Sarva Shatrunjaya Hanumanth Stothram In Telugu – సర్వశత్రుంజయ హనుమత్ స్తోత్రం

Shatrunjaya Hanumanth Stothram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సర్వశత్రుంజయ హనుమత్ స్తోత్రం గురించి తెలుసుకుందాం…

సర్వశత్రుంజయ హనుమత్ స్తోత్రం

శ్లో॥ శ్రీమంతం హనుమంత మాత్తరిపుభి ర్భూభృత్త రుద్రాభిధం।
వగద్వాలబద్ధవై రినిచయం చామీకరాద్రి ప్రభం ।
రోషాద్రక్తపిశంగనేత్రనలినం భూభంగ మంగస్ఫుర ।
త్రోద్యచ్ఛండమయూఖ మండలముఖం దుఃఖాపహం దుఃఖినాం ॥

కౌపీనం” కటిసూత్ర మౌం జ్యజినయుగ్ధహం విదేహత్మజా ।
ప్రాణాధీశ పదారవింద నిహితస్వాంతం కృతాంతం ద్విషాం ।
ధ్యాత్వైవం సమరాంగణస్థిత మథానీయ స్వహృత్పంకజే ।
సంపూజ్యాన్ని ఖిల పూజనోక్తవిధినా సంప్రార్థయే త్రార్థితం ॥

తా॥ ఇట్లు ధ్యాన మొనర్చి యీ క్రింద వ్రాయబడిన స్తోత్రము చేయవలెను.

శ్లో॥ హనుమ న్నంజనీసూనో మహాబలపరాక్రమ ।
లోలల్లాంగూలపాతేన మామారాతీన్ని పాతయ ॥

మర్కటాధిప మర్తాండ మండల గ్రాసకారక ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥

అక్షక్షఫణిపింగాక్ష క్షితిజాశుగ్వినాశన ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

రుద్రావతార సంసార దుఃఖభారాపహారక ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

శ్రీరామచరణాంభోజ మధురాయితమానస ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

వాలికాలరదక్లాంత సుగ్రీవోవ్మోచన ప్రభో ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

సీతావిరహవారీశ మగ్నసీతేశతారక ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

రక్షోరాజ ప్రతాపాగ్ని దమ్యమానజగత్ప్రన॥
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రక్షసా బోధిమందర ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

వుచ్ఛ గుచ్ఛ స్ఫూరర్రూమానల దగ్గారిపన్తన ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥

జనన్మనోదురల్లంఘ్య పారావారవిలంఘన ।
లోలల్లాంగూలపాతేన మమారాతీ న్నిపాతయ ॥

శ్లో॥ స్మృతమాత్రసమస్తే పూరక ప్రణత ప్రియ
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

రాత్రించరచమూరాశి కరనైక వికర్తన ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥

జానకీ జానకీజాని ప్రేమపాత్ర పరంతప ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

భీమాదిక మహావీర వీరావేశావతారక ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥

వజ్రాంగనఖ దంష్టేశ వజ్రవజ్రవగుంఠన ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

ఆఖర్వ గర్వ గంధర్వ పర్వతోచ్ఛేవనస్వర ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥

లక్ష్మణప్రాణసంత్రాణ త్రాత తీక్ష కరాన్వయ ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ॥

సీతాశీర్వాదసంపన్న సమస్తావయవాక్షిత ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥

రామాది విప్రయోగార్త భరతాద్యార్తి నాశన ।
లోలల్లాంగూల పాతేన మమారాతీ న్నిపాతయ ॥

శ్లో॥ సశీఘ్రమేవాస్త సమస్తశత్రుః ।
ప్రమోదతే మారుతజ ప్రభావత్ ॥

పై విధముగ అశ్వత్థ వృక్షమూలమునఁ గూర్చిని పై స్తోత్రమునెవడు పఠించునో వెంటనే వాని సమస్త శత్రువులు నశించుననియు హనుమత్ప్రసాదమువలన సంతోషముతో నుండుననియు తాత్పర్యము.

మరిన్ని స్తోత్రములు

Bilvashtakam In Telugu – బిల్వాష్టకమ్

బిల్వాష్టకమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు బిల్వాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Bilvashtakam Lyrics Telugu

బిల్వాష్టకమ్

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్

1

త్రిశాఖైర్బిలపత్రైశ్చ హ్యచ్ఛిదైః కోమలై శ్భుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్.

2

అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణమ్

3

సాలగ్రామశిలామేకాం జాతు విప్రాయ యోరర్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణమ్.

4

దంతకోటి సహస్రాణి వాజపేయ శతానిచ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణమ్.

5

పార్వత్వాస్స్వేదతోత్పన్నం మహాదేవస్య సత్ ప్రియం
బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణమ్.

6

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వమ్ శివార్పణమ్.

7

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రత శ్శివరూపాయ ఏకబిల్వం శివార్పణమ్.

8

బిల్వాష్టక మిదం పుణ్య యఃపఠేచ్ఛివసన్నిధౌ
సర్వపాప వినిర్ముక్తః శివలోక మవాప్నుయాత్।

మరిన్ని అష్టకములు

Chyavana Maharshi – Jalarulu In Telugu | చ్యవన మహర్షి – జాలరులు

chyavanamaharshi-jalarulu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… చ్యవన మహర్షి – జాలరులు నీతికథ.

చ్యవన మహర్షి – జాలరులు

భృగుమహర్షి పులోమాదేవి పుత్రుడైన చ్యవనుడు దివ్య తేజోసంపన్నుడు ఆయుర్వేద ప్రవీణుడు. ఆ చ్యవనుడి అర్థాంగి మహాపతివ్రత అయిన సుకన్యాదేవి. వారి సంతానము దధీచి మహర్షి ప్రమతి ఆప్రవానుడు. ఒకసారి గంగాయమున సంగమ జలాలలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చ్యవనుడు. తాపసులు కామక్రోధాదులను జయించినవారు. ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగినా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు చ్యవనుడు. ఇలా ౧౨ యేండ్లు గడిచాయి. ఒకసారి విధివశాత్తు కొందరు జాలరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతోబాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కినాడు. మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు.

“ఓ జాలరులారా! భయపడకండి. మీరేతప్పూ చేయలేదు. మీ విధినిర్వహణలో తెలియకుండా ఇలా జరిగినది. మీ కష్టం ఊరికే పోకూడదు. శ్రమించినందుకు తగిన ఫలితము మీకు రావాలి. అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి” అని అన్నాడు. చ్యవనుడి ఉదార స్వభావానికి అశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపఱచామని రాజైన నహుషుడి వద్దకు వెళ్ళి వాళ్ళంతట వాళ్ళు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరారు.

జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహుషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి కడకేగి ఆయనకు పాదాభివందనం చేసి “మహానుభావా! ఈ బెస్తలు తెలియక తప్పుచేశారు. దీనికి ప్రాయశ్చిత్తమేమిటో మీరే సెలవీయ్యండి” అని అన్నాడు. దయామయుడైన చ్యవనుడు “రాజా! ఈ జాలరుల దోషమేమీ లేదు. వారి కులవృత్తిని పాటించారు అంతే. వీరికి వారి కష్టమునకు తగిన వెల దక్కేటట్టు చూడు” అని సత్యభాషణం చేశాడు. నహుషుడు తన మంత్రులతో ఆ జాలరులకి వెయ్యి మాడలు ఇవ్వమని ఆదేశించాడు. కానీ చ్యవనుడు అది తనకు సరైన వెలకాదన్నాడు. రాజు పదివేలు లక్ష చివరికి కోటి మాడలిస్తానన్నా అది తనకు సరైన ధరకాదన్నాడు చ్యవనుడు. నహుషుడు “అయితే అర్ధరాజ్యమిస్తాను” అని అన్నాడు. “నీ మంత్రులతో సంప్రదించి చూడు” అన్నాడు చ్యవనుడు. “ఆలోచించడానికేమున్నది? నా రాజ్యసర్వస్వమూ ఇస్తాను” అని అన్నాడు నహుషుడు! చ్యవనుడు అయినా అది సరిపోదన్నాడు.

ఏమి చేయాలో తోచని నహుషుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడనే ఒక మహాముని “గోవు త్రిలోక పూజ్యమైనది. సర్వదేవతా స్వరూపమైనది. సకల వేద శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెల కట్టడం అసాధ్యం. అలాగే గోవుకు కూడా వెలకట్టలేము. అందుకని ఒక గోవునివ్వు”. అలాగే చేశాడు నహుషుడు. చ్యవనుడు సంతోషించాడు. తగిన వెల ఇచ్చావని అన్నాడు.

ఆ జాలరులు కూడా సామాన్యులా? ఇలా అనుకున్నారు “ధనధాన్యాదులు ఎప్పుడైనా సంపాదించవచ్చు. కానీ ఒక మంచి పని చేశే అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి”. ఇలా అనుకుని మహర్షి కడకేగి “అయ్యా! బ్రహ్మ తుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి” అని అన్నారు. వాళ్ళ మంచితనానికి సంతోషించిన చ్యవనుడు ఈ చేపలకీ మీకూ సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు. ఆ తరువాత నహుషుడి ధర్మబుద్ధికి మెచ్చి చ్యవనుడు గవిజాతుడు తమని వరం కోరుకో మన్నారు. వినయముతో నహుషుడు “స్వామీ! మీరు తృప్తిపొందితే అదే చాలు. నాకింకేదీ అక్కరలేదు” అన్నాడు. అతని వినయవిధేయతలకు ఆనందించి ఇంద్రపదవిని అనుగ్ర హించి అంతర్ధానమయ్యారు ఆ మహర్షులు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. తన తీవ్ర తపస్సు భంగమైనా కొంచముకూడా కోపించకుండా చ్యవనుడు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఆ జాలరులను మన్నించాడు.
  2. జాలరుల నిజాయితీ మనకు కనువిప్పు కావాలి. చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి తమకు తాముగా వెళ్ళారు జాలరులు.
  3. సత్కర్మలు చేశే అవకాశం అరుదుగా వస్తుందని. వచ్చినప్పుడు సంకోచించకుండా వాటిని చేయాలని మనకు చూపించారు జాలరులు.
  4. గోమాత యొక్క ప్రాధాన్యము ఈ కథలో మనకు తెలిసినది. సాక్షాత్తు బ్రహ్మదేవునితో సమానమైనది గోవు అని చెప్పాడు గివిజాత మహర్షి..
  5. ధర్మపాలనకై తన సర్వస్వమునూ త్యాగం చేయటానికి సిద్ధపడ్డ నహుషుడు మనకు ఆదర్శము కావాలి.

మరిన్ని నీతికథలు మీకోసం:

Jagannatha Ashtakam In Telugu- జగన్నాథాష్టకమ్

Jagannatha Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు జగన్నాథాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Jagannatha Ashtakam Lyrics Telugu

జగన్నాథాష్టకమ్

కదాచిత్ కాళిందీతటవిపినసంగీతకవరో
ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః,
రమాశంభుబ్రహ్మా మరపతిగణేశార్చితపదో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.

1

భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచరకటాక్షం విదధతే,
సదా శ్రీమద్భృందావనవసతి లీలాపరిచయో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.

2

మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ ప్రాసాదాంతస్సహజబలభద్రేణ బలినా,
సుభద్రామధ్యస్థః సకలసుర సేవావసరదో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.

3

కృపా (కథా) పారావారస్సజల జలదశ్రేణిరుచిరో
రమావాణీ సోమస్ఫురదమలపద్మోద్భవముఖైః
సురేంద్రరారాధ్యః శ్రుతిగణ శిఖాగీతచరితో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.

4

రథారూఢా గచ్ఛన్ పథి మిళితభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః,
దయాసింధుర్బంధుః సకలజగతాం సింధుసుతయా
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.

5

పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోనంతశిరసి,
రసానందో రాధాసరసవపురాలింగనసుఖో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.

6

న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవం
న యాచేహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూం,
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.

7

హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే !
హర త్వం పాపానాం వితతమపరాం యాదవపతే !
అహో దీనానాథం నిహితమచలం నిశ్చితపదం
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే.

8

ఇతి శ్రీ జగన్నాథాష్టకమ్

మరిన్ని అష్టకములు

Vatapi Jeernam In Telugu – వాతాపి జీర్ణం

Vatapi Jeernam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వాతాపి జీర్ణం నీతికథ.

వాతాపి జీర్ణం

(ఈ కథ ఆరణ్యపర్వంలో ఉంది.)

చాలా రోజులక్రితం మాట.
అగస్త్యుడనే పేరుగల బ్రహ్మచారి ఉండేవారు. ఆయన తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తూ సర్వ ప్రాణి కోటినీ దయాహృదయంతో చూసే వాడు.
ఆయన తపోదీక్ష మహామహులెందరికో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేది. అలా తపస్సు చేసుకుంటూ అరణ్యాలలో తిరుగుతూండగా – పితృ పితామహులు కనిపించి:
‘నాయనా, యోగ్యురాలయిన కన్యను వివాహం చేసుకుని నువ్వు పుత్ర సంతానం పొందాలి. లేకపోతే మాకు ఉత్తమ లోకాలు దొరకవు ‘ అన్నారు.
కులవృద్ధుల మాట శిరసావహించి అగస్త్యుడు తనకు తగిన భార్య కోసం అన్వేషణ ఆరంభించాడు.
తిరిగి తిరిగి విదర్భదేశం చేరాడు.
ఆరాజుగారి యింట మెరపు తీగెవంటి లావణ్యంతో, నిర్మల సరో వరంలోని నల్ల కలువ వలె పెరుగుతున్న లోపాముదము చూశాడు.
అందచందాలలోనే కాదు వినయగుణ శీలాలలో కూడా ఆమె యోగ్యురాలని గ్రహించాడు.
ఆ మహారాజు అగస్త్య మహర్షి రాగానే ఆయనకు స్వాగతం పలికి, అర్ఘ్యపాద్యాలతో పూజించాడు.

వారి పరిచర్యలకు సంతోషించి ఆ మునిచంద్రుడు :
‘మహారాజా! మా వంశాన్ని ఉద్దరించే ఉత్తమ సంతానం కోసం కుమార్తెను నా భార్యగా కోరుతున్నాము’ అన్నాడు. మహారాజు గుండె దడ దడ లాడింది. మనస్సు ఆందోళనలో పడింది. చీని చీనాంబ రాలతో మణిరత్న భూషణాలతో, హంసతూలికా తల్పాల మీద రాజభవనంలో వందలాది దాసీజనాం సేవలందుకుంటూ ఇంద్రభోగం అనుభవించవలసిన తన కూతురు, ఈ మునీశ్వరుడి భార్యగా వనవాసం చేస్తూ పటకుటీరాలలో నార చీరలు ధరించి, కందమూల ఫలాలు తింటూ జీవించగలదా? అనే సందేహంలో పడ్డాడు.

ఈ వార్త విని మహారాణి విదార సాగరంలో మునిగింది.
అది చూసి లోపాముద్ర చిరునవ్వుతో తండ్రిని సమీపించి :
నా వల్ల మీరు కష్టాలపాలు కానవసరం లేదు. నేను సంతో షంతో ఈ మునీశ్వరుని భార్యగా, ఆయన సేవచేసి వారి అనుగ్రహం పొందుతాము’ అంది.

విధి విహితంగా లోపాముద్రా వరిణయం జరిపించాడు మహారాజు.
లోపాముద్ర తన ఆభరణాలు, చీని చీనాంబరాలు విడిచి నార చీరలతో సామాన్య మునిపత్నీ వేషంతో ఆయన వెంట అరణ్యానికి వచ్చి నిరంతరం పతిసేవలో ఆయన హృదయాన్ని చూరగొన్నది.
గంగానదీ తీరాన రమణీయ వనంలో పట కుటీరంలో రాజపుత్రిక వార చీరలతో చలిగాలులూ, వేడిగాడ్పులూ లెక్కచెయ్యకుండా ఎంతో ఓరిమితో సేవలు చెయ్యడం ఆ మునిని ఎంతగానో అలరించింది.
అయినా ఆయన తన ఋషిధర్మాన్ని విడువకుండా వేదవిహిత కర్మలే కొనసాగిస్తున్నాడు. రోజులు సాగిపోతున్నాయి. కాలచక్రం తిరుగుతున్నది.
ఆ విధంగా కొంతకాలం గడిచాక ఒకనాడు లోపాముద్ర ఋతు స్నానం చేసి సర్వాంగ శోభతో ఆశ్రమ ప్రాంగణంలో నడయాడు. చుండగా మహర్షి మనస్సు చలించింది.

ఆమెను చేరబిలిచి, చెయ్యిపుచ్చుకుని; బుగ్గ ముద్దాడబోగా ఆమె మందహాసంతో వెనుదిరిగి !
‘స్వామీ! ఆశ్రమ ధర్మాన సారం మనం ఈ పట కుటీరంలో దర్భ శయ్యలమీద జీవితం గడుపుతున్నాం. ఇప్పుడు మీకు సంసార సుఖం కావాలంటే, నేను మానాన్న గారింట ఏ భోగభాగ్యాలతో ఉండే దానినో అవి సమకూర్చగలిగితే, సుఖంగా ఆ సంతోషం మీకు అందివ్వ గలను’ అని క్షణం ఆగి, మీ వంటి మహా తపస్వికి అవి సమకూర్చడం నిమిషాలలో పని. నా ఋతుకాలం పూర్తి కాకుండా అవి సమకూర్చండి’ అంది.
ఆలోచించాడు, ఆ మునీశ్వరుడు. ఈ సాంసారిక సుఖంకోసం తపశ్శక్తిని వ్యయం చేరడం యిష్టం లేకపోయింది.
ఏ మహారాజు నయినా ఆర్థించాలని బయలుదేరాడు. వెళ్ళి ముగ్గురు మహారాజులను దర్శించి.
‘ఎవరికి కష్టం కలగకుండా మీ ఆదాయంలో నా కెంక దానం చెయ్యగలరు’, అని అడిగాడు.
వారందరూ తమ ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నా యన్నారు.
వారి సూచనానుసారం ఇల్వలుడనే దానవరాజు దగ్గర కావలసిన సంపవలన్నీ ఉన్నాయన్నారు. ఆయన ఈ రాజులను వెంటబెట్టుకుని అదే బయలుదేరాడు.
ఈ ఇల్వలుడు వాతాపిసోదరుడు. వారిద్దరూ ఒక అరణ్యంలో ఉంటూ ఆ దారిని వచ్చేవారిని భోజనానికి పిలుస్తారు. వారు రాగానే వాతాపి మేకలా మారిపోతాడు.
ఆ మేకను చంపి వండి పెడతాడు, ఇల్వలుడు. వారు హాయిగా భుజించాక ఇల్వలుడు:
“సోవరా, వాతాపీ’ అని పిలవగానే వాడు పొట్ట చీల్పుకుని బయటపడగానే అన్న దమ్ములిద్దరూ ఆ అతిథిని వండుకు తింటారు.

అది వారి జీవన విధానం.
అగస్త్యుడు తనతో రాజులను వెంటబెట్టుకుని రాగానే వివయంగా వెళ్ళి వారికి స్వాగతం పలికి ఆశ్రమానికి తీసుకు వెళ్ళారు.
వారి ఎదురుగానే మేకను వండిపెట్టబోగా ఆ రాజులు భయంతో మునివైపు చూశారు.
ఆయన వారికి అభయమిచ్చి వండినదంతా ముందు నాకు వడ్డించు. మిగిలితే వారి విషయం చూద్దాం’ అన్నాడు.

సరిగ్గా అదే సమయానికి ఇల్వలుడు –
సోదరా ! వాతాపీ’ అని అరిచాడు.
అదివిని అగస్త్యుడు: ‘ఇంకా ఎక్కడ వాతాపి వాడింక తిరిగి రాడు’, అని నవ్వగా ఇల్వలుడు భయపడి :

‘స్వామిః క్షమించండి’ మీకు నా సర్వ సంపదలూ యిస్తాను, అని తన వద్ద నున్న మణిరత్న సువర్ణ రాసులు రథంమీద ఉంచి ఆయనకు అర్పించాడు.
ఆయన కదలబోతుండగా ఆయనను సంహరించబోగా మహర్షి వెను తిరిగి హుంకరించాడు. ఇల్వలుని దేహం గుప్పెడు బూడిద
మహాముని ఆ సంపదతో ఆశ్రమానికి వచ్చి !
‘ధర్మచారిణీ లోకంలో అందరిలా ఉండే పుత్రులు, అసంఖ్యా
కంగా కావాలా? గుణశీల వంతుడయిన కుమారుడు ఒకడు కావాలా? అని ఆడిగారు.
ఆవిడ గుణవంతు డొకడు చాలునంది.
అనంతరం ఆ దంపతుల సంసార యాత్రా ఫలంగా దృఢదస్యుడనే మహాతపస్వి ప్రభవించాడు.
వాతాపిజీర్ణం జీర్ణం జీర్ణం వాతాపితీర్థం అనే నానుడి ఈ కథ వల్ల పుట్టింది. ఇది భోజనానంతరం ఉచ్చరిస్తే తిన్నది బాగ జీర్ణమవుతుందని పెద్ద అంటారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Sita Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సీతా అష్టోత్తర నామావళి

Sri Sita Ashtottara Shatanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సీతా అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

శ్రీ సీతా అష్టోత్తర నామావళి

ప్రతి నామమునకు ముందుగా ఓమ్ అని చదువుకొనవలయును

  • ఓం శాంతాయై నమః
  • మహేశ్వర్యై నమః
  • నిత్యాయై నమః
  • శాశ్వత్యై నమః
  • పరమాక్షరాయై నమః
  • అచింత్యాయ నమః
  • కేవలాయై నమః
  • అనంతాయై నమః
  • శివాత్మనే నమః
  • పరమాత్మికాయై నమః
  • జానక్యై నమః
  • మిధిలానందాయై నమః
  • రాక్షసాంతవిధాయిన్యై నమః
  • రమ్యాయై నమః
  • రామవక్షస్థలస్ధాయై నమః
  • ప్రాణేశ్వర్యై నమః
  • ప్రాణరూపాయై నమః
  • ప్రధాన పురుషేశ్వర్యై నమః
  • సర్వశక్యై నమః
  • జోత్స్నాయైనమః
  • కాలాయై నమః
  • కాష్ఠాయై నమః
  • ఇందుమహిమాస్పదాయే నమః
  • పురాణ్యై నమః
  • చిన్మయై నమః
  • పుంసమాధ్యై నమః
  • పురుషరూపిణ్యై నమః
  • భూతాంతరాత్మనే నమః
  • కూటస్ధాయై నమః
  • మహాపురుష సంజ్ఞతాయై నమః
  • స్వకార్యాయై నమః
  • కార్య జనన్యై నమః
  • బ్రహ్మేశాయై నమః
  • బ్రహ్మాసంశ్రయాయై నమః
  • వ్యక్తాయై నమః
  • ప్రథమజాయై నమః
  • బ్రహ్మాణ్యై నమః
  • మహాత్మనే నమః
  • జ్ఞానరూపిణ్యై నమః
  • మహేశ్వర్యై నమః
  • సముత్పన్నాయై నమః
  • భుక్తి ముక్తి ఫలప్రదాయై నమః
  • సర్వేశ్వర్యై నమః
  • సర్వవర్ణాయై నమః
  • నిత్యాయై నమః
  • ముదితమానసాయ నమః
  • వాసవ్యై నమః
  • వరదాయై నమః
  • వాచ్యాయై నమః
  • కర్రెనమః
  • సర్వార్థసాధికాయై నమః
  • వాగీశ్వర్యై నమః
  • సర్వవిద్యాయై నమః
  • మహావిద్యాయై నమః
  • సుశోభనాయై నమః
  • శోభాయై నమః
  • వంశకర్యై నమః
  • లీలాయై నమః
  • మానిన్యై నమః
  • పరమేష్టిన్యై నమః
  • త్రిలోకసుందర్యై నమః
  • కామచారిణ్యై నమః
  • విరూపాయై నమః
  • సురూపాయై నమః
  • భీమాయై నమః
  • మోక్ష ప్రదాయిన్యై నమః
  • భక్తార్తి నాశిన్యై నమః
  • భవ్యాయై నమః
  • భవభావని వాసిన్యై నమః
  • వికృత్యై నమః
  • శాంకర్యై నమః
  • శాంత్యై నమః
  • గంధర్వ యక్ష సేవితాయై నమః
  • వైశ్వానర్యై నమః
  • మహాశీలాయై నమః
  • దేవసేనాయై నమః
  • గృహ ప్రియాయై నమః
  • హిరణ్మయ్యై నమః
  • మహారాత్ర్యై నమః
  • సంసారపరివర్తి కాయై నమః
  • సుమాలిన్యై నమః
  • సురూపాయై నమః
  • తారిణ్యై నమః
  • భావిన్యై నమః
  • ప్రభాయై నమః
  • జగత్రియాయై నమః
  • జగమ్మార్యై నమః
  • అమృతాశ్రయయై నమః
  • నిరాశ్రయాయై నమః
  • నిరాహారాయై నమః
  • నిరంకుశాయై నమః
  • రణోర్భవాయై నమః
  • శ్రీ ఫల్యై నమః
  • శ్రీ మత్యై నమః
  • శ్రీ శాయై నమః
  • శ్రీనివాసాయై నమః
  • హరిప్రియాయై నమః
  • శ్రీకర్యై నమః
  • కామప్రియాయై నమః
  • ఓం శ్రీ ధరాయై నమః
  • ఈశవరిణ్యై నమః
  • శ్రీ వేదవత్యై నమః
  • శ్రీ హనుమదాశ్రితాయై నమః
  • మహాలక్ష్యై నమః
  • సరసామృతధాత్ర్యై నమః
  • శ్రీ పట్టాభిరామ ప్రియాయై నమః

