మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఉమామహేశ్వర స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో యెన్ని మారులు యిట్టె నీపనులు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
ఇదికూడా జానపదుల శైలిలో కొనసాగే దశావతార కీర్తన. నా అభిప్రాయంలో ఇది బహుక్లిష్టమైనది. ఎందుకంటే కొన్ని మాటలకు యే నిఘంటువులోనూ అర్ధ వివరణ సూచన ప్రాయంగా కూడా లభించలేదు. అది ఏ అవతార వివరణో వూహించగలుగుట వలన భావసమన్వయం ఆవశ్యకమైనది. అంటే. ఉదాహరణకి “పెళ్లె తప్పేవు బిరుసుగ” అంటే వరాహవతారంతో సమన్వయపరచుటెట్లు సాధ్యం. యేటివంకలు తిద్దవశమా? అంటే కృష్ణావతారంతో యెట్లా ముడిపెట్టాలి? దీని అర్థం ఏమిటో ఎలా తెలుస్తుంది? ఓ దేవదేవా! అన్నమయ్య ఈ కీర్తన పల్లవిలో అన్నమాట నిజం చేస్తున్నావు కదటయ్యా! “ఇన్ని మాయల నన్ను నేచనేటికిరా”. అంటే ఏమిటో తెలియాలంటే ఏమిటి చేయాలి? మీకు తెలుసునని నాకు తెలుసు.
భావ వివరణ:
నీ పనులు (నీవు చేసే లీలలు యెన్ని మారులు? (ఎన్ని విధములో) చెప్పుట యెట్లు సాధ్యము? నన్ను ఇన్ని మాయలతోన్ చేయనేటికిరా? (అతిశయించుట యెందులకయ్యా? )
ఒకసారి నీలోనే నీళ్ళు నములుతుంటావు (మత్స్యావతారము); ఇంకొకసారి వెలుపలికి వచ్చి సన్నల (సైగలతో) వేళ్ళను చూపింతువు (కూర్మావతారము); ఇంకొకసారి, బిరుసుగ పేళ్లె తప్పేవు (కాఠిన్యంతో వేగిపోతూ తపించిపోయేవు)… అనగా (వరాహావతారం). ఇంకొకసారి, ఇంతేసి గోళ్ళ రాచేవు (ఇంతింత పొడుగువున్న గోళ్ళతో చీరివేసెదవు. కోపమేటికిరా? కోపమెందులకయ్యా? (నరసింహావతారం).
ఒకసారి, మేనెదాచేవు (చూడటానికి పొట్టి పిల్లవాడిలావున్నా, భూనభాంతరములు నిండిపోగల శరీరాన్ని దాచివుంచినావు)… అనగా (వామనావతారం).; మెస్తిర గొడ్డలి నయముననే నానం బెట్టేవు (బాగా పదునైన పరశువును బాగా రక్తంలో నానబెట్టినావు)… అనగా (పరశురామావతారము); పోని తెరువుల పోకల బోయేవు (చొరరాని కీకారణ్యములబట్టి పోయేవు)… అనగా (శ్రీరామవతారం); కానిరా, యేటివంకలు తిన్దవశమా (కానీయవయ్యా! వంకరటింకరగా పోయే ఏరుయొక్క మార్గాన్ని కట్టడి చెయ్యగలమా? … అనగా (శ్రీకృష్ణావతారపు గోపీలోలత్వం).
ఒకసారి, చేరి కపటాలే చేసేవు (పురసతులను మోసగించినావు)… అనగా (బుద్ధావతారము). ఇకనైనా సారెం పరువులు చాలించరా (ఇప్పటికైనా, మాటిమాటికీ పరుగులు తీసే అలవాటు మానుకోవయ్యా!)… అనగా (కల్కి అవతారము); ధీరోదాత్తుడవు కావున ఓ తిరువేంకటేశ్వరా! కూరిమి యెరిగి నన్ను కూడితివి. ఇప్పుడు నీమాయలను మెచ్చక యెలా వుండగలను ప్రభూ!.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ కృష్ణాష్టకమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవముగురించి భక్తి యోగం లో తెలుసుకుందాం… అష్టలక్ష్మీ స్తోత్రం ఒక ప్రముఖమైన హిందూ ప్రార్థనా సంస్కృతిలో ఒక పవిత్ర స్తోత్రము. ఈ స్తోత్రం మహాలక్ష్మిని స్తుతిస్తుంది, అష్టలక్ష్మీలు మహాలక్ష్మి దేవికి అంగములగా అనిపిస్తాయి. ఈ స్తోత్రంలో లక్ష్మీదేవికి అనుగ్రహించే స్వర్ణదాత మహాలక్ష్మీకి అర్పించిన స్తుతులు ఉన్నాయి. ఈ స్తోత్రంలో ఆధ్యాత్మికత, ఐశ్వర్యం, ప్రేమ, క్షమా, శాంతి, సౌందర్యము, శక్తి, ధర్మము, కీర్తి, ధన సంపాదన, ఆరోగ్య లభ్యం లక్ష్మీ అనుగ్రహాన్ని చెందడంలో అందరికీ ఆశీస్సులు లభించడం వంటి విషయాలు చెప్పబడినవి.
అష్టలక్ష్మీ మూర్తులు అందించే శక్తులు
అష్టలక్ష్మి అనగా ఎనిమిది లక్ష్ములు అను అర్దం వచ్చును. అష్టలక్ష్మి మూర్తుల శక్తులు అనగా, అష్ట దేవతా మూర్తులు మనకి ప్రసాదించే అష్ట శక్తులు. ఒక్కొక్క లక్ష్మి ఒక్కొక్క శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. ఏ, ఏ లక్ష్ములు ఏమేమి శక్తులని ప్రసాదిస్తారో, క్రింద ఇచ్చిన విదముగా తెలుసుకుందాము.
1. శ్రీ ఆదిలక్ష్మిదేవి
ప్రాణశక్తికి, దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత.
2. శ్రీ ధాన్యలక్ష్మీ మాత
సకల సస్యసంపదలకి, పాడి పంటలకి అధిష్టాన దేవత, శారీరక ధారుఢ్యాన్న ప్రసాదించే తల్లి.
3. శ్రీ దైర్యలక్ష్మీమాత
ధైర్య సాహసాలు, మనోబలం ప్రసాదించే తల్లి.
4. శ్రీ గజలక్ష్మీమాత
సమస్త శుభాలకీ అధిష్టాన దేవత.
5. శ్రీ సంతాన లక్ష్మీ మాత
సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత.
6. శ్రీ విజయలక్ష్మీ మాత
సకల కార్యసిద్ధికీ, సర్వత్రా విజయసాధనకి అధిష్టాన దేవత.
7. శ్రీ విద్యాలక్ష్మి మాత
విద్యావివేకాలకి, మన అర్హతలకి తగిన గుర్తింపు రాణింపు కలిగేలా చేసే చల్లని తల్లి దేవత.
8. శ్రీ ధనలక్ష్మీ మాత
సకలైశ్వర్య ప్రదాయిని. అన్ని సంపదలకి అధిష్టాన.
ఈ శ్రీఅష్టలక్ష్మీ ఆరాధన వైభవం పుస్తకం ద్వారా శ్రీమన్మహలక్ష్మీదేవి ప్రాదుర్భావం, వైభవ కటాక్షాలతో మొదలు పెట్టి వరుసగా ఎనిమిది మంది అష్టలక్ష్మీ మాతల స్వరూప, వైభవ, ఆగ్రహానుగ్రహ ప్రభావాలు, ఆరాధన పద్ధతులు, వీటి వల్ల కలిగే ఫలితాల గురించి వివరించటం జరిగింది. శ్రద్ధా భక్తులతో ఈ పుస్తకాన్ని చదివి ఆ జగన్మాత అనుగ్రహం వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా వుండాలని మా ఆకాంక్ష.
మన అపోహలు – సందేహాలు
సకల జీవావళికి అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదించే నిమిత్తం శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాలను ధరించింది. తన పిల్లలమైన మన అభ్యున్నతికోసం అహరహం ఆరాటపడుతుంది జగన్మాత. అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం గురించి, స్వభావం గురించి మనలో ఎన్నో అపోహలు వున్నాయి. పాశ్చాత్య విజ్ఞాన ప్రభావం బాగా వంటబట్టిన మన నేటితరం వారికి మన సనాతన సాంప్రదాయం, పూజా పునస్కారాల గురించి ఎన్నో సందేహాలు అవి ఏమిటో చూద్దాం.
లక్ష్మీదేవి అనగానే మనకి స్ఫురణకి వచ్చేది. తన చేతుల నుంచి బంగారు కాసులను అనుగ్రహించే శ్రీ ధనలక్ష్మీదేవి రూపమే అందువల్లనే లక్ష్మీపూజ అనగానే ధనాన్ని కోరి చేసే పూజ మాత్రమే అనే అపోహ జనబాహుళ్యంలో వుంది.
ఇక లక్ష్మీదేవి అనుగ్రహం చంచలమైనదని, ఆ తల్లి అనుగ్రహం ఎంత కాలం మనవద్ద వుంటుందో తెలియదని, ఎప్పుడు వదలి వెళ్ళిపోతుందో తెలియదనే తప్పు అభిప్రాయం కూడా జనానీకంలో నెలకొని వుంది.
అదే విధంగా లక్ష్మీ సరస్వతులు అత్తాకోడళ్ళు అనీ, లక్ష్మి వున్న చోట విద్య వుండదు అనీ, విద్య వున్నచోట లక్ష్మి వుండదు. అని అంటూ వుంటారు. ఇదీ అపోహే.
ఇక అష్టలక్ష్మీ ఆరాధన విషయానికి వస్తే, ఇలా ఎనిమిది రకాల లక్ష్మీ రూపాలను ఎందుకు పూజించాలి? ఒక మహాలక్ష్మీ రూపాన్ని పూజిస్తే చాలదా? అనేది కూడా ఒక ప్రశ్న.
లోకంలో అందరూ వారి వారి పద్ధతులలో భగవదారాధన చేసుకుంటూ తమ తమ కోరికలను, అవసరాలని నెరవేర్చుకుంటూ వుండగా ప్రత్యేకంగా అష్టలక్ష్మీ ఆరాధన, పూజ, వైభవాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఏమిటి?
తార్కిక దృష్టితో మాత్రమే ఆలోచించే నేటి ఆధునికులు లోకంలో ఏ పని అయినా సరే మనం కష్టపడి శ్రద్ధగా చేయటం వల్లనే పరిపూర్ణమైన ఫలితాన్ని పొందగలుగుతాం అంటారు. అంతే కాని ఆ పని సఫలం కావటానికి లక్ష్మీదేవో, మరే దేవతో అనుగ్రహం కావాలనటం మూర్ఖత్వం అని కూడా అంటూ వుంటారు.
అదే విధంగా చేసే పనిని శ్రద్ధగా చేస్తే చాలు, అదే అసలైన పూజ అనే వారూవున్నారు. ఇవి ఎంత వరకు నిజం?
అయినా ఈ యిరవై ఒకటవ శతాబ్దంలో సైన్సు విపరీతంగా అభివృద్ధి చెంది పోయి సృష్టికి ప్రతిసృష్టి చేయాలని ఉవ్విళ్లూరుతున్న మానవ సమాజంలో, యీ విధంగా పూజల వల్ల బీజాక్షర జపాల వల్ల ఫలితాలు కలుగుతాయంటే నమ్మేవారు ఎందరు?
ఆధునిక యుగంలో ప్రతినిత్యం తమ తమ దైనందిన కార్యక్రమాలలో తలమునకలై ప్రతిక్షణం హడావుడి పడిపోతూ జీవించే నేటి తరం వారికి ఈ విధమైన భగవదారాధనకి సమయం ఎక్కడిది?
భక్తిశ్రద్ధలతో కూడిన పూజా పురస్కారాలు వగైరా వయస్సు మళ్ళి, ఓపిక తగ్గిన వృద్ధులకే గాని భుక్తికోసం కోటి విద్యలు నేర్చుకుని అహరహం ధనార్జనలో సతమతమయ్యే యువతకి ఈ ఆరాధనల అవసరం ఏమిటి?
ఇలా అనేక సందేహాలు వస్తూ వుంటాయి. ఇవన్నీ చాలా సహజమైన సందేహాలే. ఏ విషయాన్నైనా సశాస్త్రీయంగా విశ్లేషిస్తే గాని నేటితరం అంగీకరించదు. అలాంటివారి కోసమే ఈ పుస్తకం. ఈ పుస్తకం శ్రద్ధగా చదివితే పైన చెప్పిన అన్ని సందేహాలకి సమాధానాలు దొరికి మనకి ఏం కావాలో కూడా మనకి తెలుస్తుంది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గరుడ గర్వభంగం నీతికథ.
గరుడ గర్వభంగం
(ఉద్యోగ పర్వంలో చేయబార సమయంలో కణ్వమహర్షి చెప్పిన కథ)
” నాయనా దుర్యోధనా !
దేవలోకానికి అధిపతి అయిన దేవేంద్రుని పేరు విన్నావు కదా! ఆయన రథాన్ని నడిపే సారథి పేరు మాతలి.
ఇంద్రుని మనసు గ్రహించి రథం నడిపించే మాతలికి ముల్లోకాల లోనూ సాటిరాగల సారథులు లేరు. అటువంటి సేవాధర్మం ఎరిగిన మాతలి శాంత స్వభావంతో, సద్గుణ సంపదతో అందరిచేతనూ ప్రశంసలు పొందినవాడు.
ఆయనకు గుణకేశి అని ఒక కూతురు. గుణకేశి ఎంత అందగత్తెయో అంతకంటే గుణవతి, శీలసంపన్న, విద్యావతి. తల్లి దండ్రుల శిక్షణలో ఆమె వంశ సంప్రదాయాన్ని, ఆచార మర్యాదలనూ చక్కగా అలవరచుకొని పదినుందిలో వినయగుణవతిగా పేరు పొందింది.
బాల్యదశ దాటి పదహారేడుల యవ్వనవతి అయింది. అంటే వివాహ యోగ్యమైన వయసులో అడుగుపెట్టింది. వరాన్వేషణ ఆరంభిం చాడు మాతలి.
ఉన్నత వంశంలో పుట్టి, చక్కని అంద చందాలతో గుణవంతు రాలు, విద్యావతి అయిన ఆడబిడ్డకు యోగ్యుడైన వరుడు దొరకడం చాలాకష్టం.
విద్యఉంటే వినయం ఉండదు. విద్యావినయాలుంటే రూపం ఉండదు. ఈ మూడూ ఉంటే సంపద ఉండదు.
విద్యా వినయ గుణరూపాలున్ని వరుడు దొరుకుతాడేమో అని మాతలి దేవలోకం అంతా తిరిగాడు. భూలోకం కూడా గాలించాడు.
ప్రయోజనం లేకపోయింది. అయినా ప్రయత్నం విరమించ కుండా తిరుగుతూనే ఉండగా, ఒకనాడు నారదముని కనిపించి, మాతలి బాధ విని ఆయనకూడా తోడుగా బయలుదేరాడు.
ఇరువురూ కలిసి పాతాళంలో వరుణలోకం చేరారు. ఆలోకం లోని వింతలు, విశేషాలూ వివరంగా చెప్పాడు నారదుడు. అన్నీ విని మాతలి!
దేవమునీ :
నేను దేవతల ప్రభువైన ఇంద్రుని సారథిని కదా ! ఈ లోకం రాక్షసులకు నిలయం. వీరితో బాంధవ్యం నాకు కుదరదు, అన్నాడు.
గరుడ లోకం తిరిగారు. ఇక్కడ కూడా యోగ్యుడైన వరుడు దొరకలేదు. రసాతలానికి వెళ్ళారు.
ఆ లోకం ప్రజలందరూ భోగమయ విలాస జీవితం గడుపు తున్నారు. అది మాతలికి రుచించలేదు.
అప్పుడు నాగలోకానికి చేరారు. ఆలోకానికి రాజధాని భోగవతి. ఆ రాజధానీ నగరంలో అన్వేషణ ఆరంభించారు.
నాగ వంశ ప్రముఖులందరి గుణగణాలనూ నారదుడు వివరిస్తూ వారిని చూపిస్తున్నాడు.
వింటూ వింటూన్న మాతలి కనులు ఒక నవసుందరాంగుని మీద నిలిచాయి.
అది గ్రహించి నారదుడు మాతలీ
నాగలోకంలో ఐరావత వంశం ప్రఖ్యాతమయింది. అందులో పెద్ద ఆర్యకుడు. ఆయన కుమారుడు చికురుడు.
నువ్వు చూపే యువకుడు సుముఖుడు. ఈ సుందర గుణ సంపన్నుడయిన సుముఖుడు చికురుని ప్రియ పుత్రుడు, అని చెప్పాడు. తరువాత ‘ కుల పెద్ద ‘ అయిన ఆర్యకునితో:
‘నాయనా! ఈయన ఇంద్రసారథి మాతలి. ఈయన కుమార్తె గుణకేశి. ఆమె రూపంలోనే కాక గుణసంపదలో కూడా ఎందరికో పాఠాలు నేర్పగలది. ఆ బిడ్డను మీ ఇంటి కోడలుగా పంపాలని మా సంకల్పం అన్నాడు.
ఆర్యకుడు దేవయినీ: వినతానందనుడైన గరుత్మంతుడు మా నాగజాతిని ఆహారంగా తీసుకుంటాడని మీ రెరుగుదురు. మొన్ననే మా చికురుడు ఆయనకు ఆహారం అయాడు. అప్పుడే చెప్పాడాయన.
తరువాయి వంతు సుముఖునిది, అని. ఈ విషయం తెలిసి ఈ వివాహం జరిపి మీ ఆడబిడ్డను జీవితాంతం దుఃఖసముద్రంలో వడల మంటారా ? ‘ అన్నాడు.
అప్పుడు మాతలిని వెంటబెట్టుకొని నారదుడు శ్రీమన్నారాయణుని సమీపించి, చేతులు జోడించి, విషయం వివరించగా ఆయన సుముఖునికి పూర్ణాయుర్దాయం అనుగ్రహించాడు.
తిరిగి వచ్చి మాతలి తన బిడ్డను నాగలోకం కొని వచ్చి సుముఖు నితో వివాహం జరిపించాడు.
వా రుభయులా అనురాగంతో ఆనందమయ దాంపత్యం సాగి స్తున్నారు.
ఈ వార్త గరుత్మంతుని చెప్పిని పడింది.
తీవ్ర క్రోధంతో నాగలోకం చేరి
‘చతుర్దశ భువనాలకూ అధిపతి అయిన మహా విష్ణువు భారాన్ని నేను తప్ప ఇతరుడు భరించ లేడని తెలియదామీకు? అంతటి శక్తికల నన్ను మీరు అవమానించారు, నామాట వినకుండా ఈ వివాహం జరిపించి’ అని అహంకార గర్వంతో తన శక్తి ప్రదర్శనకు ఉపక్రమించ బోతుండగా గ్రహించిన మహావిష్ణువు అక్కడకు వచ్చి మందహాసంతో:
‘నాయనా! వినతానందనా ! నా భారం అంతా మోయగల శక్తిమంతుడివి కదా ఏది, నా చెయ్యి ఒక్కటి నీ వీపుమీద ఉంచు తాను, చూడు,’ అని గరుత్మంతుని మీద తన చెయ్యి ఉంచాడు.
అంతే! ఇంతకాలంగా శ్రీమన్నారాయణుని వాహనంగా ఉన్న గరుత్మంతునికి ఆ చెయ్యి బరువుకి కళ్ళు తిరిగి, కాళ్ళు పట్టుతప్పి, రెక్కలు గజగజలాడి, నోరు ఎండి నాలుక పిడచకట్టింది.
అప్పుడు మహావిష్ణువు తన చేతితో వెన్ను దువ్వి ఆశ్వాసించి? ‘నాయనా గర్వం, అహంకారం, ఎప్పుడూ కొరగానివి. విన యంతో, పరోపకార దృష్టితో జీవించే వారికే ఉత్తమ గతులు ప్రాప్తి స్తాయి’ అన్నాడు.
అనంతరం గరుడవాహనం మీదనే ఆయన వైకుంఠం వెళ్ళాడు.
‘చూశావా, దుర్యోధనాః గర్వం ఎటువంటి ఆపదలు తెచ్చి పెడు తుందో ! కనక అది విడిచి పెట్టాలి’ అన్నాడు కణ్వమహర్షి.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి సమాజ తాంబూలముగురించి తెలుసుకుందాం…
Sai Samaja Tambulamu Telugu
సాయి సమాజ తాంబూలము
దృష్టి లోపమో నరునిది దుష్ట పథమొ
బురదలో భ్రమించగ వీరి బుద్ధి యంత
చేయుచుండిరి స్వార్థపు చేతలెల్ల
నీవు రక్షింప మాయెద నిలువు సాయి
1
నీతి ఎరుగని వారలు నీతులరసి
అనుసరించుట మరచి బోధనల పడిరి
నీతి మరచిన జనులకు నీతి దెలిపి
నీదు మహిమలు చాటగ నిలువు సాయి
2
మురియు సంపదలను గని మూర్ఖులిచట
ఉన్న దంతయు తనదని ఉరిమి పడుచు
లేని దానికై వీరంత లేచి పడగ
ఆశకంతము ఏముండునయ్య సాయి
3
లీలలను చేసి నువ్వు నిలిపితి వయ్య
మమ్ము నీ సుందర జగతి మాటునందు
వ్యాప్తి చెందెను కాలుష్య వాయు గణము
నీదు మహిమతో వారింప నిలువు సాయి
4
అందమగు రూప లావణ్య మవని యందు .
సాంప్రదాయపు గౌరవ సంపదలును
మోడలింగులో ముత్యాల ముసుగు లోన
విలువ మరచెను చూడుము వినతి సాయి
5
మాట చెల్లిన వారికే మంతనాలు
మాటున జరుగునట్టిదే మదియు గాంచె
చిత్రమగు చేష్టలకులోన చింత పెరిగె
నీవు రావయ్య నియతిని నిలుప సాయి
6
పైకి మెరిపించు వారలు పైకములను
దోచుకుని పోవుచుండిరి దొరల తీరు
వేషములు ఎన్నొ గట్టిన వీరి వింత
నీవు మార్చగ రావయ్య నిత్య సాయి
7
మానవత్వమును మనిషి మరచి పోయి
సాటి మనుజుల చంపుచు సాకుచెపుచు
జీవకోటి నెత్తురు ముద్ద జేసియాడు
నీ మనుషులను మార్చుము ఇలను సాయి
8
నీరు లేనట్టి పంటలో నిండి గరక
పంటయే తానని భ్రమించి పరుగు లెత్తు
కోత రోజు తెలియు దాని కొసరు బ్రతుకు
మూర్ఖులిటుల భ్రమింతురు ముందు సాయి
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఆళవందార్ స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు – అన్నమయ్య కీర్తనలు
తాళ్ళపాకలో వెలసిన ‘కోనేటిరాయనిపై’ చక్కటి కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. వీడివో (వీడే) లక్ష్మీపతి, వీడే సర్వేశ్వరుడు అని కీర్తిస్తున్నారు. భావ వివరణనంతా చదివాక మీకు అంతులేని ఆనందం కలుగుతుందని నాకు ప్రగాఢ విశ్వాసము. శేషాచలమనేటి శ్రీవేంకటాద్రిపై శేషమై కోనేటిదండ చెలగీని దేవుడు అంటే యెన్నైనా అర్థములు చెప్పవచ్చును. ఈ స్వామి తీయటి నీటి బావి. తోడుకున్న వారికి తోడుకొన్నన్ని నీళ్ళు. అవునా?
భావ వివరణ:
ఓ ప్రజలారా! వీడివో (ఈతడే లక్ష్మీపతి, వీడివో సర్వేశుడు (సర్వమునకు ప్రభువు), ఈతడే ఈ కోనేటి ఒడ్డున విహరించే దేవదేవుడు. ఈయన ఘన కార్యములనాకర్ణించండి.
పూర్వం ఈయన కొండను గొడుగుగనెత్తి (నంద వ్రజమున గోవర్ధన పర్వతమును తన చిటికిన వ్రేలి పై గొడుగువలె యెత్తి గోకులమును రక్షించినాడు). కోరి, కొండవంటి దానవుని (శకటాసురుని) చించెను (ముక్కలు ముక్కలు చేశాడు). అప్పటిని (మరల ఈ కలియుగంలో శ్రీవేంకటగిరి అనే కొండనెక్కి కొలువు దీరియున్నాడు. నిజముగా ఈ స్వామి ఇదే ఈ కోనేటి కఱుతను (ఒడ్డున… అని… భావిస్తున్నాను) కొండవంటి అండయైయున్నాడు.
పూర్వం ఈయన మద్దిమాకులను (రేపల్లెలో నందుని ప్రాంగణమున వున్న రెండు మద్ది చెట్లను) దొబ్బి (త్రోసివేసి) కూల్చినాడు (మద్దిచెట్లవలెనున్న గంధర్వులకు శాపవిమోచనం కలిగించాడు). ఈ శ్రీకృష్ణుడే స్వర్గలోకంనుండి కల్పవృక్షము అను మాకును (దేవవృక్షమును) వారికి (పెకలించి) మహిమీదకు (భూలోకానికి) తెచ్చెను. ఈయనే గొల్లమగువల చీరెలెత్తుకొనిపోయి మాకుమీదనెక్కి (యమునానది ఒడ్డునవున్న చెట్టునెక్కి వారు శరణన్న తరువాత తిరిగి ఇచ్చినాడు. ఇదిగో నేడు ఈ కోనేటి ఒడ్డున మాకుల మధ్య మరిగినాడు (పరిచితమవుచున్నాడు).
వసుదేవుడు బాలకృష్ణుని యమునానది దాటిస్తుంటే కుండపోతగా వానవచ్చింది. అప్పుడు శేషుడు తన పడిగెలను గొడుగులాకప్పినాడు. స్వామి ఆ పడిగెల నీడలో యశోద ఇంటికి చేరినాడు. శేషజాతి సర్పమైన కాళింగు శిరసుల ద్రొక్కి రక్తం కక్కించి అతను శరణన్నాక కరుణించి విడిచిపెట్టాడు. ఇదే దేవుడు శేషాచలము అనే శ్రీవేంకటాద్రిపైనున్న కోనేటిదండ (కోనేటి ఒడ్డున) చెలగీనీ దేవుడు (శ్రీవేంకటేశ్వరుడై శోభిల్లుతున్నాడు).
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివనామావళ్యాష్టకమ్గురించి తెలుసుకుందాం…
కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో చేకొని కొలువరో శ్రీనరసింహము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
అన్నమాచార్యులవారికి భజన అంటే ప్రత్యేకమైన ప్రీతి అని నా నమ్మకం. ఉగ్రనరసింహునిపై వారు చెప్పిన ఈ భజన మీ మనస్సులను ప్రక్షాళన చేస్తుంది. నిశితమైన వర్ణన అంటే (మైన్యూట్ డిస్క్రిప్షన్) అది యెలావుంటుందో ఇది వింటే తెలుస్తుంది. తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని చిత్రహింసలు పెట్టి ఈ స్తంభములో వాడిని (శ్రీహరిని) చూపించకపోతే స్వయంగా, తనే ప్రహ్లాదుని చంపేస్తానన్నాడు హిరణ్యకశిపుడు. ఆవేశం కట్టలు తెంచుకొని, పగిలిన స్తంభంలోంచి వెడలివచ్చిన శ్రీనరసింహుడు యెలావున్నాడయ్యా! అంటే… “శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు) శ్రీసతివల్లభా”! అని ప్రార్థించండి.
భావ వివరణ:
ఓ భక్తులారా! ఇదే శ్రీనరసింహము. ఈ దేవదేవుని చేకొని (పూనుకొని) కొలువరే (మ్రొక్కి సేవించండి). ఈ నరసింహము మనకు శ్రీకరుడు (శు భములనొసగు మహానుభావుడు).
ఈ శ్రీనరసింహము చిడుముడి కోపమువాడు (తొట్రుపాటు కలుగజేసే కోపధారి). చూడండి తన కోపము చేత వెడలేటివూర్పులు (బయల్వెడలు ఉచ్ఛ్వాస నిస్వాసములతో) వేడిసెగల నెట్లా వెదజల్లుతున్నాడో గమనించండి. ఆయన గండస్థలము (రెండు చెక్కిళ్ళూ) ఉద్రేకంతో గడగడమని వణుకుతున్నాయి. అందుచేత ఈ శ్రీనరసింహము యొక్క జడలు (జూలు) పైకి క్రిందికి కదలుచున్నది.
ఈ శ్రీనరసింహము వంకరలు తిరిగిన పంజాగోళ్ళతో వాటివైపు చూసుకొంటూ (రక్తం అంటినదోలేదోనని) చింక చూపులు (భీతహరిణేక్షణములతో) చూస్తున్నాడు. ఈ శ్రీనరసింహము యొక్క హూంకారమునకు, వుదధులు (సాగరములు అన్నియును కలచీ (కల్లోలమైపోతున్నాయి.) ఈ స్వామి అంకెల శ్రీపతి (తన ప్రియసతి శ్రీలక్ష్మిని తన తొడపైననే కూర్చుండబెట్టిన శ్రీనాథుడు.
ఈస్వామి తనతొడపైనున్న హిరణ్యకశిపుని మేను (శరీరాన్ని) తన వదనము వడి తిప్పుచూ (తన మొగమును వేగంగా అటూ ఇటూ కదలించుచూ) చిద్రుపలు చేసెను. (చిన్న చిన్న ఖండములుగా చేసినాడు). ఇంత ఘోర భీభత్సం చేసిన ఈ శ్రీనరసింహము చెదరక (ఏమాత్రమూ చలించక) అదివో శ్రీవేంకటాద్రినెక్కి యిటు (ఈవిధముగా) శ్రీవేంకటేశ్వరుడై నిలిచియుండి, మనబోంట్లను అనుగ్రహిస్తున్నాడు.