మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాసాన్ని కలిగి స్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించినచో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… కవచముల గురించి క్లుప్తంగా ఈ క్రింద ఇచ్చిన లింకుల నందు ఇవ్వబడినది. అవి ఏమిటో తెలుసుకుందాం…
ఈ కవచమును పైన చెప్పినవిధిగా ప్రతి నిత్యము పఠించినచో సర్వరోగములు, సర్వ శత్రుబయములు తప్పక శమించును. ఇది పూర్వము శ్రీరామునకు వశిష్ఠముని యుపదేశించిన అత్యద్భుత కవచము. ఇది పరాశరసంహితనుండి గ్రహింపబడింది.
“గోవులను కాచే గోవిందుడా! నిన్ను చూచి ఈ రేపల్లె గొల్లభామలు గొల్లుమని నవ్వారయ్యా! వాళ్ళనేమనగలము?” అంటున్నారు అన్నమాచార్యులవారు. నీ కోపాలు యికపై చెల్లేట్లులేవు. మరి నీవు వాళ్ళ చీరెలెత్తికెళ్ళిపోతే మళ్ళీ నిన్నే తిడుతున్నారు, అంటున్నారు. ఈ గోవిందుడు గొల్లవాడలోనున్న సతులనందరినీ ఒక్కవావిగానే చేశాడట. అంటే యేమిటో తెలుసా? ఆ గోవిందుడు, వరుసకు వదినా మరదళ్ళయిన ఇద్దరిని కూడితే వారు ఏమవుతారు? ఒకేవావి కదా! అంటే అక్కా చెల్లెళ్ళేకదా! అదన్నమాట సంగతి. ఇంతా చేసిన ఆ శ్రీసతిలోలుడేనట.
భావ వివరణ:
ఓ గోవిందుడా! ఈ గొల్లెతలను (గొల్లభామలను యేమనేవు (నీవేమి అనగలవు?) నీసంగతులు చెప్పుకొంటూ వాళ్ళు గొల్లుమని నవ్వుకొంటున్నారు చూశావా?
ఓ గోవిందుడా! నీ సుద్దులెల్లా (ముచ్చట్లనన్నియు) ఈ గోపికలు నీ తల్లి యశోదమ్మతో యేపున వున్నవీ లేనివీ కల్పించి యెక్కువగా) చెబుతున్నారు. నీ తీపుల చేతలెల్లా (నీవు పెట్టిన యాతనలు చిలిపి పనులు) అన్నియునూ తేటతెల్లమాయె (బట్టబయలైపోయాయి). ఓ గోవిందుడా నీ అలుకలు చెల్లవిక.
ఒకానొక నృసింహ జయంతి సందర్భంగా అన్నమాచార్యులవారు చెప్పిన కీర్తననాస్వాదించండి. “ఓనరులారా! నేటిదినముననే స్తంభములో నరసింహుడు వుదయించి హిరణ్యకశిపుని తుదముట్టించి దేవతలకు శుభములను ఆనందమును యొసగినాడు” అని, ఆయన ప్రహ్లాదుని రక్షించిన వైనం కీర్తిస్తున్నారు. శ్రీవేంకటగిరి ఆదిమ పురుషుడైన ఆ ఏడుకొండలవాడే ఈయనైనందువలన వంచన సేయక మంచి వరాలిస్తాడు అని అంటున్నారు. ఈ ఔభళేశుడు (అహెూబల నరసింహుడు) గురుతరమైన బ్రహ్మాండ గుహలో వెలసినాడట.
భావ వివరణ:
ఓ నరులారా! నేడే నృసింహ జయంతి. ఈ నరసింహ జయంతి నాడే ఆయన స్తంభమున వెలసి హిరణ్యకశిపుని వధించి సురులకు ఆనందము కలిగించి శుభములనొసగినాడు.
ఈ ఔభళేశుడు (అహోబలేశ్వరుడు) సందించి (పూని) వైశాఖ శుద్ధ చతుర్ధశినాడు, శనివారము రోజున సంధ్యా సమయమున ఆవిర్భవించినాడు. చక్కగా ఆ హిరణ్యకశిపుని వరముల ననుసరించియే కంభములో పొడమి (స్తంభములోనుంచి పుట్టాడు కాబట్టి యే తల్లిదండ్రికి పుట్టనివాడైనాడు). ఒక కడపమీద వాడిని చంపాడు (కాబట్టి ఇంటా బయటా కాని చోటనే వాడు చచ్చాడు). కందువ (సామర్థ్యంతో) తనవాడియైన గోళ్ళతో (యే ఆయుధముతోను వాడికి చావులేదు కాబట్టి) చీల్చి ఆ కనకకశిపుని (హిరణ్య కశిపుని) వధించినాడు.
ఈయనయెట్లా వున్నాడో ఒకసారి చూడండి. ఈయనది నరమృగరూపము (తల సింహానిది శరీరము నరునిది), నానాహస్తములు (చాలా చేతులు వున్నందున నరుడు కూడా కాదు). అరిది (ఉపయోగింపబడని) శంఖచక్రములు ఆయన హస్తభూషణములుగా వున్నవి. గరిమ (అద్భుతముగా) తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని కాపాడి రక్షించి నిలిచినాడు. ఎక్కడ? బ్రహ్మాండమైన ఈ అహెూబలం కొండ గుహలో నిలిచినాడు.
ఎట్లా నిలిచాడో గమనించండి. ఆ దనుజుని వధానంతరం వెంటనే బంగారు గద్దెపై (సింహాసనముపై) మించుగ (వున్నతముగా) ఇందిరను (శ్రీలక్ష్మిని) తన తొడపై కూర్చుండబెట్టుకొని కొలువైయున్నాడు. ఈయనే అంచె (ఆ తరువాత) శ్రీవేంకటగిరి మీద ఆది పురుషుడు శ్రీవేంకటేశ్వరుడై నిలిచాడు. వంచన సేయక (నమ్మిన తన భక్తులను వంచించక) మంచి మంచి వరములనిస్తున్నాడు. అదిగో ఆయనకు మ్రొక్కండి.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దుర్గా సప్తశతి కీలక స్తోత్రంగురించి తెలుసుకుందాం…
Durga Saptasati Keelaka Stotram In Telugu
దుర్గా సప్తశతి కీలక స్తోత్రం
అస్య శ్రీ కీలక స్తోత్రమంత్రస్య శివ ఋషిః అనుష్టు| ప్ఛందః శ్రీ మహాసరస్వతీ దేవతా మంత్రి దితా దేవ్యో బీజం | నవాల్లో మంత్ర శ్శక్తిః | శ్రీ సప్తశతీమంత్రస్తత్త్వం! శ్రీజగదంబా ప్రీత్యర్థే సప్తశతీపాఠాంగ త్వేనజ విని యోగః| ఓం నమ శ్చండికాయై |
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి భక్తి కుసుమాలుగురించి తెలుసుకుందాం…
Sai Bhakti Kusumalu Telugu
ప్రార్థన
విన్నవించుచుంటిని స్వామి వినయముగను
శతక మాలను కూర్చగ శరణు గోరి
నిన్ను తలచి యుంటిని మది నిండ నిల్పి
విఘ్నములను తొలగ సేయు విజయ సాయి.
1
శుభములొసగు మూలపుటమ్మ చూడవమ్మ
మహిమ గల తల్లి మొక్కెద మనసుతోడ
నీ కృపా కటాక్షమ్ముల నింపవమ్మ
యని, సరస్వతి వేడెద నయ్య సాయి
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక ప్రార్థనలలో ఒకటి. సహస్ర అనగా వెయ్యి . అంటే ఈ స్తోత్రంలో వెయ్యి నామాలు ఉంటాయి . ఇది శ్రీమహావిష్ణువు యొక్క వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు (చాత్తాద శ్రీవైష్ణవులు) భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు.ఇచట సహస్రనామము అనగా వేయి పేర్లు అని కాదు అనంతము అని చెప్పుకోవలెను. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ విష్ణు సహస్రననామావళిఃగురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ త్రిపురసుందరీ మానసపూజా స్తోత్రంగురించి తెలుసుకుందాం…
Sri Tripura Sundari Manasa Puja Stotram Telugu
శ్రీ త్రిపురసుందరీ మానసపూజా స్తోత్రం
మమ న భజనశక్తిః పాదయోస్తే న భక్తి-
-ర చ విషయవిరక్తిర్ధ్యానయోగే న సక్తిః |
ఇతి మనసి సదాహం చింతయన్నాద్యశక్తే
రుచిరవచనపుష్పైరర్చనం సంచినోమి ||
జానపదులు కోలాటములాడుతూ పాడే మధురమైన కీర్తన అన్నమాచార్యులవారి ద్వారా ఆస్వాదించండి. అల్లోనేరేడు పళ్ళవలె మధరములైన నెయ్యములు (స్నేహములు) ఒయ్యన (తిన్నగా) వువ్విళ్ళురు చున్నవి. ఇది ఆట ప్రధానమైన కీర్తన. బాహుమూలములలో పలచని చెమటల గురించి వర్ణించగలిగిన సత్తా అన్నమయ్యకు మాత్రమే వున్నదని వేరే చెప్పక్కరలేదు. ఇది సుగ్రాహ్యము అనుకోవడానికి వీలులేని కీర్తన. జాగ్రత్తగా చదివితేకాని అర్థంకాదు, మరి.
భావ వివరణ:
మా నెయ్యములు (స్నేహము) అల్లోనేరేడు పండ్లవలె మధురమైనవి. ఒయ్యన (తిన్నగా) వువ్విళ్ళూరెడ్డి మా అనుబంధం దినదిన ప్రవర్ధమానమవుగాక!
బాహుమూలములలో పరిఢవిల్లిన లే చిత్తడి చెమటల చెలమలలో అందములు అలంకార ప్రాయమైనవి. ఈ నృత్యమువలన చెమట ఇంకా అధికమై, థళథళమను (తళతళమని) మెరయు ముత్యములను చెరుగు సురటి (విసనకఱ్ఱ), దులిపేటి నీళ్ళతుంపరల వలె వున్నవి.
ఈ గోవిందుడు తన విరహంతో ఆమెనెంత బాధిస్తున్నాడంటే, ఆమె కన్నుల నుండి తొట తొటమని కన్నీరు కురియుచున్నది. ఆమె అది తాళలేక అలుక వహించినది. ఆ చిటిపొటి (చిన్న చిన్న) అలుకలు చివరికి చిరునవ్వులై రావిపండురంగులోనున్న నీ వన్నెల అధరమునాస్వాదించి | గుక్కిళ్ళువేయుచూ (గుటకలు మింగించినది). అలుకలు మరింత మధురమైనవి.
ఓ గరగరికల (నిర్మలుడవైన) వేంకటేశ్వరా! నీ కౌగిటిలో పరిమళములు వెదజల్లు మీ ఒంటిపై పూతలు ఒండొరులకు ఎలా వున్నాయంటే మన్మథుని వింటినుండి వెలువడిన కమ్మని పుష్పబాణములు కూడా గురిగా తాకునట్లు మీపై వేసిన ఇనుప గుగ్గిళ్ళవలెనున్నవి.
దైవం బలవత్తరం భువనే
నైవ రోచతే నర్మ మయి
ఏవమేవ భవదిష్టం కురు కురు
శ్రీ వేంకటాద్రి శ్రీనివాస.
||అంజలి||
అవతారిక:
చక్కటి సంస్కృత కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. నాయిక శ్రీవేంకటేశ్వరునిపై అలిగింది. నీకు దండం పెడతాను నన్నెందుకు మాటలతో ఏడిపిస్తావు. అని రుసరుసలాడిందామె. నీవెవరివి? నేనెవరిని? పోపోవయ్యా! అని పోట్లాడింది. కాని ఆయన లేకుండా క్షణం |వుండలేదామె. చివరికి నీ ఇష్టం మహాప్రభో! అని లొంగిపోయింది.
భావ వివరణ:
నీకు ఈ నమస్కారములు, వందనములు. నాకు నీ మాటలతో యెందుకు దుఃఖమును కలిగిస్తున్నావు?
దేవా! నన్నెందుకు తలచెదవు? నాతో నీకేమిటి? నీవెవరవు? నీకు నేనేమవుతాను? నీవు నాకేమవుతావు? పనివున్నదయ్యా? నాపై నీకు శంకలేకుంటే ఇక్కడికెందుకు వచ్చావు?
ఓ మనసిజ జనకా! (మన్మధునికి తండ్రీ) నీ వినయపు మాటలకు నేను యోగ్యురాలనా? కానయ్యా! నీవు మరల మరల పూజింపదగిన వాడివైయున్నావు. దినదినమూ జరిగే ఈ కలహాలతో నీకేమి పనిలే? ఓ | రమారమణా! నేను దీనితో విసిగిపోయాను.
భువనములో దైవమే బలవత్తరమైనది. నాయందు నీవంచనలు నాకు రుచించవు. పోనీలే, నీకేది ఇష్టమో అదేచేయుము. ఓ వేంకటాద్రిపైనున్న శ్రీనివాసా! నేనేమనగలను?