కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
భూభారాన్ని తగ్గించడానికి భువిపై అవతరించిన ఆదివిష్ణువే ఈ కృష్ణుడు అని ఆ అవతార విశిష్టతను కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు.
సవరేతిరి అంటే అర్ధరాత్రి అని అర్థం. సిసువు అంటే శిశువు అని అర్థం. కన్నతల్లిదండ్రుల కర్మబంధాలను పటాపంచలు చేశాడట ఆయన. రాకాసి మూకలు అంటే రాక్షసులగుంపు అని అర్థం. ఈ కృష్ణయ్యే కలియుగంలో శ్రీవేంకటాద్రిపై అలమేల్మంగమ్మతో వెలసి నిత్యకళ్యాణాల చక్రవర్తియై శోభలీనుతున్నాడు అంటున్నారు. ‘ఆదికొనుట’ అంటే కన్నువేయటం అని అర్థం.
భావ వివరణ:
ఓ అమ్మలారా! ఈతడే ఆదివిష్ణువట. ఈ మహానుభావుడు, ఆదిగొని (కన్నువేసి… అంటే… నిశ్చయించుకొని) భూభారము నణచినాడమ్మా!
చందురునుదయవేళ (చంద్రుడు వుదయించుచున్న సమయమున) సవరేతిరి కాడ (అర్థరాత్రి తరుణమున) దేవకీదేవి, కందువ బిడ్డ గనెనమ్మా! (సామర్థ్యముగల శిశువునకు జన్మనిచ్చింది. బ్రహ్మాది దేవతలు అప్పుడు పొందుగా (ఉద్ధతితో) ఆ పురిటింటి గుమ్మంలో నిలబడి ఆ బాలుని స్తోత్రించినారోయమ్మా!
అనంతరం వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణుడు వసుదేవుని యెదుట సిసువుగ (శిశువుగా) అవతరించి చెలగీనమ్మా (కనువిందుజేయు చున్నాడమ్మా!) అప్పుడు ఆ యిసుమంత శిశువు ముసిముసినవ్వులు విరజిమ్ముతూ తనను చూడవచ్చిన మునీశ్వరులకు ఇకపై భయమువలదు అని వారికి అభయమునొసగినాడు ఓయమా! ఏమి ఆశ్చర్యము!!
అప్పుడా శిశువు తన కన్నతల్లిదండ్రులకు వారి గతజన్మల పుణ్య విశేషమును వివరించి తను వారి గర్భమున జన్మించిననూ వారి కర్మఫలము వలన తన బాల్యమును జూచు అదృష్టము వారికి లేదనీ, తిరిగి తను పెద్దవాడయ్యాక జీవితాంతము తనతోనే గడుపుదురని వివరించి వారికి కర్మపాశము నుండి విముక్తి కలిగించెను. ఆ బాలుడే అన్ని విధములైన రాకాసి మూకలను చీల్చి చెండాడినాడు. నేడు ఆతడే శ్రీవేంకటాద్రిపై లక్ష్మీదేవితో నుండి, వున్నతముగా పూని నిత్యకళ్యాణములు జరుపుకొంటూ, పరగీనమ్మా! (వెలయుచున్నాడమ్మా!).
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… అహంకారం వివాశహేతువు నీతికథ.
అహంకారం వివాశహేతువు
(ఉద్యోగపర్వంలో కథ యిది. కృష్ణుడు రాయబారానికివచ్చి తను చెప్పవలసిన హితవు చెప్పాడు. అనంతరం ఆ సభలో ఉన్న మహర్షి పరశురాముడు చేసిన హితబోధ)
నాయనా! దుర్యోధనా !
నీకూ, నీ వారికి సర్వప్రపంచానికి మేలుకలిగే విషయం చెపు తున్నాను. ఆవేశపడకుండా సావధానంగా విను.
చాలారోజుల క్రితంమాట.
దంభోద్భవుడు అనే పేరుగల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతనూ పాలించేవాడు. భుజబలంలో పరాక్రమంలో ఆయనకు సాటివచ్చేవారు లేరు ఆ రోజుల్లో. అంతటి మహాయోధు
ఆయనరోజూ ఉదయంలేచి, కాలకృత్యాలు పూర్తికాగానే బాగా అలంకరించుకొని రత్న కిరీటం ధరించి, కోడెత్రాచువంటి కరవాలంచేత బట్టి సభాభవనానికి వచ్చి బంగారుసింహాసనం అధివసించేవాడు.
వంది మాగధులు ఆయన బలపరాక్రమాలను గానం చేస్తూంటే, కోరమీసం మెలి త్రిప్పుతూ ఆనందించేవాడు.
అనంతరం తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ:
ఈ భూలోకంలో ఎవడయినా నాతో యుద్ధం చేయగల మహావీరు డున్నాడా ! గదా, ఖడ్గ ప్రాసాది ఆయుధాలతోకాని, ఆగ్నేయ, వారుణ, వాయవ్యాది అస్త్రాలతోకాని నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు మల్లయుద్ధం చేయగల వీరుడు ఉన్న వాడిని క్షణంలో కడ తేరుస్తాను.
అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగురవేసేవాడు.
ఆయన బలపరాక్రమాలెరిగిన వారెవరూ యుద్ధానికి దిగేవారు కారు.
అంతతో ఆయన అహంకారం నానాటికీ పెరుగుతూ వచ్చింది. నా అంతవాడు లేడనే గర్వంతో అయిన విర్రవీగుతూ తిరుగు తున్నారు.
అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులుకూడా అటువంటి దొరుకుతారుకదా!
వారు రోజూ ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు.
అలా ఉండగా ఒకనాడు ఆయనను చూడడానికి సభాభవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు –
మహారాజా! మీరు నిజంగా మహావీరులే. బలవరా తమ సంపన్నులే.
అయితే
గంధమాదనపర్వతంమీద వర నారాయణులని ఇద్దరు తీవ్రనిష్ఠతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు మూడులోకాలలో లేరని విన్నాము. తమకు కోరికఉంటే వారితో యుద్ధం చేయవచ్చు అన్నారు.
ఆ మాట వినడంతో ఆయన ఆగ్రహంతో కత్తి జళిపించి నేలమీద పాదంతో తొక్కి
ఎంతకావరం ! నన్నుమించిన యోధులా వారు, అంటూ సేనలు సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయలుదేరాడు. గంధమాడన పర్వతం చేరాడు.
ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే తొడగొట్టి యుద్ధానికి పిలిచి, నవ్వుతూ కోరమీసం త్రిప్పాడు.
నర నారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్కారాలు జరుపబోగా :
ఇవన్నీ అనవసరం, యుద్ధం, యుద్ధం అని అట్టహాసం చేశాడు.
అప్పుడు వారు:
ఎవరితోనూ సంబంధంలేకుండా కళ్ళుమూసుకుని యీ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే ముములం. మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు, అన్నారు.
వినలేదు మహారాజు.
యుద్ధం చెయ్యకతప్పదు, అన్నాడు.
అంటూనే బాణం తొడుగుతూంటే చూచిన నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్ల తీసి
ఇదిగో ఈ గడ్డిపరక నీ సేనను నిలబెడుతుంది అని వదిలాడు.
ఆరాజు బాణవర్షం కురిపించాడు. ఆ గడ్డిపరక అన్ని బాణాలనూ ముక్కలు ముక్కలు చేసింది.
రాజుకి తల తిరిగింది.
సేవలు పలాయనం చేస్తున్నాయి
చూసిన రాజుకి గుండె జారింది.
ఆయుధాలన్నీ క్రింద పెట్టి, తలవంచి నర నారాయణుల పాదాల మీద వ్రాలి:
ఆర్యా ! నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయ శ్చిత్తం అయింది, అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు వారు నవ్వుతూ ! మహారాజా
సిరి సంపదలు కలవారు పేద సాదలకు దాన ధర్మాలు చేసి గొప్ప వారు కావాలి.
అలాగే బల పరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారినుండి పజ్జను లను రక్షించడానికి తమశక్తిని వినియోగించాలి. అంతేకాని, అహం కారంతో తిరగరాదు.
ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మవ్యర్థం- అన్నారు.
మహారాజు వారి బోధవిని, ఆనాటినుంచీ అహంకారం విడిచి, అందరి శ్రేయస్సూ దృష్టిలో ఉంచుకొని తన సంపదలను బీదలకు దానం చేస్తూ, తన బలంతో దుర్మార్గులనూ, క్రూరులనూ శిక్షించి, న్యాయమార్గాన సజ్జనసేవచేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు.
కనక, దుర్యోధనా !
అహంకారం, బలగర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి, అన్నాడు పరశురాముడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఉమామహేశ్వరాష్టకమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గాయత్రీ నిత్య పూజా విధానము గురించి తెలుసుకుందాం.
“ఓం జనార్దనాయ నమః” అని కుడి అరచేతితో వక్షస్థలము నదుముకొనవలెను.
“ఓం ఉపేంద్రాయ నమః” అని వ్రేళ్ల కొసలతో శిరమును స్పృశించుకొనవలెను.
“ఓం హరయే నమః” అని కుడి చేతి వ్రేళ్లు చుంచువువలె ముడిచిగాని, విప్పారగా గాని – ఎడమ కుడి భుజములను తాకవలెను. (కొందరు ఎడ మ చేత కుడి మూపును, కుడిచేత ఎడమ మూపును ‘ ఆకారముగా తాకుటయు ప్రచారమున గలదు) పిదప
“శ్రీకృష్ణాయ నమః” అని కొంచెము నీరు ఒక చిన్న పళ్లెరములో విడిచి నమస్కరించుకొనవలెను.
భూశుద్ధి
తదుపరి కాసిని అక్షింతలు చేతబట్టుకుని
శ్లో॥ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః
ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
అని చెప్పుకుని, ఆ అక్షతలు వాసనచూసి వెనుక వైపునకు వేసుకొన వలెను.
నీరు చిలికి –
ఆ పదార్ధములచుట్టూ ఔపోసనవిధిగా
1. ఓం ప్రాణాయస్వాహా,
2. ఓం అపానాయస్వాహా
3. ఓం వ్యానాయ స్వాహా
4. ఓం ఉదానాయ స్వాహా
5. ఓం సమానాయ స్వాహా అని చెప్పు చూ
5 పర్యాయములు నివేదనమును గాయత్రీ దేవికి కైవోలు చేయవలెను. పిదప –
“మధ్యే మధ్యే పానీయం సమర్పయామి” అని – ఒకటి, రెండు చుక్క ల నీరును పదార్థములపై ప్రోక్షించవలెను.
తదనంతరం –
“ఉత్తరాపోశనం సమర్పయామి” అని ఒకమారు
“హస్తా ప్రక్షాళయామి” అని యొకమారు
“పాదౌ ప్రక్షాళయామి” అని యొకమారు
“శుద్ధాచమనీయం సమర్పయామి” అని యింకొక మారునూ వెరసి నా లుగు పర్యాయాలు నీరు సమర్పించాలి.
“కర్పూర నీరాజనానంతరం పునః శుద్ధాచమనీయం సమర్పయామి” అనుచూ – పువ్వుతో ఒక బొట్టు నీరును అమ్మవారి వద్ద ఉంచాలి. అనంతరం కొన్ని అక్షతలూ, పువ్వులూ, చిల్లర డబ్బులూ చేతితో పట్టు కుని సువర్ణ మంత్ర పుష్పమును పఠించవలెను.
కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో శ్రీ వేంకటేశ్వరుడు శ్రీయలమేల్మంగతోడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
శ్రీ వేంకటేశ్వరుడు శ్రీయలమేల్మంగతోడ – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 14
కీర్తన : శ్రీ వేంకటేశ్వరుడు శ్రీయలమేల్మంగతోడ
సంఖ్య : 240
పుట 150
రాగం: సాళంగనాట
‘కోడతిరుణాళ్ళు’ అంటే వసంతోత్సవ అని అర్థం. శ్రీవేంకటేశ్వరుడూ ఆయన దేవేరి అలమేల్మంగ వసంతోత్సవంలో పాలుపంచుకొంటున్నారట. ఆ దృశ్యాన్ని కళ్ళకు కట్టిస్తున్నారు అన్నమాచార్యులవారు. స్వామి వసంతాలు చల్లుటయేకాదు శృంగారవనంలో కోవిదుడై విహరిస్తున్నాడట. అంటే ఆరితేరినవాడై వసంతాలాడుతూ విహరిస్తున్నాడన్నమాట. అసంఖ్యాకమైన సుందరాంగులతో ఆ శ్రీవేంకటేశ్వరుడు కోరికలు వెదచల్లే కోడతిరునాళ్ళు ఆడుతున్నాడట. ‘కప్రము’ అంటే కర్పూరము అని అర్థం. పన్నీరు కర్పూరము బాగా కలిపి తలమీద పోసేవారట ఆ రోజుల్లో.
భావ వివరణ:
శ్రీవేంకటేశ్వరుడు శృంగారపురుషుడు. తన దేవేరి అలమేల్మంగతో ఆయన కోవిదుడై (ఆరితేరిన నేర్పరివలె) కోడతిరుణాళ్ళు (వసంతోత్సవము) జరుపుకొంటూ విహరించీ (విహరించుచున్నాడు.). ఆ వైనం తిలకించండి.
ఆ తిరువీధులలో వెన్నెల వెల్లివిరిసి కాస్తున్నది. ఎవ్వరూ చల్లకనే పూవులవాన జడి (జల్లు) లాగా కురుస్తున్నది. ఆ వసంతోత్సవంలో పాల్గొంటున్న స్త్రీలందరూ తనను వుగ్గిళించి పొగడగా (తన పక్షాన ఉత్తేజ పరుస్తూ పొగుడుతుంటే) ఆ దేవదేవుడు ఆమె వలపులను కొల్లలాడీ (అపహరించాడు). స్వామి కోడతిరుణాళ్ళు అంత చూడ ముచ్చటగా వున్నది.
కొంతమంది అక్కడ ఆడుతున్నారు (నృత్యం చేస్తున్నారు). కొంతమంది మధురంగా గానం ఆలపిస్తున్నారు. వారు అండనే (ఇంటిలోనే) వున్నారు, మరి అంత జోరుగా వసంతాలాడితే ఆలిసిపోయి ఆకలివేస్తుంది కదా! స్వామి అప్పుడు పాటించి (ఆదర పూర్వకంగా కాసేపు విశ్రాంతినిచ్చి పైపై ఆరగింపులు (తేలికపాటి ఆహారం) తీసికొనినాడు. గాటముగా (అధికముగా) వీడెములు తాంబూలములను స్వీకరించాడు. గంధము పూతలు గ్రహించాడు. కోటి భోగాలు (అసంఖ్యాకమైన భోగములను) భోగించాడు. ఆ వసంతోత్సవం కన్నుల పండువగా వున్నది.
ఆహా!! ఎంత అద్భుతమైన దృశ్యమది!! వారి (స్వామివారు ఆయన దేవేరి) శిరసున (తలలమీద) చేరి (స్త్రీలందరూ కలిసి) పన్నీటిలో కలిపిన కప్రము (కర్పూరమును) గులకగా (కుమ్మరించగా వీరంతా స్వామివారి కొలువుకూటమిలో చేరారు. ఈ విధంగా శ్రీవేంకటేశ్వరుడు ఇంతమంది సతులగూడి (సుందరాంగులతో కూడి) వసంతాలాడుతుంటే స్వామిపై కోరిక కలుగనిదెవరికి చెప్పండి. ఆ విధంగా ఆ మనోహరుడు కోరికలు వెదచల్లుతుండే కోడతిరుణాళ్లు ఆడుతున్నాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సూర్య సహస్రనామావళిఃగురించి తెలుసుకుందాం…
కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో నాలం వా తవ నయవచనం కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
జయదేవకవి స్ఫూర్తితో చాలామంది గీర్వాణలో శృంగార కీర్తనలు రచించారు. అన్నమాచార్యులవారు సాళ్వ నరసింహరాయలు కొలువులో వున్నప్పుడూ అసంఖ్యాకమైన సరసశృంగార కీర్తనలు చెప్పారు వేంకట మకుటంతో రాజుగారి ఆస్థానంలో విద్వత్ గోష్ఠులు జరిగే తరుణంలో పాండితీ ప్రదర్శనకు కవులు సంస్కృతంలో కవిత్వం చెప్పేవారేమో అనిపిస్తుంది. ఈ కీర్తనలో నిందాస్తుతిని ఇతివృత్తంగా యెన్నుకొన్నారు. నాయిక విర హెూత్కంఠితయై స్వామిని నిందిస్తున్నది. దెప్పి పొడుస్తున్నది. చివరికి రాజీకి రాక తప్పలేదు. నీవు నా ప్రియుడివైతే నేనూ శోభిస్తాను కదయ్యా! అంటున్నది.
భావ వివరణ:
నీయొక్క నయవంచనతో కూడిన మాటలు ఇక చాలించవయ్యా! ముందు నా పైట కొంగును విడిచిపెట్టు. నీదాసినౌదునులే. నన్ను వదలిపెట్టు.
ఓ కులిశహృదయా! (కఠినహృదయుడా! నీకు నాతో పొత్తు యెందులకు? చాలు చాలు. పో పొమ్ము. ఓ బహుగుణ విభవా! (అనేక గుణములు పుణికి పుచ్చుకున్నవాడా!) చాలు చాలు పో పో. నేను పులకించిన గాత్రము (శరీరం) వలన పొందిన వేదన యొక్క మాలిన్యమును ధరించియున్నాను. ఇక నా అహమును విడనాడి నీకు వశమైతిని.
నీవు యెల్లప్పుడూ నీ వలపుకత్తెనే స్మరిస్తుంటావు. నీవు గొప్పవాడివి కదా! గొప్పవాళ్ళకి స్త్రీ వ్యసనం సహజమేలే. పైగా నీవు బ్రహ్మానందానికి నిలయుడవట కదా! నీ భుజములపై రతికూటముల చిహ్నములు కొట్టవచ్చినట్లు కనబడుతూనే వున్నాయి కదా! పోనీలే. నీకు అంతా విజయమేలే. నా తిప్పలు నీకెందుకు పట్టాయి గనుకా!
నన్ను బుజ్జగించే విధానమును కూడా కాస్త నీవు తెలుసుకోకూడదటయ్యా! నీ ప్రియకాంతకే నీవలపులనందించుకో. మధ్యలో నిన్ను కాదన్న వాళ్ళెవరు? నాకేమి పట్టింది? భయహరుడవైన ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు నా ప్రియుడవైనచో నేను కూడా శోభించెదను కదా! స్వామీ!
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి బ్రతుకు బాటలుగురించి తెలుసుకుందాం…
Sai Bratuku Batalu Telugu
సాయి బ్రతుకు బాటలు
లక్ష్య సాధనతో విద్య లక్షితముగ
తలచిన గురిని సాధించ వలయు నెపుడు
లక్ష్య సిద్దియే లేకున్న లక్ష్య పెట్ట
రెవరు వారి బ్రతుకులనీ ఇలను సాయి
1
నింగి చూసి భ్రమించెడు నీలి తెరలు
కొండ తోను పందెము గాసి కుప్పగూలు
తల్లి ఒడిని మరచినట్టి తనయులెల్ల
ఎంత ఎదిగి పోయిన లాభమేమి సాయి
2
నీవు పెంచిన తోటకు నీరు లేక
కలుపు మొక్కలు పెరుగుచు కలత పెట్టె
ముళ్ళతో నిండె నీ వనములిట నేరి
వేయ దయతోడ నిలువుము ప్రేమ సాయి
3
తెల్లనగు కాగితాలపై నల్ల రాత
జీవితమ్మన రంగు పేజీలు గావు
నడుమ వచ్చిన అమృతంపు నాణ్యతయును
వ్యర్థమే కాద యోచింపవలయు సాయి
4
సాగ నది వోలె జీవిక సాగి పోవ
మధ్యలో దూరు మాయని మచ్చ ఝరులు
మాటి మాటికి మాయచే మరియు మారె
మాయ వల నుండి కాపాడు మమ్ము సాయి
5
నడిమి సంద్రము నందున్న నావ మేము
మధ్య తరగతి బ్రతుకులు మమ్ము గాంచు
కష్ట సుఖముల చుట్టాలు కనుల ముందు
అలల మాదిరి ఎదురుగ నయ్యె సాయి.
6
ఆపి ఏ రాగ మనెద నేను
ఆకలియను నీ రాగమునాలపించ
ఇప్పుడే పుట్టిన పసికందేని చూడ
కాటికేగెడు ముసలి రాగమిది సాయి
7
విర్ర వీగుట తప్ప వివేకి ఎవరు
తాను ముందనుచు జనుడు తలచునెపుడు
సకల జీవులన్ని తెలివి చాలవనెడు
మతులు చెడ్డ ఈ భ్రమలను మార్చు సాయి
8
కడుపు తిప్పలుతో జీవ కణిక లిచట
అలమటించు చుండెను దేవ ఆలకించు
ఆకలి కలి పిశాచమై అరయు చుండ
ఆపకుండ నీ కరుణను చూపు సాయి
9
చదువులమ్మకు యిష్టమౌ చంటి పాప
మట్టి నిండిన మెదడుకు మనసు గూర్చి
అక్షరముల తోడనె లోకమంత వెలుగు
చిలుకరించెడు గురువులు చేరు సాయి
10
కలమునే ఆయుధమ్ముగ కనుల జూచి
పదములన్నియు నొకటిగా పదిల పరచి
నీతి విలువ చాటుచు అవినీతినణచి
చదువులమ్మ బిడ్డ కవిని సాకు సాయి
11
ఉన్న ఊరి దొరతనమ్ము ఉచ్చుపన్ని
చేత గాని వారిని చేసి చిదిమివేయ
ఆలు బిడ్డల తలిదండ్రులాత్మ మరచి
వెడలు జనముల కరుణించు ప్రీతి సాయి
12
ఏమిటి మరి చిత్రమ్మేది ఎరుక రాక
అడుగు చుంటిని చెప్ప రావయ్య ఇప్పుడు
ముందు చూడు నీయాలయ మందు చూడు
వరుస గూర్చుండిరీ ముష్టి వారు సాయి
13
పనుకు బట్టెను ఫలములు పసరు లేక
పాహియనుచిల దరి చేరె పసరు కోరి
కనికరమ్మును పూనుచు గాంచవయ్య
ప్రేమ మూర్తివి నీవు మా ప్రీతి సాయి
14
ఎండమావి బ్రతుకు దూరమెంత యున్న
నీడ పట్టు కుదురుగ నిలిచి యుండు
మగని బ్రతుకును వలచిన మగువతీరు
ఇలకు ఈ జంటయే శోభ నిచ్చు సాయి
15
తెలివి యున్నను జనులకు తెల్ల మొహము
చదువులెన్ని యున్నను వీరి చవట బుద్ధి
విందు ముందరున్నను రుచి విధమెరుగదు
నీవు మార్చగ ఇటు రమ్ము నియతి సాయి
16
పల్లె పల్లె నీరాకకై పరితపించె
వానదేవుడ కరుణించి వరములిమ్ము
బ్రతుకులన్ని వాడక ముందు వాన నొసగి
మాకు దిక్కువై నిలిచిపో మాదు సాయి
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ హనుమాన్ బడబానలా స్తోత్రం గురించి తెలుసుకుందాం…