మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు రుద్రాష్టకమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ముకుందమాలా స్తోత్రము గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శతనామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శతనామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా అష్టోత్తర శతనామావళిగురించి తెలుసుకుందాం…
Sri Lalitha Ashtottara Sathanamavali In Telugu Lyrics
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు పార్వతీవల్లభ నీలకంఠాష్టకమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మధురాష్టకమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివషడక్షరీ స్తోత్రముగురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వేంకటేశ స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ – అన్నమయ్య కీర్తనలు
అలమేల్మంగ నాంచారి మీద అన్నమాచార్యులవారు చెప్పిన సరస శృంగార కీర్తన నాస్వాదించండి. వైష్ణవుల పరిభాషలో దేవిని నాంచారి అంటారు. నాచారి అని కూడా అంటారు. అందులో అమ్మవారి కొన్ని ఆభరణాల పేర్లను గానంచేస్తున్నారు. నెమలిపాదపుడాలు, సరపణలవుయ్యాలలు, మంచమున కలంకరించిన పాపసజ్జలు – ఇత్యాదివి నేటి కాలంలో లేనందువల్ల కొన్ని మన వూహాతీతం. ఊంజలేసేవ సందర్భంగా పాడిన కీర్తన అయివుంటుంది. “సిగ్గులు చిందించే చిరునవ్వు మెఱుపులొలికే మోముగల, ఈ అలమేల్మంగనాచారి నిన్ను మరగెనయ్యా తిరుమలేశా!” అంటున్నారు. నేటితరం వారికి ఈ భాషే ఒక తమాషా జాగ్రత్తగా చదవండి.
భావ వివరణ:
ఓదేవదేవా! నీ దేవేరి అలమేల్మంగ నాచారి నిన్ను మరగె (ఆశించుచున్నది). మనోహరమైన ఆ నాచారి (దేవి) సిగ్గుల చిరునవ్వు మెఱుగార (మెరపులు కురిపిస్తున్న) మోముతో (వదనముతో) శోభలీనుచున్నది.
ఆమె, నిట్టనిలువుగానున్న తురుము (సిగకొప్పు) మీద “నెమలి పాదపుడాలు” ధరించినది. అది తళతళ మెరుగులను మించి (అధికముగా) దొలకె (చిందించుచున్నది). ఆ దేవి వెరగువడి (అత్యధికమైన ఆశ్చర్యముతో మలయుచున్నది (నీకొరకు ఆరాటపడుచున్నది). ఆమె జగజ్జననియైన అలమేల్మంగనాచారి.
ప్రభూ! నీ మెడలో “సరపణులు” వుయ్యాలలూగుచున్నవి. ఉదటు మురిపెమున (గొప్ప మురిపెముతో) వూగుచున్న వాటిని, గిరికొన్న తమకాన (తారా స్థాయికి చేరిన పారవశ్యముతో) కింద మీదెరుగక (ఆశగా చూడవచ్చునో చూడ కూడదో తేల్చుకోలేక) ఆ అలమేల్మంగ నాచారి, మేను మరచె (తన తనువును తానే మరచినది స్వామీ!)
దేవా! కంచము మోవిగని (తేనెలూరు మధురాధరమును) గాంచి లంచముగా కమ్మని తేనెలారగించితివి. అప్పుడు దేవి అలదుకున్న కస్తూరిలప్పెలుగా రాలిపడినది. ఆపైన ఓ శృంగారరాయా! యెంచగా తిరువేంకటేశుడైన నీవు అలమేల్మంగ నాచారితో నీ “పాపసజ్జ మంచమునెక్కి” ఆదేవిని నీ సరసశృంగారముల నలరించితివి. (ఓ జగద్రక్షకా! భావాతీతమైన మిమ్ముభావించుట బావిలో కప్పవంటి నా తరమా!! నా అశక్తతకు అజ్ఞానానికి మన్నించి నీవు అలా నవ్వుతూనే వుండు ప్రభూ!)
కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో మేలుకొనవే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
అన్నమాచార్యులవారు చెప్పిన ఒక మేలుకొలుపు కీర్తననాస్వాదించండి. 600 సంవత్సరాల క్రితం పరిస్థితి ఇంత ఘోరంగావుంటే నేడు యెవరికివారే యమునాతీరే అనే రోజుల సంగతి చెప్పేదేముంది? కన్నకొడుకులపై తండ్రి కక్షకడుతున్నాడు. బంగారం బంధువైపోయింది. ఆడది అసురులవంటి వారి చేతిలో అల్లాడిపోతుంది. “కసిమసగెడి కలికాలం” మహిమ యేం చెప్పగలం? ఒక్క శ్రీవేంకటేశుడే వసుధలోని పగను నెవ్వగలడు అంటున్నారు. భావవివరణతో పరిస్థితి ఇంకా బాగా అర్థమవుతుంది. అవునా?
భావ వివరణ:
ఓ భూలలనాధిప! (భూసతీరమణా!) భోగిశయనా! (శేషతల్పశాయీ!) మేలుకొనవే. (నీవు సృష్టించిన ఈలోకం యెంత ఘోరంగా వున్నదో ఒకసారి పరికింపుము).
వేదువిధి లేశమును లేదు (ఎవ్వడూ వేద విధానములను పాటించుట లేదు). భూమి మీద భరమై మించినది (అతిశయము యెక్కువైపోయింది). చూపరులకు భువిపాదుపడదు (కాళ్ళకింద భూమి కనపడదు. అంటే అంత పొగరుబట్టి వుంటారు). ప్రేమించవలసిన కన్నకొడుకుపైన తండ్రే కనలె (మండిపడుతుంటాడు).
కనకము చవిచెడెన్ కడునేకడున్ (బంగారమునకు వుండవలసిన నిబద్ధతతో కూడిన మక్కువ వుండదు. అనగా ప్రతివాడూ బంగారం కోసం వెంపర్లాడుతుంటాడు). గొప్పవాళ్ళయిన నృపుల (పరిపాలకుల) బాధలు గదిమినవి (భయపెడుతునవి). దనుజులకు (రాక్షసులవంటి మగవారి దౌర్జన్యాలకు) అతివలు (స్త్రీలు) తలకెదరు (భయపడుతుంటారు). లోకంలో ఈ పరిస్థితిని ఎనయు బలాఢ్యులు (సవరించగల దిట్టలు) యెవ్వరూ లేరు.
కాని అసురసతులు (దుర్మార్గుల భార్యలు) ఘనమైన పుణ్యములు చేస్తుంటారు. కలికాల మహిమ (కలియుగ ప్రభావముచేత) కసమసగెడి (పాపము విజృంభిస్తుంటుంది). హతవిధీ!! ఇక గత్యంతరం యేమిటి? పసగలవేంకటపతి (సర్వ సమర్ధుడైన శ్రీవేంకటేశ్వరుడు) ఇకను (ఇకపై) వసుధలోని పగను, నెవ్వగలడు (ఆపద తప్పించగలడు.)