Doratanamulatoda Todapai Srisatitoda In Telugu – దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ

దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ
సంఖ్య: 518
పుట: 348
రాగం: నాట

నాట

71 దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ
కేరలీఁ బంతముల సుగ్రీవనారసింహము.

||పల్లవి||

నిక్కినకర్ణములతో నిట్ట చూపుగుడ్లతో
మిక్కుటమైన పెద్దమీసాలతోడ
వెక్కసపునోరితోడ వెలయుబుగ్గలతోడ
క్రిక్కిరిసీ నవ్వుల సుగ్రీవనారసింహము.

||దొర||

చల్లునూరుపులతోడ సంకుఁజక్రములతోడ
మొల్ల మైనసహస్రకరములతోడ
తెల్లనిమేనితోడ దిండైనపిరుఁదుతోడ
కెల్లరేఁగీఁ గరుణ సుగ్రీవనారసింమము.

||దొర||

విరులపాదాలతోడ వెలయుసొమ్ములతోడ
తిరమైనకోటిసూర్యతేజముతోడ
విరులదండలతోడ వేడుక శ్రీవేంకట
గిరిమీఁద వెలసె సుగ్రీవనారసింహము.

||దొర||

అవతారిక:

సహజత్వం వుట్టిపడేలా వర్ణనలు కీర్తనలో జొప్పించటం అన్నమాచార్యుల వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన నరసింహుని వర్ణిస్తుంటే మనకళ్ళయెదుట ఆ స్వామి నిలుచున్నట్లే వుంటుంది. “దొరతనంతోడ, తొడపై శ్రీసతితోడ ఈ సుగ్రీవనరసింహుడు పంతములకేరలీ” అంటున్నారు. ఈయన కంఠము సుగ్రీవమట. అందంగావున్న కంఠస్వరం అన్నమాట. ఈయన పాదాలు పువ్వుల్లా వున్నాయట. వేంకటగిరి మీదనున్న సుగ్రీవనరసింహుని కీర్తించండి అంటున్నారు.

భావ వివరణ:

దొరతనముతోడ (సర్వేశ్వరుని ఠీవితో) తనతొడపై శ్రీదేవితో ఈ సుగ్రీవనారసింహుడు (చక్కటి కంఠధ్వనిగల నరసింహుడు), కేరడి పంతములవాడు (మిక్కుటమైన పట్టుదలగలవాడు).

ఈయన యెలావున్నాడో చూడండి. ఇతను నిక్కిన కర్ణములతో (నిక్కపొడుచుకొనిన చెవులతో) నిట్టచూపుగుడ్లతో (మిడిగుడ్లతో). దట్టమైన పెద్ద మీసాలతో, వెక్కసపు (భీతినిగొలుపు) నోటితోను, వెలయు (మెరయుచున్న) బుగ్గలతోను, క్రిక్కిరిసిన నవ్వులతోనూ (దట్టమైన నవ్వులు చిందించుచూ) ఈ సుగ్రీవ నారసింహుడు దర్శనమొసగుచున్నాడు.

ఈయన చల్లునూరుపులతో వున్నాడు. (వెలువడునప్పుడు విస్తరించుచున్న నిశ్వాసములతో వున్నాడు.) వున్నాడు.) ఈ చతుర్భుజుని, రెండుచేతులలో శంఖచక్రములన్నవి. అధికముగ వేయి కరములతో ఈ స్వామి వెలసియున్నాడు. ఈయన తెల్లని మేనితో (దేహంతో) దిండ్లవంటి పిరుదులతోనున్నాడు. ఈయన కెల్లురేగిన (పెల్లుబికిన) కరుణ మూర్తీభవించినట్లున్నాడు. ఈ సుగ్రీవనారసింహుని చూచి తరించండి.

ఈ దేవదేవుడు విరులవంటి (పుష్పములవలె సున్నితమైన) పాదములను కలిగియున్నాడు. విరివిగానున్న సొమ్ములు (ఆభరణములతోనున్నాడు). తిరమైన (స్థిరమైన) కోటి సూర్యులకాంతితో వెలుగొందుచున్నాడు. మెడలో ఈ స్వామి అనేక పుష్పహారములను ధరించియున్నాడు. వింతగా ఈ సుగ్రీవనారసింహుడు వేడుకతో శ్రీ వేంకటగిరిమీద వేంకటేశ్వరుడై వెలసియున్నాడు. ఈ స్వామిని చూచి భక్తితో మొక్కండి.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Vari Vari Bhagyamulu Vrasivunnavi Nosalla In Telugu – వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల

వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల
సంఖ్య : 270
పుట: 181
రాగం: రామక్రియ

రామక్రియ

52 వారి వారి భాగ్యములు వ్రాసి వున్నవి నొసళ్ల
ధీరతతో నేది మేలో తెలుసుకోరో

||పల్లవి||

అట్టే కొందరు మతము లన్నియు నేకమని
పట్టవర్ధనము నెత్తిఁబెట్టి చూపిరి
జట్టిఁ గొందరు జీవులు జంగమే లింగముగాని-
పుట్టుగెల్లా భస్మమని పూసుక చూపిరి

||వారి||

కొంద రేమియును లేదు కొట్టఁగొన లయమని
అంది వట్టిలలాటశూన్యము చూపిరి
కందువఁ గొందరు లక్ష్మీకాంతుఁ డంతరాత్మయని
ముందే నామము శ్రీచూర్ణమునుఁ బెట్టి చూపిరి

||వారి||

చెలఁగి దిష్ట మిపుడు శ్రీవేంకటేశుఁడు
అలమేలుమంగపతి యై యున్నవాఁడు
యిలవీర నీదాసుల కిట్టిభాగ్య రేఖలు
వలసినవారికెల్లా వ్రాసినాఁ డితఁడు

||వారి||270

అవతారిక:

“ఎంత మాత్రమున నెవ్వరు తలచిన అంతమాత్రమె నీవు” అనే అన్నమాచార్యుల వారి కీర్తనలో అన్న విషయాన్నే ఈ కీర్తనలోనూ ప్రస్తావిస్తున్నారు. ఎవరి భాగ్యంయెట్లా వుంటుందో వారి నొసటిపై విధాత వ్రాసి భూమిపైకి పంపిస్తాడని పెద్దవాళ్ళు చెబుతారు. ఎవరికేది మేలో ఏమిచెయ్యాలో ఎవరికివారే ధైర్యంతో ఆలోచించి తెలుసుకోవాలి అని అంటున్నారు శ్రీవేంకటేశుని దాసులు భాగ్యరేఖలు మాత్రం వారికెట్టాకావాలో అట్లా వ్రాస్తాడట.. ఆవిధాత. ఎందుకని? ఆయన దిష్ట అందుకని. దిష్ట అంటే అదృష్ట ప్రదాత అని చెప్పుకోవచ్చును. ఇది జటిలమైన కీర్తన అని విడిగా చెప్పనక్కరలేదు కదా!

భావ వివరణ:

ఓ ప్రజలారా! వారి భాగ్యములు (ఎవ్వరికి ప్రాప్తించెడి భాగ్యములు) వారి నొసళ్ళ (అవ్వారి నుదుటి భాగములలో) వ్రాసివున్నవి, (విధాత చేత పుట్టుకనాడే వ్రాయబడినవి). ఈ విషయాన్ని ధీరతతో తెలుసుకోరో! (ధైర్యంతో తెలుసుకోండయ్యా!) ఈ ప్రపంచంలో వేర్వేరు మతస్థులు వేర్వేరు నమ్మకాలతోవుంటారు.అ ట్టె (అదేవిధంగా) కొందరు మతములన్నియు ఏకమని (ఒక్కటేనని) పట్టవర్ధనము (నొసటిపై ధరించు ఒకరకమైన బొట్టు) నెత్తిబెట్టి (నుదుట ధరించి) చూపిరి. జట్టి (నిర్ణయించి) కొందరు జీవులు, జంగమే (శివుడే) లింగమ రూపంలో వుంటాడని జీవితాంతంలో పుట్టుకలన్నీ బూడిదయ్యేవేనని నమ్మి తమ శరీరమంతా భస్మము వ్రాసుకొని జీవిస్తారు. అది వారి నమ్మకం మనమెలా కాదనగలము? కొందరు శూన్యవాదులున్నారు. వారు పాపపుణ్యాలు రెండూ లేవంటారు. అసలు భగవంతుడే లేడు అంటారు. కొట్టకొనలయము (చిట్టచివరికి చావు తప్పదు కాబట్టి, మంచివాడు చెడ్డవాడు ఇద్దరూ చావక తప్పదు కనుక, ఏమీ అవసరంలేదని, వట్టి లలాటము (బోసిగావున్న నుదురుతో బొట్టులేకుండా శూన్యముగావున్న నొసలు) చూపిరి. కందువ (సామర్థ్యంగల) కొందరు లక్ష్మీపతియైన శ్రీహరియే అంతరాత్ముడని తమ నొసటిపై ఎచూర్ణము (తిరుచూర్ణము, పంగనామాలుగా ధరించి చూపిరి.

ఇప్పుడు శ్రీవేంకటేశ్వరుడు దిష్టము వలె (అదృష్టప్రదాతగా) చెలగి (అతిశయించగా) సిరులరాణియైన అలమేల్మంగమ్మ పతియైయున్నవాడు. అందుకని ‘యిల’ (ఈలోకంలో) వీర (వీరే… అంటే… అదేవీ ఆవిడ భర్తా) నీదాసులకు (హరిదాసులకు) ఇట్టి భాగ్యరేఖలు, వారికెల్లా వలసిన విధముగా (వారు కోరిన విధముగా) ఇతడు విధాత రూపంలో వారి భాగ్యం వారి నొసళ్ళపై వ్రాస్తాడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Vinavamma Janaki Nivibhudintesesinadu In Telugu – వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు

వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు
సంఖ్య : 462
పుట: 311
రాగం: రామక్రియ

రామక్రియ

51 వినవమ్మ జానకి నీవిభుఁ డింతసేసినాఁడు
యెనసి యీరఘరాముఁ డిఁక నేమి సేసునో

||పల్లవి||

వానరులదండు గూడి వారధి కొండలఁ గట్టె
ఆని లంక చుట్టిరా నదే విడిసె
కోనలఁ ద్రికూటమెక్కె గొడగులన్నియుఁ జెక్కె
యేనెపాన రఘురాముఁ డిఁక నేమిసేసునో

||విన||

కోరి ఇంద్రజిత్తుఁ జంపె కుంబకర్ణు నిర్జించె
గోరదానవులనెల్ల కూలఁగుమ్మెను
మారణహెూమము నేనె మతకమింతాఁ జెరిచె
యీరసాన రఘురాముఁ డిఁక నేమిసేసునో

||విన||

లావున రావణుఁ జంపె లంక విభీషణు కిచ్చె
చేవల నోసీత నిన్నుఁ జెకొనెను
భావించి శ్రీవేంకటాద్రిఁ బట్టము దాఁ గట్టుకొనె
యీవలనావల నాతఁ డిఁక నేమిసేసునో

||విన||462

అవతారిక:

ఇటువంటి కీర్తన నభూతో న భవిష్యతి అని గట్టిగా చెప్పగలను. ఎందుకంటే గతంలో “ఓ సీతమ్మ తల్లీ! నను బ్రోవమని చెప్పవే” అని మొరబెట్టిన వారున్నారు. తల్లీ! నీవు సాక్షాత్తు లక్ష్మీదేవివమ్మా! అని కీర్తించినవారున్నారు కాని తానే ఒక రామదూత కపియై శ్రీరాముని శత్రు నిర్మూలనం సీతమ్మకు వర్ణించి వివరించటం యెన్నడూ యెరుగము. అన్నమాచార్యుని కృపచేత ఈ కీర్తన రూపంలో ఆలోటు తీరింది. “ఓ జానకమ్మా! మీ ఆయన యేమి చేశాడో వినవమ్మా! ఈయనగారు తిరుమల కొండలెక్కాడు. ఇకపై యేమిచేస్తాడో తెలియకుండావున్నది” అంటున్నారు, నభవిష్యతి- అని ఎందుకన్నానంటే ఈ తెలుగు పాండిత్యం వున్న మొనగాడెవడండీ…

భావ వివరణ:

ఓ జానకీదేవీ! ఇది వినవమ్మా! నీ విబుడు (నీభర్తయైన శ్రీరాముడు) ఇంసేసినాడు, ఇన్ని వీరోచితకార్యములను చేసినాడు. ఈ రగురాముడు, ఎనసి (పూని) ఇకన్ యేమిసేసునో!! ఇంకా ఏమిచేస్తాడో యేమో!!

నీ భర్త వానరదండు (కపులసేనతో కూడి కొండలతో వారధిగట్టె (సేతువును నిర్మించినాడమ్మా!) ఆపైన ఈ లంక చుట్టిరా (చుట్టూతా) అదే తన సైన్యంతో విడిసె (విడిది యేర్పరచుకొనినాడు) అదిగో ఆ లోయలవైపునుంచి చిత్రకూట పర్వతమునెక్కినాడు. ఆయనశక్తిసామర్థాల గురించి చెవులు కొరుక్కున్నవారి గొడుగులన్నిటికీ (గొణుక్కోవటాలకన్నింటికీ) చెక్కె (చెక్కినట్లు సమాధానమిచ్చాడు. ఈ రఘురాముడు ఇకపై యేనెపానటేమిసేసునో!! (దేనికోసం యేమిచేస్తాడో చెప్పలేము తల్లీ!)

కోరి ఇంద్రజిత్తుని జంపె (సీతాపరహరణంలో అతని పాత్రయేమీ లేకపోయినా, వాడు రావణుని ఆత్మజుడు కావున లక్ష్మణునితో చంపించాడు). అనేక వానరులను మూకొమ్మడిగాచంపాడని కుంభకర్ణుని తెగవేసినాడు. ఘోరమైన దానవులను కూలగమ్మె (కూలవేసినాడు). మతకమంతా జెరిచి (రాక్షసమాయను పటాపంచెలము చేసెను). రణరంగంలో మారణ హెూమం (మృత్యుహెూమం) చేశాడు ఈ రఘురాముడు, ఈరసానవున్నాడు (కోపముచేత వివశుడైయున్నాడు. ఇంకాయేమిసేసునో!!

ఆపైన రావణాసురుని లావున (ధైర్యముతో) చంపెను. లంకానగరానికి విభీషణుని పట్టాభిషిక్తునిచేశాడు. ఓ సీతా! ఆయన ఇక నిన్న చేవల చేకొనును (వశమై చేపట్టును). భావించి (ఆశ్రీరాముడే ఈ శ్రీవేంకటేశ్వరునిగా యెంచి) తాను శ్రీవేంకటాద్రిని, పట్టము కట్టుకొన్నాడు (పట్టాభిషిక్తుడయ్యాడు). ఈవల నావల (ఇక్కడ తిరుమలలోను అక్కడ అయోధ్యలోను) అతడు ఇక నేమిసేసునో!! ఎవరు చెప్పగలరు?

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sri Sainatha Dandakam In Telugu – శ్రీ సాయినాథుని దండకం

Sri Sainatha Dandakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయినాథుని దండకం గురించి తెలుసుకుందాం…

శ్రీ సాయినాథుని దండకం

శ్రీసాయిబాబా! దయాసాంద్ర! త్రిమూర్త్యాత్మకా! శ్రీదత్త, శివ, రామకృష్ణ, మారుత్యాది దివ్యావతార స్వరూప! ఈ ధరిత్రిన్ భక్తులన్ రక్షింప లీలతో దేహమున్దాల్చి నీ పూజలన్, నీ సేవలన్, నీ నామ సంకీర్తనల్ జేయు భక్తాళికిన్,భక్తియున్, భుక్తియున్, ముక్తియున్ గూర్చి యావత్తులన్ బాపి, యోగంబు,క్షేమంబుజేకూర్చి రక్షించు దివ్యస్వభావా! నమస్కార మర్పింతు, లోకంబులో జాతిభేధాలు గల్పించు కొన్నట్టివేగాని సత్యంబుగా లేవులేవం చు భక్తాళికిన్ విశ్వప్రేమంబుజాటు చందబునన్ ప్రతిగ్రామంబులో విఫ్రిగే హంబులోజన్మమున్ గాంచి బాలుండవైయుండ, నీ తల్లిదండ్రుల్ ఫకీరొ క్కనింగాంచి నిన్నిచ్చివేయంగ అయిదేడు లా సాధుపోష్యంబులో నుండి, యా పిమ్మటన్ వెంకుసా పేరుతో నొప్పు నాదేశముఖ్యుండు, గోపాలరా యుండు,నిన్ చెంతకుజేర్చి సద్భోదనలే జేసి, జ్ఞానోపదేశంబుగావించి, నిన్నంపివేయంగ, నీ సంగతులీదేశమందెవ్వరున్ గాంచకుండగ సంచార మున్జేసి, యష్టాదశాబ్దంబులున్ బ్రాయమొప్పారగా, పూర్వపుణ్యంబు పక్వంబుగానొప్పు గోదావరి తీరప్రాంతంబులోనున్న షిరిడీయను గ్రామంబు నన్ జొచ్చి యచ్చోటనున్నట్టి యావేపవృక్షంబు క్రిందన్ మాహాప్రీతితో నిల్చి, నీవచటన్ క్రిందగూర్చున్న, యా కొమ్మకున్ చాలామాధుర్యయుక్తం బులౌ యాకులంగూర్చి, యాచెంతనన్ పాడుబడ్డట్టిచోటన్ మసీదొక్కటిన్ గాంచి, యచ్చోటనే సుస్థిరం బై నివాసంబుజేయంగ కాంక్షించి, యద్ధానికిన్ ద్వారకామాయి నామంబు గల్పించి, నీ చెంతకున్ కర్మశేవంబుతో జేరునా శక్యంబైనా? యాకాశభాగంబునన్ పక్షీ బృందంబు పైపైకి తాబోవునేగాని యంతంబు మంగాంచగానోపునే! యట్లు నీ దివ్యమౌ వైభవంబులెల్ల నేన న్నంగరీతి వీలౌను? ప్రాపంచికార్ధంబులన్ గోరునవ్వారికిన్ గొప్ప ఉద్యోగ ముల్, ద్రవ్యలాభంబులున్, సత్సంతానమున్, జేకూర్చుచున్, కొందరిన్ సర్వలోకాధినాథుండు సర్వేశ్వరుడైన యాదేవుపై భక్తిభావంబు సూచింపు చున్. కొందరిన్ ముక్తిమార్గంబు కాంక్షించు మర్త్యావళికిన్ జేరి దృశ్యంబు నిశ్యంబు జీవేశ్వరుల్ వేరుగారంచు నాత్మానుసంధానుభావంబు బోధించు చున్, కొందరున్ బ్రోచిపంచ ప్రదేశంబులన్ దెచ్చుకొన్నట్టి భిక్షాన్న మున్ది నుచు, రోజంతయు పుష్కలంబైనట్టి ద్రవ్యంబుతోడన్ మహావైభవోపేతుడై యుండి, సాయంత్రమౌవేళకున్, సర్వమున్, సాధులోకాళికిన్ ఖర్చు గావిం చి పూర్వంబురీతిన్ ఫకీరై మదిన్ భేదభావంబు లేకుండగా నందరిన్ జేర్చి, నీ పైన భారంబుసర్వంబునున్ వైచి సద్గురుడంచునినే సదా నమ్మి సేవించు జీవాళికార్యంబులెల్లన్ సానుకూలంబుగా దీర్చుచున్ కొంగుబం గారమైవారి రక్షించి సద్భక్త చింతామణీ! నేడు నీ దివ్యపాదాబ్జముల్గాక, గత్యంతరంబేమీ లేదంచు, నీవే శరణ్యంబంచు నీ చెంతకున్ జేరు మమ్మె ల్లరన్ గాపాడుతూ దీనబంధూ, మహాదేవ! దయాసింధు! శ్రీసాయినాధా! నమస్తే నమస్తే నమః

మరిన్ని దండకములు:

Malasi Chudaro Maga Simham In Telugu – మలసీ చూడరో మగ సింహము

మలసీ చూడరో మగ సింహము – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో మలసీ చూడరో మగ సింహము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

మలసీ చూడరో మగ సింహము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 1
కీర్తన : మలసీ చూడరో మగ సింహము
సంఖ్య: 13
పుట: 9
రాగం: హిందోళ

హిందోళ

66 మలసీ చూడరో మగ సింహము
అలవి మీరిన మాయల సింహము

||పల్లవి||

అదివో చూడరో ఆదిమపురుషుని
పెదయౌభళము మీది పెనుసింహము
వెదకి బ్రహ్మాదులు వేదాంత తతులు
కదిసి కానగలేని ఘనసింహము

||లలల||

మెచ్చిమెచ్చి చూడరో మితిమీరినయట్టి
చిచ్చరకంటితోడి జిగి సింహము
తచ్చిన వారధిలోన తరుణి కౌగిట జేర్చి
నచ్చిన గోళ్ళ శ్రీనరసింహము

||లలల||

బింకమున చూడరో పిరితియ్యక నేడు
అంకపు దనుజ సంహార సింహము
వేంకటనగముపై వేదాచలము పై
కింక లేక వడి పెరిగిన సింహము

||లలల||

అవతారిక:

మలసి చూడరో (ఉద్యమించి చూడండయ్యా!) అంటున్నారు అన్నమాచార్యులవారు. ఎవరిని చూడాలి? ఈ మగసింహమును. అది మామూలు మగ సింగము కూడా కాదు అలవి మాలిన మాయల సింగమట. అహెూబల నృసింహునిపై చెప్పిన ఈ కీర్తనలో యెన్నో తెలియని విశేషాలున్నాయి. జాగ్రత్తగా చదివి ఆకలనం చేసికొనండి. చిచ్చరకంటితో అంటే అగ్నిని కురిపిస్తున్న కన్నులతో, జిగి సింహము మెరిసిపోతున్న సింహమట. వేంకటగిరి (తిరుమల) లోనూ వేదాచలంలో (అహెూబలం) లోనూ వున్నదొక్కరేనట. ఈయన, కింక లేక (కోపమును విడనాడి) వడి పెరిగిన సింహమట. అంటే యేమిటో!

భావ వివరణ:

ఓ భక్తులారా! ఈ మగసింహము (మొండెము మగవాడు, తల సింహపుది అయిన నరసింహుడు) కనువిందు చేయుచున్నాడు. ఈయనను చూడరో (చూడండయ్యా!) ఈయన అలవిమీరిన (అశక్యమైన) మాయల సింహము (లీలలు కలిగిన నరసింహుడు).

అదిగో ఈ ఆదిపురుషుని చూడండయ్యా! ఈయనే నారాయణుడు, ఈయన ఇప్పుడు పెదయౌబళమున (అహెూబలమునందు) పెనుసింహము (పెద్ద నరసింహుని) వలెనున్నాడు. బ్రహ్మాది దేవతలుగాని వేదాంత తతులు (వేదవేదాంగములు) గాని, వెదకి (ఆయనకోసం గాలించినా) కదిసి కానలేని (సరిగ్గా కనుగొనలేకపోయిన) నరసింహము.

ఈ జిగిసింహము (కాంతులు వెదజల్లు నృసింహుడు) చిచ్చర కంటితో (అగ్నిశిఖలు వెదజల్లు ఫాలనేత్రముతో వుజ్వలముగా ప్రకాశించుచుండగా మితిమీరియున్నాడు (అతిశయించినాడు). మెచ్చి మెచ్చి (బాగుగా కీర్తించుచూ) చూడరో (ఈ స్వామి దర్శనం చేసికోండి). తచ్చిన (కిక్కిరిసియున్న) వారధిలోన (నది రెండు ఒడ్డులను కలుపు వంతెనలో) నచ్చిన తరుణిని (తన హృదయేశ్వరి అయిన శ్రీలక్ష్మిని గోళ్ళతో గిలిగింతలిడుచున్న నృసింహుని చూడండి.

ఈయన ఉగ్రనరసింహుడే, కాని భక్తవత్సలుడు. నేడు పిరుదియ్యక (భయపడక) బింకమున చూడరో (ధైర్యంగా చూడండయ్యా!) దనుజుని (హిరణ్యకశిపుని) అంకమున (ఒడిలో కూర్చొనబెట్టుకొని సంహరించాడు. ఈ నృసింహుని కొలవండి. ఈయన కింకలేక (కోపమును వుపసంహరించుకొని) వడి పెరిగెను (త్వరగా ప్రీతిపాత్రుడైనాడు). తిరుమలవేంకటేశ్వరుడు ఈయనే అహెూబల నరసింహుడు ఈ దేవుడే.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Daridraya Dahana Shiva Stotram In Telugu – దారిద్ర్యదహన స్తోత్రమ్

Daridraya Dahana Shiva Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దారిద్ర్యదహన స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Daridraya Dahana Shiva Stotram Lyrics

దారిద్ర్యదహన స్తోత్రమ్

శ్రీ వశిష్ఠ మహాముని కృతమ్

విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర థారణాయ |
కర్పూరకాంతి ధవళాయ జటాధరరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ ॥

1

గౌరీప్రియాయ రజనీశ కలాధరరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ |
గంగాధరాయ గజరాజ విమర్దనాయ

||దారిద్య్ర || 2

భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖభవసాగర తారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ

||దారిద్య్ర || 3

చర్మాంబరాయ శవ భస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ |
మంజీర పాద యుగళాయ జటాధరాయ

||దారిద్య్ర || 4

పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
హేమాంశుకాయ భువన త్రయ మండితాయ |
ఆనందభూమి వరదాయ తమోతమయాయ

||దారిద్య్ర || 5

భానుప్రియాయ భవసాగరతారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ |
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ

||దారిద్య్ర || 6

రామప్రియాయ రఘునాథ వరప్రదాయ
నా(గ)మప్రియాయ నరకార్ణవతారణాయ |
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ

||దారిద్య్ర || 7

ము(క్తే)క్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ |
మాతంగ చర్మవసనాయ మహేశ్వరాయ

||దారిద్య్ర || 8

వశిష్ఠనకృతస్తోత్రం సర్వరోగ నివారణమ్ |
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ ||
త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం సహి స్వర్గ మవాప్నుయాత్.

ఇతి శ్రీవశిష్ఠ విరచితం దారిద్ర్యదహన స్తోత్రమ్

మరిన్ని స్తోత్రములు

Sri Katyayini Devi Ashtottara Shatanamavali In Telugu – శ్రీ కాత్యాయనీ దేవీ అష్టోత్తర శతనామావళి

Sri Katyayini Devi Ashtottara Shatanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ కాత్యాయనీ దేవీ అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం…

Sri Katyayini Devi Ashtottara Shatanamavali In Telugu

శ్రీ కాత్యాయనీ దేవీ అష్టోత్తర శతనామావళి

  • ఓం గౌర్యై నమః
  • ఓం గిరిజాతనుభావాయై నమః
  • ఓం జగన్మాత్రే నమః
  • ఓం వీరభద్ర ప్రసువే నమః
  • ఓం విశ్వరూపిన్యై నమః
  • ఓం కష్ట దారిద్రషమన్యై నమః
  • ఓం శామ్భావ్యై నమః
  • ఓం బాలాయై నమః
  • ఓం భాద్రదాయిన్యై నమః
  • ఓం సర్వ మంగలాయై నమః
  • ఓం మహేశ్వర్యై నమః
  • ఓం మంత్రారాధ్యై నమః
  • ఓం హేమాద్రిజాయై నమః
  • ఓం పార్వత్యై నమః
  • ఓం నారాయణంశాజాయై నమః
  • ఓం నిరీశాయై నమః
  • ఓం అమ్బికాయై నమః
  • ఓం ముని సంసేవ్యాయై నమః
  • ఓం మేనకాత్మజాయై నమః
  • ఓం కన్యకాయై నమః
  • ఓం కలిదోష నివారిన్యై నమః
  • ఓం గణేశ జనన్యై నమః
  • ఓం గుహామ్బికాయై నమః
  • ఓం గంగాధర కుతుమ్బిన్యై నమః
  • ఓం విశ్వా వ్యాపిన్యై నమః
  • ఓం అష్టమూర్తాత్మికాయై నమః
  • ఓం శివాయై నమః
  • ఓం శాంకర్యై నమః
  • ఓం భావాన్యై నమః
  • ఓం మాంగల్య దాయిన్యై నమః
  • ఓం మంజు భాశిన్యై నమః
  • మహా మాయాయై నమః
  • ఓం మహా బలాయై నమః
  • ఓం హేమవత్యై నమః
  • ఓం పాప నాశిన్యై నమః
  • ఓం నిత్యాయై నమః
  • ఓం నిర్మలాయై నమః
  • ఓం మ్రుదాన్యై నమః
  • ఓం మానిన్యై నమః
  • ఓం కుమార్యై నమః
  • ఓం దుర్గాయై నమః
  • ఓం కాత్యాయిన్యై నమః
  • ఓం కలార్చితాయై నమః
  • ఓం క్రుపాపూర్నాయై నమః
  • ఓం సర్వమయి నమః
  • ఓం సరస్వత్యై నమః
  • ఓం అమర సంసేవ్యాయై నమః
  • ఓం అమ్రుతెశ్వర్యై నమః
  • ఓం సుఖచ్చిత్పుదారాయై నమః
  • ఓం బాల్యారాదిత భూతదాయై నమః
  • ఓం హిరణ్మయై నమః
  • ఓం సూక్ష్మాయై నమః
  • ఓం హరిద్రా కుంకుమా రాధ్యాయై నమః
  • ఓం సర్వ భోగాప్రదాయై నమః
  • ఓం సామ శిఖరాయై నమః
  • ఓం కర్మ బ్రమ్యై నమః
  • ఓం ఓం వాంచితార్ధ యై నమః
  • ఓం చిదంబర శరీరిన్యై నమః
  • ఓం దేవ్యై నమః
  • ఓం కమలాయై నమః
  • ఓం మార్కందేయవర ప్రదాయి నమః
  • ఓం పున్యాయై నమః
  • ఓం సత్యధర్మరతాయై నమః
  • ఓం శశాంక రూపిన్యై నమః
  • ఓం భాగాలాయై నమః
  • ఓం మాత్రుకాయై నమః
  • ఓం శూలిన్యై నమః
  • ఓం సత్యై నమః
  • ఓం కల్యాన్యై నమః
  • ఓం సౌభాగ్యదాయిన్యై నమః
  • ఓం అమలాయై నమః
  • ఓం అన్నపూర్ణాయై నమః
  • ఓం అఖిలాగమ సంస్తుతాయై నమః
  • ఓం అమ్బాయై నమః
  • ఓం భానుకోటి సముద్యతాయై నమః
  • ఓం పరాయి నమః
  • ఓం శీతాంశు కృత శేఖరాయై నమః
  • ఓం సర్వ కాల సుమంగళ్యై నమః
  • ఓం సామ శిఖరాయై నమః
  • ఓం వేదాంగ లక్షణా యై నమః
  • ఓం కామ కలనాయై నమః
  • ఓం చంద్రార్క యుత తాటంకాయై నమః
  • ఓం శ్రీ చక్ర వాసిన్యై నమః
  • ఓం కామేశ్వర పత్న్యై నమః
  • ఓం మురారి ప్రియార్దాన్గై నమః
  • ఓం పుత్ర పౌత్ర వర ప్రదాయి నమః
  • ఓం పురుషార్ధ ప్రదాయి నమః
  • ఓం సర్వ సాక్షిన్యై నమః
  • ఓం శ్యామలాయై నమః
  • ఓం చంద్యై నమః
  • ఓం భాగామాలిన్యై నమః
  • ఓం విరజాయై నమః
  • ఓం స్వాహాయై నమః
  • ఓం ప్రత్యంగి రామ్బికాయై
  • నమః ఓం దాక్షాయిన్యై నమః
  • ఓం సూర్య వస్తూత్తమాయై నమః
  • ఓం శ్రీ విద్యాయై నమః
  • ఓం ప్రనవాద్యై నమః
  • ఓం త్రిపురాయై నమః
  • ఓం షోడశాక్షర దేవతాయై నమః
  • ఓం స్వధాయై నమః
  • ఓం ఆర్యాయై నమః
  • ఓం దీక్షాయై నమః
  • ఓం శివాభిదానాయై నమః
  • ఓం ప్రణ వార్థ స్వరూపిన్యై నమః
  • ఓం నాద రూపాయి నమః
  • ఓం త్రిగునామ్బికాయై నమః
  • ఓం శ్రీ మహాగౌర్యై నమః
  • ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః

ఇతి అష్టోత్తర శతనామ పూజ

మరిన్ని అష్టోత్తరములు:

Tagu Munulu Rushulu Tapamulu Seyaga In Telugu – తగు మునులు ఋషులు తపముల సేయగ

తగు మునులు ఋషులు తపముల సేయగ - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో తగు మునులు ఋషులు తపముల సేయగ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

తగు మునులు ఋషులు తపముల సేయగ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 2
కీర్తన : తగు మునులు ఋషులు తపముల సేయగ
సంఖ్య : 315
పుట : 213
రాగం : ధన్యాసి

ధన్యాసి

35 తగు మునులు ఋషులు తపములు సేయఁగ
గగనము మోచియుఁ గర్మము దెగదా.

||పల్లవి||

ధరణీధర ముందరధర నగధర
చిరకౌస్తుభధర శ్రీధరా
కరిఁ గాచితి కాకముఁ గాచితి నీ-
కరుణకుఁ బాత్రము గలదిదియా.

||తగు||

భవహర మురహర భక్తిపాపహర
భువన భారహర పురహరా
కవిసినవురుతను గద్దను మెచ్చితి –
వివల నీదయకు నివియా గురుతు.

||తగు||

శ్రీవేంకటపతి శేషగరుడపతి
భూవనితాపతి భూతపతి
గోవుల నేలితి కోఁతుల నేలితి
పావనపుఁగృపకుఁ బాత్రము లివియా.

||తగు॥ 315

అవతారిక:

ముల్లోకాలలోను శ్రీహరిని వేడని వారెవరు? ఎంతోమంది ఋషులు, మునులు యెన్నెన్నో తపములు చేశారు ఆకాశాన్ని అందుకొనేంత కీర్తిని సంపాదించారు. కాని వారి కర్మములు పరిపక్వంచెంది తెగితేకాని వారికి నీ కృప కలుగదు. నీకృప వారికి యేజన్మలోనైనా యేక్షణాననైనా కలుగవచ్చును. అజ్ఞానంతో వారు నీకు అపకారం చేసినా వారు యెంత హీనస్థితిలోవున్నా పరిగెత్తి వారిని చేరి వారిని అక్కున చేర్చుకొంటావు. అన్నీ నీ అభయానికి పాత్రములే. కరిగాని, కాకిగాని, వుడతగాని, గద్దగాని, ఆవులుగాని, కోతులుగాని.. ఒక్కటనేమిటి యేదయినా నీ సంతతే, నీదే అనే కరుణ చూపిస్తావు. అందుకే నీవు జగత్పితవు అంటున్నారు అన్నమాచార్యులవారు. సాధ్యమైనంత వివరించటానికి ప్రయత్నించాను.

భావ వివరణ:

ఓ దేవదేవా! అనేకమంది ఋషులు, మునులు తగిన విధములుగా నీకోసం తపములనాచరించారు. కాని అందరికీ నీకృప కలిగిందా? ఆకాశాన్ని కొనే కీర్తి సంపాదించవచ్చు గాక! కాని కర్మము దీరక (పరిపక్వముకాక) నీకృప సిద్ధిస్తుందా?

ఓ భూరమణా! మందరగిరిధరా! నగధరా! (గోవర్ధనధారీ) ప్రఖ్యాతి చెందిన కౌస్తుభమణని ధరించినవాడా! శ్రీధరా! (శ్రీకాంతా!) నీలీలలనేమని వర్ణించను ప్రభూ! అలనాడు కరిని రక్షించావు (గజేంద్ర వరదుడు), కాకిని రక్షించావు (కాకాసురుని శిక్షింపబూనియు శరణంటే రక్షించాడు శ్రీరాముడు). నీ కరుణకు పాత్రులవ్వాలంటే హీనాధికములైన యేదైనా అర్హమే.

ఓ భవహరా! (పుట్టుక లేక చేయగల దేవా!) మురహర! (ముర అను అసురుని నిర్జించిన దేవా!) భక్త పాపహరా, ప్రపంచమున పాపుల భారమును నివారించువాడా! పురహరా! (త్రిపురాసురులను హరించినవాడా! నీ దయకు అర్హత యెవ్వరికైనా కలుగవచ్చును. ఆనాడు నీ రామావతారంలో, కవిసిన వుడుతకు (పరుగులు పెట్టి తన శరీరానికి ఇసుకను అంటించుకొని సేతువుపై విదిలించి సేతు నిర్మాణానికి తనదవంతు కృషి చేసిన ఒక చిన్ని ఉడుతకు మోక్షమిచ్చావు). గద్దయైన గరుత్మంతుని నీవాహనం చేసికొని గరుడ గమనుడవయ్యావు. వాటిని మెచ్చావు. అవల (ఆవిధంగా) వాటి జాతి మొత్తం ఈనాటికీ నీ గుర్తులను తమ శరీరంపై ధరించియున్నాయి.

ఓ శ్రీవేంకటాచలపతీ! శేషాద్రివాసా! గరుడాద్రివాసా! భూధరా! భూతపతీ! (సర్వ భూతముల ఆధారా!) నీ పావనమైన కృపకు పాత్రాపాత్ర భేదము లేదు. అందరికీ జీవనాధారమైన గోవులను కాచి గోవిందుడివైనట్లే, నిరుపయోగమైన కోతులకు కూడా క్రమశిక్షణ నేర్పి రామదండు చేశావు. ఎనలేని కీర్తినిచ్చావు. కరుణామూర్తీ! ఇంతకంటే యే నిరూపణలు ఇంతకంటే యే నిరూపణలు కావాలి తండ్రీ, నీవు కరుణాంతరంగుడవు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Shiva Ashtakam In Telugu – శివాష్టకమ్

శివాష్టకమ్ (Shivashtakam)

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Shiva Ashtakam Lyrics In Telugu

శివాష్టకమ్

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశాన మీడే.

1

గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం
జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభు మీశాన మీడే.

2

ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతమ్
అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభు మీశానమీడే.

3

వటాథో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశనం సదాసుప్రకాశమ్
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభు మీశానమీడే.

4

గిరీంద్రాత్మజాసంగృహీతార్థ దేహమరౌ సంస్థితం సర్పహారం సురేశం
పరబ్రహ్మ బ్రహ్మాదిభి ర్వంద్యమానం శివం శంకరం శంభు మీశాన మీడే.

5

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దధానం
బలీవర్ధయానం సురాణాం ప్రదానం శివం శంకరం శంభు మీశాన మీడే.

6

శరచ్ఛంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభు మీశాన మీడే.

7

హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభు మీశాన మీడే.

8

స్తవం యః ప్రభాతే నర శ్మూలపాణేః పఠేత్ సర్వదా భర్గసేవానురక్తః
సపుత్రం దనం ధ్యానమిత్రే కళత్రం విచిత్రం సమాసాద్య మోక్షంప్రయాంతి.

మరిన్ని అష్టకములు

Annitipainunnatlu Haripai Nundadu Mati In Telugu – అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి

అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి
సంఖ్య : 124
పుట : 83
రాగం: నారాయణి

నారాయణి

48 అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి
కన్నులఁ బ్రహ్లాదువలె కనుఁగొను టరుదా

||పల్లవి||

పులుగు నర్చిం చొకఁడు పూఁచెనాగత మెరిఁగి
వెలసి ఘనుఁడనంటా విఱ్ఱవీఁగీని
జలజాక్షుపాదములు సారె నర్చించేటివారు
ఇలలోనఁ బరమార్థ మెరుఁగుట యరుదా

॥అన్ని॥

మావోడ నమ్మొకఁడు మహాజలధి దాఁటి
నానార్ధములు గూర్చి నటియించీని
శ్రీనాథుపాదములు చేకొని నమ్మినవాఁడు
పూని భవవార్ధి దాఁటి పుణ్యమందు టరుదా

॥అన్ని॥

దీపమువట్టి యొకఁడు తెగనిచీఁకటిఁ బాసి
చూపుల నన్నిటిఁ గని సుఖమందీని
చేపట్టి పరంజ్యోతి శ్రీవేంకటేశు భక్తుఁ
డోపి ముక్తి కడగని వున్నతుఁడౌ టరుదా

॥అన్ని॥

అవతారిక:

ప్రహ్లాదునికి అందరిలోనూ హరియే కనుపించేవాడు. అన్నిటిలో వున్నది హరియే అని దృఢముగా నమ్మిన వానికే అది సాధ్యము. వారి వారి అభీష్టాలు నెరవేరుటతో మానవులు రకరకాల సాధనలను చేస్తారు. ప్రాపంచిక విషయాలలో కడతేరటం యేమంతకష్టం కాదు. శ్రీహరి శరణాగతుఉ వైకుంఠమ ఏ పొందగలరు; భవసాగరాన్ని సునాయాసంగా తరించగలరు; ముక్తిని కూడా పొందగలరు, ఎందుకంటే వారు పరంజ్యోతియైన శ్రీవేంకటేశ్వరుని భక్తులు కదా! అంటున్నారు అన్నమాచార్యులవారు.

భావ వివరణ:

అయ్యో! మతి (నామనస్సు) అన్నిటిపైన వున్నట్లు హరిపై నుండదు. ఏమి దౌర్భాగ్యము!! భక్త ప్రహ్లాదునివలె ఆ శ్రీహరిని కన్నుల యెదుట ప్రత్యక్షం చేసికొనుట అరుదా (అసంభవమా?) ఏమాత్రమూ కాదు.

ఇదివరలో ఒకడు గరుత్మంతుని అర్చించి ఆయన అనుగ్రహంతో ఆగతము (జరుగబోవునది) తెలిసికొని తానే ఘనుడనని విఱ్ఱవీగినాడు. అతడే అట్లయిన, ఆ గరుత్మంతుని అధిపతియైన జలజాక్షుడు శ్రీహరిపాదముల నర్చించువాడు, ఇలలో పరమార్థము నెరుగుట ఒక గొప్ప విషయమా?

మానివాడ (కొయ్యతో చేసిన ఓడ) నెక్కి మహాసముద్రములను దాటి రకరకములైన సంపదలను పొందుటకు అనేక నటనలు చేస్తాడు ఒకడు. వాడికే అటువంటి విశిష్టత కలిగితే ఇక శ్రీనాథుని పాదముల నాశ్రయించినవాడు భవసాగరమును దాటి పుణుడగుట అరుదా (అసంభవమైన విషయమా?) ఏమాత్రమూ కాదు.

ఒకానొకడు దీపమును తన చేత ధరించి తెగని చీకటి (అంతులేని అంధకారమును) అధిగమించి తన కళ్ళతో అన్నీ చూడగలిగి సుఖములననుభవించాడు. అటువంటప్పుడు పరంజ్యోతి అయిన శ్రీవేంకటేశ్వరుని భక్తుడు, ఓపి (ఓపికతో) ముక్తిని పొంది సర్వోన్నతుడవటం అరుదా (అసంభవమా?) ఏమాత్రం కాదు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు