మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో అష్టోత్తర అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. అష్టోత్తరములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళిగురించి తెలుసుకుందాం…
శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి
అథ అష్టోత్తర శతనామ పూజా
ఓం తరుణాదిత్యసంకాశాయై నమః
ఓం సహస్రనయనోజ్జ్వలాయై నమః
ఓం స్యందనోపరిసంస్థానాయై నమః
ఓం ధీరాయై నమః
ఓం జీమూత నిస్వనాయై నమః
ఓం మత్తమాతంగ గమనాయై నమః
ఓం హిరణ్య కమలాసనాయై నమః
ఓం దీనజనోద్ధార నిరతాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం యోగధారిణ్యై నమః
ఓం నటనాట్యైకనిరతాయై నమః
ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః
ఓం ఘోరాయై నమః
ఓం ఆచార క్రియాసక్తాయై నమః
ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః
ఓం యాదవేంద్రకులోద్భూతాయై నమః
ఓం తురీయపదగామిన్యై నమః
ఓం గాయత్ర్యై నమః
ఓం గోమత్యై నమః
ఓం గంగాయై నమః
ఓం గౌతమ్యై నమః
ఓం గరుడాసనాయై నమః
ఓం గేయాయై నమః
ఓం గానప్రియాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం గోవిందపరిపూజితాయై నమః
ఓం గంధర్వనగరాకారాయై నమః
ఓం గౌరవర్ణాయై నమః
ఓం గణేశ్వర్యై నమః
ఓం గుణాశ్రయాయై నమః
ఓం గుణవత్యై నమః
ఓం గుహ్యకాయై నమః
ఓం గణపూజితాయై నమః
ఓం గుణత్రయసమాయుక్తాయై నమః
ఓం గుణత్రయవివర్జితాయై నమః
ఓం గుహావాసాయై నమః
ఓం గుహాచారాయై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం గంధర్వరూపిణ్యై నమః
ఓం గార్ల్యప్రియాయై నమః
ఓం గురుపదాయై నమః
ఓం గుహ్యలింగాంకధారిణ్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సూర్యతనయాయై నమః
ఓం సుషుమ్నానాడిభేదిన్యై నమః
ఓం సుప్రకాశాయై నమః
ఓం సుఖాసీనాయై నమః
ఓం సువ్రతాయై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం సుషుప్త్యవస్థాయై నమః
ఓం సుదత్యై నమః
ఓం సుందర్యై నమః
ఓం సాగరాంబరాయై నమః
ఓం సుధాంశుబింబవదనాయై నమః
ఓం సుస్తన్యై నమః
ఓం సువిలోచనాయై నమః
ఓం శుభ్రాంశుభాసాయై నమః
ఓం సుశ్రోణ్యై నమః
ఓం సంసారార్ణవతారిణ్యై నమః
ఓం సామగానప్రియాయై నమః
ఓం సాధ్వ్యై నమః
ఓం సర్వాభరణభూషితాయై నమః
ఓం సీతాయై నమః
ఓం సర్వాశ్రయాయై నమః
ఓం సంధ్యాయై నమః
ఓం సఫలాయై నమః
ఓం సుఖదాయిన్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం విమలాకారాయై నమః
ఓం మాహేంద్ద్యై నమః
ఓం మాతృరూపిణ్యై నమః
ఓం మహాలక్ష్మై నమః
ఓం మహత్సిద్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మోహిన్యై నమః
ఓం మదనాకారాయై నమః
ఓం మధుసూదనసోదర్యై నమః
ఓం మీనాక్ష్యై నమః
ఓం క్షేమసంయుక్తాయై నమః
ఓం నగేంద్రతనయాయై నమః
ఓం రమాయై నమః
ఓం త్రివిక్రమపదాక్రాంతాయై నమః
ఓం త్రిస్వరాయై నమః
ఓం త్రివిలోచనాయై నమః
ఓం సూర్యమండలమధ్యస్థాయై నమః
ఓం చంద్రమండలసంస్థితాయై నమః
ఓం వహ్నిమండలమధ్యస్థాయై నమః
ఓం వాయుమండలసంస్థితాయై నమః
ఓం వ్యోమమండల మధ్యస్థాయై నమః
ఓం క్రస్థాయై నమః
ఓం చక్రరూపిణ్యై నమః
ఓం కాలచక్రవిధానజ్ఞాయై నమః
ఓం చంద్రమండలదర్పణాయై నమః
ఓం జ్తోత్స్నాత పేనలిప్తాంగ్యై నమః
ఓం మహామారుతవీజితాయై నమః
ఓం సర్వమంత్రాశ్రితాయై నమః
ఓం ధీరాయై నమః
ఓం పాపఘ్న్యై నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఓం చతుర్వింశతివర్ణాఢ్యాయై నమః
ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
ఓం మందేహరాక్షసఘ్న్యై నమః
ఓం షట్కుక్యై నమః
ఓం త్రిపదాయై నమః
ఓం శివాయై నమః
ఓం జపపారాయణప్రీతాయై నమః
ఓం బ్రాహ్మణ ఫలదాయిన్యై నమః
శ్రీ గాయత్రీ సావిత్రీ సరస్వతీ దేవతాభ్యో నమః
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి
అది కలియుగం ప్రారంభమైన 46వ సంవత్సరం, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పరిశోధన ప్రకారం సుమారు 5000 యేళ్ళ క్రితం) మనకందించిన, పేరు పొందిన పద్యాలలో ఒకటైనా పద్యం శ్రీకృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యద, దానిలోనినీతికథలు మీ అందరికోసం…
నీతికథలు
శ్రీకృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యదలోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విష్ణుచిత్తుని అతిథిసేవ.
విష్ణుచిత్తుని అతిథిసేవ
పాండ్యదేశంలో శ్రీవల్లి పుత్తూరు అనే భవ్యనగరం ఉండేది. ఆ నగరం మింటినంటే మేడలతో హంసల క్రీంకారాలు ధ్వనించే కొలనులతో బాతులకు ఆశ్రయమైన కాలువలతో ఉద్యానవనాలతో మామిడి పనస అరిటి మెదలైన తోటలతో అతి రమణీయంగా ఉండేది. ఆ పట్టణములో వీధులన్నీ సూత్రపట్టినట్లు వంకరలులేక చక్కగావున్నాయి.
నాలుగు వర్ణస్థులు సుఖ శాంతులతో ఉండేవారు. ఆ ఊరి స్త్రీలు మేనికి పసుపు పూసుకుని చెరువులో స్నానమాడి ఆ ఊరి దేవుడైన శ్రీ మన్నారు కృష్ణస్వామి అభిషేకానికై బిందెలలో నీళ్ళు తీసుకొని పూజకు కలువలు కోసుకొనిపోయేవారు. గ్రంథాలను ప్రబంధాలను చదువుకుంటూ కాలక్షేపం చేసేవారు.
ఆ ఊరి ప్రజలు అతిథి కనబడగానే సాష్టాంగనమస్కారం చేసేవారు. స్వాగతం చెప్పి అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సేద తీర్చేవారు. టెంకాయ ఆకుల చాపపై కూర్చోబెట్టి విశాలమైన అరటి ఆకు పఱచి భోజనం పెట్టేవారు. రాజన్నపు వరి అన్నం పప్పు నెయ్యి ఎన్నోరకాల కూరలు పాలు పెరుగు ఇచ్చేవారు.
అతిథి తృప్తిగా భుజించిన తరువాత తాంబూలమిచ్చి పాదసేవ చేసేవారు. అతిథి “వెళ్ళి వస్తాను” అనగానే శక్తికొలది అతని సత్కరించి కొంత దూరం అతనితో నడచి అతనిని సాగనంపేవారు. సేవ చేయటానికి అంత కొంచం అవకాశం దొరికిందని విచారిస్తూ తిరిగి వచ్చేవారు. ఈ విధముగా అతి శ్రద్ధతో ప్రతిదినమూ అతిథి అభ్యాగతుల సేవ చేసేవారు ఆ ఊళ్ళోని గృహస్థులు.
అలాంటి ఉన్నత జీవనం సాగిస్తున్న శ్రీవల్లిపుత్తూరు ప్రజల మధ్యలో గరుత్మంతుడి అంశతో భట్టనాథుడనే భాగవతోత్తముడు జన్మించినాడు. అతడు సమవర్తి స్థితప్రజ్ఞుడు. కష్టసుఖాలను లెక్కించేవాడు కాడు. భట్టనాథుడు నిత్యం తులసిమాలలు చెంగల్వదండలు కట్టి మన్నారు. కృష్ణస్వామికి సమర్పించేవాడు.
దేవాలయంలో ఉన్న వటపత్రశాయిని సేవించడం అతని నిత్యకృత్యము. ఏమి విద్యలూ అభ్యసించకపోయినా జ్ఞానం వైరాగ్యం కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ విష్ణువునే ధ్యానిస్తూ ఉండేవాడు. అతని నిష్కల్మష భక్తికి మెచ్చి శ్రీహరి అతని హృదయంలో ఎల్లప్పుడూ నివసించేవాడు. అందుకనే భట్టనాథునికి విష్ణుచిత్తుడనే సార్థకనామధేయం వచ్చింది.
“మానవ సేవే మాధవ సేవ భవతరణానికి నావ” అనే సూక్తిని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు విష్ణుచిత్తుడు. అతడు ఎంతో భక్తితో అతిథిని సేవించి సేద తీర్చేవాడు. వానాకాలంలో వరి అన్నం పప్పు నాలుగైదు కూరలు వరుగులు వడియాలు పెరుగు మొదలైన వాటితో అన్నం పెట్టేవాడు.
వేసవిలో ముందుగా అతిథికి శ్రీచందనం ఇచ్చేవాడు. తాపం తీరిన అతిథికి వేడి అన్నం తియ్యని చారు మజ్జిగ పులుసు చెఱుకురసం లేత టెంకాయనీళ్ళు భక్ష్యాలు ఫలాలు సుగంధభరితమైన చల్లని నీళ్ళు వడపిందెలు మజ్జిగ మొదలైన వాటితో విందు చేసేవాడు.
శీతాకాలంలో పునుగు వాసనగల రాజనపు అన్నం మిరియపుపొడి వేడి వేడి కూరలు ఆవపచ్చళ్ళు పాయసం ఊరగాయలు వేడిగావున్న నెయ్యి పాలు మొదలైనవాటినిచ్చి అతిథిని సంతృప్తి పఱచేవాడు. ఈతడు ఎంతటి భక్తుడంటే ఏ విద్యలూ నేర్వకుండానే ఆ దేశపురాజైన వల్లభదేవునికి నారాయణుని పరతత్త్వం బోధించగలిగినాడు. సాక్షాత్కరించిన విష్ణువుకి తన దృష్టి తగులుతుందేమో నని పరమాత్మకే మంగళశాసనం చేశాడు! గోదాదేవిని శ్రీహరికి కన్యాదానం చేసి లోకనాథునికే మామ అయినాడు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
1. ఏ కాలానికి హితమైన ఆహారము ఆ కాలంలో అతిథికి ఇచ్చి అద్వితీయ అతిథిసేవ చేసి మనకు మార్గదర్శి అయినాడు పరమ భక్తుడైన విష్ణుచిత్తుడు.
2. ప్రపంచం ఇంకా కన్నువిప్పనినాడే అన్ని రంగాలలో అగ్రశ్రేణిలో ఉండదగిన శ్రీవల్సిపుత్తూరు వంటి నగరాలు ఎన్నెన్నో మన దేశంలో!
ఆధ్యాత్మికతలోనే కాక నాగరిక జీవనంలో కూడా ప్రపంచానికి గురువై బోధించిన భారతదేశంలో పుట్చిన మనం అదృష్టవంతులము.
ప్రభూ! పరమసుఖమిచ్చేది ఈ ప్రపంచంలో యేదన్నా వున్నదంటే అది నీపై కలిగిన భక్తి మాత్రమే. అయితే ప్రాపంచిక సుఖాలు మాత్రమే అవసరం అనుకొన్నంత కాలమూ భక్తి రుచి మనిషి గ్రహించలేడు. యుక్తాయుక్త విచక్షణ వున్న వారికి నిజమైన సుఖము ఒక్క భక్తియేనని తెలుస్తుంది. శ్రీవేంకటేశ్వరుని కొలిచిన ఆనందము పెరగటమే కాదు ఆపైన ఇక బెళకులుండవుట. కులము, ధనము, పేరు ప్రతిష్ఠలు, విద్యావైశిష్ట్యమూ… యేవీ శ్రీహరి భక్తికి సాటిరావంటున్నారు.
భావ వివరణ:
ఓ దేవదేవా! మాకు నీపై భక్తియొక్కటే పరమ సుఖము (దైవికమైన సౌఖ్యమును) ప్రసాదించును. యుక్తి జూచిన (విచక్షణతో పరికించిన) ఆ పరమసుఖము ఒక్కటే నిజమైనది. మరియేదియును లేదు.
ఎవ్వరి“కులమై”నా యెంతగొప్పదైనా ప్రయోజనమేమిటి? దానివల్ల గర్వం పెరుగుతుంది, అంతేకద! జగడమెందుకువస్తుంది? యెంత ‘చలము’ (ద్వేషము) వుంటే, అది అంత వస్తుంది. ‘తలపు’ అధికమయిందంటే కోరిక తగులుకొంటుంది. అవన్నీ పీడిస్తున్నవాడికి యెలమి (అతిశయించిన విజ్ఞానము (భగవత్సంబంధమైన జ్ఞానము)
యెలాకలుగుతుంది?
ఇంకొక వింత యేమిటంటే ధనమెంత పెరుగుతుంటే లోభత్వం అంత యెక్కువవుతుంది. స్త్రీ పురుషులలో సౌందర్యమెక్కువైతే మోహము వారిపై పెరుగుతుంది. పోనీ విద్య వలన కూడా మంచి జరుగదు. భక్తిలేనివాడికి యెంత విద్యవున్నా అది మదమును పెంచటానికి తప్పించి ఇంకెందుకు ఉపయోగిస్తుంది? ఎనయగ (అవన్నీ వృద్ధిచెందివున్నచోట) పరమపదము ఇంచుకయినా సాధ్యంకాదు.
తరుణులు (స్త్రీలు) యెంతమందివున్నా పురుషులకు మదనతాపము కలుగుతూనే వుంటుంది. ఏమాత్రం తగ్గదు. సిరిసంపదలెన్నివున్నా చింతలు (దిగులు) పెరుగుతుందేకాని తరుగదు. స్థిరమైన శ్రీవేంకటేశ్వరా! నిన్ను కొలిచినయెడల ఆనందము పెరుగుతూనే వుంటుంది. వారికి బెళకులు (చలించిపోవుటలు) లేవు (వుండవు).
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…
శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు
1. షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము
2. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు
3. ఈ బౌతికదేహానంతరం నేను అప్రమత్తుడను.
4. నాభక్తులకు రక్షణ నాసమాధినుండియే వెలువడుచుండును. 5. నా సమాధినుండియే నామనుష్యరూపము మాట్లాడును.
6. నన్నాశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
7. నా యందు యెవరికి దృష్టికలదో, వారియందే నా కటాక్షము. 8. మీ భారములు నా పై పడవేయుడు. నేను మోసెదను.
9. నా సహాయముగాని, సలహాగాని కోరిన తక్షణమొసంగ సంసిద్ధుడను.
10. నా భక్తుల యింట ‘లేమి’ యను శబ్దము పొడసూపదు.
11. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్ ఒక తెలుగు భక్తి గీతంగా తెలుగు వారు ప్రధానంగా పాడే భక్తి సంగీత క్రియలలో ఒకటి. ఈ సుప్రభాతం ఆంజనేయ స్వామిని స్తుతించడానికి సమర్థమైనది. ఈ గీతం భక్తులకు మాత్రమే కాదు, ప్రత్యేకంగా తెలుగు సాంస్కృతిక వ్యవహారాలలో ప్రచురించబడుతుంది. అది భక్తి, ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక సమృద్ధికి ప్రధాన పాత్రని ప్రదర్శిస్తుంది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు అక్షయ తృతీయ అధ్యాత్మ దర్శనము గురించి తెలుసుకుందాం.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
వివిధ పురాణాల లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గౌతమ మహర్షి కథ.
గౌతమ మహర్షి కథ
ఒకసారి సృష్టికర్త అయిన చతుర్ముఖుడు సరస్వతీదేవిని మెప్పించటానికి అహల్యను సృష్టించాడు. “న హల్యతి ఇతి అహల్య”. అంటే ఎందులో నూ అఱకొఱలు లేనిది సాటిలేనిది అని అర్థము. బ్రహ్మదేవుడు ఆ అపూర్వ గుణవతి సౌందర్యవతికి వరుడెవ్వడని యోచించి తీవ్ర బ్రహ్మచర్య నిష్ట నిగ్రహం ఉన్న సంయమీంద్రుడే ఆమె భర్తకాగలడని నిశ్చయించినాడు. గౌతమ మహర్షి అట్టి ధీరుడని కనుగొని ఆతనిని పరీక్షించుటకై “నాయనా! ఈ అతిలోక సుందరి నా పుత్రిక అహల్య.
ఈమెను నీ ఆశ్రమములో వదిలి వెళుతున్నాను. జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ వచ్చి ఆమెను తీసుకువెళతాను” అని ఆజ్ఞాపించాడు. ఆ పరమేష్టికి ప్రీతిచేయుట కంటే అధికమేమున్నది తలచి గౌతముడు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించాడు. ఎంతో కాలము గడచిపోయింది. అయినా ఎన్నడూ సంయమీంద్రుడైన ఆ గౌతముడు అహల్యను చూసి చలించలేదు. పరమశివభక్తుడైన ఆ గౌతముడు పంకజాసనుని పరీక్షలో నెగ్గాడు. గౌతముని నిగ్రహాన్ని మెచ్చుకొని అహల్యను అతనికి అర్థాంగిగా అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు.
మహర్షులు తపస్సుకై అనేక ప్రాంతాలు సంచరిస్తూ కొన్ని చోట్ల నివసించి తమ తపశ్శక్తి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం పునీతం చేసి మరొకప్రాంతానికి వెళుతుంటారు. అలా ఒకసారి గౌతమ ఆహల్య దంపతులు త్ర్యంబకేశ్వరుని సన్నిధి వద్దనున్న బ్రహ్మగిరిపై ఆశ్రమం నిర్మించుకొని అక్కడ ఉండసాగినారు.
గౌతముడు వ్యవసాయ భూ జల శాస్త్రాలలో నిపుణుడు. భారతీయుల వేదవిజ్ఞానం భౌతికమైన విజ్ఞానమే కాక దానికి ఆధారమైన ఆధ్యాత్మిక దైవిక విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. గౌతముడు భౌతిక విజ్ఞానముతో సాధించలేని పనులను దైవికశక్తి ద్వారా సాధించి ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేశాడు. ప్రకృతిని క్షోభించకుండా వివిధ రకాలుకా కాలువలు జలాశయాలు నిర్మించి ఎందఱినో ఆదుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి ఆయన ఉన్న ప్రాంతములో క్షామము వచ్చింది. యోగీశ్వరులు తప్ప మిగిలినవారంతా ప్రాణాలు కాపాడుకోవటానికి తాలా ఒక వైపుకి వెళ్ళిపోయారు. దయాళువైన గౌతముడు ప్రజల పశుపక్షాదుల బాధలు చూడలేకపోయాడు. అనివార్యమైన ప్రారబ్ధాన్ని కూడా మార్చగలిగే శక్తి తపస్సుకున్నదని తెలిసిన గౌతముడు ఆఱు నెలలు వరుణదేవునికై తీవ్ర తపస్సు చేసినాడు.
గౌతముడి పరోపకారబుద్ధికి మెచ్చి వచ్చిన వరుణుడిని గౌతముడు వర్షాన్ని ప్రసాదించమని కోరినాడు. అప్పుడు ఆ వరుణుడు “ఓ మునీంద్ర! కాలధర్మమును అతిక్రమించి వర్షించలేను కదా! మహాకాలుడైన ఆ పరమేశ్వరుని ఆజ్ఞానుబద్ధులము మేము. జీవుల పాపపుణ్యాలను అనుసంధానము చేసి ఆ మహేశ్వరుడు మా ద్వారా ప్రకృతిని శాసిస్తాడు. ఇప్పుడు కొంతకాలము క్షామము తప్పదు” అని అన్నాడు. ప్రాణులను రక్షించాలని దృఢ సంకల్పంతో ఉన్న గౌతముడు అక్షయజలం కోరాడు. వరుణుడు అక్షయజలాన్ని అనుగ్రహించాడు. ఇలా తన తపశ్శక్తి ద్వారా గౌతముడు ప్రాణికోటికి ప్రాణదానం చేశాడు.
అహల్యా గౌతమ దంపతులు నిరంతర అతిథిసేవా పరాయణులు. గౌతముడు తన వ్యవయాస శాస్త్ర విజ్ఞానముతో శిష్యుల సహాయముతో వరి కాయగూరలు మొదలైన పంటలు పండించేవాడు. పరమసాధ్వి పతివ్రత అయిన అహల్య ఆ పంటలనుండి వచ్చిన వాటిని వండి అతిథులకు ఆర్తులకు పెట్టేది. అపర అన్నపూర్ణ వలె విరాజిల్లేది ఆ అహల్య.
ఇలా ఉండగా గౌతమ అహల్యల అద్వితీయ అతిథిసేవ వారి ధర్మనిరతి చూసి ఈర్ష చెందారు కొందరు మునులు! ఆహా! ఈర్ష అతి దారుణామైనది. అది మహామేధావులైన మునులను సైంతం విడువదు. “ఈ జలం తాము తెచ్చిందేననే అహంకారంతో విర్ర వీగుతున్నారీ అహల్యాగౌతములు” అంటూ కువ్యాఖ్యానాలు చేసేవారు. ఈర్ష మత్సరముగా మారి చివరికి వాళ్ళు గౌతముని అక్కడనుండి వెళ్ళగొట్టాలని నిశ్చయించుకున్నారు. అన్నం పెట్టిన గౌతమునికి కృతజ్ఞత చూపక పోవటమేకాక అతనికి కీడు చేయాలని అనుకున్నారు. మత్సర ముతో బాధ పడుతున్నవాడు ఎంత పాపకార్యము చేయటానికైనా వెనుకాడడు కదా!
గౌతముడు తప్పస్సును లోకహితార్థము ఉపయోగించితే ఈ మునులు మత్సరముతో అతనికి హానిచేయటానికి ఉపయోగించారు. పవిత్రమైన మంత్రములను లౌకిక స్వార్థ ప్రయోజనాలకై వాడకూడదని తెలిసికూడా ఆ మునులు గౌతమునికి కీడు చేయాలనే ఉద్దేశ్యముతో మహాగణపతిని మంత్రబద్ధముగా ఉపాసనచేశారు. ప్రత్యక్షమైన విఘ్నేశ్వరునితో తమ కోరిక చెప్పారు. ఆ వినాయకుడు ఆశ్చర్యపడి “ఔరా! ఏమి చిత్రము!
ప్రాణదాతకి ప్రత్యుపకారం చేయకపోగా అతనికి అపకారం చేస్తున్నారే! ఇట్టి కృతఘ్నుల పాపానికి నిష్కృతి ఉండదు” అని తలచి “నాయనలారా! అపకారికి ఉపకారము చేయమని మన శాస్త్రాలు ఘోషిస్తుంటే మీరు కనీసము కృతజ్ఞతా ధర్మాన్ని కూడా పాటించుట లేదెందులకు? ఈ ప్రయత్నం మానండి. కృఘ్నతకు మించిన పాపం లేదు” అని హితవు చెప్పాడు. “స్వామి! నీవు నిజంగా మంత్రబద్ధుడవే అయితే మా కోరిక తీర్పు” అని సమాధానం చెప్పారు ఆ మునులు. “ఎవరి కర్మకు వారే బాధ్యులు. అటులనే అగుగాక” అని అంతర్ధానమయ్యాడు మహాగణపతి.
గణేశుడు ఒక మాయాధేనువును సృష్టించినాడు. అది గౌతముడి పొలాన్ని పాడుచేయసాగినది. పవిత్రమైన గోమాతను ఎన్నడు ఆదిలించరాదని తెలిసిన గౌతముడు ఆ మాయాధేనువును పక్కకి పంపాలని గడ్డి పరకలు తీసుని గోవుపై వేశాడు. దానికే అది మృతిచెందినది. గౌతముడు దుఃఖిస్తూ “పరమేశ్వరా! నేనేమి అపరాధము చేసినాను? గడ్డిపరకలు తగిలి గోవు మృతిచెందుటేమి? నన్ను ఈ ఘోరమైన గోహత్యాపాతకము నుండి రక్షించు స్వామి!” అని ఆక్రోశించాడు. ఇలా బాధపడుతున్న గౌతముని చూసి ఆ మునులు “గోహత్య వంటి మహాపాతకము చేసిన మీరు పవిత్రమైన ఈ ఆశ్రమములో ఉండకూడదు. తక్షణం వెళ్ళిపోండి” అని తూలనాడి రాళ్ళు విసిరి వెళ్ళగొట్టారు.
మహాపాపము చేశానే అనే దుఃఖంతో గౌతముడు అహల్య ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయారు. సకల ధర్మసూక్ష్మాలు తెలిసిన ఆ గౌతమ మహర్షి ప్రాయశ్చిత్త విధానము తెలిసికూడా పండిత మండలిచే ఆమోద ముద్ర వేయించుకోవాలనే ఉద్దేశ్యముతో క్రోశదూరం వెళ్ళినా తిరిగివచ్చి తనకు అపకారం చేసిన మునులకు నమస్కరించి “అయ్యా! నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉపదేశించండి” అని ప్రార్థించాడు! “గౌతమా! చేసిన తప్పు చెప్పుకుంటూ పృథ్వికి ముమ్మార్లు ప్రదక్షిణము చేసి ఇక్కడ మాసవ్రతము చేయాలి. లేదా ఈ బ్రహ్మగిరికి నూటొక్కమార్లు ప్రదక్షిణములు చేసి కోటి పార్థివలింగారాధన చేసి గంగాస్నానము చేయాలి” అని ప్రాయశ్చిత్త మార్గాన్ని బోధించారు. గౌతమ మహర్షి అటులనే చేశాడు. అప్పుడు పరమశివుడు సంతోషించి.
“నాయనా! గౌతమా! నీవు ధన్యుడవు. ఆజన్మ శుద్ధుడవైన నీకు పాపము లేదు. ఇదంతా ఆ మునుల కుతంత్రము. ఈ కృతఘ్నులకు ప్రాయశ్చిత్తము లేదు. వీరు భ్రష్టులై వేదమార్గాన్ని వదిలి నాకు దూరమవుతారు. వీరి వంశములోని వారంతా పతితులవుతారు. వత్సా! ఏదైనా వరం కోరుకో. ప్రసాదిస్తాను.” అని అన్నాడు. కరుణామయుడైన గౌతముడు “స్వామి! ఈ మునివరులు నాకు ఉపకారమే చేసినారు. వీరివల్లనే కదా నేడు నాకు నీ దర్శన మహద్భాగ్యము కలిగినది!” అని అన్నాడు. పరమశివుడు గౌతముని క్షమాగుణము చూసి సంతోషించాడు. “స్వామి! లోకకళ్యాణార్థము గంగను ప్రసాదించు” అని కోరాడు గౌతముడు. పరమశివుని సంకల్ప మాత్రాన ప్రత్యక్షమైన గంగాభవానిని స్తుతించి గౌతముడు “భాగీరథిపై ఉత్తర భారతమును అనుగ్రహించినట్టే గోదావరిపై దక్షిణ భారతాన్ని ఆంధ్రభూమిని పునీతము చేయి తల్లీ!” అని ప్రార్థించాడు.
గంగాదేవి కోరిక పై స్వామి త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ రూపుడై గోదావరినది జన్మస్థానములో అవతరించాడు. గౌతమ మహర్షి పేఱున ఆ నది గౌతమీనదిగా ప్రసిద్ధికెక్కినది.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
ఈ ప్రపంచానికి ఆధారమైన నాలుగు పుణ్యస్తంభాలు: భూతదయ నిరహంకారం పరోపకారం ఇంద్రియ నిగ్రహమ్. ఈ గుణాలు నిండుగా ఉన్న గౌతముడు మనకు ఆదర్శపురుషుడు. బ్రహ్మదేవుని పరీక్షలో నెగ్గి గౌతముడు తన అఖండ మనోనిగ్రహాన్ని మనకు చూపినాడు. క్షామము నుండి ప్రాణులను కాపాడి తన దయ పరోపకార బుద్ధి చూపినాడు. సకల ధర్మరహస్యాలు తెలిసినా పండితుల వద్దకు వెళ్ళి ప్రాయశ్చిత్త విధానము తెలుసుకొని తన వినయవైభవాన్ని చాటినాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
ఈవిధముగ రామభక్తుడగు హనుమంతుని నామ సహస్రమును రెండు సార్లు గాని, మూడు సార్లు గాని ప్రతిదినము శ్రద్ధతో పఠించువారలకును, పఠింపచేయు వారలకును, సర్వకార్యములు సిద్ధించును. దేవీ! మోక్షార్ధి పైసహస్రనామములను బరించినయెడల మోక్షమును బొందును. కాముకుడు తన కోరికను దీర్చుకొనును. విద్యార్థిగనున్న వాడు హనుమత్సహస్రనామ పారాయణముచే విద్యలను పొందును. మనస్సులో వాంఛలు గలవాడు పఠించుటచే వాంఛాసిద్ధి నొందును. ధర్మార్థియగునతడు పఠించుటచే అక్షయమైన ధర్మమును పొందును. పుత్రాగ్ని యగువాడు పఠించినచో పుత్రప్రాప్తి గలవాడగును. క్షేత్రకాముడు క్షేత్రమును, పశుకాముడు పశువులను బొందును. సహస్రనామ పఠనముచే దుస్స్వప్నములు నశించును. మణియు సమస్త దుఃఖములు తొలగును. సకల సంపదలు వృద్ధినొందును. అశ్వత్థ మూలమునందు గూర్చుండి పై సహస్రనామములను బరించువారలకు శత్రుక్షయమగును. శత్రుభయము నొసగును. త్రికాలముల యందు బఠించువారలకు కార్యసిద్ధి కరతలామలకమై యుండును.
రవివారమున రాత్రి మధ్యభాగమున దశావర్తముగ పఠించినచో సర్వార్ధసిద్ధిని బొందును. మంగళవారమున తెల్లవారు సమయమున పఠించినచో సార్వభౌముడగును. ఆదివారము జిల్లేడు చెట్టు మొదట నుండి పై సహస్ర నామములను పఠించినచో దీర్ఘాయుష్మంతుడును, పుత్రవంతుడును జయముగలవాడు నగును. బ్రాహ్మీముహూర్తమున లేచి దీనిని పఠించిన వారలకు సమస్తమయిన యభీష్టములు సిద్ధించును. యుద్ధము చేయుచున్న వారలు పఠించినచో శత్రువులు పారిపోవుదురు. మరియు గ్రహబాధలు తొలగును. సహస్రనామ పారాయణము వలన జ్వరాపస్మార పాండుక్షయాది సర్వరోగములు నివారణమగును. ఇంతియే కాక హనుమదను గ్రహములు సర్వసౌఖ్యములు గలుగును. సర్వము సిద్ధించును. సర్వ కామములు ఫలించును.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీ పద్మ పురాణం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… దధీచి మహర్షి నీతికథ.
దధీచి మహర్షి కథ
పూర్వం పరా త్వష్ట అనే దంపతులుండే వారు. ఎంతకాలం గడచినా వారికి సంతానం కలగలేదు. ఆమె పుత్రప్రాప్తికై పరమేశ్వరునకు తపము చేయసాగింది. ఏకాగ్ర చిత్తంతో మహాదేవుని ధ్యానంచేసింది. వేయి సంవత్సరముల పరాసాధ్వి యొక్క తపస్సునకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమైనాడు. ఆమె “పరమశివా! శూరుడు శస్త్రాస్త్రాలకు చంపబడని వాడు విప్రదానవ రూపధరుడు అయిన పుత్రుని ప్రసాదించు” అని కోరినది.
పరమేశ్వరుని వరానుసారం ఆమెకు వృత్రుడనే పుత్రుడు కల్గినాడు. స్వయంగా శుక్రాచార్యులవారే ఆ వృత్రునికి విద్యాబోధచేసినాడు. వరప్రభావంతో గురుకృపతో మహాతేజసంపన్నుడైనాడు వృత్రుడు. కాని అతనిలో బలగర్వం ఎక్కువయ్యింది. చివరికి దేవేంద్రుని మీద దండెత్తాడు! అమిత బలవంతుడైన వృత్రుడు దేవాధిపతి అయిన ఇంద్రుడు 3000 యేండ్లు యుద్ధం చేశారు. చివరికి వృత్రుడు విజయం పొందాడు. పరాజితుడైన శచీపతి బ్రహ్మలోకం చేరాడు. మించిన బలగర్వం మత్సరంగా మాఱగా వృత్రుడు శుక్రాచార్యునితో ఇలా అన్నాడు
“యుద్ధంలో ఓడిన ఇంద్రుడు బ్రహ్మలోకం వెళ్ళాడు. నేనూ అక్కడి వెళ్ళాలి. దారిచెప్పండి”. శుక్రుడిలా బదులిచ్చాడు “రాక్షసనాథా! నీవు బ్రహ్మలోకానికి పోలేవు. తృప్తికి మించిన సంపద లేదు. త్రిలోకాధిపత్యంతో సంతృప్తిపడు”. “ఇంద్రుడున్నంత వరకూ నాకు సుఖంలేదు. వాడిని నాశనం చేయాలి. ఇంద్రుడికి బ్రహ్మలోకం వెళ్ళే అర్హత ఎలా వచ్చింది? నాకెందుకు లేదు” అని వృత్రుడన్నాడు. “పూర్వం పవిత్రమైన నైమిశారణ్యంలో ౧౦౦౦ సంవత్సరాలు ఇంద్రుడు శివునికై తీవ్ర నిష్టతో తపస్సు చేశాడు. అంతటి తపశ్శాలి కనక బ్రహ్మలోక ప్రవేశం ఇంద్రునికి శంకరుని అనుగ్రహం వలన కలిగింది” అని చెప్పాడు శుక్రుడు. వెంటనే వృత్రుడు నైమిశారణ్యం చేరి తపస్సు ఆరంభించాడు.
దుష్టుడైన వృత్రుని సంహారమునకు శ్రీకారం చుట్టిన మహావిష్ణువు ఇంద్రునితో ఇలా అన్నాడు “సురేశ్వరా! పరమేశ్వరుని వర ప్రభావం వలన వృత్రుడు శస్త్రాస్త్రాలకు అవధ్యుడు. సరస్వతీ నదీ తీరంలో పరమనిష్ఠతో దధీచి మహర్షి తపమాచరిస్తునాడు. నూరుమూరల ప్రమాణంలో ఉన్న ఆ మహనీయుని వెన్నెముక ప్రజ్రముకంటే రెండు రెట్లు పటిష్టమైనది. ఆ దయాళువును లోకహితార్థము తన అస్థిని ఈయమని ప్రార్థించండి”. నారాయణుని అనుజ్ఞ తీసుకుని దేవేంద్రుడు కురుక్షేత్రంలో నదీతీరంలో ఉన్న మహర్షిశిరోమణి వద్దకు వెళ్ళాడు.
దధీచి మహర్షి ఇంద్రుని రాకకు కారణమేమని అడిగినాడు. ఇంద్రుడు పూర్వ వృత్తాంతమంతయు తెలిపి ఇలా అన్నాడు “మహానుభావా! వృత్రుని ఆగడాలు మితిమీఱుతున్నాయి. అతని సంహరించకపోతే విబుధ (పండిత) వినాశం తప్పదు. దయచేసి మీ అస్థిని మాకు ప్రసాదించండి”.
ఇంద్రుడు చేసిన ప్రార్థన విని దధీచి మహర్షి మహదానందంతో పొంగిపోయాడు. లోక హితార్థము తన శరీరం వినియోగపడటం కన్నా కావలిసినది ఏమున్నదన్నాడు. యోగశక్తితో శరీరత్యాగం చేశాడు! దధీచి మహర్షి చేసిన అసామాన్యమైన త్యాగానికి విభ్రమితుడైన వేల్పుదొర దధీచికి నమస్కరించాడు. అస్థితో వజ్రాయుధాన్ని చేయించి లోకభీకరుడైన వృత్ర సంహారం చేశాడు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
మహనీయులు పరోపకారార్ధము తమ శరీరమును కూడా త్యాగం చేయడానికి వెనకాడరు. అడగంగానే మహదానందంతో ఇంద్రునికి తన అస్థిని ఇచ్చి దధీచి మహర్షి మహకు మార్గదర్శి అయినాడు.
గర్వం అహంకారం వినాశ హేతువులు. బలగర్వంతో హుంకరిచిన వృత్రుడు ఎంతో వరబలం ఉండికూడా మత్సరంతో ఇంద్రుని నాశనం చేయబోయి తానే నాశనమైనాడు.