మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ అనురాఘవేంద్ర స్తోత్రంగురించి తెలుసుకుందాం…
Sri Anu Raghavendra Sthotram In Telugu
గోలోకవాసి, శ్రీహరి పార్ష దుడు నైనశ్రిశంఖుకర్ణుడు బ్రహ్మదేవు నా దేశానుసారముగ యీ యవనిపై బ్రహ్మదేవు శ్రీ ప్రహ్లాదునిగ, శ్రీ విభీషణునిగ, శ్రీ బాహ్లికునిగా, శ్రీ వ్యాస నాయతీర్థునిగ, శ్రీ రాఘ వేంద్ర తీర్థునిగా యుగయుగములంద వత పంచి శ్రీ హరిశక్తిని, భక్తిని ప్రచారమొనరించి ధర్మసంస్థా పనము గావించెను.
ఎవని పాదోదకమును కషాయముగ (మందుగ), ఏ గురు దేవుని శిరముపై నున్న బృందావన మృత్తికను (మట్టిని) మాత్రగ స్వీకరించినచో నిత్యము రోగము లన్నియు తొలగి పోవునో, ఆసద్గుణనిధి యగు గురురాఘ వేంద్రుని చేరి
సేవించెదను.
శ్రీలక్ష్మీనాథుని వక్షము నందు ధరించినవాడు, మంచి వారిని రక్షించుటలో ఆదరము కలవాడు, సంపన్నులు, శ్రేష్ఠులు రాజకుమారులు మొదలగువారి ముఖములచే అరుణవర్ణ ములుగ ప్రకాశించు పాదములు కలవాడు, స్త్రీలను జూచి మోహము పొందిన ద్విజుని పాపమును నశింపజేసి ఉద్ధరించినవాడు, కట పర్వత (మంత్రాలయ) ప్రదేశమునకు ఆభూషణ మైనరత్నము వంటివాడు, బ్రహ్మాదు లైన దేవతల యొక్క విందములను అర్చించువాడు నగు శ్రీ గురు దేవుని సేవించెదను.
స్మేరాననం నవఘనాఘననీలభాసం
శ్రీ జానకీ కనక పీఠవ రే నిషణ్ణం |
బింబాధరద్యుతిసుర క్తతనం స్వనాథం
సంప్రేక్ష్య మందహసితాంకగతా సదావ్యాత్ ||
9
మందహాసవదనము గలవాడును, నూతనమైన దట్టమైన మేఘముయొక్క నల్లని కాంతివంటి కాంతి గలవాడును, బంగారు పీఠమునందు ఆసీనుడై యున్నవాడును, బింబాధరము యొక్క కాంతిచే మిగుల యెజ్జగా చేయబడిన శరీరము గలవాడును, తనకు నాథుడును నగు శ్రీరాముని చూచుచు మందహాసము కలదియు అంకపీఠముపై గూర్చున్నదియు నగు ఆజానక దేవి ఎల్లప్పుడు రక్షించుగాక!
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రముగురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ రాఘవేంద్ర మంగళాష్టకమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాసాన్ని కలిగిస్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించినచో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… ఈ క్రింద ఇచ్చిన లింకు నందు శ్రీ చండి కవచం ఇవ్వబడినది. అది ఏమిటో తెలుసుకుందాం…
Sri Chandi Kavacham In Telugu
శ్రీ చండి కవచం
అథ దేవ్యాః కవచమ్
అస్య శ్రీ చండీకవచస్య బ్రహ్మా ఋషిః | అనుష్టు ప్ఛందః | చాముండా దేవతా | అంగన్యాసోక్తమాతరో బీజ౩ | నవార్ణో మంత్ర శృః | దిగ్బంధదేవతా స సత్త్వం. శ్రీ జగదంబా ప్రీత్యర్ధే శ్రీ చండిస్తోత్ర పాఠాంగత్వేన జపే వినియోగః |
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… రంతిదేవుడు నీతికథ.
రంతిదేవుడు
పూర్వం రంతిదేవుడను రాజేంద్రుడుండెడి వాడు. ఆతడు రాజైననూ మహాయోగి వలె విషయ వాంఛలకు లోనుగాక నిరతం హరినామ స్మరణతో కాలంగడిపేవాడు. దైవవశమున లభించిదానితోనే తృప్తిపడేవాడు. ఆ రాజు తన సంపదలను దానం ఇచ్చి ఇచ్చి బీదవాడైనాడు. కుటుంబంతో సహా చాలా కష్టాలపాలైనాడు. నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్ళు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా గుండెదిటవు కోల్పోలేదు.
ఒకరోజు ప్రాతఃకాలమున అతనికి నెయ్యి పాయసము హల్వ నీళ్ళు లభించాయి. భోజనకాలం వచ్చాక రంతిదేవుడు సకుటుంబముగా భోజనముచేయ సిద్ధపడ్డాడు. భరింపరాని క్షుత్పిపాసల బాధ తీర్చుకుందామని అనుకుంటుండగా ఓ దీన బ్రాహ్మణుడు అతిథియై వచ్చాడు. రంతిదేవుడెంతో ప్రేమతో అతని గౌరవించి హరిసమర్పణముగా ఆహారంలో అర్ధభాగాన్ని అతడికిచ్చాడు. ఆ విప్పుడు కడుపారా భుజించి సంతృప్తుడై వెళ్ళాడు.
ఇంతలో ఒక శూద్రుడు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. వచ్చిన అభ్యాగతునిలో భగవంతుడిని దర్శించి ఆదరంతో ఆ శూద్రునికి ఆహారంలో ఒకభాగాన్నిచ్చాడు రంతిదేవుడు. వాడు సంతృప్తిగా తిని వెళ్ళాడోలేదో కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు. “రాజా! నేను ఈ కుక్కలు ఆకలిచే మిగుల పీడితులమై యున్నాము. మాకు సరిపోయే ఆహారము ఇమ్ము” అని వాడన్నాడు. అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచిమాటలాడి పంపాడు రంతిదేవుడు.
Ranti Devudu Story In Telugu
ఇక రంతిదేవుని వద్ద నీళ్ళొకటి మిగిలాయి. అదీ ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి. దప్పికతో ప్రాణాలు కడగడుతున్న రంతిదేవుడు అవి త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు “అయ్యా! నేను చాలా దీనుడను. చాలా దాహంగా ఉంది. నీరసముతో అడుగు ముందుకు వేయలేకున్నాను. నీవద్దనున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు”. ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుని చూచి “ఓ అన్నా! నావద్ద అన్నంలేదు కాని ఈ తీయ్యని నీళ్ళున్నాయి. దగ్గరకురా. నీ దాహం తీరేటట్లు త్రాగు.
ఆపదకలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవడం కన్నా పరమార్థమేమున్నది మానవులకు”? అని రంతిదేవుడున్నాడు. తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్కచేయక రంతిదేవుడు “నా జలదానంతో ఈతడి బాధ ఆయాసం దాహం తొలగితే నాకంతే చాలు. అంతా ఈశ్వరేచ్ఛ” అని ఆ చండాలుని పాత్రలో నీళ్ళు పోశాడు.
బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవుని ఎదుట ప్రత్యక్షమై జరిగినదంతా విష్ణుమాయా ప్రభావం అని చెప్పారు. బ్రాహ్మణ శూద్ర చండాల వేషములలో వచ్చినది వారే అని ఎఱుక కల్గించి ఆశీర్వదించారు. రంతిదేవుడు వారికి నమస్కరించినాడు. ధీరుడైన రంతిదేవుడు వారిని ఏదీ కోరలేదు. స్థిరమైన విష్ణుభక్తులకే కోరికలుండవు కదా! కడకు విష్ణుపదాన్ని పొందాడు. ఆ రాజేకాదు ఆ రాజు కథను బాగా విని అర్థంచేసుకున్న వాళ్ళందరూ ఆతని మహిమచే యోగులై కడకు మోక్షం సంపాదించారు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం
దానము తీసుకొనువానికి హితము కలిగించు దానిని ఫలాపేక్షరహితంగా ప్రేమతో ఇవ్వడం ఉత్తమ దానం. ఇదియేకాక అడిగినవానిలో భగవంతుడిని దర్శించి తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరమైనది తనకు లేక పోయినా ఇచ్చివేసిన రంతిదేవుడు ధన్యుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గోపికాగీతమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గోవర్ధనాష్టకమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కలియుగ వైకుంఠపతి వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. “సు-ప్రభాతము” అనగా “మంచి ఉదయం” అని అర్ధం. హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి శ్రీవైష్ణవం ఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు (షోడశోపచారములు) నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే “సుప్రభాతం” అని అంటారు.
Sri Venkateswara Suprabhatam Telugu Lyrics
శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యాసుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే|
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ॥
ముందు విచారించము మొదలు విచారించము
పొందేటిసతులతోడిభోగమేకాని
చెందినమనసులోనిచింతలను బాయము
మందపుమదమే కాని మాపుదాఁకా నేము.
||బోధిం||
పరమూఁ దడవము భక్తీఁ దడవము
అరిది ధనముమీఁది ఆసలేకాని
ఇరవై శ్రీవేంకటేశుఁ డేలుకొనెఁ దానే నన్ను
నిరతి నెరఁగనైతి నే నించుకంతాను.
||బోధిం||
అవతారిక:
“ఓ పెద్దలారా! మేము శ్రీధరుని మాయలో చిక్కుకుపోయామయ్యా! దిక్కు తెలీటంలేదు. మాకు యేమి చెయ్యాలో చెప్పండయ్యా!” అంటున్నారు జాలిగా అన్నమాచార్యులవారు. దేవుణ్ణి నమ్మం, ధర్మం ఒప్పుకోము, భవబంధాలలో అల్లాడిపోతున్నాం. ముందు విచారించము, మొదల విచారించము యెంతసేపూ వనితాభోగమే. మందపుమదమే మాపుదాకా, పరము వద్దంటాము. భక్తిసున్నా. ఏమిటీ దౌర్భాగ్యం!! తేలికగా కనుపించే క్లిష్టమైన కీర్తన ఇది. జాగ్రత్తగా చదవండి.
భావ వివరణ:
ఓ పెద్దలారా! బుధులారా! (పండితులారా!) మీరు అన్నీ యెరిగినవారు కదా! నాకు బోధింపరో (బోధపరచండయ్యా!) నేము (మేము) శ్రీధరుని మాయలలో చిక్కుకుపోయాం.
మేము దేవుని వొల్లము (అంగీకరించము). ధర్మమునంగీకరించము. దావతి సంసారముతో (దుఃఖభాజన ప్రపంచపు తగులే (అనుబంధములే) కాని, భవబంధాల భయంలేనేలేదాయెను. అనేక మార్గాలనవలంభిస్తాము కాని, వేగిలేచేము (ప్రతిదానికీ తొందరే). మాకేమి చేయాలో తెలియుటలేదు.
మాకున్న ఇంకొక దురలవాటు ముందుగా విచారించము (కార్యము ప్రారంభమునకు ముందుగ ఆలోచన చేయము). మొదలు విచారించము (కార్య ప్రారంభమునందును ఆలోచించము). మాకు లభించిన భామలతో భోగాసక్తే కాని ఇంకొక ఆలోచనేవుండదాయెను. ఈ వ్యవహారాలవల్ల మనస్సులో యెప్పుడూ దిగుళ్ళే, ఆలోచనలే. వాటిని బాయము (వదలము). మాపుదాకా (ముసలివాళ్ళమై జవసత్వాలు వుడిగేదాక ) మందపు మదమే (దట్టమైన గర్వమే…) కాని మరొకటి లేదు. మేము భ్రష్టులమైపోయాము.
అవన్నీ అటుంచి, పరము మోక్షము) అంటే యేమిటో తడవము (చలించము) భక్తి గురించిన ఆలోచనేలేదు. అరిది ధనముపై ఆసలే (అరుదుగా లభిస్తుందని ధనముపై వ్యామోహమే)… కాని భగవంతుని మాటే తలవము. ఇట్లా చాలాకాలం గడిచింది. ఒకనాడు శ్రీవేంకటేశునికి ఈ జీవిపై దయపుట్టింది. ఆయన ఇరవై (నా తలపులలో నెలకొని) తానే నన్ను యేలుకొనె. నేను ఇంచుకంతా, నిరతినెరుగనైతి (కొంచెము కూడా అత్యాశ లేక) జీవించుట ప్రారంభిచితిని. ఆ విధంగా ధన్యుడనైతిని.
కలశాపురంలో తనయెదుటనున్న ఘనమైన హనుమంతుని యెదుట అన్నమాచార్యులవారు ఈ కీర్తనను వినిపిస్తున్నారు. ఆనాడు లంకలో రాక్షసమూకనుయెట్లు చీల్చి చెండాడినాడో వర్ణిస్తున్నారు. నేటి మన దుస్థితి యేమంటే అచ్చతెలుగు కీర్తనకి, సంకరతెలుగులో వివరణ ఇచ్చుకోవలసిన వస్తున్నది. “ఆరుపుల నూరుపులనందరి బారగ దోలె”… ఆయన హూంకారముతో కూడిన గట్టి నిశ్వాసవదిలి అందరూ కకావికలై పారిపోయేట్లు చేశాడట. ఇట్లా అడుగడుగునా తేలికగా తెలియని తెలివైన తెలుగు తికమకలు దిట్టంగావున్నాయి ఈ కీర్తనలో.
భావ వివరణ:
ఆనాడు లంకలో అన్ని ఘనకార్యములను చేసిన ఆ ఘనుడైన హనుమంతుడు ఆతడా, యితడు (ఈ కలశాపురంలో మనయెదుటనున్న ఆంజనేయుడు). ఏమి ఆశ్చర్యము!
ఈయన సీతాన్వేషణలో లంకలోని రాక్షసులను యెట్లు చితక్కొట్టాడో వినండి. ఆయన తన మోచేతితో కొందరిని కుమ్మి చంపాడు. కొందరిని చేతిలోపలి భాగంలో నొక్కి చంపాడు. అడరి (ఆ విధంగా అతిశయించి) ఆ హనుమంతుడు దానవులను చంపాడు. అప్పుడు మాల్యవంతుడనే రాక్షసుడు ఆయనపైకి వెళ్ళాడు. బెడిదంపు (భయంకరమైన) పెనుతోక (పెద్దతోకతో) బిరబిర తిప్పి అణిగిపోయేట్లు మొత్తి వాడిని ఆ హనుమంతుడు చంపేశాడు.
తన కాలు (దాగుకాలు) కాలివెనుక భాగంతో) తో తన్ని కొందరిని, మోకాలితో కుమ్మించి కొందరిని తాటించినాడు (కొట్టినాడు), ఆ హనుమంతుడు. ఇదంతా ఆయన ఆకాశవీధిలోనే చేశాడు. ఆ కడ (అప్పుడు) కొందరిని పైకొని (మీదపడి) భుజములతోపడదోసి జలధిలో చంపేశాడు. హనుమంతుని మారణకాండనేమని వర్ణింతుము?
అనంతరం ఆ హనుమంతుడు “ఆరుపుల నూరుపుల నందరి బారగదోలె” (తన హూంకారముతో కూడిన గట్టి నిస్వాసముతో అందరినీ చిందరవందరగా పారిపోయేట్లు చేశాడు. ఔరా సంజీవి కొండను తెచ్చిన ఈ హనుమంతుడు జగజ్జెట్టి. మేరతో (ఆ క్రమంలో) వేంకటాద్రిమీది దేవుడైన వేంకటేశ్వరుని బంటు అనే ఆరితేరిన బిరుదుతో ఈ హనుమంతుడు శోభించుచున్నాడు.