Gayatri Mantram In Telugu | గాయత్రి మంత్రము

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గాయత్రీ మంత్రము విశిష్టత, గాయత్రీ మంత్రమును ఎందుకు పఠించాలి, మరియు గాయత్రీ మంత్రమును గురించి తెలుసుకుందాం.

Gayatri Mantram In Telugu Lyrics

మంత్రం ఒక అద్భుత శక్తితో ఉన్నది. అది మనస్సును శుద్ధి చేస్తుంది, మానసిక సంతృప్తిని అందిస్తుంది, మనస్సును శాంతిగా చేస్తుంది. మంత్రము చదివితే, అందరికీ అనంత ప్రేమ మరియు శాంతి కలిగి వస్తుంది.

గాయత్రీ మంత్రము విశిష్టత

భారతదేశమున పూర్వకాలములో ముఖ్యముగా ఐదు విధములైన దేవతారాధనలు ఉండెడివి. అవి 1) గాణాపత్యము 2) సౌరము 3) శాక్తేయము 4) శైవము 5) వైష్ణవము. గాణాపత్యులు- గణపతిని; సౌరులు – సూర్యుని; శాక్తేయులు – శక్తిని; శైవులు – శివుని; వైష్ణవులు – విష్ణువును ఆరాధించెడివారు. వీరిమధ్య పరస్పర అవగాహన కన్న పరస్పరవిద్వేషమే అధికముగా ఉండెడిది. ఒకరి దేవతను ఇంకొకరు ఆరాధించరు. కాని, వీరందరూ ఆరాధించుటకు అభ్యంతరము లేని ఒకే ఒక దేవత “గాయత్రి”. అట్టి వైశిష్ట్యము గాయత్రీ మాతకు ఉన్నది.

గాయత్రీ మంత్రమును ఎందుకు పఠించాలి?

బుద్ధులు పెడత్రోవ త్రొక్కకుండా ప్రచోదనము చేయునది గాయత్రి కాబట్టి, ముందుగా ఈ సద్భుద్ధికై “గాయత్రి” పఠించి అటు పైన పొందిన సద్భుద్ధితో మిగిలిన ఇతర మంత్రములను పఠించిన ఫలితము చేకూరును. ఈ కారణము వలన మిగిలిన మంత్రములకన్న ముందుగా గాయత్రి చేయవలెనని చెప్పుట జరిగినది. అంతేగాని ‘గాయత్రి ఒక్కటియే మంత్రము, మిగిలిన మంత్రములు పనికిరానివి’ అని అర్థము కాదు.

గాయత్రీ మంత్రము

గానము చేయదగిన గాయత్రీ మంత్రములో రెండు విధములైన మంత్రములు గలవు. 1) విశిష్ట గాయత్రి 2) జప గాయత్రి. ఇందులో జప గాయత్రిలో ప్రణవము (ఓంకారము), మూడు పాదములు మాత్రమే ఉండును. ఈ జపగాయత్రినే సాధారణముగా గాయత్రీ మంత్రముగా వ్యవహరింతురు. ఈ జపగాయత్రి ఈ క్రింద తెలిపిన విధముగా నుండును.

Gayatri Mantram In Words

పైన తెలుపబడిన జప గాయత్రీ మంత్రములో మొత్తము 29 అక్షరములు లెక్కకు వచ్చును. మరి గాయత్రీ మంత్రములో 24 అక్షరములు (చతుర్విగ్ ంశత్యక్షరా) వుండును అందురు గదా! మరి 29 వచ్చినవేమి ? పైన తెలిపిన మంత్రములో మూడు వ్యాహృతులు అనగా భూః, భువః, సువః, (కొందరు ‘సువః’ కు బదులు ‘స్వః’ అందురు. అయినను అర్థము మారదు.)

గాయత్రీ మంత్రపద విభాగము

ఓం, తత్, సవితుః, వరేణ్యమ్, భర్గః, దేవస్య. ధీమహి, ధియః, యః, నః, ప్రచోదయాత్.

పదక్రమము:

వరేణ్యమ్, నః, ధియః, ప్రచోదయాత్ యః
తత్, ఓం సవితుః, దేవస్య, భర్గః, ధీమహి.

వరేణ్యమ్                      =   (అందరికినీ శ్రేయస్సును కలుగజేయుటలో కోరదగినదియు)
నః                                 =   మన
ధియః                           =   బుద్ధులను
ప్రచోదయాత్                =  ప్రేరేపించునదియు
యః                              =   ఎవరో
ఓం                               =   ప్రణవ ప్రతీకమైన
తత్                              =   ఆ
సవితు:దేవస్య              =  వెలుగుల సవితృమూర్తి యొక్క
భర్గః                             =  (స్వయంప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన) తేజస్సును
ధీమహి                         =   ధ్యానించుదము (గాక)

తాత్పర్యము:

అందరికిని శ్రేయస్సును కలుగజేయుటలో కోరదగినదియు, మన బుద్దులను ప్రేరేపించునదియు ఎవరో – ప్రణవ ప్రతీకమైన ఆ వెలుగుల సవితృమూర్తి యొక్క (స్వయం ప్రకాశ ప్రసార గుణ సమన్వితమైన) తేజస్సును ధ్యానించెదము (గాక!) (ఈ గాయత్రీ మంత్రమునకు బహువచనములోనే గాక ఏకవచనములో గూడా అర్థ తాత్పర్యాదులు చెప్పుకొనవచ్చును.) ఇది ఒక వర్గమునకు, వర్ణమునకు, కులమునకు, మతమునకు, జాతికి, సంబంధించిన మంత్రము కాదనియు, సమస్త మానవాళి శ్రేయస్సును కోరు సహృదయులందరూ ఈ మంత్రమును ఒంటిరిగానైననూ, సామూహికముగా నైననూ ఉచ్చరించవచ్చుననియు ఈ మంత్ర తాత్పర్యమును బట్టి తేట తెల్లమగుచున్నది. ఇది సూర్యుని నుండి సౌరశక్తిని సూటిగా పొందుటకు భారతీయ ఋషులు దర్శించిన మంత్రము. భారతీయుల ప్రార్థనలు, మంత్రములు అన్నియు ఇదే విధముగా స్వార్థ రహితముగా సర్వజన శ్రేయోదాయకములుగా ఉండునని గ్రహించవలెను.

లోకాస్సమస్తాః సుఖినోభవన్లు ! ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః, 

(సర్వలోక జీవులకు సుఖశాంతులు కలుగుగాక!)

హరిః ఓం తత్సత్

శ్రీ కృష్ణార్పణమస్తు

సంబందిత ప్రశ్నలు:

1. ప్రశ్న
గాయత్రీ మంత్రమును బాహాటముగా గొంతెత్తి ఉచ్చరించవచ్చునా?

సమాధానము :
“గాయంతాం త్రాయతే – ఇతి గాయత్రి” అనగా పాడిన కొలది రక్షించు మంత్రము గాయత్రి అని నిర్వచనములోనే ఉండగా ఈ సందేహము కలుగవలసిన పనిలేదు. మరియు, గాయత్రి వేదములోని మంత్రము. వేదమంతయు స్వరయుక్తము. బయటకు ఉచ్చరించినపుడే స్వర భేదము స్ఫుటముగా తెలియును గాని, లోపల నసిగినపుడు, గొణగినపుడు కాదు. అందుచేతనే స్వరయుక్త మంత్రములన్నియు బయటకు ఉచ్చరించుట తప్పుకాదు.

2. ప్రశ్న
అందఱూ కలసి సామూహికముగా ఉచ్చరించవచ్చునా ?

సమాధానము :
“థియోయోనః ప్రచోదయాత్’ అనుటలో “థియః” అనగా బుద్ధులు అని, “నః” అనగా “మమ్ము” లేదా “మా యొక్క” అను పదములతో బహువచనములు ఉండగా అందరూ కలసి చేయవచ్చుననియే తెలుపును గదా!

3. ప్రశ్న
ఈ ఉపదేశము ఎప్పుడు జరుగవలెను?

సమాధానము:
ఏ విద్యనైనను, ఏ మంత్రము నైనను నేర్చుకొనవలెనని అభిలాష, శ్రద్ధ, పట్టుదల కలిగిన వారు వాటిని చేర్చుకొనుటకు అర్హులే. ఆసక్తి, శ్రద్ధ కలుగుట అనగా బుద్ధి దానిపట్ల ప్రచోదనమగుట అనియే కదా! నిజమునకు ఆ మంత్రమును నేర్చుకొనవలెనని బుద్ధి పుట్టినపుడు మంత్రోపదేశము (Initiation) జరిగినట్లు లెక్క. ఆ తరువాత భౌతికముగా గురువు వద్ద ఉపదేశము పొందుట దానిని సమర్ధించుచు (Ratify) చేయు ప్రక్రియయే!

4. ప్రశ్న
వేరువేరు వర్ణములకు వేరు వేరు గాయత్రీ మంత్రములు వున్నవా?

సమాధానము:
అన్ని వర్ణములవారు గాయత్రిని చేసుకొనవచ్చును. ఆ మంత్రమును చేయుట తప్పనుకొనువారికి – వేరు, వేరు గాయత్రీ మంత్రములు గూడ కలవు. బ్రాహ్మణులకు అనుష్టుప్ ఛందస్సులో పై మంత్రము ఈయబడినది. (అనుష్టుప్ అనగా 8 అక్షరముల ఛందస్సు.

5. ప్రశ్న
స్త్రీలు యీ మంత్రమును పఠించవచ్చునా?

సమాధానము:
స్త్రీ, పురుషులందఱూ జీవాత్మలే ! అనగా జీవాత్మకు లింగభేదము లేదు. మైత్రేయి, గార్గి, అనసూయ మొదలగు వారు వేద శాస్త్రాదులు చదివిన వారే ! గాయత్రీ మంత్రమును జపించిన వారే ! చేయు పద్ధతిలో స్వల్ప భేదము ఉండునేమో గాని, సంధ్యా వందనము గూడ స్త్రీలకు నిషిద్ధము కాదు.

మరిన్ని పోస్ట్లు:

Mantra – మంత్రా

Mantra

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. మంత్రం అంటే ఒక ఆధ్యాత్మిక అలంకారం. ఇది జీవనంలో సంతోషం, శాంతి, మనస్సుకి సంతృప్తి, మానసిక తృప్తి లభించడానికి వాడే విధానం. మంత్రం చదువుట, గానం చేయుట, మంత్రాలను జపించుట, ధ్యానం చేయుట ద్వారా మన మాధుర్యం, భక్తి, ఆత్మీయత వంటి గుణాలను పెంచవచ్చు. మంత్రం ఒక అద్భుత శక్తితో ఉన్నది. అది మనస్సును శుద్ధి చేస్తుంది, మానసిక సంతృప్తిని అందిస్తుంది, మనస్సును శాంతిగా చేస్తుంది. మంత్రము చదివితే, అందరికీ అనంత ప్రేమ మరియు శాంతి కలిగి వస్తుంది. మొదలగు మంత్ర విషయముల గురించి ఈ క్రింద ఇచ్చిన లింకులు ద్వారా తెలుసుకుందాం…

Mantralu – మంత్రాలు

Mantra Pushpam In Telugu | మంత్ర పుష్పం

Mantra Pushpam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో మంత్ర పుష్పం  అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంత్ర పుష్పం  గురించి తెలుసుకుందాం…

Mantra Pushpam In Telugu Lyrics

మంత్ర పుష్పం

ధాతా పురస్తాద్యముదాజహార |
శక్రః ప్రవిద్వాస్త్రదిశశ్చతస్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి |
నాన్యః పన్హా అయనాయ విద్యతే |

ఓం సహస్రశీర్ణం దేవం విశ్వాక్షం విశ్వశమ్భువమ్ |
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్ |

విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిమ్
విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి |

పతిం విశ్వస్యాత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివమచ్యుతమ్ |
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్ |

నారాయణః పరో జ్యోతిరాత్మా నారాయణః పరః |
నారాయణః పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః |

నారాయణః పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః |
యచ్చ కిఇ్చజ్జగత్సర్వం దృశ్యతే” శ్రూయతే2పి వా ||

అన్తర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః |
అనన్తమవ్యయం కవిగ్ం సముద్రేన్తం విశ్వశమ్భువమ్ |

పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖమ్ |
అధో నిష్ట్యా వితస్త్యానే నాభ్యాముపరి తిష్ఠతి |

జ్వాలమాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్ |
సన్తతగ్ం సిరాభిస్తు లంబత్యాకోశసన్నిభమ్ |

తస్యాన్తో సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్” సర్వం ప్రతిష్ఠితమ్ |
తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః |

సో గ్రభుగ్విభజన్తిష్ఠన్నాహారమజరః కవిః |
తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయస్తస్య సన్తతా |

సన్తాపయతి స్వం దేహమాపాదతలమస్తకః |
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయో”ర్ధ్వా వ్యవస్థితా |

నీలతోయదమధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా |
నీవారశూకవత్తన్వీ సీతా భా”స్వత్యణూపమా |

తస్యా”: శిఖాయా మధ్యే పరమా”త్మా వ్యవస్థితః |
స బ్రహ్మ స శివ: (స హరి:) సేన్ద్ర: సోఒక్షరః పరమః స్వరాట్ ||

యోపాం పుష్పం వేద |
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి |

చన్ద్రమా వా అపాం పుష్పమ్” |
పుష్పవాన్ ప్రజావా”న్ పశుమాన్ భవతి |
య ఏవం వేద | యోపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |

అగ్నిర్వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యో”ఒగ్నేరాయతనం వేద || ఆయతనవాన్ భవతి |
ఆపో వా అగ్నేరాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |

వాయుర్వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యో వాయోరాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై వాయోరాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోపామాయతనం వేద | |
ఆయతనవాన్ భవతి |

అసౌ వై తపన్నపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యో ముష్య తపత ఆయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
ఆపో వా అముష్య తపత ఆయతనమ్ ||
ఆయతనవాన్ భవతి ||
య ఏవం వేద | యో౬పామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |

చన్ద్రమా వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యశ్చన్ద్రమస ఆయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై చక్రమస ఆయతనమ్| ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |

నక్షత్రాణి వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యో నక్షత్రాణామాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై నక్షత్రాణామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యో పామాయతనం వేద || య |
ఆయతనవాన్ భవతి |

పర్జన్యో వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యః పర్జన్యస్యాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై పర్జన్యస్యా౬ఒయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యో పామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |

సంవత్సరో వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యస్సంవత్సరస్యాయతనం వేద | ఆయతనవాన్ భవతి | వేద | |
ఆపో వై సంవత్సరస్యాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యో”ఒప్సు నావం ప్రతిష్ఠితాం వేద |
ప్రత్యేవ తిష్ఠతి ||

కిం తద్విష్ణోర్బలమాహుః కా దీప్తిః కిం పరాయణం
ఏకో యద్ధారయద్దేవః రేజతీ రోదసీ ఉభే
వాతాద్విష్ణోర్బలమాహుః అక్షరాద్దీప్తిరుచ్యతే
త్రిపదాద్ధారయద్దేవః యద్విష్ణోరేకముత్తమం |

ఆతనుష్వ ప్రతనుష్వ |
ఉద్ధమా౬౭ధమ సన్దమ |
ఆదిత్యే చన్ద్రవర్ణానామ్ |
గర్భమాధేహి యః పుమాన్ |

ఇతస్సిక్తగ్ం సూర్యగతమ్ |
చన్ద్రమస్తే రసఙ్కృధి |
వారాదఞనయాగ్రేగ్నిమ్ |
య ఏకో రుద్ర ఉచ్యతే ||

ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే” |
నమో వయం వై”శ్రవణాయ కుర్మహే |
స మే కామాన్కామకామాయ మహ్యమ్” |
కామేశ్వరో వై”శ్రవణో దదాతు |
కుబేరాయ వైశ్రవణాయ |
మహారాజాయ నమ: ||

ఓం తద్రృహ్మ ఓ”O తద్వాయుః ఓ”ం తదాత్మా
ఓం తత్సత్యం ఓం తత్సర్వమ్” ఓ”O తత్పురోర్నమ: |

అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు |
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమిన్ద్రస్త్వగ్ం రుద్రస్త్వం
విష్ణుస్త్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః |

త్వం తదాప ఆపో జ్యోతీ రసోమృతం
బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||

ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మా ధీపతిర్బహ్మణో ధీపతిర్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ ||

సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా
సర్వగ్ం హరతుమే పాపం దూర్వాదు స్స్వప్న నాశినీ

కాణ్ణాత్ కాణ్ణాత్ ప్రరోహన్తి పరుషః పరుషః పరి
ఏవానో దూర్వే వ్రతను సహస్రేణ శతేనచ

యాశతేన వ్రతనోషి సహ సేణ విరోహసి
తస్యాస్తే దేవీష్టకే విధేమా హవిషావయం

అశ్వక్రాన్తో రథకార్డే విష్ణు క్రాన్తె వసుంధరా
శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదే పదే
భూమిరే నుర్దరణీ లోకధారిణీ

ఉదృతాసి వరాహేణ కృష్ణన శతబాహునా
మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం
మృత్తికే బ్రహ్మ దత్తాసి కాశ్యపేనాభి మన్రితా
మృత్తికే దేహిమే పుష్టింత్వయి సర్వం ప్రతిష్ఠితం
మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మేనిర్ణుదమృత్తికే
తయాహతేన పాపేన గచ్చామి పరమాం గతిమ్

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
సిద్ధ లక్ష్మీ ర్మోక్షలక్ష్మీ ర్ణయలక్ష్మీ స్సరస్వతీ
శ్రీలక్ష్మీర్వర లక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా

వరాంకుశాపాశ మభీతి ముద్రాం కరైర్వహన్తమ్ కమలాసనస్థాం
బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహ మంబాం జగదీశ్వరీం తామ్
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.
కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి
తన్నోదుర్గిః ప్రచోదయాత్.
సద్భావపుష్పాణ్యాదాయ సహజ ప్రేమ రూపిణే
లోకమాత్రే దదామ్యద్య, ప్రీత్యా సంగృహ్యతాం సదా
శ్రీ లలితా దేవ్యై నమః

సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి

మరిన్ని పోస్ట్లు:

Lalitha Ashtottara Satha Nama Sthotra Ratnam In Telugu | లలితాష్టోత్తరశతనామస్తోత్రరత్నమ్

Lalitha Ashtottara Satha Nama Sthotra Ratnam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు లలితాష్టోత్తరశతనామస్తోత్రరత్నమ్ గురించి తెలుసుకుందాం…

Lalitha Ashtottara Satha Nama Sthotra Ratnam In Telugu

లలితాష్టోత్తరశతనామస్తోత్రరత్నమ్

శివాభవానీకల్యాణీ గౌరీ కాళీశివప్రియా
కాత్యాయనీ మహాదేవీ దుర్గార్యాచండికాభవా.

1

చంద్రచూడాచంద్రముఖీ చంద్రమండలవాసినీ
చంద్రహాసకరా చంద్రహాసినీ చంద్రకోటిభా.

2

చిద్రూపా చిత్కళానిత్యానిర్మలానిష్కళాకళా
భవ్యాభవప్రియా భవ్యరూపిణీ కులభాషిణీ.

3

కవిప్రియా కామకళా కామదా కామరూపిణీ
కారుణ్యసాగరఃకాళీ సంసారార్ణవతారికా.

4

దూర్వాభా దుష్టభయదా దుర్జయా దురితాపహా
లలితారాజ్యదాసిద్ధాసిద్దేశీ సిద్ధిదాయినీ.

5

శర్మదా శాంతిరవ్యక్తాశంఖకుండలమండితా
శారదా శాంకరీ సాధ్వీశ్యామలాకోమలాకృతిః

6

పుష్పిణీ పుష్పబాణాంబా కమలాకమలాసనా
పంచబాణస్తుతా పంచవర్ణరూపా సరస్వతీ.

7

పంచమీపరమాలక్ష్మీః పావనీ పాపహారిణీ
సర్వజ్ఞా వృషభారూఢా సర్వలోకవశంకరీ

8

సర్వస్వతంత్రాసర్వేశీ సర్వమంగళకారిణీ
నిరవద్యా నీరదాభా నిర్మలానిశ్చయాత్మికా.

9

నిర్మదానియతాచారానిష్కామానిగమాలయా
అనాదిబోధా బ్రహ్మాణీకౌమారీ గురురూపిణీ.

10

వైష్ణవీసమయాచారా కౌళినీ కుళదేవతా
సామగానప్రియా సర్వవేదరూపాసరస్వతీ.

11

అంతర్యాగప్రియానందా బహిర్యాగపరార్చితా
వీణాగానరసానందా అర్థోన్మీలితలోచనా.

12

దివ్యచందనదిగ్ధాంగీ సర్వసామ్రాజ్యారూపిణీ
తరంగీకృతసాపాంగవీక్షారక్షితసజ్జనా.

13

సుధాపానసముద్వేలహేలామోహితధూర్జటీ
మతంగమునిసంపూజ్యా మతంగకులభూషణా.

14

మకుటాంగదమంజీరమేఖలాదామ భూషితా
ఊర్మిలా కింకిణీరత్న కంకణాదిపరిష్కృతా

15

మల్లికామాలతీకుందమందారాంచితమస్తకా
తాంబూలకబళో దంచత్కపోలతలశోభినీ

16

త్రిమూర్తిరూపా త్రైలోక్య సుమోహనతనుప్రభా
శ్రీమచ్చక్రాధినగరీసామ్రాజ్య శ్రీస్వరూపిణీ.

17

మరిన్ని అష్టోత్తర పోస్ట్లు మీకోసం:

Durga Saptashati Argalaa Sthotram In Telugu | దుర్గా సప్తశతి అర్గళా స్తోత్రమ్

Durga Saptashati Argalaa Sthotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దుర్గా సప్తశతి అర్గళా స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Durga Saptashati Argalaa Sthotram In Telugu

దుర్గా సప్తశతి అర్గళా స్తోత్రమ్

అస్య శ్రీ అర్దశాస్తోత్రమంత్రస్య విష్ణు ఋషిః అనుష్టు వృందః | శ్రీమహాలక్ష్మీ దేవతా మంత్రోదితా దేవో బీజం | నవార్లో మంత్ర శ్శక్తిః | శ్రీ సప్తశతీమంత్రస్తత్వం శ్రీ జగదంబా ప్రీత్యర్థే స్తోత్రపాఠాంగత్వేన జపే వినియోగః ॥ ఓం నమ శ్చండికాయై |

మార్కండేయ ఉవాచ |

జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ |
దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తు తే ||

1

మధుకై టభవిద్రావి విధాతృవందే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

2

మహిషాసురనిర్నాశవిధాత్రి వరదే నమః |
రూపం … జహీ ||

3

వందితాంమ్రియుగే దేవి దేవి సౌభాగ్యదాయిని |
రూపం … జహీ ||

4

రక్తబీజవధే దేవి చండముండవినాశిని |
రూపం … జహీ ||

5

అంచిత్య రూపచరితే సర్వశత్రువినాశిని |
రూపం … జహీ

6

న తేభ్య స్సర్వదా భక్త్యా చండికే ప్రణతాయ మే। న కే
రూపం … జహీ

7

స్తువద్భ్యో భ క్తి పూర్వం త్వాం చండికే వ్యాధినాశిని
రూపం … జహీ

8

చండికే సతతం యే త్వా మర్చయంతీహ భక్తితః ॥
రూపం … జహీ

9

దేహి సౌభాగ్య మారోగ్యం దేహి దేవి పరం సుఖం |
రూపం … జహీ

10

విధేహి ద్విషతాం నాశం విధేహి బల ముచ్చకై |
రూపం … జహీ

11

విధేహి దేవి కళ్యాణం విధేహి విపులాం శ్రియం:
రూపం … జహీ

12

విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు |
రూపం … జహీ

13

ప్రచండదై త్యదర్స ఘ్నే చండి కే ప్రణతాయ మే |
రూపం … జహీ

14

చతుర్భుజే చతుర్వక్త్ర సంస్తుతే పరమేశ్వరి తే |
రూపం … జహీ

15

కృష్ణన సంస్తు తే దేవి శశ్వవృత్త్యా తథాంబి కే |
రూపం … జహీ

16

హిమాచలసు తా.నాథపూజితే పరమేశ్వరీ |
రూపం … జహీ

17

సురాసుర శిరోరత్న నిఘృష్టచరణేఒంది కే |
రూపం … జహీ

18

ఇంద్రాణీపతి సద్భావ పూజితే పరమేశ్వరి |
రూపం … జహీ

19

దేవి ప్రచండ దోర్దండ దైత్యదర్ప వినాశిని |
రూపం … జహీ

20

దేవి భ క్తజనోద్దామ దత్తానందోదయేఒంబి కే |
రూపం … జహీ

21

పత్నీం మనోరమాం ‘దేహి మనోవృత్తానుసారిణీం|
తారిణీం దుఃసంసార సాగర స్య కులోద్భవామ్ ||

22

ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠే న్నరః |
స తు సప్తశతీసంఖ్యా వర మాప్నోతి సంపదః ||

23

ఇశ్రీ శ్రీ మార్కండేయవురాణే దేవ్యా అర్ధశాస్త్రోత్రమ్ ||

మరిన్ని స్తోత్రములు:

Sri Devi Kadgamala Stotraratna Namaavali In Telugu | శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రరత్న నామావళిః

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రరత్న నామావళిః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రరత్ననామావళిః గురించి తెలుసుకుందాం…

Sri Devi Kadgamala Stotraratna Namaavali In Telugu Lyrics

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రరత్న నామావళిః

  • ఓం త్రిపురసుందర్యై నమః
  • ఓం అథన్యాసాంగదేవక నామాని నమః
  • ఓం హృదయదేవ్యై శిరోదేవ్యై నమః
  • ఓం శిఖాదేవ్యై నమః
  • ఓం కవచదేవ్యై నమః
  • ఓం నేత్రదేవ్యై నమః
  • ఓం అథతిధినిత్యానామాని నమః
  • ఓం కామేశ్వర్యై నమః
  • ఓం భగమాలిన్యై నమః
  • ఓం నిత్యక్లిన్నాయై నమః
  • ఓంభేరుండాయై నమః
  • ఓం వహ్నివాసిన్యై నమః
  • ఓం మహావజ్రేశ్వర్యై నమః
  • ఓం శివదూత్యై నమః
  • ఓం త్వరితాయై నమః
  • ఓం కులసుందర్యై నమః
  • ఓం నిత్యాయై నమః
  • ఓం నీలపతాకాయై నమః
  • ఓం విజయాయై నమః
  • ఓం సర్వమంగళాయై నమః
  • ఓం జ్వాలామాలిన్యై నమః
  • ఓం చిత్రాయై నమః
  • ఓం మహానిత్యాయై నమః
  • ఓం అథ దివ్యౌఘగురునామాని నమః
  • ఓం పరమేశ్వరపరమేశ్వర్యై నమః
  • ఓం మిత్రేశమయ్యై నమః
  • ఓం షష్ఠీశమయ్యై నమః
  • ఓం చర్యానాథమయ్యై నమః
  • ఓం లోపాముద్రామయ్యై నమః
  • ఓం అగస్త్యమయ్యై నమః
  • ఓం కాలతాపనమయ్యై నమః
  • ఓం ధర్మాచార్యమయ్యై నమః
  • ఓం ముక్తకేశీశ్వరమయ్యై నమః
  • ఓం అథమానవౌఘగురునామాని నమః
  • ఓం దీపకళానాథమయ్యై నమః
  • ఓం విష్ణుదేవమయ్యై నమః
  • ఓం ప్రభాకరదేవమయ్యై నమః
  • ఓం తేజోదేవమయ్యై నమః
  • ఓం మనోజదేవమయ్యై నమః
  • ఓం కల్యాణదేవమయ్యై నమః
  • ఓం వాసుదేవమయ్యై నమః
  • ఓం రత్న దేవమయ్యై నమః
  • ఓం శ్రీరామానందమయ్యై నమః
  • ఓం అథప్రథమావరణనామాని నమః
  • ఓం అణిమాసిద్ధయే నమః
  • ఓం లఘిమాసిద్దయే నమః
  • ఓం మహిమాసిద్దయే నమః
  • ఓం ఈశిత్వసిద్ధయే నమః
  • ఓం వశిత్వసిద్ధయే నమః
  • ఓం ప్రాకామ్యసిద్ధయే నమః
  • ఓం భుక్తిసిద్ధయే నమః
  • ఓం ఇచ్ఛాసిద్ధయే నమః
  • ఓం ప్రాప్తిసిద్ధయే నమః
  • ఓం సర్వకామసిద్ధయే నమః
  • ఓం బ్రాహ్మ్యై మాహేశ్వర్యై నమః
  • ఓం కౌమార్యై నమః
  • ఓం వైష్ణవ్యై నమః
  • ఓం వారాహ్యై నమః
  • ఓం మాహేంద్యై నమః
  • ఓం చాముండాయై నమః
  • ఓం మహాలక్ష్మ్యే నమః
  • ఓం సర్వసంక్షోభిణ్యై నమః
  • ఓం సర్వవిద్రావిణ్యై నమః
  • ఓం సర్వాకర్షిణ్యై నమః
  • ఓం సర్వవశంకర్యై నమః
  • ఓం సర్వోన్మాదిన్యై నమః
  • ఓం సర్వమహాంకుశాయై నమః
  • ఓం సర్వచ సర్వబీజాయై నమః
  • ఓం సర్వయోన్యై నమః
  • ఓం సర్వత్రిఖండాయై నమః
  • ఓం త్రైలోక్యమోహనచక్రస్వామిన్యై నమః
  • ఓం ప్రకటయోగిన్యై నమః
  • ఓం అథద్వితీయావరణనామాని నమః
  • ఓం కామాకర్షిణ్యై నమః
  • ఓం బుద్ధ్యాకర్షిణ్యై నమః
  • ఓం అహంకారాకర్షిణ్యై నమః
  • ఓం శబ్దాకర్షిణ్యై కర్షి నమః
  • ఓం చక్రస్వామి నమః
  • ఓం రూపాకర్షిణ్యై నమః
  • ఓం రసాకర్షిణ్యై నమః
  • ఓం గంధాకర్షిణ్యై నమః
  • ఓం చిత్తాకర్షిణ్యై నమః
  • ఓం ధైర్యాకర్షిణ్యై నమః
  • ఓం స్మృత్యాకర్షిణ్యై నమః
  • ఓం నామాకర్షిణ్యై నమః
  • ఓం బీజాకర్షిణ్యై నమః
  • ఓం ఆత్మాకర్షిణ్యై నమః
  • ఓం అమృతాకర్ణిణ్యై నమః
  • ఓం శరీరాకర్షిణ్యై నమః
  • ఓం సర్వాశాపరిపూరకచక్రస్వామిన్యై నమః
  • ఓం గుప్తయోగిన్యై నమః
  • ఓం అథతృతీయావరణనామాని నమః
  • ఓం అనంగకుసుమాయై నమః
  • ఓం అనంగమేఖలాయై నమః
  • ఓం అనంగమదనాయై నమః
  • ఓం అనంగమదనాతురాయై నమః
  • ఓం అనంగరేఖాయై నమః
  • ఓం అనంగవేగిన్యై నమః
  • ఓం అనంగాకుశాయై నమః
  • ఓం అనంగమాలిన్యై నమః
  • ఓం సర్వసంక్షోభణచక్రస్వామిన్యై నమః
  • ఓం అథచతుర్థావరణనామాని నమః
  • ఓం సర్వసంక్షోభిణ్యై నమః
  • ఓం సర్వవిద్రావిణ్యై నమః
  • ఓం సర్వాకర్షిణ్యై నమః
  • ఓం సర్వాదిన్యై నమః
  • ఓం సర్వసమ్మోహిన్యై నమః
  • ఓం సర్వస్తంభిన్యై నమః
  • ఓం సర్వజృంభిణ్యై నమః
  • ఓం సర్వవశంకర్యై నమః
  • ఓం సర్వరంజన్యై నమః
  • ఓం సర్వోన్మాదిన్యై నమః
  • ఓం సర్వార్థసాధిన్యై నమః
  • ఓం సర్వసంపత్తిపూరణ్యై నమః
  • ఓం సర్వమంత్రమయ్యై నమః
  • ఓం సర్వద్వంద్వక్షయంకర్యై నమః
  • ఓం సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిన్యై నమః
  • ఓం సంప్రదాయయోగిన్యై నమః
  • ఓం అథపంచమావరణనామాని నమః
  • ఓం సర్వసిద్ధిప్రదాయై నమః
  • ఓం సర్వసంప్రత్పదాయై నమః
  • ఓం సర్వప్రియంకర్యై నమః
  • ఓం సర్వమంగళాకారిణ్యై నమః
  • ఓం సర్వకామప్రదాయై నమః
  • ఓం సర్వదుఃఖ విమోచన్యై నమః
  • ఓం సర్వమృత్యుప్రశమన్యై నమః
  • ఓం సర్వవిఘ్ననివారిణ్యై నమః
  • ఓం సర్వాంగసుందర్యై నమః
  • ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః
  • ఓం సర్వార్థసాధకచక్రస్వామిన్యై నమః
  • ఓం కులోత్తీర్ణయోగిన్యై నమః
  • ఓం అథషష్ఠావరణనామాని నమః
  • ఓం సర్వజ్ఞాయై నమః
  • ఓం సర్వశక్త్యే నమః
  • ఓం సర్వైశ్వర్యప్రదాయిన్యై నమః
  • ఓం సర్వజ్ఞానమయ్యై నమః
  • ఓం సర్వవ్యాధివినాశిన్యై నమః
  • ఓం సర్వాధారస్వరూపాయై నమః
  • ఓం సర్వపాపహరాయై నమః
  • ఓం సర్వానందమయ్యై నమః
  • ఓం సర్వరక్షస్వరూపిణ్యై నమః
  • ఓం సర్వేప్సితలఫలప్రదాయై నమః
  • ఓం సర్వరక్షాకరచక్రస్వామిన్యై నమః
  • ఓం నిగర్భయోగిన్యై నమః
  • ఓం అథసప్తమావరణనామాని నమః
  • ఓం వశిన్యై, కామేశ్వర్యై నమః
  • ఓం మోదిన్యై, విమలాయై నమః
  • ఓం అరుణాయై నమః
  • ఓం జయిన్యై నమః
  • ఓం సర్వేశ్వర్యై నమః
  • ఓం సర్వరోగహరచక్రస్వామిన్యై నమః
  • ఓం రహస్యయోగిన్యై నమః
  • ఓం అథఅష్టమావరణనామాని నమః
  • ఓం బాణి నమః
  • ఓం పాశిన్యై నమః
  • ఓం అంకుశిన్యై నమః
  • ఓం మహారాజేశ్వర్యై నమః
  • ఓం మహాజేశ్వర్యై నమః
  • ఓం మహాభగమాలిన్యై నమః
  • ఓం మహాశ్రీసుందర్యై నమః
  • ఓం సర్వసిద్ధిప్రదచక్రస్వామిన్యై నమః
  • ఓం అతిరహస్యయోగిన్యై నమః
  • ఓం అథనవమావరణనామాని నమః
  • ఓం శ్రీశ్రీమహాభట్టారికాయై నమః
  • ఓం సర్వానందమయ నమః
  • ఓం చక్రస్వామిన్యై నమః
  • ఓం పరాపరరహస్యయోగిన్యై నమః
  • ఓం అథ నవచక్రేశ్వరీ నామాని నమః
  • ఓం త్రిపురాయై నమః
  • ఓం త్రిపురేత్రిపురసుందర్యై నమః
  • ఓం త్రిపురవాసిన్యై నమః
  • ఓం త్రిపురాశ్రియై నమః
  • ఓం త్రిపురమాలిన్యై నమః
  • ఓం త్రిపురాసిధ్ధ్య నమః
  • ఓం త్రిపురాంబాయై నమః
  • ఓం మహాత్రిపురసుందర్యై నమః
  • ఓం అథదేవీ విశేషణాని నమః
  • ఓం మహామహేశ్వర్యై నమః
  • ఓం మహామహారాజ్యై నమః
  • ఓం మహామహాశక్త్యే నమః
  • ఓం మహామహాగుప్తాయై నమః
  • ఓం మహామహాజ్ఞప్యై నమః
  • ఓం మహామహానందాయై నమః
  • ఓం మహామహాస్పందాయై నమః
  • ఓం మహామహాశయాయై నమః
  • ఓం మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞ్యి నమః
  • ఓం నమస్తే నమస్తే నమస్తే నమః నమః

మరిన్ని స్తోత్రములు:

Mantra Matruka Varnamaala Sthotram In Telugu | మంత్రమాతృకా వర్ణమాలా స్తోత్రమ్

Mantra Matruka Varnamaala Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంత్రమాతృకా వర్ణమాలా స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Mantra Matruka Varnamaala Sthotram In Telugu

మంత్రమాతృకా వర్ణమాలా స్తోత్రమ్

కల్లోలోల్లసితా మృతాబ్ధిలహరీ మధ్యే విరాజన్మణి
ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాట్యుజ్జ్వలే
రత్నస్తంభ సహస్ర నిర్మిత సభామధ్యే విమానోత్తమే
చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే ||

1

ఏణాంకానల భానుమండల లసఛ్ఛీ చక్రమధ్యే స్థితాం
బాలార్కద్యుతి భాసురాం కరతలైః పాశాంకుశా బిభ్రతీం
చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభ వస్త్రాన్వితాం
తాం త్వాం చంద్రకళావతంస మకుటాంచారుస్మితాంభావయే ||

2

ఈశానాది పదం శివైక ఫలకం రత్నాసనం తే శుభం
పాద్యం కుంకుమ చందనాది భరిత్యై రర్ఘ్యం స రత్నాక్షతైః
శుద్దె రాచమనీయకం తప జలై ర్భక్త్యా మయా కల్పితం
కారుణ్యామృత వారిధే తదఖిలం సంతుష్టయే కల్ప్యతామ్ ||

3

అక్ష్యే యోగిజనస్య రక్షిత జగజ్జాలే విశాలేక్షణే
ప్రాలేయాంబు పటీర కుంకుమ లసత్కర్పూర మిశ్రోదకైః
గోక్షీరై రపి నారికేళసలిలై శ్శుద్దోదకై ర్మంత్రితై
స్నానం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్ప్యతాం ||

4

హ్రీంకారాంకిత మంత్రలక్షతతనో హేమాచలత్సంచితైః
రత్నైరుజ్జ్వల ముత్తరీయ సహితం కౌసుంభ వర్ణాంశుకం
ముక్తాసంతతి యజ్ఞసూత్ర మమలం సౌవర్ణ తంతూద్భవం
దత్తం దేవి ధియా మయై దతఖిలం సంతుష్టయే కల్ప్యతామ్ ||

5

హంసై రప్యతి లోభనీయ గమనే హోరావళీ ముజ్జ్వలాం
హిందోళద్యుతి హీరపూరితతరే హేమాంగదే కంకణే
మంజీరే మణికుండలే మకుట మప్యర్ధేందు చూడామణిం
నాసామౌక్తిక మంగుళీయ కటకే కాంచీమపి స్వీకురు ||

6

సర్వాంగే ఘనసార కుంకుమ ఘన శ్రీగంధ పంకాంకితం
కస్తూరీ తిలకంచ ఫాలఫలకే గోరోచనా పత్రకం
గండాదర్శన మండలే నయనయో ర్దివ్యాంజనం తేంచితం
కంఠాణ్ణి మృగనాభిపంక మమలం త్వత్రీతయే కల్ప్యతామ్ ||

7

కల్హారోత్పల మల్లికా మరువకెః సౌవర్ణపంకేరుహైః
జాజీ చంపక మాలతీ వకుళకై ర్మందార కుందాదిభిః
కేతక్యా కరవీరకై ర్భహువిధైః క్లుప్తాః సజోమాలికాః
సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహ్యతామ్ ||

8

హంతారం మదనస్య నందయసి యైరంగై రనంగోజ్జ్వలై
ర్యైర్భృంగావళి నీలకుంతలభరై ర్బధ్నాసి తస్యాశయం
తానీమాని తవాంబ కోమలతరా ణ్యామోద లీలాగృహా
ణ్యామోదాయ దశాంగ గుగ్గులు ఘృతై ర్ధూపై రహం ధూపయే ||

9

లక్ష్మీముజ్జ్వలయామి రత్ననివహో ద్భాసాన్తరే మన్దిరే
మాలారూప విలంబితై ర్మణిమయ స్తంభేషు సంభావితైః
చిత్రైర్హాటక పుత్రికా కరధృతైర్గవైర్ఘృతైర్వర్థితైః
దివ్యై ర్దీపగణై ర్థియా గిరిసుతే సంతుష్టయే కల్ప్యతాం ||

10

హ్రీంకారేశ్వరి తప్తహాటక కృతైః స్థాలీ సహస్త్రైర్యుతం
దివ్యాన్నం ఘృత సూపశాక భరితం చిత్రాన్నభేదం తథా
దుగ్ధాన్నం మధుశర్కరా దధియుతం మాణిక్యపాత్రే స్థితం
మాషాపూప సహస్రమంబస ఫలం నైవేద్య మావేదయే ||

11

సచ్ఛాయైర్వర కేతకీ దళరుచా తాంబూలవల్లీ దళైః
పూగైర్భూరిగుణైః స్సుగంధి మధురైః కర్పూర ఖండోజ్జ్వలైః
ముక్తాచూర్ణ విరాజితై రృహువిధై ర్వక్రాంబుజా మోదితైః
పూర్ణారత్నకలాచికా తవ ముదే న్యసా&త పురస్తాదుమే ||

12

కన్యాభిః కమనీయ కాంతిభి రలంకారామలా రార్తికా
పాత్రే మౌక్తిక చిత్రపంక్తి విలస త్కర్పూర దీపాళిభిః
తత్తత్తాళ మృదంగగీత సహితం నృత్య త్పదాంభోరుహం
మంత్రారాధన పూర్వకం సునిహితం నీరాజనం గృహ్యతామ్ ||

13

లక్ష్మీర్మౌక్తి కలక్షకల్పిత సిత చ్ఛత్రం తు ధత్తే రసా
దింద్రాణీ చ రతిశ్చ చామరవరే ధతే &త స్వయంభారతీ
వీణామేణ విలోచనా స్సుమనసా తానృత్యంతి తద్రాగవ
ద్భావై రాంగిక సాత్వికైః స్ఫుటరసం మాత స్త్వమాకర్ణ్యతాం ||

14

హ్రీంకార త్రయ సంపుటేన మనునో పాస్యే త్రయీ మౌళీభిః
వాక్యై ర్లక్ష్యతనో ! తవ స్తుతి విధౌ కో వాక్షమేతాంబికే
సల్లాపాస్తుృతయః ప్రదక్షిణశతం సంచార ఏవాస్తుతే
సంవేశో నమస్సహస్ర మఖిలం సంతుష్టయే కల్పతాం ||

15

శ్రీ మంత్రాక్షర మాలయా గిరిసుతాం యః పూజయేచ్చేతసా
సంధ్యాసు ప్రతివాసరం సునియతస్తస్యామల స్యాచిరాత్
చిత్తాంభోరుహ మంటపే గిరిసుతా నృత్తం విధత్తే రసా
ద్వాణీ వక్త్రసరోరుహే జలధిజా గేహే జగన్మంగళా ||

16

ఇతి గిరివరపుత్రీ పాదరాజీవ భూషా భువన మమలయంతి సూక్తిసౌరభ్య సారైః
శివపద మకరన్ద స్యన్దినీ మన్నిబద్దా
మదయతు కవిభృంగా న్మాతృకా పుష్పమాలా ||

17

ఇతి శ్రీ మచ్ఛంకర భగవత్పూజ్య పాదాచార్యులు చెప్పిన మంత్ర మాతృకా పుష్పమాలాత్మకమైన నిత్య మానసపూజా స్తుతి సంపూర్ణము.

మరిన్ని స్తోత్ర పోస్ట్లు మీకోసం:

Sri Lalitha Panchavimsati Nama Sthotram In Telugu | శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రం

Sri Lalitha Panchavimsati Nama Sthotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Sri Lalitha Panchavimsati Nama Sthotram In Telugu

శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రం

వాజివక్త్ర మహాబుద్ధే పంచవింశతి నామభిః
లలితా పరమేశాన్యా దేహి కర్ణరసాయనం ||

సింహాసనేశీ లలితా మహారాజ్ఞి వారంకుశా
చాపినీ త్రిపురా చైవ మహాత్రిపురసుందరీ

సుందరీ చక్రనాథా చ సామ్రాజ్ఞి చక్రినీ తధా
చక్రేశ్వరీ మహాదేవీ కామేశీ పరమేశ్వరీ

కామరాజ ప్రియా కామకోటికా చక్రవర్తినీ
మహావిద్యా శివానంగవల్లభా సర్వపాటలా

కులనాథా22 మ్నాయనాధా సర్వామ్నాయనివాసినీ
శృంగారనాయికా చేతి పంచవింశతి నామభిః||

స్తువంతి యే మహాభాగాం లలితాం పరమేశ్వరీం
తేప్రాప్నువంతి సౌభాగ్యం అష్టసిద్దీర్మహద్యశః॥

కామేశ్వరోత్సంగసదానివాసి కాలాత్మికే దేవి కృతానుకంపే
కల్పావసానోస్థిత కాళిరూపే కామప్రదే కల్పలతే నమస్తే ॥

ఈ స్తోత్రం అన్నిటా విజయమును కలిగిస్తుంది. అందుచే దీనిని సమర విజయ ప్రద స్తోత్రం అని కూడా అంటారు.

మరిన్ని స్తోత్రములు:

Sri Lalitha Ashtakam In Telugu | శ్రీ లలితాష్టకమ్

Sri Lalitha Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము.  అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలిత అష్టకం గురించి తెలుసుకుందాం…

Sri Lalitha Ashtakam In Telugu

శ్రీ లలితాష్టకమ్

శరణాగత పరిపాలిని కరుణాయిత ధిషణే
కరుణా రసపరిపూరిత నయనాంబుజ చలనే
అరుణాంబుజ సద్యశీకృత మణినూపుర చరణే
అంబ లలితే శివ దయితే మయి కృపణే కురు కరుణాం ||

కమలాయత తటివాసిని కమలావతి సహజే
కమలా శతపరిభావిత నయనాంబుజ చలనే
కమలాసన ముదాశాసన భవశాసన వినుతే
అంబ లలితే శివ దయితే మయి కృపణే కురుకరుణాం ||

భవకానన గత మానుష పదవీకృత చరణే
భవనాశన పరికల్పిత శయనార్చిత నయనే
అవనీ ధర వర కార్ముక మద పల్లవలతికే

|| అంబ ||

మదిరాలస గత మానుష మదవారణ గమనే
విలసత్ సూ బా నవశాబక విలసత్కర కమలే
రదనచ్ఛవి వరనిర్జిత నవమౌక్తి నికరే

|| అంబ ||

బలసూదన మణిరంజిత పదపంకజ కమలే
అవబుజవర వాహన బహుభేదిత సుఖదే
అళిసంకుల నిభకుంతల విలసశ్చశి శకలే

|| అంబ ||

అధరీకురు రిపు సంహృతి మతి కోకిల వచనే
మధురాధర పరిశోభిత మదనాంతక హృదయే
అధునాసుర వనితాశత పరిభావిత చరణే

|| అంబ ||

శకలీకృత దురితేఖిల జగతామపి శివదే
శివ మానస పరిమోహన మణినూపుర నినదే
సకలాగమ శిరసా పి చ బహుతోషిత మహిమే

|| అంబ ||

శమనాంతక హృదయాంబుజ తరుణారుణ కిరణే
శమయాఖిల దురితా నపి బహుమానయ పూర్ణే
అమలీకురు ధిషణా మపి బహుసంశయ దళనే

|| అంబ||

మరిన్ని అష్టకములు:

Sri Raghavendra Swamy Japa Vidhanam In Telugu | శ్రీ రాఘవేంద్రస్వామి జప విధానము

Sri Raghavendra Swami Japa Vidhanam

పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.

Sri Raghavendra Swamy Japa Vidhanam Telugu

పూజా అనేది అభిమానం, ప్రేమ, భక్తి మరియు అభివృద్ధికి స్థానము. ఇది మనస్సును ప్రశాంతత, ధ్యానం మరియు సమాధానాన్ని అందిస్తుంది. పూజా అనేది ధర్మ, ఆధ్యాత్మికత మరియు సంస్కృతి వ్యాపకంగా సంబంధించిన అమూల్యమైన పద్ధతి. శ్రీ రాఘవేంద్రస్వామి జప విధానము, పూజ గురించి తెలుసుకుందాం…

శ్రీ రాఘవేంద్రస్వామి జప విధానము

ఓం అస్య శ్రీరాఘ వేంద్రాష్టాక్షరీ మహామంత్రస్య అప్పణాచార్యః ఋషిః గాయత్రీ ఛందః, శ్రీరాఘ వేంద్ర గుర్వ స్తర్గత శ్రీమూలరామచజ్ఞో దేవతా, ఓం బీజం, శ్రీం శక్తి ః, రాఘవేంద్రాయ నమః కీలకమ్, శ్రీరాఘవేంద్రప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః.

ఓం అంగుష్ఠాభ్యాం నమః
శ్రీం తర్జనీభ్యాం నమః,
రాఘ వేంద్రాయ మధ్యమాభ్యాం నమః ||

నమః అనామికాభ్యాంనమః
ఇతిక నిష్ఠికాభ్యాంనమః
శ్రీరాఘ వేంద్రాయ కరతలకరపృష్టాభ్యాం నమః ||

ఇతికరన్న్యాసః
అథ అంగన్న్యాసః ;
శ్రీం హృదయాయ నమః
“రాఘ వేంద్రాయ శిరసే స్వాహా నమః ||

శిఖాయై వషట్
శ్రీం కవచాయ హుమ్
రాఘవేంద్రాయ నేత్రాభ్యాం వౌషట్
నమః అస్త్రాయ ఫట్
ఇతి దిగ్బంధః ||

ధ్యానమ్

తప్త కాంచన సంకాశ మక్షమాలాం కమణ్డలుమ్
దోర్భ్యాం దధానం కాషాయవసనం రామమానసమ్
యోగీన్ద్రతీర్థ వంద్యాఘ్రం తులసీదామభూషితమ్
జ్ఞానభ క్తి తపః పూర్ణం ధ్యాయేత్సర్వార్థసిద్ధయే.

పుటము బెట్టిన పసిడివంటి దేహకాంతి కలవాడును, ఒక చేత జపమాలను, వేఱక చేతక మండలువును దాల్చి కాషాయ వస్త్రములను ధరించి యున్నవాడును, సదా శ్రీరామపర బ్రహ్మ మందు మనస్సును నిల్పినవాడును, తులసీదళమాలలను ధరించిన వాడును, యోగీంద్రతీర్థాదులచే పాదాభివందనములను బొందు వాడును, భ క్తి జ్ఞానతపసాదులచే పరిపూర్ణు డైనవాడును నగు శ్రీరాఘ వేంద్రతీర్థ స్వామిని సకలార్థసిద్ధికొఱకు ధ్యానించెదను.

శ్రీవారిమంత్రమునకు అధిదేవతాపర మగు అర్థముగూడ స్ఫురించును. ఓం = ఓంకారస్వరూపుడును; శ్రీ = లక్ష్మీ స్వరూపురా లగుసీతతో గూడినవాడును, రాఘవేంద్రాయ = రఘువంశమందు శ్రేష్ఠు డగు రామచంద్రునకు, నమః = నమస్కారము.
“ఓం శ్రీ రాఘ వేంద్రాయ నమః”

షోడశోపచార పూజ
పదునాఱు ఉపచారములచే శ్రీవారిని పూజింపవలెను.

1. ధ్యానము, 2. ఆవాహనము, 3. అసనసమర్ప ణము, 4. పాద సమర్పణము, 5. 6. ఆచమన సమర్పణము, 7. మధుపర్క సమర్పణము, 8. అను లేపనసమర్పణము, 9. స్నానము సమర్పణము, 10. వస్త్ర సమర్పణము, 11. యజ్ఞోపవీతసమర్పణము, 12. ఆభరణ సమర్పణము, 13. గంధసమర్పణము, 14. అక్షతసమర్ప ణము, 15. పుష్పమాలా సమర్పణము, 16. ధూపదీప సమర్పణము.

తదనంతరము ఈ క్రింది విధముగ పూజలను కొనసాగింప వలెను.

1. నైవేద్యసమర్పణము
2. హస్తప్రయోళనార్థము అర్ఘ్యసమర్పణము
3. తాంబూల సమర్పణము
4. సువర్ణ దక్షిణాసమర్పణము
5. మంత్రపుష్పసమర్పణము
6. నీరాజన సమర్పణము
7. ప్రదక్షిణా చరణము.

తదనంతరము ఉత్తరపూజ నొనరింపవలెను.

1. ఛత్ర సమర్పణము,
2. చామర సమర్పణము,
3. దర్పణదర్శనము
4. వాద్యవాదనము
5. జయజయా కార సమర్పణము
6. నృత్యము
7. గీతము
8. సమస్తరాజోపచారమంత్రోపచార పూజాసమర్పణము
9. శ్రీకృష్ణార్పణము
10. సాష్టాంగదండప్రణామము.

ఇట్లుపూజను పూర్తి చేసి శ్రీవారి విగ్రహమును చేతులతో పైకెత్తి ఆరాధనా మహోత్సవమునకు అఱు దెంచిన సర్వులకు జూపించిన లెను.

మరిన్ని పూజా విధానాలు: