Sri Aadi Lakshmi Ashtottara Shatanama Stotram In Telugu – శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం

Sri Aadi Lakshmi Ashtottara Sata Naamaavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

శ్రీ ఆదిలక్ష్మీ దేవి ఒక ప్రముఖ హిందూ దేవత. ఆమె లక్ష్మీ దేవియొక అవతారము. ఈ దేవి అమ్మవారిని ఆదిలక్ష్మీ అని పిలుస్తారు, అమ్మవారు సృష్టిచేసిన ప్రపంచమును తన సృష్టివిస్తారు అని నమ్ముతారు. ఆదిలక్ష్మీ ఆది లక్ష్మిని పిలుస్తుంది మరియు ఆమె దేవతల మొదటి మూర్తి. ఆదిలక్ష్మీదేవి పరమేశ్వరుడు వారిపై ఆశీర్వచనం ప్రసాదిస్తారు మరియు ఐశ్వర్యము మరియు భక్తులకు మహిమా ప్రదానం చేస్తారు. ఆమె శ్రీ విష్ణు సహితముగా సాయంకాలం పూజించబడుతారు మరియు ఆదిశేషుడు ఆమెని సాయంకాలం కనిపించే విధంగా ఉండాలి. ఆదిలక్ష్మీ సాయంకాలం మందిరాలలో ఆలంబనముగా ఉంటారు. ఆమె ఐశ్వర్యముతో లోకమును ఆకర్షించే విధంగా ఉంటారు.

శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామస్తోత్రం

శ్రీకాంతా శివసంధ్రాత్రీ శ్రీంకార పంజర శుకీ
శ్రీ పదాశ్రిత మందారా శ్రీకరీ భృ-గునందినీ 1

జితకోటి రతి సౌందర్యా జీవనరాగహేతవే
జీవనా జీవికా జీవా జీవనాచ జిజీవిషా 2

సుఖమూలా సుప్రియాచ సురాసుర సుసేవితా
అష్టలక్ష్మీ స్వరూపా చ ఆదిమూర్తి అనాహతా 3

అజితా విజితా సర్వజిద్దాసీభూత సురాంగనా
విష్ణుపత్ని ర్విశ్వరాజ్ఞీ ర్వేద వేదాంత చారిణీ 4

వేదమాతా విశ్వమాతా అనంతానంద ప్రదాయినీ
నిత్య ప్రకాశ స్వప్రకాశ స్వరూపిణీ నమో నమః 5

హృల్లేఖా పరమా శక్తి : మాతృకా బీజరూపిణీ
యజ్ఞ విద్యా మహవిద్యా గుహ్య విద్యా, విభావరీ 6

జ్యోతీష్మతీ మహామాతా సర్వమంత్ర ఫలప్రదా
గాయత్రీ సోమ సంభూతా సావిత్రీ ప్రణవాత్మికా 7

శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వదేవ నమస్కృతా
జయా జయకరీ విజయా జయంతీ చారాజితా 8

అష్టాంగ యోగినీదేవీ నిర్భీజా ధ్యానగోచరీ
సర్వతీర్థ స్థితా శుద్ధా సర్వ పర్వత వాసినీ 9

శివాధాత్రీ శుభానందా యజ్ఞ కర్మ స్వరూపిణీ
ప్రతినీ మేనకా దేవీ బ్రాహ్మాణీ బ్రహ్మచారిణీ 10

ఏకాక్షర పరా తారా భవబంధ వినాశిని
విశ్వంభరధరాధరా నిరాధారాధిక స్వరా 11

రాకాకూహూ రమా వాస్య పూర్ణిమానుమతీద్యుతిః
సినీవాలీ శివానీ చవ శ్యా వైశ్వదేవీ పిశంగిలా 12

పిప్పలాచ విశాలక్షీ రక్షోఘ్నీ వృష్టి కారిణీ
దుష్ట విద్రావిణీదేవి సర్వోప ద్రవనాశినీ 13

శారదా శర సంధాతా సర్వశస్త్ర స్వరూపిణీ
పంచవక్రాః దశభుజా శుద్ధ స్ఫటిక సన్నిభా 14

రక్తా కృష్ణా సితా పీతా సర్వవర్ణ నిరీశ్వరీ
పాతుమాం సర్వదాదేవీ ఆదిలక్ష్మీ నమో నమః 15

మరిన్ని అష్టోత్తరములు:

Sarveswara Nito Sariyevvaru In Telugu – సర్వేశ్వరా నీతో సరియెవ్వరు

సర్వేశ్వరా నీతో సరియెవ్వరు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో సర్వేశ్వరా నీతో సరియెవ్వరు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సర్వేశ్వరా నీతో సరియెవ్వరు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : సర్వేశ్వరా నీతో సరియెవ్వరు
సంఖ్య : 303
పుట: 203
రాగం: ముఖారి

ముఖారి

56 సర్వేశ్వరా నీతో సరి యెవ్వరు
పూర్వపువారు చెప్పఁగాఁ బూఁచి కొలిచిఏఁగాని

||పల్లవి||

చేరి వేదములు నిన్నుఁ జెప్పఁగా వినుటేకాని
నీరూపము దర్శించేవార లెవ్వరు
ధారుణిలో నీ యవతారాలే చూచుట
ధీరత నీమహిమలు తెలిపేవారెవ్వరు

||సర్వే||

భూమివాకరిఁ జూచి నిన్నుఁ బూజలు సేయుటగాని
కామించి నీతో మాటాడే ఘను లెవ్వరు
దీమసాన నీదాసుల ద్రిష్ట మెరుఁగుటగాని
యీమేర నీదైవిక మెరిఁగేనా రెవ్వరు

||సర్వే||

వరములు నీవియ్యఁగా వచ్చి సేవించుటగాని
కెరలి నీమూర్తి వెదకేవా రెవ్వరు
హరి శ్రీవేంకటేశా నీకరుణవారౌటగాని
ఆరసి నిన్ను సుద్దులడిగేవా రెవ్వరు

||సర్వే||

అవతారిక:

భూమి మీద ఇంతమంది ‘దేవుడు’ అని కొలిచే వాడిని చూసిందెవరు? పోనీ ఆ దేవుడి మాటలను విన్నదెవరు? పూర్వము వారు చెప్పగా ఔనేమో అనుకోవడమే కాని ఆయన అనుభవం పొందినవాడెవడు? సర్వేశ్వరుడైన ఆయనతో సరియైనవారు లేరు. ఆయననుంచి ఏవో వరాలు ఆశించి సేవించే వారేగాని వారేగాని ఆయనను తెలుసుకోవాలని తెలుసుకోవాలని వెదకేవారేలేరు అంటున్నారు అన్నమాచార్యులవారు. ఇదికూడా తేలిక అనిపించే అతి క్లిష్టమైన కీర్తన. ఈ కీర్తన పాడినప్పుడు ఆచార్యులవారి మనోభావాలు సులభగ్రాహ్యం అనిపించుటలేదు. జాగ్రత్తగా పరిశీలిద్దాం.

భావ వివరణ:

ఓ సర్వేశ్వరా! నీతో సరియైన వారలెవ్వరు? పూర్వపువారు (మా పెద్దలు) చెప్పగా ఔనేమో నని పూచి (ప్రయత్నపూర్వకంగా) కొలుస్తున్నాను. కానీ నిన్ను తెలుసుకోలేకున్నాను.

ప్రభూ! వేదము నీగురించి వర్ణించగా వినుటయే కాని నీ రూపమును దర్శించినవారలెవ్వరు? ధారుణి (భూలోకంలో) నీయవతారాలను చూచిన వారు ఆయా యుగాలలో వున్నారేమో గాని ధీరతతో (గాఢమైన నమ్మకంతో) నీ మహిమను తెలిసినవారెవ్వరు?

దేవా! ఈ భూమి మీద వున్న మాతోడి మానవులనుచూచి వారుచేసినట్లే నిన్ను పూజిస్తున్నాను. నిజానికి కావాలని ప్రయత్నించి నీతో మాట్లాడిన మానవమాత్రుడెవడు? అంతటి ఘనులెవ్వరైనా ఉన్నారా? దీమసాన (నేర్పుతో) నీదాసులయొక్క ద్రిష్టము (అదృష్టము) యెంతగొప్పదో తెలుసుకోవటమేకాని, యీమేర (వైపున నీ దైవికము (దివ్యశక్తిని) యెరిగే వారెవరున్నారు? అనుభవేక వేద్యమైన నీ మహిమ తెలియుటెట్లు సాధ్యము?

దేవా! నీవు కోరిన వరములిస్తావనే ఆశతో దూరభారమునెంచక నీవద్దకు వచ్చి సేవించేవారేగాని, కెరలి (అతిశయించి) నీ మూర్తిని (దివ్యమంగళ రూపాన్ని) వెదకే వారెవ్వరున్నారు? ఓ శ్రీహరీ! ఓ శ్రీవేంకటేశ్వరా! అంతా నీ కరుణ పొందాలనుకొనేవారే కాని, నిన్ను అరసి (నీపై దృష్టి సారించి) నీ సుద్దులు (నీపుణ్యకథలు) అడిగేవారెవ్వరు? (వినాలని తహతహలాడేదెవరు?) హతవిధీ! నేటి పరిస్థితి ఇంకా ఘోరంగా వున్నది తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Kalasaa Puramukada Gachkunnadu In Telugu – కలశాపురముకాడ గాచుకున్నాడు

కలశాపురముకాడ గాచుకున్నాడు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో కలశాపురముకాడ గాచుకున్నాడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కలశాపురముకాడ గాచుకున్నాడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : కలశాపురముకాడ గాచుకున్నాడు
సంఖ్య : 216
పుట: 145
రాగం: మాళవి

మాళవి

55 కలశాపురముకాడఁ గాచుకున్నాఁడు
వలసినవరాలిచ్చీ వాయునందనుఁడు

||పల్లవి||

మాయాబిలముచొచ్చి మగుడి యంబుధిలోని-
చాయాగ్రహముఁ జంపి చయ్యన దాఁటి
ఆయెడ లంకిణిఁ గొట్టి యంతలో జానకిఁగని
వాయువేగానవచ్చిన వాయునందనుఁడు

||కల||

కడలిదరినుండిన కపులతోఁ గూడుకొని
వడదీరఁగా మధువనము చొచ్చి
బడి రామునికి సీతాపరిణామమెల్లాఁ జెప్పె
వడిగలవాఁ డితఁడు వాయునందనుఁడు

||కల||

రావణాదిరాక్షసుల రామునిచే సాధింపించి
ఆ విభుని సీతఁ గూర్చి అయోధ్యనుంచె
శ్రీవేంకటేశుఁ గొల్చి శిష్టరక్షణమునకై
వావిరి నిలుచున్నాఁడు వాయునందనుఁడు

||కల|| 216

అవతారిక:

కలశాపురములో వెలసిన హనుమంతునిపై చక్కటి కీర్తన చెబుతున్నారు అన్నమాచార్యులవారు. వాయుసుతుడైన ఈ హనుమంతుడు తన భక్తులకు కావలసిన వరములనిస్తున్నాడు. ఆయన అందుకోసమే కాచుకొనివున్నాడు అంటున్నారు. ఆ హనుమంతుడు సీతను రామచంద్రుని కలిపి అయోధ్యనుంచే శ్రీవేంకటేశుని గొల్చి శిష్టరక్షణకై వావిరి నిలుచున్నాడట. అంటే ‘అధికుడై” నిలుచున్నాడట. పనిలోపనిగా హనుమంతుని ప్రతాపాన్ని వివరించే రామాయణ అంతర్గత కథలను వుటంకిస్తున్నారు.

భావ వివరణ:

ఈ వాయునందనుడైన హనుమంతుడు, కలశాపురము వద్ద కాచుకొని యున్నాడు. (నిరీక్షించుచున్నాడు). శ్రీరామ భక్తులకు, తనను నమ్మిన భక్తులకు ఆయన లెక్కకు మించిన వరములను అనుగ్రహించుచున్నాడు.

సీతాన్వేషణ సమయంలో మాయాబిలం (గుహ)లో ప్రవేశించిన వానరులు దిక్కుతోచక అల్లాడుతుంటే, ఆపద్భాంధవుడై ఆదుకొన్నదీ హనుమంతుడే. మగుడి (తదనంతరం) అంబుధి దాటే సమయంలో ‘సింహిక’ నీడ వలె తననాక్రమించి రామకార్య విఘాతమునకు వొడిగడితే దానిని చంపివేశాడు. లంకలో లంకిణిని ఒక్క గుద్దుతో మట్టి కరిపించాడు. అంతలో జగన్మాత జానకీదేవిని అశోకవనంలో చూచి రామకార్యం నెరవేర్చి వాయువేగాన తిరిగివచ్చి కపివర్యుల ప్రాణాలు నిలబెట్టాడు. ఈ వాయునందనుడు జగజ్జెట్టి.

ఆపైన కడలి దరి నుండిన కపులతో (సముద్రం ఒడ్డున తనకోసం నిరీక్షిస్తున్న వానరులతో) గూడుకొని (కలసి) వడదీరగ (అలసటనుపశమించుటకు) మధువనము ప్రవేశించి నానా అల్లరి చేశాడు. అటు పిమ్మట సత్వరమే రామునికి సీతాదేవి పరిణామము (వర్తమానము) నెల్లా వివరించాడు. ఈ వాయునందనుడు వడిగలవాడు (చాలా వేగము కలవాడు).

ఆ వెనుక జరిగిన రామరావణ యుద్ధంలో ఈయన పాత్ర మరువలేనిది. రావణాది రాక్షసులనందరిని రామునిచేత సాధింపించినవాడు (నెగ్గుటకు దోహదపడినవాడు) ఈయనే. ఆ విభునికి (శ్రీరామచంద్రునకు) సీతను గూర్చి (కలిపి) అయోధ్యలోవుంచి (పునః ప్రతిష్ఠించినాడు). నేడు ఈ కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడై నిలిచిన తన రాముని గొల్చుచున్నవాడై ఈనాటి ఆవశ్యకతననుసరించి శిష్ట రక్షణకై (సన్మార్గులను సంరక్షించుచూ ఈ వాయునందనుడు కలశాపురములో వావిరి (అధికుడై) నిలుచునియున్నాడు. ఈ స్వామిని సేవించి తరించండి.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Tholi Ekadashi In Telugu – తొలి ఏకాదశి విశిష్టత

Tholi Ekadashi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు తొలి ఏకాదశి విశిష్టత, తొలి ఏకాదశి  పండుగ ఎందుకు జరుపుకుంటారు, మరియు తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం.

పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.

తొలి ఏకాదశి విశిష్టత

సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసిన తరువాత వచ్చే మొదటి ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. మన పండగలన్నీ దీంతోనే మొదలవుతాయి. లోకంలో మోక్షగాములైన వారు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అంటే నాలుగు నెలలపాటు పుణ్య తిధులుగా భావించి ‘దేవశయని’ అనే వ్రతాన్ని చేస్తారు. సన్యాసులు, యతీశ్వరులు మొదలైన వారు కూడా ఈ కాలంలో ప్రయాణం చేయకుండా ఒక చోట స్థిరంగా ఉంటారు. దీన్నే ‘చాతుర్మాస్యము’ అంటారు.

ఒక రోజున ధర్మరాజుకు ఒక చిన్న అనుమానం వచ్చింది. మోక్షగాములు దేవశయని వ్రతాన్ని ఎందుకు చెయ్యాలి? ఇదే సమయంలో చాతుర్మాస్యము చెయ్యటానికి గల కారణాలేవి? తన అనుమానాన్ని తీర్చే వారెవరున్నారు? అని ఆలోచించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు తప్ప ఇంకెవరి వల్లా కాదని నిశ్చయించుకున్న వాడై, భగవానుడి దగ్గరకు వెళ్ళి ‘ఓ పరంధామా! పరాత్పరా! దేవశయని వ్రతాన్ని, చాతుర్మాస దీక్షను గురించి నాకు వివరించ వలసినది’ అని ప్రార్థించాడు. ధర్మజుని ప్రార్ధన ఆలకించిన భగవానుడు ఈ రకంగా చెప్పటం ప్రారంభించాడు.

‘ధర్మనందనా! ఆషాఢ శుద్ధ ఏకాదశి నే దేవశయనీ ఏకాదశి’ అని అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మోక్షం పొందాలనుకునే వారంతా ఈ రోజున దేవశయని వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజే చాతుర్మాస్యము కూడా ప్రారంభమవుతుంది.

సూర్యుడు కర్కాటకరాసి లోనికి వచ్చిన తరువాత ఆషాఢ శుద్ధ ఏకాదశిన శ్రీ మహావిష్ణువును పవళింప చెయ్యాలి. సూర్యుడు తులారాసిలో ప్రవేశించిన తరువాత అనగా కార్తీక మాసంలో తిరిగి ఆయనను మేల్కొల్పాలి. ఈ నాలుగు నెలల కాలము శ్రీహరి నిద్రావస్థ లో ఉంటాడు. ఇది వర్షా కాలము. అందుచేత యతీశ్వరులు, సన్యాసులు దేశాటన చెయ్యటానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి వారు ఏదో ఒక చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక బోధలు చేస్తుండాలి. ఇదే చాతుర్మాస్యము.

రాజా! ఏకాదశినాడు శ్రీ మహావిష్ణువు ప్రతిమకు పంచామృతా లతో చక్కగా స్నానంచేయించి, సుగంధ లేపనము కావించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి, ‘దేవదేవా! వర్షాకాలము నాలుగు నెలలు దాట నువ్వు తిరిగి, మేల్కొనే వరకు పరిశుద్ధమైన నియమాలతో నేను కాలం గడుపుతాను. ఏ అడ్డంకులూ లేకుండా ఈ వ్రతము పూర్తి అయ్యేటట్లు గా అనుగ్రహించ వలసినది’ అని ప్రార్థించి రెండు వైపులా తలగడతో, తెల్లని వస్త్రముతో శయ్యను ఏర్పాటుచేసి, ఆమహానుభావుని శయనింప చెయ్యాలి. ఆయన నిద్రిస్తే ఈ జగత్తు కూడా నిద్రిస్తుంది. ఆయన మేల్కొన్నప్పుడే ఈ జగత్తు మేల్కొంటుంది.

పాండవాగ్రజా! ఈ వ్రతాన్ని ఆషాడ శుద్ధ ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అష్టమి లేదా కర్కాటక సంక్రమణం జరిగిన రోజున ప్రారంభించి నాలుగు నెలల తరువాత కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశిన పూర్తిచెయ్యాలి. ఈ వ్రతం ఆరంభించటానికి మంచి చెడులతో పని లేదు. జనన మరణాల వలన కలిగే శౌచా శౌచములు చూడవలసిన పనిలేదు. స్త్రీ పురుష భేదము అంతకన్నా లేదు. ఈ వ్రత మాచరించిన వాడు మరణించిన తరువాత మిక్కిలి కాంతితో ప్రకాశిస్తూ, సూర్య తేజముగల విమాన మెక్కి విష్ణు లోకం చేరతాడు.

Tholi Ekadashi visishstata

చాతుర్మాస్య వ్రతం అనేక రకాలుగా ఆచరిస్తారు.

  1. ప్రతి రోజూ దేవాలయానికి వెళ్ళి అక్కడ అంతా శుభ్రం చేసి, నీళ్ళు చల్లి ఆవుపేడతో అలికి రంగవల్లులు తీర్చి దిద్దిన వాడు ఏడు జన్మల వరకు శ్రేష్ఠమైన బ్రాహ్మణ కులంలో పుట్టి సత్య ధర్మ పరాయణుడవుతాడు.
  2. ఈ నాలుగు నెలలూ శ్రీమహావిష్ణువును పంచామృతాలతో స్నానం చేయించినవాడు మరణానంతరము విష్ణులోకానికి వెళ్ళి సారూప్య ముక్తి పొందుతాడు. అంటే లక్ష్మీదేవి, శ్రీవత్సము, సృష్టి స్థితి లయ సామర్థ్యము తప్ప రూపు రేఖలు, భక్తుల కోరికలు తీర్చటములో శ్రీహరి రూపంలోనే ఉంటాడు.
  3. ఈ సమయంలో ఉత్తముడైన బ్రాహ్మణునికి భూదానం గాని, సువర్ణ దానం గాని చేసిన వాడు ఈ లోకంలో ఇంద్ర భోగాలనుభవించి, మరణానంతరము విష్ణులోకం చేరతాడు.
  4. చాతుర్మాస్యంలో ప్రతిరోజూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ, భగవంతు డికి నైవేద్యం సమర్పించేటప్పుడు బంగారు తామర పువ్వును సమర్పించిన వాడు ఈ లోకంలో అనంతమైన భోగాలనుభవించి, చివరకు స్వర్గం చేరతాడు.
  5. ఈ సమయంలో ప్రతిరోజూ హరిని తులసి దళాలతో అర్చించి, బంగారు తులసి దళము దానం చేసినవాడు విష్ణులోకం పొందుతాడు.
  6. వ్రత సమయంలో భగవంతునికి ధూప దీపాలు సమర్పించి, వ్రతాంతమున దీపపు కుందులు దానం చేసినవాడు గొప్ప శ్రీమంతుడవు తాడు. సకల సౌభాగ్యాలు పొందుతాడు.
  7. ఈ కాలంలో ప్రతి రోజూ రావి చెట్టుకు గాని, శ్రీమహావిష్ణువుకు గాని ప్రదక్షిణలు చేసినవాడు వైకుంఠం చేరతాడు.
  8. వ్రత సమయంలో ప్రతి రోజూ సాయంత్రం దేవుని సన్నిధిన దీపారాధన చేసి, వ్రత సమాప్తిన వస్త్రము, బంగారము, దీపపుకుంది. దానం చేసినవాడు ఈ లోకంలో మహా తేజస్వి అవుతాడు. మరణా నంతరము వైకుంఠంచేరతాడు.
  9. శ్రీమహావిష్ణువు పాదోదకాన్ని పానంచేసినవాడు విష్ణులోకం పొందుతాడు. అతడికి పునర్జన్మ ఉండదు.
  10. ఈ సమయంలో ప్రతిరోజూ మూడు వేళలా దేవాలయంలో 108 గాయత్రీ జపం చేసిన వాడికి పాపాలు అంటవు.
  11. చాతుర్మాస్యంలో ప్రతిరోజూ పురాణ శ్రవణంచేసి, వ్రతసమాప్తి యందు పుస్తకము, వస్త్రము, బంగారము దానంచేసినవాడు సకల భోగాలు అనుభవిస్తాడు.
  12. చాతుర్మాస్యంలో శివనామం కాని, కేశవ నామంకాని జపంచేసి, వ్రత సమాప్తిన బంగారపు శివ ప్రతిమగాని, విష్ణు ప్రతిమగాని దానంచేసిన వాడికి మహాపుణ్యము లభిస్తుంది.
  13. స్నాన సంధ్యాది నిత్యకృత్యాలు పూర్తిచేసి సూర్యమండల మధ్య వర్తి అయిన శ్రీమన్నారాయణునికి అర్ఘ్యమిచ్చి, వ్రత సమాప్తి నందు ఎరుపు రంగు వస్త్రము, బంగారము, గోవును దానం చేసినవాడు పరిపూర్ణ … ఆరోగ్యవంతుడవుతాడు. చిరాయువౌతాడు.
  14. ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ, నువ్వులతో హోమంచేసి, వ్రత సమాప్తి యందు తిలపాత్ర దానంచేసిన వాడు సర్వపాపములనుండి విముక్తుడవుతాడు.
  15. ప్రతిరోజూ అన్నహోమము చేసి, వ్రతాంతమందు నేతితో నిండిన కుండను, మంచి వస్త్రమును దానంచేసినవాడు మంచి ఆరోగ్యము, శరీరచ్ఛాయ, పుత్రపౌత్రాది సంపద కలిగి బ్రహ్మదేవునితో సమానుడౌతాడు.
  16. ప్రతిరోజూ అశ్వత్థ వృక్షాన్ని పూజించి, ఆఖరు రోజున వస్త్రము, బంగారము దానంచేసిన వాడు మంచి ఆరోగ్యవంతుడవుతాడు.
  17. ప్రతిరోజూ తులసిని పూజించి, తులసి దళాలను ధరించినవాడు సర్వపాపములనుండి విముక్తుడై విష్ణులోకము పొందుతాడు.
  18. ప్రతి. దినము గరికెను పూజించి శిరస్సున ధరించి, వ్రతాంతమున బంగారు గరికె దానంచేసిన వాడు సర్వపాపములనుండి విముక్తుడవు తాడు, స్వర్గాన్ని పొందుతాడు.
  19. చాతుర్మాస్యములో శివకేశవులలో ఎవరిని ధ్యానించినా పుణ్య ఫలము వస్తుంది.
  20. ప్రతి దినము విష్ణు పాదోదకము పారాయణచేసిన వాడు సర్వ పాపములనుండి విముక్తుడవుతాడు. అతని ఆయువు, సంపద వృద్ధి పొందుతాయి. వ్రత సమాప్తిన గోదానము చెయ్యాలి. లేకపోతే వస్త్రదానం చెయ్యవచ్చు.
  21. వేదవిదులైన బ్రాహ్మణులను పూజించాలి. వ్రతసమాప్తిన బ్రాహ్మణ సమారాధన, అన్నదానము చేసినవాడు ఆయుర్దాయము, ధనము పొందుతాడు.
  22. కపిల గోవును అర్చించి, ప్రదక్షిణలు చేసినా, దానమిచ్చినా గోవు శరీరం మీద ఎన్ని రోమములున్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు.
  23. ప్రతి దినము గణపతిని, సూర్యుని అర్చించినవాడు ఆయురా రోగ్య ఐశ్వర్యములు పొందుతాడు. గణపతి అనుగ్రహముతో అతడి అభీష్ట ములు సిద్ధిస్తాయి. అన్నిచోట్లా విజయం సిద్ధిస్తుంది.
  24. చాతుర్మాస్యములో వర్ష ఋతువు, శరదృతువు రెండు ఉంటాయి. ఈ రోజులలో శివ ప్రీతికి రజత దానం చెయ్యాలి. అంత శక్తి లేకపోతే రాగిని కూడా దానం చేయవచ్చు. ఇలా చేసిన వారికి అందమైన సంతానం కలుగుతుంది. ఈ ఫలితం కావలసిన వారు తేనె తో నిండిన వెండి పాత్రను, లేదా బెల్లంతో నిండిన రాగి పాత్రను దానం చెయ్యాలి.
  25. వ్రత సమాప్తి యందు శయ్యా దానము చేసిన వారు శాశ్వత మైన సుఖం పొందుతారు.
  26. వర్షా కాలములో ప్రతి రోజూ గోపీ చందనము దానం చేసిన వాడికి భుక్తి, ముక్తి రెండు లభిస్తాయి.
  27. ప్రత సమాప్తిన గోపీచందనము, నూతన వస్త్రములు దానం చేసిన వారికి సకలైశ్వర్యములు లభిస్తాయి, చివరకు సాయుజ్యం కలుగుతుంది.
  28. ప్రతి రోజు పంచదార లేదా బెల్లము దానంచేస్తే భుక్తి, ముక్తి కలుగుతుంది.

చాతుర్మాస్య వ్రతం పూర్తి అయిన తరువాత ఉద్యాపనకు ఎనిమిది లేక నాలుగు పలములు బరువుగల ఎనిమిది, నాలుగు లేదా ఒక రాగి పాత్ర నిండా చక్కెర పోసి, పాత్రపైన వస్త్రము, దక్షిణ ఉంచి నవ ధాన్యాలతో, లేదా పిండి వంటలతో ప్రతి పాత్రను దానంచెయ్యాలి. దానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాలు చదవాలి.

తామ్రపాత్రం సవస్త్రం చ శర్కరా హేమ సంయుతం
సూర్యప్రీతికరం యస్మాద్రోగఘ్నం పాపనాశనం.

పుష్టిదం కీర్తిదం నుౄణాం నిత్యం సంతాన కారకం
సర్వకామప్రదం స్వర్గ్య మాయు ర్వర్ధన ముత్తమం

తస్మా దస్యప్రదానేన కీర్తి రస్తు సదా మమ
ఏవ వ్రతం యః కుర్యా త్తస్య పుణ్యఫలం

చక్కెరతో కూడిన రాగిపాత్ర సూర్యుడికి ప్రీతికరమైనది. సమస్త రోగాలను నశింప చేస్తుంది. పాపాలను పోగొడుతుంది. పుష్టిని, కీర్తిని ఇస్తుంది. దీని దానము వలన సంతానము కలుగుతుంది. సర్వాభీష్టములు నెరవేరతాయి. స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. అటువంటి పాత్రను నేను దానం చేస్తున్నాను, నాకు ఎల్లప్పుడూ కీర్తి కలుగు గాక.

ధర్మనందనా! ఇప్పుడు వ్రత ఉద్యాపన ఫలితము చెబుతాను వినవలసినది.

చాతుర్మాస్య వ్రతం చేసిన వాడికి సంగీత ప్రావీణ్యం కలుగు తుంది. లోకంలోని స్త్రీలందరూ అతన్ని ప్రేమిస్తారు. అతడికి రాజ్యం కావాలంటే రాజ్యము,సంతానము కావాలంటే సంతానము లభిస్తుంది. ధనం కావాలంటే ధనం లభిస్తుంది. చివర కతడు మోక్షము పొందుతాడు. చాతుర్మాస్యములో ప్రతిరోజు కూరగాని, కందమూలాలుగాని, ఫలములుగాని దానంచేసి వ్రత సమాప్తిన వస్త్ర దానం చేసిన వాడు రాజయోగి అవుతాడు.

మంత్రం :
సర్వదేవప్రియం యస్మా చ్ఛాకం తృప్తికరం నృణాం
దదామి తే న దేవాద్యాః సదా కుర్వంతు మంగళం

శాకము దేవతలకు ప్రీతిని మానవులకు తృప్తిని కలిగిస్తుంది. ఓ బ్రాహ్మణ శ్రేష్టా! అట్టి శాకము నీకిస్తున్నాను. కాబట్టి దేవతలు నాకు శుభమును చేకూర్తురుగాక అంటూ శాక దానంచెయ్యాలి. ప్రతిరోజూ త్రికటుకములు అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. అలాచేస్తే సూర్య భగవానుడు ప్రీతి చెందుతాడు. అన్ని రోగాలు నశిస్తాయి.

ఈ రకంగా ప్రతిరోజూ త్రికటుకాలు దానంచేసి వ్రత సమాప్తిని బంగారంతో చేసిన త్రికటుకలు, వస్త్రము దక్షిణలతో దానంచేసి ఉద్యా పన చేసిన వాడు నూరు సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో జీవిస్తాడు, చివరకు స్వర్గం చేరతాడు.

చాతుర్మాస్యంలో నిరంతరము మంచి ముత్యములు దానం చేసిన వాడికి అన్న వస్త్రాలకు లోటురాదు. ప్రతి దినము అన్నం దానం చేసిన వాడు అష్టశ్వర్య సంపన్నుడు, కీర్తిమంతుడు అవుతాడు. ప్రతి దినము తాను తాంబూలము సేవించకుండా, ఇతరులకు తాంబూల దానం చేసి, వ్రత సమాప్తి నందు ఎరుపు రంగు వస్త్రములు దానం చేసినవాడు మహా లావణ్యవంతుడవుతాడు. అతడికి ఏరోగాలు రావు. మంచి మేధావి అవుతాడు. గాత్ర మాధుర్యముగల వాడవుతాడు. మరణానంతరము గంధర్వు డవుతాడు. తాంబూలము లక్ష్మీ ప్రదమై నది. అందులోని ఆకు, వక్క, సున్నము త్రిమూర్తుల స్వరూపము. అందుచేతనే తాంబూల దానం చేసిన వారికి త్రిమూర్తులు సకల సంపద లను ఇస్తారు.

ఈ సమయంలో ప్రతి రోజూ పసుపు దానం చేసి, ప్రతసమాప్తిని క్రొత్త వెండి పాత్రలో పసుపుపోసి దానం చేసినట్లైతే ఆస్త్రీ లేక పురుషుడు సర్వసుఖాలు అనుభవిస్తారు. వారికి సౌభాగ్యము, అస్టెశ్వర్యాలు కలుగు తాయి. ఈ రకంగా పసుపు దానం చేసిన వారు మంచి రూప లావణ్యాలతో దేవ లోకంలో సుఖిస్తారు.

ఈ కాలంలో ఉమా మహేశ్వర స్వరూపంగా భావించి, విప్ర దంపతులను పూజించి, వారికి శక్త్యాను సారము సువర్ణ దానంచేసి, వ్రత సమాప్తి యందు ఉమా మహేశ్వరుల బంగారు ప్రతిమను చేయించి దానిని పూజించి దానం చెయ్యాలి. తరువాత రుచికరమైన పిండి వంట లతో భోజనం పెట్టాలి. అలా చేసిన వాడి సంపత్తి సురక్షితంగా ఉంటుంది. మంచి కీర్తి కలుగుతుంది. ఈ లోకంలో సమస్త భోగాలు అనుభవించి అంత మందు కైలాసం చేరతాడు. ప్రతి రోజూ ఫల దానం చేసి వ్రత సమాప్తిన వెండి ఫలమును దాన మిచ్చిన వాడి కోరికలు అన్నీ తీరతాయి. అతడు స్వర్గాన్ని చేరతాడు. బంగారు పుష్పములు దానం చేసినవాడు ఈ లోకంలో శ్రేష్ఠమైన సౌభాగ్యము పొంది, చివరకు గంధర్వ లోకం చేరతాడు.

వ్రత సమయంలో ప్రతిరోజూ దధ్యాన్నము దానం చెయ్యాలి. – అంత శక్తి లేకపోతే అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, ఆది వారము, శుక్రవారములందు దధ్యాన్నము దానం చెయ్యాలి. ప్రత సమాప్తిన గోదానం గాని, భూదానంగాని, వస్త్ర దానం గాని చేసినట్లైతే అతడికి . అక్షయమైన అన్నం దొరుకుతుంది. పుత్ర పౌత్రాది వృద్ధి కలుగుతుంది. అంతమందు కైలాసం చేరతాడు.

చాతుర్మాస దీక్షను కేవలము కూరలు, దుంపలు, ఫలములతో గడిపి ఆఖరున గోదానం మిచ్చినట్లైతే అతడు వైకుంఠం చేరతాడు. కేవలము పాలు త్రాగి ఈ వ్రతమాచరించి, ప్రత సమాప్తిన గోదానం చేసి నట్లైతే అతడు బ్రహ్మలోకం పొందుతాడు.

చాతుర్మాస్యములో ప్రతిరోజూ అరటి ఆకులలో భోజనం చేసి చివరన వస్త్రములు, కంచుపాత్ర దానంచేసినట్లైతే అతడు గొప్ప సుఖములు పొందుతాడు. ప్రతి రోజూ మోదుగ ఆకులలో భోజనం చేసినవాడి పాపాలు సర్వము హరించివేయబడతాయి. ఈ వ్రతమాచరించిన వాడికి బ్రహ్మ హత్యా పాతకము, సురాపానము, శిశు హత్య, భ్రూణ హత్య, స్త్రీ హత్య, అసత్యము, పొందరాని స్త్రీలను పొందటము వంటి వాటి వలన కలిగే పాపాలు కూడా హరించుకు పోతాయి.

వ్రత సమాప్తి యందు సారవంతమైన భూమిని దానంచేసిన వాడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది చివరకు వైకుంఠం చేరతాడు. ఎప్పుడూ ఏదీ అడగని విప్రునకు, సువర్ణము, చందనముతో వృషభ దానం చేసినవాడు జ్ఞానము, మోక్షము పొందుతాడు. ఈ సమయంలో ప్రతి రోజూ పగలు ఉపవాసముండి రాత్రికి భుజించాలి. వ్రత సమాప్తిన బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి. అలా చేసినవాడు కైలాసం చేరి మహా సుఖాలనుభవిస్తాడు.

చాతుర్మాస్యములో ఏకభుక్తం చేసి, వాసుదేవుని పూజించినవాడు స్వర్గలోకం చేరతాడు. ప్రతి రోజూ భూమి పైనే శయనించి, వ్రతాంతమున శయ్యాదానం చేసినవాడు శివలోకంలో గొప్ప సుఖాలనుభవిస్తాడు. ఈ కాలంలో పాయసము, తేనె, ఉప్పు, నేయి, ఫలములను విసర్జించి, కార్తీక పూర్ణిమిన వీటిని దానమిచ్చిన వాడు రుద్రలోకం పొందుతాడు.

ఈ నాలుగు నెలలు తలస్నానం చెయ్యకుండా, గోళ్ళు కత్తిరించ కుండా శ్రీ మహావిష్ణువును పూజించినవాడు విష్ణులోకం పొందుతాడు. ఈ కాలంలో కూరలను పూర్తిగా వదలివేసి వ్రతాంతమునందు వెండి పాత్రతో పాటుగా పది రకాల కూరలు, వస్త్రములు దానంచేసిన వాడికి కైలాసం ప్రాప్తిస్తుంది.

ఈ కాలంలో గోధుమలను తినకుండా ఉండి ప్రతాంతమున బంగారు గోధుమలను దానం చేసినట్లైతే అశ్వమేధయాగం చేసిన ఫలం దక్కుతుంది. బంగారు గోధుమలు దానం చేసేటప్పుడు ఈ క్రింది మంత్రం చదవాలి.

Tholi Ekadashi Pooja Vidanam

మంత్రం
గోధూమాః సర్వజంతూనాం బలపుష్టి వివర్దనాః
ముఖ్యాశ్చ హవ్యకవ్యేషు తస్మాన్మే దదతు శ్రియం.

గోధుమలు సర్వజీవులకు బలాన్ని పుష్టిని ఇస్తాయి. దేవ పితృ కార్యములకు ఇవి ముఖ్యమైనవి. కాబట్టి నాకు సంపదల నిచ్చుగాక.

ఈ సమయంలో తనకు ఇష్టమైన కూరలు, పండ్లు తినకుండా వదలివేసి, వ్రత సమాప్తి యందు వెండితో చేసిన పండ్లు లేదా కూరలను దానం చేసినట్లైతే ఆయురారోగ్య ఐశ్వర్యములు, పుత్ర పౌత్రాది సంతతి కలుగుతుంది. అంతమందు స్వర్గం లభిస్తుంది.
శ్రావణ మాసంలో శాకములు, భాద్రపదంలో పెరుగు, ఆశ్వియుజ మాసంలో పాలు, కార్తీక మాసంలో పప్పులు వదలి వెయ్యాలి. అంతేకాదు, అనేక బీజములున్న ఫలములు అంటే గుమ్మడి, జామ, సీతాఫలము, నారింజ, బత్తాయి, వంకాయలు వంటి వాటిని తినరాదు.

ఉసిరి, రేగు, ఆనప, చింతకాయలను ఈ నాలుగు నెలలు తినరాదు. నులక మంచం మీద గాని పట్టె మంచం మీదగాని పడుకో రాదు. ఋతుకాలము తరువాత భార్యను కలవ రాదు. బచ్చలి, మునగ, వంగ, మారేడు పండ్లు తినేవాడికి శ్రీహరి దూరమవుతాడు. ఈ సమయంలో ఏరకమైన వ్రతాలు చెయ్యకపోయినా, ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం స్నానంచేసి శ్రీహరిని పూజించినట్లైతే అతడు వైకుంఠము పొందుతాడు.

చాతుర్మాస్యంలో తేనె విడిచిన వాడు రాజవుతాడు. బెల్లమును విడిచిన వాడు దీర్ఘాయుష్షు పొందుతాడు. దేవాలయంలో సంగీతాన్ని వినిపించిన వాడు గంధర్వ లోకం పొందుతాడు. సువాసన వెదజల్లే నూనెలు విడిచిన వాడికి – శత్రువులు నశిస్తారు. ఇప్ప నూనె త్యజించిన వాడు – మంచి సౌభాగ్యము పొందుతాడు. కారము, పులుపు, చేదు, వగరు, తీపి – వీటిని విసర్జించిన వాడి శరీరము అందముగా ఉంటుంది. పూలు మొదలైన భోగాలను వదలినట్లైతే విద్యాధర గణమందు చేరతాడు. యోగియైనవాడు బ్రహ్మలోకం చేరతాడు.

తాంబూలము వదలివేసిన వాడికి రోగాలు నశిస్తాయి. పక్వా హారము విడచినవాడు – ఇంద్రలోకం పొందుతాడు. రోజు విడిచి రోజు ఉపవాసం చేస్తే – బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. చాతుర్మాస్యంలో ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్ర జపం చేసిన వాడికి పుణ్యలోకాలు కలుగుతాయి. ఆలయంలో లక్ష ప్రదక్షిణాలు చేసినవాడు హంస వాహన మెక్కి వైకుంఠం చేరతాడు. ఈ నాలుగు నెలలూ బయట భోజనం చెయ్యని వాడు – దేవతా స్వరూపు డవుతాడు.

ఈ సమయంలో ప్రాజాపత్య వ్రత మాచరించినవాడు మనో వాక్కాయ కర్మలచే చేసిన పాపాలనుండి విముక్తు డవుతాడు. చాతుర్మాస్యములో చాంద్రాయణ వ్రత మాచరించినవాడు దివ్య దేహము ధరించి శివలోకము చేరతాడు. ఈ సమయంలో పూర్తిగా ఉపమాసమున్న వాడికి సాయుజ్యం లభిస్తుంది. అతడికి పునర్జన్మ ఉండదు. మధూకర భిక్షాన్నము తిని గడిపినవాడు–వేద పారంగతుడవుతాడు.

శ్రీమన్నారాయణుడు నిద్రకుపక్రమించే రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించి నాలుగు నెలల పాటు నిర్విఘ్నంగా వ్రత మాచరించిన వాడు ఈ లోకంలో సకల సుఖాలు అనుభవించి, అంతమందు సాయుజ్యం పొందుతాడు’. అంటూ తొలి ఏకాదశి, దేవశయని వ్రత విధానము, దాని ఫలి తాలను వివరించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.

మరిన్ని పూజా విధానాలు:

Kodekadu Gadavamma Govindaraju In Telugu – కోడెకాడు గదవమ్మ గోవిందరాజు

కోడెకాడు గదవమ్మ గోవిందరాజు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో కోడెకాడు గదవమ్మ గోవిందరాజు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కోడెకాడు గదవమ్మ గోవిందరాజు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 14
కీర్తన : కోడెకాడు గదవమ్మ గోవిందరాజు
సంఖ్య : 95
పుట:57
రాగం: దేశాక్షి

దేశాక్షి

8 కోడెకాఁడు గదవమ్మ గోవిందరాజు
వేడుక మోవులతేనె విందారగించీని

||పల్లవి||

కొలువు కూటములోన గోవిందరాజు వాఁడే
పలుమారుఁ జెలులతోఁ బందేలాడీని
నిలువుల మేడమీఁద నిలిచి గోవిందరాజు
వలపులు చల్లుచును వసంతాలాడీని

||కోడె||

కోరి కేళాకూళిలోన గోవిందరాజు వాఁడే
సారె నింతులతో నీరు చల్లులాడీని
తూరుచు సింగారపుఁ దోటలో గోవిందరాజు
సైరణ లేకందరితో జాజరలాడీని

||కోడె||

గోముల శ్రీవేంకటాద్రి గోవిందరాజు వాఁడె
రామలతోడుతను సరసమాడీని
గామిడై పాన్పుపైఁ గూడి కందువ గోవిందరాజు
మోములు చూచందరితో ముచ్చటలాడీని.

||కోడె||

అవతారిక:

నిఘంటువు సాయం లేకపోతే ఈ కీర్తన వివరించడం దాదాపు అసాధ్యమే. కోడె వయసుగాడైన గోవిందరాజు వేడుకతో అధరామృతాల నాస్వాదిస్తుంటాడట. నిలువులు మేడమీద నిలిచివుంటాడట. కేళాకూళి అంటే జలక్రీడలని అర్థం. అవంటే మహా ఇష్టంట ఆయనకి. సైరణలేక జాజరచల్లుతాడట. రామలతో సరసాలాడతాడట. మోములు చూచి అందరితో ముచ్చట్లాడతాడట. పాన్పుపై గామిడై కూడినాడట. ఒకటారెండా? దాదాపు అన్నీ తెలియని తెలుగుమాటలే. తెలివిగా భావవివరణ చదివేద్దాం. పదండి ముందుకు. ఇంతకీ ఈ కీర్తన తిరుపతిలోని గోవిందరాజ స్వామిపైననే సుమండీ.

భావ వివరణ:

ఓ భామలారా! ఈ గోవిందరాజస్వామివున్నాడే, ఈయన కోడెగాడు గదమ్మా (కోడెవయసువాడు కదుటమ్మా!) ఈయన వేడుకతో భామల మోవితేనెలు (అధరామృతములను) విందారగించీని (విందువలె నాస్వాదిస్తాడు).

ఈ గోవిందరాజస్వామి తన కొలువుదీర్చియున్నాడు. కానీ తన చెలులతో (ఇద్దరు భామలు భూదేవి శ్రీదేవిలతో) పందేలాడీని (పందెములు కాస్తున్నాడు). ఆయన నిలువులు మేడల మీద (ఎత్తయిన మేడలమీద) నిలిచి అందరినీ పరికిస్తుంటాడు. తన చెలియలతో వలపులు చల్లుతూ వసంతోత్సవం చేసికొంటాడు (హెూలీ ఆడుతుంటాడన్నమాట).

ఆ గోవిందరాజస్వామికి ఇంకొక ఇష్టమైన ఆట వున్నది. అదే కేళాకూళి (జలక్రీడ). బహు కోరికతో ఆయన జలక్రీడను ఇంతులతో (స్త్రీలతో) నీరు చిమ్ముతూ చల్లులాడీ (చల్లుతూనే వుంటాడు). ఆయన శృంగార వనములో తూరుచు (దూరిపోయి) సైరణ లేక (ఆపటం అనేదే లేకుండా) జాజరలాడీని (వున్నట్టుండి వెనుక నుండి నీళ్ళు చిమ్మటం లాంటి కొంటె పనులు చేస్తుంటాడు).

ఈ గోవిందరాజస్వామే, గోముల (సౌకుమార్యంతో) శ్రీవేంకటాద్రిపై రామలతో (స్త్రీలతో) సరసములాడీని (సరసములాడుతున్న) శ్రీవేంకటేశ్వరుడు కూడా అయివున్నాడు. గామిడై (సర్వశ్రేష్ఠుడై) ఈ గోవిందరాజస్వామి తన శయ్యపై, కందువ గూడి (సమర్ధుడై కూడి) మోములు చూచి (వారి అందమైన మొగములను తదేకంగా చూస్తూ) ముచ్చటలాడుతుంటాడు. (ఇన్ని చేస్తూ కూడా శరణాగతులను ఒక కంట కనిపెడుతూనే వుంటాడు సుమా!)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Naruda Yitadu Adinarayanudu Gaka In Telugu – నరుడా యీతడు ఆదినారాయణుడు గాక

నరుడా యీతడు ఆదినారాయణుడు గాక – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో నరుడా యీతడు ఆదినారాయణుడు గాక కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నరుడా యీతడు ఆదినారాయణుడు గాక – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : నరుడా యీతడు ఆదినారాయణుడు గాక
సంఖ్య : 497
పుట: 336
రాగం: సాళంగనాట

సాళంగనాట

4 నరుఁడా యీతఁడు ఆదినారాయణుఁడు గాక
ధరణిఁ గీరితి కెక్కె దశరథసుతుఁడు

||పల్లవి||

యీతఁడా తాటకిఁ జంపె నీ మారీచసుబాహుల
నీతఁడా మదమణఁచె నిందరుఁ జూడ
యేతులకు హరువిల్లు యీతఁడా విరిచి యట్టె
సీతఁ బెడ్లియాడెను యీ చిన్న రాముఁడా

||నరుఁ||

చుప్పనాతి ముక్కుగోసి సోదించి దైత్యులఁ జంపి
అప్పుడిట్టె వాలినేసినాతఁ డీతఁడా
గుప్పించి కోఁతుల నేలి కొండల జలధిగట్టి
కప్పి లంక సాధించె నీ కౌసల్యానందనుఁడా

||నరుఁ||

రావణాదులను జంపి రక్షించి విభీషణుని
భావించయోధ్య నీతఁడు పట్ట మేలెను
శ్రీవేంకటేశుఁ డితఁడే సృష్టి రక్షించె నితఁడే
యీవల మాపాలనున్న యీ రామచంద్రుఁడా

||నరుఁ||

అవతారిక:

విశిష్టా ద్వైతమత ప్రచారకుడై అన్నమాచార్యులవారు వూరూరా తిరిగి తన కీర్తనలను వినిపించి మరీ విష్ణుతత్త్వం ప్రబోధించారు. ఆ రోజుల్లో రామాలయంలేని వూరు వుండేదికాదు. ఏవూరికెళ్తే ఆవూరి శ్రీరామునిపై కీర్తన చెప్పేవారు. ప్రతి కీర్తనలోనూ రామకథను ఆద్యంతం గానం చేయడం ఆయన ప్రత్యేకత. బహుశా ఆ వూరిలో సంస్కృత పండితులెక్కువమంది వుంటే కీర్తన గీర్వాణిలో చెప్పేవారేమో. అందుకనే అన్నమయ్య సంస్కృత కీర్తనలు యెక్కువగా శ్రీరామునిపైనా నృశింహునిపైనా వున్నాయని నాకు అనిపిస్తుంది. అందుకే… ఓ నరులారా! ఈతడు ఆదినారాయణుడు దశరథసుతునిగా ధరణిలో కీర్తిని పొందాడు… అంటున్నారు.

భావ వివరణ:

ఓ నరులారా! ఈతడెవరనుకొన్నారు? ఆదిదేవుడైన ఆదినారాయణుడు. గాక (అయితే) ధరణిన్ కీరితికెక్కె (భూలోకంలో పేరుపొందినది మాత్రం) దశరథ సుతుడైన శ్రీరామచంద్రమూర్తి అనే సుమా! (మరి ఆయన చేసిన ఘనకార్యాలు అట్లున్నవి).

ఈయన తాటకి అనే రాక్షసిని సంహరించాడు. ఇందరుజూడ (విశ్వామిత్రుని యాగమును చూచుటకు వచ్చిన ఇంత మంది చూస్తుండగా) ఈయన దాని కొడుకులైన మారీచ సుబాహుల మదమును అణచినాడు. ఈచిన్నారి రాముడు, ఏతులకు (ఉద్ధతితో) శివధనస్సును విరిచి అట్టే (అవలీలగా) సీతను పెండ్లాడినాడు.

ఈయన లక్ష్మణుని ప్రేరేపించి ‘చుప్పనాతి’ అని పేరువడ్డ శూర్పనఖ ముక్కు చెవులను కోయించినాడు. సోదించి (వెదకి సోదించి (వెదకి వెదకి) రాక్షసులను సంహరించినాడు. ఆ తరువాత రావణాసురునివంటి వాని మదమణచిన వాలిని ఒక్క అమ్ము వేసి మట్టుబెట్టాడు. ఆ మహానుభావుడే ఈ చిన్నారి రాముడా!! కుప్పించి యెగిరే కోతులను ఒక సేనగా నడిపించిన నాయకుడా!! అవునయ్యా! ఈ కౌసల్యానందనుడే జలధిగట్టి (సముద్రముపై సేతువును నిర్మించి రావణునిపై దండెత్తి స్వర్ణలంకను సాధించినాడు.

ఆనాడావిధంగా రావణుని సంహరించాక ఆ లంకను రావణుని తమ్ముడైన విభీషణునికే పట్టము గట్టిన ధర్మమూర్తి ఈయన. తమ కోసల రాజధాని అయోధ్యా నగరానికి పట్టాభిషిక్తుడై పరిపాలించాడు. ఆనాటి త్రేతాయుగానంతరం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడై తదనంతరం ఈ కలియుగంలో ఇతడే కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడై ఈ సృష్టిని రక్షిస్తున్నాడు. ఈ శ్రీరామచంద్రడే మా పాలనున్నాడు (మా పాల దైవమై వున్నాడు).

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

  1. శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును
  2. వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము
  3. దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ
  4. ఘనుడాతడా యితడు కలశాపురముకాడ
  5. బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల
  6. దాసోహమనుబుద్ధిదలచరు దానవులు
  7. నారాయణుడ నీనామమె మంత్రించివేసి

Sri Rama Ashtottara Shatanamavali In Telugu – శ్రీ రామ అష్టోత్తర శతనామావళి

Sri Rama Ashtottara Shatanamavali In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ రామ అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

శ్రీ రామ అష్టోత్తర శతనామావళి

ప్రతి నామమునకు ముందుగా ఓమ్ అని చదువుకొనవలయును

  • ఓమ్ శ్రీరామాయ నమః
  • రామభద్రాయ నమః
  • రామచంద్రాయ నమః
  • రాజీవలోచనాయ నమః
  • శ్రీమతే నమః
  • రాజేంద్రాయ నమః
  • రఘుపుంగవాయ నమః
  • జానకీవల్లభాయ నమః
  • జైత్రాయనమః
  • జితామిత్రాయ నమః
  • జనార్ధనాయ నమః
  • విశ్వామిత్ర ప్రియాయ నమః
  • దాంతాయ నమః
  • శరణత్రాణతత్పరాయ నమః
  • వాలి ప్రమథనాయ నమః
  • వాగ్మినే నమః
  • సత్యవాచే నమః
  • సత్యవిక్రమాయ నమః
  • సత్యవ్రతాయ నమః
  • వ్రత ధరాయ నమః
  • సదాహనుమదాశ్రితాయ నమః
  • కౌసలేయాయ నమః
  • ఖరధ్వంసినే నమః
  • విరాధవధ పండితాయ నమః
  • విభీషణ పరిత్రాత్రే నమః
  • దశగ్రీవశిరోహరాయ నమః
  • సప్త తాళ ప్రభేత్రే నమః
  • వేదాంతసారాయ నమః
  • వేదాత్మనే నమః
  • భవరోగస్యభేషజాయ నమః
  • దూషణశిరోహంత్రే నమః
  • త్రిమూర్తయే నమః
  • త్రిగుణాత్మకాయ నమః
  • త్రివిక్రమాయ నమః
  • త్రిలోకాత్మనే నమః
  • పుణ్యచారిత్రకీర్తనాయ నమః
  • త్రిలోకరక్షకాయ నమః
  • ధన్వినే నమః
  • దండకారణ్యపుణ్యకృతే నమః
  • అహల్యాశాపశమనాయ నమః
  • పితృభక్తాయ నమః
  • వరప్రదాయ నమః
  • జితక్రోధాయ నమః
  • జితమిత్రాయ నమః
  • జనార్ధనాయ నమః
  • ఋక్షవానరసంఘాతినే నమః
  • చిత్రకూట సమాశ్రయాయ నమః
  • జయంత త్రాణతత్పరాయ నమః
  • సుమిత్రాపుత్ర సేవితాయ నమః
  • సర్వదేవాదిదేవాయ నమః
  • సదావానర సేవితాయ నమః
  • మాయామారీచహంత్రే నమః
  • హర కోదండఖండనాయ నమః
  • మహాభోగాయ నమః
  • జామదగ్న్యమహాదర్పదళనాయ నమః
  • తాటకాంతకాయ నమః
  • సౌమ్యాయ నమః బ్రహ్మణ్యాయ నమః
  • మునిసంస్తుతాయ నమః
  • మహాయోగినే నమః
  • మహోదారాయ నమః
  • సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః
  • సర్వపుణ్యాధిక ఫలాయ నమః
  • స్మృతసర్వాఘనాశనాయ నమః
  • ఆదిపురుషాయ నమః
  • మహాపురుషాయ నమః
  • పురాణపురుషస్తుతాయ నమః
  • పుణ్యోదయాయ నమః
  • దయాసారాయ నమః
  • పురాణపురుషోత్తమాయ నమః
  • స్మిత వక్రాయ నమః
  • హరయే నమః
  • సుందరాయ నమః
  • అనంత గుణగంభీరాయ నమః
  • సీతవాసనే నమః
  • మాయామానుషచారిత్రాయ నమః
  • సేతుకృతే నమః
  • మితభాషిణే నమః
  • పూర్వభాషిణే నమః
  • రాఘవాయ నమః
  • సస్వతీర్ధమయాయ నమః
  • మహాభుజాయ నమః
  • సర్వదేవస్తుత్యాయ నమః
  • సర్వయాజ్జాధిపాయ నమః
  • యజ్వినే నమః
  • జరామరణవర్జితాయ నమః
  • శివలింగప్రతిష్ఠాత్రే నమః
  • సర్వాభరణ భూషితాయ నమః
  • పరమాత్మనే నమః
  • పరబ్రహ్మాణే నమః
  • సచ్చిదానంద విగ్రహాయ నమః
  • పరస్మై జ్యోతిషే నమః
  • పరస్యైధామ్నే నమః
  • పరాకాశాయ నమః
  • పరాత్పరాయ నమః
  • పరేశాయ నమః
  • పారగాయ నమః
  • పారాయ నమః
  • శ్యామాంగాయ నమః
  • శూరాయ నమః
  • ధీరోదాత్త గుణాశ్రయాయ నమః
  • ధనర్ధరాయ నమః
  • మహాదేవాదిపూజితాయ నమః
  • జితరాశయ నమః
  • సర్వ దేవాత్మకాయ నమః
  • శివాయ నమః
  • శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సరివార సమేత శ్రీ రామ చంద్రాయ నమః

శ్రీ రామా నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి

మరిన్ని అష్టోత్తరములు

అష్టకం – Ashtakam

Ashtakam

ముండుగా అందరికి నమస్కారం. ఈ రోజు మన భక్తివేద్.కం నందు మీకు పరిచయం చేస్తున్న అంశములు… అష్టకం అంటే ఏమిటి? అష్టకం యొక్క గొప్పదనం, మరియు ఎ సమయంలో ఎ అష్టకం చదవాలో, ఎ, ఏ అష్టకములను చదివితే మంచిదో మరియు వాటిని పటించడం వల్ల మానవాళికి కలిగే ప్రయోజనాల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది, ఈ క్రింద ఇచ్చిన లింకులు ఆధారంగా అవి ఏమిటో తెలుసుకుందాము…

Ashtakamulu – అష్టకములు

Okarigaanaga Nodabadadu Manasu In Telugu – ఒకరిగానగ నొడబడదు మనసు

ఒకరిగానగ నొడబడదు మనసు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఒకరిగానగ నొడబడదు మనసు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఒకరిగానగ నొడబడదు మనసు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: ఒకరిగానగ నొడబడదు మనసు
సంఖ్య : 534
పుట: 359
రాగం: సాళంగనాట

సాళంగనాట

42 ఒకరిఁ గానఁగ నొడఁబడదు మనసు
సకలముహరియని సరిఁదోఁచీని.

||పల్లవి||

అంతరాత్మ శ్రీహరి యతఁ డొకఁడే
జంతువులన్నియు సమములే
బంతులఁ బాత్రాపాత్రము వెదకిన
అంతట హరిదాస్యమేపో ఘనము.

||ఒక||

జగమును నొకటే చైతన్య మొకటే
తగినపంచభూతము లొకటే
నగుతా నెదిరిని నన్నును నెంచిన
మొగి నాపై హరిముద్రలె ఘనము.

||ఒక||

కారు స్వతంత్రులు కడపట నొకరును
యీరీతి నౌఁగాము లిఁక నేలా
శ్రీరమణీపతి శ్రీవేంకటేశుఁడే
కారణము శరణాగతియే ఘనము.

||ఒక||534

అవతారిక:

హరిహరుల మధ్య అంతరం యెలా సాధ్యం? రెండూ పరమాత్మ రూపాలే. రక్షణ భారం హరిదైతే లయం చేసే బాధ్యత హరుడిది. ఇది పురాణాలు నొక్కి వక్కాణిస్తున్నా, కొందరు అజ్ఞానులు హరిహరదూషణ చేసి పాపం మూట కట్టుకుంటున్నారు. జగమున నున్నది చైతన్యమొక్కటే అని హితబోధ జేస్తున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. ‘సకలము హరిమయమని సరిదోచీని’ అంటున్నారు. ఈసృష్టిలో ఆపరాత్పరుడు తప్ప యెవ్వరూ స్వతంత్రులు కారు. అందరూ ఆయన ఆజ్ఞానువర్తనులే. ఇక ఔగాములేల అంటున్నారు. అంటే మేలుచేసేదెవడు? కీడుచేసేదెవడు అన్నీ ఆ నామాలవాడే, మనిషి మానవత్వంలేకపోతే జంతువే కదా! రెండుకాళ్ళ జంతువు.

భావ వివరణ:

ఓ ప్రజలారా! నా మనస్సు ఒకరిన్ (వేరే ఇంకొకరిని కానగ (దర్శించుటకు) ఒడబడదు (అంగీకరించదు). నాకు సకలము హరియని సరిదోచీని (సరిగా అనిపిస్తున్నది). అయినా సత్యమేమిటో వినండి.

మన అందరిలో అంతరాత్మ రూపంలో వున్న శ్రీహరి ఒక్కడే. జంతువులు అన్నియూ సమానమే. మనస్సు అనేది ఒకటి వుండుటచేత మనిషి మేలైన జంతువయ్యాడు. తన మనస్సులో శ్రీహరిని నిలపగలిగితే పాత్రత (యోగ్యత) కలుగుతుంది. లేకపోతే వాడూ యోగ్యతలేని ద్విపాదపశువే కదా! వంతుల (పంతముతో) వెదకితే అపాత్రుడైన ద్విపాదపశువును పాత్రుడైన ఘనుని చేయగలిగిన దేమిటి? హరిదాస్యమే..పో. (కేవలం శ్రీహరిదాసునిగా జీవించటమే).

ఈ జగత్తంతా ఒక్కటే. ఇందులో వుండే చైతన్యము (కదిలేశక్తి) కూడా ఒక్కటే. పంచభూతములు (భూమి, నీరు, కాంతి, గాలి మరియు ఆకాశము) ఏదో ఒక రూపంలో ప్రతిదాంట్లో వున్నాయి. వుండాలి కూడా. కాబట్టి అవి కూడా ఒక్కటే. మరి అటువంటి పాంచభౌతిక శరీరధారినైన నన్ను ఘనుని చేసిందెవరు? నా పైన వున్న ఈ హరిముద్రలే (శంఖ చక్ర ముద్రలు, తిరునామము). నగుతా (నవ్వుతూ) యెదురుగా అవి లేకుంటే నాలో లెక్కించుటకు ఇంకా యేమున్నది?

ఒకసారి ఆలోచించండి. మనం కావాలనుకొని పుట్టామా? కావలసినప్పుడు కావలసినచోట కావలసిన విధంగా చావగలమా? కడపట (చివరికి) ఒక్కడికైనా ఆ స్వాతంత్రం (ఛాయిస్) వున్నదా? మరి ఇంతోటి దానికి “ఔగాము” లేల? మేలైనదేమిటి కీడైనదేమిటి?) మనకి మేలు జరిగినా హరివల్లనే, కీడు జరిగినా హరివల్లనే. అన్నిటికీ కారణం శ్రీపతియైన వేంకటేశ్వరుడే. మరి అలాంటప్పుడు ఈ పగయెందుకు? ద్వేషమెందుకు? ఆయనను శరణంటే అదే ఘనము కదా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sri Rama Raksha Sthotram In Telugu | శ్రీ రామ రక్షా స్తోత్రం

Sri Rama Raksha Sthotram

శ్రీరామరక్షా స్తోత్రం ఓ మనోవైజ్ఞానికమైన ఓషధి, ఇందులో మానసిక రోగాలన్నీ దూరమై అలౌకిక మగు శక్తి ఉత్పన్నమయ్యే భావాలు నిండి ఉన్నాయి. ఈ క్రింది విదంగా వర్ణించబడింది…

Sri Rama Raksha Sthotram In Telugu

శ్రీ రామ రక్షా స్తోత్రం

హద్దులు మీరి మీరు భయపడుతూన్నప్పుడు అశాంతి మిమ్మల్ని అణగద్రొక్కే స్థితిలో బ్రతకాలని మీకు లేని సమయంలో ఘోరమైన అశాంతి ద్వేషాదులతో మీ జీవనం గడుస్తూన్నపుడు జీవితం నీరసంగా, దుఃఖమయంగా వున్నప్పుడు లోకమంతా దయారహితంగా, పాఖండంగా గోచరించే వేళలో – మీరు అవశ్యం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. సూక్ష్మమైన ఆధ్యాత్మికశక్తితో అవశ్యం మీరు లాభాన్ని పొందుతారు.

ధనబల, విద్యాబల, బుద్ధిబలాదుల కన్న మిన్న అయిన అధికబలం కలిగినట్టిది యీస్తోత్రము. దీనివల్ల దుష్టసంస్కారాలు దూరమై శుభసంస్కారాలు జాగృతమవుతాయి. ఆశాకిరణాలు బహిర్గతమవుతాయి. వేలాదిమంది ” శ్రీరామ రక్షాస్తోత్రం” వల్ల మృత్యు, అశాంతి, ఉన్మాదం, ఆత్మహత్య ఆదిగా గల రోగాలనుండి సంరక్షింపబడ్డారు. దీనివల్ల శరీరం రోగ రహితమవుతుంది. ఆరోగ్యం వర్ధిల్లుతుంది. మస్తిష్కమూ జ్ఞానతంతువులూ పరిపుష్టమవుతాయి.

స్మరణ శక్తి తీవ్రమవుతుంది. రక్తచాపం (బ్లడప్రెషర్) హృదయరోగాలు సమూలంగా నిర్మూలమవుతాయి. మానసిక ఆరోగ్య సంతులనార్ధం దీనిని నిత్యం పారాయణ చెయ్యాలి. అనుదినం ప్రతివ్యక్తి ముఖ్యంగా శ్రీరామ భక్తులూ పూజతో బాటు దీనిని అభ్యసించాలి. (సిద్ధ్యర్ధం నిత్యం 11 పారాయణాల వంతున 9రోజులు పారాయణ చెయ్యాలి.)

ఓం శ్రీ గణేశాయ నమః అస్య శ్రీ రామరక్షాస్తోత్ర మంత్రస్య బుధ కౌశిక ఋషిః శ్రీ సీతారామచంద్రో దేవతా అనుష్టుప్ ఛందః! సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీ రామచంద్ర ప్రీత్యర్ధే రామ రక్షా స్తోత్ర జపే వినియోగః

తాత్పర్యము ||

ఈ రామరక్షా స్తోత్రానికి ఋషి బుధకౌశికుడు, దేవతలు సీతారాములు, శక్తిసీత, కీలకము హనుమంతుడు, దీని వినియోగము శ్రీరామచంద్రుని ప్రసన్నత కొరకు వున్నది. అందుకే రామరక్షా స్తోత్ర జపములో దీని వినియోగము వున్నది.

ధ్యానం

ధ్యాయే దాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థమ్
పీతం వాసోవసానం, నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతా ముఖకమల మిలల్లోచనం నీరదాభమ్
నానాలంకార దీప్తం దధత మురుజటామండలం రామచంద్రమ్.

తా ||  ధనుర్బాణములను ధరించినవాడు. బద్ధ పద్మాసన విరాజమానుడు, పీతాంబరధారీ, నూతన కమల దళములతో స్పర్ధకలిగియున్న ప్రసన్న నయనుడు, వామభాగమున వీరాజిల్లు సీతాముఖ కమలముతో కలిసి -యున్నవాడు, ఆజానుబాహువు, మేఘశ్యాముడు, వివిధాలంకార విభూషితుడు విశాల జటాజూటధారీ అయిన శ్రీరామచంద్రుని ధ్యానించవలెను.

శ్రీ రామ రక్షా స్తోత్రం

శ్లో || చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ |

తా ||  శ్రీరఘునాథుని చరిత్ర శతకోటి ప్రవిస్తరమై యున్నది. అందలి ఒక్కొక్క అక్షరము కూడ మనుష్య మాత్రుని మహాపాపములను నాశనము చేయును.

శ్లో || ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్
జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్ |

శ్లో || స్కా సీతూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్
స్వలీలయా జగత్రాతు మావిర్భూత మజం విభుమ్ |

శ్లో || రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః |

నీలకమల దళశ్యాముడును, కమలనయనుడు, జటామకుట సుశోభితుడును, ఖడ్గ, తూణీర, ధనుర్బాణధారియు, రాక్షస సంహారకారియు జగత్ రక్షణార్ధమే తన లీలచే అవతరించిన వాడును, అజన్ముడును సర్వవ్యాపకుడు అయిన శ్రీరామ భగవానుని సీతాలక్ష్మణ సమేతముగా స్మరించి ప్రాజ్ఞ పురుషుడు సర్వకామప్రదమై పాపములను నాశనము చేయునదైన యీ రామరక్షాస్తోత్రమును పఠింపవలెను. నా శిరస్సును రాఘవుడును లలాట భాగమును దశరధాత్మజుడను రక్షించు గాక !

శ్లో || కౌసల్యేయో దృశాపాతు విశ్వామిత్రః ప్రియః శృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రి వత్సలః |

తా || కౌసల్యానందనుడు నేత్రములను రక్షించుగాక! విశ్వామిత్ర ప్రియుడు కర్ణములను సురక్షితముగా వుంచును గాక! యజ్ఞ రక్షకుడు జ్ఞానేంద్రియములను, సౌమిత్రి వత్సలుడు, ముఖమును రక్షించును గాక!

శ్లో || జిహ్వాం విద్యా నిధిః పాతు కంఠం భరత వందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః |

తా || నా జిహ్వను విద్యానిధియు, కంఠమును భరతవందితుడును, స్కంధములను దివ్యాయుధుడును భుజములను శివధనుర్భంగము చేసిన వాడును రక్షించును గాక !

శ్లో || కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః |

తా || హస్తములను సీతాపతియు, హృదయమును పరుశురామ విజేతయు, మధ్య భాగమును ఖర రాక్షసాంతకుడును నాభిని జాంబవ దాశ్రయడును రక్షించును గాక!

శ్లో || సుగ్రీవేశః కటీ పాతు సక్టినీ హనుమత్ప్రభుః |
ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్

తా || కటి భాగమును సుగ్రీవస్వామియు, సర్థినిని హనుమత్ప్రభువును జఘన భాగములను, రాక్షసకుల వినాశకుడగు రఘుకుల శ్రేష్ఠుడును రక్షించును గాక.

శ్లో || జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః
పాదౌ విభీషణ శ్రీ దః పాతు రామోఖిలం వపుః |

తా || జానువులను (మోకాళ్ళను) సేతు నిర్మాతయు జఘనములను (మణికట్టును) దశ ముఖాంతకుడును, చరణములను విభీషణునికి ఐశ్వర్యము ప్రసాదించిన వాడును సంపూర్ణ శరీరమును శ్రీరాముడును రక్షించును గాక!

శ్లో || ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ 
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ |

తా || ఏ పుణ్యాత్ముడు రామబల సంపన్నమగు యీ రామరక్షా స్తోత్రమును పఠించునో అట్టివాడు దీర్ఘార్దాయముతో సుఖియై పుత్రవంతుడు విజయశీలుడనై వినయ సంపన్నుడగును.

శ్లో || పాతాళ భూతల వ్యోమ చారిణశ్ఛద్మ చారిణః 
న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితమ్ రామనామభిః |

తా|| పృథివ్యాకాశ పాతాళ లోకములలో ఛద్మ వేషముతో పరిభ్రమించే యే జీవియైనను సరే రామ నామ సురక్షితుడైనట్టి పురుషుని కన్నెత్తి చూడలేదు.

శ్లో || రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్
నరో న లిప్యతే పాపైర్భుక్షిం ముక్తిం చ విందతి |

తా|| ” రామ ” ” ” రామభద్ర ” “ రామచంద్ర ” యీ నామములను స్మరించుటవల్ల మనుష్యుడు పాప విముక్తుడగుటయే కాక భోగమోక్షములను -కూడ పొందగలుగును.

శ్లో || జగజ్జెత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్ 
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః |

తా|| జగత్తును జయించుటకు ఏకమాత్ర మంత్రమైన రామనామముచే సురక్షితమైన యీ స్తోత్రమును కంఠస్థము చేయువానికి సమస్త సిద్ధులు కరతలామలకములగును.

శ్లో || వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం |

తా || వజ్రపంజర నామకమగు యీ రామ కవచమును స్మరించు వాని ఆజ్ఞలను ఎవ్వరూ ఉల్లంఘించ జాలరు. వానికి సర్వే సర్వత్రా జయ మంగళములు ప్రాప్తించును.

శ్లో || ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః ||

తా|| రాత్రి స్వప్నమునందు తనకు యీ రామరక్షను శంకర భగవానుడు ఆదేశించినట్లుగనే ప్రాతఃకాలమున మేల్కాంచిన పిమ్మట బుధ కౌశిక మహర్షి దీనిని వ్రాసెను.

శ్లో || ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్
అభిరామస్త్రిలోకానామ్ రామః శ్రీమాన్సనః ప్రభుః || 

తా || కల్పవృక్షములతో కూడిన ఉద్యానవనమువంటి వాడును సమస్త ఆపదలను రూపుమాపువాడును ముల్లోకములలో పరమ సుందరుడును అయిన శ్రీ రామచంద్రుడే మా ప్రభువు.

శ్లో || తరుణో రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ |

శ్లో || ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణా
పుత్రా దశరథ స్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణా |

శ్లో || శరణ్యా సర్వసత్వానాం శ్రేష్ట్లా సర్వధనుష్మతామ్
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ |

తా || తరుణ వయస్కులు రూప సంపన్నులు, మహా బలశాలురు కమల సదృశ విశాల నేత్రములు కలవారు, చీరవస్త్ర, కృష్ణ మృగ చర్మ ధారులు, ఫలమూలములను ఆహారముగా గైకొనువారు, సంయమన చిత్తులు, తపస్వులు సమస్త జీవులకు శరణిచ్చువారు ధనుర్ధారులందరిలోను శ్రేష్ఠులు, రాక్షస కులనాశకులు అయిన రామలక్ష్మణ సోదరులిద్దరు మనలను రక్షించు గాక !

శ్లో || ఆత్తసజ్యధనుషావిషుస్ప్పశావక్షయాశుగ నిషంగసంగినౌ
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్

తా || నారి సారించిన ధనుస్సులు చేబూనిన వారును, బాణముపై హస్తములను త్రిప్పుచుండువారును, అక్షయ బాణయుక్త తూణీర ధారులును అయిన రామలక్ష్మణులు నన్ను రక్షించుట కొరకు మార్గములో సదా నాకు ముందుండెదరు గాక.

శ్లో || సన్నద్ధః కవచీ ఖడ్డీ చాపబాణధరో యువా
గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః

తా || తాకీ సర్వకాల సర్వావస్థలయందు, సన్నద్ధులై యుండువారు, కవచధారులై, ఖడ్గ పాణులై ధనుర్బాణధారులై యువావస్థలోవుండు నట్టి శ్రీరామ భగవానుడు లక్ష్మణ సహితుడై మున్ముందు నడచుచు మనలను మన మనోరథములను రక్షించును గాక !

శ్లో || రామో దాశరథిశ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌశల్యేయో రఘూత్తమః ||

శ్లో || వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీ వల్లభః శ్రీమా నప్రమేయ పరాక్రమః ||

శ్లో || ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః ||

తా || (భగవత్కథన మేమన) రామ, దాశరథి, శూర, లక్ష్మణాను చర, బలి కాకుత్థ పరమపురుష, పూర్ణ కౌసల్యేయ రఘూత్తమ వేదాంతవేద్య, యజ్ఞేశ పురాణ పురుషోత్తమ జానకీవల్లభ! శ్రీమాన్అప్రమేయ పరాక్రమ యీ నామములను ప్రతి నిత్యము శ్రద్ధా పూర్వకముగా జపించు నా భక్తుడు అశ్వమేథ యాగము కన్నను మిన్నయైన అధిక ఫలము పొందు ననుటలో సందేహము లేదు.

శ్లో || రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతావాససమ్ 
స్తువంతి నామభిర్దివ్యైర్నతే సంసారిణో నరాః ||

తా || దూర్వాదళ సదృశశ్యామ వర్ణుడును, కమలనేత్రుడును పీతాంబరధారియు అయిన శ్రీ రామభగవానుని యీ దివ్య నామములను కీర్తించు వారు సంసార సాగరములో పడరు.

శ్లో || రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్
కాకుత్థ్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలమ్ శాంతమూర్తిమ్
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్.

తా || లక్ష్మణాగ్రజుడును రఘుకుల శ్రేష్ఠుడును, సీతాపతియును, అత్యంత సుందరుడును, కకుత్సకుల నందనుడును కరుణా సాగరుడును గుణనిధానుడును, బ్రాహ్మణ ప్రియుడును రాజ రాజేశ్వరుడును, సత్యప్రతిజ్ఞుడును దశరథపుత్రుడును, శ్యాముడును, శాంతమూర్తియు, సర్వలోక సుందరుడును రఘుకుల తిలకుడును రాఘవుడును రావణారియును, అయిన రామభగవానునకు నేను వందన మాచరించుచున్నాను.

శ్లో || రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||

తా || రామా, రామభద్రా! రామచంద్రా ! విధాతృ స్వరూపా, రఘునాథా ! ప్రభూ, సీతా పతివీ అయిన నీకు నమస్కారము.

శ్లో || శ్రీ రామ రామ రఘునందన రామరామ |
శ్రీ రామ రామ భరతాగ్రజ రామరామ |
శ్రీ రామ రామ రణకర్కశ రామ రామ |
శ్రీ రామ రామ శరణం భవ రామ రామ ||

తా || ఓ రఘునందనా, శ్రీరామా ! భరతాగ్రజా | భగవంతుడవగు ఓరామా ! ఓ రణకర్కశ ప్రభువైన రామా ! నీవు రక్షకుడవు కమ్ము.

శ్లో || శ్రీ రామ చంద్ర చరణా మనసా స్మరామి |
శ్రీరామ చంద్ర చరణా వచసా గృణామి |
శ్రీరామ చంద్ర చరణా శిరసా నమామి |
శ్రీరామ చంద్ర చరణా శరణం ప్రపద్యే ||

తా || శ్రీరామ చంద్రుని చరణములను నేను మనసా స్మరించు చున్నాను. శ్రీరామచంద్రుని చరణములను వాక్కు ద్వారా నేను కీర్తించుచున్నాను, శ్రీరామచంద్రుని చరణములకు శిరస్సు వంచి నమస్కరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను నేను శరణు వేడుచున్నాను.

శ్లో || మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
ర్నాన్యం జానే నైవ జానే న జానే.

తా || రాముడు నా తల్లి. రామచంద్రుడు నా తండ్రి. రాముడు నా ప్రభువు. రామచంద్రుడే నా సఖుడు. దయామయుడైన రామచంద్రుడే నా సర్వస్వము. అతనిని వీనా నేను మరెవరినీ యెంత మాత్రమూ ఎరుగను.

శ్లో || దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ |

తా || దక్షిణ భాగములో లక్ష్మణుడు వామాంకమున జానకీ దేవియు సమ్ముఖమున ఆంజనేయుడును విరాజిల్లుచుండగా భాసిల్లునట్టి రఘునాథునకు నేను వందన మాచరించుచున్నాను.

శ్లో || లోకాభిరామం రణరంగధీరం |
రాజీవనేత్రం రఘువంశనాథమ్ |
కారుణ్యరూపం కరుణాకరం తం |
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే |

తా || పరిపూర్ణత్వముగల సుందరుడును, రణక్రీడలో ధీరుడును, కమలనయనుడును, రఘువంశ నాయకుడును కరుణామూర్తియు, కరుణానిధియు అయిన శ్రీ రామచంద్రుని నేను శరణు వేడుచున్నాను.

శ్లో || మనోజవం మారుతతుల్య వేగమ్
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానర యూథముఖ్యమ్
శ్రీ రామదూతం శరణం ప్రపద్యే

తా || మనస్సమానగతితో వాయు సదృశవేగంతో పరమ జితేంద్రియుడై శ్రీమంతులలో శ్రేష్ఠుడైన పవన నందనుడు వానరాగ్రగణ్యుడు అయిన శ్రీరామ దూతను నేను శరణు వేడుచున్నాను.

శ్లో || కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం |

శ్లో || ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ |

తా || ఆపదలను హరించువాడును సమస్త సంపదలను ప్రసాదించువాడును లోకాభి రాముడును అయిన రామ భగవానుననకు నేను మాటిమాటికి నమస్కరించుచున్నాను.

శ్లో || భర్జనం భవబీజానా మర్జనం సుఖసంపదామ్
తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్ |

తా || తారామ, రామ” అని యీ ప్రకారముగా ఘోషించుట సంపూర్ణ సంసార బీజములను వేయించి వేయునదియు సమస్త సుఖసంపత్తులను ప్రాప్తింపచేయునదియు యమదూతలను భయభీతుల నొనర్చునదియు అయి యున్నది.

శ్లో || రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయ స్సదా భవతుమే భో రామ మాముద్ధర ||

తా || రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడుసదా విజయశీలుడై =యుండును. లక్ష్మీపతియగు రామ భగవానుని నేను భజించెదను. రాక్షససెన్య సర్వస్వమును ధ్వంస మొనర్చిన శ్రీ రామచంద్రునకు నేను ప్రణమిల్లుచున్నాను. రామునికన్న ఘనమై అన్యమయిన ఆశ్రయము మరియొకటి లేదు. నేను అట్టి రాముని దాసుడను. నా చిత్తము సదా రామునియందే లగ్నమయి యుండు గాక! ఓ రామా! నీవు నన్నుద్ధరింపుము.

శ్లో || శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||

తా || ( శ్రీశంకరుడు పార్వతీ దేవితో ‘ ఇట్లు పలుకుచున్నాడు) ఓ సుముఖీ! రామనామము విష్ణు సహస్రనామ తుల్యమైనది. నేను సర్వదా =రామ, రామ, రామ, అని యీ ప్రకారముగా మనోహరమైన రామనామమునందే రమించు చుందును.

( ఇతి శ్రీ బుధకౌశికముని విరచితం శ్రీ రామరక్షాస్తోత్రం సంపూర్ణం)

మరిన్ని స్తోత్రములు: