Sri Suvarnamala Stuti In Telugu – శ్రీ సువర్ణ మాలా స్తుతిః

Sri Suvarnamala Stuti

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సువర్ణ మాలా స్తుతిః గురించి తెలుసుకుందాం…

Sri Suvarnamala Stuti Lyrics Telugu

శ్రీ సువర్ణ మాలా స్తుతిః

అథకథమపి మద్రసనాం త్వద్గుణ లేనైర్విశోధయామి విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఆఖండల మదఖండన పండిత తండుప్రియ! చండీశ విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఇభ చర్మాంబర! శంబరరిపు వపురపహరణోజ్జ్వల నయన వభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఈశ! గిరీశ! నరేశ! పరేశ! మహేశ! బిలేశయభూషణ! విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఉమయాదివ్యసుమంగల విగ్రహయాలింగిత వామాంగ! విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఊరీకురు మా మజ్ఞ మనాథం దూరీకురు మే దురితం భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఋషివర మానసహంస చరాచర జనన స్థితి లయ కారణభో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఋక్షాధీశ కిరీటి! మహోక్షారూఢ! విధృత రుద్రాక్ష! విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఇవర్ణ ద్వంద్వమవృంత కుసుమ మివాంఘ్రా తవారయామి విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఏకం సదితి శ్రుత్యా త్వమేవ సదసీ త్యుపాస్మహే మృడ! భో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఐక్యం నిజభక్తే భ్యో వితరసి విశ్వంభరోత్రసాక్షీ భో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఓమితి తవ నిర్దేష్టీ మాయా స్మాకం మృదోపకర్తీ భో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఔదాస్యం స్ఫుటయతి విషయేషు దిగంబరతా తవైవ విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

అంతః కరణవిశుద్ధిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

అస్తోపాధిసమస్తవ్యస్తే రూపై ర్జగన్మయో సి విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

కరుణా వరుణాలయ! మయి దాస ఉదాస స్తవచితో నహి భో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఖలసహవాసం విఘటయ విఘటయ సతామేవసంగ మనిశంభో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

గరళం జగదుపకృతయే గిలితం భవతా సమో స్తికోత్ర విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఘనసార గౌర గాత్ర! ప్రచుర జటాజూట బద్ధ గంగ! విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

జ్ఞప్తి స్సర్వ శరీరే ష్వఖండితా యా విభాతి సా త్వం భో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

చపలం మమ హృదయ కపిం విషయేద్రు చరం దృఢం బధానవిభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఛాయా స్థాణో రపి తవ తాపం నమతాం హరత్యహో శివ భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

జయ! కైలాస నివాస! ప్రమథ గణాధీశ! భూసురార్చిత! భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఝణుతక కిణుతకిట తక శబ్జెర్నటసి మహానట! భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

టంకార స్తవధనుషో దలయతి హృదయం ద్విషామశనిరివ భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఠాకృతిరివ తవమాయా బహిరంత శ్మూన్యరూపిణీ భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

జ్ఞానం విక్షేపావృతి రహితం కురు గురు స్త్వమేవ విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఢక్కాలి క్షరసూత్ర శూల ద్రుహిణ కరోటీ సముజ్జ్వలత్కర భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ణా కారగర్భిణీ చే చ్ఛు భదా తే శరగతి ర్షృణా మిహా భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

తవ మన్వతి సంజపత స్పద్యస్తరతి నరో హి భవాబ్ధిం భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

థూత్కార స్తస్యముఖే భూయాత్ తే నామ నాస్తి యస్య విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

దయనీయశ్చ దయాలు: కోస్తి మదన్య స్త్య ఇహ భో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ధర్మస్థాపన దక్ష త్ర్యక్ష ! గురో దక్షయజ్ఞ శిక్షక! భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

నను తాడితో పి ధనుషా లబ్దధియా త్వం పురా నరేణ విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

పరిమాతుం తవ మూర్తినాల మజి స్తత్ పరాత్పరో సి విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఫల మిహ నృతయా జనుష స్వతసేవా సనాతనేశ విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

బలమారోగ్యం చాయు స్త్వద్గుణరుచితామ చిరం ప్రదేహి విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

భగవన్! భర్గ! భయాపహ! భూతిపతే! భూతివిభూషితాంగ విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

మహిమా తవ నహి మాతిశ్రుతిషు హిమానీధరాత్మజాధవ! భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

యమనియమాదిభి రంగైర్యమినో హృదయే భజంతి త్వ భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

రజ్జా వహిరివ శుక్తే రజతమివ త్వయి జగంతి భాంతి విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

లబ్గ్వా భవత్ప్రసాదా చ్చక్రం విధు రవతి లోక మఖిలం భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

శర్వ! దేవ! సర్వోత్తమ! సర్వద! దుర్వృత్తగర్వహరణ! విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

షడ్రిపు – షడూర్మి – షడ్వికారహర! షణ్ముఖ! షణ్ముఖజనక!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మే త్యే తల్ల క్షణలక్షిత! భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

హాహా హూహూ ముఖసుర గాయక గీతాపదాన పద్య విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ళాలై దిరహి ప్రయోగఃతదంత మిహ మంగళం సదాస్తు విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

క్షణమివ దివసా న్నేష్యతి త్వత్పద సేవాక్షణోత్సుక శ్శివ! భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఇతి శ్రీ శంకరాచార్యకృత సువర్ణమాలాస్తుతిః

మరిన్ని స్తోత్రములు

VedaSara Shiva Stotram In Telugu – వేదసార శివ స్తోత్రమ్

VedaSara Shiva Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు వేదసార శివ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

VedaSara Shiva Stotram Lyrics Telugu

వేదసార శివ స్తోత్రమ్

శ్రీ మచ్ఛంకర భగవత్పాద విరచితమ్

పశూనాం పతిం పాపనాశం పరేశం
గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం।
జటాజూటమధ్యే స్ఫురద్ధాంగ వారిం
మహాదేవ మేకం స్మరామి స్మరామి॥

1

మహేశం సురేశం సురారార్తినాశం
విభుం విశ్వనాథం విభూత్యంగ భూషమ్।
విరూపాక్ష మింద్వర్క వహ్ని త్రినేత్రం
సదానందమీడే ప్రభుం పంచవక్త్రమ్॥

2

గిరీశం గణేశం గళే నీలవర్ణం
గజేంద్రాధిరూఢం గుణాతీత రూపమ్।
భవం భాస్వరం భస్మనా భూషితాంగం
భవానీ కళత్రం భజే పంచవక్త్రమ్॥

3

శివాకాంత శంభో శశాంకార్థమౌళే
మహేశాన శూలిన్ జటాజూట మౌళే।
త్వమేకో జగద్వ్యాపకో విశ్వరూప
ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణ రూప॥

4

పరాత్మాన మేకం జగద్బీజమాద్యం
నిరీహం నిరాకార మోంకార వేద్యం।
యతో జాయతే పాల్యతే యేన విశ్వం
తమీశం భజే లీయతే యత్ర విశ్వమ్॥

5

న భూమిర్న చాపో నవహ్నిర్ న వాయు
ర చాకాశమాస్తేన తంద్రా న నిద్రా।
న గ్రీష్మో న శీతం న దేశో న వేషో
న య స్యాస్తి మూర్తి స్త్రీమూర్తిం త మీడే ॥

6

అజం శాశ్వతం కారణం కారణానాం
శివం కేవలం భాసకం భాసకానామ్।
తురీయం తమః పార మాద్యంత హీనం
ప్రపద్యే పరం పావనం ద్వైతహీనమ్ ॥

7

నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే
నమస్తే నమస్తే చిదానందమూర్తే।
నమస్తే నమస్తే తపోయోగ గమ్య
నమస్తే నమస్తే శ్రుతిజ్ఞానగమ్య ॥

8

ప్రభో శూలపాణే విభో విశ్వనాథ
మహాదేవ శంభో మహేశ త్రినేత్ర।
శివాకాంత శాంత స్మరారే పురారే
త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః॥

9

శంభో మహేశ కరుణామయ శూలపాణే
గౌరీపతే పశుపతే పశుపాత నాశిన్।
కాశీపతే కరుణయా జగదేతదేక
స్త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోసి॥

10

త్వత్తో జగద్భవతి దేవ భవ స్మరారే
త్వయ్యేవ తిష్ఠతి జగన్మృడ విశ్వనాథ।
త్వయ్యేవ గచ్ఛతి లయం జగదేతదీశ
లింగాత్మకం హర చరా చర విశ్వరూపిన్ ॥

11

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం వేదసార శివ స్తోత్రం

మరిన్ని స్తోత్రములు

Sista Rakshanamunu Dushta Nigrahamunu In Telugu – శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును

శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును
సంఖ్య : 258
పుట: 175
రాగం: పాడి

పాడి

70 శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును
సృష్టించె నొక్కవేళనే శ్రీజయంతినాఁడు.

||పల్లవి||

హరి కృష్ణావతార మందినయంతలోనే
పరమమునుల కెల్ల భయముడిగెను
తెరలి దైత్యులగుండె దిగులుచొచ్చె నత్తరి
సిరులమించినయట్టి శ్రీజయంతినాఁడు.

||శిష్ట||

గోవిందుఁడు వసుదేవుకొడుకైనయప్పుడే
గోవులు రంకెలు వేసె గొల్లపల్లెను
నోవితోడఁ గంసునికి నూరునిండెఁ జూడఁగానె
చేపలుమీరినయట్టి శ్రీజయంతినాఁడు

||శిష్ట||

నారాయణుఁడు భువి నరుఁడు దాఁ గాఁగానే
మేరఁ బాండవు లెచ్చిరి మేనవావిని
కౌరవులపని దీరె కమ్మి శ్రీవేంకటేశుఁడు
చేరువనే మెరయఁగ శ్రీజయంతినాఁడు.

||శిష్ట||

అవతారిక:

ఒకానొక శ్రీకృష్ణ జయంతి సందర్భంగా అన్నమాచార్యులవారు వినిపించిన కీర్తననాలకించండి. “శిష్టరక్షణమును, దుష్టశిక్షణమును భగవంతుడు శ్రీజయంతినాడు ఒకే సమయంలో సృష్టించె” అంటున్నారు. మునులను రక్షించాడు, దానవులను భక్షించాడు. గోవులను మేపాడు, కంసుని వేపాడు. పాండవులు యెచ్చిరి, కౌరవుల పనిదీరె అని కృష్ణావతారవైశిష్ట్యాన్ని కీర్తిస్తున్నారు. శ్రీవేంకటేశుడు కూడా ఆయన చేరువనే మెరసినాడట. గతంలో ఇటువంటి కీర్తనలు చూచినా దేని మాధుర్యం దానిదే.

భావ వివరణ:

ఓ భక్తులారా! ఈ శ్రీజయంతినాడు (శ్రీకృష్ణాష్టమినాడు) ఆ భగవంతుడు, శిష్టరక్షణము (మంచివారిని రక్షించుట), దుష్టనిగ్రహము (చెడ్డవారిని నిరోధించుట) ఒక్కవేళనే (ఒకే సమయంలో) సృష్టించెన్ (సిద్ధింపజేశాడు).

శ్రీహరి కృష్ణావతారమును పొందినప్పుడు పరమ మునీంద్రులకు అందరికీ దానవుల భయము వుడిగెను (అణగిపోయినది). తెరలి (కలతపడిన) దైత్యుల గుండెలు, అత్తరి (అప్పుడు) దిగులుచొచ్చె (దిగులుతో దిగాలుపడ్డాయి). ఈ శ్రీజయంతి సిరులుమించిన (వైభవములతిశయించిన) పండుగ అవటంచేత ఈనాడు అంతా జయమే.

ఆ గోవింద వసుదేవుని కొడుకైనప్పుడే కొడుకైనప్పుడే గొల్లపల్లెను (గోకులమునందున్న) గోవులన్నీ సంతోషంతో రంకె వేసినవి. ఎందుకంటే వాటికి భగవంతుడు తమ మూపురాలను ప్రేమగా నిమరటానికి రాబోతున్నాడని తెలిసిపోయింది. అక్కడ మధురలో కంసునికి నోవితోడ (వేదనతో) చూడగానే (యోగమాయ హెచ్చరిక విని జరిగింది చూడగా) భయంతో నూరునిండె (నూరేళ్ళు నిండాయి). ఈ శ్రీజయంతినాడు చేవలు మీరినయట్టి (అందరికీ ధైర్యంకలిగినట్టి ఈరోజున) కంసాదులకు కన్నీళ్ళొచ్చాయి.

నారాయణుడు భువిపై తాన్ నరుడు కాగానే (అవగానే మేం (క్రమముగా) మేనవావిని (మేనరికపు బంధుత్వమునందు) పాండవులు యెచ్చిరి (బలోపేతులయ్యారు). కౌరవులు (దుష్టరాజసమూహంగల కురుసేన) పనిదీరె (పనిముగిసినది). ఈ శ్రీజయంతినాడు ఆ కృష్ణలీల సంకేతముగా, శ్రీవేంకటేశుడు ఈ తిరుమల శిఖరాలపై కమ్మి మెరయగా (వ్యాపించి మెరిసిపోగా) చేరువనే (ఇక్కడే) పండుగ పరిమళించింది.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sri Venkateswara Prapatti In Telugu – శ్రీ వేంకటేశ ప్రపత్తిః

Sri Venkateswara Prapatti

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వేంకటేశ ప్రపత్తిః గురించి తెలుసుకుందాం…

Sri Venkateswara Prapatti Telugu Lyrics

శ్రీ వేంకటేశ ప్రపత్తిః

ఈశానాంజగతోఒస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షస్థలనిత్యవాసరసికాం తర్జాంతిసంవర్ధినీమ్।
పద్మాలంకృతపాణిపల్ల వయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాదిగుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్ ॥

1

శ్రీమః కృపాజలనిధే కృతసర్వలోక
సర్వజ్ఞ శ క్త నతవత్సల సర్వశ్లేషిజా।
స్వామి సుశీల సులభాశ్రిత పారిజాత
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

2

ఆనూపురార్పితసుజాతసుగంధిపుష్ప
సౌరభ్యసౌరభకరౌ సమసన్ని వేశా|
సౌమ్యౌ సదాఒనుభవనే పి నవానుభావ్యౌ
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

3

సద్యోవికాసిసముదిత్వరసాంద్రరాగ
సౌరభ్యనిర్భరసరోరుహసామ్యవార్తామ్|
సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతా
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే॥

4

రేఖామయధ్వజసుధాకలశాతపత్ర-
వజ్రాంకుశాంబురుహకల్పకశంఖచక్రైః|
భవ్యైరలంకృతతలౌ పరతత్త్వచి హ్నైః
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

5

తామ్రోదరద్యుతిపరాజితపద్మరాగౌ
బా హ్యైర్మహోభిరభిభూతమ హేంద్రనీలౌ|
ఉద్యన్నఖాంశుభిరుద స్తశశాంకథాసౌ
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే॥

6

సప్రేమభీతి కమలాకరపల్లవాభ్యాం
సంవాహనేఒపి సపది క్లమమాదధానౌ।
కాన్తావవాఙ్మనసగోచరసౌకుమార్యౌ
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

7

లక్ష్మీమహీతదనురూపనిజానుభావ
నీలాదిదివ్యమహిషీ కరపల్ల వానామ్ |
ఆరుణ్యసంక్రమణతః కిల సాంద్రరాగౌ
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

8

నిత్యా౬౬నమద్విధిశివాదికిరీటకోటి
ప్రత్యు పదీ పనవరత్నమహఃప్రరో హైః|
నీరాజనావిధిముదారముపాదధానౌ
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే॥

9

విష్ణోః పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ
యౌ మధ్వఉత్స ఇతి భోగ్యతయాఒప్యుపాత్తా|
భూయ స్తథేతి తవ పాణితల ప్రదిష్టా
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే॥

10

పార్థాయ తత్సదృశసారథినా త్వయైవ
యౌ దర్శితౌ స్వచరణా శరణం వ్రజేతి|
భూయో౬పి మహ్యమిహ తౌ కరదర్శితా తే
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

11

మన్మూర్ధ్ని కాళీయఫణే వికటాటవీషు
శ్రీ వేంకటాద్రిశిఖరే శిరసి ప్రతీనామ్|
చి త్తే౬ప్యనన్యమనసాం సమమాహితౌ తే
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే॥

12

అమ్లానహృష్యదవనీతలకీర్ణ పుష్పా
శ్రీ వేంకటాద్రిశిఖరాభరణాయమానౌ ।
ఆనందితాఖిలమనోనయనౌ తవైతే
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

13

ప్రాయః ప్రపన్నజనతాప్రథమావగాహ్యౌ
మాతుః స్తనావివ శిశోరమృతాయమానౌ ।
ప్రాప్తో పరస్పరతులామతులాంతరౌ తే
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

14

సత్త్వోత్తరై స్సతత సేవ్యపదాంబుజేన
సంసారతారకదయార్ద్రదృగంచలేన।
సౌమ్యోపయంతృమునినా మమ దర్శితో తే
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

15

శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే
ప్రాప్యే త్వయి స్వయము పేయతయా స్ఫురంత్యా।
నిత్యాశ్రితాయ నిరవద్యగుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్ ॥

16

ఇతి శ్రీ వేంకటేశ ప్రపత్తిః సమాప్తా

మరిన్ని కీర్తనలు:

Sri Hanuman Kavacham In Telugu – శ్రీ హనుమత్ కవచం

Sri Hanuman Kavacham

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాసాన్ని కలిగి స్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించినచో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… కవచముల గురించి క్లుప్తంగా ఈ క్రింద ఇచ్చిన లింకుల నందు ఇవ్వబడినది. అవి ఏమిటో తెలుసుకుందాం…

శ్రీ హనుమత్ కవచం

అస్యశ్రీహనుమత్కవచస్తోత్ర మహామంత్రస్య వశిష్ట! ఋషిః అనుష్టుప్ ఛందః – శ్రీ హనుమాన్ దేవతా – మారుతాత్మజ ఇతి బీజం – అంజనాసూను రితి శక్తిః – వాయుపుత్ర కీలకం – శ్రీ మనుమత్ప్రసాధసిధ్యర్ధే జపే వినియోగః॥

ధ్యానం

శ్లో॥ ఉల్లంఘ్య సింధో స్సలిలం సలీలం
యశ్శోకవహ్నిం జనకాత్మజాయ :
ఆదాయతే నైవ దదాహ లంకాం
నమామి తం ప్రాజలి రాంజనేయం||

మనుః

శ్లో॥ పాదౌ వాయసుతః పాతు రామదూత స్తదంగుళీ:
గుల్ఫౌ హరీశ్వరః పాతు జంఘే చార్జవలంఘనః
జానునీ మారుతిః పాతు ఊరూ పా త్వసురాంతకః
గుహ్యం వజ్రతనుః పాతు జఘనం తు జగద్ధితః
ఆంజనేయః కటిం పాతు నాభిం సౌమిత్రిజీవనం:
ఉదరం పాతు హృద్దేహి హృదయం చ మహాబలః |
వక్షో వాలాయుధః పాతుస్తనౌ చా మితవిక్రమః
పార్శ్వౌ జితేంద్రియః పాతు బాహూ సుగ్రీవమంత్రకృత్
కరావక్షజయీ పాతు హనుమాం శ్చతదంగుళీః
పృష్ఠం భవిష్యద్రృహా చ స్కంధౌ మతిమతాం వరః
కంఠం పాతు కపిశ్రేష్టోముఖం రావణ దర్పహా
వక్త్రంచ వక్త్రు ప్రవణో నేత్రే దేవగణస్తుతః
బ్రహ్మాస్తసన్మానకరో భ్రువౌ మే పాతు సర్వదా
కామరూపః కపోలే మే ఫాలం వజ్రనభోవతు
శిరో మే పాతు సతతం జానకీ శోకనాశనః
శ్రీరామభక్త ప్రవరః పాతు సర్వ కళేబరం
మా మహ్ని పాతు సర్వజ్ఞ పాతు రాత్రే మహాయశాః
వివస్వదంతేవాసీచ సంధ్యయోః పాతు సర్వదా
బ్రహ్మాది దేవతాదత్త వరః పాతు నిరంతరం
య ఇదం కవచం నిత్యం పఠేచ్చ శృణుయా న్నరః
దీర్ఘమాయు రవాప్నోతి బలం దృష్టించ విందతి
పాదాక్రాంతా భవిష్యంతి పఠత స్తన్య శత్రవః
స్థిరాం మకీర్తి మారోగ్యం లభతే శాశ్వతం సుఖం
ఇతి నిగదిత వాక్యవృత్త తుభ్యం
సకలమపి స్వయ మాంజనేయ వృత్తం
అపి జని జనరక్షణైక దీక్షా
వశగతదీయ మహామను ప్రభావః ॥

ఈ కవచమును పైన చెప్పినవిధిగా ప్రతి నిత్యము పఠించినచో సర్వరోగములు, సర్వ శత్రుబయములు తప్పక శమించును. ఇది పూర్వము శ్రీరామునకు వశిష్ఠముని యుపదేశించిన అత్యద్భుత కవచము. ఇది పరాశరసంహితనుండి గ్రహింపబడింది.

ఓమ్ శ్రీ సీతారామంజనేయాయ నమః

మరిన్ని కవచాలు

Kolluna Navveru Ninnu Govinduda In Telugu – కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా

కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 14
కీర్తన : కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా
సంఖ్య : 333
పుట: 193
రాగం: మనోహరి

మనోహరి

10 కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుఁడా
గొల్లెతల నేమనేవు గోవిందుఁడా

||పల్లవి||

యేపున నీసుద్దులెల్ల యిట్టె యశోదతోడ
గోపిక లాడుకొనేరు గోవిందుఁడా
తీపుల నీచేఁతలెల్ల తేట తెల్లమాయనిదే
కోపగించఁ జెల్లదిఁక గోవిందుఁడా

||కొల్లు||

సిసువవై యాడువారి చీరలు దీసినందుకు
కొసరి తిట్టేరు నిన్ను గోవిందుఁడా
పసులఁగాచేచోట భామలు విందు దెచ్చిరి
కుసిగుంపు సేయకుమీ గోవిందుఁడా

||కొల్లు||

వాడలసతుల నొక్కవావిగానే సేసితివి
కోడెల నావులఁ గాచేగోవిందుఁడా
యీడనే శ్రీవేంకటాద్రి నిరవై శ్రీసతితోడఁ
గూడి లోలుఁడ వైతివి గోవిందుఁడా.

||కొల్లు||

అవతారిక:

“గోవులను కాచే గోవిందుడా! నిన్ను చూచి ఈ రేపల్లె గొల్లభామలు గొల్లుమని నవ్వారయ్యా! వాళ్ళనేమనగలము?” అంటున్నారు అన్నమాచార్యులవారు. నీ కోపాలు యికపై చెల్లేట్లులేవు. మరి నీవు వాళ్ళ చీరెలెత్తికెళ్ళిపోతే మళ్ళీ నిన్నే తిడుతున్నారు, అంటున్నారు. ఈ గోవిందుడు గొల్లవాడలోనున్న సతులనందరినీ ఒక్కవావిగానే చేశాడట. అంటే యేమిటో తెలుసా? ఆ గోవిందుడు, వరుసకు వదినా మరదళ్ళయిన ఇద్దరిని కూడితే వారు ఏమవుతారు? ఒకేవావి కదా! అంటే అక్కా చెల్లెళ్ళేకదా! అదన్నమాట సంగతి. ఇంతా చేసిన ఆ శ్రీసతిలోలుడేనట.

భావ వివరణ:

ఓ గోవిందుడా! ఈ గొల్లెతలను (గొల్లభామలను యేమనేవు (నీవేమి అనగలవు?) నీసంగతులు చెప్పుకొంటూ వాళ్ళు గొల్లుమని నవ్వుకొంటున్నారు చూశావా?

ఓ గోవిందుడా! నీ సుద్దులెల్లా (ముచ్చట్లనన్నియు) ఈ గోపికలు నీ తల్లి యశోదమ్మతో యేపున వున్నవీ లేనివీ కల్పించి యెక్కువగా) చెబుతున్నారు. నీ తీపుల చేతలెల్లా (నీవు పెట్టిన యాతనలు చిలిపి పనులు) అన్నియునూ తేటతెల్లమాయె (బట్టబయలైపోయాయి). ఓ గోవిందుడా నీ అలుకలు చెల్లవిక.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Narulara Neduvo Nara Simhajayanthi In Telugu – నరులార నేఁడువో నారసింహజయంతి

నరులార నేఁడువో నారసింహజయంతి – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో నరులార నేఁడువో నారసింహజయంతి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నరులార నేఁడువో నారసింహజయంతి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : నరులార నేఁడువో నారసింహజయంతి
సంఖ్య : 310
పుట: 208
రాగం: ముఖారి

ముఖారి

6 నరులార నేఁడువో నారసింహజయంతి
సురలకు నానందమై శుభము లొసఁగెను

||పల్లవి||

సందించి వైశాఖశుద్ధ చతుర్దశి శనివార-
మందు సంధ్యాకాలమున నౌభళేశుఁడు
పొందుగాఁ గంభములోనఁ బొడమి కడపమీఁద
కందువ గోళ్ళఁ జించెఁ గనకకశిపుని

||నరుఁ||

నరమృగరూపము నానాహస్తములు
అరిది శంఖచక్రాది ఆయుధాలతో
గరిమఁ బ్రహ్లాదునిఁ గాచి రక్షించి నిలిచె
గురుతరబ్రహ్మాండ గుహలోనను

||నరుఁ||

కాంచనపుగద్దె మీఁద గక్కనఁ గొలువైయుండి
మించుగ నిందిరఁ దొడమీఁదఁ బెట్టుక
అంచె శ్రీవేంకటగిరి నాదిమపురుషుండై
వంచన సేయక మంచివరాలిచ్చీనదివో

||నరుఁ||

అవతారిక:

ఒకానొక నృసింహ జయంతి సందర్భంగా అన్నమాచార్యులవారు చెప్పిన కీర్తననాస్వాదించండి. “ఓనరులారా! నేటిదినముననే స్తంభములో నరసింహుడు వుదయించి హిరణ్యకశిపుని తుదముట్టించి దేవతలకు శుభములను ఆనందమును యొసగినాడు” అని, ఆయన ప్రహ్లాదుని రక్షించిన వైనం కీర్తిస్తున్నారు. శ్రీవేంకటగిరి ఆదిమ పురుషుడైన ఆ ఏడుకొండలవాడే ఈయనైనందువలన వంచన సేయక మంచి వరాలిస్తాడు అని అంటున్నారు. ఈ ఔభళేశుడు (అహెూబల నరసింహుడు) గురుతరమైన బ్రహ్మాండ గుహలో వెలసినాడట.

భావ వివరణ:

ఓ నరులారా! నేడే నృసింహ జయంతి. ఈ నరసింహ జయంతి నాడే ఆయన స్తంభమున వెలసి హిరణ్యకశిపుని వధించి సురులకు ఆనందము కలిగించి శుభములనొసగినాడు.

ఈ ఔభళేశుడు (అహోబలేశ్వరుడు) సందించి (పూని) వైశాఖ శుద్ధ చతుర్ధశినాడు, శనివారము రోజున సంధ్యా సమయమున ఆవిర్భవించినాడు. చక్కగా ఆ హిరణ్యకశిపుని వరముల ననుసరించియే కంభములో పొడమి (స్తంభములోనుంచి పుట్టాడు కాబట్టి యే తల్లిదండ్రికి పుట్టనివాడైనాడు). ఒక కడపమీద వాడిని చంపాడు (కాబట్టి ఇంటా బయటా కాని చోటనే వాడు చచ్చాడు). కందువ (సామర్థ్యంతో) తనవాడియైన గోళ్ళతో (యే ఆయుధముతోను వాడికి చావులేదు కాబట్టి) చీల్చి ఆ కనకకశిపుని (హిరణ్య కశిపుని) వధించినాడు.

ఈయనయెట్లా వున్నాడో ఒకసారి చూడండి. ఈయనది నరమృగరూపము (తల సింహానిది శరీరము నరునిది), నానాహస్తములు (చాలా చేతులు వున్నందున నరుడు కూడా కాదు). అరిది (ఉపయోగింపబడని) శంఖచక్రములు ఆయన హస్తభూషణములుగా వున్నవి. గరిమ (అద్భుతముగా) తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని కాపాడి రక్షించి నిలిచినాడు. ఎక్కడ? బ్రహ్మాండమైన ఈ అహెూబలం కొండ గుహలో నిలిచినాడు.

ఎట్లా నిలిచాడో గమనించండి. ఆ దనుజుని వధానంతరం వెంటనే బంగారు గద్దెపై (సింహాసనముపై) మించుగ (వున్నతముగా) ఇందిరను (శ్రీలక్ష్మిని) తన తొడపై కూర్చుండబెట్టుకొని కొలువైయున్నాడు. ఈయనే అంచె (ఆ తరువాత) శ్రీవేంకటగిరి మీద ఆది పురుషుడు శ్రీవేంకటేశ్వరుడై నిలిచాడు. వంచన సేయక (నమ్మిన తన భక్తులను వంచించక) మంచి మంచి వరములనిస్తున్నాడు. అదిగో ఆయనకు మ్రొక్కండి.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

  1. సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా
  2. వారిధిశయన వో వటపత్రపరియంక
  3. వైష్ణవులసొమ్ము నేను వారు నీసొమ్ములింతే
  4. తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
  5. అంజినీదేవి కొడుకు హనుమంతుడు
  6. అప్పడైన హరియెక్కె నదివో తేరు
  7. అడియా నడియనయ్య యఖిలలోకైకనాథ

Durga Saptasati Keelaka Stotram | దుర్గా సప్తశతి కీలక స్తోత్రం

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దుర్గా సప్తశతి కీలక స్తోత్రం గురించి తెలుసుకుందాం…

Durga Saptasati Keelaka Stotram In Telugu

దుర్గా సప్తశతి కీలక స్తోత్రం

అస్య శ్రీ కీలక స్తోత్రమంత్రస్య శివ ఋషిః అనుష్టు| ప్ఛందః శ్రీ మహాసరస్వతీ దేవతా మంత్రి దితా దేవ్యో బీజం | నవాల్లో మంత్ర శ్శక్తిః | శ్రీ సప్తశతీమంత్రస్తత్త్వం! శ్రీజగదంబా ప్రీత్యర్థే సప్తశతీపాఠాంగ త్వేనజ విని యోగః| ఓం నమ శ్చండికాయై |

ఋషి రువాచ

విశుద్ధజ్ఞాన దేహాయ త్రివేదీ జ్ఞానిచకుషే |
శ్రేయఃప్రా ప్తినిమిత్తాయ నమ స్సోమార్థధారిణే ||

1

సర్వ మేత ద్విజావీయా న్మంత్రాణా మభికీలకం |
స్కోపి క్షేమ తేబ మవాప్నోతి సతతం జాప్యతత్పరః ||

2

క్షే సిద్ధ్యం త్యుచ్చాటనాదీని వస్తూని సకలావ్యపి
ఏతేన స్తువతాం దేవీ స్తోత్రమాత్రేణ సిద్ధ్యతి||

3

న మంత్రో నౌషధం తత్ర న కించి దపి విద్యతే
వినా జాప్యేన సిద్ధ్యేత సర్వ ముచ్చాటనాదికమ్ ||

4

సమగ్రాణ్యపి సేత్స్యంతి లోకశంకా మిమాం హరః
కృత్వా నిమంత్రయామాస సర్వ మేవ మిదం శుభమ్ ||

5

స్తోత్రం వై చండికాయస్తు తచ్చ గుహ్యం చకార సః॥
సమాప్తి ర్న చ పుణ్యస్య తాం యథావన్నియంత్రణామ్

6

స్కోపి క్షేమ మవాప్నోతి సర్వ మేవ న సంశయః|
కృష్ణాయాం వా చతుర్దశ్యా మష్టమ్యాం వా సమాహితః

7

దదాతి ప్రతిగృష్ణతి నాన్యకై షా ప్రసీదతి
ఇత్థం రూపేణ కీలేన మహాదేవేన కీలితమ్ ॥

8

యో నిష్కీలాం విధాయైనాం నిత్యం జపతి సస్ఫుటం
ససిద్ధః సగణః సోఒపీ గంధర్వో జాయతే వనే ||

9

న చైవా ప్యటత సస్య భయం క్వాపి హి జాయతే
నాపమృత్యువశం యాతి మృతో మోక్షమవాప్నుయాత్ ||

10

జ్ఞాత్వా ప్రారభ్య కుర్వీత హ్యకుర్వాణో వినిశ్యతి
తతొ జ్ఞాత్వైవ సంపన్న మిదం ప్రారభ్యతే బుదైః ||

11

సౌభాగ్యాది చ యత్కించి దృశ్యతే లలనాజ నే
తత్సర్వం తత్ప్రసాదేన తేన జాప్య మిదం శుభమ్ ||

12

శనైస్తు జప్యమానే ఒస్మిన్ స్తోత్రే సంపత్తి రుచ్చకై
భవత్యేవ సమగ్రాపీ తతః ప్రారభ్య మేవ తత్ ||

13

ఐశ్వర్యం యత్ప్రసాదేవ సౌభాగ్యారోగ్య సంపదః
శత్రుహానిః పరో మోక్షః స్తూయతే సా న కిం జనైః ||

14

ఇతి భగవత్యాః కీలక స్తోత్రమ్ ||

మరిన్ని స్తోత్రములు:

Sai Bhakti Kusumalu In Telugu – సాయి భక్తి కుసుమాలు

Sai Bhakti Kusumalu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి భక్తి కుసుమాలు గురించి తెలుసుకుందాం…

Sai Bhakti Kusumalu Telugu

ప్రార్థన

విన్నవించుచుంటిని స్వామి వినయముగను
శతక మాలను కూర్చగ శరణు గోరి
నిన్ను తలచి యుంటిని మది నిండ నిల్పి
విఘ్నములను తొలగ సేయు విజయ సాయి.

1

శుభములొసగు మూలపుటమ్మ చూడవమ్మ
మహిమ గల తల్లి మొక్కెద మనసుతోడ
నీ కృపా కటాక్షమ్ముల నింపవమ్మ
యని, సరస్వతి వేడెద నయ్య సాయి

2

భక్తి కుసుమాలు

సుప్రభాత వేళాయెనో సుప్రకాశ
భానుడుదయించె పొద్దెక్కి బారెడయ్యె.
భక్త జనులెల్ల నిను చేరి భజన సేయ
పూజలను గొని దయ చూడ పూను సాయి

3

నిర్మల మనముతో పూజ నీకు సేయ
భక్తులెల్ల మందిరమున భజన లొసగ
పూలు పళ్ళతో దూప దీపాల తోడ
వచ్చి యుండిరి దీవించు భవ్య సాయి

4

భక్తు లెక్కడ నున్నను వరములిచ్చి
పాప సంచయమ్ములనన్ని పాపి వేయ
మాధవ నగరమందున మాని తముగ
షిరిడిని తలపింపనిట నిల్చితివి సాయి

5

పద్యమగ కోరిక పల్లవించ
ఆకుల పరిచయమ్ముతో నదియు పెరిగె
పూర్తి జేయుటకు దగిన స్ఫూర్తి నిచ్చి
నీల కంఠేశ శతకమ్ము నిలిచె సాయి

6

నా కలము కవితల నల్లి నీ కొసంగ
నిండు మనసుతో మనసులో నిలిచిపోయి
శతకము పరిపూర్తిగ సేయు శక్తి నొసగి
సాగ నివ్వుము సాంతమ్ము సాధు సాయి

7

తెలియ కుండెను నాకు నీ తీపి చెలిమి
చూడ కుండగ ఉండను సుందరాంగ
కనికరముతో నొసగితివి గంగధరుని
కూర్మితో నిల్చె మనసైన గురువు సాయి

8

పాల రాతి కందిన పుణ్య వరమదేదొ
మేను రూపముతోనిట మెరిసిపోయె
పూల కబ్బిన ఏనాటి పుణ్య ఫలమొ
నీదు మెడలోన దండగా నిలిచె సాయి

9

ఎందరెందరినో ధరణి ఎరిగి యుండె
తీరు తీరు రూపంబుల తీరు చూసి
మేలిమైనట్టి రూపుతో మెరియునట్లు
తనదు కళలతో నిను తీర్చ తలచె సాయి

10

దత్త రూపుడ మాపైన దయను చూపు
వరములిచ్చు దేవర మమ్ము వదల తగదు
కనులుగల్గిన అంధుల కరణి మేము
వెదకుచుంటిమి దారి చూపించు సాయి

11

ఇంత సృష్టికి మూలమై ఇలను చేరి
మమ్ము గాంచెడి గురువువు మాదుజనక
ఆలయమ్మున గురువారమందు జనులు
భక్తితో నిను గొలుతురు భవ్య సాయి

12

అవని నేలెడు ప్రభువర ఆదుకొనుము
నింగి నిండిన దైవమా నిలువ రమ్ము
అంద చందాల నాథుడ అందుకొనుము
భక్తి నొసగు పూజలనిల బాబ సాయి

13

వేములాడలో వెలసిన వేల్పు వీవ
భక్తి తోడ కొలుచు చుంటి పరమ శివుడ
ఇంటిలో ఇలవేల్పుగా ఇమిడి పోయి
మమ్ము చల్లంగ కాపాడు మహిత సాయి

14

తల్లి దండ్రులులేనట్టి తనయుడవట
ఆలు బిడ్డలు లేని విశ్వాంగుడవట
షిరిడి చేరిన పుణ్యాత్మ సిద్ధరూప
అందుకొనవయ్య పూజలనిందు సాయి

15

ఇంద్రపురి భాగ్యమదియేమొ ఇచట నీవు
హృదయ గోపురమున నిల్చి ముదముతోడ
అడిగినంతనే కరుణతో నరుగుదెంచి
భాగ్యమొసగుచు నుందువు బంధు సాయి

16

సద్గురుని లీల గాంచని చవట నేను
జన్మ నిచ్చితివెందుకు జనక నాథ
ఉన్నఫలమేమి జీవించి ఉండి నీదు
పాదముల జేర గాంచని బ్రతుకు సాయి

17

వింత వింతగ చూడకు విసుగు చెంది
నీకో నీవె మా నీడవనుచు
“నిండు మనసులో స్థిరముగా నిన్ను చేర్చి
కొలుచుచుందును పూజల గొనుము సాయి

18

ఆత్మ యందు నీవే పరమాత్మ నీవె
సూక్ష్మమందు మోక్షమొసగి చూడ నీవె
నీవు లేని చోటెక్కడ నిజము దెలియ
ఏది నీవు కనని అందమేది సాయి

19

జానకీరామ కళ్యాణ సమయమందు
మమ్ము నేలేటి దైవమ్ము మహిని బుట్టె
మాదు పాపాల కడుగగ మరల తండ్రి
నవమి నాడు జన్మించిన నవ్య సాయి

20

ఆలయమున నాలుగు వేళలందు నీకు
భక్తి భావన పెంపొంద పరమనిష్ఠ
భక్త జనులంత నీ నామ భజన సల్ప
హారతు లొసగ వచ్చినారయ్య సాయి

21

మరిన్ని భక్తి గీతాలు

Sri Vishnu Sahasranamavali In Telugu – శ్రీ విష్ణు సహస్రననామావళిః

Sri Vishnu Sahasranamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక ప్రార్థనలలో ఒకటి. సహస్ర అనగా వెయ్యి . అంటే ఈ స్తోత్రంలో వెయ్యి నామాలు ఉంటాయి . ఇది శ్రీమహావిష్ణువు యొక్క వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు (చాత్తాద శ్రీవైష్ణవులు) భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు.ఇచట సహస్రనామము అనగా వేయి పేర్లు అని కాదు అనంతము అని చెప్పుకోవలెను. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ విష్ణు సహస్రననామావళిః గురించి తెలుసుకుందాం…

Sri Vishnu Sahasranamavali Telugu

శ్రీ విష్ణు సహస్రననామావళిః

  • ఓం విశ్వస్మై నమః |
  • ఓం విష్ణవే నమః |
  • ఓం వషట్కారాయ నమః |
  • ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః |
  • ఓం భూతకృతే నమః |
  • ఓం భూతభృతే నమః |
  • ఓం భావాయ నమః |
  • ఓం భూతాత్మనే నమః |
  • ఓం భూతభావనాయ నమః |
  • ఓం పూతాత్మనే నమః |
  • ఓం పరమాత్మనే నమః |
  • ఓం ముక్తానాంపరమగతయే నమః |
  • ఓం అవ్యయాయ నమః |
  • ఓం పురుషాయ నమః |
  • ఓం సాక్షిణే నమః |
  • ఓం క్షేత్రజ్ఞాయ నమః |
  • ఓం అక్షరాయ నమః |
  • ఓం అక్షరాయ నమః |
  • ఓం యోగాయ నమః |
  • ఓం యోగవిదాంనేత్రే నమః |
  • ఓం ప్రధానపురుషేశ్వరాయ నమః |
  • ఓం నారసింహవపుషే నమః |
  • ఓం శ్రీమతే నమః |
  • ఓం కేశవాయ నమః |
  • ఓం పురుషోత్తమాయ నమః |
  • ఓం సర్వస్మై నమః |
  • ఓం శర్వాయ నమః |
  • ఓం శివాయ నమః |
  • ఓం స్థాణవే నమః |
  • ఓం భూతాదయే నమః |
  • ఓం నిధయే౬ వ్యయాయ నమః |
  • ఓం సంభవాయ నమః
  • ఓం భావనాయ నమః |
  • ఓం భర్తే నమః |
  • ఓం ప్రభవాయ నమః |
  • ఓం ప్రభవే నమః |
  • ఓం ఈశ్వరాయ నమః |
  • ఓం స్వయంభువే నమః |
  • ఓం శంభవే నమః |
  • ఓం ఆదిత్యాయ నమః |
  • ఓం పుష్కరాక్షాయ నమః |
  • ఓం మహాస్వనాయ నమః |
  • ఓం అనాదినిధనాయ నమః |
  • ఓం ధాత్రే నమః |
  • ఓం విధాత్రే నమః |
  • ఓం ధాతురుత్తమాయ నమః |
  • ఓం అప్రమేయాయ నమః |
  • ఓం హృషీకేశాయ నమః |
  • ఓం పద్మనాభాయ నమః |
  • ఓం అమరప్రభవే నమః |
  • ఓం విశ్వకర్మణే నమః |
  • ఓం మనవే నమః |
  • ఓం త్వష్టే నమః |
  • ఓం స్థవిష్ఠాయ నమః |
  • ఓం స్థవిరాయ ధ్రువాయ నమః |
  • ఓం అగ్రహ్యాయ నమః |
  • ఓం శాశ్వతాయ నమః |
  • ఓం కృష్ణాయ నమః |
  • ఓం లోహితాక్షాయ నమః |
  • ఓం ప్రతర్దనాయ నమః |
  • ఓం ప్రభూతాయ నమః |
  • ఓం త్రికకుబ్ధామ్నే నమః |
  • ఓం పవిత్రాయ నమః |
  • ఓం మంగళాయ పరస్మై నమః |
  • ఓం ఈశానాయ నమః |
  • ఓం ప్రాణదాయ నమః |
  • ఓం ప్రాణాయ నమః |
  • ఓం జ్యేష్ఠాయ నమః |
  • ఓం శ్రేష్ఠాయ నమః |
  • ఓం ప్రజాపతయే నమః |
  • ఓం హిరణ్యగర్భాయ నమః |
  • ఓం భూగర్భాయ నమః |
  • ఓం మాధవాయ నమః |
  • ఓం మధుసూదనాయ నమః |
  • ఓం ఈశ్వరాయ నమః |
  • ఓం విక్రమిణే నమః |
  • ఓం ధన్వినే నమః |
  • ఓం మేధావినే నమః |
  • ఓం విక్రమాయ నమః |
  • ఓం క్రమాయ నమః |
  • ఓం అనుత్తమాయ నమః |
  • ఓం దురాధర్షాయ నమః |
  • ఓం కృతజ్ఞాయ నమః |
  • ఓం కృతయే నమః |
  • ఓం ఆత్మవతే నమః |
  • ఓం సురేశాయ నమః |
  • ఓం శరణాయ నమః |
  • ఓం శర్మణే నమః |
  • ఓం విశ్వరేతసే నమః |
  • ఓం ప్రజాభవాయ నమః |
  • ఓం అన్హే నమః |
  • ఓం సంవత్సరాయ నమః |
  • ఓం వ్యాళాయ నమః |
  • ఓం ప్రత్యయాయ నమః |
  • ఓం సర్వదర్శనాయ నమః |
  • ఓం అజాయ నమః |
  • ఓం సర్వేశ్వరాయ నమః |
  • ఓం సిద్ధాయ నమః |
  • ఓం సిద్ధయే నమః |
  • ఓం సర్వాదయే నమః |
  • ఓం అచ్యుతాయ నమః |
  • ఓం వృషాకపయే నమః |
  • ఓం అమేయాత్మనే నమః |
  • ఓం సర్వయోగవినిఃసృతాయ నమః |
  • ఓం వసవే నమః |
  • ఓం వసుమనసే నమః |
  • ఓం సత్యాయ నమః |
  • ఓం సమాత్మనే నమః |
  • ఓం సమ్మితాయ నమః |
  • ఓం సమాయ నమః |
  • ఓం అమోఘాయ నమః |
  • ఓం పుండరీకాక్షాయ నమః |
  • ఓం వృషకర్మణే నమః |
  • ఓం వృషాకృతయే నమః |
  • ఓం రుద్రాయ నమః |
  • ఓం బహుశిరసే నమః |
  • ఓం బభ్రవే నమః |
  • ఓం విశ్వయోనయే నమః |
  • ఓం శుచిశ్రవసే నమః |
  • ఓం అమృతాయ నమః |
  • ఓం శాశ్వతస్థాణవే నమః |
  • ఓం వరారోహాయ నమః |
  • ఓం మహాతపసే నమః |
  • ఓం సర్వగాయ నమః |
  • ఓం సర్వవిద్భానవే నమః |
  • ఓం విష్వక్సేనాయ నమః |
  • ఓం జనార్దనాయ నమః |
  • ఓం వేదాయ నమః |
  • ఓం వేదవిదే నమః |
  • ఓం అవ్యంగాయ నమః |
  • ఓం వేదాంగాయ నమః |
  • ఓం వేదవిదే నమః |
  • ఓం కవయే నమః |
  • ఓం లోకాధ్యక్షాయ నమః |
  • ఓం సురాధ్యక్షాయ నమః |
  • ఓం ధర్మాధ్యక్షాయ నమః |
  • ఓం కృతాకృతాయ నమః |
  • ఓం చతురాత్మనే నమః |
  • ఓం చతుర్వ్యూహాయ నమః |
  • ఓం చతుర్దంష్ట్రాయ నమః |
  • ఓం చతుర్భుజాయ నమః |
  • ఓం భ్రాజిష్ణవే నమః
  • ఓం భోజనాయ నమః |
  • ఓం భోక్తే నమః |
  • ఓం సహిష్ణవే నమః |
  • ఓం జగదాదిజాయ నమః |
  • ఓం అనఘాయ నమః |
  • ఓం విజయాయ నమః |
  • ఓం జేత్రే నమః |
  • ఓం విశ్వయోనయే నమః |
  • ఓం పునర్వసవే నమః |
  • ఓం ఉపేంద్రాయ నమః |
  • ఓం వామనాయ నమః |
  • ఓం ప్రాంశవే నమః |
  • ఓం అమోఘాయ నమః |
  • ఓం శుచయే నమః |
  • ఓం ఉర్జితాయ నమః |
  • ఓం అతీంద్రాయ నమః |
  • ఓం సంగ్రహాయ నమః |
  • ఓం సర్గాయ నమః |
  • ఓం ధృతాత్మనే నమః |
  • ఓం నియమాయ నమః |
  • ఓం యమాయ నమః |
  • ఓం వేద్యాయ నమః |
  • ఓం వైద్యాయ నమః |
  • ఓం సదాయోగినే నమః |
  • ఓం వీరఘ్నే నమః |
  • ఓం మాధవాయ నమః |
  • ఓం మధవే నమః |
  • ఓం అతీంద్రియాయ నమః |
  • ఓం మహామాయాయ నమః |
  • ఓం మహోత్సాహాయ నమః |
  • ఓం మహాబలాయ నమః |
  • ఓం మహాబుద్ధయే నమః |
  • ఓం మహావీర్యాయ నమః |
  • ఓం మహాశక్తయే నమః |
  • ఓం మహాద్యుతయే నమః |
  • ఓం అనిర్దేశ్యవపుషే నమః |
  • ఓం శ్రీమతే నమః |
  • ఓం అమేయాత్మనే నమః |
  • ఓం మహాద్రిధృతే నమః |
  • ఓం మహేశ్వాసాయ నమః |
  • ఓం మహీభర్తే నమః |
  • ఓం శ్రీనివాసాయ నమః |
  • ఓం సతాంగతయే నమః |
  • ఓం అనిరుద్ధాయ నమః |
  • ఓం సురానందాయ నమః |
  • ఓం గోవిందాయ నమః |
  • ఓం గోవిదాంపతయే నమః |
  • ఓం మరీచయే నమః |
  • ఓం దమనాయ నమః |
  • ఓం హంసాయ నమః |
  • ఓం సుపర్ణాయ నమః |
  • ఓం భుజగోత్తమాయ నమః |
  • ఓం హిరణ్యనాభాయ నమః |
  • ఓం సుతపసే నమః |
  • ఓం పద్మనాభాయ నమః |
  • ఓం ప్రజాపతయే నమః |
  • ఓం అమృత్యవే నమః |
  • ఓం సర్వదృశే నమః |
  • ఓం సింహాయ నమః |
  • ఓం సంధాత్రే నమః |
  • ఓం సంధిమతే నమః |
  • ఓం స్థిరాయ నమః |
  • ఓం అజాయ నమః |
  • ఓం దుర్మర్షణాయ నమః |
  • ఓం శాస్త్రే నమః |
  • ఓం విశ్రుతాత్మనే నమః |
  • ఓం సురారిఘ్నే నమః |
  • ఓం గురువే నమః |
  • ఓం గురుతమాయ నమః |
  • ఓం ధామ్నే నమః |
  • ఓం సత్యాయ నమః |
  • ఓం సత్యపరాక్రమాయ నమః |
  • ఓం నిమిషాయ నమః |
  • ఓం అనిమిషాయ నమః |
  • ఓం స్రగ్వీణే నమః |
  • ఓం వాచస్పతయే ఉదారధియే నమః |
  • ఓం అగ్రణ్యే నమః |
  • ఓం గ్రామణ్యే నమః |
  • ఓం శ్రీమతే నమః |
  • ఓం న్యాయాయ నమః |
  • ఓం నేత్రే నమః |
  • ఓం సమీరణాయ నమః |
  • ఓం సహస్రమూర్ధ్నే నమః |
  • ఓం విశ్వాత్మనే నమః |
  • ఓం సహస్రాక్షాయ నమః |
  • ఓం సహస్రపదే నమః |
  • ఓం ఆవర్తనాయ నమః |
  • ఓం నివృత్తాత్మనే నమః |
  • ఓం సంవృతాయ నమః |
  • ఓం సంప్రమర్దనాయ నమః |
  • ఓం అహఃసంవర్తకాయ నమః |
  • ఓం వహ్నయే నమః |
  • ఓం అనిలాయ నమః |
  • ఓం ధరణీధరాయ నమః |
  • ఓం సుప్రసాదాయ నమః |
  • ఓం ప్రసన్నాత్మనే నమః |
  • ఓం విశ్వధృషే నమః |
  • ఓం విశ్వభుజే నమః |
  • ఓం విభవే నమః |
  • ఓం సత్కర్తే నమః |
  • ఓం సత్కృతాయ నమః |
  • ఓం సాధవే నమః |
  • ఓం జహ్నవే నమః |
  • ఓం నారాయణాయ నమః |
  • ఓం నరాయ నమః |
  • ఓం అసంఖ్యేయాయ నమః |
  • ఓం అప్రమేయాత్మనే నమః |
  • ఓం విశిష్టాయ నమః |
  • ఓం శిష్టకృతే నమః |
  • ఓం శుచయే నమః |
  • ఓం సిద్ధార్థాయ నమః |
  • ఓం సిద్ధసంకల్పాయ నమః |
  • ఓం సిద్ధిదాయ నమః |
  • ఓం సిద్ధిసాధనాయ నమః |
  • ఓం వృషాహిణే నమః |
  • ఓం వృషభాయ నమః |
  • ఓం విష్ణవే నమః |
  • ఓం వృషపర్వణే నమః |
  • ఓం వృషోదరాయ నమః |
  • ఓం వర్ధనాయ నమః |
  • ఓం వర్ధమానాయ నమః |
  • ఓం వివిక్తాయ నమః |
  • ఓం శ్రుతిసాగరాయ నమః |
  • ఓం సుభుజాయ నమః |
  • ఓం దుర్ధరాయ నమః |
  • ఓం వాగ్మినే నమః |
  • ఓం మహేంద్రాయ నమః |
  • ఓం వసుదాయ నమః |
  • ఓం వసవే నమః |
  • ఓం నైకరూపాయ నమః |
  • ఓం బృహద్రూపాయ నమః |
  • ఓం శిపివిష్టాయ నమః |
  • ఓం ప్రకాశనాయ నమః |
  • ఓం ఓజస్తేజోద్యుతిధరాయ నమః |
  • ఓం ప్రకాశాత్మనే నమః |
  • ఓం ప్రతాపనాయ నమః |
  • ఓం ఋద్ధాయ నమః |
  • ఓం స్పష్టాక్షరాయ నమః |
  • ఓం మంత్రాయ నమః |
  • ఓం చంద్రాంశవే నమః |
  • ఓం భాస్కరద్యుతయే నమః |
  • ఓం అమృతాంశూద్భవాయ నమః |
  • ఓం భానవే నమః |
  • ఓం శశిబిందవే నమః |
  • ఓం సురేశ్వరాయ నమః |
  • ఓం ఔషధాయ నమః |
  • ఓం జగతస్సేతవే నమః |
  • ఓం సత్యధర్మపరాక్రమాయ నమః |
  • ఓం భూతభవ్యభవన్నాథాయ నమః |
  • ఓం పవనాయ నమః |
  • ఓం పావనాయ నమః |
  • ఓం అనలాయ నమః |
  • ఓం కామఘ్నే నమః |
  • ఓం కామకృతే నమః |
  • ఓం కాంతాయ నమః |
  • ఓం కామాయ నమః |
  • ఓం కామప్రదాయ నమః |
  • ఓం ప్రభవే నమః |
  • ఓం యుగాదికృతే నమః |
  • ఓం యుగావర్తాయ నమః |
  • ఓం నైకమాయాయ నమః |
  • ఓం మహాశనాయ నమః |
  • ఓం అదృశ్యాయ నమః |
  • ఓం వ్యక్తరూపాయ నమః |
  • ఓం సహస్రజితే నమః |
  • ఓం అనంతజితే నమః |
  • ఓం ఇష్టాయ నమః |
  • ఓం విశిష్టాయ నమః |
  • ఓం శిష్టేష్టాయ నమః |
  • ఓం శిఖండినే నమః |
  • ఓం నహుషాయ నమః |
  • ఓం వృషాయ నమః |
  • ఓం క్రోధగ్నే నమః |
  • ఓం క్రోధకృత్కర్తే నమః |
  • ఓం విశ్వబాహవే నమః |
  • ఓం మహీధరాయ నమః |
  • ఓం అచ్యుతాయ నమః |
  • ఓం ప్రథితాయ నమః |
  • ఓం ప్రాణాయ నమః |
  • ఓం ప్రాణదాయ నమః |
  • ఓం వాసవానుజాయ నమః |
  • ఓం అపాంనిధయే నమః |
  • ఓం అధిష్ఠానాయ నమః |
  • ఓం అప్రమత్తాయ నమః |
  • ఓం ప్రతిష్ఠితాయ నమః |
  • ఓం స్కందాయ నమః |
  • ఓం స్కందధరాయ నమః |
  • ఓం ధుర్యాయ నమః |
  • ఓం వరదాయ నమః |
  • ఓం వాయువాహనాయ నమః |
  • ఓం వాసుదేవాయ నమః |
  • ఓం బృహద్భానవే నమః |
  • ఓం ఆదిదేవాయ నమః |
  • ఓం పురందరాయ నమః |
  • ఓం అశోకాయ నమః |
  • ఓం తారణాయ నమః |
  • ఓం తారాయ నమః |
  • ఓం శూరాయ నమః |
  • ఓం శౌరయే నమః |
  • ఓం జనేశ్వరాయ నమః |
  • ఓం అనుకూలాయ నమః |
  • ఓం శతావర్తాయ నమః |
  • ఓం పద్మినే నమః |
  • ఓం పద్మనిభేక్షణాయ నమః |
  • ఓం పద్మనాభాయ నమః |
  • ఓం అరవిందాక్షాయ నమః |
  • ఓం పద్మగర్భాయ నమః |
  • ఓం శరీరభృతే నమః |
  • ఓం మహర్ధయే నమః |
  • ఓం ఋద్ధాయ నమః |
  • ఓం వృద్ధాత్మనే నమః |
  • ఓం మహాక్షాయ నమః |
  • ఓం గరుడధ్వజాయ నమః |
  • ఓం అతులాయ నమః |
  • ఓం శరభాయ నమః |
  • ఓం భీమాయ నమః |
  • ఓం సమయజ్ఞాయ నమః |
  • ఓం హవిర్హరయే నమః |
  • ఓం సర్వలక్షణలక్షణ్యాయ నమః |
  • ఓం లక్ష్మీవతే నమః |
  • ఓం సమితింజయాయ నమః |
  • ఓం విక్షరాయ నమః |
  • ఓం రోహితాయ నమః |
  • ఓం మార్గాయ నమః |
  • ఓం హేతవే నమః |
  • ఓం దామోదరాయ నమః |
  • ఓం సహాయ నమః |
  • ఓం మహీధరాయ నమః |
  • ఓం మహాభాగాయ నమః |
  • ఓం వేగవతే నమః |
  • ఓం అమితాశనాయ నమః |
  • ఓం ఉద్భవాయ నమః |
  • ఓం క్షోభణాయ నమః |
  • ఓం దేవాయ నమః |
  • ఓం శ్రీగర్భాయ నమః |
  • ఓం పరమేశ్వరాయ నమః |
  • ఓం కరణాయ నమః |
  • ఓం కారణాయ నమః |
  • ఓం కర్తే నమః |
  • ఓం వికర్తే నమః |
  • ఓం గహనాయ నమః |
  • ఓం గుహాయ నమః |
  • ఓం వ్యవసాయాయ నమః |
  • ఓం వ్యవస్థానాయ నమః |
  • ఓం సంస్థానాయ నమః |
  • ఓం స్థానదాయ నమః |
  • ఓం ధ్రువాయ నమః |
  • ఓం పరర్ధయే నమః |
  • ఓం పరమస్పష్టాయ నమః |
  • ఓం తుష్టాయ నమః |
  • ఓం పుష్టాయ నమః |
  • ఓం శుభేక్షణాయ నమః |
  • ఓం రామాయ నమః |
  • ఓం విరామాయ నమః |
  • ఓం విరజాయ నమః |
  • ఓం మార్గాయ నమః |
  • ఓం నేయాయ నమః |
  • ఓం నయాయ నమః |
  • ఓం అనయాయ నమః |
  • ఓం వీరాయ నమః |
  • ఓం శక్తిమతాం శ్రేష్ఠాయ నమః |
  • ఓం ధర్మాయ నమః |
  • ఓం ధర్మవిదుత్తమాయ నమః |
  • ఓం వైకుంఠాయ నమః |
  • ఓం పురుషాయ నమః |
  • ఓం ప్రాణాయ నమః |
  • ఓం ప్రాణదాయ నమః |
  • ఓం ప్రణవాయ నమః |
  • ఓం పృథవే నమః |
  • ఓం హిరణ్యగర్భాయ నమః |
  • ఓం శత్రుఘ్నాయ నమః |
  • ఓం వ్యాప్తాయ నమః |
  • ఓం వాయవే నమః |
  • ఓం అధోక్షజాయ నమః |
  • ఓం ఋతవే నమః |
  • ఓం సుదర్శనాయ నమః |
  • ఓం కాలాయ నమః |
  • ఓం పరమేష్ఠినే నమః |
  • ఓం పరిగ్రహాయ నమః |
  • ఓం ఉగ్రాయ నమః |
  • ఓం సంవత్సరాయ నమః |
  • ఓం దక్షాయ నమః |
  • ఓం విశ్రామాయ నమః |
  • ఓం విశ్వదక్షిణాయ నమః |
  • ఓం విస్తారాయ నమః |
  • ఓం స్థావరస్థాణవే నమః |
  • ఓం ప్రమాణాయ నమః |
  • ఓం బీజాయ అవ్యయాయ నమః |
  • ఓం అర్థాయ నమః |
  • ఓం అనర్థాయ నమః |
  • ఓం మహాకోశాయ నమః
  • ఓం మహాభోగాయ నమః |
  • ఓం మహాధనాయ నమః |
  • ఓం అనిర్విర్ణాయ నమః |
  • ఓం స్థవిష్ఠాయ నమః |
  • ఓం భువే నమః |
  • ఓం ధర్మయూపాయ నమః |
  • ఓం మహామఖాయ నమః |
  • ఓం నక్షత్రనేమయే నమః |
  • ఓం నక్షిత్రిణే నమః |
  • ఓం క్షమాయ నమః |
  • ఓం క్షామాయ నమః |
  • ఓం సమీహనాయ నమః |
  • ఓం యజ్ఞాయ నమః |
  • ఓం ఇజ్యాయ నమః |
  • ఓం మహేజ్యాయ నమః |
  • ఓం క్రతవే నమః |
  • ఓం సత్రాయ నమః |
  • ఓం సతాంగతయే నమః |
  • ఓం సర్వదర్శినే నమః |
  • ఓం విముక్తాత్మనే నమః |
  • ఓం సర్వజ్ఞాయ నమః |
  • ఓం జ్ఞానముత్తమాయ నమః |
  • ఓం సువ్రతాయ నమః |
  • ఓం సుముఖాయ నమః |
  • ఓం సూక్ష్మాయ నమః |
  • ఓం సుఘోషాయ నమః |
  • ఓం సుఖదాయ నమః |
  • ఓం సుహృదే నమః |
  • ఓం మనోహరాయ నమః |
  • ఓం జితక్రోధాయ నమః |
  • ఓం వీరబాహవే నమః |
  • ఓం విదారణాయ నమః |
  • ఓం స్వాపనాయ నమః |
  • ఓం స్వవశాయ నమః |
  • ఓం వ్యాపినే నమః |
  • ఓం నైకాత్మనే నమః |
  • ఓం నైకకర్మకృతే నమః |
  • ఓం వత్సరాయ నమః |
  • ఓం వత్సలాయ నమః |
  • ఓం వత్సినే నమః |
  • ఓం రత్నగర్భాయ నమః |
  • ఓం ధనేశ్వరాయ నమః |
  • ఓం ధర్మగుప్తే నమః |
  • ఓం ధర్మకృతే నమః |
  • ఓం ధర్మిణే నమః |
  • ఓం సతే నమః |
  • ఓం అసతే నమః |
  • ఓం క్షరాయ నమః |
  • ఓం అక్షరాయ నమః |
  • ఓం అవిజ్ఞాత్రే నమః |
  • ఓం సహస్రాంశవే నమః |
  • ఓం విధాత్రే నమః |
  • ఓం కృతలక్షణాయ నమః |
  • ఓం గభస్తినేమయే నమః |
  • ఓం సత్త్వస్థాయ నమః |
  • ఓం సింహాయ నమః |
  • ఓం భూతమహేశ్వరాయ నమః |
  • ఓం ఆదిదేవాయ నమః |
  • ఓం మహాదేవాయ నమః |
  • ఓం దేవేశాయ నమః |
  • ఓం దేవభృద్గురవే నమః |
  • ఓం ఉత్తరాయ నమః |
  • ఓం గోపతయే నమః |
  • ఓం గోప్తే నమః |
  • ఓం జ్ఞానగమ్యాయ నమః |
  • ఓం పురాతనాయ నమః |
  • ఓం శరీరభూతభృతే నమః |
  • ఓం భోక్తే నమః |
  • ఓం కపీంద్రాయ నమః |
  • ఓం భూరిదక్షిణాయ నమః |
  • ఓం సోమపాయ నమః |
  • ఓం అమృతపాయ నమః |
  • ఓం సోమాయ నమః |
  • ఓం పురుజితే నమః |
  • ఓం పురుసత్తమాయ నమః |
  • ఓం వినయాయ నమః |
  • ఓం జయాయ నమః |
  • ఓం సత్యసంధాయ నమః |
  • ఓం దాశార్హాయ నమః |
  • ఓం సాత్వతాం పతయే నమః |
  • ఓం జీవాయ నమః |
  • ఓం వినయితాసాక్షిణే నమః |
  • ఓం ముకుందాయ నమః |
  • ఓం అమితవిక్రమాయ నమః |
  • ఓం అంభోనిధయే నమః |
  • ఓం అనంతాత్మనే నమః |
  • ఓం మహోదధిశయాయ నమః |
  • ఓం అంతకాయ నమః |
  • ఓం అజాయ నమః |
  • ఓం మహార్హాయ నమః |
  • ఓం స్వాభావ్యాయ నమః |
  • ఓం జితామిత్రాయ నమః |
  • ఓం ప్రమోదనాయ నమః |
  • ఓం ఆనందాయ నమః |
  • ఓం నందనాయ నమః |
  • ఓం నందాయ నమః |
  • ఓం సత్యధర్మణే నమః |
  • ఓం త్రివిక్రమాయ నమః |
  • ఓం మహర్షయే కపిలాచార్యాయ నమః |
  • ఓం కృతజ్ఞాయ నమః |
  • ఓం మేదినీపతయే నమః |
  • ఓం త్రిపదాయ నమః |
  • ఓం త్రిదశాధ్యక్షాయ నమః |
  • ఓం మహాశృంగాయ నమః |
  • ఓం కృతాంతకృతే నమః |
  • ఓం మహావరాహాయ నమః |
  • ఓం గోవిందాయ నమః |
  • ఓం సుషేణాయ నమః |
  • ఓం కనకాంగదినే నమః |
  • ఓం గుహ్యాయ నమః |
  • ఓం గభీరాయ నమః |
  • ఓం గహనాయ నమః |
  • ఓం గుప్తాయ నమః |
  • ఓం చక్రగదాధరాయ నమః |
  • ఓం వేదసే నమః |
  • ఓం స్వాంగాయ నమః |
  • ఓం అజితాయ నమః |
  • ఓం కృష్ణాయ నమః |
  • ఓం దృఢాయ నమః |
  • ఓం సంకర్షణాయ అచ్యుతాయ నమః |
  • ఓం వరుణాయ నమః |
  • ఓం వారుణాయ నమః |
  • ఓం వృక్షాయ నమః |
  • ఓం పుష్కరాక్షాయ నమః |
  • ఓం మహామనసే నమః |
  • ఓం భగవతే నమః |
  • ఓం భగఘ్నే నమః |
  • ఓం ఆనందినే నమః |
  • ఓం వనమాలినే నమః |
  • ఓం హలాయుధాయ నమః |
  • ఓం ఆదిత్యాయ నమః |
  • ఓం జ్యోతిరాదిత్యాయ నమః |
  • ఓం సహిష్ణువే నమః |
  • ఓం గతిసత్తమాయ నమః |
  • ఓం సుధన్వనే నమః |
  • ఓం ఖండపరశవే నమః |
  • ఓం దారుణాయ నమః |
  • ఓం ద్రవిణప్రదాయ నమః |
  • ఓం దివస్పృశే నమః |
  • ఓం సర్వదృగ్వ్యాసాయ నమః |
  • ఓం వాచస్పతయే అయోనిజాయ నమః |
  • ఓం త్రిసామ్నే నమః |
  • ఓం సామగాయ నమః |
  • ఓం సామ్నే నమః |
  • ఓం నిర్వాణాయ నమః |
  • ఓం భేషజాయ నమః |
  • ఓం భిషజే నమః |
  • ఓం సన్న్యాసకృతే నమః |
  • ఓం శమాయ నమః |
  • ఓం శాంతాయ నమః |
  • ఓం నిష్ఠాయై నమః |
  • ఓం శాంత్యై నమః |
  • ఓం పరాయణాయ నమః |
  • ఓం శుభాంగాయ నమః |
  • ఓం శాంతిదాయ నమః |
  • ఓం స్రష్టాయ నమః |
  • ఓం కుముదాయ నమః |
  • ఓం కువలేశయాయ నమః |
  • ఓం గోహితాయ నమః |
  • ఓం గోపతయే నమః |
  • ఓం గోప్తే నమః |
  • ఓం వృషభాక్షాయ నమః |
  • ఓం వృషప్రియాయ నమః |
  • ఓం అనివర్తినే నమః |
  • ఓం నివృత్తాత్మనే నమః |
  • ఓం సంక్షేప్తే నమః |
  • ఓం క్షేమకృతే నమః |
  • ఓం శివాయ నమః |
  • ఓం శ్రీవత్సవక్షసే నమః |
  • ఓం శ్రీవాసాయ నమః |
  • ఓం శ్రీపతయే నమః |
  • ఓం శ్రీమతాం వరాయ నమః |
  • ఓం శ్రీదాయ నమః |
  • ఓం శ్రీశాయ నమః |
  • ఓం శ్రీనివాసాయ నమః |
  • ఓం శ్రీనిధయే నమః |
  • ఓం శ్రీవిభావనాయ నమః |
  • ఓం శ్రీధరాయ నమః |
  • ఓం శ్రీకరాయ నమః |
  • ఓం శ్రేయసే నమః |
  • ఓం శ్రీమతే నమః |
  • ఓం లోకత్రయాశ్రయాయ నమః |
  • ఓం స్వక్షాయ నమః |
  • ఓం స్వంగాయ నమః |
  • ఓం శతానందాయ నమః |
  • ఓం నందినే నమః |
  • ఓం జ్యోతిర్గణేశ్వరాయ నమః |
  • ఓం విజితాత్మనే నమః |
  • ఓం విధేయాత్మనే నమః |
  • ఓం సత్కీర్తయే నమః |
  • ఓం ఛిన్నసంశయాయ నమః |
  • ఓం ఉదీర్ణాయ నమః |
  • ఓం సర్వతశ్చక్షుషే నమః |
  • ఓం అనీశాయ నమః |
  • ఓం శాశ్వతస్థిరాయ నమః |
  • ఓం భూశయాయ నమః |
  • ఓం భూషణాయ నమః |
  • ఓం భూతయే నమః |
  • ఓం విశోకాయ నమః |
  • ఓం శోకనాశనాయ నమః |
  • ఓం అర్చిష్మతే నమః |
  • ఓం అర్చితాయ నమః |
  • ఓం కుంభాయ నమః |
  • ఓం విశుద్ధాత్మనే నమః |
  • ఓం విశోధనాయ నమః |
  • ఓం అనిరుద్ధాయ నమః |
  • ఓం అప్రతిరథాయ నమః |
  • ఓం ప్రద్యుమ్నాయ నమః |
  • ఓం అమితవిక్రమాయ నమః |
  • ఓం కాలనేమినిఘ్నే నమః |
  • ఓం వీరాయ నమః |
  • ఓం శౌరయే నమః |
  • ఓం శూరజనేశ్వరాయ నమః |
  • ఓం త్రిలోకాత్మనే నమః |
  • ఓం త్రిలోకేశాయ నమః |
  • ఓం కేశవాయ నమః |
  • ఓం కేశిఘ్నే నమః |
  • ఓం హరయే నమః |
  • ఓం కామదేవాయ నమః |
  • ఓం కామపాలాయ నమః |
  • ఓం కామినే నమః |
  • ఓం కాంతాయ నమః |
  • ఓం కృతాగమాయ నమః |
  • ఓం అనిర్దేశ్యవపుషే నమః |
  • ఓం విష్ణవే నమః |
  • ఓం వీరాయ నమః |
  • ఓం అనంతాయ నమః |
  • ఓం ధనంజయాయ నమః |
  • ఓం బ్రహ్మణ్యాయ నమః |
  • ఓం బ్రహ్మకృతే నమః |
  • ఓం బ్రహ్మణే నమః |
  • ఓం బ్రాహ్మణే నమః |
  • ఓం బ్రహ్మాయ నమః |
  • ఓం బ్రహ్మవివర్ధనాయ నమః |
  • ఓం బ్రహ్మవిదే నమః |
  • ఓం బ్రాహ్మణాయ నమః |
  • ఓం బ్రహ్మిణే నమః |
  • ఓం బ్రహ్మజ్ఞాయ నమః |
  • ఓం బ్రాహ్మణప్రియాయ నమః |
  • ఓం మహాక్రమాయ నమః |
  • ఓం మహాకర్మణే నమః |
  • ఓం మహాతేజసే నమః |
  • ఓం మహోరగాయ నమః |
  • ఓం మహాక్రతవే నమః |
  • ఓం మహాయజ్వినే నమః |
  • ఓం మహాయజ్ఞాయ నమః |
  • ఓం మహాహవిషే నమః |
  • ఓం స్తవ్యాయ నమః |
  • ఓం స్తవప్రియాయ నమః |
  • ఓం స్తోత్రాయ నమః
  • ఓం స్తుతయే నమః |
  • ఓం స్తోత్రే నమః |
  • ఓం రణప్రియాయ నమః |
  • ఓం పూర్ణాయ నమః |
  • ఓం పూరయిత్రే నమః |
  • ఓం పుణ్యాయ నమః |
  • ఓం పుణ్యకీర్తయే నమః |
  • ఓం అనామయాయ నమః |
  • ఓం మనోజవాయ నమః |
  • ఓం తీర్థకరాయ నమః |
  • ఓం వసురేతసే నమః |
  • ఓం వసుప్రదాయ నమః |
  • ఓం వాసుదేవాయ నమః |
  • ఓం వసవే నమః |
  • ఓం వసుమనసే నమః |
  • ఓం హవిషే నమః |
  • ఓం హవిషే నమః |
  • ఓం సద్గతయే నమః |
  • ఓం సత్కృతయే నమః |
  • ఓం సత్తాయై నమః |
  • ఓం సద్భూతయే నమః |
  • ఓం సత్పరాయణాయ నమః |
  • ఓం శూరసేనాయ నమః |
  • ఓం యదుశ్రేష్ఠాయ నమః |
  • ఓం సన్నివాసాయ నమః |
  • ఓం సుయామునాయ నమః |
  • ఓం భూతావాసాయ నమః |
  • ఓం వాసుదేవాయ నమః |
  • ఓం సర్వాసునిలయాయ నమః |
  • ఓం అనలాయ నమః |
  • ఓం దర్పఘ్నే నమః |
  • ఓం దర్పదాయ నమః |
  • ఓం దృప్తాయ నమః |
  • ఓం దుర్ధరాయ నమః |
  • ఓం అపరాజితాయ నమః |
  • ఓం విశ్వమూర్తయే నమః |
  • ఓం మహామూర్తయే నమః |
  • ఓం దీప్తమూర్తయే నమః |
  • ఓం అమూర్తిమతే నమః |
  • ఓం అనేకమూర్తయే నమః |
  • ఓం అవ్యక్తాయ నమః |
  • ఓం శతమూర్తయే నమః
  • ఓం శతాననాయ నమః |
  • ఓం ఏకైస్మె నమః |
  • ఓం నైకస్మై నమః |
  • ఓం సవాయ నమః |
  • ఓం కాయ నమః |
  • ఓం కస్మె నమః |
  • ఓం యస్మె నమః |
  • ఓం తస్మై నమః |
  • ఓం పదమనుత్తమాయ నమః |
  • ఓం లోకబంధవే నమః |
  • ఓం లోకనాథాయ నమః |
  • ఓం మాధవాయ నమః |
  • ఓం భక్తవత్సలాయ నమః |
  • ఓం సువర్ణవర్ణాయ నమః |
  • ఓం హేమాంగాయ నమః |
  • ఓం వరాంగాయ నమః |
  • ఓం చందనాంగదినే నమః |
  • ఓం వీరఘ్నే నమః |
  • ఓం విషమాయ నమః |
  • ఓం శూన్యాయ నమః |
  • ఓం ఘృతాశిషే నమః |
  • ఓం చలాయ నమః |
  • ఓం అమానినే నమః |
  • ఓం మానదాయ నమః |
  • ఓం మాన్యాయ నమః |
  • ఓం లోకస్వామినే నమః |
  • ఓం త్రిలోకధృషే నమః |
  • ఓం సుమేధసే నమః |
  • ఓం మేధజాయ నమః |
  • ఓం ధన్యాయ నమః |
  • ఓం సత్యమేధసే నమః |
  • ఓం ధరాధరాయ నమః |
  • ఓం తేజోవృషాయ నమః |
  • ఓం ద్యుతిధరాయ నమః |
  • ఓం సర్వశస్త్రభృతాంవరాయ నమః |
  • ఓం ప్రగ్రహాయ నమః |
  • ఓం నిగ్రహాయ నమః |
  • ఓం వ్యగ్రాయ నమః |
  • ఓం నైకశృంగాయ నమః |
  • ఓం గదాగ్రజాయ నమః |
  • ఓం చతుర్మూర్తయే నమః |
  • ఓం చతుర్బాహవే నమః |
  • ఓం చతుర్వ్యూహాయ నమః |
  • ఓం చతుర్గతయే నమః |
  • ఓం చతురాత్మనే నమః |
  • ఓం చతుర్భావాయ నమః
  • ఓం చతుర్వేదవిదే నమః |
  • ఓం ఏకపదే నమః |
  • ఓం సమావర్తాయ నమః |
  • ఓం అనివృత్తాత్మనే నమః |
  • ఓం దుర్జయాయ నమః |
  • ఓం దురతిక్రమాయ నమః |
  • ఓం దుర్లభాయ నమః |
  • ఓం దుర్గమాయ నమః |
  • ఓం దుర్గాయ నమః |
  • ఓం దురావాసాయ నమః |
  • ఓం దురారిఘ్నే నమః |
  • ఓం శుభాంగాయ నమః |
  • ఓం లోకసారంగాయ నమః |
  • ఓం సుతంతవే నమః |
  • ఓం తంతువర్ధనాయ నమః |
  • ఓం ఇంద్రకర్మణే నమః |
  • ఓం మహాకర్మణే నమః |
  • ఓం కృతకర్మణే నమః |
  • ఓం కృతాగమాయ నమః |
  • ఓం ఉద్భవాయ నమః |
  • ఓం సుందరాయ నమః |
  • ఓం సుందాయ నమః |
  • ఓం రత్ననాభాయ నమః |
  • ఓం సులోచనాయ నమః |
  • ఓం అర్కాయ నమః |
  • ఓం వాజసనాయ నమః |
  • ఓం శృంగినే నమః |
  • ఓం జయంతాయ నమః |
  • ఓం సర్వవిజ్జయినే నమః |
  • ఓం సువర్ణ బిందవే నమః
  • ఓం అక్షోభ్యాయ నమః |
  • ఓం సర్వవాగీశ్వరేశ్వరాయ నమః |
  • ఓం మహాప్రదాయ నమః |
  • ఓం మహాగర్తాయ నమః |
  • ఓం మహాభూతాయ నమః |
  • ఓం మహానిధయే నమః |
  • ఓం కుముదాయ నమః |
  • ఓం కుందరాయ నమః |
  • ఓం కుందాయ నమః |
  • ఓం పర్జన్యాయ నమః |
  • ఓం పావనాయ నమః |
  • ఓం అనిలాయ నమః |
  • ఓం అమృతాంశాయ నమః |
  • ఓం అమృతవపుషే నమః |
  • ఓం సర్వజ్ఞాయ నమః |
  • ఓం సర్వతోముఖాయ నమః |
  • ఓం సులభాయ నమః |
  • ఓం సువ్రతాయ నమః |
  • ఓం సిద్ధాయ నమః |
  • ఓం శత్రుజితే నమః |
  • ఓం శత్రుతాపనాయ నమః |
  • ఓం న్యగ్రోధాయ నమః |
  • ఓం ఉదుంబరాయ నమః |
  • ఓం అశ్వత్థాయ నమః |
  • ఓం చాణూరాంధ్రనిషూదనాయ నమః |
  • ఓం సహస్రార్చిషే నమః |
  • ఓం సప్తజిహ్వాయ నమః |
  • ఓం సప్లైధసే నమః |
  • ఓం సప్తవాహనాయ నమః |
  • ఓం అమూర్తయే నమః |
  • ఓం అనఘాయ నమః |
  • ఓం అచింత్యాయ నమః |
  • ఓం భయకృతే నమః |
  • ఓం భయనాశనాయ నమః |
  • ఓం అణవే నమః |
  • ఓం బృహతే నమః |
  • ఓం కృశాయ నమః |
  • ఓం స్థూలాయ నమః |
  • ఓం గుణభృతే నమః |
  • ఓం నిర్గుణాయ నమః |
  • ఓం మహతే నమః |
  • ఓం అధృతాయ నమః |
  • ఓం స్వధృతాయ నమః |
  • ఓం స్వాస్థ్యాయ నమః |
  • ఓం ప్రాగ్వంశాయ నమః |
  • ఓం వంశవర్ధనాయ నమః |
  • ఓం భారభృతే నమః |
  • ఓం కథితాయ నమః |
  • ఓం యోగినే నమః |
  • ఓం యోగీశాయ నమః |
  • ఓం సర్వకామదాయ నమః |
  • ఓం ఆశ్రమాయ నమః |
  • ఓం శ్రమణాయ నమః |
  • ఓం క్షామాయ నమః |
  • ఓం సుపర్ణాయ నమః |
  • ఓం వాయువాహనాయ నమః |
  • ఓం ధనుర్ధరాయ నమః |
  • ఓం ధనుర్వేదాయ నమః |
  • ఓం దండాయ నమః |
  • ఓం దమయిత్రే నమః |
  • ఓం దమాయ నమః |
  • ఓం అపరాజితాయ నమః |
  • ఓం సర్వసహాయ నమః |
  • ఓం నియంత్రే నమః |
  • ఓం నియమాయ నమః |
  • ఓం యమాయ నమః |
  • ఓం సత్త్వవతే నమః |
  • ఓం సాత్త్వికాయ నమః |
  • ఓం సత్యాయ నమః |
  • ఓం సత్యధర్మపరాయణాయ నమః |
  • ఓం అభిప్రాయాయ నమః |
  • ఓం ప్రియార్హాయ నమః |
  • ఓం అర్హయ నమః |
  • ఓం ప్రియకృతే నమః |
  • ఓం ప్రీతివర్ధనాయ నమః |
  • ఓం విహాయసగతయే నమః |
  • ఓం జ్యోతిషే నమః |
  • ఓం సురుచయే నమః |
  • ఓం హుతభుజే నమః |
  • ఓం విభవే నమః |
  • ఓం రవయే నమః |
  • ఓం విరోచనాయ నమః |
  • ఓం సూర్యాయ నమః |
  • ఓం సవిత్రే నమః |
  • ఓం రవిలోచనాయ నమః |
  • ఓం అనంతాయ నమః |
  • ఓం హుతభుజే నమః |
  • ఓం భోక్తే నమః |
  • ఓం సుఖదాయ నమః |
  • ఓం నైకజాయ నమః |
  • ఓం అగ్రజాయ నమః |
  • ఓం అనిర్విర్ణాయ నమః |
  • ఓం సదామర్షిణే నమః |
  • ఓం లోకాధిష్ఠానాయ నమః |
  • ఓం అద్భుతాయ నమః |
  • ఓం సనాతనాయ నమః |
  • ఓం సనాతనతమాయ నమః |
  • ఓం కపిలాయ నమః |
  • ఓం కపయే నమః |
  • ఓం అవ్యయాయ నమః |
  • ఓం స్వస్తిదాయ నమః |
  • ఓం స్వస్తికృతే నమః |
  • ఓం స్వస్తయే నమః |
  • ఓం స్వస్తిభుజే నమః |
  • ఓం స్వస్తిదక్షిణాయ నమః |
  • ఓం అరౌద్రాయ నమః |
  • ఓం కుండలినే నమః |
  • ఓం చక్రిణే నమః |
  • ఓం విక్రమిణే నమః |
  • ఓం ఉర్జితశాసనాయ నమః |
  • ఓం శబ్దాతిగాయ నమః |
  • ఓం శబ్దసహాయ నమః |
  • ఓం శిశిరాయ నమః |
  • ఓం శర్వరీకరాయ నమః |
  • ఓం అక్రూరాయ నమః |
  • ఓం పేశలాయ నమః
  • ఓం దక్షాయ నమః |
  • ఓం దక్షిణాయ నమః |
  • ఓం క్షమిణాం వరాయ నమః |
  • ఓం విద్వత్తమాయ నమః |
  • ఓం వీతభయాయ నమః |
  • ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః |
  • ఓం ఉత్తారణాయ నమః |
  • ఓం దుష్కృతిఘ్నే నమః |
  • ఓం పుణ్యాయ నమః |
  • ఓం దుస్వప్ననాశాయ నమః |
  • ఓం వీరఘ్నే నమః |
  • ఓం రక్షణాయ నమః |
  • ఓం సద్భ్యో నమః |
  • ఓం జీవనాయ నమః |
  • ఓం పర్యవస్థితాయ నమః |
  • ఓం అనంతరూపాయ నమః |
  • ఓం అనంతశ్రియే నమః |
  • ఓం జితమన్యవే నమః |
  • ఓం భయాపహాయ నమః |
  • ఓం చతురశ్రాయ నమః |
  • ఓం గభీరాత్మనే నమః |
  • ఓం విదిశాయ నమః |
  • ఓం వ్యాధిశాయ నమః |
  • ఓం దిశాయ నమః |
  • ఓం అనాదయే నమః |
  • ఓం భూర్భువాయ నమః |
  • ఓం లక్ష్మై నమః |
  • ఓం సువీరాయ నమః |
  • ఓం రుచిరాంగదాయ నమః |
  • ఓం జననాయ నమః |
  • ఓం జనజన్మాదయే నమః |
  • ఓం భీమాయ నమః |
  • ఓం భీమపరాక్రమాయ నమః |
  • ఓం ఆధారనిలయాయ నమః |
  • ఓం ధాత్రే నమః |
  • ఓం పుష్పహాసాయ నమః |
  • ఓం ప్రజాగరాయ నమః |
  • ఓం ఉర్ధ్వగాయ నమః |
  • ఓం సత్పథాచారాయ నమః |
  • ఓం ప్రాణదాయ నమః |
  • ఓం ప్రణవాయ నమః |
  • ఓం పణాయ నమః |
  • ఓం ప్రమాణాయ నమః |
  • ఓం ప్రాణనిలయాయ నమః |
  • ఓం ప్రాణభృతే నమః |
  • ఓం ప్రాణజీవనాయ నమః |
  • ఓం తత్త్వాయ నమః |
  • ఓం తత్త్వవిదే నమః |
  • ఓం ఏకాత్మనే నమః |
  • ఓం జన్మమృత్యుజరాతిగాయ నమః |
  • ఓం భుర్భువః స్వస్తరవే నమః
  • ఓం తారాయ నమః |
  • ఓం సవిత్రే నమః |
  • ఓం ప్రపితామహాయ నమః |
  • ఓం యజ్ఞాయ నమః |
  • ఓం యజ్ఞపతయే నమః |
  • ఓం యజ్వనే నమః |
  • ఓం యజ్ఞాంగాయ నమః |
  • ఓం యజ్ఞవాహనాయ నమః |
  • ఓం యజ్ఞభృతే నమః |
  • ఓం యజ్ఞకృతే నమః |
  • ఓం యజ్ఞినే నమః |
  • ఓం యజ్ఞభుజే నమః |
  • ఓం యజ్ఞసాధనాయ నమః |
  • ఓం యజ్ఞాంతకృతే నమః |
  • ఓం యజ్ఞగుహ్యాయ నమః |
  • ఓం అన్నాయ నమః |
  • ఓం అన్నదాయ నమః |
  • ఓం ఆత్మయోనయే నమః |
  • ఓం స్వయంజాతాయ నమః |
  • ఓం వైఖానాయ నమః |
  • ఓం సామగాయనాయ నమః |
  • ఓం దేవకీనందనాయ నమః |
  • ఓం స్రష్టే నమః |
  • ఓం క్షితీశాయ నమః |
  • ఓం పాపనాశనాయ నమః |
  • ఓం శంఖభృతే నమః |
  • ఓం నందకినే నమః |
  • ఓం చక్రిణే నమః |
  • ఓం శర్జీ ధన్వనే నమః |
  • ఓం గదాధరాయ నమః |
  • ఓం రథాంగపాణయే నమః |
  • ఓం అక్షోభ్యాయ నమః |
  • ఓం సర్వప్రహరణాయుధాయ నమః |

మరిన్ని స్తోత్రములు