Napali Ghana Nidanamavu Neeve Nannu In Telugu – నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను

నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 1
కీర్తన : నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను
సంఖ్య : 108
పుట : 74
రాగం : శుద్ధ సావేరి

శుద్ధసావేరి

34 నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను
నీపాల నిడుకొంటి నీవే నీవే

||పల్లవి||

ఒలసి నన్నేలే దేవుడవు నీవే యెందు
తొలగని నిజబంధుడవు నీవే
పలుసుఖమిచ్చే సంపదవు నీవే, యిట్టే
వెలయ నిన్నియును నీవే నీవే

||నాపాలి||

పొదిగి పాయని యాప్తుడవు నీవే, నాకు –
నదన తోడగు దేహమవు నీవే
మదమువాపెడినా మతియు నీవే, నాకు
వెదక నన్నియును నీవే నీవే

||నాపాలి||

యింకా లోకములకు నెప్పుడు నీవే యీ
పంకజభవాది దేవపతివి నీవే
అంకిలి వాపగ నంతకు నీవే, తిరు
వేంకటేశ్వరుడవు నీవే నీవే

||నాపాలి||

అవతారిక:

నిధానము అంటే పాతరలో దాచివుంచిన సొమ్ము. “నాయందు నిధానమువలె సమయానికి, నీపాల (పట్ల) వుంచుకొని ఆదుకొంటావు. నా దిక్కూ మొక్కూ వేరెవరున్నారు తండ్రీ! నీవే నీవే” అని ఏడుకొండలూ దిగి స్వయంగా శ్రీనివాసుడే దిగివచ్చేలా ఆలాపిస్తున్నారు అన్నమాచార్యులవారు. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన బంధువు. ఆ విధంగా చూస్తే బంధువులు బండ్ల కొద్దీ వుంటారు కాని నిజబంధువు ఆ స్వామి తప్ప యెవ్వరూ వుండరు. అంకిలి వాపగ (ఆపద తొలగించ) నంతయు నీవే నీవే అంటున్నారు. మన అదృష్టం కొద్దీ ఈ అమృతధారలో తడిసే భాగ్యం కలుగుతున్నది. అవునా?

భావ వివరణ:

ఓ దేవదేవా! నాపాలి (నాకు లభించిన) గొప్ప నిధానమవు నీవే (పెద్దలు దాచివుంచిన పాతర నీవే). అందుకనే నిన్ను నాపాలన్ ఇడుకొంటి (నా పక్షాన అట్టేపెట్టుకొన్నాను). నీవే నీవే నాకు ఇంకెవ్వరూ వద్దు ప్రభూ!

ఒలసి (చేరి) నన్ను యేలునట్టి దైవము నీవే. నా బంధువులందరూ నా కష్టంలో నన్ను వదిలేశారు. కానీ నన్ను విడువని నిజమైన బంధువు నీవే. సంపదలనాసించేది సుఖమునిస్తాయని. కాని మా సంపదలు అనేక ఇబ్బందులనిస్తాయి. కాని నీవు మాత్రం అనేక సుఖములనిచ్చే సంపదవు. ఈ విధంగా ఇన్ని రకములైన భాగ్యముల నిచ్చే వాడవు నీవే నీవే.

ఆప్తుడు అంటే ఐశ్వర్యము వలె అదుకొనే సన్నిహితుడు. అయితే ఐశ్వర్యమునకుండే దుర్గుణమేమంటే అది యెప్పుడు విడిచిపెట్టి పోతుందో యెవ్వరికీ తెలియదు. కానీ ఓ శ్రీహరీ! నీవు పొదిగినట్లుగా యెన్నడూ వదలిపెట్టని ఆప్తుడవు. నేను చచ్చేదాకా నాతోడువుండే దేహములాగ నీవూ అదనతోడవు (అవసరమైన తోడువు). స్వామీ! నా మదము (అహంకారమును) బాపెడి మతియు (వివేకము) నీవే. పరికించి చూసే సర్వస్వమూ నీవే, నీవే నయ్యా!

ఇంకా చెప్పాలంటే… నాకే కాదు, ఈ లోకముల కన్నింటికీ యెప్పుడూ ఆధారము నీవే. (ఇన్ని లక్షల అంతరిక్షగాముల్లో ఒక్కటి తగిలినా మన ‘భూమి’ గతేమిటో చెప్పండి.) సృష్ఠి స్థితిలయలు పర్యవేక్షించే బ్రహ్మాదిదేవతల పతియు (యేలికవూ) నీవే. మాకు అడుగడుగునా అంకిలియే (ఆపదలే). దానిని తొలగించాలంటే ఇతరులకు సాధ్యమా? ఓ తిరువేంకటేశ్వరా! నీవేనయ్యా! నీవే సమర్థుడివి. ఇంకెవ్వరివల్లా కాదు తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sri Venkateswara Sahasranama Stotram In Telugu – శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రమ్

Sri Venkateswara Sahasranama Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Venkateswara Sahasranama Stotram Telugu

శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రమ్

వసిష్ఠః :

భగవ॰ కైశ్చ విధినా నామభిర్వేజ్క టేశ్వరమ్ |
పూజయామాస తం దేవం బ్రహ్మా తు కమలై ళ్ళుభైః ॥

1

పృచ్ఛామి తాని నామాని గుణయోగపరాణి కిమ్ |
ముఖ్యవృత్తిని కిం బ్రూహి లక్షకాణ్యథవా హరేః ॥

2

నారద ఉవాచ :

నామాన్యనంతాని హరేర్గుణయోగాని కాని చిత్ ।
ముఖ్యవృత్తిని చాన్యాని లక్షకాణ్యపరాణి చ ॥

3

పరమా ధైజుస్సర్వళ బై రేకో జ్ఞేయర్గపరల్గపుమా|
ఆదిమధ్యాంతరహిత స్త్వవ్యక్తోఒనంతరూపభృత్ ॥

4

చంద్రార్కవహ్నివాయ్వాద్యా గ్రహర్జాణి నభో దిశః|
అన్వయవ్యతిరేకాభ్యాం సంతి నో సంతి యన్మతేః ॥

5

తస్య దేవస్య నామ్నాం హి పారం గంతుం హికః క్షమః |
తథాపి చాభిధానాని వేంకటేశస్య కాని చిత్ ॥

6

బ్రహ్మగీతాని పుణ్యాని తాని వక్ష్యామి సువ్రత|
యదుచ్చారణమాత్రేణ విముక్తాఘః పరం వ్రజేత్ ॥

7

వేంక టేశస్య నామ్నాం హి సహస్రస్య ఋషిర్విధిః |
ఛందోఒనుష్టుప్తథా దేవశ్రీవత్సాంకో రమాపతిః ||

8

బీజభూత స్తఖోంకారో హ్రీం క్లీం శక్తిశ్చ కీలకమ్|
ఓం నమో వేంక టేశాయేత్యాదిర్మంత్రో ఒత్ర కథ్యతే ॥

9

బ్రహ్మాండగర్భ, కవచమస్త్రం చక్రగదాధరః ।
వినియోగోఒభీష్టసిద్ధాహృదయం సామగాయనః ॥

భాస్వచ్చంద్రమసౌ యదీయనయనే భార్యా యదీయా రమా
యస్మాద్విశ్వసృడప్యభూద్యమికులం యద్ధ్యానయు క్తం సదా |

నాథో యో జగతాం నగేంద్రదుహితుర్నాథో పి యద్భక్తి మాన్
తాతో యో మదనస్మ యో దురితహా తం వేంక టేశం భజే ॥

ఊధ్వౌ హస్తె యదీయౌ సురరిపుదళనే బిభ్రతొ శంఖచక్రే
సేవ్యావంఫ్రీ స్వకీయావభిదధడధరో దక్షిణో యస్య పాణిః |

తావన్మాత్రం భవాబ్ధం గమయతి భజతామూరుగో వామపాణిః
శ్రీవత్సాంకశ్చ లక్ష్మీర్యదురసి లసతస్తం భజే వేంకటేశమ్

ఇతి ధ్యాయకా వేంక టేశం శ్రీవత్సాంకం రమాపతిమ్ |
వేంక టేళో విరూపాక్ష ఇత్యారభ్య జపేత్రమాత్ ॥

10

వేఙ్కటేశో విరూపాక్షో విశ్వేశో విశ్వభావనః ।
విశ్వసృథ్వీశ్వసంహర్తా విశ్వప్రాణో విరాడ్వపుః ||

11

శేషాద్రినిలయోఒ శేషభ క్త దుఃఖప్రణాశనః|
శేషస్తుత్య శ్శేషశాయీ విశేషజ్ఞో విభుస్స్వభూః ॥

12

విష్ణుర్ణిష్ణుశ్చ వర్ధిష్ణురుత్సహిష్ణుః సహిష్ణుకః |
భ్రాజిష్ణుశ్చ గ్రసిష్ఠుశ్చ వరిష్ఠుశ్చ భరిష్ఠుకః ||

13

కాలయంతా కాలగోప్తా కాలః కాలాంతకో ఖిలః |
కాలగమ్యః కాలకంఠవంద్యః కాలకలేశ్వరః ||

14

శంభుః స్వయంభూరంభోజనాభిః స్తంభితవారిధిః|
అంభోధినందినీజానిః శోణాంభోజపదప్రభః ||

15

కంబుగ్రీవః శంబరారిరూపః శంబరజేక్షణః |
బింబాధరో బింబరూపీ ప్రతిబింబక్రియాతిగః ||

16

గుణవాన్ గుణగమ్యశ్చ గుణాతీతో గుణప్రియః |
దుర్గుణధ్వంసకృత్సర్వసుగుణో గుణభాసకః ||

17

పరేశః పరమాత్మా చ పరంజ్యోతిః పరా గతిః |
పరం పదం వియద్వాసాః పారంపర్యశుభప్రదః ||

18

బ్రహ్మాణ్డగర్భో బ్రహ్మణ్యో బ్రహ్మనృత్ప్ర్బహ్మబోధితః |
బ్రహ్మస్తుత్యో బ్రహ్మవాడీ బ్రహ్మచర్యపరాయణః ||

19

సత్యవ్రతార్థసన్తుష్టస్సత్యరూపి దుషాఙ్గవా |
సోమకప్రాణహారీ చానీతామ్నాయోఒద్ధిసఞ్చరః ||

20

దేవాసురవరస్తుత్యః పతన్మన్దరధారకః !
ధన్వ న్తరిః కచ్ఛపాఙ్గః పయోనిధివిమస్థకః ||

21

అమరామృతసన్దాతా ధృతసమ్మోహినీవపుః |
హరమోహకమాయావీ రక్షస్సన్దేహభజ్జనః

22

హిరణ్యాక్షవిదారీ చ యజ్ఞో యజ్ఞవిధావనః |
యజ్ఞేయోర్వీసముద్ధర్తా లీలాక్రోడః ప్రతాపవాకా ॥

23

వఙ్గకాసురవిధ్వంసీ వక్రదంష్ట్రః క్షమాధరః |
గన్ధర్వశాపహరణః పుణ్యగర్ధో విచక్షణః ||

24

కరాళనశ్రీ స్సోమార్క నేత్రష్ణర్గుణవైధవః |
శ్వేత ఘోణీ ఘూర్ణితభ్రూః ఘుగ్ధురధ్వనివిభ్రమః ||

25

ద్రాఘీయా౯ నీలకేశీ చ || ౧౦౦ || జాగ్రవమ్బుజలోచనః |
ఘృణావా౯ ఘృణిసమ్మోహో మహాకాలాగ్ని దీధితిః ||

26

జ్వాలాకరాళవదనో మహోల్కాకులవీక్షణః |
సటానిర్భిణ్ణమేఘా ఘో దంష్ట్రాకుగ్వ్యా ప్తది కటః ॥

27

ఉచ్ఛ్వాసాకృష్ణభూతేళో నిశ్వాసత్య క్తవిశ్వసృట్ |
అ స్తత్ప్రమజ్జగద్గర్భోఒనన్తో బ్రహ్మకపాలహృత్ ॥

28

ఉగ్రో వీరో మహావిష్ణుర్జ్వలనస్సర్వతోముఖః |
నృసింహో భీషణో భద్రో మృత్యుమృత్యుస్సనాతనః ॥

29

సధా స్తమ్భోద్భవో భీమశ్శీరోమాలీ మహేశ్వరః |
ద్వాదశాదిత్యచూడాలః కల్పధూమసటాచ్ఛవిః ॥

30

హిరణ్యకోరస్థ్సలభిన్న ఖః సింహముఖోఒనఘః |
ప్రహ్లాదవరదో ఢీమాక్షా భక్త సజ్ఝ ప్రతిష్ఠితః ॥

31

బ్రహ్మరుద్రాదిసం సేవ్యస్సిద్ధసాధ్యప్రపూజితః |
లక్ష్మీనృసింహో దేవేశో జ్వాలాజిహ్వాస్త్రమాలికః ॥

32

ఖడ్గీ భేటీ మహేష్వాసీ కపాలీ ముసలీ హలీ: |
పాశీ కూలీ మహాబాహున్జ్వరఘ్నో రోగలుణ్ణికః ॥

33

మౌజ్జేయుక్ఛాత్రకో దడ్డీ కృష్ణాజినధరో వటుః !
అశ్లీతవేదో వేదాన్తోద్ధారకో బ్రహ్మనైష్ఠికః ॥

34

అహీనశయనప్రీతః ఆదితేయోఒనఘో హరిః |
సంవిత్రియస్సామవేద్యో ఒలివేశ్మ ప్రతిష్ఠితః ॥

35

బలిక్షాళితపాదాజ్జో విజ్ఞ్యావళివిమానితః |
త్రిపానభూమిస్వీకర్తా విశ్వరూపప్రదశశాకః ॥

36

ధృత త్రివిక్రమస్సాజ్ఞి) నఖభిన్నాణఖర్పరః |
పజ్జాతవాహినీధారాపవిత్రితజగత్ప్రయః॥

37

విధిసమ్మానితః పుణ్యో దైత్యయోద్ధా జయోర్జితః |
సురరాజ్యప్రదశ్శుక్రమదహృత్సుగతీశ్వరః ॥

38

జామదగ్న్యః కుఠారీ చ కార్తవీర్యవిదారణః |
రేణుకాయాశ్శిరోహారీ దుష్టక్షత్రియమర్దనః॥

39

వర్చస్వీ దానశీలశ్చ ధనుష్మతా బ్రహ్మవి త్తమః |
అత్యుదగ్రః సమగ్రశ్చ న్యగ్రోధో దుష్టనిగ్రహః ॥

40

రవివంశసముద్భూతో రాఘవో భరతాగ్రజః |
కౌసల్యాతనయో రామో విశ్వామిత్రపియఙ్కరః ॥

41

తాటకారిః ॥ ౨౦౦ ॥ సుబాహుఘ్నోబలాతిబలమస్త్ర వా౯|
అహల్యాశాపవిచ్ఛేదీ ప్రవిష్టజనకాలయః ||

42

స్వయంవరసభాసంస్థ ఈక చాపప్రభజ్జనః |
జానకీపరిణేతా చ జనకాధీశసంస్తుతః ||

43

జమదగ్ని తనూజాతయోద్ధాఒయోధ్యాధిపాగ్రణీః |
పితృవాక్యప్రతీపాల స్త్యక్త రాజ్యస్సలక్ష్మణః ||

44

ససీతశ్చిత్రకూటస్థో భరతాహితరాజ్యకః |
కాకదర్పప్రహర్తా చ దణ్డకారణ్యవాసకః ॥

45

పఞ్చవట్యాం విహారీ చ స్వధర్మపరిపోషకః |
వీరాధహాఙగ స్త్యముఖ్యమునిసమ్మానిత పుమాన్ ॥

46

ఇన్ద్రచాపధరః ఖడ్గధరశ్చాక్షయసాయకః |
ఖరాన్తకో దూషణారిస్త్రిశిరస్కరిపుర్వృషః ॥

47

తతక్శూర్పణఖానాసాచ్ఛేత్తా వల్కలధారకః |
జటావాన్పణ శాలాస్గో సరీచబలమర్దకః॥

48

పక్షిరాట్కృతసంవాదో రవితేజా మహాబలః |
శబర్యానీతఫలభుర్ఘ నూమత్పరితోషితః॥

49

సుగ్రీవాభయదో దైత్యకాయక్షేపణభాసురః |
సప్తసాలసముచ్ఛేత్తా వాలిహృత్కపిసంవృతః ॥

50

వాయుసూనుకృతా సేవ స్యక్తపమ్పగ కుశాసనః |
ఉదన్వ తీరగళ్శూరో విభీషణవరప్రదః ||

51

సేతుకృత్తై త్యహా ప్రాప్తలజ్కో ఒలకారవాన్ స్వయమ్ |
అతికాయశిరశ్ఛేత్తా కుమ్భకర్ణవిభేదనః

52

దశకణ్ణశిరోధ్వంసీ జామృకవత్ప్ర్వముధావృతః |
జానకీశః సురాధ్యక్షః సాకేతేక పురాతనః ॥

53

పుణ్యల్లోకో వేదవేద్యస్స్వామితీర్థనివాసకః |
లక్ష్మీసరల్గకేళిలోలో లక్ష్మీతో లోకరక్షకః ॥

54

దేవకీగర్భసమ్భూతో యశోవేక్షణలాలితః |
వసుదేవకృతస్తోత్రో సన్దగోపమనోహరః ||

55

చతుర్భుజః కోమలాజ్జో గదావాన్నీలకు న్తలః |
పూతనాప్రాణసంహర్తా తృణావర్త వినాశనః ||

56

గర్గారోపితనామాజో వాసుదేవో హ్యధోక్షణః |
గోపికా స్తన్యపాయీ చ బలభద్రాను జోఒచ్యుతః ||

57

వైయాఘ్రనఖభూషశ్చ వత్సజిద్వత్సవర్ధనః |
క్షీరసారాకనరతో దధిఢాణ్డప్రమర్దనః ॥

58

నవనీతాపహర్తా చ నీలనీరదసురః|
ఆభీరదృష్టదౌర్జన్యో నీలపద్మనిధాననః

59

మాతృదశి తవిశ్వాస్య ఉూఖలనిబన్ధనః |
నళకూబరశాపాన్తో గోధూళిచ్చురితాఙ్గకః ॥

60

గోసజ్ఞ రక్షకశ్రీళో || ౩౦౦ || బృన్దారణ్యనివాసకః |
వత్సాన్తకో బకద్వేషీ దైత్యామ్బుదమహానిలః ॥

61

మహాజగరచణ్ణాగ్నిశ్శకటప్రాణకణ్ణకః |
ఇన్ద్రసేవ్యః పుణ్యగాత్రః ఖరజిచ్చణ్డదీధితిః ॥

62

తాళపక్వఫలాశీ చ కాళీయఫణిదర్పహా |
నాగపత్నీస్తుతిప్రీతః ప్రలమ్బాసురఖణ్డనః॥

63

దావాగ్ని బలసంహారీ ఫలహారీ గదాగ్రజః |
గోపాఙ్గనాచేలచోరః పాథోలీలావిశారదః ||

64

వంశగానప్రవీణశ్చ గోపీహస్తామ్బుజార్చితః |
మునిపత్న్యాహృతాహారో మునిశ్రేష్లో మునిప్రియః ॥

65

గోవర్ధనాద్రిసన్ధర్తా సఙన్దనత మోఒపహః |
సదుద్యానవిలానీ చ రాసక్రీడాపరాయణః ||

66

వరుణాభ్యర్చితో గోపీప్రార్థితః పురుషోత్తమః |
అక్రూరస్తుతిసంప్రీతః కుబ్జాయౌవనదాయకః ॥

67

ముష్టికోరఃప్రహారీ చ చాణూరోదరదారణః |
మల్లయుద్ధాగ్రగణ్యశ్చ పితృబన్ధనమోచకః ॥

68

మత్తమాతఙ్గపశ్చాస్యః కంసగ్రీవానికృన్తనః |
ఉగ్ర నేనప్రతిష్ఠాతా రత్న సింహాసనస్థితః ॥

69

కాలనేమిఖలద్వేషీ ముచుకున్దవరప్రదః |
సాల్వ సేవితదుర్ధర్ష రాజస్మయనివారణః ||

70

రుక్మగర్వాపహారీ చ రుక్మిణీనయనోత్సవః ।
ప్రద్యుమ్నజనకః కామీ ప్రద్యుమ్నో ద్వారకాధిపః ॥

71

మణ్యాహర్తా మహామాయో జాంబవత్కృతసంగరః |
జాంబూనదాంబరధరో గమ్యో జాంబవతీవిభుః ||

72

కాళిందీ ప్రథితారామకేళిర్గుంజావతంసకః |
మందారసుమనోభాస్వాకా కవీశాభీష్టదాయకః ||

73

సత్రాజిన్మానసోల్లాసీ సత్యాజానిశ్శుభావహః |
శతధన్వహరస్సిద్ధః పాండవప్రియకోత్సవః ॥

74

భద్రప్రియస్సుభద్రాయా భ్రాతా నాగ్నజితీవిభుః |
కిరీటకుండలధరః కల్పవల్లవలాలితః॥

75

భైష్మీ ప్రణయభాషావా మిత్రవిందాధిపో భయః |
స్వమూర్తి కేళిసంప్రీతో లక్ష్మణోదారమానసః ॥

76

ప్రాగ్జ్యోతిషాధిపధ్వంసీ తత్సైన్యాన్తకరో మృతః |
భూమిస్తుతో భూరిభోగో భూషణాంబరసంయుతః॥

77

బహురామాకృతాహ్లాదో గంఢమాల్యానులేపనః |
నారదాదృష్టచరితో దేవేళో విశ్వరాజ్గురుః ॥

78

బాణబాహువిదారశ్చ తాపజ్వరవినాశకః |
ఉషోద్ధర్షయితా వ్య క్తశ్శివవాకుష్టమానసః ॥

79

మహేశజ్వరసంస్తుత్యశ్శీతజ్వరభయాంతకః |
నృగరాజోద్ధారకచ్చ పౌండ్రకాదివధోద్యతః ॥

80

వివిధారిచ్ఛలోద్విగ్నబ్రాహ్మణేషు దయాపరః ॥
జరాసన్ధబలద్వేషీ కేశిదైత్యభయఙ్కరః ||౪౦౦||

81

చక్రీడై ద్యా న్తకస్సభ్యో రాజబంధవిమోచకః |
రాజసూయహవిర్భోక్తా స్నిగ్ధాఙ్గశస్సుభలక్షణః ॥

82

ధానాభక్షణసంప్రీతః కుచేలాభీష్టదాయకః |
సత్త్వాది. పణగంభీరో ద్రౌపదీమానరక్షకః ॥

83

భీష్మధ్మేయో భక్తవశ్యో భీమపూజ్మో డయానిధిః |
దంతవ శశిర శ్ఛేత్తా కృష్ణః కృష్ణానఖస్స్వరాజ్ ॥

84

వైజయంతీ ప్రమోదీచ బహిశాబహజ విభూషణః |
ప్రాథణుకౌరవసంధానకారీ దుశ్శాసనాంతకః ॥

85

బుద్ధో విశుద్ధస్సర్వజ్ఞగ క్రతుహింసావినిందకః |
త్రిపుర స్త్రీ మానభంగస్సర్వశాస్త్రవిశారదః ॥

86

నిరికారో నిర్మమశ్చ నిరాఛాసో నిరామయః |
జగన్మోహకధర్మీ చ దిగ్వస్త్రో దికృతీక్వరః ॥

87

కల్కీ మ్లేచ్ఛ ప్రహర్తా చ మిష్టనిగ్రహకారకః |
ధర్మప్రతిష్ఠాకాకీ చ చాతుర్వర్ణ్యవిభాగకృత్ ॥

88

యుగాంతకో యుగాక్రాంతో యుగకృద్యుగథాసకః |
కామారిగ్గా కామకారీ చ నిష్కామః కామితార్థదః ॥

89

భగోక్షా వరేణ్యం సవితుః శాఙ్గజ వైకుంఠమందిరః |
హయగ్రీవల్ల కై టధారిర్గాహఘ్నోగజరక్షకః ॥

90

సర్వసంశయవిచ్ఛేత్తా సర్వభక్త సముత్సుక: |
కపర్దీ కామహారీ చ కళాకా స్త్రాస్మృతిర్ధృతిః ॥

91

అనాదిరప్రమేయౌజాః ప్రధానస్సన్ని రూపకః |
నిర్లేపో నిస్స్పృహోఒసజ్లో నిర్భయో నీతిపారగః ॥

92

నిష్ప్రేష్కోనిష్క్రిరియశ్శాంతో నిష్ప్రపంచో నిధిర్నయః |
కమ్మశాకమీనా విరిమీశాన కమేకాపు; కర్మవావనః॥

93

కర్మాంగః కర్మవిన్యాసో మహాకమీకా మహాప్రతీ |
కర్మభుకర్మఫలద. కల్మేశబ్ద కర్మనిగ్రహః॥

94

నరో నారాయణో దాంతం కపిలం కామదర్శచిః |
తప్తాజప్తా ॥౦౩॥ ఒక్షమాలావానన్తి నేతా లయోగతిః ॥

95

శిష్ట్లా ద్రష్టా రిపుడ్వేష్ణా రోహ్లి వేన్జీ మహానటః |
రోద్ధాబోద్ధామహాయోద్ధా శ్రద్ధావాజు సత్యనీకుృధః ॥

96

మంత్రి మంత్రో మంత్రగమ్యో మంత్రికృత్సరమంత్రహ్మత్ |
మంత్రభృన్మంత్రఫలదో మంత్రేలో మంత్రవిగ్రహః ॥

97

మంత్రాంగో మంత్రవిన్యాసో మహామంత్రో మహాక్రమః |
స్థిరధీః స్థిరవిజ్ఞాన: స్థిరప్రజ్ఞః స్థికాకనః ॥

98

స్థిరయోగః స్థిరాధారః స్థిరమాగతాః స్థిరాగమః |
నిశ్రేయసో నిరీహోఒగ్నిర్ని రవద్యో నిరంజనః ॥

99

నిర్వైరో నిరహంకారో నిర్దంలో నిరసూయకః |
అనంతోఒనంతవాహూకురనంతాం మ్రిరనంతద్మక్ : ॥

100

అనంతవక్త్ర ఒనంతాంగో నంతరూపో హ్యనంతకృత్ |
ఊర్ధ్వరేతాఊర్ధ్వలింగో హ్యూధ్వ=మూర్వోకాధ్వశాఖకః ||

101

ఊర్ధ్వ ఊర్ధ్వాఛ్వరక్షీ చ హ్యూర్థ్వజ్వాలో నిరాకులః |
బీజం బీజప్రదో నిత్యో నిదానం నిష్కృతిష్ఠ కృతీ ॥

102

మహానణీయాన్గరిమా సుషమా చిత్రమాలిక: |
సధస్సృజ్నధసో జ్యోతిర్నధస్వాన్నిర్నభా నభః ॥

103

ఆధుర్విభుః ప్రభుశ్వించుర్మహీయాశా భూర్భువాకృతిః |
మహానందో మహాకూరో మహోరాశిర్మహోత్సవః ॥

104

మహాక్రోధో మహాజ్వాలో మహాశాంతో మహాగుణః |
సత్య వ్రతస్సత్యపరస్వత్యసంధస్సతాం గతిః ॥

105

సత్యేకస్సత్యసంకల్పస్సత్యచారిత్రలక్షణః |
అంకశ్చరో హ్యంతరాత్మా పరమాత్మా చిదాత్మకః ॥

106

రోచనో రోచమానశ్చ సాక్షీ శారిర్జనార్దనః|
ముకుందో నందనిష్పందస్స్వర్ణ బిందు) పురందరః ॥

107

అరిందిమస్సుమండళ్చ కుందమందారహాసవాన్ |
సృందనారూఢచండాంగో హ్యానండి నందనందనః ॥

108

అనసూయానందనో త్రినేత్రానందస్సునందవా |
శంఖవాజా పంకజకర కుంకుమాంకో జయాంకుశః ||

109

అంభోజమకరందాఢ్యా నిష్పంకో గరుపంకిలః |
ఇంద్రశ్చంద్రరథశ్చంద్రోఒతిచంద్రశ్చన్ద్రదాసకః ||

110

ఉపేంద్ర ఇంద్రరాజశ్చ వాగీంద్రశ్చంద్రలోచనః |
ప్రత్యక్పరాక్ పరం ధామ పరమార్థం పరాత్పరః ॥

111

అపారవాక్పారగామీ పారావారః వవరః |
సహస్వానర్థదాతా చ సహనః సాహసీ జయీ ||

112

తేజస్వీ వాయువిశిఖీ తపస్వీ తాపసోత్తమః |
ఐశ్వర్యోద్భూతిక్మద్భూతిరైశ్వర్యాంగకలాపవాన్ ||

113

అంభోధిశాయీ భగవాణా సర్వజ్ఞస్వామపారగః ।
మహాయోగి మహార్హీరో మహాభోగి, మహాప్రభు ||

114

మహావీరో మహాతుష్టిర్మహాపుష్టిర్మహాసణః |
మహాదేవో మహాబాహుర్మహాధర్మో మహేశ్వరః ॥

115

సమీపగో దూరగామీ స్వర్గమార్గనిరర్గళః |
నగో నగధరో డాగో నాగేలో నాగపాలకః ||

116

హిరణ్మయస్స్వర్ణక్టేతా హిరణ్యాక్చి రణ్మదః |
గుణగణ్యశ్శరణ్యశ్చ పుణ్యకీర్తిం పురాణగః ॥

117

జన్యభృజ్జన్యసన్నదో దివ్యపించాయుధో వశీ |
దౌర్జన్యభంగ, పర్జన్యస్సౌజన్మనిలయోఒలయః ॥

118

జలంధరాంతకోః ||౭౦౦॥ భస్మదైత్యనాశీ మహామనాః |
శ్రేష్ఠశవిష్ణో డ్రాఘిస్ట్లో గరిష్ఠా గరుడధ్వజః ॥

119

జ్యేష్ణో ద్రఢిష్ణో వర్షిష్ణో గ్రామీయా ప్రణవర్గ ఫణీ|
సంప్రదాయకరస్స్వామీ సురేశ్లో మాధవో మధుః ||

120

నిర్నిమేషో విధిర్వేధా బలవాకా జీవనం బలీ |
స్మక్తాశ్రోతా వికర్తా చ ధ్యాతా నేతా సమో సమః ||

121

హోతా పోతా మహావక్తా రంతా మంతా ఖలాంతకః |
దాతా గ్రాహయితా మాతా నియన్తా. నంతవైభవః ||

122

గోప్తా గోపయితా హన్తా ధర్మజాగరితా ధవః |
కర్తా క్షేత్రకరః క్షేత్రప్రదః క్షేత్రజ్ఞ ఆత్మవిత్ ||

123

క్షేత్రీ క్షేత్రహరః క్షేత్రప్రియః క్షేమకరో మరుత్ |
భక్తి ప్రదో ముక్తిదాయీ శక్తిదో యుక్తి దాయకః ||

124

శక్తి యుజ్మౌ క్తికస్ర్వసూ క్తి రామ్నాయసూ క్తి గః |
ధనంజయో ధనాధ్యక్షో ధనికో ధనదాధిపః ॥

125

మహాధనో మహామానీ దుర్యోధనవిమానితః |
రత్నాకరో రత్నరోచీ రత్న గర్భాశ్రయశ్శుచిః ॥

126

రత్నాసానునిధిర్మౌళిరత్నభా రత్నకంకణః |
అంతర్లక్ష్యో న్తరణ్యాసీ చాంతర్ధ్యేయో జితాసనః ॥

127

అంతరంగో దయావాంశ హ్యాంతర్మాయో మహార్ణవః |
సరసస్సిద్ధరసిక స్సిద్ధిః సాధ్యస్సదాగతిః ॥

128

ఆయుర్గప్రదో మహాయుష్మానర్చిష్మానోషధీపతిః |
అష్ట శ్రీరష్టధాగో ఒష్టకకుబ్వ్యాప్తయశో వ్రతీ ॥రాంం॥

129

అష్టాపదస్సువర్ణాధో హ్యష్టమూ ర్తి శ్రీమూర్తి మాన్|
అస్వప్నస్స్వప్న గస్స్వప్నస్సుస్వప్న ఫలదాయకః ॥

130

దుస్స్వప్నధ్వంసకో ధ్వస్తదుర్నిమిత్తః శివంకరః|
సువర్ణ వర్ణస్సంభావ్యో వర్ణితో పర్ణసమ్ముఖః ॥

131

సువర్ణ ముఖరీతీరశివధ్యాతపదాంబుజః |
దాక్షాయణీవచస్తుష్టో దూర్వాసోదృష్టిగోచరః॥

132

అంబరీషవ్రతప్రీతో మహాకృత్తివిభంజనః।
మహాభిచారకధ్వంసీ కాలసర్పభయాంతకః॥

133

సుదర్శనః కాలమేఘశ్యామశీమంత్రధావితః।
హేమాంబుజసరస్స్నాయీ శ్రీమనోధావితాకృతిః॥

134

శ్రీ ప్రదత్తాంబుజస్రగ్వీ శ్రీకేళినిధిర్భవః |
శ్రీప్రదో వామనో లక్ష్మీనాయకర చతుర్భుజః ॥

135

సంతృప్తస్తర్పిత స్తీర్థస్నాతృసౌఖ్యప్రదర్శకః |
అగస్త్యస్తుతిసంహృష్టో దర్శితావ్యక్తభావనః ॥

136

కపిలార్చిః కపిలవా సున్నాతాఘవిపాటనః।
వృషాకపిః కపిస్వామిమనో ఒంతస్థ్సితవిగ్రహః ॥

137

వహ్నిప్రియోఒర్థసంధావ్యో జనలోకవిధాయకః ।
వహ్నిప్రభో వహ్ని తేజాః శుభాభీష్టప్రదో యమ్ ॥

138

వారుణక్షేత్రనిలయో వరుణో వారుణార్చితః।
వాయుస్థానకృతావాసో వాయుగో వాయుసంధృతః ॥

139

యమాంతకోఒభిజననో యమలోకనివారణః |
యమినామగ్రగణ్యక సంయమీ యమభావితః ॥

140

ఇంద్రోద్యానసమీపస్థ ఇంద్రదృగ్విషయః ప్రభుః |
యక్షరాట్సరసీవాసో హ్యక్షయ్యనిధికోశకృత్ ॥

141

స్వామితీర్థకృతావాసః స్వామిధ్యేయో హ్యధోక్షజః |
వరాహాద్యష్టతీర్థాభి సేవితాంఫ్రిసరోరుహః॥

142

పాండుతీర్థాభిషిక్తాంగో యుధిష్ఠిరవరప్రదః |
భీమా న్తర్గీకరణారూఢ శ్శ్వేతవాహనసఖ్యవాన్॥

143

నకులాభయదో మాద్రీసహడేవాభివందితః |
కృష్ణాశపథసంధాతా కుంతీస్తుతిరతో దమీ ॥

144

నారదాదిమునిస్తుత్యో నిత్యకర్మపరాయణః |
దర్శితావ్యక్త రూపశ్చ వీణానాదప్రమోదితః ॥

145

షట్కోటితీర్థచర్యావా= దేవతీర్థకృతాశ్రమః |
బిల్వామలజలస్నాయీ సరస్వత్యంబునేవితః॥

146

తుంబురూదకసంస్పర్శజనచి త్తతమోపహః|
మత్స్యవామనకూర్మాదితీర్థరాజం పురాణభృత్॥

147

చక్ర ధ్యేయపదాంభోజశ్శజ్ఞపూజితపాదుకః |
రామతీర్థ విహారీ చ బలభద్రప్రతిష్ఠితః॥

148

జామదగ్న్యసర స్తీర్థజల సేచనతర్పితః |
పాపాపహారికీలాలసుస్నాతాఘవినాశనః ॥

149

నభోగంగాభిషి కశ్చ || ౯౦౦ || నాగతీర్థాభి షేకవాన్ |
కుమారధారాతీర్థస్థో వటువేషస్సు మేఖలః ॥

150

వృద్ధస్య సుకుమారత్వప్రదస్సౌందర్యవాకా సుఖీ|
ప్రియంవదో మహాకుక్షిరిక్ష్వాకుకులనందనః॥

151

నీలగోక్షీరధారాభూర్వరాహాచలనాయకః |
భరద్వాజప్రతిష్ఠావా౯ బృహస్పతివిభావితః॥

152

అంజనాకృతపూజావానాజ్జు నేయకరార్చితః |
అంజనాద్రినివాసశ్చ ముంజకేశః పురందరః ॥

153

కిన్నరద్వయసంబంధిబంధమోక్షప్రదాయకః |
వైఖానసమభారంభో వృషజ్ఞేయో వృషాచలః ॥

154

వృషకాయప్రభేత్తా చ క్రీడనాచారసంభ్రమః |
సౌవర్చలేయవిన్య స్త రాజ్యో నారాయణప్రియః॥

155

దుర్మేథో భంజకః ప్రాజ్ఞో బ్రహ్మోత్సవమహోత్సుకః |
భద్రాసురశిరశ్ఛేత్తా భద్రక్షేత్రీ సుభద్రవాన్ ॥

156

మృగయా క్షీణసన్నాహశ్శంఖరాజన్యతుష్టిదః |
స్థాణుర్థీవై నతేయాంగధావితో హ్యశరీరవాణా ॥

157

భోగీంద్రభోగసంస్థానో బ్రహ్మాదిగణ సేవితః |
సహస్రార్క_చ్ఛటా స్వద్విమానాంతస్థితో గుణీ ॥

158

విష్వక్సేనకృతస్తోత్రస్సనందనవరీవృకః |
జాహ్న వ్యాదినదీ సేవ్యస్సు లేశాద్యభివందితః ॥

159

సురాంగనానృత్యపరో గంధర్వోదాయనప్రియః |
రాకేందుసంకారనఖర్గ కోమలాంఫ్రిసరోరుహః ||

160

కచ్ఛపప్రపదః కుందగుల్ఫకస్స్వచ్ఛకూర్పరః |
మేదురస్వర్ణ వస్త్రాఢ్యకటి దేశస్థమేఖలః ॥

161

ప్రోల్లసచ్ఛురికాధాస్వత్కటిదేశశుభంకరః |
అనంతపద్మజస్థాననాభిర్మౌ కమాలికః ॥

162

మందారచాం పేయమాలీ రత్నాభరణసంభృతః|
లంబయజ్ఞోపవీతీ చ చంద్రశ్రీఖంగలేపవాన్ ॥

163

వరదోఒభయదశ్చక్రీ శంధీ కౌస్తుభదీ ప్తిమాన్
శ్రీవత్సాంకితవక్షస్కో లక్ష్మీ సంశ్రితహృత్తటః |

164

నీలోత్పలనిధాకారః శోణాంభోజసమాననః |
కోటిమన్మథలావణ్యశ్చంద్రికాస్మితపూరితః॥

165

సుథాస్వచ్ఛోర్ధ్వపుండ్రశ్చ కస్తూరీతిలకాంచితః |
పుండరీకేక్షణస్స్వచ్చో మౌళిశోధావిరాజితః ॥

166

పద్మస్థః పద్మనాభశ్చ సోమమండలతో బుధః ।
వహ్నిమండలగస్సూర్యస్సూర్యమండలసంస్థితః॥

167

శ్రీపతిర్భూమిజానిశ్చ విమలాద్యభిసంవృతః।
జగత్కుటుంబజనితా రక్షికం కామితప్రదః॥

168

అవస్థాత్రయయంతా చ విశ్వతేజస్స్వరూపవాన్ |
జ్ఞప్తిజ్ఞేజయో జ్ఞానగమ్యో జ్ఞానాతీతస్సురాతిగః ॥

169

బ్రంహ్మాండాఁతర్బిహిర్వ్యాక్తోవేఙ్కటాద్రిగదాధరః ॥౧౦౦౦||
శ్రీవేఙ్కటాద్రిగదాధరోన్నను ఇతి
ఏవం శ్రీవేజ్క టేశస్య కీర్తితం పరమాద్భుతమ్ ॥

170

న్నాం సహస్రం సంశ్రావ్యం పవిత్రం పుణ్యవర్ధనమ్ |
శ్రవణాత్సర్వదోషఘ్నం రోగఘ్నం మృత్యునాశనమ్ ॥

171

వారిద్య్రభేదనం ధర్మ్మం సర్వైశ్వర్యఫలప్రదమ్ |
కాలాహివిషవిచ్చే విజ్ఞారానస్మారభంజనమ్ ||

172

శత్రుక్షయకరం రాజగ్రహబీదానివారణమ్ |
బ్రహ్మరాక్షసకూశ్మాండభేతాళభయభఙ్ఞనమ్||

173

విద్యాభిలాషీ విద్మావాన్దనార్థీ ధనవాన్భవేత్ |
అనంతకల్పజీవీ స్యానాయుష్కామో మహాయశాః ||

174

పుత్రార్థీ సుగుణాన్ని త్రాజు అభేతాఒఒయుష్మతస్తతః |
సంగ్రామే శత్రువిజయీ సనాయాం ప్రతివాదిజిత్||

175

దివ్యైర్నా మధిరేఖిస్తుతులసీపూజనాత్మకృత్ |
వైకుంఠవాసీ భగవత్సవలో విష్ణుసన్నిధౌ ||

176

కల్హారపూజనాన్మాసాద్ద్వితీయ ఇవ యక్షరాట్ : |
నీలోత్సబార్చనాత్సర్వరాజపూజ్యన్సదా భవేత్ ॥

177

బ్యాత్సంస్థితే ర్నా మధిస్తు భూయాద్దృగ్విషయో హరిః |
బాక్సాతార్థం తదా దత్యా వైకుంఠం చ ప్రయచ్ఛతి ॥

178

త్రిసంధ్యం యో జపేన్నిత్యం సంపూజ్య విధినా విభుమ్: |
త్రివారం పఞ్చవారం వా ప్రత్యహం క్రమకోయమ్ ||

179

మాసాదలక్ష్మీనాశస్స్యాద్వైమాసాత్స్యాసన్న కేంద్రతా |
త్రిమాసొన్మహదైశ్వర్యం తతస్సంభాషణం భవేత్ ॥

180

మాసం పఠన్న్యూనకర్మపూర్తిం చ సమవాప్నుయాత్ |
మార్గభ్రష్టశ్చ సన్మార్గం గతస్వస్స్వం స్వకీయకమ్ ||

181

చాంచల్యచిత్తోఒచాంచల్యం మనస్స్వాస్థ్యం చ గచ్ఛతి |
ఆయురారోగ్యమైశ్వర్యం జ్ఞానం మోక్షం చ విందతి ॥

182

సర్వాన్కామానవాప్నోతి శాశ్వతం చ పదం తథా !
సత్యం సత్యం పునస్సత్యం సత్యం సత్యం న సంశయః ॥

183

ఇతి
శ్రీబ్రహ్మాండపురాణే వసిష్ఠనారవసంవాదే శ్రీ వేట్క టాచలమాహాత్మ్యే
శ్రీవేఙ్కటేశ శ్రీసహస్రనామస్తోత్రాధ్యాయస్సమాప్తః,

శ్రియ కాన్తాయ కల్యాణనిధయే నిధయేఒర్థినామ్ |
శ్రీవేఙ్కటనివాసాయ శ్రీనివాసాయ మఙ్గళమ్ ||
శ్రీవేఙ్కటాచలాధీశం శ్రియాఒధ్యాసితవక్షసమ్ |
శ్రితచేతనమన్దారం శ్రీనివాసమహం భజే ||

మరిన్ని కీర్తనలు:

Sai Baba Mangala Harathi In Telugu – సాయిబాబా మంగళహారతి

Sai Baba Mangala Harathi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయిబాబా మంగళహారతి విధానం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

సాయిబాబా మంగళహారతి

స్వామి సాయినాథయ శిరిడిక్షేత్రవాసాయ
మామకాభీష్టదాయ మహితమంగళం

లోకనాథాయ భక్తలోకసంరక్షకాయ
నాగలోక స్తుత్యాయ నవ్యమంగళం ||స్వామి||

భక్తబృందవందితాయ బ్రహ్మస్వరూపాయ
ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం ||స్వామి॥

మరిన్ని:

Sri Venkateswara Ashtottara Shatanamavali In Telugu – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళిః

Sri Venkateswara Ashtottara Shatanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

Sri Venkateswara Ashtottara Shatanamavali Telugu

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళిః

  • ఓం వేంకటేశాయ నమః
  • ఓం శేషాద్రినిలయాయ నమః
  • ఓం వృషదృగ్గోచరాయ నమః
  • ఓం విష్ణవే నమః
  • ఓం సదజ్జనగిరీశాయ నమః
  • ఓం వృషాద్రిపతయే నమః
  • ఓం మేరుపుత్రగిరీశాయ నమః
  • ఓం సరస్స్వామితటీజుషే నమః
  • ఓం కుమారాకల్ప సేవ్యాయ నమః
  • ఓం వజ్రిదృగ్విషయాయ నమః
  • ఓం సువర్చలాసుతన్య స్తనై నాపత్యభరాయ నమః
  • ఓం రామాయ నమః
  • ఓం పద్మనాభాయ నమః
  • ఓం సదా వాయుస్తుతాయ నమః
  • ఓం త్యక్తవై కుణ్డలోకాయ నమః
  • ఓం గిరికుణ్ణు విహారిణే నమః
  • ఓం హరిచన్దనగోత్రేన్ద్రస్వామినే నమః
  • ఓం శజ్ఝరాజన్యనేత్రాబ్జవిషయాయ నమః
  • ఓం వసూపరిచరత్రాత్రే నమః
  • ఓం కృష్ణాయ నమః
  • ఓం అబ్ధికన్యాపరిష్వ_క్తవక్ష నే నమః
  • ఓం వేఙ్కటాయ నమః
  • ఓం సనకాదిమహాయోగిపూజితాయ నమః
  • ఓం దేవజిత్ప్రముఖాన న్తదై త్యసజ్ఞ ప్రణాశినే నమః
  • ఓం శ్వేతద్వీపవస నుక్తపూజితాజ్ఞియుగాయ నమః
  • ఓం శేషపర్వతరూపత్వప్రకాశ నపరాయ నమః
  • ఓం సానుస్థాపితతార్జ్యాయ నమః
  • ఓం తార్డ్యాచలనివాసినే నమః
  • ఓం మాయాగూఢవిమానాయ నమః
  • ఓం గరుడస్కస్ధవాసినే నమః
  • ఓం అనన్తశిరసే నమః
  • ఓం అనన్తాక్షాయ నమః
  • ఓం అన న్తచరణాయ నమః
  • ఓం శ్రీ శైలనిలయాయ నమః
  • ఓం దామోదరాయ నమః
  • ఓం నీలమేఘనిఛాయ నమః
  • ఓం బ్రహ్మాది దేవదుర్దర్శవిశ్వరూపాయ నమః
  • ఓం వైకుణాగతసద్ధేమవిమానా న్తర్గతాయ నమః
  • ఓం అగస్త్యాభ్యర్థితా శేషజనదృగ్గోచరాయ నమః
  • ఓం వాసుదేవాయ నమః
  • ఓం హరయే నమః
  • ఓం తీర్థపఞ్చకవాసినే నమః
  • ఓం వామదేవప్రియాయ నమః
  • ఓం జనకేష్టప్రదాయ నమః
  • ఓం మార్కణ్డయమహాతీర్థజాతపుణ్యప్రదాయ నమః
  • ఓం వాక్పతిబ్రహ్మదాత్రే నమః
  • ఓం చన్ద్రలావణ్యదాయినే నమః
  • ఓం నారాయణనగేశాయ నమః
  • ఓం బ్రహ్మ ప్రోత్సవాయ నమః
  • ఓం శబ్ధచక్రవరానమ్రలసత్కరతలాయ నమః
  • ఓం ద్రవన్మృగమదాస క్త విగ్రహాయ నమః
  • ఓం కేశవాయ నమః
  • ఓం నిత్యయౌవనమూర్తయే నమః
  • ఓం అర్థితార్థప్రదాత్రే నమః
  • ఓం విశ్వతీర్థాఘహారిణే నమః
  • ఓం తీర్థస్వామిసరస్స్నాత జనాభీష్టప్రదాయినే నమః
  • ఓం కుమారధారికావాసస్కన్దాభీష్ట ప్రదాయ నమః
  • ఓం జానుదఘ్న సముద్భూతపోత్రిణే నమః
  • ఓం కూర్మమూర్తయే నమః
  • ఓం కిన్నరద్వన్ద్వశాపా న ప్రదాత్రే నమః
  • ఓం విభవే నమః
  • ఓం వైఖానసమునిశ్రేష్ఠపూజితాయ నమః
  • ఓం సింహాచలనివాసాయ నమః
  • ఓం శ్రీమన్నారాయణాయ నమః
  • ఓం సద్భక్తనీలకణార్చ్యనృసింహాయ నమః
  • ఓం కుముద్రాక్షగణశ్రేష్ఠ నై నాపత్యప్రదాయ నమః
  • ఓం దుర్మేధఃప్రాణహర్తే నమః
  • ఓం శ్రీధరాయ నమః
  • ఓం క్షత్రియా న్తకరామాయ నమః
  • ఓం మత్స్యరూపాయ నమః
  • ఓం పాణ్డవారిప్రహర్త్రే నమః
  • ఓం శ్రీకరాయ నమః
  • ఓం ఉపత్యకాప్రదేశస్థశఙ్కరధ్యాతమూ ర్తయే నమః
  • ఓం రుక్మాబ్జసరసీకూలలక్ష్మీకృతతపస్వినే నమః
  • ఓం లసల్ల క్ష్మీకరామ్భోజద త్తకల్హారక స్రజే నమః
  • ఓం సాలగ్రామనివాసాయ నమః
  • ఓం శుకదృగ్గోచరాయ నమః
  • ఓం నారాయణార్థితా శేషజనదృగ్విషయాయ నమః
  • ఓం మృగయారసికాయ నమః
  • ఓం వృషభాసురహారిణే నమః
  • ఓం అజ్జనాగోత్రపతయే నమః
  • ఓం వృషభాచలవాసినే నమః
  • ఓం అజ్జనాసుతదాత్రే నమః
  • ఓం మాధవీయాఘహారిణే నమః
  • ఓం ప్రియఙ్గుప్రియభక్షాయ నమః
  • ఓం శ్వేతకోలవరాయ నమః
  • ఓం నీల ధేనుపయోధారా సేక దేహోద్భవాయ నమః
  • ఓం శఙ్కరప్రియమిత్రాయ నమః
  • ఓం చోళపుత్రప్రియాయ నమః
  • ఓం సుధర్మిణీసుచై తన్యప్రదాత్రే నమః
  • ఓం మధుఘాతినే నమః
  • ఓం కృష్ణాఖ్యవిప్రవేదా న్తదేశికత్వప్రదాయ నమః
  • ఓం వరాహాచలనాథాయ నమః
  • ఓం బలభద్రాయ నమః
  • ఓం త్రివిక్రమాయ నమః
  • ఓం మహతే నమః
  • ఓం హృషీ కేశాయ నమః
  • ఓం అచ్యుతాయ నమః
  • ఓం నీలాద్రినిలయాయ నమః
  • ఓం క్షీరాబ్దినాథాయ నమః
  • ఓం వైకుణాచలవాసినే నమః
  • ఓం ముకున్దాయ నమః
  • ఓం అనన్తాయ నమః
  • ఓం విరిఖ్ఛాభ్యర్థితానీతసౌమ్యరూపాయ నమః
  • ఓం సువర్ణముఖరీస్నాతమనుజాభీష్టదాయినే నమః
  • ఓం హలాయుధజగ తీర్థ సమస్త ఫలదాయినే, నమః
  • ఓం గోవిన్దాయ నమః
  • ఓం శ్రీనివాసాయ నమః

శ్రీ వేంకటేశాష్టోత్తరశతనామావళిన్సమ్పూర్ణా.

మరిన్ని పోస్టులు:

Sri Shiva Ashtottara Shatanamavali In Telugu- శివ అష్టోత్తర శతనామావళిః

Sri Shiva Ashtottara Shatanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివ అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

Sri Shiva Ashtottara Shatanamavali In Telugu

శివ అష్టోత్తర శతనామావళిః

  • ఓం శివాయ నమః
  • ఓం మహేశ్వరాయ నమః
  • ఓం శంభవే నమః
  • ఓం పినాకినే నమః
  • ఓం శశిరేఖరాయ నమః
  • ఓం వామదేవాయ నమః
  • ఓం విరూపాక్షాయ నమః
  • ఓం కపర్థినే నమః
  • ఓం నీలలోహితాయ నమః
  • ఓం శంకరాయ నమః
  • ఓం శూలపాణయే నమః
  • ఓం ఖట్వాంగినే నమః
  • ఓం విష్ణువల్లభాయ నమః
  • ఓం శిపివిష్టాయ నమః
  • ఓం అంబికానాథాయ నమః
  • ఓం శ్రీకంఠాయ నమః
  • ఓం భక్తవత్సలాయ నమః
  • ఓం భవాయ నమః
  • ఓం శర్వాయ నమః
  • ఓం త్రిలోకేశాయ నమః
  • ఓం శితికంఠాయ నమః
  • ఓం శివప్రియాయ నమః
  • ఓం ఉగ్రాయ నమః
  • ఓం కపాలినే నమః
  • ఓం అంధకాసురసూదనాయ నమః
  • ఓం గంగాధరాయ నమః
  • ఓం లలాటాక్షాయ నమః
  • ఓం కాలకాలాయ నమః
  • ఓం కృపానిధయే నమః
  • ఓం భీమాయ నమః
  • ఓం పరశుహస్తాయ నమః
  • ఓం మృగపాణయే నమః
  • ఓం జటాధరాయ నమః
  • ఓం కైలాసవాసినే నమః
  • ఓం కఠోరాయ నమః
  • ఓం త్రిపురాంతకాయ నమః
  • ఓం వృషాంకాయ నమః
  • ఓం వృషభారూఢాయ నమః
  • ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
  • ఓం సోమప్రియాయ నమః
  • ఓం సర్వమయాయ నమః
  • ఓం త్రయీమూర్తయే నమః
  • ఓం అనీశ్వరాయ నమః
  • ఓం సర్వజ్ఞాయ నమః
  • ఓం పరమాత్మనే నమః
  • ఓం సోమాసూర్యాగ్నిలోచనాయ నమః
  • ఓం హవిషే నమః
  • ఓం యజ్ఞమయాయ నమః
  • ఓం సోమాయ నమః
  • ఓం పంచవక్త్రయ నమః
  • ఓం సదాశివాయ నమః
  • ఓం విశ్వేశ్వరాయ నమః
  • ఓం వీరభద్రాయ నమః
  • ఓం గణనాధాయ నమః
  • ఓం ప్రజాపతయే నమః
  • ఓం హిరణ్యరేతసే నమః
  • ఓం దురాధర్షాయ నమః
  • ఓం గిరీశాయ నమః
  • ఓం అనఘాయ నమః
  • ఓం భుజంగభూషణాయ నమః
  • ఓం భర్గాయ నమః
  • ఓం గిరిధన్వనే నమః
  • ఓం గిరిప్రియాయ నమః
  • ఓం కృత్తివాసినే నమః
  • ఓం పురాగతయే నమః
  • ఓం భగవతే నమః
  • ఓం ప్రమదాధిపాయ నమః
  • ఓం మృత్యుంజయాయ నమః
  • ఓం సూక్ష్మతనవే నమః
  • ఓం జగద్వ్యాపినే నమః
  • ఓం జగద్గురవే నమః
  • ఓం వ్యోమకేశాయ నమః
  • ఓం మహాసేన జనకాయ నమః
  • ఓం చారువిక్రమాయ నమః
  • ఓం రుద్రాయ నమః
  • ఓం భూతపతయే నమః
  • ఓం స్థాణవే నమః
  • ఓం అహిర్భుధ్న్యాయ నమః
  • ఓం దిగంబరాయ నమః
  • ఓం అష్టమూర్తయే నమః
  • ఓం అనేకాత్మనే నమః
  • ఓం సాత్త్వికాయ నమః
  • ఓం శుద్ధవిగ్రహాయ నమః
  • ఓం శాశ్వతాయ నమః
  • ఓం ఖండపరశువే నమః
  • ఓం అజాయ నమః
  • ఓం పాతక విమోచనాయ నమః
  • ఓం మృడాయనమః
  • ఓం పశుపతయే నమః
  • ఓం దేవాయ నమః
  • ఓం మహాదేవాయ నమః
  • ఓం అశ్వాయ నమః
  • ఓం హరయే నమః
  • ఓం పూషదంతభిదే నమః
  • ఓం అవ్యగ్రాయ నమః
  • ఓం దక్షాధ్వరహరాయ నమః
  • ఓం హరాయ నమః
  • ఓం భగనేత్రభిదే నమః
  • ఓం అవ్యక్తరూపాయ నమః
  • ఓం సహస్రాక్షాయ నమః
  • ఓం సహస్రప్రసాదాయ నమః
  • ఓం త్రివర్గప్రసాదాయ నమః
  • ఓం త్రివర్గప్రసాదాయ నమః
  • ఓం అనంతాయ నమః
  • ఓం తారకాయ నమః
  • ఓం పరమేశ్వరాయ నమః
  • ఓం శ్రీ సదాశివాయ నమః

ఇతి అష్టోత్తర శతనామ పూజ

మరిన్ని అష్టోత్తరములు:

Sri Vasishta Krita Parameshwara Stotram In Telugu – శ్రీవశిష్ఠకృత పరమేశ్వరస్తోత్రమ్

Sri Vasishta Krita Parameshwara Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీవశిష్ఠకృత పరమేశ్వరస్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Vasishta Krita Parameshwara Stotram Lyrics Telugu

శ్రీవశిష్ఠకృత పరమేశ్వరస్తోత్రమ్

లింగమూర్తిం శివం స్తుత్వా గాయత్ర్యా యోగమాప్తవాన్ |
నిర్వాణం పరమం బ్రహ్మ వశిష్టోన్యశ్చ శంకరాత్ ॥

1

నమః కనకలింగాయ వేదలింగాయ వైనమః |
నమః పరమలింగాయ వ్యోమలింగాయ వైనమః ॥

2

నమః స్సహస్రలింగాయ వహ్నిలింగాయ వైనమః |
నమః పురాణలింగాయ శ్రుతిలింగాయ వైనమః ॥

3

నమః పాతాళలింగాయ బ్రహ్మలింగాయై వైనమః |
నమో రహస్యలింగాయ సప్తద్వీపోర్ధ్వలింగినే ॥

4

నమస్సర్వాత్మలింగాయ సర్వలోకాంగలింగినే |
నమస్త్వవ్యక్తలింగాయ బుద్ధిలింగాయ వైనమః ॥

5

నమో హంకారలింగాయ భూతలింగాయ వైనమః |
నమః ఇంద్రియ లింగాయ నమస్తన్మాత్రలింగినే ॥

6

నమః పురుషలింగాయ భావలింగాయ వైనమః |
నమోరజోర్ధ్వలింగాయసత్త్వలింగాయ వైనమః ॥

7

నమస్తే భవలింగాయ నమస్త్రైగుణ్యలింగినే |
నమో నాగలింగాయ తేజోలింగాయ వైనమః ॥

8

నమో వాయూర్ధ్వలింగాయ శ్రుతిలింగాయ వైనమః |
నమస్తే ధర్మలింగాయ సామలింగాయ వైనమః ||

9

నమో యజ్ఞాంగలింగాయ యజ్ఞలింగాయ వైనమః |
నమస్తే తత్త్వలింగాయ దేవానుగతలింగినే ॥

10

దిశ నః పరమం యోగ మపత్యం మత్సమం తథా |
బ్రహ్మచైవాక్షయం దేవ శమం చైవ పరం విభో ॥

11

అక్షయత్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్ |
వశిష్టాయ వరం దత్వాత త్రైవాంతరధీయతః |
వశిష్ఠన స్తుతశ్శంబు స్తుష్టశ్రీపర్వతే పురా ॥

12

ఇతి శ్రీ మహాపురాణే ఆగ్నేయే అగ్నివశిష్ఠసంవాదే వశిష్ఠకృత
పరమేశ్వరస్తుతిర్నామ సప్తదశాధికద్విశతతమోధ్యాః

మరిన్ని స్తోత్రములు

Kundanampumai Golleta Ta In Telugu – కుందణంపుమై గొల్లెత తా

కుందణంపుమై గొల్లెత తా - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో కుందణంపుమై గొల్లెత తా- కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కుందణంపుమై గొల్లెత తా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన : కుందణంపుమై గొల్లెత తా-
సంఖ్య : 92
పుట : 63
రాగం: ఆహిరి

ఆహిరి

85 కుందణంపుమై గొల్లెత తా
నెందును బుట్టని యేతరి జాతి

||పల్లవి||

కప్పులు దేరేటి కస్తురి చంకల
కొప్పెర గుబ్బల గొల్లెత
చప్పుడు మట్టెల చల్లలమ్మెడిని
అప్పని ముందట హస్తిణిజాతి

॥కుంద||

దుంప వెంట్రుకల దొడ్డతురుముగల
గుంపెన నడపుల గొల్లెత
జంపుల నటనలఁ జల్లలమ్మెడిని
చెంపల చెమటల చిత్రిణి జాతి

॥కుంద||

వీపున నఖములు వెడవెడ నాఁటిన
కోపపుఁ జూపుల గొల్లెత
చాఁపున కట్టిగఁ జల్లలమ్మెడిని
చాఁపేటి యెలుగున శంకిణిజాతి

॥కుంద||

గారవమున వేంకటపతి కౌఁగిట
కూరిమిఁ బాయని గొల్లెత
సారెకు నతనితో చల్లలమ్మెడిని
భారపుటలపుల పద్మిణిజాతి

॥కుంద||

అవతారిక:

కావ్యనాయికలను శృంగారశాస్త్రం నాలుగురకాలుగా వర్ణించింది. పద్మినిజాతి స్త్రీ, హస్తిణి, చిత్రిణి, శంకిణి అని చెప్పబడిన వీరిలో ప్రతి యువతి తన శారీరక, మానసిక లక్షణాలను బట్టి ఆ జాతికి చెందిన స్త్రీగా నిశ్చయింపబడినది. ఈ కీర్తనలో అన్నమాచర్యులవారు నలుగురు గొల్లెతలను ఆ విధంగా విభజించి బంగారు శరీరఛాయతోనున్న గొల్లెత తానెందును. బుట్టని యేతరిజాతి చిన్నది అంటున్నారు. అంటే యేమిటి? సరసశృంగారంకాస్త గూఢంగా వుంటే అందం కదా! భావవివరణ జాగ్రత్తగా చదవండి. కొసమెరుపేమంటే, నలుగురికీ ఆ నల్లనివాడంటే వుల్లములో జల్లే.

భావ వివరణ:

కుందణంపుమై (బంగారు శరీరచ్ఛాయగల) గొల్లెత (ఆ గొల్లభామ) | తాను యెందును (ఏజాతిలోనూ) పుట్టని యేతరిజాతి (అతిశయముగల స్త్రీ). అనగా వూహాసుందరి.

కప్పులుదేరేటి కస్తూరి (నల్లని కస్తూరీ పరిమళముగల) బాహు మూలములామె ప్రత్యేకత. ఆమె కొప్పెర గుబ్బల (వున్నత కుచయుగళము) గల గొల్లెత. ఆమె చల్లలమ్ముటకు పోతుంటే ఆమెమట్టెల చప్పుడు ప్రతిధ్వనిస్తుంది. అప్పని ముందట (హరియెదుట) ఆ హస్తిణీజాతి గొల్లెత నడయాడుచున్నది.

ఆమె తల వెంట్రుకలు, దుంపలు కట్టి (కుచ్చులు కట్టి) పెద్ద కొప్పుతో వున్నది. | ఆమె నడుస్తుంటే గుంపెనగా (అట్టహాసముగా) వుంటుంది. ఆమె కదులుతుంటే ఆమె చెవులకు దరించిన జంపులు (చెంపసరములు) నర్తించుతాయి. చల్లలమ్ముటకు ఆమె మధురానగరంలో నడుస్తుంటే శ్రమవల్ల ఆమె చెంపలు చెమటను చెమరించుచున్నవి. ఆమె తప్పకుండా చిత్తిణీజాతి స్త్రీయే సుమా!

ఇదిగో ఈ గొల్లెతను చూడండి. ఉద్రేకమున ఈమె వీపుపై నఖక్షతములను సైతము జేయగలదు. ఈమె చూపులే చురచురమనునట్లు కోపాగ్నితో వుంటాయి. ఆమె నడుస్తుంటే పరుగెడునట్లుంటుంది. ఈమె చల్లలమ్ముటకు చాపేటి యెలుగున (పెద్ద గొంతుతో కేకలు వేస్తూ అమ్ముతుంది). ఈ జవ్వని శంకిణిజాతి గొల్లెత.

ఈ గొల్లెతను చూశారా? ఈమె అతిశయించిన గారవము (గౌరవము) తో శ్రీవేంకటేశ్వరుని కౌగిటిని యెన్నడు విడువదు. తిరుమలేశునిపై ఆమె యెనలేని కూరిమి (వలపు) కలిగి వుంటుంది. ఈ గొల్లెత యెప్పుడు చల్లలమ్ముటకు పోయినా తనవెంట ఆ రమణుడే వుండాలని ఆశపడుతుంది. ఆమె భారపు (అధికమైన) అలసటను (శ్రమను) తట్టుకోలేదు. ఆమె ఆయనకు ప్రియమైన పద్మినీజాతి స్త్రీ.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Sri Suvarnamala Stuti In Telugu – శ్రీ సువర్ణ మాలా స్తుతిః

Sri Suvarnamala Stuti

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సువర్ణ మాలా స్తుతిః గురించి తెలుసుకుందాం…

Sri Suvarnamala Stuti Lyrics Telugu

శ్రీ సువర్ణ మాలా స్తుతిః

అథకథమపి మద్రసనాం త్వద్గుణ లేనైర్విశోధయామి విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఆఖండల మదఖండన పండిత తండుప్రియ! చండీశ విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఇభ చర్మాంబర! శంబరరిపు వపురపహరణోజ్జ్వల నయన వభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఈశ! గిరీశ! నరేశ! పరేశ! మహేశ! బిలేశయభూషణ! విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఉమయాదివ్యసుమంగల విగ్రహయాలింగిత వామాంగ! విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఊరీకురు మా మజ్ఞ మనాథం దూరీకురు మే దురితం భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఋషివర మానసహంస చరాచర జనన స్థితి లయ కారణభో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఋక్షాధీశ కిరీటి! మహోక్షారూఢ! విధృత రుద్రాక్ష! విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఇవర్ణ ద్వంద్వమవృంత కుసుమ మివాంఘ్రా తవారయామి విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఏకం సదితి శ్రుత్యా త్వమేవ సదసీ త్యుపాస్మహే మృడ! భో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఐక్యం నిజభక్తే భ్యో వితరసి విశ్వంభరోత్రసాక్షీ భో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఓమితి తవ నిర్దేష్టీ మాయా స్మాకం మృదోపకర్తీ భో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఔదాస్యం స్ఫుటయతి విషయేషు దిగంబరతా తవైవ విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

అంతః కరణవిశుద్ధిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

అస్తోపాధిసమస్తవ్యస్తే రూపై ర్జగన్మయో సి విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

కరుణా వరుణాలయ! మయి దాస ఉదాస స్తవచితో నహి భో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఖలసహవాసం విఘటయ విఘటయ సతామేవసంగ మనిశంభో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

గరళం జగదుపకృతయే గిలితం భవతా సమో స్తికోత్ర విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఘనసార గౌర గాత్ర! ప్రచుర జటాజూట బద్ధ గంగ! విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

జ్ఞప్తి స్సర్వ శరీరే ష్వఖండితా యా విభాతి సా త్వం భో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

చపలం మమ హృదయ కపిం విషయేద్రు చరం దృఢం బధానవిభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఛాయా స్థాణో రపి తవ తాపం నమతాం హరత్యహో శివ భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

జయ! కైలాస నివాస! ప్రమథ గణాధీశ! భూసురార్చిత! భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఝణుతక కిణుతకిట తక శబ్జెర్నటసి మహానట! భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

టంకార స్తవధనుషో దలయతి హృదయం ద్విషామశనిరివ భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఠాకృతిరివ తవమాయా బహిరంత శ్మూన్యరూపిణీ భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

జ్ఞానం విక్షేపావృతి రహితం కురు గురు స్త్వమేవ విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఢక్కాలి క్షరసూత్ర శూల ద్రుహిణ కరోటీ సముజ్జ్వలత్కర భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ణా కారగర్భిణీ చే చ్ఛు భదా తే శరగతి ర్షృణా మిహా భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

తవ మన్వతి సంజపత స్పద్యస్తరతి నరో హి భవాబ్ధిం భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

థూత్కార స్తస్యముఖే భూయాత్ తే నామ నాస్తి యస్య విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

దయనీయశ్చ దయాలు: కోస్తి మదన్య స్త్య ఇహ భో
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ధర్మస్థాపన దక్ష త్ర్యక్ష ! గురో దక్షయజ్ఞ శిక్షక! భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

నను తాడితో పి ధనుషా లబ్దధియా త్వం పురా నరేణ విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

పరిమాతుం తవ మూర్తినాల మజి స్తత్ పరాత్పరో సి విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఫల మిహ నృతయా జనుష స్వతసేవా సనాతనేశ విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

బలమారోగ్యం చాయు స్త్వద్గుణరుచితామ చిరం ప్రదేహి విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

భగవన్! భర్గ! భయాపహ! భూతిపతే! భూతివిభూషితాంగ విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

మహిమా తవ నహి మాతిశ్రుతిషు హిమానీధరాత్మజాధవ! భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

యమనియమాదిభి రంగైర్యమినో హృదయే భజంతి త్వ భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

రజ్జా వహిరివ శుక్తే రజతమివ త్వయి జగంతి భాంతి విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

లబ్గ్వా భవత్ప్రసాదా చ్చక్రం విధు రవతి లోక మఖిలం భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

శర్వ! దేవ! సర్వోత్తమ! సర్వద! దుర్వృత్తగర్వహరణ! విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

షడ్రిపు – షడూర్మి – షడ్వికారహర! షణ్ముఖ! షణ్ముఖజనక!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మే త్యే తల్ల క్షణలక్షిత! భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

హాహా హూహూ ముఖసుర గాయక గీతాపదాన పద్య విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ళాలై దిరహి ప్రయోగఃతదంత మిహ మంగళం సదాస్తు విభో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

క్షణమివ దివసా న్నేష్యతి త్వత్పద సేవాక్షణోత్సుక శ్శివ! భో!
సాంబ! సదాశివ! శంభో! శంకర! శరణం మే తవ చరణయుగం.

ఇతి శ్రీ శంకరాచార్యకృత సువర్ణమాలాస్తుతిః

మరిన్ని స్తోత్రములు

VedaSara Shiva Stotram In Telugu – వేదసార శివ స్తోత్రమ్

VedaSara Shiva Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు వేదసార శివ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

VedaSara Shiva Stotram Lyrics Telugu

వేదసార శివ స్తోత్రమ్

శ్రీ మచ్ఛంకర భగవత్పాద విరచితమ్

పశూనాం పతిం పాపనాశం పరేశం
గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం।
జటాజూటమధ్యే స్ఫురద్ధాంగ వారిం
మహాదేవ మేకం స్మరామి స్మరామి॥

1

మహేశం సురేశం సురారార్తినాశం
విభుం విశ్వనాథం విభూత్యంగ భూషమ్।
విరూపాక్ష మింద్వర్క వహ్ని త్రినేత్రం
సదానందమీడే ప్రభుం పంచవక్త్రమ్॥

2

గిరీశం గణేశం గళే నీలవర్ణం
గజేంద్రాధిరూఢం గుణాతీత రూపమ్।
భవం భాస్వరం భస్మనా భూషితాంగం
భవానీ కళత్రం భజే పంచవక్త్రమ్॥

3

శివాకాంత శంభో శశాంకార్థమౌళే
మహేశాన శూలిన్ జటాజూట మౌళే।
త్వమేకో జగద్వ్యాపకో విశ్వరూప
ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణ రూప॥

4

పరాత్మాన మేకం జగద్బీజమాద్యం
నిరీహం నిరాకార మోంకార వేద్యం।
యతో జాయతే పాల్యతే యేన విశ్వం
తమీశం భజే లీయతే యత్ర విశ్వమ్॥

5

న భూమిర్న చాపో నవహ్నిర్ న వాయు
ర చాకాశమాస్తేన తంద్రా న నిద్రా।
న గ్రీష్మో న శీతం న దేశో న వేషో
న య స్యాస్తి మూర్తి స్త్రీమూర్తిం త మీడే ॥

6

అజం శాశ్వతం కారణం కారణానాం
శివం కేవలం భాసకం భాసకానామ్।
తురీయం తమః పార మాద్యంత హీనం
ప్రపద్యే పరం పావనం ద్వైతహీనమ్ ॥

7

నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే
నమస్తే నమస్తే చిదానందమూర్తే।
నమస్తే నమస్తే తపోయోగ గమ్య
నమస్తే నమస్తే శ్రుతిజ్ఞానగమ్య ॥

8

ప్రభో శూలపాణే విభో విశ్వనాథ
మహాదేవ శంభో మహేశ త్రినేత్ర।
శివాకాంత శాంత స్మరారే పురారే
త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః॥

9

శంభో మహేశ కరుణామయ శూలపాణే
గౌరీపతే పశుపతే పశుపాత నాశిన్।
కాశీపతే కరుణయా జగదేతదేక
స్త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోసి॥

10

త్వత్తో జగద్భవతి దేవ భవ స్మరారే
త్వయ్యేవ తిష్ఠతి జగన్మృడ విశ్వనాథ।
త్వయ్యేవ గచ్ఛతి లయం జగదేతదీశ
లింగాత్మకం హర చరా చర విశ్వరూపిన్ ॥

11

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం వేదసార శివ స్తోత్రం

మరిన్ని స్తోత్రములు

Sista Rakshanamunu Dushta Nigrahamunu In Telugu – శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును

శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును
సంఖ్య : 258
పుట: 175
రాగం: పాడి

పాడి

70 శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును
సృష్టించె నొక్కవేళనే శ్రీజయంతినాఁడు.

||పల్లవి||

హరి కృష్ణావతార మందినయంతలోనే
పరమమునుల కెల్ల భయముడిగెను
తెరలి దైత్యులగుండె దిగులుచొచ్చె నత్తరి
సిరులమించినయట్టి శ్రీజయంతినాఁడు.

||శిష్ట||

గోవిందుఁడు వసుదేవుకొడుకైనయప్పుడే
గోవులు రంకెలు వేసె గొల్లపల్లెను
నోవితోడఁ గంసునికి నూరునిండెఁ జూడఁగానె
చేపలుమీరినయట్టి శ్రీజయంతినాఁడు

||శిష్ట||

నారాయణుఁడు భువి నరుఁడు దాఁ గాఁగానే
మేరఁ బాండవు లెచ్చిరి మేనవావిని
కౌరవులపని దీరె కమ్మి శ్రీవేంకటేశుఁడు
చేరువనే మెరయఁగ శ్రీజయంతినాఁడు.

||శిష్ట||

అవతారిక:

ఒకానొక శ్రీకృష్ణ జయంతి సందర్భంగా అన్నమాచార్యులవారు వినిపించిన కీర్తననాలకించండి. “శిష్టరక్షణమును, దుష్టశిక్షణమును భగవంతుడు శ్రీజయంతినాడు ఒకే సమయంలో సృష్టించె” అంటున్నారు. మునులను రక్షించాడు, దానవులను భక్షించాడు. గోవులను మేపాడు, కంసుని వేపాడు. పాండవులు యెచ్చిరి, కౌరవుల పనిదీరె అని కృష్ణావతారవైశిష్ట్యాన్ని కీర్తిస్తున్నారు. శ్రీవేంకటేశుడు కూడా ఆయన చేరువనే మెరసినాడట. గతంలో ఇటువంటి కీర్తనలు చూచినా దేని మాధుర్యం దానిదే.

భావ వివరణ:

ఓ భక్తులారా! ఈ శ్రీజయంతినాడు (శ్రీకృష్ణాష్టమినాడు) ఆ భగవంతుడు, శిష్టరక్షణము (మంచివారిని రక్షించుట), దుష్టనిగ్రహము (చెడ్డవారిని నిరోధించుట) ఒక్కవేళనే (ఒకే సమయంలో) సృష్టించెన్ (సిద్ధింపజేశాడు).

శ్రీహరి కృష్ణావతారమును పొందినప్పుడు పరమ మునీంద్రులకు అందరికీ దానవుల భయము వుడిగెను (అణగిపోయినది). తెరలి (కలతపడిన) దైత్యుల గుండెలు, అత్తరి (అప్పుడు) దిగులుచొచ్చె (దిగులుతో దిగాలుపడ్డాయి). ఈ శ్రీజయంతి సిరులుమించిన (వైభవములతిశయించిన) పండుగ అవటంచేత ఈనాడు అంతా జయమే.

ఆ గోవింద వసుదేవుని కొడుకైనప్పుడే కొడుకైనప్పుడే గొల్లపల్లెను (గోకులమునందున్న) గోవులన్నీ సంతోషంతో రంకె వేసినవి. ఎందుకంటే వాటికి భగవంతుడు తమ మూపురాలను ప్రేమగా నిమరటానికి రాబోతున్నాడని తెలిసిపోయింది. అక్కడ మధురలో కంసునికి నోవితోడ (వేదనతో) చూడగానే (యోగమాయ హెచ్చరిక విని జరిగింది చూడగా) భయంతో నూరునిండె (నూరేళ్ళు నిండాయి). ఈ శ్రీజయంతినాడు చేవలు మీరినయట్టి (అందరికీ ధైర్యంకలిగినట్టి ఈరోజున) కంసాదులకు కన్నీళ్ళొచ్చాయి.

నారాయణుడు భువిపై తాన్ నరుడు కాగానే (అవగానే మేం (క్రమముగా) మేనవావిని (మేనరికపు బంధుత్వమునందు) పాండవులు యెచ్చిరి (బలోపేతులయ్యారు). కౌరవులు (దుష్టరాజసమూహంగల కురుసేన) పనిదీరె (పనిముగిసినది). ఈ శ్రీజయంతినాడు ఆ కృష్ణలీల సంకేతముగా, శ్రీవేంకటేశుడు ఈ తిరుమల శిఖరాలపై కమ్మి మెరయగా (వ్యాపించి మెరిసిపోగా) చేరువనే (ఇక్కడే) పండుగ పరిమళించింది.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: