Gouthamudi Enugu In Telugu – గౌతముడి ఏనుగు

Gouthamudi Enugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గౌతముడి ఏనుగు కథ. 

గౌతముడి ఏనుగు

ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లిలేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. స్వాభావికముగా దయార్ద్రహృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకు వచ్చి పెంచుకున్నాడు. కాలక్రమేణ అది పెరిగి పెద్దదయింది. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగినాడు. గౌతముడు “తల్లీ తండ్రీ లేని ఈ ఏనుగును నా సొంత బిడ్డలా పెంచుకుంటున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది. యజ్ఞాలకు అడివినుంచి దర్భలు సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకు” అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు “నీవు అడిగినన్ని గోవులు కావలిసినంత బంగారము ఇస్తాను. ఈ ఏనుగును నాకు ఇవ్వు” అని అన్నాడు. “రాజా! దీని చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను. నీవు ఎన్ని గోవులిచ్చినా నాకు అక్కరలేదు. మునివేషములో ఉన్న నాకు హిరణ్యముతో అసలు అవసరములేదు” అని బదులిచ్చాడు గౌతముడు.

ధృతరాష్ట్రుడు “మునులకు అవసరమైనవి గోవులుకాని ఏనుగులు కావు. ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా! రాజునైన నేను స్వయముగా వచ్చి ఏనుగును ఇమ్మనినా కాదంటావా?” అని న్యాయం అడిగాడు. అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు “పుణ్యాత్ములు ఆనందించే పాపాత్ములు దుఃఖించే యమలోకానికి వేళదాము రా! యమసభలోనే న్యాయనిర్ణయం జరుగని” అని అన్నాడు.

ధృతరాష్ట్రుడు: “నాస్తికులు పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు ఆ దారుణమైన యమలోకములో. నేను రాను.”

గౌతముడు: “సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాము. అతనే న్యాయం చెప్తాడు.”
ధృతరాష్ట్రుడు: “అక్కాచెళ్ళెళ్ళను తల్లిదండ్రులను దయతో చూసుకునే వారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు. నేను రాలేను.”

గౌతముడు: “అయితే వైకుంఠధామ సమానమైన గంగాతీరానికి వెళదాము. వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అతిథి అభ్యాగతులకు పెట్టి ఆ తరువాత తినే వాళ్ళే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలరు. నేనెందుకు వస్తాను?”

గౌతముడు: “పోని పవిత్రమైన మేరువనానికి రా!”
ధృతరాష్ట్రుడు: “సత్యము దయ మృదువర్తనము భూతదయ ఉన్నవాడే అక్కడికి వెళ్ళగలడు. వేరే చోటు చెప్పు.”

గౌతముడు: “విష్ణుస్వరూపుడైన నారదుని విహారస్థలానికి వెళదాము. పద! అప్సరసలు కిన్నెరులు ఉంటారక్కడ”
ధృతరాష్ట్రుడు: “సంగీత నృత్యాలతో దేవతార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరక్కడికి. నావల్ల కాదు.”

గౌతముడు: “అలాగా! అయితే దేవతలు విహరించే ఉత్తర కురుభూములకు వెళదాం రా!”
ధృతరాష్ట్రుడు: “కామము హింస మొదలైనవి లేని వాళ్ళు అక్కడికి వెళతారు. వచ్చుట నా తరము కాదు.”

గౌతముడు: “అమృతకిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయము చేసే చంద్రుని వద్దకు వెళదాము. సరేనా?”
ధృతరాష్ట్రుడు: “దాననిరతులు పరమ శాంతచిత్తులు అక్కడికి వెళ్ళగలరు. వచ్చుట నాకు సాధ్యము కాదు.”

గౌతముడు: “సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్యభగవానుడు. ఆయన వద్దకు వెళదాము. దయలుదేరు.”
ధృతరాష్ట్రుడు: “అమ్మో! తపస్స్వాధ్యాయనిరతులే ఆయన దర్శనము చేయగలరు. నన్ను విడిచిపెట్టు.”

గౌతముడు: “పోనీ వరుణుడి దగ్గరకు వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు.”

గౌతముడు: “దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్థిద్దాము.”
ధృతరాష్ట్రుడు: “శూరులు సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు. నేను రాను.”

గౌతముడు: “ప్రజాపత్య లోకానికి వెళదాము.”
ధృతరాష్ట్రుడు: “అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళకు స్థానమది.”

గౌతముడు: “గోలోకం?”
ధృతరాష్ట్రుడు: “తీర్థాలు సేవించినవారు బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరెదరు. నేనెలా రాగలను?”

గౌతముడు: “సరే! అయితే బ్రహ్మసభకు వెళదాము రా!”
ధృతరాష్ట్రుడు: “అసంగులు (లౌకిక బంధాలు లేనివారు) ఆధ్యాత్మవిద్య తెలిసిన వారు వెళ్ళగలరు అక్కడికి. నావంటి వాడు ఆ లోకము చూడనే లేడు.”

ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు “మహానుభావా! నీవు దేవేంద్రుడవు. ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవరికి తెలుసు?” అని పాదాభివందనము చేశాడు గౌతముడు. “అయ్యా! నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు. మీరు మహానుభావులు కాబట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగినారు. మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపఱచండి” అని ప్రార్థించాడు దేవేంద్రుడు. సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

ఏ పుణ్యకార్యములు మనము చేయవలెనో తద్వారా ఏ ఏ పాపకార్యములు మనము చేయకూడదో వివరముగా దేవేంద్రుడు మనకు ఈ కథలో బోధించినాడు. (ధృతరాష్ట్రుడు అంటే శరీరమును ధరించినవాడు. అంటే మానవుడు. కాబట్టి మావనుడు ఏ పుణ్యకార్యాలు చేయాలో మనకు ఈ కథలో తెలిసింది) కానీ అందఱూ అన్నీ చేయలేరు. ఉదాహరణకు కలియుగములో అశ్వమేధ రాజసూయ యాగములు చేసే అర్హత మానవులకు లేదు. కాబట్టి అందఱూ చేయదగ్గ పుణ్యకార్యాలు మనము తప్పకుండా చేయాలి: తల్లిదండ్రుల సేవ, అతిథిసేవ, సత్యం, భూతదయ, గీతనృత్యాదులతో దేవతార్చన, దానము, స్వాధ్యాయనము, తీర్థయాత్రలు, బ్రహ్మచర్య పాతివ్రత్యాది వ్రతములు..

మరిన్ని నీతికథలు మీకోసం:

Idanindariki Nelikaivunnadu In Telugu – ఈడనిందరికి నేలికైవున్నాడు

ఈడనిందరికి నేలికైవున్నాడు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఈడనిందరికి నేలికైవున్నాడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఈడనిందరికి నేలికైవున్నాడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన: ఈడనిందరికి నేలికైవున్నాడు
సంఖ్య : 289
పుట: 194
రాగం: శుద్ధవసంతం

శుద్ధవసంతం

43 ఈడ నిందరికి నేలికై వున్నాఁడు
వాడల రేపల్లె వాఁడా వీఁడు

||పల్లవి||

భారపువుట్లపాలుఁ బెరుగులు
వారలు వట్టినవాఁడా వీఁడు
కోరి గొల్లెతల కొలనిలోపల
చీరలు దీసిన శిశువా వీఁడు

||ఈడు||

ఆవులఁ బేయల నందరియిండ్ల
వావిరిఁ గాచిన వాఁడా వీఁడు
వావు లొక్కటిగా వనితలఁ గూడి
వేవేలు నేర్చిన విటుఁడా వీఁడు

||ఈడు||

అరుదై శ్రీవేంకటాద్రిమీఁద నుండి
వరము లిచ్చేటి వాఁడా వీఁడు
మరిగెనలమేల్మంగతో మమ్మేలె
సరసుఁడై వుండే జాణా వీఁడు

||ఈడు||

అవతారిక:

ఈ తిరుమలలో అందరికీ యేలికయైవున్న ఈ భగవానుడూ అలనాడు రేపల్లె వాడలలో అల్లరి కిట్టయ్య ఒక్కరేనా? వాడా వీడు!! అని ఆశ్చర్యపోతున్నారు అన్నమాచార్యులవారు. అలవాటు ప్రకారం (రామకథ కృష్ణ కథ- దశావతారాల కథ చెప్పటం ఆయన మానుకోలేని అలవాటు) కృష్ణ లీలలు గానం చేస్తున్నారు. ఆ రేపల్లె చిత్త్చోరుడే ఈ అలమేల్మంగపతి కూడా. అవునా? ఆ జాణా వీడు… అంటున్నారు. ఎన్నిసార్లు పాడినా తనివి తీరని కృష్ణగానామృతం వినండి.

భావ వివరణ:

ఈడు ఇందరికి యేలిక (ప్రభువై వున్నాడే. ఆనాడు వాడల రేపల్లె వీధులలో తిరిగిన వాడే (ఆ గొల్లపిల్లవాడే), వీడా? అదెలా సాధ్యం?

భారపువుట్ల మీద (బరువైన వుట్లలో వున్న) పాలు పెరుగులు వారలు వట్టినవాడు (ధారలుగా కార్పించి యేడిపించిన ఆ కొంటె కోణంగియేనా) వీడు (ఈ శ్రీవేంకటేశ్వరడు), ఏమిచిత్రం!! కోరి కావలెనని (పొరబాటున కాదు) గోపికల చీరెలను కొలను గట్టున దీసి దాచి వాళ్ళ మానం మంట గలిపిన శిశువు గుర్తున్నాడా? వాడా వీడు!!

బ్రహ్మదేవుడు రేపల్లెలోని ఆవులను పెయ్యలను గోపాలురను మాయంచేస్తే తానే అవన్నీ అయిపోయి రేపల్లెలో ఒక్కరికీ తెలియకుండా నడిపి బ్రహ్మకు బుద్ధివచ్చేట్లు చేసినది ఇతడేనా? ఆ తరువాత ఆ పరమేష్టిని మన్నించి వావిరిగాచిన (ఉత్కృష్టుడై రక్షించిన వాడా, వీడు (ఈ శ్రీనివాసుడు). వావులొక్కటిగా (వావివరుసా లేకుండా) తల్లీకూతుళ్ళిద్దరినీ తన ప్రియురాండ్రను చేసికొన్న, వేవేలు నేర్చిన (అనేక రతిమర్మాలు నేర్చిన) ఆ విటుడా, వీడు (ఈ వేంకటరమణుడు) ఆహా!!

అరుదైన శ్రీవేంకటాద్రిమీద కొలువై వుండి అనేక వరములొసగే ఆ శ్రీవేంకటేశ్వరుడు వీడా (ఈ శ్రీకృష్ణుడా), వీడేనా? మరిగే (అనురాగంతో తలమునకలయ్యే) అలమేల్మంగతో మమ్ము యేలునట్టి సరసుడై వుండే ఆ జాణా (జగజ్జెట్టియా) వీడు (ఈ శ్రీకృష్ణుడు)?

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Draupadi Devi – Adarsha Bharatha Naari In Telugu | ద్రౌపదీ దేవి – ఆదర్శ భారతనారి

Draupadi Devi Adarsha Bharatha Naari

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ద్రౌపదీదేవి – ఆదర్శ భారతనారి నీతికథ.

ద్రౌపదీదేవి – ఆదర్శ భారతనారి

మహాభారత యుద్ధములో సర్వనాశనమైన కౌరవపతి దుర్యోధనుని సంతృప్తి పఱచుటకై అశ్వత్థామ తన స్వభావానికి భిన్నముగా ప్రవర్తించి అతి కిరాతకముగా ఉపపాండవులను (పాండవుల పుత్రులు) నిద్రిస్తుండగా వధించినాడు. ఆ ఘోరకృత్యం తెలుసుకున్న పాండవులు ద్రౌపదీదేవి దుఃఖానికి అంతులేదు. పసిపాపలైన బాలకులను నెత్తుటి మడుగులో చూసిన వారి గుండెలు పగిలినాయి. తన పుత్రులందఱినీ పోగొట్టుకుని విలపిస్తున్న ద్రౌపదీదేవిని ఓదార్చాడు అర్జునుడు. “ఇంత దారుణమైన పనిచేసిన ఆ అశ్వత్థామను నీ వద్దకు లాక్కువస్తాను” అంటూ పాఱిపోతున్న ఆ ద్రౌణి నెలకాల బడ్డాడు అర్జునుడు. శ్రీకృష్ణార్జునుల రథము తనను త్వరిత గతిలో సమీపిస్తున్నదని తెలిసిన అశ్వత్థామ ప్రాణరక్షణకై బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప అన్యమేదీ తనను కాపాడజాలదు అనుకుని రథమాపి శుచి అయ్యి ఆచమించి మంత్ర ప్రయోగము చేశాడు. ప్రళయకాల రుద్రునిలా సమీపించే ఆ బ్రహ్మాస్త్రాన్ని చూసి శ్రీ కృష్ణుడు ప్రతి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయమని ఆజ్ఞాపించాడు.

అర్జునుడు కూడా శుచి అయ్యి ఆచమించి పరమాత్మకు ప్రదక్షిణము చేసి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ ఱెండు అస్త్రాలు సూర్యాగ్నుల వలె ప్రజ్వరిల్లాయి. వాటి ప్రభావము చతుర్దశ భువనాలను దహింపగలదని తెలిసిన శ్రీ కృష్ణుడు ఆ అస్త్రాలను ఉపసంహరించమనినాడు. అస్ఖలిత బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణుని ప్రియమిత్రుడైన అర్జునుడు శాస్త్రకోవిదుడు. అందుకే గృహస్థుడైనా కూడా బ్రహ్మచర్యమును పాలించుటచే ఆ ఱెండు బ్రహ్మాస్త్రాలనూ ఉపసంహరించ గలిగినాడు. అలా లోకాలను తన బ్రహ్మచర్య శక్తితో కాపాడిన అర్జునుడు ఆ అశ్వత్థామను బంధించి ద్రౌపదీదేవి ముందుకు తెచ్చి పడేశాడు. చిన్న పిల్లల ప్రాణాలు తీసిన ఆ అశ్వత్థామ ద్రౌపదిముందు సిగ్గుతో తల ఎత్తలేకపోయాడు. పరాన్ముఖుడైన గురుపుత్రునికి నమస్కరించి సుగుణవతియైన ద్రౌపదీదేవి ఇలా ధర్మ్యభాషణం చేసింది.

“నాయనా! మీ తండ్రిగారైన ద్రోణాచార్యుల వారి వద్ద మా మగవారు విద్యాభ్యాసం చేశారు. పుత్రరూపములో ఉన్న ద్రోణుడవు నీవు. మాకు గురుతుల్యుడవైన నీవు ఇలా నీ శిష్యనందనులను దారుణముగా వధించడం ధర్మమా? తమకి హాని కలిగించినా ఎదుఱుకోలేని పసివాళ్ళను నీకెన్నడూ అపకారము చేయని అందాలు చిందే పాపలను నిదురించి ఉండగా చంపటానికి నీకు చేతులెలా వచ్చాయి? ఓ గురుపుత్రా! ఇక్కడ నేను నా పుత్రులకై ఏడుస్తున్నట్లే అక్కడ నీ తల్లి కృపి నీకోసం ఎంతగా విలపిస్తున్నదో. అర్జునుడు బంధించి తీసుకు పోయాడన్న వార్త వినగానే ఎంత పరితాపమును చెందినదో”. ఇలా అని శ్రీకృష్ణార్జునుల వైపు చూసి

“ద్రోణాచార్యులవారు స్వర్గస్థులైనా ఇతని మీదే ఆశలుపెట్టుకుని జీవిస్తున్నది ఆ సాధ్వి కృపి. నాలాగే పిల్లవాడి కోసం ఎంతో బాధపడుతూ ఉంటుంది. గురుపుత్రుడైన ఈ అశ్వత్థామను వదిలి వేయండి! గురుపుత్రుని వధించుట ధర్మము కాదు” అని అన్నది పరమ పతివ్రత అయిన ద్రౌపదీదేవి.

Draupadi Devi – Adarsa Bharata Naari Story In Telugu

ఈ ప్రకారం ద్రౌపదీదేవి ధర్మసమ్మతంగా దాక్షిణ్యసహితంగా నిష్కపటంగా నిష్పక్షపాతంగా న్యాయంగా ప్రశంసనీయముగా పిలికినది. పాంచాలి మాటలు విని ధర్మనందనుడు ఎంతో సంతోషించాడు. భగవంతుడైన శ్రీ కృష్ణుడు ఆమెను ఎంతగానో పొగిడినాడు. అక్కడ ఉన్న అందఱూ ఆమె మాటలను సమర్థించారు. కానీ భీమసేనుడు “కన్న కొడుకులను క్రూరముగా చంపినవాడు కళ్ళముందున్నా కోపం తెచ్చుకోకుండా విడవ మంటుందేమిటి? స్వాభావికముగా దయ ఉన్నవాడే బ్రాహ్మణుడు కానీ ఇలా ఘోరకృత్యం చేశిన ఈ అశ్వత్థామ క్షమార్హుడు కాదు” అంటూ ఆ అశ్వత్థామ పైకి దూకాడు.

తొందరలో ఏమి చేస్తాడో అని ఆ గురుపుత్రునికి అడ్డంగా నిలబడినది ద్రౌపదీదేవి!! శ్రీ కృష్ణుడు చతుర్భుజుడై ఱెండు చేతులతో భీమసేనుడిని మిగిలిన ఱెంటితో ద్రౌపదిని వారించి ఇలా ధర్మబోధ చేశాడు “శిశుఘాతకుడూ కిరాతకుడూ అయిన ఈ అశ్వత్థామ ముమ్మాటికీ చంపదగిన వాడే. కానీ గురుపుత్రుడు పైగా విప్రుడు అయినందువల్ల వీనిని చంపకుండా శిక్షించాలి. ఒక వీరునికి తలగొఱగటం కన్నా అవమానకరమైనది ఏదీ లేదు. ఈతని శిరోజాలు ఖండిచి అవమానించి పంపుదాం”. అప్పుడు విశ్వమంతా కొనియాడ తగ్గవాడూ వీరాధివీరుడూ అయిన అర్జునుడు ఆ అశ్వత్థామ శిరోజాలు ఖండించి అతని శిరస్సుమీదనున్న దివ్య (జ్ఞాన) మణిని తీసుకుని అవమానించి బయటికి గెంటివేశాడు. అనంతరం చనిపోయిన బంధువులందఱికీ దహన సంస్కారాలు చేశి గంగాతీరములో పొంగిపొఱలే దుఃఖాన్ని దిగమ్రింగుకుని మరణించిన వారికి తిలోదకాలిచ్చారు పాండవులు. తరువాత శ్రీ కృష్ణుడు పాండవులని గాంధారీ ధృతరాష్ట్రులని ఓదార్చినాడు. ఇలా శ్రీ కృష్ణుడు మహాభారత యుద్ధం ద్వారా దుష్టశిక్షణ చేశి భూభారాన్ని దించాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

పుత్రహంతకుడు కళ్ళ ఎదుటికి రాగానే “గురుపుత్ర! నమస్కారం” అని అనగలిగిన ద్రౌపదీదేవి మనస్సు యొక్క సౌందర్యం వర్ణణాతీతం. అంత దుఃఖములో ఉండికూడా ఏది ధర్మం ఏది అధర్మం అని ఆలోచించి మాట్లాడిన ఆమె ధర్మవర్తనం మనకు ఆదర్శప్రాయం. “నా వలె ఆ కృపి పుత్రుని కోసం ఎంతగా ఏడుస్తుందో” అని దయ జాలి కరుణ క్షమ అనే పదాలకు సీమాంతం చూపి మహాపకారికైనా మహోపకారం చేయగల ద్రౌపదీదేవి వంటి ఆదర్శ నారీమణులు పుట్టిన మన భారతదేశం మహోన్నతమైనది.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Parvatheesha Karavalamba Stotram In Telugu – శ్రీ పార్వతీశ కరావలంబ స్తోత్రమ్

Sri Parvatheesha Karavalamba Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ పార్వతీశ కరావలంబ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Parvatheesha Karavalamba Stotram Lyrics Telugu

శ్రీ పార్వతీశ కరావలంబ స్తోత్రమ్

శ్రీమచ్చరాచర జగత్పరిపాలనేశ
శంభో శతానన గుణత్రయ కారణత్వం |
శ్రీద క్షమాసమ సుశాంత సురేంద్రవంద్య
శ్రీ పార్వతీశ మమ దేహి కరావలంబమ్ ||

1

నిత్యానివారిత మహాబల వత్సురౌఘ |
సత్యస్వరూప సదయాప్రతిమ స్వభావ |
నిర్విణ్ణ బుద్ధిరహిత ప్రథితోరుకీర్తే |

||శ్రీ పార్వతీశ॥ 2

పాశాంకుశాభయకర ప్రణతాఘనాశ |
కౌశల్యసంచరిత విశ్వ విశాలఫాల |
త్రైశూల శృంగజిత రాక్షణబృంద శంభో ||

||శ్రీ పార్వతీ|| 3

సర్వాఖు మూషక భుగాదిషు పాపజన్మ|
మ్వత్యంత పాప నిరతస్య చ జన్మనో మే
బాల్యే విశుద్ధ మతిహీన చ కర్తిన శ్చ ||

||శ్రీ పార్వతీశ|| 4

జ్ఞానప్రదిగ్ధ చరణాయుధ సారమేయైః |
బాలై ర్విదగ్ధ హృదయై శ్చ ఫలై శ్చ నాకమ్ |
అజ్ఞానత శ్చపల బాలక చేష్టితస్య ||

||శ్రీ పార్వతీశ॥ 5

మద్దై ర్యభిర్యువతి కాఠినవృత్తవక్షో |
జన్మ ద్వయార్పిత హృద త్తరుణీర తస్య |
తారుణ్యకే వయసి నామ మదాంధదృష్టేః ||

||శ్రీ పార్వతీశ॥ 6

విత్తార్జనే వివిధ పాపవిచార యుక్త
స్యాజ్ఞానబద్ధ హృదయస్య చ దారపుత్రాన్ |
పాతుం ధరాసుర ధన ప్రతిలోభబుద్ధేః ||

||శ్రీ పార్వతీశ|| 7

దారా ఇమే మమసుతాః పశవో మదీయా |
ధ్యానం మదీయ మితి గర్విత మానసస్య |
దుర్వృత్తకృత్య నిరతస్య దురాత్మకస్య ||

||శ్రీ పార్వతీశ|| 8

వృద్ధే వయస్యుత కఫామయ వాతపిత్త |
తృష్ణాదిభి శ్చ రుదత స్స్వకళత్ర పుత్రాన్ |
దేహ్యన్న మంబర మితి ప్రతిపావనస్య ||

||శ్రీ పార్వతీశ|| 9

బాల్యే చ కుందన రతస్య చ యౌవనే తు |
స్త్రీలోలుపస్య గళితస్య జరాంశభాజి |
చింతార తస్య చ విదాపరిహీన బుద్ధేః |

||శ్రీ పార్వతీశ|| 10

కాలే మృతే స్సుత కళత్ర జనై రుదర్భి |
ర్హాహేతి బంధు నవహై రతి దీనవాక్యెః |
దైన్యం గతస్య యమదూత నిపీడితస్య ||

||శ్రీ పార్వతీశ|| 11

ఆగత్యతే యమచరా హ్యతి భీతిరూపాః |
దంష్ట్రా కరాళవదనా ధృత యామ్యదండాః |
మాంభీషయంతి చ తదా పరిపాలకః కో |
విశ్వేశ శర్వ మమ దేహి కరావలంబమ్ ||

||శ్రీ పార్వతీశ|| 12

ఆయాహి పాపనిరతేతి వదంతి యే మాం(తే) |
గళే యమభటా స్తు కఠోరపాశైః |
ధృత్వా కరౌ చ చరణా వశగస్య తేషాం ||

||శ్రీ పార్వతీశ|| 13

జల్పన్ రుదన్ సతి సుతానభివీక్ష్య వక్తుం |
హీనస్య వైధృతిబలేన చ దివ్యనామ |
స్మర్తుం భయేన యమదూత సహానుగస్య

||శ్రీ పార్వతీశ|| 14

నీతస్య తై స్సికత కంటక కుత్సితాశ్మ|
సాంద్రేణ దుష్కృత పదా జలహీన దేశే |
ఛాయా విహీన బహుళా తప తప్తభూమౌ

||శ్రీ పార్వతీశ|| 15

ఆపద్గతస్య చ తదా కృపయా గతస్త్వం |
నాలోచ్య దుర్గుణగణాం స్తవ కింకరస్య |
భీతస్య దూతవశగస్య చ మే దయాళో ||

||శ్రీ పార్వతీశ|| 16

నాస్త్వేవ దార సుత బంధు గణప్రతీకం |
ముక్త్వాగతస్య రవిసూనుపదం తదీయై |
ర్దూతై స్సమానుగమనే వ్యతిభీతిగస్య ||

||శ్రీ పార్వతీశ|| 17

జన్మప్రభృ త్యుత మహాంతి చ దుష్కృతాని |
కృత్వా తు సంస్కృతి నిమిత్త మదాంధకారైః |
నహ్యాత్త మీశ తవనామ మయా కదా పి

||శ్రీ పార్వతీశ|| 18

అవ్యాజ భక్తపరిపాలక దీనబంధో |
స్వామిన్ శివారమణ మే తవ కింకరస్య |
దేహావసాన సమయే తవ నామ దత్వా ||

||శ్రీ పార్వతీశ|| 19

నాస్త్యన్యదైవ వరదో మమ నాస్తి నాస్తి |
తా మంతరేణ గిరిజేశ కృపాసముద్ర |
దత్వా స్మృతిం శుభతరాం తవ నామ్నఏష ||

||శ్రీ పార్వతీశ|| 20

మృత్యు శ్చ సన్నిహిత ఏవ యదా కరో వా |
తం ప్రాప్నుయాం యది తదా స్మృతిహీన చిత్తం |
తస్మిన్ త్సమాగత ఉమాధవ రక్ష మాం త్వం ||

||శ్రీ పార్వతీశ|| 21

పూర్వార్జితై రమిత దుష్కర పాతకౌఘైః |
యత్రాప్నుయాం మృతి మరణ్య వనే పురే వా |
న జ్ఞాయతే యది తదా భవ మే ప్రసన్నః ||

||శ్రీ పార్వతీశ|| 22

శార్దూల సింహ మృగ సర్ప జలాగ్ని వాత |
చోరామయాది మృతి మాప్నువతో హ్యకాలే |
తత్రాగతస్త్వ దమృతాఖ్య మథోపదిశ్య ||

||శ్రీ పార్వతీశ|| 23

శ్రీమన్గిరీశ శశిశేఖర దివ్యమూర్తే |
శ్రీపార్వతీధవ రమాపతి ముఖ్యసేవ్య |
సర్వాంతరాయ హర పాశధర ప్రభో మే ||

||శ్రీ పార్వతీశ|| 24

నిత్యం శివస్య మహత స్తు కరావలంబం
స్తోత్రం మహాగురవరేణ శివంకరేణ
య త్రాతరేవ పరత త్వరవక్త్ర ఏష
స్సర్వా నభీష్ట నిచయాన్ ప్రదదాతి శంభుః ||

||శ్రీ పార్వతీశ|| 25

శ్రీ పార్వతీశస్య కరావలంబ స్తోత్రం పఠే ద్యః ప్రయతః ప్రభాతే|
స్మృతిం తు తస్యాత్ర మృతౌ ప్రదద్యాత్ శ్రీపార్వతీశో హి కరావలంబమ్ ||

ఇతి శ్రీ పార్వతీశ కరావలంబస్తోత్రం

మరిన్ని స్తోత్రములు

Hari Neeve Sarvatmakudavu In Telugu – హరి నీవే సర్వాత్మకుడవు

హరి నీవే సర్వాత్మకుడవు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో హరి నీవే సర్వాత్మకుడవు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

హరి నీవే సర్వాత్మకుడవు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : హరి నీవే సర్వాత్మకుడవు
సంఖ్య : 441
పుట : 297
రాగం : దేశి

దేశి

32 హరి నీవే సర్వాత్మకుడవు
యిరవగు భావన యియ్యగదే ॥

||పల్లవి||

చూడక మానవు చూచేటి కన్నులు
యేడనేవైనా యితరములు
నీడల నింతా నీ రూపములని
యీడువడని తెలి వియ్యగదే ॥

||హరి||

పారక మానదు పాపపు మనసిది
యీరసములతో నెందైనా
నీరజాక్షయిది నీమయమేయని
యీ రీతుల తల పియ్యగదే ॥

||హరి||

కలుగక మానవు కాయపు సుఖములు
యిలలోపలగల వెన్నైనా
అలరిన శ్రీవేంకటాధిప నీకే
యిలనర్పితమను యిహమియ్యగదే ॥

||హరి|| 441

అవతారిక:

మనం వేరు, పరులు వేరు అనే భావనవుండటం వల్లనే మనం కొందరిని ప్రేమిస్తాం, కొందరిని ద్వేషిస్తాము. కానీ శరీరాలు వేర్వేరైనా ఆత్మలన్నిటికి మూలకారణం పరమాత్మ అనే తత్త్వం తెలిసనవాడు సర్వాత్మకుడైనవాడు శ్రీహరి ఒక్కడే అని తెలిసికొని ఎవ్వరినీ ద్వేషించడు. ఓ దేవదేవా నాకు కూడా అటువంటి భావనే ఇయ్యవయ్యా! అంటున్నారు అన్నమాచార్యులవారు. ఈ ప్రపంచంలోవున్నవన్నీ నీ అర్పణ కొరకే స్వామీ! అంటున్నారు. ఈ భావవివరణ వ్రాసేటప్పుడు నాకు కలిగిన తృప్తి నేను మాటలలో వర్ణించలేను.

భావ వివరణ:

ఓ శ్రీహరీ! నీవే సర్వాత్మకుడవు (అన్ని ఆత్మలకు మూలమైనవాడవు). నాకునూ అట్టి నీవే అన్ని ఆత్మలలోగలవనె ఇరవగు భావన (సుస్థిరమైన అభిప్రాయమును) ఇయ్యగదే (ఈయవయ్యా!)

నాకు చూడాలనే కోరిక కలిగితే చాలు నా కన్నులు దేన్ని పడితే దాన్ని చూస్తాయి. ఇతరములు (అనవసరమైన ఇతర విషయములన్నింటినీ, యేడ నేవైన (యెక్కడైనా యేమైనా) చూస్తాయి. అవి చూడటం మానవు. నీడలన్ (నీ ఆశ్రయంలో) అన్నీ నీ ప్రతిరూపాలే అనునట్టి, ఈడువడని (చెడిపోని) తెలివి (జ్ఞానమును) ఈయగదే (ఇమ్ము ప్రభూ!).

నేను నాకళ్లుమూసుకున్నా నన్ను చెడగొట్టే ఇంకొకటుంది. అదే నా మనస్సు. పాపచింతనతో కూడిన నా మనస్సు అనవసరమైన వాటిమీద పారక మానదు (ప్రసరించక వదలదు). ఈ రసములతో యెందైనా యెవరికైనా యెన్నో పాపపు ఆలోచనలే వస్తాయి. ఓ నీరజాక్షా! ఈ రసములు కూడా నీమాయలే (నీవలననే కలిగినవి) అనునట్టి తలపును ఇయ్యగదే (ఈయరాదటయ్యా!)

ప్రభూ! నా కళ్ళూ మనస్సు ఒక్కసారి విజృంభించాయంటే, నా కాయము (దేహము) వున్నదే అది తగులుకొంటుంది. దానికెప్పుడూ సుఖం కావాలి. దానికి ఒక సుఖం చాలదు. ఎన్నయినా కావాలి కావాలి అనే అంటుంటుంది. దానికి ఈ ప్రపంచమంతా ఇచ్చినా చాలదు. అలరిన శ్రీవేంకటాధిప (ఏడు కొండలపై శోభించుచున్న) ఓ శ్రీవేంకటేశ్వరా! ఈ ప్రపంచంలో వున్నవన్నీ నీకు అర్పితమైనవే అనే ఇహము (ఈ ప్రాపంచిక జ్ఞానమును) ఇయ్యవయ్యా తండ్రీ!.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Maitreyi Sthotram In Telugu | మైత్రేయి స్తోత్రం

Maitreyi Sthotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మైత్రేయి స్తోత్రం గురించి తెలుసుకుందాం…

Maitreyi Sthotram In Telugu Lyrics

మైత్రేయి స్తోత్రం

జగద్గురో నమస్తుభ్యం హిమాలయ నివాసినే,
నమస్తే దివ్య దేహాయ మైత్రేయాయ నమోనమః.

1

నమోజ్ఞాన స్వరూపాయ మాయామోహ విదారిణే,
నిర్మలాయ ప్రశాంతాయ మైత్రేయాయ నమోనమః

2

నమస్తే బోధి సత్త్వాయ నమస్తే పుణ్యమూర్తయే,
పూర్ణానంద స్వరూపాయ మైత్రేయాయ నమోనమః.

3

సిద్ధి బుద్ధి ప్రయుక్తాయ సిద్ధి బుద్ధి ప్రదాయినే
భవభీతి వినాశాయ మైత్రేయాయ నమో నమః

4

నమస్తే కర్మ నిష్ణాయ యోగినాంపతయే నమః,
బ్రహ్మ జ్ఞాన స్వరూపాయ మైత్రేయాయ నమోనమః

5

నమస్తే గురుదేవాయ నమస్తే ధర్మ సేతవే,
నారాయణ నిరుక్తాయ మైత్రేయాయ నమోనమః.

6

నమస్తే కరుణాసింధో ప్రేమ పీయూష వర్షిణే,
జగద్భంధో నమస్తుభ్యం మైత్రేయాయ నమోనమః.

7

మరిన్ని స్తోత్రాలు:

Harikrishna Melukonu Adhipurusha In Telugu – హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా

హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
సంఖ్య : 543
పుట : 365
రాగం : భూపాళం

భూపాళం

38 హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
తరవాత నా మోము తప్పకిటు చూడు.

||పల్లవి||

మేలుకొను నాయన్న మెల్లనే నీతోడి
బాలులదె పిలిచేరు బడి నాడను
చాలు నిఁక నిద్దురలు చద్దికూళ్ళపొద్దు –
వేళాయ నాతండ్రి వేగ లేవే,

॥హరి||

కను దెరవు నాతండ్రి కమలాప్తుఁ డుదయించె కమలాప్తు
వనిత మొకమజ్జనము వడిఁ దెచ్చెను
మొనసి మీతండ్రి యిదె ముద్దాడఁ జెలఁగీని
దనుజాంతకుండ యిఁకఁ దగ మేలుకోవే.

॥హరి||

లేవె నాతండ్రి నీలీలలటు వొగడేరు
శ్రీ వేంకటాద్రిపతి శ్రీరమణుఁడా
దేవతలు మునులుఁ జెందిననారదాదులు
ఆవలనుఁ బాడేరు ఆకసమునందు.

||హరి|| 543

అవతారిక:

మధురాతి మధురమైన మేలుకొలుపు కీర్తన నాస్వాదించి తరించండి. అన్నమాచార్యులవారి ఋణం తీరదని అనిపిస్తున్నది కదా! నా తండ్రి మేలుకోరా నా అన్న మేలుకో అని యెన్నిసార్లు బ్రతిమిలాడుతున్నారో చూడండి. జన్మకి ఇట్లాంటికీర్తన ఒక్కటి చాలదా? కొసమెఱుపు యేమిటంటే “వనిత మొకమజ్జనము వడిదెచ్చెను” అనే చరణం నందగోపుడు రేపల్లె గొల్లవారికి యేలిక కదా! వాళ్ళ పనిమనిషి వాళ్ళ అబ్బాయి పళ్ళుతోముకోవడానికి గోరువెచ్చని నీళ్ళు తెచ్చి సిద్ధంగా వున్నదట. మొకమజ్జనము అంటే ముఖమును నీళ్ళతో కడుగుకొనుట.

భావ వివరణ:

ఓ ఆదిపురుషా! హరీ! కృష్ణా ‘మేలుకో నాన్నా! తరువాత తప్పకుండా నా మోము (ముఖమును) ఇటుచూడు. (నా మాట విను తండ్రీ!)

నా యన్న మేలుకొనరా! బడినాడను (నీతో కూడి ఆడుకొందామని) అదే నీతోడి బాలలు మెల్లనే (మన వసారాలో) నిలుచుని నిన్ను పిలిచేరు. లే తండ్రీ! ఇక నిద్దురలు చాలును కన్నా! చద్దికూళ్ళ పొద్దువేళాయె (చద్ది యన్నం తినే వేళయింది నాన్నా!) నా తండ్రీ! వేగ లేవే (తొందరగా
లేచిరావయ్యా!)

అదిగోచూడు… కమలాప్తుడుదయించె (కమలబాంధవుడైన సూర్యభగవానుడు ఉదయించినాడు) నా తండ్రీ! కన్నులు తెరువమయ్యా! మొకమజ్జనకు (నీ ముఖము కడుగుకొనుటకు నీళ్ళను) వనిత (పనిపిల్ల) వడి దెచ్చెను (శ్రీఘ్రముగా తీసికొచ్చింది). ఇవే నీతండ్రి నందగోపుడు, మొనసి (పూనుకొని) ముద్దాడ (గబగబా ముద్దులు పెట్టుకొందామని) యెదురు చూస్తున్నాడయ్యా! ఓ దనుజాంతకా! (పూతన వంటి రాక్షసులను అంతమొందించినవాడా!) ఇక మేలుకోవయ్యా!

నా తండ్రీ! నీవు చేసిన నీ లీలలన్నింటినీ వొగడేరు (పొగడుచున్నారయ్యా!) లేవె (లేచిరావయ్యా!) ఇప్పుడు నీవు ఈ తిరుమల వేంకటకృష్ణయ్యవు, శ్రీదేవీ వల్లభుడవు. అదిగో చూడవయ్యా! ఆవలను (నీవాకిటి బయట) దేవతలు, మునులు, నారదాది భక్తులు సుప్రభాతమును పాడుచున్నారు. ఆకాశములో యెంత గుంపువున్నదో చూడు తండ్రీ! ఇంతమందికి నీ దర్శనం కావాలంటే యెంత సమయం పడుతుంది? లే నాన్నా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Uppavadamu Gavayya Uyyala Mancham Meeda In Telugu – ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద

ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద
సంఖ్య : 102
పుట : 74
రాగం : కాంబోధి

కాంబోధి

26 ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీఁద
గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా.

||పల్లవి||

పవ్వళించే వీడ వచ్చి పాయనినీయలపెల్ల
మువ్వంకమేనితోడ ముచ్చట దీఱ
నవ్వేటి శ్రీసతిచూపు నాటినచిత్తపుమేన
క్రువ్వనికలువదండై గోవిందరాజా.

॥ఉప్ప||

నిద్దిరించే వీడ వచ్చి నిలుచున్నయలపెల్ల
ప్రొద్దు వొద్దునకుఁ దీర భోగీంద్రుపై
యిద్దరుసతులు నీకు నేచినతాళగతుల
గుద్దేటిపాదములతో గోవిందరాజా.

॥ఉప్ప||

మెండుగ మేలికొంటివి మించిన కౌఁగిటిలోన
కొండుకపాయపుసిరి కోపించంగా
ఉండవయ్యా సుఖలీల నుడివోనిప్రియముతో
కొండలకోనేటిరాయ గోవిందరాజా.

॥లలల||

అవతారిక:

‘ఉప్పవడము’ అవటం అంటే రాజీకి రావడం అన్నమాట. ఉయ్యాలమంచం మీద నీకు నీ దేవేరుల మాట వినక తప్పదు. గొప్ప గొప్ప కన్నులున్న గోవిందరాజువి నీవు. అయినా సరే, అంటున్నారు అన్నమాచార్యులవారు. ఈ కీర్తనలో వేంకట మకుటం లేకపోవటం విశేషమే.

ఇటువంటి శృంగార కీర్తనల భావవివరణలో చిక్కేమిటంటే “యద్భావం తద్భవతి” – అంటే నీ భావన నీ భావానుగుణ్యంగానే వుంటుంది. కొండల కోనేటిరాయుడే ఈ గోవిందరాజు అంటున్నారు. కొండుకపాయపుసిరి అంటే చిన్నపిల్లవంటి శ్రీదేవి, కోపించిందట స్వామిపైన… యెందుకో? జాగ్రత్తగా చదివి భావించి పరవశించండి.

భావ వివరణ:

ఓ గోవిందరాజా! నీ విప్పారిన గొప్ప గొప్ప నయనాలు నీ భావములను తెలుపుతూనే వున్నాయి. నీవు ఈ ఉయ్యాలమంచము మీద భూదేవి, శ్రీదేవి సమేతుడవై వూగుచున్నావు. ఇప్పుడైనా, ఉప్పవడము గావయ్య (రాజీ మార్గానికి రావయ్యా!)

ఓ గోవిందరాజా! ఈ వైపునకు వచ్చి నీ అలసట దీరునట్లు ముచ్చట దీరగా, మువ్వంకమేనితో (మూడు అవస్థలను పొందుతున్న దేహముతో) నిదురించవయ్యా! చిరునవ్వులొలుకు శ్రీసతి చూపులు నీ చిత్తము పై నీ నాటుకొంటుండగా నీ వామె మెడలో క్రువ్వని కలువదండైనావు (వాడని కలువపూలహారమైనావు స్వామీ!)

ఈడ వచ్చి ప్రొద్దు వొద్దునకు (పూట పూటకు) నిలుచున్న అలు పెల్లదీర (అలసట యంతయు దీరునట్లు) భోగీంద్రునిపై (ఆదిశేషునిపై) విశ్రాంతిగా నిదురించవయ్యా! నీకు భూదేవి, శ్రీదేవి అను ఇద్దరు భార్యలు, యేచిన తాళగతుల (అతిశయించిన తాళానుగుణముగా) గుద్దేటి పాదములతో తన సతులను తనపాదములతో తేలికపాటి తాడనములిచ్చుచున్నాడు. ఈ గోవిందరాజస్వామి చిలిపి చేష్టలేమని వర్ణింతుము?

ప్రభూ! నీవు మెండుగా (మేలుగా) మేలుకొనినది కూడా, కొండొక ప్రాయపుసిరి కౌగిటిలోననే (లేబ్రాయపు చిన్నదైన శ్రీదేవిని గాఢాలింగనముననే) ఆమె నిదుర చెడి ఆమె నీపై కోపించినదాయెను. అయినదేమో అయినదని ఆమెను వూరడించి ఉడివోని ప్రియమున (తరగని అనురాగముతో) సుఖలీల (సుఖముగా) వుండవయ్యా! ఓ గోవిందరాజా! నీవే కొండలకోనేటిరాయుడవు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Shiva Manasa Puja Stotram In Telugu – శివమానస పూజా స్తోత్రము

Shiva Manasa Puja Stotram In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివమానస పూజా స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Shiva Manasa Puja Stotram Lyrics In Telugu

శివమానస పూజా స్తోత్రము 

శ్లో॥ రత్నైఃకల్పిత మాసనం హిమజలైఃస్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం |
జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ||

1

సౌవర్ణే మణిఖండరత్న రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్వా ప్రభోస్వీకురు||

2

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగ కాహళ కలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి ర్బహువిధా హ్యేతత్సమస్తంమయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ||

3

ఆత్మాత్వం గిరిజామతి స్సహచరాః ప్రాణశ్శరీం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షణవిధిః స్తోత్రాణి సర్వాంగిరో
యద్య త్కర్మకరోమి తత్వదఖిలం శంభోః తవారాధనం ||

4

కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం |
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో ||

5

మరిన్ని స్తోత్రములు

Dasa Sloki Stuti In Telugu – దశ శ్లోకే స్తుతిః

Dasa Sloki Stuti

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దశ శ్లోకే స్తుతిః గురించి తెలుసుకుందాం…

Dasa Sloki Stuti Telugu

దశ శ్లోకే స్తుతిః

సాంబో నః కులదైవతం పశుపతే సాంబ! త్వదీయా వయం!
సాంబం స్తొమి సురాసురోరగ గణాసాంబేన సంతారితాః
సాంబాయాస్తు నమో మయా విరచితం సాంబాత్పరం సో భజే
సాంబస్యాను చరోస్మ్యహం మమ రతి స్సాంబే పరబ్రహ్మణి.

విష్ణ్వాద్యాశ్చ పురత్రయం సురగణా జేతుం న శక్తేః స్వయం
యం శంభుం భగవన్ వయం తు పశవో స్మాకం త్వమేశ్వరః
స్వ స్వస్థాన నియోజితా స్సుమనస స్వస్థా బభూవు స్తతః
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

క్షోణీ యస్య రథో రథాంగయుగళం చంద్రార్కబింబద్వయం
కోదండః కనకాచలో హారి రభూదాణో విధి స్శారధిః
తూణీరో జలధిర్హయా శ్రుతిచయో మౌర్వి భుజంగాధిపః
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

యేనే పాదిత మంగజాంగ భీసితం దివ్యాంగ రాగై స్సమం
యేన స్వీకృత మబ్జ సంభవ శిర సౌవర్ణపాత్రై స్సమం
యేనాంగీకృత మచ్యుతస్య నయనం పూజారవిందై స్సమం
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

గోవిందా దధికం న దైవత మితి ప్రోచ్చార్య హాస్తావుభా
వృద్ధృత్యాల థ శివస్య సన్నిధిగతో వ్యాసో మునీనాం వరః
యస్య స్తంభితపాణి రానతి కృతా నందీశరేణా భవత్
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

ఆకాశ శ్చికురాయతే దశదిశా భోగో దుకూలాయతే
శీతాంశుః ప్రసవాయతే స్థిరతరా నందః స్వరూపాయతే
వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

విష్ణుర్యస్య సహస్ర నామ నియమా దంబోరుహాణ్యర్చయన్
ఏకో నోపచితేషు నేత్ర కమలం నైజం పదాబ్జద్వయే
సంపూజ్యా సురసంహితం విదలయం త్రైలోక్యపాలో భవత్
తస్మిన్మే హృదయం సుఖీన రమతాం సాంబే పరబ్రహ్మణి.

శౌరిం సత్యగిరం వరాహ వపుషం పాదాంబుజా దర్శనే
చక్రే యో దయయా సమస్త జగతాం నాథం, శిరో దర్శనే
మిథ్యావాచ మపూజ్య మేవ సతతం హంస స్వరూపం విధిం
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

యస్యాసన్ ధరణీ జాలాగ్ని పవన వ్యోమార్క చంద్రా దయో
విఖ్యాతాస్తనవో ష్టధా పరిణతా నాన్యత్తతో వర్తతే
ఓంకారార్థ వివేచినీ శ్రుతిరియం చారి చష్ట తుర్యం శివం
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

విష్ణుబ్రహ్మ సురాధిప ప్రభృతయ స్సర్వే పి దేవాయదా
సంభూతా జ్జలధే ర్విషాత్పరిభవం ప్రాప్తా స్తదా సత్వరం
తానార్తాన్ శరణాగతానితి సురాస్యో రక్ష దగ్ధక్షణాత్
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

ఇతి శ్రీ శంకారాచార్య కృత దశ శ్లోకీ స్తుతి

మరిన్ని స్తోత్రములు