Sai Baba Pooja Vidhanam In Telugu – సాయిబాబా పూజా విధానం

Sai Baba Pooja Vidhanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.

సాయిబాబా పూజా విధానం

పూజా విధానము

శ్రీ మహా గణాపతయే నమః, శ్రీగురుభ్యోనమః, అపవిత్రః పవిత్రోవా సర్వావస్థామ్ గతోపివా. యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష (నీరు శిరస్సున చల్లుకొనవలెను.)

ఆచమనము

ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా. (ప్రతిసారి ఉద్ధరిణతో నీరు తీసుకొని త్రాగవలెను. నమస్కారము చేస్తూ ఈ క్రింది విధంగా చదవండి.)

ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః

ఉత్తిష్ఠన్తు భూత పిశాచ, ఏతే భూమి భారకాః,
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.
(అక్షతలుగాని నీరుగాని ఎడమవైపు వెనుకకు చల్లవలెను.)

ఆచమ్య ప్రాణానాయమ్య. ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం తత్సవితుర్వ రేణ్యం ఓం తపః ఓగ్ంసత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి, ధి యోయోనః ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భవస్సువ రోం దురితక్షయద్వారా శ్రీసాయినాథ ప్రీత్యర్ధం…

సంకల్పము

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీసాయినాథ మద్దిశ్య, శ్రీసాయినాథ ప్రీత్యర్థం. శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రాహ్మణః, ద్వితీయపరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పా దే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు వ్యప్రదేశే కృష్ణా గోదావరోర్మధ్యప్రదేశే సమస్త దేవతా హరిహర గురు చరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాన్ద్రమానేన… నామసంవత్సరే . యినే… ఋతౌ.. మాసే… పక్షే… తిధౌ… వాసరే… శుభనక్షత్రే శుభయోగే శుభ కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్… గోత్రః … నామ ధేయః ధర్మపత్నీ సమేతః మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వ రప్రీత్యర్థం – అస్మాకం సహాకుటుంబానాం క్షేమస్థైర్య, విజయధైర్య, అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థమ్ – ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీసాయినాథ (ఇష్టదేవతా ప్రీత్యర్థం యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే (ఉదకమును తాకవలెను.)

కలశారాధన

తదంగ కలశారాధనం కరిష్యే
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః
మూలేతత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్స ర్వే సప్తద్వీపా వసుంధరా.
ఋగ్వేదోఽధయజుర్వేదస్సామవేదోహ్యధర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేఽస్మిన్ సన్నింధింకురు.
కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య – దేవం – ఆత్మానం – సంప్రోక్ష్య (పువ్వుతోగాని,తమలపాకుతోగాని, కలశములో నీరు పూజాద్రవ్యముల మీదను – దేవుని మీదను చల్లుకొనవలెను.)

అథాంగపూజా

ఓం షిరిడీశ్వరాయ నమః పాదౌ పూజయామి
ఓం ద్వారకామాయివాసాయ నమః గుల్ఫౌ పూజయామి
ఓం భక్తవత్సలాయ నమః జంఘే పూజయామి
ఓం పత్రిగ్రామోద్భవాయ నమః జానునీ పూజయామి
ఓం సమాధి స్వరూపాయ నమః ఊరూ పూజయామి
ఓం చావిడీ నివాసాయ నమః కటిం పూజయామి
ఓం నింబవృక్ష స్వరూపాయ నమః ఉదరం పూజయామి
ఓం భక్తవశ్యాయ నమః వక్షస్థలం పూజయామి
ఓం అభయహస్తాయ నమః బాహూన్ పూజయామి
ఓం జ్ఞానప్రదాయ నమః కంఠం పూజయామి
ఓం సర్వమతసమ్మతాయ నమః వక్త్రం పూజయామి
ఓం వెంకూసామనోల్లాసాయ నమః దంతాన్ఫూజయామి
ఓం సర్వాంతర్యామినే నమః నాసికాం పూజయామి
ఓం సూర్య చంద్రాక్షాయ నమః నేత్రా పూజయామి
ఓం శ్యామ హృదయ నివాసాయ నమః శిరః పూజయామి
ఓం సాయిరామాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

షోడశోపచార పూజ

శ్రీసాయినాధపరబ్రహ్మణేనమః ఆసనం సమర్పయామి
(సాయినాథుని ఆవాహనము చేసి పూజించాలి. అక్షతలుంచాలి)
పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోరర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి
(ఉదకము సమర్పించాలి)
సువర్ణ వస్త్రయుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీగంథంధారయామి (అక్షతలతో పూజచేయాలి )

మరిన్ని పూజా విధానాలు:

Varalakshmi Vratha Katha In Telugu | వరలక్ష్మీ వ్రత కథ

Varalakshmi Vratha Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం స్త్రీలకు అత్యంత విశిష్ట మైన రోజు. ఈ రోజు ఆచరించే వరలక్ష్మీ వ్రతం స్త్రీలకు ఐదవతనాన్ని, అష్టైశ్వర్యాలను కలగజేస్తుందని నమ్ముతారు. ముత్తయిదువులు శుక్రవారం తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి పూజామందిరాన్ని అలంకరించుకొని కలశం పెట్టి ఈ వ్రతం ఆచరిస్తారు. శ్రావణమాసంలో ఈవ్రతం ఆచరించడంవలన తమ కోరికలు నెరవేరతాయని స్త్రీలు నమ్ముతారు. ఇంతటి పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రత కథ మీకోసం…

వ్రత పూర్వ వృత్తాంతం

శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం చేసుకునే వ్రతాన్నే వరలక్ష్మీ వ్రతమని అంటారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు పాచికలాడారు.ఆ ఆటలో పార్వతి ఓడిపోయింది దానితో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వాదులాడుకున్నారు. ఈ వాదాన్ని పరిష్కరించమని పార్వతీ పరమేశ్వరులు చిత్రనేమిని కోరారు. ఇరువురి వాదనలూ విన్న చిత్రనేమి పరమేశ్వరుడు గెలిచాడని చెప్పాడు. దానితో పార్వతీదేవి ఆగ్రహించి చిత్రనేమికి కుష్టు రోగం ప్రాప్తించేటట్లు శపించింది… చిత్రనేమి పార్వతీదేవిని దీనంగా ప్రార్థించి శాప విమోచనం కలిగించమని అడిగాడు. వరలక్ష్మీ వ్రతమును శ్రావణ పూర్ణిమ నాటి శుక్రవారం చేసినట్టయితే నీ రోగం పోతుందని పార్వతీదేవి శాపవిమోచనం తెలియజేసింది. చిత్రనేమి ఆ విధంగా శుక్రవారం వ్రతమును ఆచరించి మేలు పొందాడు. ఈ వరలక్ష్మీ వ్రతమును పార్వతీదేవి కూడా ఆచరించగా కుమార స్వామి జన్మించాడు. నందుడు, విక్రమార్కుడు ఈ వ్రతమును చేసి రాజ్యాలను పొందారని చెబుతారు. ఇది స్థూలంగా వరలక్ష్మీ వ్రతం పూర్వ చరిత్ర.

శ్రీ వరలక్ష్మీ వ్రత కథా ప్రారంభం

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు మునులరా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి “నాథా! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి” అని అడిగింది. అందుకా త్రినేత్రుడు “దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారంనాడు ఆచరించాలి.” అని చెప్పాడు. అప్పుడు పార్వతీ దేవి “దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు. ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. “కాత్యాయనీ! పూర్వకాలంలో మగధ దేశంలో విష్ణుకుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆపట్టణంలో చారుమతి అనే ఒక బ్రహ్మణ స్త్రీ ఉండేది. అమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాత: కాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాత:కాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలో చారుమతికి కలలో సాక్షాత్కారించింది. “ఓ చారుమతీ.. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలు ఇస్తానని” చెప్పి అంతర్థానమైంది. చారుమతి చాలా సంతోషించింది. “హే జననీ! నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్నలను పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది.” అని పరిపరివిధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియచెప్పింది. వారు చాలా సంతోషించి, చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహనికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపం పై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పవిధులతో “సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే” అంటూ ఆహ్వానించి ప్రతిష్టించుకన్నారు. (శక్తి కొలదీ బంగారు, వెండి, రాగి, మట్టి మూర్తులను ప్రతిష్టించుకోవచ్చు) అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.

ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును జేయవచ్చును. అట్లు చేసినచో సర్వసౌభాగ్యములును కలిగి సుఖముగానుందురు. ఈ కథను వినువారలకు, చదువువారలకు వరలక్ష్మీ వ్రత ప్రసాదము వలన సకల సుఖములు
కలుగును.

మరిన్ని వ్రతాలు:

Achyutashtakam In Telugu- అచ్యుతాష్టకమ్

Achyutashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు అచ్యుతాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Achyutashtakam Lyrics Telugu

అచ్యుతాష్టకమ్

అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్,
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే.

1

అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికారాధితమ్,
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే.

2

విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీరాగిణే జానకీజానయే,
వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే
కంసవిధ్వంసినే వంశినే తే నమః.

3

కృష్ణ ! గోవింద ! హేరామ ! నారాయణ !
శ్రీపతే ! వాసుదేవాజిత ! శ్రీనిధే !
అచ్యుతానంత ! హే మాధవాధోక్షజ !
ద్వారకానాయక ! ద్రౌపదీరక్షక !

4

రాక్షసక్షోభితః సీతయా శోభితో
దండకారణ్య భూపుణ్యతాకారణః,
లక్ష్మణేనాన్వితో వానరైః సేవితో
గస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్.

5

ధేను కారిష్టకృద్ ద్వేషిహా
కేశిహా కంసహృద్వంశికావాదకః,
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా.

6

విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం
ప్రావృడంభోదవత్రోల్లసద్విగ్రహమ్,
వన్యయా మాలయా శోభితోరఃస్థలం
లోహితాంఘ్రద్వయం వారిజాక్షం భజే.

7

కుంచితైః కుంతలైః భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్కుండలం గండయోః
హారకేయూరకం కంకణప్రోజ్జ్వలం
కింకిణీమంజులం శ్యామలం తం భజే.

8

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషస్సస్పృహమ్,
వృత్తతః సుందరం కర్తృవిశ్వంభర
స్తస్యవశ్యో హరిర్జాయతే సత్వరమ్.

ఇతి శ్రీ మచ్ఛంకరాచార్యకృతమచ్యుతాష్టకం సంపూర్ణమ్

మరిన్ని అష్టకములు

Sri Raghavendra Ashtottara Shathanamavali In Telugu | శ్రీ రాఘవేంద్ర అష్టోత్తర శతనామావళి

Sri Raghavendra Ashtottara Shathanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ రాఘవేంద్ర అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం…

Sri Raghavendra Ashtottara Shathanamavali In Telugu Lyrics

శ్రీ రాఘవేంద్ర అష్టోత్తర శతనామావళి

  • ఓం స్వవాగ్దేవతా సరిద్భక్తవిమలీకర్తే నమః |
  • ఓం శ్రీరాఘవేంద్రాయ నమః |
  • ఓం సకలప్రదాత్రే నమః |
  • ఓం క్షమా సురేంద్రాయ నమః |
  • ఓం స్వపాదభక్తపాపాద్రిభేదనదృష్టివజ్రాయ నమః |
  • ఓం హరిపాదపద్మనిషేవణాల్లబ్ధసర్వసంపదే నమః |
  • ఓం దేవస్వభావాయ నమః |
  • ఓం దివిజద్రుమాయ నమః | [ఇష్టప్రదాత్రే]
  • ఓం భవ్యస్వరూపాయ నమః |
  • ఓం సుఖధైర్యశాలినే నమః |
  • ఓం దుష్టగ్రహనిగ్రహకర్తే నమః |
  • ఓం దుస్తీర్ణోపప్లవసింధుసేతవే నమః |
  • ఓం విద్వత్పరిజ్ఞేయమహావిశేషాయ నమః |
  • ఓం సంతానప్రదాయకాయ నమః |
  • ఓం తాపత్రయవినాశకాయ నమః |
  • ఓం చక్షుప్రదాయకాయ నమః |
  • ఓం హరిచరణసరోజరజోభూషితాయ నమః |
  • ఓం దురితకాననదావభూతాయ నమః |
  • ఓం సర్వతంత్రస్వతంత్రాయ నమః |
  • ఓం శ్రీమధ్వమతవర్ధనాయ నమః |
  • ఓం సతతసన్నిహితాశేషదేవతాసముదాయాయ నమః |
  • ఓం శ్రీసుధీంద్రవరపుత్రకాయ నమః |
  • ఓం శ్రీవైష్ణవసిద్ధాంతప్రతిష్ఠాపకాయ నమః |
  • ఓం యతికులతిలకాయ నమః |
  • ఓం జ్ఞానభక్త్యాయురారోగ్య సుపుత్రాదివర్ధనాయ నమః |
  • ఓం ప్రతివాదిమాతంగ కంఠీరవాయ నమః |
  • ఓం సర్వవిద్యాప్రవీణాయ నమః |
  • ఓం దయాదాక్షిణ్యవైరాగ్యశాలినే నమః |
  • ఓం రామపాదాంబుజాసక్తాయ నమః |
  • ఓం రామదాసపదాసక్తాయ నమః |
  • ఓం రామకథాసక్తాయ నమః |
  • ఓం దుర్వాదిద్వాంతరవయే నమః |
  • ఓం వైష్ణవేందీవరేందవే నమః |
  • ఓం శాపానుగ్రహశక్తాయ నమః |
  • ఓం అగమ్యమహిమ్నే నమః |
  • ఓం మహాయశసే నమః |
  • ఓం శ్రీమధ్వమతదుగ్గాబ్ధిచంద్రమసే నమః |
  • ఓం పదవాక్యప్రమాణపారావార పారంగతాయ నమః |
  • ఓం యోగీంద్రగురవే నమః |
  • ఓం మంత్రాలయనిలయాయ నమః |
  • ఓం పరమహంస పరివ్రాజకాచార్యాయ నమః |
  • ఓం సమగ్రటీకావ్యాఖ్యాకర్తే నమః |
  • ఓం చంద్రికాప్రకాశకారిణే నమః |
  • ఓం సత్యాదిరాజగురవే నమః |
  • ఓం భక్తవత్సలాయ నమః |
  • ఓం ప్రత్యక్షఫలదాయ నమః |
  • ఓం జ్ఞానప్రదాయ నమః |
  • ఓం సర్వపూజ్యాయ నమః |
  • ఓం తర్కతాండవవ్యాఖ్యాకర్తే నమః |
  • ఓం కృష్ణోపాసకాయ నమః |
  • ఓం కృష్ణద్వైపాయనసుహృదే నమః |
  • ఓం ఆర్యానువర్తినే నమః |
  • ఓం నిరస్తదోషాయ నమః |
  • ఓం నిరవద్యవేషాయ నమః |
  • ఓం ప్రత్యర్ధిమూకత్వనిదానభాషాయ నమః |
  • ఓం యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యష్టాంగయోగానుష్టాన నిష్టాయ నమః |[నియమాయ]
  • ఓం సాంగామాయకుశలాయ నమః |
  • ఓం జ్ఞానమూర్తయే నమః |
  • ఓం తపోమూర్తయే నమః |
  • ఓం జపప్రఖ్యాతాయ నమః |
  • ఓం దుష్టశిక్షకాయ నమః |
  • ఓం శిష్టరక్షకాయ నమః |
  • ఓం టీకాప్రత్యక్షరార్థప్రకాశకాయ నమః |
  • ఓం శైవపాషండధ్వాంత భాస్కరాయ నమః |
  • ఓం రామానుజమతమర్దకాయ నమః |
  • ఓం విష్ణుభక్తాగ్రేసరాయ నమః |
  • ఓం సదోపాసితహనుమతే నమః |
  • ఓం పంచభేదప్రత్యక్షస్థాపకాయ నమః |
  • ఓం అద్వైతమూలనికృంతనాయ నమః |
  • ఓం కుష్ఠాదిరోగనాశకాయ నమః |
  • ఓం అగ్రసంపత్ప్రదాత్రే నమః |
  • ఓం బ్రాహ్మణప్రియాయ నమః |
  • ఓం వాసుదేవచలప్రతిమాయ నమః |
  • ఓం కోవిదేశాయ నమః |
  • ఓం బృందావనరూపిణే నమః |
  • ఓం బృందావనాంతర్గతాయ నమః |
  • ఓం చతురూపాశ్రయాయ నమః |
  • ఓం నిరీశ్వరమత నివర్తకాయ నమః |
  • ఓం సంప్రదాయప్రవర్తకాయ నమః |
  • ఓం జయరాజముఖ్యాభిప్రాయవేత్రే నమః |
  • ఓం భాష్యటీకాద్యవిరుద్ధగ్రంథకర్తే నమః |
  • ఓం సదాస్వస్థానక్షేమచింతకాయ నమః |
  • ఓం కాషాయచేలభూషితాయ నమః |
  • ఓం దండకమండలుమండితాయ నమః |
  • ఓం చక్రరూపహరినివాసాయ నమః |
  • ఓం లసదూర్ధ్వపుండ్రాయ నమః |
  • ఓం గాత్రధృత విష్ణుధరాయ నమః |
  • ఓం సర్వసజ్జనవందితాయ నమః |
  • ఓం మాయికర్మందిమతమర్దకాయ నమః |
  • ఓం వాదావల్యర్థవాదినే నమః |
  • ఓం సాంశజీవాయ నమః |
  • ఓం మాధ్యమికమతవనకుఠారాయ నమః |
  • ఓం ప్రతిపదం ప్రత్యక్షరం భాష్యటీకార్థ (స్వారస్య) గ్రాహిణే నమః |
  • ఓం అమానుషనిగ్రహాయ నమః |
  • ఓం కందర్పవైరిణే నమః |
  • ఓం వైరాగ్యనిధయే నమః |
  • ఓం భాట్టసంగ్రహకర్తే నమః |
  • ఓం దూరీకృతారిషడ్వర్గాయ నమః |
  • ఓం భ్రాంతిలేశవిధురాయ నమః |
  • ఓం సర్వపండితసమ్మతాయ నమః |
  • ఓం అనంతబృందావననిలయాయ నమః |
  • ఓం స్వప్నభావ్యర్థవక్తే నమః |
  • ఓం యథార్థవచనాయ నమః |
  • ఓం సర్వగుణసమృద్ధాయ నమః |
  • ఓం అనాద్యవిచ్ఛిన్న గురుపరంపరోపదేశ లబ్ధమంత్రజప్గ్రే నమః |
  • ఓం ధృతసర్వద్రుతాయ నమః |
  • ఓం రాజాధిరాజాయ నమః |
  • ఓం గురుసార్వభౌమాయ నమః |
  • ఓం శ్రీమూలరామార్చక శ్రీరాఘవేంద్ర యతీంద్రాయ నమః |

ఇతి శ్రీ రాఘవేంద్ర అష్టోత్తరశతనామావళీ |

మరిన్ని అష్టోత్తరలు:

Chiranjeevulu In Telugu – చిరంజీవులు

Chiranjeevulu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… చిరంజీవులు నీతికథ.

చిరంజీవులు

(అరణ్యపర్వంలో మార్కండేయుడు చెప్పిన కథ యిది)
పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులలో వారికి మార్కం డేయ ముని దర్శనభాగ్యం లభించింది.

ఆయనకు అర్ఘ్యపాద్యాలిచ్చి పూజించారు. కుశల ప్రశ్నలు సాగి నవి. పాండవుల వంటి ధర్మపరులకు కలిగిన క్లేశాలకు ఆయన కొంత సేపు విచారించి, యింతకంటే దుఃఖాల పాలయిన శ్రీరామచంద్రుల కథ, నలదమయంతుల కథ వివరంగా చెప్పి కొంత ఓదార్పు కలిగించాడు.

అలా వారికి ఏవేవో పురాతన రాజవంశాల గాథలూ, మహర్షుల విశేషాలూ చెపుతున్నాడు.

ఒకనాడు ధర్మరాజు వినయంగా, చేతులు జోడించి
‘మహర్షీ ! నా కొక ప్రశ్న వచ్చింది’ అని అడగడానికి సంకో చించాడు. మార్కండియుడు చిరునవ్వు నవ్వి
‘తెలియని విషయాలు తెలుసుకోవడం దోషం కాదు నాయనా! నీ సందేహం ఏమిటి, అడుగు’ అన్నాడు.
‘మహామునీ। మాకు తెలిసినంత వరకూ మీరే చిరంజీవులు, మీరు కాక మరెవరయినా చిరంజీవులున్నారా’ అని అడిగాడు.

మార్కండేయ ముని చిరునవ్వుతో, తన తెల్లని వండు గడ్డం నవ రించి, ‘ధర్మనందనా ! మంచి ప్రశ్న అడిగావు. తప్పకుండా తెలుసుకో దగ్గది. సావధానంగా విము

ప్రాచీన కాలంలో ఇంద్రద్యుమ్నుడనే పేరుగల మహారాజు ఉండే వాడు. ఆయన ఎన్నెన్నో దానాలు చేశాడు. ప్రపంచంలో అంతటి ధర్మ పురుషుడు లేడని ఖ్యాతి పొందాడు. రాజర్షిగా పేరుపొంది ప్రజలందరి మన్ననలూ పొందిన ఆ పుణ్య పురుషుడు కాలం చెల్లగానే స్వర్గం చేరాడు.

అక్కడ కొన్ని సంవత్సరాలు గడిచాయి. అప్పటికి ఆ మహారాజు పుణ్య కర్మలతో సాధించుకున్న ఫలం పూర్తిగా అయిపోయిందని క్రిందికి పంపేశారు.

భూలోకానికి వస్తుండగా నేను కనిపించాను. కనిపించగానే నన్ను చూచి: ‘మహర్షీ ! మీరు పన్ను ఎరుగుదురా?’ అని అడిగాడు.
అప్పటికి నేను చిరకాలంగా తీర్థయాత్రలతో, పుణ్యకర్మలతో, ఉప వాస వ్రతంతో కృశించి ఉన్నాను. అందుచేత ‘నాకు గుర్తులేదయ్యా’ అన్నాను.
‘స్వామీ! మీకంటె ముందు పుట్టిన ప్రాణి ఏదయినా జీవించి ఉన్నదా ?’ అని అడిగాడు.
‘ హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రావారకరం అనే పేరు గల గుడ్లగూబ ఉంది అది నా కంటే పెద్దది. కొంచెం శ్రమ పడితే దానిని చూడగలవు, ‘ అన్నాను.

ఇంద్రద్యుమ్నుడు నన్ను వెంటబెట్టుకుని హిమాలయానికి వచ్చి ఆ గుడ్ల గూబను చేరి: ‘నువ్వు నన్ను ఎరుగుదువా?’ అన్నాడు. తెలి యదని తల ఊపింది, ఆ పక్షి. ‘అయితే నీ కంటే ముందు పుట్టిన వారిని ఎవరినయినా ఎరుగుదువా?’ అని అడిగాడు.

‘అయ్యా! ఇక్కడకు యోజనాల దూరంలో ఒక సరోవరం ఉంది. దానిని ఇంద్రద్యుమ్న సరోవరం అని పిలుస్తారు. ఆ కొలనులో వాడీ జంఘమనే పేరు గల కొంగ ఉంటుంది. అది నాకంటే పెద్దది, ‘ అంది.

ముగ్గురూ కలిసి ఆ చెరువు దగ్గరకు చేరారు. ఆ మహారాజు మామూలు ప్రశ్న అడిగాడు. అప్పుడా కొంగః

‘ ఈ కొలనులోనే ఆకూపారం అనే పేరు గల తాబేలు ఉంది, అది నాకంటె ముందు పుట్టింది’, అని జవా బిచ్చింది.

ఆకూపారాన్ని పిలిచి యిదే ప్రశ్న వేయగా, అది కన్నీరు విడుస్తూ:

‘అయ్యా ! ఆయన వెయ్యి మారులు యజ్ఞం చేసి వెయ్యి యూవ స్తంభాలు వేయించాడు. ఆయన దానం చేసిన గోపుల రాకపోకలతో భూమి దిగబడి యింత సరోవరం అయింది. ఇది ఆయన చలవ”, అంది.

ఆ క్షణంలో దేవతలు ఆయనను స్వర్గం తీసుకు వెళ్ళారు. అంటే మన కీర్తి భూలోకంలో ఉన్నంత కాలం మనం స్వర్గంలో ఉంకాం.

మరిన్ని నీతికథలు మీకోసం:

Mahalakshmi Ashtakam In Telugu – మహాలక్ష్మ్యష్టకమ్

Sri Mahalakshmi Ashtakam In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మహాలక్ష్మ్యష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Sri Mahalakshmi Ashtakam Telugu Lyrics

మహాలక్ష్మ్యష్టకమ్

శ్లో॥ 1

నమస్తేస్తు మహామాయే, శ్రీ పీఠే సురపూజితే।
శంఖ చక్ర గదా హస్తే, మహాలక్ష్మి నమోస్తుతే॥

తే॥ ఓ మహామాయ రూపిణీ! నమసుమములు
నీవు శ్రీపీఠ వాసివి దేవవినుత
శంఖ చక్ర గదా హస్త! జనని! జేతు
వందనం మహాలక్ష్మిశ్రీవనితకిపుడు

తా॥ ఓ మహామాయా స్వరూపిణి నీకు నమస్కారము. నీవు శ్రీపీఠ నివాసినివి. దేవతలందరిచే కొని యాడబడి పూజించబడు దానవు. ఓ శంఖ చక్ర గదాధరీ తల్లీ! మహాలక్ష్మీ నీకు వందన మొనరించెదను.

శ్లో॥ 2

నమస్తే గరుడా రూఢీ, డోలాసుర భయంకరి।
సర్వ పాపహరే దేవి, మహాలక్ష్మి నమోస్తుతే॥

తే॥ దండములు గరుడారూఢ తల్లికిత్తు
భయము డోలాసురునికి నీవలన కలిగె
సర్వ పాపముల్ నీవల్ల సమసిపోవు
వందనం మహాలక్ష్మి శ్రీవనిత కిపుడు

తా॥ గరుత్మంతుని అధిరోహించు తల్లికి వందనము చేతును. నీవలన డోలాసురునికి భయము కలిగినది. నీవలన అన్ని పాపములు నశించును. తల్లీ! మహాలక్ష్మీ నీకు వందనమొనరించెదను.

శ్లో॥ 3

సర్వజ్ఞే సర్వవరదే, సర్వ దుష్ట భయంకరీ
సర్వ దుఃఖహరే దేవి, మహాలక్ష్మి నమోస్తుతే॥

తే॥ సర్వమును దెలిసిన తల్లి సర్వ వరద
సర్వ దుష్ట భయంకరి జనని నీవె
సర్వ దుఃఖముల్ బాపెద వుర్వియందు
వందనం మహాలక్ష్మి శ్రీవనితకిపుడు

తా॥ సర్వము తెలిసిన ఓ తల్లీ నీవు అందరినీ అనుగ్రహించుదానవు. దుర్మార్గులందరికీ నీవు
భయంకరివి. ఈలోకంలో దుఃఖములన్నీ తొలగించు దానవు. ఓ మహాలక్ష్మీ నీకు ఇదే నమస్కరించు చున్నాను.

శ్లో॥ 4

సిద్ధి బుద్ధి ప్రదే దేవి, భుక్తి ముక్తి ప్రదాయిని।
మంత్రమూర్తే సదాదేవి, మహాలక్ష్మి నమోస్తుతే

తే॥ సిద్ధి బుద్ధుల జేకొన జేయు దేవి
భుక్తి ముక్తులనీ లక్ష్మిబూని యిచ్చు
మంత్రముల అధీష్ఠానమీ మాత నిజము
వందనం మహాలక్ష్మి శ్రీవనితకిపుడు

తా॥ సిద్ధిబుద్ధులను కలుగజేయు దేవి తిండి మోక్షములన ఈ లక్ష్మి పూనుకుని అందించును. ఈ తల్లి మంత్రములకు అధిష్ఠానదేవత ఓ మహాలక్ష్మి నీకు ఇపుడు నమస్కరించు చున్నాను.

శ్లో॥ 5

ఆద్యన్తరహితే దేవి, ఆదిశక్తి మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే, మహాలక్ష్మి నమోస్తుతే

తే॥ ఆది అంతముల్ లేనిదా ఆదిశక్తి
యోగ మెరిగిన దాయమ్మ యోగలభ్య
ఈమె విష్ణుప్రియయును మహేశ్వరీమె
వందనం మహాలక్ష్మిశ్రీవనితకిపుడు

తా॥ ఆ ఆదిశక్తికి ఆదియు అంత్యములు లేవు. యోగముచే లభించు ఆ దేవి యోగ విద్య నెరిగిన తల్లి. ఈమె శ్రీమహావిష్ణువుకు ప్రియురాలు మహేశ్వరి. ఆ మహాలక్ష్మికి ఇదే నమస్కరించు చున్నాను.

Mahalakshmi Ashtakam Telugu

శ్లో॥ 6

స్థూల సూక్ష్మ, మహారౌద్రే, మహాశక్తే మహోదరే।
మహాపాపహరే దేవి, మహాలక్ష్మి నమోస్తుతే॥

తే॥ స్థూలమైనది భీకరి సూక్ష్మముయును
పెద్ద యుదరము పెనుశక్తి వెలయుచుండె
పాపములద్రుంచ జననియు పావనియును
వందనం మహాలక్ష్మిశ్రీవనిత కిపుడు

తా॥ స్థూలమైనదియు సూక్ష్మమైనదియు పెద్ద ఉదరము గలదియు, మహాశక్తియు అయిన సర్వపాప సంహారిణి పరమపావని, ఓ మహాలక్ష్మి నీకు వందనము సమర్పిస్తున్నాను.

శ్లో॥ 7

పద్మాసనస్థితే దేవి, పరబ్రహ్మ స్వరూపిణి
పరమేశ్వరి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే

తే॥ పద్మమే ఆసనంబైన పద్మజనిత
వెలసె పరబ్రహ్మ రూపిణై తలచిచూడ
సర్వజగతికి మూలమౌ జనని ఈమె
వందనం మహాలక్ష్మి శ్రీవనితకిపుడు

తా॥ పద్మము ఆసనమైన ఈ దేవి పద్మమునుంచి పుట్టినది. ఈమె పరబ్రహ్మరూపిణై వెలసి యున్నది. సర్వజగత్తుకి ఈమె తల్లి. అట్టి ఓ మహాలక్ష్మి నీకు ఇదే నా నమస్కారము.

శ్లో॥ 8

శ్వేతాంబరధరే దేవి, నానాలంకార భూషితే।
జగత్ స్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే॥

తే॥ రమ్యమౌ పెక్కునగలు అలంకరించి
శ్వేత వస్త్రధారిణియైన శ్రీలతాంగి
జగము నిలిపిన ఈ తల్లి జగతి జనని
వందనం మహాలక్ష్మి శ్రీవనితకిపుడు

తా॥ పలు సుందరాభరణాలచే అలంకరించబడిన ఈమె తెల్లని వస్త్రమును ధరించిన తరుణి. జగత్తునంతటిని ఉద్ధరించు ఈ తల్లి జగజ్జనని. ఓ మహాలక్ష్మి నీకు నమస్కరించెదను.

శ్లో॥ 9

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం, యఃపఠేద్భక్తి మాన్నరః।
సర్వసిద్ధి మవాప్నోతి, రాజ్యం ప్రాప్నోతి సర్వదా॥

తే॥ తాము ఈ మహాలక్ష్మ్యాష్టకమును ప్రీతి
భక్తి శ్రద్ధతో చదువరే ప్రార్ధనందు
సర్వసిద్ధులు కలుగును జయము కల్గు
రాజ్యభోగములీ మహాలక్ష్మి యిచ్చు

తా॥ ఈ మహాలక్ష్మి అష్టకమును ప్రేమగా భక్తిగా శ్రద్ధగా తమరు ప్రార్ధనలొ పఠించినచో సర్వ సిద్ధులూ కలుగును. విజయములు కలుగును. ఈ మహాలక్ష్మి రాజ్యభోగముకూడా కలుగ జేయును.

శ్లో॥ 10

ఏకకాలే పఠేన్నిత్యం, మహాపాప వినాశనమ్॥
ద్వికాలేయః పఠేన్నిత్యం, ధనధాన్య సమన్వితః॥
త్రికాలంయః పఠేన్నిత్యం, మహాశత్రు వినాశనమ్
మహాలక్ష్మీర్భవేన్నిత్యం, ప్రసన్నా వరదా శుభా॥

(ఇన్ద్రకృత శ్రీమహాలక్ష్మ్యష్ఠక స్తోత్రం సంపూర్ణమ్)

తే॥ పఠనమొకసారి నిత్యము పాపముక్తి
రెండుసార్లైన ధనధాన్య ‘మెండు’ కలుగ
మూడు మారుల శత్రుల ముప్పు దొలగు
శ్రీమహాలక్ష్మి సర్వదా చేయు శుభము

తా॥ ఈ అష్టకము ఒకసారి పఠించిన ప్రతిదినమూ పాప విముక్తి కలుగును. రెండు పర్యాయములైనచొ సమృద్ధిగా ధనధాన్య లాభము, మూడు మారులకు శత్రుభయనాశనము చేసి శ్రీమహాలక్ష్మి సర్వదా శుభములిచ్చుగాక.

(ఇది ఇంద్రుడు చెప్పిన శ్రీమహాలక్ష్మి అష్టకము)

మరిన్ని అష్టకములు:

Kanikanitito Karyalu Sadhinchali In Telugu – కణికనీతితో కార్యాలు సాధించాలి

Kanikanitito Karyalu Sadhinchali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కణికనీతితో కార్యాలు సాధించాలి నీతికథ.

కణికనీతితో కార్యాలు సాధించాలి

( ఈ కథ ఆదిపర్వం కోసేది )

హస్తినాపురాన్ని పాలించే ధృతరాష్ట్ర మహారాజుకు ముగ్గురు మంత్రులున్నారు.

అందులో ప్రధాని విదురుడు. ఈ విదురుడు విద్వాంసుడు, ధర్మ పరుడు, నీతికోవిదుడు.రెండవవాడు సంజయుడు. ఈయన రాయబార కార్యాలు నిర్వ హిస్తూ, నిరంతరం ధృతరాష్ట్రుని అంతరంగిక సలహాదారుగా ఉంటాడు.
మూడవ వాడు కణికుడు. ఈ కణికుడు కూటనీతి కుశలుడు. అంటే !

మోసంతో కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు. అటువంటి కుటిల నీతిపరుడైనా కణికుడు తన మహారాజుకి చెప్పిన కథ మీరు చదవబోతున్నారు.
మహారాజా !

అనగా అనగా ఓ మహారణ్యం.

ఆ అడవిలో ఎన్నో క్రూరమృగాలు, యథేచ్ఛగా విహరిస్తు న్నాయి. అక్కడ ఓ నక్క ఉంది. అది చాలా తెలివైనది. తన పనులన్నీ ఇతరులచేత చేయించుకుని, పని పూర్తికాగానే వాటిని మోసంచేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూండేది. ఈ నక్కకి నలుగురు స్నేహితులున్నారు. పులి, తోడేలు, ముంగిప, ఎలుక. వీటితో కలిసి మెలిసి ఉన్నట్టు నటిస్తూ సుఖంగా జీవిస్తున్నారు.

ఆరోజులలో ఒకనాడు – .

పిక్కబలీసి నవనవలాడుతూ హాయిగా గంతులేస్తూ, చెంగుచెంగున దూకుతూ పోయే లేడి దాని కంటబడింది. ఆ లేడి ఈ మిత్రబృందాన్ని దూరంనుంచి చూసింది. చూస్తూనే వాటికి బహుదూరంగా పారిపోయింది. నిను కోరిక కలిగింది. ఎంత ప్రయత్నించినా, దాన్ని పట్టడం సాధ్యం కావడంలేదు. బాగా ఆలోచించింది నక్క. మిత్రులను చుట్టూ కూర్చో బెట్టుకుని:

” స్నేహితులారా ! ఈ లేడి ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది అయితే దానితో పరుగెత్తే శక్తి మనకెవరికీ లేదు. కనుక దాన్ని చంపడం మనకు సాధ్యంకాదు. ఇప్పుడు మనం ఒక కుట్రపన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం ఆరగించవచ్చు” అని నాలుక చప్పరించి, అది ఎంతరుచిగా ఉంటుందో చూపించింది.

అన్నిటికీ నోరూరింది.

“ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తం” అన్నాయి అవి ఆతు రతతో అటేచూస్తూ.

అది కొంతసేపు ఆలోచన అభినయించింది.

“ఆ ఇప్పుడు ఆలోచన వచ్చింది.”

” జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి. ఈ లేడి మెలకు వగా తిరుగుతుండగా మనం పట్టుకోలేం. అందుచేత ఇది అలిసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి. అప్పుడు చప్పుడు కాకుండా పాకుతూపోయే ఈ ఎలకబావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అద నులో పులి వెళ్ళి దాని మెడ విరిచివేయాలి. అంతే అంది.
దాని తెలివికి అవి ఎంతో ఆనందించాయి. ఆ లేడి నిద్రపోయే సమయం కోసం ఎదురుచూశాయి.

అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాలలో చెంగు చెంగున గంతు లేస్తూ, పచ్చికమేసి, సెలయేటి ఒడ్డున నీరు త్రాగి, బాగా అలిసి విశ్రాంతిగా కాళ్ళుజాపి నిద్రపోతున్నది లేడి. నక్క పలహా ప్రకారం అలికిడి కాకుండా ఎంకవెళ్ళి దాని కాలు కటుక్కున కొరికింది. బాధతో అది లేవబోతూండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ కొరికేసింది. నక్కతోపాటు దాని స్నేహితులు నలుగురూ సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి.

అప్పుడా నక్క:

“స్నేహితులారా! ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి. ఇప్పుడు మీ శరీరాలన్నీ దుమ్మూ ధూళితో ఉన్నాయి. అందు చేత ఆ కొండలోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు తినవచ్చు” అంది.

అవి నాలుగూ సంతోషంతో స్నానానికి వెళ్ళాయి.
అందులో అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి, ఆ లేడి మాంసం తినాలని.
నక్క బొటబొటా కన్నీప కారుస్తూంటే చూసిన పులి :
“బావా ! ఎందుకు విచారిస్తున్నావు? అంది.

“ఏం చెప్పను పులిబావా : ఆ ఎలక లేదూ! అది ఏమన్నదో
తెలుసా ? ‘పులి ఎంత పెద్ద జంతువైతే ఏం లాభం. నేను కాళ్ళు కొరి కితే గాని అది ఏమీ చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తుంది సిగ్గులేకుండా,’ అని వేళాకోళం చేస్తే నాకు బాధ కలి గింది, అంటూ నక్క కన్నీరు విడిచింది.
పులికి పౌరుషం వచ్చింది.

“మిత్రమా! ఎఇక నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను. ఒకరిమీద ఆధారపడను. ” అంటూ వెళ్లిపోయింది.
అంతలో ఎలక రాగా –
విన్నావా, ఎలకబావా ! ఈ లేడిని పులి ముట్టుకుంది కనక ఇది విషపూరితం అయింది. దీన్ని నేను తినను. నా ఆకలి తీరడానికి ఎంకము తినేస్తా అంటూ ముంగిస బయలుదేరింది. అనగా ఎలుక చటుక్కున కన్నంలోకి పారిపోయింది.

మరికొంతసేపటికి తోడేలు వచ్చింది. “విన్నావా! పులిబావకు నీ మీద కోపంవచ్చి, నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట”, అనడంతో తోడేలు దౌడు తీసింది.

అప్పుడు ముంగిస రాగా, చాలా ఆశగా వచ్చావు. వాళ్ళ ముగ్గుర్ని చంపి దూరంగా పారేశాను. నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను” అనగా అది తోక ముడిచి పారిపోయింది. హాయిగా ఆ లేడిమాంసం ఆరగించింది నక్క. విన్నారా ! మహారాజా ! తెలివితో వంచనతో మనకార్యాలు చక్క బెట్టుకోవాలి అన్నాడు కణికుడు. ఇదే కణిక నీతి.

మరిన్ని నీతికథలు మీకోసం:

Adiya Nadiya Nayya Akhila Lokaika Natha In Telugu – అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ

అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ
సంఖ్య : 416
పుట : 279
రాగం : బౌళి

బౌళి

18 అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ
తడతాఁకులతాపత్రయము మానుపుటకు

||పల్లవి||

శరణు శరణు వోసర్వేశ్వర నీకు
మరణభయములెల్ల మానుపుటకొఱకు
మొరయొ మొరయొ నీకు ముకుంద మాధవ
దురితములన్నియుఁ దొలఁగించుటకు

||ఆడియ||

దండము దండము నీకు దైవశిఖామణి
పండియుఁ బండని మతి పాకముసేయు కొరకు
అండనే దాస్యము దాస్యము నీకు నేనైతి
నిండు నీకరుణ నాపై నించేటి కొరకు

||అడియ||

అభయ మభయము శ్రీయాదినారాయణ
వుభయకర్మము నాకు నూడుచుట కొరకు
విభుఁడ శ్రీవేంకటేశ వినుతిసేసెద నిన్ను
శుభములన్నియు మాకుఁ జూపేటి కొరకు

||అడియ॥ 416

అవతారిక:

అద్భుతమైన శరణాగతి వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. అడియను అడియను అయ్యా! అంటే నీదాసాను దాసుణ్ణి ప్రభూ! అని అర్థం. ఈ లోకంలో మూడు విధములైన తాపత్రయములు జీవిని బాధిస్తున్నవి. అవే అధ్యాత్మికము, ఆధిభౌతికము మరియు ఆధిదైవికము. ఇవి తడతాకుతుంటాయి… అంటే తత్తరపడేట్లు చేస్తాయి. ఓ అఖిలలోక నాయకా! శరణు దండము దండము, అభయం అభయం అని వేడుకొంటున్నారు. మరి శ్రీవేంకటేశ్వరుడు అనుగ్రహిస్తే అన్నీ శుభములే కదా!

భావ వివరణ:

ఓ అఖిలలోకైక నాథా! (లోకములన్నింటికీ ఒకే ఒక నాయకుడవైన శ్రీహరీ!) నేనునీ, అడియను అడియను అయ్యా! (దాసానుదాసుడను తండ్రీ!) నాకు తడతాకులు (తత్తరపాటు) కలిగించే తాపత్రయములను మాన్పుటకు నీకు మ్రొక్కెదను.

ఓ సర్వేశ్వరా! నిన్ను శరణుచొచ్చెదను. నా మరణభయములు నెల్ల (నశింపజేయు శంకలనన్నీ) మాన్పుటకు శరణు వేడెదను. ఓ ముకుందా! మాధవా! నా దురితములన్నింటినీ (పాపములన్నీ) తొలగించుటకు మొరవెట్టుచున్నాను.

ఓ దైవశిఖామణీ! (దేవతలందరిలో తలమానికమైన స్వామీ!) పండియుపండని నామతి (పరిపక్వము అయిందీ అనలేము, పరిపక్వము కానిదీ అనలేము అట్టి నా మనస్సును) పాకముసేయుట కొరకు (పరిపక్వత నొందించుటకు) దండము దండము (అనేక నమస్కారములు), అండనే (నిన్నాశ్రయించి) నీకు దాస్యము చేయువాడనైతిని. నీ కరుణ నాపై నింపి నన్ను అనుగ్రహించుటకు నీదాసుడనైతినయ్యా!

ఓ శ్రీ ఆదినారాయణా! నా ఉభయ కర్మములను (సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు అనే రెండు రకముల కర్మలను) వూడుచుటకు (తొలగిపోవునట్లు చేయుటకు) నీ అభయమును వేడెదను. నాకు అభయమునిమ్ము. ఓ శ్రీవేంకటపతీ! నిన్ను వినుతి చేసెదనయ్యా! (ప్రార్థించెదను ప్రభూ!) మాకు శుభములన్నింటినీ చూపుటకు నిన్ను యెల్లవేళలా ప్రార్థించెదను తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Jagamulelevadavu Janardanudavu In Telugu – జగములేలేవాడవు జనార్దనుడవు

జగములేలేవాడవు జనార్దనుడవు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో జగములేలేవాడవు జనార్దనుడవు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

జగములేలేవాడవు జనార్దనుడవు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : జగములేలేవాడవు జనార్దనుడవు
సంఖ్య : 229
పుట : 153
రాగం : ముఖారి

ముఖారి

22 జగము లేవాఁడవు జనార్దనుఁడవు
తగ నీవారమై (మే?) నేము ధర నెట్టుండినాను,

||పల్లవి||

గతి నీవు మతి నీవు కాణాచిచోటు నీవు
సతమై యన్నిటికిని సాక్షివి నీవు
చతురత వలసితే జరతుము కొలుతుము
తతి నేము సేసినతప్పులు లోఁగొనవే.

॥జగ||

తల్లియుఁ దండ్రివి నీవు దాత దైవమవు నీవు
యెల్లవారికిఁ బరము నిహము నీవు
మల్లడి నొక్కొకవేళ మఱతుము తలఁతుము
చల్లఁగా మానేరములు సైరించుకొనవే.

॥జగ||

దరి నీవు దాపు నీవు దయామూర్తివి నీవు
పరగ శ్రీవేంకటేశ పతివి నీవు
విరివిగా నేమైనా వేఁడుదుము నుతింతుము
శరణుచొచ్చితి మిఁక క్షమియించుకొనవే.

||జగ|| 229

అవతారిక:

జనుల ‘అర్ధన’ (వేడికోలు) వినేవాడు జనార్దనుడు. “దేవా! నీవు జనార్దనుడవై జగము లేలుతుంటే, మేము నీవారమై, నీదాసులమై ఈలోకంలో పూనికతో వుంటామయ్యా!” అని కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు. మా తల్లియు దండ్రియును దాతయునూ నీవే ప్రభూ! “అన్యధా శరణం నాస్తి” అని నిన్ను ఆశ్రయించినాము. మాకు నీవే దిక్కు. అసలు సంగతి యేమిటంటే, అవతారికలో కనుపించినంత తేలిక కాదు, దీని భావము. అంతు చిక్కని, చిక్కుముళ్ళు చాలావున్నాయి, అంటే నన్ను నమ్మండి. “కాణాచి” అంటే యేమిటో? చదవండి. రెండేళ్ళ క్రితం ఇదే కీర్తన నేను చేయలేకపోయాను, నేడు చేయగలుగుతున్నాను. ఇదే స్వామి ‘దయ’ అంటే.

భావ వివరణ:

ఓ జనార్దనా! నీవు జగములు (పదినాలుగు భువనములను) పరిపాలించు బ్రహ్మాండనాయకుడవు. నేము (మేము) ఈ ధరన్ (భూమిపై) తగన్ (తగినట్లు) నీవారమై (నీ పరివార భృత్యులమై) నెట్టుండినాము (పూనికతోయున్నాము).

ప్రభూ! నీవే మాకు గతివి (దిక్కైన ఆధారానివి). నీవే మాకు మతివి (మంచీ చెడు విచక్షణ కలిగించే మేధస్సువి). నీవే మాకు కాణాచియైన చోటువు (చిరకాలవాసస్థానమైనవాడవు… అందుచేతనే మన ఆత్మలన్నింటికీ ఆ పరమాత్మ చిరంతనుడు). అన్నిటికీ నీవే సతమైన (శాశ్వతమైన) సాక్షివి (ఆయన నిష్పక్షపాతమైన సాక్షీభూతుడు). మాకు అప్పుడప్పుడు చతురత వలసితే (తెలివితేటలు అతి అయిపోయి) నిన్ను జరతుము (నిందించెదము). తరువాత నీవే దిక్కని కొలుతము (కాళ్ళు పట్టుకొంటుంటాం). తతి (అసాధారణంగా) మేము చేయుచున్న తప్పులను మన్నించుము తండ్రీ!

ఓ దేవా! నీవే మాకు తల్లివి, తండ్రివీ నీవే. మా ప్రాణదాతవు పరమాత్మవూ నీవే. నీవు ఆత్మరూపువవైననూ అందరికీ నివాసస్థానమైన వాడవు. మాకు ఇహమున కోర్కెలు దీర్చి, పరమున మోక్షమునిచ్చేవాడవు నీవే. మల్లడి (నీతో పోట్లాడి) ఒక్కొక్కవేళ నిన్ను మఱచిపోయి తలుచుకోను కూడా తలుచుకోము. మా నేరములను చల్లగా (నెమ్మదిగా) సైరించి కొనవే (క్షమించి మమ్మల్ని కాపాడవయ్యా!)

ఓ జగన్నాథా! నీవు మా దరిదాపువు (సమీపములోనే వున్న గమ్యానివి). అంతులేని దయాస్వరూపుడవు. నీవు విలసిల్లిన శ్రీవేంకటపతివి. ఏదియేమైనా మేము నిన్ను విరివిగా (విస్తృతముగా) వేడుకొని నుతించెదము. నిన్ను శరణుచొచ్చితిమి. ఇక క్షమించుకొనవే (మమ్మల్ని క్షమించి అనుగ్రహించుము తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sri Shiva Kavacha Stotram In Telugu – శ్రీ శివ కవచ స్తోత్రమ్

Sri Shiva Kavacha Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివ కవచ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Shiva Kavacham Telugu Lyrics

శ్రీ శివ కవచ స్తోత్రమ్

అథ ధ్యానమ్
వజ్ర దంష్ట్రం త్రినయనం కాలకంఠ మరిందమమ్।
సహస్ర కర మత్యుగ్రం వందే శంభు ముమాపతిమ్॥

1

అథాపరం సర్వ పురాణ గుహ్యం నిశ్శేష పాపౌఘ హరం పవిత్రం।
జయప్రదం సర్వ విపత్ప్రమోచనం వక్ష్యామి శైవం కవచం హితాయ తే ॥

2

ఋషభ ఉవాచ :
నమస్కృత్వా మహాదేవం విశ్వ వ్యాపిన మీశ్వరం।
వక్ష్యే శివమయం వర్మ సర్వ రక్షాకరం నృణామ్॥

3

శుచౌ దేశే సమాసీనో యథావత్కల్పితాసనః।
జితేంద్రియోజిత ప్రాణశ్చింతయే చ్ఛివ మవ్యయమ్॥

4

హృత్పుండరీకాంతర సన్నివిష్టం స్వతేజసా వ్యాప్త నభోవకాశం।
ఆతీంద్రియంయే సూక్ష్మమనంత మాద్యం ధ్యాయేత్పరానందమయం॥

మహేశమ్ || 5

ధ్యానావధూతాఖిలకర్మ-బంధ శ్చిరం చిదానంద నిమగ్నచేతాః।
షడక్షరన్యాస సమాహితాత్మా శైవేన కుర్యాత్కవచేన రక్షామ్॥

6

మాం పాతు దేవోఖిలదేవతాత్మా సంసారకూపే పతితం గభీరే।
త్వన్నామ దివ్యం పరమంత్రమూలం ధునోతు మే సర్వ మఘం హృదిస్థమ్॥

7

సర్వత్ర మాం రక్షతు విశ్వమూర్తిః జ్యోతిర్మయానందఘన శ్చిదాత్మా।
అణోరణీయానురు శక్తిరేకః స ఈశ్వరః పాతు భయాద శేషాత్॥

8

యో భూ స్వరూపేణ బిభర్తివిశ్వం పాయాత్స భూమేర్గిరిశోష్ట మూర్తిః।
యో పాం స్వరూపేణ నృణాం కరోతి సంజీవనం సో వతు మాం జలేభ్య॥

9

కల్పావసానే భువనాని దగ్ధ్వ సర్వాణి యో నృత్యతి భూరిలీలః।
స కాలరుద్రో2 వతు మాం దవాగ్నే ర్వాత్యాది భీతేరఖిలాచ్చ తాపాత్॥

10

ప్రదీప్తవిద్యుత్కనకావభాసో విద్యావరాభీతి కుఠారపాణిః।
చతుర్ముఖ స్తత్పురుషస్త్రినేత్రః ప్రాచ్యాం స్థితో రక్షతు మా మజస్రమ్॥

11

కుఠార ఖేటాంకుశ పాశ శూల కపాల మాలాగ్నికణాన్ దధానః।
చతుర్ముఖో నీలరుచిస్త్రిణేత్రః పాయా దఘోరో దిశిదక్షిణస్యామ్॥

12

కుందేందు శంఖస్ఫటికావభాసో వేదాక్షమాలా వరదాభయాంకః।
త్ర్యక్షశ్చతుర్వక్త్ర ఉరుప్రభావః సద్యోధిజాతో 2వతు మాం ప్రతీచ్యామ్॥

13

వరాక్షమాలాభయ టంకైహస్తః సరోజ కింజల్కసమానవర్ణః।
త్రిలోచనశ్చారుచతుర్ముఖో మాం పాయా దుదీచ్యాం దిశి వామదేవః॥

14

వేదాభయే ష్టాంకుశ పాశటంక కపాల ఢక్కాక్షర శూలపాణిః।
సితద్యతిః పంచముఖో వతాన్మాం ఈశాన ఊర్ధ్వం పరమప్రకాశః॥

15

మూర్ధాన మవ్వాన్మమ చంద్రమౌళిఃస్ఫాలం మమావ్యాదథ ఫాలనేత్రః।
నేత్రే మమావ్యా ద్భగనేత్రహరీ నాసాం సదా రక్షతు విశ్వనాథః॥

16

పాయా చ్ఛుతీమే శ్రుతిగీతకీర్తిః కపోల మవ్యాత్సతతం కపాలీ।
వక్త్రం సదా రక్షతు పంచవక్త్రో జిహ్వాం సదా రక్షతు వేదజిహ్వః॥

17

కంఠం గిరీశోవతు నీలకంఠః పాణిద్వయం పాతు పినాకపాణిః।
దోర్మూల మవ్యాన్మమ ధర్మభాహు ర్వక్షస్థలం దక్షమఖాంతకో వ్యాత్॥

18

మమోదరం పాతు గిరీంద్ర ధన్వా మధ్యం మమావ్యా న్మదనాంతకారీ।
హేరంబతాతో మమ పాతు నాభిం పాయాత్కటిం ధూర్జటిరీశ్వరో మే॥

19

ఊరుద్వయం పాతు కుబేరమిత్రో జానుద్వయం మే జగదీశ్వరో వ్యాత్।
జంఘాయుగం పుంగవకేతురవ్వా త్పాదౌ మమావ్యాత్సుర వంద్యపాదః ॥

20

మహేశ్వరః పాతు దినాద్యామే మాం మధ్యయామేవతు వామదేవః।
త్రిలోచనః పాతు తృతీయ యామే వృషధ్వజః పాతు దినాంత్యయామే॥

21

పాయాన్నిశాదౌ శశిశేఖరో మాం గంగాధరో రక్షతు మాం నిశీథే।
గౌరీపతిః పాతు నిశావసానే మృత్యుంజయో రక్షతు సర్వకాలమ్॥

22

అంతఃస్థితం రక్షతు శంకరో మాం స్థాణుః సదా పాతు బహిఃస్థితం మామ్।
తదంతరే పాతు పతిః పశూనాం సదాశివో రక్షతు మాం సమంతాత్॥

23

తిష్ఠంత మవ్వాద్భువనైకనాథః పాయాద్వజంతం ప్రమథాధినాథః।
వేదాంతవేద్యో వతు మాం నిషణ్ణం మామవ్యయః పాతు శివః శయానమ్॥

24

మార్గేషు మాం రక్షతు నీలకంఠః శైలాదిదుర్గేషు పురత్రయారిః।
అరణ్యవాసాది మహాప్రవాసే పాయాన్మృగవ్యాధ ఉదారశక్తిః॥

25

కల్పాంతకాలోగ్ర పటు ప్రకోప స్ఫుటాట్టహాసోచ్ఛలితాంగశోశః।
ఘోరారిసేనార్ణవ దుర్నివార మహాభయాద్రక్షతు వీరభద్రః॥

26

పత్త్యశ్వమాతంగరథావరూధినీ సహస్రలక్షాయుతకోటి భీషణమ్।
అక్షౌహిణీనాం శతమాతతాయినాం ఛింద్యా న్మృడో ఘోరకుఠారధారయా॥

27

నిహంతు దస్యూర్ద్రళయానలార్చి ర్జ్వల త్రిశూలం త్రిపురాంతకస్య।
శార్దూల సింహర్ష వృకాది హింస్రార్ద సంత్రాసయ త్వీశధనుః పినాకః॥

28

దుస్స్వప్నదుశ్శకున దుర్గతి దౌర్మనస్య దుర్భిక్షదుర్వ్యసన దుస్సహదుర్యశాంసి।
ఉత్పాతతాప విషభీతి మసధ్ధహార్తిన్ వ్యాధీంశ నాశయతుమే జగతామధీశః॥

29

ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్త్వ విదూరాయ సకలలోకైక హర్రే సకలోకైక భర్రే సకలలోకైక హర్రే సకలలోకై హర్రే సకలలోకైక సకలలోకైక సంహర్రే గురవే సకలలోకైక సాక్షిణే సకలనిగమగుహ్యాయ సకల లోకైక వరప్రదాయ కలదురితార్తి భంజనాయ సకలజగడ భయంకారాయ శశాఙ్క శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరిరామయమాయ నిరన్తకాయ నిష్కళఙ్కాయ నిష్ప్రపఞ్భయ నిర్ద్వన్ద్వాయ నిస్సర్గాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరాధారాయ నిరుపవిభవాయ నిత్యశుద్ధబుద్ధ పరిపూర్ణ సచ్చిదానన్దా ద్వైతపరమ ప్రకాశాయ పరమ శాస్త్రప్రకాశాయ తేజోరూపాయ తేజోమయాయ తేజోధిపతయే జయ జయ రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాన్తభైరవ కపాలమాలాధర ఖట్వాఙ్గఖడ్గచర్మ పరశు పాశాఙ్కుశఢమరుక మృగశూలచాప బాణగదాశక్తిభిస్దావాలతోమరముసల ముద్గర ప్రాసపరి ఘదాట్టస శతఘ్నీచక్రాద్యాయుధ భీషణకర సహస్ర దంష్ట్రా కరాళ వదనవికటాట్టహాస విస్ఫోటక నాగేంద్రహార బ్రహ్మాణ్డమణ్డల నాగేన్ద్రకుణ్డల నాగేన్ద్రచర్మధరమృడ మృత్యుంజయ త్ర్యమ్బక విరూపాక్ష విశ్వేశ్వరవృషభ వాహనవిషభూషణ విశ్వరూప విశ్వతోముఖ సర్వతో ముఖమాం రక్షరక్ష జ్వజ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యు మపమృత్యుభయం నాశయ నాశయ రోగభయ ముత్సాద యోత్సాదయ విష సర్పభయం శమయ శమయ చోరాన్మారయ మారయ మమ శత్రూనుచ్ఛాట యోచ్చాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భిన్దిభిన్ధి ఖడ్గేనఛిన్ధిఛిన్ది ఖట్వాన్గేన వ్యపోథయ వ్యపోథయ మమ పాపం శోధయ శోధయ ముసలేన నిష్పేషయ నిష్పేషయ బాణైస్సంతాయయ సంతాడయ యక్షరక్షాంసి భీషయభీషయ భూతాని విద్రావయ విద్రావయ కూష్మాణభూత భేతాళ మారీ గణబ్రహ్మరాక్షస గణాంత్సంత్రాసయ సంత్రాసయ మమాభయం కురు కురు విత్రస్తం మామాశ్వాసయా శ్వాసయ దుఃఖాతర మాసమానం యానన్దయ క్షుత్తృష్ణార్తం మామాప్యాయ యాప్యాయ అమృత కటాక్షవీక్షణేన మమాలోక యాలోకయ మాంసంజీవయ సంజీవయ నరకభయాన్మా ముద్ద రోద్ధర శివకవచేన మామాచ్ఛాద యాచ్ఛాదయ మృత్యుంజయత్ర్యమ్బక సదాశివ పరమశివ నమస్తే నమస్తే నమస్తే నమః.

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్||

మరిన్ని స్తోత్రములు