనే సుమిత్ర, సీత, లక్ష్మణుడు కూర్చుని ఉన్నారు.
రాముడు వచ్చి తల్లి కౌసల్యకు, సుమిత్రకు నమస్కరించాడు. ఆమెతో ఇలా అన్నాడు. “అమ్మా! తండ్రిగారు నన్ను ఇంక నుంచి ప్రజాపాలన చూడమన్నారు. అందుకని నన్ను యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడానికి నిశ్చయించారు. రేపే యౌవరాజ్య పట్టాభిషేకము. ఈ రోజు రాత్రి అంతా నేను నా భార్య సీత ఉపవాసము చేసి దర్భాసనము మీద నిద్రించవలెనని ఋత్తిక్కులు, తండ్రిగారు ఆదేశించారు. అమ్మా! నీవు నాకూ, సీతకూ, రేపు జరగబోవు శుభకార్యమునకు చేయవలసిన మంగళకర కార్యక్రములు జరిపించు.” అని అన్నాడు.
తన కుమారునికి యౌవరాజ్యపట్టాభిషేకము అని తన కుమారుని నోటి నుండి విని ఆ తల్లి పొంగిపోయింది. ఆమె కండ్ల వెంట ఆనందభాష్పాలు రాలాయి. “వత్సా! రామా! చిరంజీవ, చిరంజీవ చిరంజీవిగా వర్ధిల్లు. నీవు నీ తమ్ములకు, నీ తల్లి సుమిత్రకు సంతోషము కలుగచెయ్యి. నాయనా! నీవు పుట్టిన వేళా విశేషము చాలామంచిది. నీవు నీ మంచి గుణములతో నీ తండ్రిని సంతోషింప జేసావు. నేను శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి చేసిన పూజలు అన్నీ ఫలించాయి. అందుకే ఇక్ష్వాకు వంశానికి రాజువు అవుతున్నావు. సుఖంగా వర్థిల్లు.” అని మనసారా దీవించింది.
తల్లి దీవనలు అందుకున్న రాముడు, లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “సోదరా! లక్ష్మణా! ఈ పట్టాభిషేకము నాకు కాదు. మన ఇద్దరికీ. మనం ఇద్దరం ఒకరికి ఒకరం తోడుగా రాజ్యపాలన చేద్దాము. నీవు నాకు రెండో ఆత్మ. అందుకే నీవే ఈ అయోధ్యకు యువరాజువు. నీ ఇష్టంవచ్ని రాజభోగములు అనుభవించు. పరిపాలన సాగించు. అసలు నీ కోసమే నేను ఈ యౌవరాజ్య పట్టాభిషేకము చేసుకుంటున్నాను.” అని అన్నాడు.
తరువాత సీతా రాములు కౌసల్యకు, సుమిత్రకు నమస్కరించి, తమ మందిరమునకు వెళ్లిపోయారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ చతుర్దశః సర్గంలో, విష్ణుమూర్తి తన అమృతమయ సాయుధాన్ని ఋషులకు అందించి, వారి యజ్ఞాన్ని రక్షించమని సూచించాడు. ఆయన యజ్ఞవాటిక వద్దకు చేరి, ఋషుల నిష్టను చూసి ప్రశంసించాడు. వసిష్ఠుడు ఈ అద్భుతాన్ని చూచి ఆనందించాడు. మహాముని విశ్వామిత్రుడు భద్రత కాపాడినందుకు రామ, లక్ష్మణులను సంతోషంగా ఆశీర్వదించాడు. దుష్ట శక్తులపై విజయం సాధించడంలో రాముడు, లక్ష్మణుడు తమ ధైర్యాన్ని, సత్తాను ప్రదర్శించారు.
ఒక సంవత్సరకాలం గడిచింది. అశ్వవమేధయాగముకొరకు వదిలి పెట్టబడిన అశ్వము తిరిగి వచ్చింది. దశరథుడు సరయూ నదీ తీరమున ఉత్తర భాగమున అశ్వమేధ యాగము ప్రారంభించాడు. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా ఉంచుకొని పురోహితులు యజ్ఞము ప్రారంభించారు.
వేదవిదులయిన ఋత్విక్కులు వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞము చేస్తున్నారు. అశ్వమేధ యాగములో ముఖ్య అంశములైన ప్రవర్ణ్యము, ఉపసదమును బ్రాహ్మణులు వేదోక్తముగా నిర్వహించారు. ఇంద్రునికి హవిర్భాగములను అర్పించారు. శ్రేష్టమైన సోమ లతను నలగగొట్టి, రసము తీసారు. దీనితో యాగములో మాధ్యందిన సవము వేదోక్తముగా చేసారు.
తరువాత ఋత్తిక్కులు దశరధునితో తృతీయ సవనమును కూడా నిర్వర్తింపచేసారు. ఆ యాగములో ఏ చిన్న తప్పుకూడా దొర్లకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు.
ఆ యాగమునకు వచ్చిన బ్రాహ్మణుల కందరకూ ఆకలి అనేది తెలియకుండా మృష్టాన్న భోజనములు సమకూర్చారు. ఆ యాగము జరిగిన ಅನ್ನ రోజులు బ్రాహ్మణులు, రాజాధిరాజులు, వారి వెంట వచ్చిన ఉద్యోగులు, భటులు, సన్యాసులు, తాపసులు అందరికీ సమృద్ధిగా భోజన సదుపాయములు చేసారు. తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు.
వచ్చిన వారందరూ తృప్తిగా భోజనము చేసి దశరధుని పుత్రవంతునిగా దీవించారు. ఆ మాటలు విని దశరధుడు పరమానంద భరితుడయ్యాడు. యాగము జరుగుతున్న సమయములో వేద పండితుల మధ్య వాగ్వివాదములు రసవత్తరముగా జరుగుతుండేవి.
యాగములో ఊపస్తంభములు నిలుప వలసిన సమయము వచ్చినది. బిల్వ వృక్షము కర్రతో చేసిన ఊపస్తంభములు ఆరు, చండ్రకర్రతో చేసినవి ఆరు, మోదుగ కర్రతో చేసినవి ఆరు, శ్లేషాత్మకము అనే కర్రతో చేసినది ఒకటి, దేవదారు కర్రతో చేసినవి. రెండు యాగ వాటికలో పాతారు. ఒకదానికి మరొక దానికి బారెడు వెడల్పు ఉండేట్టు పాతారు. ఆ ఊపస్తంభములను బంగారముతో అలంకరించారు. ఆ ఇరవై యొక్క ఊపస్తంభములను రంగు రంగుల వస్త్రములతో అలంకరించారు.
వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞ కుండము లను ఏర్పాటుచేసారు. దశరథుడు, ఆయన భార్యలు కూర్చొనుటకు వీలుగా గరుడుని ఆకారములో ఒక వేదికను నిర్మించారు.
దేవతలకు బలి ఇచ్చేనిమిత్తము ఆ ఊపస్తంభములకు రకరకాల పక్షలను, పశువులను, పాములను కట్టారు. యజ్ఞము కొరకు వదిలిన అశ్వమును ఒక ఊపస్తంభమునకు కట్టారు. మూడు వందల వశు వులను, యజ్ఞాశ్వమును ఆ ఊపస్తంభములకు కట్టారు.
తరువాత దశరధుని పట్టమహిషి కౌసల్య అక్కడకు వచ్చింది. అశ్వమును కట్టిన ఊపస్తంబమునకు మూడుమార్లు ప్రదక్షిణము చేసింది. ఆ యజ్ఞాశ్వమును మూడు కత్తులతో చంపింది. శాస్త్రములో చెప్పిన ప్రకారము ఆ రోజు రాత్రి అంతా కౌసల్య ఆ గుర్రము పక్కన నివసించింది.
మరునాడు ఆ యాగమునకు హోత, అధ్వర్యువు, ఉద్గాత అనే ముగ్గురు ఋత్తిక్కులు పట్టపురాణి కౌసల్యను ఆమె ఇద్దరు పరిచారికలను దానముగా తీసుకున్నారు. తరువాత మరొక ఋత్విక్కు చంపబడిన ఆ గుర్రము మెదడును పక్వము చేసి హోమం చేసాడు. దశరథుడు ఆ హోమము లో నుండి వచ్చిన పొగను తృప్తిగా వాసన చూచాడు.
తరువాత పదహారు మంది ఋత్విక్కులు చంపబడిన ఆ అశ్వము యొక్క శరీర భాగములను శాస్త్రోక్తముగా హోమం చేసారు.
కల్పసూత్ర ప్రకారంగా అశ్వమేధ యాగము మూడు రోజులు వేదోక్తంగా జరపాలి. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము, రెండవ రోజు కార్యక్రమమునకు ఉక్యము, మూడవ రోజు కార్యక్రమమునకు అతి రాత్రము అని పేరు. ఇవే కాకుండా దశరథుడు ఇతరములైన అనేక కార్యక్రమములు చేయించాడు.
యాగము పూర్తి అయిన తరువాత దశరథుడు తూర్పుదిక్కున ఉ న్న తన రాజ్యమును హోతకును, పశ్చిమ దిక్కున ఉన్న తన రాజ్యమును అధ్వర్యునకును, దక్షిణదిక్కున ఉన్న దేశమును బ్రహ్మకు దానంగా ఇచ్చాడు. ఈ విధంగా చేయవలెనని వేదములు సూచిస్తున్నాయి. యాగఫలమును పొందుటకు దశరథుడు ఈ విధంగా తనరాజ్యమును బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. కాని ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యమును తిరిగి దశరథునికి ఇచ్చి దానికి తగిన ప్రతిఫలముగా పదిలక్షల గోవులు, వందకోట్ల బంగారు నాణెములు, నాలుగు వందల కోట్ల వెండి నాణెములు తీసుకున్నారు.
ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్టునకు ఋష్యశృంగునకు ఇచ్చారు. వారు ఆ ధనమును అందరికి న్యాయప్రకారంగా పంచి పెట్టారు. అందరూ సంతృప్తి చెందారు. ఇది కాకుండా యాగమును చూడటానికి వచ్చిన వారికి కోటి బంగారు నాణెములు దానంగా ఇచ్చాడు దశరథుడు.
అన్ని అయిపోయిన తరువాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు. ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణమును ఆ పెద బ్రాహ్మణునికి బహూకరించాడు. తరువాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు దశరథుడు. ఆ ప్రకారంగా అశ్వమేధ యాగమును పూర్తి చేసాడు దశరథుడు.
తరువాత దశరథుడు ఋష్యశృంగుని చూచి “ఓ మహాత్మా! అశ్వమేధ యాగము నా చేత చేయించారు. తరువాత నాకు పుత్ర సంతానము కలిగి నా వంశము వృద్ధిచెందేటట్టు నాచేత ఒక యాగము చేయించవలసినది” అని ప్రార్థించాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచదశః సర్గలో, రాజు దశరథుడు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో సంతానం పొందాలనే లక్ష్యంతో పుత్రకామెస్టి కర్మను ప్రారంభించాడు. దశరథ రాజు నిర్వహించే అశ్వ పూజలో అర్పించిన నైవేద్యాలను స్వీకరించడానికి ఖగోళ జీవులు గుమిగూడారు. వారు రావణుడి దురాగతాలను చూసి కలవరపడి, రావణుని అంతమొందించే మార్గం కోసం ఆలోచించమని బ్రహ్మను అభ్యర్థిస్తారు. విష్ణువు అక్కడికి చేరుకుని, రావణుని అంతమొందించడానికి తాను మానవునిగా అవతారమెత్తుతానని హామీ ఇవ్వడంతో బ్రహ్మ మరియు ఇతర దేవతలను శాంతింపజేస్తాడు.
ఋష్యశృంగుడు బాగా ఆలోచించాడు. తరువాత దశరథునితో ఇలా అన్నాడు. “మహారాజా! తమకు పుత్ర సంతానము కలగడం కోసరం, మీకు పుత్ర సంతానమును కలిగించే ఒక ఇష్టిని (యాగమును) మీచేత చేయిస్తాను. ఈ యాగమును వేదములో చెప్పబడిన అధ్వర శిరస్సు అనే మంత్రముల ఆధారంగా చేయిస్తాను.” అని పలికాడు.
దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. యాగం ఆరంభం అయింది. వేద మంత్రములు చదువుతూ హోమం చేస్తున్నారు. యా యజ్ఞములో హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అక్కడకు వచ్చారు. ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కలిసి ఆయనతో ఇలా అన్నారు.
” ఓ బ్రహ్మదేవా! భూలోకంలో రావణుడు అనే రాక్షసుడికి మీరు ఎన్నో వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో గర్వించి ఆ రాక్షసుడు దేవతలను, మునులను, సజ్జనులను బాధిస్తున్నాడు. అతనిని కట్టడి చేయడం మా వల్ల కావడం లేదు. ఎందుకంటే మీరు అతనికి వరాలు ఇచ్చారు. వాటిని మేము గౌరవించాలి కదా. అందుకని మేము అతని మీద కఠినంగా వ్యవహరించలేకపోతున్నాము. అతడు చేయు అకృత్యములను చూచీ చూడకుండా పోతున్నాము.
(మంత్రిగారి అండదండలు ఉంటే పేరు మోసిన రౌడీలను మాత్రం పోలీసులు ఏమి చేయగలరు చెప్పండి.)
తమరి వరాల అండ చూచుకొని అతడు ముల్లోకములను బాధిస్తున్నాడు. దిక్పాలకులను లెక్క చెయ్యడం లేదు. ఇంద్రునికూడా ధిక్కరిస్తున్నాడు. ఇంక భూలోక వాసుల కష్టములకు అంతు లేదు. మునులను బ్రాహ్మణులను బాధిస్తున్నాడు. వారిని యజ్ఞయాగములు చేసుకోనివ్వడం లేదు. వాడి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు.
ఇంక సూర్యుడు అతని దగ్గర చల్లగా ఉంటాడు. వాయువు అతని వద్ద మెల్లగా వీస్తాడు. సముద్రుడు కూడా అతనిని చూడగానే అలలను వెనక్కు లాక్కుంటాడు. శాంతంగా ఉంటాడు. ఆ రావణుని వలన భయపడని వాడు లేదు. అందుకని అతనిని సంహరించి ముల్లోకము లను రక్షించే ఉపాయం ఆలోచించండి.” అని ప్రార్థించారు.
బ్రహ్మదేవుడు ఆలోచించాడు. “దేవతలారా! వాడిని చంపడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. నేను ఇచ్చిన వర ప్రభావంతో వాడు నరులు చేతిలో తక్క ఇంక ఎవరి చేతిలోనూ చావడు. అలాంటి వరం ఇచ్చాను కాబట్టి రావణుడు మనుష్యుల చేతిలోనే చావాలి. అది తక్క మరొక ఉపాయము లేదు.” అని అన్నాడు బ్రహ్మ.
అమ్మయ్య! రావణుడి చావుకు ఏదో ఒక కారణం దొరికింది అని సంతోషించారు దేవతలు. ఇంతలో విష్ణుమూర్తిఅక్కడకు వచ్చాడు. దేవతలందరు విష్ణువుకు నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు.
” ఓ దేవదేవా! ముల్లోకములను కాపాడటానికి మిమ్మల్ను ఒక పని చేయమని కోరుతున్నాము. అయోధ్యకు రాజు అయిన దశరథుడు పుత్రుల కొరకు ఒక యాగము చేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు. తమరు మా మీద దయయుంచి మీరు నలుగురుగా విడిపోయి, ఆయన ముగ్గురు భార్యలకు పుత్రులుగా జన్మించండి. బ్రహ్మదేవుని వరగర్వంతో రావణుడు అనే రాక్షసుడు ముల్లోకములలో బ్రాహ్మణులను, మునులను, దేవతలను బాధపెడు తున్నాడు. మితి మీరుతున్న ఆ రావణుని సంహరించండి. లోకాలను కాపాడండి. ఒక్క నరుడే ఆ రాక్షసుని సంహరించగలడు. కాబట్టి తమరు మానవుడిగా జన్మించి ఆ రాక్షసుని సంహరించండి.” అని వేడుకున్నారు.
విష్ణుమూర్తి వారి ప్రార్థనలను సొంతం విన్నాడు. వారితో ఇలా అన్నాడు. “ఓ దేవతలారా! మీరు భయపడకండి. మీకు త్వరలో రావణుని బారి నుండి విముక్తి లభిస్తుంది. మీరుకోరినట్టు నేను భూమి మీద అవతరిస్తాను. ఆ రావణుని సంహరిస్తాను. పదకొండు వేల సంవత్సరములు ఈ భూమిని పాలిస్తాను. ధర్మసంరక్షణ చేస్తాను.” అని పలికాడు విష్ణుమూర్తి.
“ ఓ విష్ణుదేవా! నీవు లోక భయంకరుడైన రావణుని సంహరించి తిరిగి స్వర్గలోకమునకు తిరిగి రమ్ము.” అని వేడుకొన్నారు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదిహేనవ సర్గ సంపూర్ణము.