Kesava Dasi Nati Gelichiti Nannitanu In Telugu – కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను

కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 2
కీర్తన : కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను
సంఖ్య : 432
పుట : 325
రాగం : సింధుభైరవి

సింధుభైరవి

33 కేశవదాసి నైతి గెలిచితి నన్నిటాను
యీ శరీరపు నేరాలికనేల వెదక ॥

||పల్లవి||

నిచ్చలు కోరికలియ్య నీనామమే చాలు
తెచ్చి పునీతుచేయ నీతీర్ధమే చాలు
పచ్చిపాపాలణచ నీ ప్రసాదమేచాలు
యెచ్చు కొందు వుపాయాలు ఇకనేల వెదక ॥

॥కేశవ॥

ఘనుని చేయగను నీ కైంకర్యమే చాలు
మొనసి రక్షించను నీ ముద్రలే చాలు
మనిషి కావగ తిరుమణి లాంఛనమే చాలు
మెనసెను దిక్కుదెస ఇకనేల వెదక॥

॥కేశవ॥

నెలవైన సుఖమియ్య నీ ధ్యానమేచాలు
అల దాపుదండకు నీ యర్చనే చాలు
యిలపై శ్రీవేంకటేశ యిన్నిటా మాకు కలవు
యెలమి నితరములు యికనేల వెదక ॥

॥కేశవ॥

అవతారిక:

తనని తాను కేశవునికి ‘దాసి’ వలె భావించుకొని అన్నమాచార్యులవారు పాడుతున్న చక్కటి కీర్తననాస్వాదించండి. స్వామీ నేను నీవే దిక్కని నమ్మిన దాసిని. నాలో లోపాలు లేవని నేరాలు లేవని నేనను. కానీ అవన్నీ నేను ఈ మానవశరీరం ధరించటం చేత దేహానికి ప్రకృతి సిద్ధమైన నేరాలు. వాటిని ఈనాడు యెంచినందువలన వుపయోగమేమి వుంటుంది? నేను నీ నామ సంకీర్తనతో బ్రతుకుతున్నాను, నీ అర్చన, దాస్యము, కైంకర్యములతో వైష్ణవ దీక్షలో బ్రతుకుతున్నాను నాకు ఇతరములేవీ వద్దు, వద్దు, వద్దు. అంతే… అంటున్నారు.

భావ వివరణ:

ఓ కేశవా! నేను నీదాసినైతిని. అందుచేత అన్నిటా (ఇహపరములు రెంటినీ) గెలిచితి (సాధించగలిగాను). నేను, నాలో లోపాలు లేవని కాని నేరాలు చేయని వాడిని అనిగాని అనలేను. కాని అవి యీ శరీరపు నేరాలు నేను మానవ శరీరధారినైనందువలన దానికి సహజమైన నేరాలు. ఇక వాటిని వెదకనేల? అయినా వాటిని యెదుర్కొనటానికి నా ప్రయత్నాలు నేనూ చేస్తున్నాను.

నేను సదా నీ నామస్మరణతోనే బ్రతుకుతాను. నా కోరికలు తీర్చుటకు అది చాలదా? నీ తీర్థమైన చోటునే వుంటాను. నన్ను నిర్మలుని చేయటానికి అది చాలదా? నేను చేసే పచ్చిపాపాలు బాహాటంగా కనిపిస్తున్న పాపకర్మలు. అణగద్రొక్కుటకు నీ ప్రసాదము చాలదా? ఎచ్చుకొందు వుపాయాలు (ఎక్కువ తక్కువ కిటుకులు) అవసరమా? అక్కర్లేదు నిన్ను నమ్మితే చాలు.

నీకైంకర్యము (శరణాగతి) చాలు నేను ఘనుడను అనిపించుకొంటాను. నీ ముద్రలు (రెండు భుజములపైన ధరించే శంఖ చక్రముద్రలు) చాలును. మొనసి (పూని) అవే నీ ఆయుధాలవలెనే నన్ను రక్షిస్తాయి. మనిషి కావగ (రక్షించి కాపాడుటకు) నేను నానొసట ధరించే నీ తిరుమని లాంఛనము (పంగనామాలు) చాలును వాటితోనే నా మార్గము వెలుగులీనుతున్నది.

ఓ ప్రభూ! నీ దాస్యము నెలవైన (సుప్రతిష్టమైన) సుఖమునిస్తుంది. అలదాపుదండకు (ఆపైన తోడు నీడై కాపాడుటకు) నేను చేసే నీ అర్చనయే చాలును. ఓ శ్రీవేంకటేశ్వరా! ఇన్నిటా (ఇన్ని విధములైన) నీసేవలు మాకు వున్నవి కదా!) ఎలమి (మా వికాసమునకు) ఇలపై అన్యములైన వుపాయముల వెదకుటెందులకు? నీవు మాకు చాలును తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sri Hanuman Pooja Vidanam In Telugu – శ్రీ హనుమాన్ పూజా విధానం

Sri Hanuman Pooja Vidanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ హనుమాన్ పూజా విదానం గురించి తెలుసుకుందాం.

శ్రీ హనుమాన్ పూజా విధానం

పూ || తిధౌ || గో ॥ నా ॥ మమ శరీర ఆవాహిత గర్భస్థిత సమస్త భూత ప్రేత పిశాచాది సర్వబాధా నివృత్తర్ధ్యం, దుష్టస్థాన స్థితా యే యే గ్రహాః తద్దోష పరిహారార్ధం శ్రీ హనుమత్పూజా ప్రదక్షిణాని కరిష్యే ॥ తదాదౌ నిర్విఘ్న పరిసమాప్తర్థ్యం గణాధిపతి పూజాం కరిష్యే ॥ అథ హనుమత్పూజా విధిః॥

శ్లో॥ అంజనానందనం వీరం కోటి బాలార్క సన్నిభం
ధ్యాయామ్యహం రామదూతం సర్వదా హృదయాంబుజే ॥

శ్రీ మదాంజనేయ పరబ్రహ్మణే నమః ధ్యానం సమర్పయామి॥

శ్లో॥ ఆవాహయామి పింగాక్షం మహావీర్యం మహాబలం
వాయుసూనం రామభక్తం లంకానిర్మూలకారణం ॥

శ్రీ ఆంజనేయ ఆవాహనం సమర్పయామి॥

శ్లో॥ రత్నసింహాసనం చారు జాంబూనదమయం శుభం
ప్రీత్యర్ధ్యం తవ దాస్యామి సంగృహాణ ద్రుతం ప్రభో ॥

శ్రీ ఆంజనేయ రత్న సింహాసనం సమర్పయామి ॥

శ్లో॥ పాద్యం దదా మ్యహం భక్తా నిర్మలం పాపనం శుభం
గృహాణ వానరాధీశ సుగ్రీవ ప్రియబాంధవ ॥

శ్రీ ఆంజనేయ పాద్యం సమర్పయామి ॥

శ్లో॥ అర్ఘ్య మష్టాంగ సంయుక్తం శుభ్రం తే ప్రదదా మ్యహం
గృహ్యతాం కరుణాసింధో పీతవస్త్రం ప్రసీద భో ॥

శ్రీఆంజనేయ అర్ఘ్యం సమర్పయామి ॥

శ్లో॥ వాసితం సర్వతీర్థేభ్యః ఆనీతం శీతలం శుభం |
దడా మ్యాచమనార్ధం తే గృహ్యతా మంజనాసుత ॥

శ్రీఆంజనేయ ముఖే ఆచమనీయం సమర్పయామి।।

యత్పురుషేణ హవిషా॥ పంచామృత స్నానం సమర్పయామి ॥

శ్లో॥ గంగా గోదావరీ ముఖ్య నదీభ్య స్సముపాహృతం।
జలం దదామి స్నానార్ధం స్వీకురుష్వ హరీశ్వర ॥

శ్రీఆంజనేయ శిరస్స్నానం సమర్పయామి॥

శ్లో॥ నవరత్నమయీం దివ్యాం మేఖలాం హేమనిర్మితాం ।
దదామి తుభ్యం గృష్ణాష్వ శ్రీరామప్రియ మారుతే ॥

శ్రీ ఆంజనేయ కటిసూత్రం సమర్పయామి॥

శ్లో॥ పీతకౌశేయ కౌపీనం ధార్యం చ బ్రహ్మాచారిభిః |
అర్పయామి మహాబాహో గృహాణ పవనాత్మజ ॥

శ్రీఆంజనేయ కౌపీనం సమర్పయామి ॥

శ్లో॥ ‘పీతవస్త్రయుగం దేవ ప్రయచ్ఛామి తవ ప్రభో
ప్రీత్యర్ధం పావనే మహ్యం ప్రసీద కరుణాకర ॥

శ్రీఆంజనేయ వస్త్రయుగ్మం సమర్పయామి ॥

శ్లో॥ రాజితం బ్రహ్మాసూత్రం చ నిర్మితం బ్రహ్మణా పురా |
ప్రీత్యర్థం తవ బాస్యామి సంగృహాణ కపీశ్వర ॥

శ్రీఆంజనేయ బ్రహ్మసూత్రం సమర్పయామి॥

శ్లో॥ చందనం రోచనామిశ్రం హరిద్రా కుంకుమాన్వితం ।
స్వీకురుష్వ దయాసింధో మయార్పిత మిదం ప్రభో ॥

శ్రీఆంజనేయ దివ్య చందనం సమర్పయామి॥

శ్లో॥ అక్షతాం స్తవదాస్యామి హరిద్రాక్తాన్ శుభ ప్రదాన్
రామ ప్రియ నమస్తుభ్యం సంగృహాణా-ంజనాసుత ॥

శ్రీ ఆంజనేయ అక్షతాన్ సమర్పయామి ॥

శ్లో॥ కిరీట హార కేయూర కటకాంగుళి ముద్రికాఃః
ధారయవ్వ మయాదత్తాః భక్త్యా కపికులోత్తమ॥

శ్రీఆంజనేయ సర్వాభరణాని సమర్పయామి॥

శ్లో॥ చంపకారక పున్నాగ జాతీ మందార చంపకైః |
త్వాం పూజయా మ్యహం భక్త్యా సుప్రస్రీదా-ంజనాసుత ॥

శ్రీ ఆంజనేయ నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి।।

అథాంగపూజా

ఓం హనుమతే నమః పాదౌ పూజయామి | గూడ గుల్ఫాయ నమః గుల్భౌ పూజయామి | అంజనా గర్భ సంభూతాయ నమః జంఘే పూజయామి | అతి బలపరాక్రమాయ నమః ఊరూ పూజయామి | ఉదధి లంఘనాయ నమః కటిం పూజయామి | సీతాశోకాపహారిణే నమం నాభిం పూజయామి। కాలనేమిమథనాయ నమః హృదయం పూజయామి । మకరీవిపాటనాయ నమః ప్తనౌ పూజయామి | సంజీవన ధరాధర ధారిణే నమః బాహూ పూజయామి ! సుగ్రీవ సచివాయనమః గ్రీవం పూజయామి | లక్ష్మణ ప్రాణదాత్రే నమః పూజయామి | భక్తాభీష్ట ప్రదాయకాయ నమః సర్వాణ్యంగాని పూజయామి |

అథదిక్పాలపూజా

ఇంద్రాయ నమః | అగ్నయే నమః | యమాయ నమః | నైరుతయే నమః | వరుణాయ నమః | వాయవే నమః | కుబేరాయ నమః । ఈశానాయ నమః |

మరిన్ని పూజా విధానాలు:

Chakkani Sarasapu Sisuvu In Telugu – చక్కని సరసపు శిశువు

చక్కని సరసపు శిశువు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో చక్కని సరసపు శిశువు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

చక్కని సరసపు శిశువు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : చక్కని సరసపు శిశువు
సంఖ్య : 151
పుట : 109
రాగం : కన్నడగౌళ

కన్నడగౌళ

28 చక్కని సరసపు శిశువు
పెక్కుమాయల పెనుశిశువు

||పల్లవి||

చిమ్మెడి విషములు చేఁపినరొమ్ములు
కొమ్మని యిచ్చినఁ గుడిచేని
బొమ్మరపోవఁడు పూతకిఁ బొరిగొని
అమ్మరో గయ్యాళి శిశువు

॥చక్కని॥

చుట్టమువలెనే సుడిగాలినిఁ గని
బెట్టుగఁ గౌఁగిట బిగించేని
పుట్టఁడు వొడమఁడు బూమెలే చేసీ
పట్టరే పసి బాల శిశువు.

॥చక్కని॥

పాదము చాఁచటు బండి జాతురకు
ఆదిగొనుచు తా నలరీని
వేదవేద్యుఁడగు వేంకటగిరి పై
మోద మందిన మున్నిటి శిశువు

॥చక్కని ॥

అవతారిక:

పెక్కు మాయల పెను శిశువు అని శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిస్తున్నారు. అన్నమాచార్యులవారు. పల్లవి తేలికగా వుంటే చరణాలు మరణాలే అన్నమయ్య కీర్తనలలో. స్వామి మున్నిటి శిశువుట అంటే అనాదియైన శిశువు. బొమ్మర పోవడు అంటే దిమ్మతిరిగేట్లు చేయడమన్నమాట. “పుట్టడు వొడమడు బూమెలే చేసీ” అంటే ఏమిటి? తేలికగా కనిపించే అతి క్లిష్టమైన కీర్తన ఇది. సాధ్యమైనంత పొందికగా దీని భావవివరణ కూర్చాను.

భావ వివరణ:

ఓ ప్రజలారా! శిశువు (పొత్తిళ్ళ బాలుని) వలె వున్న ఇతడు చక్కని, సరసమైన (లలితమైన) వాడు. చాలా మాయలు నేర్చిన గొప్ప శిశువు ఈతడు. ఈయన లీలలు వినండి.

ఒకనాడు పూతకి అనే రాక్షసి అందమైన యువతి వలెవచ్చి విషములు చిమ్మెడి రొమ్ములలో పాలు చేపిన (చేపినవని) కొమ్మని (త్రాగునాయనా!) అని ఇచ్చిన వెనువెంటనే, కుడిచేని (పీల్చినాడు). బొమ్మరపోవడు (దిమ్మదిరిగిన ఆ రాక్షసి పారిగొనినది (నశించినది). అమ్మరో! (అయ్యబాబోయ్) వీడు గయ్యాళి శిశువు (రండగొండి పిల్లవాడు).

ఒకనాడు తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో చుట్టపు చూపుగా అనుకోకుండా వున్నట్లుండి వచ్చాడు. వచ్చి, బెట్టుగ కౌగిట బిగించేని (అతిశయించి కౌగిటిలో బిగించినట్లు చుట్టేశాడు). అప్పుడు వీడు మాత్రం తక్కువవాడా? బూమెలే చేసీ (మోసాన్ని మోసంతోనే వంచాడు). పైగా వాడు పుట్టడు వొడమడు (పుట్టుకే లేని మగాడు). (పసిబాల శిశువుగా) వున్నంతమాత్రాన పట్టరే! (వీనిని పట్టుట సాధ్యమా?)

ఒకనాడు శకటాసురుడు అనే రాక్షసుడు ‘బండి’ రూపంలో వీడిని చంపాలని వచ్చాడు. అప్పుడు, ఆదిగొని (వాడిపై కన్నువేసి) తాను (ఆ శిశువు) అటు పాదము చాచి, జాతురకు నలరీని (మిక్కిలి చాతుర్యంతో అతిశయించి) బండిని ఒక్క తన్ను తన్ని ముక్కలు ముక్కలు చేసి శకటాసురుని చంపేశాడు. ఎందుకంటే ఆ శిశువు యెవ్వరనుకొన్నారు? వేదవేద్యుడు (వేదముల చేతనే తెలియశక్యమైన) దేవదేవుడు. శ్రీవేంకటాద్రి మీద సంతోషంగా వున్న శ్రీవేంకటేశ్వరుడే ఈ మున్నిటి (అనాదియైన మఱియాకు శిశువు).

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Bharthanu Ela Vasam Chesukovali In Telugu – భర్తను ఎలా వశం చేసుకోవాలి?

Bharthanu ela vasam chesukovali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… భర్తను ఎలా వశం చేసుకోవాలి? నీతికథ.

భర్తను ఎలా వశం చేసుకోవాలి ?

(ఈ కథ ఆరణ్య పర్వంలో ఉంది)

భారతంలో కూడా ఈ భామామణి ఉన్నదా అని ఆశ్చర్య పడే వారు లక్షలకు పయిగా ఉంటారు. కాని లక్ష శ్లోకాల మహాభారతంలో ఈ సత్యభామ ఉండేది అయిదారు నిమిషాలు. ఆ కొంచెం సేపులోనే ఆవిడ మన మనస్సును పట్టుకుంటుంది. చూడండి.

శకుని ఆడిన మాయ జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. కొద్ది రోజులలో అది పూర్తి అయి అజ్ఞాత వాసానికి వెళ్ళాలి.

అటువంటి సమయంలో చుట్టపు చూపుగా వచ్చాడు వాసుదేవుడు. ఆయన వెంట సత్యభామ కూడా వచ్చింది.

అక్కడ నాలుగయిదు రోజులు గడిపారు. ఒకనాడు పాండవపత్ని ద్రౌపదీదేవి విశ్రాంతిగా ఉన్న వేళ, ఎవరూలేనిచోట, సత్యభామ ఆవిడ దగ్గరకు చేరి, కొంతసేపు లోకాభిరామాయణం అయాక.

‘వదినా! ఒక్కమాట అడగాలని ఉంది. ఏమీ అనుకోకుండా, దాచుకోకుండా చెపుతావా? అంది.

ద్రుపద రాజనందన చిరునవ్వు నవ్వి ః
“అదేమిటి వదినా నీ దగ్గర దాపరికం ఏవుంటుంది నాకు’ అంది.

సత్యభామ: వదినా! ఇన్ని రోజులుగా చూస్తున్నాను. ఒక్క నాడు నీ అయిదుగురు భర్తలలో ఎవ్వరూ నిన్ను పరుషంగా పలక రించడం కాని, కన్ను లెర్రజేసి చూడడం కాని కనిపించదు. అందరూ అనురాగంతో ఆప్యాయంతోనే నిన్ను చూస్తున్నారు. ఈ విద్య ఎలా సాధించావు ?

ఏ మంత్రం వేస్తే, ఏ మందు పెడితే, ఏ వ్రతం చేస్తే, ఏ నది స్నానం చేస్తే యింతటి అనురాగాన్ని భర్తమంచి పొందవచ్చునో చెప్పు అంది.

ద్రౌపదీదేవి అంతా విని, మందహాసం చేసి
‘వదినా! ఎంత అమాయకురాలివమ్మా! లోకోత్తర పురుషు డయిన మా అన్నయ్యకు భార్య వయిన నీకు ఇటు వంటి ఆలోచన ఎలా వచ్చిందమ్మా! అయినా అడిగావు కనక విను.

నువ్వు చెప్పిన ప్రజలూ, నోములూ, స్నానాలూ, మందులూ, మాకులూ, మంత్రలూ, తంత్రాలూ మనకు కాదమ్మా.

పతివ్రతా ధర్మాలు తెలియని కుంటలూ, నీచులూ అటువంటి వాటి కోసం ఆలోచిస్తారు. మనమనస్సులో ఆ వెర్రి ఊహ పుట్టనే కూడదు. పుట్టినా మరుక్షణంలో దానిని పారదోలి మనస్సును పతిసేవలో లగ్నం చేసి నిర్మలంగా ఉంచుకోవాలి.

భర్తను వశపరచుకుందుకు ఈ విధంగా మందులూ, మంత్రాలూ ఉపయోగిస్తున్న సంగతి వారికి తెలిసిందంటే యింక చెప్పాలా?.

పాముదూరిన యింటిని ఎలా చూస్తారో అలా చూస్తారు. వారి మనస్సు అశాంతితో నిండి, మనమీద ఉన్న ప్రేమ కూడా పోయి ద్వేషం పుడుతుంది.

ఎవరో ఏదో ముందు తెచ్చి తినిపించమంటారు. దానివల్ల కొందరు మరణించారనీ, కొందరికి వివరీతంగా రోగాలు వచ్చాయనీ, మరికొందరు. పిచ్చివారయి ఎందుకూ కొరగాకుండా పోయారనీ విని ఉంటావు.

ఈ మందుల వల్ల నడి వయసులోనే ముసలితనం వస్తుండనీ, కొందరికి మాట వడిపోయి మూగవారు అవుతారనీ, కొందరు చెవిటివా ధయారనీ వినే ఉంటావు. అందుచేత ఆ ఆలోచన వదులుకో.

నేను ఎలా సాధించానంటావా! అది చాలా సులభం వదినా!
ముందుగా అహంకారం వదిలేశాము. దురభిమానాన్ని దూరంగా తరిమాను. సాధ్యమయినంతా పెదవి విప్పి మాట్లాడను. తప్పని పరి అయితే చిరునవ్వుతో మృదువుగా మాట్లాడుతాను. ఏనాడూ కరకుగా, పరుషంగా మాట్లాడి ఎరగను. మాటతోనే కాదుటమ్మా మనం ఎదుటివారి హృదయాన్ని జయించేది ।

ఇక –
నిరంతరం వారి మనసు గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకుంటాను. మాకు పరిచయం లేని కొత్తవారితో అసలు మాట్లాడను.. ఎక్కడకు పడితే అక్కడకు వెళ్ళను. అనవసర విషయాలలో జోక్యం కలిగించుకోను.

వీరు ఏ పనిమీదనో అటూ ఇటూ వెళ్ళివస్తే, వారు రాగానే నవ్వుతూ ఎదురు వెళ్ళి వారిసేవ కోసం ఎదురు చూస్తాను.

వీరి అవసరాలన్ని నేను స్వయంగా చూసుకుంటానే తప్ప, అది మా దాపదాసీజనానికి విడిచి పెట్టను.

వారు నాకు ఏ విషయం చెప్పినా అది వర రహస్యంగా దాచు తాను. ఎంత చిన్న విషయమయినా సరే, ఆ మాట యితరులకుచెప్పను.

ఈ యింట్లో ఎవరికి ఏది యిష్టమో నాకు లుసు. ఆ పదార్థాలు స్వయంగా వండి, నేనే వడ్డించి, నవ్వుతూ మాట్లాడుతూ వారి చేత హాయిగా భోజనం చేయిస్తాము.

సోమరితనాన్ని నా దరిదాపులకు రానివ్వను. మా గృహం నిత్యం పరిశుభ్రంగా కలకల లాడుతూ ఉండేలా చూసుకుంటాను.

వారితో మాటల సందర్భంలో అవసరమైతే నవ్వుతాను. అంతే తప్ప వెకిలినవ్వులు నవ్వుతూ నిలబడను.

ఇంద్ర ప్రస్థంలో యువరాజు పీఠంమీద వారిని ఎంత గౌరవంతో చూశానో, యీ వనవాసంలో కూడా అలానే చూస్తున్నాను. ఆ రోజులలో మా అత్తగారు కుంతీదేవి ఎవరితో ఎలా ఉండేవారో నేనూ అలానే నడుపుతున్నాను. ఏరాడూ ఆవిడమాటకు ఎదురు చెప్పలేదు.

తెల తెల వారు తూండగా నిద్రలేచి, నిర్మల మయిన మనస్సుతో నా పనులు నేనే చేసుకుంటాను. అక్కడ ఉన్న రోజులలో మా దాపదాని జనం యొక్క కష్టసుఖాలు స్వయంగా చూసుకునేదాన్ని.

అంతేకాదు, మా రాజభవనంలో వేదవేత్తలూ, వారి శిష్యులూ ఉండేవారు. ఇందరి భోజనథాజనాలూ సరిగ్గా సాగుతున్నదీ లేనిదీ చూసే పని ఎప్పుడూ మరిచిపోలేదు. అందరూ సుఖంగా నిద్రించే వరకూ నేను పడక గదిలో కాలు పెట్టను.

మా కోశాగారంలో ఎంక ఉన్నదీ, అది ఎలా వ్యయమవుతున్నది. నాకు తెలుసు. ఆదాయం వ్యయం ఎలా ఉంటున్నాయో చూసుకునే పని నాదే.

పని పాటా లేకుండా ఎవరి యింటికీ వెళ్ళకూడదు. అనవసరంగా కాలక్షేపానికి చేరి వారినీ వీరినీ నిందించే వారిని దరిజేర నివ్వరాదు.

మరొక ముఖ్య విషయం –
కన్న కొడుకుతో అయినా సరే ఏకాంతంగా పురుషులతో ఉండ కూడదు, భర్తతో తప్ప.

ఎప్పుడూ చిరునవ్వుతో, పూలు ముడిచిన జుట్టుతో, పరిశుభ్రమయిన వస్త్రాలు ధరించి, అలంకారాలతో, భర్తసేవకోసం ఎదురు చూస్తూ ఉండాలి. మన బంధువులలో వీరికి దగ్గర వారెవరో, శత్రువు లెవరో, స్నేహితు లెవరో తెలుసుకొని వారి వారికి తగినట్టు నడుచుకోవాలి.

నిత్యం సంతోషంతో ఉండాలి. అసంతృప్తి అనేది కలలోకికూడా రాకూడదు.

ఈ సూత్రాలు ఆచరించిననాడు ఎటువంటి భర్త అయినా భార్య మీద అనురాగం వర్షిస్తూ ప్రాణ సఖిగా చూపకుని సుఖపెట్టి సుఖం పొందుతాడు వదినా!

ఇవన్నీ నీకు తెలుసు. కాని నేను ఎలా ఉంటున్నానో చెప్పా సంతే అంది ద్రౌపదీ దేవి.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Veerabrahma Swamy Ashtakam In Telugu – శ్రీ వీరబ్రహ్మష్టకము

Sri Veerabrahma Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వీరబ్రహ్మష్టకము గురించి తెలుసుకుందాం…

శ్రీ వీరబ్రహ్మష్టకము

హైందవ మహమ్మదీయ సఖ్యముకొఱకు
సర్వ మానవ ధర్మంబు చాటి చెప్పి,
“ఆలకింపుఁ డమృతపుత్రు లంద”ఱనెడి
విశ్వధర్మ నిర్ణేత భావింతు నెపుడు.

ఎవని యానతి యవస మహీళు లేని
అలరు ఒత్తుగా శీర్షములందుఁ దాల్చి,
పాలన మొనర్తు ధార్మిక ప్రభుత నెఱపి
అట్టి గురునందు నాచిత్తమలరుఁగాళ.

కులమునకుఁ గాక యోగ్యతకును గుణమ్ము
నకును మన్నన యొసఁగి యంత్యజున కేని,
ఔపనిషదర్థ పీయూష మందఁ జేయు
నట్టి దేశికు చరణమ్ము లాశ్రయింతు.

యతుల కేగాని ముక్తి, గృహస్థ తతికి
దూరమనెడు నపోహముఁ దొలఁగఁ జేసి,
గేస్తుధర్మమ్ము ప్రకటించు గృహివరేణ్యు
డెపుడు వసియించుఁగాత నా హృదయ సీను.

అల సనాతన ఋషి ధర్మ మైన శిల్ప
కర్మయోగముఁ బూని నైష్కర్య సిద్ధిఁ
జాటె నే కర్మకుశలుఁ డా సంయమీంద్రుఁ
డొసఁగి ప్రోచుత సత్రియా యోగదీతు.

ఘనతరాష్టాంగ యోగంబు కాలి పోయి
శుష్క వేదాంతమున యోగశూన్య మైన
జగమునన్ యోగమార్గ సంస్థాపన మ్మొ
సరు యోగేశ్వరుఁడు శరణమ్ము నాకు.

ఎవఁడు శ్రుత్యంతముల నెల్ల నేర్పరించి
లుఁగు తత్త్వాలలోఁ బ్రబోధించినాఁడొ;
ఆ త్రయీమూర్తి రుచిరపాదాబ్జ సీమఁ
జేరి నటియించుఁగాత నా చిత్త భృంగి.

ఆతఁడు తమోరజస్సుల కవల వెలుఁగు
సత్వమూర్తి, త్రయీశిర స్సార రూపి,
వెలుఁగులకు వెల్గు, ప్రణవైకవేద్య నిత్య
తత్త్వ మా వీర గురుఁడు ప్రత్యక్ష మగుత

మరిన్ని అష్టకములు

Sri Venkateswara Mangalasasanam In Telugu – శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్

Sri Venkateswara Mangalasasanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్ గురించి తెలుసుకుందాం…

Sri Venkateswara Mangalasasanam Lyrics In Telugu

శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్

శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేఒర్థినామ్।
శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||

1

లక్ష్మీసవిభ్రమాలోకసుభ్రూవిభ్రమచక్షుషే |
చక్షుషే సర్వలోకానాం వేంక టేశాయ మంగళమ్ ||

2

శ్రీ వేంకటాద్రిశృంగాగ్రమంగళాభరణాంఘ్రయే |
మంగళానాం నివాసాయ వేంక టేశాయ మంగళమ్ ||

3

సర్వావయవసౌందర్యసంపదా సర్వచేతసామ్ |
సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ||

4

నిత్యాయ నిరవద్యాయ సత్యానందచిదాత్మనే|
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్ ||

5

స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశ్లేషిణే |
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్ ॥

6

పరనై, బ్రహ్మణే పూర్ణ కామాయ పరమాత్మనే |
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్ ||

7

ఆకాలత త్త్వమశ్రాంతమాత్మనామనుపశ్యతామ్ ।
అతృప్త్యమృతరూపాయ వేంకటేశాయ మంగళమ్ ||

8

ప్రాయస్స్వచరణా పుంసాం శరణ్యత్వేన పాణినా |
కృపయాఒఒదిశతే శ్రీమద్వేంక టేశాయ మంగళమ్ ॥

9

దయామృతతరంగిణ్యాన్తరంగై రివ శీతలైః
అపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్ ||

10

స్రగ్భూషాంబర హేతీనాం సుషమా ఒవహమూర్తయే |
సర్వార్తిశమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ॥

11

శ్రీ వైకుంకవిరక్తాయ స్వామిపుష్కరిణీత పే |
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్ ॥

12

శ్రీమత్సుందరజామాతృమునిమానసవాసినే |
సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||

13

మంగళాశాసనపరై ర్మదాచార్యపురోగమైః |
సర్వైశ్చపూర్వైరాచార్యైస్సత్ప్రృతాయాస్తు మఙ్గళమ్ ॥

ఇతి శ్రీ వేంకటేశ మంగళాశాసనం సమాప్తమ్.

మరిన్ని కీర్తనలు:

Sri Krishna Prema Ashtakam In Telugu – శ్రీ కృష్ణ ప్రేమాష్టకమ్

Sri Krishna Prema Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ కృష్ణ ప్రేమాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Sri Krishna Prema Ashtakam Telugu

శ్రీ కృష్ణ ప్రేమాష్టకమ్

అసారే సంసారే విషయ విషపూరే పటుతరే
ప్రవాహే ఘోరే మాం మలినతరమోహేన పతితమ్ !
భ్రమన్తం ధావన్తం మనసి విలపన్తం కరుణయా
సముద్ధర్తుం కృష్ణా వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

1

అనాథానాం నాథః పరమకరుణా పూర్ణహృదయో
ఘనానందాకారో జఘన విలసద్భాహు యుగళః,
సనాథం మాం కుర్వన్సదయ వర రాధావనితయా
ఘనశ్యామః కృష్ణో వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

2

సదా బృందారణ్యే కలిమలహరే యామునతటే
ముదా గోపీబృందే లసదమల గోలోకనిలయే,
విహర్తా గోపాలో మధుర మురళీగాన నిరతో
ఘనశ్యామః కృష్ణో వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

3

మతిర్మే శ్రీరాధాపతిచరణ పద్మేషు విశతాత్
రతిర్గోపీకాంతే లసతు రసనా నామ జపతాత్,
గతిర్మే గోవిన్దో భవతు నిరతం పూర్ణదయయా
ఘనశ్యామః కృష్ణా వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

4

పితా మాతా భ్రాతా సుతహిత కళత్రాది సకలం
పతిర్బంధుర్మిత్రం విభురపి శరణ్యోస్తు భగవాన్,
గతిర్మే గోపీశః కిమపి న హి కృష్ణాత్పరతరం
స గోపాలః ప్రేమ్ల్లో వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

5

గురు ర్భావానందః శమిత హృదయ స్మేరవదన
స్స మాం దీనం హీనం విషయ విషతృష్ణా పరివృతమ్,
సుధావృష్ట్యా దృష్ట్యా పరమ కృపయా పాతు మనిశం
ఘనశ్యామో భూత్వా వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

6

నమామి శ్రీకృష్ణం సజలజలద శ్యామలతనుం
భజామి శ్రీకృష్ణం మధురమధురం తస్యచరితమ్,
ప్రజామి శ్రీకృష్ణం శరణ మహమవ్యాజకృపయా
ఘనశ్యామః కృష్ణో వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

7

పరాధీనం దీనం చపలమతిహీనం కరుణయా
పరిత్రాతుం నేతుం న్వపదమపహర్తుం భవభయమ్,
గదాధారీ శౌరిః కలికలుష హారీ ధృతగిరి
స్సదామేఘశ్యామో వసతు మమ హృద్ధామ్ని సతతమ్.

8

విశ్వనాథ కృతం ప్రాతః ప్రబోధాష్టక మాదరాత్,
పఠతాం హృదయే నిత్యం సదా వసతు కేశవః.

ఇతి శ్రీకృష్ణ ప్రేమాష్టకం సంపూర్ణమ్

మరిన్ని అష్టకములు

Suprabatam – సుప్రభాతం

Suprabatam

సుప్రభాతం అనగ మంగళ ప్రభాతం లేదు శుభ ప్రబాతం. ఈ సుప్రబాతం అనేది భగవంతుని మేల్కులోపుటానికి వివిధ రకాల శ్లోకములు, మరియు స్తోత్రలతు దేవునిని ఆరదించడము. స్వామివారిణి పవిత్రమైన మంత్రాలు, శ్లోకాలు లేదా కవితలు స్తోత్రాలతో ఆరంభిస్తారు. సుప్రభాతంలో భగవన్ని అర్చించేవారిని సందర్శించే భావం ఉంటుంది. ఈ పాటను చదువుతూ, శుభోదయంలో భగవన్ని పూజించటం, సంధ్యాకాలంలో సంధ్యావందన చేయుటకు ఉపయోగపడుతుంది.

Suprabhatamulu – సుప్రభాతములు

Sri Satyanarayana Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామపూజ

Sri Satyanarayana Ashtottara Shatanamavali PDF

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామపూజ గురించి తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామపూజ

  1. ఓం నారాయణాయ నమః
  2. ఓం నరాయ నమః
  3. ఓం శౌరయే నమః
  4. ఓం చోంఅక్రపాణయే నమః
  5. ఓం జనార్ధనాయ నమః
  6. ఓం వాసుదేవాయ నమః
  7. ఓం జగద్యోనయే నమః
  8. ఓం వామనాయ నమః
  9. ఓం జ్ఞానపంజరాయ నమః
  10. ఓం శ్రీవల్లభాయ నమః
  11. ఓం జగన్నాథాయ నమః
  12. ఓం చతుర్మూర్తయే నమః
  13. ఓం వ్యోమకేశాయ నమః
  14. ఓం హృషీకేశాయ నమః
  15. ఓం శంకరాయ నమః
  16. ఓం గరుడధ్వజాయ నమః
  17. ఓం పరంజ్యోతిషే నమః
  18. ఓం ఆత్మజ్యోతిషే నమః
  19. ఓం శ్రీ వత్సాంకాయ నమః
  20. ఓం అఖిలాధారాయ నమః
  21. ఓం సర్వలోకపతిప్రభవే నమః
  22. ఓం త్రివిక్రమాయ నమః
  23. ఓం త్రికాలఙ్ఞానాయ నమః
  24. ఓం త్రిధామ్నే నమః
  25. ఓం కరుణాకరాయ నమః
  26. ఓం సర్వజ్ఞాయ నమః
  27. ఓం సర్వగాయ నమః
  28. ఓం సర్వస్మై నమః
  29. ఓం సర్వేశాయ నమః
  30. ఓం సర్వసాక్షికాయ నమః
  31. ఓం హరిణే నమః
  32. ఓం శార్జినే నమః
  33. ఓం హరయే నమః
  34. ఓం శేషాయ నమః
  35. ఓం హలాయుధాయ నమః
  36. ఓం సహస్రభాహవే నమః
  37. ఓం అవ్యక్తాయ నమః
  38. ఓం సహస్రాక్షాయ నమః
  39. ఓం అక్షరాయ నమః
  40. ఓం క్షరాయ నమః
  41. ఓం గజారిఘ్నాయ నమః
  42. ఓం కేశవాయ నమః
  43. ఓం నారసింహాయ నమః
  44. ఓం మహాదేవాయ నమః
  45. ఓం స్వయంభువే నమః
  46. ఓం భువనేశ్వరాయ నమః
  47. ఓం శ్రీధరాయ నమః
  48. ఓం దేవకీపుత్రాయ నమః
  49. ఓం అచ్యుతాయ నమః
  50. ఓం పార్థసారథయే నమః
  51. ఓం ఆచంచలాయ నమః
  52. ఓం శంఖపాణయే నమః
  53. ఓం కేశిమర్ధనాయ నమః
  54. ఓం కైటభారయే నమః
  55. ఓం అవిద్యారయే నమః
  56. ఓం కామదాయ నమః
  57. ఓం కమలేక్షణాయ నమః
  58. ఓం హంసశత్రవే నమః
  59. ఓం ఆధర్మశత్రవే నమః
  60. ఓం కాకుత్థాయ య నమః
  61. ఓం ఖగవాహనాయ నమః
  62. ఓం నీలాంబుదధ్యుతయే నమః
  63. ఓం నిత్యాయ నమః
  64. ఓం నిత్యతృప్తాయ నమః
  65. ఓం నిత్యానందదాయ నమః
  66. ఓం సురాధ్యక్షాయ నమః
  67. ఓం నిర్వకల్పాయ నమః
  68. ఓం నిరంజనాయ నమః
  69. ఓం బ్రహ్మణ్యాయ నమః
  70. ఓం పృథివీనాథాయ నమః
  71. ఓం పీతవాససే నమః
  72. ఓం గుహాశ్రయాయ నమః
  73. ఓం వేదగర్భాయ నమః
  74. ఓం విభవే నమః
  75. ఓం విష్ణవే నమః
  76. ఓం శ్రీమతే నమః
  77. ఓం త్రైలోక్యభూషణాయ నమః
  78. ఓం యజ్ఞమూర్తయే నమః
  79. ఓం అమేయాత్మనే నమః
  80. ఓం వరదాయ నమః
  81. ఓం వాసవానుజాయ నమః
  82. ఓం జితేంద్రియాయ నమః
  83. ఓం జితక్రోధాయ నమః
  84. ఓం సమదృష్టయే నమః
  85. ఓం సనాతనాయ నమః
  86. ఓం భక్తప్రియాయ నమః
  87. ఓం జగత్పూజ్యాయ నమః
  88. ఓం పరమాత్మనే నమః
  89. ఓం అసురాంతకాయ నమః
  90. ఓం సర్వలోకానా మంతకాయ నమః
  91. ఓం అనంతాయ నమః
  92. ఓం అనంతవిక్రమాయ నమః
  93. ఓం మాయాధారాయ నమః
  94. ఓం నిరాధారాయ నమః
  95. ఓం సర్వాధారాయ నమః
  96. ఓం ధరధరాయ నమః
  97. ఓం నిష్కళంకాయ నమః
  98. ఓం నిరాభాసాయ నమః
  99. ఓం నిష్ప్రపంచాయ నమః
  100. ఓం నిరామయాయ నమః
  101. ఓం భక్తవశ్యాయ నమః
  102. ఓం మహోదరాయ నమః
  103. ఓం పుణ్యకీర్తయే నమః
  104. ఓం పురాతనాయ నమః
  105. ఓం త్రికాలజ్ఞాయ నమః
  106. ఓం శ్రీ విష్టరశ్రవసే శ్రీ నమః
  107. ఓం చతుర్భుజాయ నమః
  108. ఓం శ్రీ సత్యనారాయణస్వామియే నమః

నానావిధ పరిమళ,పత్ర,పుష్ప పూజాం సమర్పయామి.

ధూపమ్

మం: యత్పురుషం వ్యదధుః కతిధావ్యకల్పయస్
ముఖం కిమస్య కౌ బాహూ కాపూరూ పాదావచ్యేతే

శ్లో: దశాంగం గుగ్గూలూపేతం సుగంధంసమనోహరం
ధూపం గృహాణ దేవేశ సర్వదేవనమస్కృత
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ధూపమాఘ్రాపయామి.

దీపమ్

మం: బ్రాహ్మణోస్యముఖమూసిత్ బాహూరాజన్యః కృతః
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత

శ్లో: ఘృతాక్తవర్తిసంయుక్తం వహ్నిన యోజితం ప్రియం
దీపం గృహాణ దేవేశ త్రైలోక్యమితిమిరాపహమ్
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి.

నైవేద్యమ్

మం: చంద్రమా మనసోజాతః చక్షస్సూర్యో అజాయత
ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయు రజాయత

శ్లో: సౌవర్ణస్థాలిమధ్యేమణిగణఖచితే గోఘృతాక్తాస్ సుపక్వాస్
భక్ష్యాస్ భోజ్యాంశ్చ లేహ్యానపరిమితరసాస్ చోష్యంమన్నం నిధాయ
నానాశాకైరూపేతం దధిమధు సగుడక్షీర పానీయయుక్తం
తాంబూలం చాపి విష్ణోః ప్రతిదివసమహం మానసే కల్పయామి
రాజాన్నం సూపసంయుక్తం శాకచోష్య సమన్వితం
ఘృతభక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతామ్.

ఓం భూర్భువస్సువః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య దీమహి ధియోయోనః ప్రచోదయాత్.

సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి,
ఓం ప్రాణాయాస్వాహా – ఓం ఆపానాయస్వాహా – ఓం వ్యానాయస్వాహా –
ఓం ఉదానాయ స్వాహా – ఓం సమానాయ స్వాహా – ఓం బ్రహ్మణేస్వాహా
శ్రీ సత్యనారాయణస్వామినే నమః, మహానైవేద్యం సమర్పయామి
అమృతాపిధానమసి, ఉత్తరపోశనం సమర్పయామి.
హస్తాప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి.

తాంబూలమ్

మం: నాభ్యా ఆసీదతరిక్షంశీర్ ర్ణోద్యౌస్సమ వర్తత
పద్భ్యాం భూమిధ్ధిశశోత్రాస్ తథాలోకాగం అకల్పయస్

శ్లో: పూగీఫలై స్సకర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీ సత్యనారాయణస్వామినే నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనమ్

శ్లో: నీరాజనం గృహాణేదేవం పంచవర్తి సమన్వితం
తేజో రాశిమయం దత్తం గృహాణత్వం సురేస్వర.

శ్రీ సత్యనారాయణస్వామినే నమః కర్పూర నీరాజనం సమర్ప

తదుపరి ఇక్కడ స్వామి మంత్రపుష్పం చదువవలెను.

నారాయణ మంత్రపుష్పం

మరిన్ని అష్టోత్తరములు

Sri Gayatri Ashtottara Shatanamavali In Telugu – శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి

Sri Gayatri Ashtottara Shatanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో అష్టోత్తర అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. అష్టోత్తరములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం…

శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి

అథ అష్టోత్తర శతనామ పూజా

    1. ఓం తరుణాదిత్యసంకాశాయై నమః
    2. ఓం సహస్రనయనోజ్జ్వలాయై నమః
    3. ఓం స్యందనోపరిసంస్థానాయై నమః
    4. ఓం ధీరాయై నమః
    5. ఓం జీమూత నిస్వనాయై నమః
    6. ఓం మత్తమాతంగ గమనాయై నమః
    7. ఓం హిరణ్య కమలాసనాయై నమః
    8. ఓం దీనజనోద్ధార నిరతాయై నమః
    9. ఓం యోగిన్యై నమః
    10. ఓం యోగధారిణ్యై నమః
    11. ఓం నటనాట్యైకనిరతాయై నమః
    12. ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః
    13. ఓం ఘోరాయై నమః
    14. ఓం ఆచార క్రియాసక్తాయై నమః
    15. ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః
    16. ఓం యాదవేంద్రకులోద్భూతాయై నమః
    17. ఓం తురీయపదగామిన్యై నమః
    18. ఓం గాయత్ర్యై నమః
    19. ఓం గోమత్యై నమః
    20. ఓం గంగాయై నమః
    21. ఓం గౌతమ్యై నమః
    22. ఓం గరుడాసనాయై నమః
    23. ఓం గేయాయై నమః
    24. ఓం గానప్రియాయై నమః
    25. ఓం గౌర్యై నమః
    26. ఓం గోవిందపరిపూజితాయై నమః
    27. ఓం గంధర్వనగరాకారాయై నమః
    28. ఓం గౌరవర్ణాయై నమః
    29. ఓం గణేశ్వర్యై నమః
    30. ఓం గుణాశ్రయాయై నమః
    31. ఓం గుణవత్యై నమః
    32. ఓం గుహ్యకాయై నమః
    33. ఓం గణపూజితాయై నమః
    34. ఓం గుణత్రయసమాయుక్తాయై నమః
    35. ఓం గుణత్రయవివర్జితాయై నమః
    36. ఓం గుహావాసాయై నమః
    37. ఓం గుహాచారాయై నమః
    38. ఓం గుహ్యాయై నమః
    39. ఓం గంధర్వరూపిణ్యై నమః
    40. ఓం గార్ల్యప్రియాయై నమః
    41. ఓం గురుపదాయై నమః
    42. ఓం గుహ్యలింగాంకధారిణ్యై నమః
    43. ఓం సావిత్ర్యై నమః
    44. ఓం సూర్యతనయాయై నమః
    45. ఓం సుషుమ్నానాడిభేదిన్యై నమః
    46. ఓం సుప్రకాశాయై నమః
    47. ఓం సుఖాసీనాయై నమః
    48. ఓం సువ్రతాయై నమః
    49. ఓం సురపూజితాయై నమః
    50. ఓం సుషుప్త్యవస్థాయై నమః
    51. ఓం సుదత్యై నమః
    52. ఓం సుందర్యై నమః
    53. ఓం సాగరాంబరాయై నమః
    54. ఓం సుధాంశుబింబవదనాయై నమః
    55. ఓం సుస్తన్యై నమః
    56. ఓం సువిలోచనాయై నమః
    57. ఓం శుభ్రాంశుభాసాయై నమః
    58. ఓం సుశ్రోణ్యై నమః
    59. ఓం సంసారార్ణవతారిణ్యై నమః
    60. ఓం సామగానప్రియాయై నమః
    61. ఓం సాధ్వ్యై నమః
    62. ఓం సర్వాభరణభూషితాయై నమః
    63. ఓం సీతాయై నమః
    64. ఓం సర్వాశ్రయాయై నమః
    65. ఓం సంధ్యాయై నమః
    66. ఓం సఫలాయై నమః
    67. ఓం సుఖదాయిన్యై నమః
    68. ఓం వైష్ణవ్యై నమః
    69. ఓం విమలాకారాయై నమః
    70. ఓం మాహేంద్ద్యై నమః
    71. ఓం మాతృరూపిణ్యై నమః
    72. ఓం మహాలక్ష్మై నమః
    73. ఓం మహత్సిద్యై నమః
    74. ఓం మహామాయాయై నమః
    75. ఓం మహేశ్వర్యై నమః
    76. ఓం మోహిన్యై నమః
    77. ఓం మదనాకారాయై నమః
    78. ఓం మధుసూదనసోదర్యై నమః
    79. ఓం మీనాక్ష్యై నమః
    80. ఓం క్షేమసంయుక్తాయై నమః
    81. ఓం నగేంద్రతనయాయై నమః
    82. ఓం రమాయై నమః
    83. ఓం త్రివిక్రమపదాక్రాంతాయై నమః
    84. ఓం త్రిస్వరాయై నమః
    85. ఓం త్రివిలోచనాయై నమః
    86. ఓం సూర్యమండలమధ్యస్థాయై నమః
    87. ఓం చంద్రమండలసంస్థితాయై నమః
    88. ఓం వహ్నిమండలమధ్యస్థాయై నమః
    89. ఓం వాయుమండలసంస్థితాయై నమః
    90. ఓం వ్యోమమండల మధ్యస్థాయై నమః
    91. ఓం క్రస్థాయై నమః
    92. ఓం చక్రరూపిణ్యై నమః
    93. ఓం కాలచక్రవిధానజ్ఞాయై నమః
    94. ఓం చంద్రమండలదర్పణాయై నమః
    95. ఓం జ్తోత్స్నాత పేనలిప్తాంగ్యై నమః
    96. ఓం మహామారుతవీజితాయై నమః
    97. ఓం సర్వమంత్రాశ్రితాయై నమః
    98. ఓం ధీరాయై నమః
    99. ఓం పాపఘ్న్యై నమః
    100. ఓం పరమేశ్వర్యై నమః
    101. ఓం చతుర్వింశతివర్ణాఢ్యాయై నమః
    102. ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
    103. ఓం మందేహరాక్షసఘ్న్యై నమః
    104. ఓం షట్కుక్యై నమః
    105. ఓం త్రిపదాయై నమః
    106. ఓం శివాయై నమః
    107. ఓం జపపారాయణప్రీతాయై నమః
    108. ఓం బ్రాహ్మణ ఫలదాయిన్యై నమః

శ్రీ గాయత్రీ సావిత్రీ సరస్వతీ దేవతాభ్యో నమః
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి

శ్రీ గాయత్ర్యష్టోత్తర శతనామపూజా సమాప్తః

మరిన్ని అష్టోత్తరములు