Sri Lalitha Ashtakarika Sthotram In Telugu | అష్టకారికలు (Avirbhava Stuti)

Sri Lalitha Ashtakarika Sthotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా అష్టకారికలు స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Sri Lalitha Ashtakarika Sthotram (Avirbhava Stuti)

అష్టకారికలు

హోమాగ్ని నుండి శ్రీ లలితాదేవిని రమ్మని ఆహ్వానిస్తూ చెప్పిన శ్లోకములు.

విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైక నాయకి
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

1

ఆనందరూపిణి పరే జగదానందాయిని
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

2

జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయరూపే మహాజ్ఞానప్రకాశిని
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

3

లోక సంహారరసికే కాళికే భద్రకాళికే
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

4

లోకసంత్రాణరసికే మంగళే సర్వమంగళే
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

5

విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విశంకటే
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

6

సంవిద్వహ్ని హుతాశేష సృష్టి సంపాదితాకృతే
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

7

భండాద్యైస్తారకా ద్యైశ్చ పీడితానాం సతాం ముదే
లలితా పరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ ॥

8

ఇత్యష్ట కారికాపాఠం కుర్వాణే శంభునాయకే
ఆవిర్భభూవ చిద్వహ్నేర్లలితా పరమేశ్వరీ ॥

9

మరిన్ని స్తోత్రములు:

Saraswathi Prarthana In Telugu – సరస్వతీ ప్రార్థన

Saraswathi Prarthana In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సరస్వతీ ప్రార్థన గురించి తెలుసుకుందాం…

Saraswathi Prarthana Lyrics

సరస్వతీ ప్రార్థన

శ్లో॥ 1

యాకుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా
యా వీణావరదండమండితకరా యాశ్వేతపద్మాసనా।
యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవై స్సదా పూజితా
సామాంపాతుసరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా॥

సీ॥ మల్లెలు, చంద్రుండు, మంచు, ముత్తెపు దండ వలె శోభమెరిసెడి వాణియీమె ధవళ కాంతుల నొప్పి ధరియుంచు నీ తల్లి శుభ్ర వస్త్రంబును శోభగూర్ప ఉత్తమ వీణియ నొప్పు హస్తంబుల తెల్లకమలమె ఆ దేవి పీట బ్రహ్మ విష్ణువులును పరమేశ్వరుడు తాము నుతియింతురీమెను నోరు పండ.

తే॥ జడము నెలకొన, తాను, అజ్ఞానమందు
దాని పూర్తిగా తొలగించు తల్లియీమె
దేవి భగవతి విద్యల దేవి ఈమె
ఓ సరస్వతి రక్షించు ఉన్నతముగ.

తా॥ మల్లెపూలు, చంద్రుడు, మంచుకొండ, ముత్యాలదండ, వలె మెరిసి పోతున్న తెల్లటికాంతినిచ్చు శుభ్రమైన తెల్లని వస్త్రములు శోభకలిగిస్తుండగా, ఉత్తమమైన వీణియను చేతులలో ధరించి తెల్లటి పద్మమున కూర్చుని ఆ త్రిమూర్తులు తమ నోరుపండునట్లు నుతించుచుండగా, అజ్ఞాన జనితమైన జడత్వమును ఆమె సంపూర్తిగా తొలగ చేయగలదు. అట్టి భగవతీ విద్యలరాణి, ఓ సరస్వతీ నన్ను చక్కగా రక్షించుము తల్లీ!

శ్లో॥ 2

శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే
సర్వదా సర్వదాSస్మాకం, సన్నిధి స్సన్నిధిం క్రియాత్॥

తే॥ వాణి! శరదృతు పద్మము వంటి నీదు
పద్మ వదనపు దర్శన భాగ్యమిమ్ము
కోర్కెదీరిచి పండిత గురువులకును
ఎల్లవేళల సన్నిధి నీయుగాక.

తా॥ ఓ సరస్వతీ! శరత్కాల పద్మమువంటి నీ ముఖము యొక్క దర్శన భాగ్యము కల్పించుము. నీవు మా కోరికలను తీర్చుదానవు. ఎల్లవేళల పండితులకు గురువులకు నీ సన్నిధి దొరుకుగాక.

శ్లో॥ 3

సరస్వతి! నమస్తుభ్యం, వరదే! కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా||

తే॥ ఎల్లయెడల సరస్వతి ఈయవమ్మ
వరములను నాకు వలయు రూపమును దాల్చు
వాణి! ఓయమ్మ! పద్మ సంభవుని రాణి!
విద్య మొదలిడ సిద్ధిని వేడెదమ్మ!

తా॥ ఓ సరస్వతీ! నాకు ఎప్పుడూ కోరిన వరములిచ్చి కరుణించుము. కావలసిన రూపమును ధరించగల ఓ వాణీ! నలువరాణీ విద్యను ఆరంభము చేయుటకు ముందు ఓ తల్లీ సిద్ధించు కృపను వేడెదను.

శా || 4

తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా సూక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందుబింబాననా.

తా॥ ఈ జగత్తుకంతటికీ మోహనరూపివైన ఓ సరస్వతీదేవీ తెల్లటి పద్మముల వంటి కన్నులుగల భగవతీ! పూర్ణచంద్ర బింబము వంటి ముఖముగల ఓతల్లీ! నిన్ను ధ్యానించి పుస్తకమును నాచేత ధరించితిని. నీవు నామనసున నిలిచి విరివిగా మంచిమాటలను, శబ్దములను శోభకలుగునట్లుగా పలుకుము. నామాట యందు ప్రీతిపూర్వకముగా నుండుము.

ఉ.

క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయసుందర వేణికి రక్షితామర
శ్రేణికిఁ దోయజాతభవచిత్తవశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామశుక వారిజ పుస్తకరమ్య పాణికిన్

తా॥ ఇసుక తిన్నెలవంటి పిరుదులు, తుమ్మెద రెక్కల వంటి ముంగురులు గలిగి పద్మసంభవుడైన బ్రహ్మను ఆకర్షించు కంఠస్వరము గలిగి, జపమాల, రామచిలుక, పద్మము, పుస్తకము ధరించిన సుందర హస్తములుగల ఓ వాణీ! నేలపై నెన్నుదురు తాకునట్లు వంగి నమ్రతతో నేను నీకు నమస్కరించెదను.

ఉ.

కాటుక కంటినీరు చనుఁ గట్టుపయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో
హాటకగర్భురాణి నిను నాకటికిన్ గొనిపోయి యల్లక
ర్ణాటకిరాత కీచకులకమ్మ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ

తా॥ కైటభాసుర సంహారి ఆ శ్రీమహావిష్ణువు యొక్క ప్రియమైన కోడలివైన నా తల్లీ! సరస్వతీ నీ కాటుక కన్నులనుండి కారిన కన్నీరు నీ కుచద్వయముపై పడునట్లు రోదించెదవెందుకు? స్వర్ణగర్భుడైన ఆ బ్రహ్మ సతీమణీ! నిన్ను నా క్షుద్బాధ తీర్చుకొనుటకు తీసుకొనిపోయి అక్కడ యున్న ఆ కర్ణాట కిరాత కీచకులకు అమ్ముకోను. త్రికరణశుద్ధిగా చెప్పు నామాట నమ్ము.

ఉ.

అంబ నవాంబుజోజ్జ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా
డంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్న దీపికా
చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్తివివిక్తనిజ ప్రభావ భా
వాంబరవీధి విశ్రుతవిహారిణి నన్ గృపఁ జూడు భారతీ.

తా॥ తల్లీ! నూతన పద్మము వలె ప్రకాశించు హస్త పద్మములు గల దాన, శరచ్చంద్రుని వెన్నెల వలె ఆడంబరమైన సుందర రూపముగల దేవీ, ధరించిన నగలయొక్క రత్నదీపముల వంటి వెలుగులు ముద్దిడుచున్న దిక్కులుగల అమ్మా వేదవిదితమైన సహజ సిద్ధ ప్రభావముగల దాన, భావగగన వీధిలో యధేచ్ఛగా విహరించు సరస్వతీ మాతా! నన్ను దయజూడుము.

ఉ.

శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేనరజతాచలకాశ ఫణీశకుందమం
దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానఁగ నెన్నఁడు గల్గు భారతీ||

తా॥ ఓ సరస్వతీ దేవీ! శరత్కాల మేఘము (తెల్లగా) వలెను, చంద్రుని వలెను, కర్పూరము వలెను, పటిక వలెను, హంసవలెను, మల్లెల దండవలెను, మంచువలెను, సముద్రపు నురగవలెను, మంచుకొండ వలెను, ఆదిశేషుని వలెను, తెల్ల మందారము వలెను, పాల సముద్రము వలెను, తెల్లని పద్మము వలెను, ఆకాశ గంగవలెను, శుభకరమైన తెలుపు రంగుతో స్వచ్ఛముగా శోభించు నిన్ను నామనస్సున ఎప్పుడు చూడగల్గుదునో కదా!

మరిన్ని పూజా విధానాలు:

Manideepeswari Ashtottara Shata Namavali In Telugu | మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిః

Manideepeswari Ashtottara Shata namavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

Manideepeswari Ashtottara Shata Namavali In Telugu

మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిః

  • ఓం దివ్యలోకవాసిన్యై నమః
  • ఓం సర్వలోకసంరక్షణాయై నమః
  • ఓం సర్వమృత్యుసర్వాపద్వినివారణ్యై నమః
  • ఓం లలితాబాలా, దుర్గాశ్యామలాకృత్యై నమః
  • ఓం గంగా, భవానీగాయత్రీస్వరూపాయై నమః
  • ఓం లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ,స్వరూపవిభవాయై నమః
  • ఓం రాజరాజేశ్వరీదేవ్యై నమః
  • ఓం భక్తాభీష్టదాయిన్యై నమః
  • ఓం భక్తిభుక్తిముక్తిప్రదాయిన్యై నమః
  • ఓం భక్తసంకల్పసిద్ధిదాయై నమః
  • ఓం పృథ్వీశ్వరీదేవ్యై నమః
  • ఓం ఆధివ్యాధినివారిణ్యై నమః
  • ఓం దౌర్భాగ్యనాశిన్యై నమః
  • ఓం సౌభాగ్యదాయిన్యై నమః
  • ఓం సృష్టిస్థితిలయాయై నమః
  • ఓం అష్టసిద్ధి నవనిధిప్రదాయిన్యై నమః
  • ఓం అష్టదికాల్పక వందితాయై నమః
  • ఓం త్రికాల వేదిన్యై నమః
  • ఓం షడ్గుణ సంసేవితాయై నమః
  • ఓం షడ్రుతు పరివేష్టితాయై నమః
  • ఓం నవగ్రహవిధివిధానాధిష్టానాయై నమః
  • ఓం సత్యధర్మశాంతిప్రేమప్రసాదిన్యై నమః
  • ఓం సర్వకాలసర్వావస్థాసమస్థితాయై నమః
  • ఓం అనంతసాగర, నదీనదాకృత్యై నమః
  • ఓం కాంస్య(కంచు)లోహమయప్రాకారిణ్యై నమః
  • ఓం పీత (ఇత్తడి)లోహమయిప్రాకారిణ్యై నమః
  • ఓం తామ్ర(రాగి)లోహమయిప్రాకారిణ్యై నమః
  • ఓం సీసలోహమయప్రాకారిణ్యై నమః
  • ఓం పంచలోహమయప్రాకారిణ్యై నమః
  • ఓం రజితసాలప్రాకారిణ్యై నమః
  • ఓం సువర్ణసాల ప్రాకారిణ్యై నమః
  • ఓం పుష్యరాగమయప్రాకారిణ్యై నమః
  • ఓం పద్మరాగమయప్రాకారిణ్యై నమః
  • ఓం గోమేధికమణిమయప్రాకారిణ్యై నమః
  • ఓం వజ్రనిర్మితప్రాకారిణ్యై నమః
  • ఓం వైడూర్యనిర్మితప్రాకారిణ్యై నమః
  • ఓం ఇంద్రనీలమణిమయప్రాకారిణ్యై నమః
  • ఓం మరకతసాలమయప్రాకారిణ్యై నమః
  • ఓం ప్రవాళసాలమయప్రాకారిణ్యై నమః
  • ఓం రత్నసాలమయప్రాకారిణ్యై నమః
  • ఓం చింతామణిమయప్రాకారిణ్యై నమః
  • ఓం శృంగారమండపదేవదేవతాయై నమః
  • ఓం జ్ఞానమండపజ్ఞానేశ్వరీదేవ్యై నమః
  • ఓం ఏకాంతమండపధ్యానేశ్వరీదేవ్యై నమః
  • ఓం ముక్తిమండపముక్తేశ్వరీదేవ్యై నమః
  • ఓం కాశ్మీరవనకామాక్షీదేవ్యై నమః
  • ఓం మల్లికావనమహారాజ్యై నమః
  • ఓం కుందవనకౌమారీదేవ్యై నమః
  • ఓం కస్తూరీవనకామేశ్వరీదేవ్యై నమః
  • ఓం సాలోక్యముక్తిప్రసాదిన్యై నమః
  • ఓం సారూప్యముక్తిప్రదాయిన్యై నమః
  • ఓం సామీప్యముక్తిదాయిన్యై నమః
  • ఓం సాయుజ్యముక్తిసుప్రసాదిన్యై నమః
  • ఓం ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిరూపిణ్యై నమః
  • ఓం వరాంకుశపాశాభయహస్తాయై నమః
  • ఓం సహస్రకోటిసహస్రవదనాయై నమః
  • ఓం మకరందఘృతాంబుధయే నమః
  • ఓం సహస్రకోటిసహస్రచంద్రసమసుధానేత్రాయై నమః
  • ఓం సహస్రకోటి సహస్ర సూర్యసమాభాసాయై నమః
  • ఓం జరామరణరహితాయై నమః
  • ఓం నారదతుంబురు సకలమునిగణవందితాయై నమః
  • ఓం పంచభూతయజమానస్వరూపిణ్యై నమః
  • ఓం జన్మజన్మాంతరదుఃఖభంజనాయై నమః
  • ఓం లోకరక్షాకృత్యతత్పరాయై నమః
  • ఓం బ్రహ్మవిష్ణు మహేశ్వరకోటివందితాయై నమః
  • ఓం చతుష్షష్టికళాసంపూర్ణస్వరూపిణ్యై నమః
  • ఓం షోడశకళాశక్తిసేనాసమన్వితాయై నమః
  • ఓం సప్తకోటిఘనమంత్రవిద్యాలయాయై నమః
  • ఓం మదనవిఘ్నేశ్వరకుమారమాతృకాయై నమః
  • ఓం కుంకుమశోభితదివ్యవదనాయై నమః
  • ఓం అనంతనక్షత్రగణనాయికాయై నమః
  • ఓం చతుర్ధశభువనకల్పితాయై నమః
  • ఓం సురాధినాథసత్సంగసమాచారకార్యకలాపాయై నమః
  • ఓం అనంగరూపపరిచారికాసేవితాయై నమః
  • ఓం గంధర్వయక్షకిన్నరకింపురుషవందితాయై నమః
  • ఓం సంతాన కల్పవృక్షసముదాయభాసిన్యై నమః
  • ఓం అనంతకోటి బ్రహ్మాండసైనికాధ్యక్ష సేవితాయై నమః
  • ఓం పారిజాత, కదంబవనవిహారిణ్యై నమః
  • ఓం సమస్తదేవీకుటుంబవందితాయై నమః
  • ఓం చతుర్వేదకళాచాతుర్యై నమః
  • ఓం పాపతాప దారిద్ర్యనాశిన్యై నమః
  • ఓం శ్రుతి,స్మృతి,పురాణకావ్యసంరక్షణాయై నమః
  • ఓం పంచబ్రహ్మాసన విరాజితాయై నమః
  • ఓం వజ్రవైడూర్యమరకతమాణిక్యచంద్రకాంతరత్నసింహాసనశోభితాయై నమః
  • ఓం దివ్యాంబరప్రభాదివ్యతేజోవిభాసాయై నమః
  • ఓం పంచముఖసర్వేశ్వరహృదయాధిష్టానాయై నమః
  • ఓం ఆపాదమస్తక నవరత్నసువర్ణాభరణధారిణ్యై నమః
  • ఓం విలాసినీఅఘోరామంగళాసనాపీఠశక్తివందితాయై నమః
  • ఓం క్షమా,దయా,జయా,విజయాపీఠశక్తిపరిపాలితాయై నమః
  • ఓం అజితా,అపరాజితా,నిత్యపీఠశక్తిపరిపూజితాయై నమః
  • ఓం సిద్ధి,బుద్ధి,మేధా,లక్ష్మీ,శృతిపీఠశక్తి సేవితాయై నమః
  • ఓం లజ్జాతుష్టిపుష్టి పీఠశక్తి ప్రభాసితాయై నమః
  • ఓం నవరాత్రదీక్షాప్రియాయై నమః
  • ఓం నామ,గాన,జ్ఞానయజ్ఞప్రియాయై నమః
  • ఓం జపతపోయోగత్యాగసంతుష్టాయై నమః
  • ఓం పంచదశీమహావిద్యాయై నమః
  • ఓం సదాషోడశప్రాయసర్వేశ్వరవల్లభాయై నమః
  • ఓం ఓంకారాక్షర స్వరూపిణ్యై నమః
  • ఓం సకలయంత్రసకలతంత్రసమర్చితాయై నమః
  • ఓం సహస్రయోజనప్రమాణ,చింతామణిగృహవాసిన్యై నమః
  • ఓం మహాదేవసహితశ్రీపరమేశ్వరీదేవ్యై నమః
  • ఓం మణిద్వీపవిరాజితమహాభువనేశ్వరీదేవ్యై నమః

మరిన్ని అష్టోత్తరములు:

Sri Lalitha Moola Mantra Kavacham In Telugu | శ్రీ లలిత మూల మంత్ర కవచం

Sri Lalitha Moola Mantra Kavacham

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాస అన్ని కలిగి స్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించిన చో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… కవచముల గురించి క్లూప్తం గా ఈ క్రింద ఇచ్చిన లింకుల నందు ఇవ్వబడినది. అవి ఏమిటో తెలుసుకుందాం…

శ్రీ లలిత మూల మంత్ర కవచం

అస్యశ్రీలలితాకవచ స్తవరత్న మంత్రస్య ఆనందభైరవ ఋషి, అమృత విరాట్ ఛందః శ్రీ మహాత్రిపురసుందరీ లలితా పరాంబా దేవతా ఐం : బీజం హ్రీం : శక్తిః, శ్రీం : కీలకం” మమ శ్రీలలితాంబా ప్రసాదసిద్ధ్యర్థే శ్రీ లలితాకవచస్తవరత్నం మంత్ర జపే వినియోగః |

  • ఐం – అంగుష్ఠాభ్యాం నమః
  • హ్రీం తర్జనీభ్యాం నమః 
  • శ్రీం – మధ్యమాభ్యాం నమః
  • శ్రీం – అనామికాభ్యాం నమః
  • హ్రీం – కనిష్ఠికాభ్యాం నమః 
  • ఐం – కరతలకరపృష్ఠాభ్యాంనమః
  • ఐం – హృదయాయ నమః
  • హ్రీం – శిరసేస్వాహా నమః
  • శ్రీం – శిఖాయైవషట్ నమః
  • శ్రీం – కవచాయహుం
  • హ్రీం – నేత్రత్రయావౌషట్
  • ఐం – అస్త్రాయ ఫట్
  • భూర్భువస్సువరోమితి దిగ్బంధః||

ధ్యానమ్

శ్రీవిద్యాం పరిపూర్ణ మేరుశిఖరే బిందుత్రికోణే స్థితాం
వాగీశాది సమస్తభూతజననీం మంచే శివాకారకే
కామాక్షీం కరుణా రసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం
కాంతాం చిన్మయకామకోటినిలయాం శ్రీబ్రహ్మవిద్యాం భజే॥

1

పంచపూజాం కృత్వా – యోనిముద్రాం ప్రదర్శ్య
కకారః పాతు శీర్షం మే ఐకారః పాతు ఫాలకం
ఈ కారశ్చక్షుషీ పాతు శ్రోతౌరక్షేల్లకారకః

2

హ్రీంకారః పాతు నాసాగ్రం వక్త్రం వాగ్భవ సంజ్ఞకః
హ కారః పాతు కంఠం మే స కారః స్కంధదేశకం

3

కకారో హృదయం పాతు హకారో జఠరం తథా
అకారో నాభిదేశం తు హ్రీం కారః పాతు గుహ్యకం

4

కామకూటస్సదాపాతు కటిదేశం మమైవతు
సకారః పాతు చోరూమే కకారః పాతు జానునీ

5

లకారః పాతు జంఘేమే హ్రీం కారః పాతుగుల్ఫకౌ
శక్తికూటం సదా పాతు పాదౌ రక్షతు సర్వదా

6

మూలమన్తకృతం చైతత్కవచం యో జపేన్నరః
ప్రత్యహం నియతః ప్రాతస్తస్య లోకా వశంవదాః

7

శ్రీ లలితా మూల మంత్రం కవచమ్ సమాప్తమ్.

లలితార్యా కవచం

ఈలలితార్యా కవచం నిత్యం పఠించేవారికి ఆయురారోగ్యాలు, సకల సంపదలు చేకూరి అమ్మ కరుణ పరిపూర్ణంగా లభిస్తుంది.

అగస్త్య ఉవాచ :

హయగ్రీవ మహాప్రాజ్ఞ మమ జ్ఞానప్రదాయక,
లలితాకవచం బ్రూహి కరుణా మయి చేత్తవ.

హయగ్రీవ ఉవాచ :

నిదానం శ్రేయసామేత ల్లలితావర సంజ్ఞితమ్,
పఠతాం సర్వసిద్ధిస్స్యాత్తదిదం భక్తిత శ్మృణు.

లలితాపాతు శిరోమే లలాటమంబా మధుమతీరూపా,
భ్రూయుగ్మం చ భవానీ పుష్పశరా పాతు లోచనద్వంద్వమ్.

పాయాన్నాసాం బాలా సుభగా దంతాంశ్చ సుందరీజిహ్వామ్,
అధరోష్ఠమాది శక్తిశ్చ క్రేశీపాతుమే సదా చుబుకమ్
కామేశ్వర్యవతు కర్ణా కామాక్షీపాతు మే గండయోర్యుగ్మమ్
శృంగారనాయికాభ్యా వక్త్రం సింహాసనేశ్వర్యవతుగళమ్.

స్కంద ప్రసూశ్చపాతు స్కంధౌ బాహూచ పాటలాంగీమే,
పాణీచ పద్మనిలయా పాయాదనిశం నఖావళిం విజయా.

కోదండినీ చ వక్షః కుక్షింపాయా త్కులాచలాత్మభవా,
కల్యాణీత్వవతు లగ్నం కటించ పాయాత్కలాధర శిఖండా.

ఊరుద్వయం చ పాయా దుమా మృడానీ చ జానునీ రక్షేత్,
జంఘేచ షోడశీమే పాయాత్పాదౌ చ పాశసృణిహస్తా.

ప్రాతః పాతుపరా మాం మధ్యాహ్నే పాతుమాం మణిగృహాంతస్థా,
శర్వాణ్యవతుచసాయం పాయాద్రాత్రేచభైరవీసతతమ్.

భార్యాం రక్షతు గౌరీ పాయాత్సుత్రాంశ్చ బిందుగ్రహపీఠా,
శ్రీవిద్యా చ యశోమే శీలంచావ్యాచ్చిరం మహారాజ్జీ.

పవనమయి పావకమయి క్షోణీమయి వ్యోమమయి కృపీటమయి,
శ్రీమయిశశిమయిరవిమయి సమయమయి ప్రాణమయి శివమయీత్యాది.

కాళీ కపాలినీ శూలినీ భైరవీమాతంగీ పంచమి త్రిపురే,
వాగ్దేవీ వింధ్యవాసినీ బాలే భువనేశి పాలయ చిరంమామ్.

అభినవసింధూరాభా మంబత్వాం చింతయంతి యే హృదయే,
ఉపరినిపతంతి తేషా ముత్పలనయనా కటాక్ష కల్లోలాః

వర్గాష్ట్రపక్షి కాభిర్వశినీ ముఖాభిరధికృతాం భవతీమ్
చింతయతాం పీతవర్ణాం పాపోనిర్యాత్యయత్నతో వదనాత్
కనకలతావదౌరీం కర్ణవ్యాలోల కుండల ద్వితయామ్
ప్రహసితముఖీం భవతీం ధ్యాయంతో యేభవంతి మూర్ధన్యాః

శీర్షాంభోరుహ మధ్యే శీతలపీయూషవర్షిణీం భవతీమ్
అనుదినమనుచింతయతా మాయుష్యం భవతి పుష్కలమవన్యామ్.

మధుస్మితాం మదారుణనయనాం మాతంగకుంభవక్షోజామ్
చంద్రావతంసినీం త్వాం సతతం పశ్యంతి సుకృతినః కేచిత్.

లలితాయాస్త్పవరత్నం లలితపదాభిః ప్రణీతమార్యాభిః
అనుదినమనుచింతయతాం ఫలానివక్తుం ప్రగల్భతే నశివః
పూజాహోమస్తర్పణం స్యా న్మంత్రశక్తిప్రభావతః
పుష్పాజ్యతో యాభావే పి జపమాత్రేణ సిధ్యతి.

ఇతి శ్రీ లలితార్యాకవచస్తోత్రరత్నమ్.

Sri Lalitha Trishati Sthotram In Telugu | శ్రీ లలితా త్రిశతి స్తోత్రం

Sri Lalitha Trishati Sthotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా త్రిశతి స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Sri Lalitha Trishati Sthotram In Telugu

శ్రీ లలితా త్రిశతి స్తోత్రం

అస్యశ్రీలలితా త్రిశతీస్తోత్ర మహామంత్రస్య భగవాన్ హయగ్రీవ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీలలితామహేశ్వరీదేవతా ఐంబీజం సౌఃశక్తిః క్లీం కీలకం మమ చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః ఐమిత్యాది భిరంగన్యాసకరన్యాసాః కార్యాః

ధ్యానమ్

అతిమధురచాపహస్తా మపరిమితామోదబాణ సౌభాగ్యాం
అరుణామతిశయ కరుణా మభినవకుళసుందరీ వందే.

హయగ్రీవ ఉవాచ:

కకార రూపాకల్యాణీ కల్యాణగుణశాలినీ
కల్యాణశైలనిలయా కమనీయా కళావతీ

1

కమలాక్షీ కల్మషఘ్నీ కరుణామృతసాగరః
కదంబకాననావాసా కదంబకుసుమప్రియా

2

కందర్పవిద్యాకందర్ప జనకాపాంగవీక్షణా
కర్పూరవీటీ సౌరభ్యకల్లోలితకకుప్తటా.

3

కలిదోషహరా కంజలోచనా కమ్రవిగ్రహా
కర్మాదిసాక్షిణి కారయిత్రీ కర్మఫలప్రదా.

4

ఏకారరూపా చైకాక్షర్యేకానే కాక్షరాకృతిః
ఏతత్తదిత్యనిర్దేశ్యా చైకానందచిదాకృతిః

5

ఏవమిత్యా గమాబోథ్యా చైకభక్తిమదర్చితా
ఏకాగ్రచిత్త నిర్ధ్యాతా చైషణారహితాదృతా.

6

ఏలాసుగంధిచికురా చైవః కూట వినాశినీ
ఏకభోగా చైకరసా చైకైశ్వర్య ప్రదాయినీ.

7

ఏకాతపత్రసామ్రాజ్యప్రదా చైకాంతపూజితా
ఏధమాన ప్రభాచైజ దనేజజ్జగదీశ్వరీ.

8

ఏకవీరాదిసంసేవ్యా చైకప్రాభవశాలినీ
ఈకారరూపిణీశిత్రీ చేప్సితార్థప్రదాయినీ

9

ఈదృగిత్య వినిర్దేశ్యా చేశ్వరత్వవిధాయినీ
ఈశానాది బ్రహ్మమయీ చేశత్వాద్యష్టసిద్ధిదా.

10

ఈక్షిత్రీక్షణసృష్టాండకోటిరీశ్వరవల్లభా
ఈడితాచేశ్వరార్ధాంగశరీరేశాధిదేవతా.

11

ఈశ్వరప్రేరణకరీ చేశతాండవసాక్షిణీ
ఈశ్వరోత్సంగనిలయా చేతిబాధా వినాశినీ.

12

ఈహారవిరహితా చేశశక్తిరీషత్సితాననా
లకారరూపా లలితా లక్ష్మీవాణీనిషేవితా.

13

లాకినీ లలనారూపా లసద్ధాడిమపాటలా
లలంతికాలసత్ఫాలా లలాటనయనార్చితా.

14

లక్షణోజ్జ్వలదివ్యాంగీ లక్షకోట్యండనాయికా
లక్ష్యార్థ లక్షణాగమ్యా లబ్ధకామాలతాతనుః

15

లలామరాజదళికా లంబముక్తాలాంచితా
లంబోదర ప్రసూర్లభ్యా లజ్జాఢ్యాలయవర్జితా

16

హ్రీంకారరూపాహ్రీంకార నిలయా హ్రీంపదప్రియా
హ్రీంకారబీజా హ్రీంకారమంత్రా హ్రీంకారలక్షణా.

17

హ్రీంకారజపసుప్రీతా హ్రీంమతిః హ్రీంవిభూషణా
హ్రీంశీలా హ్రీంపదారాధ్యా హ్రీంగర్భా హ్రీంపదాభిధా.

18

హ్రీంకారవాచ్యా హ్రీంకార పూజ్యా హ్రీంకారపీఠికా
హ్రీంకారవేద్యా హ్రీంకారచింత్యా హ్రీం హ్రీంశరీరిణీ.

19

హకారరూపా హలధృత్పూజితా హరిణేక్షణా
హరప్రియా హరారాధ్యా హరిబ్రహ్మేంద్రసేవితా

20

హయారూఢా సేవితాంఘ్రర్హయమేధసమర్చితా
హర్యక్షవాహనా హంసవాహనా హతదానవా

21

హత్యాది పాపశమనీ హరిదశ్వాదిసేవితా
హస్తికుంభోత్తుంగకుచా హస్తికృత్తిప్రియాంగనా.

22

హరిద్రాకుంకుమాదిగ్ధా హర్యశ్వాద్యమరార్చితా
హరికేశ సఖీహదివిద్యాహాలా మదాలసా.

23

సకారరూపా సర్వజ్ఞా సర్వేశీ సర్వమంగళా
సర్వకర్తీ సర్వధాత్రీ సర్వహంత్రీ సనాతనీ.

24

సర్వానవద్యా సర్వాంగసుందరీ సర్వసాక్షిణీ
సర్వాత్మికా సర్వసౌఖ్యధాత్రీ సర్వవిమోహినీ

25

సర్వాధారా సర్వగతా సర్వావగుణవర్జితా
ర్వారుణా సర్వమాతా సర్వాభరణభూషితా.

26

కకారార్థః కాలహంత్రీ కామేశీ కామితార్థదా
కామసంజీవినీ కల్యా కఠినస్తనమండలా.

27

కరభోరూః కళానాథముఖీ కచజితాంబుదా
కటాక్షస్యందికరుణా కపాలి ప్రాణనాయికా.

28

కారుణ్యవిగ్రహాకాంతా కాంతిధూతజపావళిః
కలాలాపా కంబుకంఠీ కరనిర్జితపల్లవా.

29

కల్పవల్లీ సమభుజా కస్తూరీతిలకోజ్జ్వలా
హకారార్థాహంసగతిర్హాటకాభరణోజ్జ్వలా.

30

హారహారికుచాభోగాహాకినీ హల్యవర్జితా
హరిత్పతిసమారాధ్యా హఠాత్కారహతాసురా.

31

హర్షప్రదా హవిర్భోక్తీహార్ధసంతమసాపహా
హల్లీ హాలాస్యసంతుష్టా హంసమం త్రార్థరూపిణీ.

32

హానోపాదాననిర్ముక్తా హర్షిణీ హరిసోదరీ
హాహాహూహూ ముఖస్తుత్యా హానివృద్ధివివర్జితా.

33

హయ్యంగవీనహృదయా హరికోపారుణాంశుకా
లకారార్థా లతాపూజ్యా లయస్థిత్యుద్భవేశ్వరీ

34

లాస్యదర్శనసంతుష్టా లాభాలాభవివర్జితా
లంఘ్యేతరాజ్ఞా లావణ్యశాలినీ లఘుసిద్ధిదా.

35

లాక్షారససవర్ణాభా లక్ష్మణాగ్రజపూజితా
లభ్యేతరా లబ్ధశస్తులభా లాంగలాయుథా.

36

లగ్నచామరహస్త శ్రీశారదాపరివీజితా
లజ్జాపదసమారాధ్యా లంపటా లకుళేశ్వరీ.

37

లబ్ధమానా లబ్ధరసా లబ్ధసంపత్సమున్నతిః
హ్రీంకారిణీ హ్రీంకారాదిÍంమథ్యా హ్రీంశిఖామణిః.

38

హ్రీంకారకుణ్ణాగ్ని శిఖా హ్రీంకారశశిచన్టికా
హ్రీంకార భాస్కరరుచిర్హీం కారామ్భోదచంచలా.

39

హ్రీంకారకన్దాంకురితా హ్రీంకారైకపరాయణా
హ్రీంకారదీర్ఘకా హంసీ హ్రీంకారోద్యానకేకినీ.

40

హ్రీంకారారణ్యహరిణీ హ్రీంకారావాలవల్లరీ
హ్రీంకారపంజరశుకీ హ్రీంకారాంగణదీపికా.

41

హ్రీంకార కందరాసింహీ హ్రీంకారాంబుజభృంగికా
హ్రీంకార సుమనోమాధ్వీ హ్రీం కారతరుశారికా.

42

సకారాఖ్యా సమరసా సకలోత్తమసంస్తుతా
సర్వవేదాంతతాత్పర్యభూమిస్సదసదాశ్రయా.

43

సకలాసచ్చిదానన్దా సాధ్వీ సద్గతిదాయినీ
సనకాదిమునిధ్యేయా సదాశివకుంటుంబినీ.

44

సకలాధిష్ఠానరూపా సత్త్వరూపా సమాకృతిః
సర్వప్రపంచనిర్మాత్రీ సమానాధికవర్జితా.

45

సర్వోత్తుంగా సంగహీనా సద్గుణా సకలేష్టదా
కకారిణీకావ్యలోలా కామేశ్వరమనోహరా.

46

కామేశ్వరప్రాణనాడీ కామేశోత్సంగవాసినీ
కామేశ్వరాలింగితాంగీ కామేశ్వరసుఖప్రదా.

47

కామేశ్వరప్రణయినీ కామేశ్వరవిలాసినీ
కామేశ్వరతపస్సిద్ధిః కామేశ్వరమనఃప్రియా

48

కామేశ్వరప్రాణనాథా కామేశ్వరవిమోహినీ
కామేశ్వర బ్రహ్మవిద్యా కామేశ్వరగృహేశ్వరీ.

49

కామేశ్వరాహ్లాదకరీ కామేశ్వరమహేశ్వరీ
కామేశ్వరీ కామకోటినిలయా కాంక్షితార్థదా.

50

లకారిణీ లబ్ధరూపా లబ్ధధీర్లబ్ధవాంఛితా
లబ్ధపాపమనోదూరా లబ్ధహజ్కారదుర్గమా.

51

లబ్ధశక్తిర్లబ్ధదేహో లబ్జెశ్వర్యసమున్నతిః
లబ్ధబుద్ధి ర్లబ్ధలీలా లబ్ధయౌవనశాలినీ.

52

లబ్ధాతిశయసర్వాంగసౌన్దర్యాలబ్ధవిభ్రమా
లబ్ధరాగా లబ్ధగతి ర్లబ్ధనానాగమస్థితిః

53

లబ్ధభోగా లబ్ధసుఖాలబ్ధ హర్షాభిపూజితా
ప్రీజ్కౌరమూర్తిరీజ్కౌరసౌధశృంగకపోతికా.

54

హ్రీజ్కౌరదుగ్ధాబ్ధిసుధా హ్రీజ్కౌరకమలేన్దిరా
హ్రీజ్కౌర మణిదీపార్చిŠజ్కౌర తరుశారికా.

55

హ్రీజ్కౌర పేటకమణిర్రీజ్కౌరాదర్శబిమ్బికా
ప్రీజ్కౌరకోశాసిలతా ప్రీజ్కౌరాస్థాననర్తకీ.

56

ప్రీజ్కౌరశుక్తికాముక్తా మణిగ్రీంకారబోధితా
హ్రీంకారమయసౌవర్ణస్తమ్భవిద్రుమపుత్రికా.

57

హ్రీంకారవేదోపనిషద్ధీంకారాధ్వరదక్షిణా
హ్రీంకార నన్దనారామనవకల్పవల్లరీ.

58

హ్రీంకార హిమవద్గంగా హ్రీంకారార్ణవకౌస్తుభా
హ్రీంకారమన్త సర్వస్వం హ్రీంకారపరసౌఖ్యదా.

59

హయగ్రీవః

ఇతీదం తే మయాఖ్యాతం దివ్యనామ్నాం శతత్రయం
రహస్యాతి రహస్యత్వాద్ధోపనీయం మహామునే.

60

శివవర్ణాని నామాని శ్రీదేవీ కథితాని వై
శక్త్యక్షరాణి నామాని కామేశకథితాని హి.

61

ఉభయాక్షరనామాని హ్యుభాభ్యాం కధితానివై
తదన్యైర్గధితం స్తోత్ర మేతస్య సదృశం కిము

62

నానేన సదృశం స్తోత్రం శ్రీదేవీ ప్రీతిదాయకం
లోకత్రయే2పి కల్యాణం సమ్భవేన్నాత్ర సంశయః

63

సూత:

ఇతి హయముఖగీతం స్తోత్ర రాజం నిశమ్య
ప్రగళితకలుషో౨ భూచ్చిత్తపర్యాప్తిమేత్య
నిజగురుమథ నత్వా కుంభజన్మా తదుక్తేః
పునరధికరహస్యం జ్ఞాతుమేవం జగాద.

64

అగస్త్య:

అశ్వానన మహాభాగ రహస్యమపి మే వద,
శివవర్ణాని కాన్యత్రశక్తివర్ణాని కానిహి
ఉభయోరపి వర్ణాని కాని మే వద దేశిక

65

శ్రీ హయగ్రీవః :

ఇతి పృష్టఃకుమ్భజేన హయగ్రీవో_వదత్పునః

66

తవగోప్యం కిమస్తీహ సాక్షాదంబాకటాక్షతః
ఇదం త్వతిరహస్యం తే వక్ష్యామి శృణు కుంభజ.

67

ఏతద్విజ్ఞానమాత్రేణ శ్రీవిద్యా సిద్ధిదా భవేత్
కత్రయం హద్వయం చైవ శైవోభాగః ప్రకీర్తితః

68

శక్త్యక్షరాణి శేషాణి హ్రీఙ్కార ఉభయాత్మకః
ఏవం విభాగమజ్ఞాత్వా శ్రీవిద్యాజపశీలినః

69

న తేషాం సిద్ధిదా విద్యా కల్పకోటి శతైరపి
చతుర్భిశ్శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిః

70

నవచక్రైస్తు సంసిద్ధిం శ్రీచక్రం శివయోర్వపుః
త్రికోణమష్టకోణం చ దశకోణద్వయం తథా.

71

చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచ వై
బిన్దుశ్చాష్టదళం పద్మం పద్మం షోడశపత్రకమ్.

72

చతురశ్రంచ చత్వారి శివచక్రాణ్యనుక్రమాత్
త్రికోణే బైన్దనం క్లిష్ట మష్టారే ష్టదళాంబుజమ్.

73

దశారయోషోడశారం భూపురం భువనాశ్రకే
శైవానామపి శక్తానాం చక్రాణాంచ పరస్పరమ్.

74

అవినాభావసంబంధం యో జానాతి స చక్రవిత్
త్రికోణరూపిణీ శక్తిర్బిన్దురూపశ్శివస్మృతః

75

అవినాభావసమ్బన్ధస్తస్మాద్బిన్దు త్రికోణయోః
ఏవం విభాగమజ్ఞాత్వా శ్రీచక్రం యస్సమర్చయేత్.

76

న తత్ఫలమవాప్నోతి లలితామ్బా న తుష్యతి
యే చ జానంతి లోకే9_స్మిన్ శ్రీవిద్యాం చక్రవేదినః

77

సామాన్యవేదినస్తే వై విశేషజ్ఞోతిదుర్లభః
స్వయం విద్యావిశేషజ్ఞో విశేషజ్ఞం సమర్చయేత్.

78

తస్తెదేయం తతోగ్రాహ్యం శ్రీవిద్యాచక్రవేదినా
అంధంతమః ప్రవిశంతియే హ్యవిద్మాముపాసతే.

79

ఇతిశ్రుతిరపాహైతానవిద్యోపాసకాన్ పునః
విద్యానుపాసకానేవ నిందత్యారుణికీ శ్రుతిః

80

అశ్రుతాస్సశ్రుతాసశ్చ యజ్వానోయేప్య యజ్వనః
స్వర్యన్తోనాపేక్షంత ఇంద్రమగ్నించ యేవిదుః

81

సికతా ఇవ సంయంతి రశ్మిభిస్సముదీరితాః
అస్మాల్లోకాదముష్మాచ్చేత్యపాహారుణికీ శ్రుతిః

82

యః ప్రాప్తః పృశ్నిభావం వా యది వా శంకరస్స్వయం
తేనైవ లభ్యతే విద్యా శ్రీమత్పంచదశాక్షరీ

83

ఇతి తంత్రేషు బహుథా విద్యాయా మహిమోచ్యతే
మోక్షైక హేతువిద్యా సా శ్రీవిద్యైవ న సంశయః

84

న శీల్పాదిజ్ఞానయుక్తే విద్వచ్ఛబ్దః ప్రయుజ్యతే
మోకైకహేతువిద్యా సా శ్రీవిద్యైవ న సంశయః

85

తస్మా ద్విద్యావిదే దద్యాత్ ఖ్యాపయేత్తద్గుణాస్సుధీః
స్వయం విద్యావిశేషజ్ఞో విద్యామాహాత్మ్య వేద్యపి.

86

విద్యావిద్యం నార్చయేచ్చేత్కోవాతం పూజయే జ్జనః
ప్రసంగాదేవతదుక్తంతే ప్రకృతం శృణు కుంభజ

87

యఃకీర్తయేత్సకృద్భక్త్యా దివ్యాం నామ్నాం శతత్రయం
తస్య పుణ్యఫలం వక్ష్యే విస్తరేణ ఘటోద్భవ.

88

రహస్యనామసాహస్రపాఠే యత్ఫలమీరితం
తత్కోటికోటిగుణిత మేకనామజపాద్భవేత్.

89

కామేశ్వరాభ్యాం తదిదం కృతం నామ శతత్రయం
నాన్యేన తులయేదేతతో త్రేణాన్యకృతేన తు.

90

శ్రీయఃపరంపరా యస్య భావినీతూత్తరోత్తరం
తేనైవ లభ్యతేనామ్నాం త్రిశతీ సర్వకామదా.

91

అస్యానామ్నాం త్రిశత్యాస్తు మహిమాకేన వర్ణ్యతే
యాస్వయం శివయోర్వక్త పద్మాభ్యాం పరినిస్సృతా

92

నిత్యాషోడశి కారూపాన్విప్రానాదౌతు భోజయేత్
అభ్యక్తాన్ గంధతైలేన స్నాతాసుష్టేన వారిణా.

93

అభ్యర్చ్యవస్త్రగంధాద్యైః కామేశ్వర్యాదినామభిః
అవూపైశ్శర్క రాజ్యైశ్చ ఫలైః పుష్పైస్సుగంధిభిః

94

విద్యావిదో విశేషేణ భోజయేత్య్రోడశ ద్విజాన్
ఏవం నిత్యబలిం కుర్యాదాదౌబ్రాహ్మణభోజనే.

95

పశ్చాత్రిశత్యానామ్నాంతు బ్రాహ్మణాన్ క్రమశోర్చయేత్
తైలాభ్యంగాదికం దద్యాద్విభవేసతి భక్తితః

96

శుక్లప్రతిపదారభ్య పౌర్ణమాస్యావధిక్రమాత్
దివసే దివసే విప్రా భోజ్యా వింశతి సంఖ్యయా

97

దశభిః పంచభిర్వాపి త్రిభిరేకేన వాదినైః
త్రింశతష్టిం శతం విప్రాన్ భోజయేత్రిశతం క్రమాత్.

98

ఏవం యః కురుతే భక్త్యా జన్మమధ్యే సకృన్నరః
తస్యైవం సఫలం జన్మముక్తిస్తస్య కరే స్థితా.

99

రహస్యనామసాహసైరర్చనే. ప్యేవమేవహి
ఆదౌ నిత్యబలిం కుర్యాత్పశ్చాద్భాహ్మణభోజనమ్.

100

రహస్యనామసాహస్రమహిమా యో మయోదితః
సశీకరాణురత్రైకనామ్నో మహిమవారిధేః

101

వాగ్దేవీరచితే నామసాహస్రే యద్యదీరితం
తత్తత్ఫలమవాప్నోతి నామ్నో ప్యేకస్య కీర్తనాత్.

102

ఏతదన్యైర్ణపైస్తో త్రైరర్చనైర్యత్ఫలం భవేత్
తత్ఫలం కోటిగుణితం భవేన్నా మశతత్రయాత్.

103

రహస్యనామసాహస్రకోట్యావృత్త్యాస్తు యత్ఫలం
తద్భవేత్కోటి గుణితం నామత్రిశతకీర్తనాత్.

104

వాగ్దేవీరచితే స్తోత్రే తాదృశో మహిమా యది
సాక్షాత్కామేశకామేశీకృతే? స్మిన్ గృహ్యతామితి.

105

సకృత్సంకీర్తనాదేవ నామ్నామస్మిన్ శతత్రయే
భవేచ్చిత్తస్య పర్యాప్తిర్నూ నమన్యానపేక్షిణీ.

106

నజ్ఞాతవ్యమిత స్త్వన్యజ్జగత్సర్వం చ కుంభజ
యద్యత్సాధ్యతమం కార్యం తత్తదర్థమిదం జపేత్.

107

తత్తత్సిద్ధిమవాప్నోతి పశ్చాత్కార్యం పరీక్షయేత్
యేయే ప్రసంగాస్తంత్రేషు తైర్యత్సాధ్యతే ధ్రువమ్.

108

తత్సర్వం సిద్ధ్యతి క్షిప్రం నామత్రిశతకీర్తనాత్
ఆయుష్కరం పుష్టికరం పుత్రదం వశ్యకారకమ్

109

విద్యాప్రదం కీర్తికరం సుకవిత్వ ప్రదాయకం
సర్వసంపత్ప్రదం సర్వభోగదం సర్వసౌఖ్యదమ్.

110

సర్వాభీష్టప్రదం చైవ దేవీనామశతత్రయం
ఏతజ్ఞపపరో భూయా న్నాన్యదిచ్ఛేత్కదాచన.

111

ఏతత్కీర్తనసంతుష్టా శ్రీదేవీ లలితాంబికా
భక్తస్య యద్యదిష్టం స్యాత్తత్తత్పూరయతే ధ్రువమ్.

112

తస్మాత్కుంభోద్భవమునే కీర్తయ త్వమిదం సదా
అపరం కించిదపితే బోద్ధవ్యం నావశిష్యతే

113

ఇతి తే కధితం స్తోత్రం లలితా ప్రీతిదాయకం
నావిద్యావేదినే బ్రూయా న్నాభక్తాయ కదాచన.

114

న శఠాయ న దుష్టాయ నావిశ్వాసాయ కర్హిచిత్
యోబ్రూయాత్రిశతీం నామ్నాం తస్యానర్థో మహాన్భవేత్

115

ఇత్యాజ్ఞాశాంకరీ ప్రోక్తా తస్మాద్ధోప్యమిదం త్వయా
లలితాప్రేరితేనైవ మయోక్తం స్తోత్రముత్తమమ్.

116

రహస్యనామసాహస్రాదతిగోప్య మిదం మునే
ఏవముక్త్వా హయగ్రీవః కుంభజం తాపసోత్తమమ్.

117

స్తోత్రేణానేన లలితాంస్తుత్వా త్రిపురసుందరీమ్
ఆనందలహరీమగ్న మానవసస్స మవర్తత.

118

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, హయగ్రీవాగస్త్య సంవాదే
లలితోపాఖ్యానే, సోత్రఖండే, లలితాంబా త్రిశతీ స్తోత్రరత్నమ్

మరిన్ని స్తోత్రములు:

Manidweepa Varnana In Telugu | మణిద్వీప వర్ణన

మణిద్వీప వర్ణన

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము.  స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Manidweepa Varnana In Telugu Lyrics

మణిద్వీప వర్ణన స్తోత్రం

మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయింది

1

సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబుగు మనో సుఖాలు మణి ద్వీపానికి మహానిధులు

2

లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణి ద్వీపానికి మహానిధులు

3

పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలౌ
గంధర్వాదుల గాన స్వరాలు మణి ద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం

4

పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవునగలవు
మధురమధురమగు చందనసుధలు మణిద్వీపానికి మహానిధులు

5

అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు

6

అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలౌ మణిద్వీపానికి మహానిధులు

7

కోటిసూర్యులుప్రపంచకాంతులు కోటిచంద్రులచల్లనివెలుగులు
కోటితారకల వెలుగుజిలుగులు మణిద్వీపానికి మహానిధులు

8

కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు

9

పంచామృతమయ సరోవరాలు పంచలోహమయప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు

10

ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైఢూర్యాలు
పుష్యరాగమణిప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు

11

సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు

12

||భవ||

మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు

13

కుబేర ఇంద్రవరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు

14

భక్తిజ్ఞాన వైరాగ్యసిద్ధులు పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు

15

కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు

16

మంత్రిణి దండిని శక్తిసేవలు కాళి కరాళి సేనాపతులు
ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు

17

సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మితగుహలు మణిద్వీపానికి మహానిధులు

18

సప్తసముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు

19

మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయాకారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు

20

కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు

21

దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు
దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు

22

శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంతభవనములు
మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు

23

పంచభూతములు యాజమాన్యాలు వ్రాళసాలం అనేక శక్తులు
సంతాన వృక్షసముదాయాలు మణిద్వీపానికి మహానిధులు

24

చింతామణులు నవరాత్రులు నూరామడల వజ్రరాసులు
వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు

25

దుఃఖము తెలియని దేవీ సేవలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు

26

పదనాల్గు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానం

27

చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో

28

మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో

29

పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది

30

||2||

నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు

31

||2||

శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట
తిష్టవేసుకొని కూర్చొనునంటా కోటి శుభాలను సమకూర్చుకొనుటకై
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవల నివాసము అదియే కైవల్యం

32

||భవ||

Gouthamudi Enugu In Telugu – గౌతముడి ఏనుగు

Gouthamudi Enugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గౌతముడి ఏనుగు కథ. 

గౌతముడి ఏనుగు

ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లిలేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. స్వాభావికముగా దయార్ద్రహృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకు వచ్చి పెంచుకున్నాడు. కాలక్రమేణ అది పెరిగి పెద్దదయింది. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగినాడు. గౌతముడు “తల్లీ తండ్రీ లేని ఈ ఏనుగును నా సొంత బిడ్డలా పెంచుకుంటున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది. యజ్ఞాలకు అడివినుంచి దర్భలు సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకు” అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు “నీవు అడిగినన్ని గోవులు కావలిసినంత బంగారము ఇస్తాను. ఈ ఏనుగును నాకు ఇవ్వు” అని అన్నాడు. “రాజా! దీని చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను. నీవు ఎన్ని గోవులిచ్చినా నాకు అక్కరలేదు. మునివేషములో ఉన్న నాకు హిరణ్యముతో అసలు అవసరములేదు” అని బదులిచ్చాడు గౌతముడు.

ధృతరాష్ట్రుడు “మునులకు అవసరమైనవి గోవులుకాని ఏనుగులు కావు. ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా! రాజునైన నేను స్వయముగా వచ్చి ఏనుగును ఇమ్మనినా కాదంటావా?” అని న్యాయం అడిగాడు. అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు “పుణ్యాత్ములు ఆనందించే పాపాత్ములు దుఃఖించే యమలోకానికి వేళదాము రా! యమసభలోనే న్యాయనిర్ణయం జరుగని” అని అన్నాడు.

ధృతరాష్ట్రుడు: “నాస్తికులు పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు ఆ దారుణమైన యమలోకములో. నేను రాను.”

గౌతముడు: “సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాము. అతనే న్యాయం చెప్తాడు.”
ధృతరాష్ట్రుడు: “అక్కాచెళ్ళెళ్ళను తల్లిదండ్రులను దయతో చూసుకునే వారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు. నేను రాలేను.”

గౌతముడు: “అయితే వైకుంఠధామ సమానమైన గంగాతీరానికి వెళదాము. వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అతిథి అభ్యాగతులకు పెట్టి ఆ తరువాత తినే వాళ్ళే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలరు. నేనెందుకు వస్తాను?”

గౌతముడు: “పోని పవిత్రమైన మేరువనానికి రా!”
ధృతరాష్ట్రుడు: “సత్యము దయ మృదువర్తనము భూతదయ ఉన్నవాడే అక్కడికి వెళ్ళగలడు. వేరే చోటు చెప్పు.”

గౌతముడు: “విష్ణుస్వరూపుడైన నారదుని విహారస్థలానికి వెళదాము. పద! అప్సరసలు కిన్నెరులు ఉంటారక్కడ”
ధృతరాష్ట్రుడు: “సంగీత నృత్యాలతో దేవతార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరక్కడికి. నావల్ల కాదు.”

గౌతముడు: “అలాగా! అయితే దేవతలు విహరించే ఉత్తర కురుభూములకు వెళదాం రా!”
ధృతరాష్ట్రుడు: “కామము హింస మొదలైనవి లేని వాళ్ళు అక్కడికి వెళతారు. వచ్చుట నా తరము కాదు.”

గౌతముడు: “అమృతకిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయము చేసే చంద్రుని వద్దకు వెళదాము. సరేనా?”
ధృతరాష్ట్రుడు: “దాననిరతులు పరమ శాంతచిత్తులు అక్కడికి వెళ్ళగలరు. వచ్చుట నాకు సాధ్యము కాదు.”

గౌతముడు: “సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్యభగవానుడు. ఆయన వద్దకు వెళదాము. దయలుదేరు.”
ధృతరాష్ట్రుడు: “అమ్మో! తపస్స్వాధ్యాయనిరతులే ఆయన దర్శనము చేయగలరు. నన్ను విడిచిపెట్టు.”

గౌతముడు: “పోనీ వరుణుడి దగ్గరకు వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు.”

గౌతముడు: “దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్థిద్దాము.”
ధృతరాష్ట్రుడు: “శూరులు సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు. నేను రాను.”

గౌతముడు: “ప్రజాపత్య లోకానికి వెళదాము.”
ధృతరాష్ట్రుడు: “అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళకు స్థానమది.”

గౌతముడు: “గోలోకం?”
ధృతరాష్ట్రుడు: “తీర్థాలు సేవించినవారు బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరెదరు. నేనెలా రాగలను?”

గౌతముడు: “సరే! అయితే బ్రహ్మసభకు వెళదాము రా!”
ధృతరాష్ట్రుడు: “అసంగులు (లౌకిక బంధాలు లేనివారు) ఆధ్యాత్మవిద్య తెలిసిన వారు వెళ్ళగలరు అక్కడికి. నావంటి వాడు ఆ లోకము చూడనే లేడు.”

ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు “మహానుభావా! నీవు దేవేంద్రుడవు. ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవరికి తెలుసు?” అని పాదాభివందనము చేశాడు గౌతముడు. “అయ్యా! నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు. మీరు మహానుభావులు కాబట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగినారు. మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపఱచండి” అని ప్రార్థించాడు దేవేంద్రుడు. సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

ఏ పుణ్యకార్యములు మనము చేయవలెనో తద్వారా ఏ ఏ పాపకార్యములు మనము చేయకూడదో వివరముగా దేవేంద్రుడు మనకు ఈ కథలో బోధించినాడు. (ధృతరాష్ట్రుడు అంటే శరీరమును ధరించినవాడు. అంటే మానవుడు. కాబట్టి మావనుడు ఏ పుణ్యకార్యాలు చేయాలో మనకు ఈ కథలో తెలిసింది) కానీ అందఱూ అన్నీ చేయలేరు. ఉదాహరణకు కలియుగములో అశ్వమేధ రాజసూయ యాగములు చేసే అర్హత మానవులకు లేదు. కాబట్టి అందఱూ చేయదగ్గ పుణ్యకార్యాలు మనము తప్పకుండా చేయాలి: తల్లిదండ్రుల సేవ, అతిథిసేవ, సత్యం, భూతదయ, గీతనృత్యాదులతో దేవతార్చన, దానము, స్వాధ్యాయనము, తీర్థయాత్రలు, బ్రహ్మచర్య పాతివ్రత్యాది వ్రతములు..

మరిన్ని నీతికథలు మీకోసం:

Idanindariki Nelikaivunnadu In Telugu – ఈడనిందరికి నేలికైవున్నాడు

ఈడనిందరికి నేలికైవున్నాడు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఈడనిందరికి నేలికైవున్నాడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఈడనిందరికి నేలికైవున్నాడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన: ఈడనిందరికి నేలికైవున్నాడు
సంఖ్య : 289
పుట: 194
రాగం: శుద్ధవసంతం

శుద్ధవసంతం

43 ఈడ నిందరికి నేలికై వున్నాఁడు
వాడల రేపల్లె వాఁడా వీఁడు

||పల్లవి||

భారపువుట్లపాలుఁ బెరుగులు
వారలు వట్టినవాఁడా వీఁడు
కోరి గొల్లెతల కొలనిలోపల
చీరలు దీసిన శిశువా వీఁడు

||ఈడు||

ఆవులఁ బేయల నందరియిండ్ల
వావిరిఁ గాచిన వాఁడా వీఁడు
వావు లొక్కటిగా వనితలఁ గూడి
వేవేలు నేర్చిన విటుఁడా వీఁడు

||ఈడు||

అరుదై శ్రీవేంకటాద్రిమీఁద నుండి
వరము లిచ్చేటి వాఁడా వీఁడు
మరిగెనలమేల్మంగతో మమ్మేలె
సరసుఁడై వుండే జాణా వీఁడు

||ఈడు||

అవతారిక:

ఈ తిరుమలలో అందరికీ యేలికయైవున్న ఈ భగవానుడూ అలనాడు రేపల్లె వాడలలో అల్లరి కిట్టయ్య ఒక్కరేనా? వాడా వీడు!! అని ఆశ్చర్యపోతున్నారు అన్నమాచార్యులవారు. అలవాటు ప్రకారం (రామకథ కృష్ణ కథ- దశావతారాల కథ చెప్పటం ఆయన మానుకోలేని అలవాటు) కృష్ణ లీలలు గానం చేస్తున్నారు. ఆ రేపల్లె చిత్త్చోరుడే ఈ అలమేల్మంగపతి కూడా. అవునా? ఆ జాణా వీడు… అంటున్నారు. ఎన్నిసార్లు పాడినా తనివి తీరని కృష్ణగానామృతం వినండి.

భావ వివరణ:

ఈడు ఇందరికి యేలిక (ప్రభువై వున్నాడే. ఆనాడు వాడల రేపల్లె వీధులలో తిరిగిన వాడే (ఆ గొల్లపిల్లవాడే), వీడా? అదెలా సాధ్యం?

భారపువుట్ల మీద (బరువైన వుట్లలో వున్న) పాలు పెరుగులు వారలు వట్టినవాడు (ధారలుగా కార్పించి యేడిపించిన ఆ కొంటె కోణంగియేనా) వీడు (ఈ శ్రీవేంకటేశ్వరడు), ఏమిచిత్రం!! కోరి కావలెనని (పొరబాటున కాదు) గోపికల చీరెలను కొలను గట్టున దీసి దాచి వాళ్ళ మానం మంట గలిపిన శిశువు గుర్తున్నాడా? వాడా వీడు!!

బ్రహ్మదేవుడు రేపల్లెలోని ఆవులను పెయ్యలను గోపాలురను మాయంచేస్తే తానే అవన్నీ అయిపోయి రేపల్లెలో ఒక్కరికీ తెలియకుండా నడిపి బ్రహ్మకు బుద్ధివచ్చేట్లు చేసినది ఇతడేనా? ఆ తరువాత ఆ పరమేష్టిని మన్నించి వావిరిగాచిన (ఉత్కృష్టుడై రక్షించిన వాడా, వీడు (ఈ శ్రీనివాసుడు). వావులొక్కటిగా (వావివరుసా లేకుండా) తల్లీకూతుళ్ళిద్దరినీ తన ప్రియురాండ్రను చేసికొన్న, వేవేలు నేర్చిన (అనేక రతిమర్మాలు నేర్చిన) ఆ విటుడా, వీడు (ఈ వేంకటరమణుడు) ఆహా!!

అరుదైన శ్రీవేంకటాద్రిమీద కొలువై వుండి అనేక వరములొసగే ఆ శ్రీవేంకటేశ్వరుడు వీడా (ఈ శ్రీకృష్ణుడా), వీడేనా? మరిగే (అనురాగంతో తలమునకలయ్యే) అలమేల్మంగతో మమ్ము యేలునట్టి సరసుడై వుండే ఆ జాణా (జగజ్జెట్టియా) వీడు (ఈ శ్రీకృష్ణుడు)?

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Draupadi Devi – Adarsha Bharatha Naari In Telugu | ద్రౌపదీ దేవి – ఆదర్శ భారతనారి

Draupadi Devi Adarsha Bharatha Naari

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ద్రౌపదీదేవి – ఆదర్శ భారతనారి నీతికథ.

ద్రౌపదీదేవి – ఆదర్శ భారతనారి

మహాభారత యుద్ధములో సర్వనాశనమైన కౌరవపతి దుర్యోధనుని సంతృప్తి పఱచుటకై అశ్వత్థామ తన స్వభావానికి భిన్నముగా ప్రవర్తించి అతి కిరాతకముగా ఉపపాండవులను (పాండవుల పుత్రులు) నిద్రిస్తుండగా వధించినాడు. ఆ ఘోరకృత్యం తెలుసుకున్న పాండవులు ద్రౌపదీదేవి దుఃఖానికి అంతులేదు. పసిపాపలైన బాలకులను నెత్తుటి మడుగులో చూసిన వారి గుండెలు పగిలినాయి. తన పుత్రులందఱినీ పోగొట్టుకుని విలపిస్తున్న ద్రౌపదీదేవిని ఓదార్చాడు అర్జునుడు. “ఇంత దారుణమైన పనిచేసిన ఆ అశ్వత్థామను నీ వద్దకు లాక్కువస్తాను” అంటూ పాఱిపోతున్న ఆ ద్రౌణి నెలకాల బడ్డాడు అర్జునుడు. శ్రీకృష్ణార్జునుల రథము తనను త్వరిత గతిలో సమీపిస్తున్నదని తెలిసిన అశ్వత్థామ ప్రాణరక్షణకై బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప అన్యమేదీ తనను కాపాడజాలదు అనుకుని రథమాపి శుచి అయ్యి ఆచమించి మంత్ర ప్రయోగము చేశాడు. ప్రళయకాల రుద్రునిలా సమీపించే ఆ బ్రహ్మాస్త్రాన్ని చూసి శ్రీ కృష్ణుడు ప్రతి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయమని ఆజ్ఞాపించాడు.

అర్జునుడు కూడా శుచి అయ్యి ఆచమించి పరమాత్మకు ప్రదక్షిణము చేసి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ ఱెండు అస్త్రాలు సూర్యాగ్నుల వలె ప్రజ్వరిల్లాయి. వాటి ప్రభావము చతుర్దశ భువనాలను దహింపగలదని తెలిసిన శ్రీ కృష్ణుడు ఆ అస్త్రాలను ఉపసంహరించమనినాడు. అస్ఖలిత బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణుని ప్రియమిత్రుడైన అర్జునుడు శాస్త్రకోవిదుడు. అందుకే గృహస్థుడైనా కూడా బ్రహ్మచర్యమును పాలించుటచే ఆ ఱెండు బ్రహ్మాస్త్రాలనూ ఉపసంహరించ గలిగినాడు. అలా లోకాలను తన బ్రహ్మచర్య శక్తితో కాపాడిన అర్జునుడు ఆ అశ్వత్థామను బంధించి ద్రౌపదీదేవి ముందుకు తెచ్చి పడేశాడు. చిన్న పిల్లల ప్రాణాలు తీసిన ఆ అశ్వత్థామ ద్రౌపదిముందు సిగ్గుతో తల ఎత్తలేకపోయాడు. పరాన్ముఖుడైన గురుపుత్రునికి నమస్కరించి సుగుణవతియైన ద్రౌపదీదేవి ఇలా ధర్మ్యభాషణం చేసింది.

“నాయనా! మీ తండ్రిగారైన ద్రోణాచార్యుల వారి వద్ద మా మగవారు విద్యాభ్యాసం చేశారు. పుత్రరూపములో ఉన్న ద్రోణుడవు నీవు. మాకు గురుతుల్యుడవైన నీవు ఇలా నీ శిష్యనందనులను దారుణముగా వధించడం ధర్మమా? తమకి హాని కలిగించినా ఎదుఱుకోలేని పసివాళ్ళను నీకెన్నడూ అపకారము చేయని అందాలు చిందే పాపలను నిదురించి ఉండగా చంపటానికి నీకు చేతులెలా వచ్చాయి? ఓ గురుపుత్రా! ఇక్కడ నేను నా పుత్రులకై ఏడుస్తున్నట్లే అక్కడ నీ తల్లి కృపి నీకోసం ఎంతగా విలపిస్తున్నదో. అర్జునుడు బంధించి తీసుకు పోయాడన్న వార్త వినగానే ఎంత పరితాపమును చెందినదో”. ఇలా అని శ్రీకృష్ణార్జునుల వైపు చూసి

“ద్రోణాచార్యులవారు స్వర్గస్థులైనా ఇతని మీదే ఆశలుపెట్టుకుని జీవిస్తున్నది ఆ సాధ్వి కృపి. నాలాగే పిల్లవాడి కోసం ఎంతో బాధపడుతూ ఉంటుంది. గురుపుత్రుడైన ఈ అశ్వత్థామను వదిలి వేయండి! గురుపుత్రుని వధించుట ధర్మము కాదు” అని అన్నది పరమ పతివ్రత అయిన ద్రౌపదీదేవి.

Draupadi Devi – Adarsa Bharata Naari Story In Telugu

ఈ ప్రకారం ద్రౌపదీదేవి ధర్మసమ్మతంగా దాక్షిణ్యసహితంగా నిష్కపటంగా నిష్పక్షపాతంగా న్యాయంగా ప్రశంసనీయముగా పిలికినది. పాంచాలి మాటలు విని ధర్మనందనుడు ఎంతో సంతోషించాడు. భగవంతుడైన శ్రీ కృష్ణుడు ఆమెను ఎంతగానో పొగిడినాడు. అక్కడ ఉన్న అందఱూ ఆమె మాటలను సమర్థించారు. కానీ భీమసేనుడు “కన్న కొడుకులను క్రూరముగా చంపినవాడు కళ్ళముందున్నా కోపం తెచ్చుకోకుండా విడవ మంటుందేమిటి? స్వాభావికముగా దయ ఉన్నవాడే బ్రాహ్మణుడు కానీ ఇలా ఘోరకృత్యం చేశిన ఈ అశ్వత్థామ క్షమార్హుడు కాదు” అంటూ ఆ అశ్వత్థామ పైకి దూకాడు.

తొందరలో ఏమి చేస్తాడో అని ఆ గురుపుత్రునికి అడ్డంగా నిలబడినది ద్రౌపదీదేవి!! శ్రీ కృష్ణుడు చతుర్భుజుడై ఱెండు చేతులతో భీమసేనుడిని మిగిలిన ఱెంటితో ద్రౌపదిని వారించి ఇలా ధర్మబోధ చేశాడు “శిశుఘాతకుడూ కిరాతకుడూ అయిన ఈ అశ్వత్థామ ముమ్మాటికీ చంపదగిన వాడే. కానీ గురుపుత్రుడు పైగా విప్రుడు అయినందువల్ల వీనిని చంపకుండా శిక్షించాలి. ఒక వీరునికి తలగొఱగటం కన్నా అవమానకరమైనది ఏదీ లేదు. ఈతని శిరోజాలు ఖండిచి అవమానించి పంపుదాం”. అప్పుడు విశ్వమంతా కొనియాడ తగ్గవాడూ వీరాధివీరుడూ అయిన అర్జునుడు ఆ అశ్వత్థామ శిరోజాలు ఖండించి అతని శిరస్సుమీదనున్న దివ్య (జ్ఞాన) మణిని తీసుకుని అవమానించి బయటికి గెంటివేశాడు. అనంతరం చనిపోయిన బంధువులందఱికీ దహన సంస్కారాలు చేశి గంగాతీరములో పొంగిపొఱలే దుఃఖాన్ని దిగమ్రింగుకుని మరణించిన వారికి తిలోదకాలిచ్చారు పాండవులు. తరువాత శ్రీ కృష్ణుడు పాండవులని గాంధారీ ధృతరాష్ట్రులని ఓదార్చినాడు. ఇలా శ్రీ కృష్ణుడు మహాభారత యుద్ధం ద్వారా దుష్టశిక్షణ చేశి భూభారాన్ని దించాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

పుత్రహంతకుడు కళ్ళ ఎదుటికి రాగానే “గురుపుత్ర! నమస్కారం” అని అనగలిగిన ద్రౌపదీదేవి మనస్సు యొక్క సౌందర్యం వర్ణణాతీతం. అంత దుఃఖములో ఉండికూడా ఏది ధర్మం ఏది అధర్మం అని ఆలోచించి మాట్లాడిన ఆమె ధర్మవర్తనం మనకు ఆదర్శప్రాయం. “నా వలె ఆ కృపి పుత్రుని కోసం ఎంతగా ఏడుస్తుందో” అని దయ జాలి కరుణ క్షమ అనే పదాలకు సీమాంతం చూపి మహాపకారికైనా మహోపకారం చేయగల ద్రౌపదీదేవి వంటి ఆదర్శ నారీమణులు పుట్టిన మన భారతదేశం మహోన్నతమైనది.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Parvatheesha Karavalamba Stotram In Telugu – శ్రీ పార్వతీశ కరావలంబ స్తోత్రమ్

Sri Parvatheesha Karavalamba Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ పార్వతీశ కరావలంబ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Parvatheesha Karavalamba Stotram Lyrics Telugu

శ్రీ పార్వతీశ కరావలంబ స్తోత్రమ్

శ్రీమచ్చరాచర జగత్పరిపాలనేశ
శంభో శతానన గుణత్రయ కారణత్వం |
శ్రీద క్షమాసమ సుశాంత సురేంద్రవంద్య
శ్రీ పార్వతీశ మమ దేహి కరావలంబమ్ ||

1

నిత్యానివారిత మహాబల వత్సురౌఘ |
సత్యస్వరూప సదయాప్రతిమ స్వభావ |
నిర్విణ్ణ బుద్ధిరహిత ప్రథితోరుకీర్తే |

||శ్రీ పార్వతీశ॥ 2

పాశాంకుశాభయకర ప్రణతాఘనాశ |
కౌశల్యసంచరిత విశ్వ విశాలఫాల |
త్రైశూల శృంగజిత రాక్షణబృంద శంభో ||

||శ్రీ పార్వతీ|| 3

సర్వాఖు మూషక భుగాదిషు పాపజన్మ|
మ్వత్యంత పాప నిరతస్య చ జన్మనో మే
బాల్యే విశుద్ధ మతిహీన చ కర్తిన శ్చ ||

||శ్రీ పార్వతీశ|| 4

జ్ఞానప్రదిగ్ధ చరణాయుధ సారమేయైః |
బాలై ర్విదగ్ధ హృదయై శ్చ ఫలై శ్చ నాకమ్ |
అజ్ఞానత శ్చపల బాలక చేష్టితస్య ||

||శ్రీ పార్వతీశ॥ 5

మద్దై ర్యభిర్యువతి కాఠినవృత్తవక్షో |
జన్మ ద్వయార్పిత హృద త్తరుణీర తస్య |
తారుణ్యకే వయసి నామ మదాంధదృష్టేః ||

||శ్రీ పార్వతీశ॥ 6

విత్తార్జనే వివిధ పాపవిచార యుక్త
స్యాజ్ఞానబద్ధ హృదయస్య చ దారపుత్రాన్ |
పాతుం ధరాసుర ధన ప్రతిలోభబుద్ధేః ||

||శ్రీ పార్వతీశ|| 7

దారా ఇమే మమసుతాః పశవో మదీయా |
ధ్యానం మదీయ మితి గర్విత మానసస్య |
దుర్వృత్తకృత్య నిరతస్య దురాత్మకస్య ||

||శ్రీ పార్వతీశ|| 8

వృద్ధే వయస్యుత కఫామయ వాతపిత్త |
తృష్ణాదిభి శ్చ రుదత స్స్వకళత్ర పుత్రాన్ |
దేహ్యన్న మంబర మితి ప్రతిపావనస్య ||

||శ్రీ పార్వతీశ|| 9

బాల్యే చ కుందన రతస్య చ యౌవనే తు |
స్త్రీలోలుపస్య గళితస్య జరాంశభాజి |
చింతార తస్య చ విదాపరిహీన బుద్ధేః |

||శ్రీ పార్వతీశ|| 10

కాలే మృతే స్సుత కళత్ర జనై రుదర్భి |
ర్హాహేతి బంధు నవహై రతి దీనవాక్యెః |
దైన్యం గతస్య యమదూత నిపీడితస్య ||

||శ్రీ పార్వతీశ|| 11

ఆగత్యతే యమచరా హ్యతి భీతిరూపాః |
దంష్ట్రా కరాళవదనా ధృత యామ్యదండాః |
మాంభీషయంతి చ తదా పరిపాలకః కో |
విశ్వేశ శర్వ మమ దేహి కరావలంబమ్ ||

||శ్రీ పార్వతీశ|| 12

ఆయాహి పాపనిరతేతి వదంతి యే మాం(తే) |
గళే యమభటా స్తు కఠోరపాశైః |
ధృత్వా కరౌ చ చరణా వశగస్య తేషాం ||

||శ్రీ పార్వతీశ|| 13

జల్పన్ రుదన్ సతి సుతానభివీక్ష్య వక్తుం |
హీనస్య వైధృతిబలేన చ దివ్యనామ |
స్మర్తుం భయేన యమదూత సహానుగస్య

||శ్రీ పార్వతీశ|| 14

నీతస్య తై స్సికత కంటక కుత్సితాశ్మ|
సాంద్రేణ దుష్కృత పదా జలహీన దేశే |
ఛాయా విహీన బహుళా తప తప్తభూమౌ

||శ్రీ పార్వతీశ|| 15

ఆపద్గతస్య చ తదా కృపయా గతస్త్వం |
నాలోచ్య దుర్గుణగణాం స్తవ కింకరస్య |
భీతస్య దూతవశగస్య చ మే దయాళో ||

||శ్రీ పార్వతీశ|| 16

నాస్త్వేవ దార సుత బంధు గణప్రతీకం |
ముక్త్వాగతస్య రవిసూనుపదం తదీయై |
ర్దూతై స్సమానుగమనే వ్యతిభీతిగస్య ||

||శ్రీ పార్వతీశ|| 17

జన్మప్రభృ త్యుత మహాంతి చ దుష్కృతాని |
కృత్వా తు సంస్కృతి నిమిత్త మదాంధకారైః |
నహ్యాత్త మీశ తవనామ మయా కదా పి

||శ్రీ పార్వతీశ|| 18

అవ్యాజ భక్తపరిపాలక దీనబంధో |
స్వామిన్ శివారమణ మే తవ కింకరస్య |
దేహావసాన సమయే తవ నామ దత్వా ||

||శ్రీ పార్వతీశ|| 19

నాస్త్యన్యదైవ వరదో మమ నాస్తి నాస్తి |
తా మంతరేణ గిరిజేశ కృపాసముద్ర |
దత్వా స్మృతిం శుభతరాం తవ నామ్నఏష ||

||శ్రీ పార్వతీశ|| 20

మృత్యు శ్చ సన్నిహిత ఏవ యదా కరో వా |
తం ప్రాప్నుయాం యది తదా స్మృతిహీన చిత్తం |
తస్మిన్ త్సమాగత ఉమాధవ రక్ష మాం త్వం ||

||శ్రీ పార్వతీశ|| 21

పూర్వార్జితై రమిత దుష్కర పాతకౌఘైః |
యత్రాప్నుయాం మృతి మరణ్య వనే పురే వా |
న జ్ఞాయతే యది తదా భవ మే ప్రసన్నః ||

||శ్రీ పార్వతీశ|| 22

శార్దూల సింహ మృగ సర్ప జలాగ్ని వాత |
చోరామయాది మృతి మాప్నువతో హ్యకాలే |
తత్రాగతస్త్వ దమృతాఖ్య మథోపదిశ్య ||

||శ్రీ పార్వతీశ|| 23

శ్రీమన్గిరీశ శశిశేఖర దివ్యమూర్తే |
శ్రీపార్వతీధవ రమాపతి ముఖ్యసేవ్య |
సర్వాంతరాయ హర పాశధర ప్రభో మే ||

||శ్రీ పార్వతీశ|| 24

నిత్యం శివస్య మహత స్తు కరావలంబం
స్తోత్రం మహాగురవరేణ శివంకరేణ
య త్రాతరేవ పరత త్వరవక్త్ర ఏష
స్సర్వా నభీష్ట నిచయాన్ ప్రదదాతి శంభుః ||

||శ్రీ పార్వతీశ|| 25

శ్రీ పార్వతీశస్య కరావలంబ స్తోత్రం పఠే ద్యః ప్రయతః ప్రభాతే|
స్మృతిం తు తస్యాత్ర మృతౌ ప్రదద్యాత్ శ్రీపార్వతీశో హి కరావలంబమ్ ||

ఇతి శ్రీ పార్వతీశ కరావలంబస్తోత్రం

మరిన్ని స్తోత్రములు