అంగదునివలె నేను ఆడవము బట్టనేర
సంగరమున సుగ్రీవునివలె సాధింపనేర
గాలిపక్షివలెనేను తాలిమిగమోయ నేర
బలిమితో హనుమంతునివలె పాటుపడనేర
||రామ||
లీలతో శబరివలె లాలించి విందిడ నేర
మేలిమిగ సీతవలె మెప్పిరంపనేర
గజరాజువలె నేను గట్టిగా మొరపెట్టనేర
విజయుని సతివలె వినుతింపనేర
గురిగ జాంబవంతునివలె కోరిభజింపగ నేర
॥రామ||
చేరి విభీషణునివలె శరణననేర
వరజటాయువలె ప్రాణములియ్యనేర
కరము నహల్యవలె గీర్తింపనేర
నేను రామదాసులవలె పూని మిము భజియింపనేర
నన్ను రక్షింపు భద్రాచల రామధీర
॥రామ||
67. పున్నాగవరాళి ఆదితాళము
పల్లము : రామప్రభో నీదయ నామీదను రాదేమయా శ్రీరామ
పామరుడను జడుడను తామసుడను
నేను వర్ణితంబగు నరపశువును నీ మహత్మ్య మెన్న నెంతటి వాడను
॥రామ||
రామ రామ యనిదలతు నిరంజన రామ
పరుల వేడనంటి నీ పదయుగ్మములే నమ్మి యుంటిని
నన్నరమర చేయవద్దంటిని శ్రీహరియని వేడుకొంటి
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శతనామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శతనామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళిగురించి తెలుసుకుందాం…
అద్భుతమైన సంస్కృత కీర్తననావిష్కరిస్తున్నారు అన్నమాచార్యులవారు. కృష్ణుని మాయమాటలు నమ్మి మోసపోయాననుకొని చింతిస్తున్న నాయిక నిర్వేదంతో అంటున్న పలుకులివి. ఎందుకు ప్రేలాపనలవంటి మాటలు మాట్లాడతావు. దానివల్ల యేమిలాభం? పోపోవయ్యా! అని ఆవిడ విసుక్కొంటున్నది. నీకు నమస్కరించినందువల్ల ప్రయోజనమేమిటి అనేంత నిస్పృహకు లోనైంది ఆమె.
ఇతర వధూటీమణులయందు వ్యామోహము గలిగిన నీకు హితవు బోధించాలని చూడటం ఎంత అవివేకమైన పని? నిన్నే నమ్ముకొన్న నన్ను కల్లబొల్లి కబుర్లతో ప్రసన్నురాలను చేయాలని చూచెదవు, యెందుకు? | గతజల సేతుబంధనము వలన కలిగే ప్రయోజనమేమిటి?
నీవు కపటివి. కపట వినయములు. నీవు దుర్మతివైన విటుడవు. నీకు సున్నితమైన స్తుతులవలన ప్రయోజనమేమిటి? నాయందు గొప్ప | క్రోధమును ప్రకటిస్తున్నావు. ఇదంతా చర్వితచరణమే.
నీయందు స్థిరమైనట్టి నా నమస్కారములు, విరసాలాపనలు అవుతుంటే… యేమి ప్రయోజనము కలుగుతుంది? ఓ తిరువేంకటగిరి దేవా! నీయందు విరహవేదన నిష్ప్రయోజనమవుతున్నది ప్రభూ!
కిన్నెర వెంకటగిరి కిసునరాయఁడ నీవు
వన్నెలుగ వీధి వీధి వాయించఁగా
మిన్ను దాఁకి లోకానకు మేఁటియైన లకిమమ్మ
నిన్ను సేరి సరుగన నిలుసుండే సొక్కెను
||సిన్న||
అవతారిక:
జానపదుల బాణీలో సాగిన కృష్ణలీలామృతం వినిపిస్తున్నారు. అన్నమాచార్యులవారు. ఈ కీర్తనలో ఆయన వాడిన బాలకిసున రాయడు, సిక్కుసీరై పోయను, సప్పుసారైపోయను వంటి మాటలు జానపద సాహిత్యంలో వుంటాయేమోకాని నేటి తెలుగు పాఠకులకు సుపరిచితాలు కాదు. ఈ బాలకృష్ణుని చిన్నవాడని నమ్మటానికి వీలులేదట. నేడు ఈ వెంకటగిరి కిసునరాయడు వీధివీధిలో కిన్నెర వాయిస్తుంటే లకిమమ్మ ఆయనను సేరి సరుగున నిలుసుండిందట. ఈ పాటికి మీకూ కొంత బుర్రకెక్కింది కదా!
భావ వివరణ:
ఓ కిసునరాయా! (కృష్ణరాయా!) నిన్ను చిన్నవాడవని నమ్మసెల్లదు. (నమ్మకూడదు). సిన్నైన యాటదెల్లా (యుక్తవయసు వచ్చిన ప్రతి ఆడపిల్లా) | నీమూలంగా, సిక్కు సీరై పోయను (సిగ్గుతో చితికిపోయింది).
అవుర బాలకిసునరాయడ (ఔరా! బాలకృష్ణరాయా!) నీవు సంటిపాలు (స్తన్యము) రుచిగావుంటుందని పూతన స్తనము చప్పరించి నెత్తురంతా పీల్చేస్తే అది కవకవ (వికటంగా నవ్వినవ్వి కళ్ళు తేలేసింది. సవరని యాటదెల్ల (అందమైన ఆ యువతి పూతన) సప్పుసారైపోయను (చచ్చి శవమై పోయింది).
ఓ గోపాల కృష్ణరాయా! నీవు అదిగో ఆ గొల్లవాడలో మగువల చూపులు వల్లెవేయగా (చూపులతో చూపులు కలిపి చిలిపి సంకేతాలీయగా), సూరబోయె రేపల్లె (సిగ్గుతో రేపల్లె చితికిపోయింది). గుబ్బలవంటి కుచగిరులున్న గొల్లెతల చేరడేసి కన్నులు ‘సిన్ని సిన్ని సిగ్గులు’ చిమ్మినవి.
ఓ వేంకటగిరి కిసునరాయ (వేంకట కృష్ణరాయా!) నీవు వన్నెలుగ (అందముగా) వీధివీధిలోనూ కిన్నెర (వీణ) వాయించగా అది, మిన్నుదాకి (ఆకాశంలో మారుమ్రోగి) జగదేకసుందరియైన ‘లకిమమ్మ’ (లక్ష్మీదేవి) నిన్ను చేరి సరుగున (నీ పక్కన) నిలుసుండే సొక్కెను (నిలబడి యుండగానే పరవశంతో నిద్రించినది).
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సూర్యాష్టకంగురించి తెలుసుకుందాం…
నేరు పేదో నేర మేదో నిలిచిన దొకటేదో
వూరకే నీదాసులమై వున్నారము
చేరి నన్నేలినయిట్టె శ్రీవేంకటేశ్వర
గారవించి కరుణించి కావఁగదవే
||తల||368
అవతారిక:
చక్కటి వైరాగ్య దీపికవంటి కీర్తననావిష్కరిస్తున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. “ఓ దైవమా! నీమాయలకు తలతోక వుండవయ్యా! మేము మాత్రం తెలియనివాటిని తెలుసునని, తెలిసినవాటిని తెలియవని తలపోస్తూ తిరుగుతుంటాము. మాకు దేంట్లోనూ నేర్పులేదు. మాకు తెలిసిందల్లా నీ దాసులుగా వుండటం. మమ్మల్ని యెలాగో వొకలాగ ఒడ్డునపడవెయ్యవయ్యా! కరుణించు” అంటున్నారు.
భావ వివరణ:
ఓ దేవదేవా! నీ మాయలకు (లీలలకు) తలలేదు తోకలేదు (ఆరంభం యెప్పుడు జరుగుతుందో తెలియదు. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు). నీమాయ ఆవరించినంతసేపూ, పిచ్చిపట్టినట్లు తెలిసీ తెలియక యేవేవో భ్రమలలో పడి, తిరుగాడుతూనే వుంటాము.
మా అంత పిచ్చివాళ్ళున్నారా ప్రభూ! మా ఈ శరీరం యెట్లా వచ్చిందో మాకు తెలియదు. దీనికి ఆలోచనలెలావస్తున్నాయో తెలియదు. సంసార సుఖము యెట్లా వుంటుందో తెలియదు. వెనక ముందేటిదో వివేకమెరుగము (పూర్వజన్మలో నేనెవరినో తెలియదు. మళ్ళీ నేను చచ్చాక యేమవుతానో తెలియదు). బ్రతికున్నంతకాలమూ ప్రతిరోజూ యేమో తిరుగుతూనే వుంటాము. ఏమిటి నీమాయ?
తల్లి కడుపులో యెప్పుడు యెలా పడ్డామో తెలియదు. ఏ క్షణాన గుటుక్కుమని కన్ను మూస్తామో తెలియదు. నాకు ధనమెలా వచ్చిందో, యెన్నాళ్ళుంటుందో, వున్నట్లుండి యెప్పుడు పోతాయో తెలియదు. శ్రీహరియొక్క ఈ “నిర్మాణ చక్రములో” మట్టు లేకుండా (పొందిక లేకుండా) తిరుగుతూనే వున్నాము. విచిత్రమేమంటే అట్లా తిరుగుతున్నా మేమే దిట్టలము (సమర్థులము) అని అనుకొంటుంటాము.
నీ కృపతో చివరికి ఒకనాటికి నాకు జ్ఞానోదయమయింది. నేర్వవలసిన దేమిటో తెలిసింది. ఇక నాకు నేర్పుతోను పనిలేదు. నిలిచినది వొక్కటేననే నేర్పు యేదో అది నా స్వంతమయింది. ఇక వూరకనే నీ దాసులమై వున్నారు. ఓ శ్రీవేంకటేశ్వరా! నీవే నన్ను వెదకి చేరుకుని నన్ను యేలినావు. ఇక నన్ను విడువకు. గారవించి కరుణించి కావగదవే (మన్నించి కరుణతో రక్షించుము తండ్రీ!) నాకు నీవే దిక్కు.
దశరథనందనుడైన శ్రీరామచంద్రమూర్తిని అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో కూడా రామాయణ ఘట్టములను | వర్ణిస్తూ రాముని నామాలను సన్నుతిస్తున్నారు. అన్నమాచార్య కీర్తనా యజ్ఞంలో ఈ దీక్షితులు సమర్పిస్తున్న ఈ కీర్తన సంఖ్య 1000. సహస్రాక్షుడు, సహస్రబాహువు, సహస్రముఖుడు, సహస్రరూపుడు అయిన ఆ “సాసముఖుని” సహస్రకీర్తనల వివరణతో అర్చించగలుగుతున్నాను. ఈ జన్మకిది చాలు. అన్నమయ్య అన్నట్లు “ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మఱి, యిదిగాక వైభవంబికవొకటి కలదే”!
భావ వివరణ:
దశరథనందునడవైన ఓ శ్రీరామచంద్రా! నమో నమో! నీకు వేలకొలది వందనములు. మమ్ము రక్షింపుము తండ్రీ! నీవెవ్వరివి ప్రభూ “కమనీయ శరణాగత వజ్రపంజరుడవు” (నీ శరణార్థులకు మనోజ్ఞమైన వజ్రపు కవచము వంటి రక్షకుడవు).
ఓ రామంచంద్రా! నీవు నీదాసులు రక్షణకై యెప్పుడూ కోదండమును ధరించియే వుంటాను, అనే దీక్ష నిర్వహించిన దీక్షితుడవు. ఆదిత్యకులములో (సూర్య వంశములో) జన్మించిన సకల శస్త్రాస్త్రపారంగతుడవు. మాయలేడివలె వచ్చిన మారీచుని సోదించు (వెదుకునట్టి) తలగుండు గండవు (శిక్షగా తలపై పెట్టుకొని తిరిగే పెద్దబండ వంటి మొనగాడివి). అంటే మారీచునివంటి కపటుల పాలిటి యముడివి అని భావము.
ఖరదూషణుల తలలను ఖండించి పదివేల మంది రాక్షసులను క్షణంలో మట్టుబెట్టావు. శరధిని బంధించి (వారధి నిర్మించి) విభీషణునికి వరదుడవైన ప్రతాపశాలివి. విశ్వామిత్రుని యాగమును సంరక్షించిన | జగజ్జెట్టివి. పుడమియందు జన్మించి, రావణాసురని చంపగలిగి కూడా “నేడుపోయి విశ్రాంతి తీసికొని తిరిగి రేపటికి తేరుకొని రా!” అని వదలివైచి వాడి గర్వాన్ని సమూలంగా హరించిన వీరాధివీరుడవు.
కీర్తితో అయోధ్యాపురాధీశ్వరుడవై యేలిన చక్రవర్తివి. గెలుపుమీరిన (కీర్తికాంత, భూకాంత, శ్రీకాంతలను కూడా గెలిచిన) జానకీరమణుడవు. కపిసేనలో అలఘులైన (ఉద్దండులైన) సుగ్రీవుడు అంగదుడు మొదలైన వారందరిచే సేవించబడినవాడవు. ఇంతే కాదు స్వామీ! నీవు సలలితము (దివ్యసౌందర్యోపేతమైన) శ్రీవేంకటశిఖర నివాసివైన మా దైవము శ్రీవేంకటేశ్వరుడవూ నీవే.
అన్నమాచార్యులవారి ఈ కీర్తన అర్థం కావాలంటే పురాణాలమీద మంచి పట్టు వుండితీరాలి. ఆతడే జగన్మూలమైన శ్రీవేంకటాద్రిమీది దైవము అని కీర్తిస్తున్నారు. ఈ స్వామి కమలాప్తుడైన సూర్యునిలోని వెలుగై దీప్తించువాడు. ఈయన జలధిసుతునకు బావగారు అంటున్నారు. మరి ఆబావమరిది యెవరో? ఈయన కొండవంటి రాకాసిని కొట్టినవాడట. మరి ఆ రాకాసియెవరో? శ్రీవేంకటాద్రి కొండరూపు తానేపో అంటున్నారు. అంటే ఏంటి? భావవివరణ చదివితే అన్నీ పూసగుచ్చినట్లు అర్థమవుతాయి మరి.
ఇంకా చెప్పాలంటే, ఆయన జలధిని బంధించినవాడు (సేతువును సాగరముపై నిర్మించిన శ్రీరాముడు). లంక (లంకిణి) అను రాక్షసిని సంహరించినవాడు (చంపించినవాడు). ఆయనే జలధి జొచ్చిన దైత్యుని | (వేదములను అపహరించి సముద్రంలో దాగిన సోమకాసురుని) చంపిన శ్రీమన్నారాయణుడు కూడా ఆయనే. జలధిసుతునకు (క్షీరసాగర | మథనమున పుట్టిన చంద్రునికి) వరుస బావ (అతని యొక్క సోదరి శ్రీలక్ష్మిని పెండ్లాటుచేత వరుసకు బావ) అయినవాడు. అటువంటి | క్షీరసాగరముపై పవ్వళించు స్వామియే పో మా దైవము.
ఇంతేకాక తన శ్రీకృష్ణావతారమున ఈయనే కొండను (గోవర్ధన పర్వతమును) గొడుగువలె చేతబట్టుకొని గోవులను, గోకులమును రక్షించినాడు. ఈతడే కొండవంటి రాకాసిని (రాక్షసి పూతనని) గొట్టినవాడు | (చనుబాలు త్రాగు నెపముతో సంహరించినవాడు). కొండలకు నెక్కుడైన (కొండలలో అత్యంత శ్రేష్ఠమైన) శ్రీవేంకటాద్రిపైన కొండరూపములో వున్నాడు (ఆ వేంకటాద్రి పడుకొని వున్న స్వామి శిరస్సును స్ఫురింపజేస్తుంది). తానేపో (ఆ శ్రీవేంకటేశ్వరుడే పో) మా దైవము.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ రాఘవేంద్ర స్తోత్రంగురించి తెలుసుకుందాం…
Sri Raghavendra Sthotram In Telugu
గోలోకవాసి, శ్రీహరి పార్ష దుడు నైనశ్రిశంఖుకర్ణుడు బ్రహ్మదేవు నా దేశానుసారముగ యీ యవనిపై బ్రహ్మదేవు శ్రీ ప్రహ్లాదునిగ, శ్రీ విభీషణునిగ, శ్రీ బాహ్లికునిగా, శ్రీ వ్యాస నాయతీర్థునిగ, శ్రీ రాఘ వేంద్ర తీర్థునిగా యుగయుగములంద వత పంచి శ్రీ హరిశక్తిని, భక్తిని ప్రచారమొనరించి ధర్మసంస్థా సనము గావించెను. ఆపావన చరిత్రుని దివ్యలీలలను శ్రీ రాఘ వేంద్ర కల్పవృక్ష గ్రంథములో వర్ణించి కృతార్థుడ నై తిని.
మంగళకరమగు స్వరూపము గలవాడును, దూది మొత్తము నగ్నివలె వివిధ సాంసారిక దుఖఃములను విధ్వంస మొనర్చువాడును, ఆనందము గలవాడును, ధైర్యశాలియు, సమస్త దుష్టగ్రహములను నిర్మూలింపదగిన మహాశక్తి కల వాడును, ఉపద్రవ సముద్రముల ను తరించుటకు సేతువు వంటి అగు శ్రీరాఘవేన్ద్ర స్వామి మమ్ము రక్షించు గాక.
ఈ ప్రకారముగ ప్రతిదినము మూడు వేళల ప్రార్థనను చేయుచున్న వాడు ఈలోకమునను, పరలోక మునను సమస్త మనోరథములను సిద్ధించుకొనినవాడై ఆనందించు చున్నాడు. ఈ విషయమున సం దేహము లేదు.
ఈ రాఘ వేంద్ర స్తోత్రమును బఠించు భక్తులకీ స్తోత్ర మహిమవలన రాజులవలన గాని, చోరులవలనగాని, వ్యాఘ్రముల వలనగాని సర్పములవలన గాని మొసళ్లు మొదలుగాగల వాని వలనగాని బాధ కలుగదు. సందేహ మేమాత్రము లేదు.
ఓ వామనమూర్తి! గోవిందుడా! విష్ణుదేవా! వాసుదేవా! శ్రీహరీ! శ్రీకృష్ణా! దామోదరా! (ఉదరమునకు తల్లి యశోదచే దామముతో కట్టబడినవాడా!) అచ్యుతా! మాధవా! శ్రీధరా! (లక్ష్మీవల్లభా!) నీమహిమను | గాలేము (తెలుసుకొనలేము). నిన్ను ఇటువంటివాడని అంచనావేయలేము. మరి ఇక యేమి చేయగలం? నాలుకకు అతి సులభమైన పని నీ నామమును జపించుట. అది చాలునాకు.
ఓ అనిరుద్ధా! (పరులచేత అడ్డగింపలేనివాడు) పురుషోత్తమా! అధోక్షజా! (ఇంద్రియములను జయించిన వారికి మాత్రమే కనబడువాడు) ఉపేంద్రా! జనార్ధనా! కేశవా! సంకర్షణా! (ప్రళయకాలమందు అందరినీ అంతముజేయువాడు) నిన్ను దలచలేము (నీగురించి ఆలోచించలేము). ఇక నిన్ను యెట్లు తెలియగలము? నునుపైన (పట్టుకోవటానికి తేలికైన) నీ నామము నోటితో సులభముగా పలికెదను ప్రభూ!
ఓ నారాయణుడా! పద్మనాభుడా!, హృషీకేశా! (ఇంద్రియములకు అధిపతి) నారసింహ! మధుసూదనా! త్రివిక్రమా! నీరూపము విశ్వరూపమైనందువలన యెట్లుండునో వూహింపజాలము. కానీ నేడు మాకన్నులయెదుట నిజముగా కనుపించుచున్న నిక్కపు వేంకటేశ్వరుడవు నీవే తండ్రీ! దర్శించి జపించుటకు అతి సులభమైన నీనామజపమును అన్నిటా స్వీకరింతును. ఎందుకంటే సులభమైన తరుణోపాయము ఓం నమో వేంకటేశాయ! అనడమే సుమా!