శ్రీ సీతాదేవ్యై నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి

మరిన్ని అష్టోత్తరములు

Kakabhusundi Purvajanma Vrttantamu In Telugu – కాకభుశుండి పూర్వజన్మ వృత్తాంతము

Kakabhusundi Purvajanma Vrttantamu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీతులసీదాస కృత రామచరితమానసము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కాకభుశుండి పూర్వజన్మ వృత్తాంతము నీతికథ.

కాకభుశుండి పూర్వజన్మ వృత్తాంతము

నారద మహర్షి పంపగా గరుడ భగవానుడు మేఘనాథుని చేతిలో తనకు తానే బంధింపబడిన శ్రీరాముని బంధములను తొలగించెను. శ్రీరాముని మాయావశుడైన గరుడుడు ఇలా ఆలోచించసాగెను “సర్వవ్యాపకుడు నిర్వికారుడు వాగాధిపతి మాయాతీతుడు అయిన పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరామునిగా అవతరించెనని విన్నాను. శ్రీరామ నామమును జపించినంత మాత్రముననే మానవులు భవబంధవిముక్తులు అగుదురనీ విన్నాను. కానీ అట్టి మహిమాన్వితుడైన శ్రీరాముడు ఒక రాక్షసాధముని నాగపాశముచే బంధింపబడుట ఏమి”? ఇలా మాయామోహితుడై వ్యాకులచిత్తుడైన గరుడుడు బ్రహ్మర్షి అగు నారదుని కడకేగి తన సందేహమును వ్యక్తపఱచి కాపాడమని ప్రార్థించెను.

నారదుడు గరుడుని సందేహనివారణార్థం సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికడకు పంపెను. తన వద్దకు వచ్చిన గరుడునితో బ్రహ్మదేవుడిలా అన్నాడు “ఓ విహగేశ్వరా! పరమశివుడు శ్రీరాముని మహిమను బాగా ఎఱుగును. కావున నీవు ఆ శంకరునే శరణువేడుము”. కుబేరుని కడకు వెళుతున్న మహాదేవుని కలిసి గరుడుడు తన సందేహమును చెప్పెను. “ఓ పక్షీంద్రా! ఎంతో కాలము సజ్జనుల సేవను చేసిగానీ జ్ఞానమును పొందలేము. నిన్ను నిరంతర రామకథాప్రసంగములు జరిగే దివ్యమైన నీలగిరిలోని పరమ భాగవతోత్తముడైన కాకభుశుండి ఆశ్రమమునకు పంపెదను” అని పార్వతీనాథుడు ఆనతిచ్చెను.

వేయి మందిలో ఒక్కడే ధర్మపథమును సర్వకాల సర్వావస్థలయందూ అనుసరించును. అట్టి కోటి ధర్మాత్ములలో ఒక్కడు పేరాశకు లోనుకాక విరాగి వలె ఉండును. అట్టి కోటి విరాగులలో ఒక్కడు జ్ఞాని అగును. అలాంటి జ్ఞానులలో కోటికొక్కడే జీవన్ముక్తుడగును. అట్టి వేయిమంది జీవన్ముక్తులలో అరుదుగా ఒక్కడు బ్రహ్మైక్యమును పొందును. అలా బ్రహ్మైక్యమును పొందినవారిలో మిక్కిలి అరుదుగా సంపూర్ణ ముగా మాయావిముక్తుడై శ్రీరాముని భక్తిలో లీనమైన ప్రాణి ఉండును. అట్టి దుర్లభమైన నిష్కల్మష రామభక్తి ఉన్న కాకభుశుండి కడకు గరుడుడు వచ్చెను. వచ్చిన గరుడుని తగిన రీతిలో గౌరవించి కుశలమడిగి సముచిత ఆసనముపై కూర్చుండబెట్టి గరుడునికి సంక్షిప్త రామాయణము మొదలగు ఎన్నెన్నో అతిరహస్యములైన తత్త్వములను వివరించి గరుడుని కోరికపై తన పూర్వజన్మ కథను ఇలా చెప్పాడు రామభక్తుడైన కాకభుశుండి.

“పూర్వము ఒకానొక కల్పములో కలియుగము ఆరంభమైనది. కలికాలము మిక్కిలి కలుషితమైనది. స్త్రీ పురుషులందఱూ పాపకర్మనిరతులై వేదవిరుద్ధముగా మోహాధీనులై క్షణికమైన జీవితకాలము కలిగియూ కల్పాంతములు దాటే గర్వము దంభము అహంకారమును కలిగియుందురు. పాషండులు తమవిపరీత బుద్ధులతో క్రొత్తక్రొత్త సాంప్రదాయాలను ఆచారాలను కల్పించి ప్రచారం చేయుదురు. ఎవరికి ఏది ఇష్టమో అదే ధర్మమని అందురు. ఒక వైపు బ్రహ్మజ్ఞానము గూర్చి మాట్లాడుతూ మఱోక వైపు లోభముచే ఎంత మహాపాపకార్యమైనా చేయుటకు వెనుకాడరు. తాము స్వయముగా భష్టమగుటే కాక సన్మార్గమున నడచువారినికూడా భృష్ణుపఱచెదరు. వర్ణాశ్రమధర్మాలు అడుగంటుతాయి. ప్రజలలో సామరస్యం సమైక్యభావం నశిస్తుంది. నిష్కారణ వైరములతో కక్షలతో ఉండెదరు. వేదశాస్త్ర పురాణములను గౌరవించరు. కుతర్కములతో వేదశాస్త్రపురాణ నిందచేసి అనంతపాపరాశిని సొంతం చేసుకుంటారు.

పూజలు దానధర్మాలు స్వార్థబుద్ధితో తామసముతో చేసెదరు. విద్యను అన్నమును అమ్ముకొనెదరు. ధనవంతులకే గౌరవమివ్వబడును. గురుశిష్య భార్యభర్త మాతాపితభ్రాత అను సంబధములకు విలులేకుండును. ఆడంబరముగా జీవించుచూ వేదమార్గమును త్యజించి దిగంబరత్వము సమర్థించి ఆపాదమస్తకమూ కపటత్వముతో నిండియున్న వారు గురువులై అధర్మబోధలు చేశాదరు. అమంగళకరమైన వేషభూషణాదులను ధరించి శిరోజములను విరియబోసుకొనెదరు. తినదగినది తినగూడనిది అను విచక్షణ తినుటకు సమయం అసమయం అను విచక్షణ చేయక అన్నింటిని అన్ని వేళలా తినెదరు. అలా పాపకూపములో పడి ఇహములో పరములో బహు క్లేశాలను అనుభవించెదరు.

కానీ ఈ కలియుగమున ఒక గొప్పగుణము కలదు. “కలౌ సంకీర్తనాన్ముక్తిః” యొగ యజ్ఞ పూజాదులకు ఆస్కారములేని ఈ యుగములో భగన్నామస్మరణ చేసి జనులు ముక్తిని పొందెదరు. ఓ పన్నగాసనా! ఇంద్రజాలికుడు ప్రదర్శించుమాయ చూచువారిపైనే ప్రభావమును చూపును. కానీ అతనిసేవకులను అది ఏమీ చేయదు. అట్లే మాయకు మూలమైన భగంపంతుని శరణుజొచ్చిన వానికి ఆ అనూహ్యమైన మాయ అంటదు.

అట్టి కలియుగములో నేను భూవైకుంఠమైన అయోధ్యానగరములో ఒక శూద్రునిగా జన్మించినాను. మనోవాక్కర్మలచే నేను అఖండ శివభక్తుడను. కానీ నా బుద్ధిమాన్యముచే ఇతరదేవతలను దూషించుచుండెడి వాడను. అతిగర్వముతో ధనగర్వముతో నేనుండగా ఒకసారి అయోధ్యలో కఱవు వచ్చింది. దరిద్రుడనై దుఃఖితుడనై ఉజ్జయినీ నగరము చేరి అక్కడ కొంత ధనము సంపాదించి పరమ శివుని ఆరాధన కొనసాగించితిని. ఒక్కడ అతిదయాళువు నీతిమంతుడు పరమసాధువైన ఒక విప్రోత్తముడు వైదిక పద్ధితిలో అహర్నిశలూ శివుని ఏకాగ్రచిత్తముతో నిష్కల్మషముగా పూజించుచుండెను. అతడు ఎన్నడునూ విష్ణు నింద చేయలేదు.

కపటబుద్ధితో నేనతనికి సేవ చేయుచుండెడివాడను. ఆ భూసురుడు నన్ను పుత్రవాత్సల్యముతో చూచుచూ బోధించుచుండెను. శివభక్తినే కాక ఇతరములైన ఎన్నో నీతులను నాకతడు బోధించెను. నేను ప్రతి దినమూ దేవాలయమునకు పోయి శివనామస్మరణము చేసెడివాడను కానీ నా అహంకారమును నేను విడువలేదు. హరిభక్తులను పండిత సజ్జనులను ద్వేషించెడివాడను.

నా గురువు నా ప్రవర్తన చూసి చాల బాధపడి నిత్యమూ ఎన్నో సదుపదేశములిచ్చెడివాడు. ఆ ఉపదేశములను పెడచెవిన పెట్టి గురుద్రోహము చేయుచూ నాలోని కోపాగ్నిని ప్రజ్వలింప చేయుచూ జీవించుచుంటిని. ఇలా ఉండగా ఒక రోజు నా గురువు నన్ను పిలిచి శివకేశవుల అభేదత్వము బోధించి “పరమాత్మ అయిన శ్రీరామునికి సర్వదేవతలు బ్రహ్మ శివుడు నమస్కరించెదరు. అట్టిది నీవు ద్వేషించుట తగదు” అని అనెను. అది వినడంతో నా కోపాగ్ని మింటికెగసెను. అనర్హుడనైన నాకు విద్యనొసగిన నా గురువునకే ద్రోహము తలపెట్టాను. అయినా క్రోధాదులను జయించిన అతడు నాపై ఏమాత్రమూ కోపపడలేదు.

ఒక రోజు నేను శివాలయములో శివనామము జపించుచుండగా నా గురూత్తముడు అచటికి వచ్చెను. నా గర్వము వలన లేచి ఆయనకు నమస్కరించలేదు. దయానిధి అయిన నా గురువుకు నా దౌష్ట్యము చూచియు కొంచెముకూడా కోపమురాలేదు! కాని గురువును నిరాదరించుట మహాపాపము. పరమశివుడు ఇది చూసి సహింపలేక “ఓరీ మూర్ఖుడా! పూర్ణజ్ఞాని అయిన నీ గురువును అవమానించినావు. నీవు క్షమార్హుడవు కాదు. సద్గురువుపై ఈర్షగొన్నవాడు కోట్లాది యుగములు రౌరవాది నరకములలో పడి తరువాత పశుపక్షాది జన్మలు పొంది అటుపై వేలకొలది జన్మలు క్లేశములభవించును. నీ విప్పుడే అజగరముపై ఒక చెట్టుతొఱ్ఱలో పడివుండు” అని నన్ను శపించెను. భయకంపితుడనైన నన్ను చూసి నా గురువర్యుడు రుద్రాష్టకముతో శివుని ప్రసన్నుని చేసుకుని పశ్చాత్తాపముతో దుఃఖిస్తున్న నాకు శాపావశానము ప్రసాదించమని వేడుకొనెను. అంతట పరమేశ్వరుడు

“ఓ కృపానిధీ! మహాపకారికైనా మహోపకారము చేయు నిన్ను మెచ్చితిని. నీ శిష్యునికి శాపావశానమిచ్చెద” అని నన్ను చూసి “చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. నీవు దుర్భరమైన వేయి జన్మలెత్తుతావు. కానీ నీ గురువు మహిమవల్ల దివ్యమైన అయోధ్యానగరమున పుట్టినందువల్ల నీ మనస్సును నాయందు పెట్టి నన్ను పూజించినందువల్ల నీలో అచంచలమైన రామభక్తి ఉదయిస్తుంది. ప్రతి జన్మలో నీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వత్సా! ఇంకెప్పుడూ సాధుసజ్జనవిపులను నిరాదరింపవద్దు.

ఇంద్రుని వజ్రాయుధముతో నాత్రిశూలముతో యముని దండముతో శ్రీహరి చక్రముతో చంపబడనివాడు సజ్జనద్రోహమనెడి అగ్నిలో పడి మాడిపోతాడు” అని చెప్పి నాపై కృపావర్షం కురిపించినాడు ఉమానాథుడు. అప్పటినుంచీ ప్రతి జన్మలోనూ నేను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపముతో దుఃఖిస్తూ రామునిపై భక్తిని మఱువక చివరికి కాకి జన్మనెత్తి మహనీయుడైన లోమశ మహర్షి వద్ద శ్రీరామచరితమానసము విని కాకభుశుండినై శ్రీరామునికి ప్రియుడనైనాను”.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. గురుద్రోహం శివకేశవులను భేదబుద్ధితో చూడడం సాధుసజ్జనులను అవమానించడం ఘోరపాపములని మహాశివుడు కాకభుశుండి తో చెప్పాడు. కావున మనము గర్వముతో ఇట్టి తప్పులెన్నడునూ చేయరాదు.
  2. కాకభుశుండి గురువు యొక్క దయాగుణం మనకు ఆదర్శం కావాలి. శిష్యుడెన్ని అవమానాలుచేసినా తను చెప్పిన హితవాక్యాలను పెడచెవిన పెట్టినా ఏ మాత్రమూ కోపగించుకోలేదు.
  3. రామభక్తుడైన కాకభుశుండి కలియుగ వర్ణనము వలన మనకు చేయకూడనివి ఎన్నో తెలిసినాయి. ఇట్టి దుష్కృతాలకు దూరముగా ఉండి ధర్మమార్గములో నడచుచూ నిత్యం భగవన్నామస్మరణ చేయడమే మన కర్తవ్యము.

మరిన్ని నీతికథలు మీకోసం:

Annadana Mahima Goppadi In Telugu – అన్నదాన మహిమ గొప్పది

Annadana Mahima Goppadi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… అన్నదాన మహిమ గొప్పది నీతికథ.

అన్నదాన మహిమ గొప్పది

(ఈ కథ అశ్వమేధ పర్వంలో ఉంది. వైశంపాయనునిచే జనమేజయునికి చెప్పబడింది.)

ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులూ, మహారథులూ ఎందరో కన్ను మూశారు. పద్దెనిమిది అక్షోహిణులసేనలో కురుపక్షంలో అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవులయిదుగురు, కృష్ణుడూ, సాత్యకీ మిగిలారు.

ధర్మరాజుకి పట్టాభిషేకం జరిపించారు. అంపశయ్యమీద ఉన్న భీష్మపితామహుడు సర్వధర్మవిషయాలూ బోధించి ఉత్తరాయణ పుణ్య కాలం ప్రవేశించగానే యోగమార్గాన దివ్యలోకాలు చేరాడు. జరిగిన సంగ్రామంలో ఆప్తులు, ఆత్మీయులూ అందరూ మరణిం చారనే బాధ ధర్మరాజు మనస్సుని వికలంచేస్తూనే ఉంది. ఈ మహా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించగా అశ్వమేధం సాగించ మని విద్వాంసులు సలహా యిచ్చారు.

వారి ఆదేశానుసారం అశ్వమేధయాగం ఆరంభించాడు. దేశ దేశాలనుంచి చక్రవర్తులూ, విద్వాంసులూ ఎందరో వచ్చారు. వివిధ నగరాలనుంచి, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిల కించడానికి వస్తున్నారు. చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతోపాటు నిర్విరామంగా అన్న దానం గూడా జరిపించాడు. యోగ్యులై నవారికి సువర్ణ, మణి, రత్నదానాలు చేశాడు. అక్కడకు వచ్చినవారిలో సంతృప్తిపడకుండా ఉన్నవాడు ఒకడూ లేడు. అలా సర్వజన సంతృ ప్తికలిగించిన అశ్వమేధయాగం చూచిన దేవ తలు పూలవాన కురిపించి ధర్మరాజుని అభినందించారు.

అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగిన వచ్చింది. వారందరూ ఈ శాలలోకి ముంగిన ఎలా వచ్చిందా? అని ఆశ్చర్యంతో చూస్తున్నారు.

అప్పుడా ముంగిస నవ్వుతూ ‘దేవతలు కూడా అభినందించే యాగమా యిది’ అంది. తెల్లబోయారు అందరూ. దాని శరీరంలో ఒకభాగం బంగారు కాంతులీనుతోంది. రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది.

‘సక్తుప్రస్థుడి ధర్మ బుద్ధితో పోలిస్తే యీ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం’? అంది.

అందరూ తెల్లబోయారు. దానినిచూస్తూ : ‘ఎవరా మహనీయుడు । ఏవిటాయన కథ’ అన్నారు. అలా వారు ఆతురతతో అడుగగా : ‘సావధానంగా వినండి’ అని ఇలా చెప్పింది ముంగిస.

‘ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలాకాలం క్రితం సత్తు ప్రస్థుడనే పేరుగల గృహయజమాని ఉండేవాడు. ఆయనకు ఒకే కుమారు డుండేవాడు. ఆ అబ్బాయికి కూడా వివాహం అయింది. వారు నలుగురూ సర్వభూత కోటిని దయతోచూస్తూ, కామ క్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కొడుకూ, కోడలూ ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు. ఎవ్వరికీ హానిచేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికినదాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు.

పరబ్రహ్మమీదనే మనస్సునిలిపి జీవితం సాగించడానికే ఆహారం తీసుకునేవారు. ఆ జీవితంకూడా వరమేశ్వరధ్యానానికే అర్పించేవారు.
అలా ఉండగా ఒకనాడు :
వారు తమ పరిసర ప్రాంతాలలోని చేలలో తిరిగి, అక్కడ రాలిన ధాన్యపుగింజలు ఏరి తెచ్చుకుని, దంచి, పండిచేసి, వండుకుని నలుగురూ సమంగా పంచుకున్నారు. తినడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి సమయంలో, ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయనకళ్ళు లోతుకు పోయాయి. ఎముకలు బయట పడుతున్నాయి. డొక్కలు మాడి ఉన్నాయి. ఆకలి, ఆకలి అని నీరసంగా అడిగాడు.

ఆయనను ఆదరంగా తీసుకునివచ్చి, తన పక్క కూర్చో పెట్టుకుని ఆర్యా ! తమరు కుశలమే కవ! మా ఆతిథ్యం స్వీకరించి, అనుగ్ర హించండి. ఏ ప్రాణికీ హాని కలుగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా మేంతెచ్చుకున్న ధాన్యపుగింజల పిండితో వండిన ఆహారం యిది. దీనితో మీ ఆకలిబాధ నివారించుకోండి అని గృహయజమాని తపభాగం ఆయ ఐకు వడ్డించాడు.

అది ఆరగించి తనకింకా ఆకలిగా ఉంది అన్నాడు. ఆ మాట వింటూనే ఆయనభార్య తనభాగం యిచ్చింది. ఇంకా ఆ వృద్ధుని ఆకలిబాధ తీరలేదని తెలిసి కొడుకూ, కోడలూ కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా ఆరగించి, ఆయన ఆనందంతో ‘నాయనా మీ అతిథిసత్కారం, అన్నదానం నాకు తృప్తి కలి గించాయి. నీతోపాటు నీకుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధ పడుతూకూడా మీరు తినబోయే ఆహారం దానంచేసి, పుణ్యం సాధించారు. మీ దానబుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి.

ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడి గడతాడు. అన్నంకోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు దయగలగుండె కలవారే ఆశకు దూరం అవుతారు. ఈ రెండూవున్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి యింత అన్నం పెట్టడంకంటే ఏ దానమూ గొప్పదికాదు. అటువంటి అన్న దానం చేసిన పుణ్యాత్ములు మీరు ‘ అంటూండగా దేవవిమానం వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళారు.

ఇదంతా వింటూ చూసిననేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంత ములో ఆ అతిథిపాదాలు కడిగినచోట తిరిగాను. తిరిగినప్రక్క ఆ పాదాలు కడిగిన నీటితడి తగిలిన నా దేహంలో ఈ భాగం బంగారు మయమయింది.
అనంతరం ఎన్నెన్నో దాన, ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా ఈ రెండపప్రక్క దేహం యిలానే ఉండిపోయింది. ఇక్కడకూడా అంతే. నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగివ.

మరిన్ని నీతికథలు మీకోసం:

Satyanarayana Swamy Vrata Vidhanam In Telugu – సత్యనారాయణ స్వామి వ్రత విధానము

Satyanarayana Swamy Vrata Vidhanam

పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానము గురించి తెలుసుకుందాం…

సత్యనారాయణ స్వామి వ్రత విధానము

వ్రత విశిష్టత, విధానము

ఈ వ్రతము ప్రజల కష్టములను విచారములను పోగొట్టును. ధనధాన్యములు వృద్ధి నొందించును. సంతానమును, స్త్రీలకు సౌభాగ్యమును ఇచ్చును. సమస్త కార్యములందును విజయమును సమకూర్చును.

మాఘమాసమున గాని, వైశాఖమాసమున గాని, కార్తీకమాసమున గాని మరియు ఏ శుభదినమునందైనా గాని యీ వ్రతము చేయవలెను. యుద్ధ ప్రారంభము లందును, కష్టములు కలిగినప్పుడును, దారిద్ర్యము గలిగినప్పుడును అవి తొలగిపోవుటకు కూడ ఈ వ్రతమాచరించవచ్చును. నారదా ! భక్తుని శక్తిబట్టి ప్రతి మాసమందుగాని ప్రతి సంవత్సరమున గాని యీ వ్రతము నాచరించవలెను. ఏకాదశినాడు గాని, పూర్ణిమనాడుగాని, సూర్యసంక్రమణ దినమున గాని యీ సత్యనారాయణ వ్రతము చేయవలెను.

వ్రతమురోజు విధిగా చేయవలిసిన పనులు

ప్రొద్దుట లేచి దంతధావనాది కాలకృత్యాలు, స్నానాది నిత్యకర్మములు ఆచరించి, భక్తుడు ఇట్లు వ్రతసంకల్పము చేసి దేవుని ప్రార్థింపవలెను. ఓ స్వామీ ! నీకు ప్రీతి కలుగుటకై సత్యనారాయణ వ్రతము చేయబోవుచున్నాను. నన్ననుగ్రహింపుము. ఇట్లు సంకల్పించి, మద్యాహ్న సంద్యావందనాదులొనర్చి సాయంకాలము మరల స్నానము చేసి ప్రదోషకాలము దాటిన తరువాత స్వామికి పూజ చేయవలెను. పూజాగృహములో ప్రవేశించి స్థలశుద్ధికై ఆ చోట గోమయముతో అలికి పంచవర్ణముల మ్రుగ్గులు పెట్టవలెను. ఆ మ్రుగ్గులపై అంచులున్న క్రొత్తబట్టలను పరచి, బియ్యము పోసి మధ్య, వెండిది కాని, రాగిదికాని, ఇత్తడి కాని, కలశమునుంచవలెను. బొత్తిగా పేదవారైనచో మట్టి పాత్రనైనా ఉంచవచ్చును. కాని శక్తి యుండి కూడ లోపము చేయరాదు. కలశముపై మరల అంచులున్న క్రొత్త వస్త్రము నుంచి, ఆపై స్వామిని నిలిపి పూజించవలెను. ఎనుబది గురిగింజల యెత్తు బంగారముతోగాని, అందులో సగముతో గాని, ఇరువది గురుగింజల ఎత్తు బంగారముతోగాని సత్యనారాయణ స్వామి ప్రతిమను జేయించి, పంచామృతములతో శుద్దిచేసి మండపములో నుంచవలెను.

పూజాక్రమము:

గణపతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు, పార్వతి అను పంచలోకపాలకులను, ఆదిత్యాది నవగ్రహములను, ఇంద్రాద్యష్టదిక్పాలకులను ఇక్కడ పరివార దేవతులుగా చెప్పబడిరి. కావున వారిని ముందుగా ఆవాహనము చేసి పూజించవలెను. మొదట, కలశలో వరుణదేవు నావాహనము చేసి విడిగా పూజించవలెను. గణేశాదులను కలశకు ఉత్తరమున ఉత్తర దిక్సమాప్తిగా ఆవాహన చేసి, సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములలో ఆవాహన చేసి పూజించవలెను. ఆ పిమ్మాట సత్యదేవుని కలశమందు ప్రతిష్ఠించి పూజచేయవలెను.

నాలుగు వర్ణముల వారికి పూజావిధానము

బ్రాహ్మణ – క్షత్రియ, వైశ్య, శూద్రులనెడి నాలుగు వర్ణాలవారును, స్త్రీలును గూడ ఈ వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణాది ద్విజులు కల్పోక్త ప్రకారముగా వైదిక – పురాణ మంత్రములతోను, శూద్రులైనచో కేవలము పురాణ మంత్రముల తోను స్వామిని పూజించవలెను. మనుజుడు, భక్తిశ్రద్ధలు గలవాడై ఏ రోజునైనను, పగలు ఉపవాసముండి సాయంకాలమున సత్యనారాయణ స్వామిని పూజింపవలెను.

శ్రీ సత్యనారాయణ పూజ

శ్రీ పసుపు గణపతి పూజ

శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ (గంటను మ్రోగించవలెను)

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

Satyanarayana Swamy Vratam

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //
(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిధౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్థ, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ధ్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, మహాలక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

కలశారాధనం

శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను. కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా, పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.)

ధ్యానం:

(పుష్పము చేతపట్టుకొని)
శ్లో // థ్యాయే త్సత్యం గుణాతీతం గుణత్రయసమన్వితం,
లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిమ్
పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితమ్
గీవిందం గోకులానందమ్ బ్రహ్మా దైర్యభిపూజితమ్
శ్రీ రమా సత్యనారాయణస్వామినే నమః ధ్యాయామి.
(పుష్పము వేయవలెను).

ఆవాహనం:

ఓం సహస్రశీర్ షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్,
స భూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్ఠ దశాంగులమ్.
శ్లో // జ్యోతి శ్శాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగిహృద్ధ్యానగమ్యం
సాంగం శక్తిం సాయుధం భక్తసేవ్యం సర్వాకారం విష్ణు మావాహయామి.
రమా సత్యనారాయణ స్వామినే నమః, ఆవాహయామి.
(పుష్పము వేయవలెను).

ఆసనం:

ఓంపురుష ఏవేదగం సర్వం, య ద్భూతం యచ్ఛ భవ్యం,
ఉతామృతత్వ స్యేశానః యదన్నేనాతి రోహతి.

శ్లో// కల్పద్రుమూలే మణివేదిమధ్యే సింహాసనం స్వర్ణమయం విచిత్రం
విచిత్ర వస్త్రావృత మచ్యుత ప్రభో – గృహాణ లక్ష్మీ ధరణీ సమన్విత
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః రత్న సింహాసనం సమర్పయామి.
(అక్షతలు వేయవలెను.)

Satyanarayana Swamy Vratam telugu pdf

పాద్యం:

ఏతావా నస్య మహిమా, అతో జ్యాయాగ్ శ్చపూరుషః,
పాదోస్య విశ్వభూతాని, త్రిపాదస్యామృతం దివి.

శ్లో// నారాయణ నమోస్తుతే నరకార్ణవతారక
పాద్యం గృహేణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ
శ్రీ రమా సత్యనారాయణ అవామినే నమః, పాదయోః పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం:

త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః, పాదో స్యేహాభవాత్పునః,
తతోవిష్వజ్ వ్యక్రామత్, సాశనానశనే అభి.

శ్లో // వ్యక్తావ్యక్తస్వరూపాయ హృషీకపతయే నమః
మయా నివేదితో భక్త్యా హ్యర్హ్యోయం ప్రతిగృహ్యతామ్
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, హస్తయో రర్ఘ్యం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

ఆచమనం:

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతిం శ్రియంలోకేదేవజుష్టా ముదారం
తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీ ర్మేనశ్యతాం త్వాం వృణే.
తస్మా ద్విరా డజాయత, విరాజో అధిపూరుషః, స జాతో అత్యరిచ్యత, పశ్చా ద్భూమి మథో పురః.

శ్లో// మందాకిన్యాస్తు యద్వారి సర్వపాపహరం శుభం
తదిదం కల్పితం దేవ సమ్య గాచమ్యతాం విభో
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, ముఖే ఆచమనీయం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

స్నానం:

యత్పురుషేణ హవిషా, దేవా యజ్ఞ మతన్వత, వసంతో అస్యాసీదాజ్యం, గ్రీష్మ ఇధ్మ శ్శర ద్ధవిః.

శ్లో // తీర్ధోదకైః కాంచనకుంభసంస్థై స్సువాసితైర్దేవ కృపారసార్డైః
మయార్పితం స్నానవిధిం గృహాణ పాదాబ్జనిఘ్యాతనదీప్రవాహ
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, స్నానం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

శుద్ధోదకస్నానం:

అపోహిష్టామయోభువ స్తాన ఊర్జేదధాతన, మహేరణాయ చక్షసే, యో వశ్శివతమోరస స్తస్యభాజయతేహనః ఉశతీరివ మాతరః, తస్మా అరంగ మామవో యస్యక్షయాయ జిన్వథ, అపో జనయథా చ నః .

శ్లో// నదీనాం చైవ సర్వసా మానీతం నిర్మలోదకం
స్నానం స్వీకురు దేవేశ మయా దత్తం సురేశ్వర
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, శుద్దోదక స్నానం సమర్పయామి.
స్నానాంతరం సుద్ధాచమనీయం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

వస్త్రం:

సప్తాస్యాస న్పరిధయః, త్రిస్సప్త సమిధః కృతాః, దేవా య ద్యజ్ఞం తన్వానాః, అబధ్న స్పురుషం పశుమ్.

శ్లో// వేదసూక్తసమాయుక్తే యజ్ఞసామ సమన్వితే
సర్వవర్ణప్రదే దేవ వాససీ ప్రతిగృహ్యతామ్
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, వస్త్రయుగ్మం సమర్పయామి.

ఉపవీతం:

తం యజ్ఞం బర్హిషి ప్రౌక్ష్న, పురుషం జాతమగ్రతః, తేన దేవా అయజంత, సాధ్యా ఋషయశ్చ యే.

శ్లో // బ్రహ్మవిష్ణు మహేశైశ్చ నిర్మితం బ్రహ్మసూత్రకం
గృహాణ భగవన్ విష్ణో సర్వేష్టఫలదో భవ
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, యజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం:

తస్మా ద్యజ్ఞా త్సర్వ హుతః, సంభృతం పృషదాజ్యం, పశూగ్ స్తాగ్ శ్చక్రేవాయవ్యాన్, అరణ్యాన్ గ్రామాశ్చయే.

శ్లో // శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, దివ్య శ్రీ చందనం సమర్పయామి.
(గంధం చల్లవలెను.)

ఆభరణములు:

తస్మా ద్యజ్ఞా త్సర్వహుతః, ఋచ స్సమాని జజ్ఞిరే తస్మాత్, తస్మా జ్జాతా ఆజావయః.

శ్లో// మల్లికాది సుగంధీని మాలత్యాదీనివైప్రభో
మయాహృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతామ్
శ్రీ రమా సత్యనారాయణ అవామినే నమః, పుష్పాని సమర్పయామి.
(పుష్పములు సమర్పించవలెను)

పుష్పసమర్పణం (పూలమాలలు):

తస్మాదశ్వా అజాయన్త| యేకేచో భయాదతః||
గావోహజిజ్జిరే తస్మాత్ | యస్మాజ్జాతా అజావయః
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, పుష్పై పూజయామి
తులసీ కుందమన్దార పారిజాతాం బుజైర్యుతాం|
వనమాలాం ప్రదాస్యామి గృహాన జగదీస్వరా
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, వనమాలాం సమర్పయామి
(పుష్పాములు వేయవలెను)

అథాంగ పూజా:

ఓం కేశవాయ నమః, పాదౌ పూజయామి
ఓం గోవిందాయ నమః, గుల్ఫౌ పూజయామి
ఓం అనఘాయ నమః, జానునీ పూజయామి
ఓం ఇందిరాపతయే నమః, జంఘే పూజయామి
ఓం జనారధనాయ నమః, ఊరూ పూజయామి
ఓం జనార్దనాయ నమః, కటిం పూజయామి
ఓం కుక్షిస్థాఖిలభువనాయ నమః, ఉదరం పూజయామి
ఓం లక్ష్మీవక్షస్థలాలయాయ నమః, హృదయం పూజయామి
ఓం శంఖచక్రగదా శార్ ఙ్గ పాణయే నమః, బాహున్ పూజయామి
ఓం కంబుకంఠాయ నమః, కంఠం పూజయామి
ఓం కుందకుట్మలదంతాయ నమః, దంతా న్ఫూజయామి

(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)

తదుపరి ఇక్కడ స్వామి అష్టోత్తరము చదువవలెను.

శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామపూజ

మరిన్ని వ్రతాలు:

Dharmavarulanu Varabhavincha Vaddu In Telugu – ధర్మవరులను వరాభవించ వద్దు

Dharmavarulanu Varabhavincha Vaddu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ధర్మవరులను వరాభవించ వద్దు నీతికథ.

ధర్మవరులను రాభవించ వద్దు

(ఈ కథ అరణ్యపర్వంలో ఉంది)

పాండవులు జూదంలో ఓడిపోయి, అడవులకు వచ్చారు. వారితో పాటు ఎందరో వేదవిదులు కూడా అనుపరించి రాగా, వీరందరి పోషణ భారం ఎలా నిర్వహించగలనా అని ధర్మరాజు విచారంలో మునిగాడు.

అప్పుడు వారి పురోహితుడు ధౌమ్యుడు:

‘ధర్మనందనా ! రాజవంశీయుడు తనను ఆశ్రయించిన వారికి అన్నపానాలు సమకూర్చి వారి యోగక్షేమాలు చూసుకుంటూ ఉండాలి. మీ ప్రాచీను అందరూ ఈ ధర్మ నిర్వహణ సాగించారు. తపస్సుతో, యోగశక్తితో వారు తమ ప్రజలకు ఈ రక్షణ సాగించారు.

అంతకంటే ముఖ్యాంశం ఉంది :

ఈ సృష్టి ప్రారంభం వేళ జీవకోటి అంతా ఆకలి బాధతో కటకట లాడుతుంటే అది చూసిన సూర్యభగవానుడు తాము ఉత్తరంగా వయ నించి భూమిలోని సారాన్ని గ్రహించి, అనంతరం దక్షిణంగా తిరుగుతూ ఆ సారాన్ని మళ్ళీ భూమికి అందిచ్చేవాడు. అదే సమయంలో చంద్రుడు మేఘ రూపంలో ఉన్న సూర్యతేజస్సును వర్షంగా మార్పి, ఆ జలధార లతో ఓషధులను అందించేవాడు. ఆ ఓషధులలోని ఆరు రసాలూ షడ్రు చులుగా జీవకోటికి ఆహారం ఆయాయి.

అంటే సర్వ జీవకోటికి వెలుగునిచ్చే సూర్యుడే అన్న దాత. ఆయ నను ప్రార్థించి నీ కోరిక నెరవేర్చుకో ‘ అన్నాడు.

పురోహితులు ఆదేశమపారం ధర్మరాజు అరుణోదయానికి లేచి గంగాతీరానికి వెళ్లి స్నానం చేసి పవిత్ర హృదయంతో సూర్యుని ఆరాధించాడు.
ఆ నిర్మల హృదయుని తపోదీక్షకు సంతోషించి మార్యుడు ప్రస మడై వాని కోరిక ప్రకారం ఒక శామ్ పాత్ర యిచ్చి:

‘ధర్మనందనా! ఇది అక్షయ పాత్ర. ఎండరి కయినా ఇది అన్న పానాలు సమకూరుస్తుంది. అయితే, నీ భార్య పాంచాలి భోజనం చేసి, ఈ పాత్రను పరిశుద్ధం చేసిన అనంతరం ఆ పూటకు మరి భోజనం రాదు. అంటే అతిథి పూజలు పూర్తి చేసే వరకూ, ఆవిడ భుజించదు కదా! అందు చేత నీ కోరిక తీరింది. ఇది తీసుకు వెళ్లు’ అన్నాడు.

అపరిమితానందంతో ధర్మరాజు తిరిగి వచ్చి, ఆనాటి నుండి తనతో వచ్చిన వారికే కాక, అతిథి అభ్యాగతులకు కూడా అన్నదానం చేసి కీర్తి పొందుతున్నాడు.

ఈ కబురు విన్నాడు దుర్యోధనుడు.

ఆ సమయానికే అక్కడకు చేరిన దుర్వాసమహర్షిని ఆరాధించి పాండవులను ఏ విధంగా నయినా పరాభవించాలని కోరాడు.

దుర్వాస మునీంద్రుడు అంగీకరించి బయలుదేరి వచ్చాడు.
విషయం తెలిసిన వాడు కనుక పాండవులూ, పాంచాలీ కూడా భోజనం చేశాక వారిని చేరి, కుశల ప్రశ్నలు ముగించి

‘నా శిష్యులతో పాటు నాకు ఆతిథ్యం యివ్వాలి అన్నాడు.
ధర్మరాజు సంతోషంతో ఆ వార్త పాంచాలికి చెప్పాడు.
వంట యిల్లు కడుగుతున్న ఆ ఇల్లాలి గుండె గతుక్కుమంది,

‘ నదీస్నానం చేసి రాగలం. ఈ లోపున సర్వం సన్నద్ధం కావాలి ‘ అని పలికి మునీంద్రుడు వెళ్ళాడు.

రాజనందన రెండు చేతులూ జోడించి వాసుదేవుని ప్రార్థించింది. నిర్మల చి త్తంతో ఆమె ధ్యానించే వారికి దీనజన శరణ్యు డైన వాసుదేవుడు చిరునవ్వుతో ప్రత్యక్షమై

‘ అమ్మాయీ ! ఈ నాటి శాక పాఠాలలో ఏ లేశమైనా ఉంటే నా చేతిలో వెయ్యి’ అన్నాడు.
‘అక్షయ పాత్ర కూడా శుద్ధి చేశాను. కృష్ణా: ఎందుకీ పరీక్ష ! ‘ అంది.

‘కాదమ్మా ! నా మాట విని ఒక్క మారు ఆ పాత్రలోకి చూడు, అన్నాడు.

ఆయన మాట కాదనలేక, అక్షయ పాత్రలో చెయ్యి పెట్టింది.

దాని అంచున ఒక అవిశ ఆకు దొరికింది. అది తీసి కృష్ణుని చేతిలోన దానిని నోట ఉంచుకొని :

‘ముల్లోకాలకూ తృప్తి!’ అని వెళ్ళిపోయాడు.
ద్రుపద రాజనందన అతిథుల కోసం ఎదురు చూస్తున్నది. ఎంత సేపయినా వారు రావడం లేదని భీముని పంపారు.

ఇక్కడ వాసుదేవుడు ‘ముల్లోకాలకూ తృప్తి’ అన్న క్షణంలో దుర్వాసునికి, ఆయన శిష్యులకూ, కడుపు నిండుగా భుజించిన ఆయాసం కలిగి వారు ఆటే వెళ్ళిపోయారు.

నదీ తీరానికి వచ్చిన భీమునికి అక్కడి మునులు:
“నాయనా! దుర్వాసుల వారు శిష్య సమేతం స్నానం చేస్తూనే సుష్టుగా భుజించిన తృప్తితో తేస్బుకుంటూ వెళ్ళిపోయారు’ అని చెప్పారు.

భీముడు తిరిగి వచ్చి ఆ వార్త చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు.
(‘ ధర్మపరులను పరాభవించడానికి ప్రయత్నిస్తే ధర్మ రక్షకుడు వారినే పరాభవం పాలుచేస్తాడు, అని మాతుడు భారతకథను వివి పించాడు.)

మరిన్ని నీతికథలు మీకోసం: