Sri Mallikarjuna Suprabhatam In Telugu – శ్రీ మల్లికార్జున సుప్రభాతమ్

Sri Mallikarjuna Suprabhatam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీ మల్లికార్జున సుప్రభాతం ఒక తెలుగు భక్తి గీతంగా తెలుగు వారు ప్రధానంగా పాడే భక్తి సంగీత క్రియలలో ఒకటి. ఈ సుప్రభాతం మల్లికార్జున స్వామిని స్తుతించడానికి సమర్థమైనది. ఈ గీతం భక్తులకు మాత్రమే కాదు, ప్రత్యేకంగా తెలుగు సాంస్కృతిక వ్యవహారాలలో ప్రచురించబడుతుంది. అది భక్తి, ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక సమృద్ధికి ప్రధాన పాత్రని ప్రదర్శిస్తుంది.

శ్రీ మల్లికార్జున స్వామి సుప్రభాతం

“సు-ప్రభాతము” అనగా “మంచి ఉదయం” అని అర్ధం. హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి అయ్యప్ప ఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు (షోడశోపచారములు) నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే “సుప్రభాతం” అని అంటారు.

Sri Srisaila Mallikarjuna Suprabhatam

శ్లో. ప్రాతస్స్మరామి గణనాథమనాథబంధుం
సిందూర పూరపరిశోభితగండయుగ్మమ్,
ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ
మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్.

టీక. ఆనాథబంధుమ్ = దిక్కు లేని వారికి బంధువైనట్టియు; సిందూర పూర పరిశోభిత గండయుగ్మమ్ = చంది కమను శోభనద్రవ్యము యొక్క సమూ హముచేఁ బ్రకాశించెడి చెక్కిళ్లు గలవాఁడును. ఉద్దండ… దండమ్:— ఉద్దండ = గొప్పవైన; విఘ్న = ఆంతరాయముల యొక్క; పరిఖండన = విచ్ఛేదమందు; చండదండమ్ = తీక్ష్ణ శాసనముగలవాఁడును; ఆఖండల… వంద్యమ్:— ఆఖండలాది = ఇంద్రుఁడు మొదలగు, సురనాయక = దేవ శ్రేష్ఠులయొక్క, బృంద = సమూహముచే, వంద్యమ్ = నమస్కరింపఁ బడువాఁడునగు, గణనాథం = ప్రమథగణనాయకుఁడగు వినాయకుని; ప్రాతః = ఈ ప్రాతః కాలమున, స్మరామి = నేను తలఁచుచున్నాను.

తా. దీన బంధువును, చందిరపుఁ గాంతి చే చెలువొందు గండ స్థలములు గల యేనిక మోమువాఁడును, విఘ్నము లెంత లెంతవైన క్షణములోఁ బ్రచండ శాసనమున నణఁచి వేయు వాఁడును, ఇంద్రాది దేవవంద్యుఁడునగు గణపతిని ఈ సుప్ర భాతము నిర్విఘ్నమగుట కీ ప్రాతఃకాలమున మొదట నేను మనస్సులో స్మరించుకొనుచున్నాను.

కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే,
శివాభ్యామస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్.

టీక. కలాభ్యాం = చతుష్షష్టి (64) కళలుగలవారును; (కలిఃకామధేనుః అనుటచే కలి ఛాతూత్పన్నమైన కలయనుదాని కనేకార్థములుగలవు; వానిని వివరింప విస్తారమగును) చూడాలంకృత = శిరసునం దలంకరించు కొనఁబడిన, శశికలాభ్యాం = చం ద్రకళ గలవారును; నిజతపః = ఒకరి కొఱ కొకరు చేసికొనిన తపస్సు యొక్క, ఫలాభ్యాం = ఫలముగల వారును, భక్తేషు = భక్తులమీఁద, ప్రశటిత ఫలాభ్యాం = విశదపఱచిన ఫలముగలవారును; అస్తోక… శివాభ్యాం:- అస్తోక = గొప్పదైన, త్రిభు వనశివాభ్యాం = ముల్లోకములకు శుభమునొసఁగువారును; భవాభ్యాం = కారణజన్ములైనట్టియు, ఆనంద…. అనుభవాభ్యాం _ ఆనంద = ఆనంద ముచే, స్ఫురత్ = ప్రకాశితమైన, అనుభవాభ్యాం = అనుభూతిగల వారిను, ఆగు-శివాభ్యాం = పార్వతీ పరమేశ్వర దంపతుల కొఱకు, మే = నాయొక్క; హృదిపుః = హృదయమందైతే; ఇయం = ఈ, నతిః = నమస్కారము; భవతు = ఆగుగాక !

తా. చతుష్షష్టి కళాస్వరూపులును, చంద్రకళాధరులును, వర స్పర తపఃఫల సంపాదితులును, భక్తతతి కభీష్టదాయకు లును, ముల్లోకములకు శుభములొసఁగువారును, కారణ జన్ములును, నిత్యానందగోచరులును పార్వతీవర మేశ్వరు లకు నా మనస్సులో మ్రొక్కులిడుదును.

నమస్తే నమస్తే మహాదేవ! శంభో!
నమస్తే నమస్తే దయాపూర్ణసింధో!
నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో!
నమస్తే నమస్తే నమస్తే మహేశ.

టీశ. మహాదేవ! = దేవతల కెల్లదేవుఁడవైనవాఁడా | శంభో! = సుఖమును గల్గించువాఁడా! తే=నీకొఱకు, నమః = నమస్కారము – తే = నీకొఱకు, నమః = నమస్కారము, దయాపూర్ణసింధో = దయతో నిండిన సముద్రుఁడా ! నమస్తే నమస్తే = నీకు మరల మరల నమస్కారము. ప్రపన్నాత్మబంధో! = శరణన్నవారి కాత్మబంధువైనవాఁడా! నమస్తే నమస్తే = నీకు నమస్కారము. మహేశ్ ! ఓయీ! లోకమంతటిని శానించు ప్రభువా! నమస్తే, నమస్తే, నమస్తే = నీకు ముమ్మాటికి నమస్కారములు.

తా. ఓయీ! మహా దేవ! శంభో! దయాసాగర! శరణార్తిహర ! మహేశ్వర ! నీకు పదే పదే నేను నమస్కరించు చున్నాను.

శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం
సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్,
సోమార్ధాంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమసంపత్ప్రదాం
సుశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభోస్సఖీం త్వాం సుమః.

టీక. త్రిజగతాం = ముల్లోకములకు, రక్షాకృతిం = రక్షణాకారమును, శశ్వత్ = ఎల్లప్పుడు, శ్రీగిరిమూర్ధని = శ్రీశైలపర్వత శిఖరమందు, లక్ష్మీతాం = కనబఱచునట్టిదియు, సాక్షాత్ = ప్రత్యక్షముగ, అక్షత = తఱుఁగని, సత్కటాక్ష = అనుగ్రహవీక్షణముల యొక్క, సరణి = మార్గముచే, శ్రీమత్ = శోభతో గూడిన, సుధావర్షిణీమ్ = అమృతమును వర్షించునదియు, సోమ… మస్తకాం :- సోమార్ధ = చంద్రకళ చే, అం కిత = గుర్తుగానున్న, మస్తకాం = శిరస్సును గలిగినదియు. ప్రణమతాం = తనకు నమస్కరించువారలకు, నిస్సీమసంపత్ప్రదాం = మితిలేని సంపద నిచ్చునదియు, సుశ్లోకాం = మంచి వారిచేఁ గొనియాడఁబడునదియు, స్మితముఖీం = చిఱునవ్వుగల ముఖముఁ గలిగినదియు, శంభోః = శంకరునకు, సఖీం = ప్రియురాలైన, భ్రమరాంబికాం = భ్రమరాంబ యను పేరుగల, త్వామ్ = నిన్నును, నుమః = నమస్కరించుచున్నాము.

తా. లోకరక్షణమునకై శ్రీశైలశిఖరమున నెల్లప్పుడు నాకారమును గల్గియున్నట్టియు, అక్షయము నమృత సమ్మితమైన చూపులను భక్తులపై నెఱపునదియు, చంద్రరేఖా వతంసయు, మితి లేని సంపదల నాశ్రితులకిచ్చుచు సుజనులచే నుతింపఁబడునదియు శివునర్ధాంగియు భ్రమరాంబ. యను నామముగల నిన్నును స్తోత్రించుచున్నాము.

మాతః! ప్రసీద, సదయా భవ, భవ్యశీలే !
లీలాలవాకులితదైత్యకులాపహారే !
శ్రీచక్రరాజనిలయే ! శ్రుతిగీతకీర్తే !
శ్రీశైలనాథదయితే ! తవ సుప్రభాతమ్.

టీక. మాతః! = ఓతల్లీ!, ప్రసీద = ఆనుగ్రహింపుము; భవ్యశీలే! = మంగళ స్వభావము గలదాన! సదయా = దయతో ఁగూడినదానవు, భవ = అగుము; లీలా…. హారే!: – లీలాలవ విలాసలేశముచేతనే, ఆకలిత చూడఁబడిన, దైత్యకుల = రాక్షస వంశమును ఆపహారే = నాళన మొందించినదాన! శ్రీ చక్రరాజనిలయే ! = ఉత్తమమగు శ్రీచక్రము నాధారముగఁజేసికొనినదాన!, శ్రుతిగీతకీర్తే! = వేదముల చేఁ గీర్తింపఁ బడిన కీర్తిగలదాన! శ్రీ శైలనాథదయితే ! = శ్రీశైలపతికి ప్రియురాల నగునో భ్రమరాంబ! తవ నీకు, సుప్రభాతమ్ = సుఖమయమైన యుదయమగుఁ గాక !

తా. ఓ తల్లి! నీవు మంగళమగు మనస్సుగలదానవు; కృపా వతివి, కావున మమ్మనుగ్రహింపుము; శ్రీ చక్ర ము సధిష్ఠించి యొక్కసారి విలాసమున దుష్టరాక్షసులఁజూచి వారినంతమొందించిన దాన ! వేదవాక్కులచే సుప్రతిష్ఠిత మగు కీర్తి గలదాన! శ్రీశైలనాథార్ధదేహ భాగినియగు నో భ్రమరాంబా దేవి! నీకిది సుప్రభాతమగుఁగాక !

శంభో ! సురేంద్రనుత ! శంకర ! శూలపాణే !
చంద్రావతంస ! శివ ! శర్వ ! పినాకపాణే !
గంగాధర ! క్రతుపతే ! గరుడధ్వజాప్త !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. శంభో = సుఖమును గల్గిచువాఁడా! సురేంద్రనుత = ఇంద్రునిచే సుతిఁపఁబడువాఁడా ! శంకర! = మంగళముల నొనరించువాఁడా ! శూలపాణే = శూలాయుధముమ హస్తమందు గలవాఁడా! చంద్రావ తెంస = చంద్రుని శిరసున ధరించినవాఁడా! శివ! = మంగళ మగు రూపముగలవాడా! శర్వ సర్వస్వరూపుఁడా! పినాకపాణే = పినాకమను పేరుగల ధనస్సును చేతియందుఁ గలవాఁడా! గంగాధర! = గంగను ధరించినవాఁడా! శ్రితుపతే = యజ్ఞమున అధిపతియైనవాఁడా!, గరుడధ్వజ = విష్ణువునకు, ఆప్త = ప్రియమైనవాఁడా! శ్రీ మల్లికారున = విభో! = శోభితో గూడిన ఓ మల్లి కార్డు నేశ్వర! తవ = నీకు, సుప్రభా తమ్ = సుఖరుగు ప్రణాతమగుఁ గాక !

తా. ‘శఁభో’ అనునదాదిగా ఁగల పై శ్లోకములోఁ జెప్పబడిన పదునొకండు నామములతో గూడిన యో రుద్రుఁడా! (మల్లికార్జున!) నీ కీ యుదయము శుభ మైనదగుఁగాళ !

విశ్వేశ ! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే !
విశ్వంభర ! త్రిపురభేదన ! విశ్వయోనే !
ఫాలాక్ష ! భవ్యగుణ ! భోగివిభూషణేశ !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. విశ్వేశ ! = ప్రపంచమును శాసించువాఁడా! విశ్వజనసేవిత ! = ప్రపంచములోని జీవకోటిచే సేవించఁబడినవాఁడా!; విశ్వమూర్తే! ప్రపంచమే స్వరూపముగఁ గలవాఁడా!: విశ్వంభర! ప్రపంచభార మును మోయువాఁడా! త్రిపురి భేదః! = త్రిపురాసురులను భేదించిన వాఁడా!, విశ్వయోనే ! = ప్రపంచమునకుఁ గారణమైనవాఁడా!, ఫాలాక్ష! = నొసట మూఁడవకన్ను గలవాఁడా!, భవ్యగుణ! = శుభమగు గుణములు గలవాఁడా!, భోగి విభూషణేశ! = పర్పముల నాభరణము గాఁ గలశ్రభువా!, శ్రీ మల్లి కార్జున భో! = శోభాయుక్తుఁడవగు నో మల్లి కార్జునశ్రుభూ!, తవ = నీకు, సుప్రభాతమ్ = శోభనమగు ముదయకాల మగుఁ గాక !.

తా. ‘విశ్వేశ’ అనునది మొదలు తొమ్మిదినామముల ధరించిన ఓమల్లి కార్జున స్వామి! సీకీప్రభాతముశోభ వ మైనదగుఁగాక!

కళ్యాణరూప ! కరుణాకర ! కాలకంఠ !
కల్పద్రుమప్రసవపూజిత ! కామదాయిన్ !
దుర్నీతిదైత్యదళనోద్యత ! దేవ దేవ !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. కల్యాణరూప! = మంగళమైన రూపముగలవాఁడా!; కరుణాకర! = దయానిధియైనవాఁడా!; కల్పద్రుమ….పూజితః :- కల్పద్రుమ = కల్పవృక్షముల సంబంధమగు, ప్రసవ = పుష్పములచే, పూజిత! = పూజింపఁబడువాఁడా !; కామదాయిన్ ! = కోరికలిచ్చువాఁడా !; దుర్నీతి…. ఉద్యత :- దుర్నీతి = దుర్నయులైన, దైత్య = రాక్షసులను, దళన = ఛేదించుటయందు; ఉద్యత! = సంసిద్ధుఁడా!; దేవదేవ! = దేవతల కెల్ల దేవుఁ డైన వాఁడా, శ్రీ మల్లికార్జున విభో ! = శోభాయుతుఁడ వగు నో మల్లికార్జునస్వామి! తవ = నీకు, సుప్రభాతమ్ శుభోదయ మగుఁ గాళ !

తా. ‘కల్యాణరూప’ అనునది మొదలు సప్తనామములతో శోభిల్లునో మల్లి కార్జునస్వామీ! నీకు శుభోదయమగుఁగాః !

గౌరీమనోహర ! గణేశ్వరసేవితాంఘ్రే !
గంధర్వయక్షసురకిన్నరగీతకీర్తే !
గండావలంబిఫణికుండలమండితాస్య !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. గౌరీ మనోహర ! = పార్వతీ ప్రియుఁడా!; గణేశ్వర = ప్రమధగణ నాథునిచే, సేవిత = సేవింపఁబడుచున్న, ఆంఘ్రే! = పాదములు గల వాఁడ! గంధర్వ… కీర్తే! :- గంధర్వ = గంధర్వుల చేత, యక్ష= యక్షులచేత, కిన్నర = కిన్నరుల చేత (ఈమూఁడు రకములగు కులములు గల దేవతలు సంతోషమున గానము చేయుటలో ప్రవీణులు) గీత = కీర్తింపఁబడిన; కీర్తే! = యశస్సుగలవాఁడా!; గండావలంబి = గండ = స్థలముల వఱకు వ్రేలాడుచున్న; ఫణికుండల = పాముల వేడి చెవిపోగులతో, మండిత = ఆలంకరింపఁబడిన, ఆస్య = ముఖము గలవాఁడా!; శ్రీమల్లికార్జునవిభో! = శోభతోఁగూడిన, ఓ మల్లికార్జునస్వామి! తవ = నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగుఁ గాక !

తా. ‘గౌరీ మనోహర’ అను నామ చతుష్టయముగల ఓ మల్లికార్జునస్వామీ! నీకు శుభోదయమగుఁగాః !

నాగేంద్రభూషణ ! నిరీహిత ! నిర్వికార !
నిర్మాయ ! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ !
నారాయణీప్రియ ! నతేష్టద ! నిర్మలాత్మన్ !
శ్రీ పర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతమ్.

టీక. నాగేంద్రభూషణ! = వాసుకి, శేషుఁడు మొదలగు రాజసర్పములు భూషణముగఁ గలవాఁడా!, నిరీహిత = కోరికలు లేనివాడా! నిర్వికార! = జన్మాది షడ్వికారములు లేనివాఁడా!, నిర్మాయ = మాయా విరహితుఁడా! నిశ్చల! = స్థాణుస్వరూపుఁడా! నిరర్గల! = అవరోధము లేనివాఁడా! నాగ భేదిన్! = గజేంద్ర సంహారకుఁడా!, నారాయణీ ప్రియ! = నారాయణి యను పేరుగల శాంకరికి ప్రియుఁడైనవాఁడా!, నతేష్టదా! :- నత = నమస్కరించువారలకు, ఇష్టద = ఇష్టములనిచ్చువాఁడా! నిర్మలాత్మన్ :- నిర్మల = స్వచ్ఛమైన, ఆత్మన్ = దేహము గలవాఁడా! (శివుఁడు తెల్లనిదేహము గలవాఁడనుట) లేదా? పరిశుద్దాం తఃకరణము గలవాఁడా! శ్రీ పర్వతాధిప! = శ్రీ యను పేరుగల కొండపై నివసించు ప్రభూ!, విభో! = ఓ దేవ!, తవ = నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగును గాక !

తా. ‘నా గేంద్రభూషణ’ అను నామము మొదలుకొని పదు నొకండు నామములతోఁ గూడిన యో శంకరా! నీకు శుభోదయ మగునుగాక!

Sri Srisaila Mallikarjuna Suprabhatam

సృష్టం త్వయైవ జగదేతరశేషమీశ !
రక్షావిధిశ్చ విధిగోచర ! తావకీనః,
సంహారశక్తిరపి శంకర ! కింకరీ తే
శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. ఈశ = ఓ ప్రభువా ! ఏతత్ = ఈ, ఆశేషం = సమస్తరుగు, జగత్ = లోకముత్వయైవ = నీచేతనే, స్పష్టం = సృజింపఁబడినది. విధిగోచర ! = ఓయీ! అదృష్టరూపుఁడా!, రక్షావిధిశ్చ = లోకరక్షణ విధానమును, తావకీనః = నీ సంబంధమైనదే! శంకర! = ఓ శంకరుఁడా! సంహారశ క్తిరపి = లయ మొనర్చుశక్తియు, తే = నీకు, కింకరి = వళమైన సేవకురాలేగద? శ్రీశైల శేఖరవిభో! = శ్రీశైలపర్వతమందుండెడి యో దేవుఁడా! తవ = నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగుఁ గాక!

తా. ఓ శ్రీశైల వాస! నీవు, ఈశ్వరుఁడవై లోకముల సృజిం చుచు విష్ణుస్వరూవుఁడవై లోకరక్షణభారమును నిర్వ హించుచు శివుఁడను నామమున లయక ర్త పై సర్వమును వహించిన యో శ్రీశైలవాస! శంకరా! నీకు శుభోదయ మగుగాక!

ఏకస్త్వమేవ బహుధా భవ ! భాసి లోకే
నిశ్శంకధీర్వృషభకేతన ! మల్లినాథ !
శ్రీ భ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ !
శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. భవ! = ఓయీ! శంకరుడా!, త్వం = నీవు, ఏక ఏవ = ఒక్కఁడవే, లోకే = లోకమఁదు, బహుథా = అనేక రూపములతో, భాని = ప్రకాశించుచున్నావు, నిశ్శంకధీః = నిర్భయబుద్ధిగలవాఁడ వృషభకేతన = వృషభధ్వజముగలవాఁడా! మల్లినాథ! = మల్లీశ్వరుఁడా, శ్రీ భ్రామరీ ప్రియ = శ్రీ భ్రమరాంబాదేవికి ప్రియుఁడైనవాఁడా!. సుఖాశ్రయ! = సుఖమున కాశ్రయమైనవాఁడా!, లోకనాథ! = లోకులకుఁ బ్రభువైన వాఁడా!, శ్రీశైలశేఖరవిభో! = శ్రీ శైలరాజమున నుండెడి ప్రభువా!, తవ = నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగు గాక !

తా. ఓయీ! భవుఁడా! నీ వొక్కఁడవే అనేక రూపములతో నీలోకమునఁ బ్రకాశించుతున్నావు. ‘నిశ్శంక ధీ’ అను నామము మొదలు ఆఱునామములతో నొప్పు శ్రీశైల వాస! నీకు శుభోదయమగుఁగాక!

పాతాళగాంగజలమజ్జననిర్మలాంగాః
భస్మతిపుండ్రసమలంకృతఫాలభాగాః,
గాయంతి దేవమునిభక్తజనా భవంతం
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. పాతాళ … అంగాః :- పాతాళ గాంగజల = పాతాళగంగలోని నీటి యందు, మజ్జన = స్నానముచేత, నిర్మల = పాపరహితమైన, అంగాః= అవయవములు గలిగినట్టియు, భస్మత్రిపుండ్ర = భూతితో మూడడ్డరేఖలంగా, సమలంకృత = అలంకరించుకొనఁబడిన, ఫాలభాగాః = నొసటి భాగముగలవారగు, దేవమునిభ క్తజనాః = దేవతలం, మునులు, భక్తజనులంను, భవంతం = నిన్ను, గాయతి = కీర్తించుచున్నారు. శ్రీ మల్లికార్జునవిభో! = కాంత్యు పేతుఁడవైన ఓ మల్లి కార్జునస్వామి! తవ = ఓ నీకు, సుప్రభాతమ్ = శోభనోదయమగుఁగాక!

తా. ఓ మల్లికార్జునస్వామి! దేవతలు, మునులు, భ క్తులు నందఱును బాతాళగంగను స్నానించి నిర్మలాంతః కర ణులై భస్మ త్రిపుండ్ర రేఖల నలంకృతమైన మోములతో వచ్చి నీ సన్నిధినుండి నిన్నుఁ గీర్తించుచున్నారు; నీ కీ ప్రభాతసమయము శుభమైనది; లెమ్ము.

సారస్వతాంబుయుతభోగవతీశ్రితాయాః
బ్రహ్మేశవిష్ణుగిరిచుంబితకృష్ణవేణ్యాః,
సోపానమార్గమధిరుహ్య భజంతి భక్తాః
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక . సారస్వత = రసమ తోఁజెల వొందు, అంబు = ఉదఃముతో; యుత = కూడిన, భోగవతీ = పాతాళగంగయను నామమును, శ్రితాయాః = ధరించినట్టియు; బ్రహ్మ బ్రహ్మశిఖరము, ఈశ = ఈశ్వర శిఖరము, విష్ణుగిరి = విష్ణు శిఖరమును కూటత్రయము చే, చుంబిత = తాకఁబడుచున్న, కృష్ణవేణ్యాః = కృష్ణానది యొక్క, సోపాన మార్గం = మెట్లమార్గమును ఆధిరుహ్య = ఎక్కి, భక్తాః = నీ భక్తులు, భజంతి నిన్ను సేవించు చున్నారు. శ్రీ మల్లి కార్జునఁభో ! = ఓ మల్లి కార్జున దేవ! తవ= నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగుఁ గాక!

తా. ఓ మల్లికార్జునస్వామి! నీ భ క్తులందఱును — బ్రహ్మవిష్ణు శివ నామములతోనున్న శిఖరములనంటి ప్రవహించు నదియు, కృష్ణానదీస్థాన విశేషమైనదియు, మధురోదశములతో నిండిన పాతాళగంగలో, (భోగవతి) స్నానముచేసి యచటినుండి నీయొద్దకువచ్చు సోపానమార్గములోనుండి నిన్ను సేవించుచున్నారు; నీ కీ ప్రభాతము సుప్రసన్న మగుఁగాక!

శ్రీ మల్లికార్జున మహేశ్వర సుప్రభాత
స్తోత్రం పఠంతి భువి యే మనుజాః ప్రభాతే,
తే సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం
శ్రీ శాంభవం పదమవాప్య ముదం లభంతే.

టీక. శ్రీ మల్లికార్జున = శ్రీయుతుడగు మల్లికార్జునుఁడైన, మ హేశ్వర = శివునియొక్క, సుప్రభాత = ప్రాతః కాలశోభను జెప్పునట్టి, స్తోత్రం = ఈ స్తవమును, ప్రభాతే = ప్రాతస్సమయమున, యే = ఏ, మనుజాః = మానవులు, భువి = భూలోకమందు, పఠంతి = పఠించుచున్నారో, తేజ వారు, సర్వసౌఖ్యం = అన్ని విధములగు సౌఖ్యమును అనుభూయ = అనుభవించి, పరానవాప్యం = ఈ సుప్రభాతపఠనము లేని వారు పొంద లేని, శ్రీ శాంభవం పదం = శ్రీ శంకర నివాసస్థాననుగు కైలాసమును, ఆవాస్య = పొంది, ముదం = సంతోషమును, లభంతే = పొండుచున్నారు.

తా. ఈ మల్లి కారున సుప్రభాతమును ప్రతి ప్రాతస్సమయు మున నే మానవులు శ్రద్ధతోఁ పఠింతురో వారీలోకమున సర్వసౌఖ్యము లనుభవించి చివరకు కైలాసమున కేగి సంతసింతురు.

Indradyumna Katha In Telugu – ఇంద్రద్యుమ్నుని కథ

Indradyumnuni katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఇంద్రద్యుమ్నుని కథ. 

ఇంద్రద్యుమ్నుని కథ – Indradyumna Katha In Telugu

పూర్వం ఇంద్రద్యుమ్నుడనే రాజేంద్రుడు ఉండేవాడు. అతడు ఎన్నో దానధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందినాడు. లెక్కగట్టలేనన్ని గో భూ హిరణ్య దానములు పాత్రులైన వారికిచ్చి అనంత పుణ్యసంపదను ఆర్జించుకొన్నాడు. రాజర్షి అయ్యి ప్రజారంజకముగా పాలన చేసినాడు. అలా ఎన్నో వర్షములు రాజ్యపాలనము చేసి తన పుణ్యనిధి ప్రభావముతో కాలం చెల్లాక స్వర్గం చేరుకొన్నాడు. చాలాకాలము స్వర్గభోగాలు అనుభవించిన తరువాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రద్యుమ్నుని పిలిపించి

“మహాత్మా! నీవు అనేక దానధర్మాలు చేసి ఎంతో పుణ్యమును ఆర్జించినావు కనుక ఇంత దీర్ఘకాలము స్వర్గములో ఉండగలిగినావు. కానీ పరమేశ్వరుని శరణువేడి ఆయన కృపతో పోందెడి మోక్షపదము ఒక్కటే శాశ్వతమైనది (ఇతరములు శాశ్వతములు కావు). నీ పుణ్యఫలమును అనుభవించినావు కావున సర్గమును వీడు సమయము వచ్చినది” అని చెప్పినాడు. స్వర్గాధిపతి మాటలు విని ఇంద్రద్యుమ్నుడు ఇంతకొద్ది కాలములోనే తన పుణ్యరాసులు ఎలా కరిగిపోయినాయి? అని ఆశ్చర్యపోయినాడు. అది చూసి శచీపతి “రాజా! భూలోకములో నిన్ను కానీ నీవుచేసిన సత్కర్మలను కానీ గుర్తుపెట్టుకొన్న వానిని నాకు చూపిస్తే నీవు స్వర్గములోనే ఉండవచ్చు. చేసిన దానములు మహనీయములు కాకపోతే జనులు చిరకాలము గుర్తుంచుకొనరు కదా! కావున నీ దానములను ఎంతకాలము ప్రజలు ఉపయోగింతురో అంతకాలము నీవిక్కడనుండవచ్చు” అని హితవు చెప్పినాడు. ఇంద్రుని ఆజ్ఞతీసుకొని అట్టివారు ఉన్నారేమో వెదకటానికి బయలుదేరినాడు ఇంద్రద్యుమ్నుడు.

Story Of King Indradyumna

చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్దకువెళ్ళి నమస్కరించి “ఓ తపస్విచంద్రమా! నన్ను మీరు ఎఱుగుదురా”? అని అడిగినాడు. అప్పటికి ఎంతోకాలముగా తీర్థయాత్రలుచేసి ఉపవాస వ్రతాలు చేసి కృశించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తులేదని చెప్పినాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు “స్వామి! చిరంజీవులైన మీకంటే ముందుపుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా”? అని అడిగినాడు. “పవిత్ర హిమాలయ పర్వత ప్రాంతములో ప్రావారకర్ణం అనే గుడ్లగూబ ఉన్నది” అని బదులిచ్చినాడు మార్కండేయ మహర్షి.

వెంటనే ఆ ఉలూకము వద్దకు చేరి “అయ్యా! నెన్నెఱుగుదువా”? అని ప్రశ్నించినాడు. తెలియదు అని చెప్పి “ఇక్కడికి కొన్ని యోజనాల దూరములో ఇంద్రద్యుమ్నమను సరోవరమున్నది. ఆ సరోవరములో నాడీజంఘమనే కొంగ ఉన్నది” అని ప్రావారకర్ణం చెప్పగా ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మదేవుని స్నేహితుడైన నాడీజంఘుని వద్దకు చేరి “ఓ బకరాజా! నన్ను మీరు గుర్తుపట్టినారా”? ప్రశ్నించినాడు. “లేదు. ఈ సరోవరములో ఆకూపారమనే తాబేలు ఉన్నది. అది నాకంటే పెద్దది. దానికి నీవు తెలుసేమో కనుక్కో” అని చెప్పినది.

ఇంద్రద్యుమ్నుని చూడగానే ఆకూపార కళ్ళుచెమ్మగిల్లాయి “అయ్యా! వెయ్యి యజ్ఞములు సాంగముగా చేసి వెయ్యి యూపస్తంభాలు కట్టించినావు. ఆ యజ్ఞదానాలలో లెక్కకట్టలేనన్ని గోదానాలు ఇచ్చినావు. నీవు దానము ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి యింత సరోవరము అయినది. ఇది అంతా నీ చలవే” అని కృతజ్ఞతాపూర్వకముగా చెప్పినది. మరుక్షణం దేవతలు దివ్యవిమానములో ఇంద్రద్యుమ్నుని స్వర్గానికి తీసుకొని వెళ్ళినారు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. మన సత్కీర్తి భూలోకములో ఉన్నంత కాలము సర్గలోకము కరతలామలకము. ఆకూపార ఇంద్రద్యుమ్నుడు చేసిన దానములు మరువలేదు కావున ఇంద్రద్యుమ్నునికి పునః సర్గలోక ప్రాప్తి కలిగినది. కానుక మనము నలుగురుకీ ఉపకరించే పనులు చేయాలి. అవియే మనలను రక్షించు సంపదలు (ధనము కాదు).
  2. దేవేంద్రుడు చెప్పినట్టు మోక్షము ఒక్కటే శాశ్వతపదము. ఇంత పుణ్యాత్ముడు కాబట్టే మహావిష్ణువు గజేంద్ర రూపములో ఉన్న ఇంద్రద్యుమ్నునిచే “నీవేతప్ప హితః పరంబెఱుగను …” అని అనిపించి అతనికి శాశ్వతమైన మోక్షమును ప్రసాదించినాడు (గజేంద్ర మోక్షము కథ). కావున మోక్షమునకు పుణ్యమే ప్రథమ సోపానము.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Shailesha Charana Sharana Ashtakam In Telugu – శ్రీశైలేశ చరణ శరణాష్టకమ్

Sri Shailesha Charana Sharana Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శైలేశ చరణ శరణాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Sri Shailesha Charana Sharana Ashtakam Telugu Lyrics

శ్రీశైలేశ చరణ శరణాష్టకమ్

గౌరీమనోహర ! సురాసుర మౌనిబృంద
సంసేవితాంఘ్రియుగ ! చంద్రకళావతంస !
కైలాసవాస ! కరుణాకర ! భక్తబంధో !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. గౌరీమనోహర! = పార్వతీ దేవికిఁ బ్రియుఁడైనవాఁడా! సురాసుర మానిబృంద= దేవరాక్షపమని సంఘముచే, సంసేవిత = సేవింపఁబడుచున్న, ఆంఫ్రియుగ! = పాదద్వంద్వముగలవాఁడా! చంద్రకళా వతంస! = చంద్రకళను శిరమున కలంకారముగ ధరించినవాఁడా! కైలాసవాస! = కైలాసాచలము నివాసముగఁ గలవాఁడా! కరుణాకర! = దయ కాకరమైనవాఁడా! భక్తబంధో ! = భ క్తులపాలిటియాప్త బంధువా! శ్రీశైలవాస = శ్రీగిరివాస, తవ = నీయొక్క, చరణం = పాదములను, శరణం = రక్షణమును, ఆస్మి = అంటిని.
తా. ఓ శ్రీశైలవాస! ‘గౌరీమనోహర’ అను నాఱు నామములతోఁ గూడిన నీచరణమునే నేను శరణమంటిని.

భక్తార్తిహార ! భవబంధ వినాశ కేశ !
దివ్యాపగాకలిత కాంత జటాక లాప !
శేషాహిభూష! వృషవాహన ! వ్యోమకేశ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. భక్త = భక్తులయొక్క, ఆర్తి = బాధను, హార! = హరించువాఁడా! భవబంధ = సంసారబంధమును, వినాశక ! = నశింపఁజేయువాఁడా!, ఈశా! = లోకముల శాసించువాఁడా!, దివ్యాసగా = దేవగంగతో, కలిత = కూడి, కాంత = మనోహరమైన; జటాకలాప! = జడల సమూ హముగలవాఁడా! శేషాహి = శేషుఁడనుసర్పరాజు, భూష! = ఆలంకా రముగాఁ గలవాఁడా, వృషవాహన! = వృషభమును వాహనముగాఁ గలవాఁడా! వ్యోమకేశ! = ఆకాశమునంటిన కేశములుగలవాఁడా!, శ్రీశైలనాథ! = శ్రీగిరివాస!, తవ = నీయొక్క, చరణం = పాదమును శరణం = రక్షణమునుగ, ఆస్మి = ఆంటీని.

తా. ఓ శ్రీశైలనాథ! ‘భక్తార్తిహర’ అనునామము నుండి సప్తనామములతో నిన్నాహ్వానించి నీ పాదమును శరణమంటిని.

భృంగీశసేవిత ! గణేశ కుమార తాత !
మృత్యుంజయ ! త్రిపురదానవభేదకారిన్ !
పాణావుపాత్త మృగ డామరుక త్రిశూల !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. భృంగీశ సేవిత = భృంగీశునిచే (ప్రసుధాధిపుఁడు) సేవింపఁబడువాఁడా!; గణేశ కుమారతాత = గణపతి, కుమారులు పుత్రులగఁగలవాఁడా!, మృత్యుంజయ! = మృత్యువును జయించినవాఁడా!, త్రిపురదానవ = త్రిపురాసుకులను, భేవకారన్ = భేదించినవాఁడా! పాణే = చేతియందు, ఉపాత్త = పొందిన, మృగ = లేడియు, డామరుక = డమరుకము (బుడబుక్కలవారు వాయించుసాధనము) త్రిశూల = త్రిమాలమును గలవాఁడా! శ్రీశైలవాస! శ్రీగిరినిలయుడా! తవ = నీయొక్క, శరణం= పాదమును, శరణం = రక్షకమునుగ, ఆస్మి = అయియుంటిని.

తా. ఓ! శ్రీశైలవాస! ‘భృంగీశసేవిత’ అను నైదు నామములతో నిన్నుఁ బిల్చి నీ పాదమును శరణ మంటిని.

నాగేంద్ర చర్మవస ! నాగ్ని రవీందునేత్ర !
నారాయణీప్రియ ! మహేశ ! నగేశ ! శంభో !
మౌనిప్రి ! యాశ్రితమహాఫల ! దోగ్రరూప
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. నాగేంద్ర = గజేంద్రునియొక్క, చర్మ = చర్మమును, వసన = వస్త్రముగఁగలవాఁడా! అగ్ని, రవి, ఇందు నేత్ర! = అగ్ని, సూర్యుడు, చంద్రుఁడునామూఁడు నేత్రములుగధరించినవాఁడా! నారాయణి = నారా యణీయను శక్తికి (వైష్ణవమాయకు) ప్రియ = ప్రియమైనవాఁడా!, మహేళ = మహాప్రభూ!, నగేశ = కైలాసాధీశ్వరుఁడా!, శంభో = సుఖమును గల్గించువాఁడా! మౌనిప్రియ! = మహర్షులకుఁ బ్రియమైనవాఁడా! ఆశ్రితమహాఫలద ! ఆశ్రయించినవారికిఁ బరమపురుషార్థ సాధనమునిచ్చువాఁడా!, (జ్ఞానమ్మహేశ్వరాదిచ్చేత్ – అనిశాస్త్రము) ఉగ్రరూప! = ఉగ్రుఁడను రూపముతోనున్నవాఁడా!, శ్రీశైలనాథ = శ్రీగిరి ప్రభూ! తవ = నీయొక్క, చరణం = పాదమును, శరణం = రక్షణమును, ఆస్మి = అయియుంటిని.

తా. ఓయీ ! శ్రీశైలప్రభూ ! ‘నాగేంద్రచర్మవసన’ అను నవ నామములతో నిన్నుఁ బిలిచి నీ పాదములను శరణ మంటిని.

Sri Shailesha Charana Sharana Ashtakam Telugu

సర్వార్తిభంజన ! సదాశివ ! దానవారే !
పార్థప్రహార కలితోత్తమ మూర్థభాగ !
యక్షేశసేవితపదాబ్జ ! విభూతి దాయిన్ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. సర్వ = సమస్తమైన, ఆర్తి = ఆపదలను, భంజన = విధ్వంసమొవర్చువాఁడా ! సదాశివ ! = ఎల్లప్పుడు మంగళముతోనుండువాఁడా!, దానవ = రాక్షసులకు, ఆరే = శత్రువైనవాఁడా! పార్ధ = ఆర్జనునియొక్క, ప్రహార = దెబ్బతో, కలిత = కూడిన, మూర్ఖభాగ = శిరోభాగముఁ గలవాఁడా!, యక్షేశ = కుబేరునిచే, సేవిత = సేవింపఁబడిన పదాబ్జ = పాదపద్మములుగలవాఁడా! విభూతిదాయిన్ ! = ఐశ్వర్యమాను నొసంగువాఁడా, శ్రీశైలవాస! = శ్రీగిరివాస, తవ = నీయొక్క, చరణం = పాదమును, శరణం = రక్షణముగ, అస్మి = ఆంటిని.

తా. ఓ! శ్రీశైలవాస! ‘సర్వార్తిభంజన’ అను నాఱు పేరులతో నిన్నుఁ బిలిచి నీ పాదమును శరణ మంటిని.

శ్రీభ్రామరీశ ! మదనాంతక ! కృత్తివాస !
సర్పాస్థిరుండ కలి తామల హారధారిన్ !
భూతేశ ! ఖండపరశో ! భవబంధనాశ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. శ్రీ భ్రామరీశ! = శుభములిచ్చు భ్రమరాంబికానాథుఁడా!, మదనాంతక! = మన్మథుని నాశనమొనర్చినవాఁడా! కృత్తివాసః = గజేంద్ర చర్మమును వస్త్రముగఁ గలవాఁడ!, సర్ప = పాములు, ఆస్థి = ఎముకలురుండ = తలపులతో, కలిత = కూడిన, అమల = స్వచ్ఛమైన హార = హారమును, ధారిన్ = ధరించినవాఁడా! భూతేశ! = భూతములకధిపతి యైనవాఁడా!, ఖండపరశో! = ఖండించెడి గొడ్డలికలవాడా (పరశువను రాక్షసుని ఖఁడించినవాఁడా) భవబంధనాశ! = సంస్కృతిబంధ మును దెగగొట్టువాఁడా!, శ్రీశైలనాథ = శ్రీగిరివాస!, తవ = నీయొక్క చరణం = పాదములను, శరణం = రక్షకముగ, అస్మి = ఆయితిని.

తా. ఓ! శ్రీశైలప్రభూ ! ‘శ్రీభ్రమరీశ’ అనునది మొద లీపైఁబడిన యేడు నామములతో నిన్నుఁ బిలచి నీ పాదమును శరణ మనుచున్నాను.

సర్వాగమస్తుత ! పవిత్ర చరిత్ర ! నాథ !
యజ్ఞప్రియ ! ప్రణతదేవ గణోత్తమాంగ !
కల్పద్రుమ ప్రసవ పూజిత దివ్యపాద !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. సర్వ = సమస్తమైన. ఆగమ = స్మృతులచే, స్తుత! = కొనియాడఁ బడినవాఁడా!, పవిత్రచరిత్ర = పవిత్రమగు చరిత్రగలవాఁడా ! , నాథ! = ఓ! ప్రభూ!, యజ్ఞప్రియ! = యజ్ఞములపైఁ బ్రీతిఁగలవాఁడా!, ప్రణత = నమస్కరించెడు, దేవగణ = దేవతాసమూహముయొక్క, ఉత్తమాంగ! = శిరస్సులుగలవాఁడా; కల్పద్రుమ = కల్పవృక్షములయొక్క, ప్రసవ = పూలచే, పూజిత = పూజింపఁబడిన, దివ్యపాద = ప్రకాశించు పాదములు గలవాఁడా!, శ్రీ శైలనాస! శ్రీగిరిపర్వతాశాసము గలవాఁడా, శంకరా ! తవ = వీయొక్క, చరణం = పాదమును, శరణం = రక్షకముగ, అస్మి = అయితిని.

తా. ఓ శ్రీశైల పర్వతమందు నివసించు స్వామి! ‘సర్వాగ మస్తుత’ అనునామము మొదలాఱు నామములతో నిన్నుఁ బిల్చి నీ పాదమును శరణ మంటిని.

శంభో ! గిరీశ ! హర ! శూలధరాంధకారే !
శ్రీశైలవాస ! భ్రమరాంబికయా సమేత !
శ్రీ పార్వతీదయిత ! సాక్షిగణాధిపేడ్య !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. శఁభో ! = సుఖమునుగల్గించువాఁడా!, గిరీశ ! = కైలాసపర్వతమునకు బ్రభువా? ( లేక – పర్వతములపైననే తన నివాసముండుటనుబట్టి పర్వతము అకుఁ బ్రభువా! యనియునర్థము) హర! = కష్టములనుహరించువాఁడా! శూలధర! = త్రిశూలమును ధరించినవాఁడా!, ఆంధకారే! = ఆంధకుఁడను రాక్షసునకు శత్రువైనవాఁడా!, శ్రీశైలవాస! = శ్రీగిరియందు వసించువాఁడా! భ్రమరాంబికయా = భ్రమరాంబాదేవితో, సమేత! = కూడినవాఁడా!, శ్రీ = శోభావతియగు, పార్వతీ = పర్వతరాజపుత్రిక, దయిత! = ప్రియురాలుగాఁ గలవాఁడా! సాక్షిగణాధిప! = సాక్షిగణపతిచే, ఈడ్య! = నుతింపఁబడు వాఁడా! శ్రీ శైలనాథ! = శ్రీశైలశ్రభూ! తవ = నీ యొక్క, చరణం = పాదమును, శరణం = రక్షకముగ, అస్మి = ఆయితిని.

తా. ఓ! శ్రీశై లేశ్వర! ‘శంభో’ అనునది మొదలు తొమ్మిది నామములతో నిన్నుఁ బిలిచికొని నీ పాదమే నాకు శరణమని యనుచుంటిని; రక్షింపుమని భావము,

శ్రీశైలం, శిఖరేశ్వరం , గణపతిం, శ్రీహాటకేశం పున
స్సారంగేశ్వర, బిందుతీర్థమమలం, ఘంటార్కసిద్ధేశ్వరమ్
గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతామారామవీరేశ్వరం
శంఖం చక్రవరాహతీర్థకలితం శ్రీశైలనాథం భజే.

టీక. శ్రీశైలం = శ్రీగిరి, శిఖరేశ్వరం = శిఖరేశ్వరుని, గణపతిం = సాక్షి గణపతిని, శ్రీహాటకేశం = శోభించుహాటకేశ్వరుని (ఆటికేశ్వరుని) పునః = ఇంకను, సారంగేశ్వర = సారంగతీర్థమును, అమలం = స్వచ్ఛమైన, బిందుతీర్థం = బిందుతీర్థమును, ఘఁట = ఘంటేశుని, ఆర్క = అర్కేశ్వరుని, సిద్ధేశ్వరం = సిద్ధేశుని, గంగాం = పాతాళగంగను, శ్రీ భ్రమరాంబికాం = శ్రీ భ్రమరాంబాదేవిని, గిరిసుతాం = పార్వతీదేవిని, ఆరామవీరేశ్వరం = ఆరామవీరేశ్వరుని, శంఖం = శంఖమనుతీర్థమును. చక్రవరాహతీర్థ = చక్రతీర్థ, వరాహతీర్ధములతో, కలితం = కూడిన, శ్రీశైలవాథం = శ్రీ శైలేశుఁడగు మల్లీ కార్జున స్వామిని, భజే = సేవించుచున్నాను.

తా. శ్రీశైలక్షేత్రతీర్ధమునఁ గల ఈపైఁ జూపఁబడిన పదు నాఱు క్షేత్రతీర్థములతోఁగూడిన శ్రీశైలవాసుని నిత్యము మనసులోఁ దలఁచు చున్నాను. అని, కవి శ్రీశైలక్షేత్రా దిస్మరణము కాశీస్మరణము వలె పాపహరమని నుడువుచున్నాఁడు.

శ్రీశైలేశ్వర సుప్రభాత కలిత గ్రంథస్య, లంకాన్వయ
స్సీతారామకవి, ర్యథామతి, ముదా, భావార్థవైశద్యయు
గ్వ్యాఖ్యానం, విరచయ్య, చాంతిమతదే తస్యానుకంపాప్తయే
హ్యేకం, శ్రీచరణద్వయం, శరణమి, త్యాలోచ్య, తేనేష్టకమ్

టీక. శ్రీశైలేశ్వరసుప్రభాత = శ్రీగిరీశుని సుప్రభాతముతో, కలిత = కూడిన, గ్రంథస్య = గ్రంథమునకు, అంకాన్వయః = లంకావంశసంభూతుఁడగు, సీతారామకవిః = కవియగుసీతారామశాస్త్రి, ముదా = సంతోషముతో, యథామతి = బుద్ధివైశడ్యముతోలది, భావార్థవైశద్యయన్ = భావము, ఆర్థములయొక్క విశదీకరణముతోకూడిన, వ్యాఖ్యానం = విపులీకరణమును, విరచయ్య రచించి, అంతిమపదే = ఈసుప్రభాత గ్రంథాంతిమస్థానమును, (గ్రంథముయొక్క చివర) తస్య = ఆ శ్రీశైలేశునియొక్క, ఆనుకంపా = దయను, ఆప్తయే = పొందుటకొఱకు ఏకం = ముఖ్యమైనది, శ్రీ చరణం = శ్రీ వారి పాదమే, శరణంహి = రక్షకముగదా? ఇతి = ఇట్లని, ఆలోచ్య = తలఁచి, అష్టకం = శ్రీశైలవాస చరణశరణాష్టకమును, తేనే = రచించెను. తసూకరణ ఇతిధాతోర్థటి ఉత్తమ పురుషైకవచనమ్)

తా. ‘లంకా సీతారామశాస్త్రి’ యను కవి యీ శ్రీశైల సుప్రభాత గ్రంథమునకు టీకాతాత్పర్యములను వ్రాసి, యీ గ్రంథాంతమందు శ్రీశైలచరణ శరణాష్టక ముండు టావశ్యక మనియు-గుర్వులకా శ్రీశునిచరణమే శరణమని యెంచి దానిని రచించి ధన్యుఁడయ్యెనని తాత్పర్యము.

మరిన్ని అష్టకములు:

Govardhana Giri Pooja In Telugu – గోవర్ధన గిరి పూజ

Govardhana Giri Pooja

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గోవర్ధన గిరి పూజ.

గోవర్ధన గిరి పూజ

నందవ్రజములో ప్రతి ఏట ఇంద్రయాగము చేసేవారు. ఏడేళ్ళ పసిబాలుడైన శ్రీ కృష్ణ పరమాత్మ సదస్యులందరి ముందర తండ్రియైన నందుని ఇలా ప్రశ్నించాడు “ఇంద్రయాగము చేయుటలోని ఆంతర్యమేమిటి”? నందుడు “కృష్ణ! యజ్ఞ యాగములు కృతజ్ఞతును ప్రకటించే సాధనములు. మనకు హితము కలిగించే వేల్పులకు కృతజ్ఞత చూపడమే యజ్ఞం యొక్క ముఖ్యోద్దేశం. కృతజ్ఞుడే కాని కృతఘ్నుడు సహాయమునకు అర్హుడుకాడు కదా! ఈ కారణముగా లోకహితార్థం యజ్ఞం చేయుట ఆచారం” అని చెప్పాడు.

తండ్రియొక్క సత్యవాక్కులు విని శ్రీ కృష్ణుడిలా అన్నాడు “తండ్రీ! ఫలము కేవలము దేవతలవల్లనే కలుగదు. ఫలసిద్ధికి ముఖ్యమైన హేతువు కర్మ. ఒక మనిషి తానెన్ని సత్కార్యాలు చేశాడన్నది ముఖ్యం. అందుకే కర్మయే భగవంతుడని అనవచ్చు. స్వధర్మమాచరీంచిన వాడికి దైవము చేరువలో నుండును.

పరమాత్మ అవ్యక్తుడు సర్వవ్యాపకుడు నిరాకారుడు. అలాగే దేవతలుకూడా మనకు కనబడరు. కానీ సూక్ష్మ బుద్ధితో పరీక్షిస్తే ఈ ప్రకృతి (ఆది శక్తి) పరమాత్మ యొక్క ప్రత్యక్షస్వరూపం. కావున ప్రత్యక్షంగా మనకు కనిపించే ప్రకృతిని వదిలివేయుట మంచిది కాదు. మనము వేటిమీద ప్రత్యక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నామో వాటినికూడా పూజించి మన కృతజ్ఞతా భావాన్ని సుస్థిరం చేసుకోవాలి.

మనం ఈ గోవర్ధన గిరి వద్ద నివసిస్తాము. గోసంపదతో బ్రతుకు వారము. కావున గోవర్ధన గిరి పూజ గోమాత పూజ మనకు అత్యంత ప్రధానమ్. అందునా గోవర్ధనగిరి గోవిందుని వక్షఃస్థలం నుండి పుట్టి పులస్త్య మహర్షి అనుగ్రహంచే ఇచటికి వచ్చింది”. పరమాత్ముని అమృతవాక్యాలు విన్న వ్రజవృద్ధుడైన సన్నందుడు “ఓ నందనందన! నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాటలు మాకు శిరోధార్యములు. గోవర్ధనగిరి పూజావిధానము మాకు తెలుపుము” అని అన్నాడు. పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు:

“గిరి పాదభాగమును శుభ్రపఱచి గోమయముతో అలుకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలొనర్చి భక్తితో శోడషోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్పపూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనమీయవలెను. విప్రసంతర్పణ గోపూజ అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను”.

శ్రీ కృష్ణుడు అలా పూజావిధానం తెలిపి “పూజకి వచ్చేముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవపూజ మాతాపితపూజ అన్నీ చేసుకుని రండి. వృద్ధులను బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి పశు పక్షాదులకి కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చి రండి” అని చెప్పాడు.

ఓ శుభదివసమున వ్రజవాసులు గోవర్ధన గిరిపూజకు తండోపతండాలుగా తఱలి వచ్చారు. యాదవుల గురువైన గర్గ మహర్షి పురోహితులు వచ్చారు. నవనందులు వృషభానుడు బంగారు పల్లకీలో రాధాదేవి వచ్చిరి. దేవతలు అప్సరసలు రాజర్షులు మహర్షులు పార్వతీ పరమేశ్వరులు విచ్చేసినారు. భక్తి శ్రద్ధలతో పూజావిధిని అనుసరించి గోవర్ధన గిరి పూజ చేశారు వ్రజవాసులు. వ్రజవాసుల భక్తికి మెచ్చి గోవర్ధనుడు సహస్రబాహులతో మానవాకృతిలో వచ్చి అందరిని ఆశీర్వదించాడు. శ్రీ కృష్ణ పరమాత్మకీ జై గోవర్ధనగిరిరాజుకీ జై అను జయజయ ధ్వానాలు భూనభోంతరాళముల ప్రతిధ్వనించాయి. వ్రజ చరిత్రలో అది ఓ సువర్ణ ఘట్టమ్.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. ప్రాకృతిక వనరులను నాశనం చేయడం స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. ఇదే శ్రీ కృష్ణుడు మనకిచ్చిన సందేశం.
  2. దైవసేవ మాతాపితసేవ భూతదయ అన్ని మానవుడి కర్తవ్యాలని గుర్తుచేశాడు శ్రీ కృష్ణుడు. అందుకే పూజకు వచ్చేముందు వృద్ధులకు బాలులకు పశు పక్షాదులకు ఆహారం సమకూర్చి రమ్మన్నాడు.
  3. మన సంస్కృతి ప్రకారము పూజా విధానము ఎట్టిదో శ్రీ కృష్ణుడు తెలిపాడు. భక్తి శ్రద్ధలతో విధినసురించి చేసిన పూజ ఫలించి గోవర్ధనుడు సాక్షాత్కరించాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sankha Likhitula Katha In Telugu – శంఖ లిఖితుల కథ

Sankha Likhitula Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శంఖ లిఖితుల కథ. 

శంఖ లిఖితుల కథ

పూర్వం శంఖుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వారు బాహుదానదీ తీరములో ఆశ్రమాలను నిర్మించుకొని తపస్సు చేయసాగినారు. ఇలా ఉండగా ఒకరోజు అన్నగారిని చూడలనిపించి లిఖితుడు శంఖుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. అన్నగారు ఎక్కడో బయటికి వెళ్ళారని తెలుసుకొని ఆశ్రమములోని ఒక చెట్టునీడలో కూర్చుని దాని పండ్లలు తింటూ అన్నగారికోసం నిరీక్షించాడు. వేద వేదాంగ పారంగతుడైన శంఖుడు వచ్చి తన తమ్ముని చూసి సంతోషించాడు. ఆతడు పండ్లను ఆరగించటం చూచి “తమ్ముడూ! ఈ పండ్లు నీకెక్కడివిరా?” అని అడిగాడు. లిఖితుడు చెప్పినది విని “ప్రియసోదరా! ఇది తప్పు కదా! అజమానినైన నేను లేని సమయములో నా అనుమతిని పొందకనే ఫలములను తీసుకునుట అపరాధమని నీవెఱుగవా? మన మహారాజుగారి వద్దకు వెళ్ళి నీవు చేసిన తప్పుకి తగిన శిక్షని అనుభవించి రా!” అని అన్న అయిన శంఖుడు ఆజ్ఞాపించినాడు.

తండ్రి తరువాత తండ్రంతటి అన్న మాట తప్పని లిఖితుడు వెంటనే సుద్యుమ్న మహారాజు వద్దకు పరుగెట్టాడు. మునీంద్రుడు వచ్చాడని తెలియగానే ధర్మాత్ముడైన సుద్యుమ్న మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులర్పించి పూజించాడు. అప్పుడు లిఖితుడు “పార్థివకులభూషణ! ఈ పూజలకు నేను అనర్హుడిని. నేను మా అన్నగారు లేని సమయములో ఆయన ఇంటికి వెళ్ళి చెట్టుకున్న పండ్లను ఆయన అనుమతి లేకుండా కోసుకొని తిన్నాను. కనుక నేను చేసిని ఈ దొంగతనానికి తగిన రీతిలో శిక్షవేసి నన్ను రక్షించు. రాజదండన పొందిన వానికి యమదండన ఉండదని మా అన్నగారు నాకు హితవు చెప్పారు” అని ప్రార్థించాడు. “తపశ్శక్తితో లోకాలకు హితవు చేసే మిమ్ము ఎట్లు శిక్షించము?” అని నచ్చచెప్పినా లిఖితుడు తన పట్టువదలలేదు.

చివరికి సుద్యుమ్నుడు దండనీతి శాత్రాన్ని అనుసరించి లిఖితుని చేతులు నరికించాడు. లిఖితుడు ఎంతో సంతోషించి మహారాజును మనసారా ఆశీర్వదించి అన్నగారి వద్దకు పరుగెట్టాడు. శిక్షను అనుభవించి పునీతుడై వస్తున్న తమ్ముని చూచి శంఖుడు “నాయనా! మంచి పని చేశావు. నీవంటి ఉత్తముని వలన మన వంశమంతా ఉద్ధరింపబడుతుంది.

మద్యపానము, గురుపత్నిని ఆశించడము, విప్పుని చంపడము, విప్పుని ధనమును అపహరించడము (లిఖితుడు తెలియక చేసిన తప్పు ఇదే) మరియు ఈ పనులను చేసేవారితో కలిసి తిరగడము ఇవ్వి పంచమహాపాతకాలు. నువ్వు తగిన రాజదండన పొంది పాప విముక్తుడ వైనావు. ఈ బాహుదానదీ పుణ్యజలాలలో మునిగి దేవమునిపితృ తర్పణాలు ఇవ్వు” అని ఆజ్ఞాపించాడు. వెంటనే అన్నగారి ఆజ్ఞపాటించాడు లిఖితుడు. లిఖితుడు బాహుదా నదిలో మునక వేశాడోలేదో తన బాహువులు వచ్చేశాయి! ఆశ్చర్యచకితుడై అన్నగారికి నమస్కరించాడు. శంఖుడు “ప్రియసోదరా! నువ్వు చేసిన తప్పుకు శిక్షను అనుభవించి పునీతుడవైనావు కావున భగవంతుడు నిన్ను కరుణించినాడు. బాహుదానదీ మహాత్మ్యము నా తపశ్శక్తి ప్రభావము నీ చేతులు మొలవటానికి దోహదం చేశాయి. దండనీతిని సక్రమముగా అనుసరించి నిన్ను కాపాడిన సుద్యుమ్న మహారాజు కూడా ధన్యుడు” అని చెప్పాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. దండనీతి యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. ఏ తప్పుకు ఏ శిక్షను అనుభవించాలో వవరించి ఈ దండనీతి శాస్త్రము మనలను యమబాధలనుండి కాపాడుతుంది.
  2. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. ఈ విషయము తెలిసిన శంఖుడు తమ్మునిపైన అనుగ్రహముతో మహారాజువద్దకు వెళ్ళి దండన అనుభవించిర మ్మనాడు.
  3. అన్నగారు చెప్పిన హితవును వెంటనే అనుసరించి లిఖితుడు తనంతట తాను రాజు వద్దకు వెళ్ళి చేసిన తప్పొక్కుకుని దండించమని ప్రార్థించినాడు. దండన అనుభవించి పునీతుడైనాడు.
  4. ఈ కథలో అందఱూ తమ కర్తవ్యములను బాగా పాటించి మనకు మార్గదర్శకులైనారు. విపులైన శంఖలిఖితులు లోకహితార్థం తప్పస్సులు చేసుకుంటూ కాలము గడిపినారు. దండనీతికోవిదుడైన సుద్యుమ్న మహారాజు లిఖితునికి తగిన శిక్షవేశాడు. లిఖితుడు అన్నగారి మాట జవదాటలేదు. శంఖుడు తమ్ముని శ్రేయస్సునే కోరినాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Varasiddhi Vinayaka Pranapratistha In Telugu – శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ట

Shri Varasiddhi Vinayaka Pranapratistha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ట గురించి తెలుసుకుందాం. శ్రీ వినాయక పూజ అనేది భక్తులు వినాయకుడు దేవుడిని ఆరాధించడానికి విధానము. ఈ పూజలో వినాయకుడిని ఆవాహన, ప్రణామం, ఆరతి, నైవేద్యం, మంత్రార్చన మరియు ఆయుధాల అర్పణ ఉంటుంది.

Sri Varasiddhi Vinayaka Pranapratistha

శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ట

(విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి) ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం ఇత్యాద్యేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వా, నమస్కృత్వా (నమస్కారం చేస్తూ) ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః

శ్లో|| స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం |
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు |

ఆవాహితోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ, వరదో భవ, ప్రసీద, ప్రసీద, ప్రసీద (అంటూ వినాయకుడి విగ్రహం పాదాల వద్ద అక్షతలు లేక పూలు వేయాలి)

షోడశోపచార పూజ:

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ |
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ||
ఏకదన్తం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |
పాశాఙ్కుశధరం దేవం ధ్యాయేత్సద్ధివినాయకమ్ ||
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం |
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ||
ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ||
శ్రీ మహా గణాధిపతయే నమః | ధ్యాయామి ||
(వినాయకుడి విగ్రహం పాదాల వద్ద పూలు, అక్షతలు వేసి నమస్కరించాలి)

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ ||
ఆవాహయామి
(మరల అక్షతలు వేయాలి)

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం
రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం ||
ఆసనం సమర్పయామి ||
(అక్షతలు లేదా పూలు వేయాలి)

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం
మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ||
ఆర్ఘ్యం సమర్పయామి ||
(ఉద్ధరిణతో నీరును స్వామికి చూపించి ప్రక్కన వుంచుకున్న పాత్రలో వేయాలి)

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక |
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ||
పాద్యం సమర్పయామి ||
(మరల కొంచెం నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి.)

గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక |
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ||
పాద్యం సమర్పయామి ||
(మరల కొంచెం నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి.)

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత |
గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ||
ఆచమనీయం సమర్పయామి ||
(కొంచెంనీటిని స్వామికి చూపించి పాత్రలో వేయాలి)

దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం |
మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ||
మధుపర్కం సమర్పయామి||
(స్వామికి మధుపర్కాన్ని సమర్పించాలి.)

స్నానం:

పంచామృతైర్దేవ గృహాణ గణనాయక |
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ||
పంచామృత స్నానం సమర్పయామి ||
(ఆవుపాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలు స్వామివిగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయకొట్టి ఆ నీటిని స్వామిపై చల్లాలి)

గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః |
స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే ||
శుద్దోదక స్నానం సమర్పయామి||
(కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం |
శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ ||
వస్త్రయుగ్మం సమర్పయామి ||
(స్వామికివస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకొనేట్ల యితే పత్తికిపసుపు,కుంకుమరాసి దానినివస్త్రంగా ఇవ్వవచ్చు)

రాజితం బహ్మసూత్రంచ కాంచనంచోత్తరీయకం |
గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక ||
యజ్ఞోపవీతం సమర్పయామి ||
(యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి)

చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం ||
గంధాన్ సమర్పయామి ||
(కొంచెం గంధాన్ని స్వామికి అలంకరించాలి)

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ |
గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే ||
అక్షతాన్ సమర్పయామి ||
(స్వామికి అక్షతలు సమర్పించాలి)

సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖాని చ |
ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే ||
పుష్పాణి పూజయామి ||
(స్వామిని పూలతో పూజించాలి)

అధాంగపూజ:

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అధాంగపూజాం కరిష్యే.
ఓం గణేశాయ నమః – పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమః – గుల్ఫౌ పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః – జానునీ పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః – జంఘే పూజయామి
ఓం అఖువాహనాయ నమః – ఊరూ పూజయామి
ఓం హేరంబాయ నమః – కటిం పూజయామి
ఓం లంబోదరాయ నమః – ఉదరం పూజయామి
ఓం గణనాథాయ నమః – నాభిం పూజయామి
ఓం గణేశాయ నమః – హృదయం పూజయామి
ఓం స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి
ఓం గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి
ఓం విఘ్నహంత్రే నమః – నేత్రం పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి

అథ ఏకవింశతి పత్రపూజ:

(ఒక్కొక్క నామంచదువుతూ బ్రాకెట్లో పేర్కొన్నపత్రాలు తీసుకుని స్వామిని పూజించాలి.)

ఓం సుముఖాయనమః – మాచీపత్రం పూజయామి (మాచిపత్రి)
ఓం గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి (గరిక)
ఓం హరసూనవేనమః – దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయనమః – బదరీపత్రం పూజయామి (రేగు)
ఓం గుహాగ్రజాయనమః – అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయనమః – తులసీపత్రం పూజయామి (తులసీ)
ఓం ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి (మామిడి)
ఓం వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి
ఓం భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుకాంత)
ఓం వటవేనమః – దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయనమః – దేవదారుపత్రం పూజయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి (మరువం)
ఓం హేరంబాయనమః – సింధువారపత్రం పూజయామి (వావిలి)
ఓం శూర్పకర్ణాయనమః – జాజీపత్రం పూజయామి (జాజి)
ఓం సురాగ్రజాయనమః – గండకీపత్రం పూజయామి (గండకీ)
ఓం ఇభవక్త్రాయనమః – శమీపత్రం పూజయామి (జమ్మి)
ఓం వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి (రావి)
ఓం సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి (మద్ది)
ఓం కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయనమః – ఏకవింశతి పత్రాణి పూజయామి.

మరిన్ని పూజా విధానాలు: 

Pratigna Palana In Telugu – ప్రతిజ్ఞా పాలన

Pratigna Palana

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

స్వాతంత్ర్య సమరయోధులనాటి నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ప్రతిజ్ఞా పాలన కథ. 

ప్రతిజ్ఞా పాలన

స్వరాజ్యం కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న రోజులవి. ప్రతి భారతీయుడు వందేమాతర నినాదాలు చేస్తూ బ్రిటిషర్లకు గుండెదిగులయ్యాడు. స్వదేశాభిమానంతో విదేశీవస్తు బహిష్కరణ చేశారు. అట్లా బాహ్యంగా ఆంతరంగికంగా విదేశీయతను తననుండీ దూరం చేశాడు ఓ ప్రముఖ న్యాయవాది. అతడు ప్రఖ్యాత న్యాయవాది అయినా తెల్లవాళ్ళ న్యాయస్థానాల్లో అడుగు పెట్టనని ప్రతిజ్ఞబూనాడు.

డిసెంబర్ 1924 లో కాంగ్రెస్ మహాసభలు బెల్గాంలో జరిగాయి. ఎందఱో ప్రముఖులు ఆ సభలలో పాల్గొనటానికి వచ్చారు. ఈ ప్రసిద్ధ న్యాయవాది కూడా వచ్చాడు. అందఱూ చూస్తుండగా ఇందోర్ మహారాజు కంగారుగా వచ్చి సరాసరి ఆ ప్రముఖ న్యాయవాది దగ్గరకి వెళ్ళాడు. అందఱూ విభ్రమంతో చూడసాగారు.

“అయ్యా! గొప్ప చిక్కొచ్చి పడింది. నా తరపున మీరే వాదించాలి. ఈ 25 లక్షల రూపాయలుంచండి. కేసు గెలిచిన తరువాత మరో 25 లక్షలు సమర్పిస్తాను” అని అర్థించాడు ఇందోర్ మహారాజు. ఆ రోజుల్లో 50 లక్షలు నిజంగా చాలా పెద్ద మొత్తం. ఇందోర్ రాజు మీద హత్య చేయించి నట్టు ఆరోపించబడింది. కేసు వైస్రాయి ముందు విచారింప బడుతుంది కాబట్టి వాదించే న్యాయవాది బాగా ప్రజ్ఞాశాలి అయివుండాలి. అందుకే ఇందోర్ మహారాజు ఈ న్యావవాదిని ఎన్నుకున్నాడు.

మరెవరైనా అయివుంటే “మహాభాగ్యం” అని కేసు ఒప్పుకునేవారే. కానీ ఈ న్యాయవాది నిష్కర్షగా అన్నాడు “అయ్యా! క్షమించండి. ఆంగ్లన్యాయస్థానాలలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశాను. మళ్ళీ స్వాతంత్ర్యం వచ్చాకే నేను న్యాయస్థానాల్లోకి వసాను. ధన ప్రలోభంతో మీ కేసు ఒప్పుకుని ఆత్మవంచన చేసుకోలేను” అని జవాబిచ్చాడు. ఆ న్యాయవాది సత్య వాక్ పరిపాలనను చూసి ముగ్ధుడైన రాజు మరో న్యాయవాదిని ఎన్నుకున్నాడు.

ఆ న్యాయవాది “దేశ బంధు” గా పేరుకెక్కిన చిత్తరంజన్ దాస్.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

ఏమైనా రాని ఏమైనా కానీ అన్నమాట నిలబెట్టుకోవటం నిజమైన భారతీయుని లక్షణమ్. 50 లక్షల రూపాయలొస్తున్నా కొంచంకూడా ప్రలోభ పడకుండా చిత్తరంజన్ గారు ఆ రూపాయలను తృణప్రాయంగా ఎంచి తమ మాటకి కట్టుబడ్డారు. అందుకే వారు దేశ బంధువైనారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Rama Sahasranama Stotram In Telugu – శ్రీ రామ సహస్రనామ స్తోత్రమ్

Sri Rama Sahasranama Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ రామ సహస్రనామ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Rama Sahasranama Stotram In Telugu Lyrics

శ్రీ రామ సహస్రనామ స్తోత్రమ్

రాజీవలోచనః శ్రీమాన్ శ్రీరామో రఘుపుంగవః ।
రామభద్రః సదాచారో రాజేంద్రో జానకీపతిః ॥ 1

అగ్రగణ్యో వరేణ్యశ్చ వరదః పరమేశ్వరః ।
జనార్దనో జితామిత్రః పరార్థైకప్రయోజనః ॥ 2

విశ్వామిత్రప్రియో దాంతః శత్రుజిచ్ఛత్రుతాపనః ।
సర్వజ్ఞః సర్వదేవాదిః శరణ్యో వాలిమర్దనః ॥ 3

జ్ఞానభావ్యోఽపరిచ్ఛేద్యో వాగ్మీ సత్యవ్రతః శుచిః ।
జ్ఞానగమ్యో దృఢప్రజ్ఞః ఖరధ్వంసీ ప్రతాపవాన్ ॥ 4

ద్యుతిమానాత్మవాన్వీరో జితక్రోధోఽరిమర్దనః ।
విశ్వరూపో విశాలాక్షః ప్రభుః పరివృఢో దృఢః ॥ 5

ఈశః ఖడ్గధరః శ్రీమాన్ కౌసలేయోఽనసూయకః ।
విపులాంసో మహోరస్కః పరమేష్ఠీ పరాయణః ॥ 6

సత్యవ్రతః సత్యసంధో గురుః పరమధార్మికః ।
లోకజ్ఞో లోకవంద్యశ్చ లోకాత్మా లోకకృత్పరః ॥ 7

అనాదిర్భగవాన్ సేవ్యో జితమాయో రఘూద్వహః ।
రామో దయాకరో దక్షః సర్వజ్ఞః సర్వపావనః ॥ 8

బ్రహ్మణ్యో నీతిమాన్ గోప్తా సర్వదేవమయో హరిః ।
సుందరః పీతవాసాశ్చ సూత్రకారః పురాతనః ॥ 9

సౌమ్యో మహర్షిః కోదండీ సర్వజ్ఞః సర్వకోవిదః ।
కవిః సుగ్రీవవరదః సర్వపుణ్యాధికప్రదః ॥ 10

భవ్యో జితారిషడ్వర్గో మహోదారోఽఘనాశనః ।
సుకీర్తిరాదిపురుషః కాంతః పుణ్యకృతాగమః ॥ 11

అకల్మషశ్చతుర్బాహుః సర్వావాసో దురాసదః ।
స్మితభాషీ నివృత్తాత్మా స్మృతిమాన్ వీర్యవాన్ ప్రభుః ॥ 12

ధీరో దాంతో ఘనశ్యామః సర్వాయుధవిశారదః ।
అధ్యాత్మయోగనిలయః సుమనా లక్ష్మణాగ్రజః ॥ 13

సర్వతీర్థమయః శూరః సర్వయజ్ఞఫలప్రదః ।
యజ్ఞస్వరూపీ యజ్ఞేశో జరామరణవర్జితః ॥ 14

వర్ణాశ్రమకరో వర్ణీ శత్రుజిత్ పురుషోత్తమః ।
విభీషణప్రతిష్ఠాతా పరమాత్మా పరాత్పరః ॥ 15

ప్రమాణభూతో దుర్జ్ఞేయః పూర్ణః పరపురంజయః ।
అనంతదృష్టిరానందో ధనుర్వేదో ధనుర్ధరః ॥ 16

గుణాకరో గుణశ్రేష్ఠః సచ్చిదానందవిగ్రహః ।
అభివంద్యో మహాకాయో విశ్వకర్మా విశారదః ॥ 17

వినీతాత్మా వీతరాగః తపస్వీశో జనేశ్వరః ।
కళ్యాణప్రకృతిః కల్పః సర్వేశః సర్వకామదః ॥ 18

అక్షయః పురుషః సాక్షీ కేశవః పురుషోత్తమః ।
లోకాధ్యక్షో మహామాయో విభీషణవరప్రదః ॥ 19

ఆనందవిగ్రహో జ్యోతిర్హనుమత్ప్రభురవ్యయః ।
భ్రాజిష్ణుః సహనో భోక్తా సత్యవాదీ బహుశ్రుతః ॥ 20

సుఖదః కారణం కర్తా భవబంధవిమోచనః ।
దేవచూడామణిర్నేతా బ్రహ్మణ్యో బ్రహ్మవర్ధనః ॥ 21

సంసారోత్తారకో రామః సర్వదుఃఖవిమోక్షకృత్ ।
విద్వత్తమో విశ్వకర్తా విశ్వహర్తా చ విశ్వధృత్ ॥ 22

నిత్యో నియతకల్యాణః సీతాశోకవినాశకృత్ ।
కాకుత్స్థః పుండరీకాక్షో విశ్వామిత్రభయాపహః ॥ 23

మారీచమథనో రామో విరాధవధపండితః ।
దుస్స్వప్ననాశనో రమ్యః కిరీటీ త్రిదశాధిపః ॥ 24

మహాధనుర్మహాకాయో భీమో భీమపరాక్రమః ।
తత్త్వస్వరూపీ తత్త్వజ్ఞః తత్త్వవాదీ సువిక్రమః ॥ 25

భూతాత్మా భూతకృత్స్వామీ కాలజ్ఞానీ మహాపటుః ।
అనిర్విణ్ణో గుణగ్రాహీ నిష్కలంకః కలంకహా ॥ 26

స్వభావభద్రః శత్రుఘ్నః కేశవః స్థాణురీశ్వరః ।
భూతాదిః శంభురాదిత్యః స్థవిష్ఠః శాశ్వతో ధ్రువః ॥ 27

కవచీ కుండలీ చక్రీ ఖడ్గీ భక్తజనప్రియః ।
అమృత్యుర్జన్మరహితః సర్వజిత్సర్వగోచరః ॥ 28

అనుత్తమోఽప్రమేయాత్మా సర్వాదిర్గుణసాగరః ।
సమః సమాత్మా సమగో జటాముకుటమండితః ॥ 29

అజేయః సర్వభూతాత్మా విష్వక్సేనో మహాతపః ।
లోకాధ్యక్షో మహాబాహురమృతో వేదవిత్తమః ॥ 30

సహిష్ణుః సద్గతిః శాస్తా విశ్వయోనిర్మహాద్యుతిః ।
అతీంద్ర ఊర్జితః ప్రాంశురుపేంద్రో వామనో బలీ ॥ 31

ధనుర్వేదో విధాతా చ బ్రహ్మా విష్ణుశ్చ శంకరః ।
హంసో మరీచిర్గోవిందో రత్నగర్భో మహామతిః ॥ 32

వ్యాసో వాచస్పతిః సర్వదర్పితాఽసురమర్దనః ।
జానకీవల్లభః పూజ్యః ప్రకటః ప్రీతివర్ధనః ॥ 33

సంభవోఽతీంద్రియో వేద్యోఽనిర్దేశో జాంబవత్ప్రభుః ।
మదనో మథనో వ్యాపీ విశ్వరూపో నిరంజనః ॥ 34

నారాయణోఽగ్రణీః సాధుర్జటాయుప్రీతివర్ధనః ।
నైకరూపో జగన్నాథః సురకార్యహితః స్వభూః ॥ 35

జితక్రోధో జితారాతిః ప్లవగాధిపరాజ్యదః ।
వసుదః సుభుజో నైకమాయో భవ్యప్రమోదనః ॥ 36

చండాంశుః సిద్ధిదః కల్పః శరణాగతవత్సలః ।
అగదో రోగహర్తా చ మంత్రజ్ఞో మంత్రభావనః ॥ 37

సౌమిత్రివత్సలో ధుర్యో వ్యక్తావ్యక్తస్వరూపధృక్ ।
వసిష్ఠో గ్రామణీః శ్రీమాననుకూలః ప్రియంవదః ॥ 38

అతులః సాత్త్వికో ధీరః శరాసనవిశారదః ।
జ్యేష్ఠః సర్వగుణోపేతః శక్తిమాంస్తాటకాంతకః ॥ 39

వైకుంఠః ప్రాణినాం ప్రాణః కమఠః కమలాపతిః ।
గోవర్ధనధరో మత్స్యరూపః కారుణ్యసాగరః ॥ 40

కుంభకర్ణప్రభేత్తా చ గోపీగోపాలసంవృతః ।
మాయావీ స్వాపనో వ్యాపీ రైణుకేయబలాపహః ॥ 41

పినాకమథనో వంద్యః సమర్థో గరుడధ్వజః ।
లోకత్రయాశ్రయో లోకభరితో భరతాగ్రజః ॥ 42

శ్రీధరః సద్గతిర్లోకసాక్షీ నారాయణో బుధః ।
మనోవేగీ మనోరూపీ పూర్ణః పురుషపుంగవః ॥ 43

యదుశ్రేష్ఠో యదుపతిర్భూతావాసః సువిక్రమః ।
తేజోధరో ధరాధారశ్చతుర్మూర్తిర్మహానిధిః ॥ 44

చాణూరమర్దనో దివ్యః శాంతో భరతవందితః ।
శబ్దాతిగో గభీరాత్మా కోమలాంగః ప్రజాగరః ॥ 45

లోకగర్భః శేషశాయీ క్షీరాబ్ధినిలయోఽమలః ।
ఆత్మయోనిరదీనాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ॥ 46

అమృతాంశుర్మహాగర్భో నివృత్తవిషయస్పృహః ।
త్రికాలజ్ఞో మునిః సాక్షీ విహాయసగతిః కృతీ ॥ 47

పర్జన్యః కుముదో భూతావాసః కమలలోచనః ।
శ్రీవత్సవక్షాః శ్రీవాసో వీరహా లక్ష్మణాగ్రజః ॥ 48

లోకాభిరామో లోకారిమర్దనః సేవకప్రియః ।
సనాతనతమో మేఘశ్యామలో రాక్షసాంతకృత్ ॥ 49

దివ్యాయుధధరః శ్రీమానప్రమేయో జితేంద్రియః ।
భూదేవవంద్యో జనకప్రియకృత్ప్రపితామహః ॥ 50

ఉత్తమః సాత్వికః సత్యః సత్యసంధస్త్రివిక్రమః ।
సువ్రతః సులభః సూక్ష్మః సుఘోషః సుఖదః సుధీః ॥ 51

దామోదరోఽచ్యుతః శారంగీ వామనో మధురాధిపః ।
దేవకీనందనః శౌరిః శూరః కైటభమర్దనః ॥ 52

సప్తతాలప్రభేత్తా చ మిత్రవంశప్రవర్ధనః ।
కాలస్వరూపీ కాలాత్మా కాలః కల్యాణదః కవిః ।
సంవత్సర ఋతుః పక్షో హ్యయనం దివసో యుగః ॥ 53

స్తవ్యో వివిక్తో నిర్లేపః సర్వవ్యాపీ నిరాకులః ।
అనాదినిధనః సర్వలోకపూజ్యో నిరామయః ॥ 54

రసో రసజ్ఞః సారజ్ఞో లోకసారో రసాత్మకః ।
సర్వదుఃఖాతిగో విద్యారాశిః పరమగోచరః ॥ 55

శేషో విశేషో విగతకల్మషో రఘునాయకః ।
వర్ణశ్రేష్ఠో వర్ణవాహ్యో వర్ణ్యో వర్ణ్యగుణోజ్జ్వలః ॥ 56

కర్మసాక్ష్యమరశ్రేష్ఠో దేవదేవః సుఖప్రదః ।
దేవాధిదేవో దేవర్షిర్దేవాసురనమస్కృతః ॥ 57

సర్వదేవమయశ్చక్రీ శారంగపాణిరనుత్తమః ।
మనో బుద్ధిరహంకారః ప్రకృతిః పురుషోఽవ్యయః ॥ 58

అహల్యాపావనః స్వామీ పితృభక్తో వరప్రదః ।
న్యాయో న్యాయీ నయీ శ్రీమాన్నయో నగధరో ధ్రువః ॥ 59

లక్ష్మీవిశ్వంభరాభర్తా దేవేంద్రో బలిమర్దనః ।
వాణారిమర్దనో యజ్వానుత్తమో మునిసేవితః ॥ 60

దేవాగ్రణీః శివధ్యానతత్పరః పరమః పరః ।
సామగానప్రియోఽక్రూరః పుణ్యకీర్తిః సులోచనః ॥ 61

పుణ్యః పుణ్యాధికః పూర్వః పూర్ణః పూరయితా రవిః ।
జటిలః కల్మషధ్వాంతప్రభంజనవిభావసుః ॥ 62

అవ్యక్తలక్షణోఽవ్యక్తో దశాస్యద్వీపకేసరీ ।
కలానిధిః కలారూపో కమలానందవర్ధనః ॥ 63

జయో జితారిః సర్వాదిః శమనో భవభంజనః ।
అలంకరిష్ణురచలో రోచిష్ణుర్విక్రమోత్తమః ॥ 64

అంశుః శబ్దపతిః శబ్దగోచరో రంజనో రఘుః ।
నిశ్శబ్దః ప్రణవో మాలీ స్థూలః సూక్ష్మో విలక్షణః ॥ 65

ఆత్మయోనిరయోనిశ్చ సప్తజిహ్వః సహస్రపాత్ ।
సనాతనతమః స్రగ్వీ పేశలో జవినాం వరః ॥ 66

శక్తిమాన్ శంఖభృన్నాథః గదాపద్మరథాంగభృత్ ।
నిరీహో నిర్వికల్పశ్చ చిద్రూపో వీతసాధ్వసః ॥ 67

శతాననః సహస్రాక్షః శతమూర్తిర్ఘనప్రభః ।
హృత్పుండరీకశయనః కఠినో ద్రవ ఏవ చ ॥ 68

ఉగ్రో గ్రహపతిః కృష్ణో సమర్థోఽనర్థనాశనః ।
అధర్మశత్రుః రక్షోఘ్నః పురుహూతః పురుష్టుతః ॥ 69

బ్రహ్మగర్భో బృహద్గర్భో ధర్మధేనుర్ధనాగమః ।
హిరణ్యగర్భో జ్యోతిష్మాన్ సులలాటః సువిక్రమః ॥ 70

శివపూజారతః శ్రీమాన్ భవానీప్రియకృద్వశీ ।
నరో నారాయణః శ్యామః కపర్దీ నీలలోహితః ॥ 71

రుద్రః పశుపతిః స్థాణుర్విశ్వామిత్రో ద్విజేశ్వరః ।
మాతామహో మాతరిశ్వా విరించో విష్టరశ్రవాః ॥ 72

అక్షోభ్యః సర్వభూతానాం చండః సత్యపరాక్రమః ।
వాలఖిల్యో మహాకల్పః కల్పవృక్షః కలాధరః ॥ 73

నిదాఘస్తపనోఽమోఘః శ్లక్ష్ణః పరబలాపహృత్ ।
కబంధమథనో దివ్యః కంబుగ్రీవః శివప్రియః ॥ 74

శంఖోఽనిలః సునిష్పన్నః సులభః శిశిరాత్మకః ।
అసంసృష్టోఽతిథిః శూరః ప్రమాథీ పాపనాశకృత్ ॥ 75

వసుశ్రవాః కవ్యవాహః ప్రతప్తో విశ్వభోజనః ।
రామో నీలోత్పలశ్యామో జ్ఞానస్కంధో మహాద్యుతిః ॥ 76

పవిత్రపాదః పాపారిర్మణిపూరో నభోగతిః ।
ఉత్తారణో దుష్కృతిహా దుర్ధర్షో దుస్సహోఽభయః ॥ 77

అమృతేశోఽమృతవపుర్ధర్మీ ధర్మః కృపాకరః ।
భర్గో వివస్వానాదిత్యో యోగాచార్యో దివస్పతిః ॥ 78

ఉదారకీర్తిరుద్యోగీ వాఙ్మయః సదసన్మయః ।
నక్షత్రమాలీ నాకేశః స్వాధిష్ఠానషడాశ్రయః ॥ 79

చతుర్వర్గఫలో వర్ణీ శక్తిత్రయఫలం నిధిః ।
నిధానగర్భో నిర్వ్యాజో గిరీశో వ్యాలమర్దనః ॥ 80

శ్రీవల్లభః శివారంభః శాంతిర్భద్రః సమంజసః ।
భూశయో భూతికృద్భూతిర్భూషణో భూతవాహనః ॥ 81

అకాయో భక్తకాయస్థః కాలజ్ఞానీ మహావటుః ।
పరార్థవృత్తిరచలో వివిక్తః శ్రుతిసాగరః ॥ 82

స్వభావభద్రో మధ్యస్థః సంసారభయనాశనః ।
వేద్యో వైద్యో వియద్గోప్తా సర్వామరమునీశ్వరః ॥ 83

సురేంద్రః కరణం కర్మ కర్మకృత్కర్మ్యధోక్షజః ।
ధ్యేయో ధుర్యో ధరాధీశః సంకల్పః శర్వరీపతిః ॥ 84

పరమార్థగురుర్వృద్ధః శుచిరాశ్రితవత్సలః ।
విష్ణుర్జిష్ణుర్విభుర్యజ్ఞో యజ్ఞేశో యజ్ఞపాలకః ॥ 85

ప్రభవిష్ణుర్గ్రసిష్ణుశ్చ లోకాత్మా లోకభావనః ।
కేశవః కేశిహా కావ్యః కవిః కారణకారణమ్ ॥ 86

కాలకర్తా కాలశేషో వాసుదేవః పురుష్టుతః ।
ఆదికర్తా వరాహశ్చ మాధవో మధుసూదనః ॥ 87

నారాయణో నరో హంసో విష్వక్సేనో జనార్దనః ।
విశ్వకర్తా మహాయజ్ఞో జ్యోతిష్మాన్ పురుషోత్తమః ॥ 88

వైకుంఠః పుండరీకాక్షః కృష్ణః సూర్యః సురార్చితః ।
నారసింహో మహాభీమో వక్రదంష్ట్రో నఖాయుధః ॥ 89

ఆదిదేవో జగత్కర్తా యోగీశో గరుడధ్వజః ।
గోవిందో గోపతిర్గోప్తా భూపతిర్భువనేశ్వరః ॥ 90

పద్మనాభో హృషీకేశో ధాతా దామోదరః ప్రభుః ।
త్రివిక్రమస్త్రిలోకేశో బ్రహ్మేశః ప్రీతివర్ధనః ॥ 91

వామనో దుష్టదమనో గోవిందో గోపవల్లభః ।
భక్తప్రియోఽచ్యుతః సత్యః సత్యకీర్తిర్ధృతిః స్మృతిః ॥ 92

కారుణ్యం కరుణో వ్యాసః పాపహా శాంతివర్ధనః ।
సంన్యాసీ శాస్త్రతత్త్వజ్ఞో మందరాద్రినికేతనః ॥ 93

బదరీనిలయః శాంతస్తపస్వీ వైద్యుతప్రభః ।
భూతావాసో గుహావాసః శ్రీనివాసః శ్రియః పతిః ॥ 94

తపోవాసో ముదావాసః సత్యవాసః సనాతనః ।
పురుషః పుష్కరః పుణ్యః పుష్కరాక్షో మహేశ్వరః ॥ 95

పూర్ణమూర్తిః పురాణజ్ఞః పుణ్యదః పుణ్యవర్ధనః ।
శంఖీ చక్రీ గదీ శారంగీ లాంగలీ ముసలీ హలీ ॥ 96

కిరీటీ కుండలీ హారీ మేఖలీ కవచీ ధ్వజీ ।
యోద్ధా జేతా మహావీర్యః శత్రుజిచ్ఛత్రుతాపనః ॥ 97

శాస్తా శాస్త్రకరః శాస్త్రం శంకర శంకరస్తుతః ।
సారథిః సాత్త్వికః స్వామీ సామవేదప్రియః సమః ॥ 98

పవనః సాహసః శక్తిః సంపూర్ణాంగః సమృద్ధిమాన్ ।
స్వర్గదః కామదః శ్రీదః కీర్తిదోఽకీర్తినాశనః ॥ 99

మోక్షదః పుండరీకాక్షః క్షీరాబ్ధికృతకేతనః ।
సర్వాత్మా సర్వలోకేశః ప్రేరకః పాపనాశనః ॥ 100

సర్వదేవో జగన్నాథః సర్వలోకమహేశ్వరః ।
సర్గస్థిత్యంతకృద్దేవః సర్వలోకసుఖావహః ॥ 101

అక్షయ్యః శాశ్వతోఽనంతః క్షయవృద్ధివివర్జితః ।
నిర్లేపో నిర్గుణః సూక్ష్మో నిర్వికారో నిరంజనః ॥ 102

సర్వోపాధివినిర్ముక్తః సత్తామాత్రవ్యవస్థితః ।
అధికారీ విభుర్నిత్యః పరమాత్మా సనాతనః ॥ 103

అచలో నిర్మలో వ్యాపీ నిత్యతృప్తో నిరాశ్రయః ।
శ్యామో యువా లోహితాక్షో దీప్తాస్యో మితభాషణః ॥ 104

ఆజానుబాహుః సుముఖః సింహస్కంధో మహాభుజః ।
సత్యవాన్ గుణసంపన్నః స్వయంతేజాః సుదీప్తిమాన్ ॥ 105

కాలాత్మా భగవాన్ కాలః కాలచక్రప్రవర్తకః ।
నారాయణః పరంజ్యోతిః పరమాత్మా సనాతనః ॥ 106

విశ్వసృడ్విశ్వగోప్తా చ విశ్వభోక్తా చ శాశ్వతః ।
విశ్వేశ్వరో విశ్వమూర్తిర్విశ్వాత్మా విశ్వభావనః ॥ 107

సర్వభూతసుహృచ్ఛాంతః సర్వభూతానుకంపనః ।
సర్వేశ్వరేశ్వరః సర్వః శ్రీమానాశ్రితవత్సలః ॥ 108

సర్వగః సర్వభూతేశః సర్వభూతాశయస్థితః ।
అభ్యంతరస్థస్తమసశ్ఛేత్తా నారాయణః పరః ॥ 109

అనాదినిధనః స్రష్టా ప్రజాపతిపతిర్హరిః ।
నరసింహో హృషీకేశః సర్వాత్మా సర్వదృగ్వశీ ॥ 110

జగతస్తస్థుషశ్చైవ ప్రభుర్నేతా సనాతనః ।
కర్తా ధాతా విధాతా చ సర్వేషాం ప్రభురీశ్వరః ॥ 111

సహస్రమూర్ధా విశ్వాత్మా విష్ణుర్విశ్వదృగవ్యయః ।
పురాణపురుషః స్రష్టా సహస్రాక్షః సహస్రపాత్ ॥ 112

తత్త్వం నారాయణో విష్ణుర్వాసుదేవః సనాతనః ।
పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానందవిగ్రహః ॥ 113

పరంజ్యోతిః పరంధామః పరాకాశః పరాత్పరః ।
అచ్యుతః పురుషః కృష్ణః శాశ్వతః శివ ఈశ్వరః ॥ 114

నిత్యః సర్వగతః స్థాణురుగ్రః సాక్షీ ప్రజాపతిః ।
హిరణ్యగర్భః సవితా లోకకృల్లోకభృద్విభుః ॥ 115

రామః శ్రీమాన్ మహావిష్ణుర్జిష్ణుర్దేవహితావహః ।
తత్త్వాత్మా తారకం బ్రహ్మ శాశ్వతః సర్వసిద్ధిదః ॥ 116

అకారవాచ్యో భగవాన్ శ్రీర్భూనీలాపతిః పుమాన్ ।
సర్వలోకేశ్వరః శ్రీమాన్ సర్వజ్ఞః సర్వతోముఖః ॥ 117

స్వామీ సుశీలః సులభః సర్వజ్ఞః సర్వశక్తిమాన్ ।
నిత్యః సంపూర్ణకామశ్చ నైసర్గిక సుహృత్సుఖీ ॥ 118

కృపాపీయూషజలధిః శరణ్యః సర్వదేహినామ్ ।
శ్రీమాన్నారాయణః స్వామీ జగతాం పతిరీశ్వరః ॥ 119

శ్రీశః శరణ్యో భూతానాం సంశ్రితాభీష్టదాయకః ।
అనంతః శ్రీపతీ రామో గుణభృన్నిర్గుణో మహాన్ ॥ 120

ఇతి శ్రీ రామ సహస్రనామ స్తోత్రం సంపూర్ణః ॥

మరిన్ని స్తోత్రములు:

Hanuman Chalisa In Telugu – హనుమాన్ చాలీసా

Hanuman Chalisa In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హనుమాన్ చాలీసా నీ మనము ఎక్కువగా, సంస్కృతం లోను, మరియు, ఇతర భాషలలో చూసి వుంటాము, కాని ఎం.ఎస్ రామారావు గారు మనందరికోసం తెలుగు లోకి అనువదించిన హనుమాన్ చాలీసా గురించి మన అంతర్జాల స్థలం అనగా  భక్తివేద్.కం నందు తెలుసుకుందాం.

Hanuman Chalisa In Telugu Lyrics

హనుమాన్ చాలీసా

జయ హనుమంత జ్ణానగుణవందిత
జయపండిత త్రిలోక పూజిత

రామదూత అతులిత బలధామ
అంజనీపుత్ర పవనసుతనామ

ఉదయభానుని మధుర ఫలమని
భావన లీల అమృతమును గ్రోలిన

కాంచనవర్ణ విరాజిత వేశా
కుండలమండిత కుంచితకేశా ||శ్రీ||

రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రీవున నిలిపి

జానకీపతి ముద్రిక దోడ్కొని
జలధి లంఘించి లంక జేరుకొని

సూక్ష్మరూపమున సీతను చూచి
వికట రూపమున లంకను గాల్చి

భీమ రూపమున అసురుల జంపిన
రామ కార్యమును సఫలము జేసిన ||శ్రీ||

సీత జాడకని వచ్చిన నిను కని
శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని

సహస్ర రీతుల నిను గొనియాడగ
కాగల కార్యము నీపై నిడగా

వానరసేనతో వారధి దాటి
లంకేశునితో తలపడి పోరి

హోరుహోరున పోరు సాగిన
అసురసేనల వరుసన గూల్చిన ||శ్రీ||

లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ
సంజీవి దెచ్చిన ప్రాణప్రదాత

రామలక్ష్మణుల అస్త్రధాటికి
అసురవీరులు అస్తమించిరి

తిరుగులేని రామబాణము
జరిపించెను రావణసంహారము

ఎదురు లేని ఆ లంకాపురమున
ఏలికగా విభీషణు జేసిన ||శ్రీ||

సీతారాములు నగవుల గనిరి
ముల్లోకాల హారతులందిరి

అంతులేని ఆనందాశ్రువులే
అయోధ్యాపురి పొంగిపొరలె

సీతారాముల సుందర మందిరం
శ్రీకాంతుపదం నీ హృదయం

రామచరిత కర్ణామృతగానా
రామనామ రసామృతపాన ||శ్రీ||

దుర్గమమగు ఏ కార్యమైన
సుగమమే యగు నీకృపజాలిన

కలుగు సుఖములు నిను శరణన్న
తొలగు భయములు నీ రక్షణయున్న

రామద్వారపు కాపరివైన నీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా

భూత పిశాచ శాకినీ ఢాకినీ
భయపడి పారు నీ నామజపము విని ||శ్రీ||

ధ్వజావిరాజా వజ్రశరీరా
భుజబలతేజా గదాధరా

ఈశ్వరాంశ సంభూత పవిత్ర
కేసరీ పుత్ర పావన గాత్ర

సనకాదులు బ్రహ్మాదిదేవతలు
శారద నారద ఆదిశేషులు

యమ కుబేర దిక్పాలురు కవులు
పులకితులైరి నీ కీర్తి గానముల ||శ్రీ||

“సోదర భరత సమానా” యని
శ్రీ రాముడు ఎన్నికగొన్న హనుమా

సాధులపాలిట ఇంద్రుడవన్నా
అసురల పాలిట కాలుడవన్నా

అష్టసిద్ధి నవనిధులకు దాతగా
జానకీమాత దీవించెనుగా

రామరసామృత పానము చేసిన
మృత్యుంజయదవై వెలసిన ||శ్రీ||

నీ నామ భజన శ్రీ రామ రంజన
జన్మ జన్మాంతర దుఃఖభంజన

ఎచ్చటుండినా రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు

ఇతర చింతనలు మనసున మోతలు
స్థిరముగ మారుతి సేవలు సుఖములు

ఎందెందున శ్రీరామ కీర్తన
అందందున హనుమాను నర్తన ||శ్రీ||

శ్రద్ధగా దీనిని ఆలకింపుమా
శుభమగు ఫలములు కలుగుసుమా

భక్తిమీర గానము సేయగ
ముక్తి కలుగు గౌరీశుల సాక్షిగ

తులసీదాస హనుమానచాలీసా
తెలుగున సుళువుగ నలుగురు పాడగ

పలికిన సీతారాముని పలుకున
దోశములున్న మన్నింపుమన్నా ||శ్రీ||

మంగళ హారతి గొను హనుమంత
సీతారామ లక్ష్మణ సమేత |
నా అంతరాత్మ నిలుమో అనంత
నీవే అంతా శ్రీహనుమంత ||

మరిన్ని చాలీసా పోస్టులు మీకోసం:

Miyuneragani Pamarulanu Mammu In Telugu – మియునెఱగని పామరులను మమ్ము

మియునెఱగని పామరులను మమ్ము – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో మియునెఱగని పామరులను మమ్ము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

మియునెఱగని పామరులను మమ్ము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 1
కీర్తన: మియునెఱగని పామరులను మమ్ము
సంఖ్య : 162
పుట: 109
రాగం: ఆహిరి

ఆహిరి

47 ఏమీ నెఱఁగని మమ్ము నెక్కువసేసి
పామరుల దొడ్డఁజేసె భాష్యకారులు

||పల్లవి||

గతచన్న వేదాలు కమలజునకు నిచ్చి
నాతనికరుణచేత నన్నియుఁ గని
గతిలేకపోయిన కలియుగమున వచ్చి
ప్రతిపాలించఁ గలిగె భాస్యకారులు

||ఏమీ||

లోకమెల్ల వెల్లిఁబోఁగా లోననే సురలఁగాచి
ఆకుమీఁదఁ దేలినయతనికృప
కాకరిమతములెల్ల గాలి ఁబుచ్చి పర మిట్టే
పైకొనఁగఁ గరుణించె భాస్యకారులు

||ఏమీ||

పంకజపుఁజేయి చాఁచి పాదపుఁబర మిచ్చిన
వేంకటేశుకృపతోడ వెలయఁ దానే
తెంకనే వొడయవరై తిరుమంత్రద్వయాన
పంకమెల్లఁ బోఁగడిగె భాష్యకారులు

||ఏమీ||

అవతారిక:

భాష్యకారుడు అంటే వ్యాఖ్యానం చేసేవాడు అని అర్థం. భగవంతుని లీలలను గురించి సోదాహరణంగా వ్యాఖ్యానించి, భక్తిని పెంపొందింపజేస్తారు భాష్యకారులు. వైష్ణవ పరిభాషలో రామానుజాచార్యుల బిరుదు అది. అన్నమాచార్యులవారి ఈ కీర్తనలో తన గురువుని కీర్తిస్తూ మా భాస్యకారులు మమ్మల్ని దొడ్డవాడిని చేశారు. నిజానికి మేము పామరులమే. ఏమీ యెఱగని మమ్ము “అన్నమాచార్యులవారిని చేసి యెక్కువ చేసి అనుగ్రహించారు అంటున్నారు. “తన్న” అంటే కోల్పోబడిన… లేక… కోల్పోయిన అని అర్థం. ఇట్లా సూటిగ నిఘంటువులో దొరకని చాలామాటలున్నాయి, ఈ కీర్తనలో.

భావ వివరణ:

ఈ భాష్యకారులు (రామానుజాచార్యులవారు) ఏమీ యెరుగని పామరులమైన (అజ్ఞానులమైన) మమ్ము ఆచార్యపదవితో దొడ్డవానిని (గొప్పవానిని) చేశారు.

గతచన్న (గతించిపోయిన, లేక, కోల్పోయిన వేదాలను కమలజునకు (పద్మసంభవుడైన బ్రహ్మకు తిరిగి ఇచ్చిన ఆతని (శ్రీహరి) దయవలన అన్నియు నెఱిగి, గతిలేని (సక్రమమైన ధర్మ మార్గంలేని) కలియుగంలో వచ్చి (అవతరించి) ప్రతిపాదించగలిగె (నిరూపించగలిగెను… అంటే భగవంతుని సాక్షాత్కరింపజేసెను) ఈ భాష్యకారులు.

లోకమెల్ల (భూలోకమంతా) వెల్లనోపోగా (జలప్రవాహంలో మునిగిపోగా) లోననే (తనలోనే) దేవతలకు ఆశ్రయం కల్పించి చిన్నారి శిశువు రూపంలో ఒక మఱి ఆకుపై తేలియుండిన ఆదినారాయణుని దయనుపొంది, కాకరిమతమ ఉలెల్ల (వ్యర్థమైన మతములను) గాలిబుచ్చి (గాలికెగిరిబోవునట్లు చేసి) ఇట్టే పరము (మోక్షమార్గము) పైకొనగా (కలుగునట్లు) చేసినవారే ఈ భాష్యకారులు.

పంకజపు చేయిజాచి (కమలములవలె కోమలమైన తన చేతులను చాచి) తనపాదములను చూపించి మోక్షమార్గం ఇచ్చిన శ్రీవేంకటేశ్వరుని కరునారసవృష్ఠితనపై కురియగా, తెంకనే (సుస్థిరముగా) ఉడయవరై వైష్ణవాచార్యుడై అవతరించారు. ఆపైన తరుమంత్రద్వయముతో (పవిత్రమైన రెండు మంత్రములతో) మా పాపపంకిలమునంతా ఈ భాష్యకారులు తొలగించినారు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